బడ్జెట్లో విద్యా రంగానికి అన్యాయం
Kuravi, Telangana:రాష్ట్ర బడ్జెట్ లో విద్యారంగానికి అన్యాయం జరిగిందని ఖమ్మంలో విద్యార్థి సంఘాలు మండిపడ్డాయి. ఈక్రమంలో బడ్జెట్ ప్రతులన పిడిఎస్యూ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో నగరంలో దగ్ధం చేసారు. బడ్జెట్లో విద్యారంగానికి తక్కువ నిధులు కేటాయించడాన్ని వారు తప్పుపట్టారు. ప్రభుత్వ విద్యాను బలోపేతం చేస్తామని పాలకులు చెబుతున్న ఆ దిశగా అడుగులు పడడం లేదని విమర్శించారు. నిధులు కేటాయించాలని డిమాండ్ చేసారు.हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
Secunderabad Bonalu: సికింద్రాబాద్ బోనాల్లో అపచారం.. రోడ్డుపై పడిపోయిన బోనాలు
Secunderabad, Telangana:Secunderabad Bonalu: ఆషాఢ మాసంలో ప్రతిష్టాత్మకంగా హైదరాబాద్‌లోని సికింద్రాబాద్‌లో జరిగే ఉజ్జయిని మహంకాళి బోనాలు ఉద్రిక్తతకు దారి తీశాయి. ఏర్పాట్లలో కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహించడంతో భక్తులతోపాటు జోగినిలు, శివసత్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. తీవ్ర తోపులాటతో భక్తులు అస్వస్థతకు గురయ్యారు. ఇక బోనాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచే శివసత్తులు, జోగినిలు క్యూలైన్లలో నిలబడలేక నీరసించిపోయి కిందపడిపోయారు. తోపులాట కారణంగా వారు ఎంతో భక్తిశ్రద్ధలతో తీసుకువచ్చిన బోనాలు రోడ్డుపై పడ్డాయి.
అధికారులు, ప్రభుత్వ తీరుతో జోగినిలు, శివసత్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీంతో సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి దేవాలయం వద్ద జోగిని శ్యామలతోపాటు ఇతర జోగినిలు, శివసత్తులు అందోళన చేశారు. ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి బోనాల భక్తులకు, ముఖ్యంగా బోనం ఎత్తుకొని వచ్చే మహిళలకు తగిన సౌకర్యాలు కల్పించలేదని జోగిని శ్యామల అవేదన వ్యక్తం చేశారు. భక్తులకు సరైన ఏర్పాట్లు చేయాలని డిమాండ్ చేస్తూ ఆలయం ముఖద్వారం ఎదుట జోగినిలు బైఠాయించి ఆందోళన చేశారు. తోపులాటలో సొమ్మసిల్లి రోడ్డుపై పడిపోయిన జోగినిలు, శివసత్తులు రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై శాపనార్థాలు పెట్టారు. ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ జోగిని శ్యామల కన్నీటిపర్యంతమయ్యారు. తమకు అన్యాయం చేయడం తెలంగాణ రాష్ట్రానికి అరిష్టం అని జోగినిలు శాపనార్థాలు పెట్టారు.
భారీ భద్రతా ఏర్పాట్లు
చారిత్రాత్మక ఉజ్జయిని మహంకాళి బోనాల జాతరకు లక్షలాది మంది భక్తులు తరలివస్తుండటంతో హైదరాబాద్ పోలీసులు అత్యాధునిక సాంకేతికతను వినియోగిస్తున్నారు. తొలిసారిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆధారిత ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీని ప్రవేశపెట్టారు. భక్తుల భద్రతతో పాటు నేరస్థులు, సంఘ విద్రోహ శక్తులను గుర్తించే ఏర్పాట్లు చేశారు. మహంకాళి పోలీస్ స్టేషన్లో ప్రత్యేక కమాండ్ సెంటర్‌ను ఏర్పాటు చేసి.. దర్శనానికి వచ్చే భక్తుల ముఖచిత్రాలను ఏఐ ద్వారా విశ్లేషిస్తున్నారు. ఇప్పటికే నేరచరిత్ర కలిగిన వ్యక్తులు లేదా సంఘ విద్రోహ కార్యకలాపాలకు పాల్పడే వారిని వెంటనే గుర్తించేలా ఈ వ్యవస్థ పనిచేస్తోంది. 15 మంది సిబ్బంది 20 సీసీ కెమెరాల ద్వారా నిరంతరం 48 గంటల పాటు పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు. ప్రతి కదలికపై నిఘా ఉంచుతూ అనుమానాస్పద వ్యక్తులు గుర్తించిన వెంటనే సంబంధిత పోలీసు బృందాలకు సమాచారం అందించేలా ఏర్పాట్లు చేశారు.
సీఎం పదవికి రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలి: పాలమూరు ఎంపీ డీకే అరుణ డిమాండ్
Mahbubnagar, Telangana:Revanth Reddy Apology: ‘రేవంత్ రెడ్డి హోదా మరచి మాట్లాడుతున్నారు. పేద విద్యార్థుల, తల్లిదండ్రులు అనేక ఇబ్బందులు ఎదుర్కొని, కూలీ పనులు చేస్తూ కష్టాలు పడి పిల్లలను చదివిస్తున్నారు. తమ పిల్లలు ఉన్నత విద్యవంతులు కావాలని కాలేజీలకు పంపిస్తే.. క్రిమినల్ వెస్ట్ అనడం సమంజసం కాదు‘ అని ఎంపీ డీకే అరుణ ప్రకటించారు. ‘విద్య శాఖ ఎవరి చేతుల్లో ఉంది.? విద్య శాఖ మంత్రి ఎవరు..? క్వాలిటీ ఎడ్యుకేషన్ ఎందుకు ఇవ్వడం లేదు..? మూడు ఏళ్లలో విద్య రంగానికి మీరు చేసింది ఏంటి..?‘ అని డీకే అరుణ ప్రశ్నించారు. విద్యార్థులను అగౌరవపరిచేలా మాట్లాడం సమంజసం కాదని స్పష్టం చేశారు. విద్యార్థులు ప్రశ్నిస్తే.. లాఠీ ఛార్జ్ చేయిస్తూ.. కేసులు పెట్టడం బాధాకరమని తెలిపారు. ఫీజు రీయింబర్స్ మెంట్ చేయలేక అడ్డమైన మాటలతో, అగౌరవపరిచేలా మాట్లాడటం ఏంటి.? అని రేవంత్ రెడ్డిని ఎంపీ డీకే అరుణ నిలదీశారు.
విద్యార్థులకు రేవంత్ రెడ్డి క్షమాపణలు కోరాలని ఎంపీ డీకే అరుణ డిమాండ్ చేశారు. విద్యా శాఖ మంత్రిగా ఆ కుర్చీలో కూర్చునే అర్హత రేవంత్ రెడ్డికి లేదు. విద్యార్థులను గౌరవించలేనే వారు విద్య శాఖ మంత్రి, రాష్ట్ర సీఎం అంటే విద్య వ్యవస్థ ఎటు వెళ్తుంది. విద్య శాఖ దగ్గర పెట్టుకొని, విద్య రంగం బలోపేతం చేయలేకపోవడంతో అసమర్థులని నిరూపించుకున్నారు. బాధ్యత వహించి విద్య శాఖ కు రాజీనామా చేయాలి‘ బీజేపీ ఎంపీ డీకే అరుణ డిమాండ్ చేశారు.
