Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Hyderabad508211
YS Sharmila: చంద్రబాబు చెబుతున్న మాట ఈ దశాబ్దపు అతి పెద్ద జోక్.!. వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు..
IPInamdar Paresh
Dec 04, 2025 10:18:16
Hyderabad, Telangana

 YS Sharmila slams on ap cm Chandrababu naidu on Electric charges row:  ఆంధ్ర ప్రదేశ్ లో ప్రస్తుతం కూటమి వర్సెస్ కాంగ్రెస్ ల మధ్య మాటలు యుద్దం నడుస్తుంది. ఎక్కడ చాన్స్ దొరికిన  కూడా నేతలు పరస్పరం విమర్శలు గుప్పించుకుంటున్నారు. ఇటీవల ఏపీ  సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. ఎన్నికల్లో ఇచ్చిన హమీల మేరకు విద్యుత్ చార్జీలను పెంచబోమన్నారు. అంతే కాకుండా.. ప్రజలపై తమ ప్రభుత్వం ఎలాంటి భారం మోపదన్నారు. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు వ్యాఖ్యలపై ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల సంచలన ట్విట్ చేశారు. సోషల్ మీడియా వేదికగా చంద్రబాబుచేసిన వ్యాఖ్యలకు కౌంటర్ లు వేశారు.

ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఛార్జీలు పెంచబోమని  చెప్పడం చాలా హస్యాస్పదంగా ఉందన్నారు. ఇప్పటికే కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సర్దుబాటు, ట్రూ అప్ ఛార్జీల పేరుతో ప్రజలపై వేల కోట్ల భారం మోపిందని ఆరోపణలు గుప్పించారు. ఇది చంద్రబాబు గారు చెబుతున్న ఈ దశాబ్దపు అతిపెద్ద జోక్ గా అభివర్ణించారు. 

విద్యుత్ చార్జీలపై ముఖ్యమంత్రి చంద్రబాబు మాటలు హస్యాస్పదంగా ఉన్నాయన్నారు. బిల్లుల మోతతో చాలా మంది ఇల్లు గుల్ల చేస్తున్నారని కూటమి సర్కారుపై షర్మిల మండిపడ్డారు.

17 నెలల కూటమి పాలనలో ప్రజలపై మోపిన అధిక చార్జీల భారం రూ.15,485 కోట్లు. వచ్చే రెండేళ్ల పాటు ట్రూ అప్ ప్రజల నెత్తిన పెను భారమే. యూనిట్ కు అదనంగా 40 పైసలు చొప్పున ముక్కుపిండి వసూలు చేస్తూన్నారని షర్మిలా ఎద్దేవా చేశారు. ఒకవేళ కూటమికి నిజంగానే.. ఛార్జీల భారం ప్రజలపై పడొద్దనే చిత్తశుద్ధి ఉంటే, వెంటనే సర్దుబాటు భారం రూ.15,485 కోట్లు రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

Read more: Tirumala: లక్కీ డీప్‌లో రాలేదా..?.. తిరుమల భక్తులకు టీటీడీ మరో అద్భుతమైన శుభవార్త..

ట్రూ అప్ పేరుతో వసూలు చేసిన 3 వేల కోట్లను ప్రజలకు ట్రూ డౌన్ రూపంలో తిరిగి చెల్లించాలన్నారు. అదే విధంగా.. ఏపీలో అమలౌతున్న ఛార్జీలలో 30 శాతం తగ్గింపు వెంటనే అమలు చేయాలని వైఎస్ షర్మిల సోషల్ మీడియా వేదికగా  డిమాండ్ చేశారు. ఈ క్రమంలో వైఎస్ షర్మిల చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.  ఇప్పటికే విద్యుత్ చార్జీల అంశంపై వైఎస్ షర్మిల పలుమార్లు  కూటమి సర్కారుపై నిరసనలకు దిగారు.
 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
DDDharmaraju Dhurishetty
Dec 04, 2025 09:17:42
Hyderabad, Telangana:

King Cobra Around Lamb Neck Video Watch Here: సాధారణంగా పాములు ఎక్కువగా దట్టమైన అడవి ప్రాంతాల్లో కనిపిస్తూ ఉంటాయి. ఇవి జనాలకు చాలా దూరంగా నివాసిస్తూ ఉంటాయి. అయితే, ఆహారంతో పాటు ఆశ్రయం కోసం కొన్ని పాములు గ్రమాల్లోకి వచ్చి ఇళ్లలో చొరబడుతున్నాయి. ఇలా ఎవరు లేని సమాయాల్లో ఇళ్లలోకి దూరి మనుషులపై దాడి చేస్తున్నాయి. ఇలా చాలా వరకు ఇళ్లలోకి ప్రవేశిస్తున్న సమయంలో కొంతమంది స్నేక్‌ క్యాచర్స్‌ వీడియోలుగా తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియోలో గతంలో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ వచ్చాయి. అయితే, తాజాగా కూడా సోషల్ మీడియాలో ఓ పాముకు సంబంధించిన వీడియో హల్‌ చల్‌ చేస్తోంది. ఈ వీడియో ఏంటో? దీనికి సంబంధించిన దృశ్యాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Snake Catcher అనే య్యూటుబ్‌ ఛానెల్‌ నుంచి పోస్ట్‌ చేసిన ఓ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. ఈ వీడియోకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. ఈ వీడియోలో గొర్రెల మందలోకి దూరిన పాము.. ఓ గొర్రె పిల్ల మెడ భాగం చుట్టు చుట్టేసుకుంది. అయితే, దీనిని ముందుగానే గమనించిన గొర్రెల కాపరి.. వెంటనే స్నేక్‌ క్యాచర్స్‌కి సమాచారం అందించారు. అయితే, దీనిని తెలుసుకుని వారు కూడా వెంటనే అక్కడి చేరుకున్నారు. అప్పటి వరకు ఈ ఆ కింగ్‌ కోబ్రా పాము గొర్రె పిల్ల మెడకే చుట్టుకుని ఉంది. 

స్నేక్ క్యాచర్ పాములు పట్టే హుక్‌తో నెమ్మదిగా గొర్రె పిల్ల మెడలో ఉన్న పామును తీసేందుకు ప్రయత్నించాడు. ఆ పామును స్నేక్‌ క్యాచర్‌ ఎంతో నెమ్మదిగా గొర్రె పిల్లపై ఎలాంటి దాడి చెయ్యకుండా.. స్నేక్‌ స్టిక్‌తో పాటు పైపుతో ఎంతో నెమ్మదిగా.. ఆ పామును గొర్రె పిల్ల మెడలో నుంచి తీసే ప్రయత్నం చేశాడు. ఇలా కొద్ది సేపటి తర్వాత గొర్రె పిల్ల మెడలో నుంచి ఆ పామును తొలగించారు. ఈ సమయంలో పాము కూడా గొర్రెపై ఎలాంటి దాడి చెయ్యలేకపోంది. 

ఇప్పుడు వైరల్ అవుతున్న వీడియోను Snake Catcher అనే యూట్యుబ్‌ ఛానెల్‌ నుంచి పోస్ట్ చేశారు. దీనికి Galy men nag అనే క్యాప్షన్‌ పెట్టి సోషల్‌ వీడియాలో వదిలారు. ఈ పట్టుకున్న పామున స్నేక్‌ క్యాచర్‌ అడవిలో విడిచి పెట్టిన్నట్లు తెలుస్తోంది. ఇలా వైరల్ అవుతున్న వీడియోను చాలా మంచి వీక్షించారు. అంతేకాకుండా ఈ వీడియో చూసి ఆశ్చర్యపోయిన వారు కామెంట్లు కూడా చేస్తున్నారు. 

Also Read: King Cobra Video: కింగ్ కోబ్రా తలపై ప్లాస్టిక్ డబ్బా పెట్టి.. ఏం చేస్తున్నారో మీరే చూడండి..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

119
comment0
Report
IPInamdar Paresh
Dec 04, 2025 08:57:16
Hyderabad, Telangana:

Sama ram mohan reddy fires on union minister kishan reddy: తెలంగాణలో ప్రస్తుతం ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి దేవుడిపై చేసిన కామెంట్స్ పెనుదుమారంగా మారాయి. దీనిపై మొత్తంగా అన్ని పార్టీలు కూడా రేవంత్ వ్యాఖ్యలపై మండిపడుతున్నాయి. దీనిపై హిందు సంఘాలు కూడా భగ్గుమంటున్నాయి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ విధానాల్ని, సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్ని తీవ్రస్థాయిలో ఎండగట్టారు. అయితే..ఇప్పటికే తన వ్యాఖ్యలపై లేనిపోనీ వివాదాలు రాజేయోద్దని, వక్రీకరించవద్దని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

అయితే.. తాజాగా.. కాంగ్రెస్ నేత సామా రామ్మోహన్ రెడ్డి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై సంచనల వ్యాఖ్యలు చేశారు.
సామా రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఒక బ్రోకర్ లా వ్యవహరిస్తున్నారన్నారు.  అంతే కాకుండా.. కిషన్ రెడ్డి కిరికిరి రెడ్డిగా మారారంటూ ఎద్దేవా చేశారు.

తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ది కాకుండా కాళ్ళల్లో కట్టెలు పెడుతున్నారంటూ బీజేపీపై మండిపడుతున్నారు. కేటీఆర్ మాట్లాడే చిట్టిలను చూసి కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కేటీఆర్ చెప్పిందే కాపీ పెస్ట్ చేసి కిషన్ రెడ్డి చెపుతున్నాడంటూ మండిపడ్డారు. బీఆర్ఎస్, బీజేపీల మధ్య చీకటి ఒప్పందం కుదిరిందంటూ ఎద్దేవా చేశారు.

ఒకటే స్క్రిప్ట్ ను కేటీఆర్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి జిరాక్స్ చేసి చదువుతున్నారంటూ ఆరోపణలు గుప్పించారు. కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి.. తెలంగాణ రాష్ట్రానికి తెచ్చింది ఏమైనా ఉందా?.. అంటూ ప్రశ్నలు సంధించారు. దేశ రాజధాని ఢిల్లీలో గాలిని కొనుక్కొని బతికే పరిస్థితి వచ్చిందని, 

హైదరాబాద్ ను కూడా ఢిల్లీగా మార్చాలని ప్రయత్నం చేస్తున్నారా?.. అంటూ విమర్శలు చేశారు. కిషన్ రెడ్డి గాలికి మాట్లాడతా అంటే ఒప్పుకునేది లేదని,  మహేశ్వర్ రెడ్డికి చిట్టిలు అందించేది ఎవరో తెలియదా? అంటూ సామా రామ్మోహన్ ఏకీపారేశారు.

హిల్ట్ పాలసీ కింద ఉన్నవి  ప్రయివేట్  ఓనర్ల నిరుపయోగమైన భూములపై వాలంటరీగా వెసులుబాటు ఇస్తే కేటీఆర్ కి వచ్చిన నొప్పి ఏంటని సామా రామ్మోహన్ ప్రశ్నించారు.

హిల్ట్ పాలసీలో ప్రభుత్వ భూమి లేదని స్పష్టంచేశారు.  దేవాలయాలపై జీఎస్టీ వేస్తే బీజేపీ నాయకులు మౌనంగా ఉంటారా?.. అంటూ సామా రామ్మోహన్ ప్రశ్నించారు.  తెలంగాణ దేవాయాలపై వేసిన జీఎస్టీ తగ్గించే దాకా పోరాడడానికి కిషన్ రెడ్డి రెడీనా అంటూ మండిపడ్డారు.

Read more: Pushapa 2 stampede: పుష్ప 2 తొక్కిసలాటకు ఏడాది.. శ్రీ తేజ్ హెల్త్ కండీషన్ చెబితే ఎవరు పట్టించుకోవట్లేదు..

