ఖమ్మం గ్రీవెన్స్ భారీగా బాధితుల ఫిర్యాదులు
Khammam, Telangana:ఖమ్మం కలెక్టరేట్ లో జరిగిన గ్రీవెన్స్ డేకు ప్రజలు పెద్దసంఖ్యలో తమ సమస్యలు చెప్పుకోవడం కోసం వచ్చారు. ప్రతి ఫిర్యాదును పరిశీలించిన కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్ వాటి పరిష్కారం కోసం ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. వచ్చిన ప్రతి ఫిర్యాదు తనీఖీ చేసి బాధితులకు న్యాయం చేయాలన్నారు. కలెక్టర్ కు సమస్య చెప్పుకుంటే పరిష్కారం అవుతుందన్న నమ్మకంతో భారీగా బాధితులు గ్రీవెన్స్ కు తరలివస్తున్నారు.हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
Harish Rao: ఇంజనీర్ విద్యార్థులు క్రిమినల్ వేస్ట్ వ్యాఖ్యలపై రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలి: హరీశ్ రావు
Siddipet, Telangana:Harish Rao vs Revanth Reddy: 'కాంగ్రెస్ మేనిఫెస్టోను సమాధి చేశారా.. 32 నెలలైనా ఓపీఎస్, ఆరు నెలల్లో ఇస్తామన్న పీఆర్సీ ఏవి? ప్రశ్నించే గొంతులపై ఏసీబీ, సీఐడీ అక్రమ కేసులు.. ఉద్యోగులకు బీఆర్ఎస్ అండగా ఉంటుంది, ఎవరూ భయపడొద్దు' అని ప్రభుత్వ ఉద్యోగులకు బీఆర్ఎస్ పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు భరోసా ఇచ్చారు. 'చాక్‌పీస్ కొనేందుకు పైసల్లేవు, స్కావెంజర్లకు జీతాల్లేవు.. విద్యాశాఖ మంత్రిగా రేవంత్ రెడ్డి కంప్లీట్ ఫెయిల్' అని రేవంత్ రెడ్డిపై విమర్శలు చేశారు. అసెంబ్లీని స్తంభింపజేసి అయినా సరే.. ఉద్యోగుల ఓపీఎస్, డీఏల సాధన కోసం బీఆర్ఎస్ పార్టీ పక్షాన పోరాడుతామని మాజీ మంత్రి హరీశ్ రావు ప్రకటించారు.
పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సిద్దిపేటలో సీపీఎస్ ఉద్యోగులు చేపట్టిన నిరసనలో పాల్గొని మాజీ మంత్రి హరీష్ రావు మద్దతు తెలిపారు. అనంతరం ఉద్యోగుల అంశాలతోపాటు రేవంత్ రెడ్డి ఇంజనీరింగ్ విద్యార్థులపై చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు స్పందించారు. 'సీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్ అమలు చేయాలని మీరు అడుగుతున్నది ఎలాంటి గొంతెమ్మ కోరిక కాదు. ఎన్నికల ముందు ఇదే కాంగ్రెస్ నాయకులు చేతులు జోడించి తాము అధికారంలోకి రాగానే ఓపీఎస్ తెస్తామని ఆపద మొక్కులు మొక్కి నమ్మబలికారు' అని గుర్తుచేశారు.
రేవంత్ రెడ్డి ఇంజనీరింగ్ విద్యార్థులను క్రిమినల్ వేస్ట్ అనడం అత్యంత దురదృష్టకరం.
మన పిల్లలు ఇంజనీరింగ్ చదివి ఎన్నో దేశాల్లో అద్భుతంగా రాణిస్తున్నారు. @revanth_anumula వెంటనే ఆ మాటలు వెనక్కి తీసుకోని ఇంజనీరింగ్ విద్యార్థులకు, టీచర్లకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాను. pic.twitter.com/F8POx1ZRTF
— Harish Rao Thanneeru (@BRSHarish) July 30, 2026
కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి పుణ్యకాలం సగం దాటిపోయి 32 నెలలు అవుతోంది. విజ్ఞప్తులు చేసినా రేవంత్ రెడ్డి స్పందించకపోవడంతో రోడ్డెక్కారు. ఎన్నికల ముందు మాత్రం ఆరు నెలల్లో పీఆర్సీ ఇస్తామని, పెండింగ్ డీఏలు అన్నీ వెంటనే ఇస్తామని, అద్భుతమైన ఈహెచ్ఎస్ పాలసీ తెస్తామని, ఓపీఎస్ తెస్తామని మేనిఫెస్టోలో పెట్టి నమ్మించారు' అని కాంగ్రెస్ మోసాలు మాజీ మంత్రి హరీశ్ రావు వివరించారు. 'మీరు ఇచ్చిన గ్యారెంటీలను సమాధి చేశారా? ఆ మేనిఫెస్టో ఈ రోజు ఒక చిత్తుకాగితంగా మారిపోయిందా? ఒక్కటైనా అమలు చేశారా?' అని రేవంత్ రెడ్డిని నిలదీశారు.
'ప్రభుత్వ ఉద్యోగులతో పెట్టుకున్న వారు ఎవరూ బాగుపడలేదు. సరైన సమయంలో వారు మీకు తప్పక గుణపాఠం చెబుతారని కాంగ్రెస్ నాయకులు గుర్తుంచుకోవాలి' అని కాంగ్రెస్ పార్టీకి మాజీ మంత్రి హరీశ్ రావు హెచ్చరిక చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో ఓపీఎస్ సాధనపై రేవంత్ రెడ్డిని నిలదీస్తామని.. అవసరమైతే అసెంబ్లీని స్తంభింపజేసి అయినా సరే మీకోసం గళం విప్పుతామని ప్రకటించారు. రేవంత్ రెడ్డి ప్రశ్నించే గొంతులను నొక్కేస్తూ, కక్ష సాధింపులకు పాల్పడుతున్నాడని.. అక్రమ కేసులు, విజిలెన్స్, ఏసీబీ, సీఐడీ ఎంక్వైరీలు పెట్టి భయభ్రాంతులకు గురిచేస్తున్నాడని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు వివరించారు. ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని.. మళ్లీ కేసీఆర్ ప్రభుత్వమే వస్తుందని తెలిపారు. 'ఉద్యోగుల కాంట్రిబ్యూషన్ డబ్బులను కూడా 8 నెలల పాటు ఈ ప్రభుత్వం కట్టలేదు. అసెంబ్లీలో మేము నిలదీస్తే అప్పుడు కట్టడం మొదలుపెట్టారు. కాంట్రిబ్యూషన్ కూడా కట్టకుండా మిమ్మల్ని ఎలా మోసం చేస్తోందో ఒక్కసారి ఆలోచించాలి' సీపీఎస్ ఉద్యోగులకు సూచించారు.
రేవంత్ రెడ్డి మైండ్ సరిగ్గా లేదు..
ఇంజనీరింగ్ విద్యార్థులను క్రిమినల్ వేస్ట్ అనడం అత్యంత దురదృష్టకరం.
మన పిల్లలు ఇంజనీరింగ్ చదివి ఎన్నో దేశాల్లో అద్భుతంగా రాణిస్తున్నారు.
రేవంత్ రెడ్డి... వెంటనే ఆ మాటలు వెనక్కి తీసుకోని ఇంజనీరింగ్ విద్యార్థులకు, టీచర్లకు క్షమాపణ చెప్పాలని… pic.twitter.com/UKPyAwXNrk
— Office of Harish Rao (@HarishRaoOffice) July 30, 2026
'రేవంత్ రెడ్డికి ఎక్కడ, ఏం మాట్లాడాలో తెలియడం లేదు. స్కూల్ పిల్లల ముందు బూతులు మాట్లాడుతారు. ఉపాధ్యాయులను అవమానపరిచేలా మీరు చదువు చెప్పిన ఇంజనీరింగ్ పిల్లలకు కనీసం దరఖాస్తు కూడా రాయరాదు అని హేళన చేశారు. ఇది మొత్తం ఉపాధ్యాయ లోకాన్ని అవమానించడమే' అని మాజీ మంత్రి హరీశ్ రావు ప్రకటించారు. 'ఉపాధ్యాయులు తమ స్కూళ్ల సమస్యలు అడగొద్దట.నేనెందుకు విద్యాశాఖ మంత్రిగా రాజీనామా చేయాలని ముఖ్యమంత్రి అంటున్నాడు. నీకు నువ్వే సర్టిఫికెట్ ఇచ్చుకుంటావా..? నువ్వు బాగా చేశావో లేదో పిల్లలు, ఉపాధ్యాయులు, ప్రజలు మార్కులు వేయాలి' అని పేర్కొన్నారు.
'విద్యా సంవత్సరం ప్రారంభమై నెలలు గడుస్తున్నా స్కూల్ గ్రాంట్స్ రాలేదు, స్కూళ్లలో చాక్‌పీస్ కొనుక్కునేందుకు కూడా పైసలు లేవు. స్కావెంజర్లకు 7 నెలల జీతాలు లేవు. పిల్లలకు ఇప్పటిదాకా యూనిఫామ్స్ రాలేదు. మన ఊరు మన బడి ఆపేశారు' అని రేవంత్ రెడ్డి వైఫల్యాలను మాజీ మంత్రి హరీశ్ రావు ఏకరువు పెట్టారు. 'మధ్యాహ్న భోజనంలో గుడ్ల ధరలు పెరిగినా, కనీసం పిల్లలకు సరిగ్గా అన్నం కూడా పెట్టలేని ముఖ్యమంత్రి నువ్వు. ఎంఈఓ, డీఈఓ పోస్టులు ఖాళీగా ఉన్నా ఒక్కటీ నింపలేదు. బ్రేక్ ఫాస్ట్ స్కీమ్ అన్నావు, ఉత్తిదే' అని తెలిపారు.
'పిల్లల ఫీజు రీయింబర్స్మెంట్ కింద రెండున్నరేళ్లలో ఒక్క రూపాయి ఇవ్వలేదు. మెగా డీఎస్సీ అన్నావు, ఉత్తిదే అయిపోయింది. విద్యాశాఖలో ఇన్ని దారుణాలు జరుగుతుంటే, నువ్వు విద్యాశాఖ మంత్రిగా ఉండి ఏం చేసినట్టు?' అని రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు ప్రశ్నించారు. 'ఇంతటి వైఫల్యాలు పెట్టుకుని, ప్రపంచ దేశాల్లో అద్భుతంగా రాణిస్తూ మన రాష్ట్రానికి పేరు తెస్తున్న ఇంజనీరింగ్ విద్యార్థులను పట్టుకుని ముఖ్యమంత్రి 'క్రిమినల్ వేస్ట్' అనడం అత్యంత దారుణం. ఆ పిల్లలను, వారికి చదువు చెప్పిన ఉపాధ్యాయులను ముఖ్యమంత్రి ఘోరంగా అవమానించారు' అని వివరించారు. 'అసలు రేవంత్ రెడ్డికి మైండ్ సరిగా లేదు. మాట్లాడిన ఆ మాటలను వెంటనే వెనక్కి తీసుకోవాలి. ఇంజనీరింగ్ స్టూడెంట్స్‌కు, ఉపాధ్యాయులకు బేషరతుగా క్షమాపణ చెప్పాలి' అని మాజీ మంత్రి హరీశ్ రావు డిమాండ్ చేశారు.
Ajinkya Rahane Retires: ఓటమి ఎరుగని కెప్టెన్ అజింక్య రహానే రిటైర్మెంట్..ఎమోషనల్ వీడియో వైరల్!
Hyderabad, Telangana:Ajinkya Rahane Retirement: భారత క్రికెట్లో అత్యంత నమ్మకమైన బ్యాట్స్మెన్లలో ఒకరిగా నిలిచిన అజింక్య రహానే.. తాజాగా రిటైర్మెంట్ ప్రకటించాడు. అంతర్జాతీయ క్రికెట్లో అన్నీ ఫార్మాట్ల నుంచి వీడ్కోలు పలుకుతున్నట్లు తెలిపాడు. "క్యాప్ నంబర్ 278, ఇక సెలవు. ఇన్నేళ్లుగా మీ ప్రేమకు, మద్దతుకు ధన్యవాదాలు" అని రాశారు. "నేను ఎల్లప్పుడూ కృతజ్ఞతతో ఉంటాను." ఈ సందేశంతో అతను తన అభిమానులకు, సహచర ఆటగాళ్లకు, కోచ్‌లకు, భారత క్రికెట్‌తో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరికీ తన కృతజ్ఞతను తెలియజేశాడు.Thalliki Vandanam: 'తల్లికి వందనం' భారీ మోసం.. సిమ్‌లతో రూ.3 కోట్ల దోపిడీ
Hyderabad, Telangana:ఇంటర్నెట్ను ఊపేస్తున్న పంజాబీ డాన్స్.. అబ్బబ్బ భలే ఉంది..
Hyderabad, Telangana:Punjabi Girl Video Viral: సోషల్ మీడియాలో ఎప్పుడు ఏ వీడియో వైరల్ అవుతుందో చెప్పడం కష్టం.. ముఖ్యంగా డాన్స్ వీడియోలకు నెటిజన్ల నుంచి లభించే ఆదరణే వేరు.. తాజాగా పంజాబీ సంప్రదాయ దుస్తుల్లో ఒక యువతి చేసిన డాన్స్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. దీనిని చూసిన సోషల్ మీడియా వినియోగదారులు ఫిదా అవుతున్నారు. అయితే, ఈ వీడియో ఇంతలా వైరల్ అవ్వడానికి గల కారణాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
సాధారణంగా పంజాబీ డాన్స్ అనగానే ఉత్సాహం, ఎనర్జీ, కలర్‌ఫుల్ మూవ్స్ మనకు గుర్తుకొస్తాయి. ఈ వైరల్ వీడియోలోనూ సరిగ్గా అదే జరిగింది.. ఎరుపు రంగు పంజాబీ సూట్ (Red Suit) ధరించిన ఒక యువతి.. పంజాబీ పాటలకు వేసిన స్టెప్పులు చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఆమె డాన్స్ మూవ్స్, బాడీ లాంగ్వేజ్, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ పర్ఫెక్ట్గా ఉండటంతో ఈ వీడియో తక్కువ సమయంలోనే లక్షలాది మంది దృష్టిని ఆకర్షిస్తోంది..
ఆకట్టుకుంటున్న ఎక్స్ప్రెషన్స్..
ఈ వీడియోలోని యువతి డాన్స్ మాత్రమే కాదు.. ఆమె ముఖంలో కనిపిస్తున్న Expressions ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయిగా భావించవచ్చు.. పాటలోని ప్రతి బీట్‌కు అనుగుణంగా ఆమె ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్, వేసిన స్టెప్స్ చూసి నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. సంప్రదాయ దుస్తులలో ఇంతటి ఎనర్జిటిక్ డాన్స్ చేయడం నిజంగా అద్భుతమని నెటిజన్స్ అంటున్నారు..
ఈ వీడియోను వివిధ సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్స్‌లో వేలాది మంది షేర్ చేస్తున్నారు. రియల్ టాలెంట్ అంటే ఇదే.. చూపు తిప్పుకోలేకపోతున్నాం.. పంజాబీ సంస్కృతికి తగ్గట్టుగా చాలా అందంగా డాన్స్ చేసింది.. అంటూ నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ వీడియోకు లైకులతో పాటు కామెంట్లు నిమిషాల్లోనే విపరీతంగా పెరిగిపోతున్నాయి.
Also Read: పోలీస్ వ్యాన్‌ను ఒంతిచేత్తో ఆపేసిన బాలీవుడ్ బ్యూటీ..నీట్ విద్యార్థులకు అండగా మోడల్!
ప్రస్తుతం ఈ డాన్స్ వీడియో ఇంటర్నెట్లో ఒక సంచలనంగా మారిందని భావించవచ్చు. గూగుల్ ట్రెండింగ్ లిస్ట్‌లో కూడా చోటు దక్కించుకుంటోంది. టాలెంట్ ఉంటే చాలు.. సరైన వేదిక లభిస్తే ఎవరైనా సోషల్ మీడియా స్టార్‌గా మారవచ్చని ఈ ఘటన మరొకసారి గుర్తు చేసింది..
Also Read: పోలీస్ వ్యాన్‌ను ఒంతిచేత్తో ఆపేసిన బాలీవుడ్ బ్యూటీ..నీట్ విద్యార్థులకు అండగా మోడల్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
భారీ వర్షాల నేపథ్యంలో పాఠశాలలకు రేపు సెలవు..
Hyderabad, Telangana:Karimnagar School Holiday News: కరీంనగర్ జిల్లా వాసులకు, ముఖ్యంగా పాఠశాల విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు అత్యంత ముఖ్యమైన వార్త.. గత కొన్ని రోజులుగా పడుతున్న కుండపోత వర్షాలతో జిల్లా తడిసిముద్దవుతోంది. వాగులతో పాటు వంకలు పొంగిపొర్లుతున్నాయి. రహదారులు జలమయమై పిల్లలను బడులకు పంపాలంటేనే తల్లిదండ్రుల గుండెలు చేతిలో పట్టుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ ఆందోళనకర పరిస్థితులను, ప్రజల భయాందోళనలను జిల్లా యంత్రాంగం సకాలంలో గుర్తించింది.
రేపు పాఠశాలలకు సెలవు..
వర్ష తీవ్రతను దృష్టిలో ఉంచుకుని.. విద్యార్థుల రక్షణే ధ్యేయంగా కరీంనగర్ జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా ప్రత్యేకమైన ఆదేశాలను జారీ చేశారు. కలెక్టర్ ఆదేశాల మేరకు జులై 31వ తేదీన జిల్లాలోని పాఠశాలలన్నింటికీ సెలవు ప్రకటిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి (DEO) చైతన్య జైనీ అధికారికంగా వెల్లడించారు.
ఈ నిర్ణయం జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటుతో పాటు ఎయిడెడ్ పాఠశాలల యాజమాన్యాలకు వర్తిస్తుందని DEO స్పష్టం చేశారు. చిన్నారి విద్యార్థులు వర్షంలో తడిసి అనారోగ్య సమస్యల బారిన పడకుండా.. ఏ విధమైన ప్రమాదాలకు గురికాకుండా చూసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు..
సాధారణంగా సెలవు అనగానే చదువు వెనుకబడిపోతుందేమోనన్న చింత ఉపాధ్యాయుల్లో, తల్లిదండ్రుల్లో వ్యక్తమవుతుంటుంది. కానీ.. జిల్లా విద్యాశాఖ దీనికి కూడా సరైన ప్రత్యామ్నాయాన్ని సిద్ధం చేసిన్నట్లు తెలుస్తోంది.. జులై 31న పనిదినాన్ని భర్తీ చేయడానికి రాబోయే ఆగస్టు 8న పాఠశాలలను యథావిధిగా నిర్వహించనున్నట్లు DEO చైతన్య జైనీ తెలిపారు. దీనివల్ల విద్యార్థుల విద్యాసంవత్సర ప్రణాళికకు ఎలాంటి నష్టం కలగదని ఆయన పేర్కొన్నారు.
Also Read: గౌరవెల్లి రిజర్వాయర్‌కు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్.. ప్రజల దశాబ్దాల కల నెరవేరింది..
పాఠశాలలకు, విద్యార్థులకు మాత్రమే ఈ సెలవు వర్తిస్తుందని.. ముందుగా నిర్ణయించిన ఉపాధ్యాయుల శిక్షణ కార్యక్రమాలు (Teacher Training Programs) మాత్రం షెడ్యూల్ ప్రకారమే.. కొనసాగుతాయని అధికారి తెలిపారు. సంబంధిత ఉపాధ్యాయులు ఈ విషయాన్ని గమనించి శిక్షణకు హాజరుకావాలని సూచించారు.
Also Read: గౌరవెల్లి రిజర్వాయర్‌కు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్.. ప్రజల దశాబ్దాల కల నెరవేరింది..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.
Thalliki Vandanam: 'తల్లికి వందనం' భారీ మోసం.. సిమ్‌లతో రూ.3 కోట్ల దోపిడీ
Kurnool, Andhra Pradesh:Thalliki Vandanam Cyber Fraud In Kurnool With Virtual SIM In KurnoolKurnool: సైబర్ నేరగాళ్ల భారీ మోసం.. కర్నూలులో బాధితుల లబోదిబో
Kurnool, Andhra Pradesh:Rs 3 Crore Cyber Fraud On Name Of Thalliki Vandanam Scheme In KurnoolCyber Fraud: బిగ్ అలర్ట్.. ఓటీపీలు చెప్పడంతో తల్లికి వందనం రూ.3 కోట్లు దోపిడీ
Kurnool, Andhra Pradesh:Thalliki Vandanam Scheme: విద్యా వ్యవస్థ బలోపేతం.. డ్రాపౌట్లు నివారించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకువచ్చిన తల్లికి వందనం పథకం విజయవంతంగా అమలవుతోంది. ఈ పథకం కింద విద్యార్థుల తల్లులకు రూ.13 వేలు బ్యాంకు ఖాతాల్లో ప్రభుత్వం జమ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ పథకాన్ని ఆసరాగా చేసుకుని సైబర్ మోసగాళ్లు భారీ మోసానికి పాల్పడ్డారు. రూ.3 కోట్ల మేర దోపిడీ చేశారు. ఈ సంఘటన కర్నూలు జిల్లాలో చోటుచేసుకోగా.. మోసపోయిన బాధితులు లబోదిబోమంటున్నారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
'తల్లికి వందనం' పథకం లబ్ధిదారులను లక్ష్యంగా చేసుకుని.. వర్చువల్ సిమ్ల ద్వారా భారీ సైబర్ మోసానికి పాల్పడ్డారని పథకం లబ్ధిదారులు వాపోయారు. సైబర్ నేరగాళ్లు లబ్ధిదారులకు ఫోన్ చేసి, వారి నుంచి ఓటీపీలను సేకరించి.. తద్వారా వారి బ్యాంకు ఖాతాల్లో జమ అయిన నిధులను కాజేసినట్లు పోలీసులు గుర్తించారు. కర్నూలు నగరానికి చెందిన పలువురు బాధితుల ఫిర్యాదుల మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వర్చువల్ సిమ్‌లను ఉపయోగించి మోసాలకు పాల్పడుతున్న ముఠాను గుర్తించారు.
తల్లికి వందనం పథకం సైబర్ మోసం కేసులో ప్రధాన నిందితుడిని కర్నూలు పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి 36 వర్చువల్ సిమ్‌లు, మొబైల్ ఫోన్లు, ఇతర కీలక ఆధారాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠా ద్వారా కోట్ల రూపాయల విలువైన లావాదేవీలు జరిగినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ తదుపరి దర్యాప్తు కోసం ఆధారాలు సేకరిస్తున్నామని, త్వరలోనే సమావేశం ఏర్పాటు చేసి పూర్తి వివరాలు వెల్లడిస్తామని తెలిపారు.
ఎంత అవగాహన కల్పిస్తున్నా సైబర్ మోసానికి గురవడంతో కర్నూలు పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ సందర్భంగా పోలీసులు ప్రజలకు కీలక సూచనలు జారీ చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తెలియని వ్యక్తులకు ఓటీపీలు, బ్యాంకు ఖాతా వివరాలు లేదా వ్యక్తిగత సమాచారాన్ని వెల్లడించవద్దని సూచించారు. అనుమానాస్పద ఫోన్ కాల్స్ లేదా సందేశాలు వచ్చిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌ను లేదా సైబర్ క్రైమ్ విభాగాన్ని సంప్రదించాలని ప్రజలకు సూచనలు చేశారు. తల్లికి వందనం పథకం కింద ఇప్పటికే ఏపీ పోలీస్ యంత్రాంగం అవగాహన కల్పించినా ఈ స్థాయిలో పెద్ద ఎత్తున మహిళలు మోసపోవడం విస్మయానికి గురి చేసింది.
ఎల్లంపల్లి వద్ద వరద ముప్పు.. తీరప్రాంత ప్రజలకు తీవ్ర హెచ్చరికలు!
Hyderabad, Telangana:Yellampalli Project News: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల ధాటికి ఉత్తర తెలంగాణలోని ప్రధాన జలాశయాలకు జలకళ సంతరించుకుంది. ఎగువన ఉన్న కడెం ప్రాజెక్టు భారీ వరద ప్రవాహం చేరుకోవడంతో అధికారులు గేట్లు ఎత్తి దిగువకు భారీగా నీటిని విడుదల చేశారు. దీంతో మంచిర్యాలతో పాటు పెద్దపల్లి జిల్లాల సరిహద్దుల్లోని ఎల్లంపల్లి ప్రాజెక్ట్‌కు వరద ప్రవాహం అత్యంత ఉధృతంగా పెరుగుతోంది. అయితే, భద్రతను దృష్టిలో ఉంచుకుని ఇరిగేషన్ శాఖ అధికారులు తక్షణమే అత్యవసర చర్యలు చేపట్టారు.
ఈ రోజు రాత్రి 7:30 గంటలకు ఎల్లంపల్లి ప్రాజెక్ట్ రేడియల్ క్రస్ట్ గేట్లను తెరిచి.. దిగువ గోదావరి నదిలోకి దాదాపు 1,00,000 క్యూసెక్కులకు పైగా నీటిని విడుదల చేయనున్నట్లు రామగుండం ఇరిగేషన్ విభాగం ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (EE) అధికారికంగా ప్రకటించారు.
వరద నీరు ఒక్కసారిగా ఉప్పొంగే ప్రమాదం ఉన్నందున ప్రాజెక్ట్ దిగువన ఉన్న గోదావరి పరివాహక గ్రామాల ప్రజలను అధికారులు ప్రత్యేకమైన హెచ్చరికలు జారీ చేశారు. గోదావరి తీర ప్రాంతాల వైపు ఎవరూ వెళ్లకూడదని ఆంక్షలు విధించారు. ముఖ్యంగా ఈ ప్రాంతాలకు సంబంధించిన ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
అలాగే నదిలో ప్రవాహ వేగం ప్రమాదకర స్థాయిలో ఉన్నందున చేపల వేట కోసం నదిలోకి దిగడం కానీ.. పడవలు నడపడం మానుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. పశువులను, గొర్రెలతో పాటు మేకల మందలను మేత కోసం నదీ తీరంలోకి కానీ.. ముంపు ప్రాంతాల్లోకి గానీ తీసుకెళ్లవద్దని కోరారు. దిగువ ముంపు ప్రాంతాల ప్రజలు నిరంతరం పరిస్థితిని గమనిస్తూ అప్రమత్తంగా ఉండాలని.. అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు లేదా పునరావాస కేంద్రాలకు మారేందుకు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు.
Also Read: గౌరవెల్లి రిజర్వాయర్‌కు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్.. ప్రజల దశాబ్దాల కల నెరవేరింది..
అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు పోలీస్, రెవెన్యూ యంత్రాంగాలు, ప్రజా ప్రతినిధులు తక్షణమే క్షేత్రస్థాయిలోకి రావాలని.. ఇరిగేషన్ శాఖ విజ్ఞప్తి చేసిన్నట్లు కూడా తెలుస్తోంది.. నదీ తీర గ్రామాల్లో మైకుల ద్వారా దండోరా వేయిస్తూ.. ప్రజలను చైతన్య పరచాలని సూచించారు. ముందస్తు హెచ్చరిక చర్యల ద్వారా ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
Also Read: గౌరవెల్లి రిజర్వాయర్‌కు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్.. ప్రజల దశాబ్దాల కల నెరవేరింది..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.
రైలులో పూజలు.. దీపం వెలిగించి షాకిచ్చిన ప్రయాణికుడు.. వైరల్ వీడియో..
Hyderabad, Telangana:Man Lights Diya Inside Moving Train Video: భక్తితో ఉండడం తప్పు కాదు.. కానీ అది ఇతరుల ప్రాణాలకు లేదా ప్రజా ఆస్తులకు ముప్పుగా మారినప్పుడు తీవ్ర పరిణామాలకు దారితీస్తుంది. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియో నెటిజన్లను ఆశ్చర్యానికి గురి చేస్తోంది.. కదులుతున్న ఒక రైలులో ఒక వ్యక్తి చేసిన నిర్వాకం ఇప్పుడు ఇంటర్నెట్లో తీవ్ర దుమారాన్ని రేపుతోంది.. దీనికి సంబంధించిన వీడియో కూడా ఇప్పుడు సోషల్ మీడియాల్లో సంచలనంగా మారింది. అయితే, దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
కదులుతున్న రైలులో దీపారాధన..
సాధారణంగా రైలు ప్రయాణాల్లో అగ్గిపెట్టెలు, లైటర్లు లేదా మండే స్వభావం కలిగిన పదార్థాలను తీసుకెళ్లడం చట్టరీత్యా నేరం.. కానీ, ఓ వ్యక్తి వీటన్నింటినీ పక్కన పెట్టి.. భారీగా ప్రయాణికులు కలిగిన కదులుతున్న రైలు భోగిలోనే పూజలు చేయడం ప్రారంభించాడు.. అంతటితో ఆగకుండా ప్రమిదలో నూనె పోసి.. ఒత్తి వేసి నిప్పు వెలిగించాడు. రైలు వేగంగా వెళ్తుండగా దేవుడికి హారతి ఇస్తూ.. నమస్కారాలు చేయడం ఇప్పుడు వైరల్ అవుతున్న వీడియోలో మీరు క్లియర్‌గా చూడొచ్చు..
ప్రమాదం జరిగితే పరిస్థితి ఏంటి?
రైలు వేగంగా వెళ్తున్నప్పుడు గాలి దాటికి ఆ దీపం కిందపడినా.. లేదా పక్కనే ఉన్న ప్రయాణికుల దుస్తులకు, సీట్లకు మంటలు అంటుకున్నా తీవ్ర ప్రమాదం జరిగే అవకాశం ఉంది.. గతంలో రైళ్లలో సంభవించిన ప్రమాదాలను గుర్తుచేసుకుంటూ.. పలువురు ప్రయాణికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒక చిన్న నిప్పు రవ్వ కూడా పెద్ద ఎంత ప్రమాదానికి దారితీస్తుందో తెలిసి కూడా ఇలాంటి బాధ్యతారాహిత్యమైన పనులు చేయడంపై ఆ వ్యక్తిపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
A fellow passenger reportedly intervened, explaining that such acts can be dangerous. Smoke may trigger the train's… pic.twitter.com/79SrmBnAdW
— Jharkhand Rail Users (@JharkhandRail) July 26, 2026
Also Read: పోలీస్ వ్యాన్‌ను ఒంతిచేత్తో ఆపేసిన బాలీవుడ్ బ్యూటీ..నీట్ విద్యార్థులకు అండగా మోడల్!
నెటిజన్ల తీవ్ర ఆగ్రహం..
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగానే సోషల్ మీడియా వినియోగదారులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. భక్తి ఉండాలి కానీ ఇలాంటి పిచ్చి పనులు కాదు.. ఇది భక్తి కాదు.. ప్రయాణికుల ప్రాణాలతో ఆడుకోవడమే.. అంటూ కామెంట్లు చేస్తున్నారు. కొందరు నెటిజన్లు ఈ వీడియోను రైల్వే మంత్రిత్వ శాఖకు, రైల్వే పోలీస్ ఫోర్స్ (RPF)కు ట్యాగ్ చేస్తూ.. సదరు వ్యక్తిపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
Also Read: పోలీస్ వ్యాన్‌ను ఒంతిచేత్తో ఆపేసిన బాలీవుడ్ బ్యూటీ..నీట్ విద్యార్థులకు అండగా మోడల్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Rat steals diamond Video: హమ్మా.. నీకెందుకే బంగారం.. 10 లక్షల విలువైన వజ్రాల ఆభరణాల్ని కాజేసిన ఎలుక.. వీడియో చూస్తే షాక్..
Hyderabad, Telangana:Rat steals diamond jewellery worth rs 10 lakh in Karnataka: సాధారణంగా నగల షాపులోని యజమానులు చాలా జాగ్రత్తగా ఉంటారు. ముఖ్యంగా బంగారం, వెండి రెట్లు ధరలు భారీగా పెరిగిపోయిన తర్వాత చోరీలు మరీ ఎక్కువయ్యాయి. ఈక్రమంలో ఇప్పటికే చాలా మంది కస్టమర్ల రూపంలో వచ్చిన దొంగలు బంగారంను కొట్టేస్తు అడ్డంగా దొరికిపోయిన ఘటనలు కొకొల్లలు. సీసీటీవీలో ఎప్పటికప్పుడు సిబ్బంది నిఘాలుపెడుతుంటారు. ఒక కస్టమర్ షోరూంలో ఎంట్రీ అయినప్పటి నుంచి అతను తిరిగి వెళ్లిపోయే వరకు ఒక కంట కనిపెడుతూనే ఉంటారు. ఏ మాత్రం అనుమానాస్పదంగా కన్పించిన వెంటనే అతడ్ని పట్టుకుని తనిఖీలు చేస్తారు. ఈ క్రమంలో కర్ణాటకలోని తూమకూరులోని గోల్డ్ షాపులో వింత ఘటన చోటు చేసుకుంది. ఇది కాస్త ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.
A jewellery store in Tumakuru was left puzzled after several gold rings and chains went missing overnight, only for CCTV footage to reveal an unlikely culprit—a rat.
The incident occurred at Vishwas Jewellers, where staff discovered the missing ornaments during their routine… pic.twitter.com/fJexzVf834
— Hate Detector 🔍 (@HateDetectors) July 30, 2026
కర్ణాటకలోని తుమకూరులో ఒక నగల దుకాణం ఉంది.దీనిలో అనేక రకాల బంగారం, వెండి నెక్లెస్ లు, వజ్రాల నగలు ఉన్నాయి. కస్టమర్లు రోజు వస్తుంటారు. ఇటీవల రూ. 10 లక్షల విలువైన వజ్రాలు పొదిగిన చిన్న బంగారు ఆభరణాలు మాయం అయ్యాయి. దీంతో షాపు యజమాని ఖంగుతిన్నాడు. షాపులో ఎవరైన చోరీకి పాల్పడ్డారా అని సీసీ ఫుటేజీ అంతా పరిశీలించాడు.
ఆ తర్వాత వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో రంగలోకి దిగిన స్థానిక పోలీసులు ఆ షాపులో ఉన్న ప్రతి ఒక్క సీసీ ఫుటేజీని చాలా జాగ్రత్తగా గమనించారు. అప్పుడు ఒక ఎలుక బంగారం నగలు ఉన్న ర్యాక్ లోకి ప్రవేశించి చిన్న చిన్న నగల్ని పట్టుకుని తన కలుగులోకి లాక్కెళ్లడంను గమనించారు .అక్కడ వెళ్లి చూడగా నిజం ఒక ఎలుక కలుగు ఉంది.
వెంటనే అక్కడి బొరియను తవ్వి చూశాడు. పోయిన ఆభరణాలు అందులో బైటపడ్డాయి. వాటి విలువ దాదాపు 10 లక్షలుగా షోరూమ్ సిబ్బంది చెప్పాడు. ఏది ఏమైన పొయిందనుకున్న వజ్రాలు లభించడంతో ఆ గోల్డ్ షాపు ఓనర్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అయితే.. ఈ ఎలుక చోరీకి పాల్పడిన ఘటనకు చెందిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
హిమాలయాల్లో మహా వింత.. 15 ఏళ్లకు ఒకసారే పూచే డైమండ్ ఫ్లవర్.. వీడియో..
Hyderabad, Telangana:Himalayan Diamond Flower Video: ప్రకృతి ఒడిలో ఎన్నో వింతలు, విశేషాలు దాగి ఉంటాయని మనందిరికీ తెలుసు.. ముఖ్యంగా మంచు కొండలతో కూడిన హిమాలయాల్లో లభించే వృక్ష సంపద, అరుదైన మొక్కలు నిత్యం శాస్త్రవేత్తలతో పాటు సామాన్యులను సైతం ఆశ్చర్యపరుస్తుంటాయి. తాజాగా అలాంటి ఒక అద్భుతమైన, అత్యంత అరుదైన పువ్వుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటూ వైరల్ అవుతోంది.
సముద్ర మట్టానికి దాదాపు 13,000 అడుగులకు పైగా ఎత్తైన ప్రతికూల వాతావరణంలో మాత్రమే పెరిగే ఈ పువ్వును హిమాలయన్ డైమండ్ ఫ్లవర్ అని.. స్థానికంగా కేంజో (Kenjo) అని పిలుస్తారు. ఈ అరుదైన మొక్క అత్యంత అద్భుతమైన జీవిత చక్రాన్ని కలిగి ఉంటుంది. సాధారణ పూల మొక్కల్లాగా ఇవి ప్రతి ఏటా లేదా ప్రతి సీజన్లో పూయవు.. కేవలం 7 నుంచి 15 సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే ఈ మొక్క విరబూస్తూ ఉంటుందని సమాచారం. పైగా.. ఈ పూల ఆకారం మనిషి ఎత్తు కంటే ఎక్కువ పొడవు పెరగడం విశేషం.. దట్టమైన మంచు, హానికరమైన తీవ్ర గాలులు వీచే ఎత్తైన పర్వత ప్రాంతాల్లో ఇది అత్యంత దృఢంగా పెరుగుతుంది.
ఈ కేంజో మొక్క నిర్మాణం సైంటిఫిక్ పరంగా ఎంతో అద్భుతమైనదిగా భావించవచ్చు. పసుపు రంగులో ఉండే దీని ఆకులు ఒక గ్లాస్‌హౌస్ లాగా పనిచేస్తాయి. ఇవి లోపల ఉన్న సున్నితమైన పువ్వులను, విత్తనాలను హిమాలయాల అతినీలలోహిత (UV) కిరణాలు, చలిగాలుల నుంచి రక్షిస్తూ ఉంటాయని సమాచారం. లోపలి భాగాన్ని వెచ్చగా ఉంచడం వల్ల పునరుత్పత్తి ప్రక్రియకు ఇవి ఎంతగానో సహాయపడుతూ ఉంటాయి.
ఇంతటి ప్రత్యేకత కలిగిన ఈ అరుదైన హిమాలయన్ డైమండ్ ఫ్లవర్ వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్లో తెగ చక్కర్లు కొడుతోంది.. ఈ వీడియోను చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఇది నిజంగా ప్రకృతి సృష్టించిన అద్భుతం.. మనిషి కంటే ఎత్తుగా పెరిగే ఇలాంటి వింత పూవును చూడటం ఇదే తొలిసారి.. అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. మనుషుల సంచారం లేని అత్యంత ఎత్తైన హిమాలయ ప్రదేశాలలో మాత్రమే కనిపించే ఈ పుష్పం.. ప్రకృతి తన ఒడిలో దాచుకున్న రహస్యాలకు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తోంది.
Also Read: పోలీస్ వ్యాన్‌ను ఒంతిచేత్తో ఆపేసిన బాలీవుడ్ బ్యూటీ..నీట్ విద్యార్థులకు అండగా మోడల్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
YS Jagan: విద్యార్థి జీవితాన్ని నాశనం చేస్తున్న చంద్రబాబు మనిషా.. రాక్షసుడా?: వైఎస్ జగన్
Srikakulam, Andhra Pradesh:Sidiri Appalaraju Son Bike Accident Case: 'బైక్ ప్రమాదంలో 18 ఏళ్ల విద్యార్థి జీవితాన్ని నాశనం చేస్తున్న చంద్రబాబు గడ్డి తింటున్నారా..? మనిషా? రాక్షసుడా..?' అని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇదే టీడీపీ నాయకులు ఎవరైనా చేస్తే ఇలాగే శిక్షలు విధిస్తారా..? అని ప్రశ్నించారు. 'ఇదే శ్రీకాకుళం ఎమ్మెల్యే, పాతపట్నం ఎమ్మెల్యే ప్రమాదం చేస్తే ఈ కేసుల్లో ఎవరిని అరెస్టు చేశారు. ఒక్కొక్కరికి ఒక్కోలా చేస్తే వ్యవస్థ బతకదు. చంద్రబాబు విష విత్తనాలు నాటుతున్నారు. అదే వ్యవస్థను నాశనం చేస్తున్నారు' అని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం పైడిభీమవరానికి చేరుకుని మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుటుంబాన్ని పరామర్శించారు. అప్పలరాజు జైలుకు వెళ్లడంతో తాము ఉంటామని.. వైఎస్సార్సీపీ అండగా ఉంటుందని ఆ కుటుంబానికి మాజీ సీఎం వైఎస్ జగన్ భరోసా ఇచ్చారు. అంతకుముందు విశాఖపట్నం నుంచి రోడ్డుమార్గంలో జగన్ శ్రీకాకుళం చేరుకున్నారు. దారిపొడవునా అభిమానులకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. ఆంక్షలు ఉన్నప్పటికీ పెద్దసంఖ్యలో అభిమానులు తరలివచ్చారు. చంద్రబాబు ప్రభుత్వంపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ధ్వజమెత్తారు. అక్రమ కేసులు పెట్టడమే చంద్రబాబు సర్కారు తెలిసిన పని.. కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు సీదిరి అప్పలరాజు అరెస్ట్ ఉదాహరణ అని వివరించారు.
అంపోలు జిల్లా జైలు వద్ద మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు గారి కుటుంబాన్ని పరామర్శించిన వైయస్ జగన్ గారు.#YSJaganInSrikakulam#SadistChandraBabu pic.twitter.com/uDuuONSBti
— YSR Congress Party (@YSRCParty) July 30, 2026
'యాక్సిడెంట్ ఎవరూ కావాలని చేయరు. యాక్సిడెంట్ హత్య ఎలా అవుతుంది? గొర్రెల కాపరి ఎవరో కూడా వీరికి తెలియదు. దురదృష్టవశాత్తు జరిగిన ప్రమాదం. చిన్నపిల్లాడు చేసిన ప్రమాదానికి హత్య, కుట్ర కోణం ఆపాదించారు. బైక్ ప్రమాదం జరిగితే కుట్ర కోణం ఎక్కడుంది?' అని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ నిలదీశారు. అప్పలరాజు టెన్త్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్. చంద్రబాబు అప్పట్లో అభినందించారు కూడా. సీదిరి అప్పలరాజు సామాన్య కుటుంబం నుంచి వచ్చి మంత్రిగా ఎదిగారు. సీదిరిపై తప్పుడు కేసును బనాయించారు. టీడీపీకి చెందినవారు కూడా ప్రమాదం చేస్తే.. వారిపైనా ఇలాగే కుట్ర కేసులు పెడతారా?' మాజీ సీఎం వైఎస్ జగన్ ప్రశ్నించారు.
'మంచితనాన్ని చంద్రబాబు పూర్తిగా పాతరేశారు. పొరపాటున.. దురదృష్టవశాత్తూ బైక్ ప్రమాదం జరిగింది. అప్పలరాజు కుమారుడు పొరపాటునో.. దురదృష్టవశాత్తునో ప్రమాదం చేశాడు. అతడి కెరీర్‌ను నాశనం చేయాలనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వ పెద్దలు కుట్రలకు దిగారు. అప్పలరాజును కూడా ఇరికించారు' అని మాజీ సీఎం వైఎస్ జగన్ వివరించారు. 'అప్పలరాజు కుమారుడి భవిష్యత్తును నాశనం చేయాలని చూస్తున్నారు. చెడు విత్తనాలు నాటుతున్నారు. ఇవి వృక్షాలై వ్యవస్థను నాశనం చేస్తాయి. ప్రమాదం జరిగిన వెంటనే 108కు ఫోన్ చేసి.. సీపీఆర్ కూడా చేశాడు. రాష్ట్రంలో కక్ష సాధింపు చర్యలకు అప్పలరాజు అరెస్ట్ ఒక ఉదాహరణ' అని చంద్రబాబు పాలనపై వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. యాక్సిడెంట్‌ను హత్య కేసుగా మార్చి సీదిరి కుటుంబంపై కూటమి ప్రభుత్వం కుట్రలకు తెరలేపిందని విమర్శించారు.
'రాష్ట్రంలో కక్ష సాధింపు రాజకీయాలు జరుగుతున్నాయనే దానికి ఇదే నిదర్శనం. కనీసం మానవతా విలువలు లేకుండా మంచితనానికి పాతరేశారు. నీట్ రాసి.. తన తండ్రిలాగా డాక్టర్ అవ్వాలని అనుకున్నాడు సీదిరి కుమారుడు. తెలిసో తెలియకుండా యాక్సిడెంట్ చేశాడు. కానీ కేసును ట్విస్ట్ చేసి హత్య చేశాడని, కుట్ర చేసి సీదిరి కుటుంబాన్ని ఇబ్బంది పెడుతున్నారు' అని చంద్రబాబుపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
అనుకోని పరిస్థితుల్లో రోడ్డు ప్రమాదం జరిగితే.. ఆ పిల్లాడి జీవితాన్ని నాశనం చేయాలని చూడటం ఎంతవరకు సరైంది అని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ ప్రశ్నించారు. 'బీసీల్లో సీదిరి మంచి నాయకుడు. చిన్న పిల్లాడు చేసిన యాక్సిడెంట్‌ను కుట్రగా.. హత్యగా చిత్రీకరించి సీదిరి కుటుంబాన్ని ఇరికించే కార్యక్రమం ఎంతవరకు ధర్మం' అని నిలదీశారు. అప్పలరాజును ఇబ్బంది పెట్టేలా తన కెరీర్‌ను నాశనం చేయాలని దుర్మార్గకపు ఆలోచన చేస్తున్నారని మండిపడ్డారు.
KCR: మనవడి కోసం ఆస్పత్రికి వచ్చిన తెలంగాణ తొలి సీఎం కేసీఆర్
Hyderabad, Telangana:Former CM KCR Visits Hospital For His Grand Son Himanshu RaoNeeraj Chopra: కామన్వెల్త్ గేమ్స్‌లో సత్తా చాటిన నీరజ్ చోప్రా..ఫైనల్లో అడుగుపెట్టిన ముగ్గురు భారత అథ్లెట్లు!
Hyderabad, Telangana:Neeraj Chopra CWG Final: కామన్వెల్త్ గేమ్స్ (CWG) 2026 పురుషుల జావెలిన్ త్రో క్వాలిఫికేషన్ రౌండ్లో భారత స్టార్ అథ్లెట్ నీరజ్ చోప్రా అద్భుతమైన ప్రదర్శన చేశాడు. రెండుసార్లు ఒలింపిక్ పతక విజేతగా నిలిచిన నీరజ్ చోప్రా కామన్వెల్త్ గేమ్స్‌లో ఫైనల్ పోరుకు చేరాడు. ఫైనల్‌కు అర్హత సాధించే క్రమంలో తీవ్రమైన పోటీ నెలకొనగా..నీరజ్ చోప్రాతో పాటు మరో ఇద్దరు భారత ఆటగాళ్లు సత్తా చాటి ఫైనల్‌కు చేరారు.
క్వాలిఫికేషన్ హైలైట్స్
ఈ పోటీలో పాల్గొన్న ఏ అథ్లెట్ కూడా నిర్ణీత 84 మీటర్ల ఆటోమేటిక్ క్వాలిఫికేషన్ మార్కును అందుకోలేకపోయారు. ఆటోమేటిక్ మార్కు నమోదు కాకపోవడంతో, ఉత్తమ ప్రతిభ కనబరిచిన టాప్-12 మంది అథ్లెట్లను ఫైనల్ రౌండ్‌కు ఎంపిక చేశారు. 2018 కామన్వెల్త్ గేమ్స్ ఛాంపియన్ అయిన నీరజ్ చోప్రా 79.61 మీటర్ల ఉత్తమ త్రోతో క్వాలిఫికేషన్ స్టాండింగ్స్‌లో ఐదవ స్థానంలో నిలిచి ఫైనల్ బెర్త్ ఖరారు చేసుకున్నారు.
భారత్ నుండి ముగ్గురు ఫైనల్‌కు
నీరజ్ చోత్రాతో పాటు ఇతర భారతీయ జావెలిన్ త్రో అథ్లెట్లు కూడా అంచనాలను అందుకుంటూ ఫైనల్లోకి ప్రవేశించారు. రోహిత్ యాదవ్ 78.37 మీటర్ల త్రోతో తొమ్మిదవ స్థానంలో ఉండగా.. యశ్ వీర్ సింగ్ 78.36 మీటర్ల త్రోతో పదవ స్థానంలో నిలిచాడు.
ఫైనల్ చేరిన ఆటగాళ్ల వివరాలు..
1) రుమేష్ పతిరాగే (శ్రీలంక) - 82.84 మీటర్లు
2) ఆండర్సన్ పీటర్స్ (గ్రేనాడా) - 81.29 మీటర్లు
3) డౌ స్మిత్ (దక్షిణాఫ్రికా) - 80.64 మీటర్లు
4) బెన్ ఈస్ట్ (ఇంగ్లాండ్) - 80.38 మీటర్లు
5) నీరజ్ చోప్రా (భారత్) - 79.61 మీటర్లు
6) కామెరాన్ మెక్‌ఎంటైర్ (ఆస్ట్రేలియా) - 78.91 మీటర్లు
7) అర్షద్ నదీమ్ (పాకిస్థాన్) - 78.63 మీటర్లు
8) కీషాన్ స్ట్రాచన్ (బహ్మాస్) - 78.60 మీటర్లు
9) రోహిత్ యాదవ్ (భారత్) - 78.37 మీటర్లు
10) యశ్ వీర్ సింగ్ (భారత్) - 78.36 మీటర్లు
11) కేశోర్న్ వాల్కాట్ (ట్రినిడాడ్ & టొబాగో) - 78.26 మీటర్లు
12) చినెచెరెమ్ నమ్ది (నైజీరియా) - 75.27 మీటర్లు.
ఫైనల్ మ్యాచ్ వివరాలు
జావెలిన్ త్రో ఫైనల్ పోరు భారత కాలమానం ప్రకారం శనివారం (ఆగస్టు 1) అర్ధరాత్రి 12:45 గంటలకు (IST) ప్రారంభం కానుంది. పతకం కోసం జరిగే ఈ తుది పోరులో భారత్ నుండి ముగ్గురు అథ్లెట్లు బరిలోకి దిగుతున్నారు.
Also Read: మీరాబాయి చానుకు బంగారు పతకం..కామన్ వెల్త్ గేమ్స్‌లో భారత జెండా రెపరెపలు
Also Read: రహానే కెప్టెన్సీలో భారత్ ఒక్క మ్యాచ్ ఓడిపోలేదు..కానీ, చివరికి అతడ్ని పక్కన పెట్టారు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
