Back
రెండవ రోజు కొనసాగుతున్న రాష్ట్రస్థాయి బాల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్
Gollet, Telangana
రెబ్బెన మండలం బులెట్ టౌన్షిప్ లో శనివారం ప్రారంభమైన 71వ రాష్ట్రస్థాయి పురుషులు మహిళల బాల్ బ్యాడ్మింటన్ క్రీడలు రెండవ రోజు ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా ఆదిలాబాద్ నిజామాబాద్ జట్ల క్రీడాకారులను బెల్లంపల్లి ఏరియా డీజీఎం సివిల్ భాష, ఎస్ ఓ టు జి ఎం రాయమల్లు తదితర అధికారులు పరిచయం చేసుకున్నారు ఈ కార్యక్రమంలో బాల్ బాడ్మింటన్ అసోసియేషన్ రాష్ట్ర, జిల్లా బాధ్యులు ఆర్ నారాయణ రెడ్డి, ఎస్ తిరుపతి, కే భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
13
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
Gollet, Telangana:
రెబ్బెన మండలం గోలేటి గ్రామపంచాయతీ పరిధిలోని మానేపల్లి కుంట పూర్తిగా నుండి మత్తడి దుంపడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఇటీవల కురిసిన భారీ వర్షాలకు మానేపల్లి కుంట పూర్తిగా నిండి రైతులకు వరంగా మారింది ఈ కుంట కింద వందలాది ఎకరాల వారి పొలాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ కుంట కింది రైతులు కొంతమంది వరి నాట్లు పూర్తి చేసుకోగా మిగిలిన రైతులు నాట్లు వేసుకోవడానికి సిద్ధమవుతున్నారు
9
Report
Gollet, Telangana:
రాన్రాను పశు సంపద క్షీనిస్తున్నదని, దీంతో వాతావరణ సమతుల్యమ్ దెబ్బ తింటుందని పర్యావరణ ప్రేమికులు ఎంత మొత్తుకున్నా లాభంలేకుండా పోతుంది.రెబ్బెన మండల కేంద్రంతోపాటు గోలేటి GP లో కొంతమంది యజమానులు తమ పశువుల్ని గాలికి వదిలేస్తున్నారు.వాటిని విక్రయంచి డబ్బులు పొందుతున్నవారు వాటి బాగోగుల గురించి మాత్రం పట్టించుకోవడం లేదు. పగలు రాత్రి వీదుల్లో సంచరిస్తూ ప్రజలకు ఇబ్బంది కలిగిస్తున్నాయి. రెబ్బెన జాతీయ రహదారి, గోలేటి ప్రధాన రోడ్డుపైన తిరుగుతూ వాహనాల రాక పోకలకు ఆటంకం కలిగించడంతోపాటు ప్రమాదాలకు గురవుతున్నాయి
13
Report
Gollet, Telangana:
సింగరేణి సంస్థకు వచ్చిన లాభాలను వెంటనే ప్రకటించి కార్మికులకు 40 శాతం లాభాల వాటా చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో శనివారం గోలేటిలోని జిఎం కార్యాలయం ముందు ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఏఐటియుసి బెల్లంపల్లి రీజియన్ అధ్యక్షులు బోగే ఉపేందర్ మాట్లాడుతూ సంస్థకు లాభాలు రావడంలో ట్రాన్స్పోర్ట్ కార్మికులు ఎంతో శ్రమిస్తున్నారని సింగరేణి కార్మికులతో పాటు వారికి కూడా 40 శాతం లాభాల వాటా చెల్లించాలన్నారు. కార్మికులకు ఈఎస్ఐ, పిఎఫ్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు.
14
Report
Gollet, Telangana:
పారిశ్రామిక ప్రాంతమైన గోలేటిలో నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి పురుషులు, మహిళల బాల్ బ్యాడ్మింటన్ పోటీల ప్రారంభోత్సవం సందర్భంగా పలువురు విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. భరతనాట్యం, గ్రూప్ డాన్సులతో విద్యార్థులు ఉర్రూతలూగించారు. సాంస్కృతిక కార్యక్రమాలలో ప్రతిభను కనబరిచిన విద్యార్థులను ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవా లక్ష్మి, బి బి ఏ జిల్లా అధ్యక్షులు కొత్తపల్లి శ్రీనివాస్, బెల్లంపల్లి ఏరియా జిఎం, లయన్స్ క్లబ్ గవర్నర్ ఆర్ నారాయణ రెడ్డి, పలువురు క్రీడాకారులు అభినందించారు.
13
Report
Gollet, Telangana:
క్రీడాకారులు క్రమశిక్షణ పాటిస్తూ స్వయంకృషితో అభివృద్ధి చెందాలని సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు అన్నారు ఆదివారం గోలేటి లో జరిగిన 71వ బాల్ బ్యాడ్మింటన్ పోటీల బహుమతి ప్రధానోత్సవ సభలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు పురుషుల్లో విజేతలుగా నిలిచిన వరంగల్ జట్టుకు మహిళల్లో ఛాంపియన్గా నిలిచిన ఆదిలాబాద్ జట్టుకు బహుమతులు అందజేశారు ఈ కార్యక్రమంలో బి బి ఏ జిల్లా అధ్యక్షులు డాక్టర్ కొత్తపల్లి శ్రీనివాస్ ప్రధాన కార్యదర్శి ఎస్ తిరుపతి విజయభాస్కర్ రెడ్డి పలువురు క్రీడా సంఘాల నాయకులు పాల్గొన్నారు
14
Report
Gollet, Telangana:
ఆసిఫాబాద్ జిల్లాలో పొలాల అమావాస్య పండగను శనివారం రాత్రి అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకున్న ప్రజలు ఆదివారం అదే ఉత్సాహంతో బడగ పండగ కూడా జరుపుకుంటున్నారు. శనివారం ఎద్దులను అలంకరించి మాంసాహారం ముట్టకుండా నియమనిష్టలతో పూజలు చేసిన ప్రజలు ఆదివారం విందు భోజనాలకు సిద్ధమవుతున్నారు. ముఖ్యంగా రైతు కుటుంబాల వారు మందు, విందులతో పండగ జరుపుకుంటున్నారు దీంతో జిల్లాలోని మటన్, చికెన్, చాపల దుకాణాలు కిక్కిరిసిపోతున్నాయి జిల్లాలో రైతు కుటుంబాల వారు పరస్పరం పండగ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నారు.
11
Report
Gollet, Telangana:
ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో క్రీడల అభివృద్ధికి అన్ని రకాల సహకారమందిస్తామని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మీ అన్నారు శనివారం గోలేటి టౌన్షిప్ లో జరిగిన రాష్ట్రస్థాయి బాల్ బ్యాడ్మింటన్ పురుషులు మహిళల క్రీడల ప్రారంభోత్సవం కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు క్రీడలకు సింగరేణి యాజమాన్యం పూర్తిగా సహకరించడం అభినందనీయమని అన్నారు గోలేటిలో ఇలాంటి క్రీడలు నిర్వహించడం క్రీడాకారులకు ఎంతో ప్రోత్సాహంగా ఉంటుందని అన్నారు.
14
Report
Gollet, Telangana:
రెబ్బెన మండలంలోని క్రీడా గ్రామమైన గోలేటి టౌన్షిప్ లో నేటి నుంచి రెండు రోజులపాటు నిర్వహించే రాష్ట్రస్థాయి పురుషులు,మహిళల బాల్ బ్యాడ్మింటన్ క్రీడలు శనివారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి ఈ టోర్నమెంట్ లో తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి పది జిల్లాల క్రీడాకారుల పాల్గొన్నారు. స్టేట్ బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ టోర్నమెంట్ కు వందలాది పురుష, మహిళా క్రీడాకారులు పాల్గొన్నారు దీంతో గోలేటిటౌన్షిప్ ప్రాంతమంతా సందడి వాతావరణం నెలకొంది.
14
Report
Gollet, Telangana:
రెబ్బెన మండలంలోని క్రీడా గ్రామమైన గోలేటి టౌన్షిప్ లో రేపటి నుంచి నిర్వహించనున్న బాల్ బ్యాడ్మింటన్ రాష్ట్రస్థాయి పురుషులు, మహిళల క్రీడా పోటీలకు సర్వం సిద్ధమైంది.స్థానిక సింగరేణి పాఠశాల మైదానంలో నిర్వహించనున్న ఈ పోటీలకు 10 ఉమ్మడి జిల్లాల నుండి క్రీడాకారులు పెద్ద ఎత్తున వస్తున్నారు. మైదానంలో పలు బాల్ బ్యాడ్మింటన్ కోర్టులతో పాటు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనే అతిథుల కోసం వేదికను సిద్ధం చేశారు. క్రీడాకారులకు స్వాగతం పలుకుతూ గోలేటి క్రాస్ రోడ్ నుంచి క్రీడా మైదానం వరకు ఫ్లెక్సీలు పెట్టారు.
14
Report
Gollet, Telangana:
రెబ్బెన మండలంలోని పారిశ్రామిక ప్రాంతమైన గోలేటి టౌన్షిప్ లో శనివారం నుంచి రెండు రోజులపాటు రాష్ట్రస్థాయి పురుషులు,మహిళల బాల్ బ్యాడ్మింటన్ క్రీడా పోటీలు నిర్వహిస్తున్నట్లు బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్ తిరుపతి తెలిపారు. ఈ పోటీలకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల మహిళలు, పురుషుల జట్లు పాల్గొంటారని అన్నారు. సింగరేణి యాజమాన్యం మరియు స్థానిక క్రీడాభిమానుల సహకారంతో క్రీడాకారులకు అన్ని వసతులు కల్పిస్తున్నట్లు తెలిపారు.
14
Report
Gollet, Telangana:
రెబ్బెన మండలంలోని పారిశ్రామిక ప్రాంతమైన గోలేటి టౌన్షిప్ లో గత కొంతకాలంగా యజమానులు పశువులను గాలికి వదిలేయడంతో అవి ఎక్కడపడితే అక్కడ సేద తీరుతుండడంతో లారీ డ్రైవర్లకు, ఇతర వాహనదారులకు ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడింది. గురువారం సంత రోజున గోలేటి టౌన్షిప్ ప్రధాన రహదారిపై పశువులు ఏకంగా నడిరోడ్డుపై బైఠాయించడంతో వాహనదారులు ఇబ్బంది పడ్డారు.ఇటు సంతకు వచ్చే ప్రజల, అటు కైరిగూడ ఓసి కి వెళ్లే భారీ ఎంప్టీ లారీలు, ఓసి నుంచి బొగ్గులోడుతో వచ్చే లారీల చోదకులు పశువుల సమస్యతో తీవ్ర ఇబ్బంది పడ్డారు
14
Report
Penugonda, Andhra Pradesh:
పశ్చిమగోదావరిజిల్లా పెనుగొండ మండలం వడలి గ్రామం లో సచివాలయం -2
అసాంఘిక కార్యకలాపాలు కు అడ్డాగా తయారైంది.
గ్రామంలో సచివాలయం వ్యవస్థ ను సరిగా పట్టించుకొనే నాథుడే లేక సచివాలయం ఎదుటనే మధ్యం సీసాలతో పాటు రాత్రి వేళల్లో అసాంఘిక కార్యకలాపాలు అడ్డాగామారిపోయింది.లక్షలాది రూపాయలు వెచ్చించి ప్రజా ప్రయోజనార్ధం నిర్మించిన గ్రామ సచివాలయం బూత్ బంగ్లాను తలపిస్తోంది.కనీసం పారిశుద్యానికి నోచుకోక అస్థవ్యస్తమై సచివాలయం 2వద్ద అద్వాన్న దుస్థితి నెలకొంది..
14
Report
Undi, Andhra Pradesh:
పశ్చిమగోదావరి జిల్లా
ఉండి (మం)వాండ్రం గ్రామంలో హరిజన పేటకు చేర్చిఉన్న పంట బోధి ప్రక్షాళన అంటూ..గత కొన్ని నెలల నుంచి అధికారులు కొంతమంది రైతులు కలసి తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారని.
సుమారు శతాబ్ద కాలం నుంచి నివాసముంటున్నమని ప్రభుత్వానికి చెల్లించాల్సిన అన్ని రకాల సుంకాలను చెల్లిస్తున్నామని, గ్రామ కంఠం భూమిని కానీ ఏ ఇతర భూములను ఆక్రమించుకోలేదని
వాస్తవాలను తెలుసుకొనుటకు ఎమ్మెల్యే గ్రామంలో పర్యటచేసి న్యాయం చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
14
Report
Gollet, Telangana:
బుధవారం ఎండ కాసినందుకు సంతోష పడిన ప్రజలకు నిరాశే ఎదురైంది. మండలంలోని గోలేటి, కైరిగూడ, సోనాపూర్, దుర్గాపూర్, గోలేటి క్రాస్ రోడ్, పులి కుంట, దేవుల గూడా, రెబ్బెన తదితర ప్రాంతాలలో సాయంత్రం సుమారు ఏడు గంటల నుండి అరగంట పాటు భారీ వర్షం కురిసింది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు, పంటచేళ్లలోకి నీరు చేరి ప్రజలు బాగా నష్టపోయారు. ఇకనైనా కొంతకాలం పాటు వర్షాలు రాకుంటే బాగుంటుందని ప్రజల అభిప్రాయపడుతున్నారు.
14
Report