‘విద్యార్థులపై లాఠీ ఛార్జ్ చేసే పోలీసులు.. కాంగ్రెస్ ప్రభుత్వానికి వినయం ప్రకటించుకోకండి. గత ప్రభుత్వం ఏం అయ్యిందో తెలుసు. విద్యార్థులు శాంతియుత నిరసన వ్యక్తం చేస్తే లాఠీఛార్జ్ చేయాల్సిన అవసరం ఏం వచ్చింది‘ అని ప్రశ్నించారు. విద్యార్థులపై పోలీసులు జరిపిన లాఠీఛార్జ్ ను ఈ సందర్భంగా డీకే అరుణ తీవ్రంగా ఖండించారు. ‘విద్యార్థుల పై ఎటువంటి కేసులు నమోదు చేయవద్దు. హార్వర్డ్ యూనివర్సిటీలో వీకెండ్ క్లాసులకు సీఎం రేవంత్ రెడ్డి వెళ్లి, రెండు మాటలు నేర్చుకొని విద్యార్థులను అవమానించాల్సిన అవసరం లేదు. విద్యార్థులందరికీ హార్వర్డ్ వెళ్లే అవకాశం రాదు. చేతనైతే విద్యార్థులకు అటువంటి అవకాశాలు కల్పించాలి‘ అని రేవంత్ రెడ్డికి మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ హితవు పలికారు.
YSRCP: అబద్దాల్లో చంద్రబాబుకు గిన్నీస్ బుక్ రికార్డ్ ఇవ్వాలి: గుడివాడ అమర్నాథ్
Visakhapatnam, Andhra Pradesh:Boghapuram Airport: ‘అబద్దాల విషయంలో చంద్రబాబుకు గిన్నీస్ బుక్ రికార్డ్ ఇవ్వాలి. కొబ్బరికాయ కొట్టింది.. గుమ్మడికాయ కొట్టింది నేనే అనే చంద్రబాబు మాటలు నిజమే‘ అని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఎద్దేవా చేశారు. ‘ప్రధానమంత్రి పాల్గొన్న వేదికపై జగన్ మోహన్ రెడ్డి విమర్శకు మాత్రమే కూటమి నేతలు దృష్టి పెట్టారు. భోగాపురం ఎయిర్ పోర్ట్ కట్టింది జగన్ మోహన్ రెడ్డి అన్నది ప్రజలు గుర్తించారు‘ అని గుడివాడ అమర్ నాథ్ తెలిపారు.
‘ఎయిర్‌పోర్ట్‌కు అవసరమైన భూమి లేకుండానే 2014లో చంద్రబాబు శంఖుస్థాపన చేశారు. ఎన్నికల ముందు ఎన్నో శిలాఫలకాలు చంద్రబాబు వేశారు. మే 19 2020లో భోగాపురం జిఎంఆర్ సర్టిఫికెట్ ఇన్కార్పొరేషన్ జరిగింది. నాలుగు గ్రామాలతో పాటు 2500 ఎకరాల భూ సేకరణ చేసి వెయ్యి కోట్లు పరిహారం జగన్ ప్రభుత్వం ముందు చేసింది. 2023 మే నెలలోనే అన్ని క్లియరెన్స్ తీసుకువచ్చి జగన్ మోహన్ రెడ్డి భోగాపురం ఎయిర్పోర్ట్ పనులకు శంకుస్థాపన చేశారు.2026 కల్లా పూర్తి చేస్తామని అప్పుడే సీఎంగా జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు' అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు గుడివాడ అమర్ నాథ్ వివరించారు.
‘భోగాపురం ఎయిర్ పోర్ట్ ప్రారంభోత్సవం స్వాగతిస్తున్నాం. సంతోషం. జీఎంఆర్ అధినేత మల్లికార్జునరావుకు ధన్యవాదాలు. భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవ వేదికపై ఎందుకు జీఎంఆర్‌తో మాట్లాడించలేదు?' అని అమర్ నాథ్ ప్రశ్నించారు. వాస్తవాలు చెబుతారనే జీఎంఆర్‌తో మాట్లాడించలేదని చెప్పారు. ‘రాష్ట్ర ప్రయోజనాలు మాత్రమే వైసీపీ ముఖ్యం. భోగాపురంలో యువతి మాటలను జగన్ మాటలుగా తప్పుడు ప్రచారం చేస్తున్నారు.నిన్న జరిగిన ప్రారంభోత్సవం కేవలం కూటమి ఈవెంట్ మేనేజ్ మెంట్ మాత్రమే' అని గుడివాడ అమర్ నాథ్ స్పష్టం చేశారు. కుప్పం ఎయిర్పోర్ట్ ఎక్కడ ఉందో చంద్రబాబు సమాధానం చెప్పాలని సవాల్ చేశారు. 2019 లో వేసిన కుప్పం శిలాఫలకం ఎక్కడ ఉందో చెప్పగలరా అని ప్రశ్నించారు.
‘మళ్లీ 2029లో శిలాఫలకాలు వేసే పనులు చంద్రబాబు నాయుడు మొదలు పెడతారు. ఉత్తరాంధ్రకు ఏం చేశారో బాబు చెప్పాలి. ఉత్తరాంధ్రను ఓటు బ్యాంక్ గా ఉత్తరాంధ్రను వాడుతున్నారు‘ అని కూటమి ప్రభుత్వంపై గుడివాడ అమర్ నాథ్ విమర్శలు చేశారు. 13 వేల మంది గిరిజనులతో థింసా డాన్స్ రికార్డు మినహా బాబు ప్రభుత్వం ఏం చెయ్యలేదని స్పష్టం చేశారు.
ప్రైవేటు ఉద్యోగులకు EPFO గుడ్ న్యూస్...కష్ట సమయాల్లో పీఎఫ్ డబ్బులు ఇకపై UPI ద్వారా విత్ డ్రా చేసుకునే ఛాన్స్..!!
Lakshmapur, Telangana:EPFO New Updates: ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) పీఎఫ్ క్లెయిమ్ పనితీరును వేగంగా మార్చేందుకు, అనేక మార్పులు చేసేందుకు ముందుకు వచ్చింది. ఈ ప్రక్రియ వల్ల ఉద్యోగులకు ఎంతగానో లబ్ధి చేకూరాలని ఉంది. ముఖ్యంగా ఉద్యోగులు పిఎఫ్ డబ్బులను బయటకు తీసేందుకు ఈపీఎఫ్ఓ తీసుకున్నటువంటి నిర్ణయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. . తద్వారా అత్యవసర సమయాల్లో మీరు డబ్బులను విత్ డ్రా చేసుకోవడం చాలా సులభతరం అవుతుంది.
గతంలో పిఎఫ్ డబ్బులను బయటకు తీయాలి అంటే కనీసం 7 నుంచి 10 రోజుల వరకు సమయం పట్టేది కానీ ఇప్పుడు ఈపీఎఫ్ఓ పలు విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకుంది వీటి ద్వారా మీకు కేవలం 24 గంటల నుంచి 48 గంటల్లోగా డబ్బులు పడే అవకాశం ఉంటుంది. ఈ కొత్త విధానం ద్వారా త్వరగా సెటిల్మెంట్లు పూర్తవుతున్నాయి తద్వారా ఉద్యోగులకు అత్యవసర సమయాల్లో ఆ డబ్బు ఎంతగానో ఉపయోగపడుతుంది అని చెప్పవచ్చు.
తాజాగా న్యూఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో EPFO సెంట్రల్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ (CPFC) రమేష్ కృష్ణమూర్తి పలు కీలకమైన విషయాలను ప్రకటించారు. ఇందులో అత్యంత కీలకమైనది ప్రావిడెంట్ ఫండ్ డబ్బులను మీ ఖాతా నుంచి బయటకు తీయడం ఎలాగో ఆయన పూర్తిస్థాయిలో వివరించారు. ప్రస్తుతం ఈపీఎఫ్‌వో ద్వారా ఉద్యోగులు తాము చేసే విత్ డ్రా క్లైములు అన్ని కూడా ఆటోమేటిక్ ప్రాసెస్ ద్వారానే జరుగుతున్నాయి. ఈ ఆటో సెటిల్మెంట్ విధానం ద్వారా ఎలాంటి మానవ జోక్యం తగ్గింది. ఫలితంగా క్లెయిములను ఆమోదించడామికి వేగం పెరుగుతోంది. తద్వారా ఉద్యోగులు త్వరగా తమ డబ్బులు తీసుకునేందుకు వీలు కలుగుతోంది.
