చింతకాని: పోలీసుల అదుపులో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు
Khammam, Telangana:చింతకానిలో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పెంట్యాల పుల్లయ్యను పోలీసులు అరెస్టు చేసారు. అయితే ఏ కేసులో అరెస్ట్ చేసారో చెప్పులంటూ పార్టీ నాయకులు, కుటుంబ సభ్యులు పోలీసులతో వాగ్వాదం చేసారు. ఈక్రమంలో పోలీసుల వాహనాన్ని వారు అడ్డుకున్నారు. ఈ నేపాథ్యంలో కాసేపు ఉద్రిక్తత పరిస్థితి కనిపించింది. అనంతరం బలవంతంగా పుల్లయ్య ను స్టేషన్ కు తరలించారు. ఏ కేసులో అరెస్ట్ చేసారో చెప్పకుండా అక్రమంగా అరెస్ట్ చేసారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
Ganesh Chaturthi 2026: వినాయక చవితి ఉత్సవాలు ప్రశాంతంగా జరిగేలా సహకరించాలి: సజ్జనార్
Hyderabad, Telangana:VC Sajjanar: వినాయక చవితిని పురస్కరించుకుని నవరాత్రులు, నిమజ్జనం ప్రశాంతంగా జరిగేలా ఉత్సవ సమితి నిర్వాహకులు, ప్రజలు తమ పోలీస్ శాఖకు సహకరించాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ విజ్ఞప్తి చేశారు. సమన్వయంతో ప్రశాంతంగా.. వేడుకగా వినాయక చవితి ఉత్సవాలు చేసుకుందామని పిలుపునిచ్చారు. 'గణేశ్ ఉత్సవాల వేళ శబ్ద కాలుష్యంపై ప్రజల నుంచి, ముఖ్యంగా ఆసుపత్రుల్లో చికిత్స పొందే రోగులు, వృద్ధుల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి. పండుగను ఉత్సాహంగా చేసుకుంటూనే, చుట్టుపక్కల ప్రజలకు ఇబ్బంది కలగకుండా మైక్/సౌండ్ సిస్టమ్స్ పరిమితిని తగ్గించుకోవాలి' అని ఉత్సవ సమితి నిర్వాహకులకు పోలీస్ కమిషనర్ సజ్జనార్ విజ్ఞప్తి చేశారు. ప్రధాన నిమజ్జనం రోజున మరుసటి రోజు మధ్యాహ్నం వరకు ఊరేగింపులు సాగితే ప్రజలు, ట్రాఫిక్ సిబ్బంది తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. మండపాల నిర్వాహకులు నిమజ్జనం రోజున ఉదయమే ఊరేగింపును ప్రారంభించేలా ప్రోత్సహించాలని సమితి సభ్యులను కోరారు. రద్దీ ఎక్కువగా ఉండే ఖైరతాబాద్ బడా గణేష్, బాలాపూర్ ప్రాంతాల్లో ట్రాఫిక్ స్తంభించకుండా ప్రత్యేక బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నట్లు, పోలీసు ఉన్నతాధికారులు స్వయంగా అక్కడి ఏర్పాట్లను నిరంతరం సమీక్షిస్తారని కమిషనర్ సజ్జనార్ తెలిపారు. ప్రజల్లో, నిర్వాహకులలో అవగాహన పెంచేందుకు పోలీస్ స్టేషన్ల వద్ద తగిన సమాచార బ్యానర్లు ఏర్పాటు చేయనున్నట్లు స్పష్టం చేశారు. అందరి సామూహిక భాగస్వామ్యంతో, భక్తిశ్రద్ధలతో, సంప్రదాయబద్ధంగా ఈ మహా పండుగను విజయవంతం చేయాలని అధికారులతో పాటు భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ప్రతినిధులు పిలుపునిచ్చారు.
భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ప్రతినిధులతో హైదరాబాద్ సిటీ పోలీస్ సమన్వయ సమావేశం నిర్వహించారు. హైదరాబాద్ నగరంలో వినాయక చవితి ఉత్సవాలు, నిమజ్జన ఊరేగింపును అత్యంత వైభవంగా, శాంతియుత వాతావరణంలో నిర్వహించేందుకు భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ప్రతినిధులు, నిర్వాహకులు, వివిధ కమిటీల సభ్యులతో హైదరాబాద్ సిటీ పోలీసులు శుక్రవారం విశ్వేశ్వరయ్య భవన్లో ప్రత్యేక సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు. హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో అడిషనల్ సీపీ (క్రైమ్స్, సిట్) ఎ. శ్రీనివాస్, అడిషనల్ సీపీ (ఎల్ అండ్ ఓ) తఫ్సీర్ ఇక్బాల్, జాయింట్ సీపీ (ట్రాఫిక్) డి. జోయల్ డేవిస్‌తోపాటు హైదరాబాద్ సిటీ పోలీసు కమిషనరేట్ పరిధిలోని అందరూ డీసీపీలు పాల్గొన్నారు. భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ఈ సమావేశంలో భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి, వివిధ ఉత్సవ కమిటీల ప్రతినిధులు
భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి అధ్యక్షుడు జి. రాఘవరెడ్డి, ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆర్. శశిధర్, సలహాదారు కరోడిమాల్, ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితి కోశాధికారి మహేష్ యాదవ్, బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి ప్రతినిధి సాయి కిరణ్‌తోపాటు ఇతర ఉత్సవ కమిటీల సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీపీ సజ్జనార్ మాట్లాడుతూ.. 'హైదరాబాద్ గణేశ్ ఉత్సవాలకు అంతర్జాతీయ స్థాయిలో ఎంతో గుర్తింపు ఉంది. ప్రతియేటా దశాబ్దాలుగా నగర ప్రజలు, ఉత్సవ కమిటీ నిర్వాహకులు అందిస్తున్న సహకారంతోనే ఉత్సవాలు ప్రశాంతంగా సాగుతున్నాయి' అని తెలిపారు. ఈ సంవత్సరం కూడా వేడుకలు విజయవంతంగా ముగిసేందుకు సిటీ పోలీస్ తరఫున అన్ని రకాల ఏర్పాట్లు, భద్రతా చర్యలు పూర్తి చేసినట్లు వెల్లడించారు. విగ్రహాలను తీసుకువచ్చే (ఆగమనం) సమయంలో రద్దీ, అధిక వేగం, వాహనాలపై డాన్సులు చేయడంతో ట్రాఫిక్ స్తంభించడమే కాకుండా ప్రమాదాలు జరుగుతున్నాయని కమిషనర్ ఆందోళన వ్యక్తం చేశారు. నిర్వాహకులు విగ్రహాల రాక సమాచారాన్ని ముందే పోలీసులకు తెలియజేసి, ట్రాఫిక్ తక్కువగా ఉండే సమయాల్లో సురక్షితంగా మండపాలకు తరలించాలని సూచించారు.
