వైరాలో పలు అభివృద్ధి పనులకు డిప్యూటీ సీఎం శంకుస్థాపన
Madugulagudem, Telangana:వైరా పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క శంకుస్థాపన చేసారు. మున్సిపాలిటీలో అమృత్ 2.0 పథకంలో భాగంగా జనవరి నీటి సరఫరా పథకం పనులను భట్టి ప్రారంభించారు. పనులను త్వరగా పూర్తి చేసి ప్రజల తాగునీటి కష్టాలు తీర్చాలని అధికారులను ఆదేశించారు. భట్టి వెంట ఎమ్మెల్యే రాందాస్ నాయక్,రాయల నాగేశ్వరరావు, మున్సిపల్ చైర్మన్ జైపాల్ తదితరులు ఉన్నారు.हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
MI vs RCB Match 2026: ముంబై కంచుకోట బద్దలు కొట్టిన ఆర్సీబీ..18 పరుగుల తేడాతో చిత్తు చేసిన బెంగళూరు!
Mumbai, Maharashtra:MI vs RCB Match 2026 Result: ఐపీఎల్ 2026లో భాగంగా నేడు జరిగిన రెండో మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ జట్టుపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు గెలుపొందింది. 18 పరుగుల తేడాతో విజయం సాధించి.. లీగ్‌లో మూడో విజయాన్ని నమోదు చేసుకుంది ఆర్సీబీ. ఇన్నాళ్లుగా ముంబై ఇండియన్స్ కంచుకోటగా వస్తున్న వాంఖడే స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు పూర్తి ఆధిక్యాన్ని కనబరిచింది.
టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి.. 240 పరుగులు రాబట్టింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఫిలిప్ సాల్ట్ విధ్వంసకర బ్యాటింగ్‌తో 36 బంతుల్లో 78 పరుగులు రాబట్టాడు. ఇందులో 6 సిక్సర్లు, 6 ఫోర్లు ఉన్నాయి. ఇతనితో పాటు బ్యాటింగ్‌కు వచ్చిన విరాట్ కోహ్లీ (50) హాఫ్ సెంచరీతో అలరించాడు. అయితే ఆ తర్వాత బ్యాటింగ్ కు వచ్చిన ఆర్సీబీ కెప్టెన్ రజత్ పటిదార్ కూడా అర్ధశతకంతో చెలరేగాడు.
కేవలం 20 బంతుల్లో (5 సిక్సర్లు, 4 ఫోర్లు) 53 పరుగులు రాబట్టి ఆర్సీబీ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. అలాగే మిగిలిన బ్యాటర్లు టిమ్ డేవిడ్ (34), జితేష్ శర్మ (10), రెమారియో షెఫార్డ్ (2) పరుగులతో సరిపెట్టుకున్నారు. మరోవైపు ముంబై ఇండియన్స్ బౌలర్లలో ట్రెంట్ బౌల్డ్, కెప్టెన్ హార్దిక్ పాండ్యా, మిచెల్ శాంటర్న్, శార్దూల్ ఠాకూర్ తలో వికెట్ పడగొట్టారు.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు నిర్దేశించిన 241 లక్ష్యంతో బరిలో దిగిన ముంబై ఇండియన్స్ జట్టు ఆది నుంచే తడబడింది. ముంబై ఓపెనర్లు రికెల్డన్ 22 బంతుల్లో 37 పరుగులు రాబట్టగా.. రోహిత్ శర్మ 19 పరుగులు చేసి రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. గాయం కారణంగా రోహిత్ మైదానాన్ని వీడినట్లు తెలిసింది. ఆ తర్వాత తొలి నుంచే నెమ్మదిగా సాగిన ముంబై ఇండియన్స్ స్కోర్స్ బోర్డు.. ఆ తర్వాత సూర్య కుమార్ యాదవ్ 22 బంతుల్లో 33 పరుగులు.. కెప్టెన్ హార్దిక్ పాండ్యా 22 బంతుల్లో 40 రన్స్ రాబట్టి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించేందుకు తమ వంతు ప్రయత్నం చేశారు.
ఆ తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన రూథర్ ఫర్డ్ 31 బంతుల్లో 71 పరుగులు రాబట్టి.. ముంబైను ఓటమి నుంచి తప్పించేందుకు ఎంతో కృషి చేసాడు. అప్పటికే జరగాల్సిన డామేజ్ జరిగిపోయింది. మరోవైపు ఆర్సీబీ బౌలర్లలో సయూష్ శర్మ 2 వికెట్లు పడగొట్టగా.. జకోబ్ డఫీ, సలామ్ ధర్, కృనాల్ పాండ్యా చెరో వికెట్ సాధించారు. దీంతో 20 ఓవర్లలో ముంబై జ్టటు 5 వికెట్ల నష్టానికి 222 పరుగులు చేసి సరిపెట్టుకుంది. దీంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు 18 పరుగులతో ఘనవిజయం సాధించింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Vijayawada Crime News: నగ్న ఫొటోలతో విజయవాడ మహిళకు బెదిరింపులు..ఏకంగా రూ.2 కోట్లు..గతిలేక ఆత్మహత్యకు పాల్పడితే?
Vijayawada, Andhra Pradesh:Vijayawada Crime News: గత కొన్ని నెలలుగా సోషల్ మీడియాలో అనేక దారుణమైన ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. మారుతున్న కాలానికి అనుగుణంగా కేటుగాళ్లు దందా మారుస్తున్నారు. ఇప్పుడు అలాంటి ఓ దారుణం ఇప్పుడు విజయవాడలో జరిగింది. నగరంలోని భవానీపురంలో ఓ మహిళ ఆత్మహత్యాయత్నం చేసింది. అయితే ఓ వ్యక్తి తన నగ్న ఫొటోలతో వేధిస్తున్నాడని.. ఆ ఫొటోలతో తనను బెదిరించి ఎంతో డబ్బు దండుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. బాధితురాలిని వేధించిన కేసులో మద్దు బాల వెంకటేశ్వర్లు ఇంతటి దారుణానికి ఒడిగట్టినట్లు సమాచారం. ఇదే విషయమై నిందితుడ్ని పోలీసులు అరెస్టు చేసినట్లు తెలుస్తోంది.
విజయవాడ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిందితుడు బాల వెంకటేశ్వర్లు గత రెండేళ్లుగా బాధిత మహిళను వేధింపులకు గురిచేస్తున్నట్లు ఫిర్యాదు అందింది. బాధితురాలి నగ్న ఫొటోలతో బ్లాక్మెయిల్ చేస్తూ లైంగికంగా వేధిస్తూ.. తనను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తెచ్చినట్లు తెలుస్తోంది. ఒకవేళ తనతో పెళ్లి కాదనుకుంటే ఆమె నగ్న చిత్రాలను సోషల్ మీడియాలో రిలీజ్ చేస్తానని బెదిరించినట్లు పోలీసులు తెలిపారు.
నిందితుడు అంతటితో ఆగకుండా బాధితురాలి భర్తను హత్య చేస్తానని బెదిరించినట్లు తెలిసింది. అతడ్ని చంపి ఆమెను పెళ్లి చేసుకుంటానంటూ నిందితుడు వేధించసాగాడని వెల్లడించారు. ఈ బెదిరింపుల కారణంగా ఆమె మరింత మానసిక ఒత్తిడి లోనయ్యిందట. బాధితురాల్ని బెదిరించి నిందితుడు బాల వెంకటేశ్వర్లు ఇప్పటికే రూ.21 లక్షలు వసూలు చేసినట్లు విచారణలో తేలింది.
అయితే ఆమె నగ్న ఫొటోలను పూర్తిగా డిలీట్ చేయాలంటే మరో రూ.2 కోట్లు సర్దుబాటు చేయాలని నిందితుడు బెదిరించినట్లు.. దీంతో ఆ వేధింపులు తాళలేక మహిళ ఆత్మహత్యకు పాల్పడినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. దీంతో వెంటనే ఆమె ఫ్యామిలీ మెంబర్స్ భవానీపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు.
అయితే ఈ ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన పోలీసులు ఇప్పటికే నిందితుడ్ని అరెస్టు చేశారు. అయితే నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న బాల వెంకటేశ్వర్లు ఇప్పటికే మూడు పెళ్లిళ్లు చేసుకున్నట్లు విచారణ తెలిసింది. అతడి స్మార్ట్‌ఫోన్ పరిశీలించగా.. అందులో ఎందరో మహిళల నగ్న ఫొటోలతో పాటు వీడియోలు కూడా ఉండడం చూసి పోలీసులు విస్తుపోయారు. ఇతడు ఇంకెంత మంది మహిళల్ని ఈ విధంగా మోసం చేశాడనే దానిపై ఇప్పుడు పోలీసులు విచారణ వేగవంతం చేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Jamili Elections In AP: ఏడాది ముందే ఏపీలో ఎన్నికలు రాబోతున్నాయి! మోదీ క్యాబినేట్ కీలక నిర్ణయం! వైసీపీకి పెద్ద దెబ్బే!
Nunna, Vijayawada, Andhra Pradesh:Jamili Elections In AP News: దేశంలో ఎప్పటి నుంచో పరిశీలనలో ఉన్న జమిలి ఎన్నికలు, నియోజకవర్గాల పునర్విభజన అంశాలు త్వరలోనే ఓ కొలిక్కి రానున్నాయి. వీటిని అమలు చేసే దిశగా కేంద్రంలోని మోదీ సర్కార్ కృషి చేస్తున్నట్లు సమాచారం.Singer Mangli Case: "నన్ను వదిలేయండి"..సింగర్ మంగ్లీ వెక్కివెక్కి ఏడుస్తూ..!
Hyderabad, Telangana:Singer Mangli Case News: టాలీవుడ్ సింగర్ మంగ్లీ (సత్యవతి చౌహాన్)పై పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైనట్లు వార్తలు వచ్చాయి. దీనిపై సింగర్ మంగ్లీ మీడియాతో మాట్లాడారు. ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. దయచేసి తనను వదిలేయమని ఆమె వేడుకున్నారు.China New County Breaking News: సరిహద్దుల్లో చైనా కొత్త కౌంటీ.. అక్సాయ్ చిన్ నుంచి PoK వరకు డ్రాగన్ భారీ స్కెచ్!
Lakshmapur, Telangana:China vs India: డ్రాగన్ కంట్రీ చైనా తన పట్టును మరింత బిగించేందుకు శతవిధాలా ప్రయత్నాలు చేస్తూనే ఉంటుంది. తాజాగా జెన్ జియాంగ్ ప్రావిన్స్ లో పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ పీవోకే, ఆఫ్ఘానిస్తాన్ సరిహద్దులకు అతి సమీపంగా సెన్లింగ్ అనే కొత్త కౌంటీని ఏర్పాటు చేస్తూ డ్రాగన్ కంట్రీ సంచలన నిర్ణయం తీసుకుంది. మార్చి 26న అధికారికంగా వెలువడిన ఈ నిర్ణయం ఇప్పుడు అంతర్జాతీయంగా, ముఖ్యంగా దక్షిణాసియాలో తీవ్ర చర్చకు దారి తీస్తోంది.
అయితే సెన్లింగ్ కౌంటీ ఏర్పాటు వెనుక కేవలం పరిపాలనా కారణాలేమీ లేవు. కానీ దీని వెనుక లోతైన భౌగోళిక రాజకీయ వ్యూహం మాత్రం దాగి ఉంది. ఈ ప్రాంతం కారకోరం పర్వత శ్రేణులకు సమీపంలో ఉండటమే కాకుండా.. ఆఫ్ఘనిస్తాన్లోని వాఖాన్ కారిడార్‌కు అతి దగ్గరగా ఉంది. వాఖాన్ కారిడార్ అనేది తజికిస్తాన్, పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ మధ్య ఉన్న సుమారు 74 కిలోమీటర్ల సన్నని భూభాగం ఉంటుంది. ఈ మార్గం ద్వారా మిలిటెంట్లు లేదా ఉగ్రవాద గ్రూపులు చైనాలోకి ప్రవేశించే అవకాశం ఉందని బీజింగ్ భయపడుతోంది. అందుకే ఈ ప్రాంతంలో స్థానిక పాలన పేరుతో భద్రతా దళాలను, పర్యవేక్షణ వ్యవస్థలను భారీగా మోహరించేందుకు చైనా ఈ కొత్త కౌంటీని అస్త్రంగా వాడుకుంటోంది.
భారత్ ఎందుకు ఆందోళన చెందుతోంది?
చైనా చేస్తున్న ఈ విస్తరణ చర్యలు నేరుగా భారత భద్రతపై ప్రభావం చూపే అవకాశం ఉంది. దీనికి ప్రధాన కారణాలు కూడా ఉన్నాయి. అవేంటంటే
అక్సాయ్ చిన్ వివాదం: గత ఏడాది కాలంలోనే చైనా ఈ ప్రాంతంలో ఏర్పాటు చేసిన మూడవ కౌంటీ ఇది. అంతకుముందు ఏర్పాటు చేసిన హీన్ , హెకాంగ్ కౌంటీలపై భారత్ ఇప్పటికే తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఎందుకంటే.. ఆ ప్రాంతాల్లోని కొన్ని భాగాలు లడఖ్‌లో అంతర్భాగమని, 1962 యుద్ధం తర్వాత చైనా వాటిని అక్రమంగా ఆక్రమించుకుందని భారత్ స్పష్టం చేస్తోంది.
CPEC ప్రభావం: సెన్లింగ్ కౌంటీ పరిపాలన కాష్గర్ కిందకు వస్తుంది. చైనా-పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ ఈ ప్రాంతం గుండానే వెళుతుంది. భారత భూభాగం గుండా వెళ్లే ఈ ప్రాజెక్టును భారత్ మొదటి నుంచీ వ్యతిరేకిస్తోంది. ఇప్పుడు చైనా ఇక్కడ తన పరిపాలనను పటిష్టం చేయడం అంటే.. భారత సరిహద్దుల వద్ద తన పట్టును శాశ్వతం చేసుకోవడమే అని అర్థం.
Also Read: Defender: డిఫెండర్ కొనాలా? ఎంత జీతం ఉండాలో తెలుసా! EMI ఎంత కట్టాలంటే..?
భద్రతా సమీకరణాల్లో మార్పులు
ఈ కొత్త కౌంటీ ఏర్పాటుతో చైనా కేవలం సరిహద్దులను కాపాడుకోవడమే కాకుండా.. దక్షిణాసియాలో తన వ్యూహాత్మక నియంత్రణను పెంచుకుంటోంది. కాష్గర్ కేంద్రంగా సాగుతున్న ఈ పరిణామాలు భవిష్యత్తులో లడఖ్ సరిహద్దుల వద్ద ఉద్రిక్తతలకు దారితీయవచ్చు. సరిహద్దుల్లో మౌలిక సదుపాయాల కల్పన, సైనిక శిబిరాల ఏర్పాటు వంటి చర్యలకు సెన్లింగ్ కౌంటీ ఒక కేంద్ర బిందువుగా మారబోతోంది.
చైనా తీసుకున్న ఈ నిర్ణయం దక్షిణ ఆసియాలో భద్రతా సమీకరణాలను ప్రభావితం చేసే ఒక పెద్ద అడుగు అని చెప్పాలి. భారత్ ఇప్పటికే సరిహద్దుల వెంబడి తన నిఘాను పెంచినప్పటికీ.. చైనా చేస్తున్న ఈ పరిపాలనా మార్పులను దౌత్యపరంగా.. సైనికపరంగా ఎలా ఎదుర్కోబోతుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. డ్రాగన్ వేస్తున్న ఈ అడుగులు కేవలం భద్రత కోసమేనా లేక ఆక్రమణల కోసమా అనేది కాలమే సమాధానం చెప్పాలి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Jamili Elections In AP: ఏపీలో సంవత్సరం ముందే ఎన్నికలు?! వైసీపీ పని ఇక గోవిందా? మోదీ సర్కార్ కీలక నిర్ణయం!
Vijayawada, Andhra Pradesh:Jamili Elections In AP News: దేశంలో ఎప్పటి నుంచో పరిశీలనలో ఉన్న రెండు అంశాలను అమలు చేసే దిశగా కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సర్కారు సిద్ధమైంది. అందులో ఒకటి జమిలి ఎన్నికలైతే.. రెండోది పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజన. ఈ రెండు అంశాలను ఈ ఏడాది చివరిలోగా తేల్చేసే విధంగా పార్లమెంట్ ఉభయ సభలు ప్రత్యేకంగా భేటీ అవ్వనున్నాయి. అయితే ఈ అంశాలపై ఇప్పటికే ఎంతో ఆలస్యమైందని మోదీ సర్కార్ భావిస్తోంది.
ఈ నేపథ్యంలో పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసైనా సరే ఈ అంశాలపై చర్చించాలని ధ్యేయంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఇదే విషయమై ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ ఇరకాటంలో పడినట్లు తెలుస్తోంది.
ఇదే విషయమై ఇటీవలే ఏఐసీసీ ఏర్పాటు చేసిన సమావేశంలో కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పార్టీ అధిష్టానం చర్చ జరిపింది. అయితే జమిలి ఎన్నికలపై భిన్న స్వరాలు వినిపించినా.. పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజనను గుడ్డిగా సమర్ధించలేమని వారు తీర్మానించుకున్నట్లు సమాచారం.
జనాభా ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన జరగాల్సి ఉంది. అయితే ఆలోగా జనాభా లెక్కింపును కూడా పూర్తి చేయాలా లేదా.. గతంలో మాదిరిగా నిష్పత్తి శాతంతో నియోజకవర్గాలను ఏర్పాటు చేయాలనే అంశాలపై ప్రతిపాదనలు అందుతున్నాయి.
అయితే జనాభాతో సంబంధం లేకుండా అధికార బీజేపీ తమకు అనుకూల రాష్ట్రాల్లో నియోజకవర్గాలను పెంచుకొని.. రాజకీయ లబ్ధికి తెరలేపిందని కాంగ్రెస్ పార్టీ వాదిస్తోంది. దీని ద్వారా ఉత్తరాదిన భారతీయ జనతా పార్టీ బలం పెంచుకుంటే రాబోయే ఏళ్లలో అధికారం వారికి లభిస్తుందని కాంగ్రెస్ సీనియర్లు మండిపడుతున్నారు.
అయితే జమిలి ఎన్నికలతో పాటు పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజన వెనుక బీజేపీ రాజకీయ వ్యూహం ఉందని కాంగ్రెస్ అగ్రనాయకులు అంటున్నారు. ఒకవేళ జమిలి ఎన్నికల నిర్వహణపై ఈ ఏడాది చివర్లో స్పష్టత వస్తే.. తెలంగాణ రాష్ట్రంలో సరైన సమయానికి ఎన్నికలు జరుగుతాయి. కానీ, ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం ఏడాది ముందే ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది.
ఒకవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటికి ఇప్పుడు ఎన్నికలు వస్తే మళ్లీ కూటమి ప్రభుత్వమే అధికారం చేపడతుందని.. ఇటీవలే ఇండియా టుడే సర్వే వెల్లడించింది. జమిలి ఎన్నికలు జరిగితే మరోసారి వైసీపీకి పరాభవం తప్పదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
MI vs RCB Prediction: ముంబై, బెంగళూరు మ్యాచ్‌లో గెలిచేది వీళ్లే! అన్నాదమ్ముళ్ల సవాల్..కృనాల్ పాండ్యా బౌలింగ్ మారేనా?
Mumbai, Maharashtra:MI vs RCB Match Prediction: ఐపీఎల్ 2026లో భాగంగా నేడు డబుల్ హెడర్ మ్యాచ్‌లు జరగనున్నాయి. నేటి రెండో మ్యాచ్ ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఆతిథ్య ముంబై ఇండియన్స్ జట్టు, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్‌తో తలపడనుంది. ఐపీఎల్లో ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన ముంబై ఇండియన్స్, డిఫెండింగ్ ఛాంపియన్ ఆర్సీబీతో జరగనున్న రసవత్తరపోరుకు ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలోని ముంబై ఇండియన్స్ జట్టు తమ సీజన్ ఆరంభంలో ఒడిదుడుకులను ఎదుర్కొంది. కోల్‌కతా నైట్ రైడర్స్‌పై ఆరు వికెట్ల విజయంతో లీగ్‌లో తొలి విజయాన్ని నమోదు చేసుకోగా.. ఆ తర్వాత ఆడిన ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్ చేతిలో ఓటమి పాలైంది. ఇప్పుడు మరో గెలుపు కోసం ముంబై జట్టు ఎదురుచూస్తోంది.
మరోవైపు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు రజత్ పటిదార్ నేతృత్వంలో 2026 సీజన్‌ను ఎంతో ఉత్సాహంగా ప్రారంభించింది. తొలి మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుపై ఘనవిజయం సాధించగా.. ఆ తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ జట్టుపై 43 పరుగుల ఆధిక్యంతో చిత్తుగా ఓడించింది. కానీ, తాజాగా రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓటమితో ఆర్సీబీ విజయాలను బ్రేక్ పడింది. అయినా ఇన్నింగ్స్ ప్రారంభంలోనే కీలక వికెట్లు కోల్పోయినా.. వారి బ్యాటింగ్, బౌలింగ్ లైనప్ ఎంతో గట్టిగా పోటీ ఇచ్చిన తీరు క్రికెట్ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంది. వాంఖడే స్టేడియంలో జరగనున్న ఈ మ్యాచ్ రాత్రి 7.30 గంటలకు ప్రారంభం కానుంది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) చరిత్రలో ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు ఇప్పటి వరకు 36 సార్లు తలపడ్డారు. అయితే అందులో 21 మ్యాచ్‌ల్లో ముంబై ఇండియన్స్ గెలుపొందగా.. ఆర్సీబీ 15 సార్లు గెలుపొందింది.
అదే విధంగా ముంబైలోని వాంఖడే పిచ్ ఈసారి బ్యాటింగ్ కు అనుకూలిస్తుందని.. అధిక స్కోరింగ్ మ్యాచ్ జరిగే అవకాశం ఉందని పిచ్ క్యూరేటర్లు చెబుతున్నారు. అయితే ఆట సాగేకొద్దీ పిచ్ తన వేగాన్ని నెమ్మదిగా కోల్పోతుంది. రెండో ఇన్నింగ్స్‌లో బౌలింగ్ చేసే వాళ్లకు.. అంటే తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న వారికి ఈ పిచ్ కలిసొస్తుందని అంచనా వేస్తున్నారు.
ఇప్పటి వరకు ఇరు జట్లు 3 మ్యాచ్‌లు ఆడగా.. ముంబై ఇండియన్స్‌తో పోలిస్తే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు అటు బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లోనూ మెరుగ్గా కనిపిస్తోంది. బహుశా ఆర్సీబీ జట్టు ఈ మ్యాచ్‌లో పైచేయి సాధించవచ్చు. కాకపోతే ముంబై ఇండియన్స్ జట్టును కూడా తక్కువ అంచనా వేసేందుకు వీలు లేదు. టేబుల్ లాస్ట్‌లో ఉన్న సీజన్లలో కూడా వారు విజేతలుగా నిలిచిన సందర్భాలు ఉన్నాయి.
ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ తుది జట్లు అంచనా..
ముంబై ఇండియన్స్: రోహిత్ శర్మ, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), నమన్ ధీర్, మిచెల్ సాంట్నర్, ర్యాన్ రికెల్టన్ (వికెట్ కీపర్), శార్దూల్ ఠాకూర్, అశ్వనీ కుమార్, జస్ప్రీత్ బుమ్రా, AM గజన్ఫర్, షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్ (ఇంపాక్ట్ ప్లేయర్).
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: విరాట్ కోహ్లీ, ఫిల్ సాల్ట్, దేవ్‌దత్ పడిక్కల్, రజత్ పటిదార్ (కెప్టెన్), టిమ్ డేవిడ్, కృనాల్ పాండ్యా, జితేష్ శర్మ (వికెట్ కీపర్), రొమారియో షెపర్డ్, భువనేశ్వర్ కుమార్, జోష్ హేజిల్‌వుడ్, అభినందన్ సింగ్, సుయాష్ శర్మ (ఇంపాక్ట్ ప్లేయర్).
Also Read: PBKS Vs SRH Match: సన్‌రైజర్స్‌పై పంజాబ్ కింగ్స్ ఘనవిజయం..కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మెరుపు ఇన్నింగ్స్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Redmi A7 Pro: బడ్జెట్ ధరలో బ్యాటరీ బాహుబలి.. ఏప్రిల్ 13న భారత మార్కెట్లోకి Redmi A7 Pro 5G ఎంట్రీ!
Hyderabad, Telangana:Redmi A7 Pro 5G India Launch News: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం Redmi నుంచి భారత మార్కెట్లోకి మరో సంచలన మొబైల్ విడుదల కాబోతోంది. దీనిని కంపెనీ రెడ్మి ఏ7 ప్రో 5జీ (Redmi A7 Pro 5G) పేరుతో అందుబాటులోకి తీసుకురాబోతోంది. ఈ స్మార్ట్ ఫోన్ సాధారణ బడ్జెట్లో అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. దీనిని కంపెనీ ఏప్రిల్ 13వ తేదీన భారత మార్కెట్లోకి విడుదల చేసే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ మొబైల్ సాధారణ మధ్యతరగతి కుటుంబాలకు అందేలా రూ.10 వేల లోపే లభించబోతున్నట్లు తెలుస్తోంది. బడ్జెట్ స్మార్ట్ ఫోన్ అని ఫీచర్స్ లో లోపాలు వివిధ అంశాలు ఉంటాయని అనుకోవచ్చు.. కానీ ఈ స్మార్ట్ ఫోన్ ఫీచర్స్‌లో భాగంగా Redmi ఎక్కడ వెనకాడకుండా అద్భుతమైన కొత్త కొత్త స్పెసిఫికేషన్స్ తో అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది.
ఈ స్మార్ట్‌ఫోన్ ప్రధాన ఆకర్షణ ఏంటంటే దీని బ్యాటరీ.. సాధారణ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్స్‌లో 5000mAh బ్యాటరీలను చూసి ఉంటాం.. కానీ రెడ్ మీ త్వరలో విడుదల చేయబోయే ఈ స్మార్ట్‌ఫోన్‌లో 6,300mAh బ్యాటరీ ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అదే కాకుండా అది ఒక్కసారి ఛార్జ్ చేస్తే దాదాపు రెండు రోజుల వరకు నిరంతరాయంగా పనిచేస్తుందని కంపెనీ క్లైమ్ చేస్తోంది. అలాగే బ్యాటరీ బ్యాకప్ విషయంలో కూడా వినియోగదారులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఈ Redmi కంపెనీ కొన్ని రకాల జాగ్రత్తలు కూడా తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
ఈ Redmi A7 Pro 5G మొబైల్లో కంపెనీ అద్భుతమైన భారీ డిస్ప్లేను అందించబోతున్నట్లు కూడా తెలుస్తోంది. ఇందులో కంపెనీ 6.9 ఇంచుల భారీ డిస్ప్లేను అందించబోతున్నట్లు లీక్ అయిన వివరాలు చెబుతున్నాయి. అలాగే ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌తో పని చేస్తుంది. కాబట్టి దీనివల్ల గేమింగ్‌తో పాటు వీడియో స్ట్రీమింగ్ చాలా స్మూత్‌గా ఉంటుంది. ఇక ఫోటోగ్రఫీ విషయానికొస్తే.. ఇందులో అద్భుతమైన 32 మెగాపిక్సెల్ డ్యూయల్ AI కెమెరా సెటప్‌ను అందించారు. అత్యంత తక్కువ కాంతిలో కూడా నాణ్యమైన ఫోటోలు తీయడానికి ఈ కెమెరా ఎంతగానో సహాయపడుతుంది. అంతేకాకుండా సెల్ఫీల కోసం ప్రత్యేకంగా AI బ్యూటీ ఫీచర్లను కూడా అందించారు.
Also Read: Motorola g67 Power: రూ.5 వేల లోపే Motorola g67 Power.. ఫ్లిప్‌కార్ట్ సమ్మర్ సేల్ ధమాకా!
ఇక ఈ Redmi A7 Pro 5G స్మార్ట్‌ఫోన్ ఎంతో శక్తివంతమైన ఆక్టా-కోర్ 5G చిప్సెట్తో కూడిన ప్రాసెసర్‌ను కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఆండ్రాయిడ్ 16 ఆధారిత సరికొత్త హైపర్ ఓఎస్ 3 (HyperOS 3) ఆపరేటింగ్ సిస్టంపై రన్ అవుతుంది. ఈ మొబైల్ డిజైన్ చాలా ఆకర్షణీయమైన రంగులో ఉండబోతున్నట్లు తెలుస్తోంది. దీని ద్వారానే ప్రీమియం లుక్కును కలిగి ఉన్నట్లు సమాచారం. అలాగే ఇందులో హైపర్ ఐలాండ్ అనే ఫీచర్ కూడా అందుబాటులో ఉంది. దీనివల్ల నోటిఫికేషన్లను ఎంతో ప్రత్యేకంగా చూడవచ్చు. అయితే, దీనిని భారత మార్కెట్లో ఏప్రిల్ 13వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు విడుదల చేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.
Also Read: Motorola g67 Power: రూ.5 వేల లోపే Motorola g67 Power.. ఫ్లిప్‌కార్ట్ సమ్మర్ సేల్ ధమాకా!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Asha Bhosle Top 10 Songs: సింగర్ ఆశా భోస్లే పాడిన టాప్-10 సాంగ్స్..చివరి పాట తెలుగులో ఓ ఊపు ఊపేసింది!
Hyderabad, Telangana:Asha Bhosle Top 10 Songs List: దాదాపుగా 8 దశాబ్దాలకు పైగా తన గాత్రంలో ప్రేక్షకులను అలరించిన ఆ గొంతు.. నేటితో మూగబోయింది. ఎన్నో పాటలకు తన గాత్రంతో ప్రాణం పోసిన ఆ ఊపిరి ఆగిపోయింది. భారత దిగ్గజ నేపథ్య గాయనీ ఆశా భోస్లే (92) నేడు ఆదివారం ఉదయం కన్నుమూశారు. ఆమె మరణంతో చిత్రపరిశ్రమతో పాటు సంగీత ప్రపంచంలో విషాదం నెలకొంది.
1933 సెప్టెంబర్ 8న మహారాష్ట్రలోని సాంగ్లీ అనే ఊరులో దిగ్గజ సింగర్ ఆశా భోస్లే జన్మించారు. తండ్రి పండిట్ దీనానాథ్ మంగేష్కర్ ఒక గొప్ప శాస్త్రీయ, సంగీత విద్వాంసుడిగానే కాకుండా రంగస్థల నటుడిగా ప్రసిద్ధి పొందారు. తన ఇంట్లోనే సంగీత నేపథ్యం ఉండడం వల్ల ఆశో భోస్లేకు చిన్నతనం నుంచే సంగీతంపై ఆసక్తి పెంచుకున్నారు. ఆమె 9 ఏళ్ల వయసులో తండ్రి దీనానాథ్ మంగేష్కర్ కన్నుమూయడంతో ఆ కుటుంబ బాధ్యత అంతా తన సోదరి లతా మంగేష్కర్‌పై పడింది. కుటుంబం కోసం వారిద్దరూ చిన్ననాటి నుంచే పాటలు పాడడం ప్రారంభించారు.
అలా సంగీత ప్రపంచంలోకి అడుగుపెట్టిన ఆశా భోస్లే దాదాపుగా 8 దశాబ్దాలకు పైగా తన గాత్రంలో భారతదేశం మొత్తాన్ని ఊపేశారు. హుషారెత్తించే, మత్తెక్కించే క్యాబరే పాటలకు ఆమె పెట్టింది పేరు. అలాగే మనసుకు హత్తుకునే మధుర గీతాలతో ఎన్నో ప్రయోగాలు చేస్తూ అందర్ని ఆశ్చర్యపరిచారు. ఆమె గాత్రంలో ప్రత్యేక శైలి ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. నేడు ఆమె పరమదించిన వేళ ఆశా భోస్లే పాడిన లెజండరీ సాంగ్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
1) ఆయే మెహరాబన్ - హౌరా బ్రిడ్జ్ (1958)
O.P. నయ్యర్, ఆశా భోంస్లేల కలయిక వచ్చిన ఈ పాట ఎంతో పాపులర్ అయ్యింది. మధుబాల, అశోక్ కుమార్ హీరోహీరోయిన్లుగా నటించిన "హౌరా బ్రిడ్జ్" చిత్రంలోని ఈ పాట ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకుంది. అప్పట్లో సూపర్ హిట్ సాంగ్‌గా నిలిచిన ఈ పాట.. ఇప్పటికీ ఎవర్ గ్రీన్ క్లాసిక్‌గా నిలిచింది.
2) పియా తు అబ్ తో ఆజా - కారావన్ (1971)
ఆశా భోంస్లే మధురమైన గాత్రం లేకుండా హెలెన్ కొరియోగ్రఫీని ఊహించడం కష్టం. ఆమె ఆకర్షణీయమైన గాత్రం, హెలెన్ చేసిన ఉత్సాహభరితమైన క్యాబరే డ్యాన్స్ ఎంతో చక్కగా సరిపోయేవి. "కారావన్" చిత్రంలోని ఈ పాట వినేందుకు ఆహ్లాదంగా ఉండడమే కాకుండా.. ఆశా భోస్లేకు 'ఉత్తమ నేపథ్య గాయని'గా ఫిల్మ్‌ఫేర్ అవార్డును కూడా తెచ్చిపెట్టింది.
3) హంగామా హో గయా - అన్హోని (1973)
'క్వీన్' చిత్రంలో పారిస్‌లోని ఒక క్లబ్లో ఆశా భోంస్లే పాడిన 'హంగామా' పాట రీమేక్ మనం ఇటీవలే విన్నాం. ఆ పాటకు కంగనా రనౌత్ ఊపేసే స్టెప్పులతో అలరించింది. అయితే ఆశా భోస్లే పాటల ప్రత్యేకత అదే! ఈ పాట తొలిసారి 'అన్హోని' సినిమా కోసం పాడారు.
4) దమ్ మారో దమ్ - హరే రామ హరే కృష్ణ (1971)
R.D. బర్మన్, ఆశా భోంస్లేల సింగింగ్ కాంబో ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్‌ను అందించింది. వాటిలో ఒకటి 'దమ్ మారో దమ్'. ఈ పాట 'హిప్పీ' ట్రెండ్ వారికి ఓ స్పెషల్ సాంగ్‌గా మారిపోయింది. అటు బాలీవుడ్లోనే కాకుండా ఇటు దక్షిణాది చిత్రసీమలోని సినిమాల్లో ఏదైనా పార్టీ సన్నివేశాల్లో కచ్చితంగా ఈ పాటను ప్లే చేస్తున్నారు. ఇదో 'కల్ట్ క్లాసిక్'గా ఇప్పటికీ మన మదిలో మెదులుతోంది. ఈ పాట పాడినందుకు గానూ ఆశా భోస్లేకు ఫిల్మ్ ఫేర్ అవార్డు దక్కింది.
5) చురా లియా హై తుమ్నే జో దిల్ కో - యాదోం కీ బారాత్ (1973)
బాలీవుడ్లో ఇప్పటివరకు వచ్చిన అత్యంత రొమాంటిక్ సాంగ్స్‌లో ఇదొకటిగా నిలిచింది. నేటికీ ప్రతి ఒక్కరి హృదయంలో స్థానం సంపాదించుకుంది. ఆశా భోస్లే మధురమైన గాత్రం, ఆర్.డి. బర్మన్ అద్భుతమైన సంగీతం వల్ల ఈ పాట నేటికీ ఎందరినో అలరిస్తూ ఎవర్ గ్రీన్ క్లాసిక్‌గా నిలిచింది.
6) దునియా మే లోగోం కో - అప్నా దేశ్ (1972)
రాజేష్ ఖన్నా, ముంతాజ్‌ల హీరోహీరోయిన్లుగా నటించి ఈ చిత్రంలో 'దునియా మే లోగోం కో' పాట మీ మూడ్‌ను ఇట్టే మార్చేస్తుంది.
7) ఖతూబా - అలీబాబా ఔర్ 40 చోర్
అరబిక్ ఛాయలున్న 'ఖతూబా' సాంగ్ పాట ఎంతో ఆకట్టుకుంటుంది. ఆశా భోస్లే గాత్రం ఈ పాటను మరింత స్పెషల్‌గా మార్చింది.
8) మేరా నామ్ హై షబ్నం - కటి పతంగ్ (1970)
భారతదేశపు మొట్టమొదటి ర్యాప్ పాటగా ప్రసిద్ధి చెందిన ఈ పాటను టాక్-సంగ్ శైలిలో స్వరపరిచారు. ఈ ప్రయోగాత్మక పాట భారీ విజయం సాధించింది.
9) జరా సా ఝూమ్ లూ మై - దిల్ వాలే ధులనియా లే జాయేంగే (1995)
గత తరం నటి మధుబాల నుండి నేటి తరం కథానాయిక కాజోల్ వరకు.. ఆశా భోస్లే తన వయసుతో సంబంధం లేని గాత్రంతో అందరి కోసం పాడారు. జతిన్-లలిత్ స్వరపరిచిన, షారుఖ్ ఖాన్, కాజోల్ నటించిన ఈ ఉషారైన పాటను ఈ దిగ్గజ గాయని పాడారు.
10) రంగీలా రే - రంగీలా (1995)
62 ఏళ్ల ఆశా భోస్లే 1995లో విడుదలైన 'రంగీలా' చిత్రంలో 20 ఏళ్ల వయసున్న ఊర్మిళ మటోండ్కర్ కోసం పాడి, దానికి ప్రత్యేక జ్యూరీ అవార్డును అందుకున్నారు. ఎ.ఆర్. రెహమాన్ స్వరపరిచిన ఈ చార్ట్ బస్టర్ ఇప్పటికీ స్పెషల్ సాంగ్‌గా నిలిచింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
TS Inter Exams 2026: ఇంటర్ ఫెయిల్ అయ్యారా? ఈ ముఖ్యమైన తేది గుర్తుపెట్టుకోండి!
Hyderabad, Telangana:TS Inter Supplementary Exams 2026 Latest News: తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ విద్యా మండలి కీలక ప్రకటన చేసింది.. ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన విద్యార్థుల కోసం వచ్చే నెలలో అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలను నిర్వహించబోతున్నట్లు బోర్డు వెల్లడించింది. మే 13వ తేదీ నుంచి ఈ పరీక్షలు ప్రారంభం కాబోతున్నట్లు వెల్లడించింది. ఫలితాల విడుదల తర్వాత విద్యార్థులు తమ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని.. ఏడాదంతా వృధా కాకుండా ఉండేందుకు ఈ సప్లిమెంటరీ పరీక్షలను ప్రభుత్వం నిర్వహించబోతున్నట్లు బోర్డు తెలిపింది.. అయితే దీనికి సంబంధించిన అన్ని రకాల వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం..
బోర్డు ప్రకటించిన షెడ్యూల్ కు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. మే 13 నుంచి థియరీ పరీక్షలు ప్రారంభమై విడతల వారీగా జరుగుతాయని షెడ్యూల్లో పేర్కొన్నారు. అంతేకాకుండా అనంతరం మే 22వ తేదీ నుంచి ప్రాక్టికల్ పరీక్షలు ప్రారంభమవుతాయని బోర్డు స్పష్టం చేసింది. ఒకేసారి పరీక్షలు రాయలేని వారు లేదా మార్కులను ఇంప్రూవ్ చేసుకోవాలనుకునే విద్యార్థులు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చని ఇంటర్ బోర్డు తెలిపింది.
సప్లమెంటరీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఏప్రిల్ 13వ తేదీ నుంచి ఏప్రిల్ 20వ తేదీ వరకు తమ సంబంధిత కళాశాలలో పరీక్ష ఫీజును చెల్లించాల్సి ఉంటుంది. నిర్ణీత గడువు ముగిసిన తర్వాత ఫీజు చెల్లించేందుకు అనుమతి ఉండదని.. విద్యార్థులు ఈలోపే ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులు సూచించారు. పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లతో పాటు పూర్తిస్థాయి టైం టేబుల్ లో త్వరలోనే అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతామని ఇంటర్ బోర్డు తెలిపింది..
Also Read:TS Inter Results 2026: తెలంగాణ ఇంటర్ ఫలితాల్లో అమ్మాయిలదే హవా.. 83.72 శాతంతో మేడ్చల్ టాప్..!
పరీక్ష నిర్వాహణలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా రాష్ట్రవ్యాప్తంగా పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నట్లు ఇంటర్ బోర్డు కార్యదర్శి వెల్లడించారు. విద్యార్థులు ఒత్తిడికి లోను కాకుండా ప్రణాళిక బద్దంగా చదువుకోవాలని.. సప్లమెంటరీ పరీక్షలను కూడా వార్షిక పరీక్షల మాదిరిగానే.. సీరియస్ గా తీసుకొని రాయాలని సూచించారు.. మార్కుల రీ వెరిఫికేషన్ తో పాటు రీకౌంటింగ్ దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు కూడా సప్లిమెంటరీ పరీక్షలకు పరీక్షల జరిగే దరఖాస్తు సమయంలోనే అప్లై చేసుకోవాలని స్పష్టం చేసింది..
Also Read:TS Inter Results 2026: తెలంగాణ ఇంటర్ ఫలితాల్లో అమ్మాయిలదే హవా.. 83.72 శాతంతో మేడ్చల్ టాప్..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Sircilla: స్మార్ట్ భిక్షాటన.. QR Codeతో రంగంలోకి దిగిన యాచకుడు!
Hyderabad, Telangana:Sircilla QR Code Beggar Latest News: మారుతున్న కాలంతోపాటు సాంకేతికత సామాన్యుడి ముంగిటకే కాదు.. బిచ్చగాళ్ల చెంతకు కూడా చేరింది. అమ్మ ధర్మం చేయండి.. చిల్లర లేకపోతే ఈ కోడ్‌ను స్కాన్ చేయండి.. అంటూ యాచకుడు చేస్తున్న డిజిటల్ బిగ్‌షాట్ అని ఇప్పుడు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో చర్చనీయాంశంగా మారింది. చిల్లర లేదనే సాకుతో తప్పించుకునే వారికి గట్టిగా చెక్ పెడుతూ.. సాంకేతికతను తన అవసరానికి వాడుతున్న అతడి తీరును చూసి స్థానికులు సైతం ఎంతగానో ఆశ్చర్యానికి గురవుతున్నారు..
సిరిసిల్ల పట్టణంలోని అత్యంత రద్దీగా ఉండే గాంధీ చౌక్ ప్రాంతంలో గత కొన్ని రోజులుగా ఒక దృశ్యం కనిపిస్తూ వస్తోంది.. సాధన యాచకులు తిన్నే పట్టుకొని అడుక్కుంటారు.. కానీ ఈ వ్యక్తి మాత్రం ఒక చేతిలో గిన్నెతో పాటు మరో చేతిలో ఫోన్ పే QR Code ఉన్న బోర్డును పట్టుకొని వీధుల్లో తిరుగుతూ ఉన్నాడు. పట్టణంలోని వ్యాపార సముదాయంతో పాటు హోటల్లు, ప్రధానం కూడళ్ల వద్ద వెళ్తూ దాతలను భిక్షాటన చేయమని అడుగుతూ ఉన్నాడు..
ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరు QR Code వినియోగించి పేమెంట్ చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఆన్లైన్ పేమెంట్స్ కే ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తూ వస్తున్నారు. చాలా మంది జేబుల్లో చిల్లర నగదు ఉండడం లేదు. ఎవరైనా దానం అడిగితే.. చిల్లర లేదు నాయనా అని చెప్పి వెళ్ళిపోవడం జరుగుతూ ఉంటుంది. ఈ సమస్యకు పరిష్కారంగా సదరు యాచకుడు డిజిటల్ బాట పట్టాడు.. ఎవరైనా చిల్లర లేదని చెబితే. వెంటనే తన చేతిలో ఉన్న క్యూఆర్ కోడ్ ను చూపిస్తూ.. అయ్యా స్కాన్ చేసి రూపాయి లేదా రెండు రూపాయలు పంపండి అంటూ యాచి ఇస్తున్నాడు..
Also Read:TS Inter Results 2026: తెలంగాణ ఇంటర్ ఫలితాల్లో అమ్మాయిలదే హవా.. 83.72 శాతంతో మేడ్చల్ టాప్..!
యాచకుడి వద్ద ఈ స్థాయి టెక్నాలజీ చూసిన స్థానికులు ఆశ్చర్యానికి గురవుతున్నారు.. డిజిటల్ ఇండియా అంటే ఇదేనేమో.. చిల్లర లేదని అబద్ధం చెప్పే పరిస్థితి లేకుండా పోయిందని.. కొందరు సరదాగా మాట్లాడుకుంటున్నారు. మరికొందరైతే టెక్నాలజీ ఏ స్థాయికి చేరుకుందో చూసి ఆశ్చర్యపోతున్నారు.. స్మార్ట్‌ఫోన్ వాడకం పెరగడంతో యాచకులు కూడా అప్డేట్ అవ్వక తప్పడం లేదని కొంతమంది భావిస్తున్నారు. ఈ వినూత్న భిక్షాటనకు సంబంధించిన ఫోటోలతో పాటు వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అంతేకాకుండా దీనిపై సోషల్ మీడియా వినియోగదారులు కూడా వివిధ రకాలుగా స్పందిస్తూ వస్తున్నారు.
Also Read:TS Inter Results 2026: తెలంగాణ ఇంటర్ ఫలితాల్లో అమ్మాయిలదే హవా.. 83.72 శాతంతో మేడ్చల్ టాప్..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Khammam: ఒక్క రోజు ఓపిక పట్టి ఉంటే.. మెరిట్ మార్కులతో పాస్.. కానీ ప్రాణం లేదు!
Khammam, Telangana:Khammam Student News: ఇంటర్ రిజల్ట్స్ రాకముందే ఒక విద్యార్థి తీసుకున్న తొందరపాటు నిర్ణయం ఆ కుటుంబంలో తీరని శోకాన్ని నింపింది. పరీక్షల్లో ఫెయిల్ అవుతానని అనవసర భయంతో తన కలను అర్ధాంతరంగా పాడు చేసుకున్నాడు. కానీ తీరా ఫలితాలు వచ్చాక.. ఆ విద్యార్థి గౌరవప్రదమైన మార్కులతో పాస్ అయ్యాడని తెలిసిన తల్లిదండ్రులు గుండెలు పగిలేలా రోదిస్తున్నారు.. బాగా ఎదిగిన కొడుకు కళ్ళముందే కానురాని లోకాలకు వెళ్ళిపోతుంటే తల్లిదండ్రుల బాధ వర్ణనాతీతం..
ఖమ్మం జిల్లా రాపల్లి గ్రామానికి చెందిన అక్షాంత్ అనే విద్యార్థి ఇంటర్మీడియట్ ఎంపీసీ (MPC) మొదటి సంవత్సరం చదువుకుంటున్నాడు. ఇంటర్ పరీక్ష ముగిసినప్పటినుంచి ఫలితాల గురించి అక్షంత్ తీవ్రమైన ఆందోళనకు గురయ్యాడు. తాను సరిగ్గా రాయలేదని.. ఫెయిల్ అయితే తన భవిష్యత్తు ఏమవుతుందో అన్న భయం అతడిని ఎంతగానో వెంటాడింది.. ఈ క్రమంలో ఫలితాలు వెలుపడటానికి ముందే.. గురువారం రోజు తీవ్ర మనస్థాపంతో రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు..
శుక్రవారం ఉదయం తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు ఫలితాలను విడుదల చేసింది. తన కొడుకు పేరుతో ఫలితాలు చూసిన తల్లిదండ్రులు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. అక్షంత్ అన్ని సబ్జెక్టులోనూ ఉత్తీర్ణత సాధించడమే కాకుండా ఏకంగా 347 మార్కులు సాధించి మెరిట్ జాబితాలో నిలిచాడు.. మార్కులు చూసి సంతోషించాలో.. కొడుకు లేడు అన్న నిజాన్ని తలుచుకొని ఏడవాలో తెలియక ఆ తల్లిదండ్రులు విలవిస్తున్న తీరు గ్రామస్తులను ఎంతగానో బాధకు గురి చేసింది. ఒక్కరోజు ఓపిక పట్టి ఉంటే నా కొడుకు ఈరోజు మన మధ్య ఉండేవాడు.. అని తల్లి తండ్రి రోదిస్తుంటే గ్రామం మొత్తం కన్నీరు పెట్టింది..
Also Read:TS Inter Results 2026: తెలంగాణ ఇంటర్ ఫలితాల్లో అమ్మాయిలదే హవా.. 83.72 శాతంతో మేడ్చల్ టాప్..!
ఈ ఘటన నేపథ్యంలో విద్యావేత్తలతో పాటు మానసి నిపుణులు విద్యార్థులకు కొన్ని కీలకమైన సూచనలు చేస్తున్నారు. జీవితమనేది ఒక మహా సముద్రం లాంటిదని.. మార్కులు లేదా ఒక పరీక్ష ఫలితం మీ భవిష్యత్తును పూర్తిగా నిర్ణయించలేవని వారు చెబుతున్నారు. పరీక్షల సమయంలో లేదా ఫలితాల ముందు ఒత్తిడిగా అనిపిస్తే తల్లిదండ్రులతో లేదా స్నేహితులతో మాట్లాడాలని.. ఒకవేళ ఫెయిల్ అయిన సప్లిమెంటరీ పరీక్షలు లేదా ఇతర మార్గాల ద్వారా విజయం సాధించవచ్చుని నిపుణులు తెలుపుతున్నారు. పిల్లలపై మార్కుల కోసం మితిమీరిన ఒత్తిడి తీసుకురావద్దని.. వారి మానసిక స్థితిని గమనిస్తూ ధైర్యం చెప్పాలని నిపుణులు కోరుతున్నారు..
Also Read:TS Inter Results 2026: తెలంగాణ ఇంటర్ ఫలితాల్లో అమ్మాయిలదే హవా.. 83.72 శాతంతో మేడ్చల్ టాప్..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Saturn Transit 2026: శని చూపు పడితే అంతే సంగతులు.. వచ్చే 30 రోజులు ఈ రాశుల వారికి కఠిన పరీక్ష!
Hyderabad, Telangana:Saturn Transit 2026 Effect On Zodiac Signs Telugu: జ్యోతిష్య శాస్త్రంలో అత్యంత శక్తివంతమైన గ్రహంగా.. కర్మఫల ప్రదాతగా భావించే శని దేవుడు తన నక్షత్రాన్ని మార్చుకోబోతున్నాడు. ఏప్రిల్ 17వ తేదీ శని గ్రహం ఉత్తరాభాద్ర పాద నక్షత్రంలోని నాలుగవ పాదంలోకి ప్రవేశించబోతోంది. మే 17వ తేదీ వరకు శని ఇదే స్థితిలో కొనసాగుతాడు. శని గ్రహం గమనం లేదా నక్షత్ర మార్పు జరిగితే అన్ని రాశుల వారిపై కీడు ప్రభావం పడుతుందనే మన అందరికీ తెలిసిందే. ముఖ్యంగా ప్రపంచంపై ప్రభావం పడడమే కాకుండా ఎక్కువగా మానవ జీవితాలు ప్రభావితం అవుతాయి. ముఖ్యంగా ఈ నక్షత్ర మార్పు కారణంగా నాలుగు రాశుల వారికి వచ్చే నెల రోజులపాటు ఆర్థికంగా ఆరోగ్యపరంగా వృత్తిపరంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు. అంతేకాకుండా చిన్న చిన్న సమస్యలను కూడా ఎదుర్కొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేయడం మంచిది.
ప్రభావితం అయ్యే రాశులు ఇవే..
మేషరాశి
మేషరాశి వారికి ప్రస్తుతం ఏలినాటి శని ప్రభావం కొనసాగుతోంది. దీని కారణంగా శని నక్షత్రం మార్పు కారణంగా వీరికి వృత్తి జీవితంలో తీవ్రమైన ఒత్తిడి ఎదుర్కొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా పనుల్లో ఆటంకాలు కూడా కలగడం.. తీసుకునే నిర్ణయాలు బెడిసి కొట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆర్థిక వ్యవహారాల్లో అత్యంత జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. తొందరపాటు నిర్ణయాల వల్ల భారీగా నష్టపోయే ప్రమాదం కూడా ఉందని జ్యోతిష్యులు చెబుతున్నారు. ముఖ్యంగా ఈ సమయంలో కోరుకున్న కోరికను నెరవేరకపోవచ్చు.
కర్కాటక రాశి
కర్కాటక రాశిలో జన్మించిన వ్యక్తులకు పని ప్రదేశంలో అనేక ఒడిదుడుకులు ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతేకాకుండా ఉద్యోగాలు చేస్తున్న వారికి ప్రమోషన్స్‌లో అనేక సమస్యలు ఎదురవుతాయి. కుటుంబంలో గొడవలు జరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. చిన్నపాటి కారణాలే కుటుంబంలో ఎన్నో రకాల సమస్యలకు దారితీస్తాయి. మానసిక ప్రశాంతత కోసం ఈ సమయంలో తప్పకుండా ధ్యానం చేయడం మంచిది.
తులారాశి
తులా రాశిలో జన్మించిన వ్యక్తులకు కెరీర్ పరంగా అనేక సవాళ్లు ఎదురవుతాయి. అలాగే ఆత్మవిశ్వాసం తగ్గడం వల్ల పనులు పూర్తి చేసుకోకుండానే అనేక సమస్యలల్లో పడే అవకాశాలున్నాయి. ముఖ్యంగా కొన్ని పనుల్లో విపరీతమైన జాప్యం కూడా ఎదురవుతుంది. కష్టానికి తగిన ప్రతిఫలం దక్కకపోవడంతో ఆందోళన చెందే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే తొందరపాటు ఉద్యోగ మార్పులు అంత మంచిది కాదని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అంతేకాకుండా ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు.
మకర రాశి
ఏప్రిల్ 17వ తేదీ నుంచి మే 17వ తేదీ వరకు వీరికి చాలా కఠినమైన కాలంగా చెప్పవచ్చు. ఖర్చులు అకస్మాత్తుగా పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తే అవకాశాలు ఉన్నాయి.. కాబట్టి ఆహార నియమాలు దృష్టి సారించడం మంచిది. ప్రతి పనిలోనూ ఆచితూచి అడుగులు వేయడం అవసరం. ఏ మాత్రం అశ్రద్ధ వహించిన నష్టపోయే అవకాశాలకు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అంతేకాకుండా అనేక రకాల చిన్నచిన్న సమస్యలు ఎదురవవచ్చు..
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Sanju Samson Century: సంజూ శామ్ సన్ రికార్డు సెంచరీ.. 2026లో చెన్నై బోణి కొట్టిందోచ్!
Chennai, Tamil Nadu:Chennai Super Kings Beat By 23 Runs To Delhi Capitals: హ్యాట్రిక్ ఓటములతో సతమతమవుతున్న చెన్నై సూపర్ కింగ్స్ అద్భుతం చేసి ఢిల్లీ క్యాపిటల్స్‌పై ఊహించని విజయం సాధించింది. ఆల్‌రౌండ్ ప్రదర్శన కనబర్చిన చెన్నై జట్టు ఢిల్లీపై 23 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి బోణి కొట్టింది. సంజూ శామ్సన్ అజేయ సెంచరీతో అదరగొట్టాడు. మోస్తరు లక్ష్యమైనా కూడా ఢిల్లీ చేధించలేకపోవడం గమనార్హం. అత్యంత ఆసక్తికర మ్యాచ్‌కు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Also Read: RR vs RCB: ఐపీఎల్ 2026 రారాజు రాజస్థాన్.. సూర్యవంశీ, జురేల్ బ్యాటింగ్ విధ్వంసంతో బెంగళూరు బోల్తా
చెన్నైలోని చిదంబరం స్టేడియంలో జరిగిన రెండో మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్, చెన్నై సూపర్ కింగ్స్ తలపడ్డాయి. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన చెన్నై జట్టు నిర్ణీత 20 ఓవర్లకు 2 వికెట్లు కోల్పోయి 212 పరుగులు చేసింది. టీ20 ప్రపంచకప్ సాధించడంలో కీలక పాత్ర పోషించిన సంజూ శామ్సన్ బ్యాట్‌తో విధ్వంసం సృష్టించాడు. 56 బంతుల్లో 115 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. వరుస ఓటములు ఎదుర్కొంటున్న నేపథ్యంలో విజయం కోసం పరితపిస్తున్న సమయంలో సంజూ శతకం బాదాడం చెన్నై అభిమానులకు వినోదం అందించింది. ఈ సీజన్లో సంజూకు ఇది తొలిసారి. 15 ఫోర్లతో బౌండరీల వర్షం కురిపించగా.. 4 సిక్సర్లు బాదాడు. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ 15 పరుగులకు పరిమితమవగా.. యువ ఆటగాడు ఆయుశ్ మాత్రే 36 బంతుల్లో 59 పరుగులు చేసి అర్ధ సెంచరీ నమోదు చేసి రిటైన్ అయ్యాడు. అనంతరం శివమ్ దూబే 20 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లు వికెట్లు తీయడంలో ఘోరంగా విఫలమయ్యారు. పొదుపుగా బౌలింగ్ చేసినా వికెట్లు తీయకపోవడం గమనార్హం. కెప్టెన్ అక్షర్ పటేల్ తీసిన వికెట్ ఒకటే కావడం విశేషం.
Also Read: KTR Speech: చరిత్రహీనుడిగా రేవంత్ రెడ్డి మిగిలిపోతాడు.. ప్రజలే బుద్ధి చెబుతారు: కేటీఆర్
మోస్తరు లక్ష్యాన్ని ఛేదించడానికి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ ఓవర్లు పూర్తి చేసి 189 పరుగులకు పరిమితమైంది. బ్యాటర్లందరూ చేతులెత్తేయడంతో ఆలౌటైంది. పథూమ్ నిస్సాంక 41 పరుగులతో రాణించగా.. కేఎల్ రాహుల్ (18) భారీ పరుగులు రాణించడంలో విఫలమయ్యాడు. సమీర్ రిజ్వీ (6), కెప్టెన్ అక్షర్ పటేల్ (1), డేవిడ్ మిల్లర్ (17) అతి తక్కువ పరుగులు చేశారు. ఓటమి ఖరారు చేసుకున్న క్లిష్ట సమయంలో త్రిస్టన్ స్టబ్స్ అద్భుతంగా రాణించి 38 బంతుల్లో 60 పరుగులు చేసి జట్టుకు గెలుపు ఆశలు రేకెత్తించాడు. అశుతోష్ శర్మ 19 పరుగులతో రాణించగా.. అనంతరం వచ్చిన బ్యాటర్లందరూ ఘోరంగా విఫలమయ్యారు. ఆకిబ్ నబీ (4), కుల్దీప్ యాదవ్ (4), లుంగీ ఎంగిడి (3), నటరాజన్ (1) చాలా తక్కువ పరుగులు చేసి జట్టును ఓటమి వైపు మళ్లించారు. ఈ మ్యాచ్ విజయం సాధించాలనే కసితో చెన్నై బౌలర్లు బౌలింగ్ వేశారు. తక్కువ పరుగులు ఇస్తూనే వరుస వికెట్లు తీసి ప్రత్యర్థిని దెబ్బకొట్టారు. జేమీ ఓవర్టన్ కీలక వికెట్లు తీసి ఢిల్లీ నడ్డి విరిచాడు. అతి తక్కువగా 18 పరుగులు ఇచ్చి 4 వికెట్లు తీశాడు. అన్షుల్ కంబోజ్ 3 వికెట్లు తీసి రాణించగా.. ఖలీల్ అహ్మద్, గుర్జాప్నిత్ సింగ్, నూర్ అహ్మద్ తలా ఒక్కో వికెట్ తీసి జట్టుకు విజయాన్ని అందించారు.
Also Read: KCR Jeevan Reddy: 'దేవుడే పంపిండు మీతో కలిసి పని చేయమని' కేసీఆర్‌తో జీవన్ రెడ్డి
మూడు ఓటముల అనంతరం చెన్నై సూపర్ కింగ్స్ గొప్పగా పుంజుకుని ఆల్‌రౌండ్ ప్రదర్శన చేసింది. సంజూ శామ్సన్ భారీ సెంచరీతో వినోదం అందించగా.. బ్యాటర్లు, బౌలర్లు సమష్టి కృషి చేయడంతో జట్టుకు తొలి విజయం దక్కింది. ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో మూడు ఓటములు, ఒక విజయం సాధించిన చెన్నై జట్టు పాయింట్ల పట్టికలో తన ర్యాంకును మెరుగుపర్చుకుంది. ఢిల్లీ క్యాపిటల్స్ ఈ ఓటమిని ఊహించలేకపోయింది. నాలుగు మ్యాచ్‌లు ఆడి విజయాలు, ఓటమలు రెండేసి చొప్పున ఉన్న ఢిల్లీ నాలుగో స్థానంలో కొనసాగుతోంది. రేపు లక్నో, గుజరాత్ మధ్య తొలి మ్యాచ్ జరగనుండగా.. రెండో మ్యాచ్ ముంబై, బెంగళూరు మధ్య జరగనుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
PBKS Vs SRH Match: సన్‌రైజర్స్‌పై పంజాబ్ కింగ్స్ ఘనవిజయం..కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మెరుపు ఇన్నింగ్స్!
Tira, Punjab:PBKS Vs SRH Match 2026: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో వరుస విజయాలతో దూసుకుపోతున్న పంజాబ్ కింగ్స్ జట్టు ఇప్పుడు మరో విజయాన్ని తమ ఖాతాలో వేసుకుంది. కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరగాల్సిన గత మ్యాచ్ వర్షం కారణంగా రద్దవ్వగా.. ఇప్పుడు సన్‌రైజర్స్‌పై గెలిచి సత్తా చాటింది. 220 పరుగుల లక్ష్యాన్ని అవలీలగా 18.5 ఓవర్లలో ఛేదించి.. ఈ సీజన్లో మరో బలమైన జట్టుగా నిలిచింది. ఈ గెలుపుతో పంజాబ్ కింగ్స్ జట్టు పాయింట్ల పట్టికలో 7 పాయింట్లతో రెండో స్థానానికి చేరుతుంది.
న్యూ ఛంఢీఘర్లోని మహారాజ యుధవీంద్ర అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరిగిన ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్ జట్టుతో సన్‌రైజర్స్ హైదరాబాద్ తలపడింది. టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ జట్టు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మొదట బౌలింగ్ ఎంచుకున్నాడు. టాస్ ఓడి తొలి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 219 పరుగులను రాబట్టారు. ఆరంభం నుంచే సన్‌రైజర్స్ బ్యాటర్లు విజృంభించారు.
ఓపెనర్ అభిషేక్ శర్మ విధ్వంసకర బ్యాటింగ్‌తో 28 బంతుల్లో 74 పరుగులు రాబట్టి పవర్‌ప్లేలో ఎక్కువ స్కోర్ రాబట్టేందుకు కృషి చేశాడు. ఇందులో 8 సిక్సర్లు, 5 ఫోర్లు ఉన్నాయి. అభిషేక్‌కు తోడుగా బ్యాటింగ్‌కు వచ్చిన ట్రావిస్ హెడ్ 23 బంతుల్లో 38 పరుగులు రాబట్టి మెరుగైన భాగస్వామ్యం అందించేందుకు తన వంతు ప్రయత్నం చేశాడు. ఆ తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన ఇషాన్ కిషన్ (27), క్లాసెన్ (39) తమదైన ఇన్నింగ్స్‌తో స్కోరు బోర్డును పరుగులు పెట్టించడంలో విజయం సాధించారు.
ఆ వెంటనే వచ్చిన సన్‌రైజర్స్ బ్యాటర్లు అనుకున్నంత స్థాయిలో రాణించకపోవడం వల్ల 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయిన సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు 219 పరుగులతో సరిపెట్టుకుంది. మరోవైపు పంజాబ్ కింగ్స్ బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్, శశాంక్ సింగ్ తలో రెండు వికెట్లు పడగొట్టగా.. జేవియర్ ఓ వికెట్ సాధించాడు.
ఆ తర్వాత సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు నిర్దేశించిన 220 పరుగుల లక్ష్యాన్ని చేధించేందుకు బరిలో దిగిన పంజాబ్ కింగ్స్ బ్యాటర్లు ఆదినుంచే ఆకట్టుకునే ప్రదర్శన చేశారు. ఓపెనర్లు ప్రియాన్ష్ ఆర్య (57 పరుగులు; 5 సిక్సర్లు, 5 ఫోర్లు), ప్రభ్‌సిమ్రన్ సింగ్ (51 పరుగులు; 4 సిక్సర్లు, 4 ఫోర్లు) అర్ధశతకాలతో దూకుడుగా ఆడారు. వీరిద్దరూ కలిసి 100 పరుగులకు పైగా భాగస్వామ్యం రాబట్టి పంజాబ్ కింగ్స్ జట్టుకు టెన్షన్ లేని ఛేజింగ్ స్థాయికి తీసుకొచ్చారు.
ఆ తర్వాత వచ్చిన కూపర్ కాన్లీ 11 పరుగులకే వెనుదిరిగినా.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తనదైన బ్యాటింగ్‌తో హాఫ్ సెంచరీ చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. 33 బంతుల్లో 69 పరుగులు రాబట్టి (5 సిక్సర్లు, 5 ఫోర్లు) తనదైన మార్క్ ఇన్నింగ్స్ ఆడాడు. నేహాల్ వధేరా 14 పరుగులు చేయగా.. శశాంక్ సింగ్ 16 పరుగులు రాబట్టారు. దీంతో 18.5 ఓవర్లలో నిర్దేశిత లక్ష్యాన్ని చేధించిన పంజాబ్ కింగ్స్ జట్టు ఈ లీగ్‌లో తమ మూడో విజయాన్ని నమోదు చేసుకుంటూ.. పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరుకున్నారు. మరోవైపు సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్లలో శివాంగ్ కుమార్ 3 వికెట్లు పడగొట్టగా.. హర్ష్ దుబే ఒక్క వికెట్ పడగొట్టగలిగారు.
Also Read: RR vs RCB Preview: నేడు ఐపీఎల్లో హోరాహోరీ పోరు..రాజస్థాన్ Vs బెంగళూరు..బుడ్డోడు అదరగొడతాడా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
