ఖమ్మం: పురుగుల మందుతాగి రైతు ఆత్మహత్య
Khammam, Telangana:ఖమ్మం రూరల్ మండలం జాన్ పహాడ్ తండాలో రైతు వెంకట్ రెడ్డి పురుగుల మందుతాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈనెల 4న పురుగుల మందుతాగి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నేడు మృతిచెందాడు. తన భూమిని జాటోత్ వీరన్న కబ్జా చేస్తున్నాడని ఆరోపిస్తూ, పొలంలో సెల్ఫీ వీడియో తీసి ఆత్మహత్య యత్నం చేశాడు. పోలీసు, రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించాడు. ఈ సంఘటన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పాలేరు నియోజకవర్గంలో చోటుచేసుకుంది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
Bigg Boss 10 Telugu: బిగ్‌బాస్ సీజన్ 10 గ్రాండ్ లాంచ్ ప్రోమో వచ్చేసింది.. ఊహించని సర్ప్రైజ్లతో 16 మంది కంటెస్టెంట్లు!
Hyderabad, Telangana:Bigg Boss 10 Telugu Promo: తెలుగు బుల్లితెర వీక్షకులకు 'బిగ్‌బాస్' రియాలిటీ షో అంటే ఎనలేని క్రేజ్, విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. ఇప్పటికే విజయవంతంగా 9 సీజన్లను దిగ్విజయంగా పూర్తి చేసుకున్న ఈ భారీ షో, నేడు (సెప్టెంబర్ 6) సాయంత్రం 7 గంటల నుండి 'స్టార్ మా' ఛానల్, 'జియో హాట్ స్టార్' ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో గ్రాండ్‌గా ప్రసారం కానుంది. ఈ మేరకు నిర్వాహకులు విడుదల చేసిన గ్రాండ్ లాంచింగ్ ఎపిసోడ్ ప్రోమో ప్రేక్షకులలో అంచనాలను అకాశానికి చేర్చింది.
ఈ సారి ఆట మరింత రసవత్తరంగా సాగనుందని తెలుస్తోంది. "ఆటలో సవాల్ కాదు.. ఆటే సవాల్" అంటూ ఇప్పటికే విడుదలైన ప్రోమోలు సీజన్ 10పై విపరీతమైన ఆసక్తిని, ఉత్కంఠను పెంచాయి. పదో సీజన్ ప్రత్యేకతకు అనుగుణంగా నిర్వాహకులు "దశావతారం" అనే సరికొత్త సర్ప్రైజ్ కాన్సెప్ట్‌ను ప్లాన్ చేశారని సమాచారం.
అంతేకాకుండా, ఈసారి తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో కూడా ఒకే రోజే షో ప్రారంభం కానుండటం బుల్లితెర చరిత్రలోనే ఒక సరికొత్త రికార్డు అని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో ఇతర భాషల బిగ్‌బాస్ హోస్టులైన విజయ్ సేతుపతి, మోహన్ లాల్, కిచ్చా సుదీప్ ముగ్గురూ కలిసి తెలుగు బిగ్‌బాస్ హోస్ట్ అక్కినేని నాగార్జునతో వర్చువల్ పద్ధతిలో భేటీ కావడం ప్రేక్షకులలో మరింత జోష్ నింపింది.
ఈ గ్రాండ్ లాంచ్ ఎపిసోడ్‌కు పలువురు సినీ తారలు విచ్చేసి అలరించనున్నారు. వారిలో 'సర్దార్ 2' సినిమా ప్రమోషన్స్ కోసం తమిళ స్టార్ హీరో కార్తీ రానుండగా, తమ సరికొత్త 'ఎపిక్' సినిమా ప్రమోషన్లలో భాగంగా టాలీవుడ్ యువ హీరో ఆనంద్ దేవరకొండ, అందాల హీరోయిన్ వైష్ణవి చైతన్య స్టేజ్‌పై సందడి చేయబోతున్నారు
మరోవైపు, హౌస్‌లోకి వెళ్లే కంటెస్టెంట్ల వివరాల గురించి నెట్టింట భారీగా చర్చ సాగుతోంది. ఈసారి తొలి రోజే మొత్తం 16 మంది కంటెస్టెంట్లు హౌస్‌లోకి వెళ్తున్నట్లు సమాచారం. వీరిలో సామాన్యుల కోటా నుండి ఆరుగురు, సెలెబ్రెటీ కోటా నుండి పది మంది ఉన్నారు.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సెలెబ్రెటీల జాబితా ప్రకారం..
1) ఆటో రాంప్రసాద్
2) టెంపర్ వంశీ
3) దేబ్జానీ మోదక్
4) యాంకర్ వర్షిణి
5) ముఖేష్ గౌడ
6) చైత్రా రాయ్
7) నటుడు కృష్ణుడు
8) జబర్దస్త్ నరేశ్
9) పాడ్‌కాస్ట్ యాంకర్ సుధీర్ రెడ్డి తదితరులు ఉన్నట్టు సమచారం.
ఇక 'అగ్నిపరీక్ష' మార్గం ద్వారా హౌస్‌లోకి వెళ్లే ఆరుగురు సామాన్యులలో రైతు బిడ్డ ఝాన్సీ (ఈమె ఎంట్రీని ప్రోమోలోనే చూపించారు). రోహిత్ నాయుడు, శ్రష్టి, చరణ్, అమన్ మసూద్, షాలిని పటేల్ ఉండబోతున్నట్లు సమాచారం. మరి ఈ సరికొత్త కాన్సెప్ట్, అదిరిపోయే సర్ప్రైజ్లతో రాబోతున్న ఈ సీజన్ 10 ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో వేచి చూడాలి.
Also Read: బిగ్‌బాస్ ఆఫర్ తిరస్కరించిన సెలబ్రిటీలు వీళ్లే.. లక్షల్లో రెమ్యునరేషన్ ఇచ్చినా 'నో'
Also REad: నాని పారడైజ్ సినిమా రిలీజ్‌కు మళ్లీ బ్రేక్.. మరోసారి సినిమా విడుదలపై సస్పెన్స్?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Employees Protest: విశాఖలో ఒక్కసారిగా ఉద్రిక్తత.. రోడ్డుపై సచివాలయ ఉద్యోగుల ధర్నా
Visakhapatnam, Andhra Pradesh:Sachivalaya Employees Protest: తమ పరిష్కారంపై తీవ్ర నిర్లక్ష్యం.. తమ డిమాండ్లపై కూటమి ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తుండడంతో ఏపీ సచివాలయ ఉద్యోగులు ఒక్కసారిగా ఆందోళన బాట పట్టారు. ప్రభుత్వ ఉద్యోగులకు డీఏలు, వేతన సవరణ సంఘం ప్రకటించగా తమ సమస్యల పరిష్కారంపై కూటమి ప్రభుత్వం దృష్టి సారించలేదు. దీంతో ఆకస్మికంగా ఉద్యోగులు నిరసనకు దిగారు. విశాఖపట్టణంలో సచివాలయ ఉద్యోగుల ఆందోళనతో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది.
సచివాలయ ఉద్యోగుల నిరసనల హోరుతో ఆదివారం విశాఖ మహా నగరం అట్టుడికిపోయింది. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఉమ్మడి విశాఖ జిల్లాల ఉద్యోగులు రోడ్డెక్కారు. వారి ఆందోళనతో జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద గత మూడ్రోజులుగా శాంతియుతంగా చేపట్టిన ఆందోళన ఆదివారం పతాకస్థాయికి చేరుకుంది. వార్డు, గ్రామ, సచివాలయ ఉద్యోగుల నిరసనతో ఆర్టీసీ కాంప్లెక్స్ పరిసర ప్రాంతాలు ఉద్రిక్తంగా మారాయి. తమ సమస్యలు పరిష్కరించాలంటూ జోన్-1 పరిధిలోని వందలాది మంది సచివాలయ ఉద్యోగులు రోడ్డుపై బైఠాయించి ట్రాఫిక్ కు అంతరాయం కలిగించారు. సమాచారం అందుకున్న ఈస్ట్ ఏసీపీ కె. లక్ష్మణమూర్తి హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని ఆందోళనకారుల్ని అదుపు చేయడానికి ప్రయత్నించారు. నిరసనకారులు రోడ్డుపై బైఠాయించడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వివిధ ప్రాంతాలకు వెళ్లాల్సిన ఆర్టీసీ బస్సులు కూడా ప్రత్యామ్నాయ దారుల్లో ప్రయాణించాయి.
వెట్టిచాకిరీ కాదు.. మాది అర్హతతో సాధించిన ఉద్యోగం
'నిత్యం ఉదయం నుంచి రాత్రి వరకు క్షేత్రస్థాయిలో ప్రభుత్వ సంక్షేమాన్ని ప్రజల ముంగిటకు చేర్చేది మేమే. కానీ మేం మాత్రం నడిరోడ్డుపై ఎండనక, వాననక కూర్చోవాల్సిన దుస్థితి. ప్రభుత్వ వ్యవస్థలో అత్యంత కీలకమైన ఉద్యోగుల్ని ఈ విధంగా నిరాదరణకు గురిచేయడం ప్రజాస్వామ్యానికే గొడ్డలిపెట్టు. ఇప్పటికైనా మా సమస్యలపై దృష్టి సారించి న్యాయం చేయాలి'అని బాధితులు నినదించారు.
కలల కొలువు.. నేడు రోడ్డున పడ్డ బతుకు
'ఎన్నో ఏళ్లు నిద్రాహారాలు మాని, పుస్తకాలతో కుస్తీ పట్టి, కష్టపడి సాధించుకున్న ప్రభుత్వ ఉద్యోగం మాది. ఇంట్లో వృద్ధులైన తల్లిదండ్రులు, భార్యాపిల్లల భవిష్యత్తు బాగుంటుందని ఆశపడితే... చివరకు మిగిలింది ఈ నిరసనల రోడ్డు మాత్రమేనా? ఉన్నత చదువులు చదివి, ఉత్తమ అర్హతలతో ప్రజలకు సేవ చేస్తున్న గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగులకు కనీస గౌరవం, భద్రత కరువవ్వడం అత్యంత బాధాకరం. మా శ్రమకు గుర్తింపు, మా హక్కులకు న్యాయం ఎప్పుడు దక్కుతుంది?' అంటూ బాధితులు ఆందోళన వ్యక్తం చేశారు.
Kavitha: రేవంత్ రెడ్డి ఓటమి లక్ష్యంగా కవిత.. 24న కొడంగల్ లో పాంచజన్య సభ
Baddipadaga, Telangana:Kavitha Targets Kodangal: సొంత బీఆర్ఎస్ పార్టీతోపాటు కాంగ్రెస్ పార్టీపై కూడా మాజీ ఎమ్మెల్సీ కవిత పోరాటం చేస్తున్నారు. ఈ క్రమంలో రేవంత్ రెడ్డి లక్ష్యంగా కవిత సంచలన నిర్ణయం తీసుకున్నారు. కొడంగల్‌లో రేవంత్ రెడ్డిని ఓడించాలనే లక్ష్యంతో భారీ బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించారు. తన పార్టీ నిర్ణయించిన పాంచజన్యం వివరించేందుకు వరుసగా సంకల్ప సభలు నిర్వహిస్తుండగా.. ఈసారి కొడంగల్‌లో నిర్వహించనున్నారు.
రేవంత్ రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గంపై తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవిత దృష్టి సారించారు. ఈనెల 23వ తేదీన కొడంగల్ నియోజకవర్గంలోని కోస్గిలో పాంచజన్య సంకల్ప సభ నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా కోస్గి సభ పోస్టర్‌ను ఆదివారం హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో ఉన్న తెలంగాణ రక్షణ సేన పార్టీ కార్యాలయంలో కవిత ఆవిష్కరించారు. కోస్గి సభను విజయవంతం చేయాలని ప్రజలను పిలుపునిచ్చారు.
ఎన్నికలకు ముందు తెలంగాణ ఉద్యమకారుల కాళ్లు పట్టుకున్నంత పనిచేసి, అధికారంలోకి వచ్చిన వెంటనే వారికి న్యాయం చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.
కానీ అధికారంలోకి వచ్చి మూడేళ్లు గడుస్తున్నా ఉద్యమకారులకు న్యాయం జరగలేదు.
ఉద్యమకారులకు ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని… pic.twitter.com/Swjz669gSO— Kavitha Kalvakuntla (@RaoKavitha) September 6, 2026
ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీల హామీలను నెరవేర్చడంలో రేవంత్ రెడ్డి ఘోరంగా విఫలమయ్యారని విమర్శించారు. ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని హామీ ఇచ్చి హాఫ్ గ్యారంటీ కూడా అమలు చేయడం లేదని ఆరోపించారు. బూటకపు హామీలు.. బోగస్ మాటల కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై కొడంగల్ కేంద్రంగా పాంచజన్య శంఖారావం పూరిస్తున్నామని ప్రకటించారు. 'రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ రక్షణ సేన పార్టీని గెలిపిస్తే ఉచిత విద్య, ఉచిత వైద్యం అందించడంతో పాటు తమ పాంచజన్యంలోని ప్రతి హామీని వంద శాతం నెరవేర్చి తీరుతాం' అని కవిత హామీ ఇచ్చారు. యువత, మహిళలు, సబ్బండ వర్గాల వికాసం, సాధికారత కలిగిన బహుజన తెలంగాణాను సాకారం చేయడమే తమ లక్ష్యమని కవిత ప్రకటించారు.
ఎన్నికలకు ముందు తెలంగాణ ఉద్యమకారుల కాళ్లు పట్టుకున్నంత పనిచేసి.. అధికారంలోకి వచ్చిన వెంటనే వారికి న్యాయం చేస్తామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. కానీ అధికారంలోకి వచ్చి మూడేళ్లు గడుస్తున్నా ఉద్యమకారులకు న్యాయం జరగలేదు. ఉద్యమకారులకు ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలి' అని ప్రభుత్వాన్ని కవిత డిమాండ్ చేశారు. 'బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నవారే సోషల్ మీడియా వేదికగా అనుచిత వ్యాఖ్యలు చేస్తుంటే ప్రభుత్వం, పోలీసు వ్యవస్థ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం అత్యంత బాధాకరం' అని కవిత తెలిపారు.
Keyaa Banerji AI: భారత వెయిట్‌లిఫ్టర్ కీయా బెనర్జీకి చేదు అనుభవం.. నగ్న ఫొటోలుగా మార్ఫింగ్ వైరల్!
Hyderabad, Telangana:Keyaa Banerji AI Images: పవర్‌లిఫ్టింగ్ రంగంలో తన అద్భుత ప్రదర్శనతో భారతదేశానికి కీర్తి తెచ్చిన 21 ఏళ్ల యువ అథ్లెట్ కీయా కునాల్ బెనర్జీ, ప్రస్తుతం ఒక దురదృష్టకరమైన ఆన్లైన్ వివాదాన్ని ఎదుర్కొంటోంది. దక్షిణాఫ్రికాలోని సన్ సిటీలో జరిగిన '2026 ఐపీఎఫ్ వరల్డ్ పవర్‌లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్‌ల'లో జూనియర్ మహిళల 47 కేజీల విభాగంలో ఆమె రజత పతకాన్ని సాధించింది. పోటీ సమయానికి కేవలం 45.70 కేజీల బరువున్న కీయా, తన శరీర బరువుకు మూడు రెట్ల కంటే ఎక్కువ బరువైన 140 కేజీల డెడ్‌లిఫ్ట్‌ను ఎత్తి సంచలనం సృష్టించింది.
ఈ టోర్నమెంట్లో ఫ్రాన్స్‌కు చెందిన ఇనెస్ హెర్బాక్స్ 165 కేజీలతో స్వర్ణం సాధించగా, ఐర్లాండ్‌కు చెందిన బ్లాత్నైడ్ ఓ'డ్వైర్ కూడా 140 కేజీలు ఎత్తారు. అయితే, నియమాల ప్రకారం ఓ'డ్వైర్‌ను అధిగమించి కీయా రజత పతకాన్ని కైవసం చేసుకుంది. ఆమె స్క్వాట్‌లో 90 కేజీలు, బెంచ్ ప్రెస్‌లో 50 కేజీలతో కలిపి మొత్తం 280 కేజీల బరువును ఎత్తి ఐదో స్థానంలో నిలిచారు.
దేశీయంగా ఎదుగుదల..
జాతీయ స్థాయిలో కూడా కీయా నిరంతర పురోగతిని కనబరిచారు. 2025 జాతీయ ఛాంపియన్‌షిప్‌లో ఆమె 257.5 కేజీల బరువును నమోదు చేయగా, 2026 నాటికి స్క్వాట్‌లో 95 కేజీలు, బెంచ్ ప్రెస్‌లో 52.5 కేజీలు, డెడ్‌లిఫ్ట్‌లో 140 కేజీలతో మొత్తం 287.5 కేజీల అత్యుత్తమ బరువును ఎత్తి తన ప్రదర్శనను గణనీయంగా మెరుగుపరుచుకున్నారు.
ఆన్లైన్ వేధింపుల చీకటి కోణం..
ఈ అంతర్జాతీయ విజయం తెచ్చిన కీర్తి కీయాకు ఆనందాన్ని ఇవ్వాల్సింది పోయి నరకాన్ని చూపించింది. రజతం గెలిచిన వెంటనే ఆమె పేరుతో నకిలీ ఖాతాలు వెలిశాయి. అంతేకాకుండా, ఆమె ముఖాన్ని, శరీరాన్ని చాలా అసభ్యకరమైన రీతిలో మార్ఫింగ్ చేసిన వేలాది నకిలీ ఏఐ (AI) చిత్రాలను సృష్టించి వైరల్ చేశారు. దీనితో పాటు సోషల్ మీడియాలో లైంగిక వేధింపులు, జాతి, కుల పరమైన అనుచిత వ్యాఖ్యలు ఆమెను తీవ్ర మానసిక ఒత్తిడికి గురిచేశాయి.
గతంలో కేవలం 300 మంది ఫాలోవర్లతో ప్రైవేట్ ఖాతాలో నిశ్శబ్దంగా ఉండే కీయా, ఇన్స్టాగ్రామ్ తన ఖాతాను సస్పెండ్ చేయడంతో కొత్త పబ్లిక్ ఖాతాను సృష్టించాల్సి వచ్చింది. తన ఆవేదనను వ్యక్తపరుస్తూ.. "పవర్‌లిఫ్టింగ్ అనేది నన్ను నేను సవాలు చేసుకోవడానికి మాత్రమే తప్ప సోషల్ మీడియా ప్రచారం కోసం కాదు. నాకు ఈ వైరల్ కీర్తి, ఫాలోవర్ల సంఖ్య వద్దు. నా అనుమతి లేకుండా ఏఐ చిత్రాలను సృష్టించడం దారుణం. డెడ్‌లిఫ్ట్ ఇష్టపడే ఒక సాధారణ అమ్మాయిగా బతికే ప్రశాంతమైన స్థలం మాత్రమే నాకు కావాలి" అని కీయా పేర్కొన్నారు. ఈ సంఘటన మహిళా అథ్లెట్లకు డిజిటల్ భద్రత ఎంత అవసరమో మరొక్కసారి చాటిచెప్పింది.
Also Read: India Vs Japan: జపాన్‌తో టీమ్ఇండియా ద్వైపాక్షిక టీ20 సిరీస్..భారత్‌కు ఇన్ని లాభాలా?
Also Read: రేపే భారత్ Vs పాకిస్థాన్ మధ్య పోరు..ఆసియా కప్ 2026లో దుబాయ్‌లో హై-వోల్టేజ్ మ్యాచ్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Indonesia Volcano: ఇండోనేషియాలో బద్దలైన అగ్నిపర్వతం.. 209 విమానాలపై ప్రభావం, ప్రయాణికులకు తీవ్ర అంతరాయం
Central Kalimantan:Indonesia Volcano Eruption: జావా, సుమత్రా ద్వీపాల మధ్య ఉన్న సుండా జలసంధిలో ఈ అనాక్ క్రాకటోవా అగ్నిపర్వతం ఉంది. ఆదివారం తెల్లవారుజామున సుమారు 3:53 గంటల సమయంలో దాదాపు 30 సెకన్ల పాటు ఈ విస్ఫోటనం జరిగింది. ఈ ఘోర విస్ఫోటనం కారణంగా అగ్నిపర్వతం నుండి రెండు భారీ బూడిద మేఘాలు ఏర్పడి గగనతలాన్ని కమ్మేశాయని స్థానిక అధికారులు వెల్లడించారు. అనంతరం ఏర్పడిన మొదటి బూడిద మేఘం సుమారు 20 వేల అడుగుల ఎత్తుకు చేరుకుని ఈశాన్య దిశగా కదిలింది.
దీనివల్ల జకార్తా, బాంటెన్, పశ్చిమ జావా ప్రాంతాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. ఇక రెండో బూడిద మేఘం ఏకంగా 50 వేల అడుగుల అసాధారణ ఎత్తుకు చేరుకుంది. ఇది పశ్చిమ, వాయవ్య దిశగా వ్యాపిస్తూ బాంటెన్, లాంపంగ్, బెంగ్కులు ప్రాంతాలతో పాటు దక్షిణ సుండా జలసంధి, పశ్చిమ సుమత్రాలోని హిందూ మహాసముద్ర పరిసరాలపై తీవ్ర ప్రభావాన్ని చూపింది.
ఈ భారీ బూడిద వ్యాప్తి కారణంగా విమాన ప్రయాణాలకు తీవ్ర ముప్పు వాటిల్లింది. దీంతో సుకర్ణో-హట్టా అంతర్జాతీయ విమానాశ్రయంలో మొదట ఉదయం 5:30 గంటల వరకు విమాన రాకపోకలను నిలిపివేస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. అయినప్పటికీ పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో ఆ ఆంక్షలను ఉదయం 9:30 గంటల వరకు పొడిగించారు. దీనివల్ల రాత్రి సమయంలో విమానాశ్రయంలో పార్క్ చేసిన 170 విమానాలు అక్కడే నిలిచిపోయాయి.
దీని ప్రభావం వల్ల జకార్తాలోని సుకర్ణో–హట్టా అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మొత్తం 209 విమాన సర్వీసులు ప్రభావితమవగా, సుమారు 22,800 మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు.
నిరాశ చెందిన పలువురు ప్రయాణికులు తమ టికెట్ డబ్బులను తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేయడంతో పాటు, అప్పటికే చెక్-ఇన్ చేసిన తమ సామాన్లను కూడా వెనక్కి తీసుకున్నారు. ముఖ్యంగా సింగపూర్‌కు వెళ్లే అంతర్జాతీయ విమానాలపై ఈ ప్రభావం ఎక్కువగా కనిపించింది. వీటితో పాటు హాంకాంగ్, సిడ్నీ, ఆమ్స్టర్డామ్, సియోల్, దోహా, కౌలాలంపూర్ నగరాలకు వెళ్లే విమానాలు రద్దు కావడం, ఆలస్యం కావడం లేదా రీషెడ్యూల్ చేయడం జరిగింది. దేశీయంగా కూడా లాంపంగ్, బాలి, సురబయ, మకాసర్ ప్రాంతాలకు వెళ్లే కొన్ని విమాన సర్వీసులపై తీవ్ర ప్రభావం పడింది
ప్రస్తుతానికి ఈ అగ్నిపర్వత విస్ఫోటనం వల్ల ఎలాంటి ప్రాణనష్టం లేదా గాయాలు సంభవించినట్లు సమాచారం అందలేదు. అలాగే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే ఉత్తర్వులు కూడా జారీ కాలేదు. కానీ, అగ్నిపర్వత క్రియాశీల క్రేటర్‌కు కనీసం 3 కిలోమీటర్ల దూరంలో ఉండాలని ప్రజలను, పర్యాటకులను అధికారులు హెచ్చరించారు. బూడిద పడే ప్రాంతాల వారు మాస్కులు ధరించాలని, కళ్లకు రక్షణ జాగ్రత్తలు తీసుకోవాలని, నీటి వనరులను మూసి ఉంచాలని సూచించారు.
