ఖమ్మం: విషపు నీటిని తాగి గొర్రెల మృతి
Khammam, Telangana:విషపు నీరు తాగి 20 గొర్రెలు మృతి చెందగా మరో 150 గొర్రెలు అస్వస్థతకు గురైన ఘటన ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం లంకాసాగర్ క్రాస్ రోడ్ వద్ద జరిగింది. రామచంద్రాపురం గ్రామానికి చెందిన బోలే రాంబాబుకు చెందిన 200 గొర్రెలను క్రాస్ వద్ద మేపుతున్నాడు. అయితే సింగరేణి నుండి వచ్చే విష రసాయనాలను సమీపంలోని గుంతల్లో డంప్ చేస్తున్నారు. నీటి కోసం వెళ్లిన గొర్రెలు వాటిని తాగి అస్వస్థతకు గురై చనిపోయినట్లు తెలుస్తుంది.हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
AP Rain Alert: ఏపీలో పిడుగులతో కూడిన భారీ వర్షాలు..నైరుతి ఎఫెక్ట్ మాములుగా లేదు!
Nunna, Vijayawada, Andhra Pradesh:AP Monsoon Rain Alert News: ఆంధ్రప్రదేశ్‌లో నిన్న, మొన్నటి వరకు ఎండలు మండిపోగా.. ఇప్పుడు నైరుతి రుతుపవనాల రాకతో వానలు దంచికొడుతున్నాయి. ఇప్పటికే తెలుగు రాష్ట్రాలను తాకిన నైరుతి రుతుపవనాలు.. మరో రెండు, మూడు రోజుల్లో అన్ని జిల్లాల వ్యాప్తంగా విస్తరించే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ క్రమంలో రాబోయే రెండు రోజుల్లో అటు ఆంధ్రప్రదేశ్ సహా తెలంగాణ వ్యాప్తంగా తీవ్రమైన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలుస్తోంది.Mrigasira Karthi: మృగశిర కార్తె వచ్చేసింది! ఈ రోజు చేపలు ఎందుకు తినాలి? ఆ రెండింటి సంబంధం ఏంటో తెలుసా?
Hyderabad, Telangana:Mrigasira Karthi Fish Relation: మృగశిర కార్తె రాకతో వర్షాకాలం అధికారికంగా ప్రారంభమవుతుంది. సూర్యుడు మృగశిర నక్షత్రంలోకి ప్రవేశించడాన్నే 'మృగశిర కార్తె' అంటారు. ఈ రోజున రైతులు విత్తనాలు చల్లి, పొలం పనులు మొదలుపెడతారు. అయితే మృగశిర కార్తె అనగానే అందరికీ ముందుగా గుర్తొచ్చేది చేపల వంటకాలు. పల్లె అయినా, పట్నమైనా ఈ రోజున ప్రతి ఇంట్లో చేపల కూర గుమగుమలాడాల్సిందే. మరి ఈ కార్తెకు, చేపలు తినే సంప్రదాయానికి ఉన్న ఆరోగ్య రహస్యం ఏంటో ఇప్పుడు చూద్దాం.
వాతావరణ మార్పు – రోగనిరోధక శక్తి
మృగశిర కార్తెకు ముందు వచ్చే రోహిణి కార్తెలో ఎండలు మండిపోతాయి. రోకళ్లు పగిలేంత ఎండల వల్ల ప్రజలు విపరీతమైన ఉక్కపోతకు గురై, శరీరంలో నీటి శాతం తగ్గిపోతుంది. ఆ వెంటనే మృగశిర రాకతో నైరుతి రుతుపవనాలు ప్రవేశించి, తొలకరి చినుకులు పడతాయి.
ఒక్కసారిగా వాతావరణం చల్లబడటాన్ని మానవ శరీరం తట్టుకోలేదు. ఈ తేమ వాతావరణం వల్ల బ్యాక్టీరియా, వైరస్లు వేగంగా వ్యాప్తి చెంది.. జలుబు, దగ్గు, గొంతు నొప్పి వస్తాయి. ఆస్తమా, ఉబ్బసం వంటి శ్వాసకోశ సమస్యలు పెరుగుతాయి. శరీరంలో రోగనిరోధక శక్తి తగ్గుతుంది.
ఈ కాలంలో వచ్చే జబ్బుల నుంచి తట్టుకోవడానికి మన పెద్దలు చేపలు తినే ఆనవాయితీని తెచ్చారు. దీని వెనుక బలమైన ఆరోగ్య కారణాలు ఉన్నాయి. వాతావరణం చల్లబడినప్పుడు శరీర ఉష్ణోగ్రత పడిపోతుంది. చేపలు తినడం వల్ల శరీరం లోపలి నుంచి వెచ్చగా మారుతుంది. ఇది గుండె, ఊపిరితిత్తులకు అవసరమైన వేడిని అందిస్తుంది. వర్షాల వల్ల శరీరంలో కఫం, వాత దోషాలు పెరుగుతాయి. చేపలు ఈ కఫాన్ని నియంత్రించి శ్వాసకోశ ఇబ్బందులను తగ్గిస్తాయి.
అలాగే చేపల్లో విటమిన్లు, ఖనిజ లవణాలు, ముఖ్యంగా ఓమెగా-3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యానికి, రోగనిరోధక శక్తి పెంపుదలకు ఎంతో మేలు చేస్తాయి.
తొలి వానలు పడగానే రైతులు రాత్రింబవళ్లు పొలం పనుల్లో మునిగిపోతారు. ఆ సమయంలో వచ్చే ఒళ్లు నొప్పులు, అలసట నుంచి ఉపశమనం పొందడానికి కూడా చేపలు దోహదపడతాయి. అందుకే "మృగశిరన చేప తింటే ఏడాదంతా ఏ రోగం రాదు" అనే సామెత కూడా పుట్టింది.
అంతేకాకుండా.. దీర్ఘకాలిక ఆస్తమా, ఉబ్బస వ్యాధిగ్రస్తుల కోసం ఈ రోజున ప్రత్యేకంగా అందించే 'చేప ప్రసాదం' (చేప మందు) తీసుకోవడానికి కూడా దేశం నలుమూలల నుండి ప్రజలు తరలివస్తుంటారు. మృగశిర కార్తె నాడు చేపలు తినడం అనేది కేవలం ఒక అలవాటు మాత్రమే కాదు, మారుతున్న వాతావరణానికి అనుగుణంగా మన శరీరాన్ని సిద్ధం చేసే ఒక అద్భుతమైన ఆరోగ్య సూత్రంగా మారింది.
Also Read: మనిషి చనిపోయిన తర్వాత ఫింగర్ ప్రింట్‌తో ఫోన్ అన్‌లాక్ చేయోచ్చా? అసలు నిజం ఇదే!
Also Read; విరాట్ కోహ్లీ ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన ఒక్క లైక్‌తో ఆమె జీవితమే మారిపోయింది!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
EPFO: ఉద్యోగులకు అలర్ట్.. మీ అకౌంట్లో PF Interest ఇంకా పడలేదా? అసలు కారణం ఇదే..!!
Secunderabad, Telangana:EPF Interest Credit: ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ 2025-26 ఆర్థిక సంవత్సరానికి పీఎఫ్ డిపాజిట్లపై 8.25శాతం వార్షిక వడ్డీ రేటును అందించాలని 2026 మార్చిలో సిఫార్సు చేసింది. ప్రభుత్వ ఈ నిర్ణయం తర్వాత.. దేశంలోని కోట్లాది మంది ఉద్యోగస్తులు తమ ఖాతాలోకి వడ్డీ డబ్బు వచ్చిందో లేదోనని నిరంతరం తమ పాస్‌బుక్‌లను చెక్ చేసుకుంటున్నారు. కానీ చాలా మంది సభ్యుల ఖాతాలలో వడ్డీ మొత్తం ఇంకా జమ కాలేదు. దీంతో చాలా మంది ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. అయితే దీని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం అస్సలు లేదని నిపుణులు అంటున్నారు. ఎందుకంటే పీఎఫ్ డబ్బు పూర్తిగా సురక్షితంగా ఉంది. నిర్దేశించిన విధానం ప్రకారం అది ఖచ్చితంగా మీ ఖాతాలోకి జమ అవుతుంది. మీకు కూడా ఈపీఎఫ్ఓ ఖాతా ఉంటే వడ్డీ డబ్బు మీ ఖాతాలో కనిపించకపోతే, ఆ డబ్బు ఎప్పటిలోగా మీ ఖాతాలోకి వస్తుందో తెలుసుకుందాం.
ఆర్థిక సంవత్సరం ముగిసిన తర్వాత కూడా ఖాతాలలో వడ్డీ ఎందుకు కనిపించడం లేదు? నిజానికి ఈ మొత్తం ప్రక్రియలో ఒక సుదీర్ఘమైన పరిపాలనా విధానం ఉంటుంది. ముందుగా, కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ మరియు ఆర్థిక మంత్రిత్వ శాఖ నుండి అధికారిక ఆమోదం, నోటిఫికేషన్ జారీ అవుతుంది. దీని తర్వాత, దేశవ్యాప్తంగా ఉన్న లక్షలాది PF ఖాతాల డేటాను సరిపోల్చి, అప్డేట్ చేసే ప్రక్రియ ప్రారంభమవుతుంది. దీనికి సహజంగానే చాలా వారాల సమయం పడుతుంది. ఆర్థిక నిపుణుల ప్రకారం.. ప్రస్తుతం మీ పాస్‌బుక్‌లో వడ్డీ మొత్తం ఒక ఎంట్రీగా కనిపించకపోయినప్పటికీ, మీకు అర్హత ఉన్న మొత్తంపై వడ్డీ లెక్కింపు తెరవెనుక కొనసాగుతూనే ఉంటుంది.
గతేడాది రికార్డులను పరిశీలించినట్లయితే.. 2025లో జూన్, జూలై నెలల్లో పీఎఫ్ సభ్యుల ఖాతాలకు వడ్డీ చెల్లింపులు జమ అయ్యాయి. గతంలో, ఈ ప్రక్రియ సెప్టెంబర్ లేదా అక్టోబర్ వరకు సాగేది. కానీ ఇప్పుడు డిజిటల్ వ్యవస్థ వల్ల మరింత వేగంగా మారింది. ప్రభుత్వ నోటిఫికేషన్ సకాలంలో జారీ అయితే, ఈ సంవత్సరం, 2026లో కూడా, జూన్ లేదా జూలై చివరి నాటికి ఖాతాలకు వడ్డీ చెల్లింపులు బదిలీ కావడం ప్రారంభమయ్యే అవకాశం ఉంది.
Also Read: భారీగా పడిపోయిన బంగారం, వెండి ధరలు.. నేడు జూన్ 8వ తేదీ ధరలివే..!!
ఈ పరిపాలనా జాప్యం వల్ల వడ్డీ నష్టం జరుగుతుందని చాలా మంది ఉద్యోగులు భయపడుతున్నారు. నిబంధనల ప్రకారం, పీఎఫ్ పథకంలో వడ్డీని నెలవారీ రన్నింగ్ బ్యాలెన్స్ ఆధారంగా లెక్కిస్తారు. అంటే, మీ ఖాతాలో ఎంట్రీ రెండు నుంచి నాలుగు నెలల ఆలస్యంగా కనిపించినప్పటికీ, మీరు పూర్తి సంవత్సరానికి పూర్తి వడ్డీని పొందుతారు. ఈ జాప్యం వల్ల వడ్డీ మొత్తంలో ఒక్క రూపాయి కూడా తగ్గుదల ఉండదు.
ప్రభుత్వ ఆమోదం అందిన వెంటనే, వడ్డీ మొత్తం మీ పాస్‌బుక్‌లో కనిపిస్తుంది. దీనిని చెక్ చేయడానికి, మీరు ఉమాంగ్ యాప్‌ను ఉపయోగించవచ్చు లేదా ఇ-సేవా పోర్టల్‌లోకి లాగిన్ అవ్వవచ్చు. ప్రత్యామ్నాయంగా, మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుండి 9966044425 నంబర్‌కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా లేదా 7738299899 నంబర్‌కు SMS పంపడం ద్వారా కూడా మీరు మీ బ్యాలెన్స్‌ను సులభంగా తనిఖీ చేసుకోవచ్చు. ఈ సౌకర్యాన్ని పొందాలంటే, మీ UAN తప్పనిసరిగా యాక్టివేట్ చేసి మీ పాన్, బ్యాంక్ ఖాతా, కేవైసీ పత్రాలతో పూర్తిగా లింక్ చేసి ఉండాలి.
Also Read: పీఎఫ్ ఖాతాదారులు చేసే ఆ ఒక్క చిన్న తప్పు.. కుటుంబానికి భారీ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Philippines Earthquake: ఫిలిప్పీన్స్‌లో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై 8.2 తీవ్ర..సునామీ రాబోతుందా?
Quezon City, Metro Manila:Philippines Earthquake News: ఫిలిప్పీన్స్‌లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 8.2గా నమోదయ్యింది. అయితే ఇంతటి భారీ భూకంపం నమోదు కావడం ఈ మధ్యకాలంలో ఇదే కావడం గమనార్హం. ఫిలిప్పీన్స్‌తో పాటు ఇండోనేషియా, తైవాన్, పపువా న్యూగినియా వంటి దేశాల్లో భూకంపం కారణంగా సునామీ హెచ్చరికలు జారీ చేశారు.LPG Gas Price Hike: సామాన్యులకు కేంద్ర ప్రభుత్వం బిగ్‌షాక్.. నేడు పెట్రోల్, డీజిల్ ధరలు ఎలా ఉన్నాయంటే?
Hyderabad, Telangana:LPG Gas Price Hike News: ఇంధన ధరల భారం సామాన్యుడిపై మరింతగా పడుతోంది. పశ్చిమ ఆసియా సంక్షోభం కారణంగా అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరగడంతో, దేశీయంగా ఇంధన, గ్యాస్ ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. 2026 జూన్ 8 నాటి తాజా ఇంధన, గ్యాస్ ధరల పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
గృహ, వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరల పెంపు
గృహ వినియోగ ఎల్పీజీ (14.2 కిలోలు): జూన్ 7 నుంచి గృహ వినియోగ సిలిండర్ ధరను రూ.29 మేర పెంచారు. గత మూడు నెలల్లో ధర పెరగడం ఇది రెండోసారి. ఈ తాజా పెంపుతో తెలుగు రాష్ట్రాల్లో సిలిండర్ ధర దాదాపు రూ. 1,000 మార్కుకు చేరుకుంది.
వాణిజ్య ఎల్పీజీ (19 కిలోలు): జూన్ 1 నుంచి వాణిజ్య సిలిండర్ ధరలను కూడా పెంచారు. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో దీని ధర రూ.42 పెరిగి, రూ.3,113.50 కి చేరింది.
స్థిరంగా పెట్రోల్, డీజిల్ ధరలు
జూన్ 8 (శనివారం) నాడు పెట్రోల్, డీజిల్, సీఎన్జీ ధరలలో ఎలాంటి మార్పు లేకుండా యథాతథంగా కొనసాగాయి. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు (OMCs) ప్రతిరోజూ ఉదయం 6 గంటలకే ఈ ధరలను సవరిస్తుంటాయి. అంతర్జాతీయ పరిస్థితుల వల్ల కంపెనీలు ఇప్పటివరకు లీటరు పెట్రోల్, డీజిల్‌పై సుమారు రూ. 7.50 మేర పెంచడం గమనార్హం.
వివిధ నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు..
దేశంలోని ప్రధాన నగరాల్లో ఇంధన ధరల వ్యత్యాసాలు క్రింది విధంగా ఉన్నాయి. తెలంగాణలోని హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ రూ.115.69 ఉండగా.. లీటర్ డీజిల్ ధర రూ.103.82గా విక్రయిస్తున్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో లీటర్ పెట్రోల్‌పై రూ.117.72 ఉండగా.. లీటర్ డీజిల్ ధర రూ.105.40గా ఉంది. తిరువనంతపురంలో పెట్రోల్ రూ.115.49, డీజిల్ రూ.104.40 ఉండగా.. చండీగఢ్‌లో పెట్రోల్ ధర రూ.98.10, డీజిల్ ధర రూ.86.09 విక్రయిస్తుండగా.. లక్నో పెట్రోల్ రూ.102.05.. న్యూఢిల్లీ పెట్రోల్ రూ.102.12గా విక్రయిస్తున్నారు.
ఎగుమతి సుంకాల తగ్గింపు
జూన్ 1 నుంచి ప్రారంభమైన పక్షవారానికి గాను ప్రభుత్వం పెట్రోల్, డీజిల్, ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ATF)లపై ఎగుమతి సుంకాన్ని తగ్గించింది. సవరించిన కొత్త ఎగుమతి సుంకాలు (లీటరుకు) పెట్రోల్ పై రూ.1.50.. డీజిల్‌పై రూ.13.50.. ఏటీఎఫ్‌పై రూ.9.50 పెంపు ఉండనుంది.
Also Read: భారీగా పడిపోయిన బంగారం ధరలు..రూ.3,000 తగ్గిన గోల్డ్ రేట్..10గ్రా. ఎంతంటే?
Also Read: 300 యూనిట్ల వరకు ఉచిత కరెంట్..కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే స్కీమ్..ఇలా అప్లే చేయండి!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Fingerprint Lock Technology: మనిషి చనిపోయిన తర్వాత ఫింగర్ ప్రింట్‌తో ఫోన్ అన్‌లాక్ చేయోచ్చా? అసలు నిజం ఇదే!
Hyderabad, Telangana:Dead Person Phone Unlock: మనలో చాలా మంది ప్రస్తుతం స్మార్ట్ ఫోన్స్ వినియోగిస్తున్నారు. అందులో అడ్వాన్స్ టెక్నాలజీతో ఎన్నో సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి. ఒకప్పుడు పాస్‌వర్డ్‌తో ఫోన్‌ను అన్‌లాక్ చేసే విధానం నుంచి ఇప్పుడు ఫింగర్ ప్రింట్‌తో అన్‌లాక్ చేసేంతగా టెక్నాలజీ మారిపోయింది. అయితే మనలో చాలా మందికి ఓ డౌట్ ఉంటుంది. మనిషి చనిపోయాక అతని ఫోన్ అన్‌లాక్ చేసి ఎవరైనా చెక్ చేస్తారా? అని.. అయితే దాని వెనుకున్న అసలు రహస్యాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.
చనిపోయిన వ్యక్తి ఫింగర్ ప్రింట్ ద్వారా అతని మొబైల్ అన్‌లాక్ చేసి డేటా దొంగలిస్తారా? అనే విషయాన్ని ఇప్పుడు పరిశీలిద్దాం. మొబైల్ ఫోన్లలో ప్రధానంగా మూడు రకాల వేలిముద్ర సెన్సార్లు ఉపయోగిస్తున్నారు. అవి ఆప్టికల్, కెపాసిటివ్, అల్ట్రాసోనిక్ వంటి టెక్నాలజీ మార్కెట్లో అందుబాటులోకి వచ్చింది. ప్రతి సెన్సార్‌కు వాటి ప్రత్యేకమైన సాంకేతికత, ప్రయోజనాలు ఉన్నాయి.
ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి దగ్గర స్మార్ట్‌ఫోన్ ఉంది. మొబైల్లో సమాచారం సెక్యూర్ చేసుకునేందుకు.. ప్రతి ఒక్కరూ సులభమైన వేలిముద్రలను ఉపయోగిస్తున్నారు. కానీ ఒకవేళ ఎవరైనా చనిపోతే, వారి వేలిముద్రలతో వారి ఫోన్ అన్‌లాక్ అవుతుందా? లేదా..? దీనిపై చాలా మందికి సందేహాలు ఉన్నాయి.
ప్రతి వ్యక్తి బొటనవేలోని వేలిముద్రలు భిన్నంగా ఉంటాయి. అయితే వ్యక్తి మరణించిన తర్వాత అతని ఫింగర్ ప్రింట్ ద్వారా ఫోన్ అన్‌లాక్ చేయోచ్చా? మరణం సంభవించినప్పటి నుండి గడిచిన సమయాన్ని బట్టి ఫోన్లలో ఉపయోగించే సెన్సార్ రకం ఆధారపడి ఉంటుంది.
మరణం సంభవించిన మొదటి కొన్ని గంటలలో, చర్మం ఇంకా మృదువుగా ఉన్నప్పుడు, ఆప్టికల్ లేదా కెపాసిటివ్ సెన్సార్లు తాత్కాలికంగా పనిచేసే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
అయితే, 12 నుండి 24 గంటల తర్వాత పరిస్థితి పూర్తిగా మారుతుంది. చర్మం కుంచించుకుపోవడం, తేమను కోల్పోవడం, వాహకత్వం తగ్గడం మొదలవుతుంది. దీనివల్ల కెపాసిటివ్ సెన్సార్ పూర్తిగా విఫలమవుతుంది.
దీని అర్థం ఏమిటంటే, చనిపోయిన వ్యక్తి వేలిముద్ర పనిచేయదు. అదేవిధంగా.. ఆప్టికల్, అల్ట్రాసోనిక్ సెన్సార్లు రక్త ప్రసరణ లేకపోవడాన్ని గుర్తించి, ఫోన్‌ను అన్‌లాక్ చేయడాన్ని వెంటనే తిరస్కరిస్తాయి.
(గమనిక: పైన పేర్కొన్న సమాచారం కేవలం కొన్ని నివేదికల ఆధారంగా రూపొందించింది. దీన్ని పాటించే ముందు సంబంధిత నిపుణుడ్ని సంప్రదించడం మేలు. దీన్ని జీ తెలుగు న్యూస్ ధ్రువీకరించడం లేదు.)
Also Read: 60 ఏళ్ల వయసులో కుర్రోడిలా చియాన్ విక్రమ్..ఫిట్నెస్, డైట్
Also Read: ఇంట్లో ఈ చెట్లు ఉంటే పాముల ఎక్కడ ఉన్నా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Bus Accident: ఖమ్మంలో అర్ధరాత్రి ఘోర బస్సు ప్రమాదం..డివైడర్‌ను ఢీకొని బస్సు బోల్తా..36 మంది ప్రయాణికులు..
Khammam, Telangana:Khammam Bus Accident: ఖమ్మం జిల్లాలో ఆదివారం అర్ధరాత్రి ఒక ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పెనుబల్లి మండలం కొత్తలంక పల్లి రైల్వే వంతెన పై కెవిఆర్ ట్రావెల్స్ కు చెందిన బలంగా ఢీ కొట్టి, తర్వాత రోడ్డుపై కొలతలు పడింది. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 36 మంది ప్రయాణికులు ఉన్న సమాచారం.
అతివేగమే ప్రమాదానికి కారణమా?
ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరు జిల్లా ముసునూరు మండలం చెక్కపల్లి గ్రామం (నూజివీడు సమీపం) నుంచి ఈ బస్సు హైదరాబాదుకు బయలుదేరింది. బస్సులో ధర్మాజీగూడెం, అక్కిరెడ్డిగూడెం, లింగపాలెం, రాఘవాపురం, సత్తుపల్లి తదితర ప్రాంతాలకు చెందిన ప్ర యాణి ఈ బస్సులో ఉన్నట్లు తెలుస్తుంది. అయితే బస్సు అతివేగం గా ప్రయాణించడం వల్ల అదుపుతప్పి రైల్వే బ్రిడ్జిపై ఉన్న డివైడర్‌ను ఢీ కొట్టినట్టు ప్రాథమిక సమాచారం ద్వారా తెలుస్తుంది.
క్షతగాత్రుల వివరాలు..
ప్రమాదంలో నలుగురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడగా మరికొందరు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. గాయపడిన వారు ఎం శిరీష, ఏమి శివ గణేష, మల్లిక సత్తుపల్లికి చెందినవారు. అలాగే చెక్కపల్లి కి చెందిన శ్రీనివాసరావు, పావని.. రాఘవ పురానికి చెందిన సుష్మిత, యువన్.. విజయరాయికి చెందిన ప్రణీత్, స్వప్న, నరసింహ.. లింగాపాలెం కి చెందిన తాతిన బాలాజీ.. అలాగే కొంచెం పత్తికి చెందిన రామకృష్ణ వంటి వారు గాయాల పాలయ్యారు. క్షతగాత్రులందరినీ ఆసుపత్రికి తరలించగా వారికి ప్రాణాపాయం తప్పిందని.. ప్రస్తుతం వారి ఆరోగ్యం సురక్షితమైన వైద్యులు ధ్రువీకరించారు.
సకాలంలో స్పందించిన స్థానికులు..
ప్రమాదం జరిగిన వెంటనే కొత్తలంక పల్లి గ్రామస్తులు అప్రమత్తమే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. బసవదాలను పగలగొట్టి లోపల చిక్కుకున్న ప్రయాణికులను సురక్షితంగా బయటకు తీశారు. అనంతరం అంబులెన్స్ ద్వారా గాయపడిన వారిని సత్తుపల్లి, పెనుబల్లి ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించారు.
ఈ ప్రమాదం కారణంగా రైల్వే వంతెన పై సుమారు అరగంట పాటు భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగి ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ప్రమాదం ఎలా జరిగిందనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
Also Read: Telangana Schools Reopen: అమావాస్య రోజున స్కూల్స్ రీఓపెన్..విద్యార్థుల తల్లీదండ్రుల ఆందోళన!
Also Read: దసరా, సంక్రాంతికి 17 రోజులు సెలవులు..స్కూల్స్ అకడమిక్ క్యాలెండర్ ప్రకటించిన తెలంగాణ!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Gold Rate Today: గోల్డ్ లవర్స్‌కు పండగే.. భారీగా పడిపోయిన బంగారం, వెండి ధరలు.. నేడు జూన్ 8వ తేదీ ధరలివే..!!
Secunderabad, Telangana:Gold Rate Today: ఇరాన్-ఇజ్రాయెల్-అమెరికా మధ్య ఉద్రిక్తతల కారణంగా, బంగారం ధరలు నిరంతరం మారుతున్నాయి. రెండు రోజుల తర్వాత నేడు మార్కెట్ తెరుచుకుంటోంది,. .MCXలో 24 క్యారెట్ల బంగారం ఫ్యూచర్స్ ధర 2.47శాతం అంటే రూ. 3947 తగ్గి, 10 గ్రాములకు రూ. 1,54,900కి చేరింది. ఇంతకుముందు ట్రేడింగ్ లో10 గ్రాములకు రూ. 1,59,547 వద్ద ముగిసింది. మరోవైపు, ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ ప్రకారం, బంగారం ధర 10 గ్రాములకు రూ. 1,59,900. ఇండియన్ బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ ప్రకారం, సోమవారం ఉదయం వరకు ఇది 10 గ్రాములకు రూ. 1,54,900గా ఉంది. గుడ్‌రిటర్న్స్ ప్రకారం, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1,55,910గా ఉంది.
అంతర్జాతీయ మార్కెట్లో బలహీన ధోరణి నెలకొన్న నేపథ్యంలో, చివరి ట్రేడింగ్ రోజైన శుక్రవారం ఢిల్లీ బులియన్ మార్కెట్లో బంగారం ధర తగ్గింది. 99.9 శాతం స్వచ్ఛమైన బంగారం ధర 10 గ్రాములకు రూ. 400 తగ్గి రూ. 1,59,900కి చేరింది. స్థానిక మార్కెట్ నిపుణుల ప్రకారం, ప్రపంచ మార్కెట్లో మందగమనం ప్రభావం దేశీయ ధరలపై కూడా కనిపించింది. అంతర్జాతీయ మార్కెట్లో, స్పాట్ గోల్డ్ ఔన్సుకు $ 4,470.79 వద్ద స్వల్ప తగ్గుదలతో ట్రేడవుతున్నట్లు కనిపించింది.
ఫ్యూచర్స్ ట్రేడింగ్‌లో కూడా బంగారం ధరలలో భారీ తగ్గుదల నమోదైంది. శుక్రవారం, మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ లో ఆగస్టు డెలివరీ గోల్డ్ కాంట్రాక్ట్ ధర 10 గ్రాములకు రూ. 1,221 లేదా దాదాపు ఒక శాతం తగ్గి రూ. 1,58,326కు పడిపోయింది. అధిక ముడి చమురు ధరలు, పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు, వడ్డీ రేట్లపై పెరుగుతున్న ఆందోళనలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను ప్రభావితం చేశాయని, ఇది గోల్డ్ ఫ్యూచర్స్‌పై ఒత్తిడి తెచ్చిందని మార్కెట్ నిపుణులు అంటున్నారు. ఇదిలా ఉండగా, అంతర్జాతీయ మార్కెట్లో, న్యూయార్క్‌లోని కామెక్స్ ఎక్స్ఛేంజ్లో ఆగస్టు డెలివరీ గోల్డ్ ఫ్యూచర్స్ ధర ఔన్సుకు $16.63 లేదా 0.37 శాతం తగ్గి $4,488.37కు చేరుకుంది.
పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్లపై వాటి ప్రభావం గురించి పెట్టుబడిదారుల ఆందోళనలే MCXలో బంగారం ధరలు తగ్గడానికి ప్రధాన కారణమని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. ప్రాంతీయ అనిశ్చితి ఉన్నప్పటికీ, సురక్షిత పెట్టుబడిగా బంగారానికి డిమాండ్ బలంగానే ఉందని వివరిస్తున్నారు. ఫలితంగా, డాలర్ ఇండెక్స్ కూడా 99.4 వద్ద స్థిరంగా ఉంటూ, మార్కెట్ దిశను నిర్ణయించడంలో కీలక పాత్ర పోషించింది.
Also Read: LPG Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. మళ్లీ పెరిగిన వంటగ్యాస్
Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. దయచేసి దీన్ని పెట్టుబడి, ఆర్థిక లేదా వ్యాపార సలహాగా భావించవద్దు. గుర్తుంచుకోండి స్టాక్ మార్కెట్లు, మ్యూచువల్ ఫండ్స్, క్రిప్టోకరెన్సీలు, రియల్ ఎస్టేట్, విలువైన లోహాలు వంటి అన్ని రకాల పెట్టుబడులు మార్కెట్ ఆటు పోటులు రిస్కులకు లోబడి ఉంటాయి. దీని అర్థం, మీరు లాభపడవచ్చు లేదా నష్టపోవచ్చు. మీరు తీసుకునే ఎలాంటి పెట్టుబడి నిర్ణయాలు లేదా వ్యాపార కార్యకలాపాల వల్ల కలిగే నష్టాలు లేదా లాభాలకు మా సంస్థ జీ తెలుగు వెబ్ పోర్టల్ ఎట్టి పరిస్థితుల్లోనూ బాధ్యత వహించదు. ఏదైనా ఆర్థిక నిర్ణయం తీసుకునే ముందు, తప్పకుండా ఒక రిజిస్టర్డ్ లేదా సర్టిఫైడ్ ఆర్థిక నిపుణుడిని సంప్రదించి, వారి సలహా తీసుకోమని పాఠకులకు సిఫార్సు చేస్తున్నాము.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Philippines Earthquake: ఫిలిప్పీన్స్ లో భారీ భూకంపం.. 8.2 తీవ్రత.. సునామీ హెచ్చరిక జారీ..!!