త్వరలో EPFO UPI ఆధారిత చెల్లింపు వ్యవస్థ ప్రారంభం:
ఇకపై క్లెయిమ్ ను మరింత వేగంగా చేసేందుకు కూడా ఈపీఎఫ్ఓ కొన్ని విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకుంటోంది. తద్వారా మీరు పీఎఫ్ క్లెయింలను అత్యంత వేగంగా పరిష్కారం అయ్యేందుకు యూపీఐ లింక్ ఉన్న బ్యాంకు ఖాతా ద్వారా పూర్తి చేసేందకు ఈపీఎఫ్ఓ వ్యవస్థను ఏర్పాటు చేస్తోంది. ఇందులో భాగంగా మీ పీఎఫ్ క్లెయిమ్ ఆమోదం పొందిన అనంతరం కొద్ది సమయంలోనే UPI లింక్ ఉన్న బ్యాంకు ఖాతాలో నేరుగా మీ పీఎఫ్ డబ్బులు జమ అవుతాయి.
అయితే ఈ యూపీఐ సేవలు మరికొన్ని నెలల్లో అమల్లోకి తెచ్చేందుకు ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. అయితే దీనిని దశలవారీగా అమలు చేసేందుకు సిద్ధం చేస్తున్నారు. ఒకవేళ ఇది కనుక అమల్లోకి వచ్చినట్లయితే ఉద్యోగులు అత్యంత సులభంగా డబ్బులను బయటకు తీసుకొని తమ అత్యవసర ఖర్చులకోసం వినియోగించుకోవచ్చు. ఇది ఒక రకంగా ఉద్యోగులకు ఎంతో సులువైన ప్రక్రియగా చెప్పవచ్చు.
ఇక ఈపీఎఫ్ ఉద్యోగులకు అత్యంత ముఖ్యమైనది ఆటో సెటిల్మెంట్ దీని పరిమితిని ఒక లక్ష రూపాయల నుంచి 5 లక్షల రూపాయలకు పెంచుతూ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఢిల్లీలో జరిగిన సమావేశంలో EPFO సెంట్రల్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ (CPFC) రమేష్ కృష్ణమూర్తి పేర్కొన్నారు. దీని ద్వారా అనారోగ్యంతో పాటు పెళ్లి ఇల్లు నిర్మాణం విద్యావంటి అత్యవసర సమయాల్లో పీఎఫ్ డబ్బులు సులభంగా పొందేందుకు అవకాశం ఏర్పడుతుంది.EPFO 3.0లో భాగంగా డాక్యుమెంటేషన్ ప్రక్రియ సైతం చాలా సులభంగా ఉండేలా చేశారు. అంతే కాదు రిజెక్షన్ అయ్యే అవకాశాలను కూడా తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
Also Read: బంగారం కొనొద్దన్న మోదీ... ఆగిన కొనుగోళ్లు.. WGC లెక్కలు చూస్తే షాక్ అవ్వాల్సిందే!
Also Read: కేంద్ర ప్రభుత్వం సంచలన ప్రాజెక్ట్.. రూ. 84,000 కోట్ల సముద్ర మంథన్.. ఏంటీ సముద్ర మంథన్?
Also Read: తెలంగాణ ఉద్యోగులు, పెన్షనర్లకు బిగ్ అలర్ట్..హెల్త్ కార్డ్ వివరాల
Also Read: EPF పెన్షనర్లకు షాక్.. నిలిచిపోయిన పింఛన్లు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
అమెరికా వీసాలపై ట్రంప్ ప్రభుత్వం కఠిన నిర్ణయం..!!
Lakshmapur, Telangana:US Visa Bond: అమెరికా వెళ్లాలనుకునేవారికి ట్రంప్ సర్కార్ భారీ విజిటింగ్ షాకింగ్ న్యూస్ చెప్పింది. బిజినెస్, టూరిస్టు వీసాల కోసం దరఖాస్తు చేసుకునే కొందరు విదేశీ పౌరులు సుమారు 20,000 డాలర్లు అంటే రూ. 16.5లక్షల వరకు సెక్యూరిటీ బాండ్ లేదా డిపాజిట్ చెల్లించాల్సిందేనని స్పష్టం చేసింది. ఈ మేరకు ట్రంప్ ప్రభుత్వం తీసుకువచ్చిన కఠినమైన వలస విధానం ఆగస్టు 3వ తేదీ నుంచి శాశ్వతంగా అమల్లోకి రానుంది.
ఆగస్టు 3వ తేదీ నుండి అమలులోకి వస్తుంది: ఫెడరల్ రిజిస్టర్‌లోని ఒక నోటిఫికేషన్ ప్రకారం, వీసా అధికారులు అవసరమైతే, అర్హులైన దరఖాస్తుదారుల నుండి 20,000డాలర్ల వరకు బాండ్‌ను కోరవచ్చు.
కారణం: వీసాల గడువు ముగిసిన తర్వాత యూఎస్‌లో అధిక కాలం ఉండిపోయే ధోరణిని అరికట్టడమే దీని ప్రధాన ఉద్దేశ్యం.
పైలట్ దశ పూర్తయింది: కొత్త నిబంధన ప్రకారం, వీసాలు మంజూరు చేయడానికి కాన్సులర్ అధికారులు ఇప్పుడు భారీ మొత్తంలో డబ్బును డిమాండ్ చేయనున్నారు. వీసా షరతులలో భాగంగా, దరఖాస్తుదారులను $20,000 వరకు భారీ బాండ్‌ను సమర్పించమని అడిగే అవకాశం ఉంటుంది. గతంలో $5,000 ఎంపిక కూడా అందుబాటులో ఉండేది. కానీ ఇప్పుడు దానిని పూర్తిగా తొలగించారు. పైలట్ ప్రోగ్రామ్‌లో, అధికారులు $10,000 లేదా $15,000 వరకు బాండ్లను కూడా కోరుతున్నారు.
భారతీయులకు ప్రయోజనాలు ఏమిటి? నష్టాలు ఏమిటి?
ప్రస్తుత స్థితి: ఈ నియమం ప్రస్తుతం 50 దేశాల పౌరులకు వర్తిస్తుంది (ప్రధానంగా ఆఫ్రికా దేశాలు, అలాగే బంగ్లాదేశ్, నేపాల్ భూటాన్). భారతదేశం ఇంకా ఈ జాబితాలో లేదు. కాబట్టి భారతీయ ప్రయాణికులు ప్రస్తుతం ఈ బాండ్‌ను సమర్పించాల్సిన అవసరం లేదు.
భవిష్యత్ హెచ్చరిక: అయితే, భవిష్యత్తులో పరిస్థితిని బట్టి ఈ జాబితాలో ఇతర దేశాలను కూడా చేర్చే హక్కు తమకు ఉందని అమెరికా స్పష్టం చేసినందున, భారతీయులు కూడా అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.
అమెరికాకు చట్టబద్ధమైన ప్రయాణాలపై ఈ నిర్ణయం గణనీయమైన, ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని వాదిస్తూ, చాలా మంది హక్కుల కార్యకర్తలు అమెరికా నిర్ణయాన్ని తీవ్రంగా విమర్శించారు. ట్రంప్ ప్రభుత్వం చట్టబద్ధమైన వలసలను కష్టతరం చేసిందని విమర్శకులు మండిపడుతున్నారు.. అయితే, జాతీయ భద్రతను బలోపేతం చేయడానికి ఇది అత్యవసరం అని ట్రంప్ వాదిస్తున్నారు.
Also Read: బంగారం కొనొద్దన్న మోదీ... ఆగిన కొనుగోళ్లు.. WGC లెక్కలు చూస్తే షాక్ అవ్వాల్సిందే!
Also Read: కేంద్ర ప్రభుత్వం సంచలన ప్రాజెక్ట్.. రూ. 84,000 కోట్ల సముద్ర మంథన్.. ఏంటీ సముద్ర మంథన్?
Also Read: తెలంగాణ ఉద్యోగులు, పెన్షనర్లకు బిగ్ అలర్ట్..హెల్త్ కార్డ్ వివరాల
Also Read: EPF పెన్షనర్లకు షాక్.. నిలిచిపోయిన పింఛన్లు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
వారందరికీ పింఛన్లు రద్దు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం..!!
Lakshmapur, Telangana:Telangana Govt Schemes: తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్థిక భారాన్ని తగ్గించడానికి సంక్షేమ పథకాలను అమలు చేస్తూ.. పొదుపు చర్యలు చేపడుతోంది. మితిమీరిన వ్యయం, రుణ వడ్డీ భారం దృష్ట్యా, పథకాలలోని లోపాలను సరిదిద్దే ప్రయత్నాలను వేగవంతం చేసింది. ఈ ప్రయత్నంలో భాగంగా, రాష్ట్రంలోని పింఛను లబ్ధిదారుల జాబితాను ప్రక్షాళన చేయడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. క్షేత్రస్థాయి తనిఖీల సందర్భంగా సుమారు 1.28 లక్షల మంది పింఛను లబ్ధిదారులు అనర్హులుగా ఉన్నట్లు అధికారులు గుర్తించినట్లు సమాచారం.
అధికారులు సంకలనం చేసిన నివేదికలలో అనేక అవకతవకలు వెలుగులోకి వచ్చాయి. మరణించిన వ్యక్తుల పేర్లతో పింఛన్లు పంపిణీ చేయడం, నకిలీ ధృవపత్రాలతో ఇతర రాష్ట్రాల వారికి ప్రయోజనాలు అందించడం, ప్రభుత్వ ఉద్యోగులుగా ఉండి కూడా పింఛన్లు అందుకోవడం వంటివి వాటిలో ఉన్నాయి. అదనంగా, సుమారు 1,248 మంది లబ్ధిదారులు తమకు పింఛన్లు అవసరం లేదని పేర్కొన్నప్పటికీ, వారి పేర్లు జాబితాలోనే ఉన్నాయి. ఈ అనర్హులైన లబ్ధిదారుల జిల్లా వారీ నివేదికను త్వరలో ముఖ్యమంత్రి పరిశీలన కోసం సమర్పించనున్నారు.
కొత్త పింఛన్ల మంజూరు – బ్యాలెన్స్ ప్లాన్:
ప్రస్తుతం రాష్ట్రంలో 42 లక్షల మందికి పైగా ప్రజలు పింఛన్లు పొందుతుండగా, ఆగస్టు 15వ తేదీలోగా అదనంగా మరో 2 లక్షల మంది అర్హులకు కొత్త పింఛన్లు అందించాలని ప్రభుత్వం యోచిస్తోంది. అనర్హుల పేర్లను తొలగించడం ద్వారా కొత్త పింఛను నిధుల భారాన్ని తగ్గించాలని ప్రభుత్వం ఆశిస్తోంది. గతంలో ప్రభుత్వం రేషన్ కార్డుల విషయంలో కూడా ఇలాంటి చర్యనే తీసుకుని, ఆ తర్వాత కొత్త కార్డులను జారీ చేసింది.అయితే, ఈ తొలగింపు ప్రక్రియ వల్ల నిజంగా అర్హులైన వ్యక్తులకు అన్యాయం జరగకుండా అధికారులు చాలా జాగ్రత్త వహించాలి. ఒకవేళ అర్హులైనప్పటికీ, సాంకేతిక లేదా ఇతర కారణాల వల్ల పింఛన్లు నిలిపివేస్తే, బాధితులు స్థానిక మండల పరిషత్ లేదా మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో ఫిర్యాదు చేసి, తమ సమస్యకు పరిష్కారం పొందవచ్చని అధికారులు తెలిపారు.
Also Read: బంగారం కొనొద్దన్న మోదీ... ఆగిన కొనుగోళ్లు.. WGC లెక్కలు చూస్తే షాక్ అవ్వాల్సిందే!
Also Read: కేంద్ర ప్రభుత్వం సంచలన ప్రాజెక్ట్.. రూ. 84,000 కోట్ల సముద్ర మంథన్.. ఏంటీ సముద్ర మంథన్?
Also Read: తెలంగాణ ఉద్యోగులు, పెన్షనర్లకు బిగ్ అలర్ట్..హెల్త్ కార్డ్ వివరాల
Also Read: EPF పెన్షనర్లకు షాక్.. నిలిచిపోయిన పింఛన్లు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Komatireddy: గెలిపిస్తామంటేనే ఎన్నికల్లో పోటీ చేస్తా.. లేదంటే లేదు: కోమటిరెడ్డి వెంకటరెడ్డి
Nalgonda, Telangana:Nalgonda Politics: వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నల్లగొండ జిల్లాలోనే కాదు.. తెలంగాణలోనే ఉండదని ప్రకటించి సంచలనం రేపిన మంత్రి కొమటిరెడ్డి వెంకటరెడ్డి.. మరో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మరోసారి తనను గెలిపిస్తానని హామీ ఇస్తేనే పోటీ చేస్తానని.. లేకుంటే పోటీ చేయనని సంచలన ప్రకటన చేశారు. ఎన్ని జన్మలెత్తినా నల్లగొండ నియోజకవర్గం ప్రజల రుణం తీర్చుకోలేనిదని తెలిపారు. ఎస్ఎల్బీసీ సొరంగ మార్గాన్ని పూర్తి చేయడమే తన లక్ష్యమని చెప్పారు.
నల్లగొండ నియోజకవర్గంలోని నల్లగొండ మండల పరిధిలోని కంచనపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని ఆదివారం రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రారంభించారు. నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ 7వ డివిజన్ సాయి నగర్లో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించి స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో ఎమ్మెల్సీ శంకర్ నాయక్‌తో కలిసి కల్యాణలక్ష్,మి షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి వెంకటరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వడమే ఇందిరమ్మ రాజ్య లక్ష్యం. pic.twitter.com/aiSTEqdKOd
— Komatireddy Venkat Reddy (@KomatireddyKVR) August 2, 2026
'ఎస్ఎల్బీసీ సొరంగ మార్గాన్ని పూర్తి చేయడమే నా లక్ష్యం. ఎస్ఎల్బీసీ సొరంగం మార్గం ద్వారా రెండు పంటలకు నీళ్లు ఇచ్చి జిల్లాను సస్యశ్యామలం చేస్తా. బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టు ద్వారా ఈ ప్రాంతంలో ప్రతి ఎకరానికి సాగునీరు అందిస్తాం' అని కొమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రకటించారు. నల్లగొండ నియోజకవర్గం ప్రజల రుణం ఎన్ని జన్మలెత్తినా తీర్చుకోలేనిదని తెలిపారు. తనను ఈ స్థాయికి తీసుకువచ్చింది నియోజకవర్గ ప్రజలే అని.. కంచనపల్లి గ్రామాన్ని మోడల్‌గా అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. రూ.3 కోట్లతో సబ్ స్టేషన్‌ను మంజూరు చేస్తున్నట్లు హామీ ఇచ్చారు. తాను నియోజకవర్గానికి ప్రచారానికి రాకపోయినా.. చేసిన అభివృద్ధిని చూసి ఓట్లు వేసి గెలిపించాలని కోమటిరెడ్డి వెంకటరెడ్డి విజ్ఞప్తి చేశారు. రైతులు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని.. కంచనపల్లిని రాష్ట్రంలోనే ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడమే తన ధ్యేయమని ప్రకటించారు.
అప్పుల ఊబి నుంచి రాష్ట్రాన్ని గట్టెక్కిస్తూ, సంక్షేమ పాలన అందిస్తున్నాం. రాబోయే 15 ఏళ్లు రాష్ట్రంలో కాంగ్రెస్ దే అధికారం. pic.twitter.com/Rl82j3CAfC
— Komatireddy Venkat Reddy (@KomatireddyKVR) August 2, 2026
దోమలపల్లి గ్రామంలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటుచేసి ఈ ప్రాంత విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. మూడు సంవత్సరాలు నల్గొండ నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి సారించి అభివృద్ధి చేస్తానని ప్రకటించారు. వారానికి రెండు రోజులు నియోజకవర్గంలో ప్రజలకు అందుబాటులో ఉంటానని చెప్పారు. నల్లగొండ నియోజకవర్గంలో ఏ పేదవాడికి కష్టం వచ్చినా వారికి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.
pic.twitter.com/QghajztleJ✅ ఎస్ఎల్బీసీ సొరంగం, బ్రాహ్మణ…
✅ దోమలపల్లిలో 'తెలంగాణ పబ్లిక్ స్కూల్' ఏర్పాటు చేసి నాణ్యమైన విద్య.
✅ రూ.3 కోట్లతో కంచనపల్లికి సబ్ స్టేషన్ మంజూరు.
కంచనపల్లిని మోడల్ గ్రామంగా తీర్చిదిద్దుతాం.నల్లగొండ మండలం కంచనపల్లి గ్రామంలో నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించడం జరిగింది.
— Komatireddy Venkat Reddy (@KomatireddyKVR) August 2, 2026
శతాబ్దపు సుదీర్ఘ సూర్యగ్రహణం.. పగటిపూటే చీకటి! 6 నిమిషాలు చీకట్లోనే ప్రపంచం, ఎందుకు ప్రత్యేకమంటే?
Hyderabad, Telangana:Longest total solar eclipse: 2027 ఆగస్టు 2వ తేదీన సంభవించే ఈ సుదీర్ఘ సంపూర్ణ సూర్యగ్రహణం ఒక ఖగోళ అద్భుతం అని చెప్పవచ్చు. 21వ శతాబ్దంలోనే ఇది అత్యంత సుదీర్ఘమైన సూర్యగ్రహణం కానుంది. ఈ సమయంలో ప్రపంచమంలోని పలు ప్రాంతాలు 6 నిమిషాలకు పైగా చీకటిగా మారుతుందని నాసా ఖగోళ శాస్త్రవేత్తలు తెలిపారు. సూర్యగ్రహణం సమయంలో చంద్రుడు సూర్యుడిని పూర్తిగా అడ్డుకోవడం వల్ల ప్రపంచమంతా చీకటిగా మారుతుంది, అందుకే దీనిని సంపూర్ణ సూర్యగ్రహణం అంటారు. ఈ సమయంలో ఉష్ణోగ్రతలో కూడా భారీ మార్పులు చోటుచేసుకుంటాయి. కానీ సూర్యుడి ప్రకాశవంతమైన వెలుతురు మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. ఈ సంపూర్ణ సూర్యగ్రహణం మొత్తం 6 నిమిషాల 23 సెకన్ల పాటు కొనసాగుతుంది. ఈ సంపూర్ణ సూర్యగ్రహణం అట్లాంటిక్ మహా సముద్రం ప్రాంతాల్లో కనిపిస్తుంది. అంటే అల్జీరియా, ట్యునీషియా, లిబియా, ఈజిప్ట్, సౌదీ అరేబియా, యెమెన్, సోమాలియా, మక్కా వంటి ప్రాంతాల్లో ఇది కనిపిస్తుంది.
భారతదేశంలో కనిపిస్తుందా?
ఈ సంపూర్ణ సూర్యగ్రహణం సమయంలో ప్రపంచం 6 నిమిషాల పాటు చీకటిగా మారినప్పటికీ, భారతదేశంలో మాత్రం సంపూర్ణ సూర్యగ్రహణం కాకుండా కేవలం పాక్షిక సూర్యగ్రహణం మాత్రమే కనిపిస్తుంది. దేశంలోని అనేక ప్రాంతాల్లో చంద్రుడు సూర్యుడిని కొంత భాగం మాత్రమే అడ్డుకోవడం వల్ల ఇది జరుగుతుంది. చంద్రుడు భూమికి అత్యంత దగ్గరగా, సూర్యుడికి సాపేక్షంగా దూరంగా ఉండటం వల్ల ఈ ప్రత్యేకమైన సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడుతుంది.
అయితే, ఈ గ్రహణాన్ని నేరుగా చూడవద్దని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. కేవలం సోలార్ వ్యూయింగ్ గ్లాసెస్ ద్వారా మాత్రమే చూడాలి. సాధారణ సన్ గ్లాసెస్ కూడా సురక్షితం కావు. ఇది చాలా అరుదైన గ్రహణం కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. 2009 తర్వాత భూమి నుండి సులభంగా చూడగలిగే సుదీర్ఘ సంపూర్ణ సూర్యగ్రహణం ఇదే కావడం విశేషం. ఈ గ్రహణం సమయంలో ప్రపంచం చీకటిగా మారడం వల్ల పట్టపగలే నక్షత్రాలు కూడా కనిపిస్తాయి. దీని గరిష్ట వ్యవధి 6 నిమిషాల 23 సెకన్లు ఉంటుంది. ఈ గ్రహణం ఈజిప్టులోని లక్సర్ ప్రాంతానికి దగ్గరగా నమోదు అవుతుంది. ఈ సూర్యగ్రహణాన్ని ఖగోళ శాస్త్రంలో ఒక చారిత్రాత్మక ఘట్టంగా పరిగణిస్తున్నారు. ఈ సమయంలో భారత్‌లో కొన్ని ప్రత్యేక నియమాలు పాటిస్తారు. సూర్యగ్రహణం సమయంలో మంత్రాలు పటించడం వంటివి చేస్తారు. ఈ సమయంలో బయటకు రాకుండా కొన్ని రాశుల వారు జాగ్రత్తలు తీసుకుంటారు.
Also Read: ఇకపై క్షణాల్లో తత్కాల్ టికెట్ బుకింగ్.. ఐఆర్సీటీసీ తెచ్చిన ఆ 5 కొత్త ఫీచర్లు ఇవే!
Also Read: హైడ్రోజన్ రైలు అంటే ఏమిటి? మెట్రో కంటే తక్కువ ఛార్జీలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Elnino Effect: ఏపీ, తెలంగాణ ఎల్‌నినో బారి నుంచి బయటపడినట్టేనా? రైతులు తప్పకుండా తెలుసుకోవాలి!
Vijayawada, Andhra Pradesh:Elnino Effect In Andhra Pradesh Telangana: ప్రస్తుత రుతుపవనాల సీజన్లో ఎల్ నినో ప్రభావం కారణంగా వాతావరణంలో అనూహ్య మార్పులు చోటుచేసుకున్నాయి. వర్షాకాలం ప్రారంభమైనప్పటికీ ఆశించిన స్థాయిలో వానలు కురవకపోవడం, రుతుపవనాలు సైతం తీవ్రంగా నిరాశపరచడంతో తెలుగు రాష్ట్రాల ప్రజలు, ముఖ్యంగా రైతాంగం తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఈ నెలలో కూడా వర్షాలు పడటం కష్టమేనని అందరూ భావించారు.
అయితే, వాతావరణంలో ఊహించని మార్పులు సంభవించి, గతకొద్ది రోజులుగా పలు ప్రాంతాల్లో వర్షాలు మళ్లీ మొదలయ్యాయి. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ప్రాజెక్టులు జలకళను సంతరించుకుంటుండటంతో తెలుగు రాష్ట్రాల్లో కొత్త ఆశలు మళ్లీ చిగురిస్తున్నాయి.
వాతావరణ శాఖ తాజా సూచనలు, హెచ్చరికలు
వాతావరణ శాఖ అందించిన తాజా సమాచారం ప్రకారం.. రానున్న మరో రెండు రోజుల పాటు వర్షాలు కొనసాగే అవకాశం ఉంది. అమరావతి వాతావరణ శాఖ అధికారుల వివరాల మేరకు.. కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
అటు గోదావరి పరీవాహక ప్రాంతాల్లో వరద నీటి ప్రవాహం పెరుగుతోంది. పోలవరం, ధవళేశ్వరం ప్రాజెక్టుల వద్ద లక్షలాది క్యూసెక్కుల నీరు దిగువకు విడుదలవుతోంది. మరోవైపు తెలంగాణలోనూ వాతావరణ పరిస్థితిలో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. గత నాలుగు రోజులుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాల ప్రభావంతో రాష్ట్రంలోని ప్రాజెక్టులన్నీ నిండుకుండలా మారుతున్నాయి.
ఈ పరిణామాల నేపథ్యంలో హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఒక కీలక అప్డేట్ వెల్లడించింది. తెలంగాణలో ఇప్పటివరకు ఉన్న వర్షపాత లోటు గణనీయంగా తగ్గినట్లు ప్రకటించింది. ప్రస్తుతం రాష్ట్రంలో కేవలం 5 శాతం మాత్రమే లోటు వర్షపాతం ఉన్నట్లు అధికారులు స్పష్టం చేశారు.
రైతుల్లో మళ్లీ చిగురిస్తున్న ఆశలు
మొదట్లో ఎల్ నినో ప్రభావం, రుతుపవనాల మందగమనం వల్ల పంటల సాగుపై నీలినీడలు కమ్ముకున్నాయి. కానీ, ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు, ప్రాజెక్టులోకి వస్తున్న వరద నీరు అన్నదాతలకు ఎంతో ఊరటనిస్తున్నాయి.
ఈ వర్షాల జోరు ఇలాగే కొనసాగితే భూగర్భ జలాలు కూడా మెరుగై తాగు, సాగు నీటి సమస్యలు పూర్తిగా తొలగిపోతాయని నిపుణులు భావిస్తున్నారు. మొత్తానికి, వాతావరణంలో వచ్చిన ఈ సానుకూల మార్పులు తెలుగు రాష్ట్రాల ప్రజలకు పెద్ద ఊరటనిచ్చాయి.
Also Read: నీట్ విద్యార్థులకు అలర్ట్..కౌన్సిలింగ్ షెడ్యూల్ విడుదల..ఆగస్టు 5 నుంచి రిజిస్ట్రేషన్
ALso Read: ప్రధాని మోదీని బూతులు పట్టిన యువతి..ఇప్పుడు అమాయకంగా క్షమాపణలు చెబుతోంది!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
కరిగిపోతున్న బంగారం ధర...ఆగస్టు 2వ తేదీ, ఆదివారం తులం పసిడి ధర ఎంతంటే..?
Lakshmapur, Telangana:Gold Rate Today: మార్కెట్లో బంగారం ధరలు భారీగా తగ్గుతున్నాయి. ఈరోజు, ఆగస్టు 2వ తేదీ ఆదివారం, బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,43,420 పలుకుతుండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,31,468గా ఉంది. మరోవైపు, ఒక కేజీ వెండి ధర రూ.2,18,150 పలుకుతోంది.
పసిడి ధరలు మార్కెట్లో గత రెండు రోజులుగా తగ్గుతున్నాయి. ముఖ్యంగా, అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను ప్రస్తుతం స్థిరంగా ఉంచినప్పటికీ, సెప్టెంబర్‌లో వాటిని పెంచే అవకాశం ఉందనే అంచనాలు వెలువడుతున్నాయి. దీంతో బంగారం ధరలు మరింత తగ్గే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.
దీనికి ప్రధాన కారణం, ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను పెంచితే డాలర్ విలువ బలపడే అవకాశం ఉండటమే. అదే సమయంలో అమెరికా జారీ చేసే ట్రెజరీ బాండ్లపై వచ్చే రాబడి కూడా పెరుగుతుంది. ఫలితంగా గోల్డ్‌లో పెట్టుబడులు పెట్టిన ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను ఉపసంహరించుకుని అమెరికా ట్రెజరీ బాండ్లలో పెట్టుబడులు పెట్టే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఎందుకంటే ట్రెజరీ బాండ్లపై వచ్చే రాబడి మరింత ఆకర్షణీయంగా ఉంటుంది.
మరోవైపు, దేశీయ మార్కెట్లలో బంగారానికి డిమాండ్ పెరుగుతోందని చెప్పవచ్చు. గత త్రైమాసికంలో బంగారం కొనుగోళ్లు తగ్గాయని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ ప్రకటించింది. దీనికి ప్రధాన కారణం బంగారంపై దిగుమతి సుంకం పెరగడంతో పాటు ధరలు కూడా అధికంగా ఉండటమేనని పేర్కొంది. అయితే, ఆభరణాల రూపంలో మాత్రం బంగారానికి ఇంకా మంచి డిమాండ్ కొనసాగుతోందని అంచనా వేసింది.
ఇదిలా ఉంటే, ప్రస్తుతం ఆషాఢ మాసం నడుస్తున్న నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో బంగారం కొనుగోలు చేసేందుకు ప్రజలు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారని నగల దుకాణాల యజమానులు చెబుతున్నారు. ఎందుకంటే ఆషాఢ మాసంలో తెలుగు రాష్ట్రాల్లో వివాహ ముహూర్తాలు ఉండవు. అయితే, ఆషాఢం ముగిసిన తర్వాత ప్రారంభమయ్యే శ్రావణ మాసంలో వివాహ ముహూర్తాలు ఎక్కువగా ఉంటాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని, ప్రస్తుతం ధరలు తగ్గిన నేపథ్యంలో పెద్ద మొత్తంలో బంగారు ఆభరణాలు కొనుగోలు చేసేందుకు వినియోగదారులు ఆసక్తి చూపుతున్నారని నగల దుకాణాల వారు పేర్కొంటున్నారు.
మరోవైపు, బంగారం ధరలు భవిష్యత్తులో తగ్గుతాయా? లేక పెరుగుతాయా? అనే అంచనాలు కూడా ఇప్పుడు వెలువడుతున్నాయి. బంగారం ధరలు ఆల్‌టైమ్ రికార్డు స్థాయితో పోలిస్తే ఇప్పటికే గణనీయంగా తగ్గాయి. దీంతో అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో సెప్టెంబర్ నెలలో మాత్రం బంగారం ధరలు మరింత తగ్గే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
Also Read: బంగారం కొనొద్దన్న మోదీ... ఆగిన కొనుగోళ్లు.. WGC లెక్కలు చూస్తే షాక్ అవ్వాల్సిందే!
Also Read: కేంద్ర ప్రభుత్వం సంచలన ప్రాజెక్ట్.. రూ. 84,000 కోట్ల సముద్ర మంథన్.. ఏంటీ సముద్ర మంథన్?
Also Read: తెలంగాణ ఉద్యోగులు, పెన్షనర్లకు బిగ్ అలర్ట్..హెల్త్ కార్డ్ వివరాల
Also Read: EPF పెన్షనర్లకు షాక్.. నిలిచిపోయిన పింఛన్లు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
6000 ఏళ్ల పురాతన చెట్టులో బార్.. అబ్బబ్బ భలే ఉండేది..
Hyderabad, Telangana:6,000-year-old Tree Bar: ప్రపంచంలో టూరిస్టులను ఆకర్షించేందుకు అనేక వినూత్నమైన థీమ్ రెస్టారెంట్లు ఉన్నాయి. అయితే, వాటన్నింటికీ భిన్నంగా.. ప్రకృతి ప్రసాదించిన ఒక భారీ వృక్షంలో నడిచిన ఓ వింత బార్ చరిత్రలోనే అత్యంత అరుదైనదిగా నిలిచింది. దక్షిణాఫ్రికాలోని లింపోపో (Limpopo) ప్రావిన్స్‌లో ఉన్న సన్ల్యాండ్ బావోబాబ్ (Sunland Baobab) అనే చెట్టు లోపల ఈ అద్భుతమైన బార్‌ను ఏర్పాటు చేశారు. ఇది చూడడానికి చాలా అద్భుతంగా ఉంటుంది. అయితే, ఈ బార్కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.
చెట్టు తొర్రలోనే బార్ స్పెషాలిటీ..
ఈ బావోబాబ్ వృక్షం దాదాపు 6,000 ఏళ్ల పురాతనమైనదిగా పరిశోధకులు చెబుతున్నారు. సాధారణంగా బావోబాబ్ చెట్లు వెయ్యి సంవత్సరాల వయస్సు దాటిన తర్వాత వాటి కాండం లోపలి భాగం సహజంగానే తొర్రగా మారుతుంది. ఈ సహజ సిద్ధమైన అవకాశాన్ని ఉపయోగించుకుని.. కొంతమంది ఆ చెట్టు తొర్ర లోపల బిగ్ బావోబాబ్ ట్రీ బార్ (Big Baobab Tree Bar)ను నిర్మించారు.
ఈ బార్లో ఒకేసారి 15 మందికి పైగా కూర్చుని డ్రింక్స్ తాగుతూ హాయిగా ముచ్చటించుకునేలా సీటింగ్, డ్రింక్ కౌంటర్, సౌండ్ సిస్టమ్ ఏర్పాటు చేశారు. చెట్టు కాండం గోడలు చాలా మందంగా ఉండటం వల్ల బయట ఎండ ఎంత తీవ్రంగా ఉన్నా.. లోపల వాతావరణం ఎప్పుడూ సహజ సిద్ధంగా చల్లగా (Nature's AC) ఉంటుంది. అంతేకాకుండా ప్రత్యేకమైన లైటింగ్‌ను కూడా ఏర్పాటు చేశారు.
ప్రపంచ పర్యాటకులకు హాట్ స్పాట్..
ఈ చెట్టు చుట్టుకొలత దాదాపు 33 మీటర్లు, ఎత్తు 19 మీటర్లకు పైగా ఉండేది.. ఈ అద్భుతాన్ని చూడటానికి ప్రపంచ నలుమూలల నుంచి పర్యాటకులు వచ్చేవారు. చెట్టు తొర్రలో కూర్చుని గడపడం ఒక మర్చిపోలేని అనుభూతిని ఇచ్చేదని ఇక్కడికి వచ్చిన పర్యాటకులు చెబుతూ ఉండేవారు. దురదృష్టవశాత్తు, వేల సంవత్సరాల వయస్సు కలిగిన ఈ వృక్షం వృద్ధాప్యంతో పాటు వాతావరణ మార్పుల కారణంగా 2017తో బాగా దెబ్బతిన్నది. చెట్టు ప్రధాన కాండం రెండుగా పగిలిపోవడంతో ఈ బార్‌ను శాశ్వతంగా మూసివేశారు. అయినప్పటికీ ఇప్పటికీ ఈ బార్కి సంబంధించిన వివిధ ఫోటోస్‌తో పాటు వీడియోలు వైరల్ అవుతూనే ఉంటాయి.
Also Read: పోలీస్ వ్యాన్‌ను ఒంతిచేత్తో ఆపేసిన బాలీవుడ్ బ్యూటీ..నీట్ విద్యార్థులకు అండగా మోడల్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
YS Jagan On Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్ట్‌పై వైఎస్ జగన్ ఆసక్తికర పోస్ట్..
Gudepuvalasa, Andhra Pradesh:Bhogapuram International Airport Credit: ఉత్తరాంధ్రకు మణిహారంగా భావించే భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు ఎయిర్ పోర్ట్ ఘనంగా ప్రారంభోత్సవం జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభమైన ఈ వేడుకలో కేంద్ర విమానాయాన శాఖ మంత్రి కె.రామ్మెహన్ నాయుడుతో పాటు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే ఈ భోగాపురం విమానాశ్రయం ప్రారంభోత్సంపై వైసీపీ అధినేత వైఎస్ జగన్ సంచలన ట్వీట్ చేశారు.NEET PG అభ్యర్థులకు కేంద్రం బిగ్ గుడ్‌న్యూస్.. పరీక్ష విధానంలో మార్పులు!
Hyderabad, Telangana:Big Relief For NEET Pg Candidates: కష్టపడి చదువుతూ.. దేశ ఆరోగ్య భవిష్యత్తును నిలబెట్టేందుకు సిద్ధమవుతున్న వేలాది మంది యువ వైద్యులకు కేంద్ర ప్రభుత్వం అత్యంత అద్భుతమైన శుభవార్తను అందించింది.. ఆగస్టు 30న జరగబోయే అత్యంత కీలకమైన NEET PG పరీక్షకు సంబంధించి అభ్యర్థులకు అనుకూల (Student Friendly) మార్పులను ప్రకటించింది. సుదీర్ఘకాలంగా విద్యార్థులు ఎదుర్కొంటున్న మానసిక ఒత్తిడికి, ప్రయాణ కష్టాలకు ఈ నిర్ణయంతో స్వస్తి పలికినట్లయింది. అయితే, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏంటో? దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
గతంలో పరీక్షా కేంద్రాల కేటాయింపులో అభ్యర్థులు తీవ్ర నరకాన్ని చూసిన సంగతి తెలిసిందే.. ఎక్కడో వందల కిలోమీటర్ల దూరంలో ఉండే జిల్లాలకు, పొరుగు రాష్ట్రాలకు వెళ్లలేక చదువుకోవాల్సిన సమయంలో ప్రయాణాల గురించి ఆలోచిస్తూ నరకయాతన అనుభవించేవారు. కానీ, ఈసారి ప్రభుత్వం చారిత్రాత్మక మార్పు చేసింది..
ఇకపై ప్రతి అభ్యర్థి తమకు అనుకూలమైన 3 రాష్ట్రాలను ఎంచుకునే వెసులుబాటు కల్పించింది. అంతటితో ఆగకుండా, అభ్యర్థుల ఇళ్లకు వీలైనంత దగ్గరలోని సెంటర్లనే కేటాయించనున్నట్లు కేంద్రం ప్రకటించింది. అంతేకాకుండా ప్రయాణ ఏర్పాట్లు ముందే చేసుకునేందుకు వీలుగా ఎగ్జామ్ జరిగే సిటీల జాబితాను ముందస్తుగానే విడుదల చేయబోతోంది. ఇవే కాకుండా అనేక మార్పులు చేసిన్నట్లు తెలుస్తోంది.
విద్యార్థుల ప్రతిభకు సరైన న్యాయం జరిగేలా.. ఏ ఒక్కరూ గందరగోళానికి గురికాకుండా ఉండాలనే ఉద్దేశంతో ఈసారి పరీక్షను సింగిల్ షిఫ్ట్ (ఒకే విడత) లోనే నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా 180 మొత్తం ప్రశ్నలు ఉండగా.. 3 గంటల 30 నిమిషాల సమయం కూడా కేటాయించిన్నట్లు కేంద్ర వెల్లడించింది. సమయాన్ని పెంచడం వల్ల అభ్యర్థులు ప్రశాంతమైన మనస్సుతో, ఎలాంటి కంగారు లేకుండా ప్రశ్నలకు సమాధానాలు రాసే అవకాశం లభించింది.
ALso Read: బంగాళాఖాతంలో వేగంగా మారుతున్న వాతావరణం..తెలుగు రాష్ట్రాలకు తుఫాన్ ముప్పు!
ఈ ఏడాది దేశవ్యాప్తంగా ఏకంగా 2,73,183 మంది వైద్య విద్యార్థులు ఈ పరీక్షకు హాజరుకానున్నారు. పగలు రేయి తేడా లేకుండా శ్రమిస్తున్న తమ బిడ్డలకు ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం కొండంత అండగా నిలిచింది. కేంద్రం నిర్ణయంతో మాపై ఉన్న సగం మానసిక ఒత్తిడి తగ్గిపోయిందని.. సెంటర్ ఎక్కడ పడుతుందో అన్న భయం లేకుండా.. ఇప్పుడు ప్రశాంతంగా చదువుపైనే దృష్టి పెట్టగలుగుతున్నామని.. అభ్యర్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ALso Read: బంగాళాఖాతంలో వేగంగా మారుతున్న వాతావరణం..తెలుగు రాష్ట్రాలకు తుఫాన్ ముప్పు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Hardik Pandya Tirumala: తిరుమలలో శ్రీవారి దర్శనానికి హార్దిక్ పాండ్య..తలనీలాలు ఇచ్చి, లవర్‌తో కలిసి ఆలయంలో..
Tirupati Urban, Andhra Pradesh:Hardik Pandya Tirumala Visit: భారత క్రికెట్ జట్టు స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ఆదివారం ఆంధ్రప్రదేశ్‌లోని తిరుమలలో వెలసిన ప్రసిద్ధ శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. టీమ్ఇండియాలోకి గ్రాండ్ రీ-ఎంట్రీ ఇవ్వడానికి ముందు ఆయన తిరుపతిని సందర్శించి స్వామివారి ఆశీస్సులు పొందారు. దర్శనానికి ముందు తలనీలాలు సమర్పించిన హార్దిక్ పాండ్యా.. ఆ తర్వాత ప్రేయసి మహికా శర్మతో కలిసి శ్రీవారిని దర్శించుకున్నారు.
ప్రత్యేక ఆకర్షణగా గుండు, సాంప్రదాయ లుక్
తిరుమల ఆలయంలో జరిగిన ప్రసిద్ధ సుప్రభాత సేవలో హార్దిక్ పాండ్యా ప్రత్యేకంగా పాల్గొన్నారు. ఈ పర్యటనలో ఆయన తలనీలాలు సమర్పించి.. సాంప్రదాయ తెల్లటి కుర్తా-పైజామా ధరించి కనిపించారు. నుదుటిపై తిలకంతో ఆయన పూర్తిగా భక్తిభావంతో కనిపిస్తున్న ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ఆయనతో పాటు ఈ తిరుమల సందర్శనలో హార్దిక్ పాండ్యా ప్రేయసి మహికా శర్మ కూడా తెల్లటి సాంప్రదాయ దుస్తులలో మెరిశారు. గత కొంతకాలంగా వీరిద్దరూ పలు సందర్భాల్లో కలిసి కనిపిస్తుండగా, తాజా తిరుమల పర్యటన మరోసారి చర్చనీయాంశమైంది.
VIDEO | Tirupati, Andhra Pradesh: Indian cricketer Hardik Pandya offers prayers during the Suprabhata Seva at the Sri Venkateswara Swamy Temple in Tirumala.
(Full video available on PTI Videos - https://t.co/n147TvrpG7) pic.twitter.com/HKdtPmcyC3
— Press Trust of India (@PTI_News) August 2, 2026
గాయంతో విరామం.. రీఎంట్రీకి సిద్ధం!
వెన్నునొప్పి, ఆ తర్వాత తలెత్తిన తొడ కండరాల గాయం కారణంగా హార్దిక్ పాండ్యా గత కొంతకాలంగా క్రికెట్‌కు దూరంగా ఉన్నారు. ఐపీఎల్ 2026తో పాటు పలు సిరీస్‌లను ఆయన మిస్ అయ్యారు.
అయితే, ప్రస్తుతం ఆయన గాయం నుంచి పూర్తిగా కోలుకున్నారు. బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో నిర్దేశించిన 'రిటర్న్-టు-ప్లే ప్రోటోకాల్'ను విజయవంతంగా పూర్తి చేశారు. త్వరలోనే జరగనున్న వైట్-బాల్ సిరీస్ ద్వారా ఆయన తిరిగి టీమ్ ఇండియాలోకి రీఎంట్రీ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది.
ఈ తిరుమల ఆధ్యాత్మిక పర్యటన తన కొత్త క్రికెట్ ప్రయాణానికి మంచి ఆరంభం కావాలని అభిమానులు కోరుకుంటూ సోషల్ మీడియా వేదికగా హార్దిక్‌కు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
Also Read: కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్‌కు పతకాల పంట..ఒకే రోజు 8 స్వర్ణ పతకాలు..భారత్ ఖాతాలో 39
Also Read: ఆగస్టులో విద్యార్థులకు పండగే పండగ..ఏకంగా వారం రోజులకు పైగా సెలవులు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
న్యూజెర్సీ సూపర్మార్కెట్లో కూలిన పైకప్పు.. అందరూ ఎలా తప్పించుకున్నారో చూడండి..
Hyderabad, Telangana:Club Roof Collapses Video: సరుకుల కోసం సూపర్‌మార్కెట్‌కు వెళ్లి.. హాయిగా షాపింగ్ చేస్తున్న సమయంలో.. హఠాత్తుగా నెత్తిపైన ఉన్న పైకప్పు కూలిపోతే ఎలా ఉంటుంది? వినడానికే ఒళ్ళు గగుర్పొడిచేలా ఉన్న ఇలాంటి విచిత్ర సంఘటన అమెరికాలోని న్యూజెర్సీలో చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
న్యూజెర్సీలోని మోన్మౌత్ కౌంటీకి చెందిన ఓషన్ టౌన్షిప్లో ఉన్న బిజెస్ హోల్‌సేల్ క్లబ్ (BJ's Wholesale Club) సూపర్మార్కెట్లో ఈ ప్రమాదం జరిగింది. రోజూలాగే కస్టమర్లు తమకు కావలసిన సరుకులు కొనుగోలు చేస్తూ.. సందడిగా ఉన్నారు. అయితే, ప్రాంతంలో కురిసిన భారీ వర్షాల కారణంగా ఉదయం సుమారు 11:15 గంటల సమయంలో ఊహించని పరిణామం ఎదురైంది. సూపర్‌మార్కెట్ పైకప్పులోని ఒక పెద్ద భాగం అకస్మాత్తుగా కస్టమర్ల మీదికి కూలిపోయింది.
రూఫ్ కూలిపోవడమే కాకుండా.. పైకప్పు నుంచి భారీ ఎత్తున వర్షపు నీరు లోపలికి వరదలా దూసుకురావడంతో స్టోర్‌లోని వాతావరణం క్షణాల్లో మారిపోయింది. ప్రమాదం జరిగిన సమయంలో సూపర్మార్కెట్లో దాదాపు 27 మంది కస్టమర్లతో పాటు సిబ్బంది ఉన్నారు. పెను శబ్దంతో పైకప్పు పడటంతో ఏం జరుగుతుందో అర్థంకాక జనాలు కేకలు వేస్తూ సురక్షిత ప్రాంతాల వైపు పరుగులు తీశారు. శిథిలాల కింద ఇద్దరు వ్యక్తులు చిక్కుకున్నప్పటికీ.. సురక్షితంగా బయటకు రాగలిగారని సమాచారం.
No injuries were reported. pic.twitter.com/1Bqk26n8vi
— Shlomo Schorr (@OneJerseySchorr) July 6, 2026
సమాచారం అందుకున్న వెంటనే స్థానిక పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. శిథిలాల కింద ఎవరైనా చిక్కుకున్నారేమో తెలుసుకోవడానికి న్యూజెర్సీ అర్బన్ సెర్చ్ అండ్ రెస్క్యూ బృందాలు రంగంలోకి దిగాయి. ప్రమాద తీవ్రత దృష్ట్యా భవనం లోపలికి నేరుగా వెళ్లడం ప్రమాదకరంగా మారడంతో.. అత్యాధునిక ఇండోర్ డ్రోన్లు, శిక్షణ పొందిన కే-9 డోగ్ స్క్వాడ్ (K-9 Dog Squad) బృందాలను ఉపయోగించి అంగుళం అంగుళం తనిఖీ చేసిన్నట్లు సమాచారం.
భారీ స్థాయిలో పైకప్పు కూలిపోయినప్పటికీ.. ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో పాటు ఎవరూ తీవ్రంగా గాయపడకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. స్టోర్‌లోని మొత్తం 27 మంది సురక్షితంగా బయటపడటం ఓ అద్భుతంగా భావిస్తున్నారు. ప్రస్తుతం ప్రమాదానికి కారణమైన భవనాన్ని మూసివేసి.. అధికారులు దర్యాప్తు జరుపుతున్నారు. అయితే, కూలుతున్న సమయంలో రికార్డ్ అయిన CC టీవీ రికార్డ్స్ దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్‌గా మారాయి..
Also Read: పోలీస్ వ్యాన్‌ను ఒంతిచేత్తో ఆపేసిన బాలీవుడ్ బ్యూటీ..నీట్ విద్యార్థులకు అండగా మోడల్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
