అంగన్వాడీల ధర్నా: వేతనాల పెంపు, హామీల అమలుకు డిమాండ్
ఖమ్మం కలెక్టరేట్ ముందు అంగన్వాడీలు ధర్నా నిర్వహించారు. కనీస వేతనాల పెంపు, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఎన్నికల హామీల అమలు కోరుతూ నిరసన తెలిపారు. తక్కువ వేతనాలతో పడుతున్న ఇబ్బందులపై ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సమస్యలు పరిష్కరించనట్లయితే దశలవారీగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. తమ డిమాండ్లు నెరవేరే వరకు పోరాటం కొనసాగిస్తామని అంగన్వాడీలు స్పష్టం చేశారు.
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
KTR Condemns Revanth Reddy: శాంతిభద్రతలను కాపాడాల్సిన రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి, అసాంఘిక చర్యలను, నేరాలను ప్రోత్సహించేలా రేవంత్ రెడ్డి మాట్లాడటం కనీసం సిగ్గుచేటు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అని ప్రకటించారు. రేవంత్ రెడ్డికి పూర్తిగా మతిభ్రమించిందని ఇవాల్టి సభ సాక్షిగా తేలిపోయిందని తెలిపారు. కాంగ్రెస్ ముఖ్యమంత్రి హోదాలో ఉండి కూడా తెలుగుదేశం పార్టీ పాట పాడడం వెనుక ఉన్న అసలు కుట్ర ఇవాళ తెలంగాణ సమాజానికి అర్థమైందని చెప్పారు.
Also Read: Tomorrow Holiday: రేపు అన్నీ స్కూళ్లకు సెలవు.. బ్యాంకులకు కూడా! ఎందుకో తెలుసా?
బీఆర్ఎస్ జెండా గద్దెలను ధ్వంసం చేయాలని ఖమ్మం సభలో రేవంత్ రెడ్డి పిలుపునివ్వడాన్ని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నువ్వు ముఖ్యమంత్రివా లేక ముఠా నాయకుడివా? అని రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. ముఖ్యమంత్రిగానే కాకుండా హోంమంత్రి బాధ్యతలు కూడా నిర్వహిస్తున్న రేవంత్ రెడ్డి కనీస సోయి లేకుండా బీఆర్ఎస్ పార్టీ జెండా గద్దెలను ధ్వంసం చేయాలని పిలుపునివ్వడాన్ని కేటీఆర్ తప్పుబట్టారు. పదేళ్ల కాలంలో శాంతిభద్రతల నిర్వహణలో దేశానికే ఆదర్శంగా నిలిచిన తెలంగాణలో నేడు అరాచక పర్వానికి ద్వారాలు తెరిచే వారు అధికారంలో ఉండడం రాష్ట్రానికి పట్టిన దరిద్రమని కేటీఆర్ దుయ్యబట్టారు.
Also Read: Women Dress: మహిళలు ఏం ధరించాలి? సనాతన ధర్మం చెబుతోంది తెలుసా?
తెలంగాణ ప్రజల గుండెల్లో గులాబీ జెండాపై ఉన్న చెక్కుచెదరని అభిమానాన్ని చూసి రేవంత్ రెడ్డికి మైండ్ బ్లాక్ అయ్యిందని మాజీ మంత్రి కేటీఆర్ ప్రకటించారు. అందులో భాగంగానే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని తెలిపారు. రెండేళ్ల కాలంలోనే అట్టర్ ఫ్లాప్ పాలనతో ప్రజల్లో వ్యతిరేకతను మూటగట్టుకున్న రేవంత్ రెడ్డికి పూర్తిగా మతిభ్రమించిందని ఇవాల్టి సభ సాక్షిగా తేలిపోయిందని ప్రకటించారు. సోషల్ మీడియాలో చిన్న పోస్టు పెడితేనే చురుగ్గా స్పందించి అరెస్టులు చేసే పోలీసు శాఖ, డీజీపీ రేవంత్ రెడ్డి చేసిన ఈ తీవ్రమైన, హింసను ప్రేరేపించే వ్యాఖ్యలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు.
Also Read: Shashtipoorthi: షష్టిపూర్తి ఎందుకు చేస్తారు? 60 ఏళ్లకు ఎందుకు చేయాలో హిందూ శాస్త్రం ఏం చెబుతోంది?
కాంగ్రెస్ ముఖ్యమంత్రి హోదాలో ఉండి కూడా తెలుగుదేశం పార్టీ పాట పాడటం వెనుక ఉన్న అసలు కుట్ర ఇవాళ తెలంగాణ సమాజానికి అర్థమైందని మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. రెండేళ్లుగా తన పాత బాసు ఆదేశాల మేరకు తెలంగాణకు తీరని నష్టం చేసేలా జలహక్కులను రేవంత్ రెడ్డి కాలరాశారని గుర్తుచేశారు. నేడు ఆయన చేసిన ప్రకటనతో నిజస్వరూపం బట్టబయలైందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఒక మునిగిపోయే నావ అని అర్థం కావడంతోనే రేవంత్ రెడ్డి ఏ క్షణమైనా దాని నుంచి బయటకు దూకేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారని మాజీ మంత్రి కేటీఆర్ వెల్లడించారు.
బీఆర్ఎస్ పార్టీని రాజకీయంగా ఎదుర్కోలేక ఒకవైపు బీజేపీతో చీకటి ఒప్పందాలు చేసుకుంటూ.. మరోవైపు తెలంగాణ ప్రజలు తిరస్కరించిన టీడీపిని తిరిగి ఈ గడ్డపైకి తెచ్చేందుకు రేవంత్ రెడ్డి పన్నాగం పన్నుతున్నారని మాజీ మంత్రి కేటీఆర్ సంచలన ప్రకటన చేశారు. దీనిని 4 కోట్ల తెలంగాణ సమాజం తప్పకుండా తిప్పికొడుతుందని కేటీఆర్ తెలిపారు. నీళ్ల నుంచి మొదలుకొని నిధులు, నియామకాల వరకూ తెలంగాణ ప్రయోజనాలను పాతాళంలోకి నెట్టిన కోవర్టు రాజకీయాలకు, రాష్ట్రానికి చేసిన ద్రోహానికి రేవంత్ రెడ్డి భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
.Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Horoscope 2026 Telugu: ఒక గ్రహం నక్షత్రం సంచారం చేసినప్పుడు దాని కారణంగా ఏర్పడే ప్రభావం అనేక రాశుల వారి జీవితాల్లో కీలకమైన మార్పులు తీసుకువస్తుంది. ముఖ్యంగా ఇది వ్యక్తి జీవితంపై ప్రత్యక్షంగాను పరోక్షంగాను పడుతుంది. కాబట్టి నక్షత్ర సంచారం కూడా చాలా కీలకమైందిగా భావిస్తారు. ముఖ్యంగా కొన్ని గ్రహాలు సంచారం చేస్తే వ్యక్తిగత జీవితంలో పనుల్లో మార్పులు రావడమే కాకుండా ఆర్థిక సంబంధాల్లో కూడా అనేక మార్పులు సంభవిస్తూ ఉంటాయి. 2026 జనవరి చివరి మూడు రోజులపాటు అరుదైన యాదృచ్ఛికలో ఏర్పడిపోతున్నాయి.
ప్రధాన గ్రహాలైన కుజుడు, బృహస్పతి, బుధుడు, శుక్రుడు ఒకదాని తర్వాత ఒకటి రాశులు సంచారం చేయబోతున్నాయి. దీని ప్రభావం జనవరి 29 నుంచి 31వ తేదీ మధ్యలో అన్ని రాశుల వారిపై పడుతుంది. ముఖ్యంగా ఈ సమయంలో కుజుడు ఉత్తరాషాడ నక్షత్రం నుంచి శ్రవణా నక్షత్రంలోకి సంచారం చేస్తాడు. అలాగే జనవరి 30వ తేదీన బృహస్పతి పునర్వాసు నక్షత్రం లో ఒక దశ నుంచి మరొక దశకు మారబోతోంది. జనవరి 31వ తేదీన బుధుడు శుక్రుడు ఒకే రోజు ధనిష్ట నక్షత్రంలోకి ప్రవేశిస్తాయి. దీని కారణంగా ఈ సమయం ఎంతో కీలకంగా మారబోతోంది.
వృషభ రాశి
వృషభ రాశిలో జన్మించిన వ్యక్తులకు ఈ మూడు రోజులు ఎంతో ప్రయోజనకరంగా ఉండబోతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. ముఖ్యంగా ఆర్థిక విషయాల నుంచి ఉపశమనం తులబంగా లభించబోతోంది. ఉద్యోగాలతో పాటు వ్యాపారాలు చేస్తున్న వ్యక్తులకు ఈ సమయం చాలా లాభదాయకంగా ఉంటుంది. అలాగే కష్టపడి పనిచేయడం వల్ల సానుకూలమైన ఫలితాలు కూడా పొందుతారు. కుటుంబ జీవితంలో ప్రేమ సంబందాలు మరింత మెరుగుపడే అవకాశాలు ఉన్నాయి. ఈ సమయంలో పిల్లల ఆరోగ్యంతో పాటు మీ ఆరోగ్యం కూడా చాలావరకు మెరుగుపడుతుంది.
మిధున రాశి
మిథున రాశిలో జన్మించిన వ్యక్తులకు కూడా ఈ సమయంలో అద్భుతమైన పురోగతి లభించబోతోంది. కెరీర్ పరంగా విశేషమైన ప్రయోజనాలు కలిగే అవకాశాలున్నాయి. అలాగే ఆకస్మిక ఆర్థిక లాభాలు కూడా కలగవచ్చని జ్యోతిష్యులు చెబుతున్నారు. అలాగే ఈ సమయంలో పెండింగ్‌లో ఉన్న పనులు కూడా పూర్తవుతాయి. ముఖ్యంగా ఆర్థిక సంబంధాలు మెరుగుపడే అవకాశాలు కూడా ఉన్నాయి. శక్తి స్థాయిలు కూడా విపరీతంగా పెరిగి అనేక రకాల పనులు చేయగలుగుతాయి.
కర్కాటక రాశి
కర్కాటక రాశి వారికి ఆత్మవిశ్వాసం కూడా అనుకున్నంత స్థాయిలో పెరుగుతుంది. వీరికి ఆర్థిక పరిస్థితులు అనుకున్న దానికంటే ఎక్కువగా మెరుగుపడతాయి. ఇంట్లో ఆహ్లాదకరమైన వాతావరణ నెలకొంటుంది. పనుల్లో కొత్త బాధ్యతలు కూడా పెరుగుతాయి. మానసిక భక్తుడు కూడా విపరీతంగా తగ్గి.. అనుకోని లాభాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అలాగే అనుకున్న పనుల్లో విజయాలు కూడా సాధించగలుగుతారు.
సింహరాశి
సింహరాశి వారికి ఈ సమయంలో గౌరవం ఊహించని స్థాయిలో పెరుగుతుంది. పురోగతి కూడా ఎంతో లభిస్తుంది. ముఖ్యంగా విద్యాబుద్ధులు విపరీతంగా పెరగడమే కాకుండా.. ఈ సమయంలో జ్ఞానంతో పని చేయగలుగుతారు.. అలాగే కుటుంబ సభ్యులతో పాటు స్నేహితులతో చాలా బాగుంటారు. ముఖ్యంగా కొత్త ఆదాయ వనరులు కూడా లభిస్తాయి. అలాగే అనుకున్న పనుల్లో ఎన్నో రకాల ప్రయోజనాలు పొందుతారు. దీర్ఘకాలిక సమస్యలతో బాధపడుతున్న వారికి ఈ సమయంలో ఉపశమనం కలుగుతుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Whatsapp Admissible In Court: నేటి డిజిటల్ కాలంలో వాట్సాప్ సందేశాలు మన దైనందిన జీవితంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. మరి గొడవలు, మోసాలు లేదా కోర్టు కేసుల విషయానికి వస్తే, ఈ వాట్సాప్ స్క్రీన్షాట్లకు చట్టబద్ధత ఎంత? కోర్టు వీటిని సాక్ష్యంగా అంగీకరిస్తుందా? అనే విషయాలను చట్టపరమైన కోణంలో ఇప్పుడు విశ్లేషిద్దాం.
చాలామంది వాట్సాప్ చాట్లను కేవలం స్క్రీన్‌షాట్ తీసి ప్రింట్ ఇస్తే సాక్ష్యంగా సరిపోతుందని భావిస్తారు. కానీ, భారతీయ సాక్ష్యాధారాల చట్టం ప్రకారం ఇది అంత సులభం కాదు.
చట్టం ఏం చెబుతోంది?
డిజిటల్ సాక్ష్యాలకు సంబంధించి ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ (Indian Evidence Act) లోని సెక్షన్ 65B అత్యంత కీలకమైనది. వాట్సాప్ స్క్రీన్షాట్లు, ఇమెయిల్‌లు, ఆడియో లేదా వీడియో క్లిప్‌లను 'ఎలక్ట్రానిక్ రికార్డ్స్'గా పరిగణిస్తారు. వీటిని కోర్టులో సాక్ష్యంగా సమర్పించాలంటే 65B సర్టిఫికేట్ తప్పనిసరి.
ఏమిటీ 65B సర్టిఫికేట్?
ఇది మీరు సమర్పించే డిజిటల్ సాక్ష్యం అసలైనదని ధృవీకరించే ఒక పత్రం. ఇందులో ప్రధానంగా ఈ కింది అంశాలను ధృవీకరించాల్సి ఉంటుంది.
1) స్క్రీన్‌షాట్ తీసిన మొబైల్ సక్రమంగా పనిచేస్తోంది.
2) మెసేజ్‌లు ఎడిట్ చేయడం లేదా ట్యాంపరింగ్ చేయడం జరగలేదు.
3) సదరు వ్యక్తికి ఆ డివైజ్‌పై పూర్తి నియంత్రణ ఉందనే ధ్రువీకరణ పత్రాలు ఉండాలి
ఈ సర్టిఫికేట్ లేకుండా మీరు ఎన్ని స్క్రీన్షాట్లు సమర్పించినా కోర్టు వాటిని ప్రాథమిక సాక్ష్యంగా అంగీకరించదు.
కోర్టులో సాక్ష్యం నిలబడాలంటే ఈ నియమాలు పాటించాలి
సందర్భోచితంగా ఉండాలి: కేవలం ఒక మెసేజ్ స్క్రీన్‌షాట్ మాత్రమే కాకుండా, పూర్తి సంభాషణ (Context) అర్థమయ్యేలా ఉండాలి. ఎంపిక చేసిన (Selective) స్క్రీన్షాట్లను కోర్టు తిరస్కరించే అవకాశం ఉంది.
ఫోన్ నంబర్ స్పష్టత: స్క్రీన్‌షాట్‌లో అవతలి వ్యక్తి ఫోన్ నంబర్ స్పష్టంగా కనిపించాలి. కేవలం పేరు ఉంటే సరిపోదు, ఎందుకంటే పేరును ఎలాగైనా సేవ్ చేసుకోవచ్చు.
ఫోరెన్సిక్ పరీక్ష: అవతలి పక్షం ఆ సాక్ష్యాన్ని సవాల్ చేస్తే, కోర్టు సదరు మొబైల్‌ను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపమని ఆదేశించవచ్చు.
మెటాడేటా: సందేశం పంపిన సమయం, తేదీ వంటి వివరాలు (Metadata) సరిపోలాలి.
ఏయే కేసుల్లో ఉపయోగపడుతుంది?
గృహ హింస, విడాకుల కేసులు... బ్లాక్మెయిల్ లేదా బెదిరింపులకు సంబంధించిన నేరాలు.. ఆర్థిక మోసాలు, వ్యాపార ఒప్పందాల వివాదాలు.. కార్యాలయాల్లో వేధింపులు (Workplace Harassment) వంటి వాటి కోసం ఈ సాక్ష్యాలు సందర్భాన్ని బట్టి పనిచేయవచ్చు.
