బోనాల పండుగలో సుడా అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేంద్రరెడ్డి పాల్గొన్నారు
Karimnagar, Telangana:కరీంనగర్, రామనగర, మార్కండేయ కాలనీలో మున్నూరుకాపు కులస్తులు నిర్వహించిన పోచమ్మ నాట్లు ఉత్సవంలో సుడా అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేంద్రరెడ్డి పాల్గొని అమ్మవారికి పూజలు చేశారు. ఈ సందర్భంగా నరేందర్‌రెడ్డి మాట్లాడుతూ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆరోగ్యంగా జీవించాలని అమ్మవారిని ప్రార్థించారు. ఈ కార్యక్రమాల్లో మెరుగు స్వప్నశ్రీ, పిట్టల రవీందర్, శ్రవణ్ నాయక్, గుండాటి శ్రీనివాస్ రెడ్డి, నెల్లి నరేష్, పెద్దిగారి తిరుపతి, ఉప్పరి అజయ్, అల్వాల భరత్, కంపల్లి కీర్తికుమార్, సతీష్ తదితరులు పాల్గొన్నారు.
हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
Meena: శ్రీకాళహస్తి ఆలయంలో సినీ నటి మీనా పూజలు
Srikalahasti, Andhra Pradesh:Godavari Pushkaralu: గోదావరి పుష్కరాలకు భారీ స్థాయిలో ఏర్పాట్లకు సీఎం చంద్రబాబు ఆదేశం
Amaravathi, Andhra Pradesh:Fake Doctors: ఓపెన్ డిగ్రీ చేసిన వ్యక్తి డాక్టర్.. హైదరాబాద్‌లో శంకర్‌దాదా ఎంబీబీఎస్‌లు
Hyderabad, Telangana:Big Alert Fake Doctors And Medical Staff Arrest In Hyderabad Watch VisualsTirumala: తిరుమల ఆలయంలో తెలంగాణ ఎమ్మెల్సీ, ఇతర ప్రముఖులు
Dharmavaram, Andhra Pradesh:Telangana MLC Naveen Kumar Reddy Visits Tirumala Temple Watch VisualsIrumudi 100 Crores: సెంచరీ కొట్టేసిన రవన్న.. రవితేజ కెరీర్లో రూ.వంద కోట్ల 'ఇరుముడి'
Baddipadaga, Telangana:Ravi Teja Irumudi Movie: ఇంట్లో ఆడపిల్ల ఉంటే ఇల్లు కళగా ఉంటుంది. అదే సినిమాగా తీస్తే కనకమహాలక్ష్మి కాసుల వర్షం కురిపిస్తుంది. అది రవితేజ, శివ నిర్వాణ కాంబినేషన్లో తెరకెక్కిన 'ఇరుముడి' సినిమా కలెక్షన్లతో రుజువు అవుతోంది. తండ్రీ కుమార్తె మధ్య ఉన్న అనుబంధంపై శివ నిర్వాణ దర్శకత్వం వహించిన ఇరుముడి సినిమా బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. రవితేజ కెరీర్లోనే రికార్డు హిట్‌గా నిలుస్తోంది. విడుదలైన నాలుగు రోజుల్లోనే రూ.వంద కోట్లు కొల్లగొట్టింది. ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ బృందం ప్రకటించింది.
బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్తుండడంతో కుటుంబ ప్రేక్షకులు కూడా థియేటర్‌కు వస్తున్నారు. తొలి మూడు రోజుల్లోనే రూ.80 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ఈ సినిమా మంగళవారం రూ.వంద కోట్ల మైలురాయిని దాటేసింది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్లు కొల్లగొట్టినట్లు మైత్రి మూవీ మేకర్స్ ప్రకటించింది. తండ్రీ, కూతురి మధ్య కథకు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. కథ నచ్చడంతో ప్రేక్షకులు థియేటర్లకు బారులు తీరుతుండడంతో ఈ సినిమా థియేటర్ల సంఖ్య పెరుగుతోంది.
తొలి షో నుంచే పాజిటివ్ టాక్ అందుకున్న ఈ సినిమా రూ.వంద కోట్ల మార్క్‌ను నాలుగు రోజుల్లోనే చేరుకుంది. ప్రియా భవానీ శంకర్ హీరోయిన్గా.. బేబీ నక్షత్ర రవితేజ కూతురి పాత్రలో ఆకట్టుకోగా చక్కటి కుటుంబ సినిమాగా ఇరుముడి ప్రేక్షకాదరణ పొందుతోంది. జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం కూడా తోడవడంతో సినిమాకు ఊహించని కలెక్షన్లు వస్తున్నాయి. విక్రమార్కుడు తర్వాత ఆ స్థాయిలో కలెక్షన్లు రవితేజ నటించిన ఇరుముడి సినిమాకు వస్తున్నాయి. మొదటి రోజే దాదాపు 60 శాతానికి పైగా రివకరీ సాధించిన ‘ఇరుముడి’ సినిమా రెండో రోజు ప్రవేశించే సమయానికే బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకుంది. తొలి రోజు రూ.20 కోట్లకు పైగా కలెక్షన్లు పొందిన ఈ సినిమా రెండో రోజు రూ.13 కోట్లకు పైగా షేర్ అందుకుంది. మూడో రోజు అంచనాలకు మించి రూ.15 కోట్ల కలెక్షన్లు రాబట్టింది.
With the blessings of Lord Ayyappa and the love from the audience, #Irumudi hits a century ❤🔥❤🔥
100 CRORES GROSS WORLDWIDE 🔥🔥
Book Your Tickets Now!
🎟️https://t.co/LPeVCIRYVl#IRUMUDI / #IRUMUDIKATTU pic.twitter.com/QSJF8T3GrC— Mythri Movie Makers (@MythriOfficial) August 25, 2026
రూ.100 కోట్ల గ్రాస్ క్లబ్బులో ప్రవేశించడంతో రవితేజ చాలా రోజుల తర్వాత 'ఇరుముడి'తో భారీ బంపర్ హిట్ సినిమా పొందాడు. ధమాకా తర్వాత రవితేజ రూ.100 కోట్ల గ్రాస్ క్లబ్బులో ప్రవేశించిన రెండో సినిమాగా రికార్డు నెలకొల్పింది. అంతకుముందు చిరంజీవితో నటించిన ‘వాల్తేరు వీరయ్య’ సినిమా మూడో రూ.వంద కోట్లు సాధించిన సినిమా. మంచి మౌత్‌టాక్‌తో దూసుకెళ్తున్న ఇరుముడి సినిమా వసూళ్లల్లోనూ అదే స్థాయిలో దూసుకెళ్తుండగా శుక్రవారం విడుదల అవుతున్న 'టాక్సిక్' కొంత ప్రభావం చూపే అవకాశం ఉంది. యశ్ నటించిన ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ఉండడంతో కొంత ఇరుముడికి ఆదరణ తగ్గేలా ఉంది. అయినా కూడా వారం తర్వాత మళ్లీ ఇరుముడి కలెక్షన్లు పుంజుకునే అవకాశాలు ఉన్నాయి.
Godavari Pushkaralu: సీఎం చంద్రబాబు సమీక్ష.. రూ.4,026 కోట్లతో గోదావరి పుష్కరాల ఏర్పాట్లు
Amaravathi, Andhra Pradesh:Chandrababu Review Meeting: అఖండ గోదారిని ఆరాధించేలా పుష్కరాలు ఉండాలని.. పుష్కరాల్లో భక్తులకు అత్యుత్తమ సౌకర్యాలు, పవిత్రతకు పెద్దపీట వేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచించారు. పుష్కరాలకు పది కోట్ల మంది పుణ్య స్నానాలు చేస్తారని.. దీనికోసం భారీ ఏర్పాట్లు చేయాలని చెప్పారు. పుష్కరాల కోసం 181 కొత్త ఘాట్ల నిర్మాణంతో సహా 440 ఘాట్ల అభివృద్ధి చేయాలని.. మొత్తం రూ.4,026 కోట్ల వ్యయంతో 4,932 పనులు చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు.
