మహిళల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వ సహకారం: ఖమ్మం కలెక్టర్
ఖమ్మం కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఎర్రుపాలెం మండలం మీనవోలు గ్రామంలో ఇందిరా మహిళా డైరీపై సదస్సులో పాల్గొన్నారు. ఇందిరా మహిళాశక్తి కార్యక్రమం మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దుతుందని, వ్యాపారంపై అవగాహన, సమిష్టి సహకారంతో ముందుకు సాగాలని సూచించారు.
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Trainee Police Constables Stipend Hike: ఆంధ్రప్రదేశ్‌లో స్టైపెండరీ క్యాడెట్ ట్రైనీ పోలీస్ కానిస్టేబుళ్లకు కూటమి ప్రభుత్వం కొత్త సంవత్సరం వేళ భారీ గుడ్ న్యూస్ అందించింది. ట్రైనింగ్ లో ఉన్న కానిస్టేబుళ్లకు ఇప్పటివరకు నెలకు కేవలం రూ.4,500గా ఉన్న స్టైపెండ్‌ను ఏకంగా రూ.12,000కి పెంచుతూ హోంశాఖ బుధవారం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయంతో శిక్షణలో ఉన్న వేలాది మంది అభ్యర్థుల్లో ఉత్సాహం వెల్లివిరిసింది.
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ విడుదలైనప్పటికీ.. న్యాయపరమైన అడ్డంకులు పరిష్కరించకపోవడంతో పరీక్ష ఫలితాలు నిలిచిపోయాయి. దీని కారణంగా ఎంపికైన అభ్యర్థులు సంవత్సరాల పాటు నిరీక్షణలోనే ఉండాల్సి వచ్చింది. అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఈ అంశంపై దృష్టి సారించి, పెండింగ్‌లో ఉన్న న్యాయ సమస్యలను పరిష్కరించి ఎట్టకేలకు ఫలితాలను విడుదల చేసింది. ఫలితంగా ఎంపికైన 5,751 మంది కొత్త పోలీస్ కానిస్టేబుళ్లు డిసెంబర్ 20 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న డీటీసీలు (District Training Centres), పీటీసీలు (Police Training Centres), బీటీసీలు (Basic Training Centres)లో శిక్షణకు హాజరయ్యారు.
ఈ నేపథ్యంలో మంగళగిరిలో నిర్వహించిన ఒక కార్యక్రమంలో డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా, ట్రైనీ కానిస్టేబుళ్లకు అందిస్తున్న స్టైపెండ్ తక్కువగా ఉందన్న అంశాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై వెంటనే స్పందించిన సీఎం చంద్రబాబు అక్కడికక్కడే స్టైపెండ్‌ను నెలకు రూ.12,000కు పెంచుతున్నట్లు ప్రకటించారు. సీఎం ప్రకటనకు అనుగుణంగా హోంశాఖ మరుసటి రోజే ఉత్తర్వులు జారీ చేయడం విశేషంగా నిలిచింది.
ప్రస్తుతం రాష్ట్రంలోని 21 శిక్షణ కేంద్రాల్లో పోలీస్ కానిస్టేబుళ్ల శిక్షణ కార్యక్రమాలు సజావుగా కొనసాగుతున్నాయని పోలీస్ ట్రైనింగ్ విభాగం డీఐజీ సత్య యేసుబాబు తెలిపారు. రాబోయే రెండు నుంచి మూడు రోజుల్లో అన్ని శిక్షణ కేంద్రాల్లో ఆధునిక స్క్రీన్లు ఏర్పాటు చేసి, నిపుణుల సహకారంతో ఆన్లైన్ తరగతులు నిర్వహించనున్నట్లు చెప్పారు. అంతేకాకుండా ప్రతి ట్రైనీకి సైకోమెట్రిక్ అసెస్మెంట్ నిర్వహించి, వారి సామర్థ్యాలకు అనుగుణంగా శిక్షణ అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకెళ్తోందని స్పష్టం చేశారు. ఈ చర్యలతో పోలీస్ శాఖకు నాణ్యమైన, క్రమశిక్షణ గల సిబ్బందిని అందించాలనే కూటమి ప్రభుత్వ సంకల్పం స్పష్టంగా కనిపిస్తోంది.