వాట్సాప్ స్క్రీన్‌షాట్ కోర్టులో సాక్ష్యంగా చెల్లుతుంది, కానీ దానికి సెక్షన్ 65B సర్టిఫికేట్ తోడవ్వాలి. స్క్రీన్‌షాట్‌ను ఎడిట్ చేయడం లేదా ఫార్వార్డ్ చేసిన మెసేజ్‌లను సాక్ష్యంగా చూపడం వల్ల ప్రయోజనం ఉండదు. న్యాయపరమైన చిక్కులు ఎదురైనప్పుడు అనుభవజ్ఞుడైన న్యాయవాదిని సంప్రదించి, డిజిటల్ సాక్ష్యాలను సరిగ్గా సిద్ధం చేసుకోవడం ముఖ్యం.
(గమనిక: ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. చట్టపరమైన సమస్యల కోసం నిపుణులైన లాయర్లను సంప్రదించండి. పైన పేర్కొన్న సమాచారాన్ని జీ తెలుగు న్యూస్ ధ్రువీకరించడం లేదు.)
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
CPI Centenary Meeting: 'బీజేపీ అంటే బ్రిటిష్ జనతా పార్టీ. కాంగ్రెస్, కమ్యూనిస్టులు కలిసి ఉపాధి హామీ పథకం తెస్తే బీజేపీ ప్రభుత్వం దానిని రద్దు చేసింది. ఉపాధి హామీ రద్దుతో అగ్గువకో సగ్గువకో అదానీ అంబానీలకు కూలీలు దొరికే పరిస్థితి. బ్రిటీషర్లకు వ్యతిరేకంగా నాడు పోరాటం చేశాం. పేదల హక్కులు కొల్లగొట్టడానికి, రాజ్యాంగం మార్చడానికి 400 సీట్లు ఇవ్వాలని బీజేపీ నాయకులు కోరారు. రాజ్యాంగాన్ని చెర పట్టడానికి బీజేపీ ప్రయత్నిస్తోంది' అని రేవంత్ రెడ్డి ఆరోపించారు.
Also Read: Lakshmi Parvathi: చంద్రబాబు లోకేశ్‌పై ఎన్టీఆర్ భార్య లక్ష్మీపార్వతి సంచలన వ్యాఖ్యలు
ఖమ్మంలో జరుగుతున్న సీపీఐ శతాబ్ది ఉత్సవాల ముగింపు సభలో రేవంత్ రెడ్డి కీలక ప్రసంగం చేశారు. పేదల హక్కుల పోరాటాల్లో ప్రాణాలు కోల్పోతామే కానీ ఎర్ర జెండా వదలమని ప్రకటించిన కామ్రేడ్లకు రేవంత్ రెడ్డి వందనం చేశారు. రైతులు, రైతు కూలీలు, హరిజనులు, గిరిజనులు కోసం కమ్యూనిస్టులు పోరాడారని.. దున్నే వాడిదే భూమి అని కమ్యూనిస్టులు పిలుపునిస్తే దానిని అమల్లోకి తెచ్చింది ఇందిరాగాంధీ, పీవీ నరసింహారావు, బూర్గుల రామకృష్ణారావు అని గుర్తుచేశారు.
Also Read: Shashtipoorthi: షష్టిపూర్తి ఎందుకు చేస్తారు? 60 ఏళ్లకు ఎందుకు చేయాలో హిందూ శాస్త్రం ఏం చెబుతోంది?
'రైతులు ధర నిర్ణయించలేనప్పుడు కనీస మద్దతు ధర కోసం కమ్యూనిస్టులు పోరాడారు. 4 వేల అమరవీరుల త్యాగాలతో హైదరాబాద్ రాష్ట్రం నిజాం నుంచి విముక్తి అయింది. పుచ్చలపల్లి సుందరయ్య, చండ్ర రాజేశ్వరరావు, నల్లమల గిరిప్రసాద్, శేషగిరి రావు వంటి వారెందరో నాడు పోరాడారు' అని రేవంత్ రెడ్డి వివరించారు. 'పేదల ఓటు హక్కు రద్దు చేసేందుకు సర్ తీసుకువచ్చారు. రాజ్యాంగ సభ సమయంలోనూ గోల్వాల్కర్ వారసులు పేదలకు ఓటు హక్కు లేకుండా చేసేందుకు ప్రయత్నించారు' అని మోదీ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read: Women Dress: మహిళలు ఏం ధరించాలి? సనాతన ధర్మం చెబుతోంది తెలుసా?
'మూల వాసులు ఎక్కడ నుంచి ఆధారాలు తెస్తారు. ఓటు హక్కు లేకపోతే రేషన్ కార్డు, ఇల్లు, పింఛన్ పోతుంది. కాంగ్రెస్, కమ్యూనిస్ట్ తేడా లేకుండా మోదీకి వ్యతిరేకంగా దండు కట్టాలి' అని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. కమ్యూనిస్టులు పేదల కోసం కొట్లాడతారని.. నేటి ఈ ప్రభుత్వంలో మీ శ్రమ ఉందని చెప్పారు. 'నరేంద్ర మోదీ, అమిత్ షా కలిసి వచ్చినా బీజేపీ ఒక్క సీటు లేదు. తులసీ వనంలో గంజాయి మొక్కకు చోటు లేదు. ఖమ్మం జిల్లాలో బీజేపీకి చోటు లేదు. ఖమ్మం జిల్లాలో బీజేపీకి సర్పంచులు కూడా లేరు' అని రేవంత్ రెడ్డి తెలిపారు. సీపీఐ శతాబ్ది ఉత్సవాల ముగింపు కార్యక్రమం ఖమ్మంలో సంబరంగా ప్రారంభమైంది. మరో రెండు రోజుల పాటు ఈ శతాబ్ది ఉత్సవాలు జరుగుతున్నాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
.Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Nandamuri Lakshmi Parvathi: ఎన్టీఆర్ అభిమానులు చంద్రబాబు మోసాలను గ్రహించాలని ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ విగ్రహం పేరుతో చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజంగా చిత్తశుద్ధి ఉంటే గతంలోనే నీరుకొండపై విగ్రహం పెట్టేవాడని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నందమూరి లక్ష్మీ పార్వతి పేర్కొన్నారు. తనప్రతిష్ట దిగజారుతున్నప్పుడల్లా ఎన్టీఆర్ పేరుతో రాజకీయం చేయడం చంద్రబాబుకి అలవాటేనని, ఎన్టీఆర్ విగ్రహం పేరుతో ఆయన చేస్తున్న హడావుడి కూడా అలాంటిదేనని ప్రకటించారు.
Also Read: Shashtipoorthi: షష్టిపూర్తి ఎందుకు చేస్తారు? 60 ఏళ్లకు ఎందుకు చేయాలో హిందూ శాస్త్రం ఏం చెబుతోంది?
ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్‌లోని తన నివాసంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నందమూరి లక్ష్మీపార్వతి కీలక ప్రెస్‌మీట్ నిర్వహించారు. చంద్రబాబుకి చేతనైతే మెడికల్ కాలేజీలు నిర్మించాలని.. ప్రధాని మోదీతో మాట్లాడి ఎన్టీఆర్‌కి భారతరత్న ఇప్పించాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు, లోకేష్ దుర్మార్గాలపై బీజేపీ నాయకులు స్పందించాలని విజ్ఞప్తి చేశారు. 2014లోనే నీరుకొండపై ఎన్టీఆర్ విగ్రహం పెడతానని చెప్పి పక్కన భూములు కాజేశాడని, చిత్తశుద్ధి ఉంటే ఐదేళ్లలో విగ్రహం నిర్మాణం పూర్తి చేయలేడా అని లక్ష్మీపార్వతి ప్రశ్నించారు. ఎన్టీఆర్ అభిమానులు ఇప్పటికైనా చంద్రబాబు మోసాలను గుర్తించాలని విజ్ఙప్తి చేశారు.
Also Read: Women Dress: మహిళలు ఏం ధరించాలి? సనాతన ధర్మం చెబుతోంది తెలుసా?
చేతనైతే మోడీతో మాట్లాడి చంద్రబాబు ఎన్టీఆర్‌కి భారతరత్న ఇప్పించాలని, వైద్య కళాశాలల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని పెండింగ్ పనులు పూర్తి చేయాలని లక్ష్మీపార్వతి డిమాండ్ చేశారు. చంద్రబాబు, లోకేష్ దోపిడీలు, అరాచకాలపై తాను కూడా ప్రధాని మోడీకి లేఖ రాస్తానని చెప్పారు. జూదాలు, కోడి పందేలు, కేసినోలు, అర్థనగ్న నృత్యాలతో రాష్ట్ర ప్రతిష్టను చంద్రబాబు నడి బజారున నిలబెట్టాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాపం పండిన రోజు చంద్రబాబు సంపాదించిన లక్షల కోట్ల అక్రమ సంపాదన కూడా ఆయన్ను కాపాడలేదని, నారా లోకేష్ అమలు చేస్తున్న రెడ్ బుక్ రాజ్యాంగం ఆయన కాళ్లకే చుట్టుకుని ఆయన్ను జైలుపాలు చేయడం ఖాయమని లక్ష్మీపార్వతి ప్రకటించారు.
జయంతి, వర్ధంతి వచ్చినప్పుడల్లా ఎన్టీఆర్ మీద చంద్రబాబు ప్రేమ ఒలకబోస్తుంటాడని నందమూరి లక్ష్మీపార్వతి విమర్శించారు. గతంలోనూ 2014 అధికారంలోకి వచ్చినప్పుడు నీరుకొండ మీద ఎన్టీఆర్ విగ్రహం పెడతానని హడావుడి చేసి చుట్టుపక్కల భూములు కాజేశాడు. మళ్లీ ఇప్పుడు ఎన్టీఆర్ పేరుతో రాజకీయాలు చేస్తున్నాడని.. ఎన్టీఆర్ ఆశయాలను కాపాడతానని నక్క వినయాలు ప్రదర్శిస్తున్నాడని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 20 నెలలవుతున్నా ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయకుండా చంద్రబాబు ప్రజలకు వెన్నుపోటు పొడిచాడని లక్ష్మీపార్వతి ఆరోపించారు.
మోసపు హామీలతో రైతులు, విద్యార్థులు, యువత, ఉద్యోగులు, నిరుద్యోగులు, మహిళలు.. ఇలా అన్ని వర్గాల ప్రజలను చంద్రబాబు దారుణంగా మోసం చేశాడని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నందమూరి లక్ష్మీపార్వతి తెలిపారు. మోసపు హామీలతో అధికారంలోకి రావడం వచ్చాక ప్రజలకు వెన్నుపోటు పొడిచి రాష్ట్రాన్ని దోచుకోవడమే చంద్రబాబు విధానం అని విమర్శించారు. మళ్లీ జగన్ ప్రభుత్వం రాగానే తండ్రీకొడుకుల అరాచాకలపై తక్షణ విచారణ జరిపి చట్టపరంగా వారిని శిక్షించకుండా వదిలిపెట్టమని లక్ష్మీ పార్వతి హెచ్చరించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
.Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Bangladesh Ireland T20 World Cup: టీ20 ప్రపంచకప్ 2026ను భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న వేళ, టోర్నీ ప్రారంభానికి ముందే ఆసక్తికరమైన సంఘటనలు జరుగుతున్నాయి. భారత్‌లో ఆడేందుకు బంగ్లాదేశ్ విముఖత చూపడం, దానికి ఐర్లాండ్ షాక్ ఇవ్వడం ఇప్పుడు క్రీడా వర్గాల్లో చర్చనీయాంశమైంది. బంగ్లాదేశ్‌లో ప్రస్తుత పరిస్థితులతో పాటు భారత్-బంగ్లా మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) సంచలన నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది.
భద్రతా కారణాలే సాకుగా..
ప్రస్తుత షెడ్యూల్ ప్రకారం.. గ్రూప్-సిలో ఉన్న బంగ్లాదేశ్ తన మ్యాచ్‌లను కోల్‌కతా, ముంబై వేదికలుగా ఆడాల్సి ఉంది. అయితే, భారత్‌లో తమకు భద్రతా సమస్యలు తలెత్తుతాయని బంగ్లా బోర్డు ఆందోళన వ్యక్తం చేస్తోంది.
ఐపీఎల్ జట్టు కేకేఆర్ నుంచి ముస్తాఫిజుర్ రెహ్మన్‌ను తప్పించడం కూడా రెండు బోర్డుల మధ్య దూరాన్ని పెంచిందని సమాచారం. భారత్ నుంచి తమ మ్యాచ్‌లను శ్రీలంకకు తరలించాలని లేదా తమ గ్రూప్‌ను మార్చాలని ఐసీసీని (ICC) బంగ్లాదేశ్ కోరింది.
ఐర్లాండ్‌తో 'గ్రూప్' గేమ్..
బంగ్లాదేశ్ ఒక వినూత్న ప్రతిపాదనను ఐసీసీ ముందు ఉంచింది. ఐర్లాండ్ ఉన్న గ్రూప్-బి లోని మ్యాచ్‌న్నీ శ్రీలంకలోనే జరగనున్నాయి. దీంతో, తమను గ్రూప్-బి కి మార్చి, ఐర్లాండ్‌ను గ్రూప్-సి కి పంపాలని బంగ్లాదేశ్ ప్రతిపాదించింది. తద్వారా తాము భారత్‌కు రాకుండా శ్రీలంకలోనే మ్యాచ్‌లు పూర్తి చేయవచ్చని వారి ప్లాన్.
బిగ్ ట్విస్ట్..
బంగ్లాదేశ్ చేసిన ఈ ప్రతిపాదనను ఐర్లాండ్ క్రికెట్ బోర్డు (CI) నిర్ద్వంద్వంగా తోసిపుచ్చింది. తమ షెడ్యూల్లో ఎలాంటి మార్పులు ఉండబోవని ఐర్లాండ్ స్పష్టం చేసింది. గ్రూప్ దశలో తాము శ్రీలంకలోనే ఆడతామని ఇప్పటికే తమకు స్పష్టమైన హామీలు లభించాయని ఐర్లాండ్ అధికారులు వెల్లడించారు. బంగ్లాదేశ్ కోసం తమ గ్రూప్‌ను మార్చుకునే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.
ప్రస్తుత గ్రూపుల పరిస్థితి..
గ్రూప్ B (శ్రీలంక వేదిక): ఐర్లాండ్, ఆస్ట్రేలియా, శ్రీలంక, జింబాబ్వే, ఒమన్.
గ్రూప్ C (భారత్ వేదిక): బంగ్లాదేశ్, వెస్టిండీస్, ఇటలీ, ఇంగ్లాండ్, నేపాల్.
ఐర్లాండ్ ససేమిరా అనడంతో ఇప్పుడు ఐసీసీ కఠిన నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. బంగ్లాదేశ్ భద్రతా కారణాలను ఐసీసీ పరిగణనలోకి తీసుకుంటుందా? లేక షెడ్యూల్ ప్రకారమే భారత్‌కు రావాలని ఆదేశిస్తుందా? అనేది చూడాలి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Dmart Business Strategy: నిత్యావసర సరుకులు అనగానే సామాన్యుడికి గుర్తొచ్చే మొదటి పేరు డీమార్ట్ (DMart). ఎంఆర్పి (MRP) ధర కంటే తక్కువకే వస్తువులు విక్రయించడం డీమార్ట్ ప్రత్యేకత. అయితే, అందరూ ఎక్కువ ధరకు అమ్ముతుంటే డీమార్ట్ మాత్రం ఇంత తక్కువకు ఎలా ఇస్తోంది? దీని వెనుక ఉన్న బిజినెస్ సీక్రెట్స్ (Business Secrets) గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
డీమార్ట్ విజయం వెనుక ఎటువంటి మాయాజాలం లేదు, కేవలం పక్కా వ్యాపార ప్రణాళిక మాత్రమే ఉంది. ఇతర రిటైల్ సంస్థలకు, డీమార్ట్‌కు ఉన్న ప్రధాన వ్యత్యాసాలు ఇవే..
1. మధ్యవర్తులు లేని వ్యాపారం (Direct Sourcing)
సాధారణంగా వస్తువులు తయారీదారు నుండి డిస్ట్రిబ్యూటర్లకు, అక్కడి నుండి రిటైలర్లకు చేరుతాయి. కానీ డీమార్ట్ మధ్యలో ఎవరినీ ఉంచదు. నేరుగా కంపెనీల నుంచే భారీ మొత్తంలో (Bulk) సరుకులను కొనుగోలు చేస్తుంది. దీనివల్ల మధ్యవర్తులకు వెళ్లే కమీషన్ తగ్గుతుంది. ఆ ప్రయోజనాన్ని కస్టమర్లకు బదిలీ చేస్తుంది.
2. తక్షణ చెల్లింపులు (Quick Payments)
చాలా సూపర్ మార్కెట్లు వస్తువులను కొనుగోలు చేసిన తర్వాత కంపెనీలకు నెలల తరబడి బిల్లులు చెల్లించవు. కానీ డీమార్ట్ సరఫరాదారులకు (Suppliers) కేవలం కొద్ది రోజుల్లోనే బిల్లులు క్లియర్ చేస్తుంది. ఈ నమ్మకంతో కంపెనీలు డీమార్ట్‌కు 'క్యాష్ డిస్కౌంట్' కింద తక్కువ ధరకు సరుకులను అందిస్తాయి.
3. సొంత భవనాలు - అద్దె భారం లేదు
డీమార్ట్ అనుసరించే అతిపెద్ద వ్యూహం ఇదే. చాలా రిటైల్ సంస్థలు మాల్స్‌లో భారీ అద్దెలు చెల్లించి స్టోర్లు నడుపుతాయి. కానీ డీమార్ట్ తన స్టోర్ల కోసం స్థలాలను సొంతంగా కొనుగోలు చేస్తుంది లేదా శాశ్వత భవనాలను నిర్మిస్తుంది. దీని వెనుక ఉన్న లాభం ఏమిటంటే.. ప్రతి నెలా లక్షల రూపాయల అద్దె భారం తప్పుతుంది. ఈ ఆదా చేసిన మొత్తాన్నే కస్టమర్లకు డిస్కౌంట్ల రూపంలో ఇస్తుంది.
4. లో-కాస్ట్ ఇంటీరియర్ (Simple Setup)
డీమార్ట్‌లో మీరు గమనిస్తే ఆకర్షణీయమైన డెకరేషన్లు, ఖరీదైన లైటింగ్ ఉండవు. స్టోర్ సెటప్ చాలా సాదాసీదాగా ఉంటుంది. అనవసరపు ఖర్చులను తగ్గించుకుని, కేవలం వస్తువుల విక్రయంపైనే దృష్టి పెడుతుంది.
5. ఫాస్ట్ మూవింగ్ గూడ్స్ (FMCG Focus)
ప్రజలకు ప్రతిరోజూ అవసరమయ్యే నిత్యావసర వస్తువులనే డీమార్ట్ ఎక్కువగా విక్రయిస్తుంది. వీటిని ఎవరైనా సరే కొని తీరాల్సిందే. దీనివల్ల వస్తువులు స్టాక్ పేరుకుపోకుండా వేగంగా అమ్ముడవుతాయి. ఫలితంగా తక్కువ మార్జిన్ ఉన్నప్పటికీ లాభాలు ఎక్కువగా వస్తాయి.
చివరిగా ఒక్క మాటలో చెప్పాలంటే.. "తక్కువ లాభం - ఎక్కువ అమ్మకాలు" అనే సూత్రంపై డీమార్ట్ నడుస్తోంది. ఒక్కో వస్తువుపై తక్కువ లాభం తీసుకున్నా, వేల సంఖ్యలో కస్టమర్లు రావడం వల్ల డీమార్ట్ దేశంలోనే అత్యంత విజయవంతమైన రిటైల్ బ్రాండ్‌గా నిలిచింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Weight Loss Exercises Plan: బరువు తగ్గడం అనేది కేవలం సౌందర్యానికి సంబంధించింది మాత్రమే కాదు, ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి కూడా చాలా ముఖ్యం. ముఖ్యంగా మహిళల్లో వచ్చే హార్మోన్ల అసమతుల్యత, పీరియడ్స్ సమస్యలను నివారించడంలో ఈ వ్యాయామాలు ఎంతో తోడ్పడతాయి.
1. జంపింగ్ జాక్స్ (Jumping Jacks)
ఇది పూర్తి శరీరానికి మంచి కదలికను ఇస్తుంది. అందుకు కోసం నిటారుగా నిలబడి గాలిలోకి ఎగురుతూ కాళ్లను పక్కకు జరపాలి, అదే సమయంలో చేతులను పైకి ఎత్తి చప్పట్లు కొట్టినట్లుగా చేయాలి. ఇలా చేయడం వల్ల బొడ్డు దగ్గర తొడల దగ్గర పేరుకుపోయిన మొండి కొవ్వును కరిగించడంలో చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది.
2. ఫ్రంట్ హ్యాండ్ జంప్స్ (Front Hand Jumps)
నిలబడి రెండు చేతులను నేరుగా ముందుకు చాచాలి. చిన్నగా దూకుతూ చేతులను పైకి, కిందకు ఆడిస్తూ ఉండాలి. ఇలా రోజుకు 30 నుండి 60 సార్లు చేయడం వల్ల చేతులు, భుజాల దగ్గర కొవ్వు తగ్గడమే కాకుండా మొత్తం శరీర బరువు అదుపులోకి వస్తుంది.
3. మౌంటైన్ క్లైంబర్స్ (Mountain Climbers)
నేలపై బోర్లా పడుకుని పుష్-అప్ భంగిమలోకి రావాలి. చేతులపై బ్యాలెన్స్ చేస్తూ, పరిగెడుతున్నట్లుగా ఒక్కో కాలును ఛాతీ వరకు వేగంగా మడిచి మళ్ళీ వెనక్కి చాచాలి. అలా చేయడం వల్ల పొట్ట కండరాలను దృఢంగా మార్చి, నడుము చుట్టుకొలతను తగ్గిస్తుంది.
4. సైడ్ స్ట్రెచెస్ (Side Stretches)
ఈ వ్యాయామం చేయాలంటే కాళ్లను కొద్దిగా దూరం జరిపి నిలబడాలి. కుడి చేతితో కుడి కాలు పాదాన్ని తాకడానికి ప్రయత్నిస్తూ నడుమును వంచాలి. అదే సమయంలో ఎడమ చేతిని నిటారుగా పైకి ఎత్తాలి. ఇలా రెండు వైపులా మార్చి మార్చి చేయాలి. అలా చేయడం వల్ల సైడ్ ఫ్యాట్ (నడుము పక్కల ఉండే కొవ్వు) కరగడానికి ఇది ఉత్తమ వ్యాయామం.
5. నీ-టు-ఎల్బో జంప్స్ (Knee-to-Elbow Jumps)
ఇది చేసే విధానం.. చేతులను తల వెనుక లేదా చెవుల దగ్గర ఉంచుకోవాలి. గాలిలోకి ఎగురుతూ కుడి మోకాలిని ఎడమ మోచేతికి తాకించడానికి ప్రయత్నించాలి. ఇలా రెండు కాళ్లతో మార్చి మార్చి చేయాలి. ఇది గుండె స్పందన రేటును పెంచి (Cardio), శరీరంలోని క్యాలరీలను వేగంగా ఖర్చు చేస్తుంది.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
క్రమం తప్పకుండా: ఈ వ్యాయామాలను ప్రతిరోజూ 30 నుండి 60 సార్లు (సెట్ల రూపంలో) పునరావృతం చేయాలి.
నీరు: వ్యాయామం చేసే సమయంలో శరీరం డీహైడ్రేషన్ అవ్వకుండా తగినంత నీరు తాగుతూ ఉండాలి.
ఆహారం: నూనె పదార్థాలు, చక్కెర తగ్గించి ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారం తీసుకోవాలి.
(గమనిక: ఈ సమాచారం ప్రాథమిక అవగాహన కోసం మాత్రమే. ఏదైనా తీవ్రమైన ఆరోగ్య సమస్యలు లేదా వెన్నునొప్పి ఉన్నవారు నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ వ్యాయామాలు ప్రారంభించడం మంచిది. దీన్ని జీ తెలుగు న్యూస్ ధ్రువీకరించడం లేదు.)
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Night Skin Care Routine: చాలామంది ఉదయం స్కిన్ కేర్ రొటీన్ ఫాలో అయితే సరిపోతుందని అనుకుంటారు. ఉదయం అంతా అలసిపోయిన తర్వాత రాత్రి సమయంలో మంచి స్కిన్ కేర్ రొటీన్ ఫాలో అవ్వడం చాలా ముఖ్యం. దీనివల్ల మీ చర్మం తాజాగా అందంగా మెరుస్తూ కనిపిస్తుంది. రాత్రి పడుకునే ముందు మీ చర్మానికి మంచి పోషణ అందించే విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే డే మాత్రమే కాదు.. మీ నైట్ స్కిన్ కేర్ రొటీన్ కూడా ఎలా ఉండాలో తెలుసుకుందాం..
మేకప్..
చాలామంది రోజంతా మేకప్ వేసుకొని ఉంటారు. రాత్రి పడుకునే ముందు ఆ మేకప్ తప్పనిసరిగా తీసి వేయాలి. ముఖాన్ని కాటన్ వైప్స్‌తో క్లీన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది ముఖంపై రంధ్రాలు రాకుండా.. జీవం కోల్పోకుండా చేస్తాయి. లేకపోతే రాను రాను ముఖం పాడయ్యే అవకాశం ఉంది.
ఆ తర్వాత ముఖాన్ని క్లెన్స్ చేసుకోవడం అలవాటు చేసుకోవాలి. తద్వారా ముఖంపై ఉండే మలినాలు ,అదనపు నూనె తొలగిపోతాయి. ప్రతిరోజు ముఖాన్ని క్లెన్స్ చేసుకోవాలి. ముందుగా గోరువెచ్చని నీటితో ముఖాన్ని వాష్ చేసుకోవాలి. ఆ తర్వాత మీ చర్మానికి మంచి టోనర్ కూడా అందించాలి. ఇది చర్మం పీహెచ్ స్థాయిలను సమతులం చేస్తుంది. మంచి హైడ్రేషన్ కూడా మన చర్మానికి అందిస్తుంది.
ఆ తర్వాత వెంటనే ముఖానికి మంచి హైరోలోనిక్ యాసిడ్ వంటి సీరమ్స్ అప్లై చేయాలి. ఇందులో ముఖానికి హైడ్రేషన్ అందించే గుణాలు ఉంటాయి. ఇలాంటి టోనర్స్ లో విటమిన్ సీ ముఖానికి కాంతివంతం చేస్తుంది. యాక్నే తొలగిపోతుంది.ఆ తర్వాత ముఖానికి మాయిశ్చర్ రాయాలి. రోజు రాత్రి పడుకునే ముందు తప్పకుండా ముఖానికి మాయిశ్చర్ రాయడం అలవాటు చేసుకోవాలి. తద్వారా ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు స్కిన్ రిపేర్ చేసే గుణాలు ఉంటాయి.
రాత్రి పడుకునే ముందు మాయిశ్చరైజర్ మాత్రమే కాదు.. మీ కంటికి ఐ క్రీం రాయడం మర్చిపోకూడదు. ఇది లైట్ వెయిట్ ఐ క్రీమ్ అయితే బెస్ట్. తద్వారా కళ్ల కింద ఉండే నల్ల మచ్చలు, గీతాలు తొలగిపోతాయి. ప్రతి వారానికి రెండుసార్లు ఓవర్ నైట్ మాస్కులు కూడా వేసుకోవడం అలవాటు చేసుకోవాలి. ఇది చర్మానికి మంచి హైడ్రేషన్ అందించి పునరుజ్జీవనం కూడా అందిస్తుంది.
ఇక హైడ్రేషన్ అంటే కేవలం మాయిశ్చరైజర్ మాత్రమే కాదు.. రోజు సరిపడా నీళ్లు తాగడం అలవాటు చేసుకోవాలి. ప్రతిరోజు కనీసం 8 గంటల నిద్ర అవసరం. ఇది బ్యూటీ స్లీప్ అని కూడా పిలుస్తారు. ముఖానికి మంచి నిద్ర ఎక్కువగా నీరు తీసుకోవడం వల్ల మీ స్కిన్ కేర్ రొటీన్ లో మీ ముఖం కాంతివంతంగా మారిపోతుంది. (Disclaimer: ఈ కథనం ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న సమాచారం. వీటిని పాటించే ముందు వైద్య సలహా తీసుకోవాలి. ఈ సమాచారాన్ని Zee Media ధృవీకరించలేదు)
ALso Read: గుడ్లతో ఈ 5 ఫుడ్స్ తింటున్నారా? అయితే వెంటనే ఆపేయండి, నిపుణుల షాకింగ్ సలహా..
ALso Read: ఖరీదైన క్రీములు అవసరం లేదు.. మన ఇంట్లోనే ఉన్న ఈ 7 పదార్థాలే నిజమైన బ్యూటీ సీక్రెట్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Sudheer Rashmi Latest News: యాంకర్ రష్మీ గౌతమ్ అంటే బుల్లితెర ప్రేక్షకులకు ఒక ప్రత్యేకమైన అభిమానం. ముఖ్యంగా సుడిగాలి సుధీర్, రష్మీల ఆన్-స్క్రీన్ కెమిస్ట్రీకి విపరీతమైన ఫ్యాన్ బేస్ ఉంది. అయితే గత కొంతకాలంగా వీరిద్దరూ కలిసి కనిపించకపోవడంతో రకరకాల పుకార్లు షికారు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో రష్మీ ఒక ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు.
సుధీర్‌తో తనకు గొడవ జరిగిందన్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదని యాంకర్ రష్మీ స్పష్టం చేశారు. తన సినిమా ప్రమోషన్ల కోసం సుధీర్ ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడని, వారి మధ్య స్నేహం అలాగే ఉందని తెలిపారు. అలాగే తన సినిమా గురించి తెలిసి సుధీర్ స్వయంగా ఫోన్ చేసి, "నీ సినిమా కోసం నేను ఏం చేయగలను?" అని అడిగారని రష్మీ గుర్తు చేసుకున్నారు. ప్రదీప్, రోషన్ వంటి స్నేహితుల తరహాలోనే సుధీర్ కూడా తనకు అండగా నిలుస్తాడని ఆమె పేర్కొన్నారు.
టీవీ షోలకు సుధీర్ రాకపై..
సుధీర్ మళ్లీ టీవీ షోలకు తిరిగి రావాలన్నది తన వ్యక్తిగత నిర్ణయం కాదని, అది పూర్తిగా మేనేజ్మెంట్ తీసుకునే నిర్ణయమని రష్మీ వెల్లడించారు. సుధీర్‌కు తానెప్పుడూ ప్రత్యేకంగా మెసేజ్ చేయాల్సిన అవసరం లేదని, అవసరమైనప్పుడు తను ఎప్పుడూ తనకు తోడుగా ఉంటాడనే నమ్మకం ఉందని ఆమె చెప్పుకొచ్చారు.
ప్రస్తుతం ఒక పెద్ద షోను రెండు గంటల పాటు ఒంటరిగా నడుపుతుండటంపై రష్మీ సంతోషం వ్యక్తం చేశారు. ఈ షో రేటింగ్ పరంగా అద్భుతంగా దూసుకుపోతోందని, తన చిలిపి పనులు కూడా షో విజయానికి తోడ్పడుతున్నాయని ఆమె తెలిపారు. ఆడియన్స్ తనను సొంత ఇంట్లోని అమ్మాయిలా చూసుకుంటున్నారని, తన విజయానికి వారే ప్రధాన కారణమని కృతజ్ఞతలు తెలిపారు.
బయట జరుగుతున్న ప్రచారం కేవలం వదంతులేనని.. సుధీర్, తన మధ్య స్నేహబంధం ఇప్పటికీ బలంగానే ఉందని రష్మీ క్లారిటీ ఇవ్వడంతో అభిమానులు ఊపిరి పీల్చుకుంటున్నారు. ప్రస్తుతం రష్మీ అటు షోలతో పాటు సినిమాలపై కూడా దృష్టి సారిస్తోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
AR Rehman controversy Said Sorry: ఆస్కార్ విజేత, భారతీయ సంగీత దిగ్గజం ఏఆర్ రెహమాన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సినీ వర్గాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. గత కొన్నేళ్లుగా హిందీ చిత్ర పరిశ్రమలో తనకు అవకాశాలు తగ్గడానికి గల కారణాల గురించి ఇటీవల ఒక ఇంటర్వ్యూలో రెహమాన్ విశ్లేషిస్తూ ‘‘ఎనిమిదేళ్లుగా ఇండస్ట్రీలో పవర్ షిప్ట్ జరిగింది క్రియేటివిటీ లేని వాళ్ల చేతుల్లోకి అధికారం వెళ్లింది. దీనికి మతపరమైన వివక్ష కూడా కారణమై ఉండొచ్చన్నారు. తన వ్యాఖ్యల ఉద్దేశం సంగీతానికి గౌరవం దగ్గడమేనని చెప్పారు. తాను ఎప్పుడూ బాధ పెట్టాలని అనుకోలేదన్నారు. తన నిజాయితీని గుర్తిస్తారని ఆశిస్తున్నానని వ్యాఖ్యానించారు ఏఆర్ రెహమాన్.రెహమాన్ చేసిన మత వివక్ష ఆరోపణలను చాలామంది తప్పుబడుతున్నారు. రెహమాన్ నుంచి ఇలాంటి స్టేట్మెంట్ రావడం నమ్మలేకపోతున్నానని, అంతర్జాతీయ ప్రాజెక్ట్స్, విదేశీ కాన్సర్ట్స్, పెద్ద సినిమాలతో ఆయన బిజీగా ఉంటారనే ఉద్దేశ్యంతో చాలామంది నిర్మాతలు ఆయన్ను సంప్రదించలేకపోవచ్చు అని సీనియర్ స్క్రీన్ రైటర్ జావేద్ అక్తర్ అన్నారు.
ఒకవేళ మత వివక్ష ఉంటే కొందరు హీరోలు ఇప్పటికీ స్టార్స్‌గా ఉండేవారు కాదని ఆయన అభిప్రాయపడ్డారు. ఇక తనకు కూడా అవకాశాలు తగ్గాయని, అంతమాత్రాన అవకాశాలు రాకపోవడానికి మతాన్ని ముడిపెట్టడం సరికాదని సింగర్ షాన్ అన్నారు. రెహమాన్ డేంజరస్ కామెంట్స్ చేశారని, వ్యక్తిగత వైఫల్యాలకు ఇండస్ట్రీని నిందించడం సరికాదని రచయిత్రి శోభా డే మండిపడ్డారు.
Read more: సమంత బాటలో దర్శకులను పెళ్లి చేసుకున్న హీరోయిన్స్ వీళ్లే..
Read more: సమంత కంటే ముందు రెండో పెళ్లి చేసుకున్న హీరోయిన్స్ వీళ్లే..! పూర్తి లిస్ట్ ఇదే..!
రెహమాన్ కామెంట్స్ రాజకీయ చర్చకు కూడా దారితీశాయి. ఒకప్పుడు హిందువు అయిన రెహమాన్ , తనకు మళ్లీ అవకాశాలు కావాలంటే ఘర్ వాపసీ అవ్వాలని వీహెచ్‌పీ నేత వినోద్ బన్సల్ అన్నారు. ఇండస్ట్రీని నిందించే ముందు రెహమాన్ ఆత్మపరిశీలన చేసుకోవాలని సూచించారు. గతేడాది ఈయన ‘ఛావా’ సినిమాకు అద్భుతమైన మ్యూజిక్ కంపోజ్ చేశారు.
Also Read: వెయ్యి కోట్ల దర్శకులు.. ‘దురంధర్’తో ఈ క్లబ్బులో ఎంట్రీ ఇచ్చిన ఆదిత్యధర్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.
Bandla Ganesh Sankalp Yatra: సినీ నిర్మాత బండ్ల గణేశ్ తన ఇష్టదైవమైన తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామికి మొక్కుకున్న మొక్కును తీర్చుకోవడానికి సిద్ధమయ్యారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు తాను పెట్టుకున్న 'సంకల్పం' నెరవేరినందుకు కృతజ్ఞతగా ఆయన ఈ పాదయాత్రను చేపడుతున్నట్లు స్పష్టం చేశారు.
తనదైన శైలిలో వ్యాఖ్యలు చేస్తూ ఎప్పుడూ వార్తల్లో ఉండే నిర్మాత బండ్ల గణేశ్, ఇప్పుడు ఒక ఆధ్యాత్మిక, భావోద్వేగ ప్రయాణానికి శ్రీకారం చుట్టారు. అప్పుడు చంద్రబాబు కోసం మొక్కుకున్న మొక్కును తీర్చుకోవడానికి తన ఇంటి నుంచే తిరుమలకు నడక ప్రారంభించనున్నారు.
ఏమిటా మొక్కు? ఎందుకీ యాత్ర?
గత వైకాపా ప్రభుత్వ హయాంలో చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన సమయంలో బండ్ల గణేశ్ తీవ్ర మనోవేదనకు గురైనట్లు ఆయన చెప్పుకొచ్చారు. చంద్రబాబుపై వేసిన అభాండాలు తొలగిపోయి, ఆయన క్షేమంగా బయటకు రావాలని అప్పట్లో సుప్రీంకోర్టు గడపపై నిలుచుని స్వామివారిని వేడుకున్నట్లు ఆయన తెలిపారు.
చంద్రబాబు జైలు నుంచి విడుదలయ్యాక, తన ఇంటి గడప నుండి తిరుమల కొండ వరకు పాదయాత్ర చేస్తానని మొక్కుకున్నట్లు సినీ నిర్మాత బండ్ల గణేశ్ వెల్లడించారు. జనవరి 19న (సోమవారం) ఉదయం 9 గంటలకు షాద్‌నగర్‌లోని ఆయన నివాసం నుంచి ఈ 'సంకల్ప యాత్ర' మొదలవుతుంది. తన తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకుని, ఇంటి ముందు కొబ్బరికాయ కొట్టి ఈ సుదీర్ఘ యాత్రను బండ్ల గణేశ్ ప్రారంభించనున్నారు.
ఇది రాజకీయం కాదు.. కేవలం కృతజ్ఞత!
ఈ యాత్ర గురించి బండ్ల గణేశ్ స్పందిస్తూ.. ఇది ఎటువంటి రాజకీయ ఉద్దేశంతో చేస్తున్న యాత్ర కాదని స్పష్టం చేశారు. "ప్రతి తెలుగువాడి ప్రార్థనల వల్ల చంద్రబాబు మళ్లీ అఖండ విజయం సాధించి, పూర్వ వైభవాన్ని పొందారు. ఇటీవల ఆయనపై ఉన్న కేసులన్నీ కొట్టేయడంతో నా మనసు కుదుటపడింది. నా కోరిక నెరవేర్చిన ఆ కలియుగ ప్రత్యక్ష దైవానికి నా మొక్కును చెల్లించుకుంటున్నాను" అని ఆయన పేర్కొన్నారు.
వందలాది కిలోమీటర్ల మేర సాగనున్న ఈ పాదయాత్ర ఇప్పుడు అటు సినీ వర్గాల్లో, ఇటు రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. తన నాయకుడిపై ఉన్న అభిమానాన్ని బండ్ల గణేశ్ ఈ విధంగా చాటుకుంటున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Tirumala April Quota Release Date: తిరుమల శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) తీపి కబురు అందించింది. 2026 ఏప్రిల్ నెలకు సంబంధించిన దర్శనం, ఆర్జిత సేవలు, గదుల కేటాయింపు కోటాను విడుదల చేసే తేదీలను ప్రకటించింది. భక్తులు తమ ప్రయాణాన్ని ప్లాన్ చేసుకునేందుకు వీలుగా పూర్తి షెడ్యూల్ వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దర్శనం కోసం వేచి చూస్తున్న భక్తులు అధికారిక వెబ్సైట్ ద్వారా టికెట్లను బుక్ చేసుకోవచ్చు. గతంలో ఇంటర్నెట్లో దర్శనం ఇచ్చిన అనుమానాస్పద లింక్ ఇప్పుడు పూర్తిగా తీసివేయబడింది. ఈ క్రమంలో టికెట్లు విడుదలయ్యే తేదీలు, సమయాల వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
1) జనవరి 19వ తేదీ ఉదయం 10 గంటలకు సుప్రభాతం, తోమాల వంటి ఆర్జిత సేవల 'లక్కీ డిప్' రిజిస్ట్రేషన్‌తో ప్రారంభమై, జనవరి 21వ తేదీ ఉదయం వరకు కొనసాగుతుంది.
2) జనవరి 22న ఉదయం 10 గంటలకు కల్యాణోత్సవం వంటి ఇతర ఆర్జిత సేవలు, మధ్యాహ్నం 3 గంటలకు వర్చువల్ సేవల కోటా విడుదలవుతుంది.
3) జనవరి 23వ తేదీన ఉదయం 10 గంటలకు అంగప్రదక్షిణ టోకెన్లు, 11 గంటలకు శ్రీవాణి ట్రస్ట్ టికెట్లు, మధ్యాహ్నం 3 గంటలకు వయోవృద్ధులు, దివ్యాంగుల ప్రత్యేక కోటా అందుబాటులోకి వస్తాయి.
4) శ్రీవారి భక్తులు ఎంతగానో వేచి చూసే రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లతో పాటు తిరుమల, తిరుపతిలో గదుల బుకింగ్ కోటా జనవరి 24న వరుసగా ఉదయం 10 గంటలకు.. మధ్యాహ్నం 3 గంటలకు విడుదల కానున్నాయి.
5) చివరగా జనవరి 27న మధ్యాహ్నం 3 గంటలకు శ్రీవారి సేవ, పరకామణి సేవ కోటాను విడుదల చేయనున్నారు. భక్తులు ఈ తేదీలను గమనించి టీటీడీ అధికారిక వెబ్సైట్ ద్వారా సకాలంలో తమ టికెట్లను బుక్ చేసుకోవచ్చు.
ముఖ్య గమనిక..
జనవరి 19న రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి 21వ తేదీన లక్కీ డిప్ తీస్తారు. విజేతలు 23వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు నగదు చెల్లించాల్సి ఉంటుంది. భక్తులు కేవలం TTD అధికారిక వెబ్సైట్ ద్వారా మాత్రమే టికెట్లు బుక్ చేసుకోవాలి. నకిలీ వెబ్సైట్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని TTD కోరింది. వేసవి సెలవుల కారణంగా ఏప్రిల్ నెలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది, కాబట్టి టికెట్లు విడుదలైన వెంటనే బుక్ చేసుకోవడం మంచిది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Telangana Chief Minister Revanth Khammam Tour: సీఎం రేవంత్‌రెడ్డి నేడు ఖమ్మం జిల్లాలో పర్యటించ నున్నారు. పాలేరు నియోజకవర్గంలో 362 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులకు ఆయన శ్రీకారం చుట్టనున్నారు. ఇటు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల అనంతరం కాంగ్రెస్ మునిసిపల్ ఎన్నికల ప్రచార సభలో పాల్గొంటారు. ఆ తర్వాత ఖమ్మంలో జరిగే సీపీఐ శతాబ్ది ముగింపు ఉత్సవాల సభకు హాజరై ప్రసంగిస్తారు. అనంతరం అక్కడి నుంచి మేడారం పయనవుతారు.
హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో బయల్దేరనున్న సీఎం రేవంత్ మద్దులపల్లి వద్ద హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. అక్కడ 108.60 కోట్ల రూపాయలతో జేఎన్టీయూ ఇంజనీరింగ్ కాలేజీ నూతన భవనాలకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం అక్కడే 45 కోట్ల రూపాయలతో నిర్మించిన మద్దులపల్లి నర్సింగ్ కళాశాల భవనాలను ప్రారంభిస్తారు. అలాగే మద్దులపల్లిలో 19.90 కోట్లతో నిర్మించిన వ్యవసాయ నూతన మార్కెట్ భవనాలను కూడా సీఎం ప్రారంభించనున్నారు.
Read more: సమంత కంటే ముందు రెండో పెళ్లి చేసుకున్న హీరోయిన్స్ వీళ్లే..! పూర్తి లిస్ట్ ఇదే..!
Read more: సమంత బాటలో దర్శకులను పెళ్లి చేసుకున్న హీరోయిన్స్ వీళ్లే..
ఇటు రూ. 162.54 కోట్లతో మున్నేరు వృథా జలాలను పాలేరు రిజర్వాయర్‌కు అనుసంధానం చేసే 9.5 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్ పనులకు కూడా శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం మద్దులపల్లిలో మంత్రి పొంగులేటి అధ్యక్షతన జరిగే కాంగ్రెస్ మునిసిపల్ ఎన్నికల ప్రచార సభలో సీఎం పాల్గొంటారు.అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు ఖమ్మం ఎస్సార్ అండ్ బీజీఎన్నార్ కళాశాల మైదానంలో జరిగే సీపీఐ శతాబ్ది ఉత్సవాల ముగింపు సభకు హాజరై ప్రసంగిస్తారు. తర్వాత హెలికాప్టర్లో మేడారం బయలుదేరి వెళ్తారు. సీఎం పర్యటనకు సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు.
Also Read: వెయ్యి కోట్ల దర్శకులు.. ‘దురంధర్’తో ఈ క్లబ్బులో ఎంట్రీ ఇచ్చిన ఆదిత్యధర్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.
Sankratni Return Journey Full Traffic Jam: సంక్రాంతి పండగ ముగియడంతో పల్లెలకు వెళ్ళిన ప్రజలు మళ్ళీ హైదరాబాద్ తిరుగు బాట పట్టారు. రిటర్న్ జర్నీతో విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారి రద్దీగా మారింది. దీంతో రిటర్న్ జర్నీలో ప్రజలు నరకయాతన చూస్తున్నారు. ఈ రోజు పుష్య బహుళ అమావాస్య అంతేకాదు సంక్రాంతి పండగ తర్వాత మాఘమాసం ముందు వచ్చే మౌనీ అమావాస్య కావడంతో చాలా మంది నిన్న సాయంత్రమే సొంతూళ్ల నుంచి హైదరాబాద్ కు తిరుగు ప్రయాణమయ్యారు. ఆదివారం మౌనీ అమావాస్య మంచిది కాకపోవడంతో అందరు నిన్ననే పోలోమంటూ బయలు దేరడంతో ఒక్కసారిగా జాతీయ రహదారి కిక్కిరిసి పోయింది.
ఉమ్మడి కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాలు, విశాఖ, గుంటూరు, ఒంగోలు నెల్లూరు నుంచి వచ్చే వాహనదారులు హైదరాబాద్ హై వే పైకి రావడంతో రద్దీ ఎక్కువైంది. రద్దీ ఏ మేరకు పెరిగిందంటే గుంటుపల్లి నుంచి ఇబ్రహీంపట్నం రింగు రోడ్ జంక్షన్ వరకూ దూరం ఉన్న 5 కిలోమీటర్లు ప్రయాణానికి గంటన్నర పడుతోంది.
Also Read: వెయ్యి కోట్ల దర్శకులు.. ‘దురంధర్’తో ఈ క్లబ్బులో ఎంట్రీ ఇచ్చిన ఆదిత్యధర్..
అటు చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ ప్లాజా వద్ద వాహనాలు బారులు తీరాయి. వాహానాలకు స్పెషల్ ట్యాగ్స్ ఉన్నా.. వాహనాలు ఒక్కొక్కటిగా నెమ్మడిగా కదులుతున్నాయి. మొత్తంగా పంతంగి టోల్ ప్లాజా ఇపుడు జాతరను తలపిస్తోంది. మొత్తంగా కొన్ని గంటలు పట్టే సమయం కూడా వాహనాల రద్దీ నేపథ్యంలో మూడు నాలుగు గంటలు ఆలస్యమవుతుంది. మొత్తంగా ఈ రోజు కాకుండా రేపు కూడా జాతీయ రహదారిపై రద్దీ ఉండే అవకాశాలు లేకపోలేదు. దీంతో ప్రజలు రోడ్డుపైనే నరక యాతన అనుభవిస్తున్నారు.
Read more: సమంత బాటలో దర్శకులను పెళ్లి చేసుకున్న హీరోయిన్స్ వీళ్లే..
Read more: సమంత కంటే ముందు రెండో పెళ్లి చేసుకున్న హీరోయిన్స్ వీళ్లే..! పూర్తి లిస్ట్ ఇదే..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.