రెవెన్యూ సంబందిత సమస్యలు త్వరగా పరిష్కారించాలి: కలెక్టర్
Khammam, Telangana:ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, కలెక్టరేట్లో రెవిన్యూ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ధరణి, ప్రజావాణి, ధృవీకరణలు, ప్రభుత్వ భూముల పరిరక్షణపై చర్చించారు. మండల స్థాయిలో రెవిన్యూ వ్యవస్థ పటిష్టంగా ఉండాలని, ప్రజల సమస్యలు మండల స్థాయిలోనే పరిష్కరించాలన్నారు. డిటి, ఆర్ఐ, సీనియర్, జూనియర్ అసిస్టెంట్లకు చట్టాలపై శిక్షణ అందించాలని సూచించారు. రెవిన్యూ అధికారులకు పూర్తి నాలెడ్జ్ ఉండాలని, తహసీల్దార్ కార్యాలయం స్పందించకపోవడం అంగీకరించలేమని స్పష్టం చేశారు.
हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
Revanth Reddy: కొన్ని గంటల్లో వచ్చేస్తున్నా.. అన్నింటిపై మాట్లాడుతా: రేవంత్ రెడ్డి
Baddipadaga, Telangana:USA Tour Cancel: అమెరికా పర్యటన రద్దు అంశంపై దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపడంతో బీజేపీ నాయకులు.. జాతీయవాదులు రేవంత్ రెడ్డిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాకిస్థాన్ మద్దతుదారుడిని కలిసేందుకు అమెరికా పర్యటనకు వెళ్లడాన్ని తీవ్రంగా తప్పుబడుతున్నారు. జాతీయవ్యాప్తంగా రాజకీయ వివాదం నెలకొన్న నేపథ్యంలో రేవంత్ రెడ్డి స్పందించారు. ఈ విషయాలపై తాను అన్నింటిపై మాట్లాడుతానని... కొన్ని గంటల్లో తాను వస్తున్నట్లు ప్రకటించారు.
తన అమెరికా పర్యటనకు కేంద్ర ప్రభుత్వం రాజకీయ కోణంలోనే అనుమతి ఇవ్వలేదని రేవంత్‌రెడ్డి ఆరోపణలు చేశారు. తనకు అనుమతి నిరాకరించడంతో అమెరికాలోని బోస్టన్ పర్యటనకు వెళ్లలేకపోతున్నట్లు తెలిపారు. తన అమెరికా పర్యటనపై ‘ఎక్స్’లో రేవంత్ రెడ్డి పోస్ట్ చేశారు. రాజకీయ కారణాలతోనే తన అమెరికా పర్యటనకు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అనుమతి నిరాకరించిందని తెలిపారు.
ఈ కారణంగా అమెరికాలోని బోస్టన్‌కు వెళ్లలేకపోతున్నట్లు.. విదేశీ పర్యటన అంశంలో తనకు మద్దతుగా నిలిచిన కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. లండన్ పర్యటనను విజయవంతంగా ముగించుకుని మరికొన్ని గంటల్లో హైదరాబాద్‌కు వస్తున్నట్లు వెల్లడించారు. అక్కడికి (హైదరాబాద్) వచ్చాక మిగిలిన అంశాలపై మాట్లాడతానని రేవంత్ రెడ్డి ప్రకటన చేశారు. ఇక తనకు మద్దతుగా మూడు రోజుల నుంచి కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తోందని.. దీనికి కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు రేవంత్‌రెడ్డి తెలిపారు.
రేపు ప్రెస్‌మీట్..?
విదేశీ పర్యటన ముగించుకుని రేవంత్ రెడ్డి రేపు ఉదయం హైదరాబాద్‌కు చేరుకోనున్నారు. అనంతరం రేపు ఉదయం తన అమెరికా పర్యటన రద్దు అంశంపై మీడియా సమావేశం నిర్వహించే అవకాశం ఉంది. దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపిన తన అమెరికా పర్యటన రద్దుపై కీలక విషయాలు వెల్లడించే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా తెలంగాణ కాంగ్రెస్‌లో నెలకొన్న ఆగస్టు సంక్షోభం.. కొండా సురేఖ, చిన్నారెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యవహారాలపై కూడా స్పందిస్తారని సమాచారం. దీంతో రేపటి రేవంత్ రెడ్డి మీడియా సమావేశంపై ఉత్కంఠ నెలకొంది.
Emotional Video: మతిస్థిమితం లేని వ్యక్తికి రాఖీ కట్టిన విద్యార్థిని.. తర్వాత ఆ వ్యక్తి చేసిన పనికి నెటిజన్లు ఫిదా!
Hyderabad, Telangana:Emotional Viral Video Watch: రక్తసంబంధం లేకపోయినప్పటికీ.. సమాజం గుర్తించని స్థితిలో ఉన్నప్పటికీ.. స్వచ్ఛమైన ప్రేమకు ఎలాంటి సరిహద్దులు ఉండవని నిరూపించే హృదయాన్ని హత్తుకునే ఘటన ఒకటి సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. మతిస్థిమితం లేని ఓ వ్యక్తి పట్ల పాఠశాల విద్యార్థిని చూపిన ప్రేమ.. ఆమె చూపిన ఆదరణకు ఆ వ్యక్తి స్పందించిన తీరు ప్రతి ఒక్కరి కళ్ళలోనూ నీళ్లు తెప్పిస్తోంది. ఇప్పుడు ఈ ఘటన చూసిన ప్రతి ఒక్కరు బాగోద్వేగానికి గురవుతున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం..
రోజులాగే యూనిఫామ్ ధరించి బ్యాగ్ తగిలించుకొని పాఠశాలకు వెళ్తున్న ఓ బాలిక దగ్గరకు.. చిరిగిన బట్టలతో.. కర్రతో పాటు సంచిని భుజానికి వేసుకొని ఓ మతిస్థిమితం లేని వ్యక్తి వచ్చాడు. చేతిలో ఒక రాఖీని పట్టుకొని.. దాన్ని తనకు కట్టాలంటూ మూగ సైగలతో దీనంగా వేడుకున్నాడు.. తెలియని వ్యక్తి కావడంతో పాటు.. మానసిక స్థితి సరిగ్గా లేకపోవడంతో ఆ విద్యార్థిని మొదటగా తీవ్రంగా భయపడి వెనకడుగు వేసింది. అయితే.. తనలో ఉన్న అమాయకత్వాన్ని గమనించిన ఆ చిన్నారి.. ఏమాత్రం ఆలోచించకుండా అతని వద్దకు వెళ్లి ఎంతో ఆప్యాయంగా చేతికి రాఖీ కట్టడం మీరు ఈ వీడియోలో చూడొచ్చు..
రాఖీ కట్టిన మరుక్షణమే ఆ వ్యక్తి ప్రవర్తించిన తీరు అక్కడున్న వారిని.. వీడియో చూసిన సోషల్ మీడియా వినియోగదారులను ఆశ్చర్యపరిచేలా చేసింది. సోదరి సమానురాలైన ఆ చిన్నారి కాళ్లకు సాష్టాంగ నమస్కారం చేసి ఆశీర్వాదం తీసుకున్నాడు.. అనంతరం సాంప్రదాయం ప్రకారం చెల్లికి కానుక ఇవ్వాలన్న భావనతో తన జేబులను తడుముకున్నాడు.. జేబులు ఖాళీగా ఉండడంతో పాటు తమ వద్ద ఇచ్చేందుకు చెల్లి గవ్వ లేదంటూ చేతులు జోడించి సైగల ద్వారా క్షమాపణలు కోరాడు.. ఆపై చిరునవ్వుతో అక్కడి నుంచి భారంగా అడుగులు వేస్తూ వెళ్లిపోయాడు..
Also Read: Eshwar Sai: బాసింగా బాసింగా సాంగ్ ఫేమ్ ఈశ్వర్‌సాయి రాసలీలలు..
ఈ అపురూప ఘట్టానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా చెక్కర్లు కొడుతోంది.. సంపద లేకున్నా సంస్కారం ఉంది.. మానసిక స్థితి దెబ్బతిన్న రక్తంలో జీర్ణించుకుపోయిన బంధాల విలువ మరువ లేదంటూ చాలామంది సోషల్ మీడియా వినియోగదారులు కామెంట్లు చేస్తున్నారు. ఆపదలో ఉన్న వారిని దూరం పెట్టకుండా ఆదరించిన ఆ పాఠశాల విద్యార్థిని సంస్కారాన్ని కూడా ప్రతి ఒక్కరు కొనియాడుతున్నారు.. మనుషుల మధ్య అంతరాలు పెరిగిపోతున్న ఈ రోజుల్లో.. ఈ అద్భుతమైన వీడియో మానవత్వపు మానవత్వపు గొప్పదనాన్ని మరోసారి చాటి చెప్పింది..
Also Read: Eshwar Sai: బాసింగా బాసింగా సాంగ్ ఫేమ్ ఈశ్వర్‌సాయి రాసలీలలు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
కొండగట్టు అంజన్న సన్నిధిలో ఉద్రిక్తత.. లడ్డూ కౌంటర్ వివాదంపై VHP ధర్నా!
Hyderabad, Telangana:Kondagattu Temple: జగిత్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం.. చొప్పదండి నియోజకవర్గం పరిధిలో ఉన్న కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో ఊహించని ఒక వివాదం చోటుచేసుకుంది.. పవిత్రమైన లడ్డు ప్రసాద పంపిణీ కేంద్రం వద్ద భక్తులతో పాటు ఆలయ సిబ్బంది మధ్య జరిగిన వాగ్వాదం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.. సిబ్బంది తీరును నిరసిస్తూ విశ్వహిందూ పరిషత్ సభ్యులు ఆలయ ఈవో కార్యాలయం ఎదుట ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టారు..
సాధారణంగా కొండగట్టు స్వామివారి దర్శనార్థం నిత్యం వందలాదిమంది భక్తులు వస్తూ ఉంటారు. దర్శనానంతరం లడ్డు ప్రసాదం కొనుగోలు చేసేందుకు వెళ్లిన విశ్వహిందూ పరిషత్ సభ్యులకు చేదు అనుభవం ఎదురైంది.. ప్రసాదం కోసం వెనక వైపు నుంచి వెళ్ళిన తమపై కౌంటర్లో సిబ్బంది అత్యంత తురుసుగా ప్రవర్తించారని విహెచ్పి నాయకులు ఆరోపించారు. కనీస మర్యాద లేకుండా తమను నెట్టువేసి.. దౌర్జన్యానికి పాల్పడ్డారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు..
ఈ ఘటనతో మనస్థాపానికి చెందిన విశ్వహిందూ పరిషత్ సభ్యులు వెంటనే ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కార్యాలయం వద్దకు చేరుకొని భారీ ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు.. ఈవో డౌన్ డౌన్ అంటే పెద్ద ఎత్తున నినాదాలు చేయడంతో ఆలయ ప్రాంగణంలో గందరగోల వాతావరణం నెలకొంది. భక్తులతో వింతగా ప్రవర్తించిన సదరు సిబ్బందిని తక్షణమే విధుల్లో నుంచి సస్పెండ్ చేయాలని వారు డిమాండ్ చేశారు..
Also Read: Eshwar Sai: బాసింగా బాసింగా సాంగ్ ఫేమ్ ఈశ్వర్‌సాయి రాసలీలలు..
దైవ దర్శనానికి వచ్చే భక్తులతో ఆలయ సిబ్బంది ఎంతో మర్యాదగా.. ఓపికగా వ్యవహరించాలని.. భక్తులను ఇబ్బందులకు గురిచేస్తూ దాడులకు దిగడం క్షమించరాన్ని నేరమని.. బాధ్యులపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని విశ్వహిందూ పరిషత్ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో సమాచారం అందుకున్న కొండగట్టు ఎస్సై, ఆలయ సూపరింటెండెంట్ హుటాహుటిన అక్కడికి చేరుకొని.. ఆందోళన చేస్తున్న వారితో సంప్రదింపులు జరిపి అన్ని విషయాలను అడిగి తెలుసుకున్నట్లు సమాచారం. అనంతరం విశ్వహిందూ పరిషత్ సభ్యుల నుంచి లిఖితపూర్వకంగా ఫిర్యాదును కూడా స్వీకరించారు..
Also Read: Eshwar Sai: బాసింగా బాసింగా సాంగ్ ఫేమ్ ఈశ్వర్‌సాయి రాసలీలలు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Eshwar Sai Madhuri Rathod: మధూరీ రాథోడ్ వ్యవహారంపై క్లారిటీ ఇచ్చిన ఫోక్ డ్యాన్సర్ ఈశ్వర్ సాయి!
Hyderabad, Telangana:Eshwar Sai On Madhuri Rathod: ఇటీవల వివాదం చెలరేగిన నేపథ్యంలో ఈశ్వర్ సాయి, మాధురీ రాథోడ్ వ్యవహారంలో అడ్డంగా దొరికిపోయిన నేపథ్యంలో ఇటీవలే వైరల్‌గా మారింది. ఈ ఘటనను భార్య వీడియో తీస్తు రెడ్ హ్మాండెడ్ గా పట్టుకుంది. మాధురిని చెంప మీద కొట్టి నానా బూతులు తిట్టింది. ఈ రచ్చను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అది కాస్త విపరీతంగా వైరల్‌గా మారింది. కొంత మంది ఈశ్వర్ సాయి భార్యకు సపోర్ట్ చేస్తుండగా, మరికొంత మంది మాత్రం మాధురీ రాథోడ్ కు అండగా నిలుస్తున్నారు. తాజాగా ఈ సంఘటనపై ఈశ్వర్ సాయి స్పందించాడు.AP Liquor Scam: వైసీపీ మాజీ మంత్రి కారుమూరి అరెస్ట్.. ఏపీ మద్యం కుంభకోణం కేసులో కీలక పరిణామం!
Hyderabad, Telangana:Karumuri Nageswara Rao Arrest: ఏపీ మద్యం రవాణా కుంభకోణం కేసులో కీలక రాజకీయ పరిణామం చోటుచేసుకుంది. ఈ దర్యాప్తులో భాగంగా వైకాపా నేత, మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావును ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ కొండాపూర్‌లోని ఆయన నివాసంలో ఆదివారం సాయంత్రం కారుమూరిని అదుపులోకి తీసుకున్న అధికారులు, తదుపరి విచారణ కోసం బషీర్‌బాగ్‌లోని ఈడీ ప్రధాన కార్యాలయానికి తరలించారు. ఈ కేసులో కారుమూరి నాగేశ్వరరావు నాలుగో నిందితుడిగా అరెస్ట్ అయ్యారు.
కాగా, ఇదే కేసులో ఆయన కుమారుడు కారుమూరి సునీల్‌ను ఈ ఏడాది జూన్ 16న ఈడీ అధికారులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. ఈ దందాలో సునీల్ అత్యంత కీలక పాత్ర పోషించారని, ఆయన బ్యాంకు ఖాతాల్లోకి దాదాపు రూ.28 కోట్ల మేర కిక్బ్యాక్స్ (ముడుపులు) వచ్చాయని ఈడీ తన రిమాండ్ నివేదికలో స్పష్టం చేసింది. తండ్రి రాజకీయ పలుకుబడిని ఉపయోగించుకుని సునీల్ ఈ భారీ అవకతవకలకు పాల్పడినట్లు అధికారులు గుర్తించారు. ఈ క్రమంలోనే తండ్రి కారుమూరి నాగేశ్వరరావును కూడా ఈడీ అధికారులు తాజాగా అరెస్ట్ చేశారు.
ఈ కేసులో ఇప్పటికే రాజ్ కసిరెడ్డి, మద్యం నియంత్రణ సంస్థ మాజీ ఎండీ వాసుదేవరెడ్డి వంటి ప్రముఖులను ఈడీ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తండ్రీకొడుకులిద్దరూ ఈ కేసులో అరెస్ట్ కావడంతో రాబోయే రోజుల్లో మరికొందరు కీలక వ్యక్తుల పేర్లు బయటకు వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఈ పరిణామం ఏపీ రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపుతోంది.
Also Read: ఏపీ నిరుద్యోగులకు విద్యాశాఖ మంత్రి శుభవార్త.. మరో 3,000 టీచర్ పోస్టుల భర్తీకి రెడీ!
Also REad: ఎన్టీఆర్ జిల్లాలో స్కూల్ బస్సుకు ఘోరం ప్రమాదం..20 మంది విద్యార్థులు, దూసుకెళ్లింది!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Anasuya Vs Hema: యాంకర్ అనసూయకు నటి హేమ కౌంటర్..నోరు అదుపులో పెట్టుకోవాలని ఘాటు వార్నింగ్!
Hyderabad, Telangana:Hema On Anasuya Controversy: టాలీవుడ్ యాంకర్ అనసూయ భరద్వాజ్ సనాతన ధర్మం, శ్రీరాముడి నామంపై ఇటీవల చేసిన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో తీవ్ర దుమారం రేపాయి. కొందరు శ్రీరాముడి పేరును, దేవుడి ఫొటోలను వాడుకుంటూ సోషల్ మీడియాలో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారంటూ ఆమె చేసిన కామెంట్లపై హిందూ సంఘాలు, నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ క్రమంలోనే హైదరాబాద్‌లోని బోరబండ పోలీస్ స్టేషన్లో ఆమెపై అధికారికంగా ఫిర్యాదు కూడా నమోదైంది. పరిస్థితి తీవ్రతను గమనించిన అనసూయ వివరణ ఇస్తూ ఒక వీడియోను విడుదల చేశారు. తాను కూడా హనుమాన్ భక్తురాలినేనని, కేవలం సోషల్ మీడియాలో తనను ట్రోల్ చేస్తూ వేధిస్తున్న కొందరిని ఉద్దేశించి మాత్రమే ఆ వ్యాఖ్యలు చేశానని, తన మాటలను వక్రీకరించారని అందులో పేర్కొన్నారు. అయితే, ఈ వివరణతో వివాదం ముగియకముందే, సీనియర్ నటి హేమ ఈ వ్యవహారంలోకి ప్రవేశించి అనసూయపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
"సినీ పరిశ్రమలో ఉన్న మనమంతా అద్దాల మేడలో ఉన్నట్లే. మనం మాట్లాడే ప్రతి మాటా, చేసే పనీ ప్రజలు భూతద్దంలో పెట్టి చూస్తారు. ఈ కనీస స్పృహ లేకుండా పదే పదే ఎందుకు నోరు జారుతావు?" అంటూ హేమ అనసూయను సూటిగా ప్రశ్నించారు. కోట్ల మంది హిందువుల విశ్వాసాలతో ముడిపడి ఉన్న సున్నితమైన విషయాలపై పబ్లిక్‌గా మాట్లాడేటప్పుడు అత్యంత విచక్షణతో వ్యవహరించాలని హితవు పలికారు. 'జై శ్రీరామ్' నామం కేవలం ఒక నినాదం కాదని, అది కోట్లాది మంది భారతీయుల హృదయాల్లో నిక్షిప్తమైన ఒక దివ్య మంత్రం అని హేమ భావోద్వేగానికి లోనయ్యారు.
ఎవరైనా వేధిస్తే ధైర్యంగా వారి పేర్లు బయటపెట్టి పోరాడాలి కానీ, పవిత్రమైన దేవుడి పేర్లను, ఫొటోలను కవచంగా వాడుతూ విమర్శలు చేయడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని నటి హేమ మండిపడ్డారు. ముందు నోరు జారి, ఆ తర్వాత కవరింగ్ ఇచ్చుకోవడం మానుకోవాలని చురకలంటించారు.
"కర్మ సిద్ధాంతం ఎవరినీ వదిలిపెట్టదు. జాగ్రత్త" అని హేమ హెచ్చరించారు. తెలుగు సినీ ప్రేక్షకుల ఆదరణ వల్లే ఈ స్థాయి గుర్తింపు వచ్చిందని, వారి విశ్వాసాలను గౌరవించడం నేర్చుకోవాలని హేమ ఘాటుగా విమర్శించారు. ప్రస్తుతం ఈ వివాదం టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది.
Also REad: బిగ్‌బాస్‌లోకి టాలీవుడ్ క్రేజీ హీరోయిన్..సోషల్ మీడియాలో సుజీత్ హీరోయన్ క్లారిటీ!
Also Read: బాక్సాఫీస్ వద్ద మాస్ మహారాజా ప్రభంజనం.. తొలిరోజే 'ఇరుముడి' ఆల్‌టైమ్ రికార్డ్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
డిగ్రీ అర్హతతో బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీ నోటిఫికేషన్.. జీతం రూ. 85 వేలకు పైనే! అప్లికేషన్ లింక్!
Hyderabad, Telangana:Bank Of baroda LBO Posts: ఈ నోటిఫికేషన్ ప్రకారం, దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ఆగస్టు 18వ తేదీ నుండి ప్రారంభమై సెప్టెంబర్ 15వ తేదీ వరకు కొనసాగుతుంది. బ్యాంక్ రంగంలో స్థిరమైన ఉద్యోగం సాధించాలని ఎదురుచూస్తున్న వారికి బ్యాంక్ ఆఫ్ బరోడా ఈ గొప్ప అవకాశాన్ని కల్పించింది. మొత్తం 2,482 లోకల్ బ్యాంక్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి బ్యాంక్ శ్రీకారం చుట్టింది. ఈ నోటిఫికేషన్ ప్రక్రియ ఆగస్టు 18 నుండి సెప్టెంబర్ 7 వరకు అందుబాటులో ఉంటుంది. ఈ నియామకాల ద్వారా మేనేజ్మెంట్ గ్రేడ్ స్కేల్-1 కింద ఉన్న పోస్టులను భర్తీ చేయనున్నారు. మొత్తం 2,482 లోకల్ బ్యాంక్ ఆఫీసర్ పోస్టుల ద్వారా అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ నిర్వహించబడుతుంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆలస్యం చేయకుండా వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకుని, నిర్ణీత దరఖాస్తు రుసుమును చెల్లించి అప్లికేషన్ పూర్తి చేయాలి. అభ్యర్థులు ముందుగా దరఖాస్తు చేసుకున్న తర్వాత, రాబోయే పరీక్షల కోసం కూడా క్రమ పద్ధతిలో ప్రిపేర్ కావాల్సి ఉంటుంది.
కావలసిన అర్హతలు:
బ్యాంక్ ఆఫ్ బరోడా ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు పరిమితి 21 ఏళ్ల నుండి 30 ఏళ్ల మధ్యలో ఉండాలి. అయితే, కమర్షియల్ బ్యాంకులో పని చేసిన అనుభవం ఉన్న అభ్యర్థులకు నిబంధనల ప్రకారం ఉపశమనం కలిగే అవకాశం ఉంది. నిర్దిష్ట క్యాడర్లకు దరఖాస్తు చేసేటప్పుడు ఈ నిబంధనలు వర్తిస్తాయి. అంతేకాకుండా, అభ్యర్థులకు సంబంధిత స్థానిక భాషను చదవడం, రాయడం, మాట్లాడటం వంటి ప్రాథమిక నైపుణ్యాలు తప్పనిసరిగా తెలిసి ఉండాలి.
బ్యాంక్ ఆఫ్ బరోడా ఎల్బీఓకి దరఖాస్తు చేసుకునే విధానం:
దరఖాస్తు ప్రక్రియ కోసం ముందుగా బ్యాంక్ ఆఫ్ బరోడా అధికారిక వెబ్సైట్ https://bankofbaroda.bank.in/ను ఓపెన్ చేయాలి. అక్కడ ఉన్న 'కెరియర్' సెక్షన్లోకి వెళ్లి, 'కరెంట్ అపర్చునిటీస్' అనే ఆప్షన్‌ను ఎంచుకోవాలి. అక్కడ లోకల్ బ్యాంక్ ఆఫీసర్ రిక్రూట్మెంట్ కి సంబంధించిన నోటిఫికేషన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేసి, మొదట రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలి. ఆ తర్వాత అప్లికేషన్ ఫారమ్‌లో అడిగిన అన్ని వివరాలను నింపి, అవసరమైన పత్రాలను అప్లోడ్ చేయాలి. అనంతరం దరఖాస్తు రుసుమును చెల్లించి ఫారమ్‌ను సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేసిన తర్వాత వచ్చే కన్ఫర్మేషన్ పేజీని భవిష్యత్తు అవసరాల కోసం డౌన్లోడ్ చేసుకుని భద్రపరుచుకోవాలి.
Also Read: బ్యాంకు కస్టమర్లకు అలర్ట్.. ఈ వారం ఏకంగా 4 రోజులు బ్యాంకులు బంద్!
Also Read: తెలుగు రాష్ట్రాల ప్రయాణికులకు గుడ్ న్యూస్.. సోలాపూర్-అనకాపల్లి కొత్త ఎక్స్‌ప్రెస్ రైలు ప్రారంభం! శ్రీకాకుళం కూడా!
ఎంపిక ప్రక్రియ, పరీక్షా విధానం:
బ్యాంక్ ఆఫ్ బరోడా లోకల్ బ్యాంక్ ఆఫీసర్ ఎంపిక ప్రక్రియ అనేది ఆన్లైన్ పరీక్ష, గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూల ద్వారా నిర్వహించబడుతుంది. పరీక్షా విధానం విషయానికి వస్తే, మొత్తం 120 ప్రశ్నలు ఉంటాయి. ప్రతి ప్రశ్నకు 1 సమాన మార్కును కేటాయిస్తారు.. అంటే మొత్తం 120 మార్కులు ఉంటాయి. ఈ పరీక్షలో ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కులు నెగటివ్ మార్కింగ్‌గా తీసివేస్తారు. అభ్యర్థులకు ఇంగ్లీష్ లాంగ్వేజ్‌లో మాట్లాడటం తప్పనిసరిగా తెలిసి ఉండాలి. చివరగా, పరీక్షలో సాధించిన మెరిట్ ఆధారంగా అర్హులైన అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
జహీరాబాద్‌లో భారీ మోసం.. బంగారం ట్రేడింగ్ పేరుతో రూ.28 కోట్లు కొల్లగొట్టిన నైకీ ట్రేడర్స్..
Hyderabad, Telangana:Zahirabad Investment Scam: బంగారంతో పాటు వెండి ట్రేడింగ్‌లో అదిరిపోయే లాభాలు, భారీ వడ్డీలు ఇస్తామంటూ.. అమాయక ప్రజలను నమ్మించి కోట్లాది రూపాయలను కొల్లగొట్టిన ఓ భారీ మోసం సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో వెలుగు చూసింది.. హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న నైకీ ట్రేడర్స్ సమస్త నిర్వాహకులు ఏకంగా రూ.28 కోట్లకు పైగా టోపీ పెట్టారట.. బాధితుల ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు నలుగురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ప్రాథమికంగా 22 మంది బాధితులు ఇచ్చిన ఫిర్యాదుల మేరకే రూ.28 కోట్లకు పైగా మోసం బయటపడగా.. బాధితుల సంఖ్య పెరిగే కొద్దీ ఈ కుంభకోణం విలువ దాదాపు 100 కోట్లకు పైగా చేరే అవకాశాలున్నట్లు తెలుస్తోంది..
నైకీ ట్రేడర్స్ మేనేజ్మెంట్ గత రెండేళ్లుగా ట్రేడింగ్ పేరుతో ప్రత్యేకమైన కార్యకలాపాలను సాగిస్తోంది.. ప్రముఖ ఓ జ్యువెలరీ సంస్థ కు సంబంధించి తామే బంగారం సరఫరా చేస్తున్నామని ఇన్వెస్టర్లను నమ్మించారు. తమ వద్ద పెట్టుబడి పెడితే. భారీ లాభాలతో పాటు క్రమం తప్పకుండా వడ్డీలు ఇస్తామని ఆశ చూపారు.. బాధితులకు నమ్మకం కలిగేందుకు మొదట్లోనే అనుకున్న సమయానికి లాభాలతో పాటు వడ్డీ చెల్లించారు. దీంతో జహీరాబాద్ వాసులు స్థిరాస్తులు అమ్మి.. అప్పులు తెచ్చి మరి పెద్ద మొత్తంలో కోట్లాది రూపాయలు ఈ సంస్థలు ఇన్వెస్ట్ చేశారు..
డిసెంబర్ వరకు లావాదేవీలు సజావుగా సాగించిన ఆ నిర్వాహకులు.. బాధితులు అడిగిన అసలు డబ్బులు సైతం ఇచ్చేందుకు నిరాకరించారట.. గత తొమ్మిది నెలలుగా అందులో పెట్టిన పెట్టుబడిదారుల ఫోన్ కాల్స్ ఎత్తకుండా తప్పించుకు తిరిగారు. చివరికి తాము నిలువునా మోసపోయామని గ్రహించిన బాధితులు లబోదిబోమంటూ జహీరాబాద్ పోలీసులను ఆశ్రయించారు..
Also Read: Eshwar Sai: బాసింగా బాసింగా సాంగ్ ఫేమ్ ఈశ్వర్‌సాయి రాసలీలలు..
బాధితుడు ఇజ్రాయేల్ బాబీతో ఇతర కొంతమంది బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి ప్రత్యేకమైన దర్యాప్తును చేపట్టారు. ఈ కుంభకోణానికి ప్రధాన కారకులైన శశివర్ధన్ రెడ్డి తో పాటు రవీంద్రబాబు, సుస్మిత తో పాటు జగదీష్ నలుగురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు జహీరాబాద్ టౌన్ సీఐ ఆర్. రవి తెలిపారు. నైకీ ట్రేడర్స్ సమస్త ద్వారా ఇంకా ఎవరైనా మోసపోయి ఉంటే నిర్భయంగా పోలీసులను ఆశ్రయించాలని అధికారులు సూచిస్తున్నారు.
Also Read: Eshwar Sai: బాసింగా బాసింగా సాంగ్ ఫేమ్ ఈశ్వర్‌సాయి రాసలీలలు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
నవ పంచమి రాజయోగం ఎఫెక్ట్.. ఈ 4 రాశుల వారికి ఇక పట్టిందల్లా బంగారమే!
Hyderabad, Telangana:Nava Panchami Raja Yoga Effect On Zodiac: జ్యోతిష్య శాస్త్రంలో గ్రహ సంచారాలతో పాటు వాటి ప్రత్యేకమైన మార్పులు అన్ని రాశులతో పాటు ప్రపంచాన్ని ఎంతగానో ప్రభావితం చేస్తూ ఉంటాయి. 2026 సంవత్సరం సెప్టెంబర్ 18వ తేదీన రాహువుతో పాటు కుజ గ్రహాల మార్పుల కారణంగా నవ పంచమి రాజయోగం ఏర్పడబోతోంది. ఇది చాలా శుభ్రమైన అరుదైన యోగంగా పరిగణిస్తూ ఉంటారు.. కుజుడు రాహువుకు ఐదవ స్థానంలోకి వచ్చినప్పుడు.. రాహువు, కుజుడికి 9వ స్థానంలో ఉన్నప్పుడు మాత్రమే ఈ శక్తివంతమైన రాజయోగం ఏర్పడుతుంది. దీనివల్ల అదృష్టం పెరగడమే కాకుండా.. నిర్ణయాలు తీసుకునే నైపుణ్యం కూడా విపరీతంగా పెరుగుతుంది. ముఖ్యంగా డబ్బు విషయంలో ఆకస్మికంగా లాభాలు వస్తాయి. కుజుడు ప్రభావం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు పొందుతారు. సెప్టెంబర్ 18వ తేదీ నుంచి ప్రారంభమయ్యే ఈ యోగం వల్ల ఏ రాశుల వారికి ఎక్కువగా మేలు జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం..
ఈ రాశులవారికి బంపర్ లాభాలు:
మేషరాశి
కుజుడు మేష రాశి వారికి అధిపతిగా వ్యవహరిస్తారు.. నీ శక్తివంతమైన నవ పంచమి రాజయోగం ఏర్పడడం కారణంగా మేష రాశి వారి జీవితంలో సానుకూలమైన మార్పులు రావడం ప్రారంభమవుతాయి. ముఖ్యంగా వీరు ఈ సమయంలో కోరుకున్న ప్రదేశాలను సందర్శించే ఛాన్స్ కూడా కనిపిస్తుంది. అలాగే ఆత్మవిశ్వాసం కూడా ఊహించని స్థాయిలో పెరుగుతుంది. అత్యంత కష్టమైన ప్రాజెక్టులను కూడా సులభంగా పూర్తి చేస్తారు. ముఖ్యంగా అనుకుంటున్న పనుల్లో ఊహించని లాభాలు పొందుతారు.
మిథున రాశి
మిధున రాశి వారికి ఈ శక్తివంతమైన రాజయోగం చాలా అనుకూలంగా ఉండబోతోంది. స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టాలనుకునే వారికి ఈ సమయం ఎంతో లాభదాయకంగా ఉంటుంది. అలాగే ఊహించని దానికంటే ఎక్కువ మొత్తంలో డబ్బులు పొందగలుగుతారు. ముఖ్యంగా తెలివితేటలతో పాటు వ్యూహాత్మకమైన ఆలోచనల వల్ల జీవితంలో ఉన్నత శిఖరాలకు ఎదిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతేకాకుండా వ్యాపారాల్లో ఉన్న వ్యక్తులు కొత్త కొత్త కాంట్రాక్టులు కూడా పొందుతారు.
తులారాశి
తులా రాశిలో జన్మించిన వ్యక్తులకు ఈ శక్తివంతమైన నవ పంచమి యోగ ప్రభావంతో అదృష్టం ఊహించని స్థాయిలో పెరుగుతుంది. ముఖ్యంగా నిలిచిపోయిన పనులు ఇప్పుడు వాటంతకావే ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. విదేశాలకు సంబంధించిన వ్యాపారాలతో పాటు ఉద్యోగాల్లో అద్భుతమైన మార్పులు వస్తాయి. ఉన్నత విద్యను చేపట్టడానికి ప్రయత్నించే పనులు చాలా లాభదాయకంగా మారుతాయి. కారు లేదా భూములు కొనుగోలు చేయాలనుకునే వ్యక్తులందరికీ విశేషమైన లాభాలు కలిగే అవకాశాలు ఉన్నాయి.
కుంభరాశి
కుంభ రాశిలో జన్మించిన వ్యక్తులకు రాహువుతో పాటు కుజ గ్రహం కలయిక కారణంగా తెలివితేటలతో పాటు ఆదాయ వనరులు కూడా ఊహించని విధంగా పెరుగుతాయి. ముఖ్యంగా వ్యాపారాల్లో అనుకోని ఆర్థికపరమైన లాభాలు కలుగుతాయి. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న యువతకు మంచి శుభవార్తలు కూడా లభిస్తాయి. అలాగే వ్యక్తులతో పరిచయాలు ఏర్పడి.. అద్భుతమైన ఆర్థిక ప్రయోజనాలు పొందుతారని జ్యోతిష్యులు తెలుపుతున్నారు.
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
గమనిక.. 
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook ..
3000 DSC Notification: ఏపీ నిరుద్యోగులకు విద్యాశాఖ మంత్రి శుభవార్త.. మరో 3,000 టీచర్ పోస్టుల భర్తీకి డీఎస్సీ ప్రకటన!
Vijayawada, Andhra Pradesh:3000 AP DSC Notification: ఆంధ్రప్రదేశ్‌లోని నిరుద్యోగ యువతకు కూటమి ప్రభుత్వం మరో అద్భుతమైన తీపి కబురు అందించింది. ఇప్పటికే మెగా డీఎస్సీ ద్వారా వేలాది ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తున్న ప్రభుత్వం, తాజాగా పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను పెంచడానికి అదనంగా మరో 3,000 పోస్టులను డీఎస్సీ ద్వారా భర్తీ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విజయనగరం జిల్లా దాసన్నపేట పాఠశాలలో శనివారం నిర్వహించిన రాష్ట్రస్థాయి క్లస్టర్ పాఠశాలల సమావేశంలో ఈ కీలక విషయాన్ని అధికారికంగా ప్రకటించారు.
ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ, సమాజంలో ఆశించిన మార్పు, అభ్యున్నతి కేవలం నాణ్యమైన విద్య ద్వారానే సాధ్యమవుతాయని తాము బలంగా నమ్ముతున్నట్లు మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. విద్యా వ్యవస్థలో నాణ్యతను పెంచడంతో పాటు ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న వృత్తిపరమైన సమస్యలను అర్థం చేసుకునేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందని వివరించారు. ఇందుకోసం ప్రతి నెలా ఒక నియోజకవర్గ పరిధిలోని క్లస్టర్ కాంప్లెక్స్ సమావేశంలో స్వయంగా పాల్గొని ఉపాధ్యాయులతో ప్రత్యక్షంగా మాట్లాడతానని హామీ ఇచ్చారు.
క్లాస్‌రూమ్‌లలో విద్యార్థులకు మెరుగైన రీతిలో పాఠాలు బోధించేందుకు ఉపాధ్యాయులు అవలంబిస్తున్న వినూత్న బోధనా పద్ధతులను ఆయన స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ఈ సమావేశంలో రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 4,034 ఉపాధ్యాయ సముదాయాలు లైవ్ స్ట్రీమింగ్ ద్వారా భాగస్వామ్యం పంచుకున్నాయి.
అదేవిధంగా, ఉపాధ్యాయులకు ప్రత్యేక టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) నిర్వహించే ప్రతిపాదనను కూడా ప్రభుత్వం పరిశీలిస్తోందని మంత్రి లోకేష్ తెలిపారు. అయితే ఈ ప్రత్యేక పరీక్షల విషయమై ఉపాధ్యాయులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, వారు కేవలం తరగతి గదుల్లో విద్యార్థుల బోధనపైనే పూర్తి దృష్టి పెట్టాలని సూచించారు. ఏపీ ఉపాధ్యాయ సంఘాలు, రాష్ట్రోపాధ్యాయ సంఘాల ప్రతినిధులు చేసిన విజ్ఞప్తులపై సానుకూలంగా స్పందించి ఆయన వారికి హామీ ఇచ్చారు.
ఇప్పటికే ప్రతిపక్షాలు మెగా డీఎస్సీపై పలు విమర్శలు చేస్తూ టార్గెట్ చేస్తున్నప్పటికీ, నిరుద్యోగుల ప్రయోజనాలే ధ్యేయంగా మళ్లీ డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయుల భర్తీ చేపడతామని స్పష్టం చేశారు. ఈ తాజా ప్రకటన నిరుద్యోగ అభ్యర్థులలో కొత్త ఆశలను రేకెత్తిస్తోంది. త్వరలోనే ఈ పోస్టుల వివరాలు, అర్హతలు, పరీక్షా విధానం, దరఖాస్తు తేదీలపై అధికారిక నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది.
Also Read: ఎన్టీఆర్ జిల్లాలో స్కూల్ బస్సుకు ఘోరం ప్రమాదం..20 మంది విద్యార్థులు, దూసుకెళ్లింది!
Also Read: చిన్నప్పటి నుంచి నా హీరో, నా అన్నయ్య చిరంజీవే: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Bigg Boss Telugu 10: బిగ్‌బాస్‌లోకి టాలీవుడ్ క్రేజీ హీరోయిన్..సోషల్ మీడియాలో క్లారిటీ ఇచ్చిన సుజీత్ హీరోయిన్!
Hyderabad, Telangana:Seerat Kapoor Bigg Boss Telugu 10: బుల్లితెర ప్రేక్షకులు ఎంతో ఆత్రుతగా, ఆశగా ఎదురుచూస్తున్న బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10 గ్రాండ్ లాంచింగ్ సెప్టెంబర్ మొదటి వారంలోనే అత్యంత వైభవంగా ప్రారంభం కానుంది. ఇప్పటికే సాధారణ ప్రజలకు (కామన్ పీపుల్) బిగ్‌బాస్ హౌస్‌లోకి అడుగు పెట్టే సువర్ణావకాశం కల్పించేందుకు షో మేకర్స్ 'అగ్నిపరీక్ష' సీజన్ 2 పేరుతో ప్రత్యేక ఆడిషన్స్ నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించిన ఇంట్రెస్టింగ్ వీడియోలు ఇప్పటికే సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో తెగ హల్చల్ చేస్తూ వైరల్ అవుతున్నాయి.
మరోవైపు, ఈ క్రేజీ సీజన్లో సందడి చేయబోయే సెలబ్రిటీ కంటెస్టెంట్లు ఎవరనే అంశంపై ప్రేక్షకులలో రోజురోజుకూ ఉత్కంఠ పెరుగుతోంది. ప్రస్తుతం సోషల్ మీడియా ప్రచారాల ప్రకారం పల్లవి గౌడ, తేజస్విని గౌడ, జబర్దస్త్ ఫేమ్ రాకింగ్ రాకేష్, బుల్లితెర గ్లామర్ డాల్ వర్ష, పవిత్ర, గ్లామరస్ యాంకర్ వర్షిణి, యూట్యూబ్ సెన్సేషన్ నందూస్ వరల్డ్ నందు, యంగ్ హీరో చంద్రహాస్, సీనియర్ నటి జ్యోతి, రాయల్ ఎంసీ రమణ, ఒకప్పటి లవర్ బాయ్ హీరో అబ్బాస్, నూకరాజు, టెంపర్ వంశీ వంటి పలువురి పేర్లు గట్టిగా వినిపిస్తున్నాయి.
ఈ క్రేజీ సెలబ్రిటీల జాబితాలోకి తాజాగా టాలీవుడ్ అందాల ముద్దుగుమ్మ సీరత్ కపూర్ పేరు కూడా వచ్చి చేరింది. ఆమె ఈసారి బిగ్‌బాస్ హౌస్‌లోకి అడుగు పెట్టబోతోందంటూ వార్తలు రావడంతో, సీరత్ కపూర్ స్పందించి ఇన్‌స్టా/సోషల్ మీడియా వేదికగా తన అభిమానుల కోసం స్పష్టత ఇచ్చింది.
"నేను 'బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10'లో కంటెస్టెంట్‌గా పాల్గొంటున్నట్లు సోషల్ మీడియాలో వస్తున్న ఊహాగానాలను నేను కూడా చూశాను. ఈ విషయంలో అందరికీ క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను. ప్రస్తుతం నేను బిగ్‌బాస్‌లో పాల్గొనడం లేదు. ఒకవేళ భవిష్యత్తులో ఏదైనా ఉంటే నేనే స్వయంగా ప్రకటిస్తాను. లేదంటే నా సోషల్ మీడియా ఖాతాలలో పోస్ట్ చేస్తాను. దయచేసి అంతవరకు ఎలాంటి తప్పుడు రూమర్లను నమ్మవద్దు" అని హీరోయిన్ సీరత్ కపూర్ గట్టిగా పేర్కొంది.
'రన్ రాజా రన్' సినిమాతో టాలీవుడ్లో మంచి విజయం అందుకొని తెలుగు ప్రేక్షకులకు ఎంతగానో చేరువైన సీరత్ కపూర్.. ఆ తర్వాత 'టైగర్', 'కొలంబస్', 'రాజు గారి గది 2', 'ఒక్క క్షణం', 'టచ్ చేసి చూడు', 'కృష్ణ అండ్ హిజ్ లీల', 'మా వింత గాధ వినుమా', 'భామా కలాపం', రీసెంట్ మూవీ 'మనమే' వంటి పలు విజయవంతమైన చిత్రాల్లో తన నటనతో మెప్పించింది. సోషల్ మీడియాలో కూడా ఎంతో మంచి ఫాలోయింగ్ ఉన్న సీరత్ కపూర్ ఇచ్చిన ఈ అధికారిక వివరణతో ఆమె ఎంట్రీపై వస్తున్న తప్పుడు ప్రచారాలకు ఎట్టకేలకు పూర్తిగా తెరపడింది.
Also Read: బిగ్‌బాస్ 10 హంగామా షురూ.. ఈసారి హౌస్‌లోకి ఆ టాలీవుడ్ స్టార్ విలన్?
Also REad: నవదీప్, బిందు మాధవి తర్వాత..ఇప్పుడు నాగార్జునపై వీడియో రిలీజ్ చేసిన ఉప్పల్ బాలు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Yashasvi Jaiswal Asitha: శ్రీలంకతో టెస్టులో ఉద్రిక్తత..లంక బౌలర్‌తో యశస్వి జైస్వాల్ రణరంగం..వీడియో వైరల్!
Colombo, Western Province:Yashasvi Jaiswal Asitha Fernando: టీమ్ఇండియా, శ్రీలంక మధ్య రెండో టెస్టు మ్యాచ్ ప్రారంభమైంది. సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్ మైదానంలో జరుగుతున్న ఈ రెండో టెస్ట్ మ్యాచ్‌లో భారత్ టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. టీమ్ఇండియా బ్యాటర్ జైస్వాల్ వికెట్ తీసిన ఉత్సాహంలో బౌలర్ అసిథా ఫెర్నాండో, జైస్వాల్‌కు ఘాటైన శైలిలో వీడ్కోలు పలికాడు. పెవిలియన్ వైపు వెళ్ళిపోతున్న జైస్వాల్, ఫెర్నాండో నుండి ఏదో మాట వినపడటంతో వెనక్కి తిరిగాడు.
ఇద్దరూ ఒకరినొకరు ఎదుర్కొంటూ ముఖాముఖిగా నిలబడ్డారు. మాటల యుద్ధం తీవ్రమవడంతో మైదానంలో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో భారత ఓపెనర్ యశస్వి జైస్వాల్ తల అసిథా ఫెర్నాండో తలకు స్వల్పంగా తగిలింది. పరిస్థితి మరింత చేయి దాటక ముందే తోటి శ్రీలంక ఆటగాళ్లు వెంటనే జోక్యం చేసుకుని వీరిద్దరినీ విడదీసి ఘర్షణను శాంతింపజేశారు.
ఈ మ్యాచ్ ద్వారా సరన్ష్ జైన్ తన టెస్టు అరంగేట్రం చేశాడు. అయితే టాస్ సమయంలో భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఒక ముఖ్యమైన విషయాన్ని వెల్లడించారు. లెఫ్ట్-ఆర్మ్ రిస్ట్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ఒక ఇన్ఫెక్షన్ కారణంగా ఈ మ్యాచ్‌కు దూరమయ్యాడని, అందువల్లే అతడిని జట్టు నుండి తప్పించాల్సి వచ్చిందని గిల్ తెలిపారు.
భారత ఇన్నింగ్స్ ప్రారంభం
ఇన్నింగ్స్ ఆరంభంలో ఓపెనర్లు యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్ అద్భుతంగా ఇన్నింగ్స్ ప్రారంభించారు. జైస్వాల్ మంచి పట్టుదలతో ఆడుతూ ఆఫ్ స్టంప్ వెలుపల వచ్చే బంతులను జాగ్రత్తగా ఎంపిక చేసుకున్నాడు. కేఎల్ రాహుల్ కూడా మొదట కాస్త జాగ్రత్తగా ఆడి, ఆ తర్వాత కుదురుకున్నాడు. అయితే, లహిరు కుమార వేసిన ఒక వైడ్ బంతిని ఎడ్జ్ చేసి రాహుల్ వికెట్ కీపర్‌కు క్యాచ్ ఇచ్చి 18 పరుగుల వద్ద అవుటయ్యాడు. దీంతో భారత్ తొలి వికెట్ కోల్పోయింది. రాహుల్ అవుటైన తర్వాత దేవదత్ పడిక్కల్ క్రీజులోకి వచ్చాడు. ఆరంభంలో పడిక్కల్ స్లిప్ ఫీల్డర్ల పక్కగా బంతిని ఎడ్జ్ చేసి కాస్త ఆందోళన చెందాడు.
మరోవైపు యశస్వి జైస్వాల్ క్రీజులో పూర్తి ఆత్మవిశ్వాసంతో ఆడాడు. అతను ఎదుర్కొన్న 53 బంతుల్లో 9 బౌండరీల సహాయంతో వేగంగా 45 పరుగులు సాధించాడు. శ్రీలంక బౌలర్లు లైన్ లేదా లెంగ్త్ తప్పినప్పుడల్లా జైస్వాల్ బౌండరీలు బాదుతూ వారిపై ఒత్తిడి పెంచాడు. ఆ ఓవర్లో అంతకుముందు మూడు బౌండరీలు సమర్పించుకున్న శ్రీలంక పేసర్ అసిథా ఫెర్నాండో చివరకు చివరి బంతికి విజయం సాధించాడు.
తొలి సెషన్ ముగిసేసరికి భారత్ పరిస్థితి
యశస్వి జైస్వాల్ అవుట్ కావడంతో భారత్ తొలి సెషన్ ముగిసేసరికి ఇద్దరు ఓపెనర్ల వికెట్లు కోల్పోయి 66 పరుగుల స్కోరుకు చేరుకుంది. అప్పటివరకు బలంగా సాగిన భారత ఇన్నింగ్స్‌లో జైస్వాల్ వికెట్ పడటంతో శ్రీలంక తిరిగి మ్యాచ్‌లోకి పుంజుకోగలిగింది. కొలంబో పిచ్ కూడా భారత బ్యాటర్లపై ఒత్తిడి తెచ్చేందుకు శ్రీలంక బౌలర్లకు తగినంత సహకారాన్ని అందిస్తోంది.
Also Read: డబ్ల్యూటీసీ రేసులో భారత్ అసలు సిసలైన పరీక్ష.. ఫైనల్ చేరాలంటే భారత్ ఇలా చేయాలి!
Also Read: శ్రీలంకతో తొలిటెస్టులో భారత్ ఘన విజయం..10 వికెట్లు పడగొట్టిన స్పిన్నర్ మానవ్ సుతార్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Abhijeet Dipke Case: టీచర్లకు బెదిరింపులు.. 'కాక్రోచ్ జనతా పార్టీ' అభిజీత్ దీప్కేపై కేసు నమోదు!
Badapur, Maharashtra:Abhijeet Dipke Case In Maharashtra: మహారాష్ట్రలోని లాతూర్ జిల్లాలో ప్రభుత్వ ఉపాధ్యాయులపై బెదిరింపులకు పాల్పడిన ఘటనలో 'కాక్రోచ్ జనతా పార్టీ' (CJP)కి షాక్ తగిలింది. ఆ పార్టీ వ్యవస్థాపకుడైన అభిజీత్ దీప్కేతో పాటు ఆయన బృందంలోని మరికొందరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎటువంటి ముందస్తు అనుమతులు లేకుండా ప్రభుత్వ పాఠశాలలోకి ప్రవేశించి, తరగతులకు అంతరాయం కలిగించి, ఉపాధ్యాయులను తీవ్రంగా భయభ్రాంతులకు గురిచేసిన ఆరోపణలపై పోలీసులు ఈ తక్షణ చర్యలు తీసుకున్నారు. ఈ వివాదాస్పద ఘటనకు సంబంధించి లాతూర్ పరిధిలోని ఆసా పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ (FIR) నమోదైంది.
ఘటన నేపథ్యం..
కాక్రోచ్ జనతా పార్టీ (CJP) ఆధ్వర్యంలో మహారాష్ట్రలోని ప్రభుత్వ పాఠశాలలు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను బహిర్గతం చేయడం కోసం "స్కూల్ ఠీక్ కరో" అనే ప్రచార కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో భాగంగా అభిజీత్ దీప్కే, ఆయన సహచరులు లాతూర్‌లోని పలు ప్రభుత్వ పాఠశాలలను సందర్శిస్తూ, అక్కడ ఉన్న లోటుపాట్లను సామాజిక మాధ్యమాలలో ప్రస్తావిస్తున్నారు.
అయితే, ఈ పర్యటనల సాకుతో ఆసా సమీపంలోని జవళి గ్రామంలో గల జిల్లా పరిషత్ ఉర్దూ పాఠశాలలో వీరు తీవ్రమైన అరాచకానికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి.
ఉపాధ్యాయురాలి ఫిర్యాదు..
జవళి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉర్దూ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా విధులు నిర్వహిస్తున్న సయ్యద్ షమ్షద్బానో ఖైరతాలీ (53) ఆసా పోలీస్ స్టేషన్లో దీనిపై అధికారికంగా ఫిర్యాదు చేశారు. ఆమె సమర్పించిన ఫిర్యాదు వివరాల ప్రకారం.. అభిజీత్ దీప్కే బృందం ఎటువంటి ముందస్తు అనుమతి కానీ, కనీస సమాచారం కానీ లేకుండా అక్రమంగా పాఠశాల ప్రాంగణంలోకి చొరబడింది. ఆ తర్వాత తరగతి గదుల్లోకి వెళ్లి విద్యార్థుల మధ్య కూర్చుని, వారిని రకరకాల ప్రశ్నలు వేయడం ద్వారా తరగతులు, పాఠశాల అధికారిక కార్యకలాపాలకు తీవ్ర అంతరాయం కలిగించారు.
సస్పెన్షన్ బెదిరింపులు..
పాఠశాలలో జరిగిన ఈ పరిణామాలను దీప్కే బృందం వీడియోలుగా చిత్రీకరించి సోషల్ మీడియాలో షేర్ చేసింది. అంతేకాకుండా, పాఠశాల విద్యార్థుల సంఖ్యను ఎక్కువగా చూపించడం కోసం పక్కనే ఉన్న మరో పాఠశాల విద్యార్థులను తీసుకువచ్చి తరగతి గదుల్లో కూర్చోబెట్టారని దీప్కే ఉపాధ్యాయులపై ఆరోపణలు చేశారు. ఈ విషయమై అక్కడి ఉపాధ్యాయులను విధుల్లోంచి సస్పెండ్ చేయిస్తామని అభిజీత్ దీప్కే నేరుగా బెదిరింపులకు దిగడంతో పాఠశాల సిబ్బంది తీవ్ర ఆందోళన చెందారు.
కేసు నమోదు చేసిన పోలీసులు..
బాధిత ఉపాధ్యాయురాలి ఫిర్యాదు ఆధారంగా ఆసా పోలీసులు అభిజీత్ దీప్కే, ఇతర నిందితులపై భారతీయ న్యాయ సంహిత (BNS)లోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. పోలీసులు నమోదు చేసిన సెక్షన్ల వివరాలు క్రింది విధంగా ఉన్నాయి.
సెక్షన్ 132 - ప్రభుత్వోద్యోగి విధులను నిర్వహించకుండా అడ్డుకోవడం.
సెక్షన్ 329(3) - ప్రభుత్వ పాఠశాల అధికారిక పనులకు తీవ్ర ఆటంకం కలిగించడం.
సెక్షన్ 351(2) - పాఠశాల సిబ్బందిని నేరపూరితమైన రీతిలో బెదిరింపులకు గురిచేయడం.
సెక్షన్ 356(2) - శాంతిభద్రతలకు భంగం కలిగిస్తూ అలజడి సృష్టించడం.
ఈ సంఘటన సామాజిక మాధ్యమాలు మరియు స్థానిక ప్రభుత్వ విద్యా వర్గాలలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
Also Read: వాహనదారులకు బిగ్ రిలీఫ్..పెట్రోల్ బంకుల్లో పాత వాహనాలకు మళ్లీ E10 పెట్రోల్ అందుబాటు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Karimnagar News: హాస్టల్‌కు పోవడం ఇష్టం లేక.. ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య!
Hyderabad, Telangana:Karimnagar Student News: హాస్టల్ జీవితం నచ్చలేక.. తల్లిదండ్రులకు దూరంగా ఉండటం ఇష్టం లేక.. ఓ ఇంటర్మీడియట్ విద్యార్థిని బల్వన్ మరణానికి పాల్పడిన విషాదకర ఘటన కరీంనగర్ జిల్లాలో చోటుచేసుకుంది.. కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం రంగపేట గ్రామానికి చెందిన విద్యార్థిని స్ఫూర్తి పురుగుల మందు తాగి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందడంతో స్థానికంగా తీవ్ర విషాద ఛాయలు నెలకొన్నాయి..
కుటుంబ సభ్యులతో పాటు పోలీసుల అందించిన సమాచారం ప్రకారం.. రంగ పేటకు చెందిన స్ఫూర్తి ఇంటర్మీడియట్ చదువుతోంది.. చదువుల కోసం హాస్టల్లో ఉండాల్సి రాగా.. అక్కడి వాతావరణంలో ఉండటం ఆమెకు ఏమాత్రం ఇష్టం లేక పోయింది.. మానసిక ఒత్తిడికి గురైన ఆమె.. సుమారు వారం రోజుల క్రితం ఇంట్లో ఎవరూ లేని సమయంలో పాలల్లో పురుగుల మందు కలుపుకొని తాగింది..
తాను పురుగుల మందు తాగినని విషయాన్ని స్ఫూర్తి తల్లిదండ్రులకు లేదా కుటుంబ సభ్యులకు చెప్పకుండా అలాగే ఉండిపోయింది.. అయితే.. శరీరంలోని విష ప్రభావం తీవ్రం కావడంతో కొన్ని రోజుల తర్వాత ఆమె తీవ్ర అస్వస్థకు గురైనట్లు తెలుస్తోంది.. కడుపునొప్పితో పాటు వాంతులతో బాధపడుతున్న ఆమెని కుటుంబ సభ్యులు వెంటనే గమనించి ప్రశ్నించగా.. పురుగుల మందు తాగినట్లు విషయాన్ని బయట పెట్టేసింది..
Also Read: Eshwar Sai: బాసింగా బాసింగా సాంగ్ ఫేమ్ ఈశ్వర్‌సాయి రాసలీలలు..
విషయం తెలిసిన వెంటనే కుటుంబ సభ్యులు బాధితురాలిని కరీంనగర్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.. అప్పటికే విషం శరీరమంతటా వ్యాపించడంతో.. ఆమె పరిస్థితి విషమంగానే మారింది.. ఐసీయూలో అత్యవసర చికిత్సను అందించినప్పటికీ పరిస్థితి.. మెరుగుపడక శనివారం రాత్రి స్ఫూర్తి చికిత్స పొందుతూ మరణించింది..చేతికి అంది వచ్చిన కూతురు కళ్ళముందే చనిపోవడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరు అవుతున్నారు..
Also Read: Eshwar Sai: బాసింగా బాసింగా సాంగ్ ఫేమ్ ఈశ్వర్‌సాయి రాసలీలలు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
తాతయ్యలు, బామ్మల బ్యాగుల్లో గంజాయి.. స్మగ్లర్ల మైండ్ బ్లాంక్ అయ్యే స్కెచ్!
Hyderabad, Telangana:Senior Citizens Turned Drug Carriers: వృద్ధాప్యం అనగానే ఎవరికైనా జాలితో పాటు గౌరవం కలుగుతుంది.. కానీ కొందరు మాఫియా కేటుగాళ్లు ఇదే సానుభూతిని అడ్డం పెట్టుకొని అక్రమ వ్యాపారానికి ఆయుధంగా మలుచుకుంటున్నారు.. ప్రయాణాల్లో వయస్సు పైబడిన వారిని ఎవరు పెద్దగా చెక్ చెయ్యరని భావించి.. డ్రగ్ క్యారియర్లుగా మార్చిన ఓ భారీ ముఠాను హైదరాబాద్ పోలీసులు పట్టుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం..
హైదరాబాద్ CCS ప్రత్యేక క్రైమ్ బృందం, గాంధీనగర్ పోలీసులు సంయుక్తంగా జరిపిన ఆపరేషన్ లో భాగంగా 38 కిలోల గంజాయితో.. ఐదుగురు నిందితులు పట్టుపడ్డారు.. పక్కా సమాచారంతో దాడులు నిర్వహించి స్వాధీనం చేసుకున్న ఈ మారకద్రవ్యాల విలువ మార్కెట్లో సుమారు పది లక్షలకు పైగా ఉంటుందని పోలీసులు వెల్లడించారు..
పోలీసులు విచారణలో భాగంగా కొన్ని ఆశ్చర్యపరిచే నిజాలు వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది.. అరెస్ట్ అయిన వారిలో 78 ఏళ్ల రాజారాం స్వామి.. 65 ఏళ్ల సంతోష్.. 66 ఏళ్ల విజయలక్ష్మి లాంటి వృద్ధులతో పాటు మరో ఇద్దరు మహిళలు ఉన్నారట.. వీరంతా సాధారణ హౌస్ హెల్పర్స్ గా.. కూలీలుగా పనిచేస్తూ సులభంగా డబ్బులు సంపాదించాలని ఆశతో ఈ ఊబిలోకి దిగినట్లు పోలీసులు తెలిపారు..
స్మగ్లర్ల హైటెక్ స్కెచ్..
ఏజెన్సీ ప్రాంతమైన అరకులు నాణ్యమైన గంజాయిని కొనుగోలు చేసి.. వాసన రాకుండా బ్రౌన్ కలర్ కవర్లలో ప్యాక్ చేశారని పోలీసులు గుర్తించారు.. వృద్ధుల బ్యాగుల్లో.. వారి సాధారణ బట్టల మధ్య ఈ ప్యాకెట్లను దాచిపెట్టి.. ఆర్టీసీ బస్సుల్లో హైదరాబాద్ చేరుకొని.. ఎవరికి అనుమానం రాకుండా నగరాల్లోని లాడ్జిల్లో బస చేసి.. అనంతరం ప్రైవేట్ బస్సుల్లో ముంబాయి వెళ్లి.. అక్కడ గంజాయి విక్రయించే వారికి సరుకులు అప్పగిస్తూ ఉంటారని పోలీసుల దర్యాప్తులో తేలింది.. అంతేకాకుండా ఈ ప్రయాణానికి గాను ఒక్కొక్క డెలివరీకి.. దాదాపు పదివేల నుంచి 12 వేల వరకు వీరికి కమిషన్ మూడుతోందని అధికారులు వెల్లడించారు.
DCP చైతన్య కుమార్ మార్గదర్శకత్వంలో.. ఇన్స్పెక్టర్ సుధాకర్ రావు, ఎస్సై దేవేందర్ గౌడ్ ఈ ఆపరేషన్ విజయవంతంగా పూర్తి చేశారు. పట్టుబడిన నిందితులకు గతంలోనూ గంజాయి రవాణా చేసే నేర చరిత్ర ఉన్నట్లు విచారణలో తేలింది. అసలు అరకులో సరుకు ఇస్తుంది ఎవరు? ముంబైలో తీసుకున్న డాన్ ఎవరు? అనే కోణంలో పోలీసులు ప్రత్యేకమైన దర్యాప్తును కూడా చేస్తున్నట్లు తెలుస్తోంది.
Also Read: Viral Pic: ఇదేం క్రియేటివిటీ రా బాబు.. మూత్రం పోస్తూ ప్రీ వెడ్డింగ్ ఫోటో స్టిల్స్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి..
