ఖమ్మంలో జోరువాన
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Actress Madhavi latha shocking comments on Samantha raj nidimoru second marriage: సమంతా రాజ్ నిడిమోరులు ఇటీవల పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. కోయంబత్తురులోని ఈషా ఫౌండేషన్ లో డిసెంబర్ 1న భూతశుద్ది క్రతువుతో ఒక్కటయ్యారు. వీరి పెళ్లి వేడుక కొద్ది మంత్రి స్నేహితులు, దగ్గరి బంధువుల మధ్యలో సింపుల్‌గా జరిగింది. గతంలో జరిగిన కర్మలు మరల బాధించకుండా భూతశుద్ది క్రతువులో వీరు పెళ్లి చేసుకున్నారు. అయితే.. పెళ్లిజరిగిన నాలుగు రోజులకే సామ్ మరల షూటింగ్ కు వెళ్లారు. దీంతో సమంత డెడికేషన్ ను ఆమె అభిమానులు ప్రశంసిస్తున్నారు. సమంతకు అత్తింటి వారి నుంచి గ్రాండ్ గా వెల్ కమ్ లభించింది. తమకు ఇలాంటి కోడలు రావడం ఎంతో ఆనందంగా ఉందని రాజ్ నిడిమోరు కుటుంబ సభ్యులు ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఇదిలా ఉండగా.. పాపం.. సమంత రెండోపెళ్లి చేసుకున్న ఆనంద కొద్ది కాలం కూడా ఉండనీయకుండా కొంతమంది పనిగట్టుకుని ఆమెను ట్రోల్స్ చేసేపనిలో పడ్డారు. సమంత రాజ్ నిడిమోరును వల్లో వేసుకుందని, శ్యామిలీడేకు డైవర్స్ ఇచ్చేలా సామ్ ఒత్తిడి తీసుకొచ్చిందని కోంత మంది ట్రోల్స్ చేశారు. వారి కాపురంలో నిప్పులు పోసి రాజ్ నిడిమోరును పెళ్లి చేసుకుందని ఎవరికి నచ్చినట్లు వారు ఇష్టమున్నట్లు సమంత రెండో పెళ్లిపై ట్రోల్స్ చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా.. దీనిపై నటి, బీజేపీ మహిళ నేత మాధవీలత ఫైర్ అయ్యారు.
సమంత రెండోపెళ్లిపై ట్రోల్స్..
సమంత పెళ్లి చేసుకుంటే కొందరికి ఎందుకంత బాధ?.. ఆమె ఎవరిదో సంసారాన్ని కూల్చినట్లు మాట్లాడుతున్నారంటూ మండిపడ్డారు. ఒకరి జీవితాలు చెడగొట్టేవాళ్లు, విడాకులు ఇవ్వకుండానే మరోకరితో రొమాన్స్ లకు దిగే వాళ్లు కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తుంటే నవ్వొస్తుందన్నారు. ట్రోల్స్ చేస్తున్న వారు ఎవరు కూడా పవిత్రతలుకాదు కదా.. అంటూ గట్టిగానే ఇచ్చిపడేశారు.
అదే విధంగా.. పెళ్లిళ్లు స్వర్గంలో నిశ్చయమవుతాయని, రుణాలు తీరిపోతే ఎవ్వరైన సరే విడిపోతారని మాధవీలత వ్యాఖ్యానించారు. “ఒకరినొకరు చంపుకోవడం లేదు కదా?.. అంటూ మాధవీలత సెటైర్ లు వేశారు. సమంతపై అనవసరంగా విమర్శలు చేయడం తగదని తెల్చిచెప్పారు.
Read more: Prabhas: ప్రభాస్ హైట్‌తో ఆ విషయంలో చాలా ఇబ్బందిపడ్డా.!. బాంబు పేల్చిన బాలీవుడ్ బ్యూటీ ..
జేసీ ప్రభాకర్ రెడ్డితో గతేడాది ఫైటింగ్..
