ఖమ్మం: నకిలీ వైద్యుడి గుట్టు రట్టు
Khammam, Telangana:ఖమ్మం జిల్లా వేంసూరు మండలం మర్లపాడు గ్రామంలో నకిలీ వైద్యుడు పట్టుబడ్డాడు. ఫార్మసీ చదివిన డాక్టర్ కరుణ ప్రసాద్ ఓపీ ఫీజు తీసుకుని చికిత్స అందిస్తున్నారు. గత పదేళ్లుగా ఇదే తంతు కొనసాగుతున్నా వైద్యాధికారులు కన్నెత్తి చూడలేదు. ఎంబీబీఎస్ వైద్యులు రూ.300 ఓపీ వసూలు చేస్తూ మందులు, ఇంజక్షన్లు ఇస్తున్నట్లు అధికారులు గుర్తించారు.
हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
NEET PG అభ్యర్థులకు కేంద్రం బిగ్ గుడ్‌న్యూస్.. పరీక్ష విధానంలో మార్పులు!
Hyderabad, Telangana:Big Relief For NEET Pg Candidates: కష్టపడి చదువుతూ.. దేశ ఆరోగ్య భవిష్యత్తును నిలబెట్టేందుకు సిద్ధమవుతున్న వేలాది మంది యువ వైద్యులకు కేంద్ర ప్రభుత్వం అత్యంత అద్భుతమైన శుభవార్తను అందించింది.. ఆగస్టు 30న జరగబోయే అత్యంత కీలకమైన NEET PG పరీక్షకు సంబంధించి అభ్యర్థులకు అనుకూల (Student Friendly) మార్పులను ప్రకటించింది. సుదీర్ఘకాలంగా విద్యార్థులు ఎదుర్కొంటున్న మానసిక ఒత్తిడికి, ప్రయాణ కష్టాలకు ఈ నిర్ణయంతో స్వస్తి పలికినట్లయింది. అయితే, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏంటో? దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
గతంలో పరీక్షా కేంద్రాల కేటాయింపులో అభ్యర్థులు తీవ్ర నరకాన్ని చూసిన సంగతి తెలిసిందే.. ఎక్కడో వందల కిలోమీటర్ల దూరంలో ఉండే జిల్లాలకు, పొరుగు రాష్ట్రాలకు వెళ్లలేక చదువుకోవాల్సిన సమయంలో ప్రయాణాల గురించి ఆలోచిస్తూ నరకయాతన అనుభవించేవారు. కానీ, ఈసారి ప్రభుత్వం చారిత్రాత్మక మార్పు చేసింది..
ఇకపై ప్రతి అభ్యర్థి తమకు అనుకూలమైన 3 రాష్ట్రాలను ఎంచుకునే వెసులుబాటు కల్పించింది. అంతటితో ఆగకుండా, అభ్యర్థుల ఇళ్లకు వీలైనంత దగ్గరలోని సెంటర్లనే కేటాయించనున్నట్లు కేంద్రం ప్రకటించింది. అంతేకాకుండా ప్రయాణ ఏర్పాట్లు ముందే చేసుకునేందుకు వీలుగా ఎగ్జామ్ జరిగే సిటీల జాబితాను ముందస్తుగానే విడుదల చేయబోతోంది. ఇవే కాకుండా అనేక మార్పులు చేసిన్నట్లు తెలుస్తోంది.
విద్యార్థుల ప్రతిభకు సరైన న్యాయం జరిగేలా.. ఏ ఒక్కరూ గందరగోళానికి గురికాకుండా ఉండాలనే ఉద్దేశంతో ఈసారి పరీక్షను సింగిల్ షిఫ్ట్ (ఒకే విడత) లోనే నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా 180 మొత్తం ప్రశ్నలు ఉండగా.. 3 గంటల 30 నిమిషాల సమయం కూడా కేటాయించిన్నట్లు కేంద్ర వెల్లడించింది. సమయాన్ని పెంచడం వల్ల అభ్యర్థులు ప్రశాంతమైన మనస్సుతో, ఎలాంటి కంగారు లేకుండా ప్రశ్నలకు సమాధానాలు రాసే అవకాశం లభించింది.
ALso Read: బంగాళాఖాతంలో వేగంగా మారుతున్న వాతావరణం..తెలుగు రాష్ట్రాలకు తుఫాన్ ముప్పు!
ఈ ఏడాది దేశవ్యాప్తంగా ఏకంగా 2,73,183 మంది వైద్య విద్యార్థులు ఈ పరీక్షకు హాజరుకానున్నారు. పగలు రేయి తేడా లేకుండా శ్రమిస్తున్న తమ బిడ్డలకు ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం కొండంత అండగా నిలిచింది. కేంద్రం నిర్ణయంతో మాపై ఉన్న సగం మానసిక ఒత్తిడి తగ్గిపోయిందని.. సెంటర్ ఎక్కడ పడుతుందో అన్న భయం లేకుండా.. ఇప్పుడు ప్రశాంతంగా చదువుపైనే దృష్టి పెట్టగలుగుతున్నామని.. అభ్యర్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ALso Read: బంగాళాఖాతంలో వేగంగా మారుతున్న వాతావరణం..తెలుగు రాష్ట్రాలకు తుఫాన్ ముప్పు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Hardik Pandya Tirumala: తిరుమలలో శ్రీవారి దర్శనానికి హార్దిక్ పాండ్య..తలనీలాలు ఇచ్చి, లవర్‌తో కలిసి ఆలయంలో..
Tirupati Urban, Andhra Pradesh:Hardik Pandya Tirumala Visit: భారత క్రికెట్ జట్టు స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ఆదివారం ఆంధ్రప్రదేశ్‌లోని తిరుమలలో వెలసిన ప్రసిద్ధ శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. టీమ్ఇండియాలోకి గ్రాండ్ రీ-ఎంట్రీ ఇవ్వడానికి ముందు ఆయన తిరుపతిని సందర్శించి స్వామివారి ఆశీస్సులు పొందారు. దర్శనానికి ముందు తలనీలాలు సమర్పించిన హార్దిక్ పాండ్యా.. ఆ తర్వాత ప్రేయసి మహికా శర్మతో కలిసి శ్రీవారిని దర్శించుకున్నారు.
ప్రత్యేక ఆకర్షణగా గుండు, సాంప్రదాయ లుక్
తిరుమల ఆలయంలో జరిగిన ప్రసిద్ధ సుప్రభాత సేవలో హార్దిక్ పాండ్యా ప్రత్యేకంగా పాల్గొన్నారు. ఈ పర్యటనలో ఆయన తలనీలాలు సమర్పించి.. సాంప్రదాయ తెల్లటి కుర్తా-పైజామా ధరించి కనిపించారు. నుదుటిపై తిలకంతో ఆయన పూర్తిగా భక్తిభావంతో కనిపిస్తున్న ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ఆయనతో పాటు ఈ తిరుమల సందర్శనలో హార్దిక్ పాండ్యా ప్రేయసి మహికా శర్మ కూడా తెల్లటి సాంప్రదాయ దుస్తులలో మెరిశారు. గత కొంతకాలంగా వీరిద్దరూ పలు సందర్భాల్లో కలిసి కనిపిస్తుండగా, తాజా తిరుమల పర్యటన మరోసారి చర్చనీయాంశమైంది.
VIDEO | Tirupati, Andhra Pradesh: Indian cricketer Hardik Pandya offers prayers during the Suprabhata Seva at the Sri Venkateswara Swamy Temple in Tirumala.
(Full video available on PTI Videos - https://t.co/n147TvrpG7) pic.twitter.com/HKdtPmcyC3
— Press Trust of India (@PTI_News) August 2, 2026
గాయంతో విరామం.. రీఎంట్రీకి సిద్ధం!
వెన్నునొప్పి, ఆ తర్వాత తలెత్తిన తొడ కండరాల గాయం కారణంగా హార్దిక్ పాండ్యా గత కొంతకాలంగా క్రికెట్‌కు దూరంగా ఉన్నారు. ఐపీఎల్ 2026తో పాటు పలు సిరీస్‌లను ఆయన మిస్ అయ్యారు.
అయితే, ప్రస్తుతం ఆయన గాయం నుంచి పూర్తిగా కోలుకున్నారు. బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో నిర్దేశించిన 'రిటర్న్-టు-ప్లే ప్రోటోకాల్'ను విజయవంతంగా పూర్తి చేశారు. త్వరలోనే జరగనున్న వైట్-బాల్ సిరీస్ ద్వారా ఆయన తిరిగి టీమ్ ఇండియాలోకి రీఎంట్రీ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది.
