హామిల అమలు కోసం కలెక్టరేట్ ఎదుట ధర్నా
Mahabubabad, Telangana:కాంగ్రెస్ ఇచ్చిన ఆరు హామీ పథకాలను అమలు చేయాలని సీపీఐఎంఎల్ మాస్ లైన్ పార్టీ ఖమ్మం కలెక్టరేట్ ఎదుట నిరసన చేపట్టింది. అర్హులైన వారికి నివాస స్థలం, ఇళ్లు నిర్మించి ఇవ్వాలి. రేషన్‌కార్డులు, పోడు భూములకు పట్టాలు, రైతు బీమా, పింఛన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అధికారం చేపట్టి ఎనిమిది నెలలు అవుతున్నా ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
Veligonda Project: రేపు తీరనున్న మూడు దశాబ్దాల కల.. వెలిగొండ ప్రాజెక్టు జాతికి అంకితం
Jammana Palle, Andhra Pradesh:Veligonda Project: మూడు దశాబ్దాల కల సాకారం దిశగా వెలిగొండ ప్రాజెక్టు నిలవనుంది. వెలిగొండ సొరంగం నుంచి నీరు విడుదలవుతుండడంతో ప్రకాశం జిల్లా రైతులు సంబరపడుతున్నారు. వెలిగొండ ప్రాజెక్టు సొరంగం నుంచి జలధారగా కృష్ణమ్మ జలాలు వస్తున్నాయి. దశాబ్దాల నిరీక్షణకు తెరదించుతూ వెలిగొండ నుంచి రేపు కృష్ణా జలాలు పరుగులు తీస్తున్నాయి. కృష్ణా జలాల రాకతో కరువు ప్రాంతం జలకళ సంతరించుకోనుంది.
కరవు నేల చరిత్రలో సువర్ణ అధ్యాయంగా వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభోత్సవం నిలవనుంది. వెలిగొండ ప్రాజెక్టు కోసం దశాబ్దాలుగా లక్షలాది మంది రైతుల ఎదురుచూపులు ఫలించనున్నాయి. శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి వెలిగొండ ప్రాజెక్టుకు వస్తున్న కృష్ణా జలాలు ప్రకాశం జిల్లాలో పరవళ్లు తొక్కనున్నాయి. ఫీడర్ కెనాల్ గేట్లు ఎత్తి రేపు నల్లమల సాగర్‌కు 10.7 టీఎంసీల నీరును సీఎం చంద్రబాబు విడుదల చేయనున్నారు. ఆనాడు శంకుస్థాపన చేసిన చంద్రబాబు ఈరోజు ప్రారంభం చేయనుండడం విశేషం.
రెండేళ్లలో భారీగా ఖర్చు
ప్రకాశం, మార్కాపురం జిల్లా ప్రజల నీటి కష్టాలు వెలిగొండ ప్రాజెక్టు తీర్చనుంది. కరవు నేలకు కృష్ణమ్మను తెస్తున్న ఆ ప్రాజెక్టు ప్రారంభోత్సవంపై అందరి కళ్లు పడ్డాయి. వెలిగొండ పండుగతో ప్రతి గ్రామం కళకళలాడుతోంది. కలగా మిగిలిపోతుందనుకున్న వెలిగొండను కళ్ల ముందుకు రావడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రెండేళ్లలో వెలిగొండపై రూ.2,400 కోట్లకు పైగా కూటమి ప్రభుత్వం ఖర్చు చేసింది.
తీరనున్న సమస్యలు
వెలిగొండ ప్రాజెక్టుతో ప్రకాశం, మార్కాపురం జిల్లాల రైతాంగానికి కొత్త భరోసా. కృష్ణమ్మ రాకతో కరవు నేలలో కొత్త ఆశలు
ఫ్లోరైడ్ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించనుంది. తీవ్రమైన ప్లోరైడ్ సమస్యతో కొట్టుమిట్టాడుతున్న పశ్చిమ ప్రకాశం ప్రాంతానికి మంచి రోజులు
ఈ ప్రాజెక్టు పూర్తితో సాగు, తాగునీటికి ఇబ్బందులు తొలగనున్నాయి.
ఇంటింటికీ కుళాయి ద్వారా తాగునీటి సరఫరా జరగనుంది.
భారీగా పరిహారం
నిర్వాసితుల కుటుంబాలకు వేగంగా పరిహారం ప్రభుత్వం అందించింది. మూడు విడతల్లోనే 6,206 కుటుంబాలకు రూ.768 కోట్లు ప్రభుత్వం అందించగా.. అదనంగా మరో రూ.169 కోట్లు ప్రకటించింది. 2019 తర్వాత 18 ఏళ్ల నిండిన వారికి రూ.2 లక్షల చొప్పున పరిహారం ప్రభుత్వం ఇచ్చింది.
నిర్వాసితులకు గౌరవం
నిర్వాసిత మహిళలను గౌరవించేలా చీర, పసుపు, కుంకుమ, గాజులు అందించాలని సీఎం చంద్రబాబు ఆదేశాలు ఇచ్చారు. ఈ మేరకు ఏర్పాట్లు చేసిన అధికార యంత్రాంగం. నిర్వాసితులకు చెందిన 4,933 పశువులకు 30 రోజుల పాటు దాణా అందించనున్నారు. అంతేకాకుండా 10 వేల మందికి 25 కిలోల బియ్యం, కిలో పప్పు, కిలో చక్కెర, లీటర్ నూనె, 2 కిలోల ఉల్లిపాయలు, 2 కిలోల బంగాళాదుంపలతో నిత్యావసరాల కిట్ ఇవ్వనున్నారు.
Eatala Rajender: భారతదేశం విచ్చిన్నం కావాలని కాక్రోచ్ జనతా పార్టీకి ఫండింగ్: ఈటల రాజేందర్
Secunderabad, Telangana:Hyderabad: బంగ్లాదేశ్, శ్రీలంక లాగా భారతదేశం విచ్చిన్నం కావాలని అనేక దేశాలు కాక్రోచ్ జనతా పార్టీకి ఫండింగ్ చేస్తున్నారని మల్కాజిగిరి బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ తీవ్ర ఆరోపణలు చేశారు. నరేంద్ర మోదీ బలహీన పడితే ప్రజాస్వామ్యం, దేశ భద్రత బలహీనపడుతుందని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం డబ్బులిస్తోందని అని చెప్పలేని సంకుచిత స్వభావి రేవంత్ రెడ్డి అని విమర్శించారు. కురచ మనస్తత్వంతో వ్యవహరిస్తున్నారని తెలిపారు.
మేడ్చల్ మల్కాజిగిరి అర్బన్ జిల్లా బీజేపీ కార్యాలయం ప్రారంభోత్సవం ఆదివారం జరగ్గా ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. 'బీజేపీ కుటుంబ పార్టీ కాదు. సిద్ధాంతంతో ఏర్పడిన పార్టీ. దేశహితం కోసమే నిర్ణయాలు తీసుకుంటుంది తప్ప పార్టీ కోసం కాదు. బీజేపీ పవర్ ఓరియెంటెడ్ పార్టీ కాదు. పీపుల్ ఓరియెంటెడ్ పార్టీ' అని వివరించారు. 'సంకీర్ణ ప్రభుత్వంలో దేశ హితం కోసం అప్పటి ప్రధాని వాజ్‌పేయి అనేక నిర్ణయాలు తీసుకున్నారు. ఎన్డీయే ప్రభుత్వం 370 ఆర్టికల్‌ను రద్దు చేసింది. తెలంగాణ ఉద్యమంలో ఏబీవీపీ, బీజేపీ జేఏసీలో భాగస్వాములు.
'కార్యకర్తలు పార్టీకి పునాదిరాళ్లు. పదవి రాకపోయినా నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేస్తారు. నాయకులు వస్తారు పోతారు కానీ కార్యకర్తలు శాశ్వతం. నాయకులు కార్యకర్తలను, ప్రజలను ప్రేమించాలి, లేదంటే మళ్లీ గెలవలేడు. రెండోసారి గెలిస్తే ప్రజల విశ్వాసం పొందినట్టు. కార్యకర్తల గుండెల్లో చోటు సంపాదించుకున్నట్టు లెక్క' అని ఎంపీ ఈటల రాజేందర్ వెల్లడించారు. 'నరేంద్ర మోదీ ఆను పాలకుడిని కాదు సేవకుడిని అంటారు. నేను ఇచ్చిన అని ఎన్నడూ అనరు. కానీ ఇక్కడ ఉన్న కురుస నాయకులు మాత్రం అన్నీ నేనే ఇచ్చిన అని ప్రచారం చేసుకుంటారు' అని రేవంత్ రెడ్డిపై పరోక్షంగా ఎంపీ ఈటల రాజేందర్ విమర్శించారు. 'రేషన్ కార్డుల మీద ఫొటోలు వేసుకుంటున్నారు. నువ్వు ప్రజల డబ్బులకు కాపలదారుడవి అని మాత్రం మర్చిపోకు. కేంద్రం కూడా డబ్బులు ఇస్తుంది అని చెప్పని సంకుచిత స్వభావులు' అని కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు.
'క్యూర్ పేరుతో రేవంత్ రెడ్డి హైదరాబాద్ ప్రజలను క్రష్ చేస్తున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారుల దగ్గర నుంచి 30 శాతం కమీషన్లు వసూలు చేసి డిల్లీకి పంపిస్తున్నారు' అని రేవంత్ రెడ్డిపై ఎంపీ ఈటల రాజేందర్ విమర్శించారు. '43 శాతం క్రైమ్ రేట్ డ్రగ్స్ వల్ల పెరిగింది. డ్రగ్స్ ఎందుకు అరికట్టలేక పోతున్నావని రేవంత్ రెడ్డి యువతకు సమాధానం చెప్పాలి' అని డిమాండ్ చేశారు. 'ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వరు. ఉద్యోగాలు లేవు. యువత విద్యార్థులు ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారు' అని తెలిపారు. రేవంత్ రెడ్డి పాలనలో అనుములు సోదరులు సంతోషంగా ఉన్నారని ఆరోపించారు.
శాస్త్రవేత్తల ఉద్యోగాలకు భారీ నోటిఫికేషన్.. జీతం, అర్హత, ఫీజు వివరాలు ఇవే!
Hyderabad, Telangana:ISRO Recruitment 2026: ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ISRO), సైంటిస్ట్, ఇంజినీర్ పోస్టుల భర్తీ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ప్రధానంగా ఎలక్ట్రానిక్స్, మెకానికల్, కంప్యూటర్ సైన్స్ విభాగాలలో మొత్తం 175 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ నియామకాలు సెంట్రల్ ఫిజికల్ రీసెర్చ్ లేబొరేటరీ (CPRL) పరిధిలో చేపట్టనున్నారు. అర్హత ఉన్న అభ్యర్థులు ఆగస్టు 27 నుండి సెప్టెంబర్ 16 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన అభ్యర్థులకు నెలకు కనీసం రూ. 56,000 జీతం లభిస్తుంది.
ఇస్రో రిక్రూట్మెంట్ 2026 అర్హతలు..
ఈ రిక్రూట్మెంట్కు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సైంటిస్ట్/ఇంజినీర్ పోస్టులకు కావాల్సిన సరైన విద్యార్హత కలిగి ఉండాలి. అభ్యర్థులు బీఈ లేదా బీటెక్ లేదా దానికి సమానమైన డిగ్రీని కలిగి ఉండాలి. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ విభాగంలో కనీసం 65 శాతం మార్కులు పొంది ఉండాలి. మెకానికల్ విభాగంలో బీఈ/బీటెక్ మెకానికల్ ఇంజనీరింగ్‌లో కనీసం 65 శాతం మార్కులు లేదా 6.84 CGPA ఉండాలి. కంప్యూటర్ సైన్స్ విభాగంలో కూడా బీఈ/బీటెక్ కంప్యూటర్ సైన్స్‌లో కనీసం 65 శాతం మార్కులు తప్పనిసరి. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వారు మాత్రమే ఈ పోస్టులకు అర్హులు.
అభ్యర్థుల వయస్సు 2026 సెప్టెంబర్ 16 నాటికి 28 ఏళ్ల లోపు ఉండాలి. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఎక్స్-సర్వీస్‌మెన్, దివ్యాంగులకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. కేవలం భారతీయ పౌరులు మాత్రమే ఈ నోటిఫికేషన్‌కు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. మొత్తం ఖాళీలను పరిశీలిస్తే, ఎలక్ట్రానిక్స్ విభాగంలో 99, మెకానికల్ విభాగంలో 52, కంప్యూటర్ సైన్స్‌లో 21 ఖాళీలు ఉన్నాయి. అయితే, ఈ సంఖ్య భవిష్యత్తులో మారే అవకాశం ఉంది.
ఇస్రో దరఖాస్తు రుసుము..
దరఖాస్తు చేసే అభ్యర్థులు రూ. 250 దరఖాస్తు రుసుముగా, రూ. 750 ప్రాసెసింగ్ ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఫీజును 'భారత్ కోష్' (Bharat Kosh) పేమెంట్ గేట్‌వే ద్వారా ఆన్లైన్లో మాత్రమే చెల్లించాలి. ఇంటర్నెట్ బ్యాంకింగ్, యూపీఐ లేదా డొమెస్టిక్ డెబిట్ కార్డ్ ద్వారా చెల్లింపులు చేయవచ్చు; చెక్కు, డీడీల ద్వారా చెల్లించడం కుదరదు. దీనికి సంబంధించిన అదనపు ఛార్జీలను అభ్యర్థులే భరించాలి. దరఖాస్తుకు చివరి తేదీ 2026 సెప్టెంబర్ 16. మీరు తప్పనిసరిగా రాత పరీక్ష రాయాల్సి ఉంటుంది.
Also Read: గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు బిగ్ అలర్ట్..సెప్టెంబర్ 1 నుంచి మారిన 7 కొత్త రూల్స్ ఇవే!
Also Read: డెబిట్ కార్డు పోయిందా? ఇంట్లో నుంచే మొబైల్లో ఇలా బ్లాక్ చేయండి! చాలా ఈజీ!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
అందం, డబ్బు కాదు.. జీవిత భాగస్వామిలో ఈ లక్షణాలే ముఖ్యమంటున్న చాణక్యుడు!
Hyderabad, Telangana:Chanakya Niti Latest News: మానవ జీవితంలో అత్యంత కీలకమైన మధురమైన ఘట్టం వివాహంగా చెప్పుకోవచ్చు.. సరైన జీవిత భాగస్వామి దొరికితే ఆ బంధం ఎంతో మధురంగా మారుతుంది. అదే భాగస్వామి ఎంపికలో ఏ చిన్న పొరపాటు పడిన జీవితాంతం నరకం అనుభవించాల్సిన అవసరం వస్తుంది. అందుకే పెళ్లి చేసుకునే ముందు కేవలం అందంతో పాటు హోదా, డబ్బు మాత్రమే కాకుండా ఎదుటి వారి స్వభావం.. ఆలోచన విధానం.. ఇతరులతో వ్యవహరించే తీరును క్లియర్‌గా గమనించి పెళ్లి చేసుకోవడం చాలా మంచిదని చాణక్య నీతి శాస్త్రం చెబుతోంది..
భారతదేశపు గొప్పతత్వవేత్తతో పాటు రాజనీతి జ్ఞానుడిగా పేరున ఆచార్య చానక్యుడు తన చాణక్యనీతి శాస్త్రంలో జీవిత భాగస్వామి ఎంపిక గురించి అద్భుతమైన సూచనలు చేశారు. ముఖ్యంగా ఐదు రకాల లక్షణాలున్న వ్యక్తులకు పెళ్లికి ముందే దూరంగా ఉండాలని ఆయన హెచ్చరించారు.. ఆ లక్షణాలు ఏమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం..
పైకి అందంగా ఉండడం..
చాలామంది పెళ్లి అనగానే ముందుగా అందానికి ఎక్కువగా ప్రాధాన్యతిస్తూ ఉంటారు.. కానీ కేవలం అందం చూసి పెళ్లి చేసుకోవడం ఒక పెద్ద పొరపాటని చాణక్యనీతి శాస్త్రం చెబుతోంది. ఒక వ్యక్తి చూడడానికి ఎంతో ఆకర్షణీయంగా ఉన్నప్పటికీ.. వారి స్వభావంతో పాటు ఆలోచనలు, సంస్కారం సరిగ్గా లేకపోతే ఆ వైవాహిక బంధం ఎంత కాలం నిలబడదు.. పై అందం కంటే ఎదుటి వ్యక్తి మనస్తత్వంతో పాటు ఆలోచన తీరుకు ప్రాధాన్యత ఇచ్చినప్పుడే ఆ బంధం ఎంతో మరింత అద్భుతంగా ఉంటుంది..
కఠినంగా మాట్లాడేవారు..
చిన్న చిన్న విషయాలకి తీవ్రంగా కోపగించుకునే వారితో పాటు కఠినమైన, కించపరిచే పదాలతో ఇతరులను దూషించే వారితో వివాహ బంధం ఏమాత్రం మంచిది కాదని చాణక్యుడు చెబుతున్నాడు. ఏ బంధం లోనైనా ప్రశాంతత ఉండాలంటే సమానంతో పాటు సరైన కమ్యూనికేషన్ చాలా అవసరమని ఆయన అన్నారు. ఎప్పుడూ కోపంతో రగిలిపోయేవారు.. తమ మాటే నెగ్గాలని వారితో జీవితం గడిపితే ప్రతిరోజు గొడవలతో పాటు మనస్పార్ధాలు తప్పవని చాణక్యనీతి శాస్త్రం క్లియర్‌గా చెబుతోంది..
అత్యాశ..
డబ్బుతో పాటు ఆస్తుల మీద విపరీతమైన వ్యామోహం ఉన్నవారికి వీలైనంత దూరంగా ఉండాలని చాణక్యనీతి శాస్త్రం తెలుపుతోంది. అనుబంధాల కంటే కేవలం డబ్బుకే ఎక్కువగా వెలుగునిచ్చే వారు భవిష్యత్తులో ఏదైనా చిన్న ఆర్థిక కష్టం రాగానే మిమ్మల్ని ఒంటరి చేసే ప్రమాదం ఉంది. వివాహ బంధం అనేది నిస్వార్ధమైన ప్రేమ, నమ్మకం పై ఆధారపడి ఉండాలి కానీ.. ఆర్థిక ప్రయోజనాల మీద కాదని చాణక్యనీతి వివరిస్తోంది..
ఇతరులను గౌరవించని వారు..
ఒక వ్యక్తి మీతో ఎంత ప్రేమగా ఉన్నారనే దానికంటే.. ఇతరులతో ఎలా ప్రవర్తిస్తున్నారనేది చాలా ముఖ్యం.. ఇతరులను గౌరవించాలని వారు.. వారితో చులకనగా మాట్లాడేవారు.. పెళ్లి తర్వాత మీకు లేదా మీ కుటుంబానికి కూడా తగిన గౌరవం ఇవ్వకపోవచ్చు. కనీస మర్యాద ఇవ్వని వారితో జీవితం పంచుకోవడం సరైన నిర్ణయం కాదని చాణక్యనీతి శాస్త్రం క్లియర్‌గా చెబుతోంది..
ఇది కూడ చదవండి: ఎంత సంపాదించినా డబ్బు మిగలడం లేదా? చాణక్య నీతిలోని ఈ 5 రహస్యాలు తెలుసుకోండి..
తప్పుడు మార్గంలో నడిచేవారు..
నిజాయితీ లేని వారు.. పదేపదే అబద్ధాలు చెప్పేవారు.. ఇతరులను మోసం చేసేవారు లేదా చెడు అలవాట్లకు బానిసైన వారు ఎప్పటికీ మంచి జీవిత భాగస్వామి కాలేరు.. ఏది నిజం..ఏది అబద్దం అని కనీస వ్యత్యాసం తెలియని వ్యక్తులతో జీవితాన్ని ముడి పెట్టుకోవడం అంటే చేజేతులారా కష్టాన్ని కొనితెచ్చుకోవడమేనని చాణక్యనీతి శాస్త్రం చెబుతోంది.. పెళ్లి అనేది ఒక రోజుతో ముగిసిపోయే వేడుక కాదు.. ఇది జీవితకాలం పాటు సాగే ఓ సుదీర్ఘ ప్రయాణం... కాబట్టి ఆకర్షణ వలలో పడి..తొందరపడి నిర్ణయం తీసుకోకుండా..పై విషయాలను దృష్టిలో ఉంచుకొని సరైన భాగస్వామిని ఎంచుకోవాలని ఆచార్య చానక్యుడు సూచిస్తున్నాడు.
ఇది కూడ చదవండి: ఎంత సంపాదించినా డబ్బు మిగలడం లేదా? చాణక్య నీతిలోని ఈ 5 రహస్యాలు తెలుసుకోండి..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
ఎంత సంపాదించినా డబ్బు మిగలడం లేదా? చాణక్య నీతిలోని ఈ 5 రహస్యాలు తెలుసుకోండి..
Hyderabad, Telangana:Chanakya Niti Money Saving Tips: నెలాఖరు వచ్చేసరికి జేబులో ఒక్క రూపాయి కూడా మిగలడం లేదా? వచ్చిన జీతం వచ్చినట్లే కళ్ళముందే ఖర్చయిపోతుందా? మీరు ఎంత కష్టపడినప్పటికీ మీ జేబులో డబ్బులు నిలవడం లేదా? అయితే మీరు ఎక్కడో తప్పు చేస్తున్నట్లు అని అర్థం.. వేల సంవత్సరాల క్రితమే గొప్ప ఆర్థిక వేత్త తో పాటు రాజనీతి వేత్తగా పేరు ఉన్న ఆచార్య చానక్యుడు మనిషి ఆర్థికంగా ఎలా ఎదగాలి.. డబ్బులను ఎలా ఆదా చేయాలి అనే విషయాలపై చాణక్య నీతిలో అద్భుతమైన సూత్రాలను వివరించాడు. ఈ ఐదు చాణక్య నీతి నియమాలను మీ జీవితంలో అమలు చేస్తే.. దారిద్ర్యం దూరమై మీ మీరు కోరుకున్న సిరిసంపదలు మీ సొంతమవుతాయి.. అవేంటో తెలుసుకోండి..
ఆదాయం ఖర్చుల మధ్య తప్పకుండా సమతుల్యత..
చాణక్యుడు నీతి శాస్త్రంలో పేర్కొన్న వివరాల ప్రకారం.. మనిషి ఎంత సంపాదిస్తున్నాడు అన్నది ముఖ్యం కాదు.. ఎంత ఆదా చేస్తున్నాడనేదే చాలా చాలా ముఖ్యం.. మీ ఆదాయానికి మించి ఎప్పుడు ఖర్చు చేయకండి.. మీ బడ్జెట్‌ను పక్కా ప్లాన్ చేసుకోండి.. ఖర్చుల విషయంలో హద్దులు దాటితే భవిష్యత్తులో అప్పుల ఊబిలో కూరుకుపోవడం ఖాయం.. ఆదాయంతో పాటు ఖర్చుల మధ్య సమతుల్యత పాటించే వారి వద్ద లక్ష్మీదేవి నిలుస్తుందని చాణక్యనీతి శాస్త్రంలో పేర్కొన్నాడు..
క్రమం తప్పకుండా పొదుపు చేయడం..
చాలామంది జీతం పెరిగాక పొదుపు చేద్దాంలే అని వాయిదాలు వేస్తూ ఉంటారు.. కానీ ఇది చాలా పెద్ద తప్పుని చాణక్యనీతి శాస్త్రం చెబుతోంది. మీ ఆదాయం తక్కువైనప్పటికీ సరే.. ప్రతి నెల కొంత మొత్తాన్ని తప్పకుండా పొదుపు చేయడం అలవాటు చేసుకుంటేనే మంచిది. ఈ చిన్న పొదుపు.. భవిష్యత్తులో ఆపద సమయంలో అత్యవసర పరిస్థితుల్లో మీ అతిపెద్ద రక్షణ కవచంగా మారుతుంది. కష్టకాలాల్లో మనల్ని కాపాడే ఏకైక మిత్రుడు మనం దాచుకున్న 70 అని చాణక్యనీతి స్పష్టంగా చెబుతోంది.
ఆడంబరాలకు.. ఆర్భాటాలకు దూరం..
నేటి సమాజంలో చాలామంది ఇతరులను మెప్పించడానికి.. తమ హోదాను అందరికీ తెలిసేలా చేయడానికి అవసరమైన వస్తువులపై.. బ్రాండ్లపై డబ్బులు వెదజల్లుతూ ఉంటారు.. ఈ షో ఆఫ్ కల్చర్ మిమ్మల్ని పేదరికంలో నెట్టేస్తుంది.. వృధా ఖర్చులు చేసే వ్యక్తులు ఎప్పుడూ ధనవంతులు కాలేరు.. మీ అవసరాలకు మాత్రమే ఖర్చులు చేయడం మంచిది.. ఆడంబారాలకు దూరంగా ఉండటమే ఎంతో మేలు..
అత్యాశకు పోకపోవడం..
రాత్రికి రాత్రే కోటీశ్వరులు అయిపోవాలనే అత్యాశ మనిషి పతనానికి ఊహించని పతనానికి దారి తీసే అవకాశాలు కూడా ఉన్నాయి. షార్ట్ కట్స్ ద్వారా తప్పుడు మార్గంలో సంపాదించిన డబ్బు నీటి మూట లాంటిది.. అది ఎప్పటికీ నిలబడదు.. నిజాయితీగా కష్టపడి సంపాదించిన డబ్బే శాశ్వతమైన ఆనందాన్ని.. స్థిరత్వతని అందిస్తుందని చానాక్యనీతి శాస్త్రం చెబుతోంది..
ఇది కూడ చదవండి: బస్సు నడుపుతుండగా గుండెపోటు.. అయినా 60 మంది ప్రాణాలు కాపాడిన RTC డ్రైవర్..
ఆర్థిక లావాదేవీల్లో అప్రమత్తత..
డబ్బులను ఎక్కడైనా పెట్టబడిగా పెట్టేటప్పుడు లేదా ఇతరులకు అప్పుగా ఇచ్చేటప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. గుడ్డిగా ఎవరిని నమ్మకూడదు.. అనవసరంగా అవగాహన లేకుండా చేసే పెట్టుబడులు తీవ్ర నష్టాలను మిగులుతాయి. ఆర్థిక క్రమశిక్షణ పాటించడంతో పాటు సరైన ప్రణాళికలతో అడుగులు వేయడం వల్ల సంపాదనను వృద్ధి చేసుకోగలుగుతారని చాణక్యుడు తన నీతి శాస్త్రంలో తెలిపారు..
ఇది కూడ చదవండి: బస్సు నడుపుతుండగా గుండెపోటు.. అయినా 60 మంది ప్రాణాలు కాపాడిన RTC డ్రైవర్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
బ్లాక్ కాఫీ మంచిదేనా? బరువు, షుగర్, లివర్‌పై ప్రభావంపై నిపుణుల సూచనలు!
Hyderabad, Telangana:Black Coffee For Weight Loss: ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరు హాట్ హాట్ గా ఒక కప్పు కాఫీ లేదా టీ తాగడంతోనే రోజు ప్రారంభమవుతుంది. ఇది మన భారతదేశంలో ప్రతి ఇంట సాధారణంగా కనిపించే దృశ్యమే.. అయితే నేటి బిజీ జీవనశైలిలో.. మారిన ఆహారపు అలవాట్ల కారణంగా చాలామంది అధిక బరువుతో పాటు మధుమేహం వంటి సమస్యల బారిన పడుతున్నారు. ముఖ్యంగా కొంతమంది పొట్ట చుట్టూ పేరుకుపోయిన మొండి కొవ్వును కరిగించుకోవడానికి నానాదంతాలు పడిపోతున్నారు.
ఇంటర్నెట్లో వెతికి చాలామంది ఎన్నో రకాల ప్రయోగాలు చేస్తూ ఉన్నారు. అయితే, ఎలాంటి ప్రయోగాలు చేయకుండానే రోజువారి అలవాట్లలో కొన్ని రకాల మార్పులు చేర్పులు చేసుకొని.. పంచదార పాలు కలిపిన కాఫీకి బదులుగా బ్లాక్ టీ తాగడం మంచిదని అపోలో ఆసుపత్రి వైద్యులు చెబుతున్నారు. చక్కెర పాలు కలిపిన కాఫీ శరీరానికి అంత మంచిది కాదని వారు అంటున్నారు.. బ్లాక్ కాఫీ సాధాగా తాగడం వల్ల మధుమేహం కూడా సులభంగా కంట్రోల్ అయ్యి.. ఎన్నో రకాల బెనిఫిట్స్ పొందుతారని అపోలో వైద్యులు సూచిస్తున్నారు. ముఖ్యంగా బ్లాక్ టీ కొన్ని అనారోగ్య సమస్యలకు దివ్య ఔషధంగా కూడా పనిచేస్తుందని వారు చెబుతున్నారు..
మొండి కొవ్వును కరిగించేందుకు..
ఉదయాన్నే పరిగడుపున చెక్కరలేని బ్లాక్ కాఫీ తాగడం వల్ల మెటబాలిజం రేటు అమాంతం పెరిగిపోతుందని అపోలో వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇది కొవ్వును వేగంగా కరిగించే పనిలో క్రియాశీలక పాత్ర పోషిస్తుంది. బ్లాక్ కాఫీలో ఎలాంటి క్యాలరీలు కూడా ఉండవు కాబట్టి దీన్ని తాగగానే వెంటనే బరువు కూడా తగ్గిపోతారని వారంటున్నారు. కాబట్టి బరువు తగ్గాలనుకునేవారు రోజుల్లో రెండు నుంచి మూడుసార్లు తీసుకోవాల్సి ఉంటుందని వారు సూచిస్తున్నారు..
డయాబెటిస్ కి చెక్..
చక్కెర లేని బ్లాక్ కాఫీ తాగడం వల్ల రక్తంలోని షుగర్ లెవెల్స్ అదుపులో ఉంటాయని అపోలో ఆసుపత్రికి సంబంధించిన డాక్టర్స్ చెబుతున్నారు. ఇది శరీరంలోని ఇన్సులిన్ సెన్సిటివిటీని గణనీయంగా పెంచుతుందని.. తద్వారా టైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదాన్ని పూర్తిగా తగ్గిస్తుందని వారు అంటున్నారు. ఇప్పటికే డయాబెటిస్ ఉంటే కంట్రోల్ కు వస్తుందని చెబుతున్నారు..
గుండె, లివర్‌కు బెస్ట్..
బ్లాక్ కాఫీ ని తగ్గిన మోతాదులో తాగడం వల్ల లివర్‌కు అత్యంత ప్రయోజనకరంగా ఉంటుందని అపోలోకు సంబంధించిన ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఫ్యాటీ లివర్ తో పాటు లివర్ క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల ప్రమాదాన్ని కూడా సులభంగా తగ్గిస్తుందని వారంటున్నారు. ఇందులో లభించే కొన్ని యాంటీ ఆక్సిడెంట్లు లివర్ కణాలను సురక్షితంగా ఉంచి.. శరీరంలో పేరుకుపోయిన కొవ్వును తగ్గించి గుండె పనితీరును కూడా మెరుగు పరుస్తాయని వారు చెబుతున్నారు.
ఇది కూడ చదవండి: బస్సు నడుపుతుండగా గుండెపోటు.. అయినా 60 మంది ప్రాణాలు కాపాడిన RTC డ్రైవర్..
గమనిక.. బ్లాక్ కాఫీ ఆరోగ్యానికి చాలా మంచిదే అయినప్పటికీ.. దాన్ని తగిన మోతాదులోనే తీసుకోవాలని అపోలో వైద్యులు చెబుతున్నారు.. గర్భవతులతో పాటు గుండె సమస్యలు, అధిక రక్తపోటు ఉన్నవారు.. మరేదైనా ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు డైట్ లో మార్పులు చేసే ముందు తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది..
ఇది కూడ చదవండి: బస్సు నడుపుతుండగా గుండెపోటు.. అయినా 60 మంది ప్రాణాలు కాపాడిన RTC డ్రైవర్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Mars Transit: కుజుడి నక్షత్ర మార్పుతో అదృష్టం పొందే 5 రాశులు.. సెప్టెంబర్ 2 నుంచి డబ్బే డబ్బు!
Hyderabad, Telangana:Mars Transit Effect 2026: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కుజ గ్రహాన్ని శక్తివంతమైన గ్రహంగా పరిగణిస్తూ ఉంటారు. దీనిని ధైర్యంతో పాటు బలం, సంపదకు కారకుడిగా భావిస్తూ ఉంటారు. ఇదిలా ఉంటే సెప్టెంబర్ రెండవ తేదీన గురు గ్రహానికి సంబంధించిన పునర్వాసు నక్షత్రంలోకి కుజుడు ప్రవేశించబోతున్నాడు.. దీని ఫలితంగా ఈ సమయంలో అద్భుతమైన శుభ ప్రభావం ఏర్పడి.. కొన్ని రాశుల వారిపై పడబోతోంది. కుజుడి నక్షత్ర సంచారంతో ఐదు రాశుల వారికి మంచి జరుగుతుంది. ముఖ్యంగా వృత్తి పరంగా మేలు కలగడమే కాకుండా.. వ్యాపారాల్లో విశేషమైన ధన లాభాలు కలుగుతాయి. సంపాదనతో పాటు ఆస్తిపరంగా విశేషమైన లాభాలు కలుగుతాయని జ్యోతిష్యులు చెబుతున్నారు..
ఈ రాశులవారికి బిగ్ జాక్‌ఫాట్..
మేషరాశి
కుజుడు పునర్వాసు నక్షత్ర సంచారం కారణంగా మేషరాశి వారికి ధన సంబంధిత సమస్యలన్నీ పరిష్కారం కాబోతున్నాయి. ఈ సమయంలో ఆకస్మిక ధన లాభాలు కలగడమే కాకుండా.. వృత్తిలో అద్భుతమైన పురోగతి లభిస్తుంది. అలాగే వ్యాపారాలు వృద్ధి చెంది కొత్త ప్రాజెక్టులు కూడా లభిస్తాయి. ఈ సమయంలో కుటుంబ సభ్యులతో అద్భుతమైన సమయాన్ని గడపగలుగుతారు. ముఖ్యంగా ఇబ్బందులతో పాటు అశాంతి తొలగిపోయి.. ఒత్తిడి నుంచి విముక్తి కలుగుతుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు.
కర్కాటక రాశి
కర్కాటక రాశిలో జన్మించిన వ్యక్తులందరికీ కుజుడి నక్షత్ర సంచార ప్రభావం వల్ల మంచి రోజులు రాబోతున్నాయి. సెప్టెంబర్ రెండవ తేదీ నుంచి వీరి జీవితంలో అనేక సమస్యల నుంచి పరిష్కారం లభించబోతోంది. గతంలో ఉన్న పాత చిక్కులన్నీ తొలగిపోయి ఈ సమయంలో తండ్రుల ఆస్తులు కూడా సొంతం చేసుకోగలుగుతారు. ముఖ్యంగా భూములు కొనుగోలు చేసి.. భారీ మొత్తంలో డబ్బులు సంపాదిస్తారు. అలాగే ఉద్యోగంలో అద్భుతమైన పదోన్నతులు లభించి.. వ్యాపారాలపరంగా మంచి వృద్ధి లభిస్తుంది..
వృశ్చిక రాశి
వృశ్చిక రాశిలో జన్మించిన వ్యక్తులకు ఈ సమయంలో దిమ్మతిరిగే ధన లాభాలు కలుగుతాయి. ముఖ్యంగా ఇతరులకు ఇది అత్యంత అనుకూలంగా ఉంటుంది. పనుల్లో బాధ్యతలు పెరిగి జీతాలు కూడా ఊహించని రీతిలో పెరుగుతాయి. అలాగే ఆర్థిక పరిస్థితులు మెరుగుపడి వ్యాపారంలో విశేషమైన ప్రయోజనాలు చేకూతాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. అంతేకాకుండా భారీ మొత్తంలో అనుకోని సంపదను కూడా సొంతం చేసుకోగలుగుతారు. కొత్త ప్రాజెక్టుల నుంచి ధనం కూడా విపరీతంగా లభిస్తుంది.
ధనస్సు రాశి
ధనస్సు రాశిలో జన్మించిన వ్యక్తులకు కుజ గ్రహ సంచార ప్రభావంతో అనేక రకాల శుభవార్తలు వినగలుగుతారు. ముఖ్యంగా వీరికి ఉద్యోగంలో అద్భుతమైన పదోన్నతులు కూడా లభించబోతున్నాయి. వ్యాపారాల్లో భాగస్వాముల నుంచి మంచి సపోర్టు పొంది.. ఇతర దేశాల్లో పెట్టుబడును పెట్టగలుగుతారు. అలాగే ఎన్నో రకాల సమస్యల నుంచి అద్భుతమైన ఉపశమనం కూడా లభిస్తుంది. రుణాలు కూడా సులభంగా తీరిపోయి.. విశేషమైన ప్రయోజనాలు చేకూరుతాయి. డబ్బు సంబంధిత అంశాలన్నీ మెరుగుపడతాయి.
మీన రాశి
మీనరాశిలో జన్మించిన వ్యక్తులకు కూడా కుజుడి నక్షత్ర సంచార ప్రభావం మంచి రోజులను తీసుకువస్తుంది.. వీరికి కూడా సెప్టెంబర్ రెండవ తేదీ ఎంతో అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా వీరి శత్రువులపై అద్భుతమైన విజయాలు సాధించడమే కాకుండా.. ఆదాయం కూడా ఊహించని స్థాయిలో పెరుగుతుంది. కుటుంబంలో మంచి రోజులు రావడం ప్రారంభమవుతాయి. అంతేకాకుండా ఆదాయం పెరిగి ఇతర వాటిల్లో పెట్టుబడులు పెట్టి అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఎన్నో సమస్యల నుంచి పరిష్కారం పొంది అనుకోని ప్రయోజనాలు సొంతం చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.
గమనిక.. ఇక్కడ అందించిన సమాచారం కేవలం జ్యోతిష్య శాస్త్ర నిపుణుల నుంచి సేకరించి రాసింది మాత్రమే.. దీనికి జీ తెలుగు న్యూస్ కి ఎలాంటి సంబంధం లేదు..
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook ..
Pulasa Fish: రికార్డు స్థాయిలో పులస చేప ధర.. ఎంతకు కొన్నారంటే?
Yanam, Andhra Pradesh:Record Price To Pulasa Fish At Yanam Wath Full Videoచేతులు లేవని ఆగలేదు.. కాళ్లతో అన్నకు రాఖీ కట్టిన సోదరి! వైరల్ వీడియో చూస్తే కన్నీళ్లు ఆగవు..
Hyderabad, Telangana:Ties Rakhi With Feet Video: రాఖీ పౌర్ణమి అనగానే మనకు ముందుగా గుర్తుకొచ్చేది అన్నా చెల్లెల అంతులేని అద్భుతమైన ప్రేమ.. సోదరుడు ఎల్లప్పుడూ తనకు రక్షణగా నిలవాలంటూ.. ఒక సోదరి తన అన్న చేతికి కట్టే రక్షాబంధన్ వారిద్దరి మధ్య ఉన్న విడదీయరాని బంధానికి ప్రతీక.. అయితే, రాఖీ పండగకు సంబంధించిన ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తుంది.. ఆ వీడియో చూసిన ప్రతి ఒక్కరి కళ్ళు చెమగిల్లిపోతున్నాయి.. శారీరక లోపం వారి ప్రేమకు ఏమాత్రం అడ్డు కాదని నిరూపించిన ఈ అన్నాచెల్లెళ్ల అనురాగం.. సోషల్ మీడియా వినియోగదారుల హృదయాలను కదిలిస్తూ వస్తోంది.. అసలు ఆ వీడియో ఏంటి? దానికి సంబంధించిన అన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
సాధారణంగా రాఖీ పండగ రోజున అక్కా చెల్లెల్లు.. తమ అన్నదమ్ముళ్ల మణికట్టుకు తమ చేతులతో రాఖీ కట్టి స్వీట్లను తినిపిస్తూ ఉంటారు. కానీ ఈ వైరల్ అవుతున్న వీడియోలో ఒక సోదరి తన సోదరుడికి చేతులతో కాకుండా.. తన రెండు కాళ్లతో రాఖీ కట్టడం కనిపిస్తుంది.. ఆ అమ్మాయికి చేతులు లేకపోవడంతో.. తన కాళ్ళనే చేతులుగా మార్చుకొని.. రాఖీ కట్టడం ఈ వీడియోలో చూడొచ్చు. అంతటితో ఆగకుండా.. కాళ్లతోనే ఎంతో ప్రేమగా అన్నకు స్వీట్లు కూడా తినిపించేసింది.. ఆ సమయంలో ఆమె ముఖంలో కనిపిస్తున్న ఆనందం.. సోదరుడి పట్ల ఆమెకున్న ప్రేమానురాగాలు చూస్తే ఎంతటి కఠినాత్ములకైన కన్నీళ్లు రాక తప్పవు.. సోదరుడు కూడా చెల్లెలి పరిస్థితిని అర్థం చేసుకొని.. ఆమె కురిపించిన ప్రేమను అంతే సంతోషంగా స్వీకరించడం ఈ వీడియోలో అందరి మనసును హత్తుకునే ఒక అద్భుతమైన ఘట్టంగా భావించవచ్చు..
ఈ హృదయ విదారక ఘటనకు సంబంధించిన వీడియో ఎక్స్ వేదికగా ఓ ఖాతాదారుడు షేర్ చేశారు. కాళ్లతో కట్టిన ఈ రాఖీ సోదరుడికి ప్రపంచంలోనే అత్యంత విలువైన రాఖీ.. ఆ సోదరి జీవితంలో ఎన్నో సవాళ్లు ఉన్న ఆమె ధైర్యం చూడండి.. కాళ్లతో రాఖీ కట్టి స్వీట్లు కూడా తినిపించింది.. ఆ బిడ్డను చూస్తుంటే నిజంగా హృదయం కదిలిపోతుంది అని ఆయన ఎమోషనల్ గా క్యాప్షన్ రాసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇప్పుడు ఈ వీడియో విపరీతంగా వైరల్ అవుతూ వస్తోంది..
बिटिया को देखकर आंखें सच में नम हो गईं। pic.twitter.com/KPjPIIptTT
— Haji Nizamuddin Abbasi (@HajiNizamuddin3) August 25, 2026
ఇది కూడ చదవండి: బస్సు నడుపుతుండగా గుండెపోటు.. అయినా 60 మంది ప్రాణాలు కాపాడిన RTC డ్రైవర్..
ఈ వీడియో పోస్ట్ చేసిన కొద్ది నిమిషాల్లోనే సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం ప్రారంభమైంది.. వేలాదిమంది ఈ వీడియోని వీక్షించడమే కాకుండా.. లైకులతో పాటు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.. నిజమైన ప్రేమకు ఎలాంటి అడ్డంకులు ఉండవని ఈ వీడియో నిరూపించిందని చాలామంది కామెంట్లు పెడుతూ వస్తున్నారు. బయటి పరిస్థితులు ఎంత కష్టంగా ఉన్నా.. మనస్సులో స్వచ్ఛమైన ప్రేమ ఉంటే దారి దానంతట అదే దొరుకుతుంది అని ఓ సోషల్ మీడియా వినియోగదారుడు ప్రశంసించాడు.
ఇది కూడ చదవండి: బస్సు నడుపుతుండగా గుండెపోటు.. అయినా 60 మంది ప్రాణాలు కాపాడిన RTC డ్రైవర్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
చాణక్యుడి ఈ 6 రహస్యాలు తెలుసుకుంటే.. జీవితంలో ఎప్పుడూ మోసపోరు!
Hyderabad, Telangana:Chanakya Niti: ఆచార్య చానక్యుడు తన నీతి శాస్త్రంలో మానవ జీవితాన్ని సున్నితంగా.. సులభతరంగా.. విజయవంతంగా మలుచుకోవడానికి ఎన్నో అద్భుతమైన మార్గాలను సూచించారు.. ప్రస్తుతం పోటీ ప్రపంచంలో స్వార్థం ఊహించని స్థాయిలో పెరిగిపోతోంది.. మన అవసరం తీరగానే వదిలేసే కపట.. స్వార్థపరులను గుర్తించడం చాలా కష్టమైపోయింది.. అయితే, అటువంటి మోసగాళ్ల బారిన పడకుండా.. ఆర్థిక నష్టాల పాలు కాకుండా ఉండాలంటే కొన్ని అద్భుతమైన ఉపాయాలను చాణక్యనీతి స్పష్టంగా వివరిస్తోంది. ఆచార్య చానక్యుడు సూచించిన ఆ ఆరు కీలకమైన రహస్యాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
ఆర్థికపరమైన విషయాలను సీక్రెట్ గా ఉంచండి..
వీరి ఎంత సంపాదించుతున్నారు? మీ బ్యాంకు బ్యాలెన్స్ ఎంత? మీరు ఎక్కడైనా అప్పు చేశారా? లేదా పెట్టుబడులు ఎక్కడైనా పెట్టారా? లాంటి మీ ఆర్థిక పరిస్థితికి సంబంధించిన విషయాలను ఎవరితోనూ పంచుకోకండి.. మీ దగ్గర డబ్బులు ఉంటే కొందరు అసూయ పడవచ్చు.. లేదంటే మిమ్మల్ని వాడుకొని ఆర్థికంగా మోసం చేస్తే అవకాశాలు కూడా ఉన్నాయని తెలిపారు..
మీ బలహీనతలు ఎవరికి చెప్పకండి..
ప్రతి మనిషిలోనూ ఏదో ఒక బలహీనత లేదా భయం ఉంటుంది.. కానీ దానిని అందరి ముందు ఎట్టి పరిస్థితుల్లోనూ చెప్పకూడదని చాణక్యనీతి శాస్త్రం చెబుతోంది. ఆశావాదులతో పాటు ఫీడ్ చేసేవారు మీ బలహీనతను ఆసరాగా చేసుకుని మిమ్మల్ని మానసికంగా.. ఆర్థికంగా దెబ్బతీయవచ్చు.. మీ వ్యక్తిగత కష్టాలను అత్యంత నమ్మకమైన సన్నిహితులతో మాత్రమే పంచుకోవడం చాలా మంచిది..
గుడ్డిగా అసలు నమ్మకండి..
మానవ సంబంధాలలో నమ్మకం చాలా ముఖ్యమైనదిగా భావించవచ్చు. కానీ ఇతరులను గుడ్డిగా నమ్మడం మిమ్మల్ని తీవ్ర అగాధంలో నెట్టేస్తుందని చాణక్యనీతి శాస్త్రం చెబుతోంది. మీతో తీయగా మాట్లాడే వారంతా మీ శ్రేయోభిలాషులు అస్సలు కారు.. అవతలి వ్యక్తి అసలు రంగు ఏంటి.. వారి అంతర్గత ఉద్దేశాలను పూర్తిగా అర్థం చేసుకున్నాకే వారిని నమ్మడం చాలా మంచిది..
భవిష్యత్తు ప్రణాళికలను కూడా చాలా సీక్రెట్ గా ఉంచుకోండి..
మీ భవిష్యత్తులో చేయబోయే పనులతో పాటు ప్రారంభించబోయే కొత్త వ్యాపారాలు లేదా లక్ష్యాల గురించి ముందుగానే డబ్బా కొట్టుకోకండి.. మీ ప్రణాళికలు ఆచరణలోకి రాకముందే ఇతరులకు తెలిస్తే.. వారు మీ విజయానికి అవసరమైన అడ్డంకులు సృష్టించే ప్రమాదం అధికంగా ఉన్నాయి.
వ్యక్తిగత నిర్ణయాల్లో ఇతరుల జోక్యం..
మీ జీవితానికి సంబంధించిన ఐదు ముఖ్యమైన నిర్ణయాలు మీరే స్వయంగా లోతుగా ఆలోచించి తీసుకోవలసి ఉంటుంది. సలహాలు తీసుకోవాలనుకుంటే మీకు నిజమైన శ్రేయోభిలాషులైన వారిని.. ఆ రంగంలో అపారమైన అనుభవం ఉన్న వారిని మాత్రమే అడగండి.. అనవసరంగా ఎక్కువమందిని అడిగితే మీలో గందరగోళం పెరిగి.. తప్పుడు నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి..
ఇది కూడ చదవండి: బస్సు నడుపుతుండగా గుండెపోటు.. అయినా 60 మంది ప్రాణాలు కాపాడిన RTC డ్రైవర్..
తక్కువగా మాట్లాడండి..
అవసరానికి మించి ఎక్కువగా ఎక్కువగా మాట్లాడేవారు తెలియకుండానే తమ రహస్యాలను ఇతరుల ముందు బయట పెట్టేస్తూ ఉంటారు. అందుకే ఎల్లప్పుడూ తక్కువగా మాట్లాడడం మంచిదని చాణక్యనీతి శాస్త్రం చెబుతుంది.. క్లిష్ట పరిస్థితులు వచ్చినప్పుడు సమన్వయం కోల్పోకుండా.. ప్రశాంతంగా ఉంటూ ఎదుటివారి ప్రవర్తనను గమనించడం అత్యంత తెలివైన వారి లక్షణం..
ఇది కూడ చదవండి: బస్సు నడుపుతుండగా గుండెపోటు.. అయినా 60 మంది ప్రాణాలు కాపాడిన RTC డ్రైవర్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Harish Rao: ఒక్కొక్కరికీ రూ.66 వేలు బాకీ పడ్డ రేవంత్ రెడ్డి.. ఇచ్చేయాల్సిందే: హరీశ్ రావు
Hyderabad, Telangana:BRS Party: దివ్యాంగులపై రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కనీస మానవత్వం లేదని మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పింఛన్లు పెంచుతామని చెప్పి ఒక్కొక్క దివ్యాంగుడికి రేవంత్ రెడ్డి రూ.66 వేలు బాకీ పడ్డాడని తెలిపారు. ఆనాడు రూ.500 ఉన్న పెన్షన్‌ను కేసీఆర్ రూ.4,016 చేసి ఆదుకున్నారని గుర్తుచేశారు. ఎన్నికల సమయంలో రేవంత్ రెడ్డి హామీ ఇచ్చిన రూ.6,000 పెన్షన్ ఏది? బ్యాక్లాగ్ పోస్టులు, ఉచిత బస్సు ఏమాయె అని బీఆర్ఎస్ పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు ప్రశ్నించారు.
అందాల పోటీలకు, ఫుట్‌బాల్ సోకులకు డబ్బులుంటాయి కానీ పెన్షన్లకు ఉండవా అని రేవంత్ రెడ్డిని మాజీ మంత్రి హరీశ్ రావు నిలదీశారు. రూ.30 వేల కోట్ల భూములు అమ్మాడు, వందల కోట్ల ఆస్తులు తమ్ముడికి కట్టబెట్టాడని విమర్శించారు. హామీలు అడిగితే తప్పుపడతారా..దివ్యాంగుల పక్షాన ఇందిరా పార్క్ వద్ద మహా ధర్నా చేస్తామని హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం దివ్యాంగులపై నిర్లక్ష్య వైఖరి వ్యవహరిస్తోందని.. హైదరాబాద్ హస్తినాపురంలోని జీఎస్ఆర్ కన్వెన్షన్ హాల్లో శనివారం దివ్యాంగుల సమర శంఖారావం సభ జరిగింది.
దివ్యాంగుల మీద కాంగ్రెస్ ప్రభుత్వానికి దయలేదు.
దివ్యాంగులకు ఇచ్చిన ఒక్క హామీ కూడా రేవంత్ ప్రభుత్వం అమలు చేయలేదు.
రూ. 500 ఉన్న దివ్యాంగుల పెన్షన్‌ను కేసీఆర్ గారు రూ. 4,016 చేసిండు. రిజర్వేషన్లను పెంచిండు.
దివ్యాంగుల చట్టాన్ని మొట్టమొదటిగా అమలుచేసి, బీఆర్ఎస్ ప్రభుత్వం అవార్డు… pic.twitter.com/PCXn3UaoqY
— BRS Party (@BRSparty) August 29, 2026
ఈ సందర్భంగా దివ్యాంగులను ఉద్దేశించి మాజీ మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. 'తెలంగాణలో ఉన్నది దయలేని కాంగ్రెస్ ప్రభుత్వం. దివ్యాంగులపై కనీస మానవత్వం కూడా లేనిది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. దివ్యాంగులను ఓటర్లుగా కాదు కుటుంబ సభ్యులుగా కేసీఆర్ చూసుకున్నారు' అని తెలిపారు. దివ్యాంగుల కోసమే కేసీఆర్ ప్రభుత్వం రూ.10,300 కోట్లు ఖర్చు చేసిందని గుర్తుచేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా దివ్యాంగులకు డబుల్ బెడ్రూం ఇళ్లలో 5 శాతం రిజర్వేషన్, విద్యా ఉద్యోగాల్లో 4 శాతం రిజర్వేషన్ కేసీఆర్ ప్రభుత్వం కల్పించింది అని వెల్లడించారు.
దివ్యాంగుల హక్కుల చట్టాన్ని దేశంలోనే అత్యుత్తమంగా అమలు చేసిన రాష్ట్రంగా 2015లోనే తెలంగాణ జాతీయ అవార్డు గెలుచుకుందని బీఆర్ఎస్ పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు గుర్తుచేశారు. మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది? రేవంత్ రెడ్డి దివ్యాంగుల పెన్షన్‌ను ఒక్క రూపాయి కూడా పెంచలేదని చెప్పారు. పైగా నెలనెలా ఇవ్వాల్సిన పెన్షన్‌ను ఒక నెల ఇస్తూ, ఇంకో నెల ఆపుతూ.. ఏకంగా మూడు నెలల పెన్షన్ ఎగ్గొట్టాడని మండిపడ్డారు.
ఒక్కొక్క దివ్యాంగుడు ఒక్కొక్క శక్తివంతుడు..
దివ్యాంగులను హేళన చేసిన వాడే అసలైన దివ్యాంగుడు!త్వరలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ వద్ద
దివ్యాంగుల తరపున నిరసన కార్యక్రమాలు చేపడతాం.- మాజీ మంత్రి, ఎమ్మెల్యే @BRSHarish 🔥 pic.twitter.com/T5sxvMmfa7
— BRS Party (@BRSparty) August 29, 2026
'దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం, నెలకు రూ.6000 పెన్షన్, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు, బ్యాక్లాగ్ పోస్టుల భర్తీ.. ఇలా ఎన్నికల ముందు ఎన్నో హామీలు ఇచ్చి దగా చేశారు. ఒక్క బ్యాక్లాగ్ పోస్టును కూడా భర్తీ చేయలేదు' అని కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. 'రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చి 33 నెలలు గడిచిపోయాయి. రాష్ట్రంలోని 5 లక్షల 11 వేల మంది దివ్యాంగులకు హామీ ఇచ్చిన నెలకు రూ.6000 చొప్పున లెక్కేస్తే.. ఒక్కొక్క దివ్యాంగుడికి ఈ ప్రభుత్వం ఏకంగా 66 వేల రూపాయలు బాకీ పడింది' అని వెల్లడించారు.
'ఎన్నికలు దగ్గర పడే సమయానికి ఆరు నెలల పెన్షన్లు విదిలించి ప్రజలను మభ్యపెట్టొచ్చు అనుకుంటున్నారేమో! దివ్యాంగులు మీ మోసాలను మర్చిపోరు. మిమ్మల్ని నమ్మరు' అని కాంగ్రెస్ ప్రభుత్వానికి సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు బుద్ధి చెప్పారు. దివ్యాంగులకు పెన్షన్లు ఇవ్వడానికి ఈ ప్రభుత్వం వద్ద డబ్బులు లేవా? లేక మనసు లేదా? అని ప్రశ్నించారు. అందాల పోటీలకు, ఫుట్‌బాల్ సోకులకు, మూసీ సుందరీకరణకు వందల, లక్షల కోట్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి? నిలదీశారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పక్ష ఉపనేత సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి, నాయకులు వాసుదేవ రెడ్డి, దేవీ ప్రసాద్, ఎర్రోళ్ల శ్రీనివాస్‌తోపాటు పెద్ద ఎత్తున దివ్యాంగులు పాల్గొన్నారు.
Tirumala: తిరుమల శ్రీవారి సేవలో క్రికెటర్ వాషింగ్టన్ సుందర్
Dharmavaram, Andhra Pradesh:Cricketer Washington Sundar Visited Tirumala Lord Venkateswara Swamy Temple Watch VisualsTirumala: తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే దామచర్ల
Tirupati Urban, Andhra Pradesh:Rakhi To Trees: చెట్లనే తోబుట్టువులుగా రాఖీ కట్టిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు
Anantapur, Andhra Pradesh:School Students Ties Rakhi To Trees In Anantapur District Watch Viral VideoPulasa Fish: వేలంపాటలో రికార్డు స్థాయిలో గోదావరి పులస చేప ధర.. ఎంతంటే?
Yanam, Puducherry:Pulasa Fish Record Price: గోదావరి పులస చేపకు ఎప్పుడూ భారీ ధర పలుకుతుంది. గతేడాది వేలం పాటో రికార్డు స్థాయిలో ధర పలకగా.. ఈ సారి కూడా భారీ ధరకు పులస చేప అమ్ముడుపోయింది. ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు లేక పులస చేప లభించడం లేదు. కేంద్ర పాలిత ప్రాంతం యానాం వద్ద పులస చేట మత్య్సకారులకు చిక్కింది. వేటకు వెళ్లిన మత్స్యకారుల వలకు రెండు కిలోల పులస చేప చిక్కగా వేలం పాట వేయగా భారీ ధర పలికింది. పులస చేపను యానాం ఫిష్ మార్కెట్లో వేలం వేస్తే పార్వతి అనే మత్స్యకార మహిళ రూ.24 వేలకు దక్కించుకుంది. ఈ సీజన్లో ఇదే అతి పెద్ద పులస... అత్యధిక ధర కావడం విశేషంగా మారింది.
ఏటా వరదల సమయంలో గోదావరికి ఎర్రనీరు పోటెత్తిన సమయంలో అంబేద్కర్ కోనసీమ జిల్లా సరిహద్దులోని కేంద్రపాలిత ప్రాంతం యానాం వద్ద గౌతమి గోదావరిలో పులసలు లభిస్తుంటాయి. పులస చేపకు అత్యంత డిమాండ్ ఉంటుంది. అయితే కొన్నేళ్లుగా పులుస చేపలు రావడం తగ్గిపోతున్నాయి. ఈ ఏడాది ఎల్‌నినో కారణంగా గోదావరి వరద నామమాత్రంగా ఉండడంతో పులస చేపలు చిక్కడం లేదు. పులస చేపల కోసం మత్య్సకారులు ఎదురుచూస్తుంటే గోదావరిలో భారీ వరద ప్రవాహం లేకపోవడంతో పులస చేపలు కనిపించడం లేదు.
ఈ ఏడాది ఇప్పటివరకు మూడు పులుస చేపలు మాత్రమే లభించాయి. మార్కెట్లో వేలానికి వచ్చిన పులస చేపలకు భారీ డిమాండ్ ఏర్పడింది. నెల రోజుల కిందట వచ్చిన మొదటి రెండు పులస చేపలకు ఒక్కొక్కటి దాదాపు 15 వేల రూపాయల వరకు ధర పలికాయి. తాజాగా ఇప్పుడు వచ్చిన రెండు కేజీల పులుస చేప అత్యధికంగా 24 వేల రూపాయలు పలికింది. అయితే మత్స్యకార మహిళల నుంచి పులస చేప అంటే చెవి కోసుకునే మాంసాహార ప్రియులు ఫైనల్‌గా ఎంత రేటుకు కొనుగోలు చేశారో తెలియాల్సి ఉంది.
మరోవైపు గోదావరి జిల్లాలకు చెందిన వారు పులస చేప కూరను హైదరాబాద్‌లో సినిమా హీరోలు, రాజకీయ నాయకులకు గిఫ్ట్‌గా పంపించడం సాంప్రదాయం. 24 వేల రూపాయలకు కొనుగోలు చేసిన ఈ చేపను ఎవరికైనా గిఫ్ట్‌గా పంపించారా అనేది తెలియాల్సి ఉంది. గోదావరికి కొద్దిరోజులుగా మరోసారి స్వల్ప వరద రావడంతో ఇంకా పులస చేపలు దొరుకుతాయా అని మత్స్యకారులు ఆశగా వలలు వేస్తున్నారు. మరి పులస అదృష్టం మత్య్సకారులను వరిస్తుందా? లేదా అనేది ఆశగా ఎదురుచూస్తున్నారు.