'వినాయక ఆగమనం, నిమజ్జనం ఊరేగింపు మార్గాల్లో విద్యుత్ వైర్లు, చెట్ల కొమ్మల అడ్డంకులు, రోడ్ల మరమ్మతులపై ఇప్పటికే జీహెచ్ఎంసీ, ఎస్పీడీసీఎల్ అధికారులతో సమన్వయ సమావేశం పూర్తయింది. త్వరలోనే పోలీస్ అధికారులు రూట్ విజిట్ (మార్గ తనిఖీ) చేపడతారు' అని పోలీస్ కమిషనర్ సజ్జనార్ వెల్లడించారు. ప్రతి గణేష్ మండపం వద్ద నిర్వాహకులు తప్పనిసరిగా నలుగురు నుంచి 5 మంది బాధ్యతాయుతమైన వాలంటీర్లను కేటాయించాలని ఆదేశించారు. వాలంటీర్ల వివరాలను పోలీస్ యాప్‌లో నమోదు చేయాలని, వారికి ప్రత్యేక గుర్తింపు (ఒకే రంగు దుస్తులు/బ్యాడ్జీలు) ఇవ్వడం ద్వారా పోలీసులతో సమన్వయం సులువవుతుందని సూచించారు.
Chandrababu: 'నా కాన్వాయ్ ట్రాఫిక్ నిలుపుదల చేయవద్దు': సీఎం చంద్రబాబు
Amaravathi, Andhra Pradesh:Chandrababu Collectors Conference: తన కాన్వాయ్ కోసం ట్రాఫిక్ నిలుపుదల చేయవద్దని సీఎం చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. వీఐపీలు, వీవీఐపీల పర్యటనల సందర్భంగా ఎక్కువ హడావుడి చేయవద్దంటూ సీఎం చంద్రబాబు దిశా నిర్దేశం చేశారు. ప్రజాప్రతినిధులు, అధికారులు సింపుల్‌గా ఉంటేనే ప్రజలు మెచ్చుతారని పేర్కొన్నారు. క్షేత్రస్థాయి ఉద్యోగి తప్పు చేసినా.. ప్రభావం ప్రభుత్వంపై పడుతుందనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని సూచించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి కూటమి నాయకులు వస్తే వారి సూచనలను పరిగణనలోకి తీసుకోవాలని తెలిపారు. కలెక్టర్ల కాన్ఫరెన్స్ ముగింపు సందర్భంగా పోలీస్ అధికారులకు కొన్ని కీలక సూచనలు చేశారు.
'మా కోసం ప్రజలను ఇబ్బంది పెట్టవద్దని మరోసారి విజ్ఞప్తి. నా కాన్వాయ్‌ను కూడా గణనీయంగా తగ్గించా. కాన్వాయ్ తగ్గిన తర్వాత ప్రశాంతంగా ఉంది. పోలీసు కానిస్టేబుల్ తప్పు చేసినా ముఖ్యమంత్రిని, ప్రభుత్వాన్నే దూషిస్తారు. ప్రజాప్రతినిధుల్ని గౌరవిస్తూనే న్యాయసమ్మతంగా వ్యవహరించాలి. పొలిటికల్ గవర్నెన్స్ విధానంలోనే కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తోంది. కూటమి పార్టీల నాయకులందరూ సమానమే. ప్రజా సమస్యల పరిష్కారంపై కూటమికి పార్టీలకు చెందిన నాయకులు ఎవరూ వచ్చినా గౌరవించి.. ఆ సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలి. ప్రజల్ని భాగస్వాములను చేస్తే చేపట్టే కార్యక్రమాలు విజయవంతమవుతాయి. భోగాపురం విమానాశ్రయం, వెలిగొండ, పోలవరం ఎడమ కాలువ ప్రాజెక్టుల ప్రారంభించినప్పుడు ప్రజల స్పందన అనూహ్యం' అని సీఎం చంద్రబాబు తెలిపారు.
'డీఎస్సీ పరీక్షలను అత్యంత పారదర్శకంగా నిర్వహించాం. దీనిపై 350 పిటిషన్లను వేసి అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న కేసులు పరిష్కరించి పోలీసు కానిస్టేబుల్ ఉద్యోగాలు ఇచ్చాం. కూటమి ప్రభుత్వం ఎక్కడా తప్పు చేయదు. భయపడి వెనక్కు వెళ్లదు. కొందరు చేసిన ఆరోపణలకు తగిన సమాధానం ఇచ్చాం. గత ప్రభుత్వం గ్రూప్ 1 పరీక్షల వ్యవహారంలో దారుణాలకు పాల్పడింది. హైకోర్టు కూడా సిట్ వేసి విచారణ చేయాలని ఆదేశించింది. రాజకీయ ముసుగు వేసుకుని శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తామంటే చూస్తూ ఊరుకోం. వారు వదిలివెళ్లిన 1.53 లక్షల మెట్రిక్ టన్నుల లెగసీ వేస్ట్ తొలగించడానికి రెండేళ్లు పట్టింది' అని సీఎం చంద్రబాబు వివరించారు. వారు సృష్టించిన భూవివాదాలను ప్రక్షాళన చేయడానికి మూడేళ్లు పడుతోందని చెప్పారు.
ఉద్యోగులు, పోలీసులకు డీఏ, సరెండర్ లీవ్‌లు కూడా ఇస్తున్నాం. ఎక్కడా పొరపాట్లు లేకుండా ప్రతీ నిర్ణయంలో వేగం ఉండాలి. ప్రతీ నిర్ణయంలో మానవీయ కోణం ఉండాలి. ఆదాయం లేకపోతే సంక్షేమం ఇవ్వలేం' సీఎం చంద్రబాబు చెప్పారు. డీప్ టెక్నాలజీతో కూడిన న్యూ గవర్నెన్స్‌లో లీడర్షిప్ కీలకమని ప్రకటించారు. 'జీఎస్టీలో 18 శాతం మేర వృద్ధి నమోదైంది. జీఎస్డీపీ అంచనాలు కూడా దేశ సగటుతో పోలిస్తే అధికంగా ఉంది. 2027 నాటికి రాష్ట్రంలో భూసమస్యలను అన్నీ పరిష్కరిస్తాం. అందరికీ పట్టాదారు పాస్ పుస్తకాలు జారీ చేస్తాం' అని చంద్రబాబు తెలిపారు. క్యూఆర్ కోడ్, బ్లాక్ చెయిన్ టెక్నాలజీతో రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలు జారీ చేస్తామని ప్రకటించారు.
'జలవనరుల శాఖకు చెందిన ఖాళీ స్థలాల్లో వెయ్యి మెగావాట్ల సౌరవిద్యుత్ ప్లాంట్ ఏర్పాటు చేస్తాం. త్వరలోనే రాయలసీమను హార్టీ కల్చర్ హబ్‌ను ప్రారంభిస్తాం. రాష్ట్రంలో అనుమతులిచ్చిన పరిశ్రమలకు త్వరితగతిన భూ కేటాయింపులు చేయాలి' సీఎం చంద్రబాబు వెల్లడించారు. పరిశ్రమలు, సేవలు వ్యవసాయ రంగంలో వృద్ధితో జీఎస్డీపీ పెరుగుతుందని.. రాష్ట్రంలోనూ ఏఐ నిపుణుల్ని తయారు చేసేలా కార్యాచరణ చేపడుతున్నట్లు ప్రకటించారు. 6వ తరగతి నుంచే వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రెన్యూర్ కింద శిక్షణ ఇస్తామని.. డేటా లేక్ ద్వారా ప్రతీ ప్రభుత్వ శాఖనూ సమన్వయం చేస్తామని తెలిపారు. ఏఐ స్టాక్లను ప్రతీ విభాగానికి అందుబాటులోకి తీసుకువస్తాం' అని సీఎం చంద్రబాబు తెలిపారు. లీగల్ ఏఐ స్టాక్ కూడా త్వరలోనే అందుబాటులోకి వస్తుందని చెప్పారు. జీరో క్రైమ్ విధానంతో పని చేయాలని సూచించారు. డిజిటల్ అరెస్ట్ పేరిట కొందరు దుండగులు ఆర్ధిక నేరాలకు పాల్పడుతున్నారని.. నిమిషాల్లో బాధితులు డబ్బులు కోల్పోతున్నారని తెలిపారు.
Dearness Allowance: ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు జాక్‌పాట్.. 2 డీఏలు విడుదల చేస్తూ ఉత్తర్వులు
Nuzendla, Andhra Pradesh:AP DA Released: తమ డిమాండ్ల సాధన కోసం.. సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వ ఉద్యోగులు పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టడంతో ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దిగివచ్చింది. ఉద్యోగులకు భారీ శుభవార్త వినిపించింది. ఉద్యోగుల ప్రధాన డిమాండ్లలో ఒకటైన కరువు భత్యం (డీఏ) రెండింటిని విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రెండు డీఏలు విడుదల చేయడంతో ప్రభుత్వ ఉద్యోగులకు వినాయక చవితి కానుక అందించింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్‌దారులకు కూటమి ప్రభుత్వం భారీ శుభవార్త వినిపించింది. 2 నెలల డీఏలు విడుదల చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పెంచిన డీఏలను సెప్టెంబర్ జీతానికి కలిపి చెల్లించాలని ప్రభుత్వ ఆర్థిక శాఖ తెలిపింది. 1.82 శాతం డీఏను 2025 జనవరి 1వ తేదీ నుంచి ప్రభుత్వం చెల్లించనుంది. 20 నెలల బకాయిలు 2028 జనవరి, మార్చి, మే, జూలైన ఆర్థిక శాఖ చెల్లించనుంది. ఉద్యోగులకు 2.73 శాతం డీఏను 2024 జూలై 1 నుంచి చెల్లించనుంది. ఇక 26 నెలల బకాయిలు 2027 ఏప్రిల్, జూన్, ఆగస్టులో, అక్టోబర్‌లో ఉద్యోగులకు ఆర్థిక శాఖ జమ చేయనుంది.
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల డీఏను ప్రస్తుతం ఉన్న 37.31 శాతం నుంచి 40.04 శాతానికి పెంచుతూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఉద్యోగులకు అదనంగా 2.73 శాతం డీఏ పెంపు లభించినుంది. ఇప్పటివరకు అమల్లో ఉన్న డీఏ శాతాన్ని మరింత పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ తాజా నిర్ణయంతో ఏపీలోని రాష్ట్రవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు, సిబ్బందికి భారీ ఆర్థిక ప్రయోజనం కలగనుంది.
పెంచిన డీఏ లబ్ధి సాధారణ ప్రభుత్వ ఉద్యోగులకు కాకుండా ఇతర వర్గాల ఉద్యోగులకు వర్తించనుంది. 2022 రివైజ్డ్ పే స్కేల్స్ (వేతన సవరణ) ప్రకారం వేతనాలు పొందుతున్న ఉద్యోగులందరికీ డీఏ పెంపు వర్తించనుంది.
డీఏ వర్తించేది వీరికే..
ప్రభుత్వం విడుదల చేసిన డీఏలు ఎవరికి వర్తిస్తుందంటే.. జిల్లా పరిషత్, మండల పరిషత్, గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లు తదితర స్థానిక సంస్థల ఉద్యోగులకు పెంపు వర్తించనుంది. ఎయిడెడ్ విద్యా సంస్థలు, విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న బోధన, బోధనేతర సిబ్బందికి డీఏ పెంపు వర్తిస్తుందని ఆర్థిక శాఖ తెలిపింది.
Video Viral: జంక్ ఫుడ్ చూస్తేనే జడుసుకునేలా చేశారుగా.!.. పిల్లలకు బిగ్ షాక్ ఇచ్చిన టీచర్లు.. వీడియో వైరల్..
Hyderabad, Telangana:Teachers creative ideas to stay away children from junk food video: చాలా మంది పిల్లలు ఇటీవల ఎక్కువగా జంక్ ఫుడ్ కు అలవాటు పడ్డారు. శుభ్రంగా అన్నం తినకుండా సూపర్ మార్కెట్ లలో దొరికే చిరుతిండ్లు అంటే పడిచస్తారు. స్కూల్ కు వెళ్లాలన్న, హోమ్ వర్క్ చేయాలన్న వారికి ఇష్టమైన చిరుతిండ్లు తినిపిస్తేనే ఆ పనులు చేస్తారు . పొరపాటున బైటకు తీసుకెళ్తే ఇక తల్లిదండ్రులకు చుక్కలు చూపిస్తారు. కన్పించిన చిరుతిండ్లు కావాలని మారం చేస్తారు. ఇటీవల పిల్లలు మరీ అప్ డెట్ అయ్యారు. తల్లిదండ్రుల దగ్గర నుంచి మొబైల్ తీసుకుని తమకు కావాల్సిన పిజ్జాలు, బర్గర్ లు ఇతర చిరుతిండ్లు ఆర్డర్ పెట్టుకుంటున్నారు. ముఖ్యంగా జంక్ ఫుడ్ లేకుంటే కొంత మంది ముద్దను సైతం ముట్టడంలేదు.
Teachers use fake ultrasound footage to ensure children stay away from junk food. pic.twitter.com/0HXWz6bt39
— The Indian Idiot (@theindianidiot) September 11, 2026
ఆ తర్వాత కడుపు నొప్పి, ఇతర సమస్యలతో కన్నవారికిచుక్కలు చూపిస్తారు. ఇదంతా రోటీన్ గా జరిగేదే. అయితే.. దీనిపై ఒక స్కూల్ టీచర్లు చాలా కొత్తగా ఆలోచించారు.అసలు జంక్ ఫుడ్ లు తింటే ఎలాంటి చెడు ప్రభావాలు ఎదుర్కొవాల్సి వస్తుంది.. వారి కడుపులో ఏంజరుగుతుందో వీడియోతో సహా ప్లే చేసి పిల్లలకు చూపించారు.
ఏకంగా క్లాసులో పిల్లలకు మొదట జంక్ ఫుడ్ తినేందుకుఇచ్చారు. అది కడుపులోకి వెళ్లిన తర్వాత ఏమౌతుంది.. ఆ తర్వాతి పరిణామాలను వీడియోలో చూపించారు. దీన్ని ఒక ప్రాజెక్టర్ లో చూపించారు.కడుపులో నులి పురుగులు, ఇతర సమస్యలు , అంతర్గత అవయాలను చూపించారు . దీంతో పిల్లలంతా భయంతో గుక్కపెట్టి ఏడ్చారు.
కడుపులో నులి పురుగులు చూసి భయపడిపోయారు. ఇక తమకు ఈ జంక్ ఫుడ్ వద్దన్నట్లు ఫిక్స్అయ్యారు. మొత్తంగా పాపం.. పిల్లలు మాత్రం క్లాసులోనే తెగ ఏడ్చారు. ఈ వీడియోను టీచర్లు వీడియో తీసి నెట్టింట పోస్ట్ చేయడంతో అది కాస్త వైరల్ గా మారింది. ఈ ఘటన ఎక్కడ జరిగిందో వివరాలు లేవు. ఈ వీడియో చూసిన నెటిజన్ లు భలే ప్లాన్ చేశారుగా అంటూ ఫన్నీగా కామెంట్ లు చేస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.
Ganesh Chaturthi 2026: వినాయక చవితి స్పెషల్..దేశంలో 5 ఫేమస్ గణపతి ఆలయాలు..కాణిపాకం ఉందా?
Kanipakam, Andhra Pradesh:Ganesh Chaturthi 2026 Famous Temples: హిందూ విశ్వాసాలలో తొలి పూజలందుకునే విఘ్నాధిపతికి అంకితం చేసిన ప్రధాన పండుగ గణేశ చతుర్థి. 2026 గణేశ చతుర్థి వేడుకలకు దేశవ్యాప్తంగా ఆధ్యాత్మిక ఉత్సాహం నెలకొంది. జీవితంలోని విఘ్నాలను తొలగించి, సకల శుభాలను అందించే బొజ్జ గణపయ్య అనుగ్రహం కోసం భక్తులు విశేషంగా సందర్శించే భారతదేశంలోని ప్రముఖ గణేశ క్షేత్రాలు, వాటి విశిష్టతల గురించి ప్రత్యేకంగా తెలుసుకుందాం.
2026 గణేశ చతుర్థి వేళ ముంబైలోని సిద్ధివినాయక ఆలయం, పూణేలోని దగ్దుషేత్ హల్వాయి ఆలయం, కర్ణాటకలోని శ్రీ వినాయక దేవురు ఆలయం, ఆంధ్రప్రదేశ్‌లోని కాణిపాకం వినాయక ఆలయం వంటి ప్రముఖ పుణ్యక్షేత్రాలు విశేష పూజలు, వేడుకలతో ఆధ్యాత్మిక కేంద్రాలుగా మారుతున్నాయి
భారతదేశంలోని ప్రసిద్ధ గణపతి క్షేత్రాలు..
1) సిద్ధివినాయక ఆలయం (ముంబై)
దేశంలోనే అత్యంత ఆదరణ పొందిన గణపతి ఆలయాలలో ముంబైలోని సిద్ధివినాయక ఆలయం ప్రధానమైనది. జీవితంలో విజయం, శ్రేయస్సు, దేవుని అండ లభించాలని కోరుకుంటూ ప్రతి ఏటా లక్షలాది మంది భక్తులు ఇక్కడికి తరలివస్తుంటారు. గణేశ చతుర్థి పండుగను ఈ ఆలయంలో ఎంతో ఘనంగా నిర్వహిస్తారు. గణపతిని ఎంతో సుందరంగా అలంకరిస్తారు. అక్కడ నిర్వహించే ప్రత్యేక హారతులు ఎంతో పవిత్రమైన ఆధ్యాత్మిక వాతావరణాన్ని నింపుతాయి.
2) దగ్దుషేత్ హల్వాయి గణపతి ఆలయం (పూణే)
మహారాష్ట్రలోని పూణేలో ఉన్న దగ్దుషేత్ హల్వాయి ఆలయంలో వినాయక చవితి ఉత్సవాలు ఎంతో ఘనంగా నిర్వహిస్తారు. గణపతికి ఎంతో విలువైన ఆభరణాలు, రంగురంగుల పూలతో అలంకరించబడిన వినాయకుడి విగ్రహం భక్తులకు చూడముచ్చటగా ఉంటుంది. కేవలం పూజా కార్యక్రమాలే కాకుండా, ఈ వేడుకలలో భాగంగా జరిగే వివిధ సాంస్కృతిక కార్యక్రమాల వల్ల కూడా ఇక్కడకు భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తుంటారు.
3) శ్రీ వినాయక దేవుని ఆలయం (కర్ణాటక)
కర్ణాటకలోని శ్రీ వినాయక దేవుని ఆలయం ప్రశాంతమైన పరిసరాలతో భక్తులను ఎంతో భక్తితో నింపేస్తుంది. ఇది ఇతర ఆలయాల కంటే భిన్నమైన, ప్రశాంతమైన, ధ్యానానికి అనువైన వాతావరణాన్ని కలిగి ఉంది. గణేశ చతుర్థి సమయంలో ఇది ఒక ముఖ్యమైన ఆధ్యాత్మిక కేంద్రంగా మారుతుంది. వినాయక చవితి రోజున ఇక్కడ నిర్వహించే ప్రత్యేక పూజలు, భజనలు, భక్తి సంగీత కార్యక్రమాలు ఈ వేడుకలను మరింత వైభోపేతంగా నిర్వహిస్తారు.
4) కాణిపాకం వినాయక ఆలయం (ఆంధ్రప్రదేశ్)
ఆంధ్రప్రదేశ్‌లోని కాణిపాకం వినాయక ఆలయానికి ఓ ప్రత్యేక గుర్తింపు ఉంది. అంతే కాకుండా గొప్ప ఆధ్యాత్మిక చరిత్ర కూడా ఉంది. ఇక్కడి వినాయకుడి విగ్రహం స్వయంభువు (స్వయంగా ఆవిర్భవించినది) అని ఆలయ పురాణాల్లో పేర్కొని ఉంది. కేవలం ఆచారంగా మాత్రమే కాకుండా, ఈ క్షేత్రం పట్ల ఉన్న గాఢమైన నమ్మకంతో వేలాది మంది భక్తులు దర్శనానికి వస్తుంటారు. వినాయక చవితి పండుగ సమయంలో బ్రహ్మోత్సవాలు నిర్వహించి, ఉత్సవమూర్తిని ఊరేగిస్తూ కన్నుల పండుగలా పూజలు నిర్వహిస్తారు.
5) రంజన్‌గావ్ గణపతి ఆలయం (మహారాష్ట్ర)
రంజన్‌గావ్ గణపతి ఆలయానికి గొప్ప ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉంది. ఇది అష్టవినాయక క్షేత్రాలలో ఒకటిగా నిలిచింది. ఇక్కడి విగ్రహం అత్యంత శక్తివంతమైనదిగా భక్తులు భావిస్తారు. వినాయక చవితి సమయంలో ఈ ఆలయంలో వైభవంగా పూజలు నిర్వహిస్తారు.
Also Read: వినాయక చవితికి ఇంట్లో ప్రతిమకు ప్రాణప్రతిష్ట ఎలా చేయాలి? పూజ నుంచి నిమజ్జనం వరకు..
Also Read: అన్నీ స్కూళ్లు, కాలేజీలకు సెలవు..ఎట్టకేలకు సెలవు ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Bank Employees: బ్యాంకులకు ఐదు రోజుల పని విధానం.. దేశవ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగుల ఆందోళన
Hyderabad, Telangana:Bank Employees Strike: తీవ్ర పని ఒత్తిడి.. అధిక పని గంటలతో తీవ్రంగా సతమతమవుతున్న బ్యాంకు ఉద్యోగులు భారీ ఉద్యమం చేపట్టారు. తమ నిరసనల్లో భాగంగా శుక్రవారం దేశవ్యాప్త సమ్మె చేపట్టారు. అన్నీ జాతీయ బ్యాంకులు ఒక రోజు బంద్ చేపట్టాయి. తమ సమస్యల పరిష్కారం.. తమ డిమాండ్ల సాధనలో భాగంగా బ్యాంకు ఉద్యోగులు విధులను బహిష్కరించి తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ భారీ ఆందోళనకు దిగారు.
ఐదు రోజుల బ్యాంకింగ్ విధానం అమలులో జాప్యాన్ని నిరసిస్తూ యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (యూఎఫ్‌బీయూ) పిలుపు మేరకు దేశవ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగులు సమ్మె చేపట్టారు. హైదరాబాద్ కోఠిలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రధాన కార్యాలయంలో పెద్ద ఎత్తున బ్యాంకు ఉద్యోగులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తమ డిమాండ్లు నెరవేర్చాలని నినాదాలు చేశారు. వారంలో రెండు రోజుల సెలవు.. ఖాళీల భర్తీ చేపట్టి తమపై పని ఒత్తిడి తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ సమ్మెలో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 3,500 మంది ఉద్యోగులు పాల్గొన్నారు.
సమ్మె సందర్భంగా యుఎఫ్‌బీయూ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ కె. ఆంజనేయ ప్రసాద్ మాట్లాడుతూ.. ఐదు రోజుల బ్యాంకింగ్ విధానం అమలు, బ్యాంకింగ్ రంగంలో ఖాళీ పోస్టుల భర్తీ, ఉద్యోగుల సమస్యల పరిష్కారం తదితర డిమాండ్లను ప్రభుత్వం, బ్యాంకు యాజమాన్యాలు పరిష్కరించాలని కోరారు. బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగులపై పనిభారం పెరుగుతోందని, సిబ్బంది కొరతతో ఖాతాదారులకు సేవలు అందించడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు.
ప్రభుత్వ రంగ బ్యాంకులను బలోపేతం చేయాలని, ప్రైవేటీకరణ ప్రయత్నాలను నిలిపివేయాలని యుఎఫ్‌బీయూ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ కె. ఆంజనేయ ప్రసాద్ డిమాండ్ చేశారు. బ్యాంకింగ్ రంగంలో ప్రతిపాదిత పనితీరు ఆధారిత ప్రోత్సాహక విధానం (పీఎల్ఐ)పై ఉద్యోగ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఉద్యోగుల మధ్య విభజనకు దారితీసే విధానాలను అమలు చేయవద్దని కోరారు. బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగులు, అధికారుల న్యాయమైన డిమాండ్ల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని బ్యాంకు ఉద్యోగులు విజ్ఞప్తి చేశారు.
బ్యాంకింగ్ రంగానికి సంబంధించిన వివిధ సమస్యలపై చర్చించేందుకు సెప్టెంబర్ 28, 29, 30 తేదీల్లో దేశవ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగులు, అధికారులు సమావేశాలు నిర్వహించనున్నట్లు యూఎఫ్‌బీయూ ప్రకటించింది. సమస్యలు పరిష్కారం కాకపోతే తదుపరి ఆందోళన కార్యక్రమాలను చేపడతామని తెలిపింది. ఈ కార్యక్రమంలో ఏఐబీఈఏ రాంబాబు, ఎన్సీబీఈ ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్, శాండిల్య, వెంకటరామయ్య తదితరులు పాల్గొని సంఘీభవాన్ని తెలిపారు.
Tirumala: తిరుమల ఆలయంలో అనూహ్యంగా పెరిగిన భక్తుల రద్దీ
Dharmavaram, Andhra Pradesh:Devotees Heavy Rush To Tirumala Temple A Head Continuous Holidays Watch VideoTirumala Temple: తిరుమల శ్రీవారి సేవలో సినీ నటి కృతి శెట్టి
Dharmavaram, Andhra Pradesh:Cine Heroine Kriti Shetty Visits Tirumala Temple Watch VideoTelangana Rain Alert: తెలంగాణలో రెడ్ అలెర్ట్..ఈ 6 జిల్లాల్లో భారీ వర్ష సూచన!
Hyderabad, Telangana:Telangana Rain Forecast: బంగాళాఖాతం పరిసరాల్లో కొనసాగుతున్న సుస్పష్టమైన అల్పపీడనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో రాబోయే మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ వెల్లడించింది. తెలంగాణలోని 6 జిల్లాల్లో భారీ వర్షసూచన ఉండబోతుందని రెడ్ అలెర్ట్ జారీ చేసింది. ఆయా జిల్లాల్లో అధికారులతో పాటు ప్రజలకు తగు సూచనలు చేశారు.Tirumala: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న వైఎస్సార్సీపీ ఎంపీ
Dharmavaram, Andhra Pradesh:YSRCP MP Mithun Reddy Visits To Tirumala Temple Watch VideoMahesh Babu SIR Notice: డైరెక్టర్ రాజమౌళి, మహేష్ బాబు, ఉపాసనకు ఈసీఐ నోటీసులు..వెంటనే స్పందించాలని సూచన!
Hyderabad, Telangana:Mahesh Babu Rajamouli SIR Notice: దేశవ్యాప్తంగా ఎన్నికల సంఘం చేపడుతున్న ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియ తెలంగాణలో కూడా సమయం పొడిగించి సమర్థవంతంగా కొనసాగిస్తోంది. ఈ విధానంలో భాగంగా హైదరాబాద్ నగరంలో ప్రచురించిన ఓటర్ల ముసాయిదా జాబితాను అధికారులు నిశితంగా పరిశీలించారు. ఈ తనిఖీల్లో నగరంలోని జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఖైరతాబాద్ వంటి ప్రముఖ నియోజకవర్గాల పరిధిలో ఓటర్లుగా నమోదైన పలువురు దిగ్గజాల సమాచారంలో వ్యత్యాసాలు, సాంకేతిక లోపాలు ఉన్నట్లు తేలింది. అధికారుల రికార్డులతో వీరి వివరాలు సరిపోలకపోవడంతో చట్టబద్ధంగా వివరణ కోరుతూ ఈసీఐ నోటీసులు జారీ చేసింది.
సినీ రంగానికి చెందిన ప్రముఖులు..
ఎన్నికల సంఘం నోటీసులు పంపిన వారిలో టాలీవుడ్ అగ్రశ్రేణి నటులు, దిగ్గజ దర్శకులు ఉన్నారు. దర్శకుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు, ఆయన సతీమణి నమ్రతా శిరోద్కర్, సీనియర్ కథానాయకుడు దగ్గుబాటి వెంకటేష్, ఆయన కుటుంబ సభ్యుల పేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. వీరితో పాటు ప్రముఖ కథానాయిక సమంత రూత్ ప్రభు, యువ హీరో విజయ్ దేవరకొండ, ఆయన సోదరుడు ఆనంద్ దేవరకొండలకు కూడా ఈసీ నోటీసులు పంపారు.
క్రీడా, వ్యాపార రంగాలు..
సినీ ప్రముఖులతో పాటు క్రీడా రంగానికి చెందిన దిగ్గజాలు కూడా ఈసీఐ నోటీసులు అందుకున్న వారిలో ఉన్నారు. మాజీ క్రికెటర్లు వీవీఎస్ లక్ష్మణ్, మిథాలీ రాజ్, జాతీయ బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్, స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ ఓటరు రికార్డుల్లో తేడాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. కార్పొరేట్ రంగం నుంచి ఫార్మా దిగ్గజం దివీస్ ల్యాబ్స్ అధినేత మురళీకృష్ణ ప్రసాద్ దివి, అపోలో హాస్పిటల్స్ డైరెక్టర్ ఉపాసన కొణిదెల వంటి వ్యాపారవేత్తలకు కూడా నోటీసులు జారీ చేసినట్లు సమాచారం అందుతోంది.
ఓటరు గుర్తింపు కార్డుల్లో మ్యాచ్ కాని వివరాలకు సంబంధించి ప్రముఖులు తమ ఆధారాలను మళ్లీ సమర్పించి సవరణలు చేసుకోవాలని ఎన్నికల అధికారులు సూచించారు. ఒకవేళ వీరు ప్రత్యక్షంగా లేదా వ్యక్తిగతంగా విచారణకు హాజరు కాలేని పక్షంలో, తమ తరపున ఒక ప్రతినిధిని పంపే వెసులుబాటును ఎన్నికల సంఘం కల్పించింది.
Also Read: Chalo Hyderabad: ప్రభుత్వ ఉద్యోగుల్లో గందరగోళం..రేపు చలో హైదరాబాద్ ఉందా? లేదా?!
Also Read: మాధురి రాథోడ్ 'నిమ్మతోట వనములో' పాట సంపాద ఎంత? రూ.10 లక్షలు పెడితే,16.2 కోట్లతో..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Srikakulam Crime News: 7 ఏళ్ల బాలికపై 75 ఏళ్ల ముసలోడు లైంగిక దాడి..శ్రీకాకుళంలో దారుణం, కామాంధుడి అరెస్ట్!
Srikakulam, Andhra Pradesh:Srikakulam Minor Rape Case: శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలానికి చెందిన గుంజిలోవ గ్రామంలో ఒక దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. అదే గ్రామానికి చెందిన 75 ఏళ్ల వృద్ధుడు కవిటి రామారావు, బుధవారం మధ్యాహ్నం ఏడేళ్ల అమాయక బాలికపై లైంగిక దాడికి ఒడిగట్టాడని ఆరోపణలు వచ్చాయి. ఈ విషయం తెలుసుకున్న బాలిక తల్లిదండ్రులు వెంటనే స్పందించి, కోటబొమ్మాళి పోలీసులను ఆశ్రయించి ఘటనపై అధికారికంగా ఫిర్యాదు చేశారు.
బాధితురాలి తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కోటబొమ్మాళి పోలీసులు తక్షణమే విచారణ చేపట్టారు. భారతీయ నష్యాయ సంహిత (BNS)లోని సంబంధిత సెక్షన్లతో పాటు, పోక్సో (POCSO) చట్టంలోని సెక్షన్ 5(m) రెడ్ విత్ 6 కింద నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అనంతరం పోలీసులు బాధిత బాలికకు వైద్య పరీక్షలు నిర్వహించి, ఘటనకు సంబంధించిన సమాచారాన్ని సేకరించారు.
టెక్కలి డీఎస్పీ దాసరి లక్ష్మణరావు స్వయంగా బాలిక నివాసానికి వెళ్ళి పరిస్థితిని పరిశీలించి విచారణ నిర్వహించారు. అంతేకాకుండా, క్లూస్ టీమ్ (Clues Team) కూడా ఘటనాస్థలానికి చేరుకుని కీలక ఆధారాలను సేకరించింది.
నిందితుడి అరెస్ట్, కోర్టులో హాజరు..
కేసు దర్యాప్తును వేగవంతం చేసిన పోలీసులు, గురువారం సాయంత్రం కోటబొమ్మాళి మార్కెట్ యార్డు సమీపంలో టెక్కలి డీఎస్పీ దాసరి లక్ష్మణరావు ఆధ్వర్యంలో నిందితుడు కవిటి రామారావును అరెస్ట్ చేశారు. అనంతరం నిందితుడిని కోటబొమ్మాళి పోలీస్ స్టేషన్ నుంచి నడిపిస్తూ ప్రత్యేక జ్యుడీషియల్ సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచారు.
ఈ కేసును విచారించిన న్యాయస్థానం, నిందితుడు కవిటి రామారావుకు 7 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు నిందితుడిని ప్రత్యేక వాహనంలో శ్రీకాకుళం జిల్లా గార మండలం అంపోలు ప్రాంతంలో ఉన్న జిల్లా జైలుకు తరలించారు. చిన్నారులపై జరిగే లైంగిక నేరాలను అరికట్టేందుకు కఠినమైన చర్యలు తీసుకుంటున్నామని, అందుబాటులో ఉన్న ఆధారాల ప్రకారం కేసు దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.
Also Read: తిరుమల వెళ్లే భక్తులకు ఊహించని షాక్..సెప్టెంబరు 12, సెప్టెంబరు 13న దర్శనాలు రద్దు!
Also Read: "జగన్‌కి డీఎస్సీకి, ఏపీపీఎస్సీకి తేడా తెలుసా?" వైఎస్ జగన్‌కు మంత్రి లోకేష్ కౌంటర్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Seed Ganesha: విత్తన గణపతి నాటాలని హీరో విజయ్ దేవరకొండ పిలుపు
Hyderabad, Telangana:Actor Vijay Deverakonda Called To Use Seed Ganesha For Ganesh Chaturthi 2026 Watch VideoRajaka Community: అసెంబ్లీని ముట్టడించిన రజకులు.. కేసీఆర్ ఇచ్చింది మాకు ఇవ్వడం లేదు
Hyderabad, Telangana:Rajaka Community Protest At Telangana Assembly About Free Electricity Watch VideoTirumala: తిరుమలలో అనూహ్యంగా పెరిగిన భక్తుల రద్దీ.. శ్రీవారి సేవలో నటి కృతి శెట్టి
Tirupati Urban, Andhra Pradesh:Tirumala Heavy Rush: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనం కోసం తిరుమలకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్, నారాయణగిరి షెడ్లలో భక్తులు వేచి ఉన్నారు. క్యూలైన్లు, కంపార్టుమెంట్లలో భక్తుల సందడి కనిపిస్తోంది. శ్రీవారి దర్శనం కోసం వచ్చిన భక్తులకు టీటీడీ అధికారులు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. క్యూలైన్లలో ఉన్న భక్తులకు తాగునీరు, అన్నప్రసాదం, పాలు, అల్పాహారం అందిస్తున్నారు. భక్తుల రద్దీకి అనుగుణంగా దర్శన ఏర్పాట్లను అధికారులు పర్యవేక్షిస్తున్నారు. తిరుమలలోని ప్రధాన ప్రాంతాల్లో భక్తుల రద్దీ కనిపిస్తోంది.
తిరుమల శ్రీవారిని శుక్రవారం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. వైఎస్సార్సీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, సినీ నటి కృతి శెట్టి శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. వీఐపీ బ్రేక్ సమయంలో వారు దర్శించుకోగా.. వారికి ఆలయ అధికారులు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాయకుల మండపానికి చేరుకున్న ప్రముఖులకు వేద పండితులు వేద ఆశీర్వచనం అందించారు.
తిరుమల ఆలయంలో స్వామిని 11వ తేదీన భక్తులు భారీ సంఖ్యలో దర్శించుకున్నారు. శ్రీవారిని 69,771 మంది భక్తులు దర్శించుకోగా.. వారిలో 25,888 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. ఒక్కరోజే తిరుమల ఆలయానికి భారీగా హుండీ ఆదాయం లభించింది. రూ.6.94 కోట్లు హుండీ ఆదాయం వచ్చిందని టీటీడీ ప్రకటించింది. 4.42 లక్షల లడ్డూ ప్రసాదం విక్రయాలు జరగ్గా.. 2.65 లక్షల మంది భక్తులు అన్నప్రసాదం స్వీకరించారు. ఎస్ఎస్డీ టోకెన్లు లేకుండా సర్వదర్శనానికి 15 నుంచి 20 గంటలు సమయం పడుతోంది.
అవి రద్దు
రెండో శనివారం, ఆదివారంతోపాటు సోమవారం వినాయక చవితి రావడంతో వరుసగా మూడు రోజులు సెలవులు వచ్చాయి. ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, స్కూళ్లతోపాటు బ్యాంకులకు కూడా సెలవు కావడంతో పెద్ద ఎత్తున భక్తులు తిరుమలకు చేరుకుంటున్నారు. భక్తుల తాకిడి పెరగడంతో టీటీడీ దర్శనాలు త్వరగా అయ్యేలా చర్యలు తీసుకుంటోంది. శ్రీవారిని త్వరితంగా దర్శనం చేసుకునేలా టీటీడీ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో వీఐపీ బ్రేక్ దర్శనం, సిఫారసు లేఖలను టీటీడీ రద్దు చేసింది.
