Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Khammam507003

అమరుల త్యాగాల వల్లే ప్రజలకు స్వేచ్ఛ జీవితం: కలెక్టర్ ముజామిల్ ఖాన్

Jul 26, 2024 11:58:30
Khammam, Telangana
సైనికుల త్యాగాలను ఎప్పటికి స్మరించుకోవాలని వారి సేవలను గుర్తుపెట్టుకోవాలని ఖమ్మం కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్ అన్నారు. కార్గిల్ విజయ్ దివస్ లో బాగంగా అమరులకు కలెక్టర్ నివాళిఅర్పించారు. దేశ ప్రజలు స్వేచ్చగా బ్రతుకుతున్నారంటే అది అమరుల త్యాగాల వల్లే అన్నారు. వారి త్యాగాలను వెలకట్టలేమని కలెక్టర్ అన్నారు. ఈ క్రమంలో వారి సేవలను కొనియాడుతూ గుర్తుచేసుకున్నారు. ఈకార్యక్రమంలో నగర మేయర్ నీరజా, జిల్లా సైనిక సంక్షేమ అధికారి చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
HDHarish Darla
Jan 14, 2026 13:52:27
Hyderabad, Telangana:

Allu Arjun Lokesh Kanagaraj Movie: ఈ సంక్రాంతి వేళ సినీ ప్రియులకు అతిపెద్ద 'బ్లాక్ బస్టర్' శుభవార్త అందింది. టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, కోలీవుడ్ హిట్ మెషిన్ లోకేష్ కనగరాజ్ కాంబినేషన్‌లో ఒక భారీ పాన్-ఇండియా చిత్రం పట్టాలెక్కబోతోంది. గత కొంతకాలంగా వినిపిస్తున్న ఈ వార్తలను నిజం చేస్తూ, అల్లు అర్జున్ స్వయంగా ఒక పవర్‌ఫుల్ వీడియో ద్వారా ఈ ప్రాజెక్ట్‌ను ధృవీకరించారు.

వీడియోలో 'సింహం'లా బన్నీ..
ఈ చిత్ర ప్రకటన కోసం విడుదల చేసిన వీడియో సోషల్ మీడియాను ఊపేస్తోంది. ఇందులో అల్లు అర్జున్ రాచరికం, ఆధిపత్యానికి ప్రతీకగా 'సింహం'లా కనిపిస్తుండగా, అతని చుట్టూ మోసపూరితమైన 'నక్కలు' ఉన్నట్లు చూపించారు. లోకేష్ కనగరాజ్ మార్క్ ఇంటెన్స్ యాక్షన్, పదునైన స్క్రీన్ ప్లే ఈ సినిమాలో పుష్కలంగా ఉండబోతున్నాయని ఈ వీడియో సంకేతాలిస్తోంది.

ప్రధాన ఆకర్షణలు ఇవే..
పాన్-ఇండియా లెవల్: ఈ చిత్రం కేవలం దక్షిణాదికే పరిమితం కాకుండా, హిందీతో పాటు దేశవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కానుంది. అల్లు అర్జున్ స్టైల్, లోకేష్ కనగరాజ్ రా (Raw) అండ్ రస్టిక్ యాక్షన్ మేకింగ్ తోడైతే బాక్సాఫీస్ రికార్డులు తిరగరాయడం ఖాయమని ఫ్యాన్స్ నమ్ముతున్నారు. సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. అతని నేపథ్య సంగీతం (BGM) సినిమాకు ప్రధాన బలం కానుంది. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్‌ను #AA23 అనే వర్కింగ్ టైటిల్‌తో పిలుస్తున్నారు.

భారీ అంచనాలతో..
లోకేష్ కనగరాజ్ తన సినిమాలతో ఒక సొంత యూనివర్స్ (LCU)ను సృష్టించారు. మరి అల్లు అర్జున్ సినిమా కూడా ఆ యూనివర్స్‌లో భాగమవుతుందా? లేదా ఇది ఒక కొత్త తరహా గ్యాంగ్‌స్టర్ డ్రామానా? అనే ఉత్కంఠ అందరిలోనూ నెలకొంది. ఈ భారీ ప్రాజెక్ట్‌ను ఒక ప్రముఖ నిర్మాణ సంస్థ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది.

Also Read: Sesame Seeds Sankranti: సంక్రాంతి రోజున నువ్వుల లడ్డూలు ఎందుకు తినాలి? సూర్యుడు-శని మధ్య ఉన్న ఆసక్తికర రహస్యం ఇదే!

Also Read: Cervical Cancer: స్త్రీల ఆరోగ్యంలో కీలకమైన 'సెర్విక్స్'..గర్భాశయ క్యాన్సర్ ముప్పు నుండి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
HDHarish Darla
Jan 14, 2026 11:10:24
Hyderabad, Telangana:

Makar Sankranti Sesame Sweet: భారతీయ సంస్కృతిలో సంక్రాంతి పండుగకు, నువ్వులకు విడదీయలేని బంధం ఉంది. ఈ రోజున నువ్వులను దానం చేయడం, నువ్వుల లడ్డూలు తినడం వెనుక అటు ఆధ్యాత్మిక పరమైన కథలు, ఇటు శాస్త్రీయమైన ఆరోగ్య రహస్యాలు దాగి ఉన్నాయి.

'నువ్వుల' అసలు కథ..
సూర్య భగవానుడు తన కుమారుడైన శని దేవుని రాశి అయిన 'మకర రాశి'లోకి ప్రవేశించడమే మకర సంక్రాంతి. తండ్రీకొడుకులైన సూర్యుడు, శనికి పురాణాల ప్రకారం పడదు. దీని వెనుక ఒక ఆసక్తికర కథ ఉంది.

శాపం - విముక్తి: సూర్యుడికి తన కుమారుడు శనిపై కోపం వచ్చి, శని నివాసమైన 'కుంభ' రాశిని దహనం చేస్తాడు. దీంతో శని, అతని తల్లి ఛాయ తీవ్ర ఇబ్బందులు పడతారు.

నువ్వుల పూజ: యమధర్మరాజు మధ్యవర్తిత్వం వహించి సూర్యుడిని శాంతింపజేస్తాడు. సూర్యుడు తన కుమారుడైన శని ఇంటికి (మకర రాశి) వెళ్లినప్పుడు, అక్కడ అంతా కాలిపోయి కేవలం నల్ల నువ్వులు మాత్రమే మిగిలి ఉంటాయి. శని దేవుడు ఆ నువ్వులతోనే తన తండ్రికి స్వాగతం పలికి పూజిస్తాడు.

వరము: కుమారుడి భక్తికి మెచ్చిన సూర్యుడు.. "మకర సంక్రాంతి రోజున ఎవరైతే నల్ల నువ్వులతో నన్ను పూజిస్తారో, వారిపై శని ప్రభావం తగ్గుతుందని, వారికి సుఖశాంతులు లభిస్తాయని" వరమిచ్చాడట. అందుకే సంక్రాంతి నాడు నువ్వులకు అంత ప్రాధాన్యత ఏర్పడింది.

నువ్వులు - బెల్లం 
సంక్రాంతి పండుగ చలికాలం మధ్యలో వస్తుంది. ఈ సమయంలో నువ్వులు, బెల్లం తీసుకోవడం వెనుక బలమైన ఆరోగ్య కారణాలు ఉన్నాయి. నువ్వులు, బెల్లం ప్రకృతిసిద్ధంగా వేడిని కలిగిస్తాయి. ఇవి చలికాలంలో శరీర ఉష్ణోగ్రతను సమతుల్యం చేయడంలో సహాయపడతాయి. నువ్వులలో ఉండే నూనెలు, బెల్లంలో ఉండే ఐరన్ కలిపి తీసుకోవడం వల్ల శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. చలికాలంలో వచ్చే నీరసాన్ని తగ్గించి, తక్షణ శక్తిని ఇవ్వడంలో ఈ లడ్డూలు కీలకంగా పనిచేస్తాయి.

నువ్వుల దానంతో శని దోష నివారణ
శాస్త్రాల ప్రకారం మకర రాశికి అధిపతి శని దేవుడు. సంక్రాంతి రోజున నువ్వులను శని దేవుని ప్రసాదంగా భావిస్తారు. నువ్వులను దానం చేయడం వల్ల జాతకంలోని శని దోషాలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. ఈ రోజున నీటిలో నువ్వులు వేసుకుని స్నానం చేయడం వల్ల పాపాలు నశిస్తాయని చెబుతారు. నువ్వుల లడ్డూలు తినడం వల్ల సూర్యుడి తేజస్సు, శని అనుగ్రహం రెండూ లభిస్తాయని పండితులు పేర్కొంటున్నారు.

మకర సంక్రాంతి నాడు మనం తినే నువ్వుల లడ్డూ కేవలం ఒక పిండి వంటకం మాత్రమే కాదు.. అది ఆరోగ్యానికి రక్షణ కవచం, మన ప్రాచీన సంప్రదాయాలకు ప్రతిబింబం.

(గమనిక: పైన పేర్కొన్న సమాచారం కేవలం కొన్ని నివేదికల ఆధారంగా రూపొందించింది. దీన్ని పాటించే ముందు సంబంధిత నిపుణుడ్ని సంప్రదించండి. దీన్ని జీ తెలుగు న్యూస్ ధ్రువీకరించడం లేదు.)

Also Read: Gruhalakshmi Yojana: మహిళలకు సంక్రాంతి కానుక..ఖాతాల్లోకి రూ.4,000 జమ..ఎప్పటిలోగా ఇస్తారంటే?

Also Read: Cervical Cancer: స్త్రీల ఆరోగ్యంలో కీలకమైన 'సెర్విక్స్'..గర్భాశయ క్యాన్సర్ ముప్పు నుండి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
HDHarish Darla
Jan 14, 2026 09:58:18
Bengaluru, Karnataka:

Gruhalakshmi Yojana Status Check: రాష్ట్రంలోని కోట్లాది మంది మహిళలకు కాంగ్రెస్ ప్రభుత్వం సంక్రాంతి పండుగ వేళ తీపి కబురు అందించింది. సాంకేతిక కారణాల వల్ల గత రెండు నెలలుగా నిలిచిపోయిన గృహలక్ష్మి పథకం నిధులను విడుదల చేస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పెండింగ్‌లో ఉన్న రెండు విడతల సొమ్మును (రూ.4,000) నేటి నుండే (జనవరి 14) దశలవారీగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయనున్నారు.

24, 25వ విడతల నిధులు విడుదల
గృహలక్ష్మి పథకం కింద అర్హులైన మహిళలకు నెలకు రూ.2,000 చొప్పున ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు 24వ, 25వ విడతలకు సంబంధించిన నిధుల విడుదలకు ఆర్థిక శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

తొలి దశ: బెంగళూరుతో సహా 26 జిల్లాల్లో 25వ విడత డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ (DBT) ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది.

పెండింగ్ బకాయిలు: గతంలో నిలిచిపోయిన విడతల ఫైళ్లు కూడా చివరి దశలో ఉన్నాయని, త్వరలోనే ఆ రూ.4,000 కూడా ఖాతాల్లో పడతాయని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి లక్ష్మీ హెబ్బాళ్కర్ స్పష్టం చేశారు.

ముఖ్యమైన వివరాలు..
లబ్ధిదారుల సంఖ్య: రాష్ట్రవ్యాప్తంగా సుమారు 1.2 కోట్లకు పైగా మహిళలు ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందుతున్నారు.

నిధుల జమ: పండుగ కానుకగా నేటి నుండే దశలవారీగా నగదు బదిలీ ప్రక్రియ మొదలైంది. ఒకేసారి కాకుండా జిల్లా వారీగా అకౌంట్లలో డబ్బులు జమ అవుతాయి.

రేషన్ కార్డు రద్దు అయితే పరిస్థితి ఏంటి?
ఇటీవల ప్రభుత్వం అనర్హులైన వారి BPL (బిపిఎల్) కార్డులను రద్దు చేస్తున్న నేపథ్యంలో కొన్ని సందేహాలు తలెత్తాయి.

అర్హత ఉంటేనే: ఒకవేళ పొరపాటున అర్హత కలిగిన లబ్ధిదారుల కార్డు రద్దు అయితే, వారు తగిన ఆధారాలతో అధికారులకు వివరణ ఇచ్చి మళ్ళీ పథకాన్ని పునరుద్ధరించుకోవచ్చు.

నిబంధన: లబ్ధిదారురాలు ఆదాయపు పన్ను (Income Tax) చెల్లింపుదారు అయి ఉండకూడదు.

అక్రమాలపై వేటు: అక్రమంగా కార్డులు పొందిన వారిపై చర్యలు తీసుకుంటూనే, నిజమైన పేదలకు అన్యాయం జరగకుండా చూస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది.

పండుగ పూట తమ ఖాతాల్లోకి డబ్బులు చేరుతుండటంతో మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మీ ఖాతాలోకి నగదు జమ అయిందో లేదో మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు వచ్చే మెసేజ్ ద్వారా లేదా సంబంధిత వెబ్‌సైట్‌లో స్టేటస్ చెక్ చేసుకోవచ్చు.

Also REad: EPF Withdrawal Rules 2026: ఉద్యోగులకు ముఖ్య గమనిక..పీఎఫ్ డబ్బు విత్‌డ్రాలో భారీ మార్పులు..ఏడాదిలో ఎన్నిసార్లు చేయోచ్చు?!

Also Read: ICC T20 World Cup: అమెరికాకు భారత్ షాక్..పాకిస్థాన్ పౌరులు భారత గడ్డపై అడుగుపెట్టడానికి వీలులేదు!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
HDHarish Darla
Jan 14, 2026 09:23:13
Hyderabad, Telangana:

Cervical Cancer Cure: భారతదేశంలో మహిళలు ఎదుర్కొంటున్న ప్రధాన ఆరోగ్య సమస్యలలో గర్భాశయ క్యాన్సర్ (Cervical Cancer) రెండవ స్థానంలో ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఇది నాలుగవ అత్యంత సాధారణ క్యాన్సర్. సరైన అవగాహన ఉంటే దీనిని 100% నివారించే అవకాశం ఉన్నప్పటికీ, అవగాహన లేకపోవడం, పరీక్షలకు దూరంగా ఉండటం వల్ల చాలా మంది ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. అయితే గర్భాశయ క్యాన్సర్ ముప్పు ఎలా వస్తుంది? దాని నుంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవడం..తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? అనే వివరాలను ప్రసిద్ధ ఫెర్నాండేజ్ హాస్పిటల్ గైనకాలజిస్టు వైద్య నిపుణురాలు డాక్టర్ విద్యావతి మాటల్లోనే తెలుసుకుందాం.

సెర్విక్స్ అంటే ఏమిటి? అది చేసే పనులేంటి?
సెర్విక్స్ లేదా గర్భాశయ ముఖద్వారం అనేది గర్భాశయానికి, యోనికి మధ్య ఉండే ఒక కండరాల ద్వారం. ఇది పునరుత్పత్తి వ్యవస్థలో మల్టీ టాస్కర్ లాగా పనిచేస్తుంది. బాహ్య ఇన్ఫెక్షన్లు గర్భాశయంలోకి వెళ్లకుండా అడ్డుకుంటుంది. పీరియడ్స్ సమయంలో రక్తం బయటకు వెళ్లేలా, ఫలదీకరణం సమయంలో శుక్రకణాలు లోపలికి వెళ్లేలా చేస్తుంది. శిశువు జనన సమయంలో ఇది వ్యాకోచించి ప్రసవం సులభతరం చేస్తుంది.

గర్భాశయ ఆరోగ్యానికి పొంచి ఉన్న ముప్పులు
గర్భాశయానికి వచ్చే సమస్యలు సాధారణ వాపు (Inflammation) నుండి క్యాన్సర్ వరకు రకరకాలుగా ఉండవచ్చు.

గర్భాశయ డిస్ప్లాసియా: ఇది క్యాన్సర్ రావడానికి ముందు కణాలలో జరిగే మార్పు. ఇది కంటికి కనిపించదు.

HPV వైరస్: గర్భాశయ క్యాన్సర్‌కు ప్రధాన కారణం హ్యూమన్ పాపిల్లోమా వైరస్ (HPV). ఇది చాలా కాలం పాటు శరీరంలో ఉంటే క్యాన్సర్‌గా మారే ప్రమాదం ఉంది.

పాలిప్స్: గర్భాశయంలో పెరిగే చిన్న గడ్డలు. ఇవి అన్నీ క్యాన్సర్ కానప్పటికీ, వైద్యుని సంప్రదించడం ముఖ్యం.

ఆరోగ్యాన్ని కాపాడుకునే 5 సూత్రాలు
పరిశుభ్రత: పీరియడ్స్ సమయంలో నాణ్యమైన శానిటరీ ప్యాడ్‌లు వాడాలి. అదే విధంగా వాటిని నిర్ణీత సమయానికి మారుస్తూ ఉండాలి. వ్యక్తిగత పరిశుభ్రత పట్ల అపోహలను విడనాడాలి.

స్క్రీనింగ్ పరీక్షలు: 25 ఏళ్లు దాటిన మహిళలు క్రమం తప్పకుండా పాప్ స్మెర్ (Pap Smear). HPV స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవాలి. దీనివల్ల క్యాన్సర్‌ను రాకముందే గుర్తించవచ్చు.

టీకా (Vaccination): HPV వ్యాక్సిన్ తీసుకోవడం ద్వారా గర్భాశయ క్యాన్సర్‌ను సమర్థవంతంగా నివారించవచ్చు. 11-12 ఏళ్ల నుండి 26 ఏళ్ల వయస్సు లోపు ఈ టీకా తీసుకోవడం శ్రేయస్కరం.

జీవనశైలి మార్పులు: ధూమపానం మానుకోవాలి. ప్రాసెస్ చేసిన ఆహారాన్ని తగ్గించి, పోషకాహారం తీసుకోవాలి.

లక్షణాలను గుర్తించడం ఎలా: పొత్తికడుపు నొప్పిని లేదా అసాధారణ రక్తస్రావాన్ని ఎప్పుడూ నిర్లక్ష్యం చేయకూడదు.

అప్రమత్తం చేయాల్సిన హెచ్చరిక సంకేతాలు
మీ శరీరంలో ఈ క్రింది మార్పులు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించండి.

1) యోని నుండి విపరీతమైన స్రావం (Discharge).

2) స్రావం రంగు లేదా వాసనలో మార్పు రావడం.

3) పీరియడ్స్ మధ్యలో లేదా శృంగారం తర్వాత రక్తస్రావం కావడం.

4) శృంగార సమయంలో విపరీతమైన నొప్పి.

5) పొత్తికడుపు లేదా నడుము భాగంలో మొండి నొప్పి.

చివరిగా.. గర్భాశయ క్యాన్సర్ అకస్మాత్తుగా రాదు. ఇది శరీరంలో కణాల మార్పు ద్వారా నెమ్మదిగా మొదలవుతుంది. కాబట్టి, క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం వల్ల కోలుకునే అవకాశాలు 100% పెరుగుతాయి. మీ శరీరం ఇచ్చే చిన్న సంకేతాన్ని కూడా విస్మరించకండి.

Also Read: EPF Withdrawal Rules 2026: ఉద్యోగులకు ముఖ్య గమనిక..పీఎఫ్ డబ్బు విత్‌డ్రాలో భారీ మార్పులు..ఏడాదిలో ఎన్నిసార్లు చేయోచ్చు?!

Also Read: ICC T20 World Cup: అమెరికాకు భారత్ షాక్..పాకిస్థాన్ పౌరులు భారత గడ్డపై అడుగుపెట్టడానికి వీలులేదు!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
HDHarish Darla
Jan 14, 2026 08:31:08
Hyderabad, Telangana:

EPF Withdrawal Rules Reform: సాధారణంగా పీఎఫ్ (PF) డబ్బును రిటైర్మెంట్ తర్వాత అవసరాల కోసం దాచుకుంటాం. అయితే అత్యవసర సమయాల్లో ఆ డబ్బును విత్‌డ్రా చేసుకోవడానికి గతంలో కఠినమైన నిబంధనలు ఉండేవి. ఇప్పుడు EPFO తన నిబంధనలను సరళీకరించి, బ్యాంక్ నుండి నగదు తీసుకున్నంత సులభంగా పీఎఫ్ విత్‌డ్రాలను మార్చింది.

ముఖ్యమైన మార్పు
గతంలో పీఎఫ్ డబ్బు తీసుకోవాలంటే కనీసం రెండు నుండి ఐదు సంవత్సరాల సర్వీస్ ఉండాలనే నిబంధన ఉండేది. కానీ ఇప్పుడు కేవలం 12 నెలల (ఒక సంవత్సరం) ఉద్యోగ కాలం పూర్తయితే చాలు, అత్యవసర పరిస్థితుల్లో మీ నిధుల నుండి నగదు విత్‌డ్రా చేసుకోవచ్చు.

ఏఏ కారణాల కోసం విత్‌డ్రా చేసుకోవచ్చు..
కొత్త నిబంధనల ప్రకారం వివిధ అవసరాల కోసం నగదు తీసుకునే పరిమితులు ఇలా ఉన్నాయి.

అవసరం (Purpose) ఎన్నిసార్లు తీసుకోవచ్చు (Frequency) గరిష్ట పరిమితి
అనారోగ్యం (Medical) ఏడాదికి 3 సార్లు 6 నెలల ప్రాథమిక వేతనం లేదా ఉద్యోగి వాటా మొత్తం
విద్య (Education) మొత్తం సర్వీసులో 10 సార్లు ఉద్యోగి వాటాలో 50% వరకు
వివాహం (Marriage) మొత్తం సర్వీసులో 5 సార్లు ఉద్యోగి వాటాలో 50% వరకు
ఇల్లు / స్థలం (Housing) మొత్తం సర్వీసులో 5 సార్లు నిబంధనల ప్రకారం (సుమారు 90% వరకు)
 
కారణం లేకుండా (Non-Para) ఏడాదికి 2 సార్లు ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే

75%, 100% విత్‌డ్రా ఎప్పుడు చేయవచ్చు?
ఉద్యోగం కోల్పోతే: మీరు ఉద్యోగం కోల్పోయిన నెల రోజుల్లోనే మీ పీఎఫ్ బ్యాలెన్స్‌లో 75 శాతం మొత్తాన్ని తీసుకోవచ్చు. మిగిలిన 25 శాతాన్ని రిటైర్మెంట్ నిధి కోసం ఖాతాలో ఉంచడం మంచిది.

పూర్తి విత్‌డ్రా (100%): వరుసగా రెండు నెలల పాటు నిరుద్యోగిగా ఉంటే లేదా రిటైర్మెంట్ సమయంలో పూర్తి నగదును విత్‌డ్రా చేసుకోవచ్చు.

చక్రవడ్డీ నష్టం
అయితే పీఎఫ్ సంస్థ గణాంకాల ప్రకారం.. 75% ఖాతాల్లో రూ.50,000 కంటే తక్కువ బ్యాలెన్స్ ఉంటోంది. దీనివల్ల ఉద్యోగులు 8.25% చక్రవడ్డీ (Compounding) ప్రయోజనాన్ని కోల్పోతున్నారు. పీఎఫ్ డబ్బును చిన్న చిన్న అవసరాలకు తీయడం వల్ల వృద్ధాప్య పింఛను, దీర్ఘకాలిక పొదుపుపై ప్రతికూల ప్రభావం పడుతుంది.

విత్‌డ్రా చేయడం ఎలా?
మీరు ఇప్పుడు పీఎఫ్ కార్యాలయం చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. UAN పోర్టల్ లేదా UMANG యాప్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. మీ ఆధార్, బ్యాంక్ ఖాతా, పాన్ కార్డ్ UAN కు లింక్ అయి ఉండాలి.

Also Read: ICC T20 World Cup: అమెరికాకు భారత్ షాక్..పాకిస్థాన్ పౌరులు భారత గడ్డపై అడుగుపెట్టడానికి వీలులేదు!

Also Read: School Holiday: స్కూళ్లు, ఆఫీసులకు సెలవు ప్రకటన..ఎట్టకేలకు ఆరోజు హాలీడే ఇచ్చిన ప్రభుత్వం..పండగ చేసుకోండి!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

 

0
comment0
Report
BBhoomi
Jan 14, 2026 06:27:38
Lakshmapur, Telangana:

Pensioners: మధ్యప్రదేశ్‌లోని పెన్షనర్లు ప్రస్తుతం తీవ్రమైన ఆందోళనలో ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం కారణంగా దాదాపు ఐదు లక్షల మంది పెన్షనర్లు అనేక సమస్యలను ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడింది. ఏప్రిల్ 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా పెన్షన్ కార్యాలయాలను మూసివేయాలని ప్రభుత్వం నిర్ణయించడంతో ఈ పరిస్థితి తలెత్తింది. దీని ఫలితంగా ఇకపై పెన్షన్‌కు సంబంధించిన ఏ చిన్న పని అయినా సరే, పెన్షనర్లు నేరుగా రాష్ట్ర రాజధాని భోపాల్‌కు వెళ్లాల్సి ఉంటుంది.

ఈ నిర్ణయం ముఖ్యంగా వృద్ధ పెన్షనర్లకు తీవ్ర ఇబ్బందులను కలిగిస్తుందని పెన్షనర్ల సమస్యల పరిష్కార సంఘం ఆందోళన వ్యక్తం చేసింది. ఇప్పటికే వయస్సు పైబడిన వారు, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు, చిన్నచిన్న పత్రాల సవరణలు లేదా పెన్షన్‌కు సంబంధించిన సాధారణ సమస్యల కోసం కూడా వందల కిలోమీటర్లు ప్రయాణించాల్సి రావడం ఆర్థికంగా, శారీరకంగా, మానసికంగా భారంగా మారుతుందని సంఘం పేర్కొంది. రవాణా ఖర్చులు, ప్రయాణ కష్టం, భాషా సమస్యలు వంటి అంశాలు పెన్షనర్లను మరింత ఇబ్బందులకు గురిచేస్తాయని వారు చెబుతున్నారు.

Also Read: Pension: తమ సంబంధాన్ని ఎప్పుడూ దాచలేదు..లివ్‌-ఇన్‌-పార్ట్‌నెర్‌కు పెన్షన్ ఇవ్వాల్సిందే.. కేంద్రానికి హైకోర్టు ఆదేశాలు..!

ప్రభుత్వం నిర్ణయం ప్రకారం, జిల్లా స్థాయి కార్యాలయాల స్థానంలో భోపాల్‌లో ఒకే ఒక కేంద్రీకృత పెన్షన్ కార్యాలయం పనిచేయనుంది. పెన్షనర్లకు ఆన్‌లైన్ సేవలు అందుబాటులో ఉంచి, వారి సమస్యలను డిజిటల్ విధానంలో పరిష్కరిస్తామని అధికారులు చెబుతున్నారు. అయితే, సాంకేతిక పరిజ్ఞానం లేని వృద్ధులకు ఆన్‌లైన్ సేవలు పూర్తిగా ఉపయోగపడతాయా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

జిల్లా కార్యాలయాల్లో ఏకరీతి విధానాలు లేకపోవడమే సమస్యకు మూలమైతే, వాటిని పూర్తిగా మూసివేయడం కంటే జిల్లా అధికారులకు సరైన శిక్షణ ఇచ్చి వ్యవస్థను మెరుగుపరచాల్సిందని పెన్షనర్ల సంఘం అభిప్రాయపడుతోంది. ఇది పెన్షనర్లకు సులభమైన, మానవీయమైన పరిష్కారంగా ఉండేదని వారు అంటున్నారు. ప్రభుత్వం తమ నిర్ణయాన్ని పునఃపరిశీలించి, పెన్షనర్ల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని మార్పులు చేయాలని సంఘం డిమాండ్ చేస్తోంది.

Also Read: Salary Hike: ఉద్యోగులకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. మీ జీతం త్వరలో వేల రూపాయలు పెరగనుంది.. పూర్తి డీటెయిల్స్ ఇవే..!!

 

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
DDDharmaraju Dhurishetty
Jan 14, 2026 06:17:17
Hyderabad, Telangana:

Shukra Aditya Yoga Effect On Zodiac: గ్రహాలకు రాజుగా భావించే సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించాడు. సూర్యుడిని గౌరవం విశ్వాసం బలం దృఢత్వం నాయకత్వానికి కారకంగా పరిగణిస్తారు అందుకే సూర్యుడిని గ్రహాలకు రాజుగా చెప్పుకుంటారు. అలాగే సూర్యుడు మకర రాశిలోకి సంచారం చేయడాన్ని మకర సంక్రాంతిగా పిలుస్తారు.. అలాగే దీనిని చాలా ప్రాముఖ్యత కలిగిన సంచారంగా భావిస్తారు. ఈరోజు నుంచి సూర్యుడు ఉత్తరం వైపుకు కదలడం ప్రారంభిస్తాడు. హిందూ క్యాలెండర్ ప్రకారం జనవరి 14వ తేదీన 3 గంటల సమయంలో సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించాడు. మకర రాశిలో ఇప్పటికే ఉన్న శుక్రుడితో సంయోగం కూడా జరిగింది. దీని కారణంగానే శుక్రదిత్య రాజయోగం ఏర్పడింది. ఈ రాజయోగం కొన్ని రాశుల వారికి మకర సంక్రాంతి వేల అద్భుతమైన ఫలితాలను అందించబోతోంది. ముఖ్యంగా ఆర్థికంగా ఎన్నో రకాల ప్రయోజనాలను అందించబోతోందని జ్యోతిష్యులు చెబుతున్నారు. 

ఈ రాశుల వారికి బిగ్ జాక్పాట్ 
మేష రాశి 
శుక్రదిత్య రాజయోగం కారణంగా సూర్యుడి ప్రభావంతో మేషరాశి వారికి చాలా శుభప్రదంగా ఉండబోతుంది. ముఖ్యంగా సూర్యుడి ఆశీస్సులతో విద్యార్థులకు ఊహించని ధన లాభాలు కలుగుతాయి. అలాగే ఆర్థికంగా కూడా కలిసి వస్తుంది. విద్యార్థులు తమ చదువుపై దృష్టి పెట్టడం చాలా మంచిదని జ్యోతిష్యులు చెబుతున్నారు. పిల్లల విషయంలో కూడా ఎన్నో రకాల శుభవార్తలు వింటారు. అలాగే ఆరోగ్యం కూడా చాలా వరకు మెరుగుపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆర్థిక సమస్యలు కూడా క్రమంగా తొలగిపోతాయని జ్యోతిష్యులు చెబుతున్నారు.

వృషభ రాశి
సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించడం వల్ల ఏర్పడిన శుక్రదిత్య రాజయోగంతో వృషభరాశి వారికి కూడా ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ముఖ్యంగా వీరికి ఆరోగ్యం మెరుగుపడడమే.. కాకుండా అన్ని రకాల పనులు ఎంతో సులభంగా చేయగలుగుతారు. ఇక పనుల కోసం ప్రయాణాలు చేయాల్సిన అవసరం కూడా ఉంటుంది. అంతేకాకుండా ఆరోగ్యకరమైన ఆహారాలు తీసుకుంటూ ఉండడం ఎంతో మంచిది. వ్యాపారాల్లో చిక్కుకున్న డబ్బులు కూడా ఈ సమయంలో పొందగలుగుతారు. అలాగే అనుకున్న పనుల్లో అద్భుతమైన విజయాలు సాధించడంలో వీరు ముందుంటారు. 

కర్కాటక రాశి 
మకర రాశిలో సూర్యుడి సంచారం వల్ల కర్కాటక రాశి వారికి కూడా చాలావరకు మేలు జరుగుతుంది. వ్యాపారాల పరంగా వస్తున్న అనేక ఇబ్బందుల నుంచి ఈ సమయంలో విముక్తు లభించబోతోంది. ఆర్థిక ఇబ్బందులు కూడా తొలగిపోతాయి. ముఖ్యంగా ఈ సమయంలో వీరు ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ వహించాల్సి ఉంటుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఇక ఉద్యోగాలు చేస్తున్న వ్యక్తులకు మీతో పని చేస్తున్న ఉద్యోగుల నుంచి మంచి సపోర్టు కూడా లభిస్తుంది. దీనివల్ల మానసిక ప్రశాంతత కూడా చాలావరకు మెరుగుపడే సూచనలు కనిపిస్తున్నాయి.

మీన రాశి 
మీన రాశిలో జన్మించిన వ్యక్తులకు కూడా సూర్యుడి సంచార ప్రభావంతో ఎన్నో రకాల ప్రయోజనాలు కలగబోతున్నాయి. ముఖ్యంగా శుక్రదిత్య రాజయోగ ప్రభావంతో పనుల్లో తలెత్తుతున్న ఇబ్బందులు పూర్తిగా తొలగిపోతాయి. అంతేకాకుండా వ్యాపారాల్లో ఆర్థిక లాభాలు పొందే అవకాశంలున్నాయి. ముఖ్యంగా ఉద్యోగాలు చేస్తున్న వారికి మీ అధికారుల నుంచి మంచి ప్రశంసలు కూడా లభిస్తాయి. కుటుంబ సభ్యులతో బయటికి వెళ్లే అవకాశాలు కూడా ఉన్నాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. అనుకోకుండా ఎలాంటి పనులు చేసిన సులభంగా విజయాలు సాధించగలుగుతారు.

Also Read: Sankranthi Muggulu 2026: సంక్రాంతి పండగ రోజు తప్పకుండా వేసుకోవలసిన 5 ముగ్గులు ఇవే..

Also Read: Sankranthi Muggulu 2026: సంక్రాంతి పండగ రోజు తప్పకుండా వేసుకోవలసిన 5 ముగ్గులు ఇవే..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
comment0
Report
HDHarish Darla
Jan 14, 2026 05:32:00
Hyderabad, Telangana:

ICC T20 World Cup Americas Qualifier: వచ్చే నెలలో ప్రారంభం కానున్న టీ20 ప్రపంచకప్ 2026 ఆతిథ్య దేశమైన భారత్, అమెరికా (USA) క్రికెట్ జట్టుకు గట్టి షాక్ ఇచ్చింది. ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు భారత్, శ్రీలంక వేదికలుగా ఈ మెగా టోర్నీ జరగనుంది. అయితే, టోర్నీ ప్రారంభానికి ముందే అమెరికా జట్టులోని నలుగురు కీలక ఆటగాళ్లకు వీసా చిక్కులు ఎదురవ్వడం ఇప్పుడు అంతర్జాతీయ క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

పాకిస్థాన్ మూలాలే శాపమా?
అమెరికా జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ, ఆ జట్టులోని నలుగురు కీలక ఆటగాళ్లు అలీ ఖాన్, షాయన్ జహంగీర్, మహ్మద్ మోసిన్, ఎహ్సాన్ ఆదిల్ పాకిస్థాన్‌లో జన్మించారు. వీరు ప్రస్తుతం అమెరికా పౌరసత్వం కలిగి ఉన్నప్పటికీ, భారత వీసా నిబంధనల ప్రకారం పాకిస్థాన్ మూలాలున్న వారు అదనపు భద్రతా తనిఖీలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. భద్రతా కారణాల దృష్ట్యా భారత ప్రభుత్వం ఈ విషయంలో అత్యంత కఠినంగా వ్యవహరిస్తోంది.

"పాకిస్థాన్ మూలాలున్న కారణంగా మా నలుగురికి భారత వీసా దొరకలేదు. దీనివల్ల మేము వరల్డ్ కప్‌కు దూరం అయ్యే పరిస్థితి కనిపిస్తోంది" అని స్టార్ పేసర్ అలీ ఖాన్ ఒక వీడియో సందేశంలో ఆవేదన వ్యక్తం చేశారు.

గతంలోనూ ఇవే ఇబ్బందులు
క్రికెటర్లకు భారత్ వచ్చే సమయంలో వీసా సమస్యలు ఎదురవ్వడం ఇదే మొదటిసారి కాదు. గతంలో పలువురు ఆటగాళ్లు ఇలాంటి ఇబ్బందులే పడ్డారు. ఆస్ట్రేలియా ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా, ఇంగ్లాండ్ స్పిన్నర్లు షోయబ్ బషీర్, రెహాన్ అహ్మద్ వంటి వారు 2023 వన్డే వరల్డ్ కప్ సమయంలోనూ కొందరు ఆటగాళ్లకు ఇదే రకమైన జాప్యం జరిగింది.

టెన్షన్‌లో ఇతర జట్లు.. రంగంలోకి ఐసీసీ!
కేవలం అమెరికా మాత్రమే కాకుండా జింబాబ్వే, కెనడా, నెదర్లాండ్స్ వంటి జట్లలో కూడా పాకిస్థాన్ మూలాలున్న ఆటగాళ్లు ఉన్నారు. దీంతో ఆ జట్లు కూడా తమ ఆటగాళ్లకు వీసాలు వస్తాయో లేదో అని ఆందోళన చెందుతున్నాయి. ఈ క్రమంలో ఐసీసీ (ICC) జోక్యం చేసుకుని భారత ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతోంది. మరి భారత ప్రభుత్వం వీరికి మినహాయింపు ఇస్తుందో లేదో వేచి చూడాలి.

Also Read: School Holiday: స్కూళ్లు, ఆఫీసులకు సెలవు ప్రకటన..ఎట్టకేలకు ఆరోజు హాలీడే ఇచ్చిన ప్రభుత్వం..పండగ చేసుకోండి!

Also REad: Washington Sundar Injury: న్యూజిలాండ్‌తో రెండో వన్డేకి ముందు టీమ్ఇండియాకి భారీ షాక్..టోర్నీ నుంచి వైదొలిగిన భారత ఆల్‌రౌండర్!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
DDDharmaraju Dhurishetty
Jan 13, 2026 14:43:02
Hyderabad, Telangana:

Chaturgrahi Yoga Effect On Zodiac: ఈ సంవత్సరం మకర సంక్రాంతి జనవరి 15వ తేదీన వచ్చింది. దేశవ్యాప్తంగా ఈ సంక్రాంతిని రెండు రోజులపాటు జరుపుకుంటున్నారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ పండగను దాదాపు వారం రోజుల పాటు జరుపుకుంటారు. పండగ మూడు రోజులైనప్పటికీ.. ఏడు రోజుల ముందే వివిధ కార్యక్రమాలు మొదలవుతాయి. అలాంటిది ఈ ఏడాది మకర సంక్రాంతికి ముందు రోజే ఎంతో శక్తివంతమైన చతుర్గ్రహి రాజయోగం ఏర్పడుతుంది. ఈ రాజయోగానికి ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది.  సాధారణంగా మకర రాశిలో సూర్యుడు ప్రవేశించిన తర్వాతే మకర సంక్రాంతి జరుపుకుంటారు. అయితే మకర రాశిలో ఇప్పటికే కొన్ని గ్రహాలు సంచార దశలో ఉన్నాయి. సూర్యుడు వెళ్లిన వెంటనే ఈ గ్రహాల సంయోగం ఏర్పడుతుంది. దీని కారణంగానే చతుర్గ్రహి రాజయోగం ఏర్పడబోతోంది. ముఖ్యంగా సూర్యుడితోపాటు శుక్రుడు, బుధుడు, బుజుడీ కలయిక జరగబోతోంది. దీంతో ఈ యోగం ఏర్పడి అన్ని రాశుల వారిపై ప్రభావం చూపుతుంది. 

ఈ రాశులవారికి బంపర్‌ లాభాలు:
మేషరాశి 
చతుర్గ్రహి రాజయోగం వల్ల మేషరాశి వారికి కెరీర్ పరంగా అద్భుతమైన విజయాలు కలుగుతాయి. ఉద్యోగాలు చేస్తున్న వారికి ఈ సమయంలో పదోన్నతులు కూడా లభిస్తాయి. అలాగే కొత్త కొత్త బాధ్యతలు లభించడమే కాకుండా ఉద్యోగాలు చేస్తున్న వ్యక్తులకు కొత్త లొకేషన్ లో పోస్టింగ్ కూడా కలుగుతుంది. వ్యాపారాలు చేస్తున్న వ్యక్తులకు పెద్ద పెద్ద ఆర్డర్లు కూడా లభించబోతున్నాయి. సమాజంలో గౌరవం పెరగడమే కాకుండా.. తల్లిదండ్రులు లేదా సీనియర్ల నుంచి కూడా మంచి సపోర్టు లభించి.. ఎన్నో రకాల ప్రయోజనాలు పొందుతారని జ్యోతిష్యులు చెబుతున్నారు.

కన్యా రాశి 
కన్యా రాశిలో జన్మించిన వ్యక్తులకు కూడా చతుర్గ్రహి రాజయోగం వల్ల అదృష్టం ఊహించని స్థాయిలో పెరుగుతుంది. ముఖ్యంగా పోటీ పరీక్షలు రాసే విద్యార్థులకు ఈ సమయం విశేషమైన ప్రయోజనాలను అందిస్తుంది. అలాగే కోర్టు సంబంధిత కేసుల నుంచి కూడా కాస్త ఉపశమనం కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా పెండింగ్లో ఉన్న పనులన్నీ ఎంతో సింపుల్గా పూర్తవుతాయి. మతపరమైన కార్యక్రమాలపై ఆసక్తి కూడా పెరిగి.. దేవాలయాలు సందర్శించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. దూర ప్రయాణాలు చేసే వ్యక్తులకు ఈ సమయం ఎన్నో అద్భుతమైన అవకాశాలను అందిస్తుంది. కుటుంబంలో ఆనందాన్ని కూడా పెంచే వార్తలు వినగలుగుతారు.

ధనస్సు రాశి 
ధనస్సు రాశిలో జన్మించిన వ్యక్తులకు కూడా ఈ సమయం అద్భుతమైన ఫలితాలనందిస్తుంది. ముఖ్యంగా వీరికి ఈ సమయం చాలా శుభప్రదంగా ఉండబోతోంది. ఉద్యోగాలు చేస్తున్న వ్యక్తులకు విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయి. వ్యాపారాలు విస్తరించే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. అంతేకాకుండా రోజు వారి జీవితంలో సమతుల్యత పెరుగుతుంది. పెట్టుబడులు పెట్టే వారికి అద్భుతమైన అవకాశాలు కూడా లభించబోతున్నాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. 

మకర రాశి 
చతుర్గ్రహి రాజయోగం కారణంగా మకర రాశి వారికి ఈ సంక్రాంతి సమయం నుంచి ఎన్నో రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ఈ రాశి కలిగిన వ్యక్తులు అనేక రంగాల్లో అద్భుతమైన విజయాలు సాధించగలుగుతారు. అలాగే వీరికి ఈ సమయంలో ఆత్మవిశ్వాసం కూడా అంచెలంచెలుగా పెరుగుతుంది. కెరీర్ పరంగా కొత్త శిఖరాలను చేరే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఎప్పటినుంచో అనేక సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులకు ఎంతో సులభంగా పరిష్కారం కూడా లభిస్తుంది. దీర్ఘకాలిక సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి.

Also Read: Sankranthi Muggulu 2026: సంక్రాంతి పండగ రోజు తప్పకుండా వేసుకోవలసిన 5 ముగ్గులు ఇవే..

Also Read: Sankranthi Muggulu 2026: సంక్రాంతి పండగ రోజు తప్పకుండా వేసుకోవలసిన 5 ముగ్గులు ఇవే..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
comment0
Report
DDDharmaraju Dhurishetty
Jan 13, 2026 14:28:59
Hyderabad, Telangana:

Surya Dev Favorite Zodiac Signs Telugu: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. సూర్యుడిని స్థానం ప్రతిష్ట తీసుకునే నిర్ణయాలకు చిహ్నంగా భావిస్తారు. అందుకే ఈ గ్రహానికి ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. అలాగే భూమిపై ఉండే సమస్త జీవులకు సూర్యుడు గొప్ప శక్తిని అందిస్తాడు. అలాగే ఈ గ్రహాన్ని అన్ని గ్రహాలకు రారాజుగా కూడా పిలుస్తారు.. జాతకంలో ఈ గ్రహం శుభస్థానంలో ఉన్న రాశుల వారికి అద్భుతమైన ప్రశంసలతో పాటు ఆనందం ఊహించని స్థాయిలో పెరుగుతుంది. సమాజంలో గౌరవం, విశ్వాసం లభిస్తుంది. అలాగే కీర్తి, ప్రతిష్టలు కూడా ఊహించని స్థాయిలో పెరిగే అవకాశాలుంటాయి. కాబట్టి ఈ గ్రహం సంచారం చేసిన ప్రతిసారి అన్ని రాశుల వారి జీవితాల్లో ఎన్నో మార్పులు సంభవిస్తూ ఉంటాయి.

గ్రహాలకు రాజుగా భావించే సూర్యుడు ప్రతినెల ఒక రాసి నుంచి మరొక రాశికి తప్పకుండా సంచారం చేస్తూ ఉంటాడు. మొత్తం రాశులన్నీ చుట్టేయడానికి దాదాపు 12 నెలల పాటు సమయం పడుతుంది. అలాగే అప్పుడప్పుడు ఈ గ్రహం నక్షత్ర సంచారం కూడా చేస్తుంది. కాబట్టి ఈ సమయంలో ఏర్పడిన ప్రభావం కూడా మొత్తం అన్ని రాశుల వారిపై పడుతుంది. అలాగే ఈ గ్రహానికి కొన్ని దేవతలకు రాశులకు ప్రత్యేకమైన సంబంధాలు ఉంటాయి. అందుకే సూర్యుడు ఎల్లప్పుడూ కొన్ని రాశులు అంటే ఎంతో ఇష్టపడుతూ ఉంటాడు. అంతేకాకుండా ఆయారాశుల వారి జీవితాల్లో అద్భుతమైన మార్పులు కూడా తీసుకువస్తాడు. ఇంతకీ సూర్యుడు అత్యంత ఇష్టపడే రాశులేవో ఇప్పుడు తెలుసుకోండి.

ఈ రాశులవారికి ఊహించని డబ్బు:
మేషరాశి 
సూర్యుడు అత్యంత ఇష్టపడే రాశుల్లో మేషరాశి ఒకటి. ఈ రాశుల వారికి ఎల్లప్పుడూ సూర్యుడి అనుగ్రహం లభిస్తుంది. కాబట్టి వీరు ఎంతో ఆత్మవిశ్వాసంతో నిండి ఉండి.. పనులు చేయడం వల్ల సులభంగా విజయాలు సాధిస్తారు.. అలాగే కష్టపడి పనులు చేసేందుకు ఇష్టపడతారు. వీరు ఎలాంటి కష్టతరమైన పనులైన ఎంతో సులభంగా చేసి అద్భుతమైన విజయాలు సాధించగలిగే అదృష్టాన్ని పొందగలుగుతారు. ముఖ్యంగా ఉద్యోగాలు చేస్తున్న వారు ఎల్లప్పుడూ ప్రమోషన్స్ పొందడమే.. కాకుండా సమాజంలో గౌరవాన్ని సంపాదించుకోగలుగుతారు. అలాగే కొన్ని సందర్భాల్లో వీరు కొత్త అవకాశాలు పొందుతారు. దీంతో పాటు ఆకస్మాత్తుగా పనుల్లో విజయాలు సాధించే అదృష్టాన్ని సూర్యుడు అందిస్తాడు.

సింహరాశి 
అలాగే సింహరాశిలో జన్మించిన వ్యక్తులకు కూడా ఎల్లప్పుడూ సూర్యుడి అనుగ్రహం లభిస్తుంది. కాబట్టి వీరు ఎంతో ఆకర్షణీయంగా కనిపించగలుగుతారు. అంతేకాకుండా వీరు చాలా ధైర్యంతో ముందుకు సాగుతూ ఉంటారు ఆత్మవిశ్వాసం నిండి ఎలాంటి పనులైన చేసేందుకు సిద్ధమవుతారు వీరికి ధైర్యం కూడా ఊహించని స్థాయిలో ఉంటుంది.. కాబట్టి కెరీర్ పరంగా ఎలాంటి పురోగతినైనా సాధించే అవకాశాలుంటాయి. ముఖ్యంగా వీరికి ఆర్థిక శ్రేయస్సు కూడా లభిస్తుంది.. వీరు సమాజంలో నాయకత్వ లక్షణాలతో ముందుకు వెళ్తారు. రాజకీయ నాయకులైతే భాద్యతలను కూడా స్వీకరిస్తారు. ఇక జీవితంలో ఎలాంటి అడ్డంకులు వచ్చిన దగ్గరుండి పోరాడి.. వాటి నుంచి పరిష్కారం పొందుతారు. పనుల్లో ఎంతో ఓర్పుగా ఉండి వాటిని పూర్తిచేస్తారు. జీవితం ఎల్లప్పుడు విజయం దిశగా కొనసాగుతూనే ఉంటుంది.

Also Read: Happy Bhogi: భోగి పండగ విషెస్ HD ఫొటోస్, గ్రీటింగ్స్..

ధనస్సు రాశి 
ధనస్సు రాశిలో జన్మించిన వ్యక్తులకు కూడా ఎల్లప్పుడూ అదృష్టం ఊహించని స్థాయిలో పెరుగుతూనే ఉంటుంది. ముఖ్యంగా వీరికి సూర్యుడి అనుగ్రహం లభించడం వల్ల జ్ఞానంతో పాటు సంపాదన రెట్టింపు అవుతుంది. అలాగే ఎలాంటి ఉద్యోగాలు చేసిన త్వరగా అభివృద్ధి చెంద గలుగుతారు.. వ్యాపారాల్లో అధిపతులుగా నిలుస్తారు. దీంతోపాటు సమాజంలో గౌరవాన్ని కూడా పొందే అదృష్టాన్ని కలిగి ఉంటారు. ఇక సూర్యుడి అనుగ్రహం వల్ల ఎలాంటి సమస్యలు వచ్చిన తొందరగానే పరిష్కరించుకోగలుగుతారు. అంతేకాకుండా కష్ట సమయాల్లో కూడా అద్భుతమైన నిర్ణయాలు తీసుకోవడంలో వీరు దిట్ట అని చెప్పొచ్చు. సూర్యుడి ప్రభావంతో జీవితంలో వచ్చే ఎలాంటి ఇబ్బందులనైనా అధికమించగలుగుతారు. 

Also Read: Happy Bhogi: భోగి పండగ విషెస్ HD ఫొటోస్, గ్రీటింగ్స్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
comment0
Report
DDDharmaraju Dhurishetty
Jan 13, 2026 09:18:59
Hyderabad, Telangana:

Realme P3 Lite 5G Price Drop: అద్భుతమైన ఫీచర్లతో కూడిన మంచి మొబైల్ సంక్రాంతి సందర్భంగా కొనుగోలు చేయాలనుకుంటున్నారా? మీకోసం ఫ్లిప్‌కార్ట్‌ అద్భుతమైన డిస్కౌంట్ ఆఫర్స్ అందిస్తున్నాయి. ముఖ్యంగా కొన్ని చైనీ మొబైల్ తయారీ కంపెనీలకు సంబంధించిన స్మార్ట్‌ఫోన్స్ అత్యంత తక్కువ ధరకే అందుబాటులో ఉన్నాయి. అలాగే వాటిపై ఎన్నో రకాల బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి. అయితే, ఈ మొబైల్‌పై అందుబాటులో ఉన్న ఆఫర్స్ ఏంటో? దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. 

సంక్రాంతి సందర్భంగా రియల్ మీ P3 Lite 5G మొబైల్ చాలా తగ్గింపు ధరకే అందుబాటులో ఉంది ముఖ్యంగా రియల్ మీ మొబైల్ కొనుగోలు చేయాలనుకునే వారికి ఇదే అవకాశంగా భావించవచ్చు. అలాగే ఈ మొబైల్ ఎన్నో రకాల అద్భుతమైన ఫీచర్లను కలిగి ఉంది. ముఖ్యంగా ఇది 6.67-అంగుళాల HD+ IPS LCD డిస్ప్లేతో అందుబాటులోకి వచ్చింది. 

ఇక ఈ మొబైల్ స్క్రీన్ చాలా ప్రత్యేకమైన 120Hz రిఫ్రెష్ రేట్, 625 నిట్స్ బ్రైట్‌నెస్‌తో అందుబాటులోకి వస్తుంది. ఇది చాలా శక్తివంతమైన MediaTek Dimensity 6300 5G చిప్‌సెట్ ప్రాసెసర్ తో లభిస్తోంది. అలాగే ఇది 6000mAh భారీ బ్యాటరీ, 45W SUPERVOOC ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ను కూడా కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ వెనక భాగంలో అద్భుతమైన కెమెరా మాడ్యూయల్‌ని కలిగి ఉంటుంది. ముఖ్యంగా ఇది 32MP మెయిన్ కెమెరాతో అందుబాటులోకి వచ్చింది. ఫ్రంట్ భాగంలో వీడియో కాలింగ్ కోసం 8MP ఫ్రంట్ కెమెరా ఉంది.. ఇక ఇది IP64 రేటింగ్‌తో వస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 15 ఆధారిత రియల్ మీ UI 6.0పై నడుస్తుంది.

సంక్రాంతి ఆఫర్స్‌తో పాటు రిపబ్లిక్ డే సందర్భంగా కొనుగోలు చేసే వారికి ఆఫర్ల మీద ఆఫర్లు ఈ మొబైల్ పై అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం మార్కెట్‌లో ఈ మొబైల్ రెండు స్టోరేజ్ వేరియంట్లలో అందుబాటులో ఉంది ఇందులోని మొదటి స్టోరేజ్ వేరియంట్ 4 జిబి ర్యామ్‌ని కలిగి ఉంటుంది. అలాగే రెండవ స్టోరేజ్ వేరియంట్ 6GB ర్యామ్‌తో అందుబాటులోకి వచ్చింది. ఇక మొదటి స్టోరేజ్ వేరియంట్ పై ప్రత్యేకమైన డిస్కౌంట్ ఆఫర్ అందుబాటులో ఉంది మార్కెట్లో దీని ధర MRP రూ.12,999 కాగా ఇప్పుడే కొనుగోలు చేసే వారికి.. రూ.10,499 కే పొందవచ్చు.

Also Read: Samsung Galaxy F07: ఫ్లిప్‌కార్ట్‌లో సంక్రాంతి బంపర్‌ డిస్కౌంట్‌.. రూ.1,499కే Samsung Galaxy F07 మొబైల్..

ఇక బ్యాంక్ ఆఫర్స్‌తో ఈ స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకుంటే అద్భుతమైన తగ్గింపు లభిస్తుంది. ఈ ఆఫర్స్‌లో భాగంగా ఫ్లిప్‌కార్ట్‌ అనుసంధానం యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్, ఎస్బిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డులను వినియోగించి పేమెంట్ చేస్తే రూ.500 వరకు ప్రత్యేకమైన డిస్కౌంట్ లభిస్తుంది. అంతేకాకుండా ఎక్స్చేంజ్ ఆఫర్ వినియోగించి ఈ మొబైల్ కొనుగోలు చేస్తే, ఏకంగా రూ.9,600 వరకు బోనస్ పొందవచ్చు. ఇక అన్ని ఆఫర్స్ పోను ఈ మొబైల్‌ను కేవలం రూ.499కే సొంతం చేసుకోవచ్చు.

Also Read: Samsung Galaxy F07: ఫ్లిప్‌కార్ట్‌లో సంక్రాంతి బంపర్‌ డిస్కౌంట్‌.. రూ.1,499కే Samsung Galaxy F07 మొబైల్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
comment0
Report
Advertisement
Back to top