భద్రాద్రి కొత్తగూడెం:ఏసీబీ వలలో అవినీతి చేప
Mahabubabad, Telangana:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్లో ఏసీబీ అధికారులు రైడ్ చేసారు. ఈ రైడ్ లో రూ. లక్ష 14 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి హార్టికల్చర్ అధికారి సూర్యనారాయణ రెడ్ హ్యాండెండ్ గా పట్టుపడ్డారు. సూర్యనారాయణను అదుపులోకి తీసుకున్న ఏసిబి డిఎస్పి వై.రమేష్ విచారణను కొనసాగిస్తున్నారు. డ్రిప్ ఇరిగేషన్ కు సంబందించి సబ్సిడీ పొందేందుకు సర్టిఫై చేయడం కోసం లంచం డిమాండ్ చేసాడు.हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
CM Revanth Reddy Resolution: "21 ఏళ్లకే అసెంబ్లీ, పార్లమెంట్‌కు పోటీ చేసేలా చర్యలు" సీఎం రేవంత్ కీలక నిర్ణయం!
Hyderabad, Telangana:CM Revanth Reddy 21-Age Resolution: 'కమిటీ కుర్రాళ్లు' సినిమాలో చూపించినట్లుగా, ప్రస్తుత జెన్-జీ (Gen-Z) యువత రాజకీయాల్లో చురుగ్గా పాల్గొనేందుకు ఆసక్తి చూపుతోంది. ఇదే కోవలో ఇటీవల కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలు యువతలో కొత్త జోష్ నింపాయి. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన ఒక ప్రతిపాదన రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. పార్లమెంట్ లేదా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ప్రస్తుతం ఉన్న 25 ఏళ్ల కనీస వయస్సు నిబంధనను 21 ఏళ్లకు తగ్గించాలని ఆయన కోరారు. మరి రీల్లో మాదిరిగా రియల్‌గా ఇది సాధ్యమేనా? ఈ విశ్లేషణ ద్వారా తెలుసుకుందాం.Jai Yuva: జెన్‌జీ ఉద్యమం వేళ రేవంత్ రెడ్డి సరికొత్త నినాదం.. జై యువ అని జోడింపు
Hyderabad, Telangana:Jai Yuva Slogan: దేశ భవిష్యత్తు నిర్మాణంలో యువతను మరింత భాగస్వాములను చేయాల్సిన అవసరం ఉందని తెలంగాణ సీఎం ప్రకటించారు. శాసనసభలు, లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే కనిష్ఠ వయో పరిమితిని 25 ఏళ్ల నుంచి 21 ఏళ్లకు తగ్గించేలా రాజ్యాంగ సవరణ చేపట్టాలని ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదన చేశారు. ఈ క్రమంలోనే జై జవాన్.. జై కిసాన్‌కు తోడు జై యువ అనే నూతన నినాదాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి ప్రతిపాదించారు.
హైదరాబాద్‌లో జాతీయ మీడియా ప్రతినిధులతో జరిగిన సమావేశంలో తెలంగాణ ముఖ్యమంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. యువశక్తే దేశ భవిష్యత్తుకు పునాదిగా నిలుస్తుందని ప్రకటించారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ రంగాల్లో నాయకత్వ సామర్థ్యాన్ని ప్రదర్శిస్తున్న యువతకు, అదే స్థాయిలో రాజకీయ వ్యవస్థలోనూ అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఇటీవల నిర్వహించిన సీబీఎస్ఈ, నీట్, నెట్ తదితర జాతీయ స్థాయి పరీక్షల నిర్వహణలో తలెత్తిన సమస్యలపై ఆందోళన వ్యక్తం చేశారు.
పోటీ పరీక్షలు, ప్రవేశ పరీక్షలపై విద్యార్థులు, వారి కుటుంబాల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని తెలంగాణ సీఎం కోరారు. నీట్ పేపర్ లీక్ అంశంపై జరిగిన ఆందోళనల సందర్భంగా విద్యార్థులపై నమోదైన కేసులను సమీక్షించడంతోపాటు నష్టపోయిన కుటుంబాలకు అవసరమైన సహాయం అందించాలని విజ్ఞప్తి చేశారు. నేటి యువత 21 ఏళ్ల వయస్సులోనే ఐఏఎస్, ఐపీఎస్ అధికారులుగా సేవలందిస్తోందని గుర్తుచేశారు.
స్థానిక సంస్థల్లో ప్రజాప్రతినిధులుగా యంగ్ యువత బాధ్యతలు నిర్వహిస్తోందని.. ప్రపంచస్థాయి సంస్థలకు నాయకత్వం వహిస్తోందని ముఖ్యమంత్రి వెల్లడించారు. సాంకేతిక, పరిపాలనా, వ్యాపార రంగాల్లో తమ ప్రతిభను చాటుతున్న యువతకు చట్టసభల్లోనూ తగిన ప్రాతినిధ్యం కల్పించాల్సిన అవసరం ఉందని గుర్తుచేశారు. 61వ రాజ్యాంగ సవరణ ద్వారా ఓటు హక్కు వయస్సును 21 నుంచి 18 ఏళ్లకు, 73వ, 74వ రాజ్యాంగ సవరణల ద్వారా స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే కనిష్ఠ వయస్సును 21 ఏళ్లకు సవరించిన విషయాన్ని తెలంగాణ సీఎం గుర్తుచేశారు.
అదే స్ఫూర్తితో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే కనిష్ఠ వయస్సును 25 నుంచి 21 ఏళ్లకు, శాసనమండలి, రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేసే కనిష్ఠ వయస్సును 30 నుంచి 25 ఏళ్లకు తగ్గించాలని తెలంగాణ సీఎం సరికొత్త ప్రతిపాదన చేశారు. ఈ అంశంపై సమగ్ర చర్చ నిర్వహించేందుకు ఆగస్టులో తెలంగాణ శాసనసభ, శాసనమండలి సంయుక్త సమావేశాన్ని నిర్వహించనున్నట్లు ప్రకటించారు. అన్ని రాజకీయ పార్టీల అభిప్రాయాలు స్వీకరించిన అనంతరం పోటీ వయోపరిమితి తగ్గింపును కోరుతూ అధికారిక తీర్మానాన్ని ఆమోదిస్తామని వెల్లడించారు. ఆ తీర్మానాన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపనున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. నియోజకవర్గాల పునర్విభజన, పార్లమెంట్ సీట్ల పెంపు, మహిళా రిజర్వేషన్ వంటి అంశాలతో పాటు ఎన్నికల్లో పోటీ చేసే కనిష్ఠ వయోపరిమితి తగ్గింపు అంశాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం పరిశీలించాలని ముఖ్యమంత్రి సూచించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో యువత పాత్రను మరింత విస్తరించడం దేశ భవిష్యత్తుకు అవసరమని గుర్తుచేశారు.
Siddharamaiah Retirement: రాజకీయాలకు కర్ణాటక మాజీ సీఎం సిద్ధరామయ్య గుడ్‌బై..రాజీనామాతో అసంతృప్తి!
Hyderabad, Telangana:Siddaramaiah Retirement News: కర్ణాటక రాజకీయాల్లో ఊహించని కీలక పరిణామం చోటుచేసుకుంది. ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోయిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సిద్ధరామయ్య కీలక ప్రకటన చేశారు. ఇక తాను ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటానని ప్రకటించారు. 2028లో కర్ణాటకలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీ చేయబోనని సిద్ధరామయ్య ప్రకటన చేయడం చర్చనీయాంశంగా మారింది. వయసు మీద పడడం, ఆరోగ్యంతోపాటు అవినీతి రాజకీయాలు పెరిగిపోతుండటం కారణంగా తాను ఇక ఎన్నికల్లో పోటీ చేయనని సిద్ధరామయ్య నిర్ణయం తీసుకున్నారు.IND vs ZIM: సొంతగడ్డపై జింబాబ్వే బోల్తా.. వైభవ్ పవర్ హిట్టింగ్తో టీమిండియా క్లీన్‌స్వీప్
Harare, Harare Province:India Whitewash: టీ20 ప్రపంచకప్ తర్వాత జరిగిన ఐర్లాండ్, ఇంగ్లాండ్ చేతిలో వైటావాష్కు గురయిన భారత జట్టు జింబాబ్వేపై ఆ కసినంతా తీర్చుకున్నట్టు కనిపిస్తోంది. మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను భారత్ పూర్తి ఆధిపత్యం ప్రదర్శించి జింబాబ్వేకు సొంత గడ్డపైనే పరువుపోయేలా చేసింది. వైభవ్ విధ్వంసక ఇన్నింగ్స్‌తో చివరి మ్యాచ్‌లోనూ భారత్ విజయం సాధించింది. మూడు మ్యాచ్‌లను సొంతం చేసుకున్న భారత్ విమర్శకులకు వైట్‌వాష్‌తో సమాధానం ఇచ్చింది.
టాస్ గెలిచి మొదట బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టు నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. బేబీ బాస్ వైభవ్ సూర్యవంశీ మరోసారి బ్యాట్‌తో దుమ్మురేపాడు. ఐపీఎల్ తరహాలో ఆడి 49 బంతుల్లో 81 పరుగులు చేశాడు. తనదైన శైలిలో ఆడుతూ విధ్వంసం సృష్టించాడు. జింబాబ్వే బౌలర్లను ఉతికేస్తూ అంతర్జాతీయ టీ20ల్లో రెండో అర్ధ శతకం నమోదు చేశాడు. 8 ఫోర్లు, నాలుగు సిక్సర్లు బాదిన వైభవ్ కొంత దూకుడు తగ్గించి ఆడాడు. అభిషేక్ శర్మ (2) వరుసగా మూడో మ్యాచ్‌లోనూ తీవ్ర నిరాశపర్చగా.. ఇషాన్ కిషన్ (29), కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ (27) పర్వాలేదనిపించారు. రింకూ సింగ్ (25) కొంత స్కోర్ చేయగా.. తిలక్ వర్మ 11 పరుగులు తీసి నాటౌట్‌గా నిలిచాడు.
PM Modi Nandan Nilekani: పరీక్షల నిర్వహణపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం..స్పెషల్ టాస్క్‌ఫోర్స్ సిద్ధం చేసిన ప్రధాని మోదీ!
New Delhi, Delhi:PM Modi Nandan Nilekani News: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ (NEET) పేపర్ లీక్ వివాదం, ఆందోళనల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో పరీక్షా విధానాన్ని ప్రక్షాళన చేసేందుకు ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నందన్ నీలేకని నేతృత్వంలో ఒక 'అత్యున్నత స్థాయి టాస్క్ ఫోర్స్'ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు.
ప్రధాని మోదీ ప్రకటన వెనుక నేపథ్యం
నీట్ యూజీ పరీక్షల్లో జరిగిన అక్రమాలు, నిరసనల పర్వం నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరుగుతున్న ఆందోళనల నేపథ్యంలో, ఆదివారం నాడు ప్రధాని మోదీ తన 'X' (ట్విట్టర్) ఖాతా ద్వారా ప్రజలతో వీడియో సందేశం ద్వారా ఈ వివరాలను పంచుకున్నారు.
పేపర్ లీక్‌లను అరికట్టేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోందని, ఇందులో భాగంగా ఇప్పటికే ఫాస్ట్-ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేశామని ప్రధాని వెల్లడించారు. పరీక్షా విధానం మరింత విశ్వసనీయంగా, పారదర్శకంగా మారేందుకు, టెక్నాలజీని గరిష్టంగా వినియోగించుకునే దిశగా ఈ టాస్క్ ఫోర్స్ పనిచేస్తుందని ఆయన స్పష్టం చేశారు. అయితే, ఈ కమిటీలో ఇతర సభ్యులు గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
టాస్క్‌ఫోర్స్‌లోని ప్రముఖ సభ్యులు..
1) నందన్ నీలేకని - సాంకేతిక నిపుణుడు
2) ఎస్. సోమనాథ్ - మాజీ ఇస్రో చైర్మన్
3) తపన్ డేకా - మాజీ ఐబీ (ఇంటెలిజెన్స్ బ్యూరో) డైరెక్టర్
4) వి.కామకోటి - ఐఐటీ మద్రాస్ డైరెక్టర్
5) అనితా కర్వాల్ - మాజీ విద్యాశాఖ కార్యదర్శి
6) అమృత్ లాల్ మీనా - లాజిస్టిక్స్ నిపుణుడు
'జెన్-Z' యువతతో ప్రధాని మోదీ మమేకం
నీట్ పేపర్ లీక్ వివాదం నడుమ యువతతో, ముఖ్యంగా 'జెన్-Z' (నేటి తరం యువత)తో కనెక్ట్ అయ్యేందుకు ప్రధాని మోదీ వరుస వీడియోలను విడుదల చేయడం గమనార్హం. జూలై 23న విడుదల చేసిన తొలి వీడియోలో పేపర్ లీక్‌లపై కఠిన చట్టాలు తెస్తామని హామీ ఇచ్చారు. విద్యార్థులు పడుతున్న వేదన తనకు తెలుసని పేర్కొంటూ, సోమవారం పార్లమెంటులో సరికొత్త బిల్లును ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు.
పబ్లిక్ పరీక్షల సవరణ బిల్లు ప్రత్యేకతలు..
సోమవారం పార్లమెంటు ముందుకు రానున్న 'పబ్లిక్ పరీక్షల (అక్రమ పద్ధతుల నివారణ) సవరణ బిల్లు' ప్రకారం కఠిన శిక్షలు అమలవుతాయి. ప్రశ్నపత్రం లీక్ ఘటనలకు సంబంధించిన విచారణలను కేవలం రెండు నెలల్లోపు పూర్తి చేయాల్సి ఉంటుంది.
అదే విధంగా పరీక్షల్లో లీకేజీలు లేదా అక్రమాలకు పాల్పడితే కనీసం 5 ఏళ్ల నుంచి గరిష్టంగా 10 ఏళ్ల జైలు శిక్ష, రూ.50 లక్షల వరకు జరిమానా విధిస్తారు. ఇటువంటి ఘటనలు వ్యవస్థీకృత నేరాలుగా తేలితే.. కనీసం ఏడేళ్ల జైలు శిక్ష, రూ.10 కోట్ల వరకు జరిమానా విధించాలని ఈ బిల్లు ప్రతిపాదిస్తోంది.
Also Read: కేంద్ర ప్రభుత్వానికి మరో నిరసన సెగ..E20 పెట్రోల్‌పై జూలై 31న రాజధానిలో భారీ ర్యాలీ!
Also Read: కొత్త విద్యాశాఖ మంత్రి ఇతనే..కేంద్రమంత్రికి ప్రహ్లాద్ జోషికి అదనపు బాధ్యతలు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Fatty Liver Drink: లివర్ ఆరోగ్యానికి అద్భుతమైన ఔషధం..ఫ్యాటీ లివర్‌కు చెక్ పెట్టే ఇంటి చిట్కా!
Hyderabad, Telangana:Fatty Liver Healthy Drink: మానవ శరీరంలో అత్యంత కీలకమైన అవయవాల్లో కాలేయం ఒకటి. దీని పనితీరు మందగిస్తే ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతిని ప్రాణాలకే ముప్పు వాటిల్లే అవకాశం ఉంది. అయితే మారిన ఆధునిక ఆహారపు అలవాట్లు, జీవనశైలి కారణంగా నేడు చాలా మందిలో కాలేయ కణాలలో కొవ్వు పేరుకుపోయి 'ఫ్యాటీ లివర్' సమస్య బారిన పడుతున్నారు. ఈ సమస్యను నివారించి, కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో 'పచ్చి పసుపు' ఒక అద్భుతమైన సూపర్ హెర్బ్లా పనిచేస్తుంది. పసుపులో లభించే 'కర్కుమిన్' అనే బయోయాక్టివ్ సమ్మేళనం కాలేయానికి ఏ విధంగా మేలు చేస్తుందో ఇక్కడ తెలుసుకుందాం.
కాలేయానికి పచ్చి పసుపు కలిగించే ముఖ్యమైన ప్రయోజనాలు..
కొవ్వును కరిగిస్తుంది: పసుపులోని కర్కుమిన్ కాలేయంలో పేరుకుపోయిన అనవసరమైన కొవ్వును (ముఖ్యంగా ట్రాన్స్ ఫ్యాట్) కరిగించడంలో ఎంతో సహాయపడుతుంది. ఇది లిపిడ్ జీవక్రియను మెరుగుపరిచి, ఫ్యాటీ లివర్ లక్షణాలను తగ్గిస్తుంది.
వాపు, ఆక్సీకరణ ఒత్తిడి నివారణ: పసుపునకు సహజంగానే శక్తివంతమైన శోథ నిరోధక, యాంటీఆక్సిడెంట్ గుణాలు ఉంటాయి. ఇవి కాలేయ వాపును తగ్గించడంతో పాటు, కణాలను దెబ్బతీసే ఫ్రీ రాడికల్స్‌ను సమర్థవంతంగా అడ్డుకుంటాయి.
కాలేయ ఎంజైమ్‌ల నియంత్రణ: కాలేయం దెబ్బతిన్నప్పుడు హెచ్చుతగ్గులకు గురయ్యే ALT, AST వంటి కాలేయ ఎంజైమ్‌ల స్థాయిలను పసుపు క్రమబద్ధీకరిస్తుంది. తద్వారా లివర్ పనితీరు మెరుగవుతుంది.
నేచురల్ డిటాక్సిఫికేషన్: పచ్చి పసుపు రక్తంలోని విషతుల్యాలను తొలగించి, కాలేయాన్ని శుభ్రపరిచే నేచురల్ క్లెన్సర్‌గా పనిచేస్తుంది. అలాగే ఇది శరీరంలో ఇన్సులిన్ సెన్సిటివిటీని కూడా పెంచుతుంది.
పచ్చి పసుపును ఏ విధంగా తీసుకోవాలి?
కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుకుని, డిటాక్స్ చేయడానికి 'పచ్చి పసుపు నీరు' అత్యుత్తమ మార్గంగా నిపుణులు చెబుతున్నారు. దాన్ని ఎలా తయారు చేసుకోవాలంటే..ముందుగా తాజా పచ్చి పసుపు కొమ్మును తీసుకుని శుభ్రంగా కడిగి, మెత్తగా నూరాలి లేదా తురుముకోవాలి. ఈ పసుపు తురుమును ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో కలపాలి. రుచి కోసం ఇందులో కొద్దిగా తేనె లేదా నిమ్మరసం కలుపుకోవచ్చు.
ఈ ఆరోగ్యకరమైన పానీయాన్ని ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో తీసుకోవడం ద్వారా కాలేయం పనితీరు మెరుగుపడటంతో పాటు అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు.
(గమనిక: పైన పేర్కొన్న సమాచారం కేవలం కొన్ని ఆరోగ్య నివేదికల ద్వారా పేర్కొన్నాము. దీన్ని పాటించే ముందు సంబంధిత వైద్య నిపుణుడ్ని సంప్రదించడం మేలు. దీన్ని జీ తెలుగు న్యూస్ ధ్రువీకరించడం లేదు.)
Also Read: Weight Loss Tips: వాకింగ్ Vs రన్నింగ్..ఫాస్ట్‌గా బరువు తగ్గాలంటే ఏది బెస్ట్?
Also Read: Gastric Home Remedies: ఏళ్ల తరబడి ఎసిడిటీతో బాధపడుతున్నారా? ఇది చేయండి!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
T Jeevan Reddy: ధర్మేంద్ర ప్రదాన్‌కు పట్టిన గతే రేవంత్ రెడ్డికి పడుతుంది: జీవన్ రెడ్డి
Raikal, Jagtial, Telangana:Jeevan Reddy vs Revanth Reddy: రైతుల విషయంలో రేవంత్ రెడ్డి మాటలు వింటూ ఉంటే కేంద్రంలో ధర్మేంద్ర ప్రధాన్ పరిస్థితే వారికి కూడా పడుతుందని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాటిపర్తి జీవన్ రెడ్డి తెలిపారు. వరి నాట్లు వేసే సమయం దాటిపోయాక ఇప్పుడు ఆరుతడి పంటలు వేయాలనడం విడ్డూరంగా ఉందని కాంగ్రెస్ ప్రభుత్వ తీరును మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఎండగట్టారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో 24 గంటల విద్యుత్ అందిస్తే.. నేడు సాయంత్రం పూట కరెంట్ కోతలు మొదలయ్యాయని, బావుల్లో నీళ్లు అడుగంటి రైతులు అల్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డతో సంబంధం లేకుండా కన్నెపల్లి పంప్‌హౌస్ వద్ద కేవలం రూ10 కోట్ల ఖర్చుతో కాపర్ డ్యామ్ నిర్మిస్తే 15 రోజుల్లో నీటి సమస్య తీరుతుందని సూచించారు.
జగిత్యాల జిల్లా రాయికల్‌లో ఆదివారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనా తీరుపై బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితి కాలం తెచ్చిన కరువు కాదని.. రేవంత్ రెడ్డి మార్క్ పాలన తెచ్చిన కృత్రిమ కరువు అని తెలిపారు. జగన్నాథ్‌పూర్ - బోర్నపల్లి బ్రిడ్జి నిర్మాణం విషయంలో కాంగ్రెస్ పార్టీ నాయకుల నడుమ సమన్వయం లేదని చెప్పారు. స్థానిక మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ రూ.17.50 కోట్లతో తొలి సంతకం చేసి టెండర్లు కూడా పూర్తి చేస్తే.. ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ మళ్లీ కేంద్ర గిరిజన శాఖకు ప్రతిపాదనలు పంపడం ఏమిటని ప్రశ్నించారు.
పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యే సంజయ్ కుమార్‌కి తమ కాంగ్రెస్ ప్రభుత్వంపై, మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌పై నమ్మకం లేదా అని మాజీ మంత్రి జీవన్ రెడ్డి నిలదీశారు. టెండర్లు పూర్తయినా పనులు ఎందుకు ప్రారంభించడం లేదని, రామాజీపేట్, మైతాపూర్ వంతెనల అప్రోచ్ రోడ్ల విషయంలో డిపార్ట్మెంట్ నిర్లక్ష్యం వహిస్తోందని కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆవేదన వ్యక్తం చేశారు. ఎల్‌నినో హెచ్చరికలు ఉన్నా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ముందస్తు నివారణ చర్యలు తీసుకోలేదని విమర్శించారు.
పోలవరం వద్ద నీ గురువు చంద్రబాబు కాపర్ డ్యామ్ కట్టలేదా అని రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి జీవన్ రెడ్డి గుర్తుచేశారు. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆ దిశగా ఎందుకు ఆలోచించడం లేదని నిలదీశారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావులకు స్వతంత్రంగా వ్యవహరించే స్వేచ్ఛ లేదని.. రేవంత్ రెడ్డి మాటలు వింటూ ఉంటే కేంద్రంలో ధర్మేంద్ర ప్రధాన్ పరిస్థితే వారికి కూడా పడుతుందని చురకలు అంటించారు.
ధాన్యం సేకరణ, ఉచిత విద్యుత్, నీటి యాజమాన్యంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాటిపర్తి జీవన్ రెడ్డి విమర్శించారు. రైతుల సహనాన్ని పరీక్షించవద్దని కాంగ్రెస్ ప్రభుత్వానికి హెచ్చరించారు. పంజాబ్, హర్యానా రైతుల తరహాలోనే తెలంగాణ రైతులు కూడా ఉద్యమించే రోజులు దగ్గరలోనే ఉన్నాయని మాజీ మంత్రి జీవన్ రెడ్డి తెలిపారు.
Puri Jagannadh Mother: డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఇంట తీవ్ర విషాదం..కూతురు పవిత్ర ఎమోషనల్ పోస్ట్!
Hyderabad, Telangana:Puri Jagannadh Mother Passed Away: టాలీవుడ్ డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఇంట్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. దర్శకుడు పూరి జగన్నాథ్ తల్లి (అమ్మాజీ) కన్నుమూశారు. ఈ విషాదకర వార్తను పూరి కూతురు పవిత్ర సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు.
పవిత్ర ఎమోషనల్ పోస్ట్
శనివారం (జూలై 25) నాడు తన నానమ్మ మరణించినట్లు ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ ద్వారా పవిత్ర వెల్లడించారు. ఆ పోస్ట్ లో.. "ఇప్పుడు నన్నెవరు చిన్నతల్లి అని పిలుస్తారు? ప్రేమగా నన్నెవరు ముద్దుపెట్టుకుంటారు? నీతో మరోరోజు గడిపే అవకాశమొస్తే బాగుండు. నీ 96వ పుట్టినరోజున ఇచ్చినట్లు పెద్ద హగ్ ఇస్తా. ఐ మిస్ యూ నానమ్మ" అని పోస్ట్ పెట్టింది.
ఇలా ఆమె రాసుకొచ్చిన భావోద్వేగ నోట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వార్త తెలిసిన పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు పూరి కుటుంబానికి తమ ప్రగాష్ట సానుభూతి, సంఘీభావం తెలుపుతున్నారు.
పూరి జగన్నాథ్ సినిమాల ప్రస్థానం
ఒకప్పుడు టాలీవుడ్లో టాప్ డైరెక్టర్‌గా అనేక బ్లాక్‌బస్టర్ హిట్లు అందించిన పూరి జగన్నాథ్ కెరీర్ పరిశీలిస్తే.. 'ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం', 'బద్రి', 'ఇడియట్', 'అమ్మానాన్న ఓ తమిళ అమ్మాయి', 'శివమణి', 'పోకిరి', 'దేశముదురు', 'బిజినెస్ మెన్', 'టెంపర్' వంటి ఎన్నో అద్భుతమైన సినిమాలను తెరకెక్కించారు. అయితే గత కొంతకాలంగా ఆయనకు సరైన విజయాలు దక్కలేదు. 'ఇస్మార్ట్ శంకర్' మినహా మిగిలిన చిత్రాలు ఆశించిన స్థాయిలో రాణించలేదు.
ప్రస్తుతం పూరి జగన్నాథ్ టాలెంటెడ్ యాక్టర్ విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో 'స్లమ్ డాగ్ 33 టెంపుల్ రోడ్' అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో టబు, విజయ్ కుమార్, బ్రహ్మాజీ, వీటీవీ గణేష్ కీలక పాత్రలు పోషిస్తుండగా.. నేషనల్ అవార్డ్ విన్నర్ హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్నారు. పూరి కనెక్ట్స్, జెబి మోషన్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది.
ALso Read: మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్‌కు మరోసారి సర్జరీ..కోయంబత్తూరుకు వెళ్లిన మెగా ఫ్యామిలీ!
Also REad: "విద్యార్థులతో పాటు నిరసన చేయడానికి డబ్బులిస్తున్నారు" నటి ఆకాంక్ష సంచలన కామెంట్స్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
E20 Fuel Protest: కేంద్ర ప్రభుత్వానికి మరో నిరసన సెగ..E20 పెట్రోల్‌పై జూలై 31న రాజధానిలో భారీ ర్యాలీ!
New Delhi, Delhi:Delhi E20 Petrol Protest: దేశంలో మారుతున్న ఇంధన విధానాలు, వినియోగదారుల ఎంపిక హక్కుల పరిరక్షణ కోసం 'టీమ్ భారత్' (Team Bharat) సంస్థ శాంతియుత ఆందోళనకు పిలుపునిచ్చింది. ఈనెల 31న ఢిల్లీలో 'గాడీ మార్చ్, గాంధీ మార్చ్' పేరుతో భారీ శాంతియుత వాహన ర్యాలీ నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఇండియా గేట్ నుంచి ప్రారంభమయ్యే ఈ ర్యాలీ పార్లమెంట్ స్ట్రీట్ వరకు సాగనుంది.
ఆందోళనలకు అసలు కారణం ఏమిటి?
దేశంలో విక్రయిస్తున్న E10, E20 పెట్రోల్ (ఇథనాల్ కలిపిన పెట్రోల్) వల్ల వాహనాల మైలేజీ భారీగా తగ్గిపోతోందని, ఇంజిన్ రిపేర్ సమస్యలు వస్తున్నాయని వాహనదారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఇథనాల్ కలిపిన పెట్రోల్ వినియోగించడం వల్ల ఎలాంటి సాంకేతిక సమస్యలు రావని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. ఈ నేపథ్యంలో పౌరుల వేదిక అయిన 'టీమ్ భారత్' ఇంధన విధానంలో పారదర్శకత, వినియోగదారుల హక్కుల కోసం ఈ ఉద్యమానికి నడుం బిగించింది.
ఈ ర్యాలీ కేంద్ర ప్రభుత్వంతో ఘర్షణ పడేందుకు కాదని, ఇథనాల్ 20 (E20) విధానంపై వాహనదారుల్లో నెలకొన్న ఆందోళనలను శాంతియుతంగా ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లే పౌరుల ఉద్యమమని నిర్వాహకులు స్పష్టం చేశారు. ఈ మార్చ్ ఢిల్లీలోని ఇండియా గేట్ నుంచి ప్రారంభమై.. కేంద్రమంత్రులు నితిన్ గడ్కరీ, హర్దీప్ సింగ్ పురి నివాసాలు, కార్యాలయాల మీదుగా వెళ్లి పార్లమెంట్ స్ట్రీట్ వద్ద ముగియనుంది.
టీమ్ భారత్ ప్రధాన డిమాండ్లు..
1) E10 ఇంధనానికి అనుకూలంగా రూపొందించిన పాత వాహనాల కోసం మార్కెట్లో E10 పెట్రోల్‌ను అందుబాటులో ఉంచాలి.
2) E20 పెట్రోల్ ధరపై 20 శాతం ప్రత్యేక తగ్గింపు ఇవ్వాలి. అలాగే ప్యూర్ పెట్రోల్ ధరలను తగ్గించాలి.
3) E20 ఇంధన విధానానికి సంబంధించిన అన్ని అధికారిక పత్రాలు, సమాచారాన్ని దేశ ప్రజలకు పూర్తిగా అందుబాటులో ఉంచాలి.
4)2023కి ముందు తయారైన వాహనాలపై E20 పెట్రోల్ చూపుతున్న దుష్ప్రభావాలకు శాశ్వత పరిష్కారం చూపాలి.
5) చివరగా..ఇథనాల్ విధానం వల్ల కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ లబ్ధి పొందుతున్నారన్న ఆరోపణలపై స్పష్టత ఇవ్వాలి.
వాహనదారులకు పిలుపు
ఈ ర్యాలీలో కార్లు, బైక్ యజమానులు, కుటుంబాలు, విద్యార్థులు, ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని టీమ్ భారత్ పిలుపునిచ్చింది. "మేరీ గాడీ.. మేరా అధికార్", "మేరీ బైక్.. మేరీ చాయిస్", "అవర్ వెహికల్స్.. అవర్ చాయిస్.. అవర్ రైట్" వంటి నినాదాలతో ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ శాంతియుతంగా తమ నిరసన తెలపాలని కోరింది.
ఇథనాల్ విధానంపై వాదనలు..
దేశంలో ఇంధన దిగుమతులను తగ్గించడం, రైతులకు మద్దతునివ్వడం, ఇంధన భద్రతను పెంపొందించడం లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం E20 ఇథనాల్ మిశ్రమ పెట్రోల్‌ను ప్రోత్సహిస్తోంది. అయితే, 2023కి ముందు తయారైన వాహనాలపై దీని ప్రభావం వల్ల మైలేజ్ తగ్గిపోవడం, నిర్వహణ ఖర్చులు పెరగడంపై వాహనదారుల్లో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ వివాదం నేపథ్యంలో జూలై 31న జరగనున్న 'గాడీ మార్చ్' దేశవ్యాప్తంగా ప్రాధాన్యత సంతరించుకుంది.
Also REad: కొత్త విద్యాశాఖ మంత్రి ఇతనే..కేంద్రమంత్రికి ప్రహ్లాద్ జోషికి అదనపు బాధ్యతలు!
Also REad: CJP Next Target: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తర్వాత.. బొద్దింకల పార్టీ టార్గెట్ వీరిపైనే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Siddaramaiah: రాజీనామాతో తీవ్ర అసంతృప్తి.. రాజకీయాలకు మాజీ సీఎం సిద్ధరామయ్య గుడ్‌బై
Mandya, Karnataka:Siddaramaiah Good Bye To Politics: కర్ణాటక రాజకీయాల్లో ఊహించని కీలక పరిణామం చోటుచేసుకుంది. ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోయిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సిద్ధరామయ్య కీలక ప్రకటన చేశారు. ఇక తాను ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటానని ప్రకటించారు. 2028లో కర్ణాటకలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీ చేయబోనని సిద్ధరామయ్య ప్రకటన చేయడం చర్చనీయాంశంగా మారింది. వయసు మీద పడడం, ఆరోగ్యంతోపాటు అవినీతి రాజకీయాలు పెరిగిపోతుండటం కారణంగా తాను ఇక ఎన్నికల్లో పోటీ చేయనని సిద్ధరామయ్య నిర్ణయం తీసుకున్నారు.
రాజకీయాలు అవినీతిమయం
మాండ్య జిల్లాలో ఆదివారం జరిగిన ఒక కార్యక్రమంలో మాజీ సీఎం సిద్ధరామయ్య పాల్గొని కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయాలు అవినీతిమయంగా మారాయని తెలిపారు. ఈ కారణంగా తాను 2028 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. ఎన్నికల్లో పోటీ చేయకపోయినప్పటికీ తాను రాజకీయాల్లోనే కొనసాగుతానని స్పష్టత ఇచ్చారు. తాను ప్రజల కోసం పని చేస్తానని.. ప్రజల కష్టాలపై తన గొంతు విప్పుతానని సిద్ధరామయ్య ప్రకటించారు.
ರಾಜಕೀಯ ಕ್ಷೇತ್ರ ಇಂದು ಕಲುಷಿತಗೊಂಡಿರುವುದರಿಂದ 2028ರ ವಿಧಾನಸಭಾ ಚುನಾವಣೆಯಲ್ಲಿ ನಾನು ಸ್ಪರ್ಧಿಸುವುದಿಲ್ಲ. ಆದರೆ, ಸಕ್ರಿಯ ರಾಜಕಾರಣದಲ್ಲಿದ್ದು, ಜನರ ಕಷ್ಟ, ಸುಖಗಳಿಗೆ ಧ್ವನಿಯಾಗಿ ನಿಲ್ಲುತ್ತೇನೆ.
ಮತ್ತೊಮ್ಮೆ ಚುನಾವಣೆಯಲ್ಲಿ ಸ್ಪರ್ಧಿಸುವಂತೆ ವರುಣ ಕ್ಷೇತ್ರದ ಜನರು ಒತ್ತಾಯಿಸುತ್ತಿದ್ದಾರೆ. ಆದರೆ ನಾನು ಇನ್ನು ಮುಂದೆ ಯಾವುದೇ… pic.twitter.com/v0S4tCQ30o
— Siddaramaiah (@siddaramaiah) July 26, 2026
మళ్లీ పోటీ చేయను
'వరుణ నియోజకవర్గ ప్రజలు నన్ను మళ్లీ పోటీ చేయమని అడుగుతున్నారు. కానీ మళ్లీ ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నా' అని మాజీ సీఎం సిద్ధరామయ్య ప్రకటన చేశారు. బహిరంగ సభలో ప్రకటించిన విషయాన్ని సోషల్ మీడియా వేదిక కూడా ఇదే చెబుతూ పస్టు చేశారు. 79 ఏళ్ల వయస్సు ఉన్న సిద్ధరామయ్య కాంగ్రెస్ పార్టీకి నమ్మిన బంటు. కన్నడ రాజకీయాల్లో అపర చాణక్యుడుగా గుర్తింపు పొందిన సిద్ధరామయ్య మొన్నటి దాకా ముఖ్యమంత్రి పదవిలో కొనసాగిన విషయం తెలిసిందే. 2013 మే 13 నుంచి 2018 మే 16వ తేదీ వరకు సిద్ధరామయ్య కర్ణాటక ముఖ్యమంత్రి పదవీ బాధ్యతలు నిర్వర్తించారు. అంతకుముందు 1996- 1999 వరకు, తర్వాత 2004- 2005 వరకు ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు.
రాజకీయ జీవితానికి 50 ఏళ్లు
కర్ణాటక రాజకీయాల్లోకి 1978లో సిద్ధరామయ్య ప్రవేశించారు. తాలుకా బోర్డు నుంచి అతడి రాజకీయ జీవితం ప్రారంభమైంది. 1983 నుంచి నేటి వరకు సిద్ధరామయ్య ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. నియోజకవర్గాలు మారుస్తున్నా కూడా ఎక్కడా ఓటమన్నదే లేకపోవడం విశేషం. 2028వ సంవత్సరం వరకు ఆయన రాజకీయ జీవితానికి 50 ఏళ్లు పూర్తవుతాయి. దీంతో అప్పుడు పూర్తిగా రాజకీయాలకు గుడ్‌బై చెప్పే అవకాశం ఉంది.
KCR: పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్యంపై మాజీ సీఎం కేసీఆర్ ఆందోళన.. కేటీఆర్, హరీశ్ రావుకు ఫోన్
Hyderabad, Telangana:Peddi Sudarshan Reddy Health Condition: తెలంగాణ ఉద్యమకారుడు.. బీఆర్ఎస్ పార్టీ ఆరంభం నుంచి ఉన్న మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి గుండెపోటుకు గురవడంతో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు తీవ్ర ఆందోళనలో ఉన్నాయి. గుండెపోటుకు గురయ్యారనే సమాచారం అందుకున్న పార్టీ నాయకత్వం వెంటనే అప్రమత్తమై వైద్య సేవలు సత్వరమే అందేలా చర్యలు తీసుకుంది. పెద్ది సుదర్శన్ ఆరోగ్యంపై తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆందోళన చెందుతున్నారు. పెద్ది సుదర్శన్‌కు మెరుగైన వైద్యం అందించాలని బీఆర్ఎస్ పార్టీ నాయకత్వానికి ఆదేశించారు. నిరంతరం కేటీఆర్, హరీశ్ రావుతో ఫోన్లో కేసీఆర్ వివరాలు తెలుసుకుంటూ అవసరమైన సూచనలు చేస్తున్నారు.
పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్యంపై పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు కేసీఆర్‌కు ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారు. వెంట ఉండి అత్యుత్తమ చికిత్స అందేలా చూడాలని కేటీఆర్‌కు ఆదేశించారు. పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్యంపై పార్టీ ముఖ్య నాయకులను అప్రమత్తం చేశారు. అస్వస్థతకు గురైన విషయం తెలిసి ఆందోళన చెందిన కేసీఆర్ ఉదయం నుంచి పెద్ది ఆరోగ్యం గురించి ఎప్పటికప్పుడు వాకబు చేస్తున్నారు.
పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్యంపై ఆరా తీసిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు.
అనారోగ్యానికి గురైన పెద్ది సుదర్శన్ రెడ్డికి హైదరాబాద్‌లో వెంట ఉండి అత్యుత్తమ చికిత్స అందేలా చూడాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS ను అధినేత ఆదేశించారు.
పార్టీ సీనియర్ నేత, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే…
— BRS Party (@BRSparty) July 26, 2026
సుదర్శన్ రెడ్డి కుటుంబసభ్యులతో పాటు, పార్టీ నాయకులు కేటీఆర్, హరీశ్ రావు, వినోద్ కుమార్, వరంగల్ జిల్లా నాయకులతో కేసీఆర్ ఎప్పటికప్పుడు మాట్లాడుతూ అప్రమత్తం చేస్తున్నారని బీఆర్ఎస్ పార్టీ తెలిపింది. సుదర్శన్ రెడ్డికి మెరుగైన చికిత్స అందేలా తగిన ఏర్పాట్లు చేయాలి అని సూచిస్తున్నారని వెల్లడించింది. పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య సమాచారాన్ని,. మెరుగైన చికిత్స కోసం వారు చేస్తున్న కృషిని వైద్యులు కేసీఆర్‌కు ఎప్పటికప్పుడు వివరిస్తున్నారు. ప్రస్తుతం పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్యం పరిస్థితి నిలకడగా ఉందని తెలిసీ కేసీఆర్ ఊపిరి పీల్చుకున్నట్లు సమాచారం.
ఆరోగ్య స్థితిపై టీపీసీసీ చీఫ్ ఆరా
మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిపై తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు (పీసీసీ) మహేష్ కుమార్ గౌడ్ ఆరా తీశారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై వైద్యులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని వైద్యులు చెప్పడం ఊరటనిచ్చిందని మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. త్వరగా పూర్తిగా కోలుకుని మళ్లీ ప్రజా జీవితంలో చురుకుగా పాల్గొనాలని ఆకాంక్షించారు.
ప్రాణాలు పోసిన డాక్టర్ మమత
నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, తెలంగాణ ఉద్యమకారుడు పెద్ది సుదర్శన్ రెడ్డి ప్రాణాలను కాపాడేందుకు వైద్యురాలు డాక్టర్ మమత రెడ్డి తీవ్రంగా కృషి చేశారు. ఫలితంగా పెద్ది సుదర్శన్ రెడ్డి ఇప్పుడు ప్రాణంతో ఉన్నారు. ఆమె చేసిన ప్రయత్నం అందరినీ కదిలించింది. ఉదయం 8 గంటల నుంచి ఆయనను కాపాడేందుకు ఆమె వైద్య బృందంతో కలిసి నిర్విరామంగా శ్రమించారు. పలుమార్లు సీపీఆర్ చేసినప్పటికీ స్పందన రాకపోవడంతో వైద్యులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. తొమ్మిదోసారి పెద్ది సుదర్శన్ రెడ్డికి చేసిన సీపీఆర్‌తో పెద్ది సుదర్శన్ రెడ్డి గుండె కొట్టుకోవడం ప్రారంభించడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. తర్వాత కావాల్సిన వైద్యం అందిస్తున్నారు. మమత చూపిన చొరవపై బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తోపాటు ఆ పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు ప్రశంసలు కురిపించారు.
ముద్రగడ పద్మనాభం మృతికి నా చెల్లెలే కారణం: ముద్రగడ గిరిబాబు
Kirlampudi, Andhra Pradesh:Mudragada Giribabu Hot Comments On His Father Padmanabham Death Watch VideoKCR: పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్యంపై మాజీ సీఎం కేసీఆర్ ఆందోళన
Hyderabad, Telangana:Former CM KCR Asked About Peddi Sudarshan Reddy Health Condition Watch VideoBJP: మోదీని అస్తిరపర్చాలని యువతను రెచ్చగొట్టారు: డీకే అరుణ
Hyderabad, Telangana:DK Aruna Reaction About Dharmendra Pradhan Resign And Students Protest Watch VideoDK Aruna: ఊర్లో పెళ్లికి కుక్కల హడావుడి అన్నట్లు రేవంత్ రెడ్డి సంబరాలు: డీకే అరుణ
Hyderabad, Telangana:Students Protest: కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో, ఇతర రాష్ట్రాల్లో పేపర్ లీకేజీలు జరగలేదా? రాహుల్ గాంధీ తన వీపు తాను చూసుకోకుండా సందట్లో సడేమియాల వ్యవహరిస్తున్నారని బీజేపీ ఎంపీ డీకే అరుణ తప్పుబట్టారు. మీడియాలో కొంతమంది మాట్లాడే మాటలు చదువు సంస్కారం ఉన్న వాళ్లు మాట్లాడారు. నేపాల్, బంగ్లాదేశ్‌ల భారత్ చేస్తామని కొందరు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. దేశాన్ని అస్థిరపరిచే కుట్రలో కొందరు చేశారు' అని డీకే అరుణ విమర్శించారు.
హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో ఎంపీ డీకే అరుణ మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో పదో తరగతి పేపర్ లీక్ అయ్యింది.. ఇక్కడ ఎవరూ రాజీనామా చేశారు? అని బీజేపీ ఎంపీ డీకే అరుణ నిలదీశారు. 'దేశ కీర్తి, మోదీని అపహాస్యం చేసేందుకు యువతను ఉసిగొల్పారు. రాహుల్ గాంధీ ప్రతిపక్ష నాయకుడిగా ఏ ఒక్క విషయంపై పార్లమెంట్లో చర్చకు సిద్ధంగా లేరు. కానీ నల్ల బట్టలు వేసుకొని మాత్రం రోడ్డుపై ధర్నాలు చేస్తారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో అవినీతి చేస్తున్నారు. ఆ రాష్ట్రాల నుంచి కాంగ్రెస్ పార్టీని నడిపించే డబ్బుల ముఠాలు ఢిల్లీకి పంపుతున్నారు' అని డీకే అరుణ విమర్శలు చేశారు.
'నీట్ పేపర్ లీక్ అవ్వగానే రద్దు చేసి తిరిగి తక్కువ సమయంలో ఎగ్జామ్ పెట్టీ పొరపాటును సరిదిద్దారు. కేంద్రం అన్ని చర్యలు తీసుకుంది. ఆమ్ ఆద్మీ పార్టీ కోసం పని చేసే ఒక వ్యక్తి మోదీ నాయకత్వాన్ని అస్తిరపరచాలని యువతను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు' మహబూబ్‌నగర్ బీజేపీ ఎంపీ డీకే అరుణ విమర్శించారు. గత ప్రభుత్వ హయాంలో గ్రూప్-1 పేపర్ లీక్ అయితే అప్పుడెందుకు ఎవరు రాజీనామా చేయలేదు? అని ప్రశ్నించారు.
'విద్యార్థుల ఉద్యమాన్ని నడిపింది ఎవరు? ఏ అరాచక శక్తులు ఇందులో ఉన్నాయో అన్ని బయటికి వస్తాయి. భారతదేశాన్ని విచ్చిన్నం చేసే శక్తులను భారతీయులు సహించరు. నీట్ రద్దు అవ్వగానే రాహుల్ గాంధీ ధర్నా ఎందుకు చేయలేదు? ఎవరో ధర్నా చేస్తే ఆ క్రెడిట్ రాహుల్ గాంధీ కొట్టేయాలని మోడీ ఇంటి ముందు ధర్నా చేశారు' బీజేపీ ఎంపీ డీకే అరుణ విమర్శలు చేశారు. కేటీఆర్, రేవంత్ రెడ్డికు పేపర్ లీక్‌పై మాట్లాడే నైతిక హక్కు లేదని స్పష్టం చేశారు.
'మోదీ నాయకత్వాన్ని చూస్తే మీకెందుకంత బాధా! ఈర్ష్య? నిరసనలో విద్యార్థుల కంటే ఎక్కువ ఎక్కడెక్కడి నుంచో వచ్చిన వారు ఉన్నారు. రేవంత్ రెడ్డి, కేటీఆర్ అన్నం తినే వారిలా కాకుండా గడ్డి తినే వారిలా మాట్లాడుతున్నారు. దేశ వ్యతిరేకులు విదేశాల నుంచి ఫుడ్, డబ్బులు పంపించి అల్లర్లు సృష్టించేందుకు ప్లాన్ చేశారు' అని బీజేపీ ఎంపీ డీకే అరుణ వివరించారు. యువత మంచి మార్గంలో నడిచి దేశ సంప్రదాయాలను కాపాడాలని విన్నవించారు.
'ఊర్లో పెళ్లికి కుక్కల హడావుడి అన్నట్లు రేవంత్ రెడ్డి సంబరాలు చేస్తూ ర్యాలీ తీస్తున్నారు. రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలపై కట్టడి చేయడం బీజేపీకి 5 నిమిషాల పని. ఐదేళ్లు ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తున్నాం' అని ఎంపీ డీకే అరుణ తెలిపారు. 'పంజాబ్‌లో ఆప్ ప్రభుత్వం హయాంలో ఫార్మా ఉద్యోగుల పేపర్ లీక్ అయ్యింది. ఆప్ నాయకులు వచ్చి కూడా ఉద్యమంలో మాట్లాడుతున్నారు' అని వివరించారు. పేపర్ లీకేజీపై శాశ్వత పరిష్కారం తీసుకురావాలని మోదీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని.. కఠిన చట్టాల రూపకల్పనకు అందరూ ముందుకి వచ్చి మద్దతు ఇవ్వకుండా.. సలహాలు సూచనలు స్వీకరిస్తామని ప్రకటించారు. మోదీ కీర్తిని దెబ్బ తీయాలనే దురాలోచలోనే మాత్రమే ఉన్నారని.. సరైన సమయంలో అందరికీ తగిన గుణపాఠం చెబుతామని బీజేపీ ఎంపీ డీకే అరుణ తెలిపారు.
