రుణమాఫీ చేయాలని కలెక్టరేట్ ఎదుట ధర్నా
Khammam, Telangana:రైతు రుణమాఫీ పూర్తిస్థాయిలో చేయాలని ఖమ్మం కలెక్టర్ వద్ద రైతు సంఘాలు ధర్నా చేసాయి. రుణమాఫీ కాకపోవడంతో రైతాంగం నిత్యం బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నట్లు రైతు సంఘం నాయకులు ఆరోపించారు. ప్రభుత్వం ఒక క్లారిటీతో లేకపోవడం వల్ల అనేక సమస్యలు వస్తున్నాయన్నారు. సగం మంది రైతులకు రుణమాఫీ జరగాల్సి ఉందని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు బాగం హేమంతరావు, మౌలానా పాల్గొన్నారు.हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
Telangana: తెలంగాణ రైజింగ్-2047లో భాగస్వామ్యం కావాలి: ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు పిలుపు
Hyderabad, Telangana:Hyderabad: తెలంగాణ రైజింగ్- 2047 లక్ష్యసాధనలో భాగస్వామ్యం కావాలని కార్పొరేట్ సంస్థలకు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పిలుపునిచ్చారు. 'ఆర్థిక వృద్ధితోపాటు సామాజిక పురోగతి సమాంతరంగా సాగేలా.. ఆవిష్కరణల ద్వారా ఉపాధి అవకాశాలు సృష్టించేలా.. అభివృద్ధి ప్రతి నియోజకవర్గానికి, దాని ఫలాలు సమాజంలోని ప్రతి వర్గానికి చేరేలా ఈ బృహత్తర ప్రణాళికను రూపొందించాం' అని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు.
ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా (ఐసీఎస్ఐ), హైదరాబాద్ ఛాప్టర్ ఆధ్వర్యంలో హైదరాబాద్ కొండాపూర్‌లోని తెలంగాణ కాంట్రాక్టర్స్ కల్చరల్ క్లబ్లో రెండ్రోజుల పాటు జరుగుతున్న ‘50వ సదరన్ ఇండియా రీజినల్ కాన్ఫరెన్స్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్’ను శనివారం మంత్రి శ్రీధర్ బాబు లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం కీలక ప్రసంగం చేశారు. 'కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) ద్వారా తెలంగాణ అభివృద్ధిలో భాగం కావాలి. ప్రభుత్వం, పరిశ్రమలు, సమాజం సమష్ఠిగా కృషి చేస్తేనే రాష్ట్ర సమగ్రాభివృద్ధి సాధ్యమవుతుంది' అని ప్రకటించారు.
Inaugurated the 50th Southern India Regional Conference of Company Secretaries 2026, organised by the Hyderabad Chapter of The Institute of Company Secretaries of India (ICSI), at the Telangana Contractors Cultural Club, Kondapur.
Glad to interact with over 700 Company… pic.twitter.com/lE40jrBhnE
— Sridhar Babu Duddilla (@OffDSB) August 1, 2026
'తెలంగాణ రైజింగ్-2047' అనేది కేవలం ప్రభుత్వ కార్యక్రమం కాదని.. సమాజంలోని అన్ని వర్గాల భాగస్వామ్యంతో సాకారమయ్యే అభివృద్ధి విజన్ అని శ్రీధర్ బాబు పేర్కొన్నారు. ఆర్థిక వృద్ధితో పాటు సామాజిక పురోగతి సమాంతరంగా సాగేలా.. ఆవిష్కరణల ద్వారా ఉపాధి అవకాశాలు సృష్టించేలా.. అభివృద్ధి ఫలాలు ప్రతి వర్గానికి చేరేలా ఈ బృహత్తర ప్రణాళికను రూపొందించినట్లు వెల్లడించారు. ఈ లక్ష్య సాధనలో ప్రభుత్వం... పరిశ్రమలు, విద్యాసంస్థలు, స్వచ్ఛంద సంస్థలు, కార్పొరేట్ రంగం భాగస్వామ్యానికి అత్యంత ప్రాధాన్యమిస్తోందని తెలిపారు.
సీఎస్ఆర్ ద్వారా సమాజంలో మార్పు తెచ్చే కార్యక్రమాల అమలుకు, పరిశ్రమల స్థాపనకు సంబంధించి ప్రతి దశలోనూ ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు భాగస్వామిగా, సహాయకారిగా ఉంటుందని మంత్రి శ్రీధర్ బాబు భరోసా ఇచ్చారు. ఏఐ, డేటా గవర్నెన్స్, సైబర్ భద్రత వంటి అంశాలు కార్పొరేట్ ప్రపంచంలో కొత్త సవాళ్లుగా మారుతున్న నేపథ్యంలో కంపెనీ సెక్రటరీలు.. కేవలం కంప్లయన్స్ నిపుణులుగా కాకుండా స్ట్రాటజిక్ బోర్డ్ అడ్వైజర్లుగా మారాల్సిన అవసరం ఉందని గుర్తుచేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో కంపెనీలు కేవలం లాభార్జనే కాకుండా సస్టైనబుల్, ఎథికల్ వ్యాపార వృద్ధిపై దృష్టి సారించాలని సూచించారు. మరిన్ని కార్పొరేట్ కంపెనీలు, సంస్థలు రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పని చేసేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
Traffic Alert: వాహనదారులకు బిగ్ అలర్ట్.. రేపు, ఎల్లుండి సికింద్రాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు
Secunderabad, Telangana:Secunderabad Traffic Diversions: వాహనదారులకు రేపు, ఎల్లుండి బిగ్ అలర్ట్. రెండు రోజుల పాటు హైదరాబాద్ నగరంలో భారీ ట్రాఫిక్ ఆంక్షలు ఉండనున్నాయి. ఈ మేరకు వాహనదారులతోపాటు ట్రాఫిక్ పోలీసులకు అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఆషాఢ మాసంలో ప్రతియేటా సికింద్రాబాద్ ప్రాంతంలో అంగరంగ వైభవంగా బోనాలు జరుగుతాయి. ఈ ఏడాది ఆషాఢ మాస బోనాల సందర్భంగా సికింద్రాబాద్ ప్రాంతంలో వాహనాల దారి మళ్లింపు చేయనున్నారు.
సికింద్రాబాద్‌లో ఆగస్టు 2వ తేదీ నుంచి 4 వరకు జరగనున్న ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర బందోబస్తు విధుల్లో పాల్గొంటున్న ట్రాఫిక్ పోలీస్ అధికారులకు, సిబ్బందికి హైదరాబాద్ ట్రాఫిక్-I డీసీపీ అవినాశ్ కుమార్ శనివారం సమగ్ర అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సమావేశంలో ట్రాఫిక్ అడిషనల్ డీసీపీ రాములు, ట్రాఫిక్ సికింద్రాబాద్ జోన్ ఏసీపీ శ్రీనివాస్, ట్రాఫిక్ ఖైరతాబాద్ జోన్ ఏసీపీ మోహన్ కుమార్, ఇతర అధికారులు లక్ష్మణ్, సీహెచ్ శోభన్ బాబు ఉన్నారు.
జాతర సందర్భంగా భక్తులకు, వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వేడుకలు ప్రశాంత వాతావరణంలో ముగిసేలా చూడాలని హైదరాబాద్ ట్రాఫిక్-I డీసీపీ అవినాశ్ కుమార్ అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర నేపథ్యంలో సిబ్బందికి పలు సూచనలు చేశారు. స్థానిక ట్రాఫిక్ ఇన్స్పెక్టర్లతో జాతర పరిసర ప్రాంతాలను క్షేత్ర స్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి కావాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు.
పోలీసులకు సూచనలు
==> బోనాల జరిగే ప్రాంతాల్లో ట్రాఫిక్ రద్దీ ఏర్పడకుండా ముందస్తుగా రూపొందించిన ట్రాఫిక్ మళ్లింపు ప్రణాళికలను పకడ్బందీగా అమలు చేయాలి.
==> భక్తుల రద్దీని నియంత్రించడంలో, పార్కింగ్ స్థలాల వద్ద వాహనాలను క్రమబద్ధీకరించడంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలి.
==> లా అండ్ ఆర్డర్ పోలీసులు, ఇతర ప్రభుత్వ శాఖల అధికారులతో నిరంతరం సమన్వయం చేసుకుంటూ విధులు నిర్వహించాలి.
==> జాతరకు వచ్చే భక్తులు, వాహనదారులతో మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తూ వారికి అవసరమైన సహాయ సహకారాలు తక్షణమే అందించాలి.
==> ప్రజా సౌకర్యం, భద్రతే ధ్యేయంగా ప్రతి ఒక్క అధికారి అప్రమత్తంగా విధి నిర్వహణలో నిమగ్నం కావాలి.
Wines Close: మందుబాబులకు బిగ్ అలర్ట్.. రేపు, ఎల్లుండి వైన్స్ షాపులు బంద్
Secunderabad, Telangana:Wine Shops Close For Two Days: మందుబాబులకు బ్యాడ్‌న్యూస్. రెండు రోజుల పాటు మద్యం దుకాణాలు బంద్ ఉండనున్నాయి. రెండు రోజులు మద్యం దుకాణాలు మూసివేయాలని అధికార యంత్రాంగం ఉత్తర్వులు జారీ చేసింది. ఒక్క మద్యం దుకాణాలే కాకుండా బార్లు కూడా మూతపడనున్నాయి. హైదరాబాద్‌లోని ప్రధాన ప్రాంతమైన సికింద్రాబాద్ ప్రాంతంలో వైన్స్ మూసివేయనున్నారు. ఇంతకీ ఎందుకంటే సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల సందర్భంగా మద్యం విక్రయాలు బంద్ పెట్టారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ఈ మేరకు మద్యం దుకాణాలు మూత వేయనున్నారు.
ఆషాఢమాసంలో రెండో ఆదివారం సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి జాతర అంగరంగ వైభవంగా చేస్తుంటారు. సికింద్రాబాద్ బోనాలను పురస్కరించుకుని రెండు రోజులు మద్యం దుకాణాలు మూసివేయనున్నారు. ఆగస్టు 2వ తేదీ ఉదయం 6 గంటల నుంచి ఆగస్టు 4 ఉదయం 6 గంటల వరకు మద్యం దుకాణాలు మూసివేయాలని పోలీసులతోపాటు ఎక్సైజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. బోనాల జాతర నేపథ్యంలో వైన్ షాపులు, కల్లు దుకాణాలు, బార్లకు రెండు రోజుల పాటు మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు.
సికింద్రాబాద్ బోనాల సందర్భంగా మార్కెట్, గోపాలపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని వైన్ షాపులు, కల్లు దుకాణాలు, రెస్టారెంట్లకు అనుబంధ బార్లు మూసివేయాలని పోలీసులు ఆదేశించారు. మల్కాజిగిరి జోన్ పరిధిలో ఆంక్షలు అమల్లోకి రానున్నాయి. శాంతిభద్రతల పరిరక్షణ, బోనాల వేడుకలు ప్రశాంతంగా జరిగేందుకు ఈ మేరకు పోలీసులు నిర్ణయం తీసుకున్నారు. పోలీసులకు ప్రజలు సహకరించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. అయితే నిబంధనలు ఉల్లంఘించి మద్యం విక్రయాలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికార యంత్రాంగం హెచ్చరికలు జారీ చేసింది.
Chandrababu: 'ఎర్రబస్సు రాదన్నారు.. ఎయిర్ బస్ వచ్చింది'
Visakhapatnam, Andhra Pradesh:CM Chandrababu Interesting Comments In Bhogapuram Airport Inauguration ProgrammeSRSP Project: ఎస్సారెస్పీ ప్రాజెక్టును సందర్శించిన తెలంగాణ మంత్రులు
Savel, Telangana:Telangana Ministers Visits SRSP Project A Head Heavy Water Flow Watch VideoTirumala: తిరుమల సేవలో పతి సమేతంగా పీవీ సింధు
Dharmavaram, Andhra Pradesh:Badminton Star Player PV Sindhu Visits To Tirumala Along With Her Husband Watch VideoTirumala: తిరుమల సేవలో తమిళనాడు మంత్రి, ఏపీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ
Dharmavaram, Andhra Pradesh:TN Minister And AP MLC MLAs Tirumala Darshan Know Who Visits To Templeఫ్రెండ్షిప్ డే స్పెషల్ వీడియో విషెష్..
Hyderabad, Telangana:Happy Friendship Day Video: ఈ ఏడాది స్నేహితుల దినోత్సవం ఆగస్టు 2వ తేదీన వచ్చింది. ఈరోజు అందరూ తమ బాల్య స్నేహితులతో పాటు ఇప్పుడు తమతో ఉన్న ఫ్రెండ్స్‌ను గుర్తు చేసుకుంటూ.. ఎంతో ఆనందంగా ఈ రోజున ఎంజాయ్ చేస్తూ ఉంటారు.. అంతేకాకుండా ఒకరికొకరు అద్భుతమైన సందేశాలను పంచుకుంటారు. ప్రపంచవ్యాప్తంగా ఈరోజుకు చాలా ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. ఇంతటి ప్రత్యేకత కలిగిన రోజున మీరు కూడా మీ స్నేహితులను ఇలా సోషల్ మీడియా ద్వారా విష్ చేయండి..ఈ ఫ్రెండ్షిప్ డేకి బెస్ట్ వీడియో విషెష్..
Hyderabad, Telangana:Happy Friendship Day Video Wishes: స్నేహానికి కులం మతం వయస్సు ప్రాంతం లేదా పేద గొప్ప అనే తారతమ్యాలు ఉండవు.. అందుకే స్నేహమనేది గొప్పగా భావిస్తూ ఉంటారు. ఇంతటి ప్రత్యేకత కలిగిన స్నేహానికి ప్రతి సంవత్సరం ఒకరోజు ఉంటుంది. అదేంటో కాదు స్నేహితుల దినోత్సవం. ఇది ఆగస్టు నెలలో జరుపుకుంటారు. అయితే ఈ ఏడాది ఆగస్టు రెండవ తేదీన వచ్చింది. ఇంతటి ప్రత్యేకత కలిగిన స్నేహితుల దినోత్సవం రోజున మీ స్నేహితులకు ఇలా శుభాకాంక్షలు పంపండి..హ్యాపీ ఫ్రెండ్షిప్ డే వీడియో విషెష్..
Hyderabad, Telangana:Pawan Kalyan Speech: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ ఎమోషనల్..భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభం వేడుకలో ఫుల్స్పీచ్!
Gudepuvalasa, Andhra Pradesh:Pawan Kalyan Speech Bhogapuram Airport: అల్లూరి సీతారామరాజు భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవ వేదికపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వాన్ని, దేశం కోసం ఆయన పడుతున్న శ్రమను కొనియాడుతూ పవన్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.Dhimsa Dance: కళ్లు చెదిరేలా థింసా డ్యాన్స్.. మోదీ సంభ్రమాశ్చర్యాలు
Bhogapuram, Andhra Pradesh:Dhimsa Dance Set Guinness World Record With 13000 Tribal Women Performance In Bhogapuram Airport Watch VideoTirumala: తిరుమల సేవలో జపాన్ ఓపెన్ చాంపియన్ పీవీ సింధు.. ఇతర ప్రముఖులు
Tirupati Urban, Andhra Pradesh:PV Sindhu In Tirumala: కోరిన కోరికలు మొక్కులు తీర్చే కలియుగ దైవం తిరుమల వేంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తుతున్నారు. సాధారణ భక్తులతోపాటు వీఐపీలు కూడా పెద్ద ఎత్తున వస్తున్నారు. శనివారం తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. బీజేపీ జాతీయ కార్యదర్శి రితురాజ్ సిన్హా, తమిళనాడు మంత్రి వినోద్, ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ, ఎమ్మెల్సీ పద్మశ్రీ తిరుమలకు విచ్చేసి శ్రీవారి దర్శనం చేసుకున్నారు. ఆలయ సంప్రదాయం ప్రకారం టీటీడీ అధికారులు ప్రముఖులకు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. స్వామివారి దర్శనం అనంతరం రంగనాయక మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించారు. అనంతరం ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేశారు.
స్వామి సేవలో పీవీ సింధు
తిరుమల శ్రీవారిని ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు దర్శించుకున్నారు. ఉదయాస్తమాన సేవలో భాగంగా శ్రీవారి ఆలయానికి చేరుకున్న పీవీ సింధు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం ఆలయ అధికారులు పీవీ సింధుకు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేసి ఆశీర్వచనం అందించారు. శ్రీవారి దర్శనం కోసం వచ్చిన పీవీ సింధిని చూసేందుకు ఆలయ పరిసరాల్లో భక్తులు ఆసక్తి చూపించారు. ప్రపంచ వేదికపై ఇటీవల చాంపియన్‌గా నిలిచి భారతదేశానికి పీవీ సింధు గౌరవం తీసుకువచ్చారు. బ్యాడ్మింటన్‌లో ప్రతిష్టాత్మక జపాన్ ఓపెన్‌లో పీవీ సింధు చాంపియన్‌గా నిలిచారు. దాదాపు మూడేళ్ల తర్వాత ఒక టైటిల్ సాధించడంతో సింధు స్వామివారికి మొక్కులు తీర్చుకునేందుకు వచ్చారు.
కొనసాగుతున్న భక్తుల రద్దీ
నిన్న శ్రీవారిని మొత్తం 71,393 మంది భక్తులు దర్శించుకున్నారు. తలనీలాలు 27,846 మంది భక్తులు సమర్పించారు. శ్రీవారి హుండీ ఆదాయం హుండీ కానుకలు రూ.4.46 కోట్లు వచ్చాయని.. లడ్డూ విక్రయాలు 4.33 లక్షలు జరిగాయని టీటీడీ అధికారులు వెల్లడించారు. ఇక అన్నప్రసాదాలు 2.58 లక్షల మంది భక్తులు స్వీకరించారని.. వైద్య సేవలు 2,946 మంది భక్తులు పొందారు. భక్తుల రద్దీ కొనసాగుతుండడంతో 31 కంపార్ట్మెంట్లు నిండి శిలాతోరణం వరకు క్యూలైన్ ఉంది. సర్వదర్శనానికి (ఎస్ఎస్డీ టోకెన్లు లేకుండా) 12 గంటలు సమయం పడుతోంది.
ప్రాజెక్టులపై అవగాహన లేని కేటీఆర్ మళ్లీ అమెరికాలో ఉద్యోగానికి వెళ్లాలి
Old Pochampad, Telangana:BRS Party vs Ministers: తెలంగాణ ప్రాజెక్టులపై బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు అవగాహన లేదని.. ఆయన మరోసారి ఉద్యోగం చేసుకునేందుకు అమెరికా వెళ్లాలని తెలంగాణ మంత్రి వివేక్ వెంకటస్వామి సూచించారు. ప్రాజెక్టుల విషయమై కేటీఆర్, హరీశ్ రావు ఇద్దరూ కలసి కాంగ్రెస్ ప్రభుత్వంపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. వర్షాలు రావొద్దని బీఆర్ఎస్ పార్టీ కోరుకుంటోందని తెలిపారు. కాంగ్రెస్ కట్టిన ప్రాజెక్టుల ద్వారానే నీళ్లు ఇచ్చుకుంటున్నామని చెప్పారు.
శ్రీరాంసాగర్ ప్రాజెక్టు, కడెం ప్రాజెక్టులకు భారీ వరద పోటెత్తుతుండడంతో వాటిని పరిశీలించేందుకు భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు, కార్మిక శాఖ మంత్రి వివేక్ నిర్మల్ జిల్లాకు వచ్చారు. అనంతరం నిజామాబాద్ జిల్లా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టును సందర్శించారు. ఎస్సారెస్పీ ప్రాజెక్టు నీటి మట్టం, ఇన్ ఫ్లోలు పరిశీలించిన అనంతరం మంత్రి వివేక్ మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్, హరీశ్ రావులపై తీవ్ర విమర్శలు చేశారు.
బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం తప్పుడు నిర్ణయాలతో తెలంగాణ ప్రభుత్వంపై భారం పడిందని.. 60 టీఎంసీల నీరు వృథా కావడమే కాకుడా సుమారు రూ.3 వేల కోట్ల నష్టం మిగిలిందని వివేక్ వెంకటస్వామి విమర్శించారు. కేటీఆర్‌కు ప్రాజెక్టులపై అవగాహన లేదని.. మళ్లీ అమెరికా వెళ్లి ఉద్యోగం చేసుకోవడం మంచిదని ఎద్దేవా చేశారు. హరీశ్ రావుతో కలిసి కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని.. వర్షాలు రాకూడదని బీఆర్ఎస్ నాయకులు కోరుకుంటున్నారని మండిపడ్డారు.
ప్రాజెక్టుల విషయంలో బీఆర్ఎస్ పార్టీ ఉద్దేశపూర్వకంగానే కాంగ్రెస్ ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తోందని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎల్లంపల్లి ప్రాజెక్టును కాంగ్రెస్ ప్రభుత్వమే కట్టిందని.. తామే కట్టామంటూ బీఆర్ఎస్ చెప్పుకోవడం విడ్డూరంగా ఉందని తప్పుబట్టారు. వాళ్లు (బీఆర్ఎస్ పార్టీ) కట్టిన ప్రాజెక్టులు కూలిపోయాయని తెలిపారు. ఎస్సారెస్పీకి పూర్వవైభవం తీసుకువస్తామని ప్రకటించారు. త్వరలోనే ఎస్సారెస్పీ ఆయకట్టు రైతులకు సాగునీటిపై స్పష్టమైన ప్రకటన చేస్తామని తెలిపారు. ఎస్సారెస్పీ ప్రాజెక్టు రాష్ట్రానికే గర్వకారణం అని ప్రకటించారు.
తెలంగాణ ఉద్యోగులు, పెన్షనర్లకు బిగ్ అలర్ట్..హెల్త్ కార్డ్ వివరాల అప్ డేట్ పై ఆర్థిక శాఖ కీలక ఆదేశాలు..!!
Lakshmapur, Telangana:Telangana EHS health card: తెలంగాణలోని ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు వారి కుటుంబ సభ్యులకు వైద్య సేవలు మరింత సులభంగా, నాణ్యంగా అందేలా చూసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలను వేగవంతం చేసింది. కొత్త ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ (NEHS) అమలు ప్రక్రియను పటిష్టం చేస్తూ ఆర్థిక శాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ఆర్థిక (EBS-V) శాఖ స్పెషల్ సెక్రటరీ సిక్తా పట్నాయక్ జులై 31, 2026 నాటి సర్క్యులర్ మెమో ద్వారా అన్ని విభాగాల అధికారులకు స్పష్టమైన మార్గదర్శకాలను విడుదల చేశారు.
కొత్త హెల్త్ స్కీమ్ (NEHS) ప్రాముఖ్యత:
ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు, అలాగే వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యులకు మెరుగైన కార్పొరేట్, నిబంధనల పరిధిలోని వైద్య చికిత్సలను అందించడమే ఈ ఈహెచ్ఎస్ (EHS) ముఖ్య ఉద్దేశం. నిబంధనల ప్రకారం అర్హులైన ప్రతి ఒక్కరికీ నూతన డిజిటల్ హెల్త్ కార్డులను జారీ చేయడానికి ఈ డేటా సేకరణ అత్యంత కీలకంగా మారింది.
IFMIS పోర్టల్‌లో కొత్త మార్పులు:
నూతన హెల్త్ కార్డుల మంజూరు ప్రక్రియను మరింత వేగవంతం చేసేందుకు ప్రభుత్వం సాంకేతిక మార్పులు చేసింది. ఇందులో భాగంగా 'ఐఎఫ్ఎంఐఎస్' (IFMIS) పోర్టల్‌లోని "Employee Master" మోడ్యూల్‌లో డ్రాయింగ్ అండ్ డిస్బర్సింగ్ ఆఫీసర్ల (DDO) లాగిన్లకు అదనపు ఫీల్డ్స్‌ను జోడించింది. ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యుల సమగ్ర సమాచారాన్ని, సంబంధిత సర్వీస్ రికార్డులు, ధ్రువీకరణ పత్రాల ఆధారంగా డీడీఓలు నిశితంగా పరిశీలించి ఈ పోర్టల్‌లో నమోదు చేయాల్సి ఉంటుంది.
ఆగస్టు 15 ఆఖరి తేదీ:
రాష్ట్రవ్యాప్తంగా అర్హత ఉన్న ఏ ఒక్క ఉద్యోగి లేదా వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యుడు ఈ పథకం నుంచి మినహాయించకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ ప్రక్రియకు ప్రత్యేక ప్రాధాన్యతనిచ్చింది. డీడీఓలు తమ పరిధిలోని సమాచారాన్ని సరిచూసి ఆగస్టు 15, 2026 నాటికి అప్డేషన్ ప్రక్రియను తప్పనిసరిగా పూర్తి చేయాలని స్పష్టం చేసింది.
కార్డుల జారీలో ఆలస్యం జరగకుండా ఉండాలంటే నిర్దేశిత కాలపరిమితిలోగా డేటా నవీకరణ పూర్తవ్వడం అత్యవసరమని అధికారులు స్పష్టం చేశారు. నిర్దేశిత గడువులోగా డీడీఓలు డేటా నమోదు పూర్తి చేసిన వెంటనే అర్హులైన ఉద్యోగులు, పెన్షనర్లకు నూతన ఈహెచ్ఎస్ (EHS) హెల్త్ కార్డులను పంపిణీ చేయనున్నారు. కాబట్టి ఉద్యోగులు కూడా తమ వివరాలను తక్షణమే డీడీఓల వద్ద సరిచూసుకోవాలని సూచించింది.
Also Read: మీ సమస్యలు నాకు వదిలేయండి.. ముందు పిల్లల భవిష్యత్తుపై పోరాడండి
Also Read: ఒక్కో విద్యార్థిపై రూ. 1.08 లక్షల ఖర్చు.. అయినా ప్రైవేట్ వైపేనా
Also Read: ఆ పరిచయమే కొంపముంచిందా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