ఈ తిరుమల ఆధ్యాత్మిక పర్యటన తన కొత్త క్రికెట్ ప్రయాణానికి మంచి ఆరంభం కావాలని అభిమానులు కోరుకుంటూ సోషల్ మీడియా వేదికగా హార్దిక్‌కు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
Also Read: కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్‌కు పతకాల పంట..ఒకే రోజు 8 స్వర్ణ పతకాలు..భారత్ ఖాతాలో 39
Also Read: ఆగస్టులో విద్యార్థులకు పండగే పండగ..ఏకంగా వారం రోజులకు పైగా సెలవులు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
న్యూజెర్సీ సూపర్మార్కెట్లో కూలిన పైకప్పు.. అందరూ ఎలా తప్పించుకున్నారో చూడండి..
Hyderabad, Telangana:Club Roof Collapses Video: సరుకుల కోసం సూపర్‌మార్కెట్‌కు వెళ్లి.. హాయిగా షాపింగ్ చేస్తున్న సమయంలో.. హఠాత్తుగా నెత్తిపైన ఉన్న పైకప్పు కూలిపోతే ఎలా ఉంటుంది? వినడానికే ఒళ్ళు గగుర్పొడిచేలా ఉన్న ఇలాంటి విచిత్ర సంఘటన అమెరికాలోని న్యూజెర్సీలో చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
న్యూజెర్సీలోని మోన్మౌత్ కౌంటీకి చెందిన ఓషన్ టౌన్షిప్లో ఉన్న బిజెస్ హోల్‌సేల్ క్లబ్ (BJ's Wholesale Club) సూపర్మార్కెట్లో ఈ ప్రమాదం జరిగింది. రోజూలాగే కస్టమర్లు తమకు కావలసిన సరుకులు కొనుగోలు చేస్తూ.. సందడిగా ఉన్నారు. అయితే, ప్రాంతంలో కురిసిన భారీ వర్షాల కారణంగా ఉదయం సుమారు 11:15 గంటల సమయంలో ఊహించని పరిణామం ఎదురైంది. సూపర్‌మార్కెట్ పైకప్పులోని ఒక పెద్ద భాగం అకస్మాత్తుగా కస్టమర్ల మీదికి కూలిపోయింది.
రూఫ్ కూలిపోవడమే కాకుండా.. పైకప్పు నుంచి భారీ ఎత్తున వర్షపు నీరు లోపలికి వరదలా దూసుకురావడంతో స్టోర్‌లోని వాతావరణం క్షణాల్లో మారిపోయింది. ప్రమాదం జరిగిన సమయంలో సూపర్మార్కెట్లో దాదాపు 27 మంది కస్టమర్లతో పాటు సిబ్బంది ఉన్నారు. పెను శబ్దంతో పైకప్పు పడటంతో ఏం జరుగుతుందో అర్థంకాక జనాలు కేకలు వేస్తూ సురక్షిత ప్రాంతాల వైపు పరుగులు తీశారు. శిథిలాల కింద ఇద్దరు వ్యక్తులు చిక్కుకున్నప్పటికీ.. సురక్షితంగా బయటకు రాగలిగారని సమాచారం.
No injuries were reported. pic.twitter.com/1Bqk26n8vi
— Shlomo Schorr (@OneJerseySchorr) July 6, 2026
సమాచారం అందుకున్న వెంటనే స్థానిక పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. శిథిలాల కింద ఎవరైనా చిక్కుకున్నారేమో తెలుసుకోవడానికి న్యూజెర్సీ అర్బన్ సెర్చ్ అండ్ రెస్క్యూ బృందాలు రంగంలోకి దిగాయి. ప్రమాద తీవ్రత దృష్ట్యా భవనం లోపలికి నేరుగా వెళ్లడం ప్రమాదకరంగా మారడంతో.. అత్యాధునిక ఇండోర్ డ్రోన్లు, శిక్షణ పొందిన కే-9 డోగ్ స్క్వాడ్ (K-9 Dog Squad) బృందాలను ఉపయోగించి అంగుళం అంగుళం తనిఖీ చేసిన్నట్లు సమాచారం.
భారీ స్థాయిలో పైకప్పు కూలిపోయినప్పటికీ.. ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో పాటు ఎవరూ తీవ్రంగా గాయపడకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. స్టోర్‌లోని మొత్తం 27 మంది సురక్షితంగా బయటపడటం ఓ అద్భుతంగా భావిస్తున్నారు. ప్రస్తుతం ప్రమాదానికి కారణమైన భవనాన్ని మూసివేసి.. అధికారులు దర్యాప్తు జరుపుతున్నారు. అయితే, కూలుతున్న సమయంలో రికార్డ్ అయిన CC టీవీ రికార్డ్స్ దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్‌గా మారాయి..
Also Read: పోలీస్ వ్యాన్‌ను ఒంతిచేత్తో ఆపేసిన బాలీవుడ్ బ్యూటీ..నీట్ విద్యార్థులకు అండగా మోడల్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
TV వేస్తేనే పాలిస్తా.. లేదంటే NO.. స్మార్ట్ గేదె స్టైలే వేరబ్బా!
Hyderabad, Telangana:Smart Buffalo Viral Video: సోషల్ మీడియా ప్రపంచంలో రోజూ ఎన్నో వింతలతో పాటు విచిత్ర ఘటనలకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతుంటాయి. అయితే, తాజాగా నెట్టింట చక్కర్లు కొడుతున్న ఒక వీడియో చూస్తే మాత్రం ఎవరైనా సరే పడిపడి నవ్వుకోవడం ఖాయం.. సాధారణంగా పాడి పశువుల నుంచి పాలు పిండేటప్పుడు వాటికి పశువుల మేత లేదా తవుడు పెడుతూ ఉంటారు.. కానీ, ఇక్కడొక గేదె మాత్రం చాలా డిఫరెంట్.. తన ముందుకు వచ్చి టీవీ ఆన్ చేసి.. నచ్చిన ప్రోగ్రామ్ పెడితేనే పాలు ఇస్తానంటోంది. లేదంటే పాలు పిండడానికి అసలు సహకరించదట.. అవును ఇప్పుడు ఈ ఘటనకు సంబంధించిన ఘటనే సోషల్ వీడియోను షేక్ చేస్తోంది. దీనిని చూసిన వారు ఆశ్చర్యపోతున్నారు.
అసలు ఏం జరిగింది?
వైరల్ అవుతున్న సమాచారం ప్రకారం.. ఈ గేదె యజమాని ప్రతిరోజూ పాలు పిండే సమయంలో టీవీ ఆన్ చేయడం అలవాటుగా మారింది. అయితే, చాలా రోజుల నుంచి అలాగే టీవీ పెట్టడంతో.. ఆ గేదెకు కూడా TV చూడటం ఒక అలవాటుగా మారిపోయింది. ఇప్పుడు పాలు పిండే సమయంలో టీవీలో పాటలతో పాటు మంచి ప్రోగ్రామ్స్ ప్లే అవుతుంటేనే అది ప్రశాంతంగా నిలబడి పాలు ఇస్తోంది. TV ఆపివేస్తే లేదా స్క్రీన్ దూరంగా ఉంటే పాలు పిండనివ్వకుండా మొండికేస్తోంది.
ఈ దృశ్యాన్ని గేదె యజమాని తన ఫోన్లో చిత్రీకరించి.. సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో.. అది కాస్తా క్షణాల్లో వైరల్‌గా మారింది. గేదె ఎంతో శ్రద్ధగా టీవీ స్క్రీన్‌వైపు చూస్తూ పాలు ఇస్తుండటం నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటోంది. అలాగే కరెంట్ లేని సందర్భాల్లో టీవీ ఆన్ కాకపోతే.. అప్పుడప్పుడు ఆ గేదె పాలు అస్సలు ఇవ్వదట.. దీనికి సంబంధించిన దృశ్యాలను కూడా గతంలో సోషల్ మీడియాల్లో పోస్ట్ చేసిన్నట్లు సమాచారం. అయితే, ఈ వీడియోలు చూసిన సోషల్ మీడియా వినియోగదారులు రకరకాలుగా స్పదిస్తున్నారు.
ఈ వీడియో చూసిన నెటిజన్లు రకరకాల కామెంట్లతో రచ్చ చేస్తున్నారు. ఈ గేదెకు కూడా మనలాగే టీవీ సీరియల్స్.. స్పోర్ట్స్ ఛానెల్స్ చూడడం.. అలవాటైపోయిందేమో.. అని ఒకరు కామెంట్ చేయగా.. ఇది మామూలు గేదె కాదు సామీ.. ఫుల్లీ అప్డేటెడ్ స్మార్ట్ గేదె.. అని మరొకరు సరదాగా స్పందించారు. మరికొందరైతే రిమోట్ కంట్రోల్ సహాయంతో మరికొన్ని రోజుల్లో ఈ గేదె టీవీ ఆన్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. అంటూ ఫన్నీ మీమ్స్ షేర్ చేస్తున్నారు.
Also Read: పోలీస్ వ్యాన్‌ను ఒంతిచేత్తో ఆపేసిన బాలీవుడ్ బ్యూటీ..నీట్ విద్యార్థులకు అండగా మోడల్!
సాధారణంగా జంతువులకు సంగీతం వింటే మనసు ప్రశాంతంగా మారి.. ఎక్కువ పాలు ఇస్తాయని శాస్త్రీయంగానూ కొన్ని పరిశోధనలు చెబుతుంటాయి. అయితే, ఇలా విజువల్స్‌తో కూడిన టీవీ స్క్రీన్‌ను చూస్తూ.. పాలు ఇవ్వడం మాత్రం నిజంగానే అత్యంత అరుదైన, ఆసక్తికరమైన విషయమని చెప్పవచ్చు. డిజిటల్ యుగంలో మనుషులకే కాదు.. మూగజీవాలకు కూడా స్క్రీన్ టైమ్ అలవాటైపోతోందని ఈ ఘటన నిరూపిస్తోంది..
Also Read: పోలీస్ వ్యాన్‌ను ఒంతిచేత్తో ఆపేసిన బాలీవుడ్ బ్యూటీ..నీట్ విద్యార్థులకు అండగా మోడల్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
నెటిజన్లను ఫిదా చేస్తున్న తండ్రీకూతుళ్ల డాన్స్.. వీడియో ఇదే చూడండి..
Hyderabad, Telangana:Father Daughter Dance Viral Video: సోషల్ మీడియాలో ప్రతిరోజూ వేలాది వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి. కానీ అందులో కొన్ని మాత్రమే నెటిజన్స్ మనసును హత్తుకుని.. పెదవులపై చెరగని చిరునవ్వులు అందిస్తూ ఉంటాయి.. తాజాగా ఇంటర్నెట్లో అలాంటి ఒక అద్భుతమైన డ్యాన్స్ వీడియో నెటిజన్ల హృదయాలను తాకుతోంది.. తండ్రి, కుమార్తెల మధ్య ఉండే పవిత్రమైన చెదరని స్నేహాన్ని చాటిచెప్పే ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. ఈ వీడియోకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.
బాలీవుడ్ సూపర్ హిట్ సినిమాలోని బద్తమీజ్ దిల్ పాటకు తండ్రితో పాటు కుమార్తె పోటీపడి వేసిన డ్యాన్స్ స్టెప్పులు వేశారు.. ఇప్పుడు ఈ డ్యాన్స్ ఇంటర్నెట్లో సంచలనం సృష్టిస్తున్నాయి. పాట ప్లే కాగానే వారిద్దరి పర్ఫార్మెన్స్, పర్ఫెక్ట్ టైమింగ్, ముఖంలో ఎక్ప్స్ప్రెషన్స్ చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.
వీడియో మొదటి నుంచే తండ్రీకూతుళ్ల ఎనర్జీ.. ఉత్సాహం నెటిజన్స్‌ను ఎంతగానో ఆకట్టుకుంటాయి. ఎలాంటి ఇబ్బంది లేకుండా.. ఇద్దరూ కలిసి ఒకరికొకరు పోటీగా వేసిన డాన్స్ స్టెప్స్ నెటిజన్లను కట్టిపడేస్తున్నాయి. వీరి డాన్స్ స్టెప్పుల్లోని సమన్వయం చూస్తుంటే.. ఈ పర్ఫార్మెన్స్ వారికి ఎంతో ఇష్టమై ఉంటుందో స్పష్టంగా అర్థమవుతోంది. అయితే, డాన్స్ పర్ఫెక్షన్ కంటే కూడా ఇద్దరూ కలిసి సరదాగా డ్యాన్స్ చేసిన ఆ మధురమైన క్షణాలే.. ఈ వీడియోకు అసలైన ప్రాణమని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
డాన్స్ చేస్తున్నంత సేపూ వారిద్దరి ముఖాల్లో కనిపించే.. ప్రసన్నమైన చిరునవ్వు ఈ వీడియోకు ప్రధాన ఆకర్షణగా నిలిచిందని భావించవచ్చు.. ప్రతి స్టెప్పులోనూ వారి మధ్య ఉన్న అనుబంధం, ఆప్యాయత స్పష్టంగా కనిపిస్తున్నాయి. తండ్రి అంటే కేవలం కుటుంబ బాధ్యతలు నెరవేర్చే వ్యక్తి మాత్రమే కాదు.. కూతురు జీవితంలో అద్భుతమైన స్నేహితుడు, ఒక గొప్ప సపోర్ట్ సిస్టమ్.. అని ఈ వీడియోను చూసిన నెటిజన్లు కామెంట్లతో ప్రశంసిస్తున్నారు.
Also Read: పోలీస్ వ్యాన్‌ను ఒంతిచేత్తో ఆపేసిన బాలీవుడ్ బ్యూటీ..నీట్ విద్యార్థులకు అండగా మోడల్!
ఈ అద్భుతమైన డ్యాన్స్ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో ఆకాంక్ష సెహగల్ (@akku_sehgal_) అనే ఖాతా ద్వారా పోస్ట్ చేశారు. సోషల్ మీడియాలో అప్లోడ్ చేసిన అతి తక్కువ సమయంలోనే ఈ రీల్ వైరల్ చార్ట్స్‌ను తిరగరాసింది. దీనిని ఇప్పటి వరకు 14 కోట్లకు (140 మిలియన్లు) పైగా సోషల్ మీడియా వినియోగదారులు వీక్షించారు. దీనికి ఇప్పటి వరకు 77 లక్షలకు పైగా లైక్స్ వచ్చాయి. వేలాది మంది నెటిజన్లు బెస్ట్ ఫాదర్-డాటర్ డుయో.. క్యూటెస్ట్ డాన్స్ వీడియో.. అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
Also Read: పోలీస్ వ్యాన్‌ను ఒంతిచేత్తో ఆపేసిన బాలీవుడ్ బ్యూటీ..నీట్ విద్యార్థులకు అండగా మోడల్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
TSGLI లోన్ ఎలా పొందాలో తెలుసా? దరఖాస్తు విధానం, నిబంధనలు, పూర్తి వివరాలివే..!
Lakshmapur, Telangana:TSGLI loan: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఆర్థిక అత్యవసర సమయాల్లో అండగా నిలిచేందుకు తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ లైఫ్ ఇన్సూరెన్స్ (TSGLI) పథకం ఎంతో ఉపయోగపడుతుంది. ఉద్యోగులు తమ TSGLI ఖాతాలో జమ అయిన మొత్తం ఆధారంగా సులభంగా లోన్ పొందవచ్చు. ఈ బీమా స్కీమ్ కింద ఉద్యోగి లేదా పెన్షనర్ సహజ మరణం కానీ.. ప్రమాదవశాత్తు మరణించినా. బీమా ప్రయోజనాలు వర్తిస్తాయి. దీంతో ఉద్యోగులు, వారి కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పించడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ స్కీమును జూన్ 25న ప్రారంభించారు. ఈ స్కీమును సమర్థవంతంగా అమలు చేసేందుకు రాష్ట్రప్రభుత్వం 14 ప్రముఖ బ్యాంకులతో ఒప్పందం కుదుర్చుకుంది. బ్యాంకుల సహకారంతో బీమా ప్రయోజనాలు అర్హులైన ఉద్యోగులు, పెన్షనర్లకు సులభంగా అందించే విధంగా చర్యలు తీసుకుంటుంది.
అయితే ఈ స్కీము కేవలం శాశ్వత ఉద్యోగులకే పరిమితం చేయాలని ప్రభుత్వం మొదట భావించినప్పటికీ.. ఆ తర్వాత కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ వంటి తాత్కాలిక ఉద్యోగులకు కూడా వర్తింపజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. బ్యాంకు ఖాతాల ద్వారా ప్రభుత్వ జీతం అందుకునే ప్రతి ఉద్యోగికీ ఈ బీమా రక్షణ లభిస్తుంది. దాదాపు 10 లక్షల మంది ఉద్యోగుల కుటుంబాలకు ఈ స్కీమ్ ద్వారా ఆర్థిక భరోసా కల్పించనున్నారు. ఈ బీమా స్కీమ్ కోసం ఉద్యోగులు ఎలాంటి ప్రీమియం చెల్లించాల్సిన అవసరం ఉండదు. ఏదైనా ప్రమాదంలో ఉద్యోగి మరణించినట్లయితే.. వారికి రూ. 60లక్షల నుంచి రూ. 2కోట్ల వరకు బీమా పరిహారం అందిస్తుంది. గతంలో సింగరేణి ఉద్యోగుల కోసం ప్రవేశపెట్టిన ఈ స్కీమ్ ద్వారా ఇప్పటికే 45 మంది ఉద్యోగుల కుటుంబాలకు 1కోటి చొప్పున పరిహారం అందించింది ప్రభుత్వం. అయితే ఈ లోన్ కు ఎలా దరఖాస్తు చేసుకోవాలి? అర్హతలు ఏంటి.. నిబంధనలు ఎలా ఉన్నాయి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
లోన్ అర్హతలు – ఎంత వస్తుంది?
TSGLI విధానం ప్రకారం, ఉద్యోగి ఖాతాలో బోనస్‌తో కలిపి జమ అయిన మొత్తం సంచిత నిధి (Surrender Value) నుంచి దాదాపు 80శాతం వరకు లోన్ పొందే అవకాశం ఉంటుంది. దీనిపై ప్రభుత్వం నిబంధనల ప్రకారం స్వల్ప వడ్డీ రేటును వసూలు చేస్తుంది.
దరఖాస్తు విధానం (Step-by-Step Process):
అప్లికేషన్ ఫారమ్:
ముందుగా తెలంగాణ ఇన్సూరెన్స్ శాఖ అధికారిక వెబ్సైట్ (tsgli.telangana.gov.in) నుంచి TSGLI లోన్ దరఖాస్తు ఫారమ్‌ను డౌన్లోడ్ చేసుకోవాలి.
వివరాల నమోదు:
ఫారమ్‌లో పాలసీ నంబర్, ఉద్యోగి ఐడీ, ప్రాథమిక వేతనం (Basic Pay), బ్యాంక్ ఖాతా వివరాలు, ఎంత రుణం కావాలో స్పష్టంగా పూరించాలి.
పత్రాల జతపరిచే విధానం:
పూర్తి చేసిన అప్లికేషన్‌కు బ్యాంక్ పాస్‌బుక్ మొదటి పేజీ జీరాక్స్ ప్రతిని జత చేయాలి. ఫారమ్‌పై రూ. 1/- రెవెన్యూ స్టాంప్ అతికించి సంతకం చేయాలి.
DDO ధ్రువీకరణ: పూరించిన అప్లికేషన్‌ను సంబంధిత డ్రాయింగ్ అండ్ డిస్బర్సింగ్ ఆఫీసర్ (DDO) ఆమోదం పొంది, సంతకం, కార్యాలయ ముద్ర వేయించాలి.
సమర్పణ: అనంతరం ఈ దరఖాస్తును జిల్లా TSGLI ఇన్సూరెన్స్ కార్యాలయంలో అందజేయాలి.
తిరిగి చెల్లించే విధానం:తీసుకున్న రుణ మొత్తాన్ని ఉద్యోగి తన సౌకర్యాన్ని బట్టి 12, 24, 36 లేదా 48 నెలవారీ వాయిదాలలో (Instalments) తిరిగి చెల్లించవచ్చు. ఈ వాయిదా మొత్తాన్ని ప్రతి నెలా జీతం నుంచి DDO ద్వారా కట్ చేస్తారు. ఆత్యయిక పరిస్థితుల్లో బయట ఎక్కువ వడ్డీలకు అప్పులు చేయకుండా, తక్కువ వడ్డీకే లభించే TSGLI లోన్ సౌకర్యాన్ని ప్రభుత్వ ఉద్యోగులు సద్వినియోగం చేసుకోవచ్చు.
50శాతం చెల్లింపుల నిబంధన: మొదటిసారి తీసుకున్న రుణంలో కనీసం 50శాతం మొత్తం తిరిగి చెల్లించిన తర్వాతే రెండోసారి లోన్ కోసం దరఖాస్తు చేసుకునే అర్హత ఉంటుంది. డైరెక్టర్ ఆఫ్ ఇన్సూరెన్స్ విచక్షణాధికారం మేరకు మిగిలిన బకాయిలను మినహాయించుకుని మిగతా మొత్తాన్ని రెండోసారి రుణంగా మంజూరు చేస్తారు. అయితే TSGLI కింద ప్రతి నెలా చెల్లించే ప్రీమియం మొత్తానికి ఇన్కమ్ టాక్స్ యాక్ట్ సెక్షన్ 80C కింద పన్ను మినహాయింపు లభిస్తుంది.
Also Read: బంగారం కొనొద్దన్న మోదీ... ఆగిన కొనుగోళ్లు.. WGC లెక్కలు చూస్తే షాక్ అవ్వాల్సిందే!
Also Read: కేంద్ర ప్రభుత్వం సంచలన ప్రాజెక్ట్.. రూ. 84,000 కోట్ల సముద్ర మంథన్.. ఏంటీ సముద్ర మంథన్?
Also Read: తెలంగాణ ఉద్యోగులు, పెన్షనర్లకు బిగ్ అలర్ట్..హెల్త్ కార్డ్ వివరాల
Also Read: EPF పెన్షనర్లకు షాక్.. నిలిచిపోయిన పింఛన్లు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
అమెరికా-ఇరాన్ యుద్ధానికి తాత్కాలిక విరామం.. ట్రంప్ సంచలన నిర్ణయం!
Hyderabad, Telangana:US-Iran Peace Talks: గతకొద్ది కాలంగా పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తతలకు కారణమైన అమెరికా-ఇరాన్ యుద్దంలో అనూహ్య మలుపు తిరిగింది. ఇరాన్‌పై చేపట్టాల్సిన సైనిక చర్యలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు (Military Action Halted) అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇరు దేశాల మధ్య శాంతి ఒప్పందం (Peace Deal)కుదిర్చే దిశగా చర్చలు ముమ్మరమయ్యాయని.. అతి త్వరలోనే ఒప్పందంపై సంతకాలు జరిగే అవకాశం ఉందని అంతర్జాతీయ వర్గాలు వెల్లడించాయి.
ప్రపంచ చమురు రవాణాలో ఐదో వంతు ఈ హోర్ముజ్ జలసంధి (Strait of Hormuz) గుండానే సాగుతుంది. ఘర్షణల నేపథ్యంలో ఈ మార్గంలో నౌకల రాకపోకలు స్తంభించిపోవడంతో అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు ఆకాశాన్నంటాయి. ఇప్పుడు ఇరు దేశాలు శాంతి ఒప్పందానికి మొగ్గు చూపడంతో.. నౌకల రాకపోకలు పునరుద్ధరణకు మార్గం సుగమమైంది. దీనివల్ల భారత్ సహా ప్రపంచ దేశాలకు ఇంధన సరఫరాలో పెద్ద ఉపశమనం లభించనుంది.
మిలిటరీ స్థావరాలతో పాటు వ్యూహాత్మక ప్రాంతాలపై దాడులను నిలిపివేయాలని ట్రంప్ యంత్రాంగం ఆదేశించడంతో, పశ్చిమాసియా ప్రాంతంలో యుద్ధ భయం తగ్గిన్నట్లు తెలుస్తోంది. దౌత్యపరమైన సంప్రదింపుల వల్ల వివాదాలను పరిష్కరించుకోవడానికి ఇరాన్ కూడా సుముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఈ పరిణామంతో గ్లోబల్ షేర్ మార్కెట్లు, ఇంధన మార్కెట్లు సానుకూలంగా స్పందించాయి. చమురు సరఫరా యథావిధిగా సాగితే.. త్వరలోనే లీటర్ పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గే అవకాశం ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి.
Also Read: బంగాళాఖాతంలో వేగంగా మారుతున్న వాతావరణం..తెలుగు రాష్ట్రాలకు తుఫాన్ ముప్పు!
అమెరికా-ఇరాన్ మధ్య కుదురుతున్న ఈ శాంతి ఒప్పందాన్ని భారత్ సహా పలు ప్రపంచ దేశాలు స్వాగతించాయి. ఇంధన భద్రతతో పాటు గ్లోబల్ సప్లై చైన్ స్థిరత్వానికి ఈ నిర్ణయం అత్యంత కీలకమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. సైనిక ఘర్షణల కంటే దౌత్యపరమైన పరిష్కారాలే ప్రపంచ శాంతికి క్రియాశీలక పాత్ర పోషిస్తాయని అంతర్జాతీయ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు.
Also Read: బంగాళాఖాతంలో వేగంగా మారుతున్న వాతావరణం..తెలుగు రాష్ట్రాలకు తుఫాన్ ముప్పు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద ఉగ్ర కుట్ర ప్లాన్.. పోలీసు యూనిఫాంలో దాడికి జైషే ఉగ్రవాది స్కెచ్!
Hyderabad, Telangana:Jaish Terrorist Plan: ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరిగిన విద్యార్థుల నిరసనలను లక్ష్యంగా చేసుకుని ఉగ్రదాడికి పథకం రచించినట్లు తెలుస్తోంది. పశ్చిమ బెంగాల్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ (STF) అధికారులు అరెస్టు చేసిన జైషే ఏ మహమ్మద్ ఉగ్రవాది హమీమ్ మౌండల్ను సుదీర్ఘంగా విచారించగా ఈ కుట్ర కోణం బయటపడింది. ఇప్పుడు ఈ క్రుట అధికారులను సైతం ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
ఎస్టీఎఫ్ అధికారుల వివరాల ప్రకారం.. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద శాంతియుతంగా జరుగుతున్న విద్యార్థుల ఆందోళనల సమయంలో ఖాకీ యూనిఫాం ధరించి చొరబడాలని ఉగ్రవాదులు భావించారు. పోలీసు దుస్తుల్లో ఉన్నట్లయితే ఎవరికీ అనుమానం రాదని.. సులువుగా జనం మధ్యలోకి వెళ్లి వినాశనం సృష్టించవచ్చని భావించి ఈ కుట్ర పన్నారు.
హమీమ్ మౌండల్‌కు కేవలం ఢిల్లీ దాడి బాధ్యత మాత్రమే కాకుండా.. పశ్చిమ బెంగాల్‌కు చెందిన పలువురు ప్రముఖ రాజకీయ నాయకులు, ఉన్నతాధికారుల కదలికలపై రెక్కి బాధ్యతలను కూడా జైషే మహమ్మద్ అధినాయకత్వం అప్పగించినట్లు విచారణలో తేలింది. పశ్చిమ బెంగాల్‌లోని ఒక బిజెపి ఎమ్మెల్యే కుమారుడి కిడ్నాప్, రూం డిమాండ్‌కి సంబంధించిన కేసును దర్యాప్తు చేస్తున్న క్రమంలో పోలీసులకు ఈ ఉగ్రవాద నెట్వర్క్ జాడ దొరికిన్నట్లు తెలుస్తోంది. కిడ్నాప్ కేసును తవ్వేకొద్దీ దీని వెనుక ఉన్న అంతర్జాతీయ ఉగ్రవాద సంబంధాలు, దాడుల ప్రణాళికలు ఒక్కటొక్కటిగా బయటపడ్డాయి.
ప్రస్తుతం బెంగాల్ ఎస్టీఎఫ్ దర్యాప్తును వేగవంతం చేసింది. హమీమ్ మౌండల్ స్వయంగా ఢిల్లీ జంతర్ మంతర్ వద్దకు వచ్చి రెక్కి నిర్వహించాడా? లేక అతని అనుచరులు ఎవరైనా ఢిల్లీలో ఈ కుట్రకు సహకరించారా? అనే కోణంలో పోలీసులు తీవ్రంగా విచారిస్తున్నారు. ఢిల్లీ పోలీసులకు, కేంద్ర నిఘా వర్గాలకు కూడా ఈ సమాచారాన్ని అందించినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే రాజధానిలో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.
Also Read: పోలీస్ వ్యాన్‌ను ఒంతిచేత్తో ఆపేసిన బాలీవుడ్ బ్యూటీ..నీట్ విద్యార్థులకు అండగా మోడల్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
సర్పంచ్‌కి ఓటెయ్యలేదని పగ.. ఇల్లు కూలుస్తానని బెదిరింపులు..!
Hyderabad, Telangana:Kamareddy Latest News: కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం హండే కేలూరు గ్రామంలో శనివారం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. స్థానిక సర్పంచ్ ఎన్నికల్లో తనకు ఓటు వేయలేదనే కక్షతో.. కొన్ని ఏళ్ల క్రితం తాను నిర్మించుకున్న ఇల్లు కూల్చివేస్తానని సర్పంచ్ బెదిరిస్తున్నాడని ఆరోపిస్తూ ఒక నిరుపేద బాధితురాలు గ్రామ పంచాయతీ కార్యాలయం ముందు ధర్నాకు దిగింది.. బాధితురాలి నిరసనకు పెద్ద ఎత్తున గ్రామస్తుల సపోర్ట్ రావడంతో గ్రామంలో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది.
బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం... గత 25 సంవత్సరాలుగా ప్రభుత్వం తనకు కేటాయించిన స్థలంలోనే నివాసముంటున్నానని.. తన కష్టార్జితంతో ఆ ఇల్లు నిర్మించుకున్నానని తెలిపారు. అయితే, ఇటీవలి సర్పంచ్ ఎన్నికల్లో గ్రామ సర్పంచ్ గడ్డివర్ లక్ష్మణ్‌కు ఓటు వేయలేదనే నెపంతో.. ఆయన తనపై రాజకీయ కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కొన్ని రోజుల నుంచి తన ఇల్లు కూల్చివేస్తానంటూ.. సర్పంచ్ లక్ష్మణ్ తీవ్ర బెదిరింపులకు దిగుతున్నాడని బాధితురాలు ఆరోపించారు.
ఈ అన్యాయాన్ని నిరసిస్తూ.. సర్పంచ్ వేధింపుల నుంచి తనకు రక్షణ కల్పించి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ గ్రామ పంచాయతీ కార్యాలయం ముందు బాధితురాలు బైఠాయించి ధర్నా నిర్వహించారు. బాధితురాలికి మద్దతుగా గ్రామస్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి నిరసనలో పాల్గొన్నట్లు తెలుస్తోంది. ఓ నిరుపేద మహిళపై ప్రజాప్రతినిధి స్థాయిలో ఉన్న వ్యక్తి కక్షసాధింపు చర్యలకు పాల్పడడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే బాధితురాలికి న్యాయం చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు.
Also Read: బంగాళాఖాతంలో వేగంగా మారుతున్న వాతావరణం..తెలుగు రాష్ట్రాలకు తుఫాన్ ముప్పు!
ఈ సందర్భంగా బాధితురాలు కన్నీటి పర్యంతమవుతూ.. ఎన్నో ఏళ్ల కష్టంతో నిర్మించుకున్న ఇంటిని కూల్చేస్తే మా కుటుంబం రోడ్డున పడుతుంది. అధికారుల నుంచి నాకు న్యాయం జరగకపోతే ఈ గ్రామ పంచాయతీ కార్యాలయం ముందే ఆత్మహత్య చేసుకోవడం తప్ప నాకు వేరే మార్గం లేదని వాపోయింది. హండే కేలూరు గ్రామంలో ఉద్రిక్తత పరిస్థితి తలెత్తినట్లు సమాచారం అందుకున్న మద్నూర్ ఎంపీడీఓ సత్యనారాయణ రెడ్డి.. స్థానిక మద్నూర్ పోలీసులతో కలిసి వెంటనే గ్రామానికి చేరుకున్నారు. ధర్నా స్థలికి వెళ్లి బాధితురాలితో పాటు గ్రామస్తులతో మాట్లాడి.. పరిస్థితిని సమీక్షించారు.
Also Read: బంగాళాఖాతంలో వేగంగా మారుతున్న వాతావరణం..తెలుగు రాష్ట్రాలకు తుఫాన్ ముప్పు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
సికింద్రాబాద్ మహంకాళికి తొలి బోనం సమర్పించిన మంత్రి పొన్నం ప్రభాకర్!
Hyderabad, Telangana:Secunderabad Bonalu 2026: తెలంగాణ విశిష్ట సంస్కృతి, సాంప్రదాయాలు, ఆచార వ్యవహారాలకు ఆషాఢ మాస బోనాల పండగ ఒక ప్రతీక అని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల జాతర ఉత్సవాల సందర్భంగా మంత్రి తన కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకుని.. తొలి బోనం సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున అమ్మవారికి బంగారు బోనంతో పాటు పట్టు వస్త్రాలను మంత్రి అధికారికంగా సమర్పించారు.
మహంకాళి అమ్మవారి దర్శనం అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్ విలేకరులతో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలకు బోనాల పండగ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి.. పాడిపంటలతో పంట పొలాలు పచ్చగా ఉండాలని ఆ మహంకాళి అమ్మవారిని ప్రార్థించాం. ప్రజలంతా ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో జీవించాలని.. ఎవరి వృత్తుల్లో వారు గొప్ప విజయాలు సాధించాలని వేడుకున్నాం. ప్రభుత్వం ప్రవేశపెడుతున్న ప్రజా సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు ఎలాంటి అవరోధాలు లేకుండా విజయవంతంగా ముందుకు సాగడానికి ఆ జగజ్జనని కరుణాకటాక్షాలు ఎల్లప్పుడూ మన రాష్ట్రంపై ఉండాలని ఆకాంక్షించాం.. అని మంత్రి తెలిపారు.
హైదరాబాద్ నగరం ఆతిథ్యానికి పెట్టింది పేరని గుర్తుచేసిన మంత్రి.. బోనాల ఉత్సవాలలో కులమతాలకు అతీతంగా ప్రజలంతా అత్యంత ఉత్సాహంతో, భాగస్వామ్యమై పండగను జరుపుకుంటారని అన్నారు. భక్తుల ఆకాంక్షలకు అనుగుణంగా, వారికేలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం, జిహెచ్ఎంసి, పోలీస్ విభాగాల ఆధ్వర్యంలో అన్ని రకాల విస్తృత ఏర్పాట్లు చేసినట్లు వివరించారు.
ALso Read: బంగాళాఖాతంలో వేగంగా మారుతున్న వాతావరణం..తెలుగు రాష్ట్రాలకు తుఫాన్ ముప్పు!
ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం ఉండటంతో ఈసారి ఆలయాలకు భక్తుల రద్దీ గణనీయంగా పెరిగిందని.. దానికి తగ్గట్టుగానే రవాణా వ్యవస్థను సిద్ధం చేశామని ఆయన పేర్కొన్నారు. గతంలో కూడా ఈ ప్రాంతంపై అనేక విపత్తులు వచ్చినప్పుడు ఉజ్జయిని మహంకాళి అమ్మవారు ప్రజలను కాపాడారని మంత్రి పొన్నం అన్నారు. ఎల్ నినో వంటి ప్రకృతి వైపరీత్యాలు ఎదురైనా.. తెలంగాణ రాష్ట్రానికి ఎలాంటి ఇబ్బందులు కలగకూడదని బోనాల సందర్భంగా అన్ని ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించమని.. ప్రకృతి వైపరీత్యాలను తట్టుకుని అమ్మవారి దివ్య ఆశీస్సులతో రాష్ట్రంలో మంచి వర్షాలు కురుస్తాయనే నమ్మకం మాకు ఉందని మంత్రి పొన్నం అన్నారు.
ALso Read: బంగాళాఖాతంలో వేగంగా మారుతున్న వాతావరణం..తెలుగు రాష్ట్రాలకు తుఫాన్ ముప్పు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Mirnalini Ravi Engagement: సీక్రెట్‌గా నిశ్చితార్థం చేసుకున్న టాలీవుడ్ నటి! 'గద్దలకొండ గణేష్' హీరోయిన్ కాబోయే భర్త ఇతనే!
Chennai, Tamil Nadu:Mirnalini Ravi Engagement News: 'గద్దలకొండ గణేష్' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన కోలీవుడ్ నటి, సోషల్ మీడియా సెన్సేషన్ మృణాళిని రవి నిశ్చితార్థం చేసుకుంది. తన ఎంగేజ్మెంట్ వార్తలతో ఒక్కసారిగా ఆమె ట్రెండింగ్‌లో నిలిచింది. ఆధ్యాత్మిక ప్రసంగీకుడు మహావిష్ణుతో తాను ప్రేమలో ఉన్నట్లు ప్రకటించడమే కాకుండా, వీరిద్దరి ఎంగేజ్మెంట్ ఫోటోలను ఇన్స్టాగ్రామ్ వేదికగా పంచుకున్నారు. ప్రస్తుతం ఈ జోడీకి సంబంధించిన పిక్స్ నెట్టింట తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
మృణాళిని రవి నేపథ్యం..
షార్ట్ వీడియో యాప్‌ల ద్వారా పాపులర్ అయిన మృణాళిని.. ఆ తర్వాత 'సూపర్ డీలక్స్' సినిమాతో నటిగా అడుగుపెట్టారు. ఆ తర్వాత 'ఛాంపియన్', 'ఎనిమీ', 'కోబ్రా', 'రోమియో' వంటి పలు తమిళ, తెలుగు చిత్రాలలో నటించి గుర్తింపు తెచ్చుకున్నారు. సోషల్ మీడియాలోనూ ఈ భామకు భారీ ఫాలోయింగ్ ఉంది.
ఈ మహావిష్ణు ఎవరు?
మధురైకి చెందిన మహావిష్ణు తొలుత ఒక టీవీ ఛానెల్ కామెడీ షో ద్వారా వెలుగులోకి వచ్చి, ఆ తర్వాత ఆధ్యాత్మిక ప్రసంగీకుడిగా మారారు. అయితే 2024లో చెన్నైలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో ఆయన చేసిన కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు తమిళనాడులో పెద్ద కలకలమే రేపాయి.
నెట్టింట ఎందుకు హాట్ టాపిక్ అయింది?
గతంలో పలు వివాదాల్లో చిక్కుకున్న ఆధ్యాత్మిక గురువును నటి వివాహం చేసుకుంటుండటంతో సోషల్ మీడియాలో రకరకాల కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. వీరిద్దరి మధ్య ఏడేళ్లుగా స్నేహం ఉందని, అదే ప్రేమగా మారిందని మహావిష్ణు తన సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. ఏది ఏమైనప్పటికీ, ఈ అనూహ్య నిశ్చితార్థం ప్రస్తుతం సినీ వర్గాలతో పాటు నెటిజన్లను సైతం ఆశ్చర్యపరుస్తోంది.
Also Read: అందంలో హీరోయిన్లను మించిపోయిన నటి రోజా కూతురు..అన్షు లేటెస్ట్ ఫొటోలు!
Also Read: సైమా అవార్డ్స్ 2026 నామినేషన్లు..ఉత్తమ నటుడి విభాగంలో పవన్ కళ్యాణ్‌కు గట్టి పోటీ!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
ఆగస్టు 12 సూర్య గ్రహణం.. ఈ 3 రాశుల వారికి తీవ్ర నష్టాలు.. మీ రాశి ఉందా?
Hyderabad, Telangana:Solar Eclipse August 12: ఈ నెలలో ఖగోళంలో మరో అద్భుతం జరగబోతోంది.. అత్యంత కీలకమైన క్షణాలు ఆసన్నం కాబోతున్నాయి. ఈ ఏడాది చివరి, ఎంతో ప్రాధాన్యత కలిగిన రెండవ సూర్య గ్రహణం ఆగస్టు 12వ తేదీన సంభవించబోతోంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. ఈ మార్పు మానవాళిపై, ముఖ్యంగా ద్వాదశ రాశుల జీవితాలపై ఎనలేని ప్రభావం చూపుతుంది. ఈ గ్రహణం భారతదేశంలో కనిపించకపోవడం వల్ల సూతక కాలం లేకపోయినప్పటికీ.. జ్యోతిష్యపరంగా మాత్రం ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఏదో ఒక మార్పును సృష్టించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
ముఖ్యంగా.. జ్యోతిష్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మూడు రాశుల వారికి ఈ గ్రహణ కాలం తీవ్రమైన సవాలుగా మారే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. వీరు క్షణక్షణం ఆచితూచి అడుగు వేయకపోతే మానసిక, ఆర్థిక, కుటుంబ సంక్షోభాలు తప్పవని వేద పండితులు చెబుతున్నారు. అయితే, ఏయే రాశులవారు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో? ఈ సమయంలో ఏయే రాశులవారికి దుష్ప్రభావాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
సింహ రాశి (Leo):
సింహ రాశి వారికి ఆర్థికంగా కలిసివచ్చే అవకాశాలు ఉన్నప్పటికీ.. ఆరోగ్యం విషయంలో తీవ్ర ఉడుదుడుకులు ఎదురవుతాయి. తీవ్ర శ్రమ పడితే తప్ప ఫలితం దక్కని పరిస్థితి ఎదురవుతుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. వ్యాపారాల్లో ఆలోచించకుండా చేసే పనులు తీవ్ర నష్టాలకు దారితీస్తాయి. ఉద్యోగ ప్రాంతంలో సహోద్యోగులతో లేదా పైఅధికారులతో ఘర్షణ వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. కుటుంబంలో కలహాలు రాకుండా ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించండి. తొందరపాటు నిర్ణయాలు మీ జీవితాన్ని ఇబ్బందుల్లోకి నెట్టే ప్రమాదం ఉంది.
కన్యా రాశి (Virgo):
కన్యా రాశి వారికి పూర్తవుతుందనుకున్న పనులు చివరి నిమిషంలో నిలిచిపోవడం తీవ్ర నిరాశను మిగులుస్తుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. స్నేహితుల నుంచి ఆశించిన సహాయం అందక మనస్తాపానికి గురవుతారు. కెరీర్లో అకస్మాత్తుగా అవరోధాలు ఎదురవుతాయి. ఆరోగ్యం క్షీణించడం, మానసిక ఆందోళన నిద్రలేమికి దారితీసే అవకాశం ఉంది. కాబట్టి ఈ సమయంలో ఎవరితోనూ వివాదాలకు దిగకండి. పట్టుదలతో, సహనంతో ముందుకు సాగితేనే రాబోయే సమయం చాలా అద్భుతంగా ఉంటుంది.
కర్కాటక రాశి (Cancer):
కర్కాటక రాశివారికి ఈ సమయం ఒక రకమైన పరీక్షా సమయంగా భావించవచ్చు. ప్రతి పనిలోనూ అడుగడుగునా ఆటంకాలు ఎదురయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. వైవాహిక జీవితంలో అనవసర మనస్పర్ధలు, భార్యాభర్తల మధ్య విభేదాలు మనశ్శాంతిని దూరం చేయవచ్చు. అనుకోని ఖర్చులు రావడం వల్ల మీ బడ్జెట్ తలకిందులయ్యే ప్రమాదం కూడా స్పష్టంగా కనిపిస్తోంది.. కొత్త ప్రాజెక్టులు, వ్యాపారాలు ప్రారంభించాలనుకుంటే తప్పకుండా నిపుణుల సలహా తప్పనిసరని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ఏ క్షణంలోనూ ఆవేశపడకండి.. ఓర్పుతో వ్యవహరించకపోతే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. అలాగే ప్రయాణాలను వాయిదా వేసుకోవడమే శ్రేయస్కరమని నిపుణులు సూచిస్తున్నారు.
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
గమనిక.. 
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook ..
SIIMA Awards 2026: సైమా అవార్డ్స్ 2026 నామినేషన్లు..ఉత్తమ నటుడి విభాగంలో పవన్ కళ్యాణ్‌కు గట్టి పోటీ!
Hyderabad, Telangana:SIIMA Awards 2026 Nominations: సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ 2026 (సైమా అవార్డ్) వేడుక ఈసారి రసవత్తరంగా సాగనుంది. దక్షిణాది చిత్ర పరిశ్రమలకు చెందిన ఉత్తమ చిత్రాల్లోని విభాగాల్లో ఉత్తమ ప్రదర్శనకు గానూ ఈ అవార్డులను అందజేస్తారు. ఈ క్రమంలో సైమా అవార్డుల ప్రదానోత్సవానికి గానూ ఈ ఏడాది బరిలో ఉన్న నామినేషన్లను సైమా నిర్వాహకులు తాజాగా విడుదల చేశారు. సౌత్ ఇండియా సినిమా ఇండస్ట్రీల నుంచి వివిధ కేటగిరీల్లో పోటీ పడుతున్న వారి వివరాలను ఓ ప్రకటనలో వెల్లడించారు.
సైమా అవార్డ్స్ 2026లో టాలీవుడ్ నుంచి యువ కథానాయకుడు తేజ సజ్జా హీరోగా నటించిన 'మిరాయ్' సినిమా అత్యధికంగా 11 నామినేషన్లను దక్కించుకుంది. ఆ తర్వాత బరిలో నిలిచిన 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమా 10 నామినేషన్లు.. 'తండేల్', 'కోర్టు' సినిమాలకు గానూ చెరో 9 నామినేషన్లు దక్కాయి. ఈ సారి ఈ సైమా అవార్డుల ప్రదానోత్సవాన్ని సెప్టెంబరు 11, 12 తేదీల్లో జరిగే వేడుకల్లో అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు.
టాలీవుడ్ నుంచి ఈసారి బరిలో నిలిచిన నామినేషన్లు ఆసక్తికరంగా ఉన్నాయి. స్టార్ హీరో పవన్ కళ్యాణ్ చాలా ఏళ్ల తర్వాత మరోసారి సైమా అవార్డ్స్ నామినేషన్ల బరిలో నిలిచారు. ఆయన నటించిన 'ఓజీ' సినిమాకి గాను ఉత్తమ నటుడి నామినేషన్ల బరిలో నిలిచారు. ఈ ఉత్తమ నటుడి అవార్డు కోసం ఏకంగా ఆరుగురు పోటీ పడుతుండడం గమనార్హం. ఈ క్రమంలో సైమా అవార్డ్స్ నామినేషన్లలో ప్రముఖ నామినేషన్ల వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
టాలీవుడ్ నుంచి ఉత్తమ నటుడి నామినేషన్ల బరిలో ఎవరెవరు ఉన్నారంటే?
పవన్‌కల్యాణ్ - ఓజీ (The Call Him OG)
ధనుష్ - కుబేర
నాని - హిట్ 3
నాగచైతన్య - తండేల్
తేజ సజ్జా - మిరాయ్
వెంకటేష్ దగ్గుబాటి - సంక్రాంతికి వస్తున్నాం
ఉత్తమ నటి విభాగం..
ఐశ్వర్యా రాజేష్ - సంక్రాంతికి వస్తున్నాం
రాశీ ఖన్నా - తెలుసు కదా
రష్మిక మంధాన - ది గర్ల్ ఫ్రెండ్
రితికా నాయక్ - మిరాయ్
సాయి పల్లవి - తండేల్
శ్రీనిధి శెట్టి - హిట్ 3
ఉత్తమ దర్శకుడు విభాగం..
చందూ మొండేటి - తండేల్
అనిల్ రావిపూడి - సంక్రాంతికి వస్తున్నాం
కార్తిక్ ఘట్టమనేని - మిరాయ్
శైలేష్ కొలను - హిట్ 3
రాహుల్ రవీంద్రన్ - ది గర్ల్ ఫ్రెండ్
సుజీత్ - ఓజీ
ఉత్తమ చిత్రం విభాగం..
కోర్ట్
మిరాయ్
హిట్ 3
సంక్రాంతికి వస్తున్నాం
ది గర్ల్ ఫ్రెండ్
తండేల్
ఉత్తమ సంగీత దర్శకుడు విభాగం..
దేవిశ్రీ ప్రసాద్ - తండేల్
భీమ్స్ సిసిరోలియో - సంక్రాంతి వస్తున్నాం
గౌర హరి - మిరాయ్
ఎస్.ఎస్.తమన్ - ఓజీ
హషీమ్ అబ్దుల్ వహద్ - ది గర్ల్ ఫ్రెండ్
విజయ్ బుల్గానిన్ - కోర్ట్.
Also Read: 'కొరియన్ కనకరాజు' ట్రైలర్ వచ్చేసింది! వరుణ్ తేజ్ డ్యుయెల్ రోల్..సత్య సూపర్ కామెడీ!
Also Read: అందంలో హీరోయిన్లను మించిపోయిన నటి రోజా కూతురు..అన్షు లేటెస్ట్ ఫొటోలు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Sangareddy Wedding Fraud: అందగత్తె అని ఎదురుకట్నం ఇచ్చి పెళ్లి చేసుకున్నాడు..చివరికి ఫస్ట్‌నైట్ రోజే..
Sangareddy, Telangana:Sangareddy Wedding Fraud News: ఒంటరి జీవితానికి స్వస్తి చెప్పి, కొత్త జీవితాన్ని ప్రారంభిద్దామని ఆశపడిన ఓ మెకానిక్కు పెళ్లయిన మరుసటి రోజే ఘోరమైన మోసం ఎదురైంది. అందంగా ఉందన్న ఉద్దేశంతో ఎదురుకట్నం ఇచ్చి మరీ వివాహం చేసుకుంటే.. ఫస్ట్‌నైట్ తిరిగేసరికి భార్య కళ్లుగప్పి పరారైన ఈ ఘటన సంగారెడ్డి జిల్లాలో సంచలనంగా మారింది.
ఘటన వివరాల్లోకి వెళ్తే..
