icon-pinewzicon-zee
PINEWZ
become creator
Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back

हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|

Raksha Bandhan: రాఖీ కట్టడం మహాపాపం.. ఈ వింత గ్రామం కథేంటో తెలుసా?

Hyderabad, Telangana:

The 205-year-old Mystery News: భారతదేశవ్యాప్తంగా అన్నాచెల్లెళ్లు.. అక్క తమ్ముళ్ల అనుబంధానికి ప్రతీకగా రక్షాబంధన్ ఎంతో ఘనంగా.. ఆనందోత్సాహాల మధ్య జరుపుకుంటున్నారు.. సోదరుడి మణికట్టుపై సోదరీ రాఖీ కట్టి.. అతని దీర్ఘాయుష్షును కోరుకుంటుంది.. అయితే, దేశమంతా ఒకే రోజు ఈ పండగను జరుపుకుంటే.. ఓ గ్రామంలో మాత్రం రక్షాబంధన్ రోజున రాఖీ కట్టడాన్ని మహా అపచారంగా భావిస్తూ ఉంటారు.. వినడానికి ఆశ్చర్యం కలిగిస్తున్నప్పటికీ.. ఇది అక్షరాల నిజం.. పండగకు సరిగ్గా ఒకరోజు ముందు మాత్రమే ఇక్కడ రాఖీ కడుతూ ఉంటారట... ఇంతకీ ఆ గ్రామం ఏంటి? దీని వెనుక ఉన్న 205 ఏళ్ల నాటి చరిత్ర ఏమిటి? పూర్తి వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం..

గుజరాత్ రాష్ట్రంలోని వనస్కాంత జిల్లా.. పాలంపూర్ కు 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న చదోతర్ గ్రామంలోని ఈ వింత ఆచారం కొనసాగుతోంది.. ఈ ఊరిలో రక్షాబంధన్ రోజున రాఖీ కట్టడం ఆశుభమని నమ్ముతూ ఉంటారట.. అందుకే దేశవ్యాప్తంగా పండగ జరుపుకోవడానికి సరిగ్గా ఒకరోజు ముందే ఇక్కడ మహిళలు తమ అన్నదమ్ములకు రాఖీ కట్టి ఘనంగా పండగ జరుపుకుంటూ ఉంటారు.. ఈ సాంప్రదాయం ఈనాటిది కాదట.. దాదాపు 205 ఏళ్ల నాటి క్రితం ప్రారంభమై నేటికీ కొనసాగుతూ వస్తోందట..

స్థానిక కథనాల ప్రకారం.. 205 ఏళ్ల నాటి ఈ గ్రామంలో ఒక భయంకరమైన అంటువ్యాధి ప్రబలించిందట.. ఆ మహమ్మారి దెబ్బకు పెద్ద సంఖ్యలో మనుష్యులతో పాటు మూగజీవాలు కూడా ప్రాణాలు కోల్పోయాయట.. ప్రాణ భయంతో వనికిపోయిన గ్రామస్తులంతా కలిసి ఊరి శివాలయంలో ఉన్న ఒక సాధు వద్దకు వెళ్లి ఊర్లో ఉన్న పాలనంత ఒక చోటుకు చేర్చి.. ఆ పాలను ఊరి నలుమూలల చల్లుమని చెప్పారట.. ఆయన చెప్పినట్లుగానే గ్రామస్తులు ఆ పాలనంత ఊరంతా చల్లారు.. ఆశ్చర్యకరంగా.. కొద్దిసేపటికి పరిస్థితి అంతా శాంతించిందట.. వ్యాధి ఉధృతి తగ్గిపోయి గ్రామ సురక్షితంగా మారిపోయిందట..

ఆ తర్వాత ఆ సాధువు గ్రామస్తులతో మాట్లాడుతూ.. ఇకపై ఈ గ్రామంలో ఏ సోదరి కూడా రక్షాబంధన్ రోజున తన సోదరుడి చేతికి రాఖీ కట్టకూడదని ఆదేశించారట.. ఒకవేళ అలా చేస్తే గ్రామానికి కీడు జరుగుతుందని కూడా హెచ్చరించారట.. అప్పటినుంచి ఈ గ్రామంలో ఏ ఆడపడుచు రాఖీ పౌర్ణమి రోజున సోదరుడికి రాఖీ కట్టదట..

Also Read: Viral Pic: ఇదేం క్రియేటివిటీ రా బాబు.. మూత్రం పోస్తూ ప్రీ వెడ్డింగ్ ఫోటో స్టిల్స్‌..

ఈ ఆచారం కారణంగా.. పండగకు ముందు రోజే గ్రామంలోని ఆడపడుచులంతా పుట్టింటికి వచ్చి.. అన్నదమ్ములకు రాఖీ కడతారు.. ఆ రోజున ఆ ఇంటి కోడళ్ళతో పాటు తమ ఆడపడుచులకు ఘనంగా స్వాగతం పలికి ఆతిథ్యం ఇస్తారు.. ఇక అసలు పండగ రోజున ఈ కోడళ్ళు తమ పుట్టింటికి వెళ్లి.. తమ సోదరులకు రాఖీ కడతారు.. ఇలా 205 ఏళ్ల క్రితం నాటి తమ పూర్వీకుల నమ్మకాన్ని ఆచారాన్ని ఈ గ్రామస్తులు నేటికీ ఎంతో శ్రద్ధగా కొనసాగిస్తూ వస్తున్నారు.. ఆధునిక యుగంలోనూ పాత నమ్మకాలను ఏమాత్రం వదలకుండా పాటిస్తున్న ఈ గ్రామస్తుల తీరు నిజంగా ఆశ్చర్యం కదా..

Also Read: Viral Pic: ఇదేం క్రియేటివిటీ రా బాబు.. మూత్రం పోస్తూ ప్రీ వెడ్డింగ్ ఫోటో స్టిల్స్‌..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
0
Report

రాఖీ వేళ RTC చార్జీల మంట.. స్పెషల్ బస్సుల పేరుతో దోపిడీ!

Hyderabad, Telangana:

Rtc Extra Fares News: అన్నా చెల్లెళ్లతో పాటు అక్క తమ్ముళ్ల అనుబంధానికి ప్రతీకైనా రాఖీ పండగ సంతోషాన్ని ఆర్టీసీ చార్జీల మంట ఆవిరి చేస్తోంది. సంతులకు వెళ్లి కుటుంబ సభ్యులతో పండగ జరుపుకుందాం అనుకునే. సగటు ప్రయాణికుడి ఆశలపై ఆర్టీసీ యాజమాన్యం నీళ్లు చల్లుతూ వస్తుంది.. పండగపూట ఉండే రద్దీని ఆసరాగా చేసుకొని.. స్పెషల్ బస్సుల ముసుగులో ఇష్టానుసారంగా చార్జీలు పెంచుతూ ప్రయాణికుల జేబులకు భారీగా చిల్లులు పెడుతోంది.. ప్రజా రవాణా వ్యవస్థగా సేవలు అందించాల్సిన సంస్థ.. పండుగ ర దీని పూర్తిగా క్యాష్ చేసుకొనే పనిలో పడిందన్న తీవ్ర విమర్శలు ప్రయాణికులనుంచి వ్యక్తం అవుతూ ఉన్నాయి..

సాధారణ రోజుల్లో హైదరాబాద్ నుంచి కరీంనగర్ కు నాన్ ఏసీ బస్సుల్లో ప్రయాణానికి కేవలం రూ.290 చార్జి ఉంటుంది.. కానీ ఇప్పుడు స్పెషల్ బస్సుల పేరుతో 1.50 రూల్ను తెరపైకి తీసుకువచ్చి అదనంగా.. రూ.100 నుంచి రూ.150 వరకు ముక్కు పిండి వసూలు చేస్తున్నారట.. హైదరాబాద్ నుంచి కరీంనగర్ కు వెళ్లే మెట్రో డీలక్స్ స్పెషల్ బస్సుల్లో ఏకంగా రూ.400 వసూలు చేస్తుండడం ఆశ్చర్యం కలిగిస్తుందని ప్రయాణికులు చెబుతున్నారు. ఇక సూపర్ లగ్జరీ బస్సుల్లో ఈ అదనపు చార్జీల బాదుడు మరింత దారుణంగా ఉందట.. దీంతో బస్టాండ్లకు చేరుకున్న ప్రయాణికులు పెరిగిన చార్జీలు చూసి లాబోదిబోమంటున్నారు..

బస్టాండ్లలో రద్దీ ఉండడంతో.. ఎలాగోలా సీట్లు దొరికితే చాలనుకుని బస్సులు ఎక్కుతున్న ప్రయాణికులకు కండక్టర్లు చుక్కలు చూపిస్తున్నారు. బస్సు ఎక్కిన తర్వాత మార్గ మధ్యలో టికెట్ ఇచ్చే సమయంలో స్పెషల్ బస్సు పేరుతో ఈ పెంచిన చార్జీలను అకస్మాత్తుగా వసూలు చేస్తున్నారని ప్రయాణికులు తెలుపుతున్నారు.. ఇదేంటని ప్రశ్నిస్తే ప్రయాణికులపై కండక్టర్లు దురుసుగా ప్రవర్తిస్తున్నారని ఆరోపణలు కూడా జోరుగా వినిపిస్తున్నాయి..

సామాన్యుల పరిస్థితి ఇలా ఉంటే.. క్షేత్రస్థాయిలో వార్తలు సేకరించే జర్నలిస్టులకు కూడా ఈ స్పెషల్ బస్సుల్లో చేదు అనుభవం ఎదురవుతోందట... జర్నలిస్టులకు ప్రభుత్వం కల్పించిన వన్ బై థర్డ్ రాయితీ రూల్ను స్పెషల్ బస్సుల్లో వర్తించడం లేదు.. దీనిపై అధికారులతో పాటు సిబ్బందిని ప్రశ్నిస్తే.. టికెట్ ఇచ్చే TIMS మిషన్లలో ఆప్షన్లు చూపించడం లేదు అంటూ.. పొంతన లేని.. నిర్లక్ష్యపు సమాధానాలు చెబుతూ వస్తున్నారట..

ఆర్టీసీ ఉద్యోగులతో పాటు అధికారుల సమన్వయ లోపం, నిర్లక్ష్యం కారణంగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.. ఏ బస్సు స్పెషల్ బస్సు అనేది.. ఏది రెగ్యులర్ బస్సు అని తెలియక.. గందరగోళానికి గురవుతున్నారు. దీనిపై ఉన్నత అధికారులతో పాటు ప్రభుత్వం తక్షణమే స్పందించి ఈ స్పెషల్ చార్జీల దోపిడీకి అడ్డుకట్ట వేయాలని.. పండగ పూట సామాన్యులు ఆర్థిక భారం లేకుండా సంతోషంగా ప్రయాణించేలా చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తూ వస్తున్నారు..

Also Read: Viral Pic: ఇదేం క్రియేటివిటీ రా బాబు.. మూత్రం పోస్తూ ప్రీ వెడ్డింగ్ ఫోటో స్టిల్స్‌..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
0
Report

Irumudi Controversy: మంత్రి నారా లోకేష్ వద్దకు 'ఇరుముడి' పంచాయితీ! వివాదాల నడుమ ఉపాధ్యాయ సంఘాల ఫిర్యాదు!

Vijayawada, Andhra Pradesh:

Irumudi Controversy Nara Lokesh: ఓ వైపు కలెక్షన్లు, బ్లాక్‌బస్టర్ టాక్‌తో నడుస్తున్న 'ఇరుముడి' సినిమా చుట్టూ తీవ్ర వివాదం ముసురుకుంది. చిత్రంలో ప్రభుత్వ ఉపాధ్యాయుల గౌరవానికి భంగం కలిగించేలా, విద్యా వ్యవస్థను తప్పుగా చిత్రీకరించేలా అభ్యంతరకర సన్నివేశాలు ఉన్నాయని ఉపాధ్యాయ సంఘాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రాథమికోపాధ్యాయ సంఘం (ఏపీటీఏ) రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసింది.

ఎమ్మెల్సీ బోరా గోపి మూర్తి అభ్యంతరాలు..
పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో మీడియాతో మాట్లాడిన ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ బోరా గోపి మూర్తి చిత్ర యూనిట్ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అల్లూరి సీతారామరాజు జిల్లా, పాడేరు నియోజకవర్గంలోని ఒక జడ్పీ బాలికల ఉన్నత పాఠశాలలో ఈ సినిమా షూటింగ్ జరిగిందని ఆయన తెలిపారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన విద్యార్థినుల యూనిఫామ్‌లను సినిమాలో యథాతథంగా చూపించడం సరైన పద్ధతి కాదని ఆయన పేర్కొన్నారు.

ముఖ్యంగా, సినిమాలో ఒక మహిళా ఉపాధ్యాయురాలి పాత్రను అత్యంత నెగటివ్‌గా, క్రూరంగా చూపించారని విమర్శించారు. స్పెషల్ క్లాసుల పేరుతో ఒక విద్యార్థినిని స్థానిక ఎమ్మెల్యే వద్దకు టీచర్ పంపే దృశ్యం అత్యంత జుగుప్సాకరంగా ఉందని, ఇలాంటి కల్పిత సన్నివేశాలు ఉపాధ్యాయులతో పాటు ప్రజాప్రతినిధులపై కూడా సమాజంలో తప్పుడు భావనలు కలిగించే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

సామాజిక బాధ్యత విస్మరించవద్దు..
సినిమా అనేది ఎంతో శక్తివంతమైన మాధ్యమమని, భావప్రకటన స్వేచ్ఛ పేరుతో దర్శకులు, నిర్మాతలు సామాజిక బాధ్యతను విస్మరించకూడదని ఉపాధ్యాయ సంఘాల నేతలు స్పష్టం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో ఎన్నో సమస్యలను అధిగమిస్తూ పేద, మధ్యతరగతి విద్యార్థులకు నాణ్యమైన విద్యనందిస్తున్న టీచర్ల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే హక్కు ఎవరికీ లేదని తేల్చిచెప్పారు.

రాష్ట్ర ప్రభుత్వం, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ వెంటనే స్పందించి సెన్సార్ బోర్డు ద్వారా ఈ వివాదాస్పద సన్నివేశాలను సినిమా నుంచి తొలగించేలా చర్యలు తీసుకోవాలని వారు కోరారు. లేనిపక్షంలో ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

Also Read: వైసీపీకి మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ గుడ్‌బై?! వచ్చే ఎన్నికల్లో పోటీకి అభ్యంతరం!

Also Read: ఫోన్ సూచనలతో అబార్షన్.. వికటించిన వైద్యం..ఐదు నెలల గర్భిణి దుర్మరణం!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report
Advertisement

Anil Kumar Yadav Politics: వైసీపీకి మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ గుడ్‌బై?! వచ్చే ఎన్నికల్లో పోటీకి అభ్యంతరం!

Nellore, Andhra Pradesh:

Anil Kumar Yadav Quits YSRCP: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో స్థానిక సంస్థల ఎన్నికల వేళ కూటమి, వైఎస్సార్సీపీ మధ్య రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఇరుపక్షాలు 2029 సార్వత్రిక ఎన్నికలను సైతం లక్ష్యంగా చేసుకుని ముందడుగు వేస్తున్నాయి. ఈ క్రమంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్కడైనా కూటమి ఏకగ్రీవం చేసుకుంటే, ఆ నియోజకవర్గ ఇంఛార్జ్‌లకు భవిష్యత్ ఎన్నికల్లో సీటు ఇచ్చేది లేదని వైఎస్ జగన్ స్పష్టం చేశారు. సరిగ్గా ఇదే సమయంలో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ చేసిన ప్రకటన నెల్లూరు వైఎస్సార్సీపీలో తీవ్ర ఆసక్తిని రేకెత్తించింది.

రెండుసార్లు ఎమ్మెల్యే, ఒకసారి మంత్రిగా..
రాబోయే ఎన్నికల్లో తాను బరిలో నిలవకపోవచ్చని అనిల్ కుమార్ యాదవ్ వ్యాఖ్యానించారు. నెల్లూరు జిల్లాలో తనకంటూ ఒక పేజీ, చరిత్ర ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. తాను ఎవరో తెలియని స్థితిలో ఉన్నప్పుడు వైఎస్ జగన్ 2014, 2019లలో వరుసగా టికెట్లు ఇచ్చి, గుర్తించే స్థాయికి తీసుకువచ్చి మంత్రిగా అవకాశం కల్పించారని గుర్తు చేసుకున్నారు. వచ్చే ఎన్నికల్లో పార్టీ నుంచి టికెట్ వచ్చినా, రాకపోయినా రెండుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి మంత్రిగా పనిచేసిన తృప్తి తనకు సరిపోతుందని ఆయన స్పష్టం చేశారు.

నెల్లూరు సిటీలో మారుతున్న సమీకరణాలు..
2019లో వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అనిల్ కుమార్ యాదవ్‌కు కీలకమైన భారీ నీటిపారుదల శాఖ మంత్రిత్వ బాధ్యతలు దక్కాయి. అయితే, మంత్రివర్గ విస్తరణలో భాగంగా అనిల్ స్థానంలో జిల్లాకే చెందిన కాకాని గోవర్ధన్ రెడ్డికి అవకాశం కల్పించారు. అనంతరం 2024 సార్వత్రిక ఎన్నికల్లో అనిల్‌ను నెల్లూరు సిటీ నుంచి తప్పించి నరసరావుపేట లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయించగా, ఆయన ఓటమి చెందారు.

అదే సమయంలో నెల్లూరు సిటీ అసెంబ్లీ స్థానాన్ని ఖలీల్ అహ్మద్‌కు కేటాయించగా, ప్రస్తుత మంత్రి పి.నారాయణ చేతిలో ఖలీల్ 72,489 ఓట్ల భారీ తేడాతో ఓడిపోయారు. ప్రస్తుతం నెల్లూరు సిటీ వైఎస్సార్సీపీ నియోజకవర్గ ఇంఛార్జ్‌గా ఎమ్మెల్సీ పార్వతారెడ్డి చంద్రశేఖర్ రెడ్డి వ్యవహరిస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో చంద్రశేఖర్ రెడ్డి కూడా టికెట్ ఆశిస్తుండటంతో, అక్కడ అనిల్ కు మళ్లీ సీటు దక్కడం కష్టమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలోనే అనిల్ ముందస్తుగా ఈ విధమైన వ్యాఖ్యలు చేశారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. భవిష్యత్తులో జగన్ ఆయనకు ఎలాంటి ప్రాధాన్యత ఇస్తారనేది జిల్లా రాజకీయాల్లో ఉత్కంఠగా మారింది.

Also Read: అర్ధరాత్రి హైవేపై ఘోరం..ఒంటరి మహిళపై మత్తుమందు చల్లి..రన్నింగ్ బస్సులో దారుణం!

Also Read: జనసేనలోకి మంత్రి కొండా సురేఖ కుటుంబం..రాజాసింగ్ త్వరలోనే చేరిక! జనసేన కీలక ప్రకటన!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report

Yerragondapalem Abortion: ఫోన్ సూచనలతో అబార్షన్.. వికటించిన వైద్యం..ఐదు నెలల గర్భిణి దుర్మరణం!

Erragondapalem, Andhra Pradesh:

Yerragondapalem Abortion News: స్థానికుల సమాచారం ప్రకారం.. వైద్యం వికటించి ప్రాణాలు కోల్పోయిన గర్భిణి యర్రగొండపాలెం మండల పరిధిలోని మురారిపల్లె గ్రామానికి చెందిన షేక్ మాబున్నీ (25) ఐదు నెలల గర్భిణి. ఆమెకు భర్త షేక్ చిన్నబాజీ, ఇద్దరు పిల్లలు ఉన్నారు. బుధవారం ఆమెకు తీవ్రమైన కడుపునొప్పి రావడంతో కుటుంబ సభ్యులు యర్రగొండపాలెంలోని జాతీయ రహదారి పక్కన ఉన్న 'డాక్టర్స్ ప్రజా వైద్యశాల'కు తీసుకొచ్చారు. ఆ సమయంలో ఆసుపత్రిలో ఎంబీబీఎస్ అర్హత కలిగిన వైద్యులెవరూ అందుబాటులో లేరు. అయినప్పటికీ సిబ్బంది ఆమెను చేర్చుకుని చికిత్స అందించేందుకు సిద్ధపడ్డారు.

ఫోన్ సూచనల ఆధారంగా సిబ్బంది నిర్వాకం గురువారం ఉదయం సదరు ఆసుపత్రి సిబ్బంది ఓ వైద్యుడిని ఫోన్‌లో సంప్రదించి, మాబున్నీకి అబార్షన్ చేయాలని నిర్ణయించారు. వైద్యుడు ఫోన్ ద్వారా అందించిన సూచనల మేరకు, ఎలాంటి శస్త్రచికిత్స అనుభవం లేని కాంపౌండర్ శ్యామ్, నర్సు కలిసి పిండాన్ని బయటకు తీసేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో తీవ్ర రక్తస్రావం జరిగి పరిస్థితి విషమించడంతో మాబున్నీ ఆసుపత్రిలోనే ప్రాణాలు విడిచింది.

జాతీయ రహదారిపై బంధువుల ఆందోళన వైద్య సిబ్బంది నిర్లక్ష్యమే ప్రాణం తీసిందని ఆరోపిస్తూ మృతురాలి కుటుంబసభ్యులు, బంధువులు మృతదేహంతో జాతీయ రహదారిపై బైఠాయించి రాస్తారోకో చేపట్టారు. అక్రమంగా నడుస్తున్న సదరు ప్రైవేటు ఆసుపత్రిని వెంటనే సీజ్ చేయాలని డిమాండ్ చేశారు. సమాచారం అందుకున్న ఎస్సై దేవకుమార్ ఘటనా స్థలానికి చేరుకుని ఆందోళనకారులతో మాట్లాడారు. భర్త చిన్నబాజీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించగా, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు.

అనుమతులు లేకుండా దశాబ్ద కాలంగా నిర్వహణ ఈ ప్రైవేటు వైద్యశాలను దాదాపు పదేళ్ల క్రితం ఎలాంటి అధికారిక అనుమతులు లేకుండానే ప్రారంభించినట్లు తెలిసింది. గతంలో ఓ ప్రభుత్వ వైద్యుడు దీనిని నడిపించగా, ఆయనపై వచ్చిన ఫిర్యాదులపై అధికారులు చర్యలు తీసుకోలేదన్న విమర్శలు ఉన్నాయి. రెండేళ్ల క్రితం ఆయన బదిలీ కావడంతో అప్పటి నుంచి కాంపౌండర్, నర్సులే డాక్టర్లుగా చలామణి అవుతున్నారు. అధికారుల పర్యవేక్షణ లోపం వల్లే ఈ ఘోరం జరిగిందని స్థానికులు మండిపడుతున్నారు.

Also Read: అర్ధరాత్రి హైవేపై ఘోరం..ఒంటరి మహిళపై మత్తుమందు చల్లి..రన్నింగ్ బస్సులో దారుణం!

Also Read: జనసేనలోకి మంత్రి కొండా సురేఖ కుటుంబం..రాజాసింగ్ త్వరలోనే చేరిక! జనసేన కీలక ప్రకటన!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report

Lunar Eclipse: నేడు చంద్రగ్రహణం, నింగిలో అద్భుతం..'బ్లడ్‌మూన్‌'గా కనువిందు చేయనున్న చంద్రుడు!

Hyderabad, Telangana:

Lunar Eclipse Blood Moon: ఖగోళ ప్రియులకు కనువిందు కలిగించే అద్భుత దృశ్యం నేడు ఆవిష్కృతం కానుంది. నేడు ఆకాశంలో పాక్షిక చంద్రగ్రహణం ఏర్పడబోతోంది. ఈ ఖగోళ ప్రక్రియలో దాదాపు 96 శాతం చంద్రుడిని భూఛాయ కమ్మేయనుంది. మిగిలిన కొద్ది భాగం మాత్రమే సూర్యకాంతితో వెలుగుతూ కనిపిస్తుంది. ఈ నెలలో వచ్చే పున్నమి చంద్రుడిని 'స్టర్జన్ మూన్' అని పిలుస్తారు. గ్రహణ సమయంలో చంద్రుడు ఎరుపు రంగులో ప్రకాశిస్తూ 'రెడ్ మూన్'గా దర్శనమివ్వనున్నాడు.

భారత్‌లో కనిపించదు..
ఈ పాక్షిక చంద్రగ్రహణాన్ని భారత్‌లో నేరుగా వీక్షించే అవకాశం లేదు. గ్రహణం ఏర్పడే సమయం మన దేశంలో పగటి వేళ కావడమే ఇందుకు ప్రధాన కారణం. భారత కాలమానం ప్రకారం ఉదయం 8:03 గంటలకు చంద్రగ్రహణం ప్రారంభమై, సుమారు మూడున్నర గంటల పాటు కొనసాగుతుంది. ఉదయం 9:42 గంటలకు గ్రహణం గరిష్ట స్థాయికి చేరుకుంటుంది. ఆ సమయంలో చంద్రుడి శోభ అత్యంత ఆకర్షణీయంగా మారుతుంది. అయితే ఆ సమయానికి భారత్‌తో పాటు ఇతర ఆసియా దేశాల్లో సూర్యోదయం అయి ఉండటం వల్ల చంద్రుడు కనిపించడు.

కనిపించే ప్రాంతాలు..'బ్లడ్ మూన్' విశేషాలు..
ఈ పాక్షిక చంద్రగ్రహణం పశ్చిమ యూరప్ దేశాలైన స్పెయిన్, పోర్చుగల్, ఫ్రాన్స్, ఇటలీ, జర్మనీల్లో స్పష్టంగా కనిపించనుంది. అలాగే ఉత్తర, దక్షిణ అమెరికా ఖండాల్లోని కొన్ని ప్రాంతాల ప్రజలతో పాటు ఆఫ్రికాలోని కొన్ని ప్రాంతాల్లో ఇది పాక్షికంగా కనిపిస్తుంది. పశ్చిమ ఐరోపా ప్రాంతాల్లో గ్రహణ గరిష్ట సమయం సూర్యోదయానికి అత్యంత సమీపంలో ఉంటుంది. ఆ సమయంలో చంద్రుడు పశ్చిమ దిశగా ఆకాశంలో దాదాపు భూమికి సమాంతరంగా కనిపిస్తాడు.

ఉదయించే సూర్యుడి కాంతి చంద్రుడిపై పడినప్పుడు భూ వాతావరణం ఒక ఫిల్టర్‌లా పనిచేసి, ఎరుపు రంగు కాంతిని మాత్రమే ప్రసరింపజేస్తుంది. దీనివల్ల చంద్రబింబం ఎరుపు-గోధుమ రంగుల కలయికలో ఆకర్షణీయంగా కనిపిస్తూ 'బ్లడ్ మూన్' అనుభూతిని కలిగిస్తుంది.

మళ్లీ 2029లోనే..
ఇటువంటి చంద్రగ్రహణం మళ్లీ 2029 వరకు కనిపించదు. ఆ ఏడాది జూన్‌లో చంద్రుడు పూర్తిగా ఎరుపు రంగులోకి మారే 'బ్లడ్ మూన్ ఎక్లిప్స్' సంభవించనుందని నాసా (NASA) పేర్కొంది. కాగా, ఈ అరుదైన చంద్రగ్రహణాన్ని వీక్షించడానికి నాసా ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.

Also Read; నేపాల్‌లో పెను విలయం..ఆకస్మిక వరదలకు 392 మంది మృతి..290 మంది భారతీయుల ఆచూకీ గల్లంతు!

Also Read: నేపాల్ జలప్రళయం.. మామిడి చెట్టును పట్టుకుని రెండుసార్లు చావును జయించిన కార్మికుడు!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report
Advertisement

Nepal Floods: నేపాల్‌లో పెను విలయం..ఆకస్మిక వరదలకు 392 మంది మృతి..290 మంది భారతీయుల ఆచూకీ గల్లంతు!

Namarjung, Gandaki Province:

Nepal Floods Death Toll: నేపాల్, పొరుగున ఉన్న టిబెట్‌లలో ఆకస్మిక వరదల బీభత్సానికి మృతుల సంఖ్య 392కు చేరింది. మొత్తం 1,468 మంది గల్లంతవగా, అందులో 290 మంది భారతీయులు ఉన్నారు. ఇప్పటివరకు 84 మంది భారతీయులను రక్షించగా, సహాయక చర్యల కోసం భారత్ 47.5 టన్నుల మానవతా సాయాన్ని పంపింది. హిమానీనదం కూలి లెండే నదికి అడ్డంకి ఏర్పడటంతో ఈ విపత్తు సంభవించింది. మరోవైపు కొత్తగా ఏర్పడిన కృత్రిమ సరస్సుతో మరో ముప్పు పొంచి ఉంది.

290 మంది భారతీయుల ఆచూకీ కోసం గాలింపు..
ఈ విపత్తులో చిక్కుకున్న భారత పౌరులను కాపాడేందుకు సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇంకా 290 మంది భారతీయుల ఆచూకీ లభ్యం కాలేదని, ఇప్పటివరకు 84 మందిని రక్షించినట్లు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. రక్షించబడిన వారిలో నిర్మాణంలో ఉన్న త్రిశూలి-1 జలవిద్యుత్ ప్రాజెక్టుకు చెందిన 63 మంది కార్మికులు, తమిళనాడుకు చెందిన 21 మంది ఉన్నారు.

టిబెట్ వైపు చిక్కుకున్న మరో 200 మంది భారతీయులు సురక్షిత ప్రాంతాలకు తరలించాలని కోరగా.. నేపాల్, చైనా, సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలు, ఇతర ఏజెన్సీలతో సమన్వయం చేసుకుంటూ రక్షణ చర్యలు చేపడుతున్నట్లు భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ తెలిపారు. అదనంగా, నేపాల్‌కు భారత్ 47.5 టన్నుల మందులు, ఆహార ప్యాకెట్లు, మానవతా సహాయాన్ని పంపించింది.

భారీగా దెబ్బతిన్న మౌలిక సదుపాయాలు
నేపాల్-టిబెట్ సరిహద్దు సమీపంలో హిమానీనదం కూలిపోవడంతో మంచు, రాళ్లతో కూడిన భారీ హిమపాతం సంభవించింది. ఇది లెండే నది ప్రవాహాన్ని తాత్కాలికంగా అడ్డుకోగా, అనంతరం ఆ సహజ అడ్డంకి ఒక్కసారిగా తెగిపోవడంతో నీరు, బురద, శిథిలాలు ఉధృతంగా దిగువకు పోటెత్తాయి. ఈ వరద ధాటికి రసువా జిల్లాతో పాటు తిమురే, రసువాగధి ప్రాంతాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.
 
వరదల కారణంగా..
35 మోటారు వాహనాల వంతెనలు, 45 వేలాడే వంతెనలు ధ్వంసమయ్యాయి. సుమారు 40 కిలోమీటర్ల మేర రహదారులు, జలవిద్యుత్ మౌలిక వసతులు తీవ్రంగా దెబ్బతిన్నాయి.

సహాయక చర్యలు.. సిబ్బంది గల్లంతు
రహదారులు తెగిపోవడంతో రక్షణ చర్యలు క్లిష్టతరంగా మారాయి. అయినప్పటికీ నేపాల్ పోలీసులు హెలికాప్టర్ల ద్వారా 796 మందిని, భూమార్గం ద్వారా మరో 796 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. రసువా నుంచి 11 మంది భారతీయులతో సహా 27 మంది విదేశీ పర్యాటకులను కాపాడి కాఠ్మండుకు చేర్చారు.

మరోవైపు విధుల్లో ఉన్న 44 మంది నేపాల్ ఆర్మీ సిబ్బంది, 28 మంది నేపాల్ పోలీస్ సిబ్బంది, 13 మంది సాయుధ పోలీసు సిబ్బంది కూడా గల్లంతయ్యారు. అలాగే జలవిద్యుత్ ప్రాజెక్టులు, కస్టమ్స్ కార్యాలయాల్లో పనిచేస్తున్న దాదాపు 160 మంది ఆచూకీ తెలియరాలేదు.

కొత్తగా పొంచి ఉన్న ముప్పు
భోటే కోషి నదీ మూలం వద్ద కొత్తగా ఏర్పడిన ఒక ఆనకట్ట సరస్సు అధికారులను కలవరపెడుతోంది. ఈ సరస్సులో ఇప్పటికే దాదాపు 20 లక్షల క్యూబిక్ మీటర్ల నీరు చేరగా, రాబోయే మూడు రోజుల్లో మరో 30 లక్షల క్యూబిక్ మీటర్ల నీరు వచ్చి చేరే అవకాశం ఉందని అంచనా. ఒకవేళ ఈ ఆనకట్ట తెగితే దిగువ ప్రాంతాలకు మరో పెను ప్రమాదం పొంచి ఉందని, ప్రజలు భోటే కోషి, త్రిశూలి నదీ తీరాలకు దూరంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

Also Read: నేపాల్ జలప్రళయం.. మామిడి చెట్టును పట్టుకుని రెండుసార్లు చావును జయించిన కార్మికుడు!

Also REad: నేపాల్‌లో ప్రకృతి విలయం..ఆకస్మిక వరదలతో భూకంపం..మౌలిక వసతుల విధ్వంసం!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report

Raksha Bandhan Gift Ideas: రక్షా బంధన్ 2026.. తోబుట్టువులను ఆశ్చర్యపరిచే 10 అద్భుతమైన గిఫ్ట్ ఐడియాస్!

Hyderabad, Telangana:

Raksha Bandhan Gift Ideas 2026: తోబుట్టువుల మధ్య ఉండే పవిత్రమైన బంధాన్ని, అమితమైన అనురాగాన్ని సెలబ్రేట్ చేసుకునేందుకు వచ్చే ప్రత్యేకమైన పండుగ రక్షా బంధన్. ఈ రక్షా బంధన్ 2026 పండుగకు మీ తోబుట్టువుల కోసం బహుమతులు కొనడం ఆలస్యమైందా? చింతించకండి! చివరి నిమిషంలో కూడా మీ ప్రేమను మరియు ప్రయత్నాన్ని ప్రతిబింబించేలా, వారి హృదయాలను హత్తుకునే 10 అద్భుతమైన గిఫ్ట్ ఐడియాస్ ఇక్కడ ఉన్నాయి. బహుమతి ఎంత ఖరీదైనది అనేదానికంటే, దాని వెనుక ఉన్న మీ భావమే ఇక్కడ ముఖ్యం.

1) వ్యక్తిగతీకరించిన ఫోటో ఫ్రేమ్: మీ చిన్ననాటి మధురమైన జ్ఞాపకాలు లేదా ఈ మధ్యకాలంలో దిగిన హృదయానికి దగ్గరైన ఏదైనా అందమైన ఫోటోను ఫ్రేమ్ చేసి బహుమతిగా ఇవ్వండి. ఇది మాటలు లేకుండానే మీ పాత జ్ఞాపకాలను మళ్లీ గుర్తుకు తెచ్చి మీ బంధం ఎంత బలమైనదో తెలియజేస్తుంది.

2) చేతితో రాసిన లేఖ లేదా జ్ఞాపకాల స్క్రాప్‌బుక్: హృదయపూర్వకంగా చేతితో రాసిన లేఖకు ఉన్న విలువ మరే బహుమతికీ ఉండదు. మీ మధ్య ఉన్న సరదా ముచ్చట్లు, పాత జ్ఞాపకాలు, మీ తోబుట్టువుపై మీకున్న కృతజ్ఞతను ఈ లేఖ ద్వారా వ్యక్తపరచండి. ఇది చాలా సులువైనది కానీ అత్యంత అర్థవంతమైనది.

3) గిఫ్ట్ కార్డ్‌లు: వారికి ఏమి కొనాలో తెలియక సతమతమవుతుంటే, వారికి ఇష్టమైన బ్రాండ్ యొక్క గిఫ్ట్ కార్డ్ ఇవ్వడం బెస్ట్. దీనివల్ల వారు తమకు నచ్చిన వస్తువును స్వయంగా ఎంపిక చేసుకునే అవకాశం లభిస్తుంది.

4) చాక్లెట్లు లేదా స్వీట్ హ్యాంపర్‌లు: చివరి నిమిషంలో ఎంపిక చేసుకోగలిగే మధురమైన గిఫ్ట్ ఇది. ఒక నోరూరించే చాక్లెట్ల పెట్టె లేదా పండుగ స్వీట్ హ్యాంపర్ మీ తోబుట్టువు ముఖంలో తక్షణమే చిరునవ్వును రప్పిస్తుంది.

5) చర్మ సంరక్షణ లేదా గ్రూమింగ్ కిట్: ఇది ఒక ఆచరణాత్మకమైన, ఉపయోగకరమైన బహుమతి. ఒక మంచి స్కిన్ కేర్ లేదా గ్రూమింగ్ కిట్ అందించడం ద్వారా, మీరు వారి రోజువారీ సంరక్షణపై ఎంతగా శ్రద్ధ చూపుతున్నారో తెలియజేసినట్లవుతుంది.

6) ప్రత్యేకంగా తయారు చేయించిన మగ్ లేదా కుషన్: ఒక కప్పు లేదా కుషన్ (దిండు)పై మీ తోబుట్టువుకు నచ్చేలా అందమైన సందేశాన్ని లేదా చిత్రాన్ని ముద్రించి (కస్టమైజ్ చేసి) ఇవ్వండి. ఇది చిన్న ప్రయత్నమే అయినా వారికి ఎంతో ప్రత్యేకంగా అనిపిస్తుంది.

7) పుస్తకాలు లేదా జర్నల్స్: మీ తోబుట్టువుకు పుస్తకాలు చదవడం లేదా రాయడం అలవాటు ఉంటే, ఒక మంచి పుస్తకం లేదా అందమైన జర్నల్‌ను గిఫ్ట్‌గా ఇవ్వడం చివరి నిమిషంలో చేయగలిగే చక్కటి ఎంపిక.

8) యాక్సెసరీలు (వాచ్, బ్రాస్‌లెట్, చెవిపోగులు): స్టైలిష్ వాచ్, అందమైన బ్రాస్‌లెట్ లేదా చెవిపోగుల జత వంటి చిన్న వస్తువులు కూడా వారి లుక్‌ను తక్షణమే మెరుగుపరుస్తాయి. తక్కువ శ్రమతో గొప్ప అనుభూతిని ఇచ్చే బహుమతి ఇది.

9) పెర్ఫ్యూమ్: ఒక మంచి సువాసన ఇచ్చే పెర్ఫ్యూమ్ ఎప్పటికీ ట్రెండీగానే ఉంటుంది. ఇది చాలా క్లాసిక్ బహుమతిగా నిలవడమే కాకుండా, చివరి నిమిషంలో కూడా చాలా సులభంగా లభిస్తుంది.

10) అనుభూతినిచ్చే బహుమతి (సినిమా, విందు లేదా విహారయాత్ర): కొన్నిసార్లు చేతికి ఇచ్చే వస్తువుల కన్నా మనసుకు ఇచ్చే అనుభూతులు మిన్న. వారితో కలిసి ఒక సినిమా చూడటం, హోటల్‌కు వెళ్లి విందు ఆస్వాదించడం లేదా ఒక చిన్న విహారయాత్రను ప్లాన్ చేయడం ద్వారా నాణ్యమైన సమయం గడపవచ్చు. ఎలాంటి భౌతిక బహుమతికైనా ఇది ఏమాత్రం తీసిపోదు.
 
అంతిమంగా రక్షా బంధన్ అంటే కేవలం బహుమతులు మార్చుకోవడం మాత్రమే కాదు. అది జీవితాంతం నిలిచిపోయే ప్రేమ, ఆప్యాయతతో కూడిన తీపి జ్ఞాపకాల కలయిక. చివరి నిమిషంలో ఇచ్చే ఏ చిన్న బహుమతి అయినా మనస్ఫూర్తిగా ఇచ్చినప్పుడు అది ఎంతో ప్రత్యేకంగా మారుతుంది. కాబట్టి, సమయం లేదని ఒత్తిడికి గురికాకుండా మీ తోబుట్టువులపై మీకున్న గౌరవాన్ని, ప్రేమాభిమానాలను వ్యక్తపరచండి.

Also Read: మీ సోదరులకు రాఖీ ఈ సమయంలో కడితే శ్రేష్టం అంటున్నారు పండితులు..!!

Also Read: తెలుగులో రాఖీ విషెష్‌, మధురమైన కొటేషన్లు, ఫోటోలు..

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report
Advertisement

Tomorrow Holiday: విద్యార్థులకు శుభవార్త.. రేపు అన్నీ పాఠశాలలకు సెలవు.. ఉద్యోగులకు కూడా

Wadgaon, Maharashtra:

School Holiday For Tomorrow: విద్యార్థులు, ప్రభుత్వ ఉద్యోగులతోపాటు బ్యాంకులకు భారీ శుభవార్త. రేపు అంటే శుక్రవారం అందరికీ సెలవు లభిస్తోంది. ప్రభుత్వ పాఠశాలలతోపాటు ప్రైవేటు విద్యాలయాలు, ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులకు సెలవు ఉంది. అయితే ఈ సెలవు అన్నీ ప్రాంతాల్లో లేవు. దేశంలోని పలు ప్రాంతాల్లో ఈ సెలవు ఉంది. అక్కాచెల్లెళ్లు, అన్నాదమ్ముళ్ల మధ్య ఆత్మీయత పంచే రాఖీ పౌర్ణమి సందర్భంగా ఆయా ప్రాంతాల్లో సెలవుల ప్రకటించారు. ఒక రోజు సెలవు పెడితే చాలు మొత్తం మూడు రోజుల సెలవులు లభించే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

హిందూవులకు అత్యంత ప్రధానమైన పండుగ రాఖీ. శ్రావణమాసంలో వచ్చే పౌర్ణమిని ప్రజలు రాఖీ పండుగగా చేసుకుంటారు. ఈ పండుగను తోబుట్టువులు ఆనందోత్సాహాల మధ్య చేసుకుంటుండగా.. శ్రావణ పౌర్ణమి కొన్ని రోజుల్లో అత్యంత పర్వదినంగా భావిస్తారు. దీంతో ఆయా ప్రాంతాల్లో అధికారికంగా సెలవు ఉంది. అన్నాచెల్లెళ్ల అనురాగానికి ప్రతీకగా చేసుకునే రక్షా బంధన్ పండుగ సందర్భంగా పాఠశాలలకు సెలవు ఉంది. అయితే తెలంగాణ, ఏపీలోని బ్యాంకులకు మాత్రం సెలవు లేదు. కానీ ప్రభుత్వ కార్యాలయాలకు కొన్ని ప్రాంతాల్లో సెలవులు ఉన్నాయి. మరికొన్ని ప్రాంతాలు.. ఆయా విభాగాల్లో రేపు సెలవు లేదు. 

భారతదేశంలోని కీలక రాష్ట్రాలైన ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, హర్యానా, రాజస్థాన్, మధ్యప్రదేశ్, బీహార్, ఉత్తరాఖండ్ వంటి రాష్ట్రాల్లో కూడా అన్నీ విద్యాలయాలకు సెలవు ఉంది. ఈ రాష్ట్రాలలో రక్షా బంధన్‌ను అత్యంత వైభవంగా చేసుకుంటుండడంతో అక్కడి రాష్ట్ర ప్రభుత్వాలు సెలవులు ప్రకటించాయి. ఈ రాష్ట్రాల్లోని ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలలకు విద్యాశాఖ క్యాలెండర్ ప్రకారం సెలవు ఉంటుంది.

సెలవులు ఉన్న రాష్ట్రాలు
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, కర్ణాటక,లలో రక్షా బంధన్‌కు సంబంధించి ఎటువంటి సాధారణ ప్రభుత్వ పాఠశాల సెలవు ఉండదు.

ఇక్కడ సెలవు లేదు
రాఖీ పండుగను దేశంలోని పలు రాష్ట్రాల్లో చేసుకోరు. ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాల్లో రాఖీ పండుగ ఉండదు. దీంతో ఆ రాష్ట్రాల్లో పాఠశాలలు యథావిధిగా నడుస్తాయి. అస్సాం, మేఘాలయ, నాగాలాండ్ వంటి ఈశాన్య రాష్ట్రాలలో సెలవు లేదు. 

ప్రైవేటు విద్యాలయాలు
రాఖీ పండుగ సందర్భంగా ప్రైవేటు విద్యాలయాలకు కూడా సెలవు ఉంది. సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ బోర్డులకు అనుబంధంగా ఉన్న ప్రైవేట్ పాఠశాలలు తమ సొంత సెలవుల క్యాలెండర్‌లో కూడా సెలవు ఉంది. అయితే కొన్ని పాఠశాలలు ఆప్షనల్‌ హలీడేగా ప్రకటించాయి.

0
0
Report
Advertisement
Advertisement
Advertisement
Back to top