మాభూమికి రక్షణ కల్పించాలని న్యాయం చేయాలని బాధితుడి ఆవేదన
Karimnagar, Telangana:ఆయన తండ్రి కొమరయ్య నుండి వారసత్వంగా పొందిన 36 గుంటల భూమి (సర్వే నంబర్ 143/c 296డి, 297/బి, 301/డి, 302/సి) పై కొంత కాలంగా కబ్జా చేయాలని యత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. వీరు గత 25 సంవత్సరాలుగా విదేశాలలో ఉన్నారు. 1/2 గుంటలు సర్వే నంబర్ 278/ఏలో కొనుగోలు చేసిన భూమి కూడా రెవెన్యూ రికార్డులకు నమోదు చేయకుండా వేరే వారిపై చేయబడిందని పేర్కొన్నారు. వీరు 50 సంవత్సరాలుగా ఈ భూమిలో వ్యవసాయం చేస్తూ జీవిస్తున్నారని, రెవెన్యూ అధికారులు న్యాయం చేయకపోవడంతో గ్రామస్తులు ఆరోపిస్తున్నారని వెల్లడించారు.
हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
Etela Rajender: తెలంగాణ ఫస్ట్.. బీజేపీ నెక్ట్స్.. ప్రాజెక్టుల వివాదంపై ఎంపీ ఈటెల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు..
Hyderabad, Telangana:MP Etela Rajender fires on Congress govt: తెలంగాణ రాజకీయాలు ప్రస్తుతం సాగునీటి ప్రాజెక్టుల చుట్టు తిరుగుతున్నాయి. దీనిపై ఇప్పటికే బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ ల మధ్య సవాళ్ల పర్వం కొనసాగుతుంది. తనకు మూడు నెలలు తిరిగి ఇరిగేషన్ శాఖ ఇవ్వాలని హరీష్ రావు సవాల్ విసిరారు. మరోవైపు దీనికి కాంగ్రెస్ కూడా కౌంటర్ ఇచ్చింది. ఇక తాజాగా.. మల్కాజ్ గిరి బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ సాగు నీటి ప్రాజెక్ట్ ల వివాదపై కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతుల్ని పట్టించుకొవడంలేదని ఎద్దేవా చేశారు. తనకు తెలంగాణ ప్రయోజనాలు ముఖ్యమని.. తెలంగాణ ఫస్ట్, బీజేపీ నెక్ట్స్,వ్యక్తిగతం లాస్ట్ అని క్లారిటీ ఇచ్చారు. తాను తెలంగాణ మట్టిబిడ్డనని స్పష్టం చేశారు. సాగునీటి నిర్వహణ, కాళేశ్వరం ప్రాజెక్టు, రైతుల సమస్యలపై సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్రమైన ఆరోపణలు గుప్పించారు.
ఎగువ రాష్ట్రాల్లో భారీ వర్షాలతో తెలంగాణ ప్రాజెక్టుల్లోకి నీరు వస్తున్న కూడా.. కాంగ్రెస్ ప్రభుత్వం మోటర్లు ఆన్ చేయక పొవడం దారుణమన్నారు. వర్షాకాలంలోనూ సాగునీరు అందక రైతులు కష్టాలు పడుతున్నారన్నారు. ముఖ్యంగా ఎస్ఆర్ఎస్పీ కాల్వల కింద బోర్లు, బావులు లేకుండా వ్యవసాయం చేయడం సాధ్యం కాదని స్పష్టం చేశారు. తెలంగాణ ఉద్యమం నీళ్లు, నిధులు, ఆత్మగౌరవం కోసమే జరిగిందని గుర్తుంచుకొవాలన్నారు. పార్టీలు ఏవైన మూల సిద్దాంతాలు మాత్రం మర్చిపోకూడదన్నారు.
కాళేశ్వరం కంటే ముందే వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో జలయజ్ఞం ద్వారా ప్రాణహిత జలాలను తీసుకురావాలనే ప్రణాళిక రూపొందిందని పేర్కొన్నారు. శ్రీపాద ఎల్లంపల్లి, మిడ్ మానేరు వంటి ప్రాజెక్టులకు అప్పుడే శ్రీకారం చుట్టారని గుర్తు చేశారు.ఆ తర్వాత మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ద్వారా కాళేశ్వరం ప్రాజెక్టును అభివృద్ధి చేసి ఎల్లంపల్లికి నీటిని తరలించే వ్యవస్థను డెవలప్ చేశారన్నారు.
మిడ్ మానేరులో 29 టీఎంసీల నీరు ఉందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో కమీషన్లు, డిజైన్ మార్పులపై తాను మాట్లాడడం లేదని, కానీ మొత్తం ప్రాజెక్టునే తప్పుపట్టడం సరికాదని కాంగ్రెస్ నేతలపై మండిపడ్డారు. ప్రాజెక్టు పరిధిలోని దెబ్బతిన్న నిర్మాణాలకు వెంటనే మరమ్మతులు చేపట్టాలని, లేకపోతే రాష్ట్రం తీవ్ర కరవును ఎదుర్కోవాల్సి వస్తుందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
నేను ఎవరో స్క్రిప్ట్ ఇస్తే చదివే రకం కాదని అన్నారు. అంతే కాకుండా.. ఒకరి చేతిలో రిమోట్ కంట్రోల్ లాగా ఉండే వ్యక్తిని కాదన్నారు. కాళేశ్వరంలో లక్ష కోట్లు తిన్నారనడానికి రేవంత్ రెడ్డికి బుద్ది ఉందా!!.. అంటూ మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఒక్క మేడిగడ్డ బ్యారేజీ మాత్రమే కాదని..
కాళేశ్వరం ప్రాజెక్టులో లక్ష్మి, అన్నారం, సుందిళ్ల, మిడ్ మానేరు, అనంత సాగర్, రంగనాయక్ సాగర్, మల్లన్న సాగర్, కొండ పోచమ్మ సాగర్, బస్వాపూర్ ఇన్ని బ్యారేజులు, వందల కిలోమీట్లర్ల కాలువలు ఉన్నాయన్నారు.
ప్రాజెక్టుకు లక్ష కోట్లు ఖర్చు పెడితే లక్ష కోట్లు తిన్నారనడానికి కొద్దిగైనా జ్ఞానం ఉండాలని కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎద్దేవా చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు కొన్ని వందల టీఎంసీల రిజర్వాయర్, కొన్ని వందల కిలోమీటర్ల పైప్ లైన్లు, కొన్ని వందల కిలోమీటర్ల కాలువలు, పదుల సంఖ్యలో టన్నెల్స్, మోటార్లు ఇలా అనేకం ఉన్నాయని బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.
Tamarind Benefits: ఈ పండును మీ వంటల్లో కలిపి తింటే ఇట్టే బరువు తగ్గుతారు! కొవ్వు మైనంలా కరిగిపోతుంది!
Hyderabad, Telangana:Tamarind Health Benefits: మన ఇంట్లోని వంటగదిలో చింతపండు ఒక ముఖ్యమైన పదార్థంగా ఉంటుంది. దాన్ని అనేక రకాలైన కూరల్లో వాడుతుంటారు. ముఖ్యంగా సాంబార్, పులుసు కూరలు, చట్నీ, రసం వంటి వాటిలో విరివిగా ఉపయోగిస్తారు. వంటలకు పుల్లని రుచిని ఇవ్వడమే కాకుండా.. అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలగజేస్తుంది. అయితే చాలా మంది వంటల్లో చింతపండును కేవలం రుచి కోసం మాత్రమే ఉపయోగిస్తారని అనుకుంటారు. అయితే చింతపండు వల్ల శరీరానికి అనేక రకాలైన పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్లు, ఖనిజాలు ఉంటాయి. ఆహారంలో సరైన మోతాదులో చింతపండును చేర్చుకోవడం ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా మారింది.
చింతపండులో విటమిన్ సి, బి కాంప్లెక్స్ విటమిన్లు, మెగ్నీషియం, పొటాషియం, ఫైబర్, యాంటీ ఆక్సిండెంట్స్ సమృద్ధిగా లభిస్తాయి. ఇవి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి. అందుకే చింతపండును సహజ సూపర్‌ఫుడ్‌గా కూడా పరిగణిస్తారు. దీనిని ప్రతిరోజూ మితంగా తీసుకోవడం వల్ల శరీరానికి అవసరమైన పోషకాలు అందడమే కాకుండా, అనేక ఆరోగ్య సమస్యల ప్రమాదాన్ని కూడా తగ్గించవచ్చు.
వయసుతో సంబంధం లేకుండా చిన్నపిల్లలలో గుండె జబ్బులు, గుండెపోటు వంటి సమస్యలు పెరుగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం. మీరు తినే ఆహారంతో చింతపండు చేర్చడం వల్ల యాంటీఆక్సిడెంట్లు, ఖనిజాలు రక్తనాళాలను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. దీంతో పాటు చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, మంచి కొలెస్ట్రాల్‌ను పెంచడంలో కూడా చింతపండు ఉపయోగపడుతుంది. ఇది గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది.
బరువు తగ్గాలనుకుంటున్నారా?
బరువు తగ్గాలనుకునే వారికి కూడా చింతపండు కొంతవరకు ప్రయోజనకరంగా పనిచేస్తుంది. ఇందులో ఉండే హైడ్రాక్సీసిట్రిక్ యాసిడ్ (HCA) ఆకలిని నియంత్రించడంలో సహాయపడుతుందని కొన్ని అధ్యయనాలు సూచించాయి. దీన్ని ఆహారంలో చేర్చుకోవడం వల్ల శరీరంలో కొవ్వును కరిగించి జీవక్రియను మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. అయితే కేవలం చింతపండుతో మాత్రమే బరువు తగ్గడం సాధ్యం కాదు. సరైన డైట్, వ్యాయామంతో బరువు తగ్గడం సాధ్యమవుతుంది.
చింతపండు వినియోగం వల్ల సరైన జీర్ణక్రియకు కూడా ఉపయోగపడుతుంది. దీనిలో ఉండే పీచుపదార్థం ఆహారం సులభంగా జీర్ణం అయ్యేందుకు సహకరిస్తుంది. అంతేకాకుండా మలబద్ధకం సమస్యను తగ్గించడంలో కూడా కొంతవరకు ఉపయోగపడుతుంది. ఇది పేగుల పనితీరును మెరుగుపరిచి, జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. చింతపండును అధికంగా తీసుకుంటే కొంతమందిలో గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలు రావొచ్చు. ఈ క్రమంలో దీన్ని మితంగా తింటే మంచిది.
చింతపండులో విటమిన్ సి, ఫ్లేవనాయిడ్లు, కెరోటినాయిడ్లు వంటి యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీర రోగనిరోధక శక్తిని పెంచి, వైరస్లు, బ్యాక్టీరియాల వల్ల కలిగే ఇన్ఫెక్షన్ల నుండి రక్షించడంలో సహాయపడతాయి. వాతావరణ మార్పుల సమయంలో లేదా వర్షాకాలంలో రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేయడానికి కూడా చింతపండు ఉపయోగపడుతుంది.
(గమనిక: పైన పేర్కొన్న సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే పొందుపరిచినది. దీన్ని పాటించే ముందు సంబంధిత వైద్య నిపుణుడ్ని సంప్రదించడం మేలు. దీన్ని జీ తెలుగు న్యూస్ ధ్రువీకరిచడం లేదు.)
Also Read: Insomnia Symptoms: రాత్రివేళ నిద్ర రావడం లేదా..
Also Read: Yoga Day 2026: రోజూ యోగా చేయడం వల్ల కలిగే లాభాలు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
చేయి నొప్పితో వెళ్తే గర్భసంచి ఆపరేషన్.. షాద్‌నగర్‌లో డాక్టర్ నిర్లక్ష్యానికి మహిళ బలి!
Hyderabad, Telangana:Shadnagar Medical Negligence News: వైద్యుడి నిర్లక్ష్యం ఒక నిండు ప్రాణాన్ని తీసింది.. చేయి నొప్పితో హాస్పిటల్‌కి వచ్చిన మహిళకు.. స్కానింగ్ చేసి.. గర్భసంచి ఆపరేషన్ చేసి ఆమె మృతికి కారణమయ్యారనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఘటన షాద్‌నగర్‌లోని తీవ్ర కలకలం రేపుతోంది. బాధితురాలి మృతితో ఆగ్రహానికి గురైన కుటుంబ సభ్యులు, బంధువులు ప్రైవేట్ ఆసుపత్రి ఎదుట భారీ ఆందోళనకు దిగారు..
అసలేం జరిగింది..
బాధిత కుటుంబ సభ్యులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. షాద్‌నగర్ పట్టణంలోని క్రిస్టియన్ కాలనీకి చెందిన సుజాత అనే మహిళ గత కొన్ని రోజులుగా చేయి నొప్పితో బాధపడుతోంది.. దీంతో ఆమె చికిత్స నిమిత్తం పట్టణంలోని ప్రముఖ ప్రైవేట్ ఆసుపత్రి అయిన ఓ ప్రైవేటు హాస్పిటల్‌కు వెళ్లింది. అక్కడ ఆమెను పరీక్షించిన వైద్యులు పలు రకాల స్కానింగ్‌లు చేశారు.. అనంతరం, ఆమెకు గర్భసంచిలో తీవ్ర సమస్య ఉందని.. ప్రాణాలు దక్కాలంటే వెంటనే ఆపరేషన్ చేసి గర్భసంచిని తొలగించాలని వైద్యులు కుటుంబ సభ్యులను భయభ్రాంతులకు గురిచేశారు..
వైద్యుల మాటలను నమ్మిన కుటుంబ సభ్యులు ఆపరేషన్‌కు అంగీకరించారు. అయితే, ఆపరేషన్ జరుగుతున్న సమయంలోనే.. సుజాత కోమాలోకి వెళ్లిపోయింది.. దీంతో తీవ్ర ఆందోళనకు గురైన ఆసుపత్రి యాజమాన్యం, తమ తప్పును కప్పిపుచ్చుకునేందుకు బాధితురాలిని వెంటనే హైదరాబాద్‌లోని పెద్ద ఆసుపత్రికి తరలించాలని కుటుంబ సభ్యులకు సూచించారు.
హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ మృతి..
వైద్యుల సూచనతో బాధితురాలిని మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తరలించారు. అక్కడ ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో అత్యవసర విభాగంలో ఉంచి.. చికిత్స అందించినప్పటికీ.. అప్పటికే ఆమె పరిస్థితి విషమించడంతో కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతూ సుజాత కన్నుమూసింది. ఆ ప్రైవేటు ఆసుపత్రి వైద్యుడి తప్పుడు నిర్ణయంతో పాటు నిర్లక్ష్యపు ఆపరేషన్ వల్లే సుజాత ప్రాణాలు కోల్పోయిందని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.
Also Read: కొండగట్టులో కొబ్బరికాయ దోపిడీ.. ఒక్కో కాయకు రూ.10 వసూలు, వైరల్ వీడియో!
హైదరాబాద్ నుంచి సుజాత భౌతికకాయాన్ని అంబులెన్స్‌లో షాద్‌నగర్‌కు తీసుకొస్తుండగా.. బాధితులు ఆ ఆసుపత్రి ముందు శవంతో ధర్నా చేసే అవకాశం ఉందన్న ముందస్తు సమాచారంతో పోలీసులు అంబులెన్స్‌ను పట్టణ శివార్లలోనే అడ్డుకున్నారు.. బాధితులను అదుపులోకి తీసుకుని.. భౌతికకాయాన్ని బలవంతంగా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. బాధిత కుటుంబ సభ్యులు ప్రభుత్వ ఆసుపత్రి ముందు ఇది ముమ్మాటికీ అన్యాయం అంటూ బైఠాయించారు.
Also Read: కొండగట్టులో కొబ్బరికాయ దోపిడీ.. ఒక్కో కాయకు రూ.10 వసూలు, వైరల్ వీడియో!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.
Zultanite Gemstone: వజ్రం కంటే ప్రపంచంలోనే విలువైన రాయి ఇది..దొరికితే 10 తరాలు సెటిల్ అవుతాయి!
Zultanite Gemstone Price: ఆభరణాల్లో మనం ఎంతో విలువైనది భావించేంది తొలుత బంగారం.. ఆ తర్వాత వజ్రం కూడా బంగారం కంటే ఎంతో విలువైనది. ప్రపంచంలో విలువైనవి వజ్రాలే అని ఎంతోమంది భావిస్తుంటారు. కానీ, వజ్రాల కంటే మరింత విలువైనది భూమి మీద మరొకటి ఉంది. అది కూడా ఓ రాయిని పోలిఉంటుంది. ఈ అద్వితీయమైన రత్నాన్ని సుల్తానాత్ అంటారు. అయితే ఇది సాధారణ రాయి కాదు, ప్రపంచంలో కేవలం ఒకే దేశంలో లభించే ప్రకృతిలోని ఓ అద్భుతమైన మాయా రాయి.
ఈ రాయికి ఓ ప్రత్యేక లక్షణం ఉంది. అదేంటంటే ఈ రాయి ఊసరవెల్లిలా రంగులు మార్చగలదు. అంతే కాకుండా కాంతి పడే క్రమం మారినప్పుడు అది పూర్తిగా రంగు మారిపోతుంది. దీన్ని చూసిన వారు విస్మయానికి లోనవ్వడం తప్పదు.
ఈ అపురూపమైన రాయి కేవలం ఓ ప్రాంతంలోని పర్వతాల్లో మాత్రమే లభిస్తుందట. ఈ రత్నం టర్కీ పర్వతాలలో మాత్రమే దాగి ఉందని నివేదికలు చెబుతున్నాయి. అయితే ఈ రాయి అక్కడ తప్పా మరెక్కడా లేదా మరే ఇతర దేశంలో కనుగొనలేదు. దీంతో అది కేవలం టర్కీలో దొరికే అరుదైన వజ్రంలా భావిస్తున్నారు.
టర్కీ పర్వతాలలోని ఇల్మ్లీ అనే ప్రదేశంలో గనుల తవ్వకం జరుగుతోంది. ఈ ప్రాంతం సముద్ర మట్టానికి వేల అడుగుల ఎత్తులో ఉండటం వల్ల, అక్కడికి చేరుకోవడం అనేది ఎంతో కష్టమైన పని. ఆ మార్గం పెద్ద పెద్ద రాళ్లతో నిండిపోయి.. కష్టతరంగా మారిన క్రమంలో ఈ అరుదైన రాయిని వెలికితీయడం ఎంతో పెద్ద పని. అందుకే ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన రాళ్లలో ఇదొకటిగా పరిగణిస్తారు.
దీని మాయాజాలమే దీని గుర్తింపు..
ఈ రాయి అసలైన ప్రత్యేకత ఊరవెల్లిలా రంగు మార్చడం. శాస్త్రవేత్తలు దీనిని రంగు మార్పు ప్రభావం అని పిలుస్తారు. కానీ సులభంగా చెప్పాలంటే, మీరు దీనిని పగటి వెలుతురులో లేదా సూర్యకాంతిలో చూసినప్పుడు, ఇది చక్కటి కివీ పచ్చ రంగులో కనిపిస్తుంది. కానీ మీరు దాన్ని గదిలోకి తీసుకురాగానే లేదా కొవ్వొత్తి వెలుగులో చూడగానే, దాని రంగు అకస్మాత్తుగా గులాబీ లేదా లేత గోధుమ రంగులోకి మారుతుంది. ఈ మార్పు ఎంత వేగంగా జరుగుతుందంటే, దానిని మొదటిసారి చూసే వ్యక్తి ఎవరైనా దాన్ని మార్చేశారని పొరబడుతారు.
వజ్రం కన్నా పదిరెట్లు అరుదైనది..
రత్న నిపుణులు, శాస్త్రవేత్తలు ఈ రాయి వజ్రం కన్నా కూడా అరుదైనదని చెబుతున్నారు. ఒక స్థూల అంచనా ప్రకారం.. సాధారణ వజ్రాన్ని కనుగొనడం కన్నా దీనిని కనుగొనడం సుమారు పదివేల రెట్లు కష్టం. దీని అర్థం ఏమిటంటే, మీరు మార్కెట్లో వజ్రాలను సులభంగా కనుగొనవచ్చు. కానీ సుల్తానేట్ వజ్రాన్ని అందరూ కొనలేరు. దాని అధిక ధరకు మరో ప్రధాన కారణం ఏమిటంటే, దానిని గని నుండి వెలికితీసినప్పుడు, కటింగ్, పాలిషింగ్ సమయంలో దానిలో 90% ముక్కలై నాశనమవుతుంది. ఆ భాగంలో కేవలం 10% మాత్రమే అందుబాటులో ఉంటుంది. దాని నుండి ఉంగరం లేదా లాకెట్ తయారు చేయవచ్చు.
(గమనిక: పైన పేర్కొన్న సమాచారం కేవలం కొన్ని నివేదికల ఆధారంగా రూపొందించింది. ఇది విలువైన వస్తువుగానే కాకుండా వాస్తు, జోతిష్య శాస్త్రాల నమ్మకాలపై ఆధారపడి ఉంటుంది. అయితే దీని ప్రస్తావన ఎలాంటి నమ్మకాలను ప్రోత్సహించినట్లు కాదు. దీన్ని జీ తెలుగు న్యూస్ ధ్రువీకరించడం లేదు.)
Also Read: ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్..ప్రతినెలా అకౌంట్లోకి రూ.2 వేలు..
Also Read: గూగుల్ పిక్సెల్ 11 రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యింది..సూపర్ గాడ్జెట్ ఫీచర్స్, ధర తెలుసా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
పేరు మార్చికుని హిందూ మహిళలకు వల.. లీకైన రొమాన్స్ వీడియోలు..
Hyderabad, Telangana:Karnataka Gym Jihad Case Latest News: కర్ణాటకలోని దవాణగెరెలో కలకలం రేపిన జిమ్ జిహాద్ ఉదంతం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. హిందూ మహిళలను లక్ష్యంగా చేసుకుని.. పేర్లు మార్చుకుని మోసాలకు పాల్పడిన జిమ్ ట్రైనర్ వ్యవహారం బయటపడటంతో స్థానికులు, హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా ఇటీవలే సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు లీక్ అవ్వడంతో జిమ్‌లో జరిగిన అసలు విషయాలు బయటపడుతున్నాయి. అసలు లీక్ అయిన వీడియోలేంటి పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ఆకాష్‌గా మారిన ఇస్మాయిల్..
దవాణగెరెలోనిపవర్ ఫిట్నెస్ క్లబ్లో ట్రైనర్‌గా పనిచేస్తున్న ఇస్మాయిల్ అనే వ్యక్తి, జిమ్‌కు వచ్చే హిందూ మహిళలను బుట్టలో వేసుకోవడానికి తన పేరును ఆకాష్‌గా మార్చుకున్నాడు. తాను కూడా హిందువునని నమ్మించి.. ఎంతోమంది అమాయక మహిళలతో పరిచయాలు పెంచుకున్నాడు. వారి నమ్మకాన్ని ఆసరాగా చేసుకుని వారితో అసభ్యకరంగా ప్రవర్తించడమే కాకుండా.. వారి ప్రైవేటు ఫోటోలను సేకరించినట్లు కూడా తెలస్తోంది.. అంతేకాకుండా ఇస్మాయిల్ కొంతమంది హిందూ మహిళతో జిమ్‌లో రొమాన్స్ కూడా చేశారని ఆరోపనలు వస్తున్నాయి. అలాగే వీటికి సంబంధించిన వీడియోలు కూడా ఇటీవలే సోషల్ మీడియాలో లీక్ అయ్యాయి.
దారుణమైన బ్లాక్‌మెయిలింగ్..
నిందితుడు ఇస్మాయిల్ మహిళల అసభ్యకర ఫోటోలను చూపిస్తూ.. వారిని తీవ్రంగా బ్లాక్మెయిల్ చేసినట్లు కూడా సమాచారం. ఈ వేధింపులు భరించలేక, సమాజంలో తలదించుకోలేక ఒక వివాహిత పాయిజన్ తాగి ఆత్మహత్యకు యత్నించడం నగరంలో తీవ్ర సంచలనం సృష్టించింది. ప్రస్తుతం ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలుస్తోంది.
పవర్ ఫిట్నెస్ క్లబ్ వద్ద భారీ నిరసన..
ఈ విషయం లీక్ అవ్వడంతో దవాణగెరెలో హిందూ సంఘాలతో పాటు బాధిత కుటుంబాలకు సపోర్ట్‌గా పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చారు. పవర్ ఫిట్నెస్ క్లబ్ ముందు భారీ ఎత్తున నిరసన చేపట్టారు. ఆగ్రహంతో నిరసనకారులు జిమ్ ఎదుట ఉన్న ఫ్లెక్స్ బోర్డులను పూర్తిగా చింపివేసి.. ధ్వంసం చేశారు. నిందితుడికి వ్యతిరేకంగా, జిమ్ యాజమాన్యానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
పరిస్థితి అదుపు తప్పుతుండటంతో రంగంలోకి దిగిన పోలీసులు.. నిందితుడు ఇస్మాయిల్‌ను ఇప్పటికే అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అయితే కేవలం అరెస్ట్ చేస్తే సరిపోదని.. ఇటువంటి ఉన్మాదులను దేశం నుంచే బహిష్కరించాలని నిరసనకారులు హిందూ సంఘాలు గట్టిగా డిమాండ్ చేస్తున్నాయి.
Also Read: యోగి కాబినేట్ మరో కీలక నిర్ణయం.. ఉత్తర ప్రదేశ్‌లో జలాలాబాద్‌కు పేరు మార్పు..
Also Read: ముంబై, పూణెలను ముంచెత్తిన వర్షాలు.. స్కూళ్లకు సెలవులు ప్రకటించిన ప్రభుత్వం..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.
Venu Swamy Divya Bharathi: "ఆ స్టార్ హీరోయిన్‌తో కలిసి నా బైక్‌పై ఊరంతా తిరిగేవాళ్లం" వేణుస్వామి సంచలన వ్యాఖ్యలు!
Hyderabad, Telangana:Venu Swamy On Divya Bharathi: ప్రముఖ జ్యోతిష్కుడు వేణుస్వామి గురించి తెలుగు రాష్ట్రాల్లో పరిచయమైన వ్యక్తే. అందులోనూ సినీ రంగానికి సంబంధించిన కొన్ని జాతకాలు.. వారివారి భవిష్యత్తు గురించి తరచూ ప్రస్తావిస్తూ వస్తారు. సమంత - నాగచైతన్య విడాకులను కూడా ఈయన ముందే గ్రహించి జాతకాలను బయటపెట్టడం గమనార్హం. అయితే ఆ తర్వాత రెబల్ స్టార్ ప్రభాస్ గురించి కూడా వేణు స్వామి చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి. అయితే ఆ తర్వాత ఏపీ రాజకీయాల గురించి కూడా కొన్ని ప్రిడిక్షన్స్ చెప్పిన మాట వాస్తవమే.
అయితే 2024 ఎన్నికల్లో జనసేన పార్టీ నుంచి పోటీ చేసిన నటుడు పవన్ కళ్యాణ్‌కు ఘోర పరాజయం తప్పదని జ్యోతిష్కుడు వేణు స్వామి వెల్లడించాడు. అలాగే అప్పటి ముఖ్యమంత్రి జగన్ మరోసారి అధికారం చేపట్టే అవకాశం ఉందని చెప్పాడు. అయితే ఆయన చెప్పిన దానికి పూర్తి వ్యతిరేకంగా జరగడం వల్ల ఆయన జ్యోతిషం ఇకపై చెప్పనని శపథం చేశాడు.
అప్పట్లో ఇతనిపై ఏపీలోని కూటమిలో జతకట్టిన తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీలకు చెందిన కార్యకర్తలు గట్టిగానే ట్రోల్స్ చేశారు. ఆ దెబ్బతో సైలెంట్‌గా మారిన జోతిష్కుడు వేణుస్వామి.. తాజాగా మరో సంచలన విశేషాలతో ఆయన బయటకు వచ్చాడు. తన వ్యక్తిగత విశేషాలను పంచుకుంటూనే.. తనతో ఓ హీరోయిన్ చనువుగా ఉందని చెప్పుకొచ్చాడు. ఇప్పుడా విషయం సినీవర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే ఇతనితో చనువుగా ఉన్న హీరోయిన్ ఎవరు? వీరిద్దరి మధ్య కథేంటి అనే విశేషాలను ఇప్పడు తెలుసుకుందాం.
వేణుస్వామి చెప్పిన కథేంటి?
తెలంగాణ రాష్ట్రంలో మెదక్ జిల్లా గోమారంలో జన్మించిన జోతిష్కుడు వేణుస్వామి.. కేవలం తొమ్మిదో తరగతి వరకే చదువుకున్నాడట. ఆయన చిన్నతనం నుంచే పూజలు చేసేవాడినని ఆయన చెప్పుకొచ్చాడు. 11 ఏళ్ల వయసులో తండ్రిని కోల్పోయిన ఆవేదనలో.. తన అన్న రఘునాథ చారి వద్ద ఉంటూనే పౌరోహిత్యాన్ని ఆచరించినట్లు ఆయన వెల్లడించాడు. హైదరాబాద్ వచ్చిన తర్వాత 10, ఇంటర్, డిగ్రీ పూర్తి చేసినట్లు వేణుస్వామి అన్నారు. డిగ్రీలో అఖిల భారత విద్యార్థి పరిషత్‌లో సైతం పనిచేసినట్లు తెలిపారు. తన తండ్రికి గుడిలో దక్కని గౌరవం చూసి.. జనాల నుంచి అదే గౌరవాన్ని పొందనాలనే కోరిక చిన్నతనం నుంచి కలిగిందని వేణుస్వామి అన్నారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి బావమరిది చంద్ర ప్రతాప్ రెడ్డి పరిచయడతో జ్యోతిష్య రంగంలోకి ప్రవేశించినట్లు వేణుస్వామి చెప్పారు. ఆ తర్వాత అందులో లోతుగా అధ్యయనం చేసి పూర్తిగా దాన్ని వృత్తిగా స్వీకరించినట్లు స్పష్టం చేశారు. సాధారణ పూజలకు భిన్నంగా.. త్వరితగతిన ఫలితాలు అందించేలా వామాచారా మార్గాన్ని అనుసరించినట్లు బహిరంగంగా వెల్లడించారు. వామాచారం, దశమహావిద్యలు వంటి కఠినమైన పరిష్కారలను చూపుతాయని.. సాధారణ జీవితం కోటిశ్వరుడిగా మారేందుకు సహాయపడతాయని వేణు స్వామి చెప్పారు.
అయితే తన యుక్త వయసులో ఉన్నప్పుడు బాలీవుడ్ హీరోయిన్ దివ్య భారతితో తన బైక్‌పై తిరిగినట్లు వేణు స్వామి గుర్తు చేసుకున్నారు. ఆనాటి నటీనటులు టీ తాగేందుకు కూడా బయటకు వచ్చే వాతావరణం ఉండేదని ఆయన వెల్లడించారు. అలాగే పరిటాల రవి ఇంట్లో కూడా పూజలు చేసినట్లు వేణుస్వామి తెలియజేశారు. తాను కింగ్ అవ్వడం తన లక్ష్యం కాదని.. కింగ్ మేకర్ గా మారేందుకు తాను ఇష్టపడతానని ఈ సందర్భంగా తన మనసులోని మాట బయటపెట్టారు. అందుకు సంబంధించిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Also Read: 'తబాహీ' సాంగ్‌లో కియారా అద్వానీ అందాలు అరబోత..ఆ సినిమాకు ఎంత డబ్బు తీసుకుందో తెలుసా?
ALso Read: విద్యార్థులు ఎగిరి గంతేసే వార్త..రేపటి నుంచి వరుసగా 3 రోజులు సెలవులు..పండగే పండగ!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
స్వదేశానికి మన దేవుళ్లు.. ఆస్ట్రేలియా నుంచి భారత్‌కి 3 అరుదైన విగ్రహాలు!
Hyderabad, Telangana:Stolen Ancient Idols Returned News: దేశ సంస్కృతి, ఆధ్యాత్మిక వైభవానికి ప్రతిరూపాలైన పురాతన దేవాలయ విగ్రహాలు ఎట్టకేలకు స్వదేశానికి చేరనున్నాయి. గతంలో తమిళనాడులోని ప్రముఖ ఆలయాల నుంచి దొంగిలించిన.. విదేశాలకు అక్రమంగా తరలించి.. ఆరు పురాతన విగ్రహాలను తిరిగి తీసుకువచ్చేందుకు తమిళనాడుకు సంబంధించిన ప్రత్యేక పోలీసు బృందం (Idol Wing) తీవ్ర ప్రయత్నాలు చేసింది.. ఈ క్రమంలో మొదటి విడతగా ఆస్ట్రేలియాలో ఉన్న మూడు అత్యంత విలువైన విగ్రహాలను భారతదేశానికి అప్పగించేందుకు ఆస్ట్రేలియా ప్రభుత్వం అధికారికంగా అంగీకరించింది..
ప్రధాని మోదీకి అప్పగించిన విగ్రహాలు..
ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అక్కడి ప్రభుత్వం ఈ మూడు పురాతన విగ్రహాలను అధికారికంగా అందించింది.. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వ ప్రత్యేక సహాయంతో ఈ విగ్రహాలను విమానంలో ఢిల్లీకి తరిలిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఢిల్లీ నుంచి.. తమిళనాడుకు చెందిన పోలీసులు భద్రత నడుమ వీటిని రాష్ట్రానికి తీసుకువచ్చి.. అవి ఏ ఆలయాలకు సంబంధించినవో ఆయా పుణ్యక్షేత్రాలలో శాస్త్రోక్తంగా పునఃప్రతిష్ఠించనున్నారు.
ఆస్ట్రేలియా నుంచి వస్తున్న మూడు విగ్రహాలు ఇవే..
భారతదేశానికి తిరిగి వస్తున్న మూడు విగ్రహాలలో ఒక్కోదానికి ఒక్కో విశిష్టమైన చరిత్ర ఉందని అధికారులు తెలుపుతున్నారు. ఇందులో త్రిశూల భద్రకాళి అమ్మవారి విగ్రహానికి చాలా ప్రత్యేకమైన ప్రాముఖ్య ఉంది. ఈ అపురూపమైన విగ్రహం తమిళనాడులోని తిరువారూర్ జిల్లా, కడువన్గుడి గ్రామంలో వెలసిన సుప్రసిద్ధ కైలాసనాథర్ ఆలయం నుంచి దొంగిలించిన్నట్లు తెలుస్తోంది.
Also Read: యోగి కాబినేట్ మరో కీలక నిర్ణయం.. ఉత్తర ప్రదేశ్‌లో జలాలాబాద్‌కు పేరు మార్పు..
ఇక శివుని వాహనమైన ఈ పవిత్ర నంది విగ్రహం కూడా అదే కైలాసనాథర్ ఆలయానికి చెందినదిగా పోలీసులు గుర్తించారు. మూడవది షణ్ముఖ సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం.. ఆరు తలలతో ఎంతో కళాత్మకంగా చెక్కిన ఈ సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం తంజావూరు జిల్లా, కుంభకోణం సమీపంలోని మానంబాడి గ్రామంలో ఉన్న ప్రసిద్ధ నాగనాథస్వామి ఆలయం నుంచి తీసుకెళ్లిన్నట్లు తెలుస్తోంది.
తమిళనాడు సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడటంలో అక్కడి పోలీసు విభాగం సాధించిన మరో మైలురాయి ఇదని అధికారులు తెలుపుతున్నారు. విదేశాల్లో ఉన్న మిగిలిన విగ్రహాలను కూడా త్వరలోనే దేశానికి తీసుకువస్తామని.. అక్రమ రవాణా చేసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తమిళనాడు పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు.
Also Read: ముంబై, పూణెలను ముంచెత్తిన వర్షాలు.. స్కూళ్లకు సెలవులు ప్రకటించిన ప్రభుత్వం..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.
Lulu Mall: వీటిపై 50 శాతం డిస్కౌంట్.. Hyundai i20 కారు గెలుచుకునే ఛాన్స్..
Hyderabad, Telangana:Lulu Mall Hyderabad Sale News: షాపింగ్ ప్రియులకు ఒక అద్భుతమైన గుడ్‌న్యూస్.. కూకట్‌పల్లిలోని లులు మాల్ (Lulu Mall) అద్భుతమైన లులు ఆన్ సేల్ (Lulu On Sale) షాపింగ్ ఫెస్టివల్‌తో ప్రారంభించింది.. ఈ సేల్ జూలై 9వ తేదీ నుంచి ప్రారంభమై.. జూలై 12 వరకు నాలుగు రోజుల పాటు కొనసాగుతుందని లులు సంస్థ వెల్లడించింది.. ఈ నాలుగు రోజులు మాల్ ఉదయం 9 గంటల నుంచే ప్రారంభమవుతుంది. ఇందులో భాగంగా చాలా రకాల వస్తువులు అత్యంత చీప్ ధరలకే లభిస్తాయి. అయితే, వేటిపై ఆఫర్స్ లభిస్తున్నాయో.. ఇప్పుడు మనం తెలుసుకుందాం.
వీటిపై ఫ్లాట్ 50 శాతం డిస్కౌంట్..
ఈ సేల్‌లో భాగంగా 200పైగా దేశీయ, ఇంటర్నేషన్ బ్రాండ్లకు సంబంధించిన పైగా వస్తువులపై డిస్కౌంట్ ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా దుస్తులతో పాటు చెప్పులు, బ్యాగులతో పాటు లైఫ్‌స్టైల్ యాక్సెసరీలపై ఏకంగా 50 శాతం ఫ్లాట్ డిస్కౌంట్లు లభిస్తున్నాయి. టాప్ బ్రాండెడ్ ఉత్పత్తులను సగం ధరకే సొంతం చేసుకునే అవకాశం లభిస్తోంది.
లులు హైపర్మార్కెట్లో బంపర్ ఆఫర్లు..
మాల్లోని లులు హైపర్మార్కెట్లో నిత్యావసర సరుకులు (Groceries), ఎలక్ట్రానిక్స్, హోమ్ అప్లయన్సెస్, ఫ్యాషన్ విభాగాలకు సంబంధించిన దాదాపు 25,000 పైగా వస్తువులపై 50 శాతం వరకు ఫ్లాట్ డిస్కౌంట్ లభిస్తోంది. దీంతో మిడిల్ క్లాస్ నుంచి హై క్లాస్ వరకు అందరికీ ఇది రీజనబుల్ షాపింగ్‌గా మారుతుందని సంస్థ తెలిపింది.. ఇక ఫుడ్ కోర్టులో కూడా కస్టమర్ల కోసం ప్రత్యేక ఆఫర్లను అందుబాటులో ఉన్నాయి..
రూ.2999 షాపింగ్ చేస్తే.. కారు గెలుచుకునే అవకాశం..
ఈ సేల్‌లో భాగంగా లులు కంపెనీ ప్రత్యేకమైన లక్కీ డ్రాను కూడా అందుబాటులో ఉంచింది.. ఇందులో భాగంగా లులు మాల్ హ్యాపీనెస్ (Happiness Membership) లాయల్టీ మెంబర్షిప్ ఉన్న కస్టమర్లు రూ.2,999 లేదా అంతకంటే ఎక్కువ విలువైన షాపింగ్ చేస్తే.. వారు లక్కీ డ్రాలో పాల్గొనే అవకాశం కూడా అందిస్తోంది. ఈ డ్రాలో విజేతలైన వారికి సంస్థ హ్యుందాయ్ i20 (Hyundai i20) కారును బహుమతిని అందిస్తున్నారు. అంతేకాకుండా, ఈ ప్రత్యేకమైన మెంబర్షిప్ కలిగిన వారికి జూలై 8 నుంచే ముందస్తుగా (Early Access) సేల్‌లో పాల్గొనే ప్రత్యేక అవకాశం లభిస్తోంది.
Also Read: Xiaomi 18 Pro: ఐఫోన్, సాంసంగ్‌లకు చుక్కలు చూపించేలా షామీ కొత్త ఫ్లాగ్షిప్.. ఫీచర్లు లీక్!
పిల్లల కోసం ఫన్తురాలో డబుల్ ధమాకా..
షాపింగ్‌కు వచ్చే పిల్లల కోసం మాల్లోని గేమింగ్ జోన్ ఫన్తురా (Funtura) అద్భుతమైన ఆఫర్‌ను అందిస్తోంది. ఈ నాలుగు రోజుల్లో రూ.2,000 లేదా అంతకంటే ఎక్కువ రీఛార్జ్ చేసుకునే వారికి 100 శాతం వరకు ప్రత్యేకమైన బోనస్‌తో పాటు ఉచిత రైడ్ కూపన్లను కూడా అందిస్తోంది. ఈ భారీ డిస్కౌంట్ సేల్ కారణంగా మాల్‌కు భారీగా కస్టమర్స్ వచ్చే అవకాశం ఉంది.. కస్టమర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా లులు మాల్ యాజమాన్యం ప్రత్యేకమైన చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది..
Also Read: Xiaomi 18 Pro: ఐఫోన్, సాంసంగ్‌లకు చుక్కలు చూపించేలా షామీ కొత్త ఫ్లాగ్షిప్.. ఫీచర్లు లీక్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.
ఉత్తరాంధ్రకు వరం కానున్న భోగాపురం ఎయిర్పోర్ట్! ఎప్పటినుంచి ఫ్లైట్స్ నడుస్తాయి? ఎవరికి లాభం? లొకేషన్, ఫ్లైట్స్ ఫెసిలిటీస్ ఇవే!
Hyderabad, Telangana:Bhogapuram Airport Updates: భోగాపురం ఎయిర్పోర్ట్ అందుబాటులోకి వస్తే విశాఖపట్నానికి రెండు విమానాశ్రయాల సౌకర్యం లభిస్తుంది. విశాఖపట్నం నుండి ఈ ఎయిర్పోర్ట్ ఎంత దూరంలో ఉంది? ప్రయాణికులు ఎప్పటి నుండి రాకపోకలు సాగించవచ్చు? అల్లూరి సీతారామరాజు భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఇప్పుడు నిజం కానుంది. ఈ విమానాశ్రయానికి సంబంధించి ఏరోడ్రమ్ లైసెన్స్ ప్రక్రియ కూడా ఇటీవల పూర్తయింది. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ, విమానాశ్రయ నిర్మాణ పనులు 100 శాతం పూర్తయ్యాయని, అన్ని చట్టబద్ధమైన తనిఖీలు, భద్రతా ధ్రువీకరణలు, కార్యాచరణ పరీక్షలు పూర్తి అయ్యాయని తెలిపారు. అంతేకాకుండా, పీఎంఓ ఆఫీస్ కూడా ప్రారంభోత్సవ తేదీకి సంబంధించి ఏర్పాట్లు చేస్తోంది. ఈ మాసం చివరి వారంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా ఈ విమానాశ్రయాన్ని ప్రారంభిస్తారు. 2026 డిసెంబర్ నాటికి నిర్మాణ పనులు పూర్తిగా పూర్తవుతాయి. కేంద్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, జీఎంఆర్ గ్రూప్, ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సంయుక్త కృషితో నిర్ణీత గడువు కంటే ఆరు నెలల ముందే పనులు పూర్తయ్యాయని కేంద్ర మంత్రి పేర్కొన్నారు.
భోగాపురం ఎయిర్పోర్ట్ ఎక్కడుంది?
ఉత్తరాంధ్ర ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న ఈ విమానాశ్రయం విజయనగరం జిల్లాలో ఉంది. ఇది విశాఖపట్నం నుండి సుమారు 60 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. విశాఖపట్నం మెట్రోపాలిటన్, కోస్తా ఆంధ్ర ప్రాంతానికి ఇది ఒక ప్రధాన అంతర్జాతీయ విమానాశ్రయంగా మారుతుంది. ప్రస్తుతం విశాఖపట్నంలో భారత నౌకాదళానికి చెందిన వైమానిక స్థావరంతో పాటు విమానాశ్రయం అందుబాటులో ఉంది. అయితే, త్వరలోనే ఈ కొత్త గ్రీన్ ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయం కూడా అందుబాటులోకి రానుంది. దీనివల్ల విశాఖపట్నంతో పాటు ఈ ప్రాంతం ఒక ప్రధాన వాణిజ్య విమానయాన కేంద్రంగా అభివృద్ధి చెందుతుంది.
జీఎంఆర్ గ్రూప్ 2200 ఎకరాల విస్తీర్ణంలో సుమారు రూ. 4,500 కోట్ల వ్యయంతో ఈ విమానాశ్రయాన్ని అభివృద్ధి చేస్తోంది. ఏటా 40 మిలియన్ల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించేలా, 20 వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల కార్గో టర్మినల్, అత్యాధునిక పార్కింగ్ సౌకర్యాలతో దీనిని నిర్మించారు. ఇందులో అధునాతన బ్యాగేజీ హ్యాండ్లింగ్ మరియు సెక్యూరిటీ చెకింగ్ వ్యవస్థలు ఉంటాయి. ప్రస్తుతం విశాఖపట్నం ఎయిర్పోర్ట్ నౌకాదళ పరిమితుల వల్ల కొన్ని పరిమితుల్లో నడుస్తోంది. ఈ కొత్త ఎయిర్పోర్ట్ అందుబాటులోకి వస్తే అంతర్జాతీయ విమాన రాకపోకలు సులభమవుతాయి, దీనివల్ల ప్రయాణికులకు వేగవంతమైన చెకింగ్ , మెరుగైన వసతులు అందుబాటులోకి వస్తాయి.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే రోడ్డు కనెక్టివిటీని పెంచేందుకు చర్యలు చేపట్టింది. విశాఖపట్నం నుండి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు కనెక్టివిటీ పెంచేందుకు ఏడు ట్రాఫిక్ ఫ్రీ రోడ్లు అందుబాటులోకి రానున్నాయి. నేషనల్ హైవే విస్తరణ పనులు కూడా జరుగుతున్నాయి. విశాఖపట్నం నుండి డబుల్ డెక్కర్ మెట్రో కారిడార్ అంశాన్ని కూడా పరిశీలిస్తున్నారు. ప్రయాణికుల సౌకర్యార్థం జీఎంఆర్, రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ భాగస్వామ్యంతో విశాఖపట్నం నుండి భోగాపురం మార్గంలో ఎనిమిది ప్రదేశాలలో ఏసీ లాంజ్‌లను ఏర్పాటు చేస్తున్నారు.
ఎవరికి లాభం?
విశాఖపట్నం ఎయిర్పోర్ట్ కంటే భోగాపురం ఎయిర్పోర్ట్ మరింత అత్యాధునిక సేవలను అందిస్తుంది. ఇది విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు, తూర్పు గోదావరి జిల్లాల ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఉత్తర కోస్తా ఆంధ్ర ప్రజలు అంతర్జాతీయ ప్రయాణాల కోసం వేరే ప్రాంతాలకు వెళ్లకుండా ఇక్కడి నుండే సులభంగా ప్రయాణించవచ్చు.
పర్యాటకుల రాక..
ఈ ఎయిర్పోర్ట్ వల్ల ఉత్తరాంధ్రలో టూరిజం కూడా గణనీయంగా పెరుగుతుంది. ఇక్కడి బీచ్‌లు, బౌద్ధ వారసత్వ ప్రదేశాలు, హిల్ స్టేషన్లకు పర్యాటకుల రాక పెరుగుతుంది. దీనివల్ల టెక్నాలజీ, ఫార్మా, లాజిస్టిక్స్, తయారీ రంగాలకు వెసులుబాటు కలుగుతుంది. హోటల్స్, రెస్టారెంట్లు, ట్రాన్స్పోర్ట్ రంగాలకు కూడా ఇది లాభదాయకంగా మారుతుంది.
Read more: ఉత్తరాంధ్రకు గేమ్ ఛేంజర్.. నేడు భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు తొలి విమానం..!
Read more: AP: మూడు రాజధానుల పరిష్కారానికి జగన్ మాస్టర్ ప్లాన్ ఇదేనా
ఆక్వా రంగానికి బెనిఫిట్..
కేవలం ప్రయాణికులకే కాకుండా, 20,000 మెట్రిక్ టన్నుల కార్గో టర్మినల్ ఉండటం వల్ల ఆంధ్రప్రదేశ్‌లోని ఆక్వా, సీఫుడ్, ఫార్మా, అగ్రికల్చర్ ఉత్పత్తులను సులభంగా ఎగుమతి చేసే అవకాశం ఉంటుంది. దీనివల్ల ఏవియేషన్, కార్గో హ్యాండ్లింగ్, లాజిస్టిక్స్, రిటైల్ రంగాల్లో ప్రత్యక్షంగా, పరోక్షంగా అనేక ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి, ముఖ్యంగా రాష్ట్ర యువతకు ఇది గొప్ప అవకాశం. అంతర్జాతీయ ప్రయాణాలు ఇప్పుడు మరింత సులభం కావడమే కాకుండా, ఖర్చు కూడా తగ్గుతుంది. ప్రయాణ సౌకర్యార్థం ప్రత్యేక ఎలక్ట్రిక్ బస్సులు కూడా అందుబాటులోకి రానున్నాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
.Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
నకిలీ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు.. 3,035 మంది ఉపాధ్యాయులపై సర్కార్ వేటు..!
Secunderabad, Telangana:Bihar Fake Teacher Scam: బీహార్ విద్యాశాఖ రాష్ట్ర చరిత్రలోనే అతిపెద్ద ప్రక్షాళనకు శ్రీకారం చుట్టింది. నకిలీ డిగ్రీలు, ఫోర్జరీ విద్యా ధృవపత్రాలు సమర్పించి ప్రభుత్వ ఉద్యోగాలు పొందిన 3,035 మంది ఉపాధ్యాయులను తొలగించాలనే సంచలనాత్మక నిర్ణయం తీసుకుంది. 2006 నుంచి 2015 మధ్య ఉపాధ్యాయుల నియామకాల్లో విస్తృత అవకతవకలు జరిగాయన్న ఆరోపణల నేపథ్యంలో, రాష్ట్ర విజిలెన్స్ బ్యూరో కొంతకాలంగా క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తోంది. ఈ విస్తృత దర్యాప్తు అనంతరం, విజిలెన్స్ బ్యూరో నివేదిక ఆధారంగా విద్యాశాఖ ఈ కీలక చర్యలు తీసుకుంది.
ఈ దర్యాప్తులో దిగ్భ్రాంతికరమైన వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. చాలా మంది అభ్యర్థులు ఉనికిలో లేని కళాశాల ధృవపత్రాలను సృష్టించగా, మరికొందరు అసలు ధృవపత్రాలను ఫోర్జరీ చేసి ప్రభుత్వ ఉద్యోగాలు పొందారు. ఈ కుంభకోణంలో దోషులుగా తేలిన 3,035 మంది ఉపాధ్యాయులపై ఇప్పటికే వివిధ పోలీస్ స్టేషన్లలో 1,830 ఎఫ్ఐఆర్లు దాఖలయ్యాయి. వారు ఉద్యోగంలో ఉన్నప్పుడు ప్రభుత్వం నుండి పొందిన జీతాలు, అలవెన్సులే కాకుండా, వారి గౌరవ వేతనం, జీతాలను కూడా వడ్డీతో సహా తిరిగి రాబట్టాలని విద్యాశాఖ నిర్ణయించింది. వారిని అధికారిక విధుల నుంచి తొలగించిన వెంటనే ఈ రికవరీ ప్రక్రియ ప్రారంభమవుతుంది.
విజిలెన్స్ విచారణ ముమ్మరమవ్వడంతో, శాఖాపరమైన చర్యలను తప్పించుకోవడానికి కొంతమంది ఉపాధ్యాయులు తమ ఉద్యోగాలకు రాజీనామా చేశారు. అయితే, కేవలం రాజీనామా చేసినంత మాత్రాన చట్టపరమైన చర్యల నుండి తప్పించుకోలేరని, అక్రమ మార్గాల ద్వారా లబ్ధి పొందిన వారందరిపై చట్టం తన పని తాను చేస్తుందని ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. విద్యా నియామకాలలో పారదర్శకతను పెంచడానికి, సంవత్సరాలుగా వ్యవస్థలో కొనసాగుతున్న అవకతవకలను తొలగించడానికి, ప్రభుత్వ విద్యా వ్యవస్థపై ప్రజల విశ్వాసాన్ని పునరుద్ధరించడానికి ఈ కఠిన నిర్ణయాలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.
Also Read: జనం అడిగారా?..ఆ ఉచిత పథకాలు ఎవరి కోసం? తెలంగాణ సర్కార్‌పై హైకోర్టు తీవ్ర ఆగ్రహం..!!
Also Read: ఉచిత వైద్యం ఉద్యోగుల హక్కు.. జీతాల్లో EHS కోతపై తెలంగాణ హైకోర్టు సీరియస్..!!
Also Read:ప్రభుత్వ ఉద్యోగులకు ఇంపార్టెంట్ అప్డేట్.. బీమా ప్రయోజనాలు దక్కాలంటే వెంటనే ఈ పని చేయండి..!!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
తిరుమల సాలకట్ల బ్రహ్మోత్సవాలపై టీటీడీ సమీక్ష
Dharmavaram, Andhra Pradesh:Review Meeting On Tirumala Annual Srivari Salakatla Bramohstavam 2026 Watch Videoరెండో టీ20 సిరీస్ పాయె.. ఇంగ్లండ్ చేతిలో పరువు పోగొట్టుకున్న టీమిండియా
England:Team India: టీ20 ప్రపంచ చాంపియన్ భారత జట్టుకు మరో భంగపాటు ఎదురైంది. ఐర్లాండ్ సిరీస్‌లో వైట్‌వాష్‌కు గురయిన టీమిండియా ఇంగ్లాండ్ చేతిలో కూడా అదే పరిస్థితి ఎదుర్కొంటోంది. నాలుగో టీ20 మ్యాచ్‌లో కూడా ఓడిపోయిన భారత జట్టు వరుసగా మూడో ఓటమిని చవిచూసింది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 3-0తో ఇంగ్లాండ్ టీ20 సిరీస్‌ను సొంతం చేసుకుంది. సొంత గడ్డపై జరుగుతున్న సిరీస్‌లో ఇంగ్లండ్ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టి ఆతిథ్య టీమిండియాను వైట్‌వాష్ చేయాలని చూస్తోంది.
శ్రేయస్ అయ్యర్ నాయ కత్వంలో బరిలో దిగిన టీమిండియా నాలుగో మ్యాచ్‌లో ఇంగ్లండ్ 9 వికెట్ల తేడాతో భారీ విజయం సాధించింది. భారత్ జట్టు నిర్దేశించిన 159 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లండ్ 13.5 ఓవర్లలో ఒక వికెట్ మాత్రమే కోల్పోయి ఛేదించింది. కెప్టెన్ హ్యారీ బ్రూక్, ఫిల్ సాల్ట్ చెలరేగి ఆడడంతో ఇంగ్లండ్ సిరీస్‌ను సొంతం చేసుకుంది. 35 బంతుల్లో 79 పరుగులు చేసిన బ్రూక్ నాటౌట్‌గా నిలవగా.. 8 ఫోర్లు, 4 సిక్సర్లు బాదాడు. చక్కటి సహకారం అందిస్తూ ఫిల్ సాల్ట్ 59 పరుగులు చేసి అజేయంగా మ్యాచ్‌ను ముగించాడు. 39 బంతులు మిగిలుండగానే ఆట ముగియడం విశేషం. తక్కువ లక్ష్యాన్ని కాపాడడంలో భారత బౌలర్లు విఫలమయ్యారు. ఏమాత్రం ప్రత్యర్థిని ఇరుకునపెట్టేలా బౌలింగ్ చేయలేకపోయారు. అర్ష్‌దీప్ సింగ్ తీసిన ఒక్క వికెట్ తప్ప మిగిలిన బౌలర్లు తమలోని శక్తిని బయటకు తీయలేదు. దీంతో మరో మ్యాచ్ మిగిలుండగానే ఐదు టీ20 సిరీస్‌ను 3-0తో ఇంగ్లండ్ తన ఖాతాలో వేసుకుంది.
తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టు అతి తక్కువ స్కోర్ నమోదు చేసింది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మెరిసినా మిగతా వాళ్లంతా నిరాశపరచడంతో ప్రత్యర్థికి భారీ లక్ష్యం నిర్దేశించలేకపోయింది. 49 బంతుల్లో 80 పరుగులు చేసి చివరి వరకు కెప్టెన్ శ్రేయస్ నిలబడ్డాడు. 4 ఫోర్లు, 5 సిక్సర్లతో చెలరేగినా ఇతర బ్యాటర్లు సహకరించలేకపోయారు. యంగ్ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ మరోసారి తక్కువ పరుగులు (15) చేయగా.. ఇషాన్ కిషన్ (4), అభిషేక్ శర్మ (16) ఘోరంగా విఫలమయ్యారు. మూడు వికెట్లు కోల్పోయిన విపత్కర పరిస్థితుల్లో శ్రేయస్ అయ్యర్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. శివమ్ దూబే (22) కొంత సహకారం అందించగా తర్వాత వచ్చిన బ్యాటర్లు నిలబడలేకపోయారు. తిలక్ వర్మ (11), వాషింగ్టన్ సుందర్ (5) తక్కువ పరుగులకే వెనుదిరిగారు. బౌలింగ్‌తో ఇంగ్లీష్ బౌలర్లు అదరగొట్టి భారత్‌ను తక్కువ స్కోర్‌కు పరిమితం చేశారు. ఆర్చర్ 20 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు తీయగా.. జోష్ టంగ్ కూడా రెండు వికెట్లు పడగొట్టారు.
ఒక ప్రపంచకప్ సాధించిన జట్టు ఇదేనా అని రెండు సిరీస్‌లను చూస్తే అనుమానం వస్తోంది. పసికూన ఐర్లాండ్ చేతిలో వైట్‌వాష్‌కు గురవడమే షాకింగ్‌గా ఉండగా.. ఇంగ్లండ్‌తో జరుగుతున్న సిరీస్‌లోనూ ఇంతటి చెత్త ప్రదర్శన భారత జట్టు నుంచి ఎవరూ ఊహించలేదు. ఒక మ్యాచ్ రద్దు.. జరిగిన మూడు మ్యాచ్‌ల్లో భారత్ ఘోర వైఫల్యం ప్రదర్శించడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా రెండో మ్యాచ్‌లో అత్యంత భారీ తేడాతో ఓడిపోగా.. నాలుగో మ్యాచ్ కూడా ఘోర పరాభవమే. ఈ స్థాయి చెత్త ప్రదర్శన చేయడంతో బీసీసీఐ దిద్దుబాటు చర్యలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. జట్టు తిరిగివచ్చాక భారీ మార్పులు చేసే అవకాశం ఉన్నట్లు క్రీడా వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో చివరి ఐదో టీ20 శనివారం జరుగుతుండగా.. ఈ మ్యాచ్‌లోనైనా భారత జట్టు గొప్ప ప్రదర్శన చేసి పరువు నిలబెట్టుకుంటుందో లేదో చూడాలి.