Also Read: Future Metal: బంగారం, వెండి, ప్లాటినం, రాగి కాదు.. భవిష్యత్ అంతా ఈ లోహానిదే..లాభాలే లాభాలు..!!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.
Prabhas Riddhi Kumar Rumors: పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ సినిమా వస్తుందంటే చాలు.. అటు బాక్సాఫీస్ వద్ద రికార్డులు, ఇటు సోషల్ మీడియాలో ఆయన వ్యక్తిగత జీవితంపై రూమర్లు హోరెత్తిపోతుంటాయి. ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న హారర్ కామెడీ చిత్రం 'ది రాజా సాబ్' (The Raja Saab) విడుదలకు సిద్ధమవుతున్న వేళ, ఆయన డేటింగ్ గురించి నెట్టింట ఒక ఆసక్తికర చర్చ మొదలైంది.
'ది రాజా సాబ్' సినిమాలో నటించిన ముగ్గురు హీరోయిన్లలో ఒకరైన రిద్ధి కుమార్, ఇటీవల జరిగిన ప్రీ-రిలీజ్ ఈవెంట్లో చేసిన వ్యాఖ్యలే ఈ రూమర్లకు కేంద్రబిందువు అయ్యాయి. ఆ వేదికపై ఆమె ప్రభాస్ గురించి చెబుతూ చాలా ఎమోషనల్ అయ్యారు.
ప్రభాస్ నుంచి స్పెషల్ గిఫ్ట్..
"ప్రభాస్ గారు నాకు ఒక అందమైన చీరను బహుమతిగా ఇచ్చారు. దానిని నేను మూడేళ్లుగా చాలా జాగ్రత్తగా దాచుకున్నాను. ఈ ప్రత్యేకమైన రోజునే (ప్రీ-రిలీజ్ ఈవెంట్) కట్టుకోవాలని ఇన్నాళ్లూ ఎదురుచూశాను" అని ఈ చిత్రంలో హీరోయిన్లలో ఒకరైన రిద్ధి కుమార్ వెల్లడించారు.
"నా జీవితంలో మిమ్మల్ని (ప్రభాస్‌ను) పొందడం నా అదృష్టం. నేను ఈ సినిమాలో ఉన్నానంటే దానికి కారణం మీరే" అంటూ ప్రభాస్‌పై తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు.
డేటింగ్ రూమర్స్ ఎందుకంటే?
హీరోయిన్ రిద్ధి కుమార్ ప్రభాస్‌ను పొగిడిన విధానం, ఆయన ఇచ్చిన బహుమతిని మూడేళ్లుగా దాచుకున్నానని చెప్పడంతో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. గతంలో 'రాధే శ్యామ్' సినిమాలో కూడా వీరిద్దరూ కలిసి నటించారు.
ఇప్పుడు రెండోసారి 'రాజా సాబ్'లో కూడా అవకాశం రావడంతో వీరి మధ్య ఏదో ఉందనే ప్రచారం మొదలైంది. ప్రభాస్ కంటే రిద్ధి కుమార్ సుమారు 19 ఏళ్లు చిన్నది. అయినప్పటికీ, సోషల్ మీడియాలో వీరిద్దరి ఫోటోలు షేర్ చేస్తూ 'కొత్త జోడీ' అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
అసలు నిజం ఏంటి?
ప్రభాస్‌కు తన తోటి నటీనటులకు, సెట్ లోని వారికి ఖరీదైన బహుమతులు ఇవ్వడం, రకరకాల వంటకాలతో విందు ఇవ్వడం అలవాటు. దీనిని పరిశ్రమలో అందరూ 'ప్రభాస్ ఆతిథ్యం' అని పిలుచుకుంటారు. రిద్ధి కుమార్‌కు ఇచ్చిన గిఫ్ట్ కూడా అందులో భాగమే అయ్యింటుందని ఆయన అభిమానులు అభిప్రాయపడుతున్నారు. డేటింగ్ వార్తలపై ఇప్పటివరకు అటు ప్రభాస్ టీమ్ గానీ, ఇటు రిద్ధి గానీ స్పందించలేదు.
సినిమా విషయానికొస్తే.. పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ నటిస్తున్న 'ది రాజా సాబ్' చిత్రం హారర్ కామెడీ జోనర్లో తెరకెక్కుతోంది. ఈ సినిమాకు మారుతి దర్శకత్వం వహించగా.. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు.
ఇందులో ప్రభాస్ సరసన నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటిస్తుండగా.. సంజయ్ దత్, బొమన్ ఇరానీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 9న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Ola Roadster X+ Price Features: ఎలక్ట్రిక్ వాహన రంగంలో అగ్రగామిగా ఉన్న ఓలా ఎలక్ట్రిక్ (Ola Electric) మరో అద్భుత మైలురాయిని అందుకుంది. పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన రోడ్‌స్టర్ X+ (9.1 kWh) మోటార్‌సైకిల్‌కు కేంద్ర ప్రభుత్వం నుండి అధికారిక ధృవీకరణ లభించింది. దీంతో ఈ బైక్ కస్టమర్లకు డెలివరీ కావడానికి మార్గం సుగమమైంది.
'మేక్ ఇన్ ఇండియా'తో సరికొత్త చరిత్ర
ఈ బైక్ ప్రత్యేకత ఏమిటంటే, ఇది భారతదేశంలోనే తయారు చేసిన 4680 భారత్ సెల్ (4680 Bharat Cell) టెక్నాలజీతో పనిచేస్తుంది. మన దేశంలోనే తయారైన బ్యాటరీ సెల్స్‌తో ధృవీకరణ పొందిన తొలి ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ ఇదే కావడం విశేషం. మనేసర్‌లోని iCAT (ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఆటోమోటివ్ టెక్నాలజీ) ఈ మోడల్‌ను క్షుణ్ణంగా పరీక్షించి, సెంట్రల్ మోటార్ వెహికల్స్ రూల్స్ (CMVR) ప్రకారం సర్టిఫై చేసింది.
ఈ బైక్ కేవలం వేగం మాత్రమే కాదు, అత్యుత్తమ భద్రతా ప్రమాణాలను కూడా కలిగి ఉంది. AIS-156 సర్టిఫికేషన్‌తో దీనిలోని 9.1 kWh బ్యాటరీ ప్యాక్, ఆటోమోటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ARAI) నుండి కఠినమైన భద్రతా పరీక్షల తర్వాత సర్టిఫికేషన్ పొందింది. బ్యాటరీ నీటిలో మునిగినా, అగ్ని ప్రమాదం జరిగినా, విపరీతమైన వేడి లేదా కంపనాలు ఎదురైనా తట్టుకునేలా దీనిని రూపొందించారు. అలాగే బ్రేకింగ్ సామర్థ్యం, సౌండ్, విద్యుదయస్కాంత సమ్మతి వంటి అంశాల్లో ప్రభుత్వం నిర్దేశించిన అన్ని నిబంధనలను ఇది విజయవంతంగా పూర్తి చేసింది.
కేవలం మోటార్‌సైకిళ్లు మాత్రమే కాకుండా, రాబోయే రోజుల్లో ఓలా స్కూటర్లు, ఇతర ద్విచక్ర వాహనాల్లో కూడా ఇదే 'భారత్ సెల్' టెక్నాలజీని వాడనున్నట్లు సదరు కంపెనీ స్పష్టం చేసింది. ప్రభుత్వ అనుమతులు లభించడంతో, రోడ్‌స్టర్ X+ డెలివరీలు అతి త్వరలోనే ప్రారంభం కానున్నాయి. లాంగ్ రేంజ్, పవర్ ఫుల్ ఎలక్ట్రిక్ బైక్ కోసం చూస్తున్న వారికి ఇది ఒక అద్భుతమైన ఆప్షన్ కానుంది.
ధర, అదిరిపోయే ఫీచర్స్..
ఓలా రోడ్‌స్టర్ ఎక్స్ ఎలక్ట్రిక్ బైక్ అనేక వేరియంట్లలో అందుబాటులోకి రానుంది. దీని ధర రూ.99,999 నుంచి రూ.1,25,000 అత్యధికంగా ఉండనుందని విశ్లేషకులు చెబుతున్నారు. దీనిలో బ్యాటరీని బట్టి ఒక్కసారి ఛార్జ్ చేస్తే 140 కి.మీ, నుంచి 250 కి.మీ., మేర మైలేజ్ ఇస్తుందని చెబుతున్నారు. గంటకు 105 నుంచి 118 కి.మీ, వేగాన్ని అందుకోగలదట. దీని బ్యాటరీ 80 శాతం ఛార్జ్ అయ్యేందుకు సుమారు 4.6 గంటల నుంచి 6.2 గంటల సమయం పడుతుందని సమాచారం.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Silver and Rare Earth Elements: 2025 వెండి మార్కెట్లో జరుగుతున్న పరిణామాలు ప్రపంచ పెట్టుబడిదారుల ద్రుష్టిని ఆకర్షిస్తున్నాయి. ఓ వైపు వెండి ధరలు భారీగా పెరుగుతుండగా.. మరోవైపు ప్రపంచంలోనే కీలక ముడి పదార్థాల సరఫరాలో ప్రధాన పాత్ర పోషిస్తున్న చైనా కీలక నిర్ణయం తీసుకుంది. వెండి ఎగుమతులపై నియంత్రణను మరింత కఠినతరం చేస్తూ కొత్త విధానాన్ని అమలు చేయబోతోంది. ఈ రూల్స్ కొత్త ఏడాది అంటే జనవరి 1వ తేదీ నుంచి అమల్లోకి రాబోతున్నాయి. ముఖ్యంగా అమెరికా పరిశ్రమలు, రక్షణ రంగ సరఫరా గొలుసుకు వెండి అత్యంత అవసరమైన లోహం మారుతున్న ఈ నేపథ్యంలో చైనా ఈ నిర్ణయం తీసుకోవడం ఆసక్తికరంగా మారింది.
వెండి ఒక్కటే కాదు వెండితోపాటు అరుదైన భూమి ఖనిజాల ఎగుమతులపై కూడా చైనా కండిషన్స్ పెడుతోంది. ఇప్పటికే అక్టోబర్ నెలలోనే చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ ఈ కొత్త రూల్స్ ప్రకటించింది. అదే సమయంలో దక్షిణ కొరియాలో జరిగిన కీలక సమావేశంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, చైనా అధ్యక్షుడు జి జెన్ పింగ్ మధ్య చర్యలు జరిగాయి. ఆ చర్చల తర్వాత కొన్ని అరుదైన భూమి ఖనిజాల ఎగుమతులపై ఒక ఏడాది పాటు నిషేధం విధించేందుకు చైనా అంగీకరించింది. దీంతో అమెరికా కొన్ని సుంకాలను విధించడం ఉపసంహరించుకుంది.
అయితే కొత్త విధానంలో భాగంగా.. వెండిని ఎగుమతి చేసేందుకు 44 కంపెనీలకు మాత్రమే అనుమతి ఇచ్చింది చైనా. 2026, 2027 సంవత్సరాల్లో వెండి ఎగుమతులు చేయడానికి అర్హత పొందిన ఈ 44 కంపెనీల జాబితాను తాజాగా విడుదల చేసింది. అంతేకాదు.. 2026 నుంచి టంగ్స్టన్, యాంటిమోనీ వంటి కీలక లోహాల ఎగుమతులపైనా ఆంక్షలు విధించనున్నారు. చైనా సెక్యూరిటీస్ టైమ్స్ కథనం ప్రకారం.. తాజా నిబంధనలతో వెండికి వ్యూహాత్మక పదార్థం హోదా లభించింది. ఇకపై వెండి ఎగుమతులు కూడా అరుదైన భూమి ఖనిజాల తరహాలో కఠిన నియంత్రణల కింద ఉంటాయి.
Also Read: Future Metal: బంగారం, వెండి, ప్లాటినం, రాగి కాదు.. భవిష్యత్ అంతా ఈ లోహానిదే..లాభాలే లాభాలు..!!
విద్యుత్ సర్క్యూట్లు, బ్యాటరీలు, సౌర విద్యుత్ ప్యానెల్స్, వైద్య పరికరాల తయారీలో విస్తృతంగా ఉపయోగపడే వెండిని అమెరికా ఇప్పటికే క్రిటికల్ మినరల్స్ జాబితాలో చేర్చింది. గణాంకాల ప్రకారం.. 2024లో చైనా ప్రపంచంలోనే అతిపెద్ద వెండి ఉత్పత్తిదారులలో ఒకటిగా నిలిచింది. ఈ ఏడాది తొలి 11 నెలల్లోనే చైనా 4,600 టన్నులకు పైగా వెండిని ఎగుమతి చేయగా.. సుమారు 220 టన్నులను దిగుమతి చేసుకుంది.
ఈ పరిణామాల నేపథ్యంలో వెండి ధరలు అంతర్జాతీయ మార్కెట్లో దూసుకుపోతున్నాయి. పెరుగుతున్న డిమాండ్ కారణంగా కొన్ని చైనా సంస్థలు కెనడాకు చెందిన వెండి సరఫరాదారుల నుంచి మార్కెట్ ధర కంటే ఔన్సుకు 8 డాలర్లు ఎక్కువ చెల్లించేందుకు ముందుకొచ్చాయి. భారత్‌కు చెందిన ఓ కొనుగోలుదారు అయితే మార్కెట్ రేటుకంటే 10 డాలర్లు అధికంగా చెల్లించినట్లు సమాచారం. ఒక దశలో వెండి ధర ఔన్సుకు 80 డాలర్లను దాటగా, ప్రస్తుతం సుమారు 73 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.
2025లో అమెరికన్ డాలర్ ఇండెక్స్ దాదాపు 9.5 శాతం పడిపోవడం కూడా వెండి ధరలకు మరింత బలం చేకూర్చింది. ఈ ఏడాది వెండి ధరలు రెట్టింపుకంటే ఎక్కువగా పెరగడం గమనార్హం. అదే సమయంలో బంగారం కూడా బలమైన లాభాలను నమోదు చేసింది. అయితే క్రిప్టో మార్కెట్లో బిట్‌కాయిన్ మాత్రం భిన్న దిశలో కదులుతోంది. ప్రస్తుతం దాదాపు 88,000 డాలర్ల వద్ద ట్రేడవుతున్న బిట్‌కాయిన్, ఈ ఏడాది ఇప్పటివరకు సుమారు 5 శాతం నష్టాన్ని నమోదు చేసింది. ఈ నేపథ్యంలో వెండి భవిష్యత్తులో మరింత కీలక లోహంగా మారే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.
Quartz Illegal Mining: నకరికల్లు సమీపంలో మట్టి టిప్పర్ల హంగామా ఒక నిండు ప్రాణంపైకి తెచ్చింది. వేగంగా వచ్చిన మట్టి టిప్పర్ ద్విచక్ర వాహనాన్ని బలంగా ఢీకొనడంతో ఒక వ్యక్తి ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రి పాలయ్యారు. మంగళవారం చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
పోలీసులు మరియు స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..నకరికల్లు పాతూరుకు చెందిన అబ్బూరి శ్రీనివాస్, తన ద్విచక్ర వాహనంపై శ్రీరాంపురం వద్ద ఉన్న కాలువ కట్టపై వెళ్తుండగా, వెనుక నుండి అతివేగంగా వచ్చిన మట్టి టిప్పర్ లారీ ఆయనను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో శ్రీనివాస్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఆయనను గమనించిన స్థానికులు వెంటనే నకరికల్లు ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం నర్సరావుపేటలోని ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.
పరారీలో డ్రైవర్..పోలీసుల స్వాధీనంలో టిప్పర్
ప్రమాదం జరిగిన వెంటనే టిప్పర్ డ్రైవర్ వాహనాన్ని వదిలేసి అక్కడి నుండి పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని టిప్పర్‌ను స్వాధీనం చేసుకున్నారు. వాహనాన్ని పోలీస్ స్టేషన్‌కు తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. అయితే, ఈ ఘటనపై ఇంకా అధికారికంగా ఎటువంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు వెల్లడించారు.
మట్టి మాఫియా బరితెగింపు?!
గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలోని నకరికల్లు, త్రిపురారం కొండలు మట్టి మాఫియా ధాటికి కరిగిపోతున్నాయి. అనుమతులు ఉన్నది కొద్ది మేరకే అయినా, అక్రమార్కులు మాత్రం నిబంధనలను తుంగలో తొక్కి కొండలను నామరూపాల్లేకుండా చేస్తున్నారని స్ఠానికులు ఆరోపిస్తున్నారు. ఈ అక్రమ తవ్వకాల వల్ల అటు ప్రకృతి సంపద హరించుకుపోవడమే కాకుండా, స్థానిక ప్రజల ఆరోగ్యం కూడా ముప్పులో పడింది.
