icon-pinewzicon-zee
PINEWZ
become creator
Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Pinewz
505001
Merugu Vinod Merugu Vinod Follow26 Jul 2024, 01:02 pm
0
0
Report

हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|

Sugarcane Juice Tips: వర్షాకాలంలో చెరకు రసం ఎక్కువగా తాగుతున్నారా? డాక్టర్లు చెప్పిన కీలక హెచ్చరికలు ఇవే!

Hyderabad, Telangana:

Sugarcane Juice Sideeffects: వర్షాకాలంలో వాతావరణం చల్లగా ఉన్నప్పటికీ, గాలిలో ఉండే తేమ వల్ల తరచూ దాహం వేస్తుంటుంది. ఈ సమయంలో రోడ్డు పక్కన కనిపించే చల్లని చెరకు రసం తాగాలని చాలామంది ఆసక్తి చూపుతారు. చెరకు రసంలో ఐరన్, పొటాషియం, మెగ్నీషియం వంటి ఖనిజాలతో పాటు యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది శరీరానికి తక్షణ శక్తిని ఇవ్వడమే కాకుండా డీహైడ్రేషన్‌ను నివారిస్తుంది. అయితే, వర్షాకాలంలో రోడ్డు పక్కన లభించే చెరకు రసం తాగడం ఆరోగ్యానికి సురక్షితమేనా? నిపుణులు ఏమంటున్నారో ఇక్కడ చూద్దాం.

వర్షాకాలంలో చెరకు రసం వల్ల కలిగే నష్టాలు
వర్షాకాలంలో వాతావరణం బ్యాక్టీరియా, వైరస్‌ల వృద్ధికి ఎంతో అనుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో తగిన జాగ్రత్తలు పాటించకపోతే తీవ్ర అనారోగ్యాలు చుట్టుముట్టే అవకాశం ఉంది.

తీవ్రమైన ఇన్ఫెక్షన్లు: పరిశుభ్రత లేని పరిసరాల్లో, ఈగలు ముసిరే ప్రదేశాలలో విక్రయించే చెరకు రసం తాగడం వల్ల కలరా, టైఫాయిడ్, కామెర్లు, డయేరియా వంటి జీర్ణకోశ సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది.

కలుషితమైన ఐస్ వాడకం: రసంలో కలిపే ఐస్ క్యూబ్స్ స్వచ్ఛమైన నీటితో తయారు చేయకపోతే, వాటిలోని బ్యాక్టీరియా కారణంగా గొంతు నొప్పి, జలుబు, ఇతర ఇన్ఫెక్షన్లు వస్తాయి.

శుభ్రత లోపించడం: చెరకు రసం తీసే యంత్రాలు, గ్లాసులను శుభ్రంగా కడగకపోతే వాటిపై పేరుకుపోయే బ్యాక్టీరియా వల్ల రోగనిరోధక శక్తి తగ్గి త్వరగా జబ్బుల బారిన పడతారు.

ఈ సీజన్‌లో పాటించవలసిన ముందస్తు జాగ్రత్తలు
1) వీధి పక్కన కాకుండా, అత్యంత శుభ్రంగా ఉండే ప్రదేశాలలో అప్పటికప్పుడు (ఫ్రెష్‌గా) తీసిన చెరకు రసాన్ని మాత్రమే ఎంచుకోవాలి.

2) వర్షాకాలంలో చెరకు రసంలో ఐస్ క్యూబ్స్ వేయించుకోకుండా తాగడమే శ్రేయస్కరం.

3) చెరకు రసం తీసిన కొద్ది నిమిషాల్లోనే తాగేయాలి. ఎక్కువసేపు నిల్వ ఉంచితే అది ఆక్సీకరణం చెంది అనారోగ్యానికి దారితీస్తుంది.

4) మధుమేహం (షుగర్) లేదా జీర్ణ సమస్యలు ఉన్నవారు ఈ సీజన్‌లో చెరకు రసానికి దూరంగా ఉండటం మంచిది. ఒకవేళ తీసుకోవాలంటే వైద్యుల సలహా తీసుకోవడం తప్పనిసరి.

పోషకాలు నిండిన చెరకు రసం ఆరోగ్యానికి మంచిదే అయినప్పటికీ, వర్షాకాలంలో దాని తయారీలో పాటించే శుభ్రతపైనే మీ ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఈ సీజన్‌లో సురక్షితంగా ఉండండి!

Also Read: Shravan Month Diet: శ్రావణ మాసం బరువు తగ్గడానికి ఒకే ఒక్కదారి! 10 రకాల శాకాహారంతో కొవ్వు మొత్తం తగ్గిపోతుంది!

Also REad: Apple Pickle: ఆపిల్ పండుతో పచ్చడి ఎలా చేయాలో మీకు తెలుసా?

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report

కరాచీ లైయారీలో మళ్లీ గ్యాంగ్‌వార్.. బైక్‌పై వచ్చి జుబేర్ బలోచ్‌పై తూటాల వర్షం..

Hyderabad, Telangana:

Lyari Gang War Returns: నిశ్శబ్దంగా ఉన్న ఆ వీధిలో ఒక్కసారిగా తూటాల వర్షం కురిసింది.. సెకన్ల వ్యవధిలోనే వీధులు రక్తసిక్తమయ్యాయి.. ఒకప్పటి కరాచీ నరకకూపాన్ని కళ్లముందుకు తెచ్చాయి.. పాకిస్తాన్‌లోని అత్యంత కుప్రసిద్ధ గ్యాంగ్‌స్టర్, పీపుల్స్ అమన్ కమిటీ మాజీ అధినేత ఉజైర్ బలోచ్ సోదరుడు జుబేర్ బలోచ్‌పై గురువారం సాయంత్రం దుండగులు మెరుపు దాడి చేశారు. 

ఏం జరిగింది? 
కరాచీలోని అత్యంత ప్రాముఖ్యత కలిగిన లైయారీలోని సింగు లేన్ వద్ద జుబేర్ బలోచ్ తన ఇంటి బయట ప్రశాంతంగా కూర్చుని ఉన్నాడు. అక్కడ వాతావరణం సాధారణంగానే ఉంది.. కానీ ఆ ప్రశాంతత వెనుక మృత్యువు దాగి ఉందనే విషయం ఎవరూ ఊహించలేదు.. హఠాత్తుగా ముఖాలకు ముసుగులు ధరించి.. బైక్‌పై వచ్చిన గుర్తుతెలియని ముఠా.. జుబేర్‌ను లక్ష్యంగా చేసుకుని తుపాకులతో విరుచుకుపడింది.

తూటాల శబ్దాలతో ఆ ప్రాంతమంతా మార్మోగిపోయింది. జుబేర్ చాతి.. పొట్ట భాగాల్లోకి బుల్లెట్లు దూసుకెళ్లడంతో ఆయన అక్కడికక్కడే రక్తమడుగులో విలవిలలాడిపోయాడు. ఈ కాల్పుల్లో దారిన పోతున్న ఇద్దరు అమాయక పౌరులు కూడా తీవ్రంగా గాయపడ్డారు. సమీపంలోని ఓ షాపు యజమాని ధైర్యం చేసి తిరుగు కాల్పులు జరపడంతో.. దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు.

తీవ్రంగా గాయపడిన జుబేర్‌ను వెంటనే స్థానికులు కరాచీలోని సివిల్ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు శస్త్రచికిత్స చేసి బుల్లెట్లను తీసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆసుపత్రి అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి అత్యంత విషమంగా ఉందని.. చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారని వైద్య వర్గాలు తెలిపాయి. సౌత్ డిఐజి సయ్యద్ అసద్ రజా ఈ ఘటన ప్రత్యేకమైన విచారణ చేస్తున్నట్లు తెలుస్తోంది.. 

2012లో పలు తీవ్ర నేరాల్లో అరెస్ట్ అయిన ఆయన.. ఇటీవలే జైలు నుంచి విడుదలై.. ఓ రాజకీయ పార్టీలో చేరి క్రియాశీలకంగా మారారు. ఇక ఆయన అన్న ఉజైర్ బలోచ్ ఓ కేసులో 12 ఏళ్ల జైలు శిక్ష అనుభవిస్తుండగా.. ఇతర హత్యలు, ఉగ్రవాద కేసుల్లో ఆయన బెయిల్ పిటిషన్లు ఇటీవలే కోర్టు తిరస్కరించిన్నట్లు తెలుస్తోంది..

Also Read: పోలీస్ వ్యాన్‌ను ఒంతిచేత్తో ఆపేసిన బాలీవుడ్ బ్యూటీ..నీట్ విద్యార్థులకు అండగా మోడల్!

అయితే, ఈ కాల్పుల ఘటనతో లైయారీ వాసులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నట్లు తెలుస్తోంది. కరాచీ ఆపరేషన్ భయంతో దుబాయ్, ఇరాన్‌లకు పారిపోయిన పాత గ్యాంగ్‌స్టర్లు మళ్లీ నగరంలోకి అడుగుపెట్టారనే పుకార్లు స్థానికులను తీవ్రంగా కలవరపెడుతున్నాయి. ఏ క్షణంలో ఏం జరుగుతుందో.. ఎవరి తలలు తెగిపడతాయోనని కరాచీ ప్రజలు భయంతో వణికిపోతున్నారు..

Also Read: పోలీస్ వ్యాన్‌ను ఒంతిచేత్తో ఆపేసిన బాలీవుడ్ బ్యూటీ..నీట్ విద్యార్థులకు అండగా మోడల్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
0
Report
Advertisement

Shravan Month Diet: శ్రావణ మాసం బరువు తగ్గడానికి ఒకే ఒక్కదారి! 10 రకాల శాకాహారంతో కొవ్వు మొత్తం తగ్గిపోతుంది!

Hyderabad, Telangana:

Shravan Month Diet Plan: శ్రావణ మాసం చాలా మందికి ఉపవాసంతో పాటు శాకాహారం మనలో ఎంతో మార్పులను తెలుస్తుంది. ఈ మాసంలో అనుసరించాల్సి ఉత్తమమైన సాత్విక ఆహారం గురించి తెలుసుకుందాం. ఇలాంటి శాకాహారాన్ని తినడం వల్ల తేలికగా మారడం కాకుండా ఆహారం త్వరగా జీర్ణమవుతుంది. ఇది శరీరాన్ని శుద్ధి చేయడంలో (డిటాక్స్) కూడా ఈ సాత్విక ఆహారం ఉత్తమంగా పనిచేస్తుంది. ఇలాంటి సాత్విక ఆహారాన్ని అలవాటు చేసుకునేందుకు శ్రావణ మాసం ఓ మంచి అవకాశంగా మారింది. అయితే శ్రావణ మాస డైట్‌ను పాటిస్తూనే బరువు తగ్గాలని ప్రయత్నించే వారికి కొన్ని సరైన ఎంపికలను ఇప్పుడు తెలుసుకుందాం.

1) సొరకాయ (బాటిల్ గార్డ్)
తక్కువ కేలరీలు, అధిక నీటి శాతం కలిగి ఉండే సొరకాయ బరువు తగ్గడానికి అవసరమైన రెండు అంశాలనూ నెరవేరుస్తుంది. ఇది జీర్ణక్రియకు కూడా సహాయపడుతుంది. అలాగే మిమ్మల్ని ఎక్కువసేపు కడుపు నిండుగా ఉంచుతుంది. దీనిని కూరగా వండుకోవచ్చు, సూప్‌గా మార్చుకోవచ్చు లేదా జ్యూస్‌గా కూడా తాగవచ్చు.

2) దోసకాయ
చల్లగా, శరీరానికి తేమను అందిస్తూ, విడిగా తినడానికి లేదా సలాడ్‌లో కలుపుకోవడానికి సులభంగా ఉంటుంది. దోసకాయలో పీచుపదార్థం, నీరు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరాన్ని నిర్విషీకరణ చేయడానికి, ఆకలిని అదుపులో ఉంచడానికి సహాయపడతాయి. ఉపవాస సమయంలో భోజన ఎంపికలు తగ్గిపోయే అవకాశం ఉన్నందున, ఇది ప్రత్యేకంగా ఉపయోగపడుతుంది.

3) సగ్గుబియ్యం
ఉపవాస సమయంలో ఇది ఒక ముఖ్యమైన ఆహార పదార్థం. సగ్గుబియ్యంలో కార్బోహైడ్రేట్లు ఉండటం వల్ల ఇది తక్షణ శక్తిని అందిస్తుంది. అయితే దీనిని మితంగా తీసుకోవడం ముఖ్యం. దీనిని వేరుశెనగలు, పెరుగుతో కలిపి తీసుకుంటే, అది మరింత కడుపు నింపేదిగా, సమతుల్యంగా మారుతుంది.

4) సింగారా (వాటర్ చెస్ట్‌నట్ ఫ్లోర్)
వ్రతంలో తప్పనిసరిగా వాడే ఒక పదార్థం. గ్లూటెన్ రహితం, తేలికైనది, తక్కువ కేలరీలు కలిగి ఉంటుంది. మీ శ్రావణ మాస భోజనాలలో పూరీలు, పాన్‌కేక్‌లు లేదా టిక్కీల కోసం దీనిని ఉపయోగించండి.

5) మఖానా (ఫాక్స్ నట్స్)
తక్కువ కొవ్వు, అధిక ప్రోటీన్, పీచుపదార్థం కలిగిన మఖానా నిజంగా ఆరోగ్యకరమైన చిరుతిండి. ఇది మీ కడుపును నిండుగా ఉంచుతుంది. అతిగా తినడాన్ని అరికడుతుంది. దీనిని నెయ్యి, సైంధవ లవణంతో కొద్దిగా వేయించుకుంటే, ఇది కూడా ఒక రుచికరమైన ఎంపిక.

6) పెరుగు
మంచి బ్యాక్టీరియా, మంచి జీర్ణక్రియ.. ఈ రెండింటినీ పెరుగు అందిస్తుంది. ఇది శరీరానికి చల్లదనాన్ని ఇస్తుంది. కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తుంది. దీనిని అలాగే తినండి, లేదా దోసకాయ లేదా పుదీనాతో రైతా తయారు చేసుకోండి.

7) కొబ్బరి నీరు
శరీరంలో నీటి శాతం తగ్గకుండా, తాజాగా ఉండేందుకు ఇది ఒక సహజమైన మార్గం. తక్కువ కేలరీలు, ఎలక్ట్రోలైట్లతో నిండి ఉంటుంది. ముఖ్యంగా వాతావరణం తేమగా మారినప్పుడు, శ్రావణ మాసానికి ఇది చాలా అనువైనది.

8) పండ్లు (అరటిపండు, ఆపిల్, బొప్పాయి మొదలైనవి)
విటమిన్లు, సహజ శక్తిని ఈ రెండింటినీ పండ్లు అందిస్తాయి. వీటిని అల్పాహారంగా లేదా మధ్యాహ్నపు చిరుతిండిగా తీసుకోండి. ఆపిల్, బొప్పాయి వంటి పీచుపదార్థం అధికంగా ఉండే పండ్లు ముఖ్యంగా జీర్ణక్రియకు సహాయపడతాయి. కడుపు ఉబ్బరాన్ని తగ్గిస్తాయి.

9) చిలగడదుంప
చిలగడదుంపలో కడుపు నింపేది, పోషకమైనది, పీచుపదార్థం అధికంగా ఉంటుంది. దీనిని ఉడకబెట్టండి లేదా కాల్చండి. ఏదేమైనప్పటికీ, ఇది రుచి విషయంలో ఏమాత్రం రాజీ పడని, వ్రతానికి అనువైన ఒక సులభమైన భోజనం.

10) పెసరపప్పు (పసుపు కాయధాన్యాలు)
కడుపుకు తేలికగా ఉంటుంది, ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. ఉపవాసం లేని రోజులకు చాలా మంచిది. ఇది బరువు తగ్గే లక్ష్యాలకు మద్దతు ఇస్తూనే కండరాలను కాపాడుకోవడానికి సహాయపడుతుంది.

ఆరోగ్యకరమైన అలవాట్లను అలవర్చుకోవడానికి శ్రావణ మాసం నిజంగా మంచి సమయం. తేలికైన, పోషకమైన, సాత్విక ఆహారం, బరువు తగ్గే లక్ష్యాలను సాధిస్తూనే సంప్రదాయాలను గౌరవించేలా చేస్తుంది. తగినంత నీరు తాగండి.. మితంగా తినండి.. వీలైనంత వరకు వేయించిన, బరువైన ఉపవాస ఆహారాలను మానుకోండి. అసలు సూత్రం ఇదే.

(గమనిక: పైన పేర్కొన్న సమాచారం కేవలం పాఠకుల ఆసక్తి మేరకు పొందుపరిచినది. అనేక రుగ్మతలతో బాధపడే వారు దీన్ని పాటించే ముందు సంబంధిత వైద్య నిపుణుడ్ని సంప్రదించడం మేలు.)

Also Read: Apple Pickle: ఆపిల్ పండుతో పచ్చడి ఎలా చేయాలో మీకు తెలుసా?

Also Read: Weight Loss Habits: బరువు తగ్గడానికి ప్రతిరోజూ ఉదయం చేయాల్సిన పనులు!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report

Bhadrachalam: వరద ఉధృతితో గోదావరి ఉగ్రరూపం.. భద్రాచలంలో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ

Telangana:

Godavari Water Flow: ఎగువ ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో భద్రాచలం వద్ద గోదావరి ఉద్ధృతి అంతకంతకూ పెరుగుతోంది. గంట గంటకూ నీటిమట్టం పెరుగుతూ ముంపు ప్రాంత పజలను ఆందోళన కలిగిస్తోంది. భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 43 అడుగులకు చేరుకోవడంతో అధికారులు తొలి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. దీంతో నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

ఎగువ నుంచి భారీగా వరద నీరు వస్తుండటంతో సాయంత్రానికి నీటిమట్టం మరింత పెరిగే అవకాశం ఉందని కేంద్ర జల సంఘం అధికారులు అంచనా వేస్తున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలం వద్ద గోదావరికి వరద ఉధృతి పెరుగుతోంది. భద్రాచలం వద్ద ఉదయం  గోదావరి నీటిమట్టం 39.8 అడుగులకు చేరి ప్రవహిస్తోంది. భద్రాచలం వద్ద గోదావరి నది నుంచి దిగువకు 7,63,488 క్యూసెక్కుల వరద నీరు విడుదలవుతోంది.

నిన్న సాయంత్రం 28 అడుగుల వద్ద ప్రవహించి పది అడుగుల మేర పెరిగి ప్రస్తుత 39.8 అడుగులకు గోదావరి చేరింది. ఈరోజు సాయంత్రం లేదా రేపు భద్రాచలం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఇంద్రావతి, ప్రాణహిత, మేడిగడ్డ నుంచి సుమారు 12 లక్షల క్యూసెక్కుల వరద నీరు పెద్ద ఎత్తున గోదావరిలోకి వచ్చి చేరుతోంది. దీంతో భద్రాచలంలో రామాలయం కల్యాణ కట్ట, స్నానఘట్టాల వద్దకు వరద చేరింది. వరద ప్రవాహం వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో అధికారులు ముంపు ప్రాంతాల ప్రజలకు అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే సూచనలు, సలహాలు చేస్తున్నారు.

భద్రాచలం వద్ద హెచ్చరికలు ఇలా ఇస్తారు..
43 అడుగులకు చేరితే మొదటి ప్రమాద హెచ్చరిక
48  అడుగులకు చేరితే రెండో ప్రమాద హెచ్చరిక
53 అడుగులకు చేరితే మూడో ప్రమాద హెచ్చరిక

పెన్‌గంగా ప్రవాహం
ఆదిలాబాద్ జిల్లా మహారాష్ట్ర సరిహద్దులో ప్రమాదకర స్థాయిలో పెన్ గంగా ప్రవహిస్తోంది. పెన్ గంగాలోకి ఎగువన మహారాష్ట్ర నుంచి 2.5 లక్షల క్యూసెక్కులు ఇన్ ఫ్లో వస్తోంది. దీంతో భీంపూర్, జైనథ్, భోరజ్, బేల మండలాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. పెన్‌గంగా పరివాహక ప్రాంతంలో భారీ వరదతో పత్తి-సోయా పంటలు నీట మునిగాయి.

ఎల్లంపల్లి గేట్లు ఎత్తివేత
శ్రీ పాద ఎల్లంపల్లి నిండడంతో ప్రాజెక్టు గేట్లను అధికారులు ఎత్తారు. నిన్న సాయంత్రం నుంచి ఎల్లంపల్లి ప్రాజెక్టు గేట్ల లిఫ్టింగ్ కొనసాగుతుంది. కడెం ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో లక్షల క్యూసెక్కుల నీరు గోదావరి నదిలో చేరింది. కడెం నీళ్లు గోదావరి నది ప్రవాహంతో ఎల్లంపల్లి నిండింది. దీంతో రాత్రి 12 గంటల వరకు ఎల్లంపల్లి ప్రాజెక్టు 30 గేట్లను లిఫ్ట్ చేసి 4 లక్షల 90 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. కాళేశ్వరం వద్ద గోదావరి నది పరవళ్లు తొక్కుతుంది. మేడిగడ్డ లక్ష్మి బ్యారేజీ వద్ద 8 లక్షల క్యూసెక్కుల ఇన్ ఫ్లో, అవుట్ ఫ్లో కొనసాగుతుంది.

0
0
Report

పిచ్చెక్కించే లుక్‌లో Vivo T5x 5G Fusion Red విడుదల.. చీప్‌ ధరకే మీ సొంతం!

Hyderabad, Telangana:

Vivo T5x 5g Fusion Red Variant: భారతీయ స్మార్ట్‌ఫోన్ ప్రియులను విశేషంగా ఆకట్టుకుంటున్న వివో (Vivo) సంస్థ.. తన పాపులర్ మోడల్ వివో T5x 5G (Vivo T5x 5G)లో కొత్తగా  ఫ్యూజన్ రెడ్ (Fusion Red) వర్షన్ వేరియంట్‌ను భారత మార్కెట్లో అధికారికంగా విడుదల చేసింది. అద్భుతమైన పర్‌ఫార్మెన్స్‌తో పాటు ఆకట్టుకునే డిజైన్ కోరుకునే వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని.. ఈ స్మార్ట్‌ఫోన్‌ను రూపొందించిన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అందుబాటులో ఉన్న స్టార్ సిల్వర్‌తో పాటు సైబర్ గ్రీన్ రంగులతో పాటు ఈ కొత్త రెడ్ షేడ్ కూడా వినియోగదారులకు అందుబాటులోకి వచ్చింది..

ధర వివరాలు..
ఈ వివో T5x 5G స్మార్ట్‌ఫోన్ మూడు వేరియంట్లలో అందుబాటులో రాబోతున్నట్లు తెలుస్తోంది. ఇందులోని మొదటి వేరియంట్‌ 6GB ర్యామ్‌తో పాటు 128GB స్టోరేజ్‌తో కేవలం రూ.24,999లోపే విడుదల కావడం విశేషం.. ఒక రెండవ స్టోరేజ్‌ వేరియంట్‌ 8GB ర్యామ్‌తో పాటు 128GB స్టోరేజ్ రూ.27,999తో అందుబాటులోకి వస్తోంది. ఇక చివరి వేరియంట్‌ 8GB ర్యామ్‌తో 256GB స్టోరేజ్ రూ.30,999తో విడుదలైంది. 

లాంచ్ ఆఫర్లు..
ఇక హెచ్‌డిఎఫ్‌సి (HDFC), యాక్సిస్ బ్యాంక్ (Axis Bank)తో పాటు ఎస్‌బిఐ (SBI) క్రెడిట్ కార్డ్‌ల ద్వారా కొనుగోలు చేసే వినియోగదారులకు రూ.2,000 వరకు ఫ్లాట్‌ డిస్కౌంట్ అందుబాటులో ఉంది.. అంతేకాకుండా 6 నెలల వరకు నో-కాస్ట్ ఈఎమ్‌ఐ (No-Cost EMI) వెసులుబాటును కూడా కంపెనీ అందిస్తోంది..

ఈ ఫోన్‌కి సంబంధించిన ఫీచర్స్‌ వివరాల్లోకి వెళితే.. దీని ప్రధాన ఆకర్షణ 7,200mAh భారీ బ్యాటరీగా భావించవచ్చు. దీనికి తోడు 44W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ లభిస్తుంది. దీనివల్ల లాంగ్ బ్యాటరీ లైఫ్ లభించడమే కాకుండా వేగంగా ఛార్జ్ చేసుకోవచ్చు. ఇందులో 6.76 అంగుళాల ఫుల్ హెచ్‌డీ ప్లస్ (FHD+) డిస్‌ప్లే కూడా అందుబాటులో ఉంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌తో పాటు 1200 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో అందుబాటులో ఉంది.

ఈ స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7400 టర్బో (MediaTek Dimensity 7400 Turbo) 4nm ప్రాసెసర్‌పై పనిచేస్తుందని కంపెనీ వెల్లడించింది. ఇది ఆండ్రాయిడ్ 16 ఆధారిత OriginOS 6 ఆపరేటింగ్ సిస్టమ్‌పై రన్‌ అవుతుంది.. ఫోటోగ్రఫీ ప్రియుల కోసం వెనుక వైపు 50 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాతో పాటు 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్‌లను కూడా అందిస్తోంది.. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఫ్రంట్‌ భాగంలో 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా కూడా అందుబాటులో ఉంది..

Also Read:  7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!

దుమ్ము, నీటి నుంచి ప్రొటక్షన్‌ కోసం IP68తో పాటు IP69 రేటింగ్స్ కలిగి ఉంది. సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 5G, వై-ఫై 6, బ్లూటూత్ 5.4తో పాటు యూఎస్‌బీ టైప్-సి (USB Type-C) కనెక్టివిటీ ఆప్షన్లు ఇందులో ఉన్నాయి. భారీ బ్యాటరీ లైఫ్, శక్తివంతమైన కెమెరా, అద్భుతమైన ప్రాసెసర్‌తో రూ. 25,000 బడ్జెట్ విభాగంలో Vivo T5x 5G ఫ్యూజన్ రెడ్ మోడల్ వినియోగదారులకు ఒక అద్భుతమైన ఎంపికగా భావించవచ్చు..

Also Read:  7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
0
Report
Advertisement

Bhogapuram Airport: ప్రధాని మోదీ పర్యటనకు భారీస్థాయిలో భద్రతా ఏర్పాట్లు

Bhogapuram, Andhra Pradesh:

PM Modi AP Tour: భోగాపురం అల్లూరి సీతారామారాజు ఎయిర్‌పోర్టు ప్రారంభోత్సవం రేపు అట్టహాసంగా జరగనుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రాష్ట్ర గవర్నర్‌, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌, కేంద్ర, రాష్ట్ర మంత్రులు హాజరుకానున్న ఈ కార్యక్రమానికి భారీ స్థాయిలో భద్రతా ఏర్పాట్లు చేశారు. భోగాపురం ఎయిర్‌పోర్టు ప్రారంభోత్సవానికి చేసిన భద్రతా ఏర్పాట్లను జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ వెల్లడించారు. మొత్తం ఏడు వేల మందితో భద్రతా ఏర్పాటుచేసినట్లు తెలిపారు.

విమానాశ్రయ ప్రాంతాన్ని ప్రధానంగా 13 విభాగాలుగా విభజించాలని, వాటిని  89 సెక్టార్లుగా చేసి, ప్రతి సెక్టార్‌కూ 80 నుంచి 100 మంది సిబ్బందిని కేటాయించారు. ఈ బందోబస్తు విధుల కోసం రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి బలగాలను రప్పించగా, వారిలో 30 మంది ఐపీఎస్ అధికారులతో పాటు డీజీ, ఏడీజీ, ఐజీ, డీఐజీ, ఎస్పీ, ఏఎస్పీ, డీఎస్పీ స్థాయి అధికారులు ఉన్నారు. అత్యంత ప్రశాంతంగా జరిగేలా దాదాపు 7,000 మంది పోలీసు సిబ్బందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ దామోదర్ తెలిపారు.

సభా ప్రాంగణం, ఎయిర్‌పోర్ట్ జోన్, రూట్ బందోబస్తు, పార్కింగ్ ప్రాంతాలను ప్రత్యేక బృందాలు పర్యవేక్షిస్తున్నాయి. ఔటర్ పెరిఫెరల్ ప్రాంతాల్లో గ్రేహౌండ్స్, ఆక్టోపస్ దళాలు, మెటల్ డిటెక్టర్లతో కూడిన క్రైమ్ టీమ్స్ వారం రోజుల నుంచే తనిఖీలు చేపట్టాయని జిల్లా ఎస్పీ తెలిపారు. నేరాలు జరగకుండా ప్రత్యేకంగా పోలీసు సిబ్బందిని నియమించామని, డాగ్, బాంబ్ స్క్వాడ్ బృందాలు ఇప్పటికే సభ, ఎయిర్ పోర్ట్ ప్రాంగణంను క్షుణ్ణంగా తనిఖీలు చేశాయి.

ఎయిర్ పోర్ట్ చుట్టూ ఉన్న ప్రాంతాలను, గ్రామాలను సందర్శించి భద్రతా దళాలు పూర్తి పట్టు సాధించాయి. ప్రధాని  సభలో ప్రముఖులు పాల్గొననున్న కారణంగా భద్రత కట్టుదిట్టం చేసి, నాలుగంచెల పోలీసు భద్రతను ఏర్పాటు చేశారు. సభకు వచ్చే ప్రజలను క్షుణ్ణంగా తనిఖీ చేసిన తరువాతనే సభ ప్రాంగణంలోకి అనుమతించనున్నారు. ప్రధాని సభకు దాదాపు 3 లక్షల మంది ప్రజలు, 5,000 బస్సులు, ద్విచక్ర వాహనాలతో సహా 7,000 వరకు వీఐపీ, ఇతర ప్రైవేటు వాహనాలు వచ్చే అవకాశం ఉందని పోలీసులు అంచనా వేశారు.

పార్కింగ్ స్థలాలు
భోగాపురం ఎయిర్‌పోర్టు ప్రారంభం సందర్భంగా తీవ్ర ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. వాహనాలు దారి మళ్లించారు.
విశాఖపట్నం, అనకాపల్లి, విజయనగరం వైపు నుంచి వచ్చే వాహనాలు: జాతీయ రహదారి-16 పైన ఆనందపురం జంక్షన్ మీదుగా రాజాపులోవ జంక్షన్‌కు చేరుకుని.. అక్కడ కొత్తగా నిర్మించిన ట్రంపెట్ బ్రిడ్జ్ వద్ద కుడివైపునకు మళ్లి పార్కింగ్ స్థలాలకు వెళ్లాల్సి ఉంటుంది.

శ్రీకాకుళం, రాజాం, చీపురుపల్లి, నెల్లిమర్ల, ఒడిశా వైపు నుంచి వచ్చే వాహనాలు: జాతీయ రహదారి-16 మీదుగా వచ్చి భోగాపురం పరిధిలోని ముంజేరు జంక్షన్ లేదా కంచేరు-రావివలస జంక్షన్ల వద్ద సర్వీస్ రోడ్డులోకి మళ్లి పార్కింగ్ ప్రదేశాలకు చేరుకోవాలి.
వీఐపీల పార్కింగ్‌: వీఐపీల వాహనాలు నేరుగా వీఐపీ పార్కింగ్‌కు చేరేలా సవరవల్లి జంక్షన్ నుంచి సన్ రే రిసార్ట్స్ సర్వీస్ గేటు మీదుగా ఎయిర్ పోర్టు ప్రాంతంలోకి చేరుకొనే విధంగా రహదారి ఏర్పాటు

సభా ప్రాంగణానికి కేవలం 400 నుంచి 600 మీటర్ల దూరంలోనే అన్ని వాహనాలకు పార్కింగ్ వసతి కల్పించారు. మార్గమధ్యంలో వాహనాలు నిలిపివేస్తే వెనుక వచ్చే వాహనాలకు తీవ్ర ట్రాఫిక్ అంతరాయం ఏర్పడే ప్రమాదం ఉండడంతో ప్రతిఒక్కరూ కేటాయించిన పార్కింగ్ ప్రాంతాల్లోనే వాహనాలను నిలపాల్సి ఉంటుంది. జాతీయ రహదారిపై సభకు వచ్చే ప్రజలు ఇబ్బంది పడకుండా పార్కింగ్ స్థలాలకు చేరుకొనేలా ఎక్కడికక్కడ సూచిక బోర్డులను ఏర్పాటు చేశారు.

అత్యవసర సర్వీసులు, నిబంధనలు
భోగాపురం ఎయిర్‌పోర్టు ప్రారంభోత్సవం సందర్భంగా నో ఫ్లైయింగ్ జోన్‌గా ప్రకటించారు. ఎయిర్‌పోర్ట్ పరిసర ప్రాంతాల్లో 5 కిలోమీటర్ల పరిధిలో 48 గంటల పాటు 'నో ఫ్లైయింగ్ జోన్' ప్రకటించారు. డీజీసీఏ అనుమతి లేకుండా ప్రైవేట్ వ్యక్తులు, ప్రభుత్వ అధికారులు డ్రోన్లు ఎగరవేస్తే వాటిని జప్తు చేసి, బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి జైలుకు పంపుతారు.

అత్యవసర ప్రయాణాలు వాయిదా
రేపు జాతీయ రహదారిపై భారీ సంఖ్యలో వాహనాలు రాకపోకలు సాగిస్తుండడంతో అత్యవసరం అయితే తప్ప సాధారణ ప్రయాణికులు తమ ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని జిల్లా పోలీస్‌ యంత్రాంగం విజ్ఞప్తి చేసింది.

మెడికల్ క్యాంపులు, అంబులెన్సులు
ఎమర్జెన్సీ పరిస్థితుల ఎదురైతే తక్షణ వైద్యం అందించేందుకు పలుచోట్ల మెడికల్ క్యాంపులు, అంబులెన్సులను సిద్ధంగా ఉంచారు. ఆసుపత్రులకు తరలించేందుకు ప్రత్యేకంగా ఒక కారిడార్‌ను ఖాళీగా ఉంచినట్లుగా జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ తెలిపారు.

0
0
Report
Advertisement
Advertisement

PM Modi Bhogapuram Visit: భోగాపురం విమానాశ్రయం ప్రారంభోత్సానికి ఏర్పాట్లు పూర్తి..ప్రధానమంత్రి మోదీ పర్యటన షెడ్యూల్ ఇదే!

Bhogapuram, Andhra Pradesh:

PM Modi Bhogapuram Schedule: విజయనగరం జిల్లా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పర్యటన షెడ్యూల్ అధికారికంగా ఖరారైంది. ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు పూర్తయినట్లు ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి వెల్లడించారు. ప్రధాని మోదీ రాక నేపథ్యంలో గత వారం రోజులుగా అధికార యంత్రాంగం విశాఖపట్నంలోనే ఉంటూ ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు.

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన షెడ్యూల్ ఖరారైంది. ఈ పర్యటనలో ప్రధాని మోదీ సుమారు 2 గంటల 25 నిమిషాల పాటు కార్యక్రమంలో గడపనున్నట్లు షెడ్యూల్ ప్రకారం తెలుస్తోంది. అయితే ప్రధాని రాకకు సంబంధించిన మినిట్-టూ-మినిట్ షెడ్యూల్ వివరాలను తెలుసుకుందాం.

ఉదయం 10:45: ప్రత్యేక విమానంలో దిల్లీ నుంచి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి ప్రధాని మోదీ వస్తారు.

10:45 - 10:50: గవర్నర్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర-రాష్ట్ర మంత్రులు ప్రధాని మోదీకి ఘన స్వాగతం పలుకుతారు.

10:50 - 10:55: రోడ్డు మార్గాన ప్రయాణికుల టెర్మినల్ భవనానికి ప్రధాని మోదీ చేరుకుంటారు.

10:55 - 10:58: 200 మంది విద్యార్థుల కూచిపూడి నృత్యాలతో ప్రధానికి స్వాగతం పలికారు.

11:00 - 11:15: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణ పనులను పరిశీలన.

11:17 - 11:25: టెర్మినల్ భవనం నుంచి ఓపెన్‌టాప్ జీప్‌లో బహిరంగ సభా వేదికకు చేరుకుంటారు.

11:30 - 12:55: భోగాపురం విమానాశ్రయం ప్రారంభోత్సవం తర్వాత శిలాఫలక ఆవిష్కరణ, వివిధ అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవం, బహిరంగ సభలో ప్రసంగం.

మధ్యాహ్నం 1:05 - 1:10: భోగాపురం నుంచి ప్రత్యేక విమానంలో తిరుగు ప్రయాణం.

రవాణా, భారీ జనసమీకరణ ఏర్పాట్లు
ప్రధాని పర్యటన, బహిరంగ సభకు భారీగా ప్రజలు తరలిరానున్న నేపథ్యంలో రవాణా శాఖ పకడ్బందీ చర్యలు చేపట్టింది. సభకు వచ్చే ప్రజల సౌకర్యార్థం మొత్తం 5,000 వాహనాలను సిద్ధం చేశారు. ఇందులో 2,000 ఆర్టీసీ బస్సులు, 3,000 ప్రైవేట్ వాహనాలు ఉన్నాయి. ప్రజలు అనుకున్న సమయానికి గమ్యస్థానానికి చేరుకునేలా రవాణా అధికారులు అన్ని మార్గాల్లోనూ తగు జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రధాని మోదీ పర్యటనను విజయవంతం చేసేందుకు దాదాపు 3 లక్షల మందితో భారీగా జనసమీకరణ చేస్తున్నారు.

Also Read: IMD Weather Alert: ఏపీ, తెలంగాణకు భారీ తుఫాను ముప్పు..బంగాళాఖాతంలో తీవ్ర అలజడి!

Also REad: తెలంగాణ విద్యార్థులకు గుడ్‌న్యూస్..భారీ వర్షాలు, బోనాల సందడి..వరుసగా 4 రోజులు సెలవు!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report

Rega Kantha Rao: యువతిపై లైంగిక వేధింపులు..? మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావుపై కేసు

Hyderabad, Telangana:

Rega Kantha Rao Case: బీఆర్‌ఎస్‌ పార్టీకి మరో షాక్‌ తగిలింది. ఇప్పటికే పార్టీ అగ్ర నాయకత్వంపై కేసులు నమోదవుతుండడం.. విచారణ సంస్థల నుంచి విచారణ ఎదుర్కొంటుండగా తాజాగా మాజీ ఎమ్మెల్యేపై కేసు నమోదైంది. యువతిపై లైగింక వేధింపులకు పాల్పడ్డారనే ఆరోపణలు రావడంతో అతడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. హైదరాబాద్‌లోని పంజాగుట్ట పోలీసులు కాంతారావుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

బీఆర్ఎస్ పార్టీ పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావుపై పంజాగుట్ట పోలీసు స్టేషన్‌లో కేసు నమోదవడం సంచలనంగా మారింది. కాంతారావు తనను లైంగికంగా వేధించారని ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసిందని సమాచారం. ఆమె ఫిర్యాదు స్వీకరించిన అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు పోలీసులు తెలిపారు. తనను వివాహం చేసుకుంటానని నమ్మంచి మోసం చేశారని బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. యూట్యూబ్ చానెల్ పేరుతో తన ఫ్లాట్‌కు పిలిపించి వేధించారని సంచలన ఆరోపణలు చేశారు.

పెళ్లి విషయమై ప్రశ్నిస్తే కాంతారావు తన ప్రైవేటు ఫొటోలతో బ్లాక్ మొయిల్ చేస్తున్నారని యువతి తీవ్ర ఆరోపణలు ఫిర్యాదులో చేశారు. అంతేకాకుండా రియల్ ఎస్టేట్ పేరుతో తన వద్ద రూ.4 లక్షలు తీసుకుని మోసం చేశారని పోలీసులకు వివరించారు. అయితే బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు ఈనెల 26వ తేదీన పోలీసులు కేసు నమోదు చేయగా.. తాజాగా బయటకు వచ్చింది. అయితే ఈ కేసు విషయమై కాంతారావు కానీ ఆయన వర్గం నుంచి ఎలాంటి స్పందన లేదు. యువతి చేసిన ఆరోపణలు నిజమా కాదా? అనేది కాంతారావు విచారణకు వస్తే.. లేదంటే బయటకు వచ్చి విషయాలు చెబితే తెలిసేది.

న్యాయస్థానాన్ని ఆశ్రయించిన రేగా కాంతారావు
తనపై కేసు నమోదు కావడంతో అరెస్ట్ కాకుండా న్యాయస్థానాన్ని రేగా కాంతారావు ఆశ్రయించారు. పంజాగుట్టలో నమోదైన ఎఫ్ఐఆర్ను క్వాష్ చేయాలని పిటిషన్ వేశారు. లైంగిక ఆరోపణలతో నమోదైన కేసులో అరెస్టు చేయకుండా రక్షణ కల్పించాలని రేగా కాంతారావు కోరారు. ఈ పిటిషన్ న్యాయస్థానం విచారించి ఎలాంటి ఆదేశాలు ఇస్తుందో వేచి చూడాలి.

విచారణకు కేటీఆర్‌
బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్‌ మరోసారి ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానంలో విచారణకు హాజరయ్యారు. ఫార్ములా ఈ కారు రేసులో మాజీ ఐటీ శాఖ మంత్రిగా కేటీఆర్‌ను ఏసీబీ విచారణ చేస్తోంది. గురువారం విచారణకు హాజరవగా ఏసీబీ ప్రత్యేక కోర్టు ఆగస్టు 25వ తేదీకి విచారణను వాయిదా వేసింది. విచారణ సందర్భంగా కేటీఆర్‌ వెంట మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, మహమూద్‌ అలీ, ఎమ్మెల్యే పాడి కౌశిక్‌ రెడ్డి, ఇతర బీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు ఉన్నారు.

0
0
Report

స్మార్ట్‌ఫోన్ హిస్టరీలోనే బిగ్గెస్ట్ చేంజ్.. 185Hz డిస్‌ప్లే, Bose స్పీకర్లతో Redmi K100 Pro ఎంట్రీ..

Hyderabad, Telangana:

Redmi K100 Pro Price: స్మార్ట్‌ఫోన్ ప్రియులు ఎంతగానో ఎదురుచూస్తున్న ప్రముఖ టెక్ బ్రాండ్ రెడ్‌మి (Redmi) త్వరలోనే మార్కెట్లోకి దిమ్మతిరిగే ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్‌ చేసేందుకు సిద్ధమైన్నట్లు తెలుస్తోంది.. రెడ్‌మి K100 ప్రో (Redmi K100 Pro) పేరుతో ఈ ఫోన్ విడుదల కాబోతోంది. అంతేకాకుండా ఇప్పటికే ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన లీక్‌ అయిన వివరాలు స్మార్ట్‌ఫోన్‌ ప్రియులను ఎంతగానో ఆకర్శిస్తున్నాయి. అంతేకాకుండా కొన్ని ఫీచర్స్‌తో పాటు డిజైన్‌ టెక్ ప్రపంచంలో తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. అయితే, లీక్‌ అయిన వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.. 

విడుదలైన పోస్టర్ ప్రకారం.. ఈ స్మార్ట్‌ఫోన్‌ అత్యంత అద్భుతమైన చేరీ రెడ్ (Cherry Red) కలర్ వేరియంట్‌లో విడుదల కాబోతోంది. దీని ప్రీమియం ఫినిషింగ్ యూజర్లను విశేషంగా ఆకట్టుకునే అవకాశాలు ఉన్నాయి.. ఇక ఈ ఫోన్ ప్రధాన హైలైట్లలో మొదటిది దీని డిస్‌ప్లేగా భావించవచ్చు. స్మార్ట్‌ఫోన్ చరిత్రలోనే అరుదైన 185Hz రిఫ్రెష్ రేట్ ఉన్న స్క్రీన్‌ను ఇందులో అందిచే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.. దీనివల్ల హై-ఎండ్ గేమింగ్, యాప్స్ స్క్రోలింగ్‌తో పాటు వీడియోలు చూసేటప్పుడు అత్యంత స్మూత్ అనుభూతిని అందిస్తుందని లీక్‌ అయిన వివరాలు చెబుతున్నాయి.

200MP ప్రధాన కెమెరా..
ఫోటోగ్రఫీ ప్రియుల కోసం ఈ ఫోన్‌లో 200 మెగాపిక్సెల్ (200MP) ప్రధాన కెమెరాతో కూడిన ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను అందించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.. దీనితో పాటు ఆల్ట్రా-వైడ్‌తో పాటు టెలిఫోటో లెన్స్‌లు కూడా అందుబాటులో ఉండే ఛాన్స్‌లు ఉన్నట్లు తెలుస్తోంది.. ఆడియో లవర్స్ కోసం Bose (బోస్) ట్యూన్ చేసిన స్పీకర్లను కూడా అందుబాటులోకి తీసుకు రాబోతోంది..

గీక్‌బెంచ్ (Geekbench) లిస్టింగ్ వివరాల ప్రకారం.. ఈ స్మార్ట్‌ఫోన్ అత్యంత వేగవంతమైన Qualcomm Snapdragon 8 Elite Gen 5 ప్రాసెసర్‌తో విడుదల కాబోతోంది.. మల్టీటాస్కింగ్ కోసం ఏకంగా 16GB RAMను అందుబాటులోకి తీసుకు రాబోతున్నట్లు తెలుస్తోంది.. బెంచ్‌మార్క్ పరీక్షల్లో సింగిల్ కోర్‌లో 3,429 పాయింట్లతో పాటు మల్టీకోర్‌లో 10,461 పాయింట్లు సాధించి తన పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్‌ను నిరూపించుకున్నట్లు కూడా సమాచారం..

భారీ బ్యాటరీ..
యూజర్లు ఎక్కువ సమయం ఛార్జింగ్ ఇబ్బంది లేకుండా వాడేందుకు ఇందులో 8000mAh భారీ బ్యాటరీని అందుబాటులోకి తీసుకు రాబోతున్నట్లు తెలుస్తోంది.. దీనికి తోడు 50W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉండే ఛాన్స్‌లు ఉన్నట్లు సమాచారం. సెక్యూరిటీ కోసం 3D అల్ట్రాసోనిక్ ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్, నీరు, ధూళి నుంచి ప్రొటక్షన్ పొందేందుకు IP68, IP69 రేటింగ్‌లను అందించబోతున్నట్లు తెలుస్తోంది.

Also Read:  7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!

చైనాలో జరగనున్న ప్రముఖ ChinaJoy ఈవెంట్‌లో కంపెనీ ఈ ఫోన్‌ను అధికారికంగా లాంచ్ చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.. ఇది శక్తివంతమైన కెమెరాతో పాటు పవర్‌ఫుల్ బ్యాటరీ, విప్లవాత్మక డిస్‌ప్లేతో రాబోతున్న ఈ Redmi K100 Pro స్మార్ట్‌ఫోన్‌, ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ విభాగంలో కొత్త చరిత్ర సృష్టించడం ఖాయమని కనిపిస్తోంది..

Also Read:  7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
0
Report
Advertisement
Advertisement
Back to top