ఖమ్మంలో 4 కోట్ల గంజాయిని దహనం: ఎక్సైజ్ పోలీసుల శక్తివంతమైన చర్య!
Kamanchikal, Telangana:ఖమ్మం ఎక్సైజ్ పరిధిలోని నాలుగు పోలీస్ స్టేషన్ లో రికవరీ చేసిన రూ. 4 కోట్ల విలువైన గంజాయిని దహనం చేసారు. 1611.947 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్న ఎక్సైజ్ పోలీసులు నగరంలోని ఐఎన్టీసీ కాంప్లెక్స్ లో దహనం చేసినట్లు అసిస్టెంట్ కమీషనర్ జి. గణేష్ తెలిపారు. జిల్లా నుండి వివిధ ప్రాంతాలకు గంజాయి సరఫరా అవుతుండగా అడ్డుకుని ప్రభుత్వ అనుమతితో దహనం చేసామన్నారు.हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
Car Lock Death: ఎమ్మెల్యే మీటింగ్‌లో తండ్రి.. డోర్ లాక్ కావడంతో కుమార్తె ఊపిరాడక మృతి
Julurupad, Telangana:Car Lock Death: ఎమ్మెల్యే నిర్వహించిన సమావేశానికి వెళ్లిన సర్పంచ్.. ఆలోపు ఇంటి వద్ద నిలిపిన కారులో చిక్కుకుని అతడి కుమార్తె చనిపోయింది. లాక్ వేసిన కారులో చిక్కుకుని ఊపిరాడక ఆ బాలిక కన్నుమూసింది. అయితే తమ పాప ఎంతకీ కనిపించకపోవడంతో ఆలస్యంగా గుర్తించిన కుటుంబసభ్యులు కారులో చూస్తే పాప అచేతనంగా పడిపోయి ఉంది. కారు తెరచి చూడగా అప్పటికే బాలిక చనిపోయి ఉండడంతో ఆ కుటుంబసభ్యులకు కడుపు కోత మిగిలింది. ఈ తీవ్ర విషాద సంఘటన తెలంగాణలో చోటుచేసుకుంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని జూలూరుపాడు మండలం వినోభానగర్ గ్రామ సర్పంచ్ నవీన్. నవీన్- ఐశ్వర్య దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉండగా.. పెద్ద కూతురు తన్విత (5). ఆదివారం సెలవు దినం కావడంతో తన్విత ఆడుకుంటూ కారులో కూర్చుంది. అయితే ఇంటి ముందు నిలిపిన కారు డోర్ లాక్ పడిపోయింది. ఇది తెలియని బాలిక అందులోని ఉండిపోయింది. కొద్దిసేపటికి కారులో ఊపిరాడక తల్లడిల్లిపోయింది. అనంతరం తీవ్ర అస్వస్థతకు గురయి కారులోనే తన్విత కుప్పకూలిపోయింది.
అయితే ఎంతసేపటికి పాప కనిపించకపోవడంతో తల్లిదండ్రులు, బంధువులు చుట్టుపక్కల గాలించారు. ఎక్కడా ఆచూకీ లభించకపోవడంతో ఇంటి ముందు నిలిపి ఉన్న కారులో చూడగా తన్విత అచేతనంగా పడి ఉండడాన్ని గుర్తించారు. వెంటనే కారు డోర్ తీసి బాలికను గమనించగా స్పృహలో లేకపోవడంతో హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే తన్విత మృతి చెందిందని వైద్యులు నిర్ధారించడంతో ఆ కుటుంబసభ్యులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. స్థానిక ఎమ్మెల్యే ఏర్పాటుచేసిన సర్పంచ్ల సమావేశం నిర్వహించగా.. ఆ సమావేశానికి వెళ్లిన తండ్రి నవీన్ వెంటనే విషయం తెలుసుకుని ఇంటికి వచ్చాడు. తన గారాలపట్టీ కారులో చిక్కుకుపోయి మరణించడంతో తల్లడిల్లేలా రోదించాడు. తమ కళ్ల ముందే పాప ప్రాణం పోతున్నా పట్టించుకోలేకపోయామని.. కాపాడుకోలేకపోయామని ఆ తల్లిదండ్రులు గుండెలవిసేలా ఏడ్చారు. కూతురు తన్విత మృతదేహంపై పడి వారిద్దరూ విలపించడం చూసి గ్రామస్తులు కూడా కన్నీరు పెట్టుకున్నారు. ఈ ఘటనపై పోలీసులకు సమాచారం చేరిందని తెలుస్తోంది.
Paradise Movie Ticket Price Hike: హీరో నానికి తెలంగాణ ప్రభుత్వం భారీ శుభవార్త.. ప్యారడైస్ టికెట్ల ధర పెంపు
Baddipadaga, Telangana:Paradise Movie: భారీ అంచనాలతో తెరకెక్కిన ప్యారడైజ్ సినిమా విడుదలకు సిద్ధమైంది. ఇప్పటికే టీజర్, పాటలతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొనడంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తెలంగాణ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తెరకెక్కించిన ప్యారడైజ్ సినిమాకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సినిమా టికెట్ల ధరలు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
ప్యారడైజ్ సినిమా స్పెషల్ షో, టికెట్ ధరల పెంపునకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. సెప్టెంబర్ 23వ తేదీన సాయంత్రం 6:30 గంటలకు స్పెషల్ ప్రీమియర్ షోకు ప్రభుత్వం అనుమతి నిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. టికెట్ ధర రూ.500 (విత్ జీఎస్టీ)గా నిర్ణయించింది. సినిమా విడుదల రోజు నుంచి అంటే సెప్టెంబర్ 27వ తేదీ వరకు మల్టీప్లెక్స్‌లకు రూ.94 (విత్ జీఎస్టీ), సింగిల్ స్క్రీన్లలో రూ.48 (విత్ జీఎస్టీ) టికెట్ రేట్ల పెంపునకు ప్రభుత్వం అంగీకరించింది.
సెప్టెంబర్ 28వ తేదీ నుంచి అక్టోబర్ 3 వరకు మల్టీప్లెక్స్‌లకు రూ.45 (విత్ జీఎస్టీ), సింగిల్ స్క్రీన్లలో రూ.23 (విత్ జీఎస్టీ) టికెట్ల ధరలు పెంచుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇస్తూ ఉత్తర్వులు విడుదల చేసింది. సినిమా టికెట్ల ధరలు పెంచడంతో వాటిలో వచ్చే ఆదాయంలో రూ.కోటి తెలుగు సినీ పరిశ్రమ కార్మికుల సంక్షేమ సంఘానికి నిర్మాత ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశం ఇచ్చింది. వీటికి అంగీకరించిన సినిమాలకే ప్రభుత్వం టికెట్ల ధరల పెంపునకు అంగీకరిస్తున్న విషయం తెలిసిందే.
దసరా సినిమాతో శ్రీకాంత్ ఓదెల భారీ హిట్ కొట్టడంతో అతడి రెండో సినిమా మరోసారి నానితో తీస్తున్నాడు. ఇప్పటికే సినిమాకు సంబంధించిన అప్డేట్లు భారీగా రాగా.. ఒక్క ట్రైలర్ విడుదల కాలేదు. అయినా కూడా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. తప్పకుండా సినిమా విజయం సాధిస్తుందని నాని భారీ ఆశలు పెట్టుకున్నాడు. కాగా తెలంగాణ నేపథ్యంలోనే ఈసారి కూడా కథాంశంగా దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తీసుకున్నట్లు తెలుస్తోంది. మరి ఈ సినిమా ఎలా ఉంటుందనేది కొన్ని రోజుల్లో తెలియనుంది.
Telangana PRC DA: ప్రభుత్వ ఉద్యోగుల పీఆర్సీ, డీఏ ఆలస్యం..తెరవెనుక నిజాలను బయటపెట్టిన Zee న్యూస్ ఎడిటర్ శ్రీ భరత్!
Hyderabad, Telangana:Telangana PRC DA News: రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన పీఆర్సీ (PRC), డీఏ (DA) అంశాలపై ప్రభుత్వం వ్యవహరిస్తున్న అలసత్వంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పీఆర్సీ నివేదికను సాధ్యమైనంత త్వరగా అందజేయాలని చీఫ్ సెక్రెటరీ లేఖ రాసి పది రోజులు పూర్తయినా, ఆ నివేదిక ఇంకా చీఫ్ సెక్రటరీకి చేరకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఈ నెల 9వ తేదీన చీఫ్ సెక్రెటరీ లేఖ ఇవ్వగా, 19వ తేదీ వచ్చినా నివేదిక రాకపోవడంతో ఉద్యోగుల్లో తీవ్ర అసహనం నెలకొంది. ఈ క్రమంలో ఉద్యోగుల పీఆర్సీ, డీఏల ప్రక్రియ మరింతగా లేటు అవుతున్న క్రమంలో.. తెరవెనుక జరుగుతోన్న పరిస్థితులను కులకషంగా వివరించారు.
ఈ సుదీర్ఘ ప్రక్రియ భారత రాజ్యాంగ రచన కంటే ఎక్కువ సమయం తీసుకుంటోందని ఉద్యోగులు సెటైర్లు వేస్తున్నట్లు జీ తెలుగు న్యూస్ ఎడిటర్ శ్రీ భరత్ చెప్పుకొచ్చారు. ప్రభుత్వం నాటకాలు ఆడకుండా తమ ఆర్థిక పరిస్థితిపై స్పష్టత ఇవ్వాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయని ఆయన అన్నారు.
తెలంగాణ ఉద్యోగుల పీఆర్సీ, డీఏలపై క్లారిటీ ఇచ్చేందుకు జరుగుతోన్న ఈ కాలయాపనపై సోషల్ మీడియా వేదికగా పలు సెటైర్లు, జోకులు వస్తున్నాయని ఎడిటర్ శ్రీ భరత్ తెలిపారు. డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ నేతృత్వంలోని డ్రాఫ్టింగ్ కమిటీ భారత రాజ్యాంగాన్ని రచించడానికి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల సమయం తీసుకుందని, కానీ ఉద్యోగుల జీతాల పెంపును నిర్ణయించే పీఆర్సీ కమిషన్ దాదాపు 3 సంవత్సరాలకు పైగా సమయం తీసుకోవడం హాస్యాస్పదంగా ఉందని విమర్శించారు. దేశ రాజ్యాంగాన్ని రచించడానికి పట్టిన సమయం కంటే పీఆర్సీ నివేదిక తయారీకే ఎక్కువ సమయం పడుతుండటంపై జీ తెలుగు న్యూస్ వేదికగా జరిగిన విశ్లేషణ కార్యక్రమంలో ఆయన ఆశ్చర్యం వ్యక్చం చేశారు.
గత కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ప్రారంభమైన ఈ పీఆర్సీ కమిషన్ వ్యవహారం, వెయ్యి ఎపిసోడ్లు దాటిన ఒక సుదీర్ఘమైన టీవీ సీరియల్లాగా సాగుతోందని ఎడిటర్ శ్రీ భరత్ విమర్శించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటికీ ఈ సీరియల్ ఇంకా కొనసాగుతూనే ఉందన్నారు. ఇందులో అధికారుల తప్పు ఏమీ లేదని, శివశంకర్ గారిని బ్లేమ్ చేయాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. ప్రభుత్వం "నువ్వు కొట్టినట్లు చేయి, నేను ఏడ్చినట్లు చేస్తా" అనే డ్రామాలు బంద్ చేసి, తమ ఆర్థిక శక్తి ఎంతో, ఎంత చేయగలుగుతారో క్లియర్‌గా చెప్పాలని డిమాండ్ చేశారు.
రాబోయే 21వ తేదీన సమావేశం ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఈ అంశంపై స్పష్టత వస్తుందో లేదో చూడాల్సి ఉంది. జీ తెలుగు వార్తల ప్రత్యక్ష చర్చలో ఉద్యోగ సంఘాల జేఏసీ ఛైర్మన్ చావా రవి, మారం జగదీశ్వర్, సదానంద గౌడ్ తదితరులు పాల్గొని తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.
Also Read: "ఉద్యోగులందరూ ఉచితాలకు వ్యతిరేకంగా పోరాడండి!" డీఏ, పీఆర్సీ ఆలస్యంపై ZEE భరత్ పిలుపు!
Also Read: కేవలం 2 గంటల్లోనే తిరుమల శ్రీవారి దర్శనం..తిరుమల వెళ్లే భక్తులకు గుడ్‌న్యూస్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Video Viral: గుండెలు గుభేల్ .. రన్నింగ్ ట్రైన్లో నాగుపాము కలకలం.. వీడియో వైరల్..
Hyderabad, Telangana:Snake hiding in Katihar Express train in Kolkata: ఇటీవల పాములు ఎక్కువగా జనావాసాల్లోకి వస్తున్నాయి. ముఖ్యంగా కోబ్రాలు ఇళ్లలోకి దూరి వస్తున్నాయి. కారులో, బూట్లలో దూరి హల్ చల్ చేస్తున్నాయి. ఇలాంటి ఘటనలు తరచుగా వార్తలలో ఉంటున్నాయి. ఈ క్రమంలో ఇతర సీజన్ లలో కంటే వానాకాలంలో పాములు సంచారం చాలా ఎక్కువగా ఉంటుంది. అంతే కాకుండా కోబ్రాలతో నిరంతరం అప్రమత్తంగా ఉండాలని చెప్తారు. అవి ఎక్కువగా చల్లగా, చీకటిగా ఉండే ప్రదేశాలలో ఉండేందుకు ఆసక్తిని చూపిస్తాయి.
20 सितंबर 2026 | रेल यात्रियों की सुरक्षा पर सवाल
चलती ट्रेन के स्लीपर कोच में बर्थ के नीचे से लंबा सांप निकलने का वीडियो सामने आया है। घटना कोलकाता जा रही कटिहार एक्सप्रेस की बताई जा रही है, जिससे यात्रियों में अफरा-तफरी मच गई।
यात्रियों ने रेलवे से ट्रेन की साफ-सफाई और… pic.twitter.com/nrc5uYtKLX
— Mumbai Congress (@INCMumbai) September 20, 2026
ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఒక పాము ఏకంగా రన్నింగ్ ట్రైన్ లోకి దూరింది. కోల్ కతా వెళ్తున్న రైలులో కొంత మంది ప్రయాణికులు పామును చూశారు. ఈ వీడియో వైరల్ గా మారింది. కోల్ కతాకు వెళ్తున్న కతీహర్ ఎక్స్ ప్రెస్ ట్రైన్ లో ఒక పాము ప్రవేశించింది. అది పాక్కుంటూ రాత్రిపూట లోయర్ బెర్త్ వద్ద హల్ చల్ చేసింది. ఇంతలో పామును కొంత మంది ప్రయాణికులు గుర్తించారు. ఆ తర్వాత వెంటనే దాన్ని బైటకు వెళ్లేలా చేశారు. పాము చూడటానికి చాలా డెంజర్ గా ఉంది.
Read more: Giant Python Video: వామ్మె.. జింకను గుటుక్కున మింగేస్తున్న భారీ కొండ చిలువ.. వీడియో వైరల్..
ప్రయాణికులు అరవడంతో ఆ పాము ఎక్జిట్ డోర్ గుండా బైటకు వెళ్లిపోయింది. కొంత మంది పాము కదలికలను తమ ఫోన్ లలో రికార్డు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో అది కాస్త వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఎంత పెద్ద ప్రమాదం తప్పిందో అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.
Telangana DA PRC: ఉద్యోగులందరూ ఉచితాలకు వ్యతిరేకంగా పోరాడండి! డీఏ, పీఆర్సీ ఆలస్యంపై ZEE భరత్ పిలుపు!
Hyderabad, Telangana:Telangana DA PRC DNA With Bharat: తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు, అవుట్సోర్సింగ్ సిబ్బంది తమ పీఆర్సీ (PRC) అమలు కోసం సుదీర్ఘకాలంగా ఎదురుచూస్తున్నారు. గత మూడు సంవత్సరాలుగా పీఆర్సీ నివేదిక పెండింగ్‌లోనే ఉండటం, అసెంబ్లీ సమావేశాలు నిరవధికంగా వాయిదా పడటంతో ఉద్యోగుల భవిష్యత్తుపై తీవ్ర అనిశ్చితి నెలకొంది. పీఆర్సీకి సంబంధించిన శివశంకర్ కమిటీ నివేదికను సమర్పించాలని చీఫ్ సెక్రటరీ (CS) ఆదేశించి 10 రోజులు దాటినా ఇప్పటికీ ఎటువంటి స్పందన లేదు. ఇదే విషయంపై జీ తెలుగు న్యూస్ ఎడిటర్ భరత్ తన గళాన్ని విప్పారు. ఉద్యోగులకు డీఏ, పీఆర్సీ పెండింగ్ సుదీర్ఘంగా పెండింగ్ పడుతున్న క్రమంలో ఉచితాలపై ఉద్యోగులు ప్రశ్నించాల్సిన అవసరం ఉందని ఆయన పిలుపనిచ్చారు.
అయితే ప్రభుత్వం ఏర్పాటు చేసిన శివశంకర్ కమిటీ ఈ నెల 21వ తేదీ నాటికి ప్రభుత్వం నుంచి వచ్చే స్పందన లేదా నిర్ణయంపై ఉద్యోగ సంఘాలు, అవుట్సోర్సింగ్ సిబ్బంది తీవ్ర ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు తమ హక్కుల సాధన, పీఆర్సీ పారితోషికాల అమలకై నిరంతరం నిరీక్షిస్తున్నారు. అవుట్సోర్సింగ్ జేఏసీ (JAC) నాయకులు దేవదాస్, మహిపాల్, శ్రీధర్, కట్కం రమేష్, ఏలూరు శ్రీనివాసరావు వంటి ప్రతినిధులు ఈ ఉద్యోగుల సమస్యలపై జీ తెలుగు న్యూస్ వేదికగా ఏర్పాటు చేసిన 'డీఎన్ఏ విత్ భరత్' డిబేట్ కార్యక్రమం వేదికగా తమ స్వరాన్ని వినిపించారు.
గత మూడేళ్ల నుండి పీఆర్సీ ప్రక్రియ కొలిక్కి రాకుండా నివేదిక పెండింగ్‌లోనే ఉండిపోవడం ఉద్యోగులలో తీవ్ర అసంతృప్తికి దారితీసింది. పీఆర్సీ నివేదికను వెంటనే అందజేయాలని చీఫ్ సెక్రటరీ (CS) సూచించి 10 రోజులు గడిచినా శివశంకర్ కమిటీ నుండి ఎలాంటి పురోగతి లేకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అధికారుల మధ్య జరుగుతున్న చర్చల ప్రకారం.. ఒకవైపు రాతపూర్వకంగా నివేదికను సమర్పించాలని చెప్తూనే, మరోవైపు ఫోన్ సంభాషణల ద్వారా నివేదికను ఇవ్వవద్దంటూ ఒత్తిళ్లు తెస్తున్నారనే ప్రచారం జరుగుతోంది.
ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు కూడా నిరవధికంగా వాయిదా పడటంతో, ప్రజాప్రతినిధుల సభలో ఈ అంశంపై చర్చించే అవకాశం లేకుండా పోయింది. వారాంతపు సెలవుల అనంతరం వచ్చే సోమవారంలోగా శివశంకర్ కమిటీ తన నివేదికను సమర్పిస్తుందా లేదా ఈ ప్రక్రియను మరో 10 రోజుల పాటు సాగదీస్తారా అనేది స్పష్టత లేకుండా ఉంది.
ఈ క్రమంలో, ప్రభుత్వం ఈ నెల 21వ తేదీ లోపు ఎటువంటి రెస్పాన్స్ ఇస్తుంది. ఎలాంటి చర్యలు తీసుకుంటుందోనని ఉద్యోగ సంఘాలు, అవుట్సోర్సింగ్ సిబ్బంది ఆశగా ఎదురుచూస్తున్నారు. తక్షణమే పీఆర్సీ నివేదికను స్వీకరించి, తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని ఉద్యోగులు కోరుతున్నారు.
Also Read: రైలు ప్రయాణికులకు అలర్ట్..రేపు హైదరాబాద్ వెళ్లే పలు రైళ్లురద్దు..అక్కడ స్పెషల్ రైలు
Also Read: కేవలం 2 గంటల్లోనే తిరుమల శ్రీవారి దర్శనం..తిరుమల వెళ్లే భక్తులకు గుడ్‌న్యూస్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Train Cancelled Warangal: రైలు ప్రయాణికులకు అలర్ట్..రేపు హైదరాబాద్ వెళ్లే పలు రైళ్లు రద్దు..అక్కడ స్పెషల్ ట్రైన్స్!
Secunderabad, Telangana:Train Cancelled Warangal: వినాయక చవితి, బతుకమ్మ, దసరా పండుగల నేపథ్యంలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని రైల్వే శాఖ కొన్ని కీలక రూట్లలో ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రజల ప్రయాణాన్ని సులభతరం చేసేందుకు రెండు తెలుగు రాష్ట్రాల మధ్య మొత్తం మీద 8 స్పెషల్ ట్రైన్స్‌ను నడపాలని నిర్ణయించింది. ఈ ప్రత్యేక రైళ్లు సెప్టెంబరు 19 నుంచి ప్రారంభమై అక్టోబరు 12వ తేదీ వరకు అందుబాటులో ఉంటాయని ఓ ప్రకటనలో పేర్కొంది. ప్రయాగ్ రాజ్, తిరునల్వెళ్లి మధ్య తిరిగే ట్రైన్ కొన్ని ప్రత్యేక స్టేషన్లలో మాత్రమే నిలుపుదల చేస్తారని సమాచారం. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని రైల్వే శాఖ కీలక ప్రకటన చేసింది.
స్పెషల్ ట్రైన్ సర్వీసుల వివరాలు..
పండుగ ప్రత్యేక రైళ్ల షెడ్యూల్ ప్రకారం..
ప్రయాగ్‌రాజ్ - తిరునెవెళ్లి (రైలు నంబరు - 04171): ఈ ఎక్స్‌ప్రెస్ రైలు ఈ నెల 19వ తేదీ నుండి అక్టోబర్ 10వ తేదీ వరకు మొత్తం నాలుగు సర్వీసులుగా వరంగల్ స్టేషన్‌కు చేరుకుని తన ప్రయాణాన్ని కొనసాగిస్తుంది.
తిరునెవెళ్లి - ప్రయాగ్‌రాజ్ (రైలు నంబరు 04172): తిరుగు ప్రయాణంలో ఈ ఎక్స్‌ప్రెస్ రైలు ఈ నెల 21వ తేదీ నుండి అక్టోబర్ 12వ తేదీ వరకు నాలుగు సర్వీసులుగా వరంగల్ మీదుగా ప్రయాణిస్తుంది.
హాల్టింగ్ (ఆగే) స్టేషన్ల వివరాలు..
ఈ ప్రత్యేక రైళ్లకు అప్, డౌన్ రెండు మార్గాల్లోనూ ప్రయాణికుల సౌకర్యార్థం అనేక ముఖ్యమైన స్టేషన్లలో హాల్టింగ్ సౌకర్యం కల్పించారు. ఈ రైళ్లు మార్గమధ్యంలో మాణిక్పూర్, సంత, కాట్ని, జబల్పూర్, ఇటార్సీ, నాగపూర్, చంద్రాపూర్, బల్లర్ష, సిర్పూర్ కాగజ్ నగర్, రామగుండం, వరంగల్, ఖమ్మం, విజయవాడ, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, రేణిగుంట, కట్పాడి, జోలార్‌పేటై, సేలెం, నమ్మకల్, కరూర్, దిండిగల్, మదురై, సత్తూర్, కోవిల్పట్టి, తిరునెవెళ్లి.. ఈ స్టేషన్లలో రైళ్లు ఆగుతాయని, ప్రయాణికులు ఈ ప్రత్యేక సర్వీసులను సద్వినియోగం చేసుకోవాలని రైల్వే అధికారులు కోరారు.
పలు రైళ్లు రద్దు..
అలాగే నిత్యం దేశవ్యాప్తంగా ఢిల్లీ, చెన్నై మధ్య రైల్వే లైన్ నిత్యం ప్రయాణికులతో రద్దీగా ఉంటుంది. ప్రస్తుతం పండుగల నేపథ్యంలో ఢిల్లీ - చెన్నై మధ్య సికింద్రాబాద్, విజయవాడ మీదుగా నిత్యం వేలాది మంది ప్రయాణిస్తుంటారు. ఈ క్రమంలో ప్రయాణికుల సౌకర్యార్థం భారతీయ రైల్వే శాఖ కొన్ని స్పెషల్ ట్రైన్స్ తీసుకొచ్చిన సంగతి తెలిసిందే.
అయితే వరంగల్, కాజీపేట మీదుగా సికింద్రాబాద్, కాగజ్ నగర్ మధ్య ప్రయాణించే పలు రైళ్లను ఆపరేషన్ కారణాల వల్ల దక్షిణ మధ్య రైల్వే ఈ నెల 20 వరకు కొన్ని రైళ్లను రద్దు చేసింది. అందులో సికింద్రాబాద్ - వరంగల్ (67761) పుష్ఫుల్ ఉండగా.. అలాగే వరంగల్ - సికింద్రాబాద్ (67762) పుష్పుల్, సిర్పూర్ కాగజ్ నగర్ - సికింద్రాబాద్ (12758), సికింద్రాబాద్ - సిర్పూర్ కాగజ్ నగర్ వెళ్లే (12757) ఎక్స్‌ప్రెస్ రైళ్లను ఈ నెల 20వ తేదీన రద్దు చేశారు. ప్రయాణికులు ఈ విషయాన్ని గమించాలని రైల్వే శాఖ తెలిపింది.
Also Read: తిరుమల వెళ్లే శ్రీవారి భక్తులకు శుభవార్త..ఇప్పుడు తిరుపతికి మరో వందే భారత్ రైలు!
Also Read: School Holidays: ఈవారంలో స్కూళ్లకు వరుసగా 3 రోజులు సెలవులు..విద్యార్థులకు పండగే పండగ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Abhishek Sharma Century: ఫోర్లతో విధ్వంసం.. సిక్సర్లతో సునామీ సృష్టించిన అభిషేక్ శర్మ
New Delhi, Delhi:Abhishek Sharma Record Century: స్వదేశంలో అఫ్ఘానిస్థాన్‌కు భారత బ్యాటర్లు చుక్కలు చూపిస్తున్నారు. మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో ఇప్పటికే రెండు విజయాలతో దూకుడుగా ఉన్న భారత జట్టు క్లీన్‌స్వీప్‌పై దృష్టి సారించింది. ఆఖరి మ్యాచ్‌లో అభిషేక్ శర్మ దంచికొట్టాడు. అఫ్ఘాన్ బౌలర్లను ఊచకోత కోసి అతి తక్కువ బంతుల్లో శతకం బాదిన బ్యాటర్‌గా అభిషేక్ రికార్డు సృష్టించాడు. 30 బంతుల్లో సెంచరీ నమోదు చేసి అరుదైన ఘనత సాధించాడు. అభిషేక్ ఇన్నింగ్స్ ఎలా సాగిందో చూద్దాం.
వరుసగా రెండు మ్యాచ్‌లను గెలిచి టీ20 సిరీస్‌ను చేజిక్కించుకున్న భారత జట్టు న్యూఢిల్లీ వేదికగా గురువారం అఫ్ఘానిస్థాన్‌తో జరిగిన ఆఖరి మ్యాచ్‌లో భారీ స్కోర్ నమోదు చేసింది. వైభవ్ సూర్యవంశీకి విశ్రాంతినివ్వగా ఓపెనర్‌గా దిగిన స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ చెలరేగి ఆడాడు. బౌలర్ ఎవరనేది చూడకుండా బ్యాట్‌తో బంతిని బౌండరీ దాటించడమే పనిగా పెట్టుకున్నాడు. ఫలితంగా 34 బంతుల్లో 317 స్ట్రైక్ రేటుతో 108 పరుగులు సాధించాడు. 9 ఫోర్లతో విధ్వంసం చేయగా.. 11 సిక్సర్లతో సునామీ సృష్టించాడు. ఈ సంచలన ప్రదర్శనతో అభిషేక్ పలు రికార్డులను బద్దలు కొట్టాడు.
Alla Nani: అధికార లాంఛనాలతో ముగిసిన ఏపీ మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని అంత్యక్రియలు
Sanivarapupeta, Andhra Pradesh:Alla Nani Funerals End: ఆంధ్రప్రదేశ్ మాజీ ఉప ముఖ్యమంత్రి, టీడీపీ సీనియర్ నాయకులు ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ (ఆళ్ల నాని) అంత్యక్రియలు శోకతప్త హృదయాల మధ్య ముగిశాయి. విశాఖపట్టణంలో మృతిచెందిన ఆయన పార్థీవదేహాన్ని ఏలూరుకు తరలించి అక్కడి నివాసంలో ప్రజల సందర్శనార్థం రెండు రోజులు ఉంచారు. మూడో రోజు ఆళ్ల నానికి సంబంధించిన అంతిమ యాత్ర నిర్వహించి.. అధికార లాంఛనాలతో అంత్యక్రియలు ముగించారు.
ఏలూరులోని శనివారపుపేటలో మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని భౌతికకాయానికి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. శనివారపుపేటలోని ఆయన నివాసం నుంచి ప్రత్యేకంగా అలంకరించిన వాహనంలో వీధుల గుండా అంతిమయాత్ర సాగింది. ఈ కార్యక్రమాన్ని మంత్రి కొలుసు పార్థసారథి దగ్గరుండి పర్యవేక్షించారు. పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపి గన్ సెల్యూట్‌తో నానికి చివరి గౌరవ వందనం సమర్పించారు.
అనంతరం ఆళ్ల నాని భార్య, ఇద్దరు కుమారులు, కుటుంబసభ్యులు అంత్యక్రియల క్రతువును పూర్తి చేశారు. ఈ సందర్భంగా మంత్రి కొలుసు పార్థసారథి మాట్లాడుతూ.. ఆళ్ల నాని మృతి రాష్ట్రానికి, ఏలూరు జిల్లాకు తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా, ఉప ముఖ్యమంత్రిగా ప్రజా సమస్యల పరిష్కారానికి ఆయన ఎంతో కృషి చేశారని కొనియాడారు. ముఖ్యంగా కరోనా సంక్షోభ సమయంలో వైద్యారోగ్య శాఖ మంత్రిగా ఆక్సిజన్, బెడ్లు, వ్యాక్సిన్ల కొరత లేకుండా చూసి ఎంతోమంది ప్రాణాలను కాపాడారని గుర్తు చేసుకున్నారు. ఆళ్ల నాని కుటుంబానికి ప్రభుత్వం, టీడీపీ పూర్తి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
ఈ అంతిమయాత్రలో ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి, కాపు కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు, అధికారులు, వివిధ పార్టీల నాయకులు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆళ్ల నానికి నివాళులర్పించారు. అయితే వైఎస్సార్సీపీ నాయకులు ఆళ్ల నాని అంత్యక్రియల్లో కనిపించకపోవడం చర్చనీయాంశమైంది. వైఎస్ జగన్ ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆళ్ల నాని చనిపోతే ఆ పార్టీ నాయకత్వం పట్టించుకోకపోవడం విమర్శలకు దారి తీస్తోంది.
AP Road Accidents: రక్తమోడిన ఏపీ రోడ్లు.. విషాదంగా మారిన తిరుమల యాత్ర, గణేశ్ నిమజ్జనం
Nuzendla, Andhra Pradesh:Massive Road Accidents In AP: ఆంధ్రప్రదేశ్‌లో రోడ్లు రక్తమోడాయి. ఘోర రోడ్డు ప్రమాదాలు సంభవించి నలుగురు మృతి చెందారు. ఆనందం.. ఆధ్యాత్మిక భావనలో సాగుతున్న తీర్థ యాత్ర, వినాయక నిమజ్జనంలో తీవ్ర విషాదం నింపింది. ఇద్దరు తిరుమల యాత్రకు వెళ్లి తిరుగు ప్రయాణం చేస్తుండగా రోడ్డు ప్రమాదం జరగ్గా.. మరో ఘటనలో వినాయక నిమజ్జనం ఊరేగింపుపై అదుపు తప్పిన కారు అత్యంగ వేగంగా భక్తులపై దూసుకెళ్లింది. ఈ రెండు ప్రమాదాల్లో నలుగురు మృతి చెందగా.. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
చిత్తూరు జిల్లా పలమనేరు పరిధిలోని బంగారుపాలెం మండలం మొగిలి ఘాట్ రోడ్డు వద్ద ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. తిరుమల శ్రీవారి దర్శనం చేసుకుని తిరుగు ప్రయాణమైన ఓ కుటుంబాన్ని రోడ్డు ప్రమాదం విషాదంలోకి నెట్టింది. ఆగి ఉన్న లారీని వెనుక నుంచి బొలెరో వాహనం ఢీకొట్టడగా ప్రమాదంలో ఓ మహిళ అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద సమయంలో బొలెరో వాహనంలో ఆరుగురు ప్రయాణిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
తిరుమల శ్రీవారి దర్శనం ముగించుకుని తిరిగి స్వస్థలానికి వెళ్తుండగా ఈ ఘటన జరిగినట్లు సమాచారం. మృతులు, క్షతగాత్రులను తమిళనాడు రాష్ట్రం కుప్పచ్చిపారై ప్రాంతానికి చెందినవారిగా పోలీసులు గుర్తించారు. డ్రైవర్ నిద్రమత్తులోకి జారుకోవడంతోనే వాహనం అదుపుతప్పి ఆగి ఉన్న లారీని ఢీకొన్నట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. ప్రమాదంపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనతో మొగిలి ఘాట్ రహదారిపై కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
వినాయక నిమజ్జనంలో విషాదం
చిత్తూరు జిల్లా వి.కోటలో వినాయక నిమజ్జనంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. వీ కోట నాయకనేరి టోల్ ప్లాజా పక్కన గంధోడిపాల్యం నుంచి చింతమాకునపల్లికి తీసుకు వెళుతున్న వినాయకుడి ఊరేగింపులో కర్ణాటక రాష్ట్రం హసన్‌కు వెళ్తున్న ఈచర్ వాహనం దూసుకొచ్చింది. వినాయకుడి ఊరేగింపు వెంట వెళ్తున్న వారిపై వాహనం దూసుకువెళ్లగా పెద్ద ఎత్తున భక్తులు గాయపడ్డారు. సుమారు 20 మందిపై వాహనం దూసుకెళ్లడంతో అక్కడ దారుణ పరిస్థితి నెలకొంది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 6 మందికి తీవ్ర గాయాలు కుప్పం పీఏఎస్ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి వి.కోట పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతిచెందిన వారిని వరలక్ష్మి (27), శివ (26)గా పోలీసులు గుర్తించారు. గాయపడిన వారు వెన్నెల (17), దిలీప్ (16), వరలక్ష్మి (35) పోలీసులు వెల్లడించారు. ప్రమాదంతో చింతమాకులపల్లిలో విషాదఛాయలు అలుముకున్నాయి.
Tirumala Darshan News: కేవలం 2 గంటల్లోనే తిరుమల శ్రీవారి దర్శనం..తిరుమల వెళ్లే భక్తులకు గుడ్‌న్యూస్!
Tirupati Urban, Andhra Pradesh:Tirumala Darshan News: కలియుగ వైకుంఠమైన తిరుమల గిరులలో నిత్యం గోవింద నామస్మరణ మార్మోగుతోంది. సాధారణంగా శ్రీవారి దర్శనం కోసం భక్తులు గంటల తరబడి క్యూలైన్లలో వేచి ఉండాల్సి వస్తుంది. కానీ ప్రస్తుతం తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉండటంతో భక్తులు ఎంతో ప్రశాంత వాతావరణంలో శ్రీనివాసుడిని దర్శించుకుని తరిస్తున్నారు.
సెప్టెంబరు 17వ తేదీ ఉదయం నాటికి వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని కేవలం 4 కంపార్ట్మెంట్లలో మాత్రమే భక్తులు వేచి ఉన్నారు. దీనితో స్లాటెడ్ సర్వ దర్శనం (ఎస్ఎస్డీ) టోకెన్లు లేని సాధారణ భక్తులకు కూడా కేవలం 2 గంటల వ్యవధిలోనే స్వామివారి దర్శనం కలుగుతోంది. ఇంత తక్కువ సమయంలో దర్శనం పూర్తవుతుండటంతో దూరప్రాంతాల నుండి వచ్చిన భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
భక్తుల సంఖ్య, హుండీ ఆదాయం..
గడిచిన ఒక్కరోజు వ్యవధిలోనే 71,196 మంది భక్తులు శ్రీవారి దివ్య మంగళ రూపాన్ని కన్నులారా వీక్షించారు. స్వామివారికి మొక్కులు చెల్లించుకోవడంలో భాగంగా కల్యాణకట్టలో 22,581 మంది భక్తులు తమ తలనీలాలు సమర్పించారు. అలాగే భక్తులు తమ స్థోమతకు తగినట్లుగా కానుకలు సమర్పించడంతో హుండీ ద్వారా ఒక్కరోజులోనే రూ.2.46 కోట్ల భారీ ఆదాయం వచ్చింది.
స్వామివారి దర్శనం ముగించుకున్న భక్తులు అత్యంత పవిత్రంగా భావించే 3.69 లక్షల లడ్డూ ప్రసాదాలను కొనుగోలు చేశారు. శ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనంలో 1.61 లక్షల మంది భక్తులు రుచికరమైన అన్నప్రసాదాన్ని స్వీకరించారు. క్యూలైన్లలో వేచి ఉన్న వారికి టీటీడీ అధికారులు అన్నప్రసాదాలు, పాలు, తాగునీరు అందిస్తున్నారు. భక్తుల ఆరోగ్య భద్రత నిమిత్తం అశ్విని ఆసుపత్రి ద్వారా 3,212 మంది భక్తులకు తక్షణ వైద్య సేవలు అందజేశారు.
తిరుమలలో రద్దీ తక్కువగా ఉన్న ఈ సమయంలో భక్తులు తమ తిరుమల యాత్రను మరింత సులభంగా ప్లాన్ చేసుకోవచ్చని టీటీడీ అధికారులు తెలియజేస్తున్నారు. క్యూలైన్లలో క్రమశిక్షణ పాటించి సిబ్బందికి సహకరించాలని, తిరుమల పవిత్రతను కాపాడాలని విజ్ఞప్తి చేస్తున్నారు. కాగా, రాబోయే బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రత్యేక దర్శనాలను టీటీడీ రద్దు చేసిన సంగతి తెలిసిందే.
Also Read: ఏపీ, తెలంగాణ ప్రజలకు చల్లని కబురు..బంగాళాఖాతంలో అల్పపీడనం..భారీ వర్షాలకు హెచ్చరిక!
Also REad: ఎట్టకేలకు వెలిగొండ ప్రాజెక్ట్‌ను సీఎం చంద్రబాబు ప్రారంభం..30 ఏళ్ల నాటి కల సాకారం..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Ganesh Immersion: గణేశ్ ఉత్సవాల్లో తీవ్ర విషాదం.. చెరువులో గణనాథుడితో మునిగి ఆరుగురు విద్యార్థుల జల సమాధి
Peddakanjerla, Telangana:Ganesh Immersion Turns To Tragedy: వినాయక చవితి ఉత్సవాలు హైదరాబాద్‌లో అంగరంగ వైభవంగా జరుగుతుండగా ఒక్కసారిగా తీవ్ర విషాద సంఘటన చోటుచేసుకుంది. మూడో రోజు పూజలు అందుకున్న వినాయకుడిని నిమజ్జనానికి తీసుకెళ్తూ విద్యార్థులు చెరువులో పడిపోయారు. చెరువు నీటిలో మునిగి విద్యార్థులు మృతి చెందారు. ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం ఆరుగురు విద్యార్థులు చనిపోయారని తెలుస్తోంది. దీనికి సంబంధించిన వివరాలు మరిన్ని తెలియాల్సి ఉంది.
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పోలీస్‌స్టేషన్ పరిధిలోని పెద్దకంజర్ల గ్రామం నేరేడు చెరువులో నిమజ్జనానికి వినాయకుడిని శిరీష చారిబుల్ ట్రస్ట్ విద్యార్థులు తీసుకువచ్చారు. ఆరు మంది విద్యార్థుల మృతి చెందారు. సమాచారం అందుకున్న వెంటనే పటాన్చెరు పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను వెలికితీసి ప్రాచీన్ గ్లోబల్ ఆస్పత్రికి తరలించారు.
Kavitha Lands: రేవంత్ రెడ్డికి కవిత చాలెంజ్.. 'గజం భూమి ఎక్కువ ఉన్నా నీకే ఇచ్చేస్తా!'
Baddipadaga, Telangana:Kavitha Lands: 'కవిత పేరు మీద మహబూబ్‌నగర్‌లో 14 ఎకరాల భూమి ఉంది. ఆమె భర్త అనిల్ కుమార్ పేరిట 23 ఎకరాలు ఉంది. వారిద్దరి పేరు మీద 37.26 ఎకరాల భూమి ఉంది' అని అసెంబ్లీలో రేవంత్ రెడ్డి చేసిన ప్రకటనపై తెలంగాణ రక్షణ సేన పార్టీ అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్సీ కవిత స్పందించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి చేసిన ప్రకటనను ఖండించారు. తన కుటుంబానికి భూములకు సంబంధించి రేవంత్ రెడ్డి అబద్ధాలు చెప్పారని మాజీ ఎంపీ కవిత స్పష్టం చేశారు.
అసెంబ్లీలో రేవంత్ రెడ్డి చేసిన ప్రకటనపై 'ఎక్స్' వేదికగా కవిత స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. 'ఎన్నికల అఫిడవిట్లో నేను ప్రస్తావించిన నా ఆస్తులకన్నా గజం భూమి ఎక్కువగా ఉన్నా ఆ భూమిని ప్రభుత్వానికే సరెండర్ చేస్తా' అని రేవంత్ రెడ్డికి సవాల్ చేశారు. అసెంబ్లీ వేదికగా రేవంత్ రెడ్డి తన కుటుంబానికి ఎక్కడో భూములు ఉన్నట్టు అబద్ధాలు చెప్పారని తెలిపారు. అసలు ఈ రేవంత్ రెడ్డిపైనే తమకు నమ్మకం లేదని స్పష్టం చేశారు.
అసెంబ్లీలో రేవంత్ రెడ్డి చదివిన భూముల చిట్టాలో నిజాలు నిగ్గు తేలాలంటే సీబీఐ విచారణకు ఆదేశించాలని తెలంగాణ రక్షణ సేన పార్టీ అధ్యక్షురాలు కవిత డిమాండ్ చేశారు. 'గుంపు మేస్త్రీ ఈ రోజు అసెంబ్లీలో ప్రస్తావించిన కేసీఆర్ ఫాంహౌస్‌లో ఉండే సీఎం గూఢచారి సహా నవీన్ రావు, కొండల్ రావు, గంగుల కమలాకర్, ఎర్రబెల్లి దయాకర్ రావు, జగదీశ్ రెడ్డి, రామేశ్వర్ రావు, ప్రతిమ శ్రీనివాస్ రావు, పల్లా రాజేశ్వర్ రెడ్డి, సుధీర్ రెడ్డి, పైలెట్ రోహిత్ రెడ్డి సహా అందరి భూములపై సీబీఐతో సమగ్ర విచారణ జరిపించి నిజాలు నిగ్గు తేల్చాలి' అని మరోమారు కవిత డిమాండ్ చేశారు.
ప్రభుత్వ నిబంధనలను మించి ఒక్క గజం భూమి తనకు ఎక్కువగా ఉన్న.. ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్న దానికన్నా గజం భూమి అదనంగా ఉన్నా ప్రభుత్వానికే సరెండర్ చేస్తానని మాజీ ఎమ్మెల్సీ కవిత మరోమారు స్పష్టం చేశారు.
ఎన్నికల అఫిడవిట్ లో నేను ప్రస్తావించిన నా ఆస్తులకన్నా గజం భూమి ఎక్కువగా ఉన్నా ఆ భూమిని ప్రభుత్వానికే సరెండర్ చేస్తాను
అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి నా కుటుంబానికి ఎక్కడో భూములు ఉన్నట్టు అబద్ధాలు చెప్పారు
అసలు ఈ ముఖ్యమంత్రి పైనే మాకు నమ్మకం లేదు.. అసెంబ్లీలో ఈరోజు సీఎం… pic.twitter.com/0dimCUmKNT
— Kavitha Kalvakuntla (@RaoKavitha) September 16, 2026
KCR Farm House: అసెంబ్లీలో రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన.. కేసీఆర్ ఫామ్‌హౌస్ భూములు దళితులకు పంచుతా!
Hyderabad, Telangana:KCR Farm House Lands: భూముల వ్యవహారంపై అసెంబ్లీ వేదికగా రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. మొన్న కాంగ్రెస్ నాయకులు తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ ఫామ్‌హౌస్‌పై దాడికి పాల్పడగా.. ఇప్పుడు రేవంత్ రెడ్డి కేసీఆర్ ఫామ్ హౌస్ భూములను సర్వే చేస్తామని.. వాటిని దళితులకు పంచి పెడతామని ప్రకటించారు. కేసీఆర్ కుటుంబానికి అన్ని ఎకరాల భూమి ఎలా వచ్చిందని ప్రశ్నించారు. కేసీఆర్ ఫామ్‌హౌస్ ఆధీనంలో 700 ఎకరాలు ఉన్నాయని రేవంత్ రెడ్డి తెలిపారు.
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా బుధవారం రేవంత్ రెడ్డి కీలక ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా 22ఏ భూముల వ్యవహారంపై కీలక ప్రసంగం చేశారు. 22ఏపై కాంగ్రెస్ ప్రభుత్వం వేధిస్తోందని ఆరోపిస్తున్నారని.. కానీ అది నిజం కాదని స్పష్టం చేశారు. 'కేసీఆర్ కుటుంబం పేరుతోనే 440 ఎకరాల భూమి ఉంది. ఎర్రవల్లి ఫాంహౌస్ పరిసరాల్లో వివాదంలో ఉన్న భూమి 385 ఎకరాలు ఉంది. కేసీఆర్ ఆధీనంలో 700 ఎకరాలకు పైగా భూమి ఉందా.? లేదా.? రెవెన్యూ అధికారులకు ఆదేశాలు ఇస్తున్నా' అని రేవంత్ రెడ్డి ప్రకటన చేశారు.
కేసీఆర్ ఆధీనంలో ఉన్న భూమి ఎంత? అక్కడ ప్రభుత్వం భూమి ఎక్కడ ఉందో ఎంత ఉందో తేల్చాలని అసెంబ్లీ నుంచి అధికారులకు రేవంత్ రెడ్డి ఆదేశించారు. 30 రోజుల్లో చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.లేదంటే అధికారులు, జిల్లా మంత్రుల మీద చర్యలు తీసుకుంటానని రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు.
'సిద్దిపేట మార్కూక్ మండలంలో కేసీఆర్‌కి 27 ఎకరాలు ఉండాలి. 67 ఎకరాలు ఉంది. మాజీ మంత్రి కేటీఆర్ కుటుంబంలో నలుగురి పేరుపై 123 ఎకరాల భూమి ఉంది. కేటీఆర్ కుటుంబానికి 49 ఎకరాలు. కేటీఆర్ సతీమణి శైలిమ పేరుమీద 17 ఎకరాలు, వారి కుమారుడు హిమాన్షు పేరు మీద 43 ఎకరాల భూమి' అని రేవంత్ రెడ్డి వెల్లడించారు. 'మాజీ మంత్రి హరీశ్ రావుకి 21 ఎకరాలు, ఆయన సతీమణి పేరు మీద 8.5 ఎకరాల భూమి ఉంది. సంతోశ్ రావు కుటుంబానికి 79 ఎకరాల భూమి ఉంది. సంతోశ్ పేరుపై 18.21 ఎకరాలు, ఆయన భార్యపై 7.2 ఎకరాలు ఉంది' అని అసెంబ్లీలో రేవంత్ రెడ్డి వివరించారు.
'2010లో ఒడిశాలో ధరణి ప్రారంభమైంది. కానీ కేసీఆర్ నేనే ధరణి తెచ్చానని చెప్పుకున్నారు' అని రేవంత్ రెడ్డి తెలిపారు. ధరణి తీసుకువచ్చిన కేసీఆర్ దందాలకు తెరలేపారని ఆరోపించారు. ధరణి చిట్టా చెప్పాలనే కేసీఆర్‌ను పదే పదే సభకు రావాలని అడిగినట్లు చెప్పారు. భూముల విషయాలు బయటపడతాయనే సభ నుంచి పారిపోయారని రేవంత్ రెడ్డి విమర్శించారు.
Clay Ganesh: 800 ఏళ్లు నిమజ్జనం కాని మట్టి వినాయకుడు.. ఎక్కడో తెలుసా?
Narayanpet, Telangana:800 Years Old Clay Ganesh Idol: వినాయక చవితి వచ్చిందంటే ప్రతి ఇంట్లోనూ, ప్రతి వీధిలోనూ గణనాథుడి సందడి కనిపిస్తుంది. వినాయకుడిని ప్రతిష్ఠించి భక్తిశ్రద్ధలతో పూజలు చేసి అనంతరం నిమజ్జనం చేయడం సంప్రదాయం. కానీ ఒకసారి ప్రతిష్ఠించిన తర్వాత నిమజ్జనం చేయకుండా ఏకంగా 800 సంవత్సరాలకుపైగా నిత్య పూజలు అందుకుంటున్న మట్టి వినాయకుడు ఉన్నాడంటే నమ్ముతారా? తెలంగాణలోని నారాయణపేటకు చెందిన ఈ గణపతి విగ్రహనికి ఎన్నో ఏళ్ల చరిత్ర ఉంది. ఈ అరుదైన మట్టి వినాయకుడిపై ప్రత్యేక కథనం.
నారాయణపేట జిల్లా కేంద్రంలోని పళ్ల వీధి విద్యాధర్ దీక్షిత్ నివాసంలో కొలువై ఉన్న ఈ మట్టి గణపతి సాధారణ వినాయకుడు కాదు. సుమారు 800 సంవత్సరాలకుపైగా చరిత్ర కలిగిన ఈ గణనాథుడు నేటికీ నిమజ్జనం కాకుండా నిత్య పూజలు అందుకుంటున్నాడు. ఈ విగ్రహానికి సుమారు 12వ శతాబ్దం నాటి చరిత్ర ఉందని స్థానికులు చెబుతున్నారు. సుమారు 12వ శతాబ్దంలో కశ్మీర్ ప్రాంతం నుంచి ఓ బ్రాహ్మణ కుటుంబం ఇక్కడికి వలస వచ్చారు. అప్పట్లో ఈ ప్రాంతాన్ని పాలించిన లోకపల్లి సంస్థానం రాజు కోరిక మేరకు ఆ కుటుంబం ఇక్కడ స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నట్లు స్థానికుల కథనం. వారు తమ వెంట తీసుకొచ్చిన మట్టి వినాయకుడిని అప్పటి నుంచి నిత్యం పూజిస్తూ వచ్చారట. కాలం మారినా.. తరాలు మారినా ఇక్కడ మట్టి గణపతికి మాత్రం పూజలు ఆగలేదు.
ఈ వినాయకుడి చరిత్రలో ఒక ఆసక్తికరమైన విషయాలు కూడా ఉన్నాయి. ఆ కుటుంబం అభివృద్ధి చెందడం కొంతమందికి నచ్చక కొందరు దొంగల రూపంలో వచ్చి గణపతి విగ్రహాన్ని ధ్వంసం చేశారు. విగ్రహం దెబ్బతినడంతో దాన్ని నిమజ్జనం చేయాలని కుటుంబసభ్యులు నిర్ణయించుకున్నారట. విగ్రహాన్ని నిమజ్జనం చేయడానికి సిద్ధమవుతున్న సమయంలో ఓ వ్యక్తి విటుడి రూపంలో వచ్చి ఓ సూచన చేశాడట. భిన్నమైన ఈ గణపతి విగ్రహాన్ని మట్టితో సహా పాలలో వేసి ఒక గదిలో ఉంచి 41 రోజుల పాటు పూజలు చేయాలని చెప్పాడట. ఆ వ్యక్తి చెప్పినట్లుగానే విగ్రహాన్ని పాలలో ఉంచి గది తలుపులు మూసి 41 రోజుల పాటు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
41 రోజులు పూర్తయిన తర్వాత గది తలుపులు తెరిచి చూడగా గణపతి విగ్రహం తిరిగి తన రూపాన్ని ఏర్పరచుకోవడంతో కుటుంబసభ్యులు ఆశ్చర్యపోయారు. అప్పటి నుంచి ఈ గణపతిని నిమజ్జనం చేయకుండా నిత్య పూజలు చేస్తూ వస్తున్నారు. ఒక్కసారి ప్రతిష్ఠించిన ఈ మట్టి గణపతికి మళ్లీ నిమజ్జనం అనే మాటే లేదు. వందల ఏళ్ల తరబడి తరతరాలుగా ఇదే గణపతికి పూజలు కొనసాగుతున్నాయి. ఈ వినాయకుడు కోరిన కోర్కెలు తీర్చే గణపతిగా భక్తుల్లో విశ్వాసం ఉంది. తమ కోరికలు నెరవేరిన తర్వాత భక్తులు స్వయంగా ఇక్కడికి వచ్చి ప్రత్యేక పూజలు చేస్తుంటారు. స్థానికులకే పరిమితం కాకుండా చుట్టుపక్కల గ్రామాల నుంచి.. ఇతర ప్రాంతాల నుంచి పక్క రాష్ట్రాల నుంచి కూడా భక్తులు ఈ గణపతిని దర్శించుకునేందుకు వస్తుంటారు.
వినాయక చవితి సందర్భంగా ఈ పురాతన మట్టి వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద మంత్రోచ్ఛారణల మధ్య భక్తిశ్రద్ధలతో పూజలు, అభిషేకాలు, హారతులు నిర్వహించారు. 800 ఏళ్లకు పైగా చరిత్ర ఉందని చెప్పే ఈ మట్టి గణపతి నేటికీ అదే విశ్వాసంతో భక్తుల పూజలు అందుకుంటున్నాడు. నిమజ్జనం ఎరుగని 800 ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన ఈ మట్టి గణపతిని మీరు కూడా సందర్శించండి.
Ganesh Mouse: గణేశ్ మండపంలో ఆశ్చర్యకర ఘటన.. కదలకుండా గణనాథుడి వద్ద ఎలుక
Andhra Pradesh:Mouse Pradakshina To Lord Ganesh: వినాయక చవితి ఉత్సవాలు దేశవ్యాప్తంగా అంగరంగ వైభవంగా ప్రారంభమవగా.. రెండో రోజు కూడా గణనాథుడు భక్తుల పూజలందుకున్నాడు. విఘ్నాలు తొలగించే వినాయకుడికి భక్తులు పూజలు చేసి తమ కోరికలు విన్నవించుకున్నారు. రెండో పూజలు అందుకున్న వినాయకుడి వద్దకు ఆయన వాహనమైన మూషికం వచ్చింది. గణేశ్ మండపంలో ఎలుక ప్రత్యక్షమవడంతో భక్తులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. మండపంలో కొన్ని నిమిషాల పాటు మూషికం అలాగే మండపంలో ఉంది. ఈ ఆసక్తికర సంఘటన ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో చోటుచేసుకుంది.
వినాయక చవితి వేడుకల్లో అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఒక వింత సంఘటన అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. గణనాథుడి వాహనమైన మూషికం సాక్షాత్తు ఆ దేవుడి చెంత ఉండిపోయింది. ఎక్కడకు కదలకుండా అక్కడే ఎలుక ఉండిపోయింది. అల్లూరి జిల్లా సీలేరులోని గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో వినాయక చవితి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ వేడుకల్లో భాగంగా ఏర్పాటుచేసిన వినాయక విగ్రహం వద్దకు ఒక మూషికం (ఎలుక) చేరింది.
మొదట గణనాథుడి విగ్రహం చుట్టూ ప్రదక్షిణ మాదిరి ఎలుక చేసింది. అనంతరం గణేశుడి ఒడిలో ఎలుక కూర్చుంది. గంటల తరబడి అక్కడే కదలకుండా ఉండిపోయింది. పాఠశాలలో పిల్లలు చేసే భజనలు, పెద్ద శబ్దాలు వస్తున్నప్పటికీ ఆ మూషికం ఏమాత్రం బెదరకుండా అక్కడే ఉంది. వినాయక చవితి రోజు మొదలైన ఈ ప్రయాణం ఇప్పటికీ గణేశ్ విగ్రహం చుట్టూ సాగుతోంది. విద్యార్థులు బొట్టు పెడితే కూడా ఎలుక పారిపోకుండా నామం ధరించింది.
పాఠశాల విద్యార్థులు భక్తితో బొట్టు పెట్టి.. తినడానికి ఇష్టమైన ఆహారాన్ని అందిస్తున్నారు. ఆ ఎలుక ఎక్కడికీ వెళ్లకుండా అక్కడే ఆహారం తింటూ గణపయ్య విగ్రహం దగ్గరే ఉంటోంది. దీన్ని దేవుని లీలగా స్థానికులు భావిస్తున్నారు. ఈ వింత దృశ్యాన్ని చూసిన పాఠశాల ఇంచార్జ్ ప్రధానోపాధ్యాయురాలు నాగశకుంతల, ఇతర ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు మరింత భక్తిభావంతో పూజలు నిర్వహిస్తున్నారు. వినాయకుడితో పాటు ఆయన వాహనమైన మూషికం కూడా ప్రత్యక్షంగా దర్శనమివ్వడంతో స్థానికులు పెద్ద ఎత్తున చూసేందుకు ఎగబడుతున్నారు.