బీజేపీ నాయకులకు నరేంద్ర మోదీ ఒక్కడే దేవుడని, కానీ నిజమైన హిందువులకు ముక్కోటి దేవుళ్ళు ఉన్నారంటూ సామా రామ్మోహన్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి వ్యాఖ్యలకు కౌంటర్ లు ఇచ్చారు.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

80
comment0
Report
IPInamdar Paresh
Dec 04, 2025 08:21:26
Hyderabad, Telangana:

Madras High Court stay orders on bala krishna akhanda 2 thandavam: బాలయ్య అభిమానులు ఎంతో ఆసక్తిగా అఖండ 2 తాండవం రిలీజ్ కు ముందే ఊహించని ట్విస్ట్ ఎదురైంది. అఖండ 2 తాండవం రేపు డిసెంబర్ 5న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఇప్పటికే ఏపీలో టికెట్లపై పెంపుపై గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చారు. దీంతో అభిమానులు బాలయ్య మూవీని ఎప్పుడెప్పుడు చూడాలో అని పూనకాలతో ఊగిపోతున్నారు.ఈ నేపథ్యంలో మద్రాస్ హైకోర్టు బాలయ్య సినిమాకు బిగ్ షాక్ ఇచ్చింది.

ఈ చిత్రం విడుదలపై మద్రాస్‌ హైకోర్టు స్టే విధించింది. బాలీవుడ్ నిర్మాణ సంస్థ ఈరోస్ ఇంటర్నేషనల్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారించిన ధర్మాసనంఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.  అయితే..ఈరోస్ సంస్థ, 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ మధ్య రచ్చ కాస్త కోర్టుకు ఎక్కింది.

14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ నుంచి తమకు రూ. 28 కోట్లు రావాల్సి ఉందని, ఆ మొత్తం చెల్లించే వరకు 'అఖండ 2' సినిమాను నిలిపివేయాలని ఈరోస్ సంస్థ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించింది.  దీనిపై విచారణ జరిపిన కోర్టు ఈ మేరకు కీలక ఆదేశాలు ఇచ్చింది.

'అఖండ 2' చిత్రాన్ని 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై నిర్మించారు. అయితే, 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్‌లోని భాగస్వాములైన రామ్ ఆచంట, గోపి ఆచంటనే ఈ కొత్త సంస్థను కూడా ప్రారంభించారని, కాబట్టి పాత బకాయిలకు వారే బాధ్యత వహించాలని ఈరోస్ వాదించింది. ఈ వాదనతో ఏకీభవించిన కోర్టు స్టే విధించింది. 

Read more: Pushapa 2 stampede: పుష్ప 2 తొక్కిసలాటకు ఏడాది.. శ్రీ తేజ్ హెల్త్ కండీషన్ చెబితే ఎవరు పట్టించుకోవట్లేదు..

ఈ క్రమంలో బాలయ్య మూవీని ఎటువంటి రూపంలో కూడా విడుదల చేయోద్దని, థియేటర్లు, ఓటీటీ, సాటిలైట్ హక్కులు, డిస్ట్రిబ్యూటషన్లకు కూడా స్టే విధిస్తు మద్రాస్ హైకోర్టు ఆదేశాలిచ్చింది. అయితే..ఈ మూవీపై ఇటు అఖండ 2 మూవీ టిమ్ ఇప్పటి వరకు స్పందించలేదు. దీంతో కొన్ని గంటల ముందు మా బాలయ్య మూవీకి ఏంటీ ఈ అడ్డంకులు అంటూ అభిమానులు తెగ  టెన్షన్ పడుతున్నారు.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

156
comment0
Report
IPInamdar Paresh
Dec 04, 2025 07:13:45
Hyderabad, Telangana:

Allu Arjun pushpa 2 movie stampede sritej health condition latest update: అల్లు అర్జున్ మూవీ పుష్ప2 సినిమా ప్రపంచ వ్యాప్తంగా భారీ వసూళ్లను రాబట్టింది. అనేక రికార్డుల్ని తిరగరాసింది.  అదే విధంగా ఈ మూవీ ప్రీమియర్ షోను చూసేందుకు వచ్చిన  ఒక కుటుంబంలో మాత్రం పెనువిషాదంను నింపింది. పుష్ప2 ప్రీమియర్ షోను సంధ్యథియేటర్ లో చూసేందుకు వచ్చిన ఒక కుటుంబం మాత్రం విషాదంలో మునిగిపోయింది. పుష్ప2 చూసేందుకు తన ఫ్యామిలీతో వచ్చిన రేవతి అనే మహిళ తొక్కిసలాటలో చనిపోగా, ఆమె కుమారుడు శ్రీతేజ్ ఇంకా ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు.

