2లక్షల రుణమాఫీకీ కోర్రిలు పెడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వంఆందోళనలో రైతులు
2 లక్షల రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్ రూరల్ బీజేపీ అధ్యక్షుడు మాడిశెట్టి సంతోష్‌కుమార్ ఆధ్వర్యంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి కరీంనగర్ రూరల్ ఎంఎంఆర్‌వో కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. అనంతరం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన భాజపా జిల్లా ప్రధాన కార్యదర్శి తాళ్లపెల్లి శ్రీనివాస్ గౌడ్ ఎమ్మార్వోకు వినతిపత్రం అందజేసి మాట్లాడుతూ ప్రతి రైతుకు రూ.2 లక్షల రుణమాఫీ ఎలాంటి ఆంక్షలు లేకుండా చేయాలని డిమాండ్ చేశారు. రైతుల విశ్వాసంతో రాష్ట్ర ప్రభుత్వం ఆటలాడుతోంది.
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Papaya Leaves Benefits: డెంగీ ,మలేరియా వ్యాధి బారిన పడినప్పుడు ఈ గుమ్మడి ఆకులను వినియోగిస్తారు. ఇది ప్లేట్ లెట్ సంఖ్యను పెంచుతుంది. కాలేయ పనితీరును కూడా మెరుగు చేస్తుంది. గుమ్మడి ఆకుల్లో ఆరోగ్య ప్రయోజనాలు మెండుగా ఉంటాయి. ఇందులో ఔషధ గుణాలు కలిగి ఉంటుంది. చర్మ ప్రయోజనాలు అంతేకాదు హెయిర్ కేర్ లో కూడా ఈ గుమ్మడి ఆకులను వినియోగిస్తారు. ప్రధానంగా డయాబెటిస్, హైపర్ టెన్షన్ సమస్యతో బాధపడుతున్న వారు కూడా తీసుకోవచ్చు. గుమ్మడి ఆకులు రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాం.
ప్లేట్ లెట్స్ పెంచుతుంది..
గుమ్మడి ఆకులు రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల ప్లేట్ లెట్స్ సంఖ్యను పెంచుతుంది. ప్రధానంగా మలేరియా డెంగీ, చికెన్ గున్యా ఇన్ఫెక్షన్లు సోకినప్పుడు ఈ ఆకులను జ్యూస్ రూపంలో తీసుకుంటారు. అంతే కాదు ఇది బోన్ మ్యారో ఉత్పత్తికి కూడా సహాయపడుతుంది.
పుష్కలమైన యాంటీ ఆక్సిడెంట్లు..
గుమ్మడి ఆకుల్లో ఇలాంటి ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అంతేకాదు ఇందులో విటమిన్ సి ఉంటుంది. ఫ్రీ రాడికల్ బారిన పడకుండా కాపాడుతుంది. ఆక్సిడేటివ్ స్ట్రెస్ నివారిస్తుంది. అంతేకాదు వయస్సురీత్యా వచ్చే వృద్ధాప్య సమస్యలను కూడా ఆలస్యం చేస్తుంది.
జీర్ణ ఆరోగ్యం..
గుమ్మడి ఆకుల్లో పప్పెయిన్, కైమోపప్పెయిన్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది జీర్ణ ఆరోగ్యానికి సహాయపడతాయి. దీర్ఘకాలిక మలబద్ధక సమస్య కూడా మంచి రెమిడీ. అంతేకాదు గుమ్మడి ఆకులు తీసుకోవడం వల్ల కడుపులో గ్యాస్, అజీర్తిని తగ్గిస్తుంది. యాసిడ్ రీప్లెక్స్ నుంచి కూడా కాపాడుతుంది.
యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు..
గుమ్మడి ఆకుల్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. తద్వారా ఆస్తమా, ఆర్థరైటిస్ బాధపడుతున్న వారికి మంచి ఉపశమనం లభిస్తుంది. అంతేకాదు ఈ గుణాల వల్ల ఆరోగ్యకరమైన పేగు కదలికలకు కూడా తోడ్పడుతుంది.
షుగర్ కంట్రోల్..
గుమ్మడి ఆకులు ఇన్సూలిన్ సెన్సిటివిటీని కూడా మెరుగు చేస్తుంది. రక్తంలో షుగర్ స్థాయిలను నియంత్రిస్తుంది. ఇది డయాబెటిస్ వారికి కూడా మంచిది. అంతే కాదు కాలేయాన్ని డిటాక్సీఫై చేసే గుణాలు ఇందులో ఉన్నాయి. గుమ్మడి ఆకులతో తయారు చేసిన జ్యూస్ తీసుకోవడం వల్ల ఫ్యాటీ లివర్, కామెర్ల సమస్యలు కూడా రావు.
ఇమ్యూనిటీ బూస్ట్ కావాలంటే గుమ్మడి ఆకుల రసం తాగాల్సిందే. ఇందులో విటమిన్ ఏ, సీ, సీ ఇమ్యూనిటీ వ్యవస్థను బలపరిచే గుణాలు కలిగి ఉంటుంది. సీజనల్ జబ్బుల బారిన కాపాడుతుంది. ఇది చర్మ ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. పిగ్మెంటేషన్, ఎగ్జిమా సమస్య నుంచి కాపాడుతుంది. ఇందులో యాంటీ మైక్రోబియన్ గుణాలు ఉంటాయి. గాయాలను నయం చేసే గుణం కూడా ఇందులో ఉంది.
Also Read: సహజంగా పింక్ గ్లో కావాలంటే స్ట్రాబెర్రీలు తప్పనిసరి! ఈ కారణాలు చూడండి..
Also Read: బద్రీనాథ్.. కేదార్నాథ్ మాత్రమే కాదు ఈ 48 ఆలయాలపై సంచలన నిర్ణయం.. నాన్ హిందువులకు నో ఎంట్రీ..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి. Twitter, Facebook.
Flying Snake Facts: ప్రకృతి ఒడిలో ఎన్నో వింతలు, విశేషాలు ఉంటాయి. అందులో ఒకటి 'ఎగిరే పాము' (Flying Snake). పాములకు రెక్కలు ఉండవు కదా.. మరి ఇవి ఎలా ఎగురుతాయి? ఇవి నిజంగా విషపూరితమైనవా? అనే ఆసక్తికర విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. సాధారణంగా పాములు నేలపై పాకడం లేదా నీళ్లలో ఈదడం చూస్తుంటాం. కానీ దక్షిణ, ఆగ్నేయాసియాలోని దట్టమైన అటవీ ప్రాంతాల్లో గాలిలో ప్రయాణించే పాములు కనిపిస్తాయి.
ఇవి నిజంగా ఎగురుతాయా?
వాస్తవానికి ఈ పాములకు పక్షుల్లా రెక్కలు ఉండవు. ఇవి ఒక చెట్టు పైనుంచి మరో చెట్టుకు గాలిలో 'గ్లైడ్' (Glide) అవుతాయి. అంటే గాలిలో తేలుతూ దూకుతాయి కాబట్టి వీటిని ఎగిరే పాములు అని పిలుస్తారు.
ఎగిరే టెక్నిక్ ఏంటి?
ఈ పాములు గాలిలో ప్రయాణించే విధానం శాస్త్రవేత్తలనే ఆశ్చర్యపరుస్తుంది. చెట్టు కొమ్మ చివరకు రాగానే, ఇవి తమ పక్కటెముకలను వెడల్పుగా చేసి శరీరాన్ని చదునుగా మార్చుకుంటాయి. దూకడానికి ముందు శరీరాన్ని 'J' ఆకారంలో వంచి, ఒక్కసారిగా విల్లులా ముందుకు ఉరుకుతాయి.
గాలిలో ఉన్నప్పుడు ఇవి ఈత కొట్టినట్లుగా అటు ఇటు ఊగుతూ (S-shape లో) దిశను మార్చుకుంటాయి. ఇలా ఇవి ఏకంగా 100 అడుగుల (30 మీటర్లు) దూరం వరకు ప్రయాణించగలవు.
ఇవి విషపూరితమైనవా?
చాలామంది ఈ పాములను చూసి భయపడతారు. కానీ నిజానికి మనుషులకు ప్రమాదం లేదు. ఈ పాములు విషపూరితమైనవి కావు. ఇవి చాలా ప్రశాంతమైన స్వభావాన్ని కలిగి ఉంటాయి. ఇవి చిన్న బల్లులు, కప్పలు, పక్షులను వేటాడుతాయి.
ఎక్కడ కనిపిస్తాయి?
ఇవి ఎక్కువగా చెట్లపైనే నివసిస్తాయి. అరుదుగా మాత్రమే నేలపైకి వస్తాయి. ఇవి ఎగిరే ఉడుతల కంటే చాలా నేర్పుగా గాలిలో ప్రయాణించగలవని పరిశోధనలు చెబుతున్నాయి. ప్రస్తుతం వీటికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.
ఎగిరే పాములు ప్రకృతి సృష్టించిన ఒక అద్భుతమైన ఇంజనీరింగ్ అద్భుతం. ఇవి మనుషులకు హాని చేయవు కాబట్టి వీటిని చూసి భయపడాల్సిన అవసరం లేదు.
Also Read: Telangana PRC: ఉద్యోగులకు షాకింగ్ న్యూస్..పీఆర్సీ అమలుపై ఆశలు గల్లంతు..ఎప్పటికి వచ్చే?!
Also Read: Shambhavi Pathak: అజిత్ పవార్ విమాన ప్రమాదం..కాక్‌పిట్‌లో పైలట్స్ చివరి మాటలు..అసలేం జరిగిందంటే?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Big Gift To Employees: దసరా పండుగ నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం వరాలు కురిపిస్తోంది. ఉద్యోగులు, పింఛన్‌దారులకు సంబంధించిన సమస్యలు, డిమాండ్లు పరిష్కరిస్తోంది. దసరా సమయంలో కరువు భత్యం (డీఏ) ప్రకటించిన ప్రభుత్వం అనంతరం దీపావళి, సంక్రాంతి పండుగకు కూడా గుడ్‌న్యూస్ ప్రకటించింది. తాజాగా మరో వరం ప్రకటించింది. ఉద్యోగులు, పింఛన్‌దారులకు సంబంధించి ప్రకటన చేసింది. ప్రభుత్వం ప్రకటించిన తీపి కబురుతో ఉద్యోగ వర్గాలకు భారీ ప్రయోజనం లభించనుంది.
Also Read: School Holiday: విద్యార్థులకు పండుగే.. స్కూళ్లకు నాలుగు రోజులు సెలవు?
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు పెండింగ్‌లో ఉన్న వివిధ రకాల బిల్లుల చెల్లింపుల్లో పురోగతి లభించింది. వివిధ రకాల బిల్లులు భారీగా పెండింగ్‌లో ఉండడంతో తాజాగా కొంత ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది. విడుదల చేసిన బిల్లుల్లో టీఏ, టీటీఏ బిల్లులు ఉన్నాయి. 1 ఏప్రిల్ 25 నుంచి ఉద్యోగులకు సంబంధించిన టీఏ, టీటీఏ బకాయిల కోసం సుమారు రూ.150 కోట్లు ప్రభుత్వం విడుదల చేసింది. ఏపీజీఎల్ఐ బిల్లులకు సంబంధించి మెచ్యూర్ అయిన పాలసీలు, లోన్ పేమెంట్లకు సంబంధించిన బిల్లులు ప్రభుత్వం క్లియర్ చేసింది. ఉద్యోగులు, పెన్షనర్లకు రావాల్సిన జీపీఎఫ్ బకాయిలు కూడా ప్రభుత్వం చెల్లించింది. ఇక రిటైర్డ్ ఉద్యోగుల సరెండర్ లీవ్ చెల్లింపుల ప్రక్రియ కూడా చేయగా.. వాటికి సంబంధించి బిల్లులు ప్రభుత్వం విడుదల చేసింది. వీటి చెల్లింపులతో ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్‌దారులకు భారీ ప్రయోజనం లభించనుంది.
Also Read: HIV Injection: బ్రేకప్ చెప్పాడని మాజీ ప్రియుడి భార్యకు HIV ఇంజెక్షన్ ఇచ్చిన ప్రియురాలు
Also Read: Govt Employees: ప్రభుత్వ ఉద్యోగులకు భారీ షాక్.. ఇవి ఉల్లంఘిస్తే ఉద్యోగం ఊస్ట్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
.Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Love Story Tragedy: అప్పుడప్పుడే సమాజం గురించే తెలుసుకునే వయసు.. ఈ వయసులో కలిగే ఆకర్షణను ప్రేమ అనుకున్న మైనర్లు తమ నిండు జీవితాన్ని నాశనం చేసుకున్నారు. ఆరు నెలల పరిచయాన్ని ప్రేమగా భావించి.. అంతటితో ఆగకుండా పెళ్లి వయసు రాకముందే వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. తమ పెళ్లి పెద్దలు చేయరని భావించి ఇంట్లో నుంచి పారిపోయారు. ఈ విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు బెదిరింపులకు పాల్పడడంతో ఇంటికి వచ్చి ఆ పిల్లలు ప్రాణాలు తీసుకున్నారు. ఈ విషాద సంఘటన తెలంగాణలోని నాగర్‌కర్నూల్ జిల్లాలో చోటుచేసుకుంది.
Also Read: School Holiday: విద్యార్థులకు పండుగే.. స్కూళ్లకు నాలుగు రోజులు సెలవు?
నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలం బొమ్మనపల్లి గ్రామానికి దాసరి ప్రసాద్ (18)కు చిట్లకుంట గ్రామానికి చెందిన అమ్మాయి (16 ఏళ్లు) మధ్య పరిచయమైంది. తమ ఆరు నెలల పరిచయాన్ని వారు ప్రేమగా భావించారు. తరచూ వీరిద్దరూ కలుసుకుంటూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అయితే తమ పెళ్లికి పెద్దలు అంగీకరించరని వారిద్దరూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో వారం రోజుల కిందట ఇంట్లో నుంచి పారిపోయారు. వారం నుంచి కనిపించకపోవడంతో కుటుంబసభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read: HIV Injection: బ్రేకప్ చెప్పాడని మాజీ ప్రియుడి భార్యకు HIV ఇంజెక్షన్ ఇచ్చిన ప్రియురాలు
పారిపోయిన విషయం తెలుసుకున్న అమ్మాయి కుటుంబసభ్యులు ఫోన్లో బెదిరించారు. వారి బెదిరింపులతో భయపడిన ప్రసాద్, అమ్మాయి మంగళశారం తన సొంత గ్రామం బొమ్మన్‌పల్లికి గ్రామానికి చేరుకున్నారు. తమ పెళ్లికి పెద్దలు ఒప్పుకుంటలేరని నిర్ధారించుకొని ఇంట్లో ఎవరు లేని సమయంలో అమ్మాయి, అబ్బాయి ఒకే చీరతో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. నిద్రపోయిన కుటుంబసభ్యులు తెల్లవారు లేచి చూసేసరికి తలుపు గడియ పెట్టి ఉంది. ఫోన్ చేసినా.. పిలిచినా పలకకపోవడంతో తలుపు పగులగొట్టారు.
Also Read: Govt Employees: ప్రభుత్వ ఉద్యోగులకు భారీ షాక్.. ఇవి ఉల్లంఘిస్తే ఉద్యోగం ఊస్ట్!
లోపలికి వెళ్లి చూడగా వారిద్దరూ ఒకే చీరకు ఉరేసుకుని విగతజీవులుగా మారిపోయారు. ఉన్న ఒక కొడుకు చనిపోవడంతో ప్రసాద్ కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటన చేరుకొని పరిశీలించారు. అబ్బాయి, అమ్మాయి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం అచ్చంపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం వారి కుటుంబ సభ్యులకు మృతదేహాలను అప్పగించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. తమ అబ్బాయి చావు కారణమైన వారిని.. అమ్మాయి మేనమామ ఈదయ్యను కఠినంగా శిక్షించాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
.Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Telangana PRC News: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న రెండో వేతన సవరణ (PRC) ప్రక్రియ మరింత జాప్యం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. పీఆర్సీ కమిటీ గడువును ప్రభుత్వం మరోసారి పొడిగించే యోచనలో ఉండటమే ఇందుకు ప్రధాన కారణంగా కనిపిస్తుంది.
రాష్ట్రంలో పీఆర్సీ గడువు ఈ ఏడాది మార్చితో ముగియనుంది. అయితే, ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే ప్రభుత్వం నాలుగోసారి కూడా కమిటీ కాలపరిమితిని పెంచే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.
నివేదిక సిద్ధం..కానీ!
పీఆర్సీ కమిటీ తన నివేదికను ఇప్పటికే సిద్ధం చేసిందని, ప్రభుత్వం పిలిస్తే వెంటనే అందజేయడానికి సిద్ధంగా ఉన్నారని ఉద్యోగ సంఘాలు చెబుతున్నాయి. అయితే, ప్రభుత్వం నివేదికను స్వీకరించడానికి వెనుకాడుతోందని, కావాలనే ఆలస్యం చేస్తోందని సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు.
కమిటీ నేపథ్యం - కాలక్రమం..
నియామకం: 2023 అక్టోబర్ 2న (శివశంకర్ చైర్మన్‌గా).
తొలి గడువు: 2024 ఏప్రిల్ 2.
పొడిగింపులు: ఇప్పటివరకు మూడుసార్లు గడువు పొడిగించారు. ఇప్పుడు నాలుగోసారి పొడిగింపు దిశగా చర్చలు సాగుతున్నాయి.
ఫిట్మెంట్ లెక్కలు..
ఉద్యోగ సంఘాలు 51 శాతం ఫిట్మెంట్ కావాలని కోరుతుండగా, ప్రభుత్వంపై పడే ఆర్థిక భారం ఇలా ఉండవచ్చు.
| ఫిట్మెంట్ శాతం | అంచనా వ్యయం (వార్షికంగా) |
| 30% (ప్రభుత్వ అంచనా) | సుమారు ₹7,500 కోట్లు |
| 51% (సంఘాల డిమాండ్) | సుమారు ₹12,750 కోట్లు |
నోట్: ఒక్క శాతం ఫిట్మెంట్ పెంచితే నెలకు ₹250–300 కోట్ల అదనపు భారం పడుతుంది.
ఆర్థిక పరిస్థితే అడ్డంకా?
రాష్ట్ర ఆదాయం కంటే వ్యయం ఎక్కువగా ఉండటం, ఇటీవల రెండు డీఏల (DA) ప్రకటించిన నేపథ్యంలో.. పీఆర్సీ అమలు ఆర్థికంగా పెను సవాలుగా మారింది. బడ్జెట్లో దీనిపై స్పష్టత రాకపోతే, ఉద్యోగుల నిరీక్షణ మరో ఆరు నెలలు తప్పదని తెలుస్తోంది.
వాస్తవానికి రెండో పీఆర్సీ 2023 జూలై 1 నుంచే అమలులోకి రావాలి. గడువులను పదేపదే పొడిగించడం వల్ల తాము ఆర్థికంగా నష్టపోతున్నామని ఉద్యోగులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం వచ్చే బడ్జెట్ సమావేశాల్లోనైనా దీనిపై కీలక ప్రకటన చేస్తుందో లేదో వేచి చూడాలి.
Also Read: Shambhavi Pathak: అజిత్ పవార్ విమాన ప్రమాదం..కాక్‌పిట్‌లో పైలట్స్ చివరి మాటలు..అసలేం జరిగిందంటే?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Ajit Pawar Pilot Shambhavi Pathak: మహారాష్ట్ర రాజకీయాల్లో పెను విషాదం నింపిన అజిత్ పవార్ విమాన ప్రమాదానికి సంబంధించిన మరిన్ని భయంకరమైన నిజాలు బయటకు వస్తున్నాయి. ప్రమాదం జరగడానికి కొన్ని క్షణాల ముందు విమానంలో అసలేం జరిగింది? పైలట్లు చివరి నిమిషంలో ఎందుకు మేడే (Mayday) కాల్ చేయలేకపోయారు? అనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
బారామతి విమానాశ్రయం రన్‌వేకు కేవలం 100 మీటర్ల దూరంలో చార్టర్డ్ విమానం కుప్పకూలిన ఘటనలో అజిత్ పవార్‌తో సహా ఐదుగురు మరణించారు.
మృత్యుఘోష.."ఓహ్ షిట్... ఓహ్ షిట్"
విమాన ప్రమాదాల్లో అత్యవసర సమయంలో పైలట్లు చేసే 'మేడే' (Mayday) కాల్‌ను కెప్టెన్ సుమిత్ కపూర్ చేయలేకపోయారు. అయితే, ఆయనతో ఉన్న కో-పైలట్ కెప్టెన్ శంభవి పాఠక్ చివరి క్షణంలో "ఓహ్ షిట్... ఓహ్ షిట్" అని అరిచినట్లు రికార్డింగ్స్ ద్వారా తెలుస్తోంది. అంటే, ప్రమాదం జరగబోతుందని వారికి ముందే అర్థమైనా, ప్రాణాలు కాపాడుకునే సమయం దొరకలేదని స్పష్టమవుతోంది.
ల్యాండింగ్ ప్రయత్నాలు విఫలం..
తొలి ప్రయత్నం: ఉదయం పూట దట్టమైన పొగమంచు వల్ల రన్‌వే 11 సరిగ్గా కనిపించలేదు. దీంతో పైలట్లు విమానాన్ని ల్యాండ్ చేయలేక మళ్లీ పైకి తీసుకెళ్లారు.
రెండో ప్రయత్నం: కొద్దిసేపటి తర్వాత మళ్లీ ల్యాండింగ్‌కు ప్రయత్నించినప్పుడు, విమానం వేగంగా రన్‌వే వైపు దూసుకొచ్చింది. కానీ నేలను తాకే ముందే విమానం అదుపు తప్పి బోల్తా పడి కుప్పకూలింది.
ప్రత్యక్ష సాక్షుల కథనం..
విమానం నేలను ఢీకొట్టగానే భారీ పేలుడు సంభవించింది. ఆ తర్వాత మరో 4 నుండి 5 సార్లు పేలుళ్లు జరగడంతో విమానం తునకలైంది. "విమానం మా గ్రామంపై నుండే ఎగిరింది. కూలిన తర్వాత పేలుడు ధాటికి విమానం భాగాలు ఎగిరి మా ఇళ్లపై పడ్డాయి" అని గ్రామస్తులు తెలిపారు. మంటలు ఎగసిపడుతుండటంతో ప్రాణాలు కాపాడేందుకు గ్రామస్తులు చేసిన ప్రయత్నం విఫలమైంది.
అజిత్ పవార్ చివరి కాల్..
విమానం ఎక్కే ముందు అజిత్ పవార్ తన మేనల్లుడు రంజాగ్జిత్ సింగ్ పాటిల్‌కు ఫోన్ చేశారు. "ల్యాండింగ్ అయ్యాక మళ్ళీ మాట్లాడతాను" అని చెప్పిన అజిత్ పవార్ మాటలు చివరికి ఆఖరి మాటలుగా మిగిలిపోయాయి. బుధవారం ఉదయం 8:45 గంటలకు ఈ ఘోరం జరిగింది.
దర్యాప్తు ప్రారంభం..
ప్రస్తుతం ఎయిర్‌క్రాఫ్ట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (AAIB) ఈ ప్రమాదంపై సమగ్ర విచారణ చేపట్టింది. ఢిల్లీలోని విమాన ఆపరేటర్ VSR వెంచర్స్ కార్యాలయంలో అధికారులు తనిఖీలు చేస్తున్నారు. పొగమంచు కారణమా? లేక సాంకేతిక లోపమా? అన్న కోణంలో దర్యాప్తు సాగుతోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Pakistan Boycott T20 World Cup 2026: ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026కు సంబంధించి ఒక ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. బంగ్లాదేశ్ ఈ టోర్నీ నుంచి తప్పుకున్న నేపథ్యంలో, ఇప్పుడు పాకిస్థాన్ కూడా భారత్‌తో మ్యాచ్‌ను బహిష్కరిస్తామంటూ హెచ్చరికలు జారీ చేస్తోంది. ఒకవేళ పాక్ గనుక భారత్‌తో మ్యాచ్ ఆడకపోతే పాయింట్ల పట్టికపై ఎలాంటి ప్రభావం పడుతుంది? సెమీస్ సమీకరణాలు ఎలా మారతాయనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
గ్రూప్-ఏలో భారత్, పాకిస్థాన్లతో పాటు నమీబియా, నెదర్లాండ్స్, అమెరికా (USA) జట్లు ఉన్నాయి. ఫిబ్రవరి 15న కొలంబో వేదికగా జరగాల్సిన భారత్-పాక్ మ్యాచ్‌పై ఇప్పుడు నీలి నీడలు కమ్ముకున్నాయి.
పాక్ బహిష్కరిస్తే భారత్‌కు లాభమేంటి?
ఒకవేళ పాకిస్థాన్ కేవలం భారత్‌తో మ్యాచ్ ఆడేందుకు నిరాకరిస్తే, ఐసీసీ నిబంధనల ప్రకారం దానిని 'వాకోవర్' (Walkover) గా పరిగణిస్తారు. దీంతో టీమ్ఇండియాకు ఆటోమేటిక్‌గా 2 పాయింట్లు లభిస్తాయి. దీనివల్ల భారత్ సూపర్-8 దశకు చేరుకోవడం చాలా సులభమవుతుంది.
అదే విధంగా పాకిస్థాన్‌కు సున్నా పాయింట్లు లభిస్తాయి. గ్రూప్ దశలో ఒక్క మ్యాచ్ పాయింట్లు కోల్పోయినా, సూపర్-8 రేసు నుంచి పాక్ తప్పుకోవాల్సి వస్తుంది. మిగిలిన మూడు మ్యాచ్‌ల్లో (నమీబియా, నెదర్లాండ్స్, USA) పాక్ ఖచ్చితంగా గెలవాల్సి ఉంటుంది.
పాక్ పూర్తిగా తప్పుకుంటే?
ఒకవేళ పాకిస్థాన్ ఈ టోర్నీ నుంచి పూర్తిగా వైదొలిగితే, ఐసీసీ ఖాళీ అయిన ఆ స్థానాన్ని భర్తీ చేస్తుంది. ర్యాంకింగ్స్ ఆధారంగా తదుపరి అత్యున్నత ర్యాంకు ఉన్న ఉగాండా జట్టుకు అవకాశం దక్కవచ్చు. ఇప్పటికే టోర్నీ నుంచి తప్పుకున్న బంగ్లాదేశ్, పాక్ స్థానంలో మళ్ళీ వచ్చేందుకు ఐసీసీని ఒప్పించే అవకాశం ఉంది.
పాకిస్థాన్‌పై ఐసీసీ ఎలాంటి చర్యలు తీసుకుంటుంది?
భారత్‌తో మ్యాచ్ ఆడకపోయినా లేదా టోర్నీ నుంచి తప్పుకున్నా పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. ఐసీసీ గ్లోబల్ టోర్నీల నుంచి పాకిస్థాన్‌ను కొంతకాలం నిషేధించే అవకాశం ఉంది. పీఎస్ఎల్ (PSL) ఆడే అంతర్జాతీయ ఆటగాళ్లకు ఎన్ఓసీలు నిరాకరించడం వంటి ఆర్థిక పరమైన ఆంక్షలు విధించవచ్చు. ప్రసారకర్తలు, స్పాన్సర్ల నుంచి వచ్చే ఆదాయంలో పాకిస్థాన్‌కు కోత పడుతుంది.
సెమీస్ చేరే జట్లు ఏవి?
ప్రస్తుత ఫామ్, సమీకరణాలను బట్టి గ్రూప్-ఏ నుంచి భారత్ అగ్రస్థానంలో నిలిచి సూపర్-8కు చేరడం దాదాపు ఖాయం. పాకిస్థాన్ ఆడితే రెండో జట్టుగా వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ పాక్ తప్పుకుంటే, అమెరికా (USA) లేదా నెదర్లాండ్స్ జట్ల మధ్య రెండో స్థానం కోసం గట్టి పోటీ నెలకొంటుంది.
పాకిస్థాన్ ప్రభుత్వం, పీసీబీ తీసుకునే నిర్ణయంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. రాజకీయ కారణాలతో క్రికెట్‌ను బహిష్కరిస్తే అది పాక్ జట్టు భవిష్యత్తుకే ముప్పుగా మారే ప్రమాదం ఉంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Key Update On Rythu Bharosa Scheme: రాష్ట్రంలోని రైతులు 'రైతు భరోసా' పథకం కింద ప్రభుత్వం అందజేసే యాసంగి పెట్టుబడి సాయం కోసం ఎదురు చూస్తున్నారు. దీంతో ఫిబ్రవరి మొదటి వారంలో రైతు భరోసా నిధులు అర్హులైన రైతుల ఖాతాల్లో జమ చేస్తామని ప్రభుత్వ వర్గాలు ఇటీవల పేర్కొన్నాయి. అయితే, రాష్ట్రంలో తాజా పరిణామాల నేపథ్యంలో రైతు భరోసాకు ఇంకా సమయం పట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
రైతు భరోసా సాయం కోసం రైతులకు నిరీక్షణ తప్పేలా లేదు. మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ జారీ నేపథ్యంలో రాష్ట్రంలో ఈ పథకం మరి కొంత కాలం జాప్యం కానుంది. రైతు భరోసా నిధుల జమ ప్రక్రియ ఫిబ్రవరి చివరి వారం లేదా మార్చి మొదటి వారంలో జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం.
ఆర్థిక శాఖ ఇప్పటికే రూ. 8 వేల కోట్ల నిధుల సమీకరణలో ఉంది. అయితే బడ్జెట్ కసరత్తు , కేంద్ర సాయాలు, రాష్ట్ర తాజా ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో ఆర్థిక పరిస్థితులు పెద్దగా ఆశాజనకంగా లేవు. అయినప్పటికీ ప్రభుత్వం ఈ పథకం అమలు చేయాలని భావిస్తుంది. అర్హులకే లబ్ధి చేకూర్చాలనే యోచన కారణంగా స్వల్ప ఆటంకాలు ఎదురవుతున్నాయని అధికారులు చెబుతున్నారు.
సాగులో ఉన్న భూములను పక్కాగా గుర్తించేందుకు ప్రభుత్వం చేపట్టిన శాటిలైట్ సర్వే కారణంగా ఈ ఆలస్యం జరుగుతోంది. అగ్రికల్చర్ యూనివర్శిటీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ సర్వే నివేదిక అందాక.. కేవలం పంట సాగు చేస్తున్న రైతులకు మాత్రమే రైతు భరోసా నిధులు అందనున్నాయి. సాగు చేయని భూములకు ఈసారి నిధులు జమ నిలిపివేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. పారదర్శకత కోసమే ఈ నిబంధనలు అమలు చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు.
Also Read: Medaram Jatara: నేటి నుంచి 4 రోజుల పాటు మేడారం మహాజాతర.. అత్యంత కీలక ఘట్టం ఏంటో తెలుసా..?
Also Read: Arijit Singh: ఫుల్ ఫామ్‌లో ఉండగానే రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ సింగర్.. షాక్‌లో ఫ్యాన్స్..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Ajit Pawar Net Worth 2026: మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ విమాన ప్రమాదంలో దుర్మరణం చెందిన వార్త విషాదంలోకి నెట్టివేసింది. మరాఠా రాజకీయాల్లో పరిపాలనా దక్షుడిగా పేరుగాంచిన ఆయన.. ఎన్నో రకాలుగా వార్తల్లో నిలిచారు. అయితే అజిత్ పవార్ జీవితాంతం సంపాదించిన ఆస్తుల వివరాలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి.
ఎన్నికల అఫిడవిట్ల ప్రకారం, గత ఐదేళ్లలో ఆయన సంపద గణనీయంగా పెరగడం గమనార్హం. రాజకీయాల్లోనే కాకుండా వ్యాపారం, వ్యవసాయ రంగాల్లోనూ అజిత్ పవార్ కుటుంబం బలమైన ఆర్థిక పునాదులు కలిగి ఉంది.
5 ఏళ్లలో రూ.50 కోట్ల పెరుగుదల
ఎన్నికల సంఘానికి సమర్పించిన తాజా గణాంకాల ప్రకారం, అజిత్ పవార్ సంపద వేగంగా వృద్ధి చెందింది. 2019 నాటికి దాదాపు రూ.75 కోట్లుగా ఉన్న ఆస్తి.. 2024-25 నాటికి రూ.124.55 కోట్లు దాటింది.
ఆయన సంపద ప్రధానంగా స్థిరాస్తుల రూపంలో ఉంది. స్థిరాస్తులు (భూమి, ఇళ్లు) సుమారు రూ.97.94 కోట్లు ఉండగా.. చరాస్తులు (నగదు, పెట్టుబడులు) రూ.26.60 కోట్లు ఉన్నట్లు సమాచారం. బ్యాంక్ నిల్వల్లో వివిధ ఖాతాలలో రూ.6.81 కోట్లకు పైగా డిపాజిట్లు ఉన్నాయి.
భార్య సునేత్రా పవార్ ఆస్తులే ఎక్కువ!
ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, అజిత్ పవార్ కంటే ఆయన భార్య సునేత్రా పవార్ పేరు మీద ఎక్కువ ఆస్తులు ఉన్నాయి. మొత్తం ఆస్తి సుమారు రూ.127.6 కోట్లు ఉండగా.. ఆమె వద్ద 28 క్యారెట్ల వజ్రంతో సహా రూ.1.19 కోట్ల విలువైన బంగారం, వెండి, వజ్రాభరణాలు ఉన్నాయి. ఆమె పేరు మీద రూ.58 కోట్ల విలువైన భూములు, భవనాలు ఉన్నాయి.
పెట్టుబడులు, వాహనాలు
అపారమైన సంపద ఉన్నప్పటికీ, అజిత్ పవార్ పేరిట ఎటువంటి ఎల్ఐసీ (LIC) లేదా లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలు లేకపోవడం గమనార్హం. ఆయనకు వివిధ కంపెనీల షేర్లు, బాండ్లు, మ్యూచువల్ ఫండ్లలో భారీ పెట్టుబడులు ఉన్నాయి. అజిత్ పవార్ వద్ద టయోటా కామ్రీ, హోండా CRV, హోండా అకార్డ్ వంటి లగ్జరీ కార్లతో పాటు.. తన వ్యవసాయ నేపథ్యానికి తగ్గట్లుగా ట్రాక్టర్, మూడు ట్రైలర్లు కూడా కలిగి ఉన్నారు.
అప్పులు, ఆదాయ వనరులు
ఆస్తులతో పాటు పవార్ కుటుంబానికి సుమారు రూ.21.39 కోట్ల రుణాలు (Loans) ఉన్నాయి. వీరికి ప్రధానంగా వ్యవసాయం, రియల్ ఎస్టేట్ మరియు వివిధ వ్యాపారాల ద్వారా ఆదాయం సమకూరుతోంది. బారామతి, పూణే ప్రాంతాల్లో వీరికి కోట్లాది రూపాయల విలువైన వ్యవసాయ భూములు ఉన్నాయి.
ALso Read: Padma Awards Benefits: పద్మ అవార్డుల పవర్ ఇదే! పురస్కార గ్రహీతలకు లభించే రాచమర్యాదలు ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook