కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం శాంతి నగర్‌లోని సేవాలాల్ మహారాజ్ కాంప్లెక్స్‌లో లావణ్య టిఫిన్ అండ్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్‌ను మాజీ మంత్రి గంగుల కమలాకర్ ప్రారంభించారు. నాణ్యమైన ఆహారం అందించాలని హోటల్ నిర్వాహకులకు సూచించారు. యువత ప్రభుత్వ ఉద్యోగాలపై ఆధారపడకుండా స్వశక్తితో ముందుకు సాగుతున్నారని ప్రశంసించారు. కార్యక్రమంలో భూక్య తిరుపతి నాయక్, శ్రావణ్ నాయక్, విటల్ మహారాజు, భాస్కర్ మహారాజ్, నజీమా బేగం, సుధాకర్, సంబోజి సుజాత, గ్రామస్తులు పాల్గొన్నారు