కోమటిరెడ్డి నరేంద్ర రెడ్డి సుడా అధ్యక్షుడు కేటీఆర్‌పై మండిపడ్డారు
కరీంనగర్ జిల్లా ఆర్అండ్బీ గెస్ట్‌హౌస్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నరేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. అధికారం కోల్పోయిన తర్వాత కేటీఆర్ ఆత్మగౌరవంతో బాధపడుతున్నారని, కొన్నిసార్లు తుపాకి రాముడిలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తే మళ్లీ అధికారంలోకి వస్తామని చెప్పడంలో భాగంగానే డిస్కో డ్యాన్స్, బ్రేక్ డ్యాన్స్‌లు చేయవద్దని మంత్రి నరేంద్రరెడ్డి చెప్పడంతో చాలా మంది మనోభావాలు దెబ్బతింటాయన్నారు జరిగింది.
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Khamenei Wife Mansoureh untold story: ఇరాన్.. ప్రపంచ రాజకీయాల్లో ఎప్పుడూ హాట్ టాపిక్. ఇప్పుడు ఆ దేశం మరోసారి అగ్ని పరీక్షను ఎదుర్కొంటోంది. ఆర్థిక సంక్షోభం, అంతర్జాతీయ ఆంక్షలు, మహిళల హక్కుల కోసం నిప్పురవ్వలా ఎగిసిపడుతున్న నిరసనలు.. వీటన్నింటి మధ్య ఇరాన్ సుప్రీం నాయకుడు ఆయతుల్లా అలీ ఖమేనీ ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. ఓ వైపు విదేశీ శక్తులే ఈ తిరుగుబాటుకు కారణమంటూ ఆయన ఆరోపిస్తుంటే.. మరోవైపు అదే దేశంలోని మహిళలు, యువత ఆయన పాలనపై బహిరంగంగా తిరబడుతున్నారు. ఖమేనీ పోస్టర్లను తగులబెట్టి.. సిగరెట్లు వెలిగించడం వంటి ద్రుశ్యాలు ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేశాయి.
అయితే ఇక్కడ ఒక ఆసక్తికరమైన ప్రశ్న తలెత్తుతుంది. మహిళలపై కఠిన నియమాలు విధించే ఈ పాలకుడి ఇంట్లో పరిస్థితి ఎలా ఉంటుంది? ఆయతుల్లా అలీ ఖమేనీ ఇంట్లో మహిళల పాత్ర ఏమిటి? ముఖ్యంగా… ఆయన భార్య మన్సూరి ఖోజన్ ఎవరు? ఎందుకు ఆమెను ఇరాన్లో అత్యంత అదృశ్య మహిళ గా పిలుస్తారు? పూర్తి వివరాలు తెలుసుకుందాం.
ఖమేనీ భార్య మన్సూరి ఖోజన్ను ప్రపంచం చాలా అరుదుగా మాత్రమే గుర్తించింది. ఆమె ఎప్పుడూ భర్తతో పాటు రాజకీయ కార్యక్రమాల్లో కనిపించలేదు. మీడియా ముందు రావడం దాదాపు శూన్యం. అందుకే ఇరాన్‌కు ఫస్ట్ లేడీ అన్న పదం వినిపించదు. ఆ స్థానంలో ఇన్విజిబుల్ వుమన్ ఆఫ్ ఇరాన్ అనే ముద్ర పడింది. ఈ ఇద్దరి పెళ్లికథ మరింత ఆసక్తికరంగా ఉంటుంది. ఇది ప్రేమకథ కాదు.. సినిమాల్లా కలుసుకుని ప్రేమించి పెళ్లి చేసుకున్న కథ కాదు. 1964లో ఖమేనీ తల్లి చూసి కుదిర్చిన సంప్రదాయ వివాహం వీరిది. మన్సూరి ఒక సంప్రదాయ మతపరమైన కుటుంబానికి చెందిన అమ్మాయి. ఖమేనీ అప్పటికి పెద్ద రాజకీయ నాయకుడేమీ కాదు. షా పాలనకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న ఒక యువ మతగురువు మాత్రమే.
అయితే వీరిద్దరి కథ జైలులోనే మొదలైంది. పెళ్లైన కొద్ది కాలానికే ఖమేనీ ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాల కారణంగా అరెస్టయ్యాడు. అప్పటి నుంచి జైలు జీవితం మొదలైంది. ఆ సమయంలో మన్సూరి ఒంటరిగా ఆరుగురు పిల్లలను పెంచింది. భర్త జైలులో ఉన్నా ఆమె వెనక్కి తగ్గలేదు. జైలుకు వెళ్లి అతన్ని కలవడం, అతని పోరాటానికి మద్దతు ఇవ్వడం కొనసాగించింది. ఒక విధంగా చెప్పాలంటే… వారి వివాహ బంధం అసలు పరీక్షను జైలులోనే ఎదుర్కొంది. అంతే కాదు… మన్సూరి కూడా ఆ తిరుగుబాటులో నిశ్శబ్దంగా భాగస్వామి అయిందని చెప్పుకుంటారు. ప్రభుత్వ వ్యతిరేక కరపత్రాలను దాచడం, సందేశాలను చేరవేయడం వంటి పనుల్లో ఆమె ఖమేనీకి సహాయం చేసినట్లు కథనాలు ఉన్నాయి. కానీ మన్సూరీ ఎలా ఉంటుందో ఇఫ్పటి వరకు ప్రపంచానికి తెలియదు. ఆమెకు సంబంధించిన ఒక ఫొటో కూడా బయటకు రాలేదు. ఆమె ముఖం ఇప్పటికీ ప్రపంచానికి ఒక రహస్యమే.
ఒకసారి ఆమె తీవ్ర అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో చేరింది. కానీ ఆమె ఎవరో వైద్యులకు కూడా తెలియకుండా చికిత్స తీసుకుందట. ఖమేనీ ఆసుపత్రికి వచ్చిన తర్వాతే… ఆమె సుప్రీం లీడర్ భార్య అని తెలిసిందట. ఇది ఆమె ఎంత గోప్యంగా జీవించిందో చెప్పే ఉదాహరణ. మన్సూరి జీవితంలో ఒక్కసారి మాత్రమే మీడియా ముందుకు వచ్చారు. అది 1993లో. ఒక విదేశీ పత్రికకు ఇచ్చిన ఆ ఒక్క ఇంటర్వ్యూలో ఆమె చెప్పిన మాటలు అప్పట్లో సంచలనం సృష్టించాయి. నా భర్త తన బాధ్యతలను ప్రశాంతంగా నిర్వహించగలిగేలా ఇంట్లో శాంతిని కాపాడటమే నా ప్రధాన పని అని ఆమె చెప్పారు.
మీ భర్త ఇంటి పనుల్లో సహాయం చేస్తారా అని అడిగితే.. అతనికి అంత సమయం ఉండదు. నేను కూడా అలా ఆశించను. కానీ పని ఒత్తిడిని ఇంట్లోకి తీసుకురాకుండా చూసే అలవాటు మాత్రం అతనిలో ఉంది అని చెప్పింది. మీరు ప్రభుత్వ పదవిలో ఉన్నారా అనే ప్రశ్నకు… నేను ఒక ముస్లిం మహిళను. నాకు కొన్ని నైతిక బాధ్యతలు ఉన్నాయి. కానీ ఎలాంటి అధికారిక హోదా లేదు అని స్పష్టం చేశారు. హిజాబ్ గురించి కూడా ఆమె ఆసక్తికర వ్యాఖ్య చేసింది. ఇంటి బయట హిజాబ్ చాలా ముఖ్యమైంది. కానీ ఇంట్లో వాతావరణం వేరు. అయినా దుస్తులు మాత్రం ఇస్లామిక్ విలువలకు అనుగుణంగానే ఉండాలి అని చెప్పింది.
ఇలా… ప్రపంచ రాజకీయాల్లో కఠిన నాయకుడిగా కనిపించే ఆయతుల్లా అలీ ఖమేనీ వెనుక… పూర్తిగా వెలుగులోకి రాని ఒక నిశ్శబ్ద మహిళ జీవితం ఉంది. ఆమె పేరు మన్సూరి ఖోజన్. రాజకీయాల్లో కనిపించదు. ప్రసంగాలు చేయదు. కానీ ఒక నాయకుడి జీవితాన్ని నిశ్శబ్దంగా మోసిన పాత్ర మాత్రం ఆమెదే. ఇరాన్లో మహిళలు రోడ్లపైకి వచ్చి హక్కుల కోసం పోరాడుతున్న ఈ సమయంలో… ఖమేనీ ఇంట్లోని ఈ అదృశ్య మహిళ కథ మరో కోణాన్ని చూపిస్తోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Bruhan Mumbai Corporations Election Results 2026 : కాగా నిన్న మకర సంక్రాంతి రోజున BMC కి ఎన్నికలు జరిగాయి. బీజేపీ-మహాయుతి కూటమికి వ్యతిరేకంగా థాక్రే బ్రదర్స్ జట్టుకట్టి పోటీలో నిలిచారు. దీంతో ఈ ఎన్నికలపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ముంబై కా రాజా ఎవరనే విషయంలో ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెల్లడయ్యాయి. 2017తో పోల్చితే ఈ సారి పోలింగ్ శాతం తగ్గినట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది. ముంబైతో పాటు మహారాష్ట్రలోని 28 మున్సిపల్ సంస్థలకు జరిగిన పోలింగ్ లో 50 శాతం పోలింగ్ నమోదైయ్యింది. 2017 లో 55-56 శాతం పోలింగ్ నమోదైతే ఈసారి కాస్త తగ్గింది. BMC ఎన్నికల్లో మొత్తం 227 సీట్లకు 17 వందల మంది అభ్యర్థులు పోటీ పడ్డారు.
ఎగ్జిట్ పోల్స్ ఫలితాల్లో దాదాపు మెజారిటీ స్థానాల్లో బీజేపీ కూటమికి ఆధిపత్యం కొనసాగనుందని తేలింది. ఆ కూటమి 130 కి పైగా వార్డులను గెలుచుకుని కార్పోరేషన్ సొంతం చేసుకుంటుందని ఫలితాలు పేర్కొన్నాయి. యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్ ప్రకారం బీజేపీ శివసన షిండే కూటమికి 131 నుంచి 151 వార్డులు వస్తాయని అంచనా వేసింది. ఇక JVC ఎగ్జిట్ పోల్స్ ప్రకారం.. బీజేపీ కూటమి 138 వార్డులు గెలుచుకుంటుందని అంచనా వేసింది.
2017 తర్వాత జరిగిన కార్పోరేషన్ ఎన్నికల్లో అప్పటితో పోల్చుకుంటే పొత్తులు మారాయి. ఎత్తులు మారాయి. కొత్తగా మరాఠీ గౌరవం అనే అంశం కూడా తెరమీదకు వచ్చి చేరింది. 20 ఏళ్ల తర్వాత.. ఒకటైన థ్రాక్రే బ్రదర్స్.. ఈ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రచారం చేశారు. కానీ ఎగ్జిట్ పోల్స్ వీరికి కార్పోరేషన్ వచ్చే అవకాశం లేదని తేల్చేశాయి. యాక్సిస్ మై ఇండియా ప్రకారం.. శివసేన ఉద్ధవ్ థాక్రే వర్గానికి, రాజ్ థాక్రేకు చెందిన MNS కు కలిపి 58-68 వార్డులు గెలుచుకుంటారని అంచనా వేసింది. ఇక JVC ప్రకారం.. ఈ కూటమికి 59 వార్డులు వస్తాయని ప్రెడిక్ట్ చేసింది.
Read more: సమంత కంటే ముందు రెండో పెళ్లి చేసుకున్న హీరోయిన్స్ వీళ్లే..! పూర్తి లిస్ట్ ఇదే..!
Read more: సమంత బాటలో దర్శకులను పెళ్లి చేసుకున్న హీరోయిన్స్ వీళ్లే..
ఇక ప్రకాశ్ అంబేద్కర్ పార్టీ వంచిత్ బహుజన్ అఘాడీ(VBA) తో కలిసి పోటీ చేసిన కాంగ్రెస్.. 12 నుంచి 16 వార్డులు గెలుచుకుంటుందని ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు అంచనా వేశాయి. ఈ ఎన్నికల్లో MIM కూడా ప్రభావం చూపింది. అయితే అసదుద్దీన్ ఏ మేరకు తన ఎఫెక్ట్ చూపారో ఎన్నికల ఫలితాల తరువాత తేలనుంది.
Also Read: వెయ్యి కోట్ల దర్శకులు.. ‘దురంధర్’తో ఈ క్లబ్బులో ఎంట్రీ ఇచ్చిన ఆదిత్యధర్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.
NATO Against US On Greenland Issue: అమెరికా బారి నుంచి డెన్మార్క్‌లోని గ్రీన్లాండ్ కు భద్రత కల్పించేందుకు యూరప్ దేశాల సేనలు రంగంలోకి దిగాయి. అణ్వస్త్ర దేశం ఫ్రాన్స్‌తో పాటు జర్మనీ, నార్వే, స్వీడన్ సహా వివిధ ఐరోపా దేశాల సైన్యాలను గ్రీన్లాండ్ గడ్డపై మోహరించే ప్రక్రియ మొదలైంది. ఈ పరిణామం నాటో కూటమిలో చీలిక లాంటిదని పరిశీలకులు అంటున్నారు. గ్రీన్‌లాండ్‌పై పట్టు వీడేందుకు ట్రంప్ ప్రభుత్వం నిరాకరించింది. దీంతో డెన్మార్క్ వ్యూహాత్మకంగా ముందుజాగ్రత్త చర్యలను మొదలుపెట్టింది. నాటో కూటమిలోని మిత్రదేశాల సైన్యాలను గ్రీన్లాండ్ గడ్డపై మోహరించే ప్రక్రియను ప్రారంభించింది. తద్వారా సైనికంగా అమెరికాను ఎదుర్కొనేందుకు డెన్మార్క్ సిద్ధమవుతోంది. గ్రీన్లాండ్లో సైనిక మోహరింపును పెంచుతామని వెల్లడించింది. తమ దేశ భూభాగాన్ని కాపాడుకునే విషయంలో రాజీపడేది లేదంటోంది.
తమ సైనిక దళాలను గ్రీన్లాండ్కు పంపే ప్రక్రియను మొదలుపెట్టామని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయేల్ మక్రాన్ వెల్లడించారు. ఇప్పటికే గ్రీన్లాండ్ రాజధాని నగరం న్యూక్‌లో ఫ్రాన్స్ దేశానికి చెందిన 15 వేల మంది సైనికులు ఉన్నారు. నేటి రాత్రికి జర్మనీకి చెందిన 13 వేల సైనికుల టీమ్‌ను గ్రీన్లాండ్లో మోహరించనున్నారని సమాచారం. అమెరికా ఆర్మీకి ఇప్పటికే గ్రీన్లాండ్లో ఒక వైమానిక స్థావరం ఉంది. ఆ స్థావరం నుంచి అమెరికా అకస్మాత్తుగా గ్రీన్లాండ్ రాజధాని నగరం న్యూక్పై సైనిక చర్యను చేపట్టే ముప్పు ఉంది. ప్రస్తుతం దీన్ని ఎదుర్కొనే సన్నాహాలు చేయడంలో డెన్మార్క్ తలమునకలై ఉంది. గ్రీన్లాండ్లో చోటుచేసుకుంటున్న పరిణామాలపై నాటో కూటమి అధికార వర్గాలు ఆచితూచి స్పందిస్తున్నాయి. నేరుగా గ్రీన్‌లాండ్‌ను ప్రస్తావించకుండా, ఆర్కిటిక్ ప్రాంత భద్రతే తమకు ముఖ్యమని నాటో అధికార వర్గాలు చెబుతున్నాయి. తమ వ్యాఖ్యల్లో అమెరికా ప్రస్తావన రాకుండా జాగ్రత్త పడుతున్నారు. ఎందుకంటే నాటో కూటమి దళాల నిర్వహణకు ఏటా అత్యధిక బడ్జెట్‌ను అమెరికాయే సమకూరుస్తోంది.
Also Read: వెయ్యి కోట్ల దర్శకులు.. ‘దురంధర్’తో ఈ క్లబ్బులో ఎంట్రీ ఇచ్చిన ఆదిత్యధర్..
అమెరికా జాతీయ భద్రత దృష్ట్యా గ్రీన్లాండ్ తమకే దక్కాలంటున్నారు ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. అందుకు నాటో దేశాలు చొరవ చూపాలని, లేదంటే రష్యా, చైనా ఆ దీవిని వశపరుచుకుంటాయన్నారు. అయితే, డెన్మార్క్ అధీనంలోని గ్రీన్‌లాండ్‌ను అమెరికా తన నియంత్రణలోకి తీసుకోవాలన్న నిర్ణయాన్ని 75 శాతం మంది అమెరికన్లే వ్యతిరేకిస్తున్నారు. కేవలం 25 శాతం మంది మాత్రమే ట్రంప్ అభిప్రాయంతో ఏకీభవిస్తున్నట్లు సర్వేలో తేలింది. అమెరికన్ వార్తా సంస్థ సీఎన్ఎన్ ఈ సర్వే నిర్వహించింది. ట్రంప్ సొంత పార్టీలోనూ దీనిపట్ల వ్యతిరేకత వ్యక్తమవుతోందని తెలిపింది. ఇక డెమోక్రాట్లలో 94 శాతం మంది గ్రీన్లాండ్ విషయంలో వ్యతిరేకత వ్యక్తంచేస్తున్నారు. పూర్తి స్వతంత్రులుగా ఉన్న వారిలో 80 శాతం మంది ఈ చర్యను వ్యతిరేకిస్తున్నట్లు సర్వే పేర్కొంది. ట్రంప్ విదేశాంగ విధానం వల్ల అంతర్జాతీయ సమాజంలో దేశ పరపతి దెబ్బతింటోందని 57 శాతం మంది ఆందోళన వ్యక్తంచేశారని సర్వే తెలిపింది. వెనెజువెలాపై మిలటరీ చర్యను 52 శాతం మంది వ్యతిరేకించారని పేర్కొంది.
కాగా గ్రీన్లాండ్లో నాటో సైనిక దళాల మోహరింపుపై బెల్జియంలోని రష్యా రాయబార కార్యాలయం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. రష్యా, చైనాలను బూచిగా చూపించి గ్రీన్లాండ్లో సైనిక మోహరింపులను నాటో పెంచుతోందని విమర్శించింది. అత్యంత ఎత్తయిన ప్రాంతమైన గ్రీన్లాండ్లో చోటుచేసుకునే పరిణామాలు తమకు కీలకమైనవని తెలిపింది.
Read more: సమంత కంటే ముందు రెండో పెళ్లి చేసుకున్న హీరోయిన్స్ వీళ్లే..! పూర్తి లిస్ట్ ఇదే..!
Read more: సమంత బాటలో దర్శకులను పెళ్లి చేసుకున్న హీరోయిన్స్ వీళ్లే..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.
Nari Nari Naduma Murali Movie: సంక్రాంతి పండుగకు విడుదలైన సినిమాల్లో నారీ నారీ మడుమ మురారి సినిమా సూపర్ హిట్టుగా నిలిచిందని చిత్రబృందం ప్రకటించింది. విడుదలైన అన్నీ సినిమాలు బాగున్నాయని.. తమ సినిమా కూడా విజయం సాధించిందని చిత్రబృందం ప్రకటన చేసింది. నారీ నారీ మడుమ మురారి సినిమా థియేటర్లు పెరుగుతున్నాయని.. కలెక్షన్లు కూడా వస్తున్నాయని చిత్రబృందం హర్షం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా సక్సెస్ మీట్ నిర్వహించారు.
Also Read: Traffic Diversion: సంక్రాంతి ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. హైదరాబాద్ వాహనాలు దారి మళ్లింపు
విజయవాడలోని ఎంపీ కేశినేని చిన్ని కార్యాలయంలో నారీ నారీ మడుమ మురారి సినిమా సక్సెస్ మీట్ జరిగింది. నిర్మాత అనిల్ సుంకర, డైరెక్టర్ రామ అబ్బరాజుతో కలిసి ఎంపీ కేశినేని నాని కేక్ కట్ చేశారు. అనంతరం చిత్రబృందంతోపాటు ఎంపీ ప్రసంగించారు. 'నా స్నేహితుడు అనిల్ సుంకర నిర్మించిన చిత్రం మంచి విజయం సాధించింది. హీరో శర్వానంద్ నాకు మంచి మిత్రుడు. నారీ నారీ నడుమ మురారి సంక్రాంతి విన్నర్‌గా నిలిచింది. చిన్న బడ్జెట్‌తో నిర్మించిన సినిమా బ్రహ్మాండమైన విజయం సాధించింది. చక్కటి విజయం సాధించిన నారీ నారీ నడుమ మురారీ సినిమా బృందానికి అభినందనలు' అని ఎంపీ కేశినేని శివనాథ్ తెలిపారు.
Also Read: Cockfight Prize: సంక్రాంతి జాక్‌పాట్.. రూ.కోటి 50 లక్షలు గెలుచుకున్న ఓ కోడి
'మా సినిమా నారి నారి నడుమ మురారి సినిమా అన్ని షోలు ఫుల్ అవుతున్నాయి. తక్కువ థియేటర్లు దొరికినా అన్నీ నిండుతున్నాయి. రోజురోజుకు థియేటర్లు పెరుగుతాయి. నారీ నారీ నడుమ మురారి సూపర్ డూపర్ హిట్ అయ్యింది. సంక్రాంతికి రిలీజైన అన్ని సినిమాలు బాగున్నాయి. మా సినిమా మరీ బాగుంది అంటున్నారు. మా సినిమా చూస్తే వారం రోజుల పాటు ఆనందంతో ఆయుష్షు పెరుగుతుంది' అని నిర్మాత అనిల్ సుంకర తెలిపారు. 'మా నారి నారి నడుమ మురారి సినిమా పెద్ద విజయం సాధించింది. విజయవాడ ఉత్సవ్ సందర్భంగా విజయవాడకు వచ్చి కనకదుర్గ దర్శనం చేసుకొని చివరి షెడ్యూల్డ్‌కు వెళ్లాము. సినిమా పెద్ద హిట్ అయ్యింది విజయోత్సవాలు కూడా విజయవాడ నుంచి ప్రారంభిస్తున్నాం' అని దర్శకుడు రామ అబ్బరాజు తెలిపారు.
Also Read: Harish Rao: పండుగ పూట కేసీఆర్‌ను తలుచుకున్న గ్రామస్తులు.. హరీశ్ రావుతో ఆత్మీయ పలకరింపు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
.Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Sankranti Traffic Diversion: సంక్రాంతి ట్రాఫిక్ రద్దీ నివారణకు హైదరాబాద్ వైపు వెళ్లే వాహనాలకు దారి మళ్లింపు చేశారు. సంక్రాంతి పండగ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి పండగ పూర్తి చేసుకొని హైదరాబాద్ నగరానికి భారీగా వాహనాలు వచ్చే అవకాశం ఉండడంతో పోలీసులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. జాతీయ రహదారి- 65 (హైదరాబాద్- విజయవాడ)పై చిట్యాల, పెద్దకాపర్తి వద్ద ప్లై ఓవర్ నిర్మాణ పనులతో ట్రాఫిక్ జామ్ ఏర్పడుతోంది. దీంతో నల్లగొండ జిల్లా పోలీస్ శాఖ ప్రత్యేక ట్రాఫిక్ దారి మళ్లింపునకు ఏర్పాట్లు చేశారు. ఆంధ్ర ప్రాంతం నుంచి హైదరాబాద్ వైపు వచ్చే వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల నుంచి వెళ్లే విధంగా చర్యలు తీసుకున్నారు.
Also Read: Cockfight Prize: సంక్రాంతి జాక్‌పాట్.. రూ.కోటి 50 లక్షలు గెలుచుకున్న ఓ కోడి
వాహనాల దారి మళ్లింపు ఇలా (ట్రాఫిక్ డైవర్షన్)..
గుంటూరు వైపు నుంచి హైదరాబాద్ వైపు వెళ్లే వాహనాలు
గుంటూరు మిర్యాలగూడ హాలియా కొండమల్లేపల్లి చింతపల్లి మాల్ మీదుగా హైదరాబాద్‌కు
మాచర్ల నుంచి హైదరాబాద్ వైపు వెళ్లే వాహనాలు..
మాచర్ల → నాగార్జునసాగర్ → పెద్దవూర → కొండపల్లేపల్లి - చింతపల్లి-మాల్ మీదుగా హైదరాబాద్
నల్లగొండ నుంచి హైదరాబాద్ వైపు వెళ్లే వాహనాలు
నల్లగొండ - మార్రిగూడ బై పాస్ మునుగోడు → నారాయణపూర్- చౌటుప్పల్ (ఎన్.హెచ్ 65) మీదుగా హైదరాబాద్
Also Read: Harish Rao: పండుగ పూట కేసీఆర్‌ను తలుచుకున్న గ్రామస్తులు.. హరీశ్ రావుతో ఆత్మీయ పలకరింపు
విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్లే భారి వాహనాలు
కోదాడ-హుజూర్నగర్- మిర్యాలగూడ -హాలియా- చింతపల్లి- మాల్ మీదుగా హైదరాబాద్
చిట్యాల, పెద్దకాపర్తిలో ప్లై ఓవర్ నిర్మాణాలు జరుగుతుండడంతో ట్రాఫిక్ జామ్ అయితే చిట్యాల నుంచి భువనగిరి గుండా హైదరాబాద్ మళ్లించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ మార్గాల ద్వారా వెళ్లడంతో ప్రధాన రహదారి విజయవాడ, హైదరాబాద్‌పై (ఎన్‌హెచ్-65) ట్రాఫిక్ ఒత్తిడి తగ్గి, ప్రయాణికులు గమ్యస్థానాలకు త్వరగా చేరుకోవచ్చని నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు.
Also Read: Govt Employees: సంక్రాంతి వేళ చంద్రబాబుకు షాక్.. 29 శాతం ఐఆర్, పీఆర్సీ కోసం భారీ నిరసన
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
.Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Revanth Reddy on Traffic Challan Auto Debit: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ట్రాఫిక్ చలాన్లపై చేసిన తాజా వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా విస్తృత చర్చకు దారి తీశాయి. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారికి ఎలాంటి రాయితీలు ఉండకూడదని స్పష్టం చేసిన ఆయన, చలాన్ నమోదైన వెంటనే వాహన యజమాని బ్యాంకు ఖాతా నుంచి జరిమానా మొత్తం ఆటోమేటిక్‌గా డెబిట్ అయ్యే విధానాన్ని ప్రతిపాదించారు. ఇందుకోసం బ్యాంకులతో సంప్రదింపులు జరుపుతామని, వాహన యజమాని బ్యాంకు ఖాతాలను ట్రాఫిక్ చలాన్ల వ్యవస్థతో లింక్ చేసే సాంకేతిక పరిష్కారాన్ని పరిశీలిస్తున్నామని తెలిపారు. అయితే ఈ ప్రతిపాదన నిజంగా అమలులోకి వస్తుందా? ఇది సాంకేతికంగా, చట్టపరంగా సాధ్యమా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
సాంకేతిక కోణంలో చూస్తే, ట్రాఫిక్ చలాన్లను బ్యాంకు ఖాతాలతో అనుసంధానం చేయడం పూర్తిగా అసాధ్యం కాదు. ప్రస్తుతం దేశంలో UPI AutoPay, e-Mandate, Standing Instruction వంటి విధానాలు ఇప్పటికే అమలులో ఉన్నాయి. మొబైల్ బిల్లులు, ఇన్సూరెన్స్ ప్రీమియంలు, లోన్ల EMIలు ఇదే పద్ధతిలో ఆటో డెబిట్ అవుతున్నాయి. అయితే ఇక్కడ కీలకమైన అంశం ఒకటే – కస్టమర్ స్పష్టమైన సమ్మతి (Consent). వాహన యజమాని నుంచి ముందుగానే e-Mandate లేదా UPI Mandate రూపంలో అనుమతి తీసుకున్నప్పుడే ఆటో డెబిట్ సాధ్యమవుతుంది.
ఉదాహరణకు, వాహన రిజిస్ట్రేషన్ సమయంలోనే బ్యాంకు ఖాతాను లింక్ చేసి, చలాన్ వచ్చినప్పుడు ఆటో డెబిట్ చేయాలంటే కూడా యజమాని స్వచ్ఛందంగా స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్ ఇవ్వాల్సిందే. ఆర్బీఐ నిబంధనల ప్రకారం, ఖాతాదారుడి అనుమతి లేకుండా బ్యాంకు ఖాతా నుంచి ఒక్క రూపాయి కూడా డెబిట్ చేయరాదు. ఇది బ్యాంకింగ్ వ్యవస్థలో మారలేని ప్రాథమిక సూత్రం.
ఇప్పుడు చట్టపరమైన అంశాన్ని పరిశీలిస్తే, భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 300-A చాలా కీలకం. ఈ ఆర్టికల్ ప్రకారం, చట్టబద్ధమైన ప్రక్రియ లేకుండా ఎవరి ఆస్తినీ హరించలేరు. బ్యాంకులో ఉన్న డబ్బు కూడా వ్యక్తిగత ఆస్తిగానే పరిగణించబడుతుంది. కాబట్టి వాహన యజమానికి ముందస్తు సమాచారం ఇవ్వకుండా, అప్పీల్ అవకాశం లేకుండా, నేరుగా ఖాతా నుంచి డబ్బులు తీసుకోవడం సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధం అవుతుంది.
ట్రాఫిక్ చలాన్ల విషయంలో మరో ముఖ్యమైన అంశం తప్పిదాల అవకాశమే. కొన్నిసార్లు కెమెరాల లోపాలు, నంబర్ ప్లేట్ తప్పుగా గుర్తించడం వంటి కారణాలతో నిర్దోషులకూ చలాన్లు పడుతున్న సందర్భాలు ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో ఆటో డెబిట్ జరిగితే, అది న్యాయపరంగా తీవ్రమైన సమస్యలకు దారి తీస్తుంది. అందుకే అప్పీల్ చేసుకునే అవకాశం, రిఫండ్ విధానం తప్పనిసరిగా ఉండాలి.
ముఖ్యమంత్రి సూచించిన ఆటో డెబిట్ విధానం చట్టబద్ధంగా అమలవ్వాలంటే కొన్ని కీలక షరతులు అవసరం. మొదటిగా, వాహన యజమాని స్వచ్ఛందంగా సమ్మతి ఇవ్వాలి. రెండవది, ఎప్పుడైనా ఆ సమ్మతిని రద్దు చేసుకునే (Opt-out) అవకాశం ఉండాలి. మూడవది, చలాన్‌పై అభ్యంతరం తెలిపే హక్కు, అవసరమైతే డబ్బు తిరిగి పొందే స్పష్టమైన విధానం ఉండాలి. ఈ అంశాలు లేకుండా బలవంతంగా ఆటో డెబిట్ అమలు చేస్తే అది చట్టవిరుద్ధమే అవుతుంది.
కొత్త వాహన రిజిస్ట్రేషన్ సమయంలోనే ఆటో డెబిట్ మెండేట్ ఇవ్వాలని ప్రభుత్వం తప్పనిసరి చేస్తుందా అనే ప్రశ్న కూడా వస్తోంది. కానీ ఇది కూడా సాధ్యంకాదనే అభిప్రాయం నిపుణుల్లో ఉంది. ఎందుకంటే వాహనం నమోదు చేసుకోవడం ఒక హక్కు కాగా, బ్యాంకు ఖాతా మీద వ్యక్తికి ఉన్న హక్కు రాజ్యాంగ పరిరక్షణ పొందిన ఆస్తి హక్కు. కోర్టు ఆదేశం లేదా ఖాతాదారి అనుమతి లేకుండా ఆ హక్కును ప్రభుత్వం కూడా ఉల్లంఘించలేరు.
మొత్తంగా చూస్తే, సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపాదించిన ట్రాఫిక్ చలాన్ ఆటో డెబిట్ విధానం సాంకేతికంగా సాధ్యమైనప్పటికీ, చట్టపరంగా అనేక పరిమితులు ఉన్నాయి. పూర్తి స్థాయి కస్టమర్ సమ్మతి, పారదర్శక న్యాయ ప్రక్రియలు, అప్పీల్ మరియు రిఫండ్ వ్యవస్థలు ఉంటేనే ఈ విధానం అమలులోకి వచ్చే అవకాశం ఉంటుంది. లేకపోతే ఇది రాజ్యాంగ, ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధంగా మారే ప్రమాదం ఉంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Congnizant New Office in Vizag: ఆంధ్ర ప్రదేశ్ కు ఐటీ కంపెనీలు క్యూ కడుతున్నాయి. ముఖ్యంగా స్టీల్ సిటీ విశాఖ పట్నాన్ని బేస్ చేసుకొని ఒక్కో ఐటీ కంపెనీ అక్కడికి క్యూ కడుతున్నాయి. అంతేకాదు అక్కడ తమ కార్యకలాపాలను ప్రారంభిస్తున్నాయి. ఇప్పటికే ఇన్ఫోసిస్ వంటి దిగ్గజ ఐటీ కంపెనీతో పాటు పలు ఐటీ కంపెనీలు తమ కార్యాలయాలను విశాఖలో ప్రారంభించాయి. తాజాగా ప్రముఖ ఐటీ కంపెనీ కాగ్నిజెంట్ తమ ఆఫీసును ప్రారంభించబోతుంది.
జనవరి 26వ తేదీ నుంచి తాత్కాలిక కార్యాలయంలో 800 మంది ఉద్యోగులతో కార్యకలాపాలు మొదలుపెడుతోంది. విశాఖపట్టణంలోని కాపులుప్పాడలో 22.19 ఎకరాల్లో నిర్మిస్తున్న శాశ్వత క్యాంపస్‌కు గతేడాది డిసెంబరు 12న సీఎం చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేశారు. అదే సమయంలో, హిల్-2లోని మహతి బ్లాక్‌లో తాత్కాలిక కార్యాలయ భవనాన్ని కూడా ప్రారంభించారు.
Read more: సమంత కంటే ముందు రెండో పెళ్లి చేసుకున్న హీరోయిన్స్ వీళ్లే..! పూర్తి లిస్ట్ ఇదే..!
Read more: సమంత బాటలో దర్శకులను పెళ్లి చేసుకున్న హీరోయిన్స్ వీళ్లే..
ప్రస్తుతం ఈ తాత్కాలిక కార్యాలయంలో 800 మంది ఉద్యోగులతో జనవరి 26 నుంచి కార్యకలాపాలు మొదలవుతాయి.వివిధ రాష్ట్రాల్లో పనిచేస్తున్న కాగ్నిజెంట్ ఉద్యోగులలో 500 మందిని విశాఖకు బదిలీ చేస్తూ ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేశారు. అదనంగా, మరో 300 మంది సీనియర్ ఉద్యోగులను కూడా ఇక్కడికి బదిలీ చేశారు. లాజిస్టిక్స్, ఆపరేషనల్ సమస్యలను పరిష్కరించుకుని, ఈ నెల 26వ తేదీ నుంచి కార్యకలాపాలు ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారు.
Also Read: వెయ్యి కోట్ల దర్శకులు.. ‘దురంధర్’తో ఈ క్లబ్బులో ఎంట్రీ ఇచ్చిన ఆదిత్యధర్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.
కాపులుప్పాడలో నిర్మించబోయే శాశ్వత క్యాంపస్‌లో విడతలవారీగా మొత్తంగా 8 వేల మందికి ఉపాధి కల్పించాలని ముందుగా నిర్ణయించారు. అయితే, శంకుస్థాపనకు ముందు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కాగ్నిజెంట్ సీఈవో మధ్య జరిగిన చర్చల వల్ల 25,000 మందికి ఉద్యోగావకాశాలు కల్పించాలని నిర్ణయించారు.
ZEE5 Telugu Sambaralu: రాకింగ్ స్టార్ మంచు మనోజ్ యాక్ట్ చేసిన బ్రాండ్ ఫిల్మ్‌ను తెలుగు జీ 5 ప్రెజెంట్ చేసింది. సంక్రాంతి పండుగ సందర్భంగా తెలుగు ప్రేక్షకుల కోసం దీన్ని విడుదల చేశారు. ఇందులో సంక్రాంతి పండుగ ఆత్మీయతను చూపించారు. అలాగే నిజంగా తెలుగు ప్రేక్షకులకు తిరుగులేని ఎంటర్టైన్మెంట్ను అందిస్తామనే జీ5 హామీ మరింత కనిపిస్తుంది. మన పండగ, మన ఎంటర్టైన్మెంట్, మన తెలుగు జీ5’ అనే కమ్యూనికేషన్ లైన్‌తో రూపొందిన ఈ క్యాంపెయిన్, ప్రాంతీయ సంస్కృతి, ప్రేక్షకులతో జీ5కి ఉన్న అనుబంధాన్ని గుర్తుకు తెస్తుంది. సంక్రాంతి సంబరాల మధ్య తెలుగు ప్రేక్షకులకు తిరుగులేని వినోదాన్ని అందించాలనే ఉద్దేశంతో ఈ బ్రాండ్ ఫిల్మ్‌ను రూపొందించినట్లు మేకర్స్ తెలియజేశారు.
Read more: సమంత కంటే ముందు రెండో పెళ్లి చేసుకున్న హీరోయిన్స్ వీళ్లే..! పూర్తి లిస్ట్ ఇదే..!
Read more: సమంత బాటలో దర్శకులను పెళ్లి చేసుకున్న హీరోయిన్స్ వీళ్లే..
సంక్రాంతి సందర్భంగా రూపొందించిన సంప్రదాయ గ్రామీణ మండువ ఇంటి సెట్లో రూపొందించిన ఈ బ్రాండ్ ఫిల్మ్‌ను గమనిస్తే.. సంక్రాంతి పండుగకి అల్లుడు (మంచు మనోజ్) పల్లెకు వస్తుంటాడు. బస్సులో టికెట్ కండెక్టర్ అందరికీ కొరియన్ సినిమా చూపెడుతుంటాడు. అదెవరికీ అర్థం కాకుండా బాధపడుతుంటారు. అప్పుడు మనోజ్.. ఆ డ్రైవర్‌ను పేరు సుబ్బరావు అయితే అప్పారావు అని పిలుస్తాడు. ‘ఎన్ని సార్లు చెప్పాలి సర్.. నా పేరు సుబ్బారావు అని, అప్పారావు కాదని అంటాడు. ‘నువ్వు చెప్పింది నాకు అర్థమైంది.. కానీ నువ్వు పెట్టిన సినిమానే మాకు అర్థం కాలేదని చెబుతాడు. మన పండగంటే మన ఎంటర్టైన్మెంట్ ఉండాలంటూ’ మనోజ్ చెప్పి తన ఫోన్లో ఉండే జీ 5 యాప్‌ను చూపెడతాడు. బస్సులో అంతా సంక్రాంతి హడావుడి మొదలవుతుంది.
ఇంటికెళ్లగానే..భార్యతో మన శంకర వర ప్రసాద్‌గారు సినిమాలోని శశిరేఖ.. పాటను సింగ్ చేస్తాడు. దానికి భార్య అతని హుషారు చూసి ‘ఏంటి బాస్ సంగతి’ అనగానే.. ‘అదిరిపోద్ది సంక్రాంతి’ అంటూనే మన పండగకి మన ఎంటర్టైన్మెంట్ ఉండాలిగా అని అంటాడు. సరదాగా చిన్న పిల్లలతో ఆడుకుంటూనే ఇంట్లో అత్త, మామలను కాస్త ఆట పట్టిస్తుంటాడు. అలాగే భర్త మహాశయులకు విజ్ఞప్తి అంటూ రవితేజ చెప్పే డైలాగ్‌ను చూపిస్తూ కుటుంబం అంతా కలిసి మన శంకర వర ప్రసాద్‌గారు, భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమాలను చూస్తారు.
అంతేకాదు త్వరలో జీ 5లో మన శంకర వర ప్రసాద్‌గారు, భర్త మహాశయులకు విజ్ఞప్తి చిత్రాలు రాబోతున్నట్టు చెప్పుకొచ్చారు. అలాగే బ్రాండ్ ఫిల్మ్‌లో పండుగ సందర్భంలో కుటుంబ సభ్యుల మధ్య ఉండే అనురాగం, ఆత్మీయత, సునిశితమైన హాస్యాన్ని చూపించాడు. ఇలా చూపించటం ద్వారా జీ 5 ఈ ఏడాదంతా తిరుగులేని ఎంటర్టైన్మెంట్ను అందిస్తుందనే విషయాన్ని ప్రేక్షకులకు చెప్పాడు.
ఈ బ్రాండ్ ఫిల్మ్‌కు సాయి మార్తాండ్ దర్శకత్వం వహించారు. పాపులర్ మూవీ లిటిల్ హార్ట్స్‌కు వర్క్ చేసిన సూర్య బాలాజీ కెమెరామెన్‌గా వర్క్ చేశారు. ఇది పండుగ స్మృతులను, ఆధునికమైన పద్ధతిలో చెప్పేలా దీన్ని తెరకెక్కించారు. ఇప్పటికే నయనం, భైరవం, సంక్రాంతికి వస్తున్నాం, కిష్కింధపురి, హను మాన్ వంటి హిట్ కంటెంట్‌తో ప్రేక్షకులకు మరింతగా చేరువైంది జీ5.
రాబోయే రోజుల్లోజీ5 మరింతగా ప్రేక్షక ఆదరణ పొందేలా సినిమాలను అందించనుంది. ఇందులో చిరంజీవి, నయనతార హీరో హీరోయిన్లుగా నటించిన మన శంకర వర ప్రసాద్ గారు, రవితేజ హీరోగా నటించిన భర్త మహాశయులకు విజ్ఞప్తి, గుర్రం పాపిరెడ్డ వంటి సినిమాలున్నాయి. ఇలాంటి చిత్రాలతో ఎంటర్టైన్మెంట్ను ప్రేక్షకులకు అందించటంలో తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకుంటోంది జీ 5 ఓటీటీ.
ఈ సందర్బంగా తెలుగు జీ 5, బిజినెస్ హెడ్ అనురాధ గురు మాట్లాడుతూ ‘‘తెలుగు ప్రేక్షకులకు తిరుగులేని, వైవిధ్యమైన ఎంటర్టైన్మెంట్ను అందించటమే మా ఎయిమ్ అన్నారు. సంప్రదాయ కుటుంబ కథల నుంచి పండుగ థీమ్ ఉన్న ఎంటర్టైనర్స్, ఆసక్తిని రేకెత్తించే థ్రిల్లర్స్, స్టార్ హీరోలకు సంబంధించిన బడా ప్రాజెక్ట్స్ ఇలా అన్నీ రకాల కంటెంట్‌ను అందిస్తున్నట్టు చెప్పారు.
సంక్రాంతి క్యాంపెయిన్‌లో ప్రధాన భూమికను పోషించిన మంచు మనోజ్ మాట్లాడుతూ ‘‘సంక్రాంతి అంటేనే కుటుంబం. ఇందులో భాగం కావటం వల్ల.. నేను ఇది వరకు ఫన్నీగా, సరదాగా నవ్వుకునేలా చేసిన క్యారెక్టర్స్ గుర్తుకొచ్చాయి. ఇప్పుడు ఆ ఫీలింగ్‌ను పొందటం చాలా కొత్తగా ఉందన్నారు. పండుగ వాతావరణాన్ని ఇందులో సహజ సిద్ధంగా పిక్చరైజ్ చేసినట్టు చెప్పుకొచ్చారు. ఇలా కుటుంబ భావాలను సెలబ్రేట్ చేసే జీ5 తెలుగు క్యాంపెయిన్‌లో భాగమవడం మరింత సంతోషంగా ఉందన్నారు.
ZEE5 గురించి...
జీ5 భారతదేశపు యంగస్ట్ అతిపెద్ద ఓటీటీ ప్లాట్ఫార్మ్. మల్టీలింగ్వుల్ ఓటీటీగా ప్రసిద్ధి పొందింది. మిలియన్ల కొద్దీ అభిమానులను సంపాదించుకుంది. గ్లోబల్ కంటెంట్ పవర్ హౌస్ జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ (జీఎల్) నుంచి శాఖగా మొదలైంది జీ5. అత్యద్భుతమైన వీడియో స్ట్రీమింగ్ ప్లాట్ఫార్మ్ గా తన కంటూ సొంత బ్రాండ్ క్రియేట్ చేసుకుంది. 4071 సినిమాల లైబ్రరీ ఉన్న అతిపెద్ద ప్లాట్ఫార్మ్ ఇది. 1800 టీవీ షోలు, 422కు పైగా ఒరిజినల్స్, 1.35 లక్షలకు పైగా ఆన్ డిమాండ్ కంటెంట్ ఈ సంస్థ సొంతం అంటూ చెప్పుకొచ్చారు. 12 భాషల్లో హిందీ, ఇంగ్లిష్,గుజరాతీ, పంజాబీ, బెంగాలీ, మలయాళం, తెలుగు, తమిళ్, మరాఠీ, ఒరియా, భోజ్‌పురి, లో అందుబాటులో ఉంది. బెస్ట్ ఒరిజినల్స్, ఇంటర్నేషనల్ మూవీస్, టీవీ షోస్, మ్యూజిక్, కిడ్స్ షోస్, ఎడ్టెక్, సినీ ప్లేస్, న్యూస్, లైవ్ టీవీ, హెల్త్, లైఫ్‌స్టైల్ విభాగాల్లో ప్రేక్షకులను అలరిస్తుందని చెప్పుకొచ్చారు.
Also Read: వెయ్యి కోట్ల దర్శకులు.. ‘దురంధర్’తో ఈ క్లబ్బులో ఎంట్రీ ఇచ్చిన ఆదిత్యధర్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.
Government Employees: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల ఆరోగ్య అవసరాలను మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. సీజీహెచ్ఎస్ లబ్ధిదారుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన పరిపూర్ణ మెడిక్లెయిమ్ ఆయుష్ బీమా( Perfect Mediclaim Ayush Insurance) ను ప్రవేశపెట్టింది. ఇప్పటివరకు ప్రభుత్వ ఆసుపత్రులు, ఎంపిక చేసిన కేంద్రాల్లో మాత్రమే చికిత్స పొందే పరిమితి ఉండేది. అయితే ఈ కొత్త బీమా పథకం ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ కార్పొరేట్ నెట్వర్క్ ఆసుపత్రుల్లో కూడా నగదు రహిత చికిత్స పొందే వెసులుబాటు కలుగుతోంది. ఇది ప్రస్తుత సీజీహెచ్ఎస్ సదుపాయాలకు అదనపు రక్షణగా పనిచేస్తుంది.
ఈ బీమా పథకం వ్యక్తిగతంగా మాత్రమే కాకుండా కుటుంబం మొత్తాన్ని దృష్టిలో ఉంచుకుని రూపొందించింది. ఒకే పాలసీ కింద గరిష్టంగా ఆరుగురు కుటుంబ సభ్యులకు రక్షణ లభిస్తుంది. పాలసీదారులు తమ అవసరాన్ని బట్టి రూ. 10 లక్షల నుంచి రూ. 20లక్షల వరకు బీమా కవరేజీని ఎంచుకునే అవకాశం ఉంది. తీవ్రమైన అనారోగ్యాలు, ఖరీదైన శస్త్రచికిత్సలు లేదా అత్యవసర వైద్య పరిస్థితులు ఎదురైనప్పుడు ఈ బీమా కుటుంబానికి ఆర్థిక భద్రతను అందిస్తుంది.
ప్రీమియం భారం తగ్గించేందుకు కో-పేమెంట్ విధానాన్ని ప్రవేశపెట్టారు. ఇందులో 70:30 లేదా 50:50 నిష్పత్తిలో ప్రీమియం చెల్లించే అవకాశం ఉంది. ఉదాహరణకు 70:30 ఎంపికలో మొత్తం ప్రీమియంలో 70 శాతం ఇన్సూరెన్స్ సంస్థ భరిస్తే, మిగిలిన 30 శాతం పాలసీదారుడు చెల్లిస్తాడు. 50:50 ఎంపికను ఎంచుకుంటే ప్రీమియం ఖర్చు మరింత తగ్గుతుంది. ఈ విధానం తక్కువ ఆదాయం ఉన్న ఉద్యోగులకు కూడా బీమాను అందుబాటులోకి తెస్తుంది. ఆసుపత్రిలో రూమ్ రెంట్ గురించి కూడా స్పష్టమైన నియమాలు ఉన్నాయి. బీమా మొత్తంలో రోజుకు 1 శాతం వరకు సాధారణ గదికి, 2 శాతం వరకు ఐసీయూ గదికి అనుమతి ఉంటుంది. ఆసుపత్రిలో చేరడానికి ముందుగా 30 రోజుల వరకు చేసిన వైద్య పరీక్షలు, మందుల ఖర్చులు కవర్ అవుతాయి. అలాగే డిశ్చార్జ్ అనంతరం అరవై రోజుల వరకు అయ్యే వైద్య ఖర్చులను కూడా క్లెయిమ్ చేసుకోవచ్చు.
ఈ పాలసీలో ఆయుష్ చికిత్సలకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. ఆయుర్వేదం, యోగా, యునాని, సిద్ధ, హోమియోపతి వంటి భారతీయ వైద్య విధానాలకు పూర్తి కవరేజీ లభిస్తుంది. ఆధునిక వైద్య చికిత్సలు, రోబోటిక్ శస్త్రచికిత్సలకు కూడా నిర్దిష్ట పరిమితిలో ప్రయోజనాలు ఉన్నాయి. అదనపు రైడర్ ద్వారా మరింత విస్తృత కవరేజీ పొందవచ్చు. ప్రైవేట్ ఇన్సూరెన్స్ పాలసీలతో పోలిస్తే ఈ పథకం చాలా తక్కువ ప్రీమియంతో అందుబాటులో ఉంది. ముఖ్యంగా ఈ పాలసీపై జీఎస్టీ పన్ను వర్తించదు. ఆరోగ్యంగా ఉండి క్లెయిమ్ చేయని వారికి ప్రతి సంవత్సరం 10 శాతం చొప్పున బీమా మొత్తాన్ని పెంచే క్యుములేటివ్ బోనస్ కూడా ఉంటుంది. న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ ద్వారా ఈ పాలసీ అమలులో ఉంది. సీజీహెచ్ఎస్ కార్డు ఉన్న ప్రతి లబ్ధిదారుడు ఈ పథకాన్ని ఉపయోగించుకుని తమ కుటుంబ ఆరోగ్య భవిష్యత్తును మరింత భద్రం చేసుకోవచ్చు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Happy Kanuma 2026 Wishes Quotes Telugu: పశువుల పండుగగా పిలిచే కనుమకు చాలా ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. సంవత్సరం పొడవునా రైతన్నలతో కలిసి కష్టపడే మూగజీవుల పాత్ర విశేషమైంది. వీటి కష్టాన్ని గుర్తించుకొని కృతజ్ఞత భావంతో ఈ కనుమ పండుగను జరుపుకుంటారు. అయితే ఈరోజు పంట పొలాల్లో పనిచేసే మూగజీవులకు మెడలో గజ్జలు కట్టి పూలదండలు వేసి ఎంతో ఆనందంగా ముస్తాబు చేస్తారు. ఆ తర్వాత ప్రత్యేకమైన నైవేద్యాన్ని సమర్పించి పూజలు చేస్తారు. ఇంతటి ప్రాముఖ్యత కలిగిన పండుగను పాడిపంటలు కలిగిన ప్రతి ఒక్కరు ఎంతో ఘనంగా జరుపుకోవాలని కోరుకుంటూ.. ఇలా శుభాకాంక్షలు తెలియజేయండి.
శుభాకాంక్షలు:
పొలంపాకలోని పశువుల పాడి.. గుమ్మం నిండా సిరి సంపదల రాశులు.. కష్టానికి తోడుగా నిలిచే మూగజీవాల పండగ కనుమ.. ఈ మూగ జీవులన్నీ ఎల్లప్పుడూ ఆరోగ్యంగా రైతుకు సహాయపడేలా ఉండాలని కోరుకుంటూ.. మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ కనుమ పండగ శుభాకాంక్షలు..
పల్లెల్లోని ముంగిట ముగ్గుల హరివిల్లులు.. పశువుల పాకలో మూగజీవుల గంటల సవ్వడి.. పాడిపంటల తోడుగా.. పల్లె మురిసే వేడుకగా.. మీ అందరికీ పేరుపేరునా కనుమ పండుగ శుభాకాంక్షలు..
నేలను దున్నిన నాగలికి.. మన పొట్టను నింపే మూగజీవులకి.. ఈ కనుమ పండగ వేళ కృతజ్ఞత తెలుపుకుందాం.. ప్రతి ఏడాదిలాగా మీ ఇంట పాడి పంటలు వర్ధిల్లాలని మనసారా కోరుకుంటూ.. మీ అందరికీ కనుమ పండుగ శుభాకాంక్షలు..
గంగిరెద్దుల అద్భుతమైన ఆటలు.. గాలిపటాల కోలాహాలం.. కనుమ పండగ రైతుల్లో తెచ్చింది కొత్త ఉత్సాహం.. ఈ సంక్రాంతి ముగింపు వేడుక మీకు ఎంతో ఉత్సాహాన్ని అందించాలని కోరుకుంటూ.. మీ అందరికీ కనుమ పండుగ శుభాకాంక్షలు..
రైతులకు ఒక వెన్నుముకగా నిలిచి.. మట్టిలోని అద్భుతమైన పంటలు పండించే.. నందివర్ధనాల వంటి పశుసంపదకు హారతి పట్టాల్సిన రోజు ఈ రోజు.. ఇంతటి శుభప్రదమైన రోజున అందరూ బాగుండాలని.. ప్రతి ఒక్కరికి సిరిసంపదలు కలగాలని కోరుకుంటూ.. మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ కనుమ పండుగ శుభాకాంక్షలు..
కుండల్లో పాలు పొంగే సంక్రాంతి.. పాడి పెరిగే కనుమ.. ప్రతి ఇంత కలకాలం ఆనందోత్సాహాల మధ్య జరగాలని.. ఆ గౌరమ్మని కోరుకుంటూ.. మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ కనుమ పండుగ శుభాకాంక్షలు..
ఎల్లప్పుడూ ప్రకృతిని ప్రేమిద్దాం.. పశువులను దైవంగా పూజిద్దాం.. మన సాంస్కృతిని అన్ని తరాలకు అందిద్దాం.. ప్రతి ఏడాది కనుమ పండుగను ఎంతో ఘనంగా జరుపుకుందాం.. మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ కనుమ పండగ శుభాకాంక్షలు.
పల్లెటూర్లో చుట్టూ పలకరింపులు.. పిండి వంటల అద్భుతమైన ఘుమఘుమలు.. కనుమ అంటేనే మమతల కలయిక. ఈ పండగ మనందరి జీవితాల్లో మధుర జ్ఞాపకాలని నింపాలని ఆ దేవుని మనసారా కోరుకుంటూ.. మీ అందరికీ కనుమ పండుగ ప్రత్యేకమైన శుభాకాంక్షలు..
Also Read: Sankranthi Muggulu 2026: సంక్రాంతి పండగ రోజు తప్పకుండా వేసుకోవలసిన 5 ముగ్గులు ఇవే..
నాగలి కట్టి కడుపు నింపుతున్న చేతులు చల్లగా ఉండాలి.. పాడి ఆవుల అంకెలు లోగిలి నిండాలి... రైతన్నలు ఎల్లప్పుడూ ఆనందంగా ఉండాలి.. వ్యవసాయం చేసే ప్రతి ఒక రైతన్నకు కనుమ పండుగ శుభాకాంక్షలు.
భోగిమంటల నుంచి వచ్చే అద్భుతమైన వేడి.. సంక్రాంతి వెలుగుల జోడి.. కనుమ తెచ్చిన పాడి.. మీ అందరి ఇంట నిండాలి ఆనందాల కోడి.. మీ అందరికీ హృదయపూర్వక కనుమ శుభాకాంక్షలు..
Also Read: Sankranthi Muggulu 2026: సంక్రాంతి పండగ రోజు తప్పకుండా వేసుకోవలసిన 5 ముగ్గులు ఇవే..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook