icon-pinewzicon-zee
PINEWZ
become creator
Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back

हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|

చేతిలో పాము గుడ్డు.. పెంకును తొలగించగానే బయటకొచ్చిన పాముపిల్ల!

Hyderabad, Telangana:

Snake Hatchling Video: సోషల్ మీడియాలో ప్రతిరోజు ఎన్నో వన్యప్రాణులకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి.. అయితే వాటిల్లో కొన్ని వీడియోలు మాత్రమే అందర్నీ ఆకట్టుకోవడమే కాకుండా ప్రకృతిలోని అద్భుతాలను కళ్లుకు కట్టినట్లు చూపిస్తూ ఉంటాయి. తాజాగా KP SNAKE EXPRT అనే యూట్యూబ్ ఛానల్‌లో పోస్ట్ చేసిన ఒక షార్ట్ వీడియో ఇంటర్నెట్లో విపరీతంగా వైరల్ అవుతుంది. వీడియో చూసిన సోషల్ మీడియా వినియోగదారులు ఆశ్చర్యపడడమే కాకుండా... వారి అభిప్రాయాలను కూడా పంచుకుంటున్నారు.. అయితే, దీనికి సంబంధించిన పూర్తి వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

ఈ వీడియో మొదట్లోనే ఒక స్నేక్ రెస్క్యూయర్ చేతిలో తెల్లటి పాము గుడ్లను పట్టుకుని జాగ్రత్తగా సోషల్ మీడియా వినియోగదారులకు చూపించడం మీరు గమనించవచ్చు.. ఆ గుడ్డుపై చిన్న పగలు కనిపించగానే.. లోపల ఉన్న పాము బయటికి రావడానికి సహాయం చేస్తూ.. గుడ్డు పెంకులను ఎంతో నెమ్మదిగా చిన్న చిన్నగా తొలగించడం మీరు ఈ వీడియోలో క్లియర్గా గమనించవచ్చు..

అయితే కొద్ది సెకండ్ల వ్యవధిలోనే ఒక చిన్న.. ఎంతో అందమైన పాము నెమ్మదిగా తలను పైకెత్తి బయటి ప్రపంచాన్ని చూడడం మీరు ఈ వీడియోలో చూడొచ్చు. అది తన చిన్న నాలుకను బయటకు చాస్తూ.. భయం లేకుండా రెస్క్యూయర్ అరచేతిపైకి పాకుతూ రావడం చూసి సోషల్ మీడియా వినియోగదారులు ఆశ్చర్యపోయారు..

గుడ్డు లోపల ముడుచుకొని ఉన్న ఆ చిన్నజీవి.. మెల్లగా బయటికి వచ్చి తన పూర్తి శరీరాన్ని చాచిన దృశ్యం సోషల్ మీడియా వినియోగదారులను ఆశ్చర్యానికి గురి చేస్తూ వస్తోంది. పాము పిల్లల పట్ల సాధారణంగా ఉండే భయాన్ని పక్కనపెట్టి.. సోషల్ మీడియా వినియోగదారులు దీనిని ప్రకృతి అందంగా అభివర్ణిస్తూ లైకులతో పాటు కామెంట్లు చేస్తూ ఉన్నారు.. ఇప్పుడు వైరల్ అవుతున్న వీడియోను కొన్ని వేల మందికి పైగా వీక్షించినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా చాలామంది ఆశ్చర్యపడుతూ కామెంట్స్ కూడా చేస్తున్నారు..

ఇక పాము గుడ్లకు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాల్లోకి వెళితే.. పాము గుడ్ల పెంకు పక్షుల గుడ్ల లాగా గట్టిగా ఉండదని.. కొద్దిగా మెత్తగా.. తోలు లాగా ఉంటుందని వన్యప్రాణి నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా గుడ్డులోంచి బయటకు రావడానికి పిల్ల పాములు తన మూతి పై ఉండే ప్రత్యేకమైన చిన్న వంటిని ఉపయోగించి గుడ్డును చీల్చుకొని బయటికి వస్తాయట. చాలా జాతుల పాములు పిల్లలు పుట్టిన క్షణం నుంచి స్వాతంత్రంగా జీవించడంతోపాటు ఆహారాన్ని వేటాడడం ప్రారంభిస్తాయట..

Also Read: Viral Pic: ఇదేం క్రియేటివిటీ రా బాబు.. మూత్రం పోస్తూ ప్రీ వెడ్డింగ్ ఫోటో స్టిల్స్‌..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
0
Report

స్కూల్ బ్యాగ్ జిప్ తీయగానే షాక్.. లోపల దాక్కున్న పాము వీడియో..

Hyderabad, Telangana:

Snake Inside School Bag Video: వర్షాకాలం లేదా వాతావరణంలో మార్పులు వచ్చినప్పుడు విష సర్పాలతో పాటు కీటకాలు వెచ్చని ప్రదేశాలను వెతుక్కుంటూ ఇళ్లలోకి.. నిత్యవసర వస్తువుల్లోకి చేరడం సర్వసాధారణం.. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక షాట్ వీడియో చూస్తే ఎవరికైనా ఆశ్చర్యం కలగక మానదు.. పిల్లలు రోజు భుజాన వేసుకునే స్కూల్ బ్యాగ్ లోనే ఒక పాము దర్జాగా నక్కి కూర్చున్న దృశ్యం సోషల్ మీడియా వినియోగదారులను ఆశ్చర్యపోయేలా చేస్తుంది.. ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలియదు కానీ ఇప్పుడు దీనికి సంబంధించిన దృశ్యాలు మాత్రం నెటిజన్లను షాప్‌కు గురిచేస్తున్నాయి.

వైరల్ అవుతున్న వీడియో వివరాల్లోకి వెళ్తే.. ఒక బ్యాగ్‌లో పాము ఉన్నట్లు అనుమానం రావడంతో స్నేక్ ఎక్స్‌పర్ట్ (Snake Rescuer) రంగంలోకి దిగాడు.. గదిలో నేలపై పెట్టిన ఆ ఒక నీలిరంగు స్కూల్ బ్యాగ్ జిప్ జాగ్రత్తగా తెరవగా.. లోపల పరశు వెనుక భాగంలో ఒక సన్నని కట్లపాము నక్కి ఉండడం మీకు ఈ వీడియోలో క్లియర్గా కనిపిస్తుంది. ఏమాత్రం తొందరపడకుండా.. ఎంతో అద్భుతమైన నైపుణ్యంతో ఆ స్నేక్ క్యాచర్ చేతితో పాము తోకను పట్టుకొని నెమ్మదిగా బయటికి తీయడం మీరు ఈ వీడియోలో చూడొచ్చు. ఆ పాము సురక్షితంగా బయటికి తీయడంతో అక్కడున్న కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నట్లు తెలుస్తోంది..

ఈ వీడియో వైరల్ కావడంతో సోషల్ మీడియా వినియోగదారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.. ముఖ్యంగా బడికి వెళ్లే పిల్లలు ఉన్న ఇంట్లో తల్లిదండ్రులు మరింత అప్రమత్తంగా ఉండాలని కొంతమంది వన్యప్రాణి సంరక్షకులు సైతం సూచిస్తున్నారు. పిల్లల స్కూల్ బ్యాగులను నేలపై లేదా తలుపుల మూలల్లో వదిలివేయకుండా కాస్త ఎత్తైన ప్రదేశాల్లో వేలాడదీయడం మంచిదని వారు చెబుతున్నారు. బ్యాగ్ అవసరం లేనప్పుడు జిప్పులు పూర్తిగా మూసి ఉండేలా చూసుకోవాలని అంటున్నారు. 

Also Read: Viral Pic: ఇదేం క్రియేటివిటీ రా బాబు.. మూత్రం పోస్తూ ప్రీ వెడ్డింగ్ ఫోటో స్టిల్స్‌..

ఉదయం పూట పుస్తకాలతో పాటు లంచ్ బాక్సులు సర్దేటప్పుడు లోపల ఏముందో చూసి చేతులు పెట్టాలని వన్యప్రాణి సంరక్షకులు తెలుపుతున్నారు.. అంతేకాకుండా బ్యాగులతో పాటు పిల్లలు రోజు వేసుకునే సాక్సులు షూలు కూడా ఒకసారి దులిపి ఆ తర్వాత పిల్లలకు వేయడం మంచిదని వారు చెబుతున్నారు.. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వేల సంఖ్యలో వ్యూస్‌తో పాటు లైక్స్‌తో దూసుకుపోతోంది. ఇలాంటి సంఘటనలు చిన్నవే అయినప్పటికీ ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్న ప్రాణాలకే ముప్పు వాటినే అవకాశం ఉందని సోషల్ మీడియా వినియోగదారులు హెచ్చరిస్తున్నారు.

Also Read: Viral Pic: ఇదేం క్రియేటివిటీ రా బాబు.. మూత్రం పోస్తూ ప్రీ వెడ్డింగ్ ఫోటో స్టిల్స్‌..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
0
Report

సెప్టెంబర్‌లో ఈ 3 రాశులకు లక్ష్మీదేవి కటాక్షం.. ఊహించని ధనలాభాలు!

Hyderabad, Telangana:

September 2026 Astrology News: సెప్టెంబర్ నెలలో చాలా గ్రహాలు తమ రాశిని మార్చుకోబోతున్నాయి. సెప్టెంబర్ రెండవ తేదీన శుక్రుడు తులా రాశిలోకి.. సెప్టెంబర్ 7వ తేదీన బుధుడు కన్యారాశిలోకి ప్రవేశిస్తాడు.. ఆ తర్వాత సెప్టెంబర్ 17న సూర్యుడు కన్యారాశిలోకి ప్రవేశించి.. సెప్టెంబర్ 26న బుధుడు మళ్లీ తన రాశిని మార్చుకొని తులా రాశిలోకి ప్రవేశిస్తాడు.. మరోవైపు కుజుడు సెప్టెంబర్ 18 నుంచి కర్కాటక రాశిలో తన ప్రయాణాన్ని ప్రారంభిస్తాడు.. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. గ్రహసంచారాలతో పాటు వాటి ద్వారా ఏర్పడి శుభయోగం పరంగా మూడు రాశుల వారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. ఈ రాశుల వారు తమ వృత్తి తో పాటు ఆర్థిక విషయాల్లో గొప్ప విజయాలు సాధించగలుగుతారు. అంతేకాకుండా అద్భుతమైన జీవితంతో విశేషమైన లాభాలు పొందగలుగుతారు..

ఈ క్రింది రాశుల వారికి బంపర్ లాభాలు..
వృషభ రాశి 

సెప్టెంబర్ నెల వృషభ రాశి వారికి ఎంతో శుభప్రదంగా ఉంటుంది. లక్ష్మీదేవి అనుగ్రహంతో కొత్త సంపాదన కూడా పొందగలుగుతారు. అలాగే నిలిచిపోయిన డబ్బులు కూడా తిరిగి సొంతం చేసుకునే అవకాశాలున్నాయి. వృత్తి జీవితంలో ఘననీయమైన పురోగతి లభిస్తుంది.. లక్ష్మీదేవి అనుగ్రహంతో పనుల్లో మీకు మంచి మంచి ప్రశంసలు కూడా లభిస్తాయి. అలాగే ఆంటీ నిర్ణయాలు తీసుకున్న అద్భుతమైన లాభాలు పొందుతారు. పెట్టుబడులు పెట్టాలనుకుంటున్న వ్యక్తులకు ఈ సమయం ఎంతో అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగంలో ఉన్నవారికి పదోన్నతులు లభించే అవకాశాలున్నాయి. అంతేకాకుండా కొత్త బాధ్యతలు కూడా సులభంగా లభిస్తాయి.

మిథున రాశి 
మిథున రాశిలో జన్మించిన వ్యక్తులకు కూడా సెప్టెంబర్ నెల ఎంతో లాభదాయకంగా ఉండబోతుంది.. ముఖ్యంగా వీరికి ఆర్థిక పరిస్థితులు గణనీయంగా మెరుగుపడడమే కాకుండా.. ఆదాయం విపరీతంగా పెరిగే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. పూర్వికుల ఆస్తుల నుంచి మంచి లాభాలు పొందడంలో ఊహించని విజయాలు సాధించగలుగుతారు. అంతేకాకుండా వృత్తిపరంగా ఈ సమయం ఎంతో లాభదాయకంగా ఉంటుంది. వ్యాపారాల పరంగా వస్తున్న ఒప్పందాలు కూడా సులభంగా ఖరారు అయితాయి. అంతేకాకుండా కొత్త ప్రాజెక్టులు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. విదేశాలలో ఉద్యోగాలు చేయాలనుకునే వారి కలలు నెరవేరుతాయి..

తులారాశి 
తులా రాశిలో జన్మించిన వ్యక్తులకు సెప్టెంబర్ నెల ఎంతో లాభదాయకంగా ఉంటుంది. కాకుండా శుభప్రదంగా ఉండబోతోంది. ఈ సమయంలో వీరికి లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల వృత్తిలో ఘననీయమైన అభివృద్ధి కనిపిస్తుంది.. అంతేకాకుండా పదోన్నతులు లభించి అద్భుతమైన అవకాశాలు కూడా సొంతం చేసుకుంటారు. ముఖ్యంగా పాత పెట్టబడిలో నుంచి భారీ మొత్తంలో లాభాలు కూడా పొందగలుగుతారు. అలాగే నిలిచిపోయిన డబ్బులు కూడా తిరిగి పొందగలుగుతారు. వివిధ మార్గాల నుంచి డబ్బులు పొందడం వల్ల విశేషమైన ప్రయోజనాలు సొంతం చేసుకోగలుగుతారు..

నోట్.. ఇక్కడ అందించిన సమాచారం కేవలం సాధారణంగా నమ్మకాలపై మాత్రమే ఆధారపడి ఉంటుంది.. దీనిని జీ తెలుగు న్యూస్ దృవీకరించదు..

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook ..

0
0
Report
Advertisement

శని-కుజుల కేంద్ర యోగం.. సెప్టెంబర్ నుంచి ఈ రాశుల వారికి డబ్బే డబ్బు!

Hyderabad, Telangana:

Saturn-mars Alignment Effect On Zodiac: సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి శని కుజ గ్రహాలు ఒకదానికొకటి 90 డిగ్రీల కోణంలోకి రాబోతున్నాయి. దీనివల్ల కేంద్ర యోగము ఏర్పడుతుంది. జ్యోతిష శాస్త్రంలో ఈ యోగం కృషి, క్రమశిక్షణ, ధైర్యంతో పాటు పట్టుదలకు సూచికగా భావిస్తారు. అయితే, జ్యోతిష్య శాస్త్రం ప్రకారం... కుజ, శని గ్రహాల ఈ స్థానం వల్ల చాలా కాలంగా ఉద్యోగాలు వ్యాపారాల పరంగా నిలిచిపోయిన పనులు వేగవంతం అవుతాయి. దీంతోపాటు ఆర్థిక రంగంలో పురోగతి కూడా లభిస్తుంది. సరైన వ్యూహంతో కష్టపడి ముందుకు తాగితే.. అద్భుతమైన పురోగతితో పాటు ధన లాభాలు కూడా కలుగుతాయి.

ఈ రాశుల వారికి గోల్డెన్ జాక్పాట్..
మిథున రాశి 

ముఖ్యంగా శని, కుజ గ్రహాల కలయికతో మిధున రాశి వారికి వృత్తిలో అద్భుతమైన లాభాలు కలుగుతాయి. ముఖ్యంగా పనుల్లో కొత్త బాధ్యతలు రావడమే కాకుండా నిలిచిపోయిన ప్రణాళికలు తిరిగి ప్రారంభించి.. భవిష్యత్తులో అద్భుతమైన నాబాలు పొందుతారు. వ్యాపారవేత్తలకు కొత్త కాంట్రాక్టులు లభించడమే కాకుండా తమ వ్యాపారాలను విస్తరించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఆదాయం కూడా ఈ సమయంలో అంచలంచలుగా పెరుగుతుంది. అలాగే ఖర్చులపై నియంత్రణ ఉంచడం చాలా మంచిదని జ్యోతిష్యులు చెబుతున్నారు. ముఖ్యంగా సంబంధాలు మనసు విప్పి మాట్లాడటం వల్ల అనేక రకాల అపార్ధాలనుంచి విముక్తి లభిస్తుంది. అలాగే కుటుంబంలో కూడా మీ అభిప్రాయాలకు విలువ ఉంటుంది..

కన్య రాశి 
కన్య రాశిలో జన్మించిన వ్యక్తులకు కేంద్ర యోగం కెరియర్ పరంగా అనేక మార్పులను తీసుకువస్తుంది. ఉద్యోగంలో పదోన్నతులను అందించడమే కాకుండా కొత్త బాధ్యతలను అందిస్తుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. ముఖ్యంగా చాలా కాలంగా నిలిచిపోయిన పనులు ఈ సమయంలో తప్పకుండా వేగవంతమవుతాయి.. వ్యాపారస్తులకు పాత పరిచయాల నుంచి ప్రయోజనాలు కూడా లభిస్తాయి. అంతేకాకుండా ఆర్థిక విషయాల్లో సరిగ్గా ప్రణాళికలు వేసుకొని మంచి ఫలితాలు పొందగలుగుతారు. కష్టానికి తగిన సానుకూలమైన ఫలితాలు తప్పకుండా పొందగలుగుతారు..

ధనస్సు రాశి 
ధనస్సు రాశిలో జన్మించిన వ్యక్తులను కూడా కుజ శని గ్రహాల కలయిక అద్భుతమైన ప్రయోజనాలనుందిస్తుంది. ముఖ్యంగా వ్యాపార భాగస్వామితో కలిసి పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా ఆదాయ వనరులు కూడా విపరీతంగా పెరిగి వ్యక్తుల సపోర్టుతో విశేషమైన లాభాలు సొంతం చేసుకోగలుగుతారు. ప్రేమ సంబంధాలు మరింత మెరుగుపడి అనుకున్న ధన లాభాలు కూడా పొందగలుగుతారు. కుటుంబంలో సమాజంలో గౌరవ మర్యాదలతో పాటు హోదా పెరుగుతుంది..

మీన రాశి 
మీనరాశిలో జన్మించిన వ్యక్తులకు కేంద్ర యోగంతో ఆర్థికంగా బోలేడు లాభాలు చేకూరే అవకాశాలు ఉన్నాయి. వృత్తి సంబంధిత సమస్యలు పరిష్కారం కావడమే కాకుండా ఉద్యోగాలు మార్పులు కూడా వస్తాయి. కొత్త బాధ్యతలు పొంది అనుకున్న ధన లాభాలు సొంతం చేసుకుంటారు. అంతేకాకుండా ఆర్థిక విషయాల్లో ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకపోవడం మంచిది. ముఖ్యంగా పలుకుబడి పెరగడం కారణంగా వీరు జీవితంలో అద్భుతమైన ఆనందాన్ని సొంతం చేసుకుంటారు.. గౌరవ మర్యాదలు కూడా పెరిగి డబ్బులు భారీగా పొందగలుగుతారు.

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

గమనిక.. 

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook ..

0
0
Report
Advertisement
Advertisement

ప్రధాని మోదీకి రాఖీ కట్టిన తెలుగు విద్యార్థిని..

Hyderabad, Telangana:

Telugu Student Ties Rakhi To Pm Modi: దేశ రాజధాని ఢిల్లీలోని ప్రధానమంత్రి అధికారిక నివాసం 7 లోక్ కళ్యాణ్ మార్గ్ రక్షాబంధన్ వేడుకలతో సందడిగా మారింది.. శుక్రవారం జరిగిన ఈ ప్రత్యేక కార్యక్రమంలో దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన విద్యార్థులతో పాటు చిన్నారులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు.. ఈ వేడుకల్లో ఢిల్లీలోని ఇంటర్మీడియట్ చదువుతున్న తెలుగు విద్యార్థిని సాయి మధుమిత పాల్గొని.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మణికట్టుకు రాఖీ కట్టి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు..

రక్షాబంధన్ సందర్భంగా విద్యార్థులందరూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి రాఖీలు కట్టగా.. ఆయన చిన్నారులను ఆశీర్వదించి ఆప్యాయంగా పలకరించారు.. ఎంతో సరదాగా సాగిన ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీ విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు.. అంతేకాకుండా పిల్లల చదువులతో పాటు వారి లక్ష్యాలను గురించి అడిగి తెలుసుకున్నారు.. చిన్నారులతో సరదాగా హై-ఫైవ్స్ ఇస్తూ వారిలో మరింత ఉత్సాహాన్ని నింపారు.

దేశ ప్రధానికి స్వయంగా రాఖీ కట్టే అరుదైన అవకాశం దక్కడంపై తెలుగు విద్యార్థిని సాయి మధుమిత హర్షం వ్యక్తం చేశారు.. ఇది తన జీవితంలో ఎప్పటికీ మరిచిపోలేని ఒక అద్భుతమైన అనుభూతి అని ఆమె పేర్కొన్నారు.. ప్రధాని మోదీ ఎంతో ప్రేమాభిమానాలతో మాట్లాడి తమను ఎంతగానో ప్రోత్సహించారని.. ఆయన చూపిన ఆదరణ ఎంతో ఆనందాన్నిచ్చిందని ఆ విద్యార్థిని వెల్లడించారు..

Also Read: చెట్లను సొంత సోదరులుగా భావించి రాఖీలు కట్టిన జార్ఖండ్ గిరిజన మహిళలు!

ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ దేశ ప్రజలందరికీ రక్షాబంధన్ పర్వదినాన ప్రత్యేకమైన శుభాకాంక్షలు కూడా తెలిపారు.. ఈ వేడుకకు సంబంధించిన మధుర జ్ఞాపకాలతో పాటు ఫోటోలను ఆయన సోషల్ మీడియాలో కూడా పంచుకున్నారు.. రక్షాబంధన్ అనేది కేవలం ఒక పండగ మాత్రమే కాదని బంధాలను మరింత బలోపేతం చేసే పవిత్రమైన వేడుక అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.. ఈ పండుగ ప్రతి ఒక్కరి జీవితాల్లో సుఖసంతోషాలు నింపడమే కాకుండా శ్రేయస్సును, అద్భుతమైన ఆనందాన్ని నింపాలని ఆయన కోరుకున్నారు..

Also Read: చెట్లను సొంత సోదరులుగా భావించి రాఖీలు కట్టిన జార్ఖండ్ గిరిజన మహిళలు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
0
Report

వరదల్లో కొట్టుకొచ్చిన మహిళ మృతదేహంపై ఉన్న బంగారం చోరీ.. ఇద్దరు అరెస్ట్!

Hyderabad, Telangana:

Nepal Theft Video: తీవ్రమైన వరదలతో పాటు కొండ చర్యలు విరిగిపడి ఒకవైపు నేపాల్ అతలాకుతలమవుతుంటే.. మరోవైపు కొందరు వ్యక్తుల అమానుష్య ప్రవర్తన యావత్ సమాజాన్ని తలదించుకునేలా చేస్తోంది.. ప్రాణాలు కోల్పోయి వరద నీటిలో కొట్టుకు వచ్చిన ఓ అభాగ్యురాలి మృతదేహం నుంచి బంగారు చెవి కమ్మలు చోరీ చేసిన అత్యంత హీనమైన ఘటన నేపాల్ లో వెలుగు చూసింది.. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ కావడంతో.. నేపాల్ కు సంబంధించిన పోలీసులు రంగంలోకి దిగి ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు..

నేపాల్ లోని పలు ప్రాంతాల్లో ఆకస్మికంగా వరదలు సంభవించి వందలాదిమంది మృత్యువాత పడ్డ సంగతి తెలిసిందే.. కాక వారితో దాటికి కొట్టుకొని వచ్చిన ఒక గుర్తు తెలియని మహిళ మృతదేహం ఒడ్డుకు చేరుకుంది. ఈ క్రమంలో ఇద్దరు యువకులు ఒక చెక్కతో పాటు కర్రల సహాయంతో ఆ మృతదేహాన్ని ఒడ్డుకు లాగారు. అనంతరం ఆమె జుట్టును పట్టుకొని ఈడ్చుకొని.. నిర్దాక్షినీయంగా ఆమె చెవులకు ఉన్న బంగారు కమ్మలను లాగేసుకున్నారు.. చుట్టూ ఉన్నవారు వారిని అడ్డుకోలేక చూస్తూ.. ఆ ఘటనను స్మార్ట్ ఫోన్స్ లో చిత్రీకరిస్తూ ఉండిపోయారు.. ఈ 41 సెకండ్ల విజువల్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఊహించని స్థాయిలో దుమారం లేపుతున్నాయి. మానవత్వం సిగ్గుపడేలా ప్రవర్తించిన ఆ దుండగులపై సోషల్ మీడియా వినియోగదారులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు..

ఈ వీడియో పోలీసుల దృష్టికి వెళ్లడంతో అధికారులు తక్షణమే స్పందించారు.. సాంకేతిక ఆధారాల సాయంతో నిందితులను గుర్తించారు. వీరు నవల్ పరాసికి చెందిన మదన్ గురుంగు.. నున్సారీ కి చెందిన ఉమేష్ చౌదరిగా గుర్తించి వారిని భరత్ పురం లోని ఓ పార్కు సమీపంలో పట్టుకున్నట్లు పోలీస్ అధికారులు వెల్లడించారు.. విపత్తు సమయంలో సహాయం చేయాల్సింది పోయి.. మృతదేహాల వద్ద ఇలా నీచమైన పనులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అక్కడి పోలీస్ అధికారులు హెచ్చరించారు.. వరద సహాయక చర్యల ప్రాంతాల్లో నిఘ మరింత పెంచినట్లు స్పష్టం చేశారు..

Also Read: Viral Pic: ఇదేం క్రియేటివిటీ రా బాబు.. మూత్రం పోస్తూ ప్రీ వెడ్డింగ్ ఫోటో స్టిల్స్‌..

గత కొద్ది రోజులుగా నేపాల్‌తో పాటు టిబెట్ సరిహద్దు ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో పాటు వరదల కారణంగా దాదాపు 400 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా.. సుమారు 1500 మందికి పైగా గల్లంతయినట్లు అధికారులు స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఇంతటి భారీ ప్రకృతి విపత్తు వేళ మనుషుల్లో నైతిక విలువలు ఇంతలా దిగజారడంపై సర్వత్ర తీవ్ర ఆవేదన వ్యక్తం అవుతుంది..

Also Read: Viral Pic: ఇదేం క్రియేటివిటీ రా బాబు.. మూత్రం పోస్తూ ప్రీ వెడ్డింగ్ ఫోటో స్టిల్స్‌..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
0
Report
Advertisement

చెట్లను సొంత సోదరులుగా భావించి రాఖీలు కట్టిన జార్ఖండ్ గిరిజన మహిళలు!

PPINEWZ22h ago
Hyderabad, Telangana:

Jharkhand Tribals Tie Rakhi To Trees: అన్నాచెల్లెళ్ల అనురాగానికి ప్రతీకగా జరుపుకునే రక్షాబంధన్ పండుగకు జార్ఖండ్లోని ఆదివాసీ మహిళలు సరికొత్త అర్ధాన్ని ఇచ్చారు.. తమను కంటికి రెప్పలా కాపాడుతున్న పచ్చని అడవులను కాపాడుకోవడమే నిజమైన రక్ష అని చాటి చెప్పారు.. రక్షాబంధన్ పర్వదినాన్ని పురస్కరించుకొని తూర్పు సింగ్ భూమ్ జిల్లాలోని వందలాదిమంది గిరిజన మహిళలు అడవిలోని వృక్షానికి పవిత్రమైన రాఖీలు కట్టి.. ప్రకృతి రక్షణకు పునరంకితమయ్యారు.. దీనికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి..

చాకులియా పరిధిలోని సున్సునియా అటవీ ప్రాంతంలో ఈ ప్రత్యేకమైన రక్షాబంధన్ కార్యక్రమం ఘనంగా జరిగింది. పద్మశ్రీ అవార్డు గ్రహీత ప్రముఖ పర్యావరణ ఉద్యకారిణి జమున టుడు నేతృత్వంలో మహిళలంతా సాంప్రదాయ వస్త్రాదరణతో అడవికి భారీ ఎత్తున తరలివచ్చారు.. చేతిలో రాఖీలు పట్టుకొని అడవి బాట పట్టడం చూసి మొదటగా అందరూ ఆశ్చర్యపోయినప్పటికీ.. చెట్ల వద్దకు వచ్చి సాల్వృక్షాలకు సాంప్రదాయ పద్ధతిలో ప్రత్యేకమైన పూజలు నిర్వహించడం చూసి అందరూ మెచ్చుకున్నారు..

అంతేకాకుండా చెట్లను సోదరుల్లా పూజించి.. తమ తోబుట్టువులుగా భావించి రక్షా సూత్రాలు కట్టారు.. అడవులను కన్నబిడ్డల్లా సొంత సోదరులారా కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిదని ప్రతిజ్ఞ చేశారు.. ఈ ప్రాంతంలో ప్రతి ఏటా రక్షాబంధన్ చెట్లకు రాఖీలు కట్టడం ఒక ఆచారంగా ఉండేదట.. ఆదివాసుల జీవనశైలితో పాటు సాంస్కృతిని అటవీ సంరక్షణతో ముడిపెడుతూ జమునా టుడు ప్రారంభించిన ఈ కార్యక్రమం నేడు దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటోంది.
 
అంతేకాకుండా మహిళలందరూ ఈ సమయంలో కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది.. అటవీ మాఫియా తో పాటు కలప స్మగ్లర్ల నుంచి చెట్లను కాపాడడంతో పాటు అక్రమంగా నరికివేతను పూర్తిగా అడ్డుకోవడం క్రియాశీలక పాత్ర పోషిస్తామని తెలిపారు. అంతేకాకుండా అడవిలోని జంతువులతో పాటు పక్షుల ఆవాసాలను పరిరక్షించి వైవిధ్యాన్ని కాపాడుతామని అన్నారు.. కానీ ప్రదేశాల్లో పెద్ద ఎత్తున మొక్కలు నాటడంతో పాటు సామాజిక వనాల పెంపకాన్ని ప్రోత్సహిస్తామని ఈ రక్షాబంధన్ వేడుకల్లో మహిళలం ప్రతిజ్ఞ చేసినట్టు తెలుస్తోంది. ఏది ఏమైనా ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియోలు మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Also Read: Viral Pic: ఇదేం క్రియేటివిటీ రా బాబు.. మూత్రం పోస్తూ ప్రీ వెడ్డింగ్ ఫోటో స్టిల్స్‌..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
0
Report

Telangana Rakhi: తెలంగాణలో ఆత్మీయంగా 'రాఖీ'.. ప్రముఖులకు రాఖీలు కట్టిన మహిళలు

Baddipadaga, Telangana:

Telangana Rakhi Celebration: 'రాఖీ పౌర్ణమి' పండుగను పురస్కరించుకుని మంత్రి కొండా సురేఖ వివాదాలు పక్కనపెట్టి ముఖ్యమంత్రికి రాఖీ కట్టారు. జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసానికి వెళ్లి కొండా సురేఖ బంగారు రాఖీ కట్టారు. మహిళా కమిషన్ చైర్‌పర్సన్ గద్వాల విజయలక్ష్మి, సభ్యులు, వివిధ కార్పొరేషన్ చైర్మన్లు, బ్రహ్మకుమారీస్, మహిళా కాంగ్రెస్ నాయకులు, మలక్‌పేట్‌లోని ప్రభుత్వ అంధుల పాఠశాల విద్యార్థినిలు ముఖ్యమంత్రికి రాఖీ కట్టారు. ఈ సందర్భంగా వారికి ముఖ్యమంత్రి కానుకలు అందించారు.

కిటకిటలాడిన హరీశ్‌ రావు నివాసం
బీఆర్‌ఎస్‌ పార్టీ డిప్యూటీ ఫ్లోర్‌ లీడర్‌ హరీశ్‌ రావుకు రాఖీలు కట్టేందుకు మహిళలు పోటీ పడ్డారు. హైదరాబాద్‌ శివారులోని కోకాపేటలో ఉన్న మాజీ మంత్రి హరీశ్‌ రావు నివాసం మహిళలతో కిటకిటలాడింది. బీఆర్‌ఎస్‌ పార్టీ మహిళా నాయకులతోపాటు రాష్ట్ర నలుమూలలా నుంచి వచ్చిన మహిళలు, వివిధ పాఠశాలల విద్యార్థినులు హరీశ్ రావుకు రాఖీలు కట్టారు. అనంతరం వారి ఆశీర్వచనం పొందిన హరీశ్‌ రావు రాఖీలు కట్టిన వారికి కానుకలు అందించారు. మాజీ మంత్రి హరీశ్ రావుకు సత్యవతి రాథోడ్‌, తుల ఉమతోపాటు మరికొందరు ప్రముఖులు ప్రత్యేకంగా రాఖీ కట్టారు.

 

మల్లారెడ్డి రాఖీ పండుగ
రక్షాబంధన్ పురస్కరించుకొని మాజీ మంత్రి  మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి, కంటోన్మెంట్ ఎమ్మెల్యే, మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డిలకు మహిళలు రాఖీలు కట్టించారు. అనంతరం మిఠాయిలు తినిపించగా సోదరీమణులకు కానుకలు అందించారు. ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ... 'రక్షాబంధన్ అన్నాచెల్లెలు, అక్క తమ్ముడు మధ్య ఉన్న గొప్ప వారధి. రక్షాబంధన్‌క అక్కాచెల్లెలు వచ్చి రాఖీ కట్టడం సాంప్రదాయంగా వస్తుంది. నాకు మా సోదరీమణులంటే ఎంతో ఇష్టం. ఈ రాఖీ బంధానికి ప్రతి ఒక్కరూ విలువ ఇవ్వాలని మారుతున్న సమాజ పరిస్థితుల నేపథ్యంలో ప్రతి ఒక్కరూ రక్షాబంధన్ చేసుకోవాలి' అని తెలిపారు.

మాజీ గవర్నర్‌ బండారు దత్తాత్రేయ
హైదరాబాద్‌లోని రాంనగర్‌లోని తన నివాసంలో రక్షాబంధన్ వేడుకల్లో మాజీ గవర్నర్‌ బండారు దత్తాత్రేయ పాల్గొన్నారు. బ్రహ్మకుమారీలు, జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య కార్మికులు దత్తాత్రేయకు రాఖీ కట్టారు.  ఈ వేడుకల్లో హైదరాబాద్ నగర్ మాజీ మేయర్  బండారు కార్తిక రెడ్డి, మహిళా మోర్చా సికింద్రాబాద్ జిల్లా అధ్యక్షురాలు కేతినేని సరళ తదితరులు ఉన్నారు.

రాఖీ పండుగను పురస్కరించుకొని బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుకు స్థానిక మహిళలు, పారిశుద్ధ్య కార్మికులురాఖీ కట్టారు. అనంతరం ప్రతి ఆడబిడ్డకు ఎమ్మెల్యే చీరలు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఉన్న అక్క చెల్లెలు అందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రతి పురుషుడు అమ్మాయికి అండగా ఉండాలని వారిని అన్నింట్లో ప్రోత్సహించి ముందుకు వెళ్లేలా చూడాలని సూచించారు.

మంత్రి అడ్లూరి
రక్షాబంధన్ పర్వదినాన్ని పురస్కరించుకుని ధర్మపురిలోని క్యాంపు కార్యాలయంలో సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌కు స్థానిక మహిళా కౌన్సిలర్లు, ఇతర సోదరీమణులు రాఖీలు కట్టి రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సోదరీమణులకు రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ.. అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకగా నిలిచే ఈ పర్వదినం ప్రతి కుటుంబంలో ఆనందాన్ని నింపాలని ఆకాంక్షించారు. సోదరీమణుల ప్రేమాభిమానాలు, ఆశీర్వాదాలు తనకు ఎల్లప్పుడూ కొండంత అండగా ఉంటాయని మంత్రి పేర్కొన్నారు.

కరీంనగర్‌లో
రక్షా బంధన్ సందర్బంగా కరీంనగర్‌లో తన సోదరి  శైలజతో కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ రాఖీ కట్టించుకున్నారు. ఈ వేడుకల్లో బండి సంజయ్‌ కుటుంబసభ్యులు పాల్గొన్నారు.

ఎమ్మెల్సీ కోదండరాం
కార్మిక సోదరీమణులతో ఎమ్మెల్సీ ప్రొఫెసర్‌ కోదండరాం రక్షాబంధన్ వేడుకలు చేసుకున్నారు. హైదరాబాద్‌లోని తెలంగాణ జన సమితి పార్టీ కార్యాలయంలో ఆయనకు పారిశుద్ధ్య కార్మికులు రాఖీలు కట్టారు. అనంతరం రాఖీలు కట్టిన సోదరీమణులకు చీరలను అందజేశారు.

0
0
Report

Sun Transit 2026: ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 13 వరకు ఈ రాశుల వారికి గోల్డెన్ డేస్!

Hyderabad, Telangana:

Sun Transit In Purva Phalguni Nakshatra: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం పూర్వ ఫల్గుణి నక్షత్రానికి శుక్రుడు అధిపతిగా వ్యవహరిస్తూ ఉంటాడు. అందుకే ఈ నక్షత్రానికి చాలా ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతూ ఉంటారు. ఇదిలా ఉంటే ఆగస్టు 31వ తేదీన సూర్యుడు ఈ నక్షత్రంలోకి సంచారం చేయబోతున్నాడు. ఆరోజు ఉదయం నాలుగు గంటల సమయంలో సూర్యుడు ఈ నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు. సెప్టెంబర్ 13వ తేదీ వరకు ఇదే నక్షత్రంలో సంచార దశలో కొనసాగుతుంది. ఫలితంగా కొన్ని రాశుల వారికి ఆనందంతో పాటు ఊహించని శ్రేయస్సు లభిస్తుంది.. అంతేకాకుండా గౌరవం పెరిగి డబ్బు సంబంధిత కోరికలు కూడా నెరవేరుతాయి. అదృష్టం కూడా తోడుగా ఉండి ఉద్యోగాల్లో విజయాలు సాధించగలుగుతారు.. అయితే, పూర్వ ఫల్గుణి నక్షత్రంలో సంచారం చేయడం కారణంగా ఏ రాశుల వారికి మేలు జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం..

ఈ రాశులవారికి లాభాలు:
మేషరాశి 

పూర్వ ఫల్గుణి నక్షత్రంలో సూర్యుడు సంచారం చేయడం కారణంగా మేష రాశి వారికి ఎక్కువగా మేలు జరుగుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా వీరికి అదృష్టం తోడు ఉండడమే కాకుండా పనుల్లో అద్భుతమైన విజయాలు సాధించగలుగుతారు. అలాగే విజయాలు కూడా లభించి ఉద్యోగంలో గొప్ప గొప్ప మార్పులు రావడం ప్రారంభమవుతుంది. ముఖ్యంగా పురోగతి కూడా లభించి డబ్బులు కూడా భారీగా సొంతం చేసుకుంటారు. కష్టాల నుంచి విముక్తి లభించి మానసిక ప్రశాంతత లభించబోతోంది. అలాగే నిలిచిపోయిన పనులు తప్పకుండా ఈ సమయంలో పూర్తి కాబోతున్నాయి..

సింహరాశి 
ఈ నక్షత్రం లోకి సూర్యుడు ప్రవేశించడం కారణంగా.. సింహరాశి వారికి కూడా ఎక్కువగా మేలు జరుగుతుంది. సింహ రాశి వారికి సూర్యుడు అధిపతిగా వ్యవహరిస్తాడు. అయితే ఈ సమయంలో అకస్మాత్తుగా గొప్ప విజయాలు సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆత్మవిశ్వాసం కూడా అంచలంచలుగా విపరీతంగా పెరుగుతుంది. ఈ సమయంలో నాయకత్వ సామర్థ్యం కూడా పెరిగి కొన్ని రకాల విజయాలు తప్పకుండా సాధిస్తారు. ముఖ్యంగా ఆర్థిక పరిస్థితులు గతంలో కంటే ఇప్పుడు మరింత మెరుగుపడతాయి. ఆదాయ వనరులు కూడా విపరీతంగా పెరిగి కొత్త మార్గాలు పొందగలుగుతారు..

తులారాశి 
తులారాశిలో జన్మించిన వ్యక్తులందరికీ ఈ సమయంలో శుభ ఫలితాలు కలుగుతాయి. వీరికి అనేక సమస్యల నుంచి పరిష్కారం లభించడమే కాకుండా కుటుంబ సభ్యుల్లో అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులందరికీ పూర్తిగా పరిష్కారం లభిస్తుంది. వ్యాపారాల్లో ఒప్పందాలను కుదుర్చుకోవాలనుకుంటున్న వారు తప్పకుండా ఈ సమయంలో కొత్త ఒప్పందాలు కుదుర్చుకుంటారు. పూర్వీకుల ఆస్తులు సులభంగా లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. డబ్బు సమస్యలు కూడా పరిష్కారం అవ్వడంతో రుణాలు కూడా తిరిగి చెల్లిస్తారు..

మీన రాశి 
మీన రాశిలో జన్మించిన వ్యక్తులకు కూడా ఈ సమయంలో బోలెడు లాభాలు కలగబోతున్నాయి. ముఖ్యంగా ఎన్నో రకాల సమస్యల నుంచి పరిష్కారం దొరుకుతుంది. అలాగే ఉద్యోగాల్లో అద్భుతమైన పురోగతి లభించి విశేషమైన లాభాలు పొందగలుగుతారు. ఈ సమయంలో ప్రయాణాలు చేయడం వల్ల గొప్ప గొప్ప అవకాశాలు కూడా సొంతం చేసుకుంటారు. ముఖ్యంగా మానసిక ప్రశాంతత నెలకొంటుంది. ఒత్తిడి తగ్గడం కారణంగా పనులపై దృష్టి పెట్టి అనుకోకుండా ధన లాభాలు సొంతం చేసుకోగలుగుతారు..

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

గమనిక.. 

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook ..

0
0
Report
Advertisement
Advertisement
Back to top