ఈ ఘటన జరిగి ఈరోజుతో (డిసెంబర్ 4) ఏడాది గడుస్తున్న ఇప్పటికి కూడా ఒంటి నిండా పైపులు, కనీసం శ్వాస, ఆహరం కూడా తీసుకొలేని స్థితిలో శ్రీతేజ్ ఉన్నాడు. ఆరునెలల క్రితమే ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన నరాలు చాలా వరకు చిట్లి పోవడంవల్ల ప్రతిరోజు అనేక రకాల థెరపీలు, ట్రీట్మెంట్ కొనసాగుతునే ఉంది.

ఏడాది గడుస్తున్న కూడా ఆకుటుంబం ఇంకా దుఃఖంలో కూరుకుపోయి ఉంది. శ్రీతేజ్ కు.. ద్రవాహారాన్ని పంపించేందుకు గ్సాస్ట్రోస్టోమీ పైపు అమర్చారు. దీనివల్ల శ్వాసకూడా తీసుకోలేడు. దీని వల్ల గాలి నేరుగా ఊపిరితిత్తుల్లోకి వెళ్లడానికి మెడ ముందు భాగంలో రంధ్రం చేసి ట్రాకియోస్టోమీ ట్యూబ్‌ ను అమర్చారు. 

మెదడు కణాలు, పలు నరాలు దెబ్బతీనడం వల్ల  ఇప్పటికి సికింద్రాబాద్‌లోని ఆసియా ట్రాన్స్‌కేర్‌ రిహాబిలిటేషన్‌ సెంటర్‌లో ట్రిట్మెంట్ తీసుకుంటున్నాడు. దీనికి నెలకు 90 నుంచి 95 వేలు ఖర్చవుతుందని తండ్రి చెబుతున్నాడు. ఇప్పటికే పుష్ప 2 మూవీ టీమ్.. పిల్లల పేరుమీద రూ.2 కోట్లు ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేశారని శ్రీతేజ్‌ తండ్రి భాస్కర్‌ చెప్పారు. ఆ మొత్తానికి నెల నెలా బ్యాంకు వడ్డీ  ఆస్పత్రి ఖర్చులకే సరిపోతుందని తండ్రి ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.

Read more: Balakrishna About Jai Balayya: అమ్మ కడుపులోనే జై బాలయ్య విన్నాను..బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు..

ప్రతి నెలకు రూ.2 లక్షలు,  బాబు కాళ్లకు ఆపరేషన్‌ చేయించినప్పుడు అదనంగా రూ.3 లక్షలు ఖర్చయ్యాయని తెలిపాడు. అయితే..  ఇదే విషయమై అల్లు అర్జున్‌కు గుర్తు చేసేందుకు ఆయన మేనేజర్‌ కాంతారావును సంప్రదించగా.. కనీసం పట్టించుకోలేదని తండ్రి భాస్కర్ ఆవేదన వ్యక్తం చేశాడు. తన బిడ్డకు వివిధ థెరపీల ఖర్చులకు సాయం అందించాలని శ్రీతేజ్ కుటుంబం అల్లు అర్జున్ పుష్ప 2 మూవీ టీమ్ ను వేడుకుంటున్నాడు.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

137
comment0
Report
RGRenuka Godugu
Dec 04, 2025 03:19:13
Hyderabad, Telangana:

 AVM Saravanan Passes Away: చిత్ర సినిమాలో విషాదం నెలకొంది. భారతీయ సినీ ప్రముఖ నిర్మాత ఏవీఎం శరవణన్‌ ఈరోజు మృతి చెందారు. 86 ఏళ్ల వయసులో ఈ లెజండరీ నిర్మాత వృద్ధాప్య సమస్యల వల్ల కన్నుమూశారు. తమిళ చిత్ర పరిశ్రమలో ఎం శరవణన్‌ అందరికంటే ప్రత్యేకమే. అందరికీ సుపరిచితమే.. ఏవీఎం సంస్థను తన తండ్రి ఏవీ మెయ్యప్పన్‌ చెట్టియార్ నిర్మాణ సంస్థను ప్రారంభించారు. తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన శివాజీ చిత్రానికి భారీ పెట్టుబడులతో అంతర్జాతీయంగా తమిళ సినిమాకు ద్వారాలు తెరిచిన ప్రముఖుడు .

ఎల్లప్పుడూ తెల్లటి దుస్తులు.. మొదటి ఫై బొట్టు.. ఆయన సున్నితమైన మాటలతో ప్రత్యేక పరిచయం అవసరం లేని వ్యక్తి. ఎవరితో మాట్లాడిన రెండు చేతులు జోడించి అప్యాయతగా పలకరించే ఏవీఎం అధినేత ఇక లేరు. ఏవీఎం సినిమా నిర్మాణలకు ప్రత్యేక పేరుగాంచింది. ప్రముఖ నటులు అయినా రజినీకాంత్ ,కమలహాసన్ కూడా చిత్ర సీమకు పరిచయం చేసింది ఈ ఏవీఎం సంస్థ. ఈ సంస్థను 1946 లోనే ఏర్పాటు ఆయన తండ్రి ఏవీ మెయ్యప్పన్‌ ప్రారంభించగా.. ఆ తర్వాత శరవణన్‌ సంస్థ అభివృద్ధి దిశగా తీసుకెళ్లారు. ఏవీఎం సంస్థ కేవలం సినిమాలకే పరిమితం కాలేదు.. అనేక సీరియల్స్‌ కూడా తీశారు. వాటిని ఇతర భాషల్లోకి కూడా డబ్బింగ్‌ చేశారు. ఏవీఎం సంస్థ అంటేనే ఎంతో మంది ట్యాలెంటెడ్ నటులను, టెక్నీషియన్లు చిత్రసీమకు అందించింది అనే పేరు కలిగింది. ప్రస్తుతం ఈ ఏవీఎం సంస్థ బాధ్యతలను ఆయన కుమారుడు ఎం ఎస్ కుగన్‌ చూసుకుంటున్నారు.

Also Read:​ వాహనదారులకు బిగ్‌ షాక్‌.. 100 శాతం రాయితీ ఫేక్‌, అది వారికి మాత్రమే..!

Also Read:​ పీఎఫ్‌ ఖాతాదారులకు అలెర్ట్‌.. ఇక ఆ డెడ్‌లైన్‌ పొడగించే అవకాశమే లేదు..!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

152
comment0
Report
DDDharmaraju Dhurishetty
Dec 03, 2025 08:19:35
Hyderabad, Telangana:

Bajaj Pulsar 125 Flipkart Discount Latest Offers:  ఎప్పటి నుంచో అత్యంత తగ్గింపు ధరకే బజాజ్ పల్సర్ 125 మోటర్‌ సైకిల్ కొనుగోలు చేయాలనుకుంటున్నారా? అయితే, మీకు సమయం రానే వచ్చేసింది. ప్రీమియం ఫీచర్స్‌ కలిగిన ఈ బజాజ్ పల్సర్ 125 (BAJAJ Pulsar 125) మోటర్‌ సైకిల్‌ ప్రముఖ ఈ కామర్స్‌ కంపెనీ ఫ్లిప్‌కార్ట్‌లో అద్భుతమైన ఫీచర్స్‌తో అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం ఈ బైక్‌పై ఫ్లిప్‌కార్ట్‌లో అదనంగా బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. అయితే, వీటిని వినియోగించి కొనుగోలు చేసేవారికి భారీ తగ్గింపు లభిస్తోంది. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో ఈ బైక్‌పై ఉన్న ఆఫర్స్‌ ఏంటో? ఇది ఏయే ఫీచర్స్‌తో అందుబాటులోకి వచ్చిందో పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.

బజాజ్ పల్సర్ 125 (BAJAJ Pulsar 125) మోటర్‌ సైకిల్ 124.4 cc ఇంజన్‌తో అందుబాటులోకి వచ్చింది. ఈ ఇంజన్‌ 4-స్ట్రోక్, 2-వాల్వ్, ట్విన్ స్పార్క్ BSVI DTS-i ఫీచర్స్‌ ఫీచర్స్‌తో లభిస్తోంది. ఈ మోటర్‌ సైకిల్ ఇంజన్‌ 8.68 kW పవర్‌తో పాటు 10.8 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇక ఫ్రంట్‌ టైర్‌కి డిస్క్ బ్రేక్ (Disc Brake) సిస్టమ్‌ కూడా లభిస్తోంది. వెనక చక్రానికి డ్రమ్ బ్రేక్ (Drum Brake) కూడా అందుబాటులో ఉంది. ఇవి రెండు యాంటీ-స్కిడ్ బ్రేకింగ్‌ సిస్టమ్‌పై పని చేస్తాయి.

ఈ మోటర్‌ సైకిల్‌ ట్యూబ్‌లెస్ టైర్లు (Tubeless Tyres)తో అందుబాటులోకి వచ్చింది. దీని వెనక భాగం నైట్రాక్స్ షాక్ అబ్జార్బర్స్ సస్పెన్షన్ (Suspension)తో మార్కెట్‌లోకి విడుదలైంది. ఇందులో సెమీ-డిజిటల్ కన్సోల్ (Semi-Digital) కూడా అందుబాటులో ఉంది. ఈ బైక్‌కి హైలెట్‌గా డిజైన్ హైలైట్ స్టైలిష్ కార్బన్ ఫైబర్ గ్రాఫిక్స్‌ లభిస్తోంది. దీంతో పాటు సింగిల్ సీట్ (Single Seat) టైప్‌ డిజైన్‌తో మార్కెట్‌లోకి అందుబాటులోకి వచ్చింది. ఇది హాలోజెన్ హెడ్‌ల్యాంప్, LED DRLsతో వస్తోంది. 

Also Read: D-Mart కంటే 40 శాతం తగ్గింపుతో వస్తువులు లభించేది ఇక్కడే!

ఇక హైదరాబాద్ ఆన్‌రోడ్, ఆఫ్‌ రోడ్‌ ధర వివరాల్లోకి వెళితే.. ప్రస్తుతం Bajaj Pulsar 125 Carbon Fibre Single Seat వేరియంట్ ధర మార్కెట్‌లో ఎక్స్-షోరూమ్ ధర రూ. 85,414 నుంచి ప్రారంభమవుతుంది. అయితే, RTOతో పాటు ఇతరులు ఛార్జిలు కలుపుకుని రూ.10,249 వరకు ఛార్జ్‌ అవుతాయి. అలాగే ఇన్సూరెన్స్ రూ.7,221 కలుపుకుని హైదరాబాద్‌లో ఆన్‌రోడ్ రూ. 1,01,834కు లభిస్తుంది. ఇక ఇదే మోటర్‌ సైకిల్‌ను ఫ్లిప్‌కార్ట్‌లో కొనుగోలు చేసేవారికి ఏకంగా రూ.7 వేల వరకు తగ్గింపు పొందవచ్చు. దీంతో కేవలం ఈ బైక్‌ రూ.94,834కే పొందవచ్చు. 

Also Read: D-Mart కంటే 40 శాతం తగ్గింపుతో వస్తువులు లభించేది ఇక్కడే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

199
comment0
Report
DDDharmaraju Dhurishetty
Dec 03, 2025 08:19:12
Hyderabad, Telangana:

HMD XploraOne Price: ఈ డిజిటల్ యుగంలో మార్కెట్‌లోకి కొత్త కొత్త స్మార్ట్‌ఫోన్స్‌ లాంచ్‌ అవుతూ వస్తున్నాయి. ఇప్పుడు ఈ మొబైల్స్‌తో చిన్నవారితో పాటు పెద్దవారికి కూడా ఎంతో అవసరమవుతున్నాయి. ముఖ్యంగా చదువుకునే యువకు స్మార్ట్‌ఫోన్స్‌కు ఇప్పుడు అత్యవసర వస్తువుగా మారింది. చాలా మంది వీటి ద్వారానే పరీక్షలకు ప్రిపేర్‌ కూడా అవుతున్నారు. అయితే, దీనిని దృష్టిలో పెట్టుకుని ప్రముఖ టెక్‌ కంపెనీ HMD మార్కెట్‌లోకి అతి త్వరలోనే అద్భుతమైన స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయబోతోంది. దీనిని ప్రత్యేకమైన చిన్న పిల్లల కోసం లాంచ్‌ చేయబోతున్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ మొబైల్‌కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.

HMD కంపెనీ Xploraతో కంపెనీ భాగస్వామ్యంతో పిల్లల కోసం అద్భుతమైన ఫీచర్స్‌తో కూడిన మంచి స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇది HMD XploraOne పేరుతో ఇంటర్నేషనల్‌ మార్కెట్‌లో లాంచ్‌ కాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనిని కంపెనీ కేవలం పిల్లల కోసం ప్రత్యేకంగా రూపొందించినట్లు తెలుస్తోంది. ఇందులో ప్రత్యేకంగా కాలింగ్‌ ఫీచర్స్‌తో పాటు అద్భుతమైన టెక్స్టింగ్ ఫీచర్‌ను కూడా అందిస్తున్నట్లు సమాచారం. ఈ స్మార్ట్‌ఫోన్‌లో కంపెనీ దృష్టి మరల్చే యాప్‌లు కూడా అందుబాటులో ఉన్నాయి. 

ఇందులో ఇంటర్నెట్ లేదా సోషల్ మీడియా యాక్సెస్‌ కూడా ఉండే అవకాశాలు లేవని లీక్‌ అయిన వివరాలు చెబుతున్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్‌లో కంపెనీ తల్లిదండ్రులకు పూర్తి యాక్సిస్‌ కూడా లభిస్తుంది. దీని వల్ల ఫోన్‌ మొత్తాన్ని నియంత్రించే ఫీచర్స్‌ను కూడా అందిస్తోంది. అలాగే ఇందులో లొకేషన్‌ ట్రాకింగ్‌ ఫీచర్స్‌ కూడా లభిస్తున్నాయి. దీనికి సంబంధించిన ఫీచర్స్‌ను టిప్‌స్టర్ @smashx_60 అనే సోషల్ మీడియా అకౌంట్‌ నుంచి విడుదలకు ముందే లీక్‌ చేశారు. 

Also Read: D-Mart కంటే 40 శాతం తగ్గింపుతో వస్తువులు లభించేది ఇక్కడే!

HMD XploraOne స్మార్ట్‌ఫోన్‌ ఫీచర్స్ వివరాల్లోకి వెళితే, ఇది 3.2-అంగుళాల QVGA IPS డిస్ప్లేను కలిగి ఉంటుంది. అంతేకాకుండా వెనక భాగంలో స్పెషల్‌గా  2-మెగాపిక్సెల్ కెమెరా కూడా అందుబాటులో ఉంది. ఇది చాలా శక్తివంతమైన Unisoc T127 చిప్‌సెట్‌ను కూడా కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే ఈ మొబైల్ 64MB ర్యామ్‌తో పాటు 128MB ఆన్‌బోర్డ్ స్టోరేజ్‌ను కూడా కలిగి ఉంటుంది. దీంతో పాటు మోస్ట్ పవర్‌ఫుల్ 2000mAh బ్యాటరీని ప్యాక్‌తో లాంచ్‌ అయ్యింది. ఇందులో కంపెనీ ఛార్జింగ్‌ కోసం టైప్-C పోర్ట్‌ను కూడా అందిస్తోంది. అలాగే ఈ స్మార్ట్‌ఫోన్‌ ధర, స్పెషిఫికేషన్స్‌ కంపెనీ త్వరలోనే వెల్లడించబోతోంది.

Also Read: D-Mart కంటే 40 శాతం తగ్గింపుతో వస్తువులు లభించేది ఇక్కడే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

113
comment0
Report
Dec 02, 2025 16:00:57
227
comment0
Report
Advertisement
Back to top