గతంలో 2018లో ఇదే అనాక్ క్రాకటోవా అగ్నిపర్వత విస్ఫోటనం వల్ల సంభవించిన భయంకరమైన సునామీ కారణంగా దాదాపు 430 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ చేదు జ్ఞాపకాల దృష్ట్యా ప్రస్తుతం అధికారులు తీవ్ర అప్రమత్తతతో బూడిద వ్యాప్తిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.
Also Read: 5,000 మంది అమెరికా సైనికుల రాకతో సెక్స్ వర్కర్లపై దాడులు..థాయ్‌లాండ్ పోలీసులకు షాక్
Also Read: "భారత్, చైనా, అమెరికా వల్లనే వరదలు వచ్చాయి": నేపాల్ ప్రధానమంత్రి బాలేంద్ర షా!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Jio యూజర్లకు భారీ గుడ్‌న్యూస్.. ఈ రీఛార్జ్‌పై 365 రోజులు 120GB బోనస్ డేటా, Hotstar ఫ్రీ!
Hyderabad, Telangana:Jio Mega Anniversary Offer: ప్రముఖ టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో తన వార్షికోత్సవం సందర్భంగా తమ కస్టమర్స్ కి భారీ కానుకను అందించేందుకు సిద్ధమైంది. దీర్ఘకాలిక వ్యాలిడిటీ తో పాటు పూర్తి వినోదాన్ని కోరుకునే కస్టమర్ల కోసం ప్రత్యేకంగా మెగా యానివర్సరీ ఆఫర్‌ను ప్రకటించింది. కంపెనీ కి చెందిన పాపులర్ రూ.3,599 ఇయర్ ప్రీపెయిడ్ ప్లాన్ పై అదనపు డేటా తో పాటు ప్రత్యేకమైన ఉచిత OTT సబ్ స్క్రిప్షన్లో, క్లౌడ్ స్టోరేజీ వంటి అద్భుతమైన ప్రయోజనాలతో వినియోగదారులకు గుడ్ న్యూస్ తెలిపింది.
ఈ వన్ ఇయర్ ప్లాన్ కు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. ఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకునే వారికి 365 రోజుల పాటు వ్యాలిడిటీ లభిస్తుంది. దేశవ్యాప్తంగా ఏ నెట్వర్క్ కైనా అన్లిమిటెడ్ ఉచిత వాయిస్ కాల్స్, రోజుకు 100 ఉచిత SMS పొందే సదుపాయాన్ని అందిస్తోంది. అంతేకాకుండా రోజుకు 2.5 హై స్పీడ్ ఫోర్ జి డేటా తో పాటు అర్హత కలిగిన వినియోగదారులకు అన్లిమిటెడ్ ఫైవ్ జి డేటా కూడా ఉచితంగా అందిస్తోంది..
యానివర్సరీ స్పెషల్ బెనిఫిట్స్ ఇవే..
యానివర్సరీ సందర్భంగా జియో ఈ 365 రోజుల ప్లాన్‌ను రీఛార్జ్ చేసుకునే వారికి.. 12 నెలల పాటు నెలకు 10 జీబీల చొప్పున మొత్తం 120 జీబీల వరకు అదనపు హై స్పీడ్ బోనస్ డేటాను కూడా అందిస్తోంది. అంతేకాకుండా జియో హాట్ స్టార్ మొబైల్ సబ్స్క్రిప్షన్ తో పాటు భారీగా బాలీవుడ్ కంటెంట్ కేటలాగ్‌ను ఉచితంగా వీక్షించేలా ప్రత్యేకమైన సదుపాయాన్ని అందిస్తోంది. అలాగే వినియోగదారులకు మొత్తం 12 జియో టీవీ ప్రో ఓచర్లను అందించడం విశేషం. వీటి ద్వారా జియో టీవీలో దాదాపు 1000కి పైగా ప్రముఖ లైవ్ టీవీ చానళ్లను ఏడాది పాటు ఎంజాయ్ చేయవచ్చు. వినియోగదారుల పర్సనల్ ఫైల్స్ కోసం.. అలాగే ఫోటోలు, సెక్యూరిటీ కోసం 50 gb జియో AI క్లౌడ్ స్టోరేజ్‌ను కూడా అందిస్తోంది. దీంతోపాటు ప్రత్యేకమైన ఏఐ టూల్స్ యాక్సిస్ ను కూడా వినియోగదారులకు అందించడం విశేషం..
Also Read: Flipkart బంపర్ ఆఫర్.. సగం ధరకే Realme 43-ఇంచ్ 4K QLED స్మార్ట్ టీవీ!
ప్రత్యేకమైన షాపింగ్ తో పాటు ట్రావెల్ డిస్కౌంట్ వోచర్లు..
రీఛార్జ్ చేసుకున్న ప్రతి యూజర్ కి EaseMyTrip ద్వారా ఫ్లైట్ బుకింగ్‌తో పాటు హోటల్ బుకింగ్స్ పై దాదాపు రెండువేల వరకు అద్భుతమైన డిస్కౌంట్ స్పెషల్ ఓచర్స్ అందిస్తోంది. అంతేకాకుండా జియో ఆన్లైన్ షాపింగ్ పై 2500 వరకు డిస్కౌంట్ వోచర్.. సినిమా ప్రియుల కోసం సినీ పోలీస్ మూవీ టికెట్లపై 150 వరకు ప్రత్యేకమైన తగ్గింపుతో కూడిన వోచర్లు అందించేందుకు సిద్ధమైంది.. ఈ యానివర్సరీ ప్రత్యేకమైన ఆఫర్ ద్వారా రీఛార్జ్ చేసుకోవాలనుకునే వారు నేరుగా మై జియో యాప్ లోకి వెళ్లి.. ప్లాన్ సెలెక్ట్ చేసుకుని రీఛార్జ్ చేసుకోవచ్చు..
Also Read: Flipkart బంపర్ ఆఫర్.. సగం ధరకే Realme 43-ఇంచ్ 4K QLED స్మార్ట్ టీవీ!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
..Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Hotel Room Rates: ఢిల్లీలో NO ROOMS బోర్డులు.. రూ. 14 లక్షలకు చేరిన హోటల్ రూమ్స్ అద్దె!
Hyderabad, Telangana:Delhi Hotel Room Rates: దేశ రాజధాని ఢిల్లీలో లగ్జరీ హోటల్స్ గదుల అద్దెలు ఆకాశాన్ని అంటుతున్నాయి. సాధారణ రోజుల్లో కేవలం లక్ష రూపాయల వరకు ఉండే లగ్జరీ సూట్ ధరలు ఏకంగా రాత్రికి రాత్రే రూ.14 లక్షలకు పైగా చేరడం విశేషం. త్వరలో జరగబోతున్న 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు 2026 నేపథ్యంలో ప్రపంచ దేశాల అధినేతలతో పాటు విదేశీ దౌత్యవేత్తలు, అంతర్జాతీయ ప్రతినిధుల రాకతో ఢిల్లీ ఆతిథ్య రంగం ఒక్కసారిగా బిజీగా మారింది. కొన్నిచోట్ల సూట్ సూట్ రూమ్స్ లేవని నో రూమ్స్ బోర్డ్స్ కూడా పెట్టేస్తున్నారు.
పూర్తిగా బుక్ అయిపోయిన ఫైవ్ స్టార్ హోటల్స్..
సెప్టెంబర్ 12తో పాటు 13వ తేదీల్లో ఢిల్లీలోని ప్రతిష్టాత్మకంగా భారత్ మండపం వేదికగా ఈ మెగా సదస్సు జరగబోతోంది. ఈ కార్యక్రమానికి వస్తున్న VIP అతిథులతో పాటు భద్రతా సిబ్బంది, అంతర్జాతీయ ప్రతినిధుల బస కోసం ఇప్పటికే కేంద్ర విదేశాంగ శాఖ ప్రత్యేకమైన రిజర్వేషన్లు కూడా చేసుకున్నాయి. దీంతో లూటియన్స్ ఢిల్లీ తో పాటు ఏరోసిటీ పరిసరాల్లోని తాజ్ మహల్ హోటల్, తాజ్ ప్యాలెస్, ది లీలా ప్యాలెస్, లీ-మెరిడియన్, ది లలిత్ వంటి చాలా ప్రముఖ ఫైవ్ స్టార్ హోటల్స్ సాధారణ బుకింగ్స్ నిలిచిపోయినట్లు తెలుస్తోంది..
కొన్ని హోటల్స్ లో రూమ్స్ లేకపోవడంతో.. హోటల్లు డైనమిక్ రైసింగ్ విధానాన్ని అమలు చేస్తూ వస్తున్నాయి. సాధారణ రోజుల్లో రూ.70 వేల నుంచి రూ.1.5 లక్షల వరకు ఉండే ప్రెసిడెంట్, సూపర్ లగ్జరీ సూట్స్ ధరలు డిమాండ్ తో పాటు తేదీలను బట్టి ఒక్కసారిగా రూ.14 లక్షలు చేరడంతో అప్పుడప్పుడు విజిట్ అయ్యే బిజినెస్ మాన్స్ ఆశ్చర్యపోతున్నారు. సాధారణంగా ఎగ్జిక్యూటివ్, డీలక్స్ గదుల అద్దె రోజుకు కేవలం రూ.1.5 లక్షలు నుంచి రూ.5 లక్షల వరకు ఉంటుంది. కొన్ని హోటల్స్ ఇప్పటికే ఆయా తేదీలకు ఆన్లైన్ బుకింగ్ పోర్టల్ కూడా క్లోజ్ చేయడం ఆశ్చర్యం కలిగిస్తోంది.
సెంట్రల్ ఢిల్లీలో గదులు దొరకకపోవడంతో విదేశీ ప్రతినిధులతో పాటు పర్యాటకులు, కార్పొరేట్ వ్యాపారవేత్తలు ఎన్ఆర్సి, గురుగ్రామ్ తో పాటు నోయిడా లోని స్టార్ హోటల్ వైపు మొగ్గు చూపుతున్నారట. గత సంవత్సరంతో పోలిస్తే ఈ సమయంలో హోటల్స్ బుకింగ్ సెర్చ్ దాదాపు 50 శాతం పెరిగినట్లు ప్రముఖ ట్రావెల్ పోర్టల్ వెల్లడించడం ఆశ్చర్యం కలిగిస్తోంది.
ఎన్సీఆర్, గురుగ్రామ్‌కు పాకిన ప్రభావం..
సెంట్రల్ ఢిల్లీలో గదులు దొరకకపోవడంతో విదేశీ ప్రతినిధులు, పర్యాటకులు, కార్పొరేట్ వ్యాపారవేత్తలు ఎన్సీఆర్ (NCR), గురుగ్రామ్, నోయిడాలోని స్టార్ హోటళ్ల వైపు మొగ్గు చూపుతున్నారు. గత ఏడాదితో పోలిస్తే ఈ సమయంలో హోటల్ బుకింగ్స్ సెర్చ్ దాదాపు 50 శాతం పెరిగినట్లు ప్రముఖ ట్రావెల్ పోర్టల్స్ వెల్లడించాయి. మరోవైపు అంతర్జాతీయ సదస్సు నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వంతో పాటు ట్రాఫిక్ పోలీసులకు కట్టుదిట్టమైన ఏర్పాట్లను చేస్తున్నారు. అలాగే ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి భారత్ మండపం వరకు సాగే మార్గాల్లో హై సెక్యూరిటీ ముమ్మరం చేశారు.
Also Read: 20 ఏళ్ల వయస్సును తగ్గించుకున్న 68 ఏళ్ల వ్యక్తి.. ఎలా సాధ్యం ఇది?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
..Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
.
Egg Prices: ఉల్లి, చక్కెర తర్వాత గుడ్ల వంతు.. డిసెంబర్లో రూ.10కి చేరే ఛాన్స్!
Hyderabad, Telangana:Egg Prices In India Telugu News: సామాన్యుడి వస్తువుల ధరలు రోజురోజుకు భారంగా మారుతూ వస్తున్నాయి. ఇప్పటికే పంచదారతో పాటు ఉల్లిపాయ ధరలు పెరిగి బడ్జెట్ తలకిందులు అవుతుండగా.. తాజాగా గుడ్ల ధరలు కూడా ఆకాశాన్ని తాకుతున్నాయి. గత ఏడాది కాలంలో దేశవ్యాప్తంగా గుడ్ల ధరలు దాదాపు 40 శాతం మేర పెరిగినట్లు సమాచారం. అయితే, గత మూడు నెలల నుంచి ఈ గుడ్ల ధరలు విపరీతంగా పెరుగుతూ వస్తున్నాయి. అసలు ఇంత ధరలు పెరగడానికి గల కారణాలు ఏంటి? దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం..
ప్రస్తుతం స్థానిక రిటైల్ మార్కెట్లో ఒక్కొక్క గుడ్డు ధర కొన్నిచోట్ల రూ.9 నుంచి దాదాపు రూ.10 వరకు పలుకుతోందంటే మామూలు విషయం కాదు.. సాధారణంగా నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీ ప్రకారం హోల్‌సేల్ ధర రూ.5 నుంచి రూ.6 మధ్య ఉన్నప్పటికీ.. చిల్లర వస్తువులు రవాణా ఖర్చులతో పాటు ఇతర ఖర్చుల పేరుతో కొన్ని షాపులు అధిక ధరలకు విక్రయిస్తూ వస్తున్నాయి.
గుడ్ల ధరలు విపరీతంగా పెరగడానికి కారణాలేంటి?
ధరల పెరుగుదలకు ప్రధాన కారణం కోళ్ల దాణా.. దీనికి సంబంధించిన ఖర్చులు విపరీతంగా పెరుగుతూ ఉండడమే కాకుండా కొన్నిచోట్ల వీటికి సంబంధించిన కోరత ఏర్పడిందని పరిశ్రమ వర్గాలు చెబుతూ వస్తున్నాయి. పౌల్ట్రీ పరిశ్రమలు ఉత్పత్తి వ్యాయాయంలో 65 నుంచి 70 శాతం వరకు దాణా కోసమే ఖర్చవుతుందట.
ముఖ్యంగా మొక్కజొన్నల పెరుగుదల..
కోళ్ల దానాలో ప్రధానమైన మొక్కజొన్న ధర కిలోకు దాదాపు 22 రూపాయల నుంచి 30 వరకు చేరింది. మూడేళ్ల క్రితం టన్ను దాదాపు కేవలం 14000 మాత్రమే ఉండేది.. కానీ ఇప్పుడు ఈ మొక్కజొన్న టన్ను ధర దాదాపు 26,000 వరకు చేరింది.. నాణ్యమైన దాణా ముడి సరుకుల ధరలు పెరగడంతో గుడ్డు ఉత్పత్తి వ్యాయామం గణనీయంగా పెరిగింది..
Also Read: DA Hike 2026: ప్రభుత్వ ఉద్యోగులకు బంపర్ గుడ్‌న్యూస్.. 2.9 శాతం DA పెంపు..
