బలహీనులను మర్చిపోలేని బడ్జెట్ టైగర్ ఆంజనేయులు గౌడ్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిన్న అసెంబ్లీలో ప్రవేశపెట్టిన 2024 ఆర్థిక సంవత్సర బడ్జెట్ అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకుంది, ముఖ్యంగా బలహీన వర్గాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం సహాయక నిర్ణయం తీసుకుంది మరియు జిల్లా రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమానికి అత్యధిక నిధులు కేటాయించింది. మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు.
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Bangladesh Hindu Killed: బంగ్లాదేశ్‌లో హిందూ మైనారిటీల పరిస్థితి రోజురోజుకూ ఆందోళనకరంగా మారుతోంది. ఇటీవల మైమెన్సింగ్లో దైవదూషణ ఆరోపణలతో దీపు చంద్ర దాస్ అనే హిందూ యువకుడిని దారుణంగా హత్య చేయడాన్ని భారత్ తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) ప్రతినిధి రణధీర్ జైస్వాల్ శుక్రవారం న్యూఢిల్లీలో జరిగిన విలేకరుల సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు.
మైనారిటీలే లక్ష్యంగా దాడులు..
బంగ్లాదేశ్‌లో ప్రస్తుత తాత్కాలిక ప్రభుత్వ హయాంలో మైనారిటీలపై జరుగుతున్న దాడుల తీవ్రతను భారత్ ఎత్తిచూపింది. తాత్కాలిక ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి హిందువులు, క్రైస్తవులు, బౌద్ధులు సహా మైనారిటీలపై 2,900 కంటే ఎక్కువ హింసాత్మక సంఘటనలు నమోదయ్యాయి.
దీపు చంద్ర దాస్ హత్యను ఖండిస్తూ, బాధ్యులకు కఠిన శిక్ష పడేలా చూడాలని బంగ్లాదేశ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. బంగ్లాదేశ్ ప్రభుత్వం చెబుతున్నట్లుగా ఇవి కేవలం మీడియా సృష్టి లేదా రాజకీయ హింస కాదని, ఇవి మైనారిటీలపై జరుగుతున్న వ్యవస్థీకృత దాడులని జైస్వాల్ స్పష్టం చేశారు.
పొరుగు దేశంలో నెలకొన్న అస్థిరతపై భారతదేశం తన వైఖరిని స్పష్టంగా వివరించింది. తమ దేశంలోని మైనారిటీల ప్రాణాలకు, ఆస్తులకు, మతపరమైన స్థలాలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత పూర్తిగా బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వానిదే అని భారత్ పునరుద్ఘాటించింది. బంగ్లాదేశ్‌లో ప్రచారంలో ఉన్న తప్పుడు భారత వ్యతిరేక కథనాలను భారత్ నిర్ద్వంద్వంగా తిరస్కరించింది. బంగ్లాదేశ్‌లో శాంతి, స్థిరత్వం నెలకొనాలని.. అక్కడ స్వేచ్ఛాయుతమైన, న్యాయమైన, అందరినీ కలుపుపోయే ఎన్నికలు జరగాలని భారతదేశం ఆకాంక్షిస్తోంది.
బంగ్లాదేశ్ ప్రజలతో సంబంధాలు
బిఎన్‌పి (BNP) నాయకుడు తారిక్ రెహమాన్ 17 ఏళ్ల తర్వాత బంగ్లాదేశ్‌కు తిరిగి రావడంపై స్పందిస్తూ.. బంగ్లాదేశ్ ప్రజలతో తమ సంబంధాలను బలోపేతం చేసుకోవడానికి భారత్ కట్టుబడి ఉందని జైస్వాల్ పేర్కొన్నారు. అక్కడి పరిణామాలను భారతదేశం నిశితంగా గమనిస్తోందని ఆయన తెలిపారు.
చివరిగా.. పొరుగు దేశంలో మైనారిటీలపై జరుగుతున్న నిరంతర శత్రుత్వం చాలా ఆందోళనకరమైన విషయమని, తక్షణమే శాంతిభద్రతలను పునరుద్ధరించాలని భారతదేశం బంగ్లాదేశ్‌కు స్పష్టమైన హెచ్చరిక జారీ చేసింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Govt employees cover medical treatment scheme upto 10 lakhs: కొత్త సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పేందుకు సిద్ధమవుతోంది మధ్యప్రదేశ్ ప్రభుత్వం. కొత్త ఏడాదిలో ప్రభుత్వ ఉద్యోగులకు కీలకమైన ఆరోగ్య భద్రతా పథకం అమలు చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. హర్యానా, రాజస్థాన్ రాష్ట్రాల్లో అమలులో ఉన్న ఆయుష్మాన్ తరహా నగదు రహిత వైద్య సేవలను 2026 నాటికి రాష్ట్రంలోని దాదాపు 15 లక్షల మంది ఉద్యోగులకు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఒక ప్రతిపాదనను సిద్ధం చేసింది. ఈ పథకం ద్వారా ఉద్యోగులు, వారి కుటుంబాలకు ఆసుపత్రుల్లో ముందుగా డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేకుండా చికిత్స పొందే అవకాశం ఉంటుంది.
ఈ ప్రతిపాదిత పథకానికి ముఖ్యమంత్రి ఆయుష్మాన్ ఆరోగ్య బీమా పథకం అనే పేరు పెట్టారు. ఉద్యోగి సంఘాల సూచనలు, దీర్ఘకాలిక డిమాండ్లను పరిగణలోకి తీసుకొని ఈ పథకాన్ని రూపొందించారు. ఆయుష్మాన్ భారత్ తరహాలోనే రాష్ట్రంలోపల, రాష్ట్రం వెలుపల ఉన్న ప్రైవేట్, ఎంపిక చేసిన ఆసుపత్రులతో ప్రభుత్వం ఒప్పందాలు కుదుర్చుకోనుంది. దీని వల్ల ఉద్యోగులు ఎక్కడైనా చికిత్స పొందే సౌలభ్యం కలుగుతుంది.
ఈ పథకం కింద సాధారణ వైద్య చికిత్సలు, OPD సేవలకు రూ.5 లక్షల వరకు ఉచిత కవరేజ్ అందించనున్నారు. తీవ్ర అనారోగ్యాల విషయంలో ఈ పరిమితిని రూ.10 లక్షల వరకు పెంచే ప్రతిపాదన ఉంది. ఈ ప్రయోజనాలు ఉద్యోగులతో పాటు వారి కుటుంబ సభ్యులకు, అలాగే పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు కూడా వర్తించనున్నాయి.
ఈ ఆరోగ్య బీమా పథకానికి అవసరమైన నిధుల్లో ఒక భాగాన్ని ఉద్యోగులు, పెన్షనర్లు తమ జీతం లేదా పెన్షన్ నుండి నెలకు రూ.250 నుంచి రూ.1,000 వరకు విరాళంగా చెల్లించాల్సి ఉంటుంది. మిగిలిన మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది. 2020లో రాష్ట్ర ఉద్యోగులకు ఉచిత వైద్య సేవలు అందిస్తామని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ, అప్పట్లో ఆ పథకం అమలుకు నోచుకోలేదు. ఈసారి మాత్రం స్పష్టమైన విధివిధానాలతో అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.
ఈ పథకం ద్వారా శాశ్వత, తాత్కాలిక, కాంట్రాక్టు ఉద్యోగులు, బోధనా కేడర్, పదవీ విరమణ చేసిన ఉద్యోగులు, మున్సిపల్ సిబ్బంది, స్వయంప్రతిపత్తి సంస్థల ఉద్యోగులు, అంగన్వాడీ కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు, గ్రామ ఉపాధి సహాయకులు, పంచాయతీ కార్యదర్శులు వంటి విభిన్న విభాగాల ఉద్యోగులు లబ్ధి పొందనున్నారు. వీరి సంఖ్య 15 లక్షలకుపైగా ఉంటుందని అంచనా వేస్తున్నారు.
ప్రస్తుతం రాష్ట్ర ఉద్యోగులు వైద్య ఖర్చులను ముందుగా స్వయంగా భరిచి, తర్వాత రీయింబర్స్మెంట్ కోసం దరఖాస్తు చేయాల్సిన పరిస్థితి ఉంది. తీవ్రమైన అనారోగ్యాల సమయంలో ఈ విధానం వారికి భారీ ఆర్థిక భారంగా మారుతోంది. ఈ నేపథ్యంలో, నగదు రహిత వైద్య సేవలు ఉద్యోగులకు పెద్ద ఉపశమనంగా మారనున్నాయి. ఉద్యోగి సంఘాలు ఈ పథకాన్ని స్వాగతిస్తున్నాయి. పెన్షనర్లు, ఉద్యోగులు వైద్య ఖర్చుల కోసం తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వం త్వరగా నిర్ణయం తీసుకొని ఈ పథకాన్ని అమలు చేయాలి అని ఉద్యోగ సంఘాల ప్రతినిధులు కోరుతున్నారు. ఈ ప్రతిపాదన త్వరలో క్యాబినెట్ ముందుకు వెళ్లనుందని, ఆమోదం లభిస్తే 2026లో అమలు ప్రారంభమయ్యే అవకాశం ఉందని సమాచారం.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.
Income Tax Slab 2026: బడ్జెట్ సమయం దగ్గరకు వస్తున్న ప్రతిసారీ దేశవ్యాప్తంగా ఉన్న లక్షలాది ట్యాక్స్ పేయర్స్ మనస్సుల్లో మెదిలే మొదటి ప్రశ్న..ఈసారి ఆదాయపు పన్నులో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి? ముఖ్యంగా జీతంపై ఆధారపడే వేతనజీవులు తమపై ఉన్న పన్ను భారం కొంతైనా తగ్గుతుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఇప్పుడు బడ్జెట్ 2026 విషయంలోనూ ఇదే చర్చ ప్రధానంగా సాగుతోంది. ప్రభుత్వం ఆదాయపు పన్ను స్లాబ్‌లలో పెద్ద మార్పులు చేస్తుందా? లేక చిన్న సవరణలకే పరిమితమవుతుందా? అన్నదానిపై అంచనాలు కొనసాగుతున్నాయి.
ప్రస్తుతం దేశంలో రెండు ఆదాయపు పన్ను విధానాలు అమల్లో ఉన్నాయి. 1. పాత విధానం 2. కొత్త విధానం. ప్రభుత్వం కొత్త పన్ను విధానానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తోంది. ఈ విధానంలో మినహాయింపులు తక్కువగా ఉండగా.. పన్ను రేట్లు క్రమంగా పెరుగుతాయి. ప్రస్తుతం వార్షిక ఆదాయం రూ. 24 లక్షలు దాటిన వారికి నేరుగా 30 శాతం పన్ను వర్తిస్తోంది. ఇక పాత పన్ను విధానంలో వివిధ రకాల మినహాయింపులు, తగ్గింపులు ఉన్నప్పటికీ, స్లాబ్ నిర్మాణం పాతదిగానే కొనసాగుతోంది.
బడ్జెట్ 2026లో సామాన్య పన్ను చెల్లింపుదారుడికి అసలు ఉపశమనం ఎక్కడ లభించగలదనే ప్రశ్న ఇప్పుడు ప్రధానంగా వినిపిస్తోంది. ఇందులో ముఖ్యంగా 30 శాతం పన్ను స్లాబ్ అంశం ఎక్కువ చర్చకు దారి తీస్తోంది. ద్రవ్యోల్బణం, గృహ రుణ భారం, పిల్లల చదువు ఖర్చులు, వైద్య వ్యయాలు పెరిగిన నేపథ్యంలో రూ. 24 లక్షల పరిమితి ఇప్పటి పరిస్థితులకు సరిపోవడం లేదని మధ్యతరగతి, ఉన్నత-మధ్యతరగతి వర్గాలు భావిస్తున్నాయి. అందుకే 30 శాతం పన్ను స్లాబ్‌ను రూ. 40 లక్షలు లేదా రూ. 50 లక్షల ఆదాయం నుంచి ప్రారంభించాలని డిమాండ్ చేస్తున్నారు.
అలా జరిగితే రూ. 24 లక్షల నుంచి రూ. 40 లక్షల మధ్య ఆదాయం పొందే వారికి నేరుగా లాభం చేకూరుతుంది. వారి చేతిలో మిగిలే డబ్బు పెరుగుతుంది. వినియోగ సామర్థ్యం మెరుగవుతుంది. ఇది ఆర్థిక వ్యవస్థకు కూడా ప్రోత్సాహకంగా మారవచ్చని నిపుణుల అభిప్రాయం. అయితే, ఈ అంశంపై ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు ఎలాంటి స్పష్టమైన సంకేతాలు రాలేదు. ఆశలు ఉన్నప్పటికీ, ఖచ్చితత్వం మాత్రం లేదు.
ఇంకొకవైపు.. కొత్త పన్ను విధానంలో చిన్నచిన్న మార్పులు జరిగే అవకాశమే ఎక్కువగా కనిపిస్తోంది. ఉదాహరణకు.. స్టాండర్డ్ డిడక్షన్‌ను కొంత పెంచడం, ఆరోగ్య బీమా లేదా పదవీ విరమణ పొదుపులకు పరిమిత ప్రయోజనాలు జోడించడం వంటి సవరణలు రావొచ్చని అంచనా. ఇవి పెద్ద సంస్కరణలుగా అనిపించకపోయినా, జీతం పొందే లక్షలాది మందిపై తక్షణ ప్రభావం చూపే అవకాశముంది.
పరిశ్రమల సంఘాలు కూడా తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నాయి. PHDCCI ప్రకారం రూ. 50 లక్షల వరకు ఆదాయం ఉన్న వారికి పన్ను రేట్లలో ఉపశమనం ఇవ్వడం ద్వారా వినియోగాన్ని పెంచవచ్చని సూచిస్తోంది. డెలాయిట్ అయితే, TDS విధానాన్ని సరళీకృతం చేయడం, తయారీ రంగానికి ప్రోత్సాహకాలు ఇవ్వడం.. కొత్త పన్ను విధానాన్ని మరింత బలోపేతం చేయడం అవసరమని అంటోంది. ఈవై సంస్థ మాత్రం మూలధన లాభాల పన్ను, ఆదాయపు పన్ను స్లాబ్‌లు, పాత పన్ను విధానం భవితవ్యంపై మార్పులు రావచ్చని అంచనా వేస్తోంది.
పాత పన్ను విధానంపై గురించి చర్చిస్తే.. ప్రభుత్వం దాన్ని క్రమంగా పక్కకు నెట్టాలనే ఉద్దేశంతో ఉన్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. బడ్జెట్ 2026లో ఒక్కసారిగా దాన్ని రద్దు చేసే అవకాశం తక్కువగానే ఉన్నప్పటికీ, కొత్త మినహాయింపులు లేదా పెద్ద ఉపశమనం వచ్చే ఆశలు కూడా చాలా పరిమితంగానే ఉన్నాయి. అంటే.. పాత విధానంలో కొనసాగుతున్న వారు పెద్ద మార్పులు ఆశించకపోవడమే మంచిదని నిపుణులు అంటున్నారు.
మొత్తంగా చూస్తే.. బడ్జెట్ 2026లో ఆదాయపు పన్ను స్లాబ్‌లలో విప్లవాత్మక మార్పులు జరిగే అవకాశం తక్కువగానే కనిపిస్తోంది. అయినప్పటికీ, 30 శాతం పన్ను స్లాబ్‌పై ప్రభుత్వం పునరాలోచన చేస్తే.. అది మధ్యతరగతికి, లక్షలాది పన్ను చెల్లింపుదారులకు పెద్ద ఊరటగా మారుతుంది. ప్రస్తుతం ఆశలు కొనసాగుతున్నాయి. కానీ తుది నిర్ణయం మాత్రం బడ్జెట్ రోజునే స్పష్టమవుతుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.
Telangana Sankranti Holidays 2026: సంక్రాంతి పండగ వచ్చిందంటే చాలు.. పిండి వంటలు, గాలిపటాలు, సొంతూరి ప్రయాణాలతో సందడి మొదలవుతుంది. ముఖ్యంగా విద్యార్థులు ఈ పండగ సెలవుల కోసం వేయికళ్లతో ఎదురుచూస్తుంటారు. అయితే, ఈసారి తెలంగాణలోని పాఠశాలలకు గత ఏడాది కంటే అదనంగా సెలవులు వచ్చే అవకాశం ఉండటంతో పిల్లలు అప్పుడే ప్లాన్లలో మునిగిపోయారు.
9 రోజుల సెలవుల లెక్క ఇదీ!
సాధారణంగా తెలంగాణలో సంక్రాంతికి తక్కువ రోజులే సెలవులు ఇస్తుంటారు. కానీ, ఈ ఏడాది క్యాలెండర్ కలిసొస్తుండటంతో సెలవుల సంఖ్య పెరిగేలా కనిపిస్తోంది. జనవరి 10 (రెండో శనివారం), జనవరి 11 (ఆదివారం), జనవరి 12 నుండి 17 వరకు: సంక్రాంతి పండగ సెలవులు (అంచనా) అదే విధంగా జనవరి 18న ఆదివారం కావడం వల్ల సెలవులు వచ్చే అవకాశం ఉంది.
ఇలా వరుసగా శని, ఆదివారాలు తోడవడంతో జనవరి 10 నుండి 18 వరకు వరుసగా 9 రోజులు స్కూళ్లకు సెలవులు వచ్చే ఛాన్స్ ఉంది. తిరిగి జనవరి 19 (సోమవారం) నాడు పాఠశాలలు పునఃప్రారంభం కావచ్చు. దీనిపై మరో రెండు మూడు రోజుల్లో విద్యాశాఖ నుండి అధికారిక ప్రకటన వెలువడనుంది.
ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంక్రాంతి సెలవులపై ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. జనవరి 10వ తేదీ నుంచి 18 వరకు 9 రోజుల పాటు రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలతో పాటు ప్రైవేట్ పాఠశాలలకు సెలవులను ప్రకటించారు. జనవరి 19న అనగా సోమవారం తిరిగి పాఠశాలలు ప్రారంభమవుతాయి. అయితే ప్రభుత్వ, ప్రైవేట్ కాలేజీలకు సెలవులపై స్పష్టత రావాల్సిఉంది.
ప్రయాణాలకు సిద్ధమవుతున్న జనం
ఈసారి లాంగ్ వీకెండ్స్, వరుస సెలవులు ఉండటంతో..అటు ఆంధ్రప్రదేశ్, ఇటు తెలంగాణ ప్రజలు తమ సొంతూళ్లకు వెళ్లేందుకు ఇప్పటికే ఏర్పాట్లు చేసుకుంటున్నారు. పర్యాటక ప్రాంతాలకు వెళ్లాలనుకునే వారు కూడా ఈ 9 రోజుల విరామాన్ని అద్భుతంగా సద్వినియోగం చేసుకోవచ్చు.
గమనిక: ఇవి విద్యాశాఖ అంతర్గత వర్గాల సమాచారం ప్రకారం అంచనాలు మాత్రమే. అధికారిక తేదీల కోసం ప్రభుత్వం విడుదల చేసే జీవో (GO) కోసం వేచి చూడాల్సిందే.
Also Read: Midday Meal Egg: స్కూల్ విద్యార్థులకు షాక్..మధ్యాహ్న భోజనంలో గుడ్లు బంద్! కొండెక్కిన కోడిగుడ్ల ధరలు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Samsung Galaxy S25 Ultra Offer Price: మీరు శామ్సంగ్ ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్ కోసం ఎదురుచూస్తున్నారా? అయితే మీకు ఇది మంచి సమయం. ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్ వెబ్సైట్, శామ్సంగ్ గెలాక్సీ S25 అల్ట్రా (Samsung Galaxy S25 Ultra) పై భారీ ధర తగ్గింపును ప్రకటించింది. ఇప్పుడు ప్రీమియం ఫీచర్లు కోరుకునే వారికి ఈ ఆఫర్ ఒక అద్భుత అవకాశంగా మారింది.
ధర, ఆఫర్ వివరాలు
లాంచ్ సమయంలో శామ్సంగ్ గ్యాలక్సీ ఎస్25 అల్ట్రా ధర రూ. 1,29,999 గా ఉండగా.. ఇప్పుడు అది భారీ తగ్గింపుతో లభించనుంది. ఫ్లిప్‌కార్ట్‌లో ఇప్పుడు ఈ ఫోన్ రూ. 1,07,183 కే అందుబాటులో ఉంది. దీంతో నేరుగా రూ. 22,816 మేర ధర తగ్గింది. నెలకు కేవలం రూ. 3,769 నుండి ప్రారంభమయ్యే నో-కాస్ట్ EMI ఆప్షన్లు కూడా ఉన్నాయి.
ఎక్స్ఛేంజ్ ఆఫర్‌తో మరింత ఆదా!
మీ దగ్గర ఉన్న పాత స్మార్ట్‌ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ చేయడం ద్వారా ధరను ఇంకా తగ్గించుకోవచ్చు. మీ పాత ఫోన్ కండిషన్, మోడల్‌ను బట్టి గరిష్టంగా రూ. 57,400 వరకు ట్రేడ్-ఇన్ విలువ లభిస్తుంది. ఈ ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ను కూడా వినియోగించుకుంటే, గెలాక్సీ S25 అల్ట్రాను అత్యంత తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు.
Samsung Galaxy S25 Ultra అదిరిపోయే ఫీచర్లు
ఈ ఫోన్ కేవలం ధరలో మాత్రమే కాదు, హార్డ్‌వేర్ విషయంలోనూ సూపర్ పవర్‌ఫుల్‌గా ఉంటుంది.
డిస్ప్లే: 6.9-అంగుళాల భారీ AMOLED స్క్రీన్ (120Hz రిఫ్రెష్ రేట్)
ప్రాసెసర్: అత్యంత వేగవంతమైన Qualcomm Snapdragon 8 Elite చిప్సెట్
మెమరీ: 16GB RAM, 1TB వరకు స్టోరేజ్ ఎంపికలు.
కెమెరా (క్వాడ్ సెటప్): 200MP మెయిన్ సెన్సార్ + 50MP అల్ట్రా-వైడ్ లెన్స్ + 50MP పెరిస్కోప్ కెమెరా + 10MP టెలిఫోటో లెన్స్ (3x ఆప్టికల్ జూమ్) + 12MP సెల్ఫీ కెమెరా
బ్యాటరీ: 5000 mAh బ్యాటరీ (45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్)
OS: శామ్సంగ్ యొక్క సరికొత్త One UI 8 సాఫ్ట్వేర్.
కలర్స్: టైటానియం బ్లాక్, గ్రే, సిల్వర్ బ్లూ, వైట్ సిల్వర్ రంగుల్లో లభిస్తుంది.
నామమాత్రపు తగ్గింపుల కోసం కాకుండా, భారీ డిస్కౌంట్ కోసం ఎదురుచూసే కస్టమర్లకు ఇది బెస్ట్ డీల్. స్టాక్ ముగిసేలోపు ఈ ఆఫర్‌ను చెక్ చేసుకోండి.
Also Read: Midday Meal Egg: స్కూల్ విద్యార్థులకు షాక్..మధ్యాహ్న భోజనంలో గుడ్లు బంద్! కొండెక్కిన కోడిగుడ్ల ధరలు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Telangana Bhavan: తన తండ్రిపై రేవంత్ రెడ్డి చేసిన బూతు వ్యాఖ్యలపై బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు అన్నీ భాషలు.. అన్నీ భాషల్లో తాను మాట్లాడగలడనని.. కానీ తన నైజం అది కాదని కేటీఆర్ తెలిపారు. ఆ వ్యాఖ్యలు చూస్తుంటే ఎడమ కాలి చెప్పు తీసుకుని కొట్టాలని ఉంటది కానీ అలా చేయలేం కాదా? అని పేర్కొన్నారు. సీఎం పదవి వస్తే మంచిగా పని చేసుకో అని రేవంత్ రెడ్డికి హితవు పలికారు.
Also Read: Govt Employees: ప్రభుత్వ ఉద్యోగుల భారీ నిర్ణయం.. డీఏ, పీఆర్సీ, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం నిరసన
హైదరాబాద్‌లోని శేరిలింగంపల్లి నియోజకవర్గానికి చెందిన నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. జూబ్లీహిల్స్‌లోని పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్లో జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి కేటీఆర్ కీలక ప్రసంగం చేశారు. రేవంత్ రెడ్డి కొడంగల్ సభలో వాడిన భాషపై కేటీఆర్ మండిపడ్డారు. 'రేవంత్‌ను తిట్టాలని తనకు లేదు. తెలంగాణ తెచ్చిన నాయకుడు, రెండు సార్లు ప్రజలు గెలిపించిన ముఖ్యమంత్రి, మా నాయనను తిడితే కొడుకుకు ఆవేశం రాదా? రేవంత్ దొరికితే ఎడమ కాలి చెప్పు తీసుకు కొట్టాలని ఉంది. కానీ ఏం చేయాలి? ప్రజాస్వామ్యంలో ఉన్నాం' అని కేటీఆర్ తెలిపారు.
Also Read: Bandi Sanjay: నెల రోజుల్లో పంచాయతీలకు నిధులివ్వాల్సిందే! రేవంత్ రెడ్డికి బండి సంజయ్ సవాల్
'రేవంత్ రెడ్డి ఎక్కడి నుంచి వచ్చారు అసలు మీరు? మీ ప్రయాణం ఎక్కడ మొదలైంది? రోడ్ల మీద పెయింటింగ్స్ వేసుకునేటోడు రేవంత్ రెడ్డి. జీవితంలో ఎవరైనా చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయికి రావాలి, తప్పు లేదు. కానీ మంచి పనులు చేసి రావాలి. లంగ పనులు చేసి, దొంగ పనులు చేసి, బ్యాగులు మోసి, సంచులు మోసి, దొరికిపోయి, జైలుకు వెళ్లి మళ్లీ అదేదో పెద్ద గొప్ప విషయం అన్నట్టు రేవంత్ రెడ్డి పోజులు కొడుతున్నారు' అని మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు.
Also Read: Harish Rao: రైతులకు రేవంత్ రెడ్డి దగా.. 24 గంటల విద్యుత్ పచ్చి మోసం: హరీశ్ రావు
'ఢిల్లీలో పైసలు ఇచ్చి ముఖ్యమంత్రి పదవి తెచ్చుకున్న రేవంత్ రెడ్డి సీఎం పదవిలో ఉన్నందుకు సంతోషపడాలి కానీ రోజూ ఈ ఏడుపు ఎందుకు?' అని రేవంత్ రెడ్డిని కేటీఆర్ ప్రశ్నించారు. 'హామీల అమలు ఏమైంది అని అడిగితే 'నీ గుడ్లు పీకి గోటీలాడతా' అంటాడు. వీడెక్కడి ముఖ్యమంత్రి?' అని అసహనం వ్యక్తం చేశారు. 'రెండేళ్లల్లో ఏం చేశావయ్యా అంటే 'లాగుల తోండలు విడిపిస్తా, పేగులు మెడలో వేసుకుంటా, గుడ్లు పీకి గోటీలాడతా'.. నీ అమ్మ, నీ అయ్య, గీదా నీ భాష? మాకు రాదా భాష? మాట్లాడమంటావా?' అని మాజీ మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
'నేను హైదరాబాద్ గల్లీల్లో పెరిగిన వాడిని. మాట్లాడమంటే ఉర్దూలో, హిందీలో, తెలుగులో, ఇంగ్లీషులో పొల్లు పోకుండా తిట్టే తెలివి నాకు కూడా ఉంది. కానీ నీకు కాదు, నీ కుర్చీకి గౌరవం ఇచ్చి ఊరుకుంటున్నాం. కనకపు సింహాసనమున శునకము కూర్చుండబెట్టినట్టుంది పరిస్ధితి' అని కేటీఆర్ పునరుద్ఘాటించారు. 'కాంగ్రెస్ నాయకులు బయటకు రా అంటే కేసీఆర్ వచ్చి ఒక ప్రెస్‌మీట్ పెట్టి పోయిండు. దానికే రేవంత్ రెడ్డికి ముచ్చెమటలు పట్టాయి, చలి జ్వరం వచ్చింది. దానికే అరుస్తున్న రేవంత్ రెడ్డి ఇప్పుడు అసెంబ్లీకి రా అంటున్నాడు. బయటకు వస్తేనే తట్టుకోలేకపోయాడు. ఇక కేసీఆర్ అసెంబ్లీకి వస్తే గుండె ఆగి రేవంత్ రెడ్డి చస్తాడు' అని కేటీఆర్ వివరించారు.
'నేను గుంటూరులో చదువుకున్నా అంటాడు. నేను గుంటూరులో చదువుకుంటే రేవంత్ కేమి నోప్పి .. నేను ప్రపంచమంతా చదువుకున్నా. రేవంత్ తల్లిదండ్రులు ఆయనకు చక్కటి తోవ చూపించలేదు నేనేం చేయాలి? నేను ఆంధ్రాకు పోయి ఇంటర్మీడియట్ చదువుకుంటే తప్పట! కానీ ఆయన ఆంధ్రాకెళ్లి అల్లుణ్ణి మాత్రం తెచ్చుకోవచ్చట' అని మాజీ మంత్రి కేటీఆర్ గుర్తుచేశారు. 'అందుకే ఇంకా రేవంత్ కు చిట్టి నాయుడి కాకుండా 'భీమవరం బుల్లోడు' అని పెడితే సరిపోతుంది' అని తెలిపారు.
'నేను మా నాయన (కేసీఆర్) పేరు చెప్పుకొని బతుకుతున్నా అంటాడు. అవును మా నాయన గొప్పోడు. మా నాయన తెలంగాణ తెచ్చిన మొగోడు, మొనగాడు. బరాబర్ చెప్పుకుంటా! తప్పేమున్నది? మా నాయన పేరు నేను కాకపోతే ఎవడు చెప్పుకుంటాడు నాకు అర్థం కాదు?' అని రేవంత్ రెడ్డి తీరుపై మాజీ మంత్రి కేటీఆర్ అసహనం వ్యక్తం చేశారు. 'నువ్వు సక్కటి పనులు చేస్తే నీ పిల్లలు కూడా నీ పేరు చెప్పుకుంటారు. నువ్వు లుచ్చా పనులు చేసినవనుకో నీ మనవడు కూడా నీ పేరు చెప్పడు' అని రేవంత్ రెడ్డికి చురుకులు అంటించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
.Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Actress Namitha Re-Entry News: దక్షిణాది సినీ పరిశ్రమలో ఒకప్పుడు తన గ్లామర్‌తో కుర్రకారును ఉర్రూతలూగించిన హీరోయిన్లలో నమిత ఒకరు. కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉన్నప్పుడే వివాహం చేసుకుని వెండితెరకు దూరమైన ఈ గ్లామర్ క్వీన్, దాదాపు 12 ఏళ్ల విరామం తర్వాత మళ్లీ రీఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. అయితే ఈసారి ఆమె రూటు మార్చడం విశేషం.
'సొంతం' నుండి 'సింహా' వరకు..
గుజరాత్లో జన్మించిన హీరోయిన్ నమిత.. తెలుగులో ఆర్యన్ రాజేశ్ సరసన 'సొంతం' సినిమాతో తెరంగేట్రం చేశారు. ఆ సినిమా సూపర్ హిట్ కావడంతో టాలీవుడ్లో వరుస అవకాశాలు దక్కించుకున్నారు. ఆమె కెరీర్లో గుర్తుండిపోయే పాత్ర యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన 'బిల్లా'లో గ్లామరస్ రోల్ పోషించి మెప్పించారు.
స్టార్ హీరోలతో 'జెమిని', 'నాయకుడు' వంటి చిత్రాల్లో నటించడమే కాకుండా, నందమూరి బాలకృష్ణ 'సింహా'లో ప్రత్యేక గీతంతో ఆకట్టుకున్నారు. 2010 తర్వాత తెలుగు సినిమాలకు దాదాపు దూరమైన ఆమె, ఇతర భాషల్లో ఒకటి అర చిత్రాలు చేస్తూ వచ్చారు.
రీఎంట్రీపై నమిత స్పష్టత..
ఇటీవల ఒక ప్రైవేట్ ఈవెంట్లో పాల్గొన్న నమిత తన సెకండ్ ఇన్నింగ్స్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. "గతంలో చేసిన తప్పులను మళ్లీ చేయదలుచుకోలేదు. ఇప్పుడు నాకు గ్లామర్ పాత్రలు చేయాలని లేదు. కేవలం పవర్ఫుల్, ఐకానిక్ పాత్రల కోసమే ఎదురుచూస్తున్నాను" అని ఆమె పేర్కొన్నారు. ఇకపై సినిమాల్లో కేవలం గ్లామర్ కోసం ఉండే పాత్రలను చేయనని, అలాంటి కథలు వస్తే నిర్మొహమాటంగా రిజెక్ట్ చేస్తున్నానని చెప్పారు.
రజనీకాంత్ 'నరసింహ' చిత్రంలో నీలాంబరి (రమ్యకృష్ణ) పాత్ర ఎంతటి గుర్తింపు తెచ్చుకుందో.. తనకు కూడా అలాంటి బలమైన పాత్రలు చేయాలని ఉందని ఆమె తన మనసులో మాట బయటపెట్టారు.
కొత్త లుక్‌లో నమిత..
చాలా కాలం తర్వాత బయటకు వచ్చిన నమిత ఫోటోలు చూసి అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. గతంలో కంటే చాలా భిన్నంగా, పరిణతి చెందిన నటిగా కనిపిస్తున్నారని కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ గ్లామర్ క్వీన్ ఆశించిన విధంగా పవర్ఫుల్ 'నీలాంబరి' లాంటి పాత్రతో ప్రేక్షకుల ముందుకు వస్తుందో లేదో వేచి చూడాలి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Midday Meal Egg: స్కూల్ విద్యార్థులకు షాక్..మధ్యాహ్న భోజనంలో గుడ్లు బంద్! కొండెక్కిన కోడిగుడ్ల ధరలు!
Egg In Mid Day Meal: తెలుగు రాష్ట్రాల్లో చికెన్, కోడిగుడ్ల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. సామాన్యుడికి భారంగా మారిన ఈ ధరల పెరుగుదల ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లోని మధ్యాహ్న భోజన పథకంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. గత నెలలో 6 రూపాయలుగా ఉన్న గుడ్డు ధర ఇప్పుడు ఏకంగా రూ. 10 వరకు చేరడంతో విద్యార్థులకు పౌష్టికాహారం అందించడం సవాలుగా మారింది.
కొండెక్కిన ధరలు.. కారణమేంటి?
గత కొద్దిరోజులుగా కోడిగుడ్లు, చికెన్ ధరలు విపరీతంగా పెరగడానికి ప్రధానంగా రెండు కారణాలు అని మార్కెట్ వర్తకులు అంటున్నారు. కార్తీక మాసం ముగియడం, వరుస పండుగలు రావడంతో మాంసాహారానికి ఒక్కసారిగా గిరాకీ పెరిగింది. డిమాండ్‌కు తగ్గట్లుగా పౌల్ట్రీ ఉత్పత్తి లేకపోవడంతో సరఫరా దెబ్బతింది. వచ్చే నెలలో సంక్రాంతి ఉండటంతో ధరలు మరింత పెరిగే అవకాశం ఉందే తప్ప తగ్గే సూచనలు కనిపించడం లేదని వ్యాపారులు చెబుతున్నారు. గుడ్ల ధరలు పెరగడంతో మధ్యాహ్న భోజన కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ప్రభుత్వం ఒక్కో గుడ్డుకు కేవలం రూ. 6 మాత్రమే చెల్లిస్తోంది. కానీ మార్కెట్లో హోల్‌సేల్ ధర రూ. 7.50 ఉండగా, రిటైల్ ధర రూ. 10 పలుకుతోంది. ధరల భారాన్ని భరించలేక కొన్ని చోట్ల వంట కార్మికులు గుడ్డుకు బదులు అరటిపండు ఇస్తున్నారు. దీనివల్ల విద్యార్థులు ప్రోటీన్ అధికంగా ఉండే కోడిగుడ్డుకు దూరమవుతున్నారు.
వంట కార్మికుల డిమాండ్లు
తమకు వస్తున్న అరకొర గౌరవ వేతనంతో (నెలకు రూ. 3,000) ధరల పెరుగుదలను తట్టుకోవడం సాధ్యం కాదని వంట కార్మికులు వాపోతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం నేరుగా గుడ్లను సరఫరా చేస్తున్నట్లుగానే, తెలంగాణలో కూడా ప్రభుత్వం ద్వారానే గుడ్ల పంపిణీ జరగాలని కోరుతున్నారు. నిత్యావసర సరుకుల ధరలు పెరిగినందున, ప్రభుత్వం ఇచ్చే నిధులను పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి రావాల్సిన బిల్లులు సకాలంలో రాకపోవడంతో వడ్డీలకు తెచ్చి వంట చేయాల్సి వస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వచ్చే ఆర్థిక సంవత్సరం నుండి ప్రభుత్వ పాఠశాలల్లో అల్పాహారం అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ క్రమంలోనే మధ్యాహ్న భోజన బడ్జెట్‌ను కూడా పెంచి, విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందేలా చూడాలని తల్లిదండ్రులు, కార్మికులు కోరుతున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Gold Rate Today: 2026లో చైనా ఆడుతున్న మైండ్ గేమ్ బంగారం.. వెండి ధరలను ప్రభావితం చేస్తోంది. యువాన్ బలపడటంతో చైనా పెద్దగా విక్రయానికి కదలకుండా.. మార్కెట్లో స్థిరత్వాన్ని చూపడమే ప్రధాన వ్యూహంగా పెట్టుకుంది. ఎందుకంటే.. చైనా తన కరెన్సీని బలోపేతం చేస్తుంటే అంతర్జాతీయ పెట్టుబడిదారులు కూడా బంగారం–వెండిపై నమ్మకం పెంచుతున్నారు. ఫలితంగా బంగారం ధరలు చుట్టూ ప్రపంచం తిరుగుతోంది. అలాగే వెండి ధరలు పారిశ్రామిక డిమాండ్, సౌర–ఎలక్ట్రిక్ వాహనాల అవసరంతో బలంగా పెరుగుతున్నాయి. ఫలితంగా 2026లో బంగారం వెండి ధరలు చారిత్రాత్మక రికార్డులను క్రియేట్ చేయడం ఖాయమంటూ భవిష్యత్తు ధరలపై అంచనా వేస్తున్నారు విశ్లేషకులు. ఈ నేపథ్యంలో డిసెంబర్ 26వ తేదీ శుక్రవారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.
బంగారం ధరలు రోజురోజుకీ సరికొత్త గరిష్టాలను నమోదు చేస్తూ దూసుకెళ్తున్నాయి. డిసెంబర్ 26న శుక్రవారం దేశీయ మార్కెట్లో పసిడి ధరలు మరోసారి రికార్డు స్థాయికి చేరాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ. 1,40,930గా ట్రేడవుతుండగా.. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 1,28,050కి చేరింది. ఇక వెండి ధర కూడా ఊహించని రీతిలో పెరిగి కిలోకు రూ. 2,26,270గా నమోదైంది. ఈ ధరలు బంగారం–వెండి మార్కెట్లో కొనసాగుతున్న అసాధారణ ర్యాలీకి నిదర్శనంగా మారాయి.
బంగారం ధరలు ఇలా ఎగబాకడానికి ప్రధాన కారణం అంతర్జాతీయ మార్కెట్లలో చోటుచేసుకున్న పరిణామాలే అని చెప్పాలి. ముఖ్యంగా అమెరికా మార్కెట్లో ఒక ఔన్స్ (సుమారు 31.1 గ్రాములు) బంగారం ధర ఏకంగా 4,500 డాలర్లకు చేరడం చరిత్రలోనే అరుదైన ఘటనగా నిపుణులు చెబుతున్నారు. డాలర్ విలువ బలహీనపడటం, అమెరికా వడ్డీ రేట్లపై ఉన్న అనిశ్చితి, అలాగే ప్రపంచవ్యాప్తంగా భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు బంగారాన్ని మరింత ఆకర్షణీయమైన పెట్టుబడిగా మార్చాయి.
గత రెండు వారాలుగా గమనిస్తే.. బంగారం ధరలు దాదాపు ప్రతిరోజూ పెరుగుతూనే ఉన్నాయి. ఈ ఏడాది ప్రారంభం నుంచి ఇప్పటివరకు చూస్తే బంగారం ధరలు సుమారు 70 శాతం వరకు పెరిగినట్టు మార్కెట్ డేటా చెబుతోంది. ఇంత తక్కువ కాలంలో ఇంత భారీగా ధరలు పెరగడం గతంలో చాలా అరుదుగా మాత్రమే కనిపించింది. పెట్టుబడిదారులు బంగారాన్ని అత్యంత సురక్షితమైన ఆస్తిగా భావించి పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతున్నదే ఈ ర్యాలీకి ప్రధాన కారణంగా నిపుణులు విశ్లేషిస్తున్నారు.
అయితే ఈ ధరల పెరుగుదల ఆభరణాలు కొనుగోలు చేసే సామాన్య ప్రజలకు మాత్రం భారంగా మారింది. ప్రస్తుతం 22 క్యారెట్ల బంగారం ధర కూడా ఆల్‌టైమ్ హై వద్ద ట్రేడవుతుండటంతో, జ్యువెలరీ షాప్‌లో 10 గ్రాముల బంగారు చైన్ కొనాలంటే తయారీ ఛార్జీలు, జీఎస్టీ తదితర ఖర్చులు కలిపి దాదాపు రూ. 1.40 లక్షల వరకు ఖర్చవుతున్న పరిస్థితి ఏర్పడింది.
వెండి ధరల పరిస్థితి కూడా ఇదే విధంగా ఉంది. వెండి ధరలు సాధారణంగా కాకుండా ప్రతిరోజూ కొత్త రికార్డులను నమోదు చేస్తూ ముందుకు సాగుతున్నాయి. ప్రస్తుతం వెండి ధర కిలోకు రూ. 2.30 లక్షల సమీపంలో ట్రేడవుతోంది. అంతర్జాతీయ మార్కెట్లలో వెండికి ఉన్న భారీ డిమాండ్, ముఖ్యంగా పారిశ్రామిక రంగాల్లో—సౌర విద్యుత్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో వినియోగం పెరగడం వల్ల వెండి ధరలు ఈ స్థాయికి చేరుకున్నాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.
Govt Employees Pension: ప్రభుత్వ ఉద్యోగులు రాజీనామా చేస్తే పెన్షన్ వస్తుందా? లేదా? అనే సందేహం చాలామందిలో ఉంటుంది. ఈ అంశంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తాజా తీర్పు ఈ అనిశ్చితికి స్పష్టత తీసుకొచ్చింది. సర్వీస్ కాలం ఎంత ఉన్నా.. ప్రభుత్వ ఉద్యోగానికి స్వచ్ఛందంగా రాజీనామా చేస్తే పెన్షన్ హక్కు ఉండదని న్యాయస్థానం తేల్చి చెప్పింది. ఈ తీర్పు భవిష్యత్తులో ఉద్యోగులపై పెద్ద ప్రభావం చూపే అవకాశం ఉంది.
ఈ అంశంపై గురుగ్రామ్‌కు చెందిన చార్టర్డ్ అకౌంటెంట్ అమిత్ కుమార్ చేసిన విశ్లేషణ కీలకంగా మారింది. ఆయన ఒక విద్యా సంబంధిత వీడియోను విశ్లేషిస్తూ.. ప్రభుత్వ ఉద్యోగులు పూర్తి సర్వీస్ కాలం పూర్తయ్యేలోపు రాజీనామా చేస్తే పెన్షన్ కోల్పోయే ప్రమాదం ఉందని వివరించారు. అయితే.. అలాంటి ఉద్యోగులకు ప్రావిడెంట్ ఫండ్ (PF) గ్రాట్యుటీ వంటి చట్టబద్ధమైన ప్రయోజనాలు మాత్రం లభిస్తాయని తెలిపారు.
ఈ తీర్పు ఢిల్లీ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ (డీటీసీ)కు చెందిన ఒక మాజీ ఉద్యోగి కేసులో స్పష్టతనిచ్చింది కోర్టు. ఆ ఉద్యోగి డీటీసీలో కండక్టర్‌గా చేరి దాదాపు 30 సంవత్సరాల పాటు సేవలందించాడు. అనంతరం 2014 ఆగస్టు 7న ఆయన తన పదవికి రాజీనామా చేశాడు. కొంతకాలానికి.. ఈ రాజీనామా తన పెన్షన్, ఇతర పదవీ విరమణ ప్రయోజనాలను ప్రభావితం చేస్తుందని తెలుసుకుని, రాజీనామాను విత్ డ్రా చేసుకునేందుకు ప్రయత్నించాడు. కానీ అధికారులు అప్పటికే రాజీనామాను అంగీకరించడంతో, ఆయన అభ్యర్థనను తిరస్కరించారు.
ఉద్యోగం నుంచి బయటకు వచ్చిన తర్వాత.. ఆ వ్యక్తికి తన ప్రావిడెంట్ ఫండ్ మొత్తం లభించింది. అయితే.. పెన్షన్, గ్రాట్యుటీ, లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ చెల్లింపులు జరగలేదు. దీంతో ఆయన న్యాయపోరాటానికి దిగగా.. ఈ కేసు చివరకు సుప్రీంకోర్టుకు చేరుకుంది. ఈ కేసును విచారించిన సుప్రీంకోర్టు 1972 నాటి సెంట్రల్ సివిల్ సర్వీసెస్ (పెన్షన్) నిబంధనలను పరిశీలించింది. వాటిలోని రూల్ 26 ప్రకారం.. ప్రభుత్వ ఉద్యోగి రాజీనామా చేస్తే అతని గత సర్వీస్ మొత్తం రద్దైనట్టుగా పరిగణిస్తారు. అందువల్ల అలాంటి ఉద్యోగికి పెన్షన్ అర్హత ఉండదని కోర్టు స్పష్టం చేసింది.
అయితే.. ఆ ఉద్యోగి తనకు 20 సంవత్సరాలకు పైగా సర్వీస్ ఉన్నందున తన రాజీనామాను స్వచ్ఛంద పదవీ విరమణగా పరిగణించాలని వాదించాడు. కానీ, స్వచ్ఛంద పదవీ విరమణకు కనీసం మూడు నెలల ముందస్తు నోటీసు తప్పనిసరి అని కోర్టు గుర్తు చేసింది. ఈ నిబంధనను పాటించనందున, ఆయన రాజీనామాను స్వచ్ఛంద పదవీ విరమణగా పరిగణించలేమని తేల్చింది.
గ్రాట్యుటీ విషయంలో మాత్రం కోర్టు ఉద్యోగికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. ఐదేళ్లకు పైగా సేవలందించిన ఉద్యోగి గ్రాట్యుటీకి అర్హుడని గ్రాట్యుటీ చట్టం స్పష్టం చేస్తుందని పేర్కొంది. మొత్తంగా.. ఈ తీర్పు ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేస్తే, సర్వీస్ కాలం ఎంత ఉన్నా పెన్షన్ హక్కు కోల్పోతారని స్పష్టంగా తెలియజేస్తోంది. అందువల్ల.. ఉద్యోగులు రాజీనామా చేసే ముందు సంబంధిత నియమాలు, నిబంధనలను పూర్తిగా తెలుసుకుని నిర్ణయం తీసుకోవడం అత్యంత అవసరమని గుర్తించాలి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.
China’s Yuan Climbs Past 7 Per Dollar as PBOC Caves: ప్రపంచ ఆర్థిక రంగంలో చైనా మరో కీలక నిర్ణయం తీసుకుంది. చైనా కరెన్సీ యువాన్, అమెరికా డాలర్‌తో పోలిస్తే కీలకమైన 7 స్థాయిని దాటింది. ఇది కేవలం సంఖ్యా మార్పు మాత్రమే కాదు.. అంతర్జాతీయ కరెన్సీ మార్కెట్లలో ఇది ఒక మానసిక పరిమితిగా పరిగణిస్తున్నారు. ఈ స్థాయిని యువాన్ దాటడంతో.. చైనా తన కరెన్సీని బలహీనపరచాలన్న ఉద్దేశం లేదని.. క్రమంగా బలోపేతం చేయాలన్న దిశగా అడుగులు వేస్తోందని స్పష్టమైన సంకేతాలు ఇచ్చింది. బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం.. ఈ నిర్ణయం చైనా దేశీయ ఆర్థిక వ్యవస్థకే కాకుండా అమెరికా.. ప్రపంచ మార్కెట్లు, భారత్ పై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది.
యువాన్ 7 స్థాయి దాటడం ఎందుకు అంత ముఖ్యమంటే.. గతంలో ఈ స్థాయి కంటే దిగువకు యువాన్ పడినప్పుడు చైనా తన ఎగుమతులను చౌకగా ఉంచేందుకు కరెన్సీని నియంత్రిస్తున్నదన్న భావన ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి మారుతోంది. పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా రోజువారీ రిఫరెన్స్ రేటును మార్కెట్ అంచనాల కంటే బలంగా నిర్ణయిస్తూ.. యువాన్ మరింత పతనం చెందకుండా కట్టడి చేస్తోంది. దీని అర్థం చైనా మార్కెట్లకు యువాన్‌ను బలహీనంగా చేయాల్సిన అవసరం లేదు అనే స్పష్టమైన సందేశాన్ని పంపుతోంది.
ఈ పరిణామం అమెరికాకు బిగ్ షాక్ తగలడం ఖాయమని చెప్పాలి. ఎన్నో ఏళ్లుగా అమెరికా.. చైనా ఉద్దేశపూర్వకంగా యువాన్‌ను బలహీనంగా ఉంచి తమ ఎగుమతులకు లాభం చేకూర్చుకుంటోందని ఆరోపిస్తోంది. కానీ యువాన్ బలపడటం ఆ వాదనను బలహీనపరుస్తోంది. అంతేకాదు.. డాలర్ ఇప్పటికే ఒత్తిడిలో ఉన్న సమయంలో యువాన్ బలపడితే.. ప్రపంచ కరెన్సీ వ్యవస్థలో డాలర్ ఆధిపత్యంపై ప్రశ్నలు తలెత్తుతాయి. ఇది అమెరికా ఆర్థిక విధానాలకు రాజకీయంగా, వ్యూహాత్మకంగా కూడా ఇబ్బందికరమైన పరిస్థితిని తీసుకువస్తుంది.
చైనా ఈ నిర్ణయం వెనుక స్పష్టమైన లక్ష్యాలతో ముందుకెళ్తోంది. మొదటగా.. విదేశీ పెట్టుబడిదారుల విశ్వాసాన్ని తిరిగి పొందడం ఒక కారణమైతే.. బలమైన కరెన్సీ ఉంటే పెట్టుబడిదారులు మరింత నమ్మకంతో చైనా మార్కెట్లలోకి వస్తారని చైనా బలంగా నమ్ముతోంది. తన స్టాక్, బాండ్ మార్కెట్లకు విదేశీ నిధులను ఆకర్షించడం రెండో కారణంగా చెబుతోంది. ఇక మూడవది ప్రపంచవ్యాప్తంగా భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు కొంత సడలుతున్న వేళ.. ఆ అవకాశాన్ని ఆర్థికంగా వినియోగించుకోవాలని భావిస్తోంది. అయితే చైనా యువాన్‌ను పూర్తిగా స్వేచ్ఛగా వదిలేయదు. ఎగుమతులపై ప్రతికూల ప్రభావం పడకుండా ఉండేందుకు, కరెన్సీ బలోపేతాన్ని ఎప్పటికీ నియంత్రితంగా కొనసాగిస్తుంది.
ఈ పరిణామం భారతదేశానికి కూడా చాలా ప్రాధాన్యత కలిగిస్తుందని చెప్పాలి. ఎందుకంటే యువాన్ బలపడితే చైనా ఉత్పత్తులు ఖరీదవుతాయి. ఇది భారత ఎగుమతిదారులకు ప్రపంచ మార్కెట్లో పోటీ పడేందుకు మంచి అవకాశాన్ని ఇస్తుంది. మరోవైపు.. చైనా నుంచి దిగుమతులు కొంత ఖరీదయ్యే అవకాశం ఉంది. డాలర్ బలహీనపడితే.. భారత రూపాయి స్థిరంగా ఉండే లేదా కొంత బలపడే అవకాశమూ ఉంది. ఇది విదేశీ పెట్టుబడులకు మద్దతుగా నిలిచే అవకాశం కూడా ఉంటుంది. చైనాలోకి విదేశీ పెట్టుబడులు పెరిగితే.. అభివృద్ధి చెందుతున్న మార్కెట్లపై సానుకూల భావన ఏర్పడుతుంది. దీని ప్రభావం భారత స్టాక్ మార్కెట్‌పైనా కనిపించే అవకాశం ఉంటుంది.
అయితే...సామాన్యుడు ఈ పరిణామం నుంచి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే.. ఇది కేవలం చైనా–అమెరికా మధ్య జరిగే పరిణామం మాత్రమే కాదు... ప్రపంచ కరెన్సీ వ్యవస్థలో చైనా తన స్థానాన్ని బలపరుచుకునే దిశగా వేసిన ఒక కీలక అడుగుగా భావించాలి. ఈ ధోరణి ఇలాగే కొనసాగితే.. భారతదేశానికి అవకాశాలతోపాటు కొన్ని సవాళ్లు కూడా ఎదురవుతాయి. రాబోయే రోజుల్లో డాలర్ కదలికలు, చైనా కేంద్ర బ్యాంకు తదుపరి చర్యలు, విదేశీ పెట్టుబడుల ప్రవాహం, రూపాయి స్థిరత్వం ఇవన్నీ కలిపి తీసుకునే నిర్ణయం భారతదేశానికి ఎంత మేరకు ప్రభావం చూపుతుందో నిర్ణయించనున్నాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.