త్రిపురారంలో అడ్డూఅదుపు లేని తవ్వకాలు
అద్దంకి-నార్కట్‌పల్లి రాష్ట్రీయ రహదారికి ఆనుకుని ఉన్న త్రిపురాపురం కొండల సముదాయం అక్రమార్కులకు కాసులు కురిపిస్తోందా? అవుననే అంటున్నారు నకరికల్లు-త్రిపురాపురం నివాసితులు. నిత్యం మట్టి టిప్పర్లు మితిమీరిన వేగంతో మట్టి రవాణా చేస్తుంటే రోడ్డుపైకి రావాలంటేనే భయాందోళనలతో అదిరిపోతున్నారు. సమీపంలో శ్రీరాంపురం, త్రిపురాపురంలోని ప్రజలు నిత్యం దుమ్ము,ధూళితో ఇబ్బంది పడుతున్నట్లు ఇప్పటికే అధికారులకు సమాచారం ఇచ్చినా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అనుమతి ఎంత..తవ్వకం ఎంత?
విశ్వసనీయ సమాచారం ప్రకారం.. శ్రీరాంపురంలో కేవలం 6.07 హెక్టార్లకే మైనింగ్ శాఖ నుంచి అనుమతులు ఉన్నాయట. కానీ, వాస్తవానికి అంతకు మించిన విస్తీర్ణంలో కొండలను పిండి చేస్తున్నారని సమాచారం. భారీ పొక్లెయిన్లు, పదుల సంఖ్యలో టిప్పర్లతో రేయింబవళ్లు తవ్వకాలు సాగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. నిత్యం రణగొణ ధ్వనుల మధ్య రాత్రుళ్లు నిద్రలేకుండా పోతుందని ఆ ఊరి ప్రజలు వాపోతున్నారు.
కొండమోడు-పేరేచర్ల జాతీయ రహదారి పనుల కోసం మట్టిని తరలిస్తున్నామని పర్మిట్లు తీసుకుని.. వాటి ముసుగులో ప్రైవేట్ వెంచర్లకు మట్టిని అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఈ అక్రమ రవాణా వల్ల స్థానికులు నరకయాతన అనుభవిస్తున్నారు. టిప్పర్ల రాకపోకలతో సమీప గ్రామాల ఇళ్లు, పంట పొలాలు ఎర్రమట్టి దుమ్ముతో నిండిపోయాయి. ప్రజలు శ్వాసకోశ సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. భారీ టిప్పర్ల లోడుకు అద్దంకి-నార్కట్‌పల్లి రహదారి గుంతలమయమైంది. ఆ గుంతలను కూడా మట్టితోనే పూడ్చి మమ అనిపిస్తున్నారు.
అక్రమార్కులకు స్థానిక రెవెన్యూ, పోలీసు అధికారుల సహకారం పూర్తిస్థాయిలో ఉందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఎవరైనా ఫిర్యాదు చేస్తే ఆ సమాచారాన్ని అధికారులే మాఫియాకు చేరవేస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. తవ్వకాలు సాగించేందుకు ప్రతిఫలంగా భారీగా ముడుపులు అందుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
సెలవు రోజులే టార్గెట్..
నకరికల్లు కొండల్లో ప్రతి ఆదివారం (సెలవు దినం) ప్రత్యేకంగా తవ్వకాలు జరుపుతున్నారు. "సెలవు రోజుల్లో మేము పట్టించుకోం" అని అధికారులు భరోసా ఇస్తున్నట్లు సమాచారం. తవ్వకాలను ఎవరైనా అడ్డుకోవాలని చూస్తే, కార్లలో తిరిగే బౌన్సర్లతో భయభ్రాంతులకు గురిచేస్తున్నారు.
చివరిగా.. ప్రకృతిని కాపాడాల్సిన అధికారులే మాఫియాకు అండగా నిలబడటంపై శ్రీరాంపురం - త్రిపురాపురం ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే ఉన్నతాధికారులు స్పందించి ఈ అక్రమ తవ్వకాలను అడ్డుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
Also Read: Chicken Vs Mutton Liver: మటన్ లివర్ Vs చికెన్ లివర్..ఏది తినొచ్చు? ఏది తినకూడదు? నిప్పులాంటి నిజం!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook