icon-pinewzicon-zee
PINEWZ
become creator
Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back

हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|

Advertisement

Jagadish Reddy: 'బీఆర్‌ఎస్‌ పార్టీలోకి కొండా సురేఖకు నో ఎంట్రీ.. గేటు కూడా తాకనివ్వం'

Baddipadaga, Telangana:

Konda Surekha No Entry: తెలంగాణ మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌కు గురయిన మాజీ మంత్రి కొండా సురేఖ బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరే అవకాశం ఉందని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆ పార్టీ కీలక ప్రకటన చేసింది. కొండా సురేఖను తమ పార్టీలో చేర్చుకునే అవకాశం లేదని ప్రకటించింది. తమ వైపు నుంచి ఆ ప్రయత్నం చేయడం లేదని స్పష్టం చేసింది. తెలంగాణ భవన్ గేటు కూడా తాకనివ్వమని మాజీ మంత్రి జగదీశ్‌ రెడ్డి సంచలన ప్రకటన చేశారు.

హైదరాబాద్‌లోని బీఆర్‌ఎస్‌ పార్టీ ప్రధాన కార్యాలయం తెలంగాణ భవన్‌లో శుక్రవారం మాజీ మంత్రి జగదీశ్‌ రెడ్డి మాట్లాడుతూ కొండా సురేఖ మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌పై స్పందించి కీలక వ్యాఖ్యలు చేశారు. 'మాజీ మంత్రి కొండా సురేఖను బీఆర్ఎస్ పార్టీలోకి తీసుకునే ఆలోచన మాకు లేదు.. మా వైపు నుంచి ఆ ప్రయత్నం కూడా లేదు' అని తెలిపారు. తెలంగాణ భవన్ గేటు తాకనివ్వమని ప్రకటించారు. అసలు మొదలు బర్తరఫ్ చేయాల్సింది కొండా సురేఖను కాదని.. రేవంత్ రెడ్డిని బర్తరఫ్‌ చేయాలని జగదీశ్‌ రెడ్డి కౌంటర్‌ ఇచ్చారు.

'రేవంత్ రెడ్డి 1000 రోజుల పాలనలో సాధించింది ఒక మహిళా మంత్రిని బర్తరఫ్ చేయడం మాత్రమే. అది వారి అంతర్గత విషయం కానీ.. కొండా సురేఖ కూతురు లేవనెత్తిన అంశాల సంగతి ఏమిటి? కాంగ్రెస్ నాయకులు చేసిన ఎన్నో కుంభకోణాలపై మేము ఆధారాలతో సహా ఫిర్యాదులు చేసినా చర్యలు తీసుకోలేదు' అని మాజీ మంత్రి జగదీశ్‌ రెడ్డి తెలిపారు. దోపిడీ సొమ్ము పంచుకోవడంలో కొట్టుకొని దొంగలు దొరికిపోయినట్టు.. ప్రజల ముందర కాంగ్రెస్ పార్టీ దొరికిపోయిందని వివరించారు.

'దొంగతనం చేసిండని చూపించినోడిని అరెస్ట్ చేసి.. దొంగను వదిలిపెట్టే సంస్కృతి ఇవాళ మనకు కనబడుతోంది. కాంగ్రెస ప్రభుత్వ అవినీతిని ఆధారాలతో సహా కొండా ఫ్యామిలీ బయటపెట్టిందనే.. ఆమెపై చర్యలకు పాల్పడ్డారు. కానీ.. కాంగ్రెస్ ప్రభుత్వం 100 శాతం అవినీతి, కుంభకోణాలకు పాల్పడుతోంది. మేము ఇప్పటికే అనేక ఆధారాలను కేంద్ర దర్యాప్తు సంస్థలకు పంపించాం' అని మాజీ మంత్రి జగదీశ్‌ రెడ్డి వెల్లడించారు. వీటిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

'పార్టీ మారిన పది మంది ఎమ్మెల్యేల్లో ఒకరిద్దరిని తప్ప ఎవరిని తీసుకోం. ఎమ్మెల్యేల క్యారెక్టర్ ఆధారంగా వాళ్లు వస్తామంటే తీసుకుంటాం' అని మాజీ మంత్రి జగదీశ్‌ రెడ్డి తెలిపారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఇద్దరు బీఆర్ఎస్ పార్టీలోకి రావడానికి రెడీగా ఉన్నారని సంచలన ప్రకటన చేశారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అప్లికేషన్ పెట్టినా తీసుకోమని స్పష్టం చేశారు. ఎన్నికల కంటే ముందు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇద్దరూ బీఆర్ఎస్ పార్టీలోకి వస్తామంటే తీసుకోలేదని మాజీ మంత్రి జగదీశ్‌ రెడ్డి గుర్తుచేశారు.

'వచ్చే ఎన్నికల నాటికి పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజన జరగకపోయినా రెండు తెలుగు రాష్ట్రాల్లో డీ లిమిటేషన్ జరుగుతుంది. ఏపీలో చంద్రబాబుకు వ్యతిరేకత స్టార్ట్ అయింది. డీ లిమిటేషన్ జరిగితే ప్రజా వ్యతిరేకత నుంచి బయట పడవచ్చని చంద్రబాబు భావిస్తున్నారు. రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తే డబ్బులకు అమ్ముడు పోయినట్టే' అని బీఆర్‌ఎస్‌ పార్టీ సీనియర్‌ నాయకులు జగదీశ్‌ రెడ్డి తెలిపారు.

0
0
Report
Advertisement

Konda Surekha YSRCP: జగన్‌ గూటికి కొండా సురేఖ? తెలంగాణ రాజకీయాల్లో వైసీపీ కింగ్‌ మేకర్‌గా మాజీ మంత్రి కానుందా?

Hyderabad, Telangana:

Konda Surekha To Join YSRCP: తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ మంత్రివర్గం నుండి కొండా సురేఖపై వేటు వేయడం, ఆమెను క్యాబినెట్ నుండి బర్తరఫ్ చేయడం తీవ్ర ప్రకంపనలు రేపింది. ఈ ఆకస్మిక చర్య సురేఖకు తీవ్ర అసంతృప్తిని, మింగుడుపడని పరిణామాన్ని మిగిల్చింది. ఈ వివాదం తర్వాత ఆమె రాజకీయ అడుగులు ఏ దిశగా పడనున్నాయి అనే అంశంపై రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తికరమైన చర్చ మొదలైంది.

ప్రస్తుతానికి తాను కాంగ్రెస్ పార్టీని వీడబోనని, పార్టీలోనే కొనసాగుతూ ఒక సాధారణ శాసనసభ్యురాలిగా (ఎమ్మెల్యేగా) ప్రజలకు నిరంతరం సేవ చేస్తానని కొండా సురేఖ బహిరంగంగా ప్రకటించారు. అయినప్పటికీ, ఆమె భవిష్యత్ ప్రయోజనాల దృష్ట్యా ఇతర రాజకీయ ప్రత్యామ్నాయాలు, అవకాశాలను పరిశీలించే వీలుందని రాజకీయ నిపుణులు విశ్వసిస్తున్నారు. ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా ఆమె వైఎస్సార్‌సీపీ (YSRCP) తీర్థం పుచ్చుకుంటారని సరికొత్త ఊహాగానాలు పుట్టుకొచ్చాయి.

ఆ ప్రచారాల ప్రకారం.. వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి తెలంగాణలో తన పార్టీని తిరిగి బలోపేతం చేయడానికి, విస్తరించడానికి వ్యూహ రచన చేస్తున్నట్లు సమాచారం. ఈ దిశగా తెలంగాణలో పార్టీని ముందుండి నడిపించేందుకు ఒక బలమైన, సమర్థవంతమైన నాయకత్వం కోసం ఆయన అన్వేషిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే కొండా సురేఖ పార్టీలో చేరితే తెలంగాణలో వైసీపీ ఒక కొత్త 'కింగ్ మేకర్' పాత్రను పోషించే అవకాశం ఉందని కొందరు అంచనా వేస్తున్నారు. అయితే, గతంలో జగన్ వెనుక నడిచిన సమయంలో ఎదుర్కొన్న చేదు రాజకీయ అనుభవాల వల్ల, ఆమె తిరిగి వైసీపీ వైపు వెళ్లే అవకాశం లేదని విశ్లేషకులు భావిస్తున్నారు.

కానీ, క్షేత్రస్థాయిలో ఆలోచిస్తే ఈ సమీకరణాలు ప్రాక్టికల్ కాదని విశ్లేషకులు తేల్చి చెబుతున్నారు. 2014 కంటే ముందు జగన్ మోహన్ రెడ్డికి మద్దతుగా నడిచినందుకు కొండా సురేఖ మరియు ఆమె భర్త (కొండా దంపతులు) తీవ్రమైన రాజకీయ ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ఆ రోజుల్లో వారు చూపిన విధేయతకు తగిన గుర్తింపు లభించకపోగా, వారి రాజకీయ భవిష్యత్తు కూడా దాదాపు ప్రశ్నార్థకంగా మారింది. నాటి ఆ చేదు అనుభవాలను దృష్టిలో ఉంచుకుంటే, ఈ క్లిష్ట దశలో కొండా సురేఖ మళ్లీ వైసీపీ గూటికి చేరతారనేది కేవలం ఒక వదంతు లేదా రాజకీయ ఊహాగానం మాత్రమే కాగలదని విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు.

Also Read: "ఆ ప్రచారం నమ్మొద్దు" సోషల్ మీడియా 'బిగ్ అప్‌డేట్' పోస్టులపై మాజీ మంత్రి కొండా సురేఖ

Also REad: Konda Surekha Press Meet: కాంగ్రెస్‌కు కొండా సురేఖ రాజీనామా? భర్త్‌రఫ్ వార్తల నడుమ కీలక నిర్ణయం!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

 

0
0
Report

Bigg Boss Offer Rejects: బిగ్‌బాస్ ఆఫర్ తిరస్కరించిన సెలబ్రిటీలు వీళ్లే.. లక్షల్లో రెమ్యునరేషన్ ఇచ్చినా 'నో' చెప్పారట!

Hyderabad, Telangana:

Bigg Boss Offer Rejected Celebrities: తెలుగు బుల్లితెర వీక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న రియాలిటీ షో 'బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10' సెప్టెంబర్ 6వ తేదీన అంగరంగ వైభవంగా ప్రారంభం కాబోతోంది. ఈ గ్రాండ్ సీజన్‌కు టాలీవుడ్ కింగ్ నాగార్జున మరోసారి హోస్ట్‌గా వ్యవహరించి సందడి చేయనున్నారు. ఈసారి నిర్వాహకులు "ఆటలో సవాల్ కాదు.. ఆటే సవాల్" అనే సరికొత్త కాన్సెప్ట్‌తో హౌస్‌ను రూపొందించారు. అలాగే సామాన్యులను హౌస్ లోకి తీసుకెళ్లే 'అగ్ని పరీక్ష 2' విజయవంతంగా ముగిసింది. ఇందులో విజేతలుగా నిలిచిన ఆరుగురు సామాన్యులు కూడా సెలబ్రిటీలతో పాటు ఈసారి హౌస్‌లోకి అడుగుపెట్టబోతున్నారు.

అయితే, ప్రతి ఏటా బిగ్‌బాస్ హౌస్ లోకి వెళ్లే సెలబ్రిటీల గురించి పెద్ద ఎత్తున చర్చలు సాగుతుంటాయి. ఈ క్రమంలోనే నిర్వాహకులు కొందరు పాపులర్ సెలబ్రిటీలను భారీ రెమ్యునరేషన్లతో సంప్రదించినప్పటికీ, వారు ఈ ఆఫర్‌ను తిరస్కరించినట్లు వార్తలు వస్తున్నాయి. మరి ఆ విధంగా బిగ్‌బాస్ ఆఫర్‌ను తిరస్కరించిన నటీనటులు ఎవరో ఇక్కడ తెలుసుకుందాం.

1) విష్ణు (బాలు)
ఓ ఛానల్‌లో ప్రసారమవుతున్న 'గుండెనిండా గుడిగంటలు' సీరియల్ లో 'బాలు' క్యారెక్టర్‌తో విపరీతమైన ప్రేక్షకాదరణ సంపాదించుకున్న హీరో విష్ణు. ఇతనికి బిగ్‌బాస్ మేకర్స్ లక్షల్లో భారీ రెమ్యునరేషన్ ఆఫర్ చేసినప్పటికీ, అతను ఈ ఆఫర్‌ను తిరస్కరించి సీరియల్‌కే పరిమితం కావాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

2) తేజస్విని గౌడ
ప్రముఖ సీరియల్ నటి, బిగ్‌బాస్ తెలుగు మాజీ రన్నరప్ అమర్‌దీప్ చౌదరి భార్య అయిన తేజస్విని గౌడను గత రెండు మూడు సీజన్ల నుండి బిగ్‌బాస్ మేకర్స్ సంప్రదిస్తూనే ఉన్నారు. ఆమెకు ఈ షోలో పాల్గొనాలనే బలమైన ఆసక్తి ఉన్నప్పటికీ, ఆమెకున్న ఇతర సీరియల్స్ కమిట్‌మెంట్స్, కాల్ షీట్స్ అడ్డంకిగా మారడంతో ఈసారి కూడా ఆమె హౌస్‌లోకి అడుగుపెట్టలేకపోయారు.

3) దెబ్జానీ మోదక్ (దేబ్ జాన్)
'ఎన్నెన్నో జన్మల బంధం', 'సత్యభామ' వంటి సూపర్ హిట్ సీరియల్స్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు బాగా చేరువైన నటి దెబ్జానీ మోదక్. ఈసారి ఆమె బిగ్‌బాస్ హౌస్‌లోకి వెళ్లడానికి దాదాపు సిద్ధమైనప్పటికీ, ప్రస్తుతం ఆమె నటిస్తున్న ఒక ఇతర భాషా సీరియల్ అద్భుతమైన రేటింగ్‌తో నడుస్తుండటంతో, ఆ కమిట్‌మెంట్స్ వల్ల చివరి నిమిషంలో బిగ్‌బాస్ ఆఫర్‌కు 'నో' చెప్పాల్సి వచ్చింది.

4) కావ్యశ్రీ
సీరియల్ హీరోయిన్‌గా మంచి గుర్తింపు, క్రేజ్ సంపాదించుకున్న నటి కావ్యశ్రీ. ఈమెను కూడా గత రెండు సీజన్ల నుండి బిగ్‌బాస్ నిర్వాహకులు సంప్రదిస్తూనే ఉన్నారు. అయితే కావ్యశ్రీకి వ్యక్తిగతంగా ఈ రియాలిటీ షోపై పెద్దగా ఆసక్తి లేకపోవడంతో, ఆమె ఈ సీజన్ ఆఫర్‌ను కూడా చాలా సున్నితంగా తిరస్కరించినట్లు సమాచారం.

Also Read: 100 రోజులకు రూ.80 లక్షలు..బిగ్‌బాస్ చరిత్రలో అత్యధికంగా సంపాదించింది ఎవరో తెలుసా?

Also Read: బాక్సాఫీస్ వద్ద 'ఇరుముడి' ప్రభంజనం.. మెగాస్టార్ చిరు రికార్డు బ్రేక్ చేసిన రవితేజ!

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report

EPF Interest Rate: 40 ఏళ్లకే ఉద్యోగం మానేస్తున్నారా? మీ ఈపీఎఫ్ నిధులపై వడ్డీ వస్తుందా? పూర్తి వివరాలు ఇవే!

Hyderabad, Telangana:

EPF Interest Rate News: కుటుంబ అవసరాల కోసమో, లేదా ఇతర వ్యక్తిగత కారణాల వల్లో చాలామంది ఉద్యోగ జీవితానికి త్వరగానే స్వస్తి పలుకుతుంటారు. ఒకవేళ 40 ఏళ్ల వయసులోనే ఉద్యోగం మానేస్తే, అప్పటి వరకు జమ అయిన ప్రావిడెంట్ ఫండ్ (EPF) నిధులకు వడ్డీ వస్తుందా? రాదా? అనే సందేహం ఎంతో మందిలో మెదులుతుంటుంది. ఉద్యోగం లేనందున వడ్డీ నిలిచిపోతుందని భావించి, చాలామంది వెంటనే నిధులు విత్ డ్రా చేసుకుంటుంటారు. అయితే ఈ ఆందోళనలపై ఈపీఎఫ్‌ఓ తాజాగా తన అధికారిక సామాజిక మాధ్యమ వేదిక 'ఎక్స్' (ట్విట్టర్) ద్వారా వివరణ ఇచ్చింది.

58 ఏళ్లు వచ్చే వరకు వడ్డీ గ్యారెంటీ!
ఉద్యోగం మానేసినప్పటికీ ఖాతాదారునికి 58 ఏళ్ల వయసు నిండేంత వరకు ఈపీఎఫ్ నిధులపై వడ్డీ వస్తూనే ఉంటుందని ఈపీఎఫ్‌ఓ స్పష్టం చేసింది. ఖాతా 'ఇన్‌ఆపరేటివ్‌' (Inoperative) కానంత వరకు ఈ వడ్డీ ప్రయోజనం నిరంతరాయంగా లభిస్తుంది.

ఖాతా ఎప్పుడు 'ఇన్‌ఆపరేటివ్‌'గా మారుతుంది?
ఈపీఎఫ్‌ఓ నిబంధనల ప్రకారం.. ఒక ఉద్యోగి 55 సంవత్సరాల వయసులో లేదా ఆ తర్వాత పదవీ విరమణ పొందితే, ఆ తేదీ నుంచి వరుసగా 36 నెలల (3 ఏళ్ల) పాటు ఎలాంటి చందా (కాంట్రిబ్యూషన్) రాకపోతే ఆ ఖాతా ఇన్‌ఆపరేటివ్‌గా మారుతుంది. ఖాతా ఇన్‌ఆపరేటివ్‌గా మారిన తర్వాతే వడ్డీ రావడం ఆగిపోతుంది. 

కానీ, ఒకవేళ 55 ఏళ్ల వయసు కంటే ముందే (అంటే 40, 45 లేదా 50 ఏళ్లకు) ఉద్యోగం మానేసిన సందర్భాల్లో, ఆ ఖాతా 58 ఏళ్లు నిండే వరకు ఎలాంటి కాంట్రిబ్యూషన్లు లేకపోయినా ఇన్‌ఆపరేటివ్ కాదు. కాబట్టి 58 ఏళ్ల వయస్సు వచ్చే వరకు వడ్డీ కొనసాగుతూనే ఉంటుంది. అలాగే చందాదారుడు విదేశాలకు శాశ్వతంగా వలస వెళ్లినప్పుడు లేదా మరణించిన సందర్భాల్లో మాత్రమే ఖాతా ఇన్‌ఆపరేటివ్‌గా మారుతుంది.

ఈపీఎఫ్ వడ్డీ ప్రయోజనాలు ఎందుకు ముఖ్యం? 
రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఉండేందుకు ఈపీఎఫ్ అద్భుతమైన మార్గం. ప్రస్తుతం ఈపీఎఫ్‌పై 8.25 శాతం వడ్డీ లభిస్తోంది. ఏటా లభించే వడ్డీ అసలు మొత్తానికి జమ కావడం వల్ల చక్రవడ్డీ రూపంలో భారీ రాబడి లభిస్తుంది. అంతేకాదు, ఈ నిధులపై వచ్చే వడ్డీకి ఆదాయ పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. పన్ను మినహాయింపులతో కలిపి చూస్తే సుమారు 9.5% నుండి 10% వరకు రాబడి లభిస్తుంది. 

చాలా మంది ఉద్యోగులు ఈపీఎఫ్ విత్ డ్రాల్ విధానాలపై సరైన అవగాహన లేక తొందరపడి డబ్బులు డ్రా చేసుకుంటుంటారు. దీని వల్ల వడ్డీ నష్టపోవడమే కాకుండా, చేతిలో ఉన్న సొమ్ము అనవసరంగా ఖర్చయ్యే ప్రమాదం ఉంటుంది. అందుకే, అత్యవసరమైన ఆర్థిక ఇబ్బందులు లేనట్లయితే ఈపీఎఫ్ నిధులను విత్ డ్రా చేయకుండా ఉంచడం ద్వారా భవిష్యత్తు వృద్ధాప్య అవసరాల కోసం పెద్ద మొత్తాన్ని సులభంగా కూడబెట్టవచ్చు. కాబట్టి చందాదారులు ఈ నిబంధనలను గుర్తుంచుకుని సరైన నిర్ణయం తీసుకోవడం ఎంతో ప్రయోజనకరం.

(గమనిక: ఇక్కడ ఇచ్చిన సమాచారం కేవలం సదరు అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపరిచిన విశేషాలను మాత్రమే పంచుకున్నాం. దీన్ని పాటించే ముందు పూర్తి వివరాలను తెలుసుకునేందుకు అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి పూర్తి వివరాలను తెలుసుకోగలరు.)

Also Read: విద్యార్థులు ఎగిరి గంతేసే వార్త..వచ్చే వారం వరుసగా 3 రోజులు సెలవులు..ఎందుకంటే?

Also Read: "భారత్, చైనా, అమెరికా వల్లనే వరదలు వచ్చాయి": నేపాల్ ప్రధానమంత్రి బాలేంద్ర షా!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report
Advertisement

IND Vs PAK Women: రేపే భారత్ Vs పాకిస్థాన్ మధ్య పోరు..ఆసియా కప్‌ 2026లో దుబాయ్ వేదికగా హై-వోల్టేజ్ మ్యాచ్

Hyderabad, Telangana:

IND Vs PAK Women Asia Cup 2026: ఆసియా కప్ 2026 టోర్నమెంట్‌లో క్రికెట్ ప్రేమికులకు అసలైన వినోదాన్ని పంచే మ్యాచ్‌కు సమయం ఆసన్నమైంది. హర్మన్‌ప్రీత్ కౌర్ నేతృత్వంలోని టీమిండియా, సెప్టెంబర్ 5వ తేదీ శనివారం నాడు దుబాయ్ వేదికగా చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో తలపడనుంది. గ్రూప్ 'ఎ'లో ఉన్న భారత మహిళల క్రికెట్ జట్టు ఇప్పటికే వరుస విజయాలతో దూసుకుపోతూ సెమీఫైనల్‌లో తన స్థానాన్ని ఖాయం చేసుకుంది. మొదటి మ్యాచ్‌లో థాయిలాండ్‌ను 94 పరుగుల తేడాతో, రెండో మ్యాచ్‌లో హాంకాంగ్‌ను 137 పరుగుల భారీ తేడాతో చిత్తు చేసి భారత్ అప్రతిహత విజయాల జోరును కనబరిచింది.

హాంకాంగ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత ఓపెనర్ స్మృతి మంధాన విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగింది. కేవలం 64 బంతుల్లోనే 7 సిక్సర్లు, 14 ఫోర్లతో 124 పరుగులు చేసి చారిత్రాత్మక సెంచరీని నమోదు చేసింది. మంధాన సెంచరీతో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 193 పరుగుల భారీ స్కోరు సాధించింది.

అనంతరం 194 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన హాంకాంగ్ జట్టును భారత బౌలర్లు వణికించారు. కేవలం 56 పరుగులకే హాంకాంగ్‌ను ఆలౌట్ చేసి అద్భుత విజయాన్ని అందుకున్నారు. భారత బౌలర్లలో దీప్తి శర్మ 3 వికెట్లతో రాణించగా, ప్రేమా రావత్, నందిని శర్మ, శ్రీ చరణి చెరో రెండు వికెట్లు పడగొట్టి జట్టు విజయానికి తోడ్పడ్డారు.

సెమీఫైనల్స్ ప్రారంభం కావడానికి ముందే గ్రూప్ స్టేజ్‌లో భారత్ తన చివరి లీగ్ మ్యాచ్‌ను సాంప్రదాయ ప్రత్యర్థి అయిన పాకిస్తాన్‌తో ఆడనుంది. దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా సాగే ఈ రసవత్తర పోరు శనివారం రాత్రి భారత కాలమానం ప్రకారం 8:00 గంటలకు (టాస్ రాత్రి 7:30 గంటలకు) ప్రారంభం కానుంది.

ఈ మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారాన్ని టీవీలో సోనీ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో, మొబైల్ లేదా వెబ్‌సైట్‌లో సోనీ లివ్ యాప్ ద్వారా వీక్షించవచ్చు. హర్మన్‌ప్రీత్ కౌర్, స్మృతి మంధాన, దీప్తి శర్మలతో కూడిన భారత జట్టు ఎంతో పటిష్టంగా కనిపిస్తుండగా.. ఫాతిమా సనా నేతృత్వంలోని పాకిస్తాన్ జట్టు కూడా గట్టి పోటీ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది.

ఇరు జట్ల ప్లేయర్స్ వివరాలు..
భారత మహిళల జట్టు: హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన, దీప్తి శర్మ, రాధా యాదవ్, అరుంధతి రెడ్డి, భారతి ఫుల్మాలి, రేణుకా సింగ్, షెఫాలీ వర్మ, రిచా ఘోష్, కమాలిని, నందిని శర్మ, ప్రతీక్ రావుల్, క్రాంతి గౌడ్, శ్రీ చరణి, ప్రేమా రావత్.

పాకిస్తాన్ మహిళల జట్టు: ఫాతిమా సనా (కెప్టెన్), ఆయేషా జాఫర్, నష్రా సంధు, గుల్ ఫిరోజా, మునీబా అలీ, వహీదా అక్తర్, తుబా హసన్, సాదియా ఇక్బాల్, ఉమ్మే హనీ, సదాఫ్ షామ్స్, మోమినా రియాసత్, ఐమన్ ఫాతిమా, సాయిరా జబీన్, షైవాల్ జుల్ఫికర్, ఈమాన్ నసీర్.

Also Read: గౌతమ్ గంభీర్‌కు బీసీసీఐ చెక్..ఆసియా గేమ్స్‌లో హెడ్‌ కోచ్‌‌గా వీవీఎస్ లక్ష్మణ్!

Also Read: 2027 ప్రపంచకప్‌కు ముందే రోహిత్ శర్మ రిటైర్మెంట్? హిట్‌మ్యాన్ అంగీకారం..నేడు కీలకభేటీ

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report

Tirumala: తిరుమల శ్రీవారి సేవలో సాయికుమార్‌, సీఎం రమేశ్‌ కుటుంబం

Tirupati Urban, Andhra Pradesh:

Tirumala VIPs Darshan: శ్రీకృష్ణాష్టమి రోజు తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. వారాంతం కావడం.. వరుస సెలవులు రావడంతో తిరుమల క్షేత్రానికి భక్తులు పోటెత్తారు. భక్తులు భారీ సంఖ్యలో రావడంతో తిరుమల కొండలు కిటకిటలాడాయి. ఇక సాధారణ భక్తులతోపాటు పలువురు ప్రముఖులు కూడా తిరుమలకు వచ్చారు. సినీ, రాజకీయ తదితర రంగాల ప్రముఖులు స్వామివారి సేవలో పాల్గొన్నార.

తిరుమల శ్రీవారిని శుక్రవారం ఉదయం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. వీఐపీ బ్రేక్ సమయంలో శ్రీవారి సేవలో పలువురు ప్రముఖులు ఉన్నారు. యానాం మాజీ మంత్రి మల్లాది కృష్ణారావు, సినీ నటుడు సాయికుమార్, నటుడు ఆది కుటుంబసభ్యులు, నటి జ్యోతి శ్రీవారిని దర్శించుకున్నారు. వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో స్వామివారిని దర్శించుకుని వారు మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం ఆలయ రంగనాయక మండపంలో ప్రముఖులకు టీటీడీ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.

ఇక శ్రీవారి అభిషేక సేవలో పాల్గొని ఏపీ హైకోర్టు న్యాయమూర్తి డి. రమేష్, అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్‌ పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. అభిషేక సేవలో శ్రీవారికి నిర్వహించిన విశేష పూజా కార్యక్రమాలను వారు వీక్షించి స్వామి ఆశీస్సులు పొందారు. రంగనాయక మండపంలో శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేసి.. వేద పండితులు ఆశీర్వచనం చేశారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు శ్రీవారి దర్శన ఏర్పాట్లకు సంబంధించిన వివరాలను ప్రముఖులకు తెలిపారు.

కొనసాగుతున్న భక్తుల రద్దీ
తిరుమల శ్రీవారిని దర్శించుకునే భక్తుల సంఖ్య పెరుగుతోంది. సాధారణ రద్దీ కన్నా అధిక సంఖ్యలో భక్తులు వస్తున్నారు. నిన్న గురువారం శ్రీవారిని 68,433 మంది భక్తులు దర్శించుకున్నారు. 30,229 మంది భక్తులు శ్రీవారికి తలనీలాలు సమర్పించారు.  శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.68 కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు ప్రకటించారు. 4.08 లక్షల లడ్డూలు విక్రయించగా.. 2.73 లక్షల మంది భక్తులు అన్నప్రసాదం స్వీకరించారు. శిలాతోరణం వరకు భక్తుల రద్దీ కొనసాగుతోంది. సర్వదర్శనానికి (ఎస్‌ఎస్‌డీ టోకెన్లు లేని భక్తులు) 18 నుంచి 24 గంటల సమయం పడుతుందని టీటీడీ అధికారులు వెల్లడించారు.

కాళహస్తీశ్వరుడి ఆలయంలో ఎంపీ రమేశ్‌
శ్రీకాళహస్తి ఆలయాన్ని ఎంపీ సీఎం రమేష్ కుటుంబసభ్యులతో కలిసి దర్శించుకున్నారు. అనంతరం జ్ఞానప్రసూనాంబ అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఆయనకు స్థానిక ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి, ఆలయ ఈవో బీకే వెంకటేశ్వర్లు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేయించారు. దర్శనాంతరం ఎంపీ రమేశ్‌ మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రసాద్ పథకం ద్వారా మరిన్ని నిధులు తీసుకువచ్చి శ్రీకాళహస్తి ఆలయాన్ని మరింత అభివృద్ధి చేస్తామని తెలిపారు.

0
0
Report

Konda Surekha News: "ఆ ప్రచారం నమ్మొద్దు" సోషల్ మీడియా 'బిగ్ అప్‌డేట్' పోస్టులపై మాజీ మంత్రి కొండా సురేఖ స్పష్టత

Hyderabad, Telangana:

Konda Surekha Big Update: సోషల్ మీడియా వేదికలలో తన పేరుతో జరుగుతున్న విస్తృత ప్రచారాలపై మాజీ మంత్రి కొండా సురేఖ తీవ్రంగా స్పందించారు. కొండా సురేఖ పేరుతో ఉన్న ఒక ఫేస్‌బుక్‌ ఖాతాలో ఇటీవలే ఒక ఆసక్తికరమైన పోస్టు ప్రత్యక్షమైంది. అందులో "త్వరలో బిగ్‌ అప్‌డేట్‌ ఉంటుంది. 'వెయిట్‌ ఈజ్‌ ఆల్‌మోస్ట్‌ ఓవర్‌'.." (త్వరలోనే ఒక పెద్ద సమాచారం రాబోతోంది, నిరీక్షణ దాదాపు ముగిసింది) అంటూ రాసి ఉంది. 

ఈ పోస్టు వివిధ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో చాలా వేగంగా వైరల్‌గా మారింది. ఈ పోస్టు చూసిన నెటిజన్లు, ఆమె అభిమానులు, ప్రజలు ఆమె నుండి రాబోయే ఆ పెద్ద అప్‌డేట్ ఏమై ఉంటుందా అని చాలా ఆసక్తిగా చర్చించుకోవడం ప్రారంభించారు. ఈ ప్రచారం కాస్తా పెద్ద ఎత్తున ఊపందుకోవడంతో ప్రజలలో కొంత అనిశ్చితి, గందరగోళం నెలకొంది.

ఈ విధంగా తన పేరుతో జరుగుతున్న ప్రచారంపై మాజీ మంత్రి కొండా సురేఖ స్వయంగా వివరణ ఇచ్చారు. తన పేరుతో వస్తున్న ఆ ప్రచారాన్ని ఆమె పూర్తిగా కొట్టిపారేశారు, తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు ఆమె సోషల్ మీడియా వేదికగా ఒక అధికారిక వివరణాత్మక ప్రకటనను విడుదల చేశారు. తన పేరుతో సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న అటువంటి పోస్టులతో తమకు ఎలాంటి సంబంధం లేదని ఆ ప్రకటనలో ఆమె చాలా స్పష్టంగా తేల్చి చెప్పారు. ఈ అవాస్తవ ప్రచారాలను ఎవరూ నమ్మవద్దని కోరారు.

ఈ సందర్భంగా ఆమె ప్రజలకు, ప్రసార మాధ్యమాలకు ఒక ముఖ్యమైన విజ్ఞప్తి చేశారు. "వివిధ సోషల్ మీడియా వేదికల్లో నా పేరుతో ప్రసారమవుతున్న పోస్టులతో మాకు ఎలాంటి సంబంధం లేదు. మీడియా ప్రతినిధులు, ప్రజలు కేవలం మా అధికారిక ఖాతాల ద్వారా వచ్చే సమాచారాన్ని మాత్రమే ప్రామాణికంగా తీసుకోవాలని కోరుతున్నాం" అని కొండా సురేఖ స్పష్టం చేశారు.

సోషల్ మీడియాలో అనధికారిక పోస్టులు, తప్పుడు సమాచార వ్యాప్తి పెరిగిపోతున్న తరుణంలో, నకిలీ లేదా అనధికారిక ఖాతాల నుండి వచ్చే అటువంటి సమాచారాన్ని నమ్మి మోసపోవద్దని ఆమె హెచ్చరించారు. ప్రజలందరూ, పత్రికా ప్రతినిధులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కోరారు. 

కేవలం తన అధికారిక సామాజిక మాధ్యమ ఖాతాల నుండి వెలువడే ప్రకటనలను మాత్రమే నిజమైనవిగా, అధికారిక సమాచారంగా పరిగణించాలని కోరారు. ఈ తాజా స్పష్టతతో కొండా సురేఖ పేరుతో సోషల్ మీడియాలో జరుగుతున్న ఆ 'బిగ్ అప్‌డేట్' ప్రచారానికి, తప్పుడు వార్తలకు పూర్తిగా తెరపడినట్లయింది.

Also Read: Konda Surekha Press Meet: కాంగ్రెస్‌కు కొండా సురేఖ రాజీనామా? భర్త్‌రఫ్ వార్తల నడుమ కీలక నిర్ణయం!

Also Read: దేశవ్యాప్తంగా భారీ వర్షసూచన..రేపు స్కూళ్లకు సెలవు ఉందా? విద్యార్థులకు అలర్ట్!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report
Advertisement

DK Aruna: అంతర్గత విభేదాలే కొండా సురేఖపై వేటుకు కారణం.. కానీ బాధాకరం: డీకే అరుణ

Mahbubnagar, Telangana:

Konda Surekha Issue: మంత్రివర్గం నుంచి వేటు పడిన కొండా సురేఖపై బీజేపీ మహబూబ్‌నగర్‌ ఎంపీ డీకే అరుణ సానుకూలంగా స్పందించారు. ఆమె సీనియర్ నాయకురాలు అని.. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మంత్రివర్గంలో తామంతా కలిసి మంత్రులుగా పనిచేశామని గుర్తుచేసుకున్నారు. ఆమెపై వేటు వేయడం బాధాకరమని ప్రకటించారు. ఒక బీసీ మంత్రిపై చర్యలు తీసుకోవడం ఎంతవరకు సమంజసమని మహబూబ్‌నగర్‌ ఎంపీ డీకే అరుణ ప్రశ్నించారు.

మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలో జరిగిన పలు కార్యక్రమాల్లో బీజేపీ ఎంపీ డీకే అరుణ పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కొండా సురేఖ అంశంపై స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీలోని అంతర్గత విభేదాలే కొండా సురేఖపై వేటుకు కారణమయ్యాయని ఆరోపించారు. ఒక బీసీ మంత్రిపై చర్యలు తీసుకోవడం బాధాకరమని వ్యాఖ్యానించారు. 'కొండా సురేఖ సీనియర్ నాయకురాలు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మంత్రివర్గంలో మేమంతా కలిసి మంత్రులుగా పనిచేశాం' అని గుర్తుచేసుకున్నారు.

బీసీల కోసం నిత్యం మాట్లాడుతామని చెప్పే రేవంత్‌ రెడ్డి.. ఒక బీసీ మంత్రిపై చర్యలు తీసుకోవడం ఎంతవరకు సమంజసమని ఎంపీ డీకే అరుణ ప్రశ్నించారు. కొండా సురేఖ కుమార్తె కొండా సుష్మిత ఏదో మాట్లాడిందనే కారణంతో ఆమెపై చర్యలు తీసుకోవడం సరైన నిర్ణయం కాదని అభిప్రాయపడ్డారు. బీసీల కోసం తాము ఇంత చేశామని గొప్పలు చెప్పుకునే రేవంత్‌ రెడ్డి సురేఖ కూతురు ఏదో మాట్లాడిందని ఒక బీసీ మంత్రిపై చర్యలు తీసుకోవడం సరైనది కాదని బీజేపీ ఎంపీ డీకే అరుణ తెలిపారు. 

'ఇది బాధాకరం. అంతేకాదు.. కొండా సురేఖ బర్తరఫ్ వెనుక కాంగ్రెస్ పార్టీలోని అంతర్గత విభేదాలే కారణం. కాంగ్రెస్‌లో కొనసాగుతున్న అంతర్గత రాజకీయాలే ఈ పరిణామాలకు దారితీశాయి' అని ఎంపీ డీకే అరుణ వ్యాఖ్యానించారు. కొండా సురేఖ బర్తరఫ్ వ్యవహారంపై డీకే అరుణ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో చర్చకు దారితీస్తున్నాయి. ఒకవైపు బీసీ మంత్రిపై చర్యల అంశాన్ని ప్రస్తావిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన డీకే అరుణ.. మరోవైపు సురేఖ బర్తరఫ్‌కు అంతర్గత విభేదాలే కారణమంటూ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఒక బీజేపీ ఎంపీ వేటుకు గురయిన కొండా సురేఖపై సానుకూలంగా స్పందించడం చర్చనీయాంశంగా మారింది.

0
0
Report

Nara Lokesh: కోటి ఇళ్లకు చేరిన 'ఇంటింటికీ తెలుగుదేశం-2026'.. మంత్రి నారా లోకేశ్‌ హర్షం

Nuzendla, Andhra Pradesh:

House To House TDP Programme: అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ రెండేళ్ల పరిపాలనలో ప్రభుత్వం సాధించిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించడంలో గొప్ప మైలురాయి సాధించింది. కూటమి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ఇంటింటికి వివరించడంలో భాగంగా టీడీపీ ప్రత్యేక కార్యక్రమం నిర్వహించింది. ఇంటింటికి తెలుగుదేశం పార్టీ-2026 కార్యక్రమం నిర్వహించగా ఆ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది. తాజాగా ఆ కార్యక్రమం కోటి ఇళ్లకు పైగా చేరింది. దీంతో నారా లోకేశ్‌ హర్షం వ్యక్తం చేస్తూ 'ఎక్స్‌' వేదికగా కీలక ప్రకటన చేశారు.

'కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించడంలో తెలుగుదేశం పార్టీ గొప్ప మైలురాయి సాధించింది' అని టీడీపీ జాతీయ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి నారా లోకేశ్‌ తెలిపారు. 'ఇంటింటికీ తెలుగుదేశం-2026' కార్యక్రమం  విజయవంతంగా కోటికి పైగా ఇళ్లకు తీసుకెళ్లిన కార్యకర్తలు, నాయకులకు అభినందనలు తెలిపారు. ఇంటింటి పర్యటనల్లో కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలను కలిసి వివరించిన తీరు చాలా బాగుంది అని పార్టీ శ్రేణులను అభినందించారు. కోటి ఇళ్లు సందర్శించడమే కాకుండా ఆయా కుటుంబాల సమస్యలు, స్థానిక అవసరాలు, ప్రభుత్వ పథకాలపై వారి అభిప్రాయాలను తెలుసుకుని ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చిన తెలుగుదేశం కుటుంబానికి మంత్రి నారా లోకేశ్‌  ధన్యవాదాలు తెలిపారు.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా టీడీపీ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి నారా లోకేశ్‌ ఇంటింటి ప్రచారం చేపట్టాలని పార్టీ శ్రేణులకు సూచించారు. జూలై 27వ తేదీ నుంచి 45 రోజుల పాటు నిరంతరాయంగా 'ఇంటింటికి టీడీపీ' కార్యక్రమం నిర్వహించాలని ప్రకటించారు. ఈ కార్యక్రమం ప్రారంభానికి ముందు జూలై 26వ తేదీన పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వ విజయాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని స్థానాలూ గెలవడమే లక్ష్యంగా పనిచేయాలని తెలుగు తమ్ముళ్లకు సూచించారు.

