icon-pinewzicon-zee
PINEWZ
become creator
Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Pinewz
505001
Merugu Vinod Merugu Vinod Follow9 Jul 2024, 10:01 am

ఆరోగ్యశ్రీ సృష్టికర్త, అభాగ్యుల ఆరోగ్య ప్రదాత డా.వై.యస్

Karimnagar, Telangana:

మానకొండూర్‌ ఎమ్మెల్యే కాంగ్రెస్‌ అధ్యక్షుడు డాక్టర్‌ కవ్వంపల్లి సత్యనారాయణతో పాటు కాంగ్రెస్‌ అధ్యక్షుడు నరేందర్‌రెడ్డి, కరీంనగర్‌ కాంగ్రెస్‌ ఇన్‌చార్జి పురుమళ్ల శ్రీనివాస్‌ పాల్గొని వైఎస్‌ఆర్‌ చిత్రపటం వద్ద నివాళులర్పించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో డాక్టర్‌ కవ్వంపల్లి మాట్లాడుతూ వైఎస్‌ఆర్‌ రాష్ట్ర అధ్యక్షుడిగా, ప్రతిపక్షనేతగా పదవులు అలంకరించి ఆ పదవులకు వెన్నుపోటు పొడిచిన వ్యక్తి సమైక్యాంధ్ర ముఖ్యమంత్రిగా తెలుగు సమాజానికి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకం ద్వారా ఎంతో సేవ చేశారన్నారు.

0
0
Report

हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|

Dhoni Retirement CSK: ధోనీ ఫ్యాన్స్‌కు గుండె బద్ధలయ్యే వార్త..సీఎస్కే నుంచి వైదొలగిన తలా..రిటైర్మెంట్?

Chennai, Tamil Nadu:

Dhoni Retirement CSK 2026: ప్రస్తుత ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ ధోనీ అసలు కనిపించడం లేదు. అదిగో వస్తున్నాడు..ఇదిగో వస్తున్నాడని చెప్పి..ఇప్పుడు లీగ్ చివరి దశకు చేరుకుంది. అయితే ధోనీ రాకపై ఇప్పుడు అతని ఫ్యాన్స్‌కు షాకింగ్ వార్త తెలుస్తోంది. ఎంఎస్ ధోనీ ఇకపై ఆటగాడిగా కొనసాగడం కష్టంగా పరిస్థితి కనిపిస్తోంది. కానీ, ధోనీ రిటైర్మెంట్‌పై ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ మైఖైల్ క్లార్క్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. 

సీఎస్కే నుండి రిటైర్ అయిన తర్వాత ధోనీకి క్రికెట్‌తో ఎలాంటి సంబంధం లేదని మైఖేల్ క్లార్క్ సంచలన ప్రకటన చేశారు. సీఎస్కే జట్టుకు ప్రతీక అయిన ధోనీ 2026 ఐపీఎల్ సిరీస్‌తో రిటైర్ అయినట్టే అని.. సీఎస్కే జట్టులో అతనికి కీలక పాత్ర ఇస్తానని చెబుతున్న తరుణంలో, రిటైర్మెంట్ తర్వాత తన ఆటతో ఎలాంటి సంబంధం ఉండదని ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు మైఖేల్ క్లార్క్ సంచలన వ్యాఖ్యలు చేశాడు.

చెన్నై సూపర్ కింగ్స్ జట్టు అనగానే మనకు గుర్తొచ్చే ముందుగా ధోనీదే. అయితే, అతను ఈ ఏడాది ఐపీఎల్‌తో రిటైర్ అవుతాడని అంటున్నారు. ఈ సీజన్ ప్రారంభంలో ధోనీ ఆడతాడని భావించినా.. గాయం కారణంగా 2026 ఐపీఎల్ ప్రారంభం నుంచే ఆటకు దూరమయ్యాడు. ఈ విషయం అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది. గత ఐపీఎల్ సీజన్‌లోనే నడుము నొప్పితో బాధపడిన అతను, ఈ సీజన్‌లో కూడా దానితో ఇబ్బంది పడుతున్నాడు. ఈ కారణంగా, అతను ఇంకా చెన్నై తుదిజట్టులో అవకాశం ఉండడం లేదు.

ఎంఎస్ ధోనీ నెట్స్‌లో ప్రాక్టీస్ కొనసాగిస్తూ బ్యాటింగ్‌లో రాణిస్తున్నాడని సీఎస్‌కే జట్టు కోచ్‌లు చెబుతున్నారు. అయితే, అతను పరుగెత్తి పరుగులు చేయలేకపోతున్నాడని అంటున్నారు. ఈ కారణంగా, అతనికి ఇంకా జట్టులో చోటు దక్కలేదు. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు మైఖేల్ క్లార్క్ ధోనీ గురించి కొన్ని విషయాలు పంచుకున్నారు.

ఇటీవలే ఓ పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో పాల్గొన్న మైఖేల్ క్లార్క్ ఈ విధంగా స్పందించాడు. "ధోనీ కంటే గొప్ప వికెట్ కీపర్ మరొకరు ఉన్నారని నన్ను ఎవరూ ఒప్పించలేరు. ధోనీ నేటికీ టీ20 క్రికెట్‌లో అత్యుత్తమ వికెట్ కీపర్‌లలో ఒకడు. అతను సాధారణ ఆటగాడు కాదు, తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ఉన్న క్రికెట్ దిగ్గజం. కాబట్టి, అతను రిటైర్ అవ్వాలని చెప్పేవారు చాలా జాగ్రత్తగా ఉండాలి" అని అన్నాడు.

సీఎస్కే మెంటార్‌గా ధోనీ..
ధోనీ రిటైర్ అయ్యాక, అతను క్రికెట్ ప్రపంచంలో కనిపించకోవచ్చనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అదే విధంగా ధోనీ కామెంటరీ చేసే అవకాశం కూడా తక్కువగానే ఉంది. కానీ, అతను చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు రాబోయే కాలంలో మెంటార్‌గా పనిచేసినా ఆశ్చర్యం అక్కర్లేదు. అతను పూర్తిస్థాయి కోచ్‌గా వ్యవహరించడం కూడా సాధ్యం కాదు. కాబట్టి అభిమానులు ఉత్సాహం పరచడం సహా జట్టును దగ్గరుండి ప్రోత్సహించేందుకు ధోనీ అవసరం ఉండొచ్చు.

Also Read: ఉద్యోగులకు ఊరట! ఏటీఎం నుంచి PF డబ్బులు విత్‌డ్రా..తాజాగా అప్‌డేట్ ఇదే..

Also Read: బెంగాల్ కొత్త ముఖ్యమంత్రిగా సువేందు అధికారి..డిప్యూటీ సీఎం పదవి ఆ ఇద్దరికే!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report

Snake In AC Video: ఏసీ ఆన్ చేస్తున్నారా? ఒక్క నిమిషం.. ఈ వీడియో చూస్తే వెన్నులో వణుకు పుట్టాల్సిందే!

Hyderabad, Telangana:

 Snake Inside Split AC Unit Rescue Video Watch: వేసవి తాపం నుంచి ఉపశమనం పొందేందుకు మనం ఏసీ ఆన్ చేసి దానిని రోజంతా నడిపిస్తూ ఉంటాం.. కానీ అదే ఏసీ నుంచి ఒక్కసారిగా విష సర్పం బయటికి వస్తే.. ఊహించుకుంటేనే వెన్నులో వెనక పుడుతుంది కదా..? సరిగ్గా ఇటువంటి షాకింగ్ ఘటనే ఒక ఇంట్లో చోటుచేసుకుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. సోషల్ మీడియా వినియోగదారులను భయాందోళనకు గురి చేస్తూ వస్తోంది. అసలు ఈ ఘటన ఎక్కడ జరిగింది.? ఆ ఏసీలోకి పాము ఎలా దూరింది? దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం..

సాధారణంగా పాము చల్లదనం కోసం లేదా ఆహారం కోసం ఇళ్లలోకి చొరబడుతుంటాయి. ఈ క్రమంలోనే అత్యంత ప్రమాదకరమైన ఒక విషస్తత్వం ఇంటి గోడ పై ఉన్న స్ప్లిట్ ఏసి లోపలికి దూరింది. ఏసీ వెనుక ఉన్న పైపుల మార్గం ద్వారా అది లోపలికి ప్రవేశించినట్లు తెలుస్తోంది. ఏసీ లోపల ఏదో కదులుతున్నట్లు గమనించిన కుటుంబ సభ్యులు దాని వైపే పరిశీలించి చూడక ఆ పాము తోక భాగం ఏసీ బయట ఉండడంతో ఒక్కసారిగా షాక్ అయిపోయారు. 

ఆ పాము తోక భాగాన్ని చూసి భయాందోళన చెందిన కుటుంబ సభ్యులు ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే స్థానిక స్నేక్ క్యాచర్ కి సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న అతను అత్యంత చాకచక్యంగా వ్యవహరించారు. ఏసి బ్యానర్ను జాగ్రత్తగా పట్టుకొని.. లోపల చుట్టుకొని ఉన్న ఆ భయంకరమైన పామును బయటకు తీసేశారు. ఏసీ ఇరుకైన సందుల్లో పాము ఇరుక్కుపోయి ఉండడంతో దానిని బయటికి తీయడానికి అతను కాస్త శ్రమ పడాల్సి వచ్చింది..

 
 
 
 
 

Also Read:  Video Viral: సాయం ముసుగులో అరాచకం.. యువతి ప్రైవేటు పార్ట్ మీద చెయ్యి వేసి మరీ.!. వీడియోపై దుమారం..

స్నేక్ క్యాచర్ పామును ఏసీ నుంచి బయటికి తీస్తున్న దృశ్యాలు కుటుంబ సభ్యులు స్మార్ట్‌ఫోన్స్‌లో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అంతే అప్పటినుంచి ఈ వీడియో ఊహించని స్థాయిలో వైరల్ అవుతూ వచ్చింది. దీనిని చూసిన సోషల్ మీడియా వినియోగదారులు సైతం ఇకపై ఏసీ ఆన్ చేయాలంటేనే భయమేస్తోందని కొందరు కామెంట్ చేస్తూ వస్తున్నాయి. ఏసీ పైపుల వద్ద రంధ్రాలు సిమెంట్ లేదా ఇతర పదార్థాలతో మూసివేయాలని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఏది ఏమైనా ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ వీడియో మాత్రం ఊహకందని స్థాయిలో వైరల్ అవుతూ వస్తోంది.

Also Read:  Video Viral: సాయం ముసుగులో అరాచకం.. యువతి ప్రైవేటు పార్ట్ మీద చెయ్యి వేసి మరీ.!. వీడియోపై దుమారం..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి..Twitter, Facebook 

  

0
0
Report
Advertisement

Kendra Drishti Rajayoga: కేంద్ర దృష్టి రాజయోగం ఎఫెక్ట్‌.. జూన్ 10 నుంచి ఈ 4 రాశుల వారికి కనకవర్షం!

Hyderabad, Telangana:

Kendra Drishti Rajayoga Effect On Zodiac 2026: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. తెలివితేటలు వ్యాపారం, సంపదకు సూచికగా బుధుడిని పరిగణిస్తూ ఉంటారు. శని గ్రహాన్ని కర్మలతో పాటు న్యాయానికి అధిపతిగా చెప్పుకుంటూ ఉంటారు. ఇదిలా ఉంటే బుధుడితో పాటు శని గ్రహాలు ఒకదానికొకటి 90 డిగ్రీల కోణంలోకి రాబోతున్నాయి. దీని కారణంగానే కేంద్ర దృష్టి యోగం ఏర్పడుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. అలాంటి సమయంలో జూన్ 10వ తేదీ నుంచి కొన్ని రాశుల వారి జీవితాల్లో ఆకస్మిక మార్పులు సంభవించబోతున్నాయి. ముఖ్యంగా ఈ కేంద్ర దృష్టి రాజయోగంతో ఆయా రాశుల వారికి అద్భుతమైన ధన లాభాలు చేకూరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆయా రాశుల వారు చాలా చురుకుగా ఉండి.. ఎన్నో దీర్ఘకాలిక సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు.. అయితే, ఈ సమయంలో ఏ రాశుల వారికి విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం..

ఈ రాశులవారికి బంపర్ జాక్‌ఫాట్:
మేషరాశి 
మేష రాశిలో జన్మించిన వ్యక్తులకు భూదాశని గ్రహాల కలయిక కారణంగా జీవితం ఒక్కసారిగా మారే అవకాశాలున్నాయి. అంతేకాకుండా ఈ సమయంలో ఎన్నో రకాల ప్రయోజనాలు కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. చాలా కాలంగా నిలిచిపోయిన పనులు ఇప్పుడు ఎంతో సులభంగా పూర్తి కాబోతున్నాయి. వ్యాపారాలు చేసే వారికి లహరి లాభాలు వస్తాయి. అంతేకాకుండా కొత్త క్లైంట్లు లభించి ఊహించని ధన లాభాలు పొందుతారు. ఈ సమయంలో ఎన్నో రకాల కొత్త నిర్ణయాలు తీసుకొని అనుకున్న పనుల్లో అద్భుతమైన విజయాలు సాధిస్తారు. దీని కారణంగా జీవితంలో ఎంతో అభివృద్ధి చెందే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగాలు చేస్తున్న వారికి మంచి పదోన్నతులు కలుగుతాయి..

కన్య రాశి 
బుధ శని గ్రహాల కలయిక కారణంగా కన్యా రాశి స్త్రీ పురుషులకు ఎన్నో రకాల ప్రయోజనాలు చేకూరే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా వీరికి పదోన్నతులు లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనికి కారణంగా జీవితంలో పెరుగుదలకు కూడా ఊహించని స్థాయిలో ఉంటుంది. ఈ సమయంలో మీరు ఆస్తులు పరంగా పెట్టుబడులు పెడితే భవిష్యత్తులో మంచి లాభాలు పొందుతారు. అంతేకాకుండా డబ్బుకు సంబంధించిన అనేక సమస్యలు పరిష్కారం అవుతాయి. మీ తలపై ఉన్న అప్పుల భారం కూడా ఎంతో సులభంగా తీరుతుంది.

తులారాశి 
బుధ శని గ్రహాలకు కలయిక కారణంగా తులా రాశి వారికి ఇది అత్యంత శుభ సమయంగా మారబోతోంది. మీడియా రంగాల్లో ఉన్న వారికి ఈ సమయంలో అద్భుతమైన పెరుగుదల కనిపిస్తుంది. అంతేకాకుండా గొప్ప పురోగతిని పొంది జీవితంలో ఎప్పుడూ ఊహించని స్థాయికి వెళ్లే అవకాశాలున్నాయి. అందరూ మీ పనికి తగ్గ గౌరవాన్ని అందిస్తారు. ఈ సమయంలో పరిసర ప్రాంతాల్లో కూడా గౌరవం ఊహించని స్థాయిలో పెరుగుతుంది. తులారాశి వారు ఇతరులతో మంచి సమయాన్ని గడిపే అవకాశాలున్నాయి.

కుంభరాశి 
కుంభ రాశిలో జన్మించిన వ్యక్తులకు ఈ రెండు గ్రహాల కారణంగా ఏర్పడిన రాజయోగం సువర్ణవకాశాల అందిస్తుంది. ముఖ్యంగా కోర్టు కేసులకు సంబంధిత సమస్యల నుంచి తప్పకుండా ఉపశమనం లభిస్తుంది. అప్పుల నుంచి కూడా భారీ మొత్తంలో ఉపశమనం పొందే అవకాశాలున్నాయి. సమాజంలో వీరు ఎన్నో రకాల సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. అలాగే చాలామంది మిమ్మల్ని గౌరవించడం వల్ల.. మీకు కుటుంబంలో కూడా మంచి గౌరవం ఏర్పడుతుంది. కొత్త పనులు చేయడం వల్ల మంచి స్కిల్స్ కూడా పొందుతారు..

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
0
Report

Venu Swamy: దళపతి విజయ్ జాతకంలో 'త్రిష' ఎఫెక్ట్? వేణు స్వామి సంచలన జోస్యం.. నూటికి వెయ్యి శాతం అంటూ వీడియో!

Hyderabad, Telangana:

Venu Swamy Comments on Vijay and Trisha: దళపతి విజయ్ సీఎం కాలేరా? ఆయన సీఎం అయిన కూడా మళ్లీ ఎన్నికలు వచ్చే అవకాశం ఉందా? ప్రస్తుతం తమిళనాడులో రాజకీయ పరిణామాలు రోజుకో విధంగా మారుతున్న తరుణంలో తాజాగా మరో హాట్ టాపిక్ తెరపైకి వచ్చింది. ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి విజయ్, త్రిషలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. త్రిష లేకుండా ఉంటే విజయ్ జాతకం మరోలా ఉండేదని ఆయన అన్నారు. విజయ్ సీఎం అయినా కూడా నెల లేదా ఆరు నెలలు, ఏడాది తర్వాత మళ్లీ తమిళనాడు ఎన్నికలు వచ్చే అవకాశం నూటికి వెయ్యి శాతం ఉన్నాయంటూ ఆయన కుండ బద్దలు కొట్టినట్టు చెప్పారు. దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక గురువు మార్పు వల్ల తమిళనాడులో పెను సంచలనాలు కూడా నమోదయ్య అవకాశం ఉందన్నారు. బెంగాల్ లోను రాష్ట్రపతి పాలన వచ్చే అవకాశం ఉందని వేణు స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు.

తమిళనాడు ఎన్నికలు 2026 టీవీకే విజయ్ పార్టీ 108 స్థానాల్లో విజయ ప్రభంజనం మోగించింది. అయితే అక్కడ ప్రభుత్వం ఏర్పాటుకు 118 స్థానాలు కావలసి ఉంది. ఇప్పటికీ ఆయన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సపోర్ట్ అడిగింది. అయితే ప్రతిపక్ష నేతలు కూడా ఆయనకు సపోర్ట్ ఇస్తా అన్నారు. ఈ నేపథ్యంలో మళ్లీ 116 స్థానాలకు మద్దతు తెలిపే ఎమ్మెల్యేల సంఖ్య పడిపోయింది. అయితే ఈరోజు ఆయన సీఎంగా ప్రమాణస్వీకారం చేయాల్సిన తరుణంలో ఈరోజు విజయ్ మళ్లీ గవర్నర్‌ను కలిసే అవకాశం ఉంది. 

 

 

విజయ్ పార్టీ ఎన్నికల ఫలితాలు మే 4వ తేదీన విడుదలైన సంగతి తెలిసిందే. అదే రోజు హీరోయిన్ త్రిష పుట్టినరోజు కూడా జరిగింది. ఈ నేపథ్యంలో ఆమె ఉదయమే తిరుమల శ్రీవారి దర్శనానికి సుప్రభాత సేవలో పాల్గొన్నారు. ఆ తర్వాత తమిళనాడు ఎన్నికల్లో విజయ పార్టీ ముందంజలో ఉండడంటంతో త్రిష వెంటనే విజయ్ ఇంటికి నేరుగా వెళ్లి కలిసింది. రెండున్నర గంటల తర్వాత బయటకు వచ్చింది. ఆయనకు సోషల్ మీడియా వేదికగా కూడా పలువురు సినీ ప్రముఖులు విషెస్ తెలియజేశారు. మొదటి భార్య సంగీత స్వర్ణ లింగం కూడా విజయ్ త్రిష మధ్య ఎఫైర్ ఉందంటూ ఆమె విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్న సంగతి తెలిసిందే. 

Also Read: ఫోర్జరీ జరిగిందని విజయ్ పార్టీపై దినకరన్ పోలీసులకు ఫిర్యాదు.. ఆరోపణలపై TVK వీడియోతో అదిరిపోయే రిటార్ట్!

అయితే గతంలో కూడా వేణు స్వామి విజయ్ త్రిష ఎఫైర్ పై కామెంట్ చేసిన సంగతి తెలిసిందే. విజయ్ దళపతి తన భార్యకు డైవర్స్ ఇచ్చేసి త్రిషను పెళ్లి చేసుకుంటారు కొన్ని రోజులు డేటింగ్ కూడా చేస్తున్నారని చెప్పారు. అంతేకాదు కొన్ని రోజుల్లో వీరిద్దరూ పెళ్లి చేసుకుంటారని సంచలన జోస్యం చెప్పారు. దీంతో అప్పట్లో కూడా వేణు స్వామి కామెంట్స్ వైరల్ గా అయ్యాయి. కానీ నెటిజన్స్ మాత్రం ఈయన ఫేమస్ అయ్యేందుకు మాత్రమే ఏది పడితే అది మాట్లాడుతున్నారు అంటూ చివాట్లు పెట్టారు.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook

0
0
Report

DA Hike 2026: ఉద్యోగులు ఎగిరి గంతేసే వార్త..ప్రభుత్వ ఉద్యోగులకు 63 శాతం డీఏ పెంపు!

Hyderabad, Telangana:

DA Hike From July 2026: 8వ వేతన సంఘం అమలు కోసం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దీని అమలుపై అనేక విస్తృత చర్చలు జరుగుతున్నాయి. ఈ పే కమిషన్ అమలులో భాగంగా తమ జీతాలు, పెన్షన్లలో ఎలాంటి మార్పులు ఆశించవచ్చో ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు కొన్ని అంచనాలకు పెట్టుకున్నారు. అయితే ఈ క్రమంలో ప్రభుత్వ ఉద్యోగులకు మరో శుభవార్త అందనుంది. అదే మరోసారి డీఏ పెంపు ఉండనున్నట్లు సమాచారం. ప్రస్తుత ద్రవ్యోల్బణ పరిస్థితులను తీసుకుంటే, జూలై 2026 వరకు డీఏ 2 నుంచి 3 శాతం మేర పెరిగే అవకాశం ఉందని అంచనాకు వస్తున్నారు. ఇది డీఏ పెంపు అమల్లోకి వస్తే, ఉద్యోగుల జీతాలు మరోసారి పెరిగే అవకాశం ఉంది.

ప్రస్తుత కరువు భత్యం ఎంత?
కేంద్ర ప్రభుత్వం 2026 ఏప్రిల్ 18న, జనవరి నుండి జూన్ వరకు గల కాలానికి కరువు భత్యాన్ని 2 శాతం పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ పెంపు తర్వాత ప్రభుత్వ ఉద్యోగులకు కరువు భత్యం (DA), పెన్షనర్లకు కరువు ఉపశమనం (DR) 60 శాతానికి చేరింది. ప్రస్తుత ఉద్యోగుల దృష్టి 2026 జూలైలో జరగనున్న తదుపరి కరువు భత్యం సవరణపై ఉంది. ఈ సవరణకు సంబంధించిన ప్రకటన సెప్టెంబర్-అక్టోబర్ నెలల్లో వెలువడే అవకాశం ఉంది.

'ఆల్ ఇండియా కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఫర్ ఇండస్ట్రియల్ వర్కర్స్' (AICPI-IW) ఆధారంగా కరువు భత్యం పెంపునకు సంబంధించిన అంచనాలను లెక్కిస్తారు. మార్చి 2026లో, ఈ సూచిక 149.5గా నమోదైంది. ఇది ఫిబ్రవరిలో 148.9 స్థాయి కంటే 0.6 పాయింట్లు ఎక్కువ. పెరుగుతున్న ద్రవ్యోల్బణ ప్రభావం కరువు భత్యం పెంపునకు దారితీయవచ్చని సూచిస్తున్న నిపుణులు. ప్రాథమిక అంచనాల ప్రకారం, జూలై 2026 కాలంలో కరువు భత్యం 2 నుంచి 3 శాతం వరకు పెరగవచ్చు.

డీఏ 63 శాతం..జీతం ఎంత పెరుగుతుంది?
కేంద్ర ప్రభుత్వం కరువు భత్యాన్ని 60 శాతం నుంచి 63 శాతం పెంచితే, దాని ప్రత్యక్ష ప్రభావం నెలసరి జీతంలో కనిపిస్తుంది. ఉద్యోగులు తమ జీతంలో ప్రత్యక్ష ప్రయోజనం పొందుతారనేది ఓ ఉదాహరణ ద్వారా తెలుసుకుందాం.

ఒక ఉద్యోగి మూల వేతనం రూ.18,000 అనుకుందాం. జనవరి 2026లో అమలు చేయబడిన 2% డీఏ పెంపుతో, అతనికి నెలకు అదనంగా రూ.360 ఆదాయం లభించింది. ఇప్పుడు మరో 3% పెంపు ఆమోదం పొందితే, అతని నెలసరి ఆదాయానికి సుమారు రూ.540 జత అవుతుంది. అధిక మూల వేతనాలు పొందుతున్న ఉద్యోగుల జీతాలలో మరింత ఖచ్చితంగా మార్పు వచ్చే అవకాశం ఉంది.

ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ప్రతి ఆరు నెలలకు ఒకసారి కరువు భత్యాన్ని సవరిస్తుంది. అయితే, బ్యాంకింగ్ రంగంలో ఉన్న పద్ధతి ప్రకారం.. కరువు భత్యాన్ని ప్రతి మూడు నెలలకు ఒకసారి సవరించాలని ఇప్పుడు అనేక ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. వేగంగా పెరుగుతున్న ద్రవ్యోల్బణం ఈ కాలంలో ఆరు నెలలు వేచి ఉండాల్సి రావడం తమపై అదనపు ఆర్థిక ఒత్తిడిని సృష్టిస్తోందని ఉద్యోగులు చూస్తున్నారు.

Also Read: ఒకే ఇంట్లో ఇద్దరికి రైతు భరోసా ఇస్తారా? ఏడాది రూ.12,000 పొందాలంటే ఏం చేయాలి?

Also Read: నక్క తోక తొక్కిన రాజస్థాన్ రాయల్స్ ఓనర్..రూ.15,660 కోట్లకు ఐపీఎల్ జట్టు అమ్మకం!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report
Advertisement

TVK Vijay : తమిళనాడు రాజకీయాల్లో కొత్త శకం...సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం.. పూలబాటపై నడిచిన దళపతికి పాలన ముళ్ళబాట అవుతుందా?

BBhoomi12h ago
Secunderabad, Telangana:

TVK Government Formation: తమిళ రాజకీయ చరిత్రలో ఒక అపూర్వ ఘట్టం ఆవిష్కృతం కాబోతోంది. దశాబ్దాలుగా రాష్ట్ర రాజకీయాలను శాసిస్తున్న ద్రవిడ దిగ్గజాల వారసత్వానికి సవాల్ విసురుతూ.. వెండితెర  ఇళయదళపతి విజయ్ ఇప్పుడు  ముఖ్యమంత్రి విజయ్‌గా తన ప్రస్థానాన్ని ప్రారంభించబోతున్నారు. ఆయన నేతృత్వంలోని టీవీకే  పార్టీకి ప్రజలు స్పష్టమైన మెజారిటీని కట్టబెట్టారు. ఈ నేపథ్యంలో శనివారం విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. గవర్నర్ నుంచి ఆహ్వానం అందడం... కోటలో ఏర్పాట్లు జరగడం ఒకెత్తు అయితే.. అధికారం చేపట్టిన తర్వాత ఆయన ఎదుర్కోబోయే  రియల్ పొలిటికల్ యాక్షన్  మరొక ఎత్తు. ఇన్నాళ్లూ పూలబాటపై నడిచిన విజయ్.. పాలన ముళ్లబాటగా మారనుందా.? దళపతి ముందున్న కంచుకోట లాంటి  సవాళ్లు ఏంటీ..? విక్టరీ ఈజీ.. కానీ ఎగ్జిక్యూషన్ కష్టమే అంటూ నిపుణులు హెచ్చరిస్తున్న ఆ  స్ట్రాటజిక్  రిస్క్ ఏంటో తెలుసుకుందాం. 

తమిళనాడుకు సినిమాకి..  రాజకీయాలకు విడదీయలేని అనుబంధం ఉంది. ఎంజీఆర్, కరుణానిధి, జయలలిత.. వీరంతా వెండితెర నుంచి వచ్చి ప్రజల మనసులు గెలుచుకున్న వారే. అయితే, విజయ్ రాకలో ఒక ప్రత్యేకత ఉంది. ఆయన ఒక పక్కా ప్లానింగ్ తో, తన కెరీర్ పీక్ స్టేజ్ లో ఉండగానే సినిమాలకు స్వస్తి చెప్పి రాజకీయాల్లోకి వచ్చారు. సంప్రదాయ రాజకీయ శైలికి భిన్నంగా, యువతను, మహిళలను ఆకర్షించడంలో ఆయన సక్సెస్ అయ్యారు. కానీ, ఎన్నికల్లో గెలవడం అనేది కేవలం ఒక యుద్ధం మాత్రమే.. రాజ్యాన్ని ఏలడం అనేది నిరంతర పోరాటం.

ఎన్నికల విశ్లేషకుడు అరుణ్ కృష్ణమూర్తి వంటి నిపుణులు చెబుతున్న మాట ఒక్కటే.. విజయ్‌కు ప్రభుత్వం ఏర్పడిన మరుక్షణం నుంచే అసలైన పరీక్ష మొదలవుతుంది.. సాధారణంగా ఏ కొత్త ప్రభుత్వానికైనా ప్రజలు కొంత సమయం హనీమూన్ పీరియడ్ ఇస్తారు. కానీ విజయ్ విషయంలో పరిస్థితి భిన్నంగా ఉంది. ఆయన ఇచ్చిన హామీలు అంత భారీగా ఉన్నాయి. టీవీకే ఒక కొత్త పార్టీ. క్షేత్రస్థాయిలో కేడర్ బలంగా ఉన్నప్పటికీ, పరిపాలనా యంత్రాంగంపై  పట్టు సాధించడం విజయ్‌కు ఒక పెద్ద సవాల్. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను సమన్వయం చేసుకుంటూ, ఫైళ్ల కదలికల నుంచి విధానపరమైన నిర్ణయాల వరకు ప్రతి విషయంలోనూ ఆయన నిశితంగా పరిశీలించాల్సి ఉంటుంది. అనుభవం లేని పార్టీగా ముద్ర పడకుండా ఉండాలంటే, తొలి వంద రోజుల పాలన అత్యంత కీలకమని చెప్పాలి.

ఉచితాల ఉచ్చు నుంచి బయటపడటం ఎలా? విజయ్ తన మ్యానిఫెస్టోలో సంక్షేమ పథకాల వర్షం కురిపించారు. ముఖ్యంగా..అందులో

మహిళలకు ఆర్థిక సాయం: నెలకు నిర్ణీత నగదు బదిలీ.

యువతకు భృతి: నిరుద్యోగ పట్టభద్రులకు నెలవారీ భత్యం.

రైతులకు వరాలు: పంట రుణాల మాఫీ.

బంగారం: పేద కుటుంబాల కుమార్తెల వివాహానికి ప్రభుత్వం తరపున బంగారం

ఉచితాలు: విద్యుత్, గ్యాస్ సిలిండర్ల పంపిణీ.

ఈ పథకాలన్నీ వినడానికి చాలా ఆకర్షణీయంగా ఉన్నప్పటికీ, వీటి అమలుకు అయ్యే ఖర్చు అక్షరాలా వేల కోట్లు. ఇప్పటికే తమిళనాడు అప్పుల భారంతో ఉంది. కొత్తగా నిధుల సమీకరణ ఎలా చేస్తారు? కేంద్రం నుంచి రావాల్సిన నిధుల కోసం ఎలాంటి వ్యూహం అనుసరిస్తారు? అనేది చూడాలి. ఒకవేళ నిధుల లేమితో పథకాల అమలు ఆలస్యమైతే, అదే ప్రజలు తిరగబడే అవకాశం ఉంటుంది. రాజకీయ సవాళ్లు ఒకవైపు ఉంటే, ప్రకృతి పరమైన ఇబ్బందులు మరోవైపు పొంచి ఉన్నాయి. రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో కరువు పరిస్థితులు నెలకొనే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. కొత్త ముఖ్యమంత్రిగా విజయ్ బాధ్యతలు చేపట్టిన వెంటనే కరువు నిర్వహణ  పనులను చేపట్టాల్సి ఉంటుంది. త్రాగునీటి ఎద్దడి తలెత్తకుండా చూడటం, పశుగ్రాసం కొరత లేకుండా చేయడం వంటివి అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశాలు. రైతు రుణమాఫీ హామీని అమలు చేయాలని రైతుల నుంచి ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది.

విజయ్ విజయం తమిళనాడులోని ప్రధాన ప్రతిపక్షం ఏఐఏడీఎంకేకు మరణశాసనం లాంటిదని విశ్లేషకులు భావిస్తున్నారు. జయలలిత మరణం తర్వాత ఆ పార్టీలో ఏర్పడిన నాయకత్వ లేమిని విజయ్ సరిగ్గా వాడుకున్నారు. ఏఐఏడీఎంకే సంప్రదాయ ఓటు బ్యాంక్ ఇప్పుడు టీవీకే వైపు మళ్లింది. అరుణ్ కృష్ణమూర్తి విశ్లేషణ ప్రకారం... రాబోయే రోజుల్లో తమిళనాడు రాజకీయం డీఎంకే వర్సెస్ టీవీకే గా మారబోతోంది. అంటే, సెంట్రిక్ పవర్ పాయింట్ గా విజయ్ ఎదిగారు. దీనివల్ల ఏఐఏడీఎంకే రాజకీయంగా తన అస్తిత్వాన్ని కాపాడుకోవడమే కష్టంగా మారవచ్చు. కానీ, డీఎంకే వంటి బలమైన యంత్రాంగం ఉన్న పార్టీని ఎదుర్కోవాలంటే కేవలం సినీ గ్లామర్ సరిపోదు, పక్కా రాజకీయ చతురత అవసరం.

Also Read: Tamil Nadu: దటీజ్ స్టాలిన్.. ఓడినా నువ్వు తోపు బాసూ.. 

ప్రస్తుతానికి తమిళనాడులో గాలి విజయ్‌కు అనుకూలంగా ఉంది. ప్రజలు మార్పును కోరుకున్నారు, ఆయనకు అవకాశం ఇచ్చారు. అయితే, ప్రజల అంచనాలు అందుకోలేకపోతే ఆ మద్దతు నీటి బుడగలా కరిగిపోతుందని చరిత్ర చెబుతోంది. విజయ్ తన టీమ్‌ను ఎలా ఎంచుకుంటారు? మంత్రివర్గంలో ఎవరికి చోటు కల్పిస్తారు? అవినీతి రహిత పాలనను ఎలా అందిస్తారు? అనేవి ఆయన రాజకీయ భవిష్యత్తును నిర్ణయిస్తాయి.

విజయ్ సినిమాల్లో ఒక సామాన్యుడి కోసం పోరాడే హీరోగా కనిపించేవారు. ఇప్పుడు నిజమైన సామాన్యుడి ఆకలి తీర్చాల్సిన బాధ్యత ఆయనపై ఉంది. శనివారం రాజ్‌భవన్‌లో జరిగే ప్రమాణ స్వీకారంతో ఒక ప్రయాణం ముగుస్తుంది, మరో కఠినమైన ప్రయాణం మొదలవుతుంది. దళపతికి ఇది కేవలం పట్టాభిషేకం మాత్రమే కాదు.. బాధ్యతల కిరీటం. ఈ ఐదేళ్ల కాలంలో ఆయన తీసుకునే ప్రతి నిర్ణయం తమిళనాడు భవిష్యత్తును మారుస్తుంది.

విజయ్ తన వాగ్దానాలను నెరవేర్చి మక్కల్ సెల్వన్ అనిపించుకుంటారా? లేక సంప్రదాయ రాజకీయ నాయకుడిలాగే మిగిలిపోతారా? అనేది కాలమే నిర్ణయించాలి. ఏది ఏమైనా శనివారం ప్రమాణ స్వీకారంతో తమిళనాడు ఒక కొత్త ఆశతో మేల్కొనబోతోంది.

Also Read: Army Canteen Prices: ఆర్మీ క్యాంటిన్‌లో ధరలు ఎందుకు తక్కువగా ఉంటాయో తెలుసా? ఈ సీక్రెట్ చదివితే వావ్ అంటారు..!!  

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

 

 

0
0
Report
Advertisement

DC vs KKR Highlights: సెంచరీతో ఢిల్లీని ఫినీష్ చేసిన ఫిన్ అల్లెన్.. కలకత్తా భారీ విజయం

New Delhi, Delhi:

IPL 2026 DC vs KKR Highlights: ఐపీఎల్‌ 2026 సీజన్‌లో ప్లేఆఫ్ అవకాశాలు ఏమాత్రం లేని సమయంలో తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ చిత్తుగా ఓడిపోగా.. కలకత్తా నైట్‌రైడర్స్‌ భారీ విజయాన్ని అందుకుంది. ఫిన్‌ అలెన్‌ అద్భుతమైన శతకంతో ఢిల్లీ క్యాపిటల్స్‌ను భారీ దెబ్బ తీసి వారి ప్లేఆఫ్స్‌ అవకాశాలను దూరం చేశాడు. అరుణ్‌ జైట్లీ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో కలకత్తా నైట్‌రైడర్స్‌ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌కు సంబంధించిన విశేషాలు ఇలా ఉన్నాయి.

Also Read: LSG vs RCB: హ్యాట్రిక్‌ ఓటముల నుంచి లక్నోకు ఊరట.. కీలక మ్యాచ్‌లో బెంగళూరు బోల్తా

సొంతగడ్డపై జరిగిన మ్యాచ్‌లో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్‌ 8 వికెట్ల నష్టానికి 142 పరుగులు అతి కష్టంగా చేసింది. పథమ్‌ నిస్సాంక అర్ధ సెంచరీతో అదరగొట్టగా.. స్టార్‌ ఆటగాడు కేఎల్‌ రాహుల్‌ 23 పరుగులకు పరిమితమయ్యాడు. నిస్సాంక 29 బంతుల్లో 50 పరుగులు చేయగా.. వాటిలో ఐదు బౌండరీలు, మూడు సిక్సర్లు ఉన్నాయి. నితీశ్‌ రాణా (3), త్రిస్టన్‌ స్టబ్స్‌ (2), కెప్టెన్‌ అక్షర్‌ పటేల్‌ (11), విప్రజ్‌ నిగమ్‌ (3) అతి తక్కువ పరుగులు చేశారు. వరుస వికెట్లు పడుతున్న వేళ అశుతోష్‌ శర్మ అద్భుతంగా ఆడాడు. 28 బంతుల్లో 39 పరుగులు చేసి గౌరవప్రదమైన స్కోర్‌ నమోదు చేశాడు. కలకత్తా బౌలర్లు అద్భుతంగా బంతులు వేసి ఢిల్లీ బ్యాటర్లను నిలువరించారు. అనుకూల్‌ రాయ్‌, కార్తీక్‌ త్యాగి పొదుపుగా బౌలింగ్‌ చేసి తలా రెండు వికెట్లు పడగొట్టారు. కామెరూన్‌ గ్రీన్‌, సునీల్‌ నరైన్‌, వైభవ్‌ అరోరా ఒక్కో వికెట్‌ తీశారు.

Also Read: Operation Sindoor: ఆపరేషన్‌ సింధూర్‌కు ఏడాది.. ఉదయం 1.05 గంటలకు ఏం జరిగిందో తెలుసా?

ఢిల్లీ విధించిన స్వల్ప లక్ష్యాన్ని కలకత్తా జట్టు ఇంకా 6 ఓవర్లు మిగిలి ఉండగానే ఛేదించింది. 14.2 ఓవర్‌లలో రెండు వికెట్లు కోల్పోయి 147 పరుగులు చేసింది. కెప్టెన్‌ అజింక్యా రహనే 13 పరుగులకే ఔటవగా.. అక్షర్‌ పటేల్‌ ఒక్క పరుగుకే వెనుదిరిగాడు. ఈ సమయంలో ఫిన్‌ అలెన్‌ బ్యాట్‌తో విధ్వంసం సృష్టించి 47 బంతుల్లో 100 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఐదు ఫోర్లు, పది సిక్సర్లతో చెలరేగి ఆడాడు. సిక్సర్లతోనే 60 పరుగులు చేయడం విశేషం. ఇక కామెరూన్‌ గ్రీన్‌ చక్కటి భాగస్వామ్యం అందించి 27 బంతుల్లో 33 పరుగులు చేసి మ్యాచ్‌ను ముగించాడు. బ్యాటర్లు చేసిన స్వల్ప స్కోర్‌ను ఢిల్లీ బౌలర్లు కట్టడి చేయలేకపోయారు. ఏ ఒక్క బౌలర్‌ కూడా ప్రభావంతంగా వేయలేదు. అక్షర్‌ పటేల్‌ మినహా ఒక్క బౌలర్‌ కూడా వికెట్‌ తీయలేకపోయారు.

ఢిల్లీ క్యాపిటల్స్‌పై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన కలకత్తా నైట్‌రైడర్స్‌ మరో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. మిగతా మ్యాచ్‌ల్లో కూడా విజయం సాధిస్తే ఏమైనా ప్లేఆఫ్స్‌కు చేరుకునే అవకాశం ఉంది. పది మ్యాచ్‌లు ఆడిన కలకత్తా నైట్‌రైడర్స్‌ 4 విజయాలు, ఆరు ఓటములను చవిచూసింది. ఢిల్లీ క్యాపిటల్స్‌ 11 మ్యాచ్‌ల్లో 4 విజయాలు, ఏడు ఓటములతో దాదాపుగా ప్లేఆఫ్స్‌ అవకాశాలను దూరం చేసుకుంది. కాగితాలపై లెక్కలు వేసుకున్నా కూడా ఢిల్లీ తదుపరి ముందడుగు వేసే అవకాశం లేదు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
0
Report

LSG vs RCB: హ్యాట్రిక్‌ ఓటముల నుంచి లక్నోకు భారీ ఊరట.. కీలక మ్యాచ్‌లో బెంగళూరు బోల్తా

Lucknow, Uttar Pradesh:

LSG vs RCB Highlights: ఓటముల్లో రికార్డులు నమోదు చేసిన లక్నో సూపర్‌ జియాంట్స్‌ అద్భుతం చేసింది. టాప్‌లో ఉన్న రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుకు భారీ షాక్‌ ఇచ్చింది. ప్రత్యర్థిపై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన పంత్‌ సేన మ్యాచ్‌ను సొంతం చేసుకుని వరుస ఓటములకు బ్రేక్‌ ఇచ్చింది. తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో బెంగళూరు తీవ్రంగా శ్రమించినా ఓటమి నుంచి తప్పించుకోలేకపోయింది. 9 పరుగుల తేడాతో లక్నో విజయం సాధించి హ్యాట్రిక్‌ ఓటముల నుంచి ఊరట పొందింది.

Also Read: Telangana Rains: తెలంగాణ జిల్లాల్లో వర్ష బీభత్సం.. పంట నష్టంతో రైతుల కన్నీటిపర్యంతం

పలుమార్లు వర్షం అంతరాయంతో ఆలస్యంగా జరిగిన ఈ మ్యాచ్‌ను 19 ఓవర్లకు కుదించగా.. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన లక్నో సూపర్‌ జియాంట్స్‌ 3 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. మిచెల్‌ మార్ష్‌ అద్భుతమైన సెంచరీతో అద్భుతం చేయగా.. అర్షిన్‌ కులకర్ణి 17 పరుగులు నమోదు చేశాడు. వర్షం పడినా.. పిచ్‌ ఎలా మారినా కూడా మార్ష్‌ మాత్రం చెలరేగి ఆడాడు. 56 బంతుల్లో 111 పరుగులు చేసి దుమ్మురేపగా.. వాటిలో 9 బౌండరీలు, 9 సిక్సర్లు బాదాడు. నికోలస్‌ పూరన్‌ 38, కెప్టెన్‌ రిషబ్‌ పంత్‌ 32 పరుగులతో రాణించి ప్రత్యర్థికి భారీ స్కోర్‌ను లక్ష్యం విధించారు. లక్నో స్కోర్‌ను కట్టడి చేయడంలో బెంగళూరు బౌలర్లు కొంత తడబడ్డారు. జోష్‌ హేజిల్‌వుడ్‌, కృనాల్‌ పాండ్యా, రసీక్‌ సలామ్‌ తలా ఒక్కో వికెట్‌ తీయగా.. మిగతా బౌలర్లు వికెట్‌ పడగొట్టడంలో విఫలమయ్యారు.

Also Read: Telangana Rains: తెలంగాణ జిల్లాల్లో వర్ష బీభత్సం.. పంట నష్టంతో రైతుల కన్నీటిపర్యంతం

టాపార్డర్‌ చేతులెత్తేసిన వేళ మిడిలార్డర్‌ గొప్పగా పోరాడంతో 19 ఓవర్లకు 6 వికెట్లు కోల్పోయిన బెంగళూరు 7 పరుగుల స్వల్ప తేడాతో మ్యాచ్‌ను చేజార్చుకుంది. జాకోబ్‌ బెతెల్‌ 4 పరుగులకు ఔటవగా.. స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లీ డకౌట్‌ అవడంతో బెంగళూరు కష్టాల్లో పడింది. ఓపెనర్లు వెనుదిరిగిన వేళ దేవదత్‌ పడిక్కల్‌, కెప్టెన్‌ రజత్‌ పాటిదార్‌ అద్భుతంగా ఆడి స్కోర్‌ బోర్డును పరుగులు పెట్టించారు. పడిక్కల్‌ 34 పరుగులతో రాణించగా.. రజత్‌ 31 బంతుల్లో 61 స్కోర్‌ చేసి సత్తా చాటాడు. జితేశ్‌ శర్మ ఒక్క పరుగు మాత్రమే చేయగా.. టిమ్‌ డేవిడ్‌ గొప్పగా పోరాడి 40 పరుగులు తీశాడు. విజయం కోసం కృనాల్‌ పాండ్యా (28*), రొమారియో షెఫర్డ్‌ (23*) ఆఖరి బంతి వరకు పోరాటం చేశారు. ఒక దశలో గెలిచేస్తారనుకున్న సమయంలో బౌలర్లు కట్టడి చేయడంతో పరుగులు రాలేకపోయాయి. ఫలితంగా బెంగళూరు మ్యాచ్‌ను కోల్పోవాల్సి వచ్చింది. లక్నో బౌలర్లు ప్రారంభంలో అద్భుతంగా బౌలింగ్‌ చేయగా.. తర్వాత దాన్ని కొనసాగించలేకపోయారు.యువ బౌలర్‌ ప్రిన్స్‌ యాదవ్‌ అద్బుతంగా బంతులు వేసి కీలకమైన మూడు వికెట్లు తీశాడు. షాబాజ్‌ అహ్మద్‌ రెండు వికెట్లతో సత్తా చాటగా.. సీనియర్‌ బౌలర్‌ షమీ ఒక వికెట్‌ తీశాడు. వరుస వికెట్లు తీసిన అనంతరం మిగతా వికెట్లు తీయడంలో తడబడడమే కాకుండా స్కోర్‌ను కూడా నియంత్రించలేకపోయారు. ఫలితంగా ఓవర్లన్నీ ముగిసేవరకు మ్యాచ్‌ ఫలితం దోబుచులాడింది. కానీ ఆఖరి బంతికి ఊరటనిచ్చేలా మ్యాచ్‌ జరిగింది. 

డబుల్‌ హ్యాట్రిక్‌ ఓటముల తర్వాత లక్నో సూపర్‌ జియాంట్స్‌ కీలక మ్యాచ్‌లో విజయం సాధించింది. పది మ్యాచ్‌లు ఆడిన లక్నో మూడు విజయాలు, 7 ఓటములు చవిచూసింది. బెంగళూరుతో మ్యాచ్‌లో గెలిచి రెండు పాయింట్లు ఖాతాలో వేసుకున్నా పాయింట్ల పట్టికలో చివరి స్థానంలోనే లక్నో కొనసాగుతోంది. ఇక బెంగళూరు జట్టు వరుసగా రెండో ఓటమి సాధించగా.. ఇప్పటివరకు 10 మ్యాచ్‌లు ఆడి ఆరు విజయాలు, నాలుగు ఓడిపోయింది. ఓడిపోయినా కూడా పాయింట్ల పట్టికలో టాప్‌ 3లోనే బెంగళూరు కొనసాగుతోంది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report
Advertisement

Hyderabad Public: ఇంట్లో పనివారుగా నేపాలీలు వద్దు.. హైదరాబాద్ ప్రజలకు పోలీస్‌ కమిషనర్‌ కీలక సూచన

Hyderabad, Telangana:

Former DGP Wife Killed Case: హైదరాబాద్‌ ప్రజలకు పోలీస్‌ కమిషనర్‌ వీసీ సజ్జనార్‌ కీలక విజ్ఞప్తి చేశారు. ఇంట్లో పనివారు.. పనుల్లో సహాయకులుగా నియమించుకునే వారి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పనివాళ్లను ఎంచుకునే సమయంలో అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. ముఖ్యంగా నేపాలీ వారిని పనుల్లోకి తీసుకోరాదని పోలీస్‌ కమిషనర్‌ సజ్జనార్‌ తెలిపారు. జూబ్లీహిల్స్‌లో దారుణ హత్య చోటుచేసుకోవడంతో నేపాలీలను దూరం ఉంచాలని కీలక ప్రకటన చేశారు.

Also Read: Former DGP Wife: మాజీ డీజీపీ భార్య దారుణ హత్య.. డబ్బు, నగలతో నేపాల్‌ గ్యాంగ్‌ పరార్

హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లో ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులు నివసించే ప్రాంతంలో మాజీ డీజీపీ భార్య దారుణ హత్యకు గురయిన విషయం తెలిసిందే. సంఘటన స్థలాన్ని సందర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ సజ్జనార్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. 'నేపాల్‌ దేశస్తులతో జాగ్రత్త. నేపాలి పని వారి పట్ల అందరూ అప్రమత్తంగా ఉండాలి. నేపాలి పని మనుషులు ఇంట్లో ఎవరూ లేనప్పుడు నేరాలకు పాల్పడతారు' అని హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ సజ్జనార్‌ హెచ్చరించారు.

Also Read: LSG vs RCB: హ్యాట్రిక్‌ ఓటముల నుంచి లక్నోకు ఊరట.. కీలక మ్యాచ్‌లో బెంగళూరు బోల్తా

'రాత్రి మాజీ డీజీపీ ఇంట్లో లేనప్పుడు ఇంట్లో పని చేసే కల్పన మరికొందరితో కలిసి ఈ నేరం చేసింది. ఘటన సమయంలో పిల్లలు ఇద్దరుపైన ఉన్నారు. తనుజ గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉన్నారు. ఇంట్లో ఉన్న కల్పనతో బయట వ్యక్తులు కాంటాక్ట్ పెట్టుకొని ఈ దారుణానికి ఒడిగట్టారు. నిందితులను అతి త్వరలో చ్చితంగా పట్టుకుంటాం' అని పోలీస్‌ కమిషనర్‌ సజ్జనార్‌ తెలిపారు. ప్రజలెవరూ ఆందోళన చెందరాదని.. నిందితులను త్వరలో పట్టుకుంటామని చెప్పారు.

'నేపాలి మనుషులు ఇంట్లో సంవత్సరం రెండు సంవత్సరాలు పనిచేసినా కూడా వారిపై నిఘా ఉండాలి. ఈ కేసును చాలా సీరియస్‌గా తీసుకుంటున్నాం. చేతులు కట్టేసి నోట్లో గుడ్డలు కుక్కి ఆమెను ఈ గ్యాంగ్ హత్య చేసింది. ఎంత బంగారం నగదు పోయింది అనే అంశాలపై ఆరా తీస్తున్నాం. నిందితులు వెనుక గేట్ నుండి ఇంట్లోకి ప్రవేశించారు. క్రైమ్ అనంతరం వెనక నుంచి పారిపోయారు' అని పోలీస్‌ కమిషనర్‌ సజ్జనార్‌ వివరించారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
0
Report

Banks Strike: బ్యాంకు ఉద్యోగుల సంచలన నిర్ణయం.. 26, 27 తేదీల్లో మళ్లీ సమ్మె!

Wadgaon, Maharashtra:

Bank Employees Strike: తమ సమస్యల పరిష్కారానికి.. డిమాండ్లు నెరవేర్చుకోవడంలో భాగంగా బ్యాంకు ఉద్యోగులు మరోసారి భారీ ఉద్యమాన్ని చేపట్టనున్నారు. పని ఒత్తిడితోపాటు అధిక పని గంటలతో వ్యక్తిగత జీవితం అనేది లేకుండా వేదన పడుతున్న బ్యాంకు ఉద్యోగులు మరోసారి తమ ఆందోళనను కొనసాగించనున్నారు. ముఖ్యంగా వారంలో ఐదు రోజుల పనిదినాల కోసం పోరాడుతున్నారు. వారానికి రెండు వారాంతపు సెలవులు ఇవ్వాలని బ్యాంకు ఉద్యోగులు డిమాండ్‌ చేస్తున్నారు.

Also Read: Former DGP Wife: మాజీ డీజీపీ భార్య దారుణ హత్య.. డబ్బు, నగలతో నేపాల్‌ గ్యాంగ్‌ పరార్

బ్యాంకు ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి దేశవ్యాప్త సమ్మెలో భాగంగా రాష్ట్రంలో రెండు రోజులు పాటు సమ్మె చేయనున్నట్లు చేపట్టనున్నట్లు ఆల్ ఇండియా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాఫ్ ఫెడరేషన్ (ఏఐఎస్‌బీఐఎస్‌ఎఫ్‌) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తెలిపారు. హైదరాబాద్ బర్కత్‌పురలోని యూనియన్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన కీలక విషయాలు వెల్లడించారు. ఈ నెల 25, 26 తేదీల్లో దేశవ్యాప్త సమ్మెకు ఆల్ ఇండియా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉద్యోగుల ఫెడరేషన్  పిలుపు ఇచ్చిందని తెలిపారు.

Also Read: Former DGP Wife: మాజీ డీజీపీ భార్య దారుణ హత్య.. డబ్బు, నగలతో నేపాల్‌ గ్యాంగ్‌ పరార్

తమ 16 డిమాండ్ల సాధనకు సమ్మె చేపట్టనున్నట్లు ఎస్‌బీఐ ఉద్యోగుల సమాఖ్య వెల్లడించింది. ఉద్యోగులపై పెరుగుతున్న పనిభారం, సిబ్బంది కొరత, భద్రతా సమస్యలు, అవుట్‌సోర్సింగ్ విధానాలతో ఎదురవుతున్న ఇబ్బందులను తక్షణమే పరిష్కరించాలని ఆ సంఘం డిమాండ్ చేసింది. సిబ్బంది కొరత కారణంగా బ్యాంకుల పనితీరు దెబ్బతింటోందని, వినియోగదారుల సేవలపై ప్రతికూల ప్రభావం పడుతోందని ఆందోళన వ్యక్తం చేసింది. 

యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉందని, ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని బ్యాంకు ఉద్యోగుల సంఘం డిమాండ్‌ చేసింది. అవుట్‌సోర్సింగ్ విధానాలతో బ్యాంకు భద్రతపై ప్రమాదాలు పెరుగుతున్నాయని, కస్టమర్ డేటా రక్షణకు ముప్పు ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. బ్యాంకింగ్ రంగంలో శాశ్వత ఉద్యోగాలను తగ్గించడం సరైంది కాదని అభిప్రాయ పడింది. పెరుగుతున్న పనిభారం, అధిక పనిగంటలు, పని ఒత్తిడితో ఉద్యోగుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతోందని ఎస్‌బీఐ ఉద్యోగుల సమాఖ్య ఆవేదన వ్యక్తం చేసింది. ఖాళీలను భర్తీ చేయకపోవడంతో పరిస్థితి మరింత దిగజారుతోందని తెలిపింది. ఈ సమస్యల పరిష్కారానికి దేశవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ఎస్‌బీఐ ఉద్యోగుల సమాఖ్య వెల్లడించింది. ప్రభుత్వం, బ్యాంకు యాజమాన్యం వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని ఎస్‌బీఐ ఉద్యోగుల సమాఖ్య డిమాండ్‌ చేసింది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
0
Report

EPFO 3.0 Update: ఉద్యోగులకు ఊరట! ఏటీఎం నుంచి PF డబ్బులు విత్‌డ్రా..తాజాగా అప్‌డేట్ ఇదే..

Hyderabad, Telangana:

EPFO 3.0 Withdrawal Update: పీఎఫ్ (PF) ఖాతాదారులకు కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే తీపి కబురు అందించబోతోంది. ఇకపై మీ పీఎఫ్ డబ్బుల కోసం నెలల తరబడి వేచి చూడాల్సిన అవసరం లేదు. అత్యవసర సమయాల్లో నేరుగా ATM నుండి నగదు విత్ డ్రా చేసుకోవడం లేదా UPI ద్వారా డబ్బులు పొందడం ద్వారా సరికొత్త విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడుతోంది.

ప్రస్తుత పీఎఫ్ విత్‌డ్రా ప్రక్రియలో ఉన్న జాప్యాన్ని నివారించేందుకు కేంద్రం ఈపీఎఫ్ఓ ​​3.0ను తీసుకువస్తోంది. దీని ప్రధాన ఉద్దేశ్యం సేవలను వేగవంతం చేయడం. 2026 మే నెలలో ఈ సేవలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. దీనివల్ల క్లెయిమ్ సెటిల్‌మెంట్లు రోజుల వ్యవధిలోనే పూర్తి కానున్నాయి.

ATM, UPI ద్వారా విత్‌డ్రా ఎలా?
పీఎఫ్ సభ్యుల కోసం EPFO ​​ప్రత్యేక కార్డులను జారీ చేసే అవకాశం ఉంది. దీని ద్వారా ఏటీఎం మెషిన్ల నుండి నేరుగా నగదు తీసుకోవచ్చు. ఫోన్ పే, గూగుల్ పే వంటి UPI యాప్‌లను ఉపయోగించి కూడా పీఎఫ్ డబ్బును నేరుగా మీ బ్యాంక్ ఖాతాలోకి పొందే సౌలభ్యం కలుగుతుంది. ప్రాథమిక సమాచారం ప్రకారం.. సభ్యులు తమ పీఎఫ్ బ్యాలెన్స్‌లో 50 శాతం వరకు ఈ పద్ధతిలో విత్‌డ్రా చేసుకునే వీలుంటుంది.

కావాల్సిన అర్హతలు ఇవే..
ఈ డిజిటల్ సేవలను ఉపయోగించుకోవాలంటే సభ్యులకు కిందివి తప్పనిసరి. యాక్టివ్‌గా ఉన్న UAN (యూనివర్సల్ ఖాతా సంఖ్య).. UANతో లింక్ అయిన ఆధార్ కార్డు, పాన్ కార్డుతో పాటు బ్యాంక్ ఖాతా వివరాలు.. అలాగే సరైన IFSC కోడ్ అప్‌డేట్ అయి ఉండాలి.

కేంద్ర కార్మిక మంత్రి మన్సుఖ్ మాండవియా వెల్లడించిన ప్రకారం.. EPFO ​​వ్యవస్థలో భారీ మార్పులు కనిపిస్తున్నాయి. 2024-25 ఆర్థిక సంవత్సరంలో 60.1 మిలియన్ క్లెయిమ్‌ల పరిష్కారంకాగా.. 2025-26 ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయిలో 83.1 మిలియన్ క్లెయిమ్‌లను పరిష్కరించారు.

పూర్తి పీఎఫ్ విత్‌డ్రా ఎప్పుడు?
సాధారణంగా 55 ఏళ్ల వయస్సులో పదవీ విరమణ చేసిన తర్వాత పూర్తి పీఎఫ్ తీసుకోవచ్చు. అయితే శాశ్వత వైకల్యం, విదేశాలకు వలస వెళ్లడం లేదా ఉద్యోగం కోల్పోయిన ప్రత్యేక సందర్భాల్లో కూడా పూర్తి చేసి ఉపసంహరించుకోవచ్చు. ATM/UPI సేవలపై అధికారిక మార్గదర్శకాలు రావాల్సి ఉంది. ఈ సేవలు అమల్లోకి వస్తే లక్షలాది మంది ఉద్యోగులకు కార్యాలయాల చుట్టూ తిరిగే బాధ తప్పుతుంది. పీఎఫ్ డబ్బులు మీ జేబులో ఉన్నట్టే!

Also Read: 5వ తరగతి చదివి ఇండస్ట్రీనే షేక్ చేసిన నటి..కోట్ల రూపాయలు సంపాదిస్తుంది!

Also Read: బ్రహ్మంగారు చేసిన అద్భుతం! నరికిన చెట్టు తెల్లవారే సరికి లేచి నిల్చుంది..ఎక్కడంటే?

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report
Advertisement
Advertisement
Back to top