వచ్చే ఏడాది జూన్ 26 నుంచి జూలై 7 వరకు 12 రోజులపాటు గోదావరి పుష్కరాలు రానుండడంతో పుష్కరాల ఏర్పాట్లపై అమరావతిలోని సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష చేశారు. పుష్కరాల్లో భాగంగా రూ.4,026 కోట్లతో చేపట్టిన 4,932 పనులకు సంబంధించి పురోగతిపై ముఖ్యమంత్రి సమీక్షించారు. ప్రకృతి ఆరాధన-ఆధ్యాత్మిక చింతన మమేకం చేస్తూ గోదావరి పుష్కరాలు నిర్వహించాలని అధికారులకు సూచించారు. ఎక్కడా పవిత్రత దెబ్బతినకుండా.. భక్తులకు సమస్యలు తలెత్తకుండా ఇప్పటినుంచే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
'పుష్కరాలు కేవలం ప్రభుత్వం నిర్వహించడమే కాదని.. స్థానిక ప్రజలను భాగస్వాములను చేయాలి. పుష్కరాలకు ఇంకా 10 నెలల సమయమే ఉండడంతో త్వరితగతిన అన్ని పనులు ప్రారంభించి సకాలంలో పూర్తి చేయాలి. పనుల నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడొద్దు' అధికార యంత్రాంగానికి సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. 'ఈ పనులకు సంబంధించి ఇప్పటికే రూ.899 కోట్లు ఆర్ధిక శాఖ కేటాయింపులు జరిగాయి. పట్టణాభివృద్ధి, ఆర్ అండ్ బీ, జల వనరులు, విద్యుత్, పంచాయతీరాజ్ శాఖలకు సంబంధించి అత్యధిక పనులు ఉన్నాయి' అని వివరించారు.
'2015 మహా పుష్కరాల్లో ఆంధ్రప్రదేశ్‌లో సుమారు 4.86 కోట్ల మంది భక్తులు పుణ్య స్నానాలు చేయగా.. 2027లో 8 నుంచి 10 కోట్ల మంది గోదావరి పుష్కరాలకు తరలి వస్తారని అంచనాలు ఉన్నాయి. రోజుకు సుమారు కోటి మంది పుణ్య స్నానాలు చేసే అవకాశం ఉంది. రద్దీని తట్టుకునేలా మొత్తం 440 ఘాట్లు సిద్ధం చేస్తున్నాం. 259 ఘాట్లను అభివృద్ధి చేయడంతో పాటు అదనంగా 181 కొత్త ఘాట్లను నిర్మిస్తున్నాం' అని సీఎం చంద్రబాబుకు వివరించారు.
గోదావరి పరివాహక ప్రాంతంలో ఎన్నో పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. పిఠాపురంలో శక్తి పీఠం సహా పంచారామాల్లో 4 క్షేత్రాలు, ద్వారకా తిరుమల, అన్నవరం, వాడపల్లి, అంతర్వేది వంటి ప్రధాన ఆలయాలను కలుపుతూ టూరిజం సర్క్యూట్‌గా అభివృద్ధి చేయాలి' అని సీఎం చంద్రబాబు అధికారులకు సూచించారు. భక్తులు పర్యాటక, ఆధ్యాత్మిక ప్రాంతాలను సందర్శించేందుకు వీలుగా హోం స్టేలను ప్రోత్సహించాలని సూచించారు. కొత్తగా హోటళ్ల నిర్మాణం చేపట్టేవారికి త్వరితగతిన అనుమతులు ఇవ్వాలని చెప్పారు.
‘రాజమహేంద్రవరంలో కన్వెన్షన్ సెంటర్ నిర్మించాలి. దేశ, విదేశాల్లో ప్రముఖులు అందరికీ గోదావరి పుష్కరాలకు ఆహ్వానం అందించాలి. కూచిపూడి ఈవెంట్ వంటివి భారీ తరహాలో నిర్వహించేలా దేవా దాయ-పర్యాటక శాఖలు ప్రణాళికలు రూపొందించాలి. పుష్కర ఘాట్లను కలిపే రహదారుల నిర్మాణం సహా పుష్కరాలు జరిగే 6 జిల్లాలో ఏ రోడ్లపై గుంతలు కనిపించకూడదు' అని సీఎం చంద్రబాబు ఆదేశించారు. 'పోలవరం ప్రాజెక్టును సందర్శించేలా రహదారుల నిర్మాణం జరగాల్సి ఉంది. బ్రిడ్జిల సామర్ధ్యాన్ని పరిశీలించి దానికి అనుగుణంగా మరమ్మతులు చేయాలి. గోదావరిలో చుక్క కూడా మురుగు నీరు కలవకుండా చూడాలి. అధికారులు ఈ విషయంలో కఠినంగా వ్యవహరించాలి. హేవ్‌లాక్ బ్రిడ్జి, సమీపంలో దీవుల అభివృద్ధి పనులు పూర్తి చేయాలి’ అని సీఎం చంద్రబాబు నిర్దేశించారు.
'వైద్య సేవల పరంగా ఎటువంటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకున్నట్టు తెలిపారు. అంబులెన్స్‌లు, ఫస్ట్ ఎయిడ్, మెడికల్ క్యాంపులు నిర్వహిస్తామని చెప్పారు. 30 ఫీల్డ్ ఆస్పత్రులను తాత్కాలిక ప్రాతిపదికన ఏర్పాటు చేసి, వాటికి అనుబంధంగా ల్యాబ్‌లు సిద్ధం చేస్తున్నాం' అని సీఎం చంద్రబాబు వెల్లడించారు. గోదావరి నదీ పరివాహక జిల్లాల్లోని 260 గ్రామ పంచాయతీలలో 50 గ్రామ పంచాయతీలను మోడల్ పుష్కర పంచాయతీలుగా అభివృద్ధి చేయాలని తెలిపారు.
అఖండ గోదావరికి పుష్కర ఏర్పాట్లు
'గోదావరి పుష్కరాలను అత్యంత వైభవంగా.. భక్తిశ్రద్ధలతో నిర్వహించడంతోపాటు దేశ, విదేశాల నుంచి వచ్చే భక్తులు, పర్యాటకులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రపంచస్థాయి మౌలిక వసతులు, రవాణా, పారిశుద్ధ్యం, తాగునీరు, వైద్య సేవలు, భద్రత, వసతి, సాంకేతిక పరిజ్ఞానంతో సమగ్ర ఏర్పాట్లను అద్భుతంగా చేయాలి' అని సీఎ చంద్రబాబు అధికారులకు ఆదేశించారు. గోదావరి జన్మస్థానం నుంచి సముద్ర సంగమం వరకు అనేక ఉప నదులు, వాగులు, ఏరులు కలుస్తుండడంతో అఖండ గోదావరి పేరుతో పుష్కరాలు నిర్వహించే అంశాన్ని పరిశీలించాలని సీఎం చంద్రబాబు సూచించారు.
YS Jagan: స్థానిక ఎన్నికలకు సిద్ధం కండి .. వైఎస్సార్సీపీ విజయం తథ్యం: వైఎస్ జగన్
Tadepalli, Andhra Pradesh:Local Body Elections: కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని.. స్థానిక సంస్థల ఎన్నికలు స్వేచ్ఛగా జరిగితే కచ్చితంగా కూటమికి వ్యతిరేక ఓట్లు భారీగా పడతాయి. దీంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయం తథ్యం' అని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ధీమా వ్యక్తం చేశారు. స్థానిక ఎన్నికలకు వైఎస్సార్సీపీ శ్రేణులు సిద్ధం కావాలని సూచించారు. ఎక్కడా ఏకగ్రీవ ఎన్నికలు జరగకూడదని.. వైఎస్సార్సీపీ అభ్యర్థులు అన్నీ చోట్లపోటీ చేయాలని స్పష్టం చేశారు.
తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం పార్టీ రీజినల్ కోఆర్డినేటర్లు, జిల్లాల అధ్యక్షులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గాల కోఆర్డినేటర్లతో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమావేశమయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధతపై జరిగిన ఈ సమావేశంలో పార్టీ నాయకత్వానికి మాజీ సీఎం వైఎస్ జగన్ దిశానిర్దేశం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలపై కీలక సూచనలు చేశారు.
'స్థానిక సంస్థల పదవులకు ప్రత్యక్ష ఎన్నికలకు ప్రభుత్వం మొగ్గు. కాబట్టి బలమైన అభ్యర్థులను రంగంలోకి దింపాలి. అప్పుడే మిగిలిన ప్రజాప్రతినిధుల పర్యవేక్షణ, బలం లభిస్తుంది' అని మాజీ సీఎం వైఎస్ జగన్ తెలిపారు. 'వెన్నుపోటు పార్టీ కూటమి రెండేళ్ల పాలనలో అన్నీ వైఫల్యాలే. కూటమి ప్రభుత్వంతో ఐదేళ్ల వైఎస్సార్సీపీ పాలనను పోల్చి చూస్తున్నారు. దీనిపై ఇప్పుడు ప్రతి ఇంట్లోనూ చర్చ జరుగుతోంది. ఇప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చాలా బలపడింది' అని వైఎస్సార్సీపీ వైఎస్ జగన్ పేర్కొన్నారు.
'స్థానిక ఎన్నికలకు వైఎస్సార్సీపీ నాయకులు పక్కా వ్యూహంతో వెళ్లాలి. ప్రతి నియోజకవర్గంలో లీగల్‌సెల్, మీడియాసెల్, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌పై చురుకైన పాత్ర పోషించాలి' అని పార్టీ శ్రేణులకు మాజీ సీఎం వైఎస్ జగన్ సూచించారు. ప్రతి ఇంటా ప్రచార కార్యక్రమం చేసి చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యాలు వివరించాలని.. వైఎస్సార్సీపీ ప్రభుత్వ సంక్షేమ పాలనపై ప్రచారం చేయాలని చెప్పారు. బలమైన అభ్యర్థిని పోటీకి దింపాలని.. అందరితో మమేకమయ్యేలా ఎక్కడా అహంకార ధోరణి చూపరాదని దిశానిర్దేశం చేశారు.
'స్థానిక సంస్థల ఎన్నికల్లో ఐదు ప్రధాన అంశాలుగా ప్రచార కార్యక్రమం చేయాలి. చంద్రబాబు పాలన వైఫల్యాలు ఎండగట్టడం. వైఎస్సార్సీపీ ఐదేళ్ల ఏళ్ల పాలనలో సంక్షేమం, సంస్కరణ. ప్రజలకు చేసిన మేలు చెప్పడం. వైఎస్సార్సీపీ క్యాడర్‌ను ఉత్సాహవంతం చేసి ఎన్నికలకు సిద్ధం చేయడం' అని వైఎస్ జగన్ వెల్లడించారు. అన్ని చోట్లా ‘వెన్నుపోటు పార్టీ. వెన్నుపోటు పాలన’ పంపిణీ చేయాలని వైఎస్సార్సీపీ శ్రేణులకు వైఎస్ జగన్ సూచించారు.
'స్థానిక సంస్థల ఎన్నికలు పార్టీ కార్యకర్తల కోసం నిలబడాల్సిన ఎన్నికలు. ఎన్నికలు స్వేచ్ఛగా జరిగితే వెన్నుపోటు పార్టీ కూటమికి వ్యతిరేక ఓటు తప్పదని తేల్చి చెప్పారు. 'స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. వాటిని కూడా తీవ్రంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. 44 లక్షల ఓట్లు గల్లంతయ్యాయని సర్ రిపోర్టు కూడా చెబుతోంది. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లను న్యాయస్థానాలు కొట్టేస్తున్నాయి. తెలంగాణలో అదే జరిగింది. అయినా దానిపై చంద్రబాబు కావాలని జీఓ ఇచ్చి డ్రామా చేస్తున్నాడు' అని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విమర్శించారు.
'మ్యానిఫెస్టోను ఒక భగవద్గీత, ఖురాన్, బైబిల్లా భావించి 99 శాతం అమలు చేశాం. పూర్తి పారదర్శకతతో పాలించాం. ప్రతి 50 ఇళ్లకు ఒక వాలంటీర్‌ను నియమించి ఇంటి గడప వద్దే ప్రభుత్వ సేవలు అందించాం. ఎక్కడా అవినీతికి తావు లేకుండా ప్రభుత్వ పథకాలు అందించాం. ఆ విధంగా ఒక గొప్ప పాలన దేవుడి దయతో ఇవ్వగలిగాం' అని మాజీ సీఎం వైఎస్ జగన్ వివరించారు.
Yash Toxic Movie: యశ్‌కు భారీ బూస్ట్.. బూతు సినిమాకు భారీగా రేట్లు పెంచిన తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు
Baddipadaga, Telangana:Toxic Ticket Prices: కేజీఎఫ్ సినిమాలతో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన కన్నడ నటుడు యశ్ నటించిన 'టాక్సిక్' సినిమా రేపు ఆగస్టు 26వ తేదీన థియేటర్లో విడుదల కానుంది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ యాక్షన్ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో రూపొందించిన ఈ చిత్రానికి సంబంధించిన గ్లింప్స్, ట్రైలర్‌కు భారీ స్పందన లభించింది. ఇక ఈ సినిమాకు సంబంధించి తెలుగు రాష్ట్రాలు భారీగా టికెట్లు రేట్లు పెంచేశాయి. తెలంగాణతోపాటు ఏపీ ప్రభుత్వాలు టాక్సిక్ సినిమాకు టికెట్ ధరలు పెంచుకునేందుకు అవకాశం కల్పించాయి. రెండు రాష్ట్రాల్లో టాక్సిక్ సినిమా టికెట్ ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
తెలంగాణలో ధరలు ఎంత?
టాక్సిక్ సినిమా టికెట్ ధరల విషయమై ఎట్టకేలకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. టాక్సిక్ సినిమా టికెట్ ధరల పెంపునకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సినిమా విడుదలైన మొదటి 10 రోజుల పాటు ధరలు పెంచుకునేందుకు ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. దీనికి తోడు మరో అదనపు షో వేసుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ప్రభుత్వం ఇచ్చిన అనుమతి ప్రకారం సింగిల్ స్క్రీన్ థియేటర్లలో టికెట్ ధరను రూ.50 మేర పెంచుకోవచ్చు. ఈ ధరలో జీఎస్టీ కూడా కలిపి ఉంటుంది. ఇక మల్టీప్లెక్స్‌లు, స్పెషల్ థియేటర్లలో రూ.100 వరకు అదనంగా వసూలు చేసుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. టికెట్ ధరలు ఆగస్టు 26 నుంచి సెప్టెంబర్ 4వ తేదీ వరకు పెంచుకోవచ్చని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ పది రోజులు రోజుకు ఐదు రెగ్యులర్ షోలకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
నిర్మాతలకు మరో బాధ్యత
టికెట్ ధరలు పెంచడమే కాకుండా తెలంగాణ ప్రభుత్వం నిర్మాతలపై మరో అదనపు భారం మోపింది. సినీ పరిశ్రమలో పనిచేసే ఉద్యోగులు, కార్మికుల సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన కమిటీకి రూ.కోటి విరాళంగా ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. అంతేకాకుండా సినిమా థియేటర్లలో మాదకద్రవ్యాలు, సైబర్ క్రైమ్‌తో కలిగే నష్టాలపై అవగాహన కల్పించే ప్రకటనలు ప్రదర్శించాలని తెలంగాణ ప్రభుత్వం సూచించింది.
ఏపీలో ఎంత అంటే?
యశ్ టాక్సిక్ సినిమాకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా టికెట్ ధరలు పెంచుకునేందుకు అనుమతి ఇచ్చింది. యశ్ టాక్సిక్ సినిమా టికెట్ రేట్లు పెంచుతూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. విడుదల రోజు ఉదయం 6 గంటల షోకు అనుమతి ఇవ్వడంతోపాటు టికెట్ ధరను రూ.600గా నిర్ణయించింది. ఇక సినిమా టికెట్‌ను సింగిల్ స్క్రీన్లలో రూ.50 (జీఎస్టీ కలిపి).. మల్టీప్లెక్స్‌లలో రూ.100 (జీఎస్టీ కలిపి) పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ పెంచిన ధరలు పది రోజులపాటు అమల్లో ఉంటాయని ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
National Bird: కోడిని జాతీయ పక్షిగా ప్రకటించిన దేశం ఇదే.. అసలు నిజాలేంటి?
Hyderabad, Telangana:Sri Lanka National Bird: ప్రపంచంలో కోట్లాది జీవరాశులు ఉన్నాయని మనందరికీ తెలుసు.. అందులో కొన్ని జంతువులు లేదా పక్షులకు ప్రత్యేకమైన ప్రాముఖ్యతలను కలిగి ఉంటాయి. ముఖ్యంగా దేశ చరిత్రతో ఉన్న సంబంధం ఆధారంగా ఆయా దేశాల జాతీయ జంతువులుగా లేదా జాతీయ పక్షుల హోదాలను పొందుతూ ఉంటాయి. మన భారత దేశ జాతీయ పక్షి నెమలి అన్న విషయం భారతీయులందరికీ తెలుసు. ఆ అద్భుతమైన అందంతో పాటు మంచి నృత్యం, భారతీయ సాంస్కృతిలో ఉన్న మంచి అనుబంధం కారణంగా నెమలికి ఆ గౌరవం దక్కింది. అయితే మన పొరుగు దేశమైన శ్రీలంక జాతీయ పక్షి ఏమిటో మీకు తెలుసా? వినడానికి కాస్త ఆశ్చర్యంగా అనిపించినప్పటికీ.. చూడడానికి అచ్చం కోడి లాగే ఉండే ఒక అరుదైన అడవి పక్షి శ్రీలంక జాతీయ పక్షిగా ఎప్పుడో ప్రకటించింది. కానీ ఈ పక్షి మాత్రం గతంలో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది..
శ్రీలంకలో జంగిల్ ఫౌల్ అని పక్షికి జాతీయ పక్షి హోదా ఉంది. దీనిని గతంలో సిలోన్ జంగిల్ ఫౌల్ అని కూడా పిలిచేవారట.. ఇది కోడి కుటుంబానికి చెందిన అరుదైన అడవి పక్షిగా చెప్పుకుంటూ ఉంటారు.. ఇది అచ్చం మన ఊర్లో పెంచుకునే నాటు కోడి లాగానే కనిపించడం విశేషం.. కానీ ఇది సాధారణ కోడి కాదు.. ఈ పక్షులు శ్రీలంక అటవీ ప్రాంతాల్లో మాత్రమే కనిపిస్తూ ఉంటాయి. వీటి రంగుతో పాటు శరీర ఆకృతి.. అడవిలో జీవించే విధానం సాధారణ కోడికి చాలా భిన్నంగా ఉంటుంది..
ఇందులో మగ పక్షులు ఎరుపు రంగుతో పాటు నారింజ, పసుపు, నలుపు రంగుతో ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తూ ఉంటాయి. ఇక ఆడ పక్షులు మాత్రం అడవి వాతావరణం లో శత్రువులు కంటపడకుండా.. చెట్లలో సులభంగా కలిసి పోయేలా.. ప్రత్యేకమైన గోధుమ రంగులో మాత్రమే ఉంటాయి.. సుమారు 35 సెంటీమీటర్ల పొడవు పెరిగే.. ఈ పక్షులు 510 నుంచి 645 గ్రాముల వరకు బరువును కలిగి ఉంటాయి. ఇవి ఆకులతో పాటు పండ్లను, చిన్న చిన్న కీటకాలను మాత్రమే ఆహారంగా తీసుకుంటాయ్.. శ్రీలంక ప్రకృతిలో ఈ ఈ పక్షికి ఉన్న ప్రత్యేకత కారణంగా దీనికి ఆదేశం జాతీయ పక్షిగా హోదా ఇచ్చింది..
Also Read: Viral Pic: ఇదేం క్రియేటివిటీ రా బాబు.. మూత్రం పోస్తూ ప్రీ వెడ్డింగ్ ఫోటో స్టిల్స్..
సోషల్ మీడియాలో ఈ మధ్య ఈ పక్షి గురించి అనేక వార్తలు హల్చల్ చేశాయి.. శ్రీలంక జాతీయ పక్షి కోడి కాబట్టి.. అక్కడ చికెన్ తింటే జైలు శిక్ష పడుతుందంటూ కొంతమంది సోషల్ మీడియా వినియోగదారులు కూడా విపరీతంగా చర్చించుకున్నారు. అయితే ఈ వాదనలో ఎలాంటి నిజం లేదని శ్రీలంకకు సంబంధించిన కొంతమంది సోషల్ మీడియా వినియోగదారులు తెలిపారు. శ్రీలంక జాతీయ పక్షి అనేది అడవుల్లో పెరిగే ఒక ప్రత్యేకమైన పక్షి మాత్రమేనని.. మనం రోజు మార్కెట్లో కొనుగోలు చేసే బ్రాయిలర్ లేదా సాదు కోడి పక్షి కాదని శ్రీలంక ప్రజలు తెలిపారు. అయితే, అక్కడ అటవీ చట్టాల ప్రకారం జాతీయ పక్షిగా గుర్తింపు పొందిన ఈ పక్షిని వేటాడడం, చంపడం లేదా హానీ తలపెట్టడం నేరమని.. ఒకవేళ నేరం రుజువైతే కఠినమైన శిక్షలు ఉంటాయని సమాచారం..
Also Read: Viral Pic: ఇదేం క్రియేటివిటీ రా బాబు.. మూత్రం పోస్తూ ప్రీ వెడ్డింగ్ ఫోటో స్టిల్స్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Amit Shah: అమిత్ షా సైలెంట్ వెనక మాస్టర్ ప్లాన్.. ఏం జరుగుతుంది?
Hyderabad, Telangana:Amit Shahs Strategic Silence: భారత అంతర్గత, బాహ్య రక్షణ వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేస్తూ కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖ సరికొత్త వ్యూహానికి పదును పెట్టిందని భావించవచ్చు. దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన ఉన్నత స్థాయి జాతీయ భద్రత వ్యూహ సదస్సులో భాగంగా సరిహద్దు భద్రతతో పాటు ఉగ్రవాద నిర్మూలనపై కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. భారత మొట్టమొదటి సమగ్ర ఉగ్రవాద వ్యతిరేక విధానం PRAHAAR డాక్ట్రిన్‌ను పూర్తిస్థాయిలో అమలులోకి తెచ్చేందుకు రంగం సిద్ధమైంది.
సాంప్రదాయ ఉగ్రవాదంతో పాటు ప్రస్తుతం దేశానికి పెనుముప్పుగా మారిన సరిహద్దు డ్రగ్ మాఫియా, అక్రమ చొర బాట్లు, అత్యాధునిక సైబర్ దాడులు.. ఇన్ఫర్మేషన్ వార్ఫెర్, వంటి అధునాతన సవాళ్లను సమర్థవంతంగా తిప్పి కొట్టడమే కాకుండా ఈ ప్రహార్ ముఖ్య ఉద్దేశం. నిఘా విభాగాలతో పాటు త్రివిధ దళాలు, ప్రత్యేకమైన పారా మిలటరీల మధ్య అద్భుతమైన ఇన్ఫర్మేషన్ షేరింగ్‌తో పాటు సమన్వయంగా అత్యంత పటిష్టమైన రక్షణ కవచాన్ని నిర్మిస్తున్నారు.