కూటమి ప్రభుత్వం రెండేళ్లలో సాధించిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను టీడీపీ శ్రేణులు ఇంటింటికి చేర్చడంలో భాగమయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో గ్రామ గ్రామాన నాయకులు తిరిగి కూటమి ప్రభుత్వం 'సూపర్ సిక్స్' హామీల అమలు, రైతు సంక్షేమం, మహిళా సాధికారత, యువతకు ఉపాధి అవకాశాలు వంటి అంశాలను ప్రజలకు వివరించారు. వైఎస్సార్‌సీపీ పాలనకు, కూటమి పాలనకు మధ్య ఉన్న తేడాను వివరిస్తూ ప్రజల్లోకి వెళ్లారు. అయితే నిర్దేశిత గడువుకు ముందే ఇంటింటికి టీడీపీ కార్యక్రమం లక్ష్యం పూర్తి కావడంతో తెలుగుదేశం పార్టీ అధిష్టానం హర్షం వ్యక్తం చేస్తోంది. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులకు మంత్రి నారా లోకేశ్‌ అభినందించారు.

0
0
Report

10 అడుగుల భారీ కోబ్రాతో స్నేక్ క్యాచర్ స్టంట్స్.. వీడియో వైరల్!

Hyderabad, Telangana:

 Giant 10-foot Cobra Snake Video Viral: సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు అద్భుతమైన.. వింతైన కంటెంట్ చెక్కర్లు కొడుతూ అందరిని ఆశ్చర్యపరుస్తూ ఉంటుంది. ముఖ్యంగా ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన విష సర్పాల వీడియోలు వస్తే.. సోషల్ మీడియా వినియోగదారులు ఎంతగానో ఆసక్తిగా వాటిని చూసి ఇతరులకు కూడా షేర్ చేస్తూ ఉంటారు. అయితే, తాజాగా సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న ఒక వీడియో మాత్రం వీక్షకులను ఆశ్చర్యపరచడమే కాకుండా తీవ్ర ఆందోళనను రేకెత్తిస్తోంది.. ఏకంగా 10 అడుగులకు పైగా పొడవున్న భారీ కోబ్రాతో ఒక స్నేక్ క్యాచర్ చేసిన సాహసోపేతమైన విన్యాసాలు ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. అంతేకాకుండా ఇప్పుడు ఈ ఘటన సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. దీనికి సంబంధించిన అన్ని వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. 

పడగ విప్పిన మృత్యువుతో విన్యాసం..
నివాస ప్రాంతాల్లోకి అనుకోకుండా వచ్చిన భారీ కోబ్రాను పట్టుకోవడానికి స్థానికులు ఒక స్నేక్ క్యాచర్‌ను అక్కడికి పిలిపించారు.. ఘటనా స్థలానికి చేరుకున్న ఆ వ్యక్తి సుమారు 10 అడుగుల పొడవున్న ఆ మహాసర్పాన్ని ఎంతో సింపుల్గా పట్టుకున్నాడు.. అయితే సాధారణంగా రక్షించిన తర్వాత వెంటనే.. ఒక సురక్షితమైన బాక్సు లేదా నల్లటి సంచిలో ఎక్కించాల్సిన ఆ స్నేక్ క్యాచర్ అక్కడ అనూహ్య ప్రవర్తనతో అందర్నీ బిత్తరపోయేలా చేసాడు..

ఆ పామును ఒక చెట్టు కాండం చుట్టూ తిప్పి.. ఒక చేతితో దాని తోకను గట్టిగా పట్టుకున్నాడు.. ఆ భారీ నాగుపాము కోపంతో స్వీకరంగా బుసలు కొడుతూ.. భారీ పడగ విప్పి ఉండడం మీరు ఈ వీడియోలో స్పష్టంగా చూడొచ్చు.. ఆ వ్యక్తి ఏ మాత్రం భయపడకుండా దాంతో ఆడుకోవడం మొదలుపెట్టడం కూడా మీరు గమనించవచ్చు. అంతేకాకుండా.. అత్యంత ప్రమాదకరమైన ఆ పాము పడగపై భాగాన్ని.. తన చేతులతో మిమ్ములతో విన్యాసాలు చేశాడు. కోబ్రా ఏ క్షణంలోనైనా కాటు వేస్తే ప్రాణం పోయే ప్రమాదం ఉన్నప్పటికీ.. అతడు అత్యంత నిర్లక్ష్యంగా దానితో ప్రవర్తించిన తీరు అక్కడున్న స్థానికులు మొబైల్ కెమెరాల్లో రికార్డు చేశారు..

సోషల్ మీడియాలో వైరల్..
ఈ వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షమైన కొద్ది రోజుల్లోనే లక్షలాది వ్యూస్తో ట్రెండ్ అవుతూ వచ్చింది. అయితే, అతడు చేసిన విన్యాసాలకు వన్యప్రాణి సంరక్షకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. రెస్క్యూ అంటే వన్యప్రాణులను కాపాడటమే తప్ప.. లైకులతో పాటు వ్యూస్ కోసం వాటి ప్రాణాలతో స్టంట్ లు చేయడం కాదని వారు మండిపడుతున్నారు. అలాగే పాములను రెచ్చగొట్టడంతో పాటు వాటి ప్రవర్తనను అవమానించడం చట్టరీత్యా నేరమని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఒక క్షణం పట్టు తప్పిన ప్రాణాలు గాల్లో కలిసిపోయే ప్రమాదం ఉందని.. ఇలాంటి ప్రమాదకరమైన విన్యాసాలను ఎవరు అనుసరించవద్దని కొంతమంది ఈ వీడియో చూసి నిపుణులు సూచిస్తూ ఉన్నారు..

 
 
 
 
 

Also Read: 20 ఏళ్ల వయస్సును తగ్గించుకున్న 68 ఏళ్ల వ్యక్తి.. ఎలా సాధ్యం ఇది?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

..Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

  

0
0
Report
Advertisement
Advertisement
Back to top