కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ చేసిన చర్లపల్లి ప్రవాసంలో మెరుగుదెబ్బకు
Karimnagar, Telangana:కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పర్యటనలో ఉన్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్, చొప్పదండి నియోజకవర్గంలోని చర్లపల్లిలో సీసీ రోడ్డు ప్రారంభించిన అనంతరం, వానలో పొలం పనుల్లో ఉన్న రైతు కూలీల వద్దకు వెళ్లారు. అక్కడ ఉన్న మైనర్ బాలిక బోళ్ల అక్షయ్యను చూసి, ఆమె చదువు గురించి ప్రశ్నించారు. అక్షయ్య టెన్త్ పాసైనప్పటికీ ఆర్ధిక పరిస్థితి కారణంగా కూలీ పనులు చేస్తోంది. బండి సంజయ్, ఆమెను కాలేజీలో చేర్చడానికి సహాయం చేస్తానని చెప్పగా, అక్షయ్య ధన్యవాదాలు చెప్పారు.
हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
సెప్టెంబర్ 7 నుంచి భద్రా రాజయోగం.. ఈ 4 రాశుల వారికి ఊహించని గోల్డెన్ జాక్‌పాట్..
Hyderabad, Telangana:Bhadra Raj Yoga Effect On Zodiac: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బుధ గ్రహాన్ని తెలివితేటలు వాక్చాతుర్యం వ్యాపారం ధనానికి అధిపతిగా సూచిస్తూ ఉంటారు. అయితే, బుధుడు తన ఉచ్ఛరాశి అయిన కన్యా రాశిలోకి ప్రవేశించినప్పుడు పంచ మహాపురుష రాజయోగాల్లో తప్పకుండా ఒకటి ఏర్పడుతూ ఉంటుంది. ఇదిలా ఉంటే ఈ సమయంలో ఎంతో శక్తివంతమైన భద్రా రాజయోగం ఏర్పడబోతోంది. దీని ప్రభావం అన్ని రాశుల వారిపై పడుతుంది. సెప్టెంబర్ 7వ తేదీన కన్యా రాశిలోకి బుధుడు సంచారం చేయడం కారణంగా ఈ రాజయోగం ఏర్పడుతుంది. అయితే, దీనికి చాలా ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుందని జ్యోతిష్య శాస్త్రం నిపుణులు చెబుతున్నారు. ఈ యోగ ప్రభావంతో ఈ క్రింది రాశుల వారి జీవితాల్లో కీలకమైన మార్పులు వస్తాయి. ఈ సమయంలో ఏ రాశుల వారి జీవితాల్లో ఎలాంటి మార్పులు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం..
ఈ రాశులవారికి ఊహించని జాక్‌ఫాట్!
వృషభరాశి
సెప్టెంబర్ 7వ తేదీన బుధుడు ఏర్పరచబోతున్న ఎంతో శక్తివంతమైన భద్రా రాజయోగం ప్రభావంతో ఈ సమయంలో వృషభ రాశి వారికి అద్భుతమైన ప్రయోజనాలు కలగబోతున్నాయి. ముఖ్యంగా ధన సంబంధిత కోరికలు సులభంగా నెరవేరబోతున్నాయి.. వ్యాపారాల్లో అద్భుతమైన వృద్ధ లభించబోతోంది. ప్రధానమైన సమస్యను పూర్తిగా పరిష్కారమై అన్ని రంగాల్లో విజయాలు సాధించబోతున్నారు. అంతేకాకుండా ఆస్తులకు సంబంధించిన వివిధ అంశాల్లో అనేక మార్పులు వస్తాయి. వ్యాపారాల్లో వృద్ధులబించి అనుకున్న మొత్తంలో ధన లాభాలు కూడా సొంతం చేసుకుంటారు..
మిథున రాశి
ఎంతో శక్తివంతమైన రాజయోగం ప్రభావంతో మిథున రాశి వారికి ఈ సమయంలో అదృష్టం విపరీతంగా పెరుగుతుంది. గొప్ప విజయాలు సాధించడమే కాకుండా ఉద్యోగాల్లో పురోగతి లభిస్తుంది. అంతేకాకుండా ప్రమోషన్స్ లభించి.. మీపై అధికారుల నుంచి అద్భుతమైన ప్రశంశాలు పొందుతారు. అంతేకాకుండా కొత్త కారును కొనుగోలు చేయాలనుకుంటున్న వ్యక్తులకు ఈ సమయం ఎంతో అద్భుతంగా ఉంటుంది. అలాగే డబ్బు సమస్యలు కూడా సులభంగా పరిష్కారం అవుతాయి. ముఖ్యంగా ఎలాంటి సమస్యలు ఎదురైనా ఆందోళన చెందాల్సిన అవసరం లేకుండా ముందుకు నడవాల్సి ఉంటుంది.
కన్య రాశి
కన్యా రాశి వారికి ఈ సమయం సువర్ణ అవకాశాలను అందిస్తుంది. ముఖ్యంగా భారీ ధన లాభాలు కలగడమే కాకుండా డబ్బుకు ఎలాంటి కొరత ఉండదని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఉద్యోగాలతో పాటు వ్యాపారాలపరంగా విశేషమైన ప్రయోజనాలు చేకూరుతాయి. అలాగే కుటుంబంలో మంచి మంచి ప్రయోజనాలు పొందగలుగుతారు.. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య దూరం పూర్తిగా తొలగిపోయి అనుకున్న లాభాలు సొంతం చేసుకోగలుగుతారు. కోరుకున్న కోరికలు సులభంగా నెరవేరబోతున్నాయి.
మకర రాశి
మకర రాశిలో జన్మించిన వ్యక్తులకు ఈ శక్తివంతమైన రాజయోగ ప్రభావంతో విశేషమైన ప్రయోజనాలు కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. వీరికి అకస్మాత్తుగా డబ్బులు లభించి విశేషమైన ధన లాభాలు సొంతం చేసుకుంటారు. అలాగే డబ్బుకూరత కూడా తీరిపోయి.. పొదుపు విపరీతంగా పెరుగుతుంది. ఉద్యోగంలో కూడా మంచి అభివృద్ధి లభిస్తుంది. వ్యాపారంలో పడ్డ కష్టాలు కూడా సులభంగా తీరిపోయి.. మంచి లాభాలు పొందగలుగుతారు. అలాగే ఎప్పటినుంచో అనుకుంటున్న వస్తువులు కూడా సులభంగా కొనుగోలు చేస్తారు.
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
గమనిక.. 
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook ..
CM Chandrababu PRC DA: ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు..పీఆర్సీ, డీఏల చెల్లింపుపై నేడే సీఎం కీలక ప్రకటన!
Vijayawada, Andhra Pradesh:AP Employees PRC DA News: ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారం దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. తమకు అందాల్సిన ఆర్థిక బకాయిల చెల్లింపుల కోసం ఉద్యోగ సంఘాలు పోరుబాట పట్టడం, కొన్ని సంఘాలు దశల వారీగా ఆందోళన కార్యక్రమాలకు దిగడంతో ప్రభుత్వం చర్చలకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో ఉద్యోగుల పెండింగ్ బకాయిలు, పీఆర్సీ సమస్యలను శాశ్వతంగా పరిష్కరించడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేరుగా రంగంలోకి దిగారు. ఉద్యోగ సంఘాల నేతలతో స్వయంగా చర్చలు జరిపి తగిన పరిష్కారాలు కనుగొనాలని నిర్ణయించారు.
జాయింట్ స్టాఫ్ కౌన్సిల్‌లోని 11 ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ రోజు అనగా నేడు సెప్టెంబరు 5 (శనివారం) అత్యున్నత స్థాయి భేటీ కానున్నారు. ఈ చర్చల సందర్భంగా ఉద్యోగ సంఘాలు ప్రస్తావిస్తున్న అంశాలపై సమగ్రంగా చర్చించడంతో పాటు, రాష్ట్రంలో ఉన్న ప్రస్తుత ఆర్థిక సమస్యలను వారికి వివరించనున్నారు.
ఈ సమావేశంలో ఉద్యోగులు గత కొంతకాలంగా ఆసక్తిగా ఎదురుచూస్తున్న 12వ వేతన సవరణ సంఘానికి (పీఆర్సీ) కొత్త కమిషనర్‌ను నియమించే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. గత ప్రభుత్వ హయాంలో మన్మోహన్ సింగ్ పీఆర్సీ కమిషనర్‌గా నియమితులవగా, కూటమి ప్రభుత్వం ఇప్పుడు ఆయన స్థానంలో సరికొత్త అధికారిని నియమించేందుకు సిద్ధమవుతోంది.
దీనితో పాటు చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న రెండు డీఏల (DA) చెల్లింపులకు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగుల హెల్త్‌కార్డుల సమస్యకు కూడా ఈ సమావేశంలో పరిష్కారం లభించనుంది. హెల్త్ కార్డుల అంశంపై ఇప్పటికే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (CS) అధ్యక్షతన ఏర్పాటైన కమిటీ పలుమార్లు సమావేశమై కీలక ప్రతిపాదనలు సిద్ధం చేసింది.
ఇటీవల ఉద్యోగ సంఘాల నేతలు ముఖ్యమంత్రిని కలసి తమ సమస్యలను పరిష్కరించాలని విన్నవించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందన్నారు. అయితే ప్రభుత్వం చర్చలు జరుపుతున్న తరుణంలో ఉద్యోగ సంఘాలు ఆందోళనలకు ఎందుకు అంత తొందరపడుతున్నాయని ఆయన ప్రశ్నించినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ, ఉద్యోగులకు న్యాయంగా చేయాల్సిన ప్రయోజనాలను ప్రభుత్వం ఒక్కొక్కటిగా నెరవేరుస్తుందని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.
మొత్తంమీద, పీఆర్సీ నూతన కమిషనర్ నియామకం, రెండు పెండింగ్ డీఏల బకాయిల చెల్లింపులతో పాటు హెల్త్ కార్డుల వంటి కీలకమైన సమస్యలకు పరిష్కారం లభిస్తుందని ఉద్యోగ సంఘాల నేతలు ఎంతో ఆశతో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు ముఖ్యమంత్రి తీసుకోబోయే నిర్ణయాలపై ఉద్యోగుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
Also Read: ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. పీఆర్సీ కోసం రంగంలోకి దిగిన సీఎం చంద్రబాబు!
Also REad: 40 ఏళ్లకే ఉద్యోగం మానేస్తున్నారా? మీ ఈపీఎఫ్ నిధులపై వడ్డీ వస్తుందా? పూర్తి వివరాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Konda Surekha Jagadeesh Reddy: "కొండా సురేఖను బీఆర్ఎస్ పార్టీ గేటు కూడా తాకనివ్వం" జగదీష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు!
Hyderabad, Telangana:Konda Surekha Jagadeesh Reddy News: మాజీ మంత్రి కొండా సురేఖ త్వరలోనే కాంగ్రెస్ పార్టీని విడనున్నారనే ప్రచారం ఊపందుకుంది. మంత్రి పదవి నుంచి ఆమెకు అధికార కాంగ్రెస్ పార్టీ బర్త్‌రఫ్ చేయగా.. ఈ క్రమంలో ఆమె పార్టీ మారే ఛాన్స్ ఉందని, త్వరలోనే ఆమె బీఆర్ఎస్ పార్టీలో చేరనున్నారని జరుగుతున్న ప్రచారంపై మాజీ మంత్రి జగదీష్ రెడ్డి స్పందించారు. కొండా సురేఖను బీఆర్ఎస్ పార్టీ గేటు కూడా తాకనివ్వమని ఆయన స్పష్టం చేశారు.Anasuya Krishnashtami Dance: శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున అనసూయ మరో వివాదం..రాధా గెటప్‌పై నెటిజన్ల తీవ్ర ట్రోలింగ్!
Hyderabad, Telangana:Anasuya Krishnashtami Dance Video: శ్రీకృష్ణాజన్మాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకుని నటి అనసూయ సోషల్ మీడియాలో ఒక స్పెషల్ వీడియోను పంచుకున్నారు. ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యంత ప్రాచుర్యం పొంది వైరల్ అవుతున్న 'తులసి కోమలవేణి..' అనే కన్నడ భక్తి గీతానికి ఆమె రాధా దేవి గెటప్‌లో నృత్యం చేస్తూ కనిపించారు. ఈ వీడియో చివర్లో "కృష్ణుడికి అంతా తెలుసు. నాకు అది చాలు" అనే ఆసక్తికరమైన క్యాప్షన్‌ను కూడా జోడించారు.
అయితే ఈ వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షమైన కొద్ది సమయానికే నెట్టింట విపరీతంగా వైరల్ కావడమే కాకుండా, నెటిజన్ల నుండి తీవ్రమైన ట్రోలింగ్‌కు దారితీసింది. అనసూయ శైలిని తప్పుబడుతూ కొందరు నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపించారు. ఒక నెటిజన్ "ఆ పాట ఏంటి? ఆ డ్రెస్ ఏంటి? బుద్ధి ఉందా?" అని మండిపడగా, మరొకరు "ఈ వీడియోలో ఆధ్యాత్మిక భావం కంటే అందాల ప్రదర్శన ఎక్కువగా కనిపిస్తోంది, అలా అనడమే బాగుంటుందేమో" అంటూ విమర్శనాత్మక కామెంట్స్ చేశారు.
వాస్తవానికి.. సనాతన ధర్మం, హిందూ ధర్మం విషయంలో అనసూయ గత కొన్ని రోజులుగా పలు విమర్శలను ఎదుర్కొంటూనే ఉన్నారు. ధర్మం, మతం పేరుతో ఇతరులపై వ్యక్తిగత దాడులకు దిగడం, బెదిరింపులకు పాల్పడటం ఏమాత్రం సరైన విధానం కాదని ఆమె చేసిన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాలలో పెద్ద ఎత్తున చర్చలకు దారితీశాయి. తనను విమర్శించే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంటుందని, అయితే వ్యక్తిగత దూషణలు చేయడం, భౌతిక బెదిరింపులకు పాల్పడటం మాత్రం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని ఆమె గట్టిగా స్పష్టం చేశారు.
న్యూస్ రీడర్‌గా తన వృత్తిని ప్రారంభించిన అనసూయ, ఆ తర్వాత బుల్లితెరపై ప్రసారమైన 'జబర్దస్త్' కామెడీ షో ద్వారా విపరీతమైన క్రేజ్, ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. బుల్లితెరపై తన హవా కొనసాగిస్తూనే, నాగార్జున సరసన 'సోగ్గాడే చిన్ని నాయనా' చిత్రంలో స్టెప్పులేసి వెండితెర ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించారు.
ఆ తర్వాత రామ్ చరణ్ ప్రధాన పాత్రలో వచ్చిన 'రంగస్థలం' చిత్రంలో ఆమె పోషించిన 'రంగమ్మత్త' పాత్ర ఆమె సినిమా కెరీర్‌ను అద్భుతమైన మలుపు తిప్పింది. ఈ పాత్ర ద్వారా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న అనసూయ, ప్రస్తుతం వరుస సినిమా అవకాశాలు అందుకుంటూ వెండితెరపై ఫుల్ బిజీగా కొనసాగుతున్నారు.
Also Read: బిగ్‌బాస్ ఆఫర్ తిరస్కరించిన సెలబ్రిటీలు వీళ్లే.. లక్షల్లో రెమ్యునరేషన్ ఇచ్చినా 'నో'
Also REad: 100 రోజులకు రూ.80 లక్షలు..బిగ్‌బాస్ చరిత్రలో అత్యధికంగా సంపాదించింది ఎవరో తెలుసా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Konda Surekha BJP: కాంగ్రెస్‌కు మాజీ మంత్రి కొండా సురేఖ గుడ్‌బై? త్వరలోనే బీజేపీలో చేరిక?
Hyderabad, Telangana:Konda Surekha BJP News: మాజీ మంత్రి కొండా సురేఖ తన పేరుతో సోషల్ మీడియా వేదికల్లో జరుగుతున్న ఒక విస్తృత ప్రచారాన్ని తీవ్రంగా ఖండించారు. కొండా సురేఖ పేరుతో ఉన్న ఒక ఫేస్బుక్ ఖాతాలో 'త్వరలో బిగ్ అప్డేట్ ఉంటుంది' అంటూ వచ్చిన ఒక పోస్టు నెట్టింట వైరల్‌గా మారడంతో ఆమె స్పందించారు. ఆ పోస్టులకు, తమకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేస్తూ సోషల్ మీడియా వేదికగా ఒక ప్రకటన విడుదల చేశారు. అయితే ఈ క్రమంలో ఆమె బీజేపీలో చేరే అవకాశం ఉందని సోషల్ మీడియాలో తెగ చర్చ జరుగుతోంది.Tirumala: తిరుమల సేవలో సినీ నటుడు సాయికుమార్ కుటుంబం
Dharmavaram, Andhra Pradesh:Actor Sai Kumar And His Son Aadi Family Visits To Tirumala Temple Watch VideoCM Ramesh: శ్రీకాళహస్తీరుడిని దర్శించుకున్న బీజేపీ ఎంపీ రమేశ్
Srikalahasti, Mitta Kandriga, Andhra Pradesh:Anakapalle BJP MP CM Ramesh Visits Srikalahasti Temple Watch VideoActress Namita: శ్రీకాళహస్తీశ్వర స్వామి సేవలో బాలకృష్ణ హీరోయిన్ నమిత
Srikalahasti, Mitta Kandriga, Andhra Pradesh:Balakrishna Heroine Namita Visits Srikalahasti Temple Watch VideoDK Aruna: కొండా సురేఖను తొలగించడంపై బాధపడిన డీకే అరుణ
HYDERABAD, Telangana:MP DK Aruna First Reacts About Konda Surekha Ministry Drops Watch VideoTirumala: తిరుమల అభిషేక సేవలో ఎంపీ రమేశ్ కుటుంబసభ్యులు
Dharmavaram, Andhra Pradesh:Anakapalle MP CM Ramesh Visits Tirumala Temple Along With His Family Watch VideoJagadish Reddy: 'బీఆర్ఎస్ పార్టీలోకి కొండా సురేఖకు నో ఎంట్రీ.. గేటు కూడా తాకనివ్వం'
Baddipadaga, Telangana:Konda Surekha No Entry: తెలంగాణ మంత్రివర్గం నుంచి బర్తరఫ్కు గురయిన మాజీ మంత్రి కొండా సురేఖ బీఆర్ఎస్ పార్టీలో చేరే అవకాశం ఉందని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆ పార్టీ కీలక ప్రకటన చేసింది. కొండా సురేఖను తమ పార్టీలో చేర్చుకునే అవకాశం లేదని ప్రకటించింది. తమ వైపు నుంచి ఆ ప్రయత్నం చేయడం లేదని స్పష్టం చేసింది. తెలంగాణ భవన్ గేటు కూడా తాకనివ్వమని మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు.
హైదరాబాద్‌లోని బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యాలయం తెలంగాణ భవన్లో శుక్రవారం మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి మాట్లాడుతూ కొండా సురేఖ మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌పై స్పందించి కీలక వ్యాఖ్యలు చేశారు. 'మాజీ మంత్రి కొండా సురేఖను బీఆర్ఎస్ పార్టీలోకి తీసుకునే ఆలోచన మాకు లేదు.. మా వైపు నుంచి ఆ ప్రయత్నం కూడా లేదు' అని తెలిపారు. తెలంగాణ భవన్ గేటు తాకనివ్వమని ప్రకటించారు. అసలు మొదలు బర్తరఫ్ చేయాల్సింది కొండా సురేఖను కాదని.. రేవంత్ రెడ్డిని బర్తరఫ్ చేయాలని జగదీశ్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు.
'రేవంత్ రెడ్డి 1000 రోజుల పాలనలో సాధించింది ఒక మహిళా మంత్రిని బర్తరఫ్ చేయడం మాత్రమే. అది వారి అంతర్గత విషయం కానీ.. కొండా సురేఖ కూతురు లేవనెత్తిన అంశాల సంగతి ఏమిటి? కాంగ్రెస్ నాయకులు చేసిన ఎన్నో కుంభకోణాలపై మేము ఆధారాలతో సహా ఫిర్యాదులు చేసినా చర్యలు తీసుకోలేదు' అని మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి తెలిపారు. దోపిడీ సొమ్ము పంచుకోవడంలో కొట్టుకొని దొంగలు దొరికిపోయినట్టు.. ప్రజల ముందర కాంగ్రెస్ పార్టీ దొరికిపోయిందని వివరించారు.
'దొంగతనం చేసిండని చూపించినోడిని అరెస్ట్ చేసి.. దొంగను వదిలిపెట్టే సంస్కృతి ఇవాళ మనకు కనబడుతోంది. కాంగ్రెస ప్రభుత్వ అవినీతిని ఆధారాలతో సహా కొండా ఫ్యామిలీ బయటపెట్టిందనే.. ఆమెపై చర్యలకు పాల్పడ్డారు. కానీ.. కాంగ్రెస్ ప్రభుత్వం 100 శాతం అవినీతి, కుంభకోణాలకు పాల్పడుతోంది. మేము ఇప్పటికే అనేక ఆధారాలను కేంద్ర దర్యాప్తు సంస్థలకు పంపించాం' అని మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి వెల్లడించారు. వీటిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
'పార్టీ మారిన పది మంది ఎమ్మెల్యేల్లో ఒకరిద్దరిని తప్ప ఎవరిని తీసుకోం. ఎమ్మెల్యేల క్యారెక్టర్ ఆధారంగా వాళ్లు వస్తామంటే తీసుకుంటాం' అని మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి తెలిపారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఇద్దరు బీఆర్ఎస్ పార్టీలోకి రావడానికి రెడీగా ఉన్నారని సంచలన ప్రకటన చేశారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అప్లికేషన్ పెట్టినా తీసుకోమని స్పష్టం చేశారు. ఎన్నికల కంటే ముందు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇద్దరూ బీఆర్ఎస్ పార్టీలోకి వస్తామంటే తీసుకోలేదని మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి గుర్తుచేశారు.
'వచ్చే ఎన్నికల నాటికి పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజన జరగకపోయినా రెండు తెలుగు రాష్ట్రాల్లో డీ లిమిటేషన్ జరుగుతుంది. ఏపీలో చంద్రబాబుకు వ్యతిరేకత స్టార్ట్ అయింది. డీ లిమిటేషన్ జరిగితే ప్రజా వ్యతిరేకత నుంచి బయట పడవచ్చని చంద్రబాబు భావిస్తున్నారు. రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తే డబ్బులకు అమ్ముడు పోయినట్టే' అని బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు జగదీశ్ రెడ్డి తెలిపారు.
Konda Surekha YSRCP: జగన్ గూటికి కొండా సురేఖ? తెలంగాణ రాజకీయాల్లో వైసీపీ కింగ్ మేకర్‌గా మాజీ మంత్రి కానుందా?
Hyderabad, Telangana:Konda Surekha To Join YSRCP: తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ మంత్రివర్గం నుండి కొండా సురేఖపై వేటు వేయడం, ఆమెను క్యాబినెట్ నుండి బర్తరఫ్ చేయడం తీవ్ర ప్రకంపనలు రేపింది. ఈ ఆకస్మిక చర్య సురేఖకు తీవ్ర అసంతృప్తిని, మింగుడుపడని పరిణామాన్ని మిగిల్చింది. ఈ వివాదం తర్వాత ఆమె రాజకీయ అడుగులు ఏ దిశగా పడనున్నాయి అనే అంశంపై రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తికరమైన చర్చ మొదలైంది.
ప్రస్తుతానికి తాను కాంగ్రెస్ పార్టీని వీడబోనని, పార్టీలోనే కొనసాగుతూ ఒక సాధారణ శాసనసభ్యురాలిగా (ఎమ్మెల్యేగా) ప్రజలకు నిరంతరం సేవ చేస్తానని కొండా సురేఖ బహిరంగంగా ప్రకటించారు. అయినప్పటికీ, ఆమె భవిష్యత్ ప్రయోజనాల దృష్ట్యా ఇతర రాజకీయ ప్రత్యామ్నాయాలు, అవకాశాలను పరిశీలించే వీలుందని రాజకీయ నిపుణులు విశ్వసిస్తున్నారు. ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా ఆమె వైఎస్సార్సీపీ (YSRCP) తీర్థం పుచ్చుకుంటారని సరికొత్త ఊహాగానాలు పుట్టుకొచ్చాయి.
ఆ ప్రచారాల ప్రకారం.. వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి తెలంగాణలో తన పార్టీని తిరిగి బలోపేతం చేయడానికి, విస్తరించడానికి వ్యూహ రచన చేస్తున్నట్లు సమాచారం. ఈ దిశగా తెలంగాణలో పార్టీని ముందుండి నడిపించేందుకు ఒక బలమైన, సమర్థవంతమైన నాయకత్వం కోసం ఆయన అన్వేషిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే కొండా సురేఖ పార్టీలో చేరితే తెలంగాణలో వైసీపీ ఒక కొత్త 'కింగ్ మేకర్' పాత్రను పోషించే అవకాశం ఉందని కొందరు అంచనా వేస్తున్నారు. అయితే, గతంలో జగన్ వెనుక నడిచిన సమయంలో ఎదుర్కొన్న చేదు రాజకీయ అనుభవాల వల్ల, ఆమె తిరిగి వైసీపీ వైపు వెళ్లే అవకాశం లేదని విశ్లేషకులు భావిస్తున్నారు.
కానీ, క్షేత్రస్థాయిలో ఆలోచిస్తే ఈ సమీకరణాలు ప్రాక్టికల్ కాదని విశ్లేషకులు తేల్చి చెబుతున్నారు. 2014 కంటే ముందు జగన్ మోహన్ రెడ్డికి మద్దతుగా నడిచినందుకు కొండా సురేఖ మరియు ఆమె భర్త (కొండా దంపతులు) తీవ్రమైన రాజకీయ ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ఆ రోజుల్లో వారు చూపిన విధేయతకు తగిన గుర్తింపు లభించకపోగా, వారి రాజకీయ భవిష్యత్తు కూడా దాదాపు ప్రశ్నార్థకంగా మారింది. నాటి ఆ చేదు అనుభవాలను దృష్టిలో ఉంచుకుంటే, ఈ క్లిష్ట దశలో కొండా సురేఖ మళ్లీ వైసీపీ గూటికి చేరతారనేది కేవలం ఒక వదంతు లేదా రాజకీయ ఊహాగానం మాత్రమే కాగలదని విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు.
Also Read: "ఆ ప్రచారం నమ్మొద్దు" సోషల్ మీడియా 'బిగ్ అప్డేట్' పోస్టులపై మాజీ మంత్రి కొండా సురేఖ
Also REad: Konda Surekha Press Meet: కాంగ్రెస్‌కు కొండా సురేఖ రాజీనామా? భర్త్‌రఫ్ వార్తల నడుమ కీలక నిర్ణయం!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Bigg Boss Offer Rejects: బిగ్‌బాస్ ఆఫర్ తిరస్కరించిన సెలబ్రిటీలు వీళ్లే.. లక్షల్లో రెమ్యునరేషన్ ఇచ్చినా 'నో' చెప్పారట!
Hyderabad, Telangana:Bigg Boss Offer Rejected Celebrities: తెలుగు బుల్లితెర వీక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న రియాలిటీ షో 'బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10' సెప్టెంబర్ 6వ తేదీన అంగరంగ వైభవంగా ప్రారంభం కాబోతోంది. ఈ గ్రాండ్ సీజన్‌కు టాలీవుడ్ కింగ్ నాగార్జున మరోసారి హోస్ట్‌గా వ్యవహరించి సందడి చేయనున్నారు. ఈసారి నిర్వాహకులు "ఆటలో సవాల్ కాదు.. ఆటే సవాల్" అనే సరికొత్త కాన్సెప్ట్‌తో హౌస్‌ను రూపొందించారు. అలాగే సామాన్యులను హౌస్ లోకి తీసుకెళ్లే 'అగ్ని పరీక్ష 2' విజయవంతంగా ముగిసింది. ఇందులో విజేతలుగా నిలిచిన ఆరుగురు సామాన్యులు కూడా సెలబ్రిటీలతో పాటు ఈసారి హౌస్‌లోకి అడుగుపెట్టబోతున్నారు.
అయితే, ప్రతి ఏటా బిగ్‌బాస్ హౌస్ లోకి వెళ్లే సెలబ్రిటీల గురించి పెద్ద ఎత్తున చర్చలు సాగుతుంటాయి. ఈ క్రమంలోనే నిర్వాహకులు కొందరు పాపులర్ సెలబ్రిటీలను భారీ రెమ్యునరేషన్లతో సంప్రదించినప్పటికీ, వారు ఈ ఆఫర్‌ను తిరస్కరించినట్లు వార్తలు వస్తున్నాయి. మరి ఆ విధంగా బిగ్‌బాస్ ఆఫర్‌ను తిరస్కరించిన నటీనటులు ఎవరో ఇక్కడ తెలుసుకుందాం.
1) విష్ణు (బాలు)
ఓ ఛానల్లో ప్రసారమవుతున్న 'గుండెనిండా గుడిగంటలు' సీరియల్ లో 'బాలు' క్యారెక్టర్‌తో విపరీతమైన ప్రేక్షకాదరణ సంపాదించుకున్న హీరో విష్ణు. ఇతనికి బిగ్‌బాస్ మేకర్స్ లక్షల్లో భారీ రెమ్యునరేషన్ ఆఫర్ చేసినప్పటికీ, అతను ఈ ఆఫర్‌ను తిరస్కరించి సీరియల్‌కే పరిమితం కావాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
2) తేజస్విని గౌడ
ప్రముఖ సీరియల్ నటి, బిగ్‌బాస్ తెలుగు మాజీ రన్నరప్ అమర్దీప్ చౌదరి భార్య అయిన తేజస్విని గౌడను గత రెండు మూడు సీజన్ల నుండి బిగ్‌బాస్ మేకర్స్ సంప్రదిస్తూనే ఉన్నారు. ఆమెకు ఈ షోలో పాల్గొనాలనే బలమైన ఆసక్తి ఉన్నప్పటికీ, ఆమెకున్న ఇతర సీరియల్స్ కమిట్మెంట్స్, కాల్ షీట్స్ అడ్డంకిగా మారడంతో ఈసారి కూడా ఆమె హౌస్‌లోకి అడుగుపెట్టలేకపోయారు.
3) దెబ్జానీ మోదక్ (దేబ్ జాన్)
'ఎన్నెన్నో జన్మల బంధం', 'సత్యభామ' వంటి సూపర్ హిట్ సీరియల్స్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు బాగా చేరువైన నటి దెబ్జానీ మోదక్. ఈసారి ఆమె బిగ్‌బాస్ హౌస్‌లోకి వెళ్లడానికి దాదాపు సిద్ధమైనప్పటికీ, ప్రస్తుతం ఆమె నటిస్తున్న ఒక ఇతర భాషా సీరియల్ అద్భుతమైన రేటింగ్‌తో నడుస్తుండటంతో, ఆ కమిట్మెంట్స్ వల్ల చివరి నిమిషంలో బిగ్‌బాస్ ఆఫర్‌కు 'నో' చెప్పాల్సి వచ్చింది.
4) కావ్యశ్రీ
సీరియల్ హీరోయిన్గా మంచి గుర్తింపు, క్రేజ్ సంపాదించుకున్న నటి కావ్యశ్రీ. ఈమెను కూడా గత రెండు సీజన్ల నుండి బిగ్‌బాస్ నిర్వాహకులు సంప్రదిస్తూనే ఉన్నారు. అయితే కావ్యశ్రీకి వ్యక్తిగతంగా ఈ రియాలిటీ షోపై పెద్దగా ఆసక్తి లేకపోవడంతో, ఆమె ఈ సీజన్ ఆఫర్‌ను కూడా చాలా సున్నితంగా తిరస్కరించినట్లు సమాచారం.
Also Read: 100 రోజులకు రూ.80 లక్షలు..బిగ్‌బాస్ చరిత్రలో అత్యధికంగా సంపాదించింది ఎవరో తెలుసా?
Also Read: బాక్సాఫీస్ వద్ద 'ఇరుముడి' ప్రభంజనం.. మెగాస్టార్ చిరు రికార్డు బ్రేక్ చేసిన రవితేజ!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
EPF Interest Rate: 40 ఏళ్లకే ఉద్యోగం మానేస్తున్నారా? మీ ఈపీఎఫ్ నిధులపై వడ్డీ వస్తుందా? పూర్తి వివరాలు ఇవే!
Hyderabad, Telangana:EPF Interest Rate News: కుటుంబ అవసరాల కోసమో, లేదా ఇతర వ్యక్తిగత కారణాల వల్లో చాలామంది ఉద్యోగ జీవితానికి త్వరగానే స్వస్తి పలుకుతుంటారు. ఒకవేళ 40 ఏళ్ల వయసులోనే ఉద్యోగం మానేస్తే, అప్పటి వరకు జమ అయిన ప్రావిడెంట్ ఫండ్ (EPF) నిధులకు వడ్డీ వస్తుందా? రాదా? అనే సందేహం ఎంతో మందిలో మెదులుతుంటుంది. ఉద్యోగం లేనందున వడ్డీ నిలిచిపోతుందని భావించి, చాలామంది వెంటనే నిధులు విత్ డ్రా చేసుకుంటుంటారు. అయితే ఈ ఆందోళనలపై ఈపీఎఫ్ఓ తాజాగా తన అధికారిక సామాజిక మాధ్యమ వేదిక 'ఎక్స్' (ట్విట్టర్) ద్వారా వివరణ ఇచ్చింది.
58 ఏళ్లు వచ్చే వరకు వడ్డీ గ్యారెంటీ!
ఉద్యోగం మానేసినప్పటికీ ఖాతాదారునికి 58 ఏళ్ల వయసు నిండేంత వరకు ఈపీఎఫ్ నిధులపై వడ్డీ వస్తూనే ఉంటుందని ఈపీఎఫ్ఓ స్పష్టం చేసింది. ఖాతా 'ఇన్ఆపరేటివ్' (Inoperative) కానంత వరకు ఈ వడ్డీ ప్రయోజనం నిరంతరాయంగా లభిస్తుంది.
ఖాతా ఎప్పుడు 'ఇన్ఆపరేటివ్'గా మారుతుంది?
ఈపీఎఫ్ఓ నిబంధనల ప్రకారం.. ఒక ఉద్యోగి 55 సంవత్సరాల వయసులో లేదా ఆ తర్వాత పదవీ విరమణ పొందితే, ఆ తేదీ నుంచి వరుసగా 36 నెలల (3 ఏళ్ల) పాటు ఎలాంటి చందా (కాంట్రిబ్యూషన్) రాకపోతే ఆ ఖాతా ఇన్ఆపరేటివ్గా మారుతుంది. ఖాతా ఇన్ఆపరేటివ్గా మారిన తర్వాతే వడ్డీ రావడం ఆగిపోతుంది.
కానీ, ఒకవేళ 55 ఏళ్ల వయసు కంటే ముందే (అంటే 40, 45 లేదా 50 ఏళ్లకు) ఉద్యోగం మానేసిన సందర్భాల్లో, ఆ ఖాతా 58 ఏళ్లు నిండే వరకు ఎలాంటి కాంట్రిబ్యూషన్లు లేకపోయినా ఇన్ఆపరేటివ్ కాదు. కాబట్టి 58 ఏళ్ల వయస్సు వచ్చే వరకు వడ్డీ కొనసాగుతూనే ఉంటుంది. అలాగే చందాదారుడు విదేశాలకు శాశ్వతంగా వలస వెళ్లినప్పుడు లేదా మరణించిన సందర్భాల్లో మాత్రమే ఖాతా ఇన్ఆపరేటివ్గా మారుతుంది.
ఈపీఎఫ్ వడ్డీ ప్రయోజనాలు ఎందుకు ముఖ్యం?
రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఉండేందుకు ఈపీఎఫ్ అద్భుతమైన మార్గం. ప్రస్తుతం ఈపీఎఫ్‌పై 8.25 శాతం వడ్డీ లభిస్తోంది. ఏటా లభించే వడ్డీ అసలు మొత్తానికి జమ కావడం వల్ల చక్రవడ్డీ రూపంలో భారీ రాబడి లభిస్తుంది. అంతేకాదు, ఈ నిధులపై వచ్చే వడ్డీకి ఆదాయ పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. పన్ను మినహాయింపులతో కలిపి చూస్తే సుమారు 9.5% నుండి 10% వరకు రాబడి లభిస్తుంది.
చాలా మంది ఉద్యోగులు ఈపీఎఫ్ విత్ డ్రాల్ విధానాలపై సరైన అవగాహన లేక తొందరపడి డబ్బులు డ్రా చేసుకుంటుంటారు. దీని వల్ల వడ్డీ నష్టపోవడమే కాకుండా, చేతిలో ఉన్న సొమ్ము అనవసరంగా ఖర్చయ్యే ప్రమాదం ఉంటుంది. అందుకే, అత్యవసరమైన ఆర్థిక ఇబ్బందులు లేనట్లయితే ఈపీఎఫ్ నిధులను విత్ డ్రా చేయకుండా ఉంచడం ద్వారా భవిష్యత్తు వృద్ధాప్య అవసరాల కోసం పెద్ద మొత్తాన్ని సులభంగా కూడబెట్టవచ్చు. కాబట్టి చందాదారులు ఈ నిబంధనలను గుర్తుంచుకుని సరైన నిర్ణయం తీసుకోవడం ఎంతో ప్రయోజనకరం.
(గమనిక: ఇక్కడ ఇచ్చిన సమాచారం కేవలం సదరు అధికారిక వెబ్సైట్లో పొందుపరిచిన విశేషాలను మాత్రమే పంచుకున్నాం. దీన్ని పాటించే ముందు పూర్తి వివరాలను తెలుసుకునేందుకు అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి పూర్తి వివరాలను తెలుసుకోగలరు.)
Also Read: విద్యార్థులు ఎగిరి గంతేసే వార్త..వచ్చే వారం వరుసగా 3 రోజులు సెలవులు..ఎందుకంటే?
Also Read: "భారత్, చైనా, అమెరికా వల్లనే వరదలు వచ్చాయి": నేపాల్ ప్రధానమంత్రి బాలేంద్ర షా!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
IND Vs PAK Women: రేపే భారత్ Vs పాకిస్థాన్ మధ్య పోరు..ఆసియా కప్ 2026లో దుబాయ్ వేదికగా హై-వోల్టేజ్ మ్యాచ్
Hyderabad, Telangana:IND Vs PAK Women Asia Cup 2026: ఆసియా కప్ 2026 టోర్నమెంట్లో క్రికెట్ ప్రేమికులకు అసలైన వినోదాన్ని పంచే మ్యాచ్‌కు సమయం ఆసన్నమైంది. హర్మన్‌ప్రీత్ కౌర్ నేతృత్వంలోని టీమిండియా, సెప్టెంబర్ 5వ తేదీ శనివారం నాడు దుబాయ్ వేదికగా చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో తలపడనుంది. గ్రూప్ 'ఎ'లో ఉన్న భారత మహిళల క్రికెట్ జట్టు ఇప్పటికే వరుస విజయాలతో దూసుకుపోతూ సెమీఫైనల్లో తన స్థానాన్ని ఖాయం చేసుకుంది. మొదటి మ్యాచ్‌లో థాయిలాండ్‌ను 94 పరుగుల తేడాతో, రెండో మ్యాచ్‌లో హాంకాంగ్‌ను 137 పరుగుల భారీ తేడాతో చిత్తు చేసి భారత్ అప్రతిహత విజయాల జోరును కనబరిచింది.
హాంకాంగ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత ఓపెనర్ స్మృతి మంధాన విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగింది. కేవలం 64 బంతుల్లోనే 7 సిక్సర్లు, 14 ఫోర్లతో 124 పరుగులు చేసి చారిత్రాత్మక సెంచరీని నమోదు చేసింది. మంధాన సెంచరీతో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 193 పరుగుల భారీ స్కోరు సాధించింది.
అనంతరం 194 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన హాంకాంగ్ జట్టును భారత బౌలర్లు వణికించారు. కేవలం 56 పరుగులకే హాంకాంగ్‌ను ఆలౌట్ చేసి అద్భుత విజయాన్ని అందుకున్నారు. భారత బౌలర్లలో దీప్తి శర్మ 3 వికెట్లతో రాణించగా, ప్రేమా రావత్, నందిని శర్మ, శ్రీ చరణి చెరో రెండు వికెట్లు పడగొట్టి జట్టు విజయానికి తోడ్పడ్డారు.
సెమీఫైనల్స్ ప్రారంభం కావడానికి ముందే గ్రూప్ స్టేజ్‌లో భారత్ తన చివరి లీగ్ మ్యాచ్‌ను సాంప్రదాయ ప్రత్యర్థి అయిన పాకిస్తాన్‌తో ఆడనుంది. దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా సాగే ఈ రసవత్తర పోరు శనివారం రాత్రి భారత కాలమానం ప్రకారం 8:00 గంటలకు (టాస్ రాత్రి 7:30 గంటలకు) ప్రారంభం కానుంది.
ఈ మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారాన్ని టీవీలో సోనీ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో, మొబైల్ లేదా వెబ్సైట్లో సోనీ లివ్ యాప్ ద్వారా వీక్షించవచ్చు. హర్మన్‌ప్రీత్ కౌర్, స్మృతి మంధాన, దీప్తి శర్మలతో కూడిన భారత జట్టు ఎంతో పటిష్టంగా కనిపిస్తుండగా.. ఫాతిమా సనా నేతృత్వంలోని పాకిస్తాన్ జట్టు కూడా గట్టి పోటీ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది.
ఇరు జట్ల ప్లేయర్స్ వివరాలు..
భారత మహిళల జట్టు: హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన, దీప్తి శర్మ, రాధా యాదవ్, అరుంధతి రెడ్డి, భారతి ఫుల్మాలి, రేణుకా సింగ్, షెఫాలీ వర్మ, రిచా ఘోష్, కమాలిని, నందిని శర్మ, ప్రతీక్ రావుల్, క్రాంతి గౌడ్, శ్రీ చరణి, ప్రేమా రావత్.
పాకిస్తాన్ మహిళల జట్టు: ఫాతిమా సనా (కెప్టెన్), ఆయేషా జాఫర్, నష్రా సంధు, గుల్ ఫిరోజా, మునీబా అలీ, వహీదా అక్తర్, తుబా హసన్, సాదియా ఇక్బాల్, ఉమ్మే హనీ, సదాఫ్ షామ్స్, మోమినా రియాసత్, ఐమన్ ఫాతిమా, సాయిరా జబీన్, షైవాల్ జుల్ఫికర్, ఈమాన్ నసీర్.
Also Read: గౌతమ్ గంభీర్‌కు బీసీసీఐ చెక్..ఆసియా గేమ్స్‌లో హెడ్ కోచ్‌గా వీవీఎస్ లక్ష్మణ్!
Also Read: 2027 ప్రపంచకప్‌కు ముందే రోహిత్ శర్మ రిటైర్మెంట్? హిట్‌మ్యాన్ అంగీకారం..నేడు కీలకభేటీ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
