చర్లపల్లి జోరువానలో కూలీ పనికి వచ్చిన ఓ బాలికను చూసి సంజయ్ కారు ఆపాడు
Karimnagar, Telangana:కరీంనగర్ పార్లమెంటరీ నియోజకవర్గ పర్యటనకు వచ్చిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఈరోజు మధ్యాహ్నం చొప్పదండి నియోజకవర్గం చర్లపల్లిలో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు వెళ్లి తిరిగి వస్తున్నారు. కూలీల గుంపులో ఓ మైనర్ బాలికను చూసి.. 'అమ్మా.. పనికి వెళ్తున్నావా? నీకు చదువుకోవాలని అనిపించలేదా నీ కుటుంబ పరిస్థితి గురించి అడిగాడు. తన పేరు బొల్లా అక్షయ్ అని, తాను 10వ తరగతి పాసయ్యానని, అయితే ఆర్థిక పరిస్థితి బాగాలేకపోవడంతో కూలీ పనులకు వెళ్తున్నానని బదులిచ్చారు.
हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
Bigg Boss 10 Telugu: బిగ్‌బాస్ తెలుగు 10 హౌస్‌లోకి వెళ్లిన సెలబ్రిటీలు వీళ్లే..యూట్యూబర్ ఆదిరెడ్డి వీడియో వైరల్!
Hyderabad, Telangana:Bigg Boss 10 Telugu Contestants: మరికొద్ది గంటల్లో ప్రారంభం కానున్న 'బిగ్ బాస్ తెలుగు సీజన్ 10' గ్రాండ్ లాంచ్ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ల్యాండ్ మార్క్ సీజన్ కావడంతో షోలో సరికొత్త సర్ ప్రైజింగ్ ఎలిమెంట్స్, మార్పులు ఉంటాయని హోస్ట్ నాగార్జున, నిర్వాహకులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో హౌస్‌లోకి అడుగుపెట్టే కంటెస్టెంట్ల గురించి తీవ్ర ఉత్కంఠ నెలకొనగా, మాజీ కంటెస్టెంట్, ప్రముఖ యూట్యూబర్ ఆదిరెడ్డి ఈ సీజన్ ఫైనల్ కంటెస్టెంట్ల జాబితాతో కూడిన ఒక ప్రత్యేక వీడియోను విడుదల చేశారు. గతంలో ఆదిరెడ్డి చేసిన అంచనాలు చాలా వరకు నిజం కావడంతో ఈ క్రేజీ జాబితా సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.
ముఖ్యంగా గేమ్స్, టాస్కుల్లోనూ చాలా మార్పులు చేశారని సమాచారం. ప్రేక్షకులకు సరికొత్త అనుభూతితో పాటు డబుల్ ఎంటర్ టైన్మెంట్ అందించేవారినే ఈసారి కంటెస్టెంట్స్ గా ఎంపిక చేశామంటూ బిగ్ బాస్ మేకర్స్ వెల్లడిస్తున్నారు.
ఈ తరుణంలో హౌస్‌లోకి వెళ్లే సెలబ్రిటీల గురించి సామాజిక మాధ్యమాల్లో రకరకాల పేర్లు వినిపిస్తున్నాయి. వీటిలో సినీ, టీవీ రంగాల ప్రముఖులతో పాటు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, యూట్యూబర్లు ఉన్నారు.
అయితే, గత సీజన్లలో కంటెస్టెంట్ల గురించి ఖచ్చితమైన అంచనాలు వేసిన ఆదిరెడ్డి, ఈ సారి కూడా ఫైనల్ లిస్ట్‌ను బల్లగుద్ది మరీ చెప్పారు. ఆయన విడుదల చేసిన అంచనా ప్రకారం హౌస్‌లోకి రాబోయే 16 మంది కంటెస్టెంట్స్ వీరే..
1) అదిత్ ఈశ్వరన్: 'చెన్నై లవ్ స్టోరీ' సినిమాలో సెకండ్ హీరో.
2) ముఖేష్ గౌడ అలియాస్ రిషి: ప్రముఖ టీవీ సీరియల్ నటుడు.
3) రోహిత్: సామాన్యుడి (కామనర్) కేటగిరీ కింద ఎంపికైన కంటెస్టెంట్.
4) కృష్ణుడు: 'వినాయకుడు' సినిమా హీరో.
5) శాలినీ
6) జబర్దస్త్ ఆటో రామ్ ప్రసాద్: ప్రముఖ కామెడీ నటుడు
7) టెంపర్ వంశీ
8) సృష్టి వ్యాకరణం
9) ఆర్జే చరణ్: 'అగ్నిపరీక్ష' కంటెస్టెంట్
10) యాంకర్ వర్షిణీ సౌందర రాజన్
11) ఝాన్సీ: రైతు, సింగర్, 'అగ్నిపరీక్ష' కంటెస్టెంట్
12) 'జబర్దస్త్' నరేష్
13) దేబ్జానీ మోదక్: సీరియల్ నటి
14) చైత్ర రాయ్: ప్రముఖ సీరియల్ నటి
15) నవరసాలు ఆర్కే: 'అగ్నిపరీక్ష' కామనర్ కంటెస్టెంట్
16) సుధీర్ రెడ్డి: పోడ్కాస్టర్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్
ఆదిరెడ్డి వెల్లడించిన ఈ ఆసక్తికరమైన జాబితా ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ ఆదివారం సాయంత్రం జరిగే గ్రాండ్ లాంచ్‌తో ఈ పేర్లపై తుది అధికారిక స్పష్టత రానుంది.
Also Read: 100 రోజులకు రూ.80 లక్షలు..బిగ్‌బాస్ చరిత్రలో అత్యధికంగా సంపాదించింది ఎవరో తెలుసా?
Also Read: బిగ్‌బాస్ ఆఫర్ తిరస్కరించిన సెలబ్రిటీలు వీళ్లే.. లక్షల్లో రెమ్యునరేషన్ ఇచ్చినా 'నో'
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Gold Price Today: బంగారం ప్రియులకు గుడ్‌న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధరలు..ఈరోజు రేట్స్ ఎలా ఉన్నాయంటే?
Hyderabad, Telangana:Gold Price India Today: భారతదేశంలో సెప్టెంబర్ 5న ప్రధాన నగరాలైన చెన్నై, ముంబై, ఢిల్లీ, హైదరాబాద్, బెంగళూరులలో బంగారం ధరలు స్వల్ప తగ్గుదలను నమోదు చేశాయి. 'గుడ్ రిటర్న్స్' తాజా సమాచారం ప్రకారం.. దేశీయంగా ఈరోజు 24 క్యారెట్ల బంగారం ధర గ్రాముకు రూ.15,480గా ఉండగా, 22 క్యారెట్ల ధర రూ.14,190, 18 క్యారెట్ల ధర రూ.11,610గా నమోదైంది. నిన్నటితో (సెప్టెంబర్ 4) పోలిస్తే 24 క్యారెట్ల బంగారం ధరపై రూ.186 తగ్గగా, 22 క్యారెట్లపై రూ.170.. అలాగే 18 క్యారెట్లపై రూ.139 మేర తగ్గుదల నమోదైంది.
అయితే, పశ్చిమ ఆసియా (మధ్యప్రాచ్యం)లో కొనసాగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ఇంధన మార్కెట్లో నెలకొన్న అస్థిరత కారణంగా విలువైన లోహాల ధరలలో రోజువారీ హెచ్చుతగ్గులు కొనసాగుతున్నాయి. సురక్షితమైన పెట్టుబడిగా బంగారం వైపు ఇన్వెస్టర్లు మొగ్గు చూపుతున్నారు.
నగరాల వారీగా ధరల వివరాలు
దేశంలోని వివిధ నగరాల్లో బంగారం ధరలు కింది విధంగా ఉన్నాయి.
చెన్నై: 24 క్యారెట్ల బంగారం గ్రాముకు రూ. 15,667 కాగా.. 22 క్యారెట్లు రూ. 14,361.. 18 క్యారెట్లు రూ. 12,131గా ఉంది. ఇక్కడ ధరలు అత్యధికంగా నమోదయ్యాయి.
హైదరాబాద్, ముంబై, బెంగళూరు, కోల్‌కతా, పూణే.. ఈ నగరాలన్నింటిలోనూ ధరలు ఒకేలా ఉన్నాయి. 24 క్యారెట్ల బంగారం ధర గ్రాముకు రూ.15,480, 22 క్యారెట్లు రూ. 14,190.. 18 క్యారెట్లు రూ. 11,610గా ఉన్నాయి.
ఢిల్లీ: 24 క్యారెట్లు రూ. 15,495 కాగా, 22 క్యారెట్లు రూ. 14,205.. 18 క్యారెట్లు రూ. 11,625గా ఉంది.
అహ్మదాబాద్ & వడోదర: 24 క్యారెట్లు రూ. 15,485, 22 క్యారెట్లు రూ. 14,195.. 18 క్యారెట్లు రూ. 11,615గా నమోదైంది.
అంతర్జాతీయ ఉద్రిక్తతలు, ముడి చమురు సంక్షోభం
బంగారం ధరల హెచ్చుతగ్గులకు అంతర్జాతీయ పరిణామాలు బలమైన కారణంగా మారుతున్నాయి. ముఖ్యంగా ఇరాన్, అమెరికాల మధ్య సైనిక ఘర్షణలు తీవ్రరూపం దాల్చాయి. ఇరాన్‌లోని 'పికాక్స్ మౌంటైన్' పై "చాలా త్వరగా" దాడి చేస్తానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించగా, ఏ విధమైన ఘర్షణనైనా ఎదుర్కొనేందుకు సిద్ధమని ఇరాన్ వైమానిక రక్షణ దళ కమాండర్ బ్రిగేడియర్ జనరల్ అలీరేజా ఎల్హామి స్పష్టం చేశారు.
మరోవైపు, గాజా నుండి ప్రజలను తరలించాలన్న ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్ ప్రతిపాదనను తిరస్కరిస్తూ, పాలస్తీనియన్ల బహిష్కరణను సమర్థించబోమని అమెరికా విదేశాంగ శాఖ తెలిపింది. ఈ ఉద్రిక్తతల వల్ల వాణిజ్య నౌకలపై క్షిపణి దాడులు పెరిగాయి. దీనితో వాషింగ్టన్, టెహ్రాన్ల మధ్య జూన్ 2026లో కుదిరిన 60 రోజుల కాల్పుల విరమణ ఒప్పందం విఫలమైంది.
మరోవైపు సౌదీ అరేబియా ముడి చమురు ఎగుమతులు రోజుకు 3 మిలియన్ బ్యారెళ్లకు పడిపోయి, 9 ఏళ్ల కనిష్టానికి చేరుకోవడంతో చమురు ధరలు ఆరు వారాల గరిష్టానికి చేరాయి. ఈ ఆర్థిక అస్థిరతల నేపథ్యంలో దౌత్య మార్గాలు దెబ్బతినడంతో, పెట్టుబడిదారులు సురక్షితమైన ఆశ్రయంగా బంగారం వైపు మళ్లడం వల్ల ధరలలో నిరంతరం మార్పులు చోటుచేసుకుంటున్నాయి.
Also Read: 40 ఏళ్లకే ఉద్యోగం మానేస్తున్నారా? మీ ఈపీఎఫ్ నిధులపై వడ్డీ వస్తుందా? పూర్తి వివరాలు
Also Read: 100 రోజులకు రూ.80 లక్షలు..బిగ్‌బాస్ చరిత్రలో అత్యధికంగా సంపాదించింది ఎవరో తెలుసా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Nagamani Video: నాగమణికి కోబ్రా కాపలా.. వైరల్ వీడియో మీరు చూశారా?
Hyderabad, Telangana:Nagamani Video Viral: పురాణాలతో పాటు అనేక ఇతిహాసాల్లో, జానపద కథల్లో నాగమణి గురించి ఎన్నో ప్రస్తావనలు ఉన్నాయి.. నాగమణిని నాగుపాములు తమ ప్రాణాల కంటే ఎక్కువగా కాపాడుకుంటాయని.. వాటి దగ్గరికి ఎవ్వరిని రానివ్వమని పెద్దలు కొన్ని కథల్లో చెప్పేవారు.. కాలక్రమేన ఇవన్నీ కేవలం కల్పిత కథలని చాలామంది భావిస్తూ ఉంటారు.. అయితే సరిగ్గా అలాంటి నమ్మకాలనే నిజం చేసేలా తాజాగా ఇన్స్టాగ్రామ్ లో వెలుగులోకి వచ్చిన ఒక వీడియో సోషల్ మీడియా వినియోగదారులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. అసలు ఈ వీడియో ఏంటి? దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం..
ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఒక అద్భుతమైన కాంతితో ధగధగ మెరుస్తున్న నాగమణి నేలపై కనిపించడం మీరు చూడొచ్చు.. ఆశ్చర్యకరంగా.. ఆ ప్రకాశవంతమైన మణికి అత్యంత సమీపంలో ఒక ప్రమాదకరమైన భారీ కోబ్రా పడక విప్పి రక్షణ వలయంగా నిలబడి ఉండడం మీరు గమనించవచ్చు. ఎవరైనా ఆ మణిని తాకడానికి వస్తే కాటు వేయడానికి సిద్ధంగా ఉన్నట్లు ఆ పాము ఉగ్రరూపం దాల్చి ఉండడం మీరు ఈ వీడియోలో క్లియర్ గా చూడొచ్చు.. ఆ పాము నాగమణికి రక్షణగా నిలుస్తున్నట్లు ఈ వీడియో భావన..
ఈ ఘటన ఎక్కడ జరిగింది. ఈ అరుదైన దృశ్యాన్ని ఎవరు చిత్రీకరించారు? అనే వివరాలు ఇంకా వెలుగులోకి రాలేదు.. అయినప్పటికీ.. మెరుస్తున్న నాగమణి పక్కనే పడగవిప్పి కోబ్రా ఎంతో భయంకరంగా ఉగ్రరూపం దాల్చి.. రక్షణగా నిలిచిన వైనం సోషల్ మీడియా వినియోగదారులను ఎంతగానో ఆకట్టుకుంటుంది.. అయితే ఈ వీడియో చూసిన చాలా మంది సోషల్ మీడియా వినియోగదారులు వివిధ రకాలుగా స్పందిస్తూ వస్తున్నారు.
Also Read: 20 ఏళ్ల వయస్సును తగ్గించుకున్న 68 ఏళ్ల వ్యక్తి.. ఎలా సాధ్యం ఇది?
ఈ వీడియో ఇంస్టాగ్రామ్ తో పాటు ఇతర సోషల్ మీడియాలో కూడా ఊహించని స్థాయిలో వైరల్ అవుతూ వస్తోంది. కొంతమంది సోషల్ మీడియా వినియోగదారులు భక్తి భావంతో కామెంట్లు పెడుతూ.. గతంలో మాత్రమే విన్న అద్భుతమైన రూపంలో దర్శనమిచ్చిందని.. ఇది ప్రకృతిలో దాగివున్న దైవిక శక్తులకు నిదర్శనమని నమ్ముతూ కామెంట్లు పెడుతూ వస్తున్నారు.. ఇక మరికొంతమంది ఇది కేవలం కంప్యూటర్ గ్రాఫిక్స్ ను వినియోగించి పామును అలా డిజైన్ చేసి.. నాగమణిని పెట్టారని కామెంట్లలో పెడుతున్నారు.. ఇక మరి కొంతమంది ఎల్ఈడి బల్బు పెట్టి.. పెంచుకుంటున్న నాగుపామును అక్కడ పెట్టి వీడియో తీశారని కామెంట్లలో చెబుతూ వస్తున్నారు. ఏది ఏమైనా చాలామంది ఈ వీడియోను నిజమైన వీడియోగా విశ్వసిస్తున్నారు..
Also Read: 20 ఏళ్ల వయస్సును తగ్గించుకున్న 68 ఏళ్ల వ్యక్తి.. ఎలా సాధ్యం ఇది?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook ..
Canadian Woman Nude Rituals: విదేశీ మహిళతో నగ్నంగా పూజలు చేసిన జోతిష్య్కుడు..వీడియో రికార్డు చేసి బెదిరింపులు!
Chennai, Tamil Nadu:Canadian Woman Nude Rituals News: పోలీసుల కథనం ప్రకారం.. కెనడా పౌరసత్వం కలిగిన శ్రీలంక తమిళురాలైన ఒక 37 ఏళ్ల మహిళ ఇటీవల తమిళనాడుకు వచ్చారు. ఆధ్యాత్మికతపై అమితమైన ఆసక్తి కలిగిన ఆమె గత కొన్ని నెలలుగా చెన్నైలోని కోడంబాక్కంలో నివసిస్తున్నారు. గతంలో ఆమె ఒక టెలివిజన్ కార్యక్రమంలో కూడా పాల్గొన్నారు. ఇటీవల ఆమె చెన్నైలోని బెసెంట్ నగర్ బీచ్‌కి వెళ్లిన సమయంలో, అక్కడ చిలుక జ్యోతిష్యం చెప్పే ఇసాక్కిముత్తు అనే వ్యక్తి ఆమెకు పరిచయమయ్యాడు.
ఆమె అతని వద్దకు వెళ్లి జ్యోతిష్యం చెప్పాలని అడగగా, ఆమెను తాను టీవీలో చూశానని, తాను చెప్పినట్లు చేస్తే జీవితంలో ఇంకా ఉన్నత స్థాయికి చేరుకుంటారని నమ్మబలికి ఆమె నమ్మకాన్ని పూర్తిగా చూరగొన్నాడు. ఆమె గ్రహాల స్థితిగతుల వల్ల జీవితంలో కొన్ని సమస్యలు ఉన్నాయని, వాటి పరిష్కారానికి తమిళనాడులోని ఒక ఆలయంలో ప్రత్యేక పూజ నిర్వహించాల్సి ఉంటుందని ఇసాక్కిముత్తు నమ్మించాడు.
ఈ పూజకు దాదాపు రూ. 70,000 వరకు ఖర్చవుతుందని తెలిపాడు. అదే సమయంలో అర్ధరాత్రి జరిగే వీడియో కాల్లో ఆమె నగ్నంగా పూజలో పాల్గొంటేనే అనుకున్నది నెరవేరుతుందని సదరు మహిళను ఒప్పించాడు. అతని మాటలను గుడ్డిగా నమ్మిన ఆ విదేశీ మహిళ అతను చెప్పినట్లుగానే వీడియో కాల్లో నగ్నంగా పూజలో పాల్గొంది. ఈ పూజ కోసం ఆమె మొదట రూ.20,000 లేదా రూ.70,000 వరకు నగదును చెల్లించింది.
అయితే, ఆ కాల్ ముగిసిన వెంటనే జ్యోతిష్యుడు ఇసాక్కిముత్తు తన అసలు స్వరూపాన్ని బయటపెట్టాడు. తన వద్ద ఆమెకు సంబంధించిన నగ్న వీడియో రికార్డు ఉందని, దానిని సామాజిక మాధ్యమాల్లో, ఆన్లైన్లో పోస్టు చేయకుండా ఉండాలంటే తనకు రూ.5 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ బ్లాక్‌మెయిల్‌కు దిగాడు. దీనితో తీవ్ర ఆందోళనకు గురైన బాధితురాలు బుధవారం చెన్నైలోని మాంబళం మహిళా పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది.
బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా పోలీసులు భారతీయ న్యాయ సంహిత (BNS), ఐటీ (IT) చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. విచారణ చేపట్టిన పోలీసులు, బాధితురాలు మొదట డబ్బులు బదిలీ చేసిన బ్యాంక్ ఖాతా వివరాలు, నిందితుడి మొబైల్ ఫోన్ నెట్వర్క్ సిగ్నల్స్ ఆధారంగా దర్యాప్తు జరిపారు. చివరకు గురువారం రాత్రి తెన్కాసి జిల్లా కోర్టాలమ్లో ఇసాక్కిముత్తు ఆచూకీ కనుగొని అతన్ని విజయవంతంగా అరెస్టు చేశారు. నిందితుడిని చెన్నైకి తీసుకువచ్చి రిమాండ్‌కు తరలించారు.
Also Read: 40 ఏళ్లకే ఉద్యోగం మానేస్తున్నారా? మీ ఈపీఎఫ్ నిధులపై వడ్డీ వస్తుందా? పూర్తి వివరాలు
Also Read: మీ వీధిలో వినాయక మండపం పెడుతున్నారా? ఒకే క్లిక్‌తో పోలీస్ పర్మిషన్..రూ.1 ఖర్చు లేదు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
సెప్టెంబర్ 7 నుంచి భద్రా రాజయోగం.. ఈ 4 రాశుల వారికి ఊహించని గోల్డెన్ జాక్‌పాట్..
Hyderabad, Telangana:Bhadra Raj Yoga Effect On Zodiac: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బుధ గ్రహాన్ని తెలివితేటలు వాక్చాతుర్యం వ్యాపారం ధనానికి అధిపతిగా సూచిస్తూ ఉంటారు. అయితే, బుధుడు తన ఉచ్ఛరాశి అయిన కన్యా రాశిలోకి ప్రవేశించినప్పుడు పంచ మహాపురుష రాజయోగాల్లో తప్పకుండా ఒకటి ఏర్పడుతూ ఉంటుంది. ఇదిలా ఉంటే ఈ సమయంలో ఎంతో శక్తివంతమైన భద్రా రాజయోగం ఏర్పడబోతోంది. దీని ప్రభావం అన్ని రాశుల వారిపై పడుతుంది. సెప్టెంబర్ 7వ తేదీన కన్యా రాశిలోకి బుధుడు సంచారం చేయడం కారణంగా ఈ రాజయోగం ఏర్పడుతుంది. అయితే, దీనికి చాలా ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుందని జ్యోతిష్య శాస్త్రం నిపుణులు చెబుతున్నారు. ఈ యోగ ప్రభావంతో ఈ క్రింది రాశుల వారి జీవితాల్లో కీలకమైన మార్పులు వస్తాయి. ఈ సమయంలో ఏ రాశుల వారి జీవితాల్లో ఎలాంటి మార్పులు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం..
ఈ రాశులవారికి ఊహించని జాక్‌ఫాట్!
వృషభరాశి
సెప్టెంబర్ 7వ తేదీన బుధుడు ఏర్పరచబోతున్న ఎంతో శక్తివంతమైన భద్రా రాజయోగం ప్రభావంతో ఈ సమయంలో వృషభ రాశి వారికి అద్భుతమైన ప్రయోజనాలు కలగబోతున్నాయి. ముఖ్యంగా ధన సంబంధిత కోరికలు సులభంగా నెరవేరబోతున్నాయి.. వ్యాపారాల్లో అద్భుతమైన వృద్ధ లభించబోతోంది. ప్రధానమైన సమస్యను పూర్తిగా పరిష్కారమై అన్ని రంగాల్లో విజయాలు సాధించబోతున్నారు. అంతేకాకుండా ఆస్తులకు సంబంధించిన వివిధ అంశాల్లో అనేక మార్పులు వస్తాయి. వ్యాపారాల్లో వృద్ధులబించి అనుకున్న మొత్తంలో ధన లాభాలు కూడా సొంతం చేసుకుంటారు..
మిథున రాశి
ఎంతో శక్తివంతమైన రాజయోగం ప్రభావంతో మిథున రాశి వారికి ఈ సమయంలో అదృష్టం విపరీతంగా పెరుగుతుంది. గొప్ప విజయాలు సాధించడమే కాకుండా ఉద్యోగాల్లో పురోగతి లభిస్తుంది. అంతేకాకుండా ప్రమోషన్స్ లభించి.. మీపై అధికారుల నుంచి అద్భుతమైన ప్రశంశాలు పొందుతారు. అంతేకాకుండా కొత్త కారును కొనుగోలు చేయాలనుకుంటున్న వ్యక్తులకు ఈ సమయం ఎంతో అద్భుతంగా ఉంటుంది. అలాగే డబ్బు సమస్యలు కూడా సులభంగా పరిష్కారం అవుతాయి. ముఖ్యంగా ఎలాంటి సమస్యలు ఎదురైనా ఆందోళన చెందాల్సిన అవసరం లేకుండా ముందుకు నడవాల్సి ఉంటుంది.
కన్య రాశి
కన్యా రాశి వారికి ఈ సమయం సువర్ణ అవకాశాలను అందిస్తుంది. ముఖ్యంగా భారీ ధన లాభాలు కలగడమే కాకుండా డబ్బుకు ఎలాంటి కొరత ఉండదని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఉద్యోగాలతో పాటు వ్యాపారాలపరంగా విశేషమైన ప్రయోజనాలు చేకూరుతాయి. అలాగే కుటుంబంలో మంచి మంచి ప్రయోజనాలు పొందగలుగుతారు.. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య దూరం పూర్తిగా తొలగిపోయి అనుకున్న లాభాలు సొంతం చేసుకోగలుగుతారు. కోరుకున్న కోరికలు సులభంగా నెరవేరబోతున్నాయి.
మకర రాశి
మకర రాశిలో జన్మించిన వ్యక్తులకు ఈ శక్తివంతమైన రాజయోగ ప్రభావంతో విశేషమైన ప్రయోజనాలు కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. వీరికి అకస్మాత్తుగా డబ్బులు లభించి విశేషమైన ధన లాభాలు సొంతం చేసుకుంటారు. అలాగే డబ్బుకూరత కూడా తీరిపోయి.. పొదుపు విపరీతంగా పెరుగుతుంది. ఉద్యోగంలో కూడా మంచి అభివృద్ధి లభిస్తుంది. వ్యాపారంలో పడ్డ కష్టాలు కూడా సులభంగా తీరిపోయి.. మంచి లాభాలు పొందగలుగుతారు. అలాగే ఎప్పటినుంచో అనుకుంటున్న వస్తువులు కూడా సులభంగా కొనుగోలు చేస్తారు.
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
గమనిక.. 
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook ..
CM Chandrababu PRC DA: ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు..పీఆర్సీ, డీఏల చెల్లింపుపై నేడే సీఎం కీలక ప్రకటన!
Vijayawada, Andhra Pradesh:AP Employees PRC DA News: ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారం దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. తమకు అందాల్సిన ఆర్థిక బకాయిల చెల్లింపుల కోసం ఉద్యోగ సంఘాలు పోరుబాట పట్టడం, కొన్ని సంఘాలు దశల వారీగా ఆందోళన కార్యక్రమాలకు దిగడంతో ప్రభుత్వం చర్చలకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో ఉద్యోగుల పెండింగ్ బకాయిలు, పీఆర్సీ సమస్యలను శాశ్వతంగా పరిష్కరించడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేరుగా రంగంలోకి దిగారు. ఉద్యోగ సంఘాల నేతలతో స్వయంగా చర్చలు జరిపి తగిన పరిష్కారాలు కనుగొనాలని నిర్ణయించారు.
జాయింట్ స్టాఫ్ కౌన్సిల్‌లోని 11 ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ రోజు అనగా నేడు సెప్టెంబరు 5 (శనివారం) అత్యున్నత స్థాయి భేటీ కానున్నారు. ఈ చర్చల సందర్భంగా ఉద్యోగ సంఘాలు ప్రస్తావిస్తున్న అంశాలపై సమగ్రంగా చర్చించడంతో పాటు, రాష్ట్రంలో ఉన్న ప్రస్తుత ఆర్థిక సమస్యలను వారికి వివరించనున్నారు.
ఈ సమావేశంలో ఉద్యోగులు గత కొంతకాలంగా ఆసక్తిగా ఎదురుచూస్తున్న 12వ వేతన సవరణ సంఘానికి (పీఆర్సీ) కొత్త కమిషనర్‌ను నియమించే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. గత ప్రభుత్వ హయాంలో మన్మోహన్ సింగ్ పీఆర్సీ కమిషనర్‌గా నియమితులవగా, కూటమి ప్రభుత్వం ఇప్పుడు ఆయన స్థానంలో సరికొత్త అధికారిని నియమించేందుకు సిద్ధమవుతోంది.
దీనితో పాటు చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న రెండు డీఏల (DA) చెల్లింపులకు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగుల హెల్త్‌కార్డుల సమస్యకు కూడా ఈ సమావేశంలో పరిష్కారం లభించనుంది. హెల్త్ కార్డుల అంశంపై ఇప్పటికే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (CS) అధ్యక్షతన ఏర్పాటైన కమిటీ పలుమార్లు సమావేశమై కీలక ప్రతిపాదనలు సిద్ధం చేసింది.
ఇటీవల ఉద్యోగ సంఘాల నేతలు ముఖ్యమంత్రిని కలసి తమ సమస్యలను పరిష్కరించాలని విన్నవించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందన్నారు. అయితే ప్రభుత్వం చర్చలు జరుపుతున్న తరుణంలో ఉద్యోగ సంఘాలు ఆందోళనలకు ఎందుకు అంత తొందరపడుతున్నాయని ఆయన ప్రశ్నించినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ, ఉద్యోగులకు న్యాయంగా చేయాల్సిన ప్రయోజనాలను ప్రభుత్వం ఒక్కొక్కటిగా నెరవేరుస్తుందని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.
మొత్తంమీద, పీఆర్సీ నూతన కమిషనర్ నియామకం, రెండు పెండింగ్ డీఏల బకాయిల చెల్లింపులతో పాటు హెల్త్ కార్డుల వంటి కీలకమైన సమస్యలకు పరిష్కారం లభిస్తుందని ఉద్యోగ సంఘాల నేతలు ఎంతో ఆశతో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు ముఖ్యమంత్రి తీసుకోబోయే నిర్ణయాలపై ఉద్యోగుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
Also Read: ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. పీఆర్సీ కోసం రంగంలోకి దిగిన సీఎం చంద్రబాబు!
Also REad: 40 ఏళ్లకే ఉద్యోగం మానేస్తున్నారా? మీ ఈపీఎఫ్ నిధులపై వడ్డీ వస్తుందా? పూర్తి వివరాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Konda Surekha Jagadeesh Reddy: "కొండా సురేఖను బీఆర్ఎస్ పార్టీ గేటు కూడా తాకనివ్వం" జగదీష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు!
Hyderabad, Telangana:Konda Surekha Jagadeesh Reddy News: మాజీ మంత్రి కొండా సురేఖ త్వరలోనే కాంగ్రెస్ పార్టీని విడనున్నారనే ప్రచారం ఊపందుకుంది. మంత్రి పదవి నుంచి ఆమెకు అధికార కాంగ్రెస్ పార్టీ బర్త్‌రఫ్ చేయగా.. ఈ క్రమంలో ఆమె పార్టీ మారే ఛాన్స్ ఉందని, త్వరలోనే ఆమె బీఆర్ఎస్ పార్టీలో చేరనున్నారని జరుగుతున్న ప్రచారంపై మాజీ మంత్రి జగదీష్ రెడ్డి స్పందించారు. కొండా సురేఖను బీఆర్ఎస్ పార్టీ గేటు కూడా తాకనివ్వమని ఆయన స్పష్టం చేశారు.Anasuya Krishnashtami Dance: శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున అనసూయ మరో వివాదం..రాధా గెటప్‌పై నెటిజన్ల తీవ్ర ట్రోలింగ్!
Hyderabad, Telangana:Anasuya Krishnashtami Dance Video: శ్రీకృష్ణాజన్మాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకుని నటి అనసూయ సోషల్ మీడియాలో ఒక స్పెషల్ వీడియోను పంచుకున్నారు. ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యంత ప్రాచుర్యం పొంది వైరల్ అవుతున్న 'తులసి కోమలవేణి..' అనే కన్నడ భక్తి గీతానికి ఆమె రాధా దేవి గెటప్‌లో నృత్యం చేస్తూ కనిపించారు. ఈ వీడియో చివర్లో "కృష్ణుడికి అంతా తెలుసు. నాకు అది చాలు" అనే ఆసక్తికరమైన క్యాప్షన్‌ను కూడా జోడించారు.
అయితే ఈ వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షమైన కొద్ది సమయానికే నెట్టింట విపరీతంగా వైరల్ కావడమే కాకుండా, నెటిజన్ల నుండి తీవ్రమైన ట్రోలింగ్‌కు దారితీసింది. అనసూయ శైలిని తప్పుబడుతూ కొందరు నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపించారు. ఒక నెటిజన్ "ఆ పాట ఏంటి? ఆ డ్రెస్ ఏంటి? బుద్ధి ఉందా?" అని మండిపడగా, మరొకరు "ఈ వీడియోలో ఆధ్యాత్మిక భావం కంటే అందాల ప్రదర్శన ఎక్కువగా కనిపిస్తోంది, అలా అనడమే బాగుంటుందేమో" అంటూ విమర్శనాత్మక కామెంట్స్ చేశారు.
వాస్తవానికి.. సనాతన ధర్మం, హిందూ ధర్మం విషయంలో అనసూయ గత కొన్ని రోజులుగా పలు విమర్శలను ఎదుర్కొంటూనే ఉన్నారు. ధర్మం, మతం పేరుతో ఇతరులపై వ్యక్తిగత దాడులకు దిగడం, బెదిరింపులకు పాల్పడటం ఏమాత్రం సరైన విధానం కాదని ఆమె చేసిన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాలలో పెద్ద ఎత్తున చర్చలకు దారితీశాయి. తనను విమర్శించే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంటుందని, అయితే వ్యక్తిగత దూషణలు చేయడం, భౌతిక బెదిరింపులకు పాల్పడటం మాత్రం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని ఆమె గట్టిగా స్పష్టం చేశారు.
న్యూస్ రీడర్‌గా తన వృత్తిని ప్రారంభించిన అనసూయ, ఆ తర్వాత బుల్లితెరపై ప్రసారమైన 'జబర్దస్త్' కామెడీ షో ద్వారా విపరీతమైన క్రేజ్, ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. బుల్లితెరపై తన హవా కొనసాగిస్తూనే, నాగార్జున సరసన 'సోగ్గాడే చిన్ని నాయనా' చిత్రంలో స్టెప్పులేసి వెండితెర ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించారు.
ఆ తర్వాత రామ్ చరణ్ ప్రధాన పాత్రలో వచ్చిన 'రంగస్థలం' చిత్రంలో ఆమె పోషించిన 'రంగమ్మత్త' పాత్ర ఆమె సినిమా కెరీర్‌ను అద్భుతమైన మలుపు తిప్పింది. ఈ పాత్ర ద్వారా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న అనసూయ, ప్రస్తుతం వరుస సినిమా అవకాశాలు అందుకుంటూ వెండితెరపై ఫుల్ బిజీగా కొనసాగుతున్నారు.
Also Read: బిగ్‌బాస్ ఆఫర్ తిరస్కరించిన సెలబ్రిటీలు వీళ్లే.. లక్షల్లో రెమ్యునరేషన్ ఇచ్చినా 'నో'
Also REad: 100 రోజులకు రూ.80 లక్షలు..బిగ్‌బాస్ చరిత్రలో అత్యధికంగా సంపాదించింది ఎవరో తెలుసా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Konda Surekha BJP: కాంగ్రెస్‌కు మాజీ మంత్రి కొండా సురేఖ గుడ్‌బై? త్వరలోనే బీజేపీలో చేరిక?
Hyderabad, Telangana:Konda Surekha BJP News: మాజీ మంత్రి కొండా సురేఖ తన పేరుతో సోషల్ మీడియా వేదికల్లో జరుగుతున్న ఒక విస్తృత ప్రచారాన్ని తీవ్రంగా ఖండించారు. కొండా సురేఖ పేరుతో ఉన్న ఒక ఫేస్బుక్ ఖాతాలో 'త్వరలో బిగ్ అప్డేట్ ఉంటుంది' అంటూ వచ్చిన ఒక పోస్టు నెట్టింట వైరల్‌గా మారడంతో ఆమె స్పందించారు. ఆ పోస్టులకు, తమకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేస్తూ సోషల్ మీడియా వేదికగా ఒక ప్రకటన విడుదల చేశారు. అయితే ఈ క్రమంలో ఆమె బీజేపీలో చేరే అవకాశం ఉందని సోషల్ మీడియాలో తెగ చర్చ జరుగుతోంది.Tirumala: తిరుమల సేవలో సినీ నటుడు సాయికుమార్ కుటుంబం
Dharmavaram, Andhra Pradesh:Actor Sai Kumar And His Son Aadi Family Visits To Tirumala Temple Watch VideoCM Ramesh: శ్రీకాళహస్తీరుడిని దర్శించుకున్న బీజేపీ ఎంపీ రమేశ్
Srikalahasti, Mitta Kandriga, Andhra Pradesh:Anakapalle BJP MP CM Ramesh Visits Srikalahasti Temple Watch VideoActress Namita: శ్రీకాళహస్తీశ్వర స్వామి సేవలో బాలకృష్ణ హీరోయిన్ నమిత
Srikalahasti, Mitta Kandriga, Andhra Pradesh:Balakrishna Heroine Namita Visits Srikalahasti Temple Watch VideoDK Aruna: కొండా సురేఖను తొలగించడంపై బాధపడిన డీకే అరుణ
HYDERABAD, Telangana:MP DK Aruna First Reacts About Konda Surekha Ministry Drops Watch VideoTirumala: తిరుమల అభిషేక సేవలో ఎంపీ రమేశ్ కుటుంబసభ్యులు
Dharmavaram, Andhra Pradesh:Anakapalle MP CM Ramesh Visits Tirumala Temple Along With His Family Watch VideoJagadish Reddy: 'బీఆర్ఎస్ పార్టీలోకి కొండా సురేఖకు నో ఎంట్రీ.. గేటు కూడా తాకనివ్వం'
Baddipadaga, Telangana:Konda Surekha No Entry: తెలంగాణ మంత్రివర్గం నుంచి బర్తరఫ్కు గురయిన మాజీ మంత్రి కొండా సురేఖ బీఆర్ఎస్ పార్టీలో చేరే అవకాశం ఉందని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆ పార్టీ కీలక ప్రకటన చేసింది. కొండా సురేఖను తమ పార్టీలో చేర్చుకునే అవకాశం లేదని ప్రకటించింది. తమ వైపు నుంచి ఆ ప్రయత్నం చేయడం లేదని స్పష్టం చేసింది. తెలంగాణ భవన్ గేటు కూడా తాకనివ్వమని మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు.
హైదరాబాద్‌లోని బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యాలయం తెలంగాణ భవన్లో శుక్రవారం మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి మాట్లాడుతూ కొండా సురేఖ మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌పై స్పందించి కీలక వ్యాఖ్యలు చేశారు. 'మాజీ మంత్రి కొండా సురేఖను బీఆర్ఎస్ పార్టీలోకి తీసుకునే ఆలోచన మాకు లేదు.. మా వైపు నుంచి ఆ ప్రయత్నం కూడా లేదు' అని తెలిపారు. తెలంగాణ భవన్ గేటు తాకనివ్వమని ప్రకటించారు. అసలు మొదలు బర్తరఫ్ చేయాల్సింది కొండా సురేఖను కాదని.. రేవంత్ రెడ్డిని బర్తరఫ్ చేయాలని జగదీశ్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు.
'రేవంత్ రెడ్డి 1000 రోజుల పాలనలో సాధించింది ఒక మహిళా మంత్రిని బర్తరఫ్ చేయడం మాత్రమే. అది వారి అంతర్గత విషయం కానీ.. కొండా సురేఖ కూతురు లేవనెత్తిన అంశాల సంగతి ఏమిటి? కాంగ్రెస్ నాయకులు చేసిన ఎన్నో కుంభకోణాలపై మేము ఆధారాలతో సహా ఫిర్యాదులు చేసినా చర్యలు తీసుకోలేదు' అని మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి తెలిపారు. దోపిడీ సొమ్ము పంచుకోవడంలో కొట్టుకొని దొంగలు దొరికిపోయినట్టు.. ప్రజల ముందర కాంగ్రెస్ పార్టీ దొరికిపోయిందని వివరించారు.
'దొంగతనం చేసిండని చూపించినోడిని అరెస్ట్ చేసి.. దొంగను వదిలిపెట్టే సంస్కృతి ఇవాళ మనకు కనబడుతోంది. కాంగ్రెస ప్రభుత్వ అవినీతిని ఆధారాలతో సహా కొండా ఫ్యామిలీ బయటపెట్టిందనే.. ఆమెపై చర్యలకు పాల్పడ్డారు. కానీ.. కాంగ్రెస్ ప్రభుత్వం 100 శాతం అవినీతి, కుంభకోణాలకు పాల్పడుతోంది. మేము ఇప్పటికే అనేక ఆధారాలను కేంద్ర దర్యాప్తు సంస్థలకు పంపించాం' అని మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి వెల్లడించారు. వీటిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
'పార్టీ మారిన పది మంది ఎమ్మెల్యేల్లో ఒకరిద్దరిని తప్ప ఎవరిని తీసుకోం. ఎమ్మెల్యేల క్యారెక్టర్ ఆధారంగా వాళ్లు వస్తామంటే తీసుకుంటాం' అని మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి తెలిపారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఇద్దరు బీఆర్ఎస్ పార్టీలోకి రావడానికి రెడీగా ఉన్నారని సంచలన ప్రకటన చేశారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అప్లికేషన్ పెట్టినా తీసుకోమని స్పష్టం చేశారు. ఎన్నికల కంటే ముందు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇద్దరూ బీఆర్ఎస్ పార్టీలోకి వస్తామంటే తీసుకోలేదని మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి గుర్తుచేశారు.
'వచ్చే ఎన్నికల నాటికి పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజన జరగకపోయినా రెండు తెలుగు రాష్ట్రాల్లో డీ లిమిటేషన్ జరుగుతుంది. ఏపీలో చంద్రబాబుకు వ్యతిరేకత స్టార్ట్ అయింది. డీ లిమిటేషన్ జరిగితే ప్రజా వ్యతిరేకత నుంచి బయట పడవచ్చని చంద్రబాబు భావిస్తున్నారు. రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తే డబ్బులకు అమ్ముడు పోయినట్టే' అని బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు జగదీశ్ రెడ్డి తెలిపారు.
