ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ 85వ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు జెండా ఎగురావేసిన బండారి శేఖర్
Karimnagar, Telangana:కరీంనగర్ నగరంలోని తెలంగాణ చౌక్ లో ఘనంగా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ 85 వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ జెండాను కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి బండారి శేఖర్ ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో నాడు స్వాతంత్రోద్యమాన్ని ఎంతోగాను ముందుకు తీసుకువెళ్లిన మహోన్నతమైన వ్యక్తి నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆధ్వర్యంలో 1939 వ సంవత్సరంలో ఆనాడు ఫార్వర్డ్ బ్లాక్ పార్టీని స్థాపించడం జరిగిందని తెలిపారు.
हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
లండన్ ఉద్యోగాల పేరుతో భారీ స్కామ్.. 'నందూస్ వరల్డ్' నందన అదుపులోకి.. శంషాబాద్‌లో లుకౌట్ నోటీసులతో అరెస్ట్!
Hyderabad, Telangana:YouTuber Nandus World Nandana Arrest: 'మన శంకర వరప్రసాద్' సినిమాలో నటించిన నటి రమా నందనను, శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో పోలీసులు ఈరోజు అదుపులోకి తీసుకున్నారు. లండన్‌లో ఉద్యోగాలు, స్పాన్సర్‌షిప్‌ల పేరుతో మోసం చేశారని ఆమెపై పలువురు ఫిర్యాదులు చేశారు. ఈమె ప్రముఖ యూట్యూబర్ నందూస్ వరల్డ్ ఛానల్ నందన. ఇప్పటికే ఆమెపై కేసు నమోదవ్వడమే కాకుండా, లుక్ అవుట్ నోటీసులు కూడా జారీ అయ్యాయి. ఈ క్రమంలోనే పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
KTR Harish Rao Black Shirt: కేటీఆర్ తలకు గాయం..హరీశ్ రావు చొక్కా ఊడగొట్టారు..తెలంగాణ అసెంబ్లీలో రణరంగం!
Hyderabad, Telangana:KTR Harish Rao Assembly Black Shirt: తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం 1,000 రోజుల పాలన పూర్తి చేసుకున్న వేళ, ప్రభుత్వ వైఫల్యాలపై నిరసన వ్యక్తంచేస్తూ నల్ల చొక్కాలు ధరించి అసెంబ్లీకి వెళ్లడానికి ప్రయత్నించిన బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావు, ఇతర ఎమ్మెల్యేలను పోలీసులు ప్రధాన గేటు వద్దే అడ్డుకున్నారు. ఈ సందర్భంగా చోటుచేసుకున్న తోపులాట, రణరంగం లాంటి వాతావరణంలో కేటీఆర్ తల, నుదురు, చేతికి గాయలైనట్లు తెలిపారు. హరీశ్ రావు, మరికొందరు శాసనసభ్యుల చొక్కాలు చిరిగిపోయాయి. ఈ క్రమంలో కేటీఆర్ గాయాల కోసం సూదిమందు తీసుకున్నారు.Harish Rao Black Shirt: బీఆర్ఎస్ లీడర్ హరీశ్ రావుకు తీవ్ర అవమానం..షర్ట్ లేకుండా ఈడ్చుకెళ్లారు!
Hyderabad, Telangana:Harish Rao Black Shirt Protest: తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం 1,000 రోజుల పాలన పూర్తి చేసుకున్న వేళ.. ప్రభుత్వ వైఫల్యాలపై నిరసన వ్యక్తంచేస్తూ నల్ల చొక్కాలు ధరించి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీ ప్రాంగణానికి వచ్చారు. అయితే అసెంబ్లీ గేటు వద్ద నిరసన చేపడుతున్న నేపథ్యంలో బీఆర్ఎస్ నేత హరీశ్ రావు నల్ల చొక్కాను విప్పించారు. ఆ తర్వాత బీఆర్ఎస్ నేతలను ఈడ్చుకెళ్లినట్లు ఆ నేతలు ఆరోపించారు. అందుకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.Ganesh Chaturthi 2026: వినాయక చవితి 2026 ఎప్పుడు జరుపుకోవాలి? సెప్టెంబరు 14 లేదా 15? తిథి, పూజా సమయం ఎప్పుడంటే?
Hyderabad, Telangana:Ganesh Chaturthi 2026 Timing: భారతీయుల సంప్రదాయంలో అత్యంత భక్తిశ్రద్ధలతో, అంగరంగ వైభవంగా జరుపుకునే పండుగలలో వినాయక చవితి అత్యంత ప్రాముఖ్యమైనది. పార్వతీపరమేశ్వరుల చిన్న కుమారుడైన విఘ్నేశ్వరుడి జన్మదినాన్ని పురస్కరించుకుని ఈ పండుగను దేశవ్యాప్తంగా ప్రతి ఏటా జరుపుకొంటారు. ప్రతి సంవత్సరం భాద్రపద మాసంలోని శుక్ల పక్ష చతుర్థి తిథి రోజున వినాయక చవితి పండుగను జరుపుకోవడం సాంప్రదాయంగా వస్తోంది. అయితే, ప్రతి ఏటా లాగే ఈసారి కూడా పండుగను ఏ రోజున నిర్వహించుకోవాలి, పూజలకు ఏ సమయం ఉత్తమమైనది అనే విషయాలపై భక్తులలో కొంత క్లారిటీ లేకుండా సందేహాలు నెలకొన్నాయి.
ఈ ఏడాది వినాయక చవితి తిథి వివరాల్లోకి వెళితే.. భాద్రపద శుక్ల పక్ష చవితి తిథి సెప్టెంబర్ 14వ తేదీ సోమవారం ఉదయం 7:06 గంటల (AM) నుండి ప్రారంభమై, మరుసటి రోజు అంటే సెప్టెంబర్ 15వ తేదీ మంగళవారం ఉదయం 7:44 గంటల (AM) వరకు కొనసాగుతుంది. ఈ సుదీర్ఘ తిథి సమయం కారణంగా 2026 సంవత్సరంలో వినాయక చవితి పండుగను భక్తులు రెండు రోజుల పాటు జరుపుకునే అవకాశం లభించింది.
అయితే, అత్యధిక శాతం మంది భక్తులు సెప్టెంబర్ 14వ తేదీ సోమవారం రోజునే ఈ పవిత్ర పండుగ పూజలు జరుపుకోవడానికి సిద్ధమవుతున్నారు. దీనికోసం ఇప్పటి నుంచే వినాయక బొమ్మలను ఎంతో ఉత్సాహంగా కొనుగోలు చేసి తమ ఇళ్లకు, పూజా మండపాలకు తరలిస్తున్నారు.
ఈసారి పండుగ సోమవారం రోజున రావడం భక్తులకు మరింత సంతోషాన్ని కలిగిస్తోంది. ఎందుకంటే శనివారం, ఆదివారం, సోమవారం కలుపుకొని వరుసగా మూడు రోజుల పాటు సుదీర్ఘమైన సెలవులు లభించాయి. దీనితో పండుగ వాతావరణం అంతటా మరింత ఉత్సాహంగా మారనుంది. ఒకవేళ అనివార్య కారణాల వల్ల సెప్టెంబర్ 14వ తేదీన పండుగ చేసుకోలేని వారు, సెప్టెంబర్ 15వ తేదీ ఉదయం 7:44 గంటల వరకు తిథి అందుబాటులో ఉన్నందున, ఆ రోజు ఉదయం కూడా పూజా కార్యక్రమాలను జరుపుకోవచ్చు.
సాధారణంగా సెప్టెంబర్ 14న వినాయక ప్రతిమలను నిలిపి నాటి నుండి దాదాపు 11 రోజుల పాటు నిత్యం అత్యంత భక్తితో పూజలు నిర్వహిస్తారు. ఈ భాద్రపద మాసం మొత్తం గణపతి ఆరాధనకు అంకితం చేస్తారు. ఈ మాసంలో గణేశ్ చతుర్థి రోజు నుండి ప్రారంభించి అనంత చతుర్దశి తిథి వరకు భక్తులు నిరంతరాయంగా గణనాథుడిని పూజిస్తూ ఉంటారు.
గమనిక: ఈ కథనంలో అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాలు, పండితుల సూచనలు, వారు తెలిపిన అంశాల ఆధారంగా పాఠకుల ఆసక్తి మేరకు మాత్రమే అందించారు. దీనికి ఎటువంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. ఈ సమాచారాన్ని జీ తెలుగు న్యూస్ ధృవీకరించలేదు.
Also Read: 300 యేళ్ల తర్వాత అరుదైన త్రిగ్రాహి యోగం.. ఈ రాశులకు పట్టిందల్లా బంగారమే.. లగ్జరీ లైఫ్ వీళ్ల
Also Read: నేటి రాశి ఫలాలు.. ఈ రాశుల వారికి అదృష్ట యోగం! ప్రయాణాలు వాయిదా వేసుకోవాల్సిన
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
KTR Harish Rao Black Shirt: తెలంగాణ అసెంబ్లీలో రణరంగం..కేటీఆర్ తలకు గాయం..ఉద్రిక్తతలో చిరిగిన హరీశ్ రావు చొక్క!
Hyderabad, Telangana:KTR Harish Rao Assembly Black Shirt: అసెంబ్లీ ప్రవేశ ద్వారం వద్ద ఉద్రిక్తత, తోపులాట తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా శాసనసభ ప్రాంగణం వద్ద పెద్ద ఎత్తున ఘర్షణ వాతావరణం నెలకొంది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం 1,000 రోజుల పాలనను పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని, ప్రభుత్వ వైఫల్యాలను నిరసించేందుకు బీఆర్ఎస్ పార్టీ వ్యూహాత్మకంగా నల్ల టీషర్టులను ధరించి బయలుదేరింది.
ఈ దుస్తులపై కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు, నెరవేర్చని ఆరు గ్యారంటీలపై విమర్శనాత్మక నినాదాలు ముద్రించి ఉన్నాయి. అయితే, అసెంబ్లీ ప్రవేశ ద్వారం (గేట్ నంబర్ 1) వద్ద పోలీసులు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను నిలిపివేశారు. నల్ల చొక్కాలతో సభలోకి వెళ్లడం శాసనసభ నిబంధనలకు విరుద్ధమని పోలీసులు స్పష్టం చేస్తూ వారిని నిలువరించారు. నిరసనకారుల అరెస్టుతో లక్డీకాపూల్ పరిసర ప్రాంతాలు స్తంభించిపోగా, అసెంబ్లీ లోపల బీజేపీ భూ దందాలపై విచారణ డిమాండ్ చేస్తూ నిరసనలకు దిగింది.
రోడ్డుపై బైఠాయింపు, నిలిచిపోయిన రవాణా వ్యవస్థ పోలీసుల తీరుపై బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ గేట్ నంబర్ 1 వెలుపల ప్రధాన రహదారిపైనే వారంతా బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ అకస్మాత్తు పరిణామంతో లక్డీకాపూల్, నాంపల్లి, పబ్లిక్ గార్డెన్స్, ఖైరతాబాద్ వంటి నగరంలోని ప్రధాన ప్రాంతాల్లో వాహనాలు నిలిచిపోయాయి. ప్రయాణికులు, సాధారణ ప్రజలు కిలోమీటర్ల మేర స్తంభించిపోయిన భారీ ట్రాఫిక్ జామ్‌లో చిక్కుకుని తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
బలప్రయోగం, గాయాలు, తీవ్ర నిరసనలు రోడ్డుపై బైఠాయించిన నిరసనకారులను అదుపు చేయడానికి పోలీసులు చివరికి బలప్రయోగం చేయాల్సి వచ్చింది. కేటీఆర్, హరీశ్ రావుతో పాటు ఇతర ప్రతినిధులను పోలీసులు బలవంతంగా లాక్కెళ్లి పోలీస్ వాహనాల్లోకి ఎక్కించి సమీపంలోని స్టేషన్లకు తరలించారు. ఈ తోపులాట ప్రక్రియలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తల, నుదురు, చేతికి స్వల్ప గాయాలైనట్లు చెప్పుకొచ్చారు. అలాగే మాజీ మంత్రి హరీశ్ రావు, మరికొందరు సభ్యుల చొక్కాలు చిరిగిపోయినట్లు సమాచారం.
ఈ సందర్భంగా కేటీఆర్, హరీశ్ రావు కాంగ్రెస్ అధిష్టానంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఢిల్లీ లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, వారి ఎంపీలు నల్ల టీషర్టులు ధరించి తిరగవచ్చని, కానీ ఇక్కడ తమను నిరోధించడం కాంగ్రెస్ ద్వంద్వ నీతికి నిదర్శనమని మండిపడ్డారు. మరోవైపు అసెంబ్లీ లోపల బీజేపీ ఎమ్మెల్యేలు సైతం 22ఏ భూ దందాలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని కోరుతూ నిరసనకు దిగడంతో సభ వాయిదా పడింది.
Also REad: Madhuri Rathod: డాన్సర్ మాధురి రాథోడ్ ఆత్మహత్యాయత్నం.. ఈశ్వర్ సాయికి మాధురి బిగ్ షాక్!
Also Read: ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు చంద్రబాబు వరాల జల్లు..పీఆర్సీ, DA చెల్లింపునకు డేట్ ఫిక్స్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Mary Kom Bigg Boss: బిగ్‌బాస్ హౌస్‌లోకి ఒలింపిక్స్ బాక్సింగ్ ఛాంపియన్..రియాలిటీ షో చరిత్రలో ఇదే తొలిసారి!
Hyderabad, Telangana:Mary Kom Bigg Boss 20: దేశవ్యాప్తంగా బుల్లితెర ప్రేక్షకులను అమితంగా అలరించే ప్రముఖ రియాలిటీ షో 'బిగ్ బాస్' సరికొత్త సీజన్లు ఘనంగా ప్రారంభమయ్యాయి. నిన్న ఒకేరోజు ఐదు విభిన్న భాషల్లో బిగ్ బాస్ సీజన్లు అత్యంత వైభవంగా ల్యాంచ్ అయ్యాయి. ఈ ప్రారంభోత్సవాలలో భాగంగా తెలుగు బిగ్‌బాస్ సీజన్ 10 హౌస్‌లోకి 16 మంది కంటెస్టెంట్లను హోస్ట్ అక్కినేని నాగార్జున బిగ్‌బాస్ ఇంటిలోకి సాదరంగా ఆహ్వానించారు. అదే సమయంలో.. తమిళం నుంచి విజయ్ సేతుపతి, కన్నడ నుంచి కిచ్చా సుదీప్, మలయాళం నుంచి మోహన్ లాల్ వారివారి బిగ్‌బాస్ సీజన్ లాంచ్ సందర్భంగా అందరూ కలిసి వీడియో కాల్లో మాట్లాడుకున్నారు. ఇది సంఘటన ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.
మరోవైపు, బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ హోస్ట్ చేస్తున్న హిందీ బిగ్ బాస్ సీజన్ 20 కూడా ఎంతో వైభవంగా ప్రారంభమైంది. అయితే, ఈ సీజన్లో అందరినీ ఆశ్చర్యపరిచిన అత్యంత విశేషమైన విషయం ఏమిటంటే, భారతదేశపు మహిళా బాక్సింగ్ దిగ్గజం మేరీ కోమ్ కంటెస్టెంట్‌గా బిగ్ బాస్ హౌస్‌లోకి ప్రవేశించడం. మేరీ కోమ్ హౌస్‌లోకి ప్రవేశించిన విధానం ఎంతో ప్రత్యేకంగా సాగింది. ఈ వేడుకకు ఆమె కుమారుడు స్వయంగా విచ్చేసి, బిగ్ బాస్ సెట్ వద్ద తన తల్లికి ప్రేమపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ రియాలిటీ షోలో పాల్గొనడంపై మేరీ కోమ్ బిగ్ బాస్ వేదికపై మాట్లాడుతూ.. "గృహిణిగా ఉండటం నా వ్యక్తిత్వంలో ఒక ముఖ్యమైన భాగం" అని ఎంతో వినమ్రంగా చెప్పారు. అథ్లెట్‌గా బాక్సింగ్ రింగ్‌లో అద్భుత విజయాలు సాధించిన ఆమె, ఇప్పుడు రియాలిటీ టీవీ స్టార్‌గా ఒక సరికొత్త పాత్ర పోషిస్తున్నారు. ఈ కొత్త పాత్రను ప్రేక్షకులు ఎలా స్వీకరిస్తారో మనం వేచి చూడాలి. ఈ షోలో ఆమె తన వ్యక్తిత్వాన్ని ఎలా నిరూపించుకుంటుందో చూడటం అత్యంత ఆసక్తికరంగా మారింది. హౌస్‌లో మేరీ కోమ్ వ్యక్తిత్వంలోని విభిన్న కోణాలను ప్రజలు తెలుసుకుంటారు, ముఖ్యంగా సల్మాన్ ఖాన్ ఆమెను ఏ కోణం నుండి ఇంటికి పంపారో దాని ఆధారంగా ప్రేక్షకులు ఆమె అసలు వ్యక్తిత్వాన్ని గమనించవచ్చు.
మేరీ కోమ్ హౌస్‌లోకి ప్రవేశించిన శుభ తరుణంలో, ప్రియాంక చోప్రా ఆమెను ప్రత్యేకంగా అభినందించారు. ఆమె సాధించిన విజయవంతమైన ప్రయాణానికి గాను బిగ్ బాస్ స్వయంగా ఆమెను అభినందించింది. హోస్ట్ సల్మాన్ ఖాన్ ఈ అభినందనల వీడియోను వేదికపై అందరికీ చూపించారు. ఆరుసార్లు ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌గా నిలిచి దేశానికి ప్రాతినిధ్యం వహించిన మేరీ కోమ్‌ను స్వదేశంలో తక్కువ అంచనా వేయలేము. దేశం కోసం పోరాడిన ఈ వీరనారి, రింగ్ వెలుపల కూడా విజయం సాధించగలదని ఆశిద్దాం.
Also Read: బిగ్‌బాస్ సీజన్ 10 ప్రోమో వచ్చేసింది.. ఊహించని సర్ప్రైజ్లతో 16 మంది కంటెస్టెంట్లు!
Also Read: భారత వెయిట్‌లిఫ్టర్ కీయా బెనర్జీకి చేదు అనుభవం.. నగ్న ఫొటోలుగా మార్ఫింగ్ వైరల్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Vande Bharat Tirupati: తిరుమల వెళ్లే శ్రీవారి భక్తులకు శుభవార్త..ఇప్పుడు తిరుపతికి మరో వందే భారత్ రైలు!
Tirupati, Andhra Pradesh:Vande Bharat Shivamogga Tirupati: తిరుమలకు రోజురోజుకు పెరుగుతున్న భక్తుల రద్దీకి అనుగుణంగా రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. కలియుగ వైకుంఠమైన తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకునే భక్తుల సంఖ్య పెరుగుతున్న క్రమంలో తెలుగు రాష్ట్రాలతో పాటు పొరుగున ఉన్న కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుండి నిత్యం వేలాది మంది భక్తులు తిరుపతికి తరలివస్తుంటారు. ఈ నేపథ్యంలో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని రైల్వే సర్వీసులను పెంచాలనే డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది.
ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో నడుస్తున్న వందే భారత్ రైళ్లకు ప్రయాణికుల నుండి విశేష ఆదరణ లభిస్తోంది. ముఖ్యంగా సికింద్రాబాద్ - తిరుపతి మధ్య నడుస్తున్న వందే భారత్ రైలు ఎప్పుడూ ప్రయాణికులతో నిండిపోతోంది. ఈ క్రమంలోనే పొరుగు రాష్ట్రాల నుండి కూడా సర్వీసులను పెంచాలనే వినతులు భారీగా వచ్చాయి. ఈ ప్రజాప్రతినిధుల వినతుల మేరకు రైల్వే శాఖ శివమొగ్గ టౌన్ - తిరుపతి మధ్య కొత్త వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను మంజూరు చేసింది.
తిరుపతికి వచ్చే భక్తుల సౌకర్యార్థం కర్ణాటక నుండి కొత్త వందే భారత్ రైలును ప్రవేశపెట్టాలని తిరుపతి ఎంపీ రైల్వే బోర్డు చైర్మన్‌కు లేఖ రాసినట్లు చెప్పుకొచ్చారు. దీనిపై రైల్వే బోర్డు సానుకూలంగా స్పందించి, తగిన ప్రతిపాదనను రూపొందించిందని ప్రకటించారు. ఈ విషయాన్ని ఎంపీ స్వయంగా సోషల్ మీడియా వేదికగా వెల్లడిస్తూ, రైల్వే బోర్డు చైర్మన్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.
రైలు మార్గం, ప్రయోజనాలు..
ఈ కొత్త వందే భారత్ రైలు కర్ణాటకలోని శివమొగ్గ టౌన్ లో బయలుదేరి బిరూర్, అర్సికెరే, కేఎస్ఆర్ బెంగళూరు, కాట్పాడి మీదుగా తిరుపతికి చేరుకుంటుంది. ఈ రైలు ప్రతిరోజూ ఉదయం సమయంలో శివమొగ్గ టౌన్ లో బయలుదేరే విధంగా అధికారులు షెడ్యూల్‌ను సిద్ధం చేస్తున్నారు. ఈ రైలు ప్రకటన ద్వారా ముఖ్యంగా బెంగళూరు, దాని చుట్టుపక్కల పరిసర ప్రాంతాల భక్తులకు ఎంతో ప్రయోజనకరంగా మారనుంది. వచ్చే నెలలోనే ఈ రైలును అందుబాటులోకి తీసుకురావడానికి రైల్వే అధికారులు తుది కసరత్తు చేస్తున్నారు.
ఈ కొత్త రైలుతో పాటు ఆంధ్రప్రదేశ్ భక్తులకు మరో తిరుగులేని గుడ్ న్యూస్ కూడా ఉంది. విశాఖపట్నం నుండి తిరుపతి మధ్య అత్యాధునిక వందే భారత్ స్లీపర్ రైలును కూడా త్వరలోనే ప్రవేశపెట్టేలా రైల్వే శాఖ పక్కా ప్రణాళికలతో ముందుకు సాగుతోంది. దీనివల్ల సుదూర ప్రాంతాల భక్తులకు కూడా తిరుమల యాత్ర మరింత సులభతరం, సుఖమయం కానుంది.
Also Read: భరోసా పెన్షన్లకు ముహూర్తం ఖరారు..కొత్త పింఛన్ల కోసం కొత్త దరఖాస్తు ఆ రోజు నుంచే?
Also Read: ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు చంద్రబాబు వరాల జల్లు..పీఆర్సీ, DA చెల్లింపునకు డేట్ ఫిక్స్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Bandhu Singh 5 Girlfriends: 63 ఏళ్ల వయసులో ఐదుగురు ప్రియురాళ్లు..ఇద్దరు గర్భవతులు..డబ్బు కోసం గజదొంగగా మారిన తాత!
New Delhi, Delhi:Bandhu Singh 5 Girlfriends News: సాధారణంగా వృద్ధాప్యంలో ప్రశాంతమైన జీవితాన్ని గడపాలని చాలామంది కోరుకుంటారు. కానీ, 63 ఏళ్ల వయసు వచ్చినప్పటికీ ఏమాత్రం మారకుండా, విలాసాల కోసం దొంగతనాలను వృత్తిగా ఎంచుకున్నాడు ఒక వృద్ధుడు. తనకున్న ఐదుగురు ప్రియురాళ్ల సరదాలు తీర్చడానికి, వారి ఖరీదైన ఖర్చులను భరించడానికి దొంగగా మారిన ఈ తాత కథ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా నిలిచింది.
పోలీసుల కథనం ప్రకారం.. ఇటీవల అరెస్టు అయిన ఒక దొంగను 63 ఏళ్ల బంధు సింగ్‌గా అధికారులు గుర్తించారు. పోలీసుల విచారణలో బంధు సింగ్ గురించి వెల్లడైన వివరాలు విని స్వయంగా పోలీసు అధికారులే ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. బంధు సింగ్‌కు ఐదుగురు మహిళలతో అక్రమ సంబంధాలు ఉన్నాయని ఈ విచారణలో తేలింది. వృద్ధాప్యంలో ఉన్నప్పటికీ, తన ఉంపుడుగత్తెలతో సరదాగా గడపడం కోసం అతను దొంగతనాల బాట పట్టాడు.
బంధు సింగ్ ప్రియురాళ్లు అత్యంత విలాసవంతమైన, ఖరీదైన జీవనశైలిని కోరుకునేవారు. వారి కోరికలను తీర్చడానికి, వారి ఖరీదైన ఖర్చులను భరించడానికి అతనికి నిత్యం పెద్ద మొత్తంలో డబ్బు అవసరమయ్యేది. కానీ అతనికి ఎటువంటి సరైన ఆదాయ వనరు లేదు. దీంతో సులభంగా డబ్బు సంపాదించేందుకు దొంగతనాన్ని తన వృత్తిగా ఎంచుకున్నాడు.
తన ప్రియురాళ్ల ఖర్చుల కోసం బంధు సింగ్ ప్రతిరోజూ ఏదో ఒక ఇంట్లోకి లేదా దుకాణంలోకి చొరబడి దొంగతనాలకు పాల్పడేవాడు. రాత్రి పూట అత్యంత కుయుక్తితో పక్కా పథకాలు వేసి, విభిన్న ప్రాంతాలలో నిరంతరం దొంగతనాలు చేసేవాడని పోలీసులు వెల్లడించారు.
ఈ కథలో మరింత విస్తుపోయే విషయం ఏమిటంటే, బంధు సింగ్ ఐదుగురు ప్రియురాళ్లలో ఇద్దరు గర్భవతులై పిల్లలను కూడా కన్నారు. దీంతో ఆ పిల్లల పెంపకానికి అయ్యే ఖర్చులతో పాటు, ప్రియురాళ్ల వివిధ రకాల విలాసవంతమైన కోరికలను తీర్చడానికి అతనికి ఇంకా పెద్ద మొత్తంలో డబ్బు అవసరమైంది. అందుకే అతను ప్రతిరోజూ చాలా తెలివిగా, కుయుక్తితో దొంగతనాలు చేస్తూ సాగాడు.
చివరకు ఈ నిత్య దొంగల తాత పోలీసుల నిఘాకు చిక్కి అరెస్ట్ అయ్యాడు. బంధు సింగ్‌ను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేయగా, అతని విలాసవంతమైన జీవనశైలి, దొంగతనాల వెనుక ఉన్న ఐదుగురు ప్రియురాళ్ల అసలు రంగు వెలుగులోకి వచ్చింది. చిన్న వయసు నుంచే దొంగతనాలకు పాల్పడుతున్న బంధు సింగ్, వయసు పైబడిన తర్వాత కూడా అదే దారిలో కొనసాగాడు. ఈ తాత వింత జీవనశైలి, అతని నేరాల కథ ప్రస్తుతం సోషల్ మీడియా వ్యాప్తంగా విపరీతంగా వైరల్ అవుతూ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఈ విషయం గతంలో ఎప్పుడో జరిగినదే అయినా.. ఇప్పుడు సోషల్ మీడియా పుణ్యమా అంటూ ఈ వార్త మరోసారి వైరల్‌గా మారింది.
Also Read: ప్రియుడికి KTM బైక్ గిఫ్ట్ కోసం సొంత ఇంట్లోనే దొంగతనం..19 ఏళ్ల కాలేజీ యువతి అరెస్ట్!
Also REad: భరోసా పెన్షన్లకు ముహూర్తం ఖరారు..కొత్త పింఛన్ల కోసం కొత్త దరఖాస్తు ఆ రోజు నుంచే?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Madhuri Rathod: డాన్సర్ మాధురి రాథోడ్ ఆత్మహత్యాయత్నం.. ఈశ్వర్ సాయికి మాధురి బిగ్ షాక్!
Hyderabad, Telangana:Dancer Madhuri rathod suicide attempt: ఫోక్ డ్యాన్సర్ ల మధ్య వివాహేతర సంబంధం వివాదం పీక్స్ కు వెళ్లింది. ఈశ్వర్ సాయి, మాధురీ రాథోడ్ లు వేముల వాడలో ఒక గదిలో ఈశ్వర్ సాయి భార్యకు అడ్డంగా దొరికిపోయారు. తొలుత తమ మధ్య ఎలాంటి రిలేషన్ లేదని చెప్పిన ఈశ్వర్ సాయి ఆ తర్వాత మరల ఆమెతో ఒత్తిడిలో అలా చేశానని చెప్పాడు. మరల వీరిద్దరి మధ్య డబ్బుల లావాదేవీల వివాదం వెలుగులోకి వచ్చింది. ఇక మాధురీ రాథోడ్ మాత్రం తనను పెళ్లి పేరుతో మాయ మాటలు చెప్పి మోసం చేశాడని, డైవర్స్ తీసుకుంటానని చెప్పి శారీరకంగా లొంగదీసుకున్నాడని చెప్పింది.YS Sharmila Daughter: ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల కూతురి పెళ్లి..కాబోయే అల్లుడు ఎవరో తెలుసా?
Hyderabad, Telangana:YS Sharmila Daughter Anjili Reddy Marriage: ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల ఇంట మరల పెళ్లి సందడి మొదలైంది. తన కూతురు అంజలి రెడ్డి పెళ్లి ముహూర్తం ఫిక్స్ అయినట్లు ఎక్స్ వేదికగా వైఎస్ షర్మిల ట్విట్ చేశారు. అమెరికాకు చెందిన ప్రముఖ వైద్యులు డాక్టర్ సోమాల రఘురాం రెడ్డికి తన కుమార్తెను ఇచ్చి వివాహం జరిపిస్తున్నవెల్లడించారు. తనకు కాబోయే అల్లుడు.. సోమాల సుబ్బారెడ్డి.. పద్మ దంపతుల కుమారుడు అని తెలిపారు.AP NTR Bharosa Pension: భరోసా పెన్షన్లకు ముహూర్తం ఖరారు..కొత్త పింఛన్ల కోసం కొత్త దరఖాస్తు ఆ రోజు నుంచే?
Vijayawada, Andhra Pradesh:AP New NTR Bharosa Pension: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా పథకం కింద అర్హులైన ప్రతి ఒక్కరికీ నూతన పింఛన్లను మంజూరు చేసే ప్రక్రియను మరింత వేగవంతం చేస్తోంది. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా కొత్త దరఖాస్తులను స్వీకరించడానికి ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లను అధికారికంగా పూర్తి చేసింది. సమాజంలోని నిరుపేదలు, వెనుకబడిన వర్గాలకు ఆర్థిక భరోసా కల్పించడమే ధ్యేయంగా ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. దీని కింద వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలతో పాటు గీత కార్మికులు, చేనేత కార్మికులు, మత్స్యకారులు నూతన పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకోవడానికి ప్రభుత్వం అర్హులుగా గుర్తించింది.
ఈ నూతన పింఛన్ల దరఖాస్తు ప్రక్రియ, ఈ-కేవైసీ (eKYC) నమోదు ప్రక్రియ సెప్టెంబర్ 07వ తేదీ నుండి అధికారికంగా ప్రారంభం కానుంది. అర్హులైన లబ్ధిదారులు తమకు అత్యంత సమీపంలో ఉన్న గ్రామ లేదా వార్డు సచివాలయానికి స్వయంగా వెళ్లి తమ పేర్లను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు సమర్పించే సమయంలో లబ్ధిదారులు తమ వెంట కొన్ని అత్యవసరమైన పత్రాలను తప్పనిసరిగా తీసుకువెళ్లాలి.
ముఖ్యంగా దరఖాస్తుదారుడి ఆధార్ కార్డు, రైస్ కార్డ్ లేదా ఆదాయ ధృవీకరణ పత్రాన్ని (ఇన్కమ్ సర్టిఫికేట్) తప్పనిసరిగా జతచేయాల్సి ఉంటుంది. వీటితో పాటు, ప్రత్యేక కేటగిరీల కింద దరఖాస్తు చేసుకునే వారు అదనపు పత్రాలను అందించాలి. వికలాంగులు తమ వైకల్యాన్ని ధృవీకరించే సదరమ్ (SADAREM) సర్టిఫికేట్‌ను, వితంతువులు తమ భర్త మరణ ధృవీకరణ పత్రాన్ని (డెత్ సర్టిఫికేట్) సంబంధిత పత్రాలుగా అధికారులకు సమర్పించాల్సి ఉంటుంది.
దరఖాస్తుదారులు అందించిన పత్రాల ఆధారంగా, సచివాలయంలో అందుబాటులో ఉండే డిజిటల్ అసిస్టెంట్ ఆన్లైన్ పోర్టల్ ద్వారా దరఖాస్తు ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆన్లైన్ సమర్పణ ప్రక్రియ పూర్తయిన వెంటనే, లబ్ధిదారునికి ఒక రసీదు లేదా అక్నాలెడ్జ్మెంట్ స్లిప్‌ను జారీ చేస్తారు. ఈ రసీదు దరఖాస్తు విజయవంతంగా నమోదైనదనడానికి ఒక ముఖ్యమైన నిదర్శనంగా ఉపయోగపడుతుంది.
దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ పూర్తిగా ముగిసిన తర్వాత, సంబంధిత ప్రభుత్వ అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లి నేరుగా ఫీల్డ్ వెరిఫికేషన్ నిర్వహిస్తారు. ఈ వెరిఫికేషన్ ప్రక్రియలో దరఖాస్తుదారు సమర్పించిన వివరాలు, పత్రాలు పూర్తిగా నిజమైనవని నిర్ధారణ అయితే, అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ నూతన ఎన్టీఆర్ భరోసా పింఛన్లను ప్రభుత్వం అధికారికంగా మంజూరు చేస్తుంది. పింఛన్ల పంపిణీ విధానంలో అత్యున్నత పారదర్శకతను పెంచడానికి, సమాజంలోని నిజమైన లబ్ధిదారులకు మాత్రమే పూర్తి లబ్ధి చేకూర్చడానికి ఈ ప్రక్రియంతటినీ సచివాలయాల ద్వారా అత్యంత పకడ్బందీగా నిర్వహిస్తున్నారు.
Also Read: ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు చంద్రబాబు వరాల జల్లు..పీఆర్సీ, DA చెల్లింపునకు డేట్ ఫిక్స్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
AP PRC: ఏపీ ప్రభుత్వ వరాలపై ఉద్యోగ సంఘాల హర్షం.. నెరవేర్చకపోతే ఉద్యమం చేస్తాం
Nuzendla, Andhra Pradesh:AP Govt Employees: 'ఉపాధ్యాయ సంఘాలు డీఏ, ఇతర సమస్యలపై అతి పెద్ద ఉద్యమం చేశారు. 10 వేల మంది ఉద్యోగులతో పెద్ద కార్యక్రమాలు చేశారు. పీఆర్సీపై ఏపీ జెఎసీకి ఉమ్మడిగా వెళ్లే బాధ్యత అప్పగించారు. జూలై 26వ తేదీలోపు చర్చలకు పిలవాలని నోటీసులు ఇచ్చాం. ఆ తర్వాత వివిధ కార్యక్రమాలు చేపట్టడంతో గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్‌తో సమావేశం పెట్టారు. ఆగష్టు 31వ తేదీలోపు ముఖ్యమంత్రి చర్చలకు పిలవకపోతే సెప్టెంబర్ మొదటి వారంలో కార్యాచరణ ఉంటుందని చెప్పాం' అని ఏపీ జేఏసీ చైర్మన్ విద్యాసాగర్ తెలిపారు.
'ప్రభుత్వం నుంచి స్పందన రాకపోవడంతో సెప్టెంబర్ 5వ తేదీన ఉద్యమ శంఖారావం పూరిస్తామని చెప్పాం. 200కు పైగా ఉన్న సంఘాలు ఏపీ జెఎసీ ఉద్యమంలోకి దిగుతుందని ప్రకటించింది. సెప్టెంబర్ 5వ తేదీన చంద్రబాబుతో జరిగిన చర్చల్లో పలు హా మీలు ఇచ్చారు' అని జేఏసీ అధ్యక్షులు విద్యాసాగర్ వివరించారు. 'మా సమస్యలను సీఎం చంద్రబాబుకు వివరించగా.. పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. మా ఇబ్బందులు గుర్తించి సానుకూలంగా స్పందించారు' అని తెలిపారు.
'పీఆర్సీ కమిషన్ పెండింగ్‌లో ఉండగా.. కమిషనర్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. పెండింగ్‌లో ఉన్న ఐదు డీఏలలో.. రెండు డీఎలు ఒకే నెలలో ఇస్తామని చెప్పారు. సరెండర్ లీవ్‌లు ఒక ఇన్స్టాల్మెంట్ ఇస్తామని తెలిపారు. ఉద్యోగులకు న్యాయంగా రావాల్సిన డబ్బులు ఇవ్వాలని కోరాం' అని జేఏసీ చైర్మన్ విద్యాసాగర్ వివరించారు. 'పోలీసు సోదరులకు అదనంగా మరొక సరెండర్ లీవ్ సెప్టెంబర్ నుంచి డిక్లేర్ చేశారు. ఉద్యోగుల హెల్త్ కార్డు వ్యవస్థ సక్రమంగా పని చేయడం లేదు. ఉద్యోగులు పడుతున్న ఇబ్బందులపై ముఖ్యమంత్రికి పరిస్థితిని వివరించాం' అని వెల్లడించారు.
'ఏడెనిమిది సంవత్సరాలుగా హెల్త్ కార్డులు పని చేయని పరిస్థితి. మా నుంచి డబ్బులు కట్టించుకుంటున్న ప్రభుత్వం నెలకు రూ.36 కోట్లు జమ చేయడం లేదు. ఆస్పత్రులకు బిల్లులు చెల్లించకపోవడంతో నగదు రహిత వైద్యానికి ముందుకు రావడం లేదు. మా జీతాల్లో నుంచి డబ్బులు తీసుకుంటున్న సమయంలోనే.. ప్రభుత్వం కూడా ట్రస్ట్ కు డబ్బులు ఇవ్వాలని కోరాం' అని జేఏసీ అధ్యక్షులు విద్యాసాగర్ తెలిపారు.
'వచ్చే నెల నుంచి హెల్త్ ట్రస్టుకు డబ్బులు ఇస్తే.. మూడు నెలల్లో అందరికీ వైద్య సేవలు అందుతాయి. మా ముందే నగదు బదిఈ చేయాలని ముఖ్యమంత్రి అధికారులకు మౌఖికంగా ఆదేశాలు ఇచ్చారు. అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ 2017లోనే పదిశాతం ఇచ్చారు' అని జేఏసీ చైర్మన్ విద్యాసాగర్ వివరించారు. 'నేడు నాలుగు లక్షల మంది పెన్షనర్లు ఉన్నారు. అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ పదిశాతం ఇవ్వాలని కోరాం' అని తెలిపారు.
'జనవరి 1 నుంచి అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఇంటీరియమ్ రిలీఫ్ గురించి సీఎంగారిని కోరగా సానుకూలంగా స్పందించారు. 11 పీఆర్సీలు ఇప్పటివరకు వేయగా.. ఎప్పుడైనా ఇంటీరియమ్ రిలీఫ్ జరిగిందా అని అడిగారు. దీనికి కూడా ఒక షెడ్యూల్ పెట్టుకుని తప్పకుండా చేస్తామని చెప్పారు' అని జేఏసీ అధ్యక్షులు విద్యాసాగర్ తెలిపారు. కాంట్రాక్టు , అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలపై చర్చించినట్లు కూడా చెప్పారు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల పదవీ విరమణ 62 ఏళ్లకు పెంచాలని కోరినట్లు.. ఉద్యోగులకు అండగా నిలిచామని ప్రకటించారు.
'ప్రభుత్వం ప్రశ్నించే పరిస్థితి తెచ్చుకుంటే మాత్రం వెనుకాడేది లేదు. ఉద్యమానికి సిద్దమయ్యే పరిస్థితి వచ్చినా ఏపీ జేఏసీ సిద్దంగా ఉంటుంది. 90 శాతం వ్యవస్థ ఉన్న ఏపీ జేఏసీ మొదటి నుంచి చర్చల ద్వారా పరిష్కరిద్దాం అని చెప్పాం. కాదంటే ఉద్యమం తప్పదని హెచ్చరించాం.. కార్యాచరణ ప్రకటించాం' అని జేఏసీ అధ్యక్షులు విద్యాసాగర్ వివరించారు. ఉద్యోగులు పెట్టుకున్న నమ్మకాలను సాకారం చేశారని అన్ని జిల్లాల నుంచి ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు.
DSC Scam: మెగా డీఎస్సీ అక్రమాలపై నారా లోకేశ్ రాజీనామా చేయాలి: ఆర్కే రోజా
Tirupati, Andhra Pradesh:Nara Lokesh Resign: డీఎస్సీ అక్రమాలపై ధైర్యముంటే సీబీఐ విచారణకు ఆదేశించాలని నారా లోకేశ్‌కు మాజీ మంత్రి ఆర్కే రోజా సవాల్ విసిరారు. నకిలీ సర్టిఫికెట్లు, సంతకాల వ్యవహారాన్ని ఆధారాలతో సహా బయటపెడతామని ప్రకటించారు. పీటీ టీచర్ పోస్టులే కాకుండా సైన్స్, సోషల్ పోస్టులను కూడా అమ్ముకున్నారని విమర్శించారు. అనర్హులకు ఉద్యోగాలు ఇవ్వడంతో వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తు అంధకారంలో కూరుకుపోయిందని విమర్శించారు. లోకేష్ రాజీనామా చేసే వరకు డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరిగే వరకు వైఎస్సార్సీపీ పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు.
విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ విద్యా వ్యవస్థను తీవ్రంగా భ్రష్టు పట్టించారని మాజీ మంత్రి ఆర్కే రోజా విమర్శించారు. డీఎస్సీ, టెట్ పరీక్షలను సక్రమంగా నిర్వహించకుండా అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. 'స్పోర్ట్స్ కోటాలో నకిలీ సర్టిఫికెట్లతో ఉద్యోగాలను అమ్ముకున్నారు. అర్హులైన నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వకుండా రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు పోస్టులను అమ్ముకుని దోచుకున్నారు' అని మాజీ మంత్రి ఆర్కే రోజా తీవ్ర ఆరోపణలు చేశారు.
'వెలుగొండ ప్రాజెక్టుపై చంద్రబాబు మరోసారి క్రెడిట్ దొంగతనానికి పాల్పడ్డాడు. 1996లో వెలుగొండ ప్రాజెక్టుకు పునాది వేసి.. 1999లో అదే ప్రాజెక్టును వేస్ట్ అని చెప్పింది చంద్రబాబు. వైఎస్ రాజశేఖరరెడ్డి, వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలోనే వెలుగొండ ప్రాజెక్టు పనులు 85 శాతం పూర్తయ్యాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో తీవ్ర కరువు పరిస్థితులు నెలకొన్నాయి' వైఎస్సార్సీపీ సీనియర్ నాయకురాలు ఆర్కే రోజా తెలిపారు.
'కరువు, చంద్రబాబు కవల పిల్లలు అని మా నాయకుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఎప్పుడో చెప్పారు. రాష్ట్రంలో 420 మండలాలు కరువు మండలాలుగా మారడానికి చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యమే కారణం. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులను గెలిపించి కూటమి ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పాలి' అని మాజీ మంత్రి ఆర్కే రోజా పిలుపునిచ్చారు. వైఎస్ జగన్‌కు అండగా నిలిచి 2029లో వైఎస్ జగన్మోహన్రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
Harish Rao: రేవంత్ రెడ్డికి హరీశ్ రావు సవాల్.. దమ్ముంటే అసెంబ్లీ నెల రోజులు నడపాలి
Erravalli, Telangana:BRSLP Meeting: తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ రాజీనామా కోరుతున్న రేవంత్ రెడ్డి ముందు అతడు రాజీనామా చేయాలని మాజీ మంత్రి హరీశ్ రావు తెలిపారు. దేవుళ్ల మీద ఒట్లు పెట్టి ఆరు గ్యారెంటీలు, రుణమాఫీ ఎగ్గొట్టినందుకు ముందు రాజీనామా చేయాల్సింది రేవంత్ రెడ్డే అని స్పష్టం చేశారు. 'నాడు ఎన్టీఆర్, జయలలిత, చంద్రబాబు లాంటి నాయకులను సభలో అవమానిస్తే.. వారు అసెంబ్లీని బహిష్కరించి ప్రజాక్షేత్రంలో గెలిచి మళ్లీ ముఖ్యమంత్రులుగా అడుగుపెట్టారు. కేసీఆర్ కూడా అదే బాటలో ఉన్నారు' అని బీఆర్ఎస్ పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు వివరించారు. దమ్ముంటే అసెంబ్లీని నెల రోజులు నడపాలని ఈ సందర్భంగా రేవంత్ రెడ్డికి సవాల్ చేశారు.
సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ పార్టీ శాసనసభా పక్ష సమావేశం నిర్వహించారు. రేపటి నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ, శాసనమండలి సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై గులాబీ అధినేత కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. ఈ భేటీ అనంతరం మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు మీడియాతో మాట్లాడుతూ.. కీలక విషయాలు వెల్లడించారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై, రేవంత్ రెడ్డి తీరుపై అసెంబ్లీ వేదికగా ప్రభుత్వాన్ని నిలదీసే అంశాలను, పార్టీ భవిష్యత్ కార్యాచరణను వివరించారు.
'కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 1000 రోజులు పూర్తవుతున్నా అన్ని వర్గాల ప్రజలకు తీరని ద్రోహమే జరిగింది. విద్యార్థులు, నిరుద్యోగులు, ఉద్యోగులు, రైతులు, మహిళలు, దళిత, గిరిజన, బీసీ వర్గాలను ఈ ప్రభుత్వం నిలువునా మోసం చేసింది. ప్రజా సమస్యల మీద సమగ్రంగా చర్చించడానికి కనీసం నెల రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నడపాలని బీఏసీ సమావేశంలో బీఆర్ఎస్ పక్షాన గట్టిగా డిమాండ్ చేయాలని నిర్ణయించాం' అని మాజీ మంత్రి హరీశ్ రావు వెల్లడించారు.
'కాళేశ్వరం ప్రాజెక్టు వద్ద నీళ్లున్నా కావాలనే ఎత్తిపోతలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను ఏడిపిస్తోంది. కేసీఆర్ 80 శాతం పూర్తి చేసిన పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టులో చిన్న పని పూర్తి చేస్తే 60 టీఎంసీల నీళ్లు వస్తాయి. కానీ ప్రభుత్వం కక్షపూరితంగా దాన్ని గాలికొదిలేసింది' అని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు గుర్తుచేశారు. ఈ రెండు ప్రాజెక్టుల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా రాబోయే రోజుల్లో కేసీఆర్ స్వయంగా లక్షలాది మందితో ప్రత్యక్ష ఉద్యమానికి నాయకత్వం వహిస్తారని ప్రకటించారు. ఈ విషయమై సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
'22A కింద వ్యవసాయ భూములను నిషేధిత జాబితాలో పెట్టి రైతులను ఇబ్బంది పెడుతున్న తీరుపై, కరెంట్ కోతలు, రుణమాఫీ వైఫల్యం, పాలిటెక్నిక్ జీవో 97 రద్దు, సింగరేణి కుంభకోణాలు, పీఆర్సీ, డీఏలు, ఈహెచ్ఎస్ ఫెయిల్యూర్ వంటి అన్ని అంశాలపైనా అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీస్తాం' అని మాజీ మంత్రి హరీశ్ రావు ప్రకటించారు. రాష్ట్రంలో 30 లక్షల మంది విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించకపోవడంతో వారి భవిష్యత్తు అంధకారమవుతుండడంతో.. విద్యార్థుల పక్షాన అవసరమైతే సభను స్తంభింపజేసి న్యాయం జరిగేదాకా కొట్లాడుతామని స్పష్టం చేశారు. అసెంబ్లీ సమావేశాలు వీలైనన్నీ ఎక్కువ రోజులు నిర్వహించాలని డిమాండ్ చేశారు. పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారని హరీశ్ రావు తెలిపారు.
Pollachi KTM Bike Gift: ప్రియుడికి KTM బైక్ గిఫ్ట్ కోసం సొంత ఇంట్లోనే దొంగతనం.. 19 ఏళ్ల కాలేజీ యువతి అరెస్ట్!
Pollachi, Tamil Nadu:Pollachi KTM Bike Gift News: తమిళనాడు రాష్ట్రంలోని పొల్లాచి ప్రాంతంలో జరిగిన ఈ విచిత్రమైన ఘటన ప్రస్తుతం స్థానికంగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. కాలేజీలో చదువుతున్న ఒక 19 ఏళ్ల యువతి ఒక యువకుడితో ప్రేమలో పడింది. ఆ ప్రియుడికి ఖరీదైన కేటీఎం (KTM) స్పోర్ట్స్ బైక్ నడపాలనే మోజు, కోరిక బలంగా ఉంది. ప్రియుడిపై ఉన్న అమితమైన ప్రేమతో, అతని బైక్ కోరికను తీర్చడం కోసం ఆమె ఎలాగైనా ఆ బైక్‌ను బహుమతిగా ఇవ్వాలని నిర్ణయించుకుంది. అయితే, అంత ఖరీదైన స్పోర్ట్స్ బైక్ కొనడానికి ఆమె వద్ద తగినంత డబ్బు లేదు.
ఈ నేపథ్యంలో, ఆమె కన్ను తన సొంత ఇంట్లోని బంగారంపై పడింది. సాధారణంగా కుటుంబ సభ్యులు ఇంట్లో భద్రంగా దాచుకునే బంగారు ఆభరణాలను దొంగిలించాలని నిర్ణయించుకుంది. కుటుంబ సభ్యులకు ఎటువంటి అనుమానం రాకుండా, వారి కళ్ళు గప్పి ఇంట్లో ఉన్న సుమారు 72 గ్రాముల బంగారు ఆభరణాలను తీసుకువెళ్లింది. అనంతరం ఆ ఆభరణాలను విక్రయించి, వచ్చిన డబ్బుతో తన ప్రియుడు ఎంతో ఆశపడిన కేటీఎం బైక్‌ను కొనుగోలు చేసి బహుమతిగా ఇచ్చింది.
కొన్ని రోజుల తర్వాత, ఇంట్లో భద్రంగా ఉంచిన లక్షల రూపాయల విలువైన బంగారు ఆభరణాలు అకస్మాత్తుగా కనిపించకపోవడాన్ని కుటుంబ సభ్యులు గమనించారు. ఆభరణాలు ఇంట్లోనే ఉన్నప్పటికీ ఎంత వెతికినా దొరక్కపోవడంతో వారు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. చివరకు చేసేదేమీ లేక స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించి, ఇంటి పరిసరాలను పరిశీలించి కుటుంబ సభ్యులందరినీ విచారించారు.
ఈ దర్యాప్తు సమయంలో యువతి మాటలు, ప్రవర్తనపై పోలీసులకు బలమైన అనుమానం వచ్చింది. పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. తన ప్రియుడికి కేటీఎం బైక్ గిఫ్ట్ ఇవ్వడానికే ఇంట్లో బంగారం దొంగిలించి అమ్మినట్లు ఆమె స్వయంగా ఒప్పుకుంది. దీంతో పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి జైలు శిక్ష విధించారు.
తల్లిదండ్రులు ఎంతో కష్టపడి కూడబెట్టుకున్న సొమ్మును సొంత కూతురే దొంగిలించడంతో ఆ కుటుంబ సభ్యులు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. కాగా, ఈ దొంగతనం విషయం బయటపడటంతో బైక్‌ను తీసుకున్న ఆమె ప్రియుడు అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ కేసులో అతని పాత్రను నిర్ధారించడానికి, దొంగిలించబడిన నగలు, బైక్‌ను స్వాధీనం చేసుకోవడానికి పోలీసులు ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి అతని కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు.
Also Read: వాహనదారులకు గుడ్‌న్యూస్.. రూ.1,000 ఫాస్ట్‌ట్యాగ్ బ్యాలెన్స్ ఉచితం..ఈ పని చేస్తే చాలు
Also REad: బంగారం ప్రియులకు గుడ్‌న్యూస్..భారీగా తగ్గిన బంగారం ధరలు..ఈరోజు రేట్స్ ఎలా ఉన్నాయంటే?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