భారత ప్రధాన భూభాగాన్ని ఈశాన్య రాష్ట్రాలతో అనుసంధానించే అత్యంత కీలకమైన.. సున్నితమైన చికెన్ నేక్ భద్రతపై కేంద్రం ప్రత్యేకమైన దృష్టిని సాధించింది. అంతేకాకుండా ధుబ్రి, కిషన్‌గంజ్, చోప్రా ప్రాంతాలను కలుపుతూ ప్రత్యేక త్రికోణ భద్రత గ్రిడ్ ఏర్పాటు చేయబోతున్నట్లు తెలుస్తోంది. సరిహద్దుల్లో చెరబాట్ల తో పాటు భూములకు సంబంధించిన ఆక్రమణలపై తక్షణమే ఉక్కు పాదం మోపాలని కఠిన ఆదేశాలు కూడా హోమ్ మంత్రి అమీషా జారీ చేసినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా తీస్తా ప్రహార వంటి సమగ్ర సంయుక్త సైనిక విన్యాసాల ద్వారా సరిహద్దుల్లో ఏ క్షణమైన అప్రమత్తంగా ఉండేలా సన్నాహాలు వేగవంతం చేశారు..
రక్షణ బలగాల మొహరింపుతో పాటు ఈశాన్య ప్రాంతాల్లో దశాబ్దాలుగా ఉన్న సమస్యల పరిష్కారానికి కేంద్రం వేగంగా అడుగులు వేస్తోంది. దీంతోపాటు గోర్ఖా కమ్యూనిటీ డిమాండ్లకు రాజ్యాంగబద్ధమైన శాశ్వత పరిష్కారాన్ని పొందేందుకు ఉన్నత స్థాయి కమిటీ ఇప్పటికే ఏర్పాటు చేసినట్లు తెలిసిందే. అలాగే మణిపూర్ మాజీ ముఖ్యమంత్రి బీరేన్ సింగ్‌తో కీలక భేటీలు.. రాబోయే జనగణన సమయంలో నేషనల్ రికార్డ్ ఆఫ్ సిటిజన్స్ అమలు పై విస్తృత చర్చలు జరగబోతున్నాయి.
Also Read: Viral Pic: ఇదేం క్రియేటివిటీ రా బాబు.. మూత్రం పోస్తూ ప్రీ వెడ్డింగ్ ఫోటో స్టిల్స్..
సరిహద్దుల్లో అణువణువు నిరంతరం నిఘాతో పాటు చొరబాటుదారులపై కఠిన చర్యలు, ఉగ్రవాదంపై ప్రహర్ పిడుగు.. ఇవన్నీ కేవలం ఒకే సమయంలో వేగవంతంగా ముందుకు సాగుతుండడం చూస్తుంటే.. అమీషా మౌనం కేవలం నిశ్శబ్దం కాదని.. దేశ భద్రత కోసం జరగబోయే ఒక అద్భుతమైన మార్పునకు నాందని విశ్లేషకులు భావిస్తూ ఉన్నారు. ఈ వ్యూహం అధికారికంగా కార్యరూపం దాల్చితే దేశ రక్షణ చరిత్రలో మరో కావడం ఖాయమని కనిపిస్తోంది..
Also Read: Viral Pic: ఇదేం క్రియేటివిటీ రా బాబు.. మూత్రం పోస్తూ ప్రీ వెడ్డింగ్ ఫోటో స్టిల్స్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Fake Doctors: ఇంటర్‌తో డాక్టర్ అవతారం.. హైదరాబాద్‌లో ఫేక్ డాక్టర్లు కలకలం
Hyderabad, Telangana:Hyderabad Police: ప్రాణం పోసేవారు వైద్యులు.. కానీ వైద్యం చదవాలంటే ఎంతో చదువుకోవాల్సి ఉంది. మరి అలాంటి ఏమీ లేకున్నా.. అర్హత లేకున్నా వైద్యం చేస్తున్న నకిలీ డాక్టర్లు హైదరాబాద్‌లో కలకలం రేపారు. పోలీసుల తనిఖీల్లో ఫేక్ డాక్టర్లు పట్టుబట్టారు. క్లినిక్‌లు పెట్టేసి వైద్య సేవలు అందిస్తున్న కేటుగాళ్లను పోలీసులు అరెస్ట్ చేశారు. ఫేక్ డాక్టర్లు అరెస్టవడంతో హైదరాబాద్‌లో వైద్య సేవలు పొందే రోగులు భయాందోళన చెందుతున్నారు.
'హైదరాబాద్‌లో నకిలీ డాక్టర్ల ముఠాను అరెస్ట్ చేశాం. ఆగస్టు 24న జూబ్లీహిల్స్ జోన్, సికింద్రాబాద్ టాస్క్‌ఫోర్స్, స్థానిక పోలీసులు సంయుక్తంగా వివిధ ప్రాంతాల్లో దాడులు నిర్వహించారు. ఎలాంటి అర్హత లేకుండా డాక్టర్లుగా చలామణి అవుతున్న మొత్తం ఆరుగురు నకిలీ డాక్టర్లను పట్టుకున్నాం' అని టాస్క్‌ఫోర్స్ డీసీపీ గైక్వాడ్ విభవ్ రఘునాథ వెల్లడించారు. క్లినిక్‌లు పెట్టుకుని అమాయక ప్రజలకు వైద్యం పేరిట సెలైన్లు, ఇంజెక్షన్లు ఇస్తున్నారని తెలిపారు.
టాస్క్‌ఫోర్స్ డీసీపీ గైక్వాడ్ విభవ్ రఘునాథ కీలక విషయాలు వెల్లడించారు. కొన్ని సందర్భాల్లో కుట్లు కూడా వేస్తూ.. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతూ అక్రమంగా డబ్బులు సంపాదిస్తున్నారని తెలిపారు. 'మధురానగర్ పీఎస్ పరిధిలో శ్రీ ఆక్వా ఫస్ట్ ఎయిడ్ పేరుతో వైద్యం చేస్తూ మెడిసిన్ ఇస్తున్న డి.రామ శేఖర్ రెడ్డి మెడికల్ షాప్ యజమాని, రాగం సుధాకర్ అనస్థీషియా టెక్నీషియన్లను అరెస్ట్ చేశాం. మెడికల్ షాప్ యజమాని సుధాకర్‌ను పనికి పెట్టుకోగా.. సుధాకర్ తనను తాను డాక్టర్‌గా పరిచయం చేసుకుంటూ రోజుకు 40-50 మందికి వైద్యం చేసేవాడు' అని వివరించారు.
'రహ్మత్‌నగర్‌లో మృదొడ్డి భారతి అనే మహిళ పారామెడికల్ కోర్సు చేసి.. నర్సుగా పనిచేసిన అనుభవంతో నాలుగేళ్లుగా ఎలాంటి అనుమతులు లేకుండా క్లినిక్ నిర్వహిస్తున్నారు. ఆమె చిన్నపిల్లలకు ఇంజెక్షన్లు, సెలైన్లు ఇస్తోంది' అని టాస్క్‌ఫోర్స్ డీసీపీ గైక్వాడ్ విభవ్ రఘునాథ వెల్లడించారు. 'జూబ్లీహిల్స్ పరిధిలోని వెంకటగిరి కటిక మహేశ్ రావు అనే వ్యక్తిని పట్టుకున్నాం. ఇతడు కేవలం ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ చదివి గతంలో ఫుడ్ స్టాల్ నడిపేవాడు. ఇప్పుడు డాక్టర్ అవతారం ఎత్తి రోజుకు 40-50 మందికి వైద్యం చేస్తున్నాడు' అని గైక్వాడ్ విభవ్ రఘునాథ వివరించారు.
'ఫిల్మ్‌నగర్ పరిధిలో సాయి తిరుమల క్లినిక్ పేరుతో పనుగంటి బాల నరసింహను అరెస్ట్ చేశాం. మెడికల్ షాప్ నిర్వహిస్తున్న ఆయన కూతురు ఎంబీబీఎస్ చదివింది. ఆమె పేరు మీద పక్కనే క్లినిక్ పెట్టి తనే స్వయంగా డాక్టర్‌గా వ్యవహరిస్తూ ఫీజులు వసూలు చేస్తూ వైద్యం చేస్తున్నాడు. బోరబండ పరిధిలోని గంగానగర్ ఎండీ అబ్దుల్ వలీని అరెస్ట్ చేశాం. ఇంటర్ ఫెయిలైన అబ్దుల్ వలీ ల్యాబ్ టెక్నీషియన్‌గా పనిచేసిన అనుభవంతో ఒక గది అద్దెకు తీసుకుని క్లినిక్ తెరిచి రోజుకు 10-20 మందికి వైద్యం అందిస్తున్నాడు' అని గైక్వాడ్ విభవ్ రఘునాథ వెల్లడించారు.
'నకిలీ వైద్యుల నుంచి వీరి క్లినిక్‌ల నుంచి భారీగా సిరంజీలు, సెలైన్ బాటిళ్లు, బీపీ మిషన్లు, స్టెతస్కోప్‌లు, సర్జికల్ కత్తెరలు, రకరకాల ఇంజెక్షన్లు, పిల్లల మందులు మరియు కాలం చెల్లిన మందులను సీజ్ చేశాం' అని గైక్వాడ్ విభవ్ రఘునాథ వివరించారు. 'సికింద్రాబాద్ జోన్ పరిధిలోని రాంగోపాల్ పేట్, చిలకలగూడ, ఓయూ సిటీ, దోమలగూడ ప్రాంతాల్లో ఆరుగురు నకిలీ డాక్టర్లను అరెస్ట్ చేశాం. చిలకలగూడలో నకిలీ సర్టిఫికెట్లు సృష్టించి రోగులకు కాలం చెల్లిన మందులు అమ్ముతున్న అదాన్ సమదానిని అరెస్ట్ చేశాం' అని టాస్క్‌ఫోర్స్ పోలీసులు వెల్లడించారు.
'ఇంటర్ మాత్రమే చదివి చర్మ వ్యాధుల డెర్మటాలజిస్ట్‌గా రాంగోపాల్‌పేట్ పరిధిలో క్లినిక్ నడుపుతున్నాడు. క్యాల్షియం పౌడర్, జింక్ ఆక్సైడ్ కలిపి సొంతంగా పెట్రోలియం జెల్ తయారు చేసి రోగులకు ఇస్తున్నాడు. ఎం. శ్రీనివాస్ అనే వ్యక్తి డిగ్రీ చదివి 26 ఏళ్లుగా దోమలగూడలో సాయిరామ్ క్లినిక్ నడుపుతున్నాడు. పెద్దాపట్ల సదానంద్ పదో తరగతి మాత్రమే చదివి చిలకలగూడలో వైద్యం చేస్తున్నాడు. ఓయూ సిటీ పరిధిలో 17 ఏళ్లుగా క్లినిక్‌లు నడుపుతున్న డాక్టర్లు చింతలూరి రమేష్, శివరాత్రి లింగయ్య డిగ్రీ మాత్రమే చదివారు' అని పోలీసులు తెలిపారు.
Jogi Ramesh Family: లోపం ఉన్న కొడుకుతో పెళ్లి చేసి జోగి రమేశ్ నా గొంతు కోశారు: కోడలు మేఘన
Vijayawada, Andhra Pradesh:Ramesh Family Issue: 'జోగి రమేశ్ సానుభూతి కోసం.. రాజకీయం కోసం మాట్లాడినట్లుగా ఉంది. అసలు వాస్తవాలు ఏమిటో నేను పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో వివరించా. అక్కడ నేను ఏం చెప్పానో అవన్నీ వాస్తవాలు అని చెబుతున్నా. ఇప్పుడే బయటపడకున్నా తప్పకుండా త్వరలోనే అన్ని విషయాలు అందరికీ తెలుస్తాయి. మా వివాహమైన తర్వాత ఉన్న ఇబ్బందులను మా మాయయ్య, అత్తయ్యకే వివరించా. సమస్యలను పరిష్కరించకుండా.. అదనపు కట్నం తేవాలంటూ మా అత్తయ్య నన్ను హింసించారు' అని కోడలు మేఘన వెల్లడించారు.
విజయవాడలో మంగళవారం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో జోగి రమేష్ కోడలు మేఘన కీలక అంశాలు వెల్లడించారు. ఇలాంటి రోజు వస్తుందని.. ఆడపిల్లగా ఇలా మాట్లాడాల్సి రావడం చాలా బాధగా ఉందని చెప్పుకొచ్చారు. తనకు జరిగిన అన్యాయాన్ని ఎదుర్కొని గట్టిగా నిలబడ్డానన.. జోగి రమేశ్, ఆయన కుటుంబ సభ్యులు తనపై నిందలు వేస్తున్నారని ఆరోపించారు. '2025 మేలో జోగి రమేశ్ కుమారుడు రాజీవ్‌తో నాకు వివాహమైంది. మా నాన్న ఎంతో సంతోషంతో కష్టపడి ఈ పెళ్లి చేశారు. జోగి రమేశ్ మీద నమ్మకంతో వారింటికి నన్ను కోడలిగా పంపారు. అందరి ఆడపిల్ల లాగానే ఎన్నో ఆశలతో ఆ ఇంట్లో అడుగు పెట్టా' అని మేఘన వెల్లడించారు.
'కానీ కొన్ని రోజులకే నన్ను ఇబ్బందులు పెట్టడం ప్రారంభించారు. ఇద్దరి మధ్య విభేదాలు వచ్చి విడిపోవడం అనేది సహజం. కానీ రాజీవ్‌కు ఉన్న సమస్య ఆ కుటుంబసభ్యులందరికీ తెలుసు. అయినా నాకు అతడితో పెళ్లి చేసి.. తెలిసి తెలిసి అమ్మాయి గొంతు కోయడం అనేది పెద్ద నేరం. జోగి రమేశ్‌కు కూడా ఒక కూతురు ఉంది. ఆమెకు ఇలా జరిగితే ఏం చేస్తారు? అసలు లోపం ఉందని తెలిసి నాతో ఎలా పెళ్లి చేశారో జోగి రమేశ్ చెప్పాలి' అని బాధితురాలు మేఘన నిలదీశారు.
'మాకు రాజకీయ చరిత్ర ఉంది. మేము చెప్పిందే చేయాలని బెదిరించారు. అదనపు కట్నం తీసుకువస్తే నువ్వు సంతోషంగా ఉంటావు. అప్పుడే అతడికి ఫీలింగ్స్ వస్తాయని అత్త మాట్లాడింది. తల్లి స్థానంలో ఉన్న శకుంతల అర్థం చేసుకోకుండా నన్నే తప్పు బట్టారు' అని బాధితురాలు మేఘన వివరించారు. పెళ్లికి ముందు హిందువులం అని చెప్పి తమకు పెళ్లి చేశారని.. కానీ వారి కుటుంబం మొత్తం క్రైస్తవులు అని.. ఇంట్లో హిందూ పూజలు అస్సలు చేయరని ఆరోపించారు.
'నేను చిన్ననాటి నుంచి హిందూ పూజలు చేయడం అలవాటు. నేను వారింటికి వెళ్లిన తర్వాత కూడా ఒక్క హిందూ దేవుళ్ల ఫొటో కూడా లేదు. నేను దేవుళ్ల పొటో తెచ్చి పూజ చేస్తుంటే అడ్డుకుని కొట్టారు. ఎవరి నమ్మకం వాళ్లది కానీ మాకు క్రైస్తవ మతం తీసుకున్నట్లు కూడా చెప్పలేదు. ఇంకా ఇప్పటికీ జోగి రమేశ్ తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. అత్తగా ఉన్న శకుంతల అనేక రకాలుగా నన్ను ఇబ్బందులు పెట్టారు' అని మేఘన వివరించారు.
'కొడుకు లోపం గురించి మాత్రం మాట్లాడకుండా నిందలు నాపై మోపుతున్నారు. నేను పూజలు చేసుకునే సమయంలో అడ్డుకుని చేతిలో ఉన్న హారతి, అగర్బత్తీలు లాగి పడేశారు. మీ దేవుళ్లు కూడా ఒక దేవుళ్లేనా ఇవన్నీ కుదరదు అని ఫొటోలు బయట పడేసి నన్ను కొట్టారు. మీ దేవుడిని నమ్ముకోవడంతోనే నీకు ఇలా జరిగింది. మా దేవుడిని నమ్ముకో నీకు మంచి జరుగుతుందని చెప్పేవారు' అని మేఘన తెలిపారు.
'మతం గురించి చెప్పలేదు. కొడుకు లోపం గురించి చెప్పలేదు. వారికి ముందే తెలిసినా సంబంధం లేని నా గొంతు కోశారు. నీ అత్త తల్లిలాగా, నేను నిన్ను కూతురిలాగా చూసుకున్నా అని జోగి రమేష్ చెబుతున్నారు. అదే జరిగితే.. నేను ఈరోజు ఇలా ఎందుకు రోడ్డు మీదకు వస్తా?' అని మేఘన ప్రశ్నించారు. ఆమె గోరుముద్దులు తినిపించలేదు.. విషపు ముద్దలు తినిపించింది కాబట్టే తన జీవితం ఇలా బలైపోయిందని మేఘన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంలో సీఎం చంద్రబాబును కలిసి న్యాయం చేయాలని కోరతామని ప్రకటించారు.
Ts Employees: పెండింగ్ DAలు, PRC అమలు కోసం.. ఉద్యోగులు ఈ 27న కలెక్టరేట్ల ముట్టడి!
Hyderabad, Telangana:Pending DA News: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగుల తో పాటు పెన్షనర్ల తమ న్యాయమైన హక్కుల కోసం కదం తొక్కబోతున్నారు.. నెలల తరబడి పెండింగ్‌లో ఉన్న తమ డిమాండ్లను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ.. తెలంగాణ ఉద్యోగ సంఘాల ఐక్యత జేఏసీ ఆధ్వర్యంలో ఆగస్టు 27వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా మహాధర్నాకు పిలుపునిచ్చారు. ఈ ఆందోళన కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జిల్లా కేంద్రాలతో పాటు రాజధాని హైదరాబాద్ లో జోరుగా ధర్నా కార్యక్రమం జరగబోతోంది.
ఉద్యోగుల డిమాండ్లు ఇవే..
ప్రభుత్వం ముందు ఉద్యోగ సంఘాలు ప్రధానంగా కొన్ని డిమాండ్లను అందుబాటులోకి తీసుకువచ్చారు. ఇవి ఉద్యోగుల ఆర్థిక, ఆరోగ్య భద్రతకు అత్యంత కీలకమని నాయకులు స్పష్టం చేశారు. ముఖ్యంగా రెండవ పిఆర్సి అమలు కోసం.. నూతన పే రివిజన్ కమిషన్ సిఫారసులను వెంటనే అమలుచేసి.. ఉద్యోగుల వేతన సవరణ చేపట్టాలని కోరారు.. ఆర్థికంగా భారం పడుతున్న నేపథ్యంలో.. పెండింగ్ లో ఉన్న ఆరు DA లను తక్షణమే మంజూరు చేయాలని తెలిపారు..
అంతేకాకుండా కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీంను పూర్తిగా రద్దుచేసి.. ఉద్యోగులకు భద్రత నిచ్చే పాత పెన్షన్ విధానాన్ని తిరిగి తీసుకురావాలని.. ఉద్యోగులతో పాటు పెన్షనర్ల ఆరోగ్య భద్రత కోసం ఉద్దేశించిన నూతన ఎంప్లాయిస్ హెల్త్ స్కీములను మరింత పగర్బందీగా.. సమర్థవంతంగా అమలు చేయాలని కోరారు.. అదేవిధంగా మహాధర్ణాలు అన్ని శాఖల ఉద్యోగులతో పాటు వైద్య ఆరోగ్యశాఖ ఉద్యోగులు కూడా అత్యంత క్రియాశీలక పాత్ర పోషించాలని TGEJAC కోరింది.
రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖకు సంబంధించిన అన్ని సంఘాల నాయకులతో పాటు సభ్యులు పెద్ద సంఖ్యలో కదిలి రావాలని విజ్ఞప్తి చేసింది. ఉద్యోగ సంఘాల ఐక్యమత్యతను చాటిచెప్పేందుకు ఇది సరైన సమయం అని నాయకులు ఈ సమయంలో గుర్తు చేశారు.. ఒకవేళ ప్రభుత్వం వీరి డిమాండ్లకు దిగివస్తే.. ఉద్యోగులందరికీ తప్పకుండా పెండింగ్‌లో ఉన్న ఆరు డిఏలు మంజూరు అవ్వడమే కాకుండా.. డిమాండ్లన్నీ నెరవేరే అవకాశాలున్నాయి. కాబట్టి.. 27న జరిగే ఈ ఉద్యోగుల ధర్నాలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం చర్చలకు వస్తుందో లేదో చూడాల్సిందే..
Also Read: Eshwar Sai: బాసింగా బాసింగా సాంగ్ ఫేమ్ ఈశ్వర్‌సాయి రాసలీలలు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
వామ్మె.. నడిరోడ్డుపై పడగ విప్పిన రెండు భారీ నాగుపాములు.. వీడియో వైరల్!
Hyderabad, Telangana:King Cobras Video Watch Now: సోషల్ మీడియాలో ప్రతిరోజు ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి. అయితే కొన్ని వీడియోలు మాత్రం సోషల్ మీడియా వినియోగదారులను ఎప్పుడూ ఆశ్చర్యానికి గురి చేసేలా చేస్తూ ఉంటాయి. తాజాగా యూట్యూబ్ ఛానల్ నుంచి షేర్ చేసిన షార్ట్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చెక్ చేస్తుంది. అంతేకాకుండా అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. అత్యంత విషపూరితమైన రెండు నాగుపాములు రహదారిపై పడగలెత్తి బుసలు కొడుతున్న దృశ్యాలు సోషల్ మీడియా వినియోగదారులను ఆశ్చర్యపోయేలా చేస్తున్నాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
వైరల్ అవుతున్న వీడియోలో పచ్చని చెట్ల మధ్య ఉన్న ఒక నిర్మానుష్య రహదారిపై భారీ రెండు పడగ విప్పిన పాములు కనిపించడం మీరు ఈ వీడియోలో క్లియర్ గా చూడొచ్చు. కెమెరా వైపు చూస్తూ అవి దూకుడుగా పడక విప్పిన తీర్ అత్యంత భయానకంగా ఉంది. ఒక్కసారిగా ఆ రెండు పాములు వాటి శరీరాలను పైకి లేపి శత్రువుపై దాడికి సిద్ధంగా ఉన్నట్లు కనిపించడంతోపాటు బుసలు కొట్టడం చూస్తుంటే ఓ ప్రత్యేకమైన త్రిల్లింగ్ అనుభూతికి కలగక తప్పదు..
ఈ వీడియో యూట్యూబ్‌లో అప్లోడ్ అయిన కొద్ది రోజుల్లోనే ఊహించని స్థాయిలో వ్యూస్ ను సొంతం చేస్తుంది. అంతేకాకుండా లక్షలాదిమంది సోషల్ మీడియా వినియోగదారులు ఈ వీడియోను లైక్ చేసినట్లు తెలుస్తోంది. ఇక ఈ వీడియోను చూసిన చాలా మంది కామెంట్లు కూడా పెడుతూ వచ్చారు.. కామెంట్లకు సంబంధించిన వివరాల్లోకి వెళ్తే.. ఇంత దగ్గర్నుంచి ఇలాంటి విశేషాలు చూడడం ఇదే మొదటిసారి అని కామెంట్లు పెడుతున్నారు. ప్రకృతి సృష్టించిన అత్యంత అందమైన.. అత్యంత ప్రమాదకరమైన జీవులు ఇవి అంటూ మరికొందరు కామెంట్లు పెడుతున్నారు..
Also Read: Viral Pic: ఇదేం క్రియేటివిటీ రా బాబు.. మూత్రం పోస్తూ ప్రీ వెడ్డింగ్ ఫోటో స్టిల్స్..
నాగుపాము భారత దేశంలో కనిపించే అత్యంత విషపూరితమైన పాముల్లో ఒకటి. దీని కాటు అత్యంత ప్రమాదకరమైందని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి ఈ పాములు కనిపించిన సమయంలో తప్పకుండా వీటికి దూరంగా ఉంటేనే చాలా మంచిదని వారు తెలుపుతున్నారు. లేదంటే దాడి చేసి ప్రాణాలను తీసే అవకాశాలున్నాయి. ముఖ్యంగా వర్షాకాలం లేదా పచ్చదనం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో.. పొలాల గట్ల వద్ద ఇలాంటి పాములు సంచరించే అవకాశం ఉందని నిపుణులు తెలుపుతున్నారు. ఒకవేళ ఇలాంటి పాములు కనిపిస్తే వాటిని చంపేయకుండా వన్యప్రాణి సిబ్బందికి లేదా స్నేక్ క్యాచెస్ కి సమాచారం అందించడం చాలా మంచిది.
Also Read: Viral Pic: ఇదేం క్రియేటివిటీ రా బాబు.. మూత్రం పోస్తూ ప్రీ వెడ్డింగ్ ఫోటో స్టిల్స్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Gold Discovery: మేక కోసం వెళ్తే బంగారు గని దొరికింది.. ఈ పల్లెటూరిలో భారీగా గోల్డ్!
Hyderabad, Telangana:Lost Goat Leads Man To Gold In Kenya: అదృష్టం ఎవరిని ఎప్పుడు ఎలా ఏ రూపంలో తలుపు తడుతుందో తెలియదు. ఒక పేద జీవితాన్ని ఒక తప్పిపోయిన మేక రాత్రికి రాత్రే మార్చేసింది.. మేకను వెతుక్కుంటూ వెళ్లిన ఆ యువకుడికి ఏకంగా బంగారమే దొరికింది.. ఈ వార్త ఊహించని స్థాయిలో వ్యాప్తి చెందడంతో.. ఇప్పుడు ఆ చిన్న పల్లెటూరికి వేలాది మంది క్యూ కడుతున్నారు.. పారలతో పాటు గుణపాలు పట్టుకొని తవ్వకాలు మొదలు పెట్టేసారు. ఆఫ్రికాలోని కెన్యాలో జరిగిన ఈ ఆసక్తికరమైన సంఘటన ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. దీనికి సంబంధించిన అన్ని రకాల వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం..
పశ్చిమ కన్యాలోని వెస్ట్ పోకోట్ కౌంటీకి చెందిన.. చేపోరేర్ అనే ఒక మారుమూల గ్రామం ఇప్పుడు ఈ బంగారు వేటకు అద్భుతమైన వేదిక అయింది. మన్సే లోమాచార్ అనే ఓ గొర్రెల కాపరి కొన్ని వారాల క్రితం తన తప్పిపోయిన మేకను వెతుక్కుంటూ అడవిలోకి వెళ్లేసాడు.. అక్కడ ఒక నది ఒడ్డున కొంతమంది మహిళలు మట్టిలో ఏదో వెతుకుతుండడం అతను చూశాడు.. వాళ్ళు అక్కడ బంగారం కోసం గాలిస్తున్నారని తెలుసుకున్న అతను.. మన్సే కూడా వారితో వెతికేందుకు ప్రయత్నించాడు. ఆశ్చర్యకరంగా అతనికి ఏకంగా మూడు గ్రాముల సహజసిద్ధమైన బంగారం దొరికింది. బంగారాన్ని మార్కెట్లో విక్రయించగా దాదాపు భారత కరెన్సీలో రూ.26 వేల రూపాయల వరకు వచ్చింది..
అతను బంగారం దొరికిన విషయం.. అతనికి వచ్చిన డబ్బుల గురించి ఆ నోట ఈ నోట చుట్టుపక్కల ప్రాంతాలకు పాకింది.. ఇంకేముంది రాత్రికి రాత్రే.. ఆ గ్రామానికి జనాలు పోటెత్తారు.. ఒకానొక దశలో దాదాపు పదివేల మంది బయటి వ్యక్తులు ఇక్కడికి చేరుకొని గుట్టలు చెట్లు పొదలు అని తేడా లేకుండా ఎక్కడపడితే అక్కడ తవ్వకాలు మొదలు పెట్టేసారు.. చేతిలో పారతో పాటు గుణపంతో మట్టిని తవ్వుతూ.. నదిలో జల్లెడ పడుతూ ఎవరికి వారు అదృష్టాన్ని పరీక్షించుకోవడం మొదలుపెట్టారు.. అయితే అందరికీ బంగారం దొరకకపోవడంతో కొందరు ఎలా వచ్చిన దారిలో అలా వెళ్ళిపోయారు.. ప్రస్తుతం ఇంకా ఇక్కడ 2500 మందికి పైగా బంగారం వేటను కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది..
బంగారం కోసం వేలమంది తరలి రావడంతో ఆ గ్రామం రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి.. నిశ్శబ్దంగా ఉండే ఆ పల్లెటూరి ఇప్పుడు ఒక జాతరను తలపిస్తోంది.. వచ్చిన వారి కోసం స్థానికులు కొత్తగా 200లకు పైగా దుకాణాలు కూడా తెరిచా.. ఆహారంతో పాటు తాగునీరు కోసం రోజు వారి వస్తువులను విక్రయించడంతో స్థానికులకు ఊహించని స్థాయిలో ఉపాధి లభించింది. ఈ గ్రామం ఉగాండా సరిహద్దులకు దగ్గరగా ఉండడంతో.. పొరుగు దేశం నుంచి కూడా జనాలు ఇక్కడికి క్యూ కడుతున్నారు..
నిజానికి ఆ ప్రాంతంలో ఉండే మహిళలు ఎప్పటినుంచో నదిలో బంగారం వెతుకుతూ వారానికి 8 నుంచి 23 డాలర్లు సంపాదిస్తున్నారు. కానీ..మన్సేకు ఒక్కసారి ఏకంగా భారీ మొత్తంలో బంగారం దొరకడంతో ఈ ప్రాంతం ఉన్నట్టుండి వెలుగులోకి వచ్చింది.. ఏది ఏమైనా తప్పిపోయిన ఒక చిన్న మేక.. మారుమూల గ్రామాన్ని ప్రపంచ పటంలో నిలబెట్టేలా చేసింది..
Also Read: Viral Pic: ఇదేం క్రియేటివిటీ రా బాబు.. మూత్రం పోస్తూ ప్రీ వెడ్డింగ్ ఫోటో స్టిల్స్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