డిసెంబర్ నాటికి గుడ్ల రేట్లు విపరీతంగా పెరిగే ఛాన్స్..
రాబోయే రోజుల్లో గుడ్ల ధరలు మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. డిసెంబర్ నాటికి ఉత్పత్తి వ్యాయాయంలో మరో 15 నుంచి 20% వరకు పెరిగే అవకాశాలు ఉన్నాయని వారంటున్నారు. దానలో నాణ్యత తగ్గకుండా ఆరోగ్యకరమైన గుడ్లను సరఫరా చేయాలంటే ధరల పెంచడం అని భార్యమని పౌల్ట్రీ వ్యాపారస్తులు చెబుతూ వస్తున్నారు..
ఉల్లి, చక్కెరలతో రెట్టింపు భారం..
ఒక గుడ్లే కాకుండా.. నిత్యవసరాలు అయినా చక్కెరతోపాటు ఉల్లిపాయ ధరలు కూడా వినియోగదారుల జేబులకు చిల్లులు పెడుతున్నాయి. గత రెండు నెలల్లో చక్కెర ధర 25 శాతం పెరిగి ప్రస్తుతం కిలో 60 రూపాయలకు పైగా దాటింది. ఇక ఉల్లిపాయల విషయానికొస్తే.. గత నెల రోజుల్లోనే ఉల్లిపాయ ధరలు 42 శాతం పెరిగి మార్కెట్లో కిలో ఉల్లిపాయ ధర 50 నుంచి 65 రూపాయల వరకు విక్రయిస్తూ వస్తున్నారు. అంతేకాకుండా కొన్ని ప్రాంతాల్లోనైతే దాదాపు వీటి ధర 80 రూపాయలకు కూడా పలుకుతుంది.
Also Read: DA Hike 2026: ప్రభుత్వ ఉద్యోగులకు బంపర్ గుడ్‌న్యూస్.. 2.9 శాతం DA పెంపు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
..Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
పండుగకు సొంతూళ్లకు వెళ్తున్నారా? దీపావళి రైలు టికెట్ల బుకింగ్స్ షురూ, వెంటనే బుక్ చేసుకోండి!
Hyderabad, Telangana:Diwali Trains 2026: ఈ ఏడాది దీపావళి పండుగ నవంబర్ 8వ తేదీన రానుంది. చాలామంది పండుగ వేడుకల కోసం సొంత ఊళ్లకు వెళ్లాలని అనుకుంటారు. దీపావళి సందర్భంగా లక్ష్మీ పూజలు నిర్వహించుకోవడానికి ప్రయాణికులు అధిక సంఖ్యలో రైలు మార్గాల్లో ప్రయాణిస్తారు. ఈ నేపథ్యంలో ఇండియన్ రైల్వే ఒక బిగ్ అప్డేట్ ఇచ్చింది; ఈరోజు ఉదయం 8 గంటల నుంచి మీరు దీపావళికి సంబంధించిన ట్రైన్ టికెట్లు బుక్ చేసుకోవచ్చు. పండుగ రద్దీ దృష్ట్యా టికెట్లకు విపరీతమైన డిమాండ్ ఉండటంతో, ముందే టికెట్లు రిజర్వ్ చేసుకోవడం ఉత్తమం.
IRCTC వెబ్సైట్లో ఈరోజు ఉదయం 8 గంటల నుంచి టికెట్ బుకింగ్ ప్రారంభం అవుతుంది. సాధారణంగా రైల్వే రెండు నెలల ముందే టికెట్లు బుక్ చేసుకునే అవకాశం కల్పిస్తుంది. దీపావళి కోసం టికెట్ల బుకింగ్ ఈరోజే ప్రారంభమవుతుంది. పండుగకు ముందే వెళ్తారు కాబట్టి ఈరోజు నుంచి బుక్ చేసుకోండి. సామాన్యంగా ప్రజలు పండుగకు రెండు రోజుల ముందు టికెట్లు బుక్ చేసుకుంటారు, ఆలస్యం చేయకుండా వెబ్సైట్ లేదా యాప్ ద్వారా బుక్ చేసుకోవాలి.
సాధారణంగా ఏ రైలు అయినా 60 రోజుల ముందే బుక్ చేసుకోవచ్చు. నవంబర్ 8 పండుగ కాబట్టి, మీరు ముందే రిజర్వ్ చేసుకుంటే సీట్లు దొరికే అవకాశం ఉంటుంది. దీపావళి,ఛత్ పూజ సందర్భంగా ఎక్కువ మంది సొంత ఊళ్లకు వెళ్తుంటారు. ముఖ్యంగా హైదరాబాద్‌లో నివసించే బీహార్‌కు చెందిన వారు దీపావళి వేడుకల కోసం తప్పకుండా వెళ్తుంటారు. ఈ నేపథ్యంలో రైళ్లలో రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ప్రధానంగా బీహార్‌కు వెళ్లే రైళ్లలో, అలాగే ఢిల్లీ, వారణాసి, పాట్నా, అహ్మదాబాద్, ముంబై, హౌరా, రాంచీ, లుధియానా వంటి ప్రాంతాలకు వెళ్లే రైళ్లలో పెద్ద సంఖ్యలో ప్రయాణికులు ఉంటారు. ముఖ్యంగా ఢిల్లీ, గోరఖ్‌పూర్ మార్గాల్లో రద్దీ ఎక్కువగా ఉంటుంది, దీనివల్ల టికెట్ కౌంటర్లు తెరిచిన గంటలోపే రైళ్లు నిండిపోతున్నాయి.
Also Read: ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. శబరి సహా 8 ఎక్స్‌ప్రెస్ రైళ్ల వేళలు
Also Read: రోడ్డుపై ఊహించని ఘటన.. మహిళను రేప్ చేయబోయిన కామాంధుడికి చుక్కలు చూపించిన కుక్క!
सावधान!
यात्रियों से निवेदन है की टिकट हमेशा अधिकृत माध्यमों व एजेंट्स से ही बुक करें तथा बुकिंग के समय अपने नाम, लिंग, उम्र एवं मोबाइल नंबर की जांच करें।
गलत जानकारी से न सिर्फ यात्रा के समय परेशानी हो सकती है, बल्कि टिकट रद्द करने या रिफंड में कठिनाई आ सकती है।
सही टिकट =… pic.twitter.com/jtBPEGujpc
— IRCTC (@IRCTCofficial) September 2, 2026
రైలు టికెట్లు ఎలా బుక్ చేసుకోవాలి?
రైలు టికెట్ బుక్ చేసుకోవడానికి దగ్గరలోని రిజర్వేషన్ కౌంటర్‌కు వెళ్లవచ్చు, లేదా ఫోన్ ద్వారా కూడా సులభంగా బుక్ చేసుకోవచ్చు. IRCTC Rail Connect యాప్ లేదా వెబ్సైట్ ద్వారా మీరు క్షణాల్లో టికెట్ బుక్ చేసుకోవచ్చు. రద్దీగా ఉన్న సమయంలో టికెట్ బుక్ చేసుకునేటప్పుడు ఇంటర్నెట్ సరిగ్గా పనిచేస్తుందో లేదో చూసుకోండి; వీలైతే వైఫై మాత్రమే ఉపయోగించండి. Rail Connect యాప్‌లో మీ వివరాలను ముందుగానే నమోదు చేసుకుని, క్లాస్ వంటి ఆప్షన్లను కూడా ముందుగానే ఎంచుకోండి. ఒకవేళ ఒక రైలు టికెట్ దొరకకపోతే, ప్రత్యామ్నాయ రైలును బుక్ చేసుకునేందుకు కూడా సిద్ధంగా ఉండండి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Tirumala: తిరుపతి ఇస్కాన్ ఆలయంలో ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి
Tirupati, Andhra Pradesh:Sri Krishna Janmashtami Celebrations In Tirupati ISKCON Temple Watch VideoTirumala: భక్తిశ్రద్ధలతో తిరుమలలో గోకులాష్టమి వేడుకలు
Dharmavaram, Andhra Pradesh:Sri Krishna Janmashtami Celebrations In Tirumala Watch VideoCM Chandrababu PRC DA: ప్రభుత్వ ఉద్యోగులకు ఏపీ సీఎం చంద్రబాబు వరాల జల్లు..పీఆర్సీ, డీఏల చెల్లింపునకు గ్రీన్ సిగ్నల్!
Vijayawada, Andhra Pradesh:YS Jagan Demands CBI Probe: మరోసారి డీఎస్సీపై సీబీఐ దర్యాప్తు వైఎస్ జగన్ డిమాండ్..విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని పోస్ట్!
Vijayawada, Andhra Pradesh:YS Jagan Demands DSC CBI Probe: ఆంధ్రప్రదేశ్‌లో డీఎస్సీ 2025 ఉపాధ్యాయ నియామకాల్లో జరిగిన తీవ్రమైన అవకతవకలు, అక్రమాలు రోజురోజుకూ సరికొత్త సాక్ష్యాలు, వాస్తవాలతో వెలుగులోకి వస్తున్నాయని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆరోపించారు. ఈ అక్రమాలకు సంబంధించి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని టీడీపీ కూటమి ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన ప్రశ్నలు ఎన్నో తలెత్తుతున్నాయని ఆయన తెలిపారు. నిజానిజాలు బయటకు రావడానికి సీబీఐ విచారణకు అంగీకరించాల్సింది పోయి, కూటమి ప్రభుత్వం స్వతంత్ర దర్యాప్తును నిరాకరిస్తూ.. ప్రశ్నిస్తున్న గొంతులను అణచివేసేందుకు ప్రయత్నిస్తోందని విమర్శించారు.
డీఎస్సీ నియామక కుంభకోణంపై ప్రశ్నలు లేవనెత్తుతున్న ప్రతిపక్ష పార్టీలు, మీడియా వేదికలు, సామాజిక కార్యకర్తలు, చివరకు సాధారణ వ్యక్తుల పోస్టులను, ఖాతాలను ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వంటి మెటా సామాజిక మాధ్యమాల్లో పరిమితం చేస్తున్నారని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్షాల సోషల్ మీడియా అకౌంట్లతో పాటు అనేక వ్యక్తిగత ఖాతాలను నిర్దిష్ట భౌగోళిక ప్రాంతాల్లో కనిపించకుండా చేస్తున్నారని, ఇందుకు మెటా "చట్టపరమైన అవసరాలు" అనే కారణాన్ని పేర్కొంటోందని చెప్పారు.
ఇది కేవలం డీఎస్సీ అక్రమాలకే పరిమితం కాలేదని, ప్రభుత్వ అవినీతి, వైఫల్యాలు, సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ హామీల అమలుపై ప్రశ్నించేవారిని లక్ష్యంగా చేసుకుని ఈ సెన్సార్‌షిప్‌కు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ఇది రాజ్యాంగం కల్పించిన వాక్ స్వాతంత్య్రం, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ వంటి ప్రాథమిక హక్కులను హరించడమేనని అన్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ప్రశ్నించేవారి నోరు మూయిస్తున్నారని, అసలు ఆయన దేనికి భయపడుతున్నారని నిలదీశారు. ఒక పోస్టును తొలగించినంత మాత్రాన ఆధారాలను తుడిచేయలేరని, ఒక ఖాతాను బ్లాక్ చేసినంత మాత్రాన నిజాన్ని పాతిపెట్టలేరని స్పష్టం చేశారు. ప్రతిపక్షాన్ని రాజకీయంగా ఎదుర్కోవాలని, ప్రజలకు ప్రజాస్వామ్యబద్ధంగా సమాధానం చెప్పి, రాజ్యాంగబద్ధంగా పాలించాలని హితవు పలికారు.
అసలు డీఎస్సీ పరీక్ష రాయకుండానే కొందరికి ఉపాధ్యాయ ఉద్యోగాలు ఏ విధంగా ఇచ్చారని, అలాగే టెట్ (TET) పరీక్షలో కనీసం ఉత్తీర్ణత సాధించని అభ్యర్థులకు ఉద్యోగాలు ఇవ్వడం వెనుక ఉన్న మతలబు ఏమిటని వైఎస్ జగన్ ప్రశ్నించారు. క్రీడా కోటా కింద జీవో జారీ చేసి, నియామకాలు పూర్తయిన తర్వాత ఆ జీవోను రద్దు చేసినప్పటికీ, ఆ అభ్యర్థులు ఇంకా ఉద్యోగాల్లో కొనసాగడం పెద్ద ఎత్తున జరిగిన అవినీతికి నిదర్శమన్నారు.
వెంటనే నిరోధించిన అన్ని ఖాతాలను, పోస్టులను పునరుద్ధరించాలని, ఈ డీఎస్సీ ఉపాధ్యాయ నియామకాలపై తక్షణమే స్వతంత్ర సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని జగన్ డిమాండ్ చేశారు. అంతేకాకుండా, ఈ అవకతవకలకు నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ తన మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
Also Read: ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. పీఆర్సీ కోసం రంగంలోకి దిగిన సీఎం చంద్రబాబు!
Also Read: "మా ఎమ్మెల్యేను కాదు, మీ బావమరిదిని ప్రశ్నించండి!" చంద్రబాబుపై జనసేన నేత కౌంటర్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
NHAI FASTag Reward: వాహనదారులకు గుడ్‌న్యూస్.. రూ.1,000 ఫాస్ట్‌ట్యాగ్ బ్యాలెన్స్ ఉచితం.. ఈ పని చేస్తే చాలు!
Hyderabad, Telangana:NHAI FASTag Clean Toilet Reward: హైవేలపై ప్రయాణించే వాహనదారుల కోసం నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) ఒక ప్రత్యేకమైన కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేస్తోంది. ప్రయాణికులు టోల్ ప్లాజాల వద్ద అపరిశుభ్రంగా ఉన్న టాయిలెట్ల గురించి ఫిర్యాదు చేస్తే, వారికి రూ.1,000 విలువైన ఫాస్ట్‌ట్యాగ్ రీచార్జ్‌ను బహుమతిగా ఇస్తారు. 'క్లీన్ టాయిలెట్ పిక్చర్ ఛాలెంజ్' పేరుతో సెప్టెంబర్ 2025లో ఈ కార్యక్రమం ప్రారంభమైంది.
ప్రయాణికుల నుండి లభించిన అద్భుతమైన స్పందన కారణంగా ఈ పథకాన్ని 2027 జూన్ 30 వరకు పొడిగిస్తున్నట్లు NHAI ప్రకటించింది. 2026 సంవత్సరంలో ఇప్పటివరకు సుమారు 429 మంది ప్రయాణికులు అపరిశుభ్ర టాయిలెట్లపై ఫిర్యాదు చేసి, రూ. 1,000 చొప్పున ఫాస్ట్‌ట్యాగ్ బ్యాలెన్స్ పొందారు.
ఫిర్యాదు చేయడం, రివార్డ్ పొందే విధానం..
NHAI తన అధికారిక ఎక్స్ (ట్విట్టర్) ఖాతా ద్వారా ఈ ప్రక్రియను వెల్లడించింది. ఈ ఛాలెంజ్‌లో పాల్గొనడానికి కింది విధంగా చేయాలి.
1) ప్రయాణికులు తమ మొబైల్లో 'రాజ్‌మార్గ్‌యాత్ర' యాప్ తాజా వెర్షన్‌ను కలిగి ఉండాలి.
2) టోల్ ప్లాజా వద్ద టాయిలెట్ అపరిశుభ్రంగా ఉంటే, యాప్ ద్వారా స్పష్టమైన, జియో-ట్యాగ్డ్, టైమ్‌స్టాంప్ ఉన్న ఫొటోను తీసి అప్లోడ్ చేయాలి.
3) ఫొటోతో పాటు ఫిర్యాదుదారుడి పేరు, లొకేషన్, వాహన రిజిస్ట్రేషన్ నంబర్ (VRN), మొబైల్ నంబర్ వివరాలు నమోదు చేయాలి.
4) ఈ వివరాలను మొదట కృత్రిమ మేధస్సు (AI) సాంకేతికతతో, ఆ తర్వాత మాన్యువల్‌గా అధికారులు తనిఖీ చేస్తారు.
5) వివరాలు సరిగ్గా ఉంటే, ఆ వాహన నంబర్‌కు అనుసంధానించబడిన ఫాస్ట్‌ట్యాగ్ ఖాతాకు రూ.1,000 క్రెడిట్ అవుతుంది.
కీలకమైన నిబంధనలు..
ఈ పథకం కింద ప్రయాణికులు గమనించవలసిన కొన్ని నిబంధనలు..
1) ఒక వాహన రిజిస్ట్రేషన్ నంబర్ (VRN) కు ఈ పథకం కాలంలో కేవలం ఒకే ఒక్కసారి మాత్రమే రివార్డ్ లభిస్తుంది.
2) ఈ రివార్డ్‌ను మరొకరికి బదిలీ చేయడం లేదా నగదుగా మార్చుకోవడం కుదరదు.
మొదటి ఫిర్యాదుకే ప్రాధాన్యత: ఒకే టాయిలెట్‌పై ఒకే రోజులో ఎక్కువ మంది ఫిర్యాదు చేస్తే, మొదటగా అందిన చెల్లుబాటు అయ్యే ఫిర్యాదుదారుడికి మాత్రమే రివార్డు లభిస్తుంది. ఇది కేవలం NHAI స్వయంగా నిర్వహిస్తున్న టోల్ ప్లాజా టాయిలెట్లకు మాత్రమే వర్తిస్తుంది. ధాబాలు, పెట్రోల్ పంపులలోని టాయిలెట్లకు ఇది వర్తించదు.
జాతీయ రహదారులపై ప్రయాణాన్ని మరింత సురక్షితంగా మార్చేందుకు NHAI తీసుకున్న ఈ నిర్ణయం ఎంతో ఉపయోగకరంగా ఉంది. మీ ప్రయాణంలో అపరిశుభ్ర టాయిలెట్లను గుర్తిస్తే వెంటనే రాజ్‌మార్గ్‌యాత్ర యాప్ ద్వారా ఫిర్యాదు చేసి మీ రివార్డును పొందండి.
Also Read: "రాష్ట్ర ప్రభుత్వాలు బైక్ ట్యాక్సీలకు అనుమతి ఇవ్వాలి" కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ..
Also REad: దేశవ్యాప్తంగా భారీ వర్షసూచన..రేపు స్కూళ్లకు సెలవు ఉందా? విద్యార్థులకు అలర్ట్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
India Vs Japan T20I: జపాన్‌తో టీమ్ఇండియా ద్వైపాక్షిక టీ20 సిరీస్.. భారత్‌కు ఇన్ని లాభాలా?
Suginami City, Tokyo:India Vs Japan T20I 2026: ప్రపంచ నంబర్ వన్ టీ20 జట్టుగా ఉన్న టీమిండియా, క్రికెట్లో ఎదుగుతున్న జపాన్ దేశంతో తలపడేందుకు సిద్ధమైంది. సెప్టెంబర్ 22న జపాన్‌లోని తోచిగి ప్రిఫెక్చర్లో గల సానో ఇంటర్నేషనల్ క్రికెట్ గ్రౌండ్ వేదికగా ఈ చారిత్రక మ్యాచ్ జరగనుంది. రెండు దేశాల సీనియర్ పురుషుల జట్ల మధ్య జరగనున్న తొలి అధికారిక అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ ఇదే కావడం విశేషం.
ఈ మ్యాచ్ వెనుక ప్రధానంగా బలమైన దౌత్య కారణాలు ఉన్నాయి. భారత్, జపాన్ దేశాల మధ్య దౌత్య సంబంధాలు ఏర్పడి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భాన్ని పురస్కరించుకుని ఈ మ్యాచ్‌ను నిర్వహిస్తున్నారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ, జపాన్ ప్రధాని సనాయే తకైచిల ద్వైపాక్షిక శిఖరాగ్ర సమావేశంలో కుదిరిన ఒప్పందం ప్రకారం 'స్పోర్ట్ 75' కార్యక్రమాన్ని ఈ మ్యాచ్ ద్వారా ప్రారంభిస్తున్నారు. రెండు దేశాల ప్రజల మధ్య క్రీడా సహకారాన్ని పెంచడం దీని లక్ష్యం.
అలాగే, జపాన్‌లోని ఐచి-నగోయా వేదికగా జరిగే 2026 ఆసియా క్రీడలకు ముందు భారత ఆటగాళ్లకు ఇది ఒక ఉపయోగకరమైన సన్నాహకంగా నిలవనుంది. ఈ ఆసియా గేమ్స్‌లో పురుషుల క్రికెట్ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ సెప్టెంబర్ 28న జరగనుంది. ఈ మ్యాచ్ ఆడటం వల్ల భారత ఆటగాళ్లకు స్థానిక పిచ్ పరిస్థితులు, ప్రయాణ పరిస్థితులు, వాతావరణంపై పూర్తి అవగాహన వస్తుంది.
ప్రస్తుతం జపాన్ జట్టు ప్రపంచ క్రికెట్ ర్యాంకింగ్స్‌లో 41వ స్థానంలో ఉంది. ప్రపంచ ఛాంపియన్ అయిన భారత్‌తో ఆడటం జపాన్ క్రికెట్ అభివృద్ధికి ఒక మైలురాయిగా మారుతుందని జపాన్ క్రికెట్ అసోసియేషన్ భావిస్తోంది. తూర్పు ఆసియాలో క్రికెట్‌ను విస్తరించాలని బీసీసీఐ లక్ష్యంగా పెట్టుకుంది. బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా తెలిపిన వివరాల ప్రకారం.. ఇది భారత క్రికెట్‌ను సరికొత్త భౌగోళిక ప్రాంతాలకు తీసుకెళ్లే ఒక ముఖ్యమైన అడుగు. భవిష్యత్తులో అక్కడ ప్రసార హక్కులు, స్పాన్సర్‌షిప్‌ల వంటి వాణిజ్య మార్కెట్ కూడా వృద్ధి చెందే అవకాశం ఉంది.
మరోవైపు, 2036 ఒలింపిక్స్ నిర్వహించాలనే లక్ష్యంతో ఉన్న భారత్‌కు, ఒలింపిక్ క్రీడలలో కీలకమైన జపాన్‌తో క్రీడా బంధాలను బలోపేతం చేసుకోవడం చాలా ప్రయోజనకరంగా మారవచ్చు. ఇప్పటికే ఆటోమొబైల్, టెక్నాలజీ, తయారీ వంటి రంగాల్లో జపాన్ భారత్‌కు కీలక భాగస్వామిగా ఉండటంతో ఈ క్రీడా సంబంధాలు ద్వైపాక్షిక మైత్రిని మరింత పెంచుతాయి. అందువల్ల, ఈ చారిత్రక మ్యాచ్‌ను కేవలం ఒక ఆటగానే కాకుండా రెండు దేశాల మధ్య ఒక శక్తివంతమైన 'క్రికెట్ డిప్లమసీ'గా చెప్పవచ్చు.
Also REad: రేపే భారత్ Vs పాకిస్థాన్ మధ్య పోరు..ఆసియా కప్ 2026లో దుబాయ్‌లో హై-వోల్టేజ్ మ్యాచ్!
Also REad: గౌతమ్ గంభీర్‌కు బీసీసీఐ చెక్..ఆసియా గేమ్స్‌లో హెడ్ కోచ్‌గా వీవీఎస్ లక్ష్మణ్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