సంగారెడ్డి ప్రాంతానికి చెందిన ఆరిఫుద్దీన్ మెకానిక్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. 30 ఏళ్ల వైవాహిక జీవితం ఆ వెంటనే మొదటి భార్యతో విడిపోయిన తర్వాత ఒంటరితనం వెంటాడటంతో.. తోడు కోసం మరో వివాహం చేసుకోవాలని నిశ్చయించుకున్నాడు. ఈ క్రమంలోనే హైదరాబాద్ పాతబస్తీకి చెందిన ఓ యువతితో అతనికి వివాహం కుదిరింది. అమ్మాయి కుటుంబం ఆర్థిక పరిస్థితి బాగాలేకపోవడంతో పెళ్లి ఖర్చుల నిమిత్తం ఆరిఫుద్దీన్ స్వయంగా రూ.60 వేలు ఎదురుకట్నం ఇచ్చి పెద్దల సమక్షంలో ఘనంగా పెళ్లి చేసుకున్నాడు. జీవితంలో కొత్త ఆశలతో భార్యను ఇంటికి తీసుకెళ్లాడు.
తెల్లారేసరికి షాక్..
అంతా సంతోషంగా గడుస్తుందనుకున్న తరుణంలో మరుసటి రోజు ఉదయం నిద్రలేచి చూసేసరికి భార్య కనిపించకపోవడంతో ఆరిఫుద్దీన్ కంగుతిన్నాడు. ఇల్లంతా వెతికి, బంధువులను ఆరా తీసినా ఎలాంటి ప్రయోజనం లేకపోయింది. రాత్రికి రాత్రే ఆమె పరారవడంతో ఇది ముందస్తుగా వేసిన పక్కా పథకం (ప్లాన్) కావచ్చని భావించాడు.
ఈ మోసంపై వెంటనే పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేయడంతో పాటు, తన భార్య క్షేమంగా తిరిగి రావాలని సోషల్ మీడియాలోనూ పోస్ట్ చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. యువతి కాల్ డేటా, స్థానిక సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తును ముమ్మరం చేశారు. కేవలం డబ్బుల కోసమే ఈ పెళ్లి నాటకం ఆడిందా? లేక దీని వెనుక అంతరాత్మను కదిలించే ఇతర కారణాలున్నాయా? అనే కోణంలో పోలీసులు కూపీ లాగుతున్నారు.
Also Read: ఆగస్టులో విద్యార్థులకు పండగే పండగ..ఏకంగా వారం రోజులకు పైగా సెలవులు!
ALso Read: బంగాళాఖాతంలో వేగంగా మారుతున్న వాతావరణం..తెలుగు రాష్ట్రాలకు తుఫాన్ ముప్పు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
NEET UG Counselling: నీట్ విద్యార్థులకు అలర్ట్..కౌన్సిలింగ్ తేదీల షెడ్యూల్ విడుదల..ఆగస్టు 5 నుంచి రిజిస్ట్రేషన్లు షురూ!
Hyderabad, Telangana:NEET UG Counselling Schedule: వైద్య విద్యనభ్యసించాలనుకునే లక్షలాది మంది విద్యార్థులకు మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ (MCC) గుడ్‌న్యూస్ చెప్పింది. నీట్ యూజీ 2026 కౌన్సెలింగ్ పూర్తి షెడ్యూల్‌ను అధికారికంగా విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు ఆగస్టు 5 నుంచి ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు వెసులుబాటు కల్పించారు.
దేశవ్యాప్తంగా ఉన్న 15 శాతం ఆల్ ఇండియా కోటా (AIQ) కింద ఎంబీబీఎస్ (MBBS), BDS, B.Sc. నర్సింగ్ కోర్సులు, ఇతర కేటగిరీ సీట్ల భర్తీకి ఈ ప్రక్రియ కొనసాగనుంది. పూర్తి ఆన్లైన్ విధానంలో జరిగే ఈ కౌన్సెలింగ్‌లో పాల్గొనే అభ్యర్థులు ముందుగా MCC (మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ) పోర్టల్‌లోని ఇన్ఫర్మేషన్ బులెటిన్‌ను క్షుణ్ణంగా చదవాలని సూచించారు.
మొదటి రౌండ్ కౌన్సెలింగ్ కీలక తేదీల వివరాలు ఇలా ఉన్నాయి..
ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం: ఆగస్టు 5, 2026
దరఖాస్తుకు చివరి తేదీ: ఆగస్టు 12, 2026
కాలేజీల ఆప్షన్ల ఎంపిక & లాకింగ్: ఆగస్టు 6 నుంచి ప్రారంభం
మొదటి రౌండ్ సీట్ల కేటాయింపు ఫలితాలు: ఆగస్టు 17, 2026
కాలేజీల్లో రిపోర్టింగ్ (అడ్మిషన్ ప్రక్రియ): ఆగస్టు 18 నుంచి ఆగస్టు 22 వరకు
కౌన్సెలింగ్‌లో ఎవరు అర్హులు?
నీట్ యూజీ 2026 పరీక్షలో కటాఫ్ మార్కులు సాధించి ఉత్తీర్ణులైన అభ్యర్థులు మాత్రమే ఈ కౌన్సెలింగ్‌కు అర్హులు. నిర్దేశిత పర్సంటైల్ కలిగి ఉండి, గడువులోగా ఆన్లైన్ దరఖాస్తు పూర్తి చేయాలి. అయితే, స్టేట్ కోటా కింద సీటు కోరుకునేవారు సంబంధిత రాష్ట్ర కౌన్సెలింగ్ అథారిటీ ద్వారా విడిగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
ఆన్లైన్ రిజిస్ట్రేషన్ విధానం..
1) మొదటగా MCC (మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ) అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.
2) హోమ్‌పేజీలో కనిపించే 'NEET UG Counseling 2026' లింక్‌పై క్లిక్ చేయండి.
3) మీ నీట్ అప్లికేషన్ నంబర్, పాస్‌వర్డ్‌తో లాగిన్ అవ్వండి.
4) రిజిస్ట్రేషన్ ఫారమ్‌ను పూరించి, నిర్దేశిత కౌన్సెలింగ్ ఫీజు చెల్లించండి.
5) వ్యక్తిగత, విద్యా వివరాలను తప్పులు లేకుండా ఎంటర్ చేసి, అవసరమైన సర్టిఫికెట్లను అప్లోడ్ చేయండి.
6) మీ ప్రాధాన్యత ప్రకారం కాలేజీలు, కోర్సులను ఎంచుకుని (ఆప్షన్స్) లాక్ చేసి తుది దరఖాస్తును సమర్పించండి.
అభ్యర్థులు సిద్ధంగా ఉంచుకోవాల్సిన పత్రాలు..
> నీట్ యూజీ 2026 స్కోర్‌కార్డ్, అడ్మిట్ కార్డ్
> 10వ తరగతి సర్టిఫికేట్ (పుట్టిన తేదీ ధృవీకరణ కోసం)
> 12వ తరగతి లేదా ఇంటర్ మార్క్‌షీట్, పాసింగ్ సర్టిఫికేట్
> చెల్లుబాటు అయ్యే ఫోటో ఐడీ ప్రూఫ్ (ఆధార్, పాన్ లేదా ఓటర్ ఐడీ)
> రీసెంట్ పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు
> రిజర్వేషన్ కోరేవారు కుల ధృవీకరణ పత్రం (క్యాస్ట్ సర్టిఫికేట్)
> దివ్యాంగులు లేదా ప్రత్యేక కోటా అభ్యర్థులు సంబంధిత సర్టిఫికెట్లు
> అడ్మిషన్ సమయంలో అన్ని ఒరిజినల్ పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది కాబట్టి వాటిని భద్రపరుచుకోవాలి.
సీట్ల కేటాయింపు ఎలా జరుగుతుంది?
రిజిస్ట్రేషన్లు ముగిసిన తర్వాత అభ్యర్థులు ఇచ్చిన ఆప్షన్ల ఆధారంగా సీట్ల కేటాయింపు ప్రక్రియ చేపడతారు. నీట్ ర్యాంక్, రిజర్వేషన్ నిబంధనలు, కేటగిరీ, కాలేజీల్లో అందుబాటులో ఉన్న సీట్ల సంఖ్య (సీట్ మ్యాట్రిక్స్) తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని పారదర్శకంగా సీట్లను కేటాయిస్తారు.
Also Read: ప్రధాని మోదీని బూతులు పట్టిన యువతి..ఇప్పుడు అమాయకంగా క్షమాపణలు చెబుతోంది!
Also Read; E20 పెట్రోల్‌తో మైలేజ్ తగ్గుతుందా? రాజ్యసభలో కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ కీలక వ్యాఖ్య
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
