ఖమ్మంలో ఆర్టీసీ కారుణ్య నియామకాల కోసం ధర్నా
Khammam, Telangana:ఖమ్మం పాత బస్ స్టేషన్ వద్ద PYL ఆధ్వర్యంలో ఆర్టీసీ కారుణ్య నియామకాల కోసం ధర్నా జరిగింది. విధుల్లో మరణించిన మరియు మెడికల్ అన్‌ఫిట్ అయిన కుటుంబాలకు ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. RM వెంటనే స్పందించాలని, సీఎం రేవంత్ రెడ్డి సమస్యలు పరిష్కరించాలని కోరారు.
हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
Telangana Rains: హైదరాబాద్‌తో సహా తెలంగాణలో దంచికొట్టిన వర్షాలు.. ఎక్కడ ఎంత పడిందంటే?
Baddipadaga, Telangana:Hyderabad Raifall: తెలంగాణలో వర్షాభావ పరిస్థితులు తొలగిపోయినట్టు కనిపిస్తోంది. ఈ సీజన్లో తొలిసారి వరుణుడు విజృంభిస్తున్నాడు. ఎల్‌నినో పరిస్థితుల కారణంగా ఇన్నాళ్లు తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొనగా ఆ పరిస్థితులు పోయి మళ్లీ వర్షాలు జోరందుకున్నాయి. హైదరాబాద్‌తో సహా తెలంగాణలోని అన్ని జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. కొన్ని రోజులుగా వర్షాలు పడుతుండడంతో తెలంగాణ నేల తడిచి ముద్దవుతోంది. తెలంగాణలో విస్తృతంగా వర్షాలు కురుస్తుండడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇన్నాళ్లు మండకొడిగా సాగిన వ్యవసయ పనులు ఇక జోరందుకోనున్నాయి. 24 గంటల్లో హైదరాబాద్‌తోపాటు అన్ని జిల్లాల్లో వర్షాలు పడ్డాయి. ఎక్కడెక్కడ ఎంత వర్షం పడిందో చూద్దాం.
Also Read: Heavy Rains: ఉత్తర తెలంగాణకు పొంచి ఉన్న ముప్పు.. రాబోయే 36 గంటలు అత్యంత కీలకం
ఉత్తర తెలంగాణ జిల్లాలతోపాటు హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, రంగారెడ్డి, వికారాబాద్, కామారెడ్డి, మెదక్ జిల్లాల్లో మంగళవారం భారీగా వర్షాలు పడ్డాయి. ఉత్తర తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడ్డాయి. జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట తదితర జిల్లాల్లో వరుణుడు ప్రతాపం చూపించాడు. అటవీ ప్రాంత జిల్లాల్లో కుంభవృష్టి కురిసింది. అత్యధికంగా ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం హీరాపూర్‌లో 5.8 సెం.మీ వాన పడగా.. తాంసి, తలమడుగు, ఇచ్చోడ, భోరజ్, మావల మండలాల్లో 4.2 సెం.మీ వర్షపాతం నమోదైంది.
==> వికారాబాద్ జిల్లా మోమిన్‌పేటలో 4 సెం.మీ
==> వరంగల్ జిల్లా చెన్నారావుపేటలో 3.8
==> కామారెడ్డి జిల్లా మొహమ్మద్‌నగర్ మండలం మొగ్దంపూర్‌లో 3.4 సెం.మీ
==> మెదక్ జిల్లా పాపన్నపేటలో 8.4 సెం.మీ
Also Read: Hyderabad Police: హైదరాబాద్‌లో భారీ వర్షం.. క్షేత్రస్థాయిలో ట్రాఫిక్ పోలీసుల తనిఖీ
రాగల కొన్ని గంటల్లో..
తీవ్ర వాయుగుండం ప్రభావంతో తెలంగాణలో వర్షాలు జోరందుకున్నాయి. ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ ప్రాంతాలపై ఏర్పడిన తీవ్ర వాయుగుండం బుధవారం వరకు పశ్చిమ- వాయవ్య దిశగా కదులుతుందని వాతావరణశాఖ తెలిపింది. ఈ ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో బుధ, గురువారాలు భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. పది జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్, కుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో రాగల కొన్ని గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మిగిలిన జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.
ప్రభుత్వం అప్రమత్తం
వాతావరణ శాఖ భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించిన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. భారీ వర్షాలు పొంచి ఉన్న జిల్లాలకు అప్రమత్తం ప్రకటించింది. ఆయా జిల్లాల కలెక్టర్లకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్‌జాజు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. కలెక్టర్లు, ఎస్పీలతో మంగళవారం టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించి వర్షాలపై సమీక్ష చేశారు. వివిధ శాఖలతో కలెక్టర్లు సమన్వయం చేసుకోవాలని.. ఎన్డీఆర్ఎఫ్ బృందాలను అందుబాటులో ఉంచినట్లు తెలిపారు.
వర్షాలకు సంబంధించి జీ తెలుగు న్యూస్ లైవ్ చూడండి
Heavy Rains: ఉత్తర తెలంగాణకు పొంచి ఉన్న ముప్పు.. రాబోయే 36 గంటలు అత్యంత కీలకం
Baddipadaga, Telangana:Heavy To Heavy Rains: ఎల్‌నిన్ ప్రభావంతో ఇన్నాళ్లు వర్షాభావంతో తల్లడిల్లిన తెలంగాణకు వరుణుడు భారీ ఊరట ఇస్తున్నాడు. రాష్ట్రవ్యాప్తంగా కుండపోత వర్షాలు పడుతుండడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్‌తో సహా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. అయితే ఉత్తర తెలంగాణలో కుంభవృష్టి పడుతోంది. భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. రానున్న 36 గంటలు అత్యంత కీలకమని ప్రకటించింది.
==> ఉత్తర తెలంగాణకు కుండపోత వర్షాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు ఎడతెరిపి లేకుండా కురుస్తున్నాయి. జగిత్యాల, నిర్మల్ జిల్లాల్లో అత్యంత తీవ్ర వర్షపాతం నమోదవుతోంది. దీంతో వరద పరిస్థితులు ఏర్పడే ప్రమాదం ఉందని హెచ్చరికలు జారీ అయ్యాయి. నిన్న అర్థరాత్రి నుంచి ప్రారంభమైన వర్షాలు పలు చోట్ల తీవ్రరూపం దాల్చాయి.
==> నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, మంచిర్యాల, కరీంనగర్, భూపాలపల్లి జిల్లాల్లో గత కొన్ని గంటలుగా నిరంతర వర్షపాతం నమోదవుతోంది. రాబోయే 3 నుంచి 4 గంటల పాటు కూడా ఈ వర్షాలు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో ఆయా జిల్లాలకు ప్రభుత్వం అప్రమత్తత ప్రకటించింది. అధికారులు స్థానికులకు సూచనలు చేశారు.
7 గంటల్లో నమోదైన వర్షపాతం వివరాలు
సారంగాపూర్ (జగిత్యాల) – 140.8 మి.మీ
బుగ్గారం (జగిత్యాల) – 138 మి.మీ
నిర్మల్ – 128.3 మి.మీ
కడెం పెద్దూర్ (నిర్మల్) – 127.5 మి.మీ
వెల్గటూర్ (జగిత్యాల) – 123 మి.మీ
మామడ (నిర్మల్) – 118 మి.మీ
మల్లాపూర్ (జగిత్యాల) – 112.5 మి.మీ
ఎండపల్లి (జగిత్యాల) – 111.5 మి.మీ
సోన్ (నిర్మల్) – 108.3 మి.మీ
మక్లూర్ (నిజామాబాద్) – 108 మి.మీ
పాలిమెల (భూపాలపల్లి) – 101.8 మి.మీ
జుక్కల్ (కామారెడ్డి) – 100.3 మి.మీ
వాజేడు (ములుగు) – 98 మి.మీ
రామగుండం (పెద్దపల్లి) – 84.5 మి.మీ
పలుచోట్ల ఇప్పటికే 100 నుంచి 140 మి.మీ. వరకు వర్షపాతం నమోదైంది. ఉదయం 8 గంటల నాటికి జగిత్యాల, నిర్మల్ జిల్లాల్లో మొత్తం వర్షపాతం 180 నుంచి 200 మి.మీ.లకు చేరుకునే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. రాబోయే 36 గంటల్లో ఉత్తర తెలంగాణలో రికార్డు స్థాయిలో కుండపోత వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. భారీ వర్షాల ప్రభావంతో గోదావరి నది ఉగ్రరూపం దాల్చే పరిస్థితులు నెలకొనే అవకాశం ఉందని హెచ్చరికలు చేశారు. లోతట్టు ప్రాంతాల్లో నివసించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వాగులు, వంకలు దాటే ప్రయత్నం చేయవద్దని అధికారులు సూచిస్తున్నారు.
London Bonalu: అంగరంగ వైభవంగా లండన్‌లో బోనాల జాతర
England:Telangana NRIs Celebrates Bonalu At London And Get Together Watch Pride VideoSimhachalam Temple: సింహాచలం గిరిప్రదక్షిణ డ్రోన్ వీడియో
Visakhapatnam, Andhra Pradesh:Watch Drone Visuals Of Simhachalam Varaha Narasimha Swamy Giri PradakshinaSimhachalam: అత్యంత వైభవంగా సింహాచలం గిరిప్రదక్షిణ
Visakhapatnam, Andhra Pradesh:Devotees Heavy Rush For Simhachalam Giri Pradakshina Traffic Jam In Vizag Watch VisualsLondon Bonalu: లండన్‌లో బోనాల జాతర.. తెలంగాణ సంస్కృతి చాటిన ఎన్నారైలు
England:Telangana NRIs Celebrates Bonalu: విదేశాల్లో స్థిరపడిన తెలంగాణ ప్రజలు తమ సంస్కృతిని చాటి చెబుతున్నారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను కాపాడుతూ ప్రత్యేకతను చాటుతున్నారు. ఆషాఢ మాసం సందర్భంగా బ్రిటన్‌లో బోనాల పండుగ చేసుకున్నారు. తెలంగాణవాసులంతా ఒక్క చోటకు చేరి బోనాల జాతరలో పాల్గొన్నారు. దీంతో బ్రిటీష్ గడ్డపై తెలంగాణ ప్రజలు బోనాలు చేసుకుని ప్రత్యేకత చాటారు. పెద్ద ఎత్తున జరిగిన లండన్ బోనాలకు సంబంధించిన విశేషాలు ఇలా ఉన్నాయి.
తెలంగాణ అసోసియేషన్ అఫ్ యునైటెడ్ కింగ్డమ్ (టాక్) ఆధ్వర్యంలో లండన్‌లో బోనాల జాతరను తెలంగాణ ఎన్నారైలు వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకలకు బ్రిటన్‌లో స్థిరపడిన తెలంగాణవాసులు నలుమూలల నుంచి సుమారు 2,500కి పైగా ప్రవాస కుటుంబసభ్యులు బోనాల వేడుకలో పాల్గొన్నారు. టాక్ అధ్యక్షుడు రత్నాకర్ కడుదుల, ఉపాధ్యక్షులు శుష్మణ రెడ్డి, ప్రధాన కార్యదర్శి సుప్రజ పులుసు ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో ఎన్నారైలు సందడి చేశారు. ఎంపీ సీమా మల్హోత్రా, భారత హై కమీషన్ ప్రతినిధి వివేక్ కుమార్, మాజీ ఎంపీ వీరేంద్ర శర్మ, హౌంస్లౌ నగర మేయర్ రంజిత్ గిల్ బోనాల జాతరకు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
తెలంగాణలో చేసుకున్నట్టు సాంప్రదాయ బద్దంగా పూజలు నిర్వహించి.. తొట్టెల ఊరేగింపు చేయగా.. అది ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కుటుంబసమేతంగా అంతా కలిసి ఇలా వేడుకలు చేసికొని రాబోయే తరాలకి తెలియజెప్పాలనే ఉద్దేశంతో బోనాల పండుగ చేసుకున్నారు. బ్రిటన్‌లో కూడా అన్ని వర్గాల ప్రజలను, సంస్కృతుల్ని ఆదరించే గొప్ప దేశంగా నిలిచిందని.. మనమంతా కలిసి మెలిసి ఐక్యంగా ఉండాలని ఈ సందర్భంగా ముఖ్య అతిథులు సూచించారు.
'ప్రపంచవ్యాప్తంగా ప్రవాస తెలంగాణ సంఘాలు ఏర్పడి తెలంగాణ సంస్కృతిని విశ్వవ్యాప్తమయ్యేలా కృషి చేస్తున్నారు. దీనికి కారణం మన ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకావడమే. అన్ని సందర్భాల్లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ముందుండి నాయకత్వం వహించిన ఉద్యమశిఖరం, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌ను అన్ని సందర్భాల్లో గుర్తు చేసుకోవాలి' అని టాక్ కన్వీనర్లు అశోక్ గౌడ్ దూసరి, నవీన్ రెడ్డి తెలిపారు. టాక్ సంస్థ తెలంగాణా ప్రజల కోసం, ప్రపంచంలో ఉన్నతెలంగాణా బిడ్డల కోసం చేస్తున్న కార్యక్రమాలను వివరించిన టాక్ సంస్థ అధ్యక్షులు రత్నాకర్ కడుదుల.. తెలంగాణ ఎన్నారైలు అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఆడబిడ్డలందరూ బోనాలతో తెలంగాణ సంస్కృతిని విశ్వవ్యాప్తం చేస్తున్న తీరు నూతన ఉత్సాహాన్ని నింపిందని టాక్ సంస్థ ఉపాధ్యక్షురాలు శుషుమన రెడ్డి తెలిపారు.
బోనాల సంబరం ఇక్కడ చూడండి
బోనాల వేడుకల్లో శ్రీకాంత్ జెల్లా, గణేష్ కుప్పాల, సుప్రజ పులుసు, సురేష్ బుడగం, మట్టా రెడ్డి, క్రాంతి రేతినేని, పవిత్ర, రాకేష్ పటేల్, సత్యం కంది, సత్యపాల్ రెడ్డి పింగిళి, సత్య చిలుముల, మట్టా రెడ్డి, రవి రేతినేని, రవి ప్రదీప్ పులుసు, మల్లా రెడ్డి, గణేష్ పాస్తాం, నాగరాజు తౌటం, శ్రీధర్ రావు, శైలజ జెల్ల, స్నేహ, విజయలక్ష్మి, శ్వేతా మహేందర్, స్వాతీ, క్రాంతి , శ్రీవిద్య , దివ్య, ప్రవీణ్ వీర, మణితేజ, నిఖిల్ రెడ్డి, హరి గౌడ్, రంజిత్, రాజేష్ వాక, మాధవ రెడ్డి, అంజన్, తరుణ్ లూణావత్, సందీప్, ఆనంద్ , లత , పావని, కార్తీక్ ,స్నేహ, అమరేశ్వరి, సాయి రావు, జస్వంత్, ప్రశాంత్, వినోద్ నవ్య, ఉమా తదితరులు ఉన్నారు.
Hyderabad Rains: హైదరాబాద్‌లో కుంభవృష్టి.. భాగ్యనగరం అతాలకుతలం
Hyderabad, Telangana:Hyderabad Heavy Rain Allout Night Time Waterlogged On Roads Here VisualsBonalu In London: లండన్‌లో తెలంగాణ సంస్కృతి చాటిన ఎన్నారైలు
England:Bonalu Celebrated In London By Telangana NRIs Here Full VideoPerni Nani: నారా లోకేశ్ మంత్రిగా రాజీనామా చేయాలి: పేర్ని నాని
Machilipatnam, Andhra Pradesh:Former Minister Perni Nani Demands Nara Lokesh Resign For Ministry Post A Head AP DSC IssueNew Delhi: నీట మునిగిన ఢిల్లీ.. ప్రజా జీవనం అస్తవ్యస్తం
New Delhi, Delhi:Heavy Rainfall In National Capital Delhi Drowned All Areas Watch VisualsHyderabad: భారీ వర్షంతో హైదరాబాద్‌లో స్తంభించిన ట్రాఫిక్
Hyderabad, Telangana:Heavy Rains In Telangana Full Traffic Jam At IT Corridar Of Hyderabad Watch VisualsKTR: హైడ్రాకు దమ్ముంటే కాంగ్రెస్ నాయకుల ఫాంహౌజ్‌లు కూల్చేయాలి: కేటీఆర్
New Delhi, Delhi:Former Minister KTR Sensational Comments On HYDRAA A Head High Court Orders Watch VideoHyderabad Police: హైదరాబాద్‌లో భారీ వర్షం.. క్షేత్రస్థాయిలో పరిశీలించిన ట్రాఫిక్ పోలీసులు
Hyderabad, Telangana:Hyderabad Rains: హైదరాబాద్ నగరంలో మంగళవారం కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో నగర ప్రజలందరూ అత్యంత అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ శ్రీ జోయల్ డేవిస విజ్ఞప్తి చేశారు. నగరంలోని లక్డీకాపూల్, అయోధ్య జంక్షన్, మాసబ్ ట్యాంక్ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఉన్నతాధికారులతో కలిసి క్షేత్రస్థాయి తనిఖీలు చేపట్టారు. ట్రాఫిక్ డీసీపీలు అవినాష్ కుమార్, కాజల్ సింగ్, రాహుల్ హెగ్డే క్షేత్రస్థాయిలో ఉండి లక్డీకాపూల్, అయోధ్య జంక్షన్, పీటీఐ మాసబ్ ట్యాంక్ వంటి నీటి నిల్వ పాయింట్ల వద్ద నిలిచిన వర్షపు నీటి పరిస్థితిని, ట్రాఫిక్ క్రమబద్ధీకరణ చర్యలను సమగ్రంగా పరిశీలించి పర్యవేక్షించారు.
#HYDTPinfo
Ms. Kajal Singh, IPS, DCP Traffic-II, Hyderabad, visited the RUB at SR Nagar and reviewed the waterlogging situation and traffic movement. She instructed the HYDRAA staff to clear the waterlogging at the earliest and take necessary measures to restore smooth vehicular… pic.twitter.com/yJmUP9F6kp— Hyderabad Traffic Police (@HYDTP) July 28, 2026
ఈ సందర్భంగా జాయింట్ సీపీ జోయల్ డేవిస్ స్వయంగా క్షేత్రస్థాయిలో పర్యటించి చర్యలు తీసుకున్నారు. ఆయనతోపాటు నగరంలోని ఇతర ప్రాంతాలలో కూడా ట్రాఫిక్ అధికారులు క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యవేక్షిస్తూ పరిస్థితిని సమీక్షించారు. రోడ్లపై వర్షపు నీరు నిలిచిపోవడంతో వాహనాల రాకపోకలు నెమ్మదిగా సాగుతుండడంతో ట్రాఫిక్ అధికారులు, సిబ్బంది నిరంతరం విధుల్లో ఉంటూ వాహనాల రద్దీని నియంత్రణ చేశారు.
Sri D. Joel Davis, IPS, Joint Commissioner of Police, Traffic, Hyderabad, visited the waterlogging point near Mehedi Function Hall following heavy rainfall in the city.
He reviewed the prevailing situation, monitored traffic flow at the affected locations, and… pic.twitter.com/SkQ1Ddv16g— Hyderabad Traffic Police (@HYDTP) July 28, 2026
నగర ప్రజలకు ట్రాఫిక్ పోలీసుల కీలక సూచనలు
==> అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దు. వర్ష తీవ్రత ఎక్కువగా ఉండడంతో అత్యవసర పనులు ఉంటే తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని, సురక్షితంగా ఇళ్లలోనే ఉండాలని కోరారు.
==> వాహనదారులు అప్రమత్తంగా ఉండాలి. ప్రయాణంలో ఉన్న వాహనదారులు తమ వాహనాలను అత్యంత నెమ్మదిగా, వేగాన్ని నియంత్రిస్తూ, జాగ్రత్తగా నడపాలి. రహదారులపై విధుల్లో ఉన్న ట్రాఫిక్ పోలీసుల సూచనలను తప్పనిసరిగా పాటించాలి.
==> ప్రయాణాలకు అదనపు సమయం కేటాయించాలి. అత్యవసర ప్రయాణాలు చేసే వారు సాధారణ సమయం కంటే కొంత అదనపు సమయాన్ని కేటాయించుకుని బయలుదేరడం శ్రేయస్కరం.
==> అధికారిక సమాచారం ప్రామాణికం. సామాజిక మాధ్యమాల ద్వారా హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ విభాగం ఎప్పటికప్పుడు అందించే అధికారిక సమాచారాన్ని, ట్రాఫిక్ అప్డేట్లను గమనిస్తూ ప్రయాణాలను ప్రణాళిక చేసుకోవాలి.
==> వర్షాల కారణంగా పలు ప్రాంతాల్లో రోడ్లపై నీరు నిలిచిపోయి, ట్రాఫిక్ నెమ్మదిగా సాగుతోంది. ఈ నేపథ్యంలో అత్యవసరమైతే తప్ప ఎవరూ ఇళ్ల నుంచి బయటకు రావద్దు. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు ఇళ్లలోనే సురక్షితంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.
