Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Merugu Vinod
Karimnagar505001

మహిళలపై వేధింపులు పెరుగుతున్నాయి: ఐద్వా నేత అరుణ జ్యోతి

Merugu Vinod Merugu Vinod Jul 28, 2024 13:21:38
Karimnagar, Telangana:

కరీంనగర్‌లో ఐద్వా రాష్ట్రస్థాయి శిక్షణా తరగతుల్లో ఆర్. అరుణ జ్యోతి మాట్లాడారు. దేశంలో మహిళలపైవేధింపులు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. సంఘటనల సమయంలో అధికారులు, ప్రజాప్రతినిధులు తాత్కాలిక చర్యలు తీసుకుంటున్నారని విమర్శించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు శాశ్వత పరిష్కారాలు చూపడం లేదన్నారు. ఐద్వా పోరాటాల ద్వారా సాధించిన చట్టాలు సరిగా అమలు కావడం లేదని పేర్కొన్నారు. మహిళలు ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు.

1
comment0
Report
Karimnagar505001

సమాజ సేవ, గో సేవలో పాల్గొనండి: గురుజీ రమేష్ బాయ్ ఓజా పిలుపు

Merugu Vinod Merugu Vinod Jul 28, 2024 13:02:53
Karimnagar, Telangana:

గురుజీ శ్రీ రమేష్ భాయ్ ఓజా కరీంనగర్‌ను సందర్శించారు. కేసర్ మల్ కార్వా జన్మదిన వేడుకల్లో పాల్గొని, శ్రీ దాస్ హనుమాన్ గోశాలను చూశారు. వ్యాపారవేత్తలు, సంఘ సంస్కర్తలు, మేధావులను సమాజ సేవలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. గో సేవను మహా పుణ్యకార్యంగా కొనియాడారు. సమాజం మెరుగ్గా ఉన్నప్పుడే ప్రజలు సంతోషంగా ఉంటారని, సమస్యలతో పోరాడుతున్న వారికి సహాయం చేయాలని నొక్కి చెప్పారు. సమాజ సేవ ద్వారా మానవత్వాన్ని పెంపొందించాలని, సామాజిక బాధ్యతను గుర్తించాలని పిలుపునిచ్చారు.

1
comment0
Report
Karimnagar505001

బోనాల పండుగలో సుడా అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేంద్రరెడ్డి పాల్గొన్నారు

Merugu Vinod Merugu Vinod Jul 28, 2024 10:42:02
Karimnagar, Telangana:

కరీంనగర్, రామనగర, మార్కండేయ కాలనీలో మున్నూరుకాపు కులస్తులు నిర్వహించిన పోచమ్మ నాట్లు ఉత్సవంలో సుడా అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేంద్రరెడ్డి పాల్గొని అమ్మవారికి పూజలు చేశారు. ఈ సందర్భంగా నరేందర్‌రెడ్డి మాట్లాడుతూ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆరోగ్యంగా జీవించాలని అమ్మవారిని ప్రార్థించారు. ఈ కార్యక్రమాల్లో మెరుగు స్వప్నశ్రీ, పిట్టల రవీందర్, శ్రవణ్ నాయక్, గుండాటి శ్రీనివాస్ రెడ్డి, నెల్లి నరేష్, పెద్దిగారి తిరుపతి, ఉప్పరి అజయ్, అల్వాల భరత్, కంపల్లి కీర్తికుమార్, సతీష్ తదితరులు పాల్గొన్నారు. 

1
comment0
Report
Karimnagar505001

చర్లపల్లి జోరువానలో కూలీ పనికి వచ్చిన ఓ బాలికను చూసి సంజయ్ కారు ఆపాడు

Merugu Vinod Merugu Vinod Jul 28, 2024 02:18:28
Karimnagar, Telangana:

కరీంనగర్ పార్లమెంటరీ నియోజకవర్గ పర్యటనకు వచ్చిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఈరోజు మధ్యాహ్నం చొప్పదండి నియోజకవర్గం చర్లపల్లిలో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు వెళ్లి తిరిగి వస్తున్నారు. కూలీల గుంపులో ఓ మైనర్ బాలికను చూసి.. 'అమ్మా.. పనికి వెళ్తున్నావా? నీకు చదువుకోవాలని అనిపించలేదా నీ కుటుంబ పరిస్థితి గురించి అడిగాడు. తన పేరు బొల్లా అక్షయ్ అని, తాను 10వ తరగతి పాసయ్యానని, అయితే ఆర్థిక పరిస్థితి బాగాలేకపోవడంతో కూలీ పనులకు వెళ్తున్నానని బదులిచ్చారు.

0
comment0
Report
Advertisement
Karimnagar505001

కరీంనగర్ రాష్ట్ర స్థాయి రాజకీయ శిక్షణ తరగతులు ఐద్వాలో ప్రారంభమయ్యాయి

Merugu Vinod Merugu Vinod Jul 26, 2024 13:02:38
Karimnagar, Telangana:

ఈరోజు స్థానిక కరీంనగర్ లోని ముకుంద్ లాల్ మిశ్రా భవన్ లో అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) రాష్ట్ర స్థాయి రాజకీయ శిక్షణ తరగతులను రాష్ట్ర అధ్యక్షురాలు ఆర్ అరుణ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రారంభ సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లులక్ష్మి మాట్లాడుతూ.. కరీంనగర్‌లో నాలుగు రోజుల పాటు రాష్ట్ర స్థాయి రాజకీయ శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నామని, ఈ తరగతుల్లో మహిళా సమస్యలపై చర్చించి భవిష్యత్‌ పోరాటాలపై చర్చిస్తామన్నారు.

1
comment0
Report
Independence Day
Advertisement
Back to top