Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Mahabubabad506101

ఈ నెల 15న ఖమ్మంలో సీఎం రేవంత్‌ సమావేశం

Aug 09, 2024 11:10:09
Mahabubabad, Telangana

ఖమ్మం జిల్లాలో సీతారామ సాగునీటి ప్రాజెక్టును ఈ నెలలో సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో తుమ్మల వైరాలో ఏర్పాటు చేసిన సభ ఏర్పాట్లను పరిశీలించారు. ప్రాజెక్టు ప్రారంభోత్సవం అనంతరం జరిగిన సభలో సీఎం రేవంత్ రూ.2 లక్షల రుణమాఫీని ప్రారంభిస్తామన్నారు. తమది రైతుల ప్రభుత్వమని చెప్పుకుంటున్నారు. సీఎం సభకు పెద్ద ఎత్తున జన సమీకరణ చేస్తున్నామని, సభకు వచ్చే ప్రజలకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నామని తుమ్మల తెలిపారు.

0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
HDHarish Darla
Jan 07, 2026 08:40:01
Hyderabad, Telangana:

AP Telangana Movie Ticket Price Hike: తెలంగాణలో భారీ బడ్జెట్ చిత్రాల టికెట్ ధరల విషయంలో నెలకొన్న సందిగ్ధానికి హైకోర్టు తెరదించింది. గతంలో సింగిల్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వుల వల్ల ఇతర సినిమాలపై పడే ప్రభావం నుంచి తాజా చిత్రాలకు మినహాయింపునిస్తూ డివిజన్ బెంచ్ కీలక ఆదేశాలు జారీ చేసింది.

హైకోర్టు ఉత్తర్వుల్లోని ముఖ్యాంశాలు..
గతంలో టికెట్ ధరల నియంత్రణపై సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పు కేవలం 'పుష్ప-2', 'ఓజీ'(OG), 'గేమ్ ఛేంజర్', 'అఖండ-2' చిత్రాలకు మాత్రమే పరిమితమని కోర్టు స్పష్టం చేసింది. అలాగే టికెట్ ధరల పెంపు, బెనిఫిట్ షోలపై నిర్మాతలు ఇచ్చే వినతులను పరిశీలించి, తగిన నిర్ణయం తీసుకోవాలని హోం శాఖ ముఖ్య కార్యదర్శిని హైకోర్టు ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వం ఈ విన్నపాలపై సానుకూలంగా స్పందిస్తుందని ప్రభుత్వ తరపు న్యాయవాది కోర్టుకు వివరించారు.

'ది రాజా సాబ్' నిర్మాతల విన్నపం ఏంటి?
ప్రభాస్ హీరోగా నటిస్తున్న 'ది రాజా సాబ్' నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఇప్పటికే ప్రభుత్వానికి లేఖ రాసింది. వారి అభ్యర్థనలు ఇలా ఉన్నాయి. ఈ చిత్రం జనవరి 9న విడుదల కానున్న నేపథ్యంలో ముందు రోజు అనగా జనవరి 8న రాత్రి 9 గంటలకు ప్రీమియర్ షో ప్రదర్శించేందుకు అనుమతి కోరుతున్నారు. 

ఆ ప్రీమియర్ షోలకు సింగిల్ స్క్రీన్స్‌లో రూ.800+జీఎస్టీ.. అలాగే మల్టీప్లెక్స్‌లో ప్రీమియర్ షో లకు రూ.1000 + జీఎస్టీ వరకు పెంపు కోసం నిర్మాతలు ప్రభుత్వానికి విన్నవించుకోనున్నారు. అలాగే విడుదల తేదీ జనవరి 9 నుంచి సింగిల్ స్క్రీన్ టికెట్లపై రూ.102, అలాగే మల్టీప్లెక్స్‌లో రూ.132 అదనంగా పెంచాలని కోరుతున్నట్లు తెలుస్తోంది.

అయితే అదనంగా జనవరి 9న తెల్లవారుజామున 4 గంటల షోలకు కూడా అనుమతి కోరినట్లు తెలుస్తోంది. భారీ పెట్టుబడితో రూపొందించినందున ఈ పెంపు అత్యవసరమని నిర్మాతలు కోర్టుకు విన్నవించినట్లు సమాచారం.

సంక్రాంతి సినిమాలకు లైన్ క్లియర్!
సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గతంలో టికెట్ ధరల పెంపు ఉండదని ప్రకటించిన నేపథ్యంలో, హైకోర్టు తాజా తీర్పు నిర్మాతలకు పెద్ద రిలీఫ్ ఇచ్చింది. ముఖ్యంగా సంక్రాంతి బరిలో ఉన్న 'మన శంకరవరప్రసాద్ గారు' చిత్రానికి కూడా ఈ తీర్పు సానుకూలంగా మారనుంది.

హైకోర్టు సూచనతో ఇప్పుడు బంతి ప్రభుత్వం కోర్టులో ఉంది. మరి ప్రభుత్వం ఎంత మేరకు ధరల పెంపుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుందో వేచి చూడాలి.

గమనిక: పైన పేర్కొన్న సమాచారం కేవలం కొన్ని నివేదికల ద్వారా రూపొందించింది. సినిమా టికెట్ ధరలపై అధికారిక ప్రకటన ఇంకా రాలేదు. 

Also Read: Tamanna Remuneration: నిమిషానికి రూ.కోటి వసూలు చేసిన మిల్కీ బ్యూటీ..సినిమాలో కాదు, 6 నిమిషాలకు రూ.6 కోట్లు!

Also Read: School Holiday: విద్యార్థులు ఎగిరి గంతేసే వార్త..స్కూళ్లకు మరో 7 రోజులు సెలవులు పొడిగింపు..పండగ చేసుకోండి!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
RGRenuka Godugu
Jan 07, 2026 07:26:05
Hyderabad, Telangana:

Tanuja Viral Video: సెలబ్రిటీలను చూడగానే ఆగకుండా ఒక్కసారిగా వారి పైకి దూసుకెళ్లడం కామన్ అయిపోయింది. హైదరాబాద్ వంటి పెద్ద నగరాల్లో కూడా ఫ్యాన్స్ అదుపుతప్పుతున్నారు. సెలబ్రిటీలపై అభిమానం వెర్రి తలలు వేస్తోంది. నిధి అగర్వాల్, సమంత, అల్లు అర్జున్, విజయ్‌లను బెంబేలెత్తించిన ఫ్యాన్స్ తాజాగా బిగ్ బాస్ ఫేమ్‌ తనూజను కూడా హడలెత్తించారు. హైదరాబాద్‌లోని ఈవెంట్‌కు వెళ్లిన ఆమె కోసం ఒక్కసారిగా ఫ్యాన్స్ చుట్టూ ముట్టేశారు. నేను మీ కోసమే వచ్చా.. దయచేసి తోయొద్దు అని విజ్ఞప్తి చేసినా వినలేదు. ఆమెను చుట్టుముట్టేసి ఒక్కసారిగా అక్కడ తోపులాట కూడా జరిగింది. ఈ వీడియో సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. దీంతో చూసినవారు అంత అభిమానం కాదు మూర్ఖత్వం అని నెటిజెన్లు సైతం ఫైర్ అవుతున్నారు.

అంతకు ముందు లుల్లు మాల్‌లో నిధి అగర్వాల్ ది రాజాసాబ్‌ ఈవెంట్ కోసం రాగా అక్కడ ఒక్కసారిగా ఆమెపై తోపులాట జరిగింది. ఆ తర్వాత తెలుగు ఇండస్ట్రీలో ఒకరిపై ఒకరు ఆరోపణలు కూడా చేసుకున్నారు. అభిమానుల సెలబ్రెటీలు కనిపించగానే అదుపు చేసుకోలేక వారిపై దూసుకెళ్తున్నారు. ఆ తర్వాత సమంత ఒక షాప్ ఓపెనింగ్‌కు వచ్చిన సమయంలో కూడా ఆమెపై అలాగే దూసుకొచ్చారు. దీంతో సమంత కూడా కాస్త ఇబ్బంది పడింది. ఒక ఫ్యాన్ అయితే ఆమె చీరను కూడా తొక్కేశాడు. అదుపుతప్పితే సమంత కింద పడే ప్రమాదం కూడా జరిగేది.

ఇటీవలె బన్నీ భార్య స్నేహరెడ్డితోపాటు హైదరాబాద్‌లోని హైటెక్‌ సిటీ నీలోఫర్ కేఫ్  వచ్చి తిరిగి వెళుతున్న సమయంలో ఒక్కసారిగా ఫ్యాన్స్ కూడా చుట్టుముట్టారు. అభిమానులు మరోసారి మితిమీరి ప్రవర్తించారు. వారిని చూసి సెల్ఫీల కోసం ఫ్యాన్స్ గుమిగూడారు. అతి కష్టం మీద బన్నీ స్నేహ కేఫ్ నుంచి బయటికి వెళ్లారు. కారు ఎక్కడానికి కూడా వాళ్ళు చాలా ఇబ్బంది పడ్డారు.

 తాజాగా తనూజ కూడా ఇలాంటి ఛేదు అనుభవమే మిగిలింది. ఇక బిగ్ బాస్ 9 తెలుగు రన్నరప్‌గా తనూజ నిలిచింది. ఈమె పూర్తి పేరు తనూజ పుట్ట స్వామి. ఇండస్ట్రీలోని పలు సీరియల్స్ లో నటించింది. తెలుగు మాత్రమే కాదు కన్నడ సీరియల్ లో కూడా నటించింది.  కర్నాటకలోని బెంగళూరు ఆమె స్వస్థలం. మొదటగా 2013లో కన్నడ హారర్ మూవీ నటించారు. జీ తెలుగు సీరియల్ ముద్దమందారంలో తను మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంది. ఈ సీరియల్ 1500 ఎపిసోడ్స్ కూడా పూర్తి చేసుకుంది. ఆ ఫేమ్‌ తర్వాత బిగ్ బాస్ తెలుగులోకి కూడా అడుగు పెట్టింది. తనూజ పుట్టస్వామి తెలుగు బిగ్ బాస్ 9 లో ఈ 33 ఏళ్ల సెలబ్రిటీ అడుగుపెట్టి. ఆమె రన్నరప్‌ నిలవగా.. విన్నర్‌గా కళ్యాణ్ పడాలా ట్రోఫీ అందుకున్నారు.

Also Read: వెయ్యి కోట్ల దర్శకులు.. ‘దురంధర్’తో ఈ క్లబ్బులో ఎంట్రీ ఇచ్చిన ఆదిత్యధర్..

Also Read: ఒకప్పుడు తెలుగు సహా అన్ని భాషల్లో సత్తా చాటిన హీరోయిన్.. నేడు రూ.2 వేల కోట్లకు యజమాని.. 5 కంపెనీలకు బాస్..

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
HDHarish Darla
Jan 07, 2026 07:07:24
Hyderabad, Telangana:

Tamanna 6 Crore Remuneration: భారతీయ సినీ పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి తమన్నా భాటియా. కేవలం సినిమాలతోనే కాకుండా, తన డ్యాన్స్ పెర్ఫార్మెన్స్‌లతో బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ఈ 'మిల్కీ బ్యూటీ' పారితోషికం ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. కేవలం 6 నిమిషాలకు రూ. 6 కోట్లు వసూలు చేసిందట. తమన్నా క్రేజ్ ఏ రేంజ్‌లో ఉందో చెప్పడానికి తాజా ఉదాహరణ ఇదే. ఇంతకీ ఆ విషయం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

కొన్ని వార్తా నివేదికల ప్రకారం.. గోవాలో జరిగిన 2025 నూతన సంవత్సర వేడుకల్లో తమన్నా తన డ్యాన్స్‌తో అదరగొట్టారు. కేవలం 6 నిమిషాల స్టేజ్ పెర్ఫార్మెన్స్ కోసం ఆమెకు రూ.6 కోట్లు చెల్లించినట్లు సమాచారం. అంటే ఆమె నృత్యంలోని ప్రతి నిమిషానికి ఒక కోటి రూపాయలు వసూలు చేశారన్నమాట!

యూట్యూబ్‌ను వణికిస్తున్న చార్ట్‌బస్టర్స్
తమన్నా కేవలం నటి మాత్రమే కాదు, ఆమె ఒక అద్భుతమైన డ్యాన్సర్. 2024లో ఆమె నటించిన పాటలు సోషల్ మీడియాలో రికార్డులు సృష్టించాయి. బాలీవుడ్‌లో రూపొందిన 'స్త్రీ 2' సినిమాలోని 'ఆజ్ కీ రాత్' సాంగ్ యూట్యూబ్‌లో ఏకంగా 90.1 కోట్లకు పైగా (901,784,667) వీక్షణలు సాధించి ప్రపంచవ్యాప్తంగా ట్రెండ్ అయ్యింది.

అలాగే రజినీకాంత్ హీరోగా రూపొందిన 'జైలర్' సినిమాలోని 'కావాలయ్యా' సాంగ్‌లోని స్టెప్పులకు ఫిదా కాని వారు లేరు. ఈ ఒక్క పాట కోసం ఆమె సుమారు రూ.3 కోట్లు తీసుకున్నట్లు సమాచారం.

దక్షిణాదిలో అత్యధిక పారితోషికం తీసుకునే నటీమణులలో తమన్నా ఒకరు. ఆమె ఒక్కో సినిమాకు రూ.4 కోట్ల నుండి రూ.5 కోట్ల వరకు వసూలు చేస్తారు. వివిధ నివేదికల ప్రకారం ఆమె ఆస్తుల విలువ సుమారు రూ.110 కోట్లుగా ఉంది. 2005లో 'చాంద్ సా రోషన్ చెహ్రా'తో మొదలైన తమన్నా సినీ ప్రయాణం.. 'హ్యాపీ డేస్', '100% లవ్', 'బాహుబలి', 'సైరా నరసింహ రెడ్డి' వంటి 89 చిత్రాలతో హీరోయిన్‌గా విజయవంతంగా కొనసాగుతోంది.

అవార్డులు
తన నటనకు గాను ఆమె మూడు సంతోషం ఫిల్మ్ అవార్డులు, రెండు సైమా అవార్డులతో పాటు ప్రతిష్టాత్మకమైన కళైమామణి అవార్డును కూడా అందుకున్నారు. 'బాహుబలి' వంటి చిత్రాలతో ఆమె పాన్-ఇండియా స్టార్‌గా ఎదిగారు.

Also Read: School Holiday: విద్యార్థులు ఎగిరి గంతేసే వార్త..స్కూళ్లకు మరో 7 రోజులు సెలవులు పొడిగింపు..పండగ చేసుకోండి!

Also Read: School Holiday: తెలంగాణలో సంక్రాంతి హాలీడేస్ ప్రకటన..ఏకంగా 9 రోజులు సెలవులు..ఎప్పటి నుంచి అంటే?

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
HDHarish Darla
Jan 07, 2026 06:25:16
Hyderabad, Telangana:

School Holiday Tomorrow: దేశవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పడిపోతుండటంతో విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని పలు రాష్ట్ర ప్రభుత్వాలు శీతాకాల సెలవులను పొడిగిస్తున్నాయి. పంజాబ్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, జార్ఖండ్ వంటి రాష్ట్రాల్లో ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది? ఏఏ రాష్ట్రాల్లో స్కూళ్లకు సెలవులను ప్రకటించారనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.

జనవరి 15 వరకు సెలవులు
దేశ రాజధాని ఢిల్లీ నగరంలో చలి తీవ్రత, గాలి కాలుష్యం దృష్ట్యా, ఢిల్లీలోని పాఠశాలలు జనవరి 15, 2026 వరకు మూత పడనున్నాయి. కనిష్ట ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో పడిపోవడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

అదే విధంగా ఉత్తరప్రదేశ్‌లో తీవ్రమైన చలితో పాటు దట్టమైన పొగమంచు కారణంగా వేర్వేరు జిల్లాల్లో సెలవులను పొడిగించారు. ఘజియాబాద్‌లో 8వ తరగతి వరకు విద్యార్థులకు జనవరి 10 వరకు పాఠశాలలు మూతపడనున్నాయి. అలాగే లక్నోలోని కొన్ని స్కూళ్లకు జనవరి 8 వరకు సెలవులు పొడిగించిన సంగతి తెలిసిందే.

జార్ఖండ్‌లో సెలవుల పొడిగింపు
జార్ఖండ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో జనవరి 6 వరకు ఉన్న సెలవులను ఇప్పుడు జనవరి 8, 2026 వరకు పొడిగించింది. ఈ ఆదేశం నర్సరీ నుండి 12వ తరగతి వరకు అన్ని పాఠశాలలకు వర్తిస్తుందని ఉత్తర్వులు జారీ చేసింది.

పంజాబ్‌లో స్కూళ్ల సెలవులు ఇలా..
పంజాబ్ విద్యాశాఖ ఆదేశాల ప్రకారం.. రాష్ట్రంలోని పాఠశాలలు జనవరి 7 (ఈరోజు) వరకు మూసివేయబడ్డాయి. అయితే, వాతావరణ పరిస్థితులు ఇంకా మెరుగుపడకపోవడంతో సెలవులు మరింత పొడిగించే అవకాశం ఉందా లేదా అనేది ప్రభుత్వం త్వరలో ప్రకటించనుంది.

త్రిపురలో సెలవుల పొడిగింపు..
ఈశాన్య రాష్ట్రమైన త్రిపురలో కూడా చలి గాలులు తీవ్రంగా ఉండటంతో, రాష్ట్రంలోని అన్ని పాఠశాలలను జనవరి 10, 2026 వరకు మూసివేయాలని అధికారులు ఆదేశించారు.

గమనిక: వాతావరణంలో మార్పుల వల్ల సెలవులపై నిర్ణయాలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. కాబట్టి స్కూల్ మేనేజ్‌మెంట్ లేదా జిల్లా కలెక్టర్ ఇచ్చే అధికారిక సమాచారాన్నే ప్రామాణికంగా తీసుకోండి. కొన్ని చోట్ల పాఠశాలలు తెరిచినప్పటికీ, ఉదయం పూట చలి ఎక్కువగా ఉండటం వల్ల స్కూల్ ప్రారంభ సమయాలను (ఉదాహరణకు ఉదయం 10 గంటలకు) మార్చే అవకాశం ఉంది.

Also Read: School Holiday: తెలంగాణలో సంక్రాంతి హాలీడేస్ ప్రకటన..ఏకంగా 9 రోజులు సెలవులు..ఎప్పటి నుంచి అంటే?

Also Read: Prabhas Daily Food Cost: డార్లింగ్ ప్రభాస్‌తో ఉంటే 'రాజ'వైభోగమే! తిండికి ఆయన రోజుకు ఎంత ఖర్చు చేస్తారో తెలుసా?

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
BBhoomi
Jan 07, 2026 05:47:06
Secunderabad, Telangana:

Donald Trump-Greenland Controversy: ప్రపంచాన్ని ఒక్కసారిగా షాక్‌కు గురి చేసిన వెనిజులా అధ్యక్షుడి కిడ్నాప్ ఘటన తర్వాత.. అంతర్జాతీయ రాజకీయాల్లో మరో సంచలన అంశం తెరపైకి వచ్చింది. ఈసారి అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ దృష్టి ప్రపంచంలోనే అతిపెద్ద ద్వీపమైన గ్రీన్లాండ్‌పై పడినట్లు తెలుస్తోంది. ట్రంప్ తాజాగా గ్రీన్లాండ్‌ను అమెరికాతో విలీనం చేయాలన్న వ్యాఖ్యలు చేయడం యూరప్ దేశాల్లో కలకలం రేపుతోంది.

నిజానికి ట్రంప్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టకముందే గ్రీన్లాండ్‌ను అమెరికా కొనుగోలు చేయాలన్న ఆలోచనను బహిరంగంగా వెల్లడించారు. అప్పట్లో ప్రపంచవ్యాప్తంగా ఆ వ్యాఖ్యలు తీవ్ర విమర్శలకు గురయ్యాయి. ఇప్పుడు వెనిజులా ఘటన తర్వాత ట్రంప్ మళ్లీ అదే అంశాన్ని తెరపైకి తేవడం గమనార్హంగా మారింది. గ్రీన్లాండ్ అమెరికాతో కలిస్తే యూరప్ భద్రతకు కూడా మేలు జరుగుతుందని ట్రంప్ వాదిస్తున్నారు.

కానీ అంతర్జాతీయ రాజకీయ నిపుణులు మాత్రం ట్రంప్ మాటల వెనుక అసలు కారణం వేరేనని అంటున్నారు. గ్రీన్లాండ్‌లో అపారమైన ఖనిజ సంపద ఉంది. అలాగే ఆర్కిటిక్ ప్రాంతంలో ఉన్న ఈ ద్వీపానికి వ్యూహాత్మకంగా చాలా కీలకమైన స్థానం ఉంది. ఇదే ట్రంప్ అసలు లక్ష్యమని విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు.

Also Read: Asaduddin Owaisi Family Details: ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీకి ఎంత మంది పిల్లలు? అమ్మాయిలు ఎందరు? అబ్బాయిలు ఎందరు?

ట్రంప్ వ్యాఖ్యలు వెలుగులోకి రావడంతో నాటో దేశాలు వెంటనే స్పందించాయి. మంగళవారం  ఏడు నాటో దేశాలు కలిసి సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయెల్ మాక్రాన్, జర్మనీ ఛాన్సలర్ ఫ్రెడరిక్ మెర్జ్, బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ సహా పలువురు యూరోపియన్ నేతలు ఈ ప్రకటనకు మద్దతు ఇచ్చారు.  గ్రీన్లాండ్ దాని ప్రజల సొంతం. దాని భవిష్యత్తును నిర్ణయించేది డెన్మార్క్ ప్రభుత్వం, గ్రీన్లాండ్ ప్రజలే  అని వారు తేల్చి చెప్పారు.

ఇది ట్రంప్‌కు గట్టి రాజకీయ హెచ్చరికగా మారింది. అంతేకాదు, డెన్మార్క్ ప్రధాని మెట్టే ఫ్రెడెరిక్సెన్ మరింత స్పష్టంగా స్పందించారు. ఏదైనా నాటో మిత్రదేశంపై అమెరికా సైనిక చర్యలకు దిగితే, అది తీవ్ర పరిణామాలకు దారి తీస్తుందని ఆమె హెచ్చరించారు. అలా జరిగితే రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఏర్పడిన నాటో కూటమికే పెద్ద ముప్పు ఏర్పడుతుందని వ్యాఖ్యానించారు. కాగా  గ్రీన్లాండ్ అంశం ఇప్పుడు అమెరికా–యూరప్ మధ్య కొత్త ఉద్రిక్తతలకు కారణమవుతోంది. ట్రంప్ ఈ విషయంలో ఎంతవరకు ముందుకెళ్తారు? నాటో దేశాలు ఎలా స్పందిస్తాయి? అన్నది రాబోయే రోజుల్లో ప్రపంచ రాజకీయాలను ప్రభావితం చేసే కీలక అంశంగా మారనుంది.

 Also Read: Business Ideas: మహిళలు ఇల్లు కదలకుండా కేవలం రూ. 10 వేలు పెట్టుబడి పెడితే చాలు నెలకు రూ. 50 వేలు సంపాదించే అవకాశం..!!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

.Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
comment0
Report
RKRavi Kumar Sargam
Jan 06, 2026 11:04:09
Jangaon, Telangana:

KTR Speech: 'తెలంగాణను 60 సంవత్సరాల పాటు రాచిరంపాన పెట్టిన కాంగ్రెస్ పార్టీ అనే విషయం మర్చిపోయి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు. 60 ఏళ్ల కాంగ్రెస్ దుర్మార్గాన్ని, తెలంగాణకు చేసిన ద్రోహాన్ని తన దీక్షతో ప్రాణాలకు తెగించి కొట్లాడి తెలంగాణ సాధించిన కేసీఆర్‌పైన అడ్డగోలుగా మాట్లాడుతున్నాడు. నదులు, తెలంగాణపై కనీస అవగాహన లేని హౌలా గాడు రేవంత్ రెడ్డి' అని మాజీ మంత్రి కేటీఆర్‌ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

Also Read: Ponnala Laxmaiah: సాగునీటిపై రేవంత్ రెడ్డి చేసిన మోసాలను ప్రజలు క్షమించరు: పొన్నాల లక్ష్మయ్య

జనగామ జిల్లాలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్‌లు, ఉపసర్పంచ్‌లు, వార్డు సభ్యుల అభినందన సభ నిర్వహించగా.. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక ప్రసంగం చేశారు. 'ఇంటింటికి నీళ్లు ఇచ్చినందుకు, అమ్మలక్కలకు ఆసరా పెన్షన్లు ఇచ్చినందుకు, ముసలివారికి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పెన్షన్‌ను 10 రెట్లు పెంచినందుకు, రైతన్నలకు రైతుబంధు ఇచ్చినందుకు, రైతు భీమా ఇచ్చినందుకు, సాగునీటి ప్రాజెక్టులు కట్టి దేశంలోనే పంటల ఉత్పత్తిలో అగ్రస్థానంలో నిలిపినందుకు, తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసినందుకు కేసీఆర్‌ను శిక్షించాలా?' అని రేవంత్ రెడ్డిని కేటీఆర్ ప్రశ్నించారు.

Also Read: Polavaram Project: ఏపీ చేపట్టిన పోలవరం-నల్లమల్ల ప్రాజెక్టును అడ్డుకుంటాం: తెలంగాణ నీళ్ల మంత్రి

మూటలు మోసుడు తప్ప రేవంత్ రెడ్డికి ఏం తెలవదు. కేసీఆర్‌కు రేవంత్ రెడ్డి నీళ్ల గురించి పాఠాలు చెప్తాడు. గోదావరి ఎక్కడుందో రేవంత్‌కు తెలియదు. భాక్రా నంగల్ ప్రాజెక్టు తెలంగాణలో ఉందని చెబుతున్నాడు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండేళ్లు అయిపోయింది.. ఎలా ప్రజలను మోసం చేశారో ఆలోచించాలి' అని ప్రజలకు మాజీ మంత్రి కేటీఆర్‌ సూచించారు. రైతుల పరిస్థితులు ఎలా తయారయ్యాయో ఆలోచించాలని చెప్పారు. 'యూరియా కోసం చలిలో ఎదురు చూస్తున్నారు. ఎనకటి రోజులు తెస్తామని రేవంత్ రెడ్డి చెప్పారు.. అదే రాబందుల కాలం రేవంత్ రెడ్డి తెచ్చాడు. గ్రామాల్లో రేవంత్ రెడ్డిని నోటికొచ్చినట్లు తిడుతున్నారు' అని కేటీఆర్‌ వివరించారు.

Also Read: Retirement Age: ఉద్యోగుల రిటైర్మెంట్‌ వయస్సు 62 ఏళ్లకు పెంపు.. త్వరలో ఉత్తర్వులు

'వరంగల్ రైతు డిక్లరేషన్‌లో అడ్డగోలుగా హామీలు ఇచ్చి తెలంగాణ ప్రజలను రాహుల్ గాంధీ మోసం చేశాడు. ఎకరానికి రైతుబంధు రూ.15,000 ఇస్తా. రైతులతో పాటు కౌలుదారులకు రైతుబంధు ఇస్తా. ప్రతి పంటకు రూ.500 అదనపు బోనస్ చెల్లిస్తానని చెప్పి కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది' అని మాజీ మంత్రి కేటీఆర్‌ వివరించారు. మరి రాహుల్ గాంధీ అనే హౌలాగాడిని నడిబజార్‌లో ఉరి తీయాలని సంచలన వ్యాఖ్యలు చేశారు. 

'2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన రాహుల్ గాంధీ అనే హౌలాగాడి మాటలు విని ప్రతి ఒక్క విద్యార్థి ఇంటింటికి వెళ్లి కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయించారు. విద్యార్థులను, నిరుద్యోగులను మోసగారి మాటలతో రెచ్చగొట్టిన రాహుల్ గాంధీ అనే హౌలాగాడిని ఉరితీయాలి. ఆడబిడ్డలకు బతుకమ్మ చీర పెట్టే ముఖం లేని రేవంత్ రెడ్డి, ఆడబిడ్డలకు నెలకు రూ.2,500 ఇవ్వలేని రేవంత్ రెడ్డి కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేస్తానంటున్నాడు. కనీసం తులం బంగారం అయినా ఆడబిడ్డలకు ఇచ్చారా?' అని మాజీ మంత్రి కేటీఆర్‌ ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పాలనలో ఆడబిడ్డలు పుస్తెలతాడు తాకట్టు పెట్టి బతికే పరిస్థితి దాపురించిందని ఆవేదన వ్యక్తం చేశారు.

'ఎందుకు రేవంత్‌ రెడ్డి అంత పిచ్చిగా మాట్లాడుతున్నాడో ఎవరికీ అర్థం కావడం లేదు. రేవంత్ రెడ్డి తన సొంత సెక్యూరిటీ సిబ్బందిని కూడా ప్రజల ముందే కొడుతున్నాడు. అడ్డగోలుగా కోరుతున్నాడు, త్వరలో కరుస్తాడు కాబట్టి కట్టివేయమని రేవంత్ రెడ్డి భార్య గీతకు చెప్పినం' అని మాజీ మంత్రి కేటీఆర్‌ తెలిపారు. 'అధికారం వచ్చిన తర్వాత కూడా రేవంత్ రెడ్డికి ఇంకా ఏడుపు ఎందుకు? తల్లిదండ్రులు చదువుకోమని పంపిస్తే రేవంత్‌ రెడ్డి లంగా పనులు చేసుకుంటూ.. పెయింటింగులు వేసుకుంటూ చదువుకోలేదు. దానికి నేనేం చేయాలి?' అని కేటీఆర్‌ ప్రశ్నించారు.

'కేసీఆర్ చెప్పు ధూళికి రేవంత్ రెడ్డి సరిపోడు. కేసీఆర్ ఒక్క ప్రెస్‌మీట్‌కే ఆగమాగం అవుతున్నాడు. అసెంబ్లీకి వచ్చి మాట్లాడితే అసెంబ్లీలోనే గుండె ఆగి సస్తాడు' అని మాజీ మంత్రి కేటీఆర్‌ ఎద్దేవా చేశారు. కారు గుర్తు కనిపిస్తే కేసీఆర్‌ను మరోసారి ముఖ్యమంత్రి చేయాలనే ఆలోచనతోనే ఓటు వేసి గెలిపించుకుందామని ప్రజలకు పిలుపునిచ్చారు. కేసీఆర్ ఎప్పుడు ముఖ్యమంత్రి కావాలని ప్రజలు కసితో ఎదురుచూస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, తాటికొండ రాజయ్య, నన్నపనేని నరేందర్, బీఆర్ఎస్ పార్టీ నాయకుడు రాకేష్ రెడ్డి తదితరులు హాజరయ్యారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

.Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
comment0
Report
RKRavi Kumar Sargam
Jan 06, 2026 10:39:55
Hyderabad, Telangana:

Polavaram Nallamala Sagar Project: 'ప్రభుత్వాలు ఏవైనా వివాదాలేవైనా రాజ్యాంగం ఒక్కటే. రాజ్యాంగపరంగా ఏ పరిష్కారానికైనా సంస్థలను ఏర్పాటు చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాజ్యాంగపరంగా ఏర్టైన సంస్థలను, చట్టాలను నిర్వీర్యం చేస్తున్నాయి. చట్టాలకతీతంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పని చేస్తున్నాయి' అని మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టులో పోలవరం నల్లమల్ల సాగర్‌పై తెలంగాణ వేసిన పిటిషన్‌పై ఏపీ వాదనలు విచిత్రంగా ఉన్నాయని చెప్పారు. 'హైదరాబాద్ తెలంగాణకు ఉంది కదా? ఏపీ సాగునీటి ప్రాజెక్టులు కట్టుకోకూడదా? అని ఏపీ తరఫు అడ్వకేట్ ఎలా వాదిస్తారు? హైదరాబాద్ తెలంగాణలో ఉంటే ఏపీ ఏమైనా చేసుకోవచ్చా?' అని మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య ప్రశ్నించారు. సాగునీటి ప్రాజెక్టులపై ఏం చేయాలో విభజన చట్టంలో ఉందని గుర్తుచేశారు.

Also Read: Polavaram Project: ఏపీ చేపట్టిన పోలవరం-నల్లమల్ల ప్రాజెక్టును అడ్డుకుంటాం: తెలంగాణ నీళ్ల మంత్రి

హైదరాబాద్‌లోని బీఆర్‌ఎస్‌ పార్టీ ప్రధాన కార్యాలయం తెలంగాణ భవన్‌లో మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య కీలక ప్రసంగం చేశారు. 'ఏపీ చేపడుతున్న పోలవరం-నల్లమల సాగర్ విభజన చట్టంలో ఎక్కడ ఉంది? అని బీఆర్‌ఎస్‌ పార్టీ సీనియర్‌ నాయకులు పొన్నాల లక్ష్మయ్య నిలదీశారు.'కేంద్ర ప్రభుత్వం ఎలా కమిటీలు వేస్తుంది? పోలవరం నల్లమల సాగర్‌కు ఏ కేంద్ర ప్రభుత్వ సంస్థ అనుమతి లేనప్పుడు కమిటీలు ఎలా వేస్తారు? మీటింగ్‌కే వెళ్లబోమని చెప్పిన వారు కమిటీకి ఎలా అంగీకరిస్తారు? సుప్రీంకోర్టులో కేసు వేసిన తర్వాత కమిటీకి తెలంగాణ సభ్యుల పేర్లు ఎందుకు పంపింది? కమిటీ వేసుకున్నారు కోర్టుకు వచ్చారు అని నిన్న సుప్రీంకోర్టు తెలంగాణను ప్రశ్నించింది. ప్రజలు అవకాశం ఇచ్చారు. దానిని ప్రభుత్వాలు ఉపయోగించుకోవాలి. రాజ్యంగపరమైన ఇరిగేషన్ సంస్థలు ఉన్నాయి' అని వివరించారు.

Also Read: Harish Rao: ఫోన్‌ ట్యాపింగ్‌పై రేవంత్ రెడ్డికి బలమైన చెంపదెబ్బ: హరీశ్ రావు

'తెలంగాణ కృష్ణా, గోదావరి నదుల మధ్యలో ఉంది. తెలంగాణకు ఎత్తిపోతల పథకాలే శరణ్యం. సీమాంధ్ర పాలనలో తెలంగాణకు రావాల్సిన నీళ్లు రాలేవు. నీరు రాకుండా కుట్రలు చేశారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును నిర్లక్ష్యం చేస్తున్నారు. ఈ ప్రభుత్వం ప్రాజెక్టులపై చిల్లర రాజకీయం చేస్తోంది. ఒకవైపు నదీజలాల పంపిణీ కమిటీల ఏర్పాటు చేసుకొని.. మరో వైపు తెలంగాణ ప్రాజెక్టుల పనులు ఆపడం దౌర్భాగ్యం' అని ఆవేదన వ్యక్తం చేశారు. 'కేంద్రం ఒత్తిడిలకు రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం వంగుతోంది. ప్రభుత్వం క్షుణ్నంగా చట్టాలను చదివి ప్రాజెక్టులపై నిర్ణయం తీసుకోవాలి' అని మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య సూచించారు.

'పాలమూరు ప్రాజెక్టుపై ప్రభుత్వ వైఖరిని ఖండిస్తున్నా. అవగాహన లేకుండా పీపీటీ అసెంబ్లీలో పెట్టారు. కేసీఆర్ మాట్లాడిన ప్రశ్నలకు సమాధానం చెప్పారా? అసెంబ్లీకి కేసీఆర్ రావడం లేదని చిల్లరగా మాటాడుతున్నారు. ప్రాజెక్టులపై రేవంత్ రెడ్డి డాక్యుమెంట్లలోని పేరాగ్రాఫ్ విడిచిపెట్టి తనకు అనుకూలంగా ఉన్న వాటినే చదవడం దారుణం ఇదే నా సీఎం సంస్కారం?' అని మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య తెలిపారు. కేటీఆర్, హరీశ్‌ రావు ప్రశ్నలకు సమాధానం చెప్పాలని సవాల్‌ చేశారు. కేసీఆర్ రాజకీయ జీవితం ముందు రేవంత్ రెడ్డి ఎంత అని ఎద్దేవా చేశారు. కేసీఆర్‌పై అవాకులు చవాకులు మాట్లాడటం సిగ్గుచేటు అని మండిపడ్డారు. సాగునీటిపై ప్రభుత్వం తీరు చాలా బాధిస్తుంది. చట్టసభలు చట్టాలు చేయడానికి ఉన్నాయి. కానీ పంచాయతీలు పెట్టడానికి కాదు. రేవంత్ రెడ్డి రాజీనామా చేసినా సాగునీటిపై ఆయన చేసిన మోసాలను ప్రజలు క్షమించరు. అసెంబ్లీని అసెంబ్లీలాగా నడపడం లేదు' అని మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య విమర్శించారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

.Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
comment0
Report
DDDharmaraju Dhurishetty
Jan 06, 2026 09:07:19
Hyderabad, Telangana:

Samsung 236 Ltr Refrigerator Price Drop: ఎప్పటి నుంచో సాంసంగ్ రిఫ్రిజిరేటర్‌ను కొనుగోలు చేయాలనుకుంటున్నారా? ఇదే అద్భుతమైన అవకాశంగా భావించవచ్చు.. సాంసంగ్ 236 L ఫ్రాస్ట్ ఫ్రీ కన్వర్టబుల్ రిఫ్రిజిరేటర్ ఫ్లిప్‌కార్ట్‌ ఆఫర్స్‌లో చాలా తక్కువ ధరకే అందుబాటులో ఉంది. దీనిపై ఎన్నో రకాల స్పెషల్‌ ఆఫర్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా బిగ్ బచాట్ డేస్ సేల్‌లో భాగంగా దీనిని కొనుగోలు చేసేవారికి భారీ తగ్గింపు లభిస్తోంది. అయితే, ఈ ఆఫర్స్‌కి సంబంధించిన అన్ని రకాల వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం..

ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో సాంసంగ్ 236 L ఫ్రాస్ట్ ఫ్రీ కన్వర్టబుల్ రిఫ్రిజిరేటర్ RT28C3733S8/HL మోడల్ నెంబర్‌తో అందుబాటులోకి వచ్చింది. ఇక ఇది చాలా ప్రీమియం ఫీచర్స్‌తో లభిస్తోంది. దీనికి సంబంధించిన ఫీచర్స్‌ వివరాల్లోకి వెళితే.. ఈ ఫ్రిజ్‌కు చాలా ప్లస్ పాయింట్ ఏంటంటే.. 3-ఇన్-1 కన్వర్టిబుల్ సపోర్ట్‌ లభిస్తోంది. దీని వల్ల అవసరానికి తగినట్లుగా ఫ్రీజర్‌ను కూడా ఫ్రిజ్‌గా మార్చుకోవచ్చు. అంతేకాకుండా ఇందులో చాలా ప్రత్యేకమైన డిజిటల్ ఇన్వర్టర్ టెక్నాలజీ కూడా అందుబాటులో ఉంది. సాంసంగ్‌ కంపెనీ దీని కంప్రెషర్‌పై 20 ఏళ్ల వారంటీని కూడా అందిస్తోంది. ఇందులో చాలా ప్రత్యేకమైన డిజిటల్ డిస్ప్లే ఫీచర్‌ కూడా లభిస్తోంది. దీని వల్ల మీరు టెంపరేచర్ సెట్టింగ్‌లను కూడా సులభంగా మార్చుకోవచ్చు. 

అలాగే ఈ ఫ్రిజ్ చాలా రకాల ప్రత్యేకమైన ఫీచర్స్‌ను కలిగి ఉంటుంది. ఇందులో చాలా అద్భుతమైన పవర్‌ టెక్నాలజీ ఉంటుంది. దీని వల్ల  100V నుంచి 300V వోల్టేజ్ హెచ్చుతగ్గులు ఉన్నప్పటికీ తట్టుకోగలుగుతున్నట్లు కంపెనీ క్లైమ్‌ చేస్తోంది. దీంతో పాటు ఇందులో డోర్ అలారం ఫీచర్‌ కూడా ఉంది. దీని వల్ల ఫ్రిజ్ డోర్ సరిగ్గా వేయకపోయినా అలారం ద్వారా అలర్ట్‌ చేస్తుందని కంపెనీ తెలిపింది. ఇవేకాకుండా ఇందులో చాలా రకాల స్పెషల్‌ ఫీచర్స్‌ అందుబాటులో ఉన్నాయి. అయితే, ఇప్పుడు ఈ స్మార్ట్‌ ఫ్రిజ్‌పై ఫ్లిప్‌కార్ట్‌లో స్పెషల్‌ ఆఫర్స్‌ అందుబాటులో ఉన్నాయి. వీటన్నింటి వినియోగించి పేమెంట్ చేసేవారికి భారీ డిస్కౌంట్‌ లభిస్తుంది..

Also Read: Rahu Effect: ఏప్రిల్‌ వరకు రాహువు పవర్‌ఫుల్‌ ఎఫెక్ట్‌.. ఈ రాశులవారికి లక్కీ జాక్‌పాట్!

ఫ్లిప్‌కార్ట్‌ బిగ్ బచాట్ డేస్ సేల్‌ (Flipkart Big Bachat Sale Offers) ఆఫర్స్‌ వివరాల్లోకి వెళితే..ఈ ఫ్రిజ్ అసలు ధర (MRP) దాదాపు రూ.40,990 ఉండగా.. ఇప్పుడే ఈ సేల్‌లో భాగంగా కొనుగోలు చేసేవారికి రూ.25,490తో లభిస్తోంది. ఇక ఈ ఫ్రిజ్‌పై ఉన్న బ్యాంక్‌ ఆఫర్స్‌ వివరాల్లోకి వెళితే.. ఫ్లిప్‌కార్ట్‌ యాక్సిస్‌ బ్యాంక్‌, SBI క్రెడిట్‌ కార్డ్‌ను వినియోగించి పేమెంట్‌ చేసేవారికి దాదాపు రూ.2 వేల వరకు డిస్కౌంట్‌ లభిస్తుంది. ఇక HDFC, Axis, లేదా ICICI బ్యాంక్‌ క్రెడిట్ కార్డ్‌లను వినియోగించి పేమెంట్‌ చేసేవారికి రూ.1 వేయి వరకు డిస్కౌంట్‌ లభిస్తుంది. అలాగే ఎక్చేంజ్‌ ఆఫర్‌ వినియోగించే వారికి రూ.10 వేల వరకు బోనస్‌ కూడా లభిస్తుంది. దీంతో ఈ ఆఫర్స్‌ అన్ని పోనూ ఈ ఫ్రిజ్‌ కేవలం రూ. 17,200కే పొందవచ్చు. అయితే, ఈ బోనస్‌ అనేది పాత రిఫ్రిజిరేట్‌ కండీషన్‌ బట్టి ఆధారపడి ఉంటుంది. 

Also Read: Rahu Effect: ఏప్రిల్‌ వరకు రాహువు పవర్‌ఫుల్‌ ఎఫెక్ట్‌.. ఈ రాశులవారికి లక్కీ జాక్‌పాట్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
comment0
Report
DDDharmaraju Dhurishetty
Jan 06, 2026 05:11:53
Hyderabad, Telangana:

Lakshmi Narayana Yogam In Telugu: జనవరి నెలలోని కొనసాగుతున్న ఈ వారం చాలా శుభప్రదమైనదిగా భావించవచ్చు. ఎందుకంటే ధనుస్సు రాశిలో బుధుడితో పాటు శుక్రుడి కలయిక జరగబోతోంది. దీని కారణంగానే ఎంతో శక్తివంతమైన లక్ష్మీ నారాయణ యోగం ఏర్పడింది. అలాగే మరికొన్ని రాజయోగాలు కూడా ఏర్పడబోతున్నాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ సమయంలో కొన్ని రాశులవారికి వ్యాపారాల పరంగా మెరుగుదల కనిపిస్తుంది. అంతేకాకుండా బాకీ ఉన్న డబ్బులు కూడా తిరిగి పొందుతారు. అలాగే ఉద్యోగాలు చేసేవారికి పదోన్నతులు లభించి.. కొత్త ఆదాయం వనరులు కూడా లభిస్తాయి. దీంతో పాటు పెట్టుబడులు పెట్టడం కూడా చాలా అనుకూలమని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ముఖ్యంగా ఈ సమయంలో బుధుడితో పాటు శుక్రుడి సంయోగం కారణంగా ఈ కింది నాలుగు రాశులవారికి చాలా అద్భుతంగా ఉంటుంది. అయితే, ఈ సమయంలో అత్యంత శుభప్రభావం పొందే రాశులేవో ఇప్పుడు తెలుసుకుందాం..

ఈ రాశులవారికి బంపర్‌ జాక్‌పాట్:
మకర రాశి

లక్ష్మీ నారాయణ యోగంతో మకర రాశివారికి గణనీయమైన లాభాలు కలుగుతాయి. వీరికి ఆరోగ్యపరంగా అద్భుతమైన లాభాలు కలుగుతాయి. దీంతో పాటు  కొత్త ఆరోగ్యకరమైన రోజులు ప్రారంభమవుతాయి. ఈ సమయంలో ఎలాంటి ప్రయాణాలు చేసిన సానుకూల ఫలితాలు పొందుతారు. వీరు అద్భుతమైన విజయాలు సాధిస్తారు. ఈ సమయంలో పనుల్లో రిస్క్ తీసుకోవడం చాలా మంచిది. దీంతో పాటు కోరుకున్న ఆర్థిక ప్రయోజనాలు కూడా పొందుతారు. అలాగే ఆర్థిక పరిస్థితుల కాస్త మెరుగుపడినప్పటికీ.. ఖర్చులు విపరీతంగా పెరిగే ఛాన్స్‌లు ఉన్నాయి. అలాగే కుటుంబ సభ్యులతో ఆనందంగా కూడా ఉంటారు. ప్రయాణాలు చేసేవారు అద్భుతమైన లాభాలు పొందుతారు. ఇంట్లో ఒంటరిగా ఉన్న వ్యక్తులకు అద్భుతమైన లాభాలు కలుగుతాయి. 

మేష రాశి
మేష రాశివారికి నిలిపోయిన పనులు ఈ వారం ప్రారంభమవుతుతాయి. అంతేకాకుండా కెరీర్‌ పరంగా అద్భుతమైన లాభాలు కలుగుతాయి. అలాగే కోర్టు సంబంధిత కేసులు కూడా చాలా వరకు పరిష్కారమవుతాయి. ఈ వారం పెట్టుబడులు పెట్టడం వల్ల భారీ ప్రయోజనాలు కూడా పొందుతారు. అలాగే ఆర్థిక లాభాల కోసం ఈ సమయంలో ఎక్కువగా కష్టపడే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యం పరంగా కూడా బోలెడు లాభాలు కలుగుతాయి. దీంతో పాటు కుటుంబంలో ఘర్షణలు కూడా పెరుగుతాయి. దీంతో పాటు ఒంటరిగా ఉన్న వ్యక్తులకు అద్భుతమైన ప్రయోజనాలు కలుగొచ్చు. అలాగే వీరు ఈ సమయంలో తప్పకుండా కొన్ని రకాల శుభవార్తలు వింటారు. వీరు ఆనందంగా ఉండడమే కాకుండా శ్రేయస్సు కూడా పొందుతారు. 

Also Read: Rahu Effect: ఏప్రిల్‌ వరకు రాహువు పవర్‌ఫుల్‌ ఎఫెక్ట్‌.. ఈ రాశులవారికి లక్కీ జాక్‌పాట్!

కుంభ రాశి
ఎంతో శక్తివంతమైన లక్ష్మీ నారాయణ యోగం ప్రభావంతో ఆర్థిక పరిస్థితులు కూడా మెరుగుపడతాయి. ప్రేమ జీవితం ఈ సమయంలో శృంగారభరితంగా ఉంటుంది. అలాగే వివాహాలు కానివారికి ఈ సమయంలో వివాహాలు కూడా జరుగుతాయి. అంతేకాకుండా తీవ్ర సమస్యలు కూడా చాలా వరకు పరిష్కారమవుతాయి. అలాగే కొత్త ప్రాజెక్టుల్లో పనులు చాలా సులభంగా జరిగిపోతాయి. దీర్ఘకాలిక సమస్యలు కూడా దూరమవుతాయి. ఎప్పటి నుంచో అనుకుంటున్న పనులు ఈ సమయంలో చేసి.. అద్భుతమైన లాభాలు పొందుతారు. కెరీర్‌ పరంగా కూడా చాలా లాభాలు కలుగుతాయి. ఈ వారం చివరిలో మానసిక ప్రశాంతత కూడా లభిస్తుంది. కుటుంబంతో కలిసి టూర్స్‌కి వెళ్తారు. 

Also Read: Rahu Effect: ఏప్రిల్‌ వరకు రాహువు పవర్‌ఫుల్‌ ఎఫెక్ట్‌.. ఈ రాశులవారికి లక్కీ జాక్‌పాట్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
comment0
Report
DDDharmaraju Dhurishetty
Jan 06, 2026 05:10:41
Hyderabad, Telangana:

Rare Yellow Python Video Watch: నివాస ప్రాంతాల్లో తరచుగా పాముల సంచారం సాధారణ ప్రజలను ఎంతగానో భయాందోళనకు గురి చేస్తూ ఉంటుంది. గత కొన్ని ఏళ్ల నుంచి అడవుల్లో వివిధ కారణాలవల్ల వనరుల కోరత ఏర్పడడం వల్ల చాలా ప్రాణులు అడవుల నుంచి బయటికి వచ్చి జనాలు నివసించే ప్రాంతాల్లో సంచారం చేస్తున్నాయి. ఇందులో భాగంగానే పాములు కూడా జనాలు తిరిగే ప్రాంతాల్లో కనిపిస్తూ ఉన్నాయి. వీటిని పట్టుకోవడానికి కొంతమంది స్నేక్ క్యాచర్స్ క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు. ఇలా పట్టుకుంటున్న సందర్భంలో వీడియోను తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. తాజాగా పాత ఇంటి పైకప్పు కింద భాగంలో సంచారం చేస్తున్న భారీ కొండచిలువను పట్టుకునే క్రమంలో చోటు చేసుకున్న ఉత్కంఠ భరితమైన ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. 

ఈ వీడియోకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. ఓ గ్రామంలో నివాస ప్రాంతంలో గత కొద్ది రోజులుగా పెంపుడు కోళ్లతో పాటు, కుక్కలు, దూడలు మాయమవడం ప్రారంభమయ్యాయి. అయితే స్థానికులు దీనిని చూసి అడవి నుంచి గ్రామంలో పెద్ద అడవి జంతువు ఏదైనా సంచారం చేస్తూ.. చంపి ఆహారంగా తింటున్నావని అనుకున్నారు. కానీ పాత రేకుల షెడ్డు పైకప్పు పై భారీ కొండచిలువ కనిపించడంతో అక్కడున్న వారంతా ఆశ్చర్యపోయారు. ఆశ్చర్యపోయి స్నేక్ క్యాచర్స్ కి సమాచారం అందించారు. వెంటనే వారు రంగంలోకి దిగి రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు.

అయితే, ఆ గ్రామంలో సంచారం చేసిన పాము దాదాపు 9 మీటర్ల పొడవు ఉండడం.. పసుపు రంగులో ఉండడం మీరు ఈ వీడియోలో  కనిపించడం మీరు చూడొచ్చు. అంతేకాకుండా అరుదైన కొండచిలువ ఎంతో భయానకంగా కనిపిస్తోంది. ఇది మనిషి అంత లావుగా ఉండడం కూడా మీరు చూడొచ్చు. అయితే, పైకప్పుకు దగ్గరగా ఉన్న ప్రాంతంలో ఈ కొండచిలువ ఉండడంతో దానిని అక్కడి నుంచి బయటికి తీసుకువచ్చేందుకు చాలామంది శ్రమ పడటం మీరు ఈ వీడియోలో క్లియర్‌గా చూడొచ్చు. ఎంతో శ్రమపడి ఆ ప్రమాదకరమైన పాములు పైనుంచి కిందికి తీసుకువచ్చారు.

Also Read: King Cobra Video: ఏంగుండెరా వాడిది.. 20 అడుగుల కింగ్ కోబ్రాతో ఏంచేస్తున్నాడో తెలిస్తే షాక్.. వీడియో మీకోసం..

ఈ సమయంలో పాము తనని తాను రక్షించుకోవడానికి.. పై కప్పు కింద ఉన్న ఇనుప చట్కాలను చుట్టుకొని ఉండిపోయింది..  దీని కారణంగా వారు దానిని బయటికి తీసుకువచ్చేందుకు శ్రమ పడాల్సి వచ్చింది. అయితే, అతి కష్టం మీద దాని తోక పట్టుకొని లాగే ప్రయత్నాన్ని చేశారు. ఇలా నెమ్మదిగా ఆ పామును కిందికి తీసుకు వచ్చిన తర్వాత ఒక పెద్ద సంచిలో ఈ భారీ పామును బంధించడం మీరు చూడొచ్చు. ఇలా బంధించిన పామును సురక్షితమైన ప్రదేశానికి తీసుకువెళ్లి వదిలిపెట్టినట్లు తెలుస్తోంది. ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియోనే సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

Also Read: King Cobra Video: ఏంగుండెరా వాడిది.. 20 అడుగుల కింగ్ కోబ్రాతో ఏంచేస్తున్నాడో తెలిస్తే షాక్.. వీడియో మీకోసం..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
comment0
Report
HDHarish Darla
Jan 05, 2026 17:04:17
Hyderabad, Telangana:

Sankranti 2026 Holidays In Telangana: తెలంగాణలోని స్కూళ్లకు సంక్రాంతి సెలవులపై విద్యాశాఖ కీలక ప్రకటన చేసింది. జనవరి 10 నుంచి జనవరి 16 వరకు సంక్రాంతి సెలవులను ప్రకటిస్తూ..సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఆప్షన్ హాలీడే వినియోగించుకుంటే ఏకంగా 9 రోజుల పాటు సంక్రాంతి సెలవులను విద్యార్థులు ఎంజాయ్ చేయోచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం. 

9 రోజులు సంక్రాంతి సెలవులు..
జనవరి 10న రెండో శనివారంతో పాటు ఆ తర్వాత జనవరి 11న ఆదివారం కారణంగా సెలవు ఉండడం వల్ల సెలవులను జనవరి 10 నుంచే ప్రారంభం అయ్యేలా ప్రభుత్వం ప్రకటన చేసింది. దీంతో జనవరి 10 నుంచి జనవరి 16 సంక్రాంతి సెలవులను ప్రకటించింది. 

అయితే జనవరి 17న శనివారం రోజున ఆప్షన్ హాలీడే ఇస్తే.. జనవరి 18న ఆదివారం కావడం వల్ల మరో సెలవులు కలిసి వస్తుంది. దీంతో శనివారం ఆప్షన్ హాలీడే వినియోగిస్తే.. ఏకంగా 9 రోజుల పాటు స్కూళ్లకు సెలవులు రానున్నాయి. అయితే ఆప్షన్ హాలీడే అనేది ఆయా పాఠశాల యాజమాన్య నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. 

స్కూల్స్ రీ-ఓపెన్..
కానీ, తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ జారీ చేసిన ఉత్తర్వుల ద్వారా అధికారికంగా జనవరి 17న పాఠశాలలు తెరవాల్సి ఉంది. అయితే జనవరి 17న శనివారం ఆ తర్వాత ఆదివారం కారణంగా సెలవు కలిసి వస్తుండడం వల్ల శనివారం ఆప్షన్ హాలీడే గురించి ఎక్కువగా ఆలోచించే అవకాశం ఉంది. ఒకవేళ శనివారం (జనవరి 17) వ్యక్తిగతంగా సెలవు తీసుకుంటే విద్యార్థులకు 9 రోజుల పాటు సెలవు వచ్చినట్లు ఉంటుంది.

జనవరి అంటేనే సెలవుల మాసం!
ఈ ఏడాది జనవరి నెల విద్యార్థులకు అసలైన పండుగను తీసుకువచ్చింది. జనవరి 1 (న్యూ ఇయిర్), సంక్రాంతికి 9 రోజులు, జనవరి 26 (గణతంత్ర దినోత్సవం)తో పాటు నెలలో 4 ఆదివారాలు, ఒక రెండో శనివారం వంటి వాటితో కలుపుకొని జనవరి నెలలో ఏకంగా 16 రోజులు పాఠశాలలు మూతపడే అవకాశం ఉంది. అంటే సగానికి పైగా రోజులు విద్యార్థులు ఇంటి వద్దే గడపవచ్చు.

ప్రయాణాలు - జాగ్రత్తలు
సెలవులు భారీగా ఉండటంతో హైదరాబాద్ నగరం నుంచి స్వగ్రామాలకు వెళ్లే వారి సంఖ్య పెరిగింది. ఆంధ్రప్రదేశ్ సరిహద్దు ప్రాంతాలు, జాతీయ రహదారులపై ట్రాఫిక్ విపరీతంగా పెరిగే అవకాశం ఉంది. ప్రయాణికుల కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులు, రైల్వే శాఖ ప్రత్యేక రైళ్లను నడుపుతున్నాయి.

విద్యార్థులకు సూచనలు..
పండుగ అంటే కేవలం ఆటలే కాదు, ప్రాణ రక్షణ కూడా ముఖ్యం. గాలిపటాలు ఎగురవేసేటప్పుడు మేడల మీద, రోడ్ల మీద అప్రమత్తంగా ఉండాలి. విద్యుత్ తీగలకు దూరంగా ఉండాలి. నదులు లేదా చెరువుల్లో స్నానాలకు వెళ్లేటప్పుడు పెద్దల పర్యవేక్షణ తప్పనిసరి. సెలవుల ఎంజాయ్‌మెంట్‌తో పాటు అకడమిక్ క్యాలెండర్ దెబ్బతినకుండా ఉపాధ్యాయులు ఇచ్చిన హోం వర్క్ పూర్తి చేయాలి.

Also Read: School Holiday: రేపు సోమవారం స్కూళ్లకు సెలవు..ఆదేశాలు జారీ చేసిన ప్రభుత్వం..విద్యార్థులు ఫుల్ ఖుషీ!

Also Read: Mana Shankara Vara Prasad Trailer: 'మన శంకరవరప్రసాద్' ట్రైలర్ వచ్చేసింది! సంక్రాంతి మెగా ధమాకా..బాక్సాఫీస్ కుమ్ముడే!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
Advertisement
Back to top