Secunderabad, Telangana:Philippines Earthquake: సోమవారం దక్షిణ ఫిలిప్పీన్స్‌లోని మిండానో తీరానికి దూరంగా 7.0 తీవ్రతతో శక్తివంతమైన భూకంపం సంభవించింది. దీని కేంద్రం భూమికి కేవలం 10 కిలోమీటర్ల లోతులో ఉంది. ఈ భూకంపం కారణంగా ఫిలిప్పీన్స్, ఇండోనేషియాతో సహా అంతర్జాతీయ పర్యవేక్షణ సంస్థలు సునామీ హెచ్చరిక జారీ చేశాయి. తీరప్రాంతానికి సమీపంలో నివసిస్తున్న వారిని వెంటనే ఖాళీ చేయాలని అధికారులు సూచించారు.
బలమైన భూకంప ప్రకంపనలు చాలా దూర ప్రాంతాలకు వ్యాపించడంతో, అనేక ప్రాంతాలలో ప్రజలు తమ ఇళ్లు, భవనాల నుండి బయటకు పరుగులు తీశారు. ప్రాథమిక నివేదికల ప్రకారం, ఈ భూకంపం సాపేక్షంగా తక్కువ లోతులో సంభవించడం వల్ల సునామీ ప్రమాదం పెరిగింది. పెద్ద నష్టం గానీ, ప్రాణనష్టం గానీ జరిగినట్లు అధికారికంగా ఎలాంటి సమాచారం లేదు.
భూకంపం సంభవించిన వెంటనే, అమెరికా సునామీ హెచ్చరిక వ్యవస్థ సునామీ గురించి హెచ్చరిక జారీ చేసింది. దీని తరువాత, ఇండోనేషియా భూభౌతిక సంస్థ కూడా తమ ఈశాన్య తీర ప్రాంతాలకు హెచ్చరిక జారీ చేసింది. ప్రభావిత తీర ప్రాంతాలలో సాధారణ అలల మట్టం కంటే ఒక మీటరుకు పైగా అలలు ఎగసిపడవచ్చని ఫిలిప్పీన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వోల్కనాలజీ అండ్ సీస్మాలజీ (PHIVOLCS) హెచ్చరించింది. ఈ అలల ప్రభావం చాలా గంటల పాటు కొనసాగే అవకాశం ఉందని తెలిపింది.
దక్షిణ ఫిలిప్పీన్స్‌లోని పలు తీరప్రాంతాల్లో నివసిస్తున్న నివాసితులు వెంటనే ఎత్తైన ప్రదేశాలకు వెళ్లాలని లేదా తీరానికి దూరంగా ఉన్న సురక్షిత ప్రాంతాల్లో ఆశ్రయం పొందాలని అధికారులు సూచించారు. విపత్తు నిర్వహణ సంస్థలు సముద్ర మట్టాలను నిరంతరం పర్యవేక్షిస్తున్నాయి . ప్రమాదం పొంచి ఉన్న ప్రాంతాల్లో సహాయక బృందాలను అప్రమత్తం చేశారు. ఫిలిప్పీన్స్, ఇండోనేషియా రెండూ ప్రపంచంలో అత్యంత భూకంపాలు సంభవించే ప్రాంతాలలో ఉన్నాయి. ఈ దేశాలు అనేక టెక్టోనిక్ ప్లేట్లు ఢీకొనే భౌగోళిక ప్రాంతమైన పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ లో ఉన్నాయి. తత్ఫలితంగా, అవి తరచుగా పెద్ద భూకంపాలు, అగ్నిపర్వత విస్ఫోటనాలు, సునామీల వంటి ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొంటాయి.
Also Read: LPG Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. మళ్లీ పెరిగిన వంటగ్యాస్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Iran Vs US War: ఇరాన్-అమెరికా యుద్ధానికి 100 రోజులు..భారతదేశానికి ఎన్ని కోట్ల రూపాయలు నష్టమో తెలుసా?
Haftador, Yazd Province:Iran US War Impact On India: అమెరికా-ఇరాన్ మధ్య సంఘర్షణ మొదలై ఇప్పటికీ వంద రోజులు గడిచింది. నేటికీ ఈ యుద్ధం ఎటువంటి స్పష్టమైన విజేతను తేల్చలేకపోయింది. యుద్ధ విరమణ చర్చలు నిలిచిపోవడం, హార్మూజ్ జలసంధి వద్ద పెరుగుతున్న ఉద్రిక్తతలు ప్రపంచ దేశాలను కలవరపాటుకు గురిచేస్తున్నాయి. ప్రత్యేకించి ఇంధన మార్కెట్లు ఈ పరిస్థితుల నేపథ్యంలో తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నాయి. రెండు దేశాల మధ్య సాగుతున్న ఈ పోరులో గెలుపోటములపై చర్చ కంటే.. దీనివల్ల సంభవిస్తున్న నష్టాలే ఇప్పుడు అంతర్జాతీయంగా ప్రధానాంశంగా మారాయి.
ఈ సంఘర్షణకు మూలం, యుద్ధ ప్రారంభంలోనే అమెరికా-ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ అత్యున్నత నాయకుడు అయతొల్లా అలీ ఖమేనీ మరణించడం. ఇది ఆ ప్రాంతంలో పెనుమార్పులకు దారితీసింది. లెబనాన్, గల్ఫ్ దేశాలకు ఈ యుద్ధం విస్తరించడం వల్ల భౌగోళిక రాజకీయ సమతుల్యత దెబ్బతింది. లక్షలాది మంది ప్రజలు నిరాశ్రయులు కాగా, వేల సంఖ్యలో ప్రాణనష్టం సంభవించింది. అమెరికాకు ఈ యుద్ధం వల్ల జరుగుతున్న ఆర్థిక నష్టం వందల బిలియన్ డాలర్లలో ఉంది, దీనిప్రభావం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్రంగా పడుతోంది.
తటస్థ విదేశాంగ విధానాన్ని అనుసరిస్తున్న భారతదేశానికి, ఈ యుద్ధం పరోక్షంగా పెద్ద ముప్పుగా పరిణమించింది. భారత్ తన చమురు దిగుమతుల్లో సుమారు 65 నుండి 70 శాతం హోర్ముజ్ జలసంధి మార్గం ద్వారానే పొందుతుంది, ఇది ప్రస్తుతం అత్యంత ప్రమాదకరంగా మారింది. కువైట్ విమానాశ్రయంపై జరిగిన డ్రోన్ దాడిలో ఒక భారతీయుడు ప్రాణాలు కోల్పోవడం, గల్ఫ్ దేశాలలో నివసిస్తున్న భారీ భారతీయ సమూహం భద్రతపై తీవ్రమైన ఆందోళనలను తెరపైకి తెచ్చింది. వాణిజ్య మార్గాలు దెబ్బతినడం భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలకు సవాలుగా మారింది.
ప్రస్తుతం దౌత్యపరమైన సంక్షోభం తీవ్రంగా ఉంది. పాకిస్థాన్ మధ్యవర్తిత్వంతో ఏప్రిల్ నెలలో కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం ఇప్పుడు అటకెక్కింది. అమెరికా ప్రతినిధులతో చర్చలకు ఇరాన్ నిరాకరిస్తోంది. 'బంతి ఇప్పుడు ట్రంప్ కోర్టులోనే ఉంది' అంటూ, ఇరాన్ తన పాత డిమాండ్లను ముందుంచుతోంది. ముఖ్యంగా స్తంభించిపోయిన తమ విదేశీ ఆస్తులను విడుదల చేయాలని, లెబనాన్‌లో శాంతిని నెలకొల్పాలని ఆ దేశం షరతులు విధిస్తోంది.
మరోవైపు అమెరికా హౌస్‌లో యుద్ధంపై జరిగిన ఓటింగ్‌లో (215-208 ఓట్లు) అధ్యక్షుడు ట్రంప్ అధికారాలను పరిమితం చేయాలని కోరడం, అంతర్గత రాజకీయ విభేదాలను వెల్లడిస్తోంది. ఆర్థికంగా కూడా ఈ యుద్ధం వాషింగ్టన్‌ను వేధిస్తోంది. ప్రారంభ ఆరు రోజుల్లోనే 11.3 బిలియన్ డాలర్ల వ్యయం కాగా, యుద్ధం కొనసాగే కొద్దీ ఇది 630 బిలియన్ డాలర్ల నుంచి 1 ట్రిలియన్ డాలర్లకు చేరుకోవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇంధన సరఫరాలో అంతరాయాలు ఏర్పడటంతో, పెట్రోల్ ధరలు బ్యారెల్‌కు వంద డాలర్ల స్థాయిని దాటి చమురు మార్కెట్లను భయాందోళనలకు గురిచేస్తున్నాయి. యుద్ధ ఖర్చులే కాక, ఇంధన ధరల పెరుగుదల ప్రపంచవ్యాప్తంగా నిత్యావసర ధరల పెరుగుదలకు దారితీస్తోంది.
హెజ్బొల్లా దళాలు ఇజ్రాయెల్‌పై సరిహద్దు దాడులను ముమ్మరం చేశాయి. ఇజ్రాయెల్ దళాలు లెబనాన్ భూభాగంలో సైనిక చర్యలను కొనసాగిస్తున్నాయి. ఈ వంద రోజుల కాలంలో ఇరాన్ వైపు 3,400 మందికి పైగా, లెబనాన్ వైపు 3,500 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఇటువంటి పరిస్థితులలో ఏ దేశమూ ఒక నిర్ణయాత్మక విజయానికి చేరుకోలేదు. కేవలం ఒకదానిపై ఒకటి ఆధిపత్యం ప్రదర్శించేందుకు ప్రయత్నిస్తున్నాయే తప్ప, యుద్ధం నుంచి బయటపడే మార్గాలను ఎవరూ అన్వేషించడం లేదు. దీని వల్ల మానవతా సంక్షోభం మరింత ముదురుతోంది.
ఆకాశంలో యుద్ధం కంటే కూడా, గల్ఫ్ ప్రాంతంలో గగనతలం నుంచి భద్రతా సమస్యలు తలెత్తుతున్నాయి. డ్రోన్, క్షిపణి దాడుల కారణంగా వాణిజ్య విమానయానానికి అంతరాయం ఏర్పడుతోంది. ప్రాంతీయ మౌలిక సదుపాయాలు దెబ్బతినడం, గల్ఫ్ ఆర్థిక వ్యవస్థలను కుదిపేస్తోంది. ఈ నష్టాలను పూడ్చడానికి సంవత్సరాల సమయం పడుతుందని అంచనా. ముఖ్యంగా ఇంధన రంగం దెబ్బతినడం వల్ల ఆయా దేశాల రెవెన్యూలు భారీగా పడిపోయాయి. ఇది గల్ఫ్ దేశాల్లో పని చేస్తున్న వలస కార్మికుల జీవితాలపై కూడా ప్రభావం చూపుతోంది.
యుద్ధం వంద రోజులను దాటినా, ముగింపు మాత్రం మృగ్యమైంది. చర్చలు ఎటువైపు సాగుతాయో తెలియని పరిస్థితి నెలకొంటుంది. అధ్యక్షుడు ట్రంప్ తన వ్యూహాలను 'గ్రేట్ సక్సెస్' గా అభివర్ణిస్తుండగా, క్షేత్రస్థాయిలో పరిస్థితి మాత్రం దారుణంగా తయారైంది. రాబోయే రోజుల్లో దౌత్య పరమైన మలుపులే ఈ యుద్ధానికి ముగింపు పలకాలి, లేదంటే ఈ ప్రాంతం మరిన్ని సంక్షోభాల్లో మునిగిపోవడం ఖాయం. ఆయుధాల ద్వారా విజయం అసాధ్యమని గ్రహించి, సంప్రదింపులకే మొగ్గు చూపాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
యుద్ధం ప్రారంభమైన మొదటి 6 రోజుల్లో 11.3 బిలియన్ డాలర్లు నష్టం చేకూరగా.. ప్రస్తుతానికి ఆ నష్టం 630 బిలియన్ డాలర్లకు చేరింది. ఒకవేళ పశ్చిమాసియాలో యుద్ధం ఇలానే కొనసాగితే 1 ట్రిలియన్ డాలర్ల మేర ప్రపంచానికి నష్టం వాటిల్లే అవకాశం ఉంది. మరోవైపు అంతర్జాతీయ చమురు ధరలు బ్యారెల్‌కు 100 డాలర్ల మార్క్‌ను ఎప్పుడో దాటేసింది. ఇంధన ధరల పెరుగుదల కారణంగా ప్రపంచవ్యాప్తంగా నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి.
దౌత్యపరమైన సంక్షోభం..
పాకిస్థాన్ మధ్యవర్తిత్వంతో ఏప్రిల్ నెలలో కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం ఇప్పుడు అటకెక్కింది. అమెరికా ప్రతినిధులతో చర్చలకు ఇరాన్ నిరాకరిస్తోంది. 'బంతి ఇప్పుడు ట్రంప్ కోర్టులోనే ఉంది' అంటూ ఇరాన్ తన పాత డిమాండ్లను ముందుంచుతోంది. ముఖ్యంగా స్తంభించిపోయిన తమ విదేశీ ఆస్తులను విడుదల చేయాలని, లెబనాన్‌లో శాంతిని నెలకొల్పాలని ఇరాన్ షరతులు విధిస్తోంది.
హెజ్బొల్లా దళాలు ఇజ్రాయెల్‌పై సరిహద్దు దాడులను ముమ్మరం చేయగా, ఇజ్రాయెల్ దళాలు లెబనాన్ భూభాగంలో సైనిక చర్యలను కొనసాగిస్తున్నాయి. ఈ వంద రోజుల్లో సంభవించిన ప్రాణనష్టం విపరీతంగా ఉంది. ఇరాన్ కు చెందిన 3,400 మంది మృతి చెందగా.. లెబనాన్‌లో 3,500 మందిపైగా మరణించారు.
డ్రోన్, క్షిపణి దాడుల కారణంగా గల్ఫ్ ప్రాంతంలో వాణిజ్య విమానయానానికి తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. అక్కడి మౌలిక సదుపాయాలు దెబ్బతినడం వల్ల గల్ఫ్ దేశాల రెవెన్యూలు భారీగా పడిపోయాయి. ఇది అక్కడ పని చేస్తున్న లక్షలాది మంది వలస కార్మికుల జీవితాలను అతలాకుతలం చేస్తోంది.
యుద్ధం వంద రోజులను దాటినా ముగింపు మాత్రం కనిపించడం లేదు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తన వ్యూహాలను 'గ్రేట్ సక్సెస్' గా అభివర్ణిస్తున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో మానవతా సంక్షోభం మరింత ముదురుతోంది. ఆయుధాల ద్వారా విజయం అసాధ్యమని గ్రహించి, ఇరు దేశాలు దౌత్యపరమైన సంప్రదింపులకే మొగ్గు చూపకపోతే ఈ ప్రాంతం మరింత సంక్షోభంలో మునిగిపోవడం ఖాయం.
Also Read; సహారా ఎడారిలో హృదయ విదారక ఘటన.. నీరు దొరక్క దాహంతో అలమటిస్తూ 49 మంది మృతి
Also Read; పాకిస్థాన్‌లో భారీగా తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు.. ప్రస్తుతం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
School Holidays: టీచర్ల సంఘం తీవ్ర ఆగ్రహం.. స్కూళ్ల సెలవుల పొడగింపుపై దుమారం
Baddipadaga, Telangana:Summer School Holidays: విద్యార్థులకు పాఠశాలల సెలవులపై తెలంగాణలో తీవ్ర దుమారం రేపుతోంది. వేసవికాల సెలవులను ప్రభుత్వం పొడిగించడంపై తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. విద్యార్థుల తల్లిదండ్రులు కూడా సెలవుల పొడిగింపుపై ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా.. తాజాగా ఉపాధ్యాయ సంఘాలు కూడా మండిపడుతున్నాయి. అకస్మాత్తుగా సెలవులను ఎలా పొడిగిస్తారని నిలదీస్తున్నాయి. ప్రభుత్వం స్కూళ్లకు సెలవులు పొడగిస్తూ తీసుకున్న నిర్ణయంపై విస్మయం వ్యక్తం చేశారు. సెలవుల పొడగింపు అనవసరమని తెలంగాణ రాష్ట్ర టీచర్స్ ఫెడరేషన్ (టీఆర్టీఎఫ్) ప్రకటించింది.
తెలంగాణలో జూన్ 12వ తేదీన పునఃప్రారంభం కావాల్సి ఉన్న పాఠశాలలకు విద్యాశాఖ అకస్మాత్తుగా సెలవులను మరో మూడు రోజులు పొడిగిస్తూ జారీ చేసిన ఉత్తర్వులు తమకు తీవ్ర విస్మయానికి గురిచేశాయని టీఆర్టీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కటకం రమేశ్, ప్రధాన కార్యదర్శి మారెడ్డి అంజి రెడ్డి తెలిపారు. పాఠశాలల సెలవుల పొడగింపుపై స్పందిస్తూ ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వ ఉత్తర్వులోనైనా దానికి కారణమైన వినతిపత్రాల వివరాలు ఉండటం సహజమని, కానీ ఈ ఉత్తర్వులో పేర్కొన్న ‘వివిధ స్టేక్ హోల్డర్స్’ ఎవరు? వారు ఇచ్చిన లేఖల ప్రస్తావన విద్యాశాఖ స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో వడగాడ్పుల తీవ్రత తగ్గుముఖం పడుతున్న సమయంలో సెలవులు పొడగించడం అనవసరమని టీఆర్టీఎఫ్ ప్రతినిధులు కటకం రమేశ్, మారెడ్డి అంజి రెడ్డి అభిప్రాయపడ్డారు. అదనపు సెలవులు పూర్తిగా అనవసరమని ప్రకటించారు. ఇలాంటి అనాలోచిత నిర్ణయాలతో సమాజంలో ‘ఉపాధ్యాయులకు సెలవులే సెలవులు’ అనే ఒక తప్పుడు భావన ఏర్పడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
ఇప్పటికే ఉపాధ్యాయులు తీవ్రమైన ఎండలను కూడా లెక్కచేయకుండా ‘బడిబాట’ వంటి ప్రభుత్వ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారని టీఆర్టీఎఫ్ ప్రతినిధులు కటకం రమేశ్, మారెడ్డి అంజి రెడ్డి తెలిపారు. జూన్ 12వ తేదీన కూడా టీచర్లు బడుల్లోనే ఉండి విధులను నిర్వహించబోతున్నారని గుర్తుచేశారు. గడిచిన కొద్ది నెలలుగా పదో తరగతి పరీక్షలు, సెన్సెస్ (జనగణన) విధులు, బడిబాట కార్యక్రమాలు, హెల్త్ కార్డు వివరాలు అప్లోడింగ్, సర్వీస్ రిజిస్టర్ల ఆన్లైన్ అప్లోడింగ్ వంటి నిరంతర ఆఫీస్ ఒత్తిళ్లతో టీచర్లు గడిపారని వివరించారు. మే, జూన్ నెలల్లో ఉపాధ్యాయులకు కంటిమీద కునుకు లేకుండా పోయిందని టీఆర్టీఎఫ్ ప్రతినిధులు కటకం రమేశ్, మారెడ్డి అంజి రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
ఇంత శ్రమిస్తున్న ఉపాధ్యాయులపై, ఏమాత్రం సంబంధం లేని వేసవి సెలవుల పొడగింపు సర్దుబాటు భారాన్ని మోపుతూ.. జూలై నెలలో ఉన్న ఒక్కగానొక్క ‘రెండో శనివారాన్ని’ పనిదినంగా మార్చడం ఎంతవరకు సమంజసమని టీఆర్టీఎఫ్ ప్రతినిధులు కటకం రమేశ్, మారెడ్డి అంజి రెడ్డి ప్రశ్నించారు. నిర్ణయం వెనుక ఉన్న అసలు కారణాలను బహిర్గతం చేసి విద్యావ్యవస్థలో పారదర్శకతను కాపాడాలని టీఆర్టీఎఫ్ ప్రతినిధులు కటకం రమేశ్, మారెడ్డి అంజి రెడ్డి కోరారు.
Revanth Reddy: వంద రోజుల్లో మూసీ నదీ ఫేజ్-2 పనులకు శ్రీకారం: రేవంత్ రెడ్డి
Hyderabad, Telangana:Musi River Project: హైదరాబాద్‌ను అంతర్జాతీయ నగరం అని చెప్పుకుంటే సరిపోదు. ఆ స్థాయిలో అభివృద్ధి జరగాలని తెలంగాణ ముఖ్యమంత్రి గుర్తుచేశారు. హైదరాబాద్ నగరంలో 122 కి.మీ మేరకు అన్ని వైపుల మెట్రోను విస్తరించాల్సిన అవసరం ఉంది. నాగోల్ నుంచి ఎల్పీనగర్, ఓవైసీ హాస్పిటల్ మీదుగా అంతర్జాతీయ విమానాశ్రయం వరకు, ఎల్బీనగర్ నుంచి హయత్ నగర్ వరకు విస్తరిస్తాం' అని రేవంత్ రెడ్డి తెలిపారు. మెట్రో విస్తరణకు రాష్ట్రం నుంచి కేంద్ర ప్రభుత్వంలో ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రులు ఎందుకు సహకరించడం లేదని ప్రశ్నించారు. మెట్రోతో పాటు రీజినల్ రింగ్ రోడ్డు, మూసీ ప్రక్షాళన వంటి నగర అభివృద్ధి కార్యక్రమాలకు సహకరించాలని కోరారు. నగర అభివృద్ధిలో ఈ ప్రాంత ప్రజాప్రతినిధులందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
Also Read: Kishan Reddy: నా నిబద్ధతపై రేవంత్ రెడ్డి సర్టిఫికెట్ అవసరం లేదు: కిషన్ రెడ్డి
హైదరాబాద్‌లోని ఉప్పల్ భగాయత్‌లో మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాకు సంబంధించి రూ.1,511 కోట్ల అభివృద్ది పనులకు శంకుస్థాపన చేసిన అనంతరం రేవంత్ రెడ్డి కీలక ప్రసంగం చేశారు. నాగోల్ నుంచి గౌరెల్లి వరకు మూసీ నది ప్రక్షాళన ఫేజ్-2 కు వంద రోజుల్లో పనులు ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. మూసీ నది పునరుజ్జీవం కోసం తొలి దశగా గండిపేట నుంచి గాంధీ సరోవర్ వరకు పనులు ప్రారంభించగా.. మరో దశగా నాగోల్ నుంచి గౌరెల్లి వరకు కార్యాచరణకు శ్రీకారం చుట్టాలని తెలిపారు.
'గుజరాత్లో సబర్మతి రివర్ ఫ్రంట్, ఢిల్లీలో యమనా రివర్ ఫ్రంట్, యూపీలో గంగానది ప్రక్షాళన చేసుకున్నప్పుడు మూసీ నదిని ఎందుకు ప్రక్షాళన చేయొద్దు. 55 కిలోమీటర్ల మూసీ నదిని ప్రక్షాళన చేసుకుంటే హైదరాబాద్ నగరం అభివృద్ధి సాధించడమే కాకుండా యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి' అని రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. మూసీ పరివాహక ప్రాంతంలో ప్రజలు దుర్భర పరిస్థితులను అనుభవిస్తున్నారని చెప్పారు.
Also Read: Harish Rao: చంద్రబాబుకు డూడూ బసవన్నలా రేవంత్ రెడ్డి తలూపుతుండు: హరీశ్ రావు
'నివసించడానికి ఏమాత్రం వీలులేకుండా కాలుష్యంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు విపరీతమైన వ్యర్థాలు, పారిశ్రామిక కాలుష్యం, కళేబరాలతో విషయం నల్గొండ ప్రజల జీవితాలను కాటేస్తోంది. నల్గొండ జిల్లాలో ఒకవైపు ఫ్లోరైడ్, మూసీ కాలుష్యంతో దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. అలాంటప్పుడు మూసీ నదిని ప్రక్షాళన చేయాల్సిన అవసరం లేదా? ఏ పేదవాడికి అన్యాయం చేయం. ఏ పేదవాడిని నిరాశ్రయులుగా చేయబోం. ఇళ్లు కోల్పోయిన వారికి ఇళ్లు ఇస్తాం. వారి పిల్లలకు మంచి చదువులు చెప్పిస్తాం' అని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.
అభివృద్ధికి అడ్డంకిగా
ఈ మల్కాజిగిరి ప్రాంతం పంచాయతీలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, గ్రేటర్ హైదరాబాద్‌తో కలిసి నాలుగు రకాల పరిపాలన జరిగేది. ఒకరి మధ్య మరొకరికి సమన్వయం లేక అభివృద్ధికి అడ్డంకిగా మారింది. అంతర్జాతీయ నగరం అని చెప్పుకోవడం కాకుండా అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి జరిగినప్పుడే గుర్తింపు వస్తుంది' అని తెలంగాణ సీఎం పేర్కొన్నారు. ఓఆర్ఆర్ లోపల 1.34 కోట్ల మంది ప్రజలు, వివిధ అంతర్జాతీయ కంపెనీలు ఏర్పాటవుతున్న సందర్భంగా ప్రజలకు మౌలిక సదుపాయాలు, మెట్రో, విద్యుత్, పోలీసు, మురుగునీటి పారుదల, మూసీ ప్రక్షాళన జరగాల్సిన అవసరం ఉందని వెల్లడించారు.
మెట్రో విస్తరణ
పరిపాలనా సౌలభ్యం కోసం జీహెచ్ఎంసీని హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి మూడు కార్పొరేషన్లుగా వికేంద్రీకరించినట్టు రేవంత్ రెడ్డి తెలిపారు. ఇదే పద్ధతిలో పోలీసు వ్యవస్థను కూడా వికేంద్రీకరించామని చెప్పారు. మల్కాజిగిరి నియోజకవర్గం పరిధిలో మెట్రో విస్తరణతో పాటు ప్రతి పనిని చేసే బాధ్యత తీసుకుంటానని హామీ ఇచ్చారు. ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఎన్ని నిధులు కావాలన్నా ఇచ్చే బాధ్యత తనదని ప్రకటించారు.
శంకుస్థాపనలు ఇవే!
ఉప్పల్ భగాయత్ లే అవుట్లో రూ.1,511 కోట్ల అభివృద్ది పనులకు శంకుస్థాపన
==> 10 ఎకరాల్లో 98 కోట్లతో నిర్మించే మల్కాజ్గిరి మునిసిపల్ కార్పొరేషన్ భవన నిర్మాణం
==> రూ.960 కోట్లతో ఏఓసీ సెంటర్లో ప్రత్యామ్నాయ రోడ్ల నిర్మాణం
==> రూ.416 కోట్లతో టీకేఆర్ కాలేజ్ జంక్షన్లో 6 లేన్ల ఫ్లై ఓవర్ నిర్మాణం
==> రూ.37.50 కోట్లతో 100 పడకల మల్కాజిగిరి జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి నిర్మాణం
Kishan Reddy: నా నిబద్ధతపై రేవంత్ రెడ్డి సర్టిఫికెట్ అవసరం లేదు: కిషన్ రెడ్డి
Hyderabad, Telangana:Kishan Reddy vs Revanth Reddy: అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొని రాజకీయ ప్రసంగం చేయడమే కాకుండా తనపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన రేవంత్ రెడ్డిపై కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 'నన్ను తెలంగాణ పొలిమేరలు దాటనివ్వనని రేవంత్ రెడ్డి అంటున్నాడు. తెలంగాణ గడ్డపై నన్ను ఆపే వ్యక్తి ఎవరూ లేరు. నేనెవరో నేనేంటో తెలంగాణ ప్రజలకు బాగా తెలుసు. మీ తాటాకు చప్పుళ్లకు భయపడే వ్యక్తిని కాదు' అని రేవంత్ రెడ్డికి కౌంటర్ ఇచ్చారు.
ఉప్పల్ భగాయత్‌లో జరిగిన సమావేశంలో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ కిషన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డికి తన వ్యాఖ్యలతో బుద్ధి చెప్పారు. తాను రేవంత్ రెడ్డిలా పార్టీలు మారలేదని కౌంటర్ ఇచ్చారు. 'పన్నెండు పార్టీలు తిరిగి బీజేపీలోకి వచ్చిన వ్యక్తిని కాదు. బీజేపీలోనే పుట్టి.. ఈ పార్టీలోనే రాజకీయ జీవితాన్ని ప్రారంభించా. బీజేపీలోనే కొనసాగుతా' అని కిషన్ రెడ్డి ప్రకటించారు.
వ్యక్తిగత స్థాయికి దిగజారి ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి రేవంత్ రెడ్డి ఇలా మాట్లాడం సరికాదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హితవు పలికారు. ఇది ప్రజాస్వామ్యానికి కూడా మంచిది కాదని సూచించారు. 'నా గురించి ఇలా మాట్లాడటం తెలంగాణ సమాజం గమనిస్తోంది. తెలంగాణ కోసం నేను చేసిన పనులకు రేవంత్ రెడ్డి సర్టిఫికెట్ ఇవ్వాల్సిన అవసరం లేదు' అని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. కేంద్ర మంత్రిగా తెలంగాణ కోసం తీసుకొచ్చిన ప్రాజెక్టులు, నిధులు, అభివృద్ధి కార్యక్రమాలు తెలంగాణ ప్రజలకు తెలుసు అని పేర్కొన్నారు. భారతీయ జనతా పార్టీకి ప్రజల్లో పెరుగుతున్న ఆదరణ, విశ్వాసమే గత పార్లమెంట్ ఎన్నికల ఫలితాల్లో ప్రతిబింబించిందని కిషన్ రెడ్డి తెలిపారు. 'తెలంగాణ ప్రజల తీర్పే మాకు సర్టిఫికెట్. తెలంగాణ ప్రజలు బీజేపీకి ఎనిమిది ఎంపీ స్థానాలు ఇచ్చి తమ విశ్వాసాన్ని చాటారు' అని గుర్తుచేశారు.
'తెలంగాణ రాజకీయ ప్రస్థానంలో అధికారం మారినా ప్రజల ఆకాంక్షలు మాత్రం నెరవేరడం లేదు. అడ్డగోలుగా అబద్ధపు హామీలు, చేతగాని అసమర్థ పాలన, అడుగడుగునా నమ్మకద్రోహం నడుమ క్షేత్రస్థాయి సమస్యలను గాలికి వదిలి గాల్లోమేడలు కడుతూ.. విదేశాలపై వ్యామోహం చూపిస్తూ.. సొంత దేశంలో జరుగుతున్న అభివృద్ధిపై కారుకూతలు కూసిన ముఖ్యమంత్రి గ్రాఫ్ పాతాళానికి పడిపోయింది' అని 'ఎక్స్' వేదికగా కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
'ఇలాగే మాట్లాడి ప్రజాగ్రహాన్ని చవిచూసి ఇప్పుడు ఆ సీట్లో కూర్చున్న రేవంత్ రెడ్డి కూడా విదేశీ భాషలో మాట్లాడుతూ తీవ్ర ప్రజావ్యతిరేకతను మూటగట్టుకుంటున్నాడు. రేవంత్ రెడ్డికి కూడా.. పదవీ పోక తప్పదు. అదేగతి తప్పదు' అని కిషన్ రెడ్డి తెలిపారు. ఉదయం యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ఆలయాన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దర్శించుకున్నారు. స్వామి వారికి అభిషేకం చేసి ప్రత్యేక పూజలు చేశారు.