మరోవైపు మాధవీలత గతంలో తాడిపత్రిలో న్యూఇయర్ వేడుకల నేపథ్యంలో గతేడాది జేసీ ప్రభాకర్ రెడ్డి ఏర్పాటు చేసిన సెలబ్రేషన్స్ పై కాంట్రవర్సీ వ్యాఖ్యలు చేశారు. దీంతో మాధవీలత వర్సెస్ జేసీ ప్రభాకర్ రెడ్డిగా కొన్నిరోజులు రచ్చ నడిచింది. మాధవీలతపై తాడిపత్రిలో కేసు కూడా నమోదైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రస్తుతం సమంత రెండో పెళ్లి వ్యాఖ్యలతో మాధవీలత మరోసారి హాట్ టాపిక్ గా మారారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Tirupati To Shirdi Train: భారతదేశంలో అత్యంత ప్రధాన పుణ్యక్షేత్రాలు తిరుపతి, షిర్డీ. ఆదాయంలోనూ.. భక్తిభావనలోనూ.. భక్తుల రాకలోనూ ఈ రెండూ ఆలయాలు ఎప్పుడూ పోటీ పడుతుంటాయి. ఇప్పుడు ఈ రెండు ఆలయాల మరింత రాకపోకలు పెరగనున్నాయి. ఇరు క్షేత్రాలను దర్శించుకోవడానికి మార్గం సుగమమైంది. ఇప్పటికే అందుబాటులో రైల్వే సదుపాయం మరింత సులభం కానుంది. మరో కొత్త రైలును రైల్వే శాఖ ప్రకటించింది.
Also Read: Free Bus Scheme: ఆర్టీసీ ఫ్రీ బస్సుకు రెండేళ్లు పూర్తి.. తెలంగాణ ఉచిత బస్సుపై బిగ్ అప్డేట్
ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రాలు తిరుపతి - షిర్డి మధ్య భక్తుల రాకపోకలకు మరో రైలు అందుబాటులోకి వచ్చింది. ఇరు ఆధ్యాత్మిక క్షేత్రాల మధ్య కనెక్టివిటీని పెంపొందించేందుకు భారతీయ రైల్వే శాఖ కొత్త రైలును ప్రకటించడంతో భక్తులకు ప్రయాణ కష్టాలు తీరనున్నాయి. రెండు ముఖ్యమైన పుణ్యక్షేత్రాల మధ్య నూతనంగా ప్రారంభించిన తిరుపతి - సాయినగర్ షిర్డి వీక్లీ ఎక్స్‌ప్రెస్ రైలును వర్చువల్‌గా ప్రారంభించారు. ప్రతి వారం ఈ రైలు సర్వీస్ ఉంటుంది.
Also Read: Harish Rao: కేసీఆర్ అంటే పోరాటం, త్యాగం.. రేవంత్ రెడ్డి అంటే వెన్నుపోటు, ద్రోహం
ఈ నూతన రైలు సేవను కేంద్ర రైల్వే సహాయ శాఖ మంత్రి సోమన్న వర్చువల్‌గా ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్లు, భవనాలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి ఈ వీక్లీ ఎక్స్‌ప్రెస్ రైలుకు జెండా ఊపి లాంఛనంగా శ్రీకారం చుట్టారు. ఇది ఈ రెండు ప్రాంతాల మధ్య ప్రారంభించిన రెండో వీక్లీ ఎక్స్‌ప్రెస్ కావడం విశేషం. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డితో పాటు తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, దక్షిణ మధ్య రైల్వే జీఎం సంజయ్ కుమార్ శ్రీవాత్సవ తదితర ప్రముఖులు పాల్గొన్నారు. ఈ నూతన రైలు తిరుపతి నుంచి బయలుదేరి ప్రయాణ మార్గంలో గూడూరు, ఒంగోలు, గుంటూరు, సికింద్రాబాద్ మీదుగా సాయినగర్ షిర్డి చేరుకుంటుంది.
Also Read: School Holiday: రేపు అన్నీ పాఠశాలలకు సెలవు.. ఎక్కడెక్కడ ఇచ్చారో తెలుసా?
ఈ మార్గమధ్యంలో ఉన్న భక్తులకు కూడా షిర్డి సాయిబాబా దర్శనం కోసం ప్రయాణం మరింత సులభతరం కానుంది. రైల్వే శాఖ తీసుకున్న ఈ నిర్ణయంతో భక్తులలో హర్షం వ్యక్తమవుతోంది. ఈ కొత్త రైలు సేవలతో భక్తుల ప్రయాణ కష్టాలు చాలా వరకు తీరతాయని, ముఖ్యంగా వారాంతాల్లో పర్యటించే ప్రయాణికులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని రైల్వే అధికారులు తెలిపారు. ఈ మార్గంలో కనెక్టివిటీ పెరగడంతో ఏపీ, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్రల ప్రజలకు రవాణా పరంగా మంచి అవకాశం లభించనుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook