Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Karimnagar505001

ఐద్వా రాష్ట్ర శిక్షణ తరగతులు: మల్లు లక్ష్మి పిలుపు

Jul 23, 2024 17:57:08
Karimnagar, Telangana

ఐద్వా తెలంగాణ రాష్ట్ర శిక్షణ తరగతులు జులై 26-29 తేదీల్లో కరీంనగర్‌లో జరుగుతాయని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి తెలిపారు. మహిళల సమస్యలపై పోరాడుతున్న ఐద్వా వరకట్న వేధింపులు, అత్యాచారాలు, హత్యలపై కఠిన శిక్షలు, ఫాస్ట్ ట్రాక్ కోర్టులు, సమాన వేతనం, చట్టసభల్లో 33% రిజర్వేషన్ కోసం పోరాడుతోందని ఆమె పేర్కొన్నారు.

0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
RKRavi Kumar Sargam
Jan 28, 2026 13:06:00
Hyderabad, Telangana:

Liquor Scam: రాష్ట్రంలో మరో అవినీతి బయట పెట్టామని మాజీ మంత్రి హరీష్‌ రావు అన్నారు. అబ్కారీ శాఖలో అవినీతి జరుగుతోందని ఆరోపించారు. రాష్ట్రంలో మైక్రో బ్రూవరీస్ 110 అప్లికేషన్లు వచ్చాయని.. ఇందులో 25 ఇవ్వాలని నిర్ణయించుకున్నారని అన్నారు. వీటిలో మంత్రి కోట 4, ముఖ్య నేత కోట 21 సెలెక్ట్ చేసుకున్నారని పేర్కొన్నారు. "ఈ మధ్య ముఖ్య నేతకు తోడై, నీడై, ఇంట్లోనే ఉంటాడు ఆ  నాయకుడు. ఈ మధ్య వార్తల్లో ఉన్నారు. నేరుగా కారు ముఖ్య నేత ఇంట్లోకి వెళ్తుంది. ఈ మధ్య ఆ ముఖ్య నేత తిరుపతి వెళ్తే కూడా నీడగా ఉన్నాడు.. వెంటే ఉన్నాడు. ఒక్కొక్క బ్రివరికి ఒక్క కోటి 80 లక్షల ధర నిర్ణయించారు. ఒక్కటిన్నర ముఖ్యనేతకు.. మిగతా 30 లక్షలు తోడు నీడకు.

21 తోడు నీడ ఫైనల్ చేసుకున్నారు. 4 మంత్రి ఫైనల్ చేసుకున్నారు. 110 అప్లికేషన్లు వచ్చాయి అంటున్నారు కదా.. వైన్స్‌లకు లాటరీ తీసినట్టు ఎందుకు లాటరీ తీయడం లేదు. రాష్ట్ర చరిత్రలో ఎన్నడు లేనివిధంగా లిక్కర్ సరఫరా చేసే సంస్థలకు 4500 కోట్లు బకాయిలు పడ్డారు. కొన్ని బకాయిలు 16 నెలలకు పైబడి బకాయిలు ఉన్నాయి. చరిత్రలో ఎన్నడు కూడా ఈ విధంగా లేదు. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో 15 రోజుల్లో చెల్లింపులు చేసేవాళ్లం. దీని వలన బ్రీజర్ సరఫరా ఆగిపోయింది. రాష్ట్రంలో చాలా షాపులలో సరుకు లేదు.

ఇతర మల్టీ నేషనల్ కంపెనీలు కూడా సరఫరా నిలిపివేస్తామని హెచ్చరించారు. లేఖలు కూడా రాశారు. వాటాలు పంపకాల్లో తేడాతోనే బకాయిలు నిలిచిపోయాయి. రానున్న రోజుల్లో మరికొన్ని బ్రాండ్స్ నిలిపివేసే పరిస్థితి ఉన్నది. దీనితో ప్రభుత్వం ఆదాయం పడిపోతోంది. ఇప్పటికే హాలోగ్రామ్ టెండర్లు విషయంలో ముఖ్య నేత అల్లుడుకి, మంత్రి కొడుక్కి కావాలని పట్టుపట్టడంలో ఈ ప్రభుత్వం బీర్ కంపెనీలకు ఇచ్చిన ప్రాధాన్యత రైతులకు ఇవ్వడం లేదు. మీకు బీర్ల కంపెనీలు ముఖ్యమా.. రైతులు ముఖ్యమా.. అంటే బీరు కంపెనీలు ముఖ్యం అంటున్నారు.

మెదక్ జిల్లా సింగూరు డ్యాం రిపేర్ పేరు మీద రైతులకు క్రాఫ్ హాలిడే ప్రకటించారు. సంగారెడ్డి జిల్లా సింగూరు ప్రాజెక్టు కింద 40 వేల ఎకరాలకు క్రాప్ హాలిడే ప్రకటించారు. మెదక్ జిల్లా ఘనపూర్ ఆయకట్ట కింద 30 వేల ఎకరాలకు క్రాప్ హాలిడే ప్రకటించారు. కానీ సంగారెడ్డి జిల్లాలో ఉన్న ఎలాంటి ఆటంకం లేకుండా బీరు కంపెనీలకు నీటి పంపిణీ చేస్తుంది. ఇది మద్యం తయార్ దారు ప్రభుత్వమా.. రైతు ప్రభుత్వమా.. అబ్కారీ శాఖ స్పెషల్ సిఎస్ సంగారెడ్డి జిల్లాకు వెళ్లి నీటిపారుదల శాఖ అధికారులతో సమావేశం అయి రైతులకు నీరు సప్లై ఆపేయండి. బీరు కంపెనీ లకు నీటి కొరత రాకుండా చూడండని ఆదేశాలు ఇచ్చారు.." అని హరీష్ రావు అన్నారు.

0
comment0
Report
RKRavi Kumar Sargam
Jan 28, 2026 11:16:25
Amaravati, Andhra Pradesh:

Big Gift To Employees: దసరా పండుగ నుంచి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం వరాలు కురిపిస్తోంది. ఉద్యోగులు, పింఛన్‌దారులకు సంబంధించిన సమస్యలు, డిమాండ్లు పరిష్కరిస్తోంది. దసరా సమయంలో కరువు భత్యం (డీఏ) ప్రకటించిన ప్రభుత్వం అనంతరం దీపావళి, సంక్రాంతి పండుగకు కూడా గుడ్‌న్యూస్‌ ప్రకటించింది. తాజాగా మరో వరం ప్రకటించింది. ఉద్యోగులు, పింఛన్‌దారులకు సంబంధించి ప్రకటన చేసింది. ప్రభుత్వం ప్రకటించిన తీపి కబురుతో ఉద్యోగ వర్గాలకు భారీ ప్రయోజనం లభించనుంది.

Also Read: School Holiday: విద్యార్థులకు పండుగే.. స్కూళ్లకు నాలుగు రోజులు సెలవు?

​ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు పెండింగ్‌లో ఉన్న వివిధ రకాల బిల్లుల చెల్లింపుల్లో పురోగతి లభించింది. వివిధ రకాల బిల్లులు భారీగా పెండింగ్‌లో ఉండడంతో తాజాగా కొంత ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది. విడుదల చేసిన బిల్లుల్లో టీఏ, టీటీఏ బిల్లులు ఉన్నాయి. 1 ఏప్రిల్ 25 నుంచి ఉద్యోగులకు సంబంధించిన టీఏ, టీటీఏ బకాయిల కోసం సుమారు రూ.150 కోట్లు ప్రభుత్వం విడుదల చేసింది. ఏపీజీఎల్‌ఐ బిల్లులకు సంబంధించి మెచ్యూర్ అయిన పాలసీలు, లోన్ పేమెంట్లకు సంబంధించిన బిల్లులు ప్రభుత్వం క్లియర్‌ చేసింది. ఉద్యోగులు, పెన్షనర్లకు రావాల్సిన జీపీఎఫ్‌ బకాయిలు కూడా ప్రభుత్వం చెల్లించింది. ఇక రిటైర్డ్ ఉద్యోగుల సరెండర్ లీవ్ చెల్లింపుల ప్రక్రియ కూడా చేయగా.. వాటికి సంబంధించి బిల్లులు ప్రభుత్వం విడుదల చేసింది. వీటి చెల్లింపులతో ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్‌దారులకు భారీ ప్రయోజనం లభించనుంది.

Also Read: HIV Injection: బ్రేకప్‌ చెప్పాడని మాజీ ప్రియుడి భార్యకు HIV ఇంజెక్షన్‌ ఇచ్చిన ప్రియురాలు

 

Also Read: Govt Employees: ప్రభుత్వ ఉద్యోగులకు భారీ షాక్‌.. ఇవి ఉల్లంఘిస్తే ఉద్యోగం ఊస్ట్‌!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

.Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
comment0
Report
RKRavi Kumar Sargam
Jan 28, 2026 11:03:20
Peddapur, Achampet, Telangana:

Love Story Tragedy: అప్పుడప్పుడే సమాజం గురించే తెలుసుకునే వయసు.. ఈ వయసులో కలిగే ఆకర్షణను ప్రేమ అనుకున్న మైనర్లు తమ నిండు జీవితాన్ని నాశనం చేసుకున్నారు. ఆరు నెలల పరిచయాన్ని ప్రేమగా భావించి.. అంతటితో ఆగకుండా పెళ్లి వయసు రాకముందే వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. తమ పెళ్లి పెద్దలు చేయరని భావించి ఇంట్లో నుంచి పారిపోయారు. ఈ విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు బెదిరింపులకు పాల్పడడంతో ఇంటికి వచ్చి ఆ పిల్లలు ప్రాణాలు తీసుకున్నారు. ఈ విషాద సంఘటన తెలంగాణలోని నాగర్‌కర్నూల్‌ జిల్లాలో చోటుచేసుకుంది.

Also Read: School Holiday: విద్యార్థులకు పండుగే.. స్కూళ్లకు నాలుగు రోజులు సెలవు?

నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలం బొమ్మనపల్లి గ్రామానికి దాసరి ప్రసాద్ (18)కు చిట్లకుంట గ్రామానికి చెందిన అమ్మాయి  (16 ఏళ్లు) మధ్య పరిచయమైంది. తమ ఆరు నెలల పరిచయాన్ని వారు ప్రేమగా భావించారు. తరచూ వీరిద్దరూ కలుసుకుంటూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అయితే తమ పెళ్లికి పెద్దలు అంగీకరించరని వారిద్దరూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో వారం రోజుల కిందట ఇంట్లో నుంచి పారిపోయారు. వారం నుంచి కనిపించకపోవడంతో కుటుంబసభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Also Read: HIV Injection: బ్రేకప్‌ చెప్పాడని మాజీ ప్రియుడి భార్యకు HIV ఇంజెక్షన్‌ ఇచ్చిన ప్రియురాలు

పారిపోయిన విషయం తెలుసుకున్న అమ్మాయి కుటుంబసభ్యులు ఫోన్‌లో బెదిరించారు. వారి బెదిరింపులతో భయపడిన ప్రసాద్‌, అమ్మాయి మంగళశారం తన సొంత గ్రామం బొమ్మన్‌పల్లికి గ్రామానికి చేరుకున్నారు. తమ పెళ్లికి పెద్దలు ఒప్పుకుంటలేరని నిర్ధారించుకొని ఇంట్లో ఎవరు లేని సమయంలో అమ్మాయి, అబ్బాయి ఒకే చీరతో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. నిద్రపోయిన కుటుంబసభ్యులు తెల్లవారు లేచి చూసేసరికి తలుపు గడియ పెట్టి ఉంది. ఫోన్‌ చేసినా.. పిలిచినా పలకకపోవడంతో తలుపు పగులగొట్టారు.

Also Read: Govt Employees: ప్రభుత్వ ఉద్యోగులకు భారీ షాక్‌.. ఇవి ఉల్లంఘిస్తే ఉద్యోగం ఊస్ట్‌!

లోపలికి వెళ్లి చూడగా వారిద్దరూ ఒకే చీరకు ఉరేసుకుని విగతజీవులుగా మారిపోయారు. ఉన్న ఒక కొడుకు చనిపోవడంతో ప్రసాద్‌ కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటన చేరుకొని పరిశీలించారు. అబ్బాయి, అమ్మాయి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం అచ్చంపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం వారి కుటుంబ సభ్యులకు మృతదేహాలను అప్పగించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. తమ అబ్బాయి చావు కారణమైన వారిని.. అమ్మాయి మేనమామ ఈదయ్యను కఠినంగా శిక్షించాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

.Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
comment0
Report
HDHarish Darla
Jan 28, 2026 10:37:54
Hyderabad, Telangana:

Telangana PRC News: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న రెండో వేతన సవరణ (PRC) ప్రక్రియ మరింత జాప్యం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. పీఆర్సీ కమిటీ గడువును ప్రభుత్వం మరోసారి పొడిగించే యోచనలో ఉండటమే ఇందుకు ప్రధాన కారణంగా కనిపిస్తుంది.

రాష్ట్రంలో పీఆర్సీ గడువు ఈ ఏడాది మార్చితో ముగియనుంది. అయితే, ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే ప్రభుత్వం నాలుగోసారి కూడా కమిటీ కాలపరిమితిని పెంచే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.

నివేదిక సిద్ధం..కానీ!
పీఆర్సీ కమిటీ తన నివేదికను ఇప్పటికే సిద్ధం చేసిందని, ప్రభుత్వం పిలిస్తే వెంటనే అందజేయడానికి సిద్ధంగా ఉన్నారని ఉద్యోగ సంఘాలు చెబుతున్నాయి. అయితే, ప్రభుత్వం నివేదికను స్వీకరించడానికి వెనుకాడుతోందని, కావాలనే ఆలస్యం చేస్తోందని సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు.

కమిటీ నేపథ్యం - కాలక్రమం..
నియామకం: 2023 అక్టోబర్ 2న (శివశంకర్ చైర్మన్‌గా).
తొలి గడువు: 2024 ఏప్రిల్ 2.
పొడిగింపులు: ఇప్పటివరకు మూడుసార్లు గడువు పొడిగించారు. ఇప్పుడు నాలుగోసారి పొడిగింపు దిశగా చర్చలు సాగుతున్నాయి.

ఫిట్‌మెంట్ లెక్కలు..
ఉద్యోగ సంఘాలు 51 శాతం ఫిట్‌మెంట్ కావాలని కోరుతుండగా, ప్రభుత్వంపై పడే ఆర్థిక భారం ఇలా ఉండవచ్చు.

ఫిట్‌మెంట్ శాతం అంచనా వ్యయం (వార్షికంగా)
30% (ప్రభుత్వ అంచనా) సుమారు ₹7,500 కోట్లు
51% (సంఘాల డిమాండ్) సుమారు ₹12,750 కోట్లు

నోట్: ఒక్క శాతం ఫిట్‌మెంట్ పెంచితే నెలకు ₹250–300 కోట్ల అదనపు భారం పడుతుంది.

ఆర్థిక పరిస్థితే అడ్డంకా?
రాష్ట్ర ఆదాయం కంటే వ్యయం ఎక్కువగా ఉండటం, ఇటీవల రెండు డీఏల (DA) ప్రకటించిన నేపథ్యంలో.. పీఆర్సీ అమలు ఆర్థికంగా పెను సవాలుగా మారింది. బడ్జెట్‌లో దీనిపై స్పష్టత రాకపోతే, ఉద్యోగుల నిరీక్షణ మరో ఆరు నెలలు తప్పదని తెలుస్తోంది.

వాస్తవానికి రెండో పీఆర్సీ 2023 జూలై 1 నుంచే అమలులోకి రావాలి. గడువులను పదేపదే పొడిగించడం వల్ల తాము ఆర్థికంగా నష్టపోతున్నామని ఉద్యోగులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం వచ్చే బడ్జెట్ సమావేశాల్లోనైనా దీనిపై కీలక ప్రకటన చేస్తుందో లేదో వేచి చూడాలి.

Also Read: Shambhavi Pathak: అజిత్ పవార్ విమాన ప్రమాదం..కాక్‌పిట్‌లో పైలట్స్ చివరి మాటలు..అసలేం జరిగిందంటే?

Also Read: Pakistan Boycott World Cup: టీ20 వరల్డ్‌కప్‌లో పాకిస్థాన్ టీమ్ బహిష్కరిస్తే..గ్రూప్-ఏ నుంచి సెమీస్‌కు వెళ్లే జట్లు ఇవే?!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
HDHarish Darla
Jan 28, 2026 10:13:28
Baramati, Maharashtra:

Ajit Pawar Pilot Shambhavi Pathak: మహారాష్ట్ర రాజకీయాల్లో పెను విషాదం నింపిన అజిత్ పవార్ విమాన ప్రమాదానికి సంబంధించిన మరిన్ని భయంకరమైన నిజాలు బయటకు వస్తున్నాయి. ప్రమాదం జరగడానికి కొన్ని క్షణాల ముందు విమానంలో అసలేం జరిగింది? పైలట్లు చివరి నిమిషంలో ఎందుకు మేడే (Mayday) కాల్ చేయలేకపోయారు? అనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

బారామతి విమానాశ్రయం రన్‌వేకు కేవలం 100 మీటర్ల దూరంలో చార్టర్డ్ విమానం కుప్పకూలిన ఘటనలో అజిత్ పవార్‌తో సహా ఐదుగురు మరణించారు.

మృత్యుఘోష.."ఓహ్ షిట్... ఓహ్ షిట్"
విమాన ప్రమాదాల్లో అత్యవసర సమయంలో పైలట్లు చేసే 'మేడే' (Mayday) కాల్‌ను కెప్టెన్ సుమిత్ కపూర్ చేయలేకపోయారు. అయితే, ఆయనతో ఉన్న కో-పైలట్ కెప్టెన్ శంభవి పాఠక్ చివరి క్షణంలో "ఓహ్ షిట్... ఓహ్ షిట్" అని అరిచినట్లు రికార్డింగ్స్ ద్వారా తెలుస్తోంది. అంటే, ప్రమాదం జరగబోతుందని వారికి ముందే అర్థమైనా, ప్రాణాలు కాపాడుకునే సమయం దొరకలేదని స్పష్టమవుతోంది.

ల్యాండింగ్ ప్రయత్నాలు విఫలం..
తొలి ప్రయత్నం: ఉదయం పూట దట్టమైన పొగమంచు వల్ల రన్‌వే 11 సరిగ్గా కనిపించలేదు. దీంతో పైలట్లు విమానాన్ని ల్యాండ్ చేయలేక మళ్లీ పైకి తీసుకెళ్లారు.

రెండో ప్రయత్నం: కొద్దిసేపటి తర్వాత మళ్లీ ల్యాండింగ్‌కు ప్రయత్నించినప్పుడు, విమానం వేగంగా రన్‌వే వైపు దూసుకొచ్చింది. కానీ నేలను తాకే ముందే విమానం అదుపు తప్పి బోల్తా పడి కుప్పకూలింది.

ప్రత్యక్ష సాక్షుల కథనం..
విమానం నేలను ఢీకొట్టగానే భారీ పేలుడు సంభవించింది. ఆ తర్వాత మరో 4 నుండి 5 సార్లు పేలుళ్లు జరగడంతో విమానం తునకలైంది. "విమానం మా గ్రామంపై నుండే ఎగిరింది. కూలిన తర్వాత పేలుడు ధాటికి విమానం భాగాలు ఎగిరి మా ఇళ్లపై పడ్డాయి" అని గ్రామస్తులు తెలిపారు. మంటలు ఎగసిపడుతుండటంతో ప్రాణాలు కాపాడేందుకు గ్రామస్తులు చేసిన ప్రయత్నం విఫలమైంది.

అజిత్ పవార్ చివరి కాల్..
విమానం ఎక్కే ముందు అజిత్ పవార్ తన మేనల్లుడు రంజాగ్జిత్ సింగ్ పాటిల్‌కు ఫోన్ చేశారు. "ల్యాండింగ్ అయ్యాక మళ్ళీ మాట్లాడతాను" అని చెప్పిన అజిత్ పవార్ మాటలు చివరికి ఆఖరి మాటలుగా మిగిలిపోయాయి. బుధవారం ఉదయం 8:45 గంటలకు ఈ ఘోరం జరిగింది.

దర్యాప్తు ప్రారంభం..
ప్రస్తుతం ఎయిర్‌క్రాఫ్ట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (AAIB) ఈ ప్రమాదంపై సమగ్ర విచారణ చేపట్టింది. ఢిల్లీలోని విమాన ఆపరేటర్ VSR వెంచర్స్ కార్యాలయంలో అధికారులు తనిఖీలు చేస్తున్నారు. పొగమంచు కారణమా? లేక సాంకేతిక లోపమా? అన్న కోణంలో దర్యాప్తు సాగుతోంది.

Also Read: Ajit Pawar Plane Crash: మహారాష్ట్ర రాజకీయాల్లో అజిత్ పవార్.."దాదా" ప్రస్థానం, ఆరుసార్లు ఉపముఖ్యమంత్రి రికార్డు!

ALso Read: Ajit Pawar Net Worth: అజిత్ పవార్ ఆస్తుల చిట్టా..రూ.124 కోట్ల సామ్రాజ్యం..భార్య వద్ద 28 క్యారెట్ల వజ్రం!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
HDHarish Darla
Jan 28, 2026 07:05:02
Hyderabad, Telangana:

Pakistan Boycott T20 World Cup 2026: ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026కు సంబంధించి ఒక ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. బంగ్లాదేశ్ ఈ టోర్నీ నుంచి తప్పుకున్న నేపథ్యంలో, ఇప్పుడు పాకిస్థాన్ కూడా భారత్‌తో మ్యాచ్‌ను బహిష్కరిస్తామంటూ హెచ్చరికలు జారీ చేస్తోంది. ఒకవేళ పాక్ గనుక భారత్‌తో మ్యాచ్ ఆడకపోతే పాయింట్ల పట్టికపై ఎలాంటి ప్రభావం పడుతుంది? సెమీస్ సమీకరణాలు ఎలా మారతాయనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

గ్రూప్-ఏలో భారత్, పాకిస్థాన్‌లతో పాటు నమీబియా, నెదర్లాండ్స్, అమెరికా (USA) జట్లు ఉన్నాయి. ఫిబ్రవరి 15న కొలంబో వేదికగా జరగాల్సిన భారత్-పాక్ మ్యాచ్‌పై ఇప్పుడు నీలి నీడలు కమ్ముకున్నాయి.

పాక్ బహిష్కరిస్తే భారత్‌కు లాభమేంటి?
ఒకవేళ పాకిస్థాన్ కేవలం భారత్‌తో మ్యాచ్ ఆడేందుకు నిరాకరిస్తే, ఐసీసీ నిబంధనల ప్రకారం దానిని 'వాకోవర్' (Walkover) గా పరిగణిస్తారు. దీంతో టీమ్ఇండియాకు ఆటోమేటిక్‌గా 2 పాయింట్లు లభిస్తాయి. దీనివల్ల భారత్ సూపర్-8 దశకు చేరుకోవడం చాలా సులభమవుతుంది.

అదే విధంగా పాకిస్థాన్‌కు సున్నా పాయింట్లు లభిస్తాయి. గ్రూప్ దశలో ఒక్క మ్యాచ్ పాయింట్లు కోల్పోయినా, సూపర్-8 రేసు నుంచి పాక్ తప్పుకోవాల్సి వస్తుంది. మిగిలిన మూడు మ్యాచ్‌ల్లో (నమీబియా, నెదర్లాండ్స్, USA) పాక్ ఖచ్చితంగా గెలవాల్సి ఉంటుంది.

పాక్ పూర్తిగా తప్పుకుంటే?
ఒకవేళ పాకిస్థాన్ ఈ టోర్నీ నుంచి పూర్తిగా వైదొలిగితే, ఐసీసీ ఖాళీ అయిన ఆ స్థానాన్ని భర్తీ చేస్తుంది. ర్యాంకింగ్స్ ఆధారంగా తదుపరి అత్యున్నత ర్యాంకు ఉన్న ఉగాండా జట్టుకు అవకాశం దక్కవచ్చు. ఇప్పటికే టోర్నీ నుంచి తప్పుకున్న బంగ్లాదేశ్, పాక్ స్థానంలో మళ్ళీ వచ్చేందుకు ఐసీసీని ఒప్పించే అవకాశం ఉంది.

పాకిస్థాన్‌పై ఐసీసీ ఎలాంటి చర్యలు తీసుకుంటుంది?
భారత్‌తో మ్యాచ్ ఆడకపోయినా లేదా టోర్నీ నుంచి తప్పుకున్నా పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. ఐసీసీ గ్లోబల్ టోర్నీల నుంచి పాకిస్థాన్‌ను కొంతకాలం నిషేధించే అవకాశం ఉంది. పీఎస్ఎల్ (PSL) ఆడే అంతర్జాతీయ ఆటగాళ్లకు ఎన్ఓసీలు నిరాకరించడం వంటి ఆర్థిక పరమైన ఆంక్షలు విధించవచ్చు. ప్రసారకర్తలు, స్పాన్సర్ల నుంచి వచ్చే ఆదాయంలో పాకిస్థాన్‌కు కోత పడుతుంది.

సెమీస్ చేరే జట్లు ఏవి?
ప్రస్తుత ఫామ్, సమీకరణాలను బట్టి గ్రూప్-ఏ నుంచి భారత్ అగ్రస్థానంలో నిలిచి సూపర్-8కు చేరడం దాదాపు ఖాయం. పాకిస్థాన్ ఆడితే రెండో జట్టుగా వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ పాక్ తప్పుకుంటే, అమెరికా (USA) లేదా నెదర్లాండ్స్ జట్ల మధ్య రెండో స్థానం కోసం గట్టి పోటీ నెలకొంటుంది.

పాకిస్థాన్ ప్రభుత్వం, పీసీబీ తీసుకునే నిర్ణయంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. రాజకీయ కారణాలతో క్రికెట్‌ను బహిష్కరిస్తే అది పాక్ జట్టు భవిష్యత్తుకే ముప్పుగా మారే ప్రమాదం ఉంది.

Also Read: Ajit Pawar Net Worth: అజిత్ పవార్ ఆస్తుల చిట్టా..రూ.124 కోట్ల సామ్రాజ్యం..భార్య వద్ద 28 క్యారెట్ల వజ్రం!

Also Read: Ajit Pawar Plane Crash: మహారాష్ట్ర రాజకీయాల్లో అజిత్ పవార్.."దాదా" ప్రస్థానం, ఆరుసార్లు ఉపముఖ్యమంత్రి రికార్డు!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
AMAruna Maharaju
Jan 28, 2026 06:30:11
Balapur, Telangana:

Key Update On Rythu Bharosa Scheme: రాష్ట్రంలోని రైతులు 'రైతు భరోసా' పథకం కింద ప్రభుత్వం అందజేసే యాసంగి పెట్టుబడి సాయం కోసం ఎదురు చూస్తున్నారు. దీంతో ఫిబ్రవరి మొదటి వారంలో రైతు భరోసా నిధులు అర్హులైన రైతుల ఖాతాల్లో జమ చేస్తామని ప్రభుత్వ వర్గాలు ఇటీవల పేర్కొన్నాయి. అయితే, రాష్ట్రంలో తాజా పరిణామాల నేపథ్యంలో రైతు భరోసాకు ఇంకా సమయం పట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

రైతు భరోసా సాయం కోసం రైతులకు నిరీక్షణ తప్పేలా లేదు. మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ జారీ నేపథ్యంలో రాష్ట్రంలో ఈ పథకం మరి కొంత కాలం జాప్యం కానుంది. రైతు భరోసా నిధుల జమ ప్రక్రియ ఫిబ్రవరి చివరి వారం లేదా మార్చి మొదటి వారంలో జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం.

ఆర్థిక శాఖ ఇప్పటికే రూ. 8 వేల కోట్ల నిధుల సమీకరణలో ఉంది. అయితే బడ్జెట్ కసరత్తు , కేంద్ర సాయాలు, రాష్ట్ర తాజా ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో ఆర్థిక పరిస్థితులు పెద్దగా ఆశాజనకంగా లేవు. అయినప్పటికీ ప్రభుత్వం ఈ పథకం అమలు చేయాలని భావిస్తుంది. అర్హులకే లబ్ధి చేకూర్చాలనే యోచన కారణంగా స్వల్ప ఆటంకాలు ఎదురవుతున్నాయని అధికారులు చెబుతున్నారు.

సాగులో ఉన్న భూములను పక్కాగా గుర్తించేందుకు ప్రభుత్వం చేపట్టిన శాటిలైట్ సర్వే కారణంగా ఈ ఆలస్యం జరుగుతోంది. అగ్రికల్చర్ యూనివర్శిటీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ సర్వే నివేదిక అందాక.. కేవలం పంట సాగు చేస్తున్న రైతులకు మాత్రమే రైతు భరోసా నిధులు అందనున్నాయి. సాగు చేయని భూములకు ఈసారి నిధులు జమ నిలిపివేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. పారదర్శకత కోసమే ఈ నిబంధనలు అమలు చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు.

Also Read: Medaram Jatara: నేటి నుంచి 4 రోజుల పాటు మేడారం మహాజాతర.. అత్యంత కీలక ఘట్టం ఏంటో తెలుసా..?

Also Read: Arijit Singh: ఫుల్ ఫామ్‌లో ఉండగానే రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ సింగర్.. షాక్‌లో ఫ్యాన్స్..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
comment0
Report
HDHarish Darla
Jan 28, 2026 06:27:38
Badapur, Maharashtra:

Ajit Pawar Net Worth 2026: మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ విమాన ప్రమాదంలో దుర్మరణం చెందిన వార్త విషాదంలోకి నెట్టివేసింది. మరాఠా రాజకీయాల్లో పరిపాలనా దక్షుడిగా పేరుగాంచిన ఆయన.. ఎన్నో రకాలుగా వార్తల్లో నిలిచారు. అయితే అజిత్ పవార్ జీవితాంతం సంపాదించిన  ఆస్తుల వివరాలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. 

ఎన్నికల అఫిడవిట్ల ప్రకారం, గత ఐదేళ్లలో ఆయన సంపద గణనీయంగా పెరగడం గమనార్హం. రాజకీయాల్లోనే కాకుండా వ్యాపారం, వ్యవసాయ రంగాల్లోనూ అజిత్ పవార్ కుటుంబం బలమైన ఆర్థిక పునాదులు కలిగి ఉంది.

5 ఏళ్లలో రూ.50 కోట్ల పెరుగుదల
ఎన్నికల సంఘానికి సమర్పించిన తాజా గణాంకాల ప్రకారం, అజిత్ పవార్ సంపద వేగంగా వృద్ధి చెందింది. 2019 నాటికి దాదాపు రూ.75 కోట్లుగా ఉన్న ఆస్తి.. 2024-25 నాటికి రూ.124.55 కోట్లు దాటింది.

ఆయన సంపద ప్రధానంగా స్థిరాస్తుల రూపంలో ఉంది. స్థిరాస్తులు (భూమి, ఇళ్లు) సుమారు రూ.97.94 కోట్లు ఉండగా..  చరాస్తులు (నగదు, పెట్టుబడులు) రూ.26.60 కోట్లు ఉన్నట్లు సమాచారం. బ్యాంక్ నిల్వల్లో వివిధ ఖాతాలలో రూ.6.81 కోట్లకు పైగా డిపాజిట్లు ఉన్నాయి.

భార్య సునేత్రా పవార్ ఆస్తులే ఎక్కువ!
ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, అజిత్ పవార్ కంటే ఆయన భార్య సునేత్రా పవార్ పేరు మీద ఎక్కువ ఆస్తులు ఉన్నాయి. మొత్తం ఆస్తి సుమారు రూ.127.6 కోట్లు ఉండగా.. ఆమె వద్ద 28 క్యారెట్ల వజ్రంతో సహా రూ.1.19 కోట్ల విలువైన బంగారం, వెండి, వజ్రాభరణాలు ఉన్నాయి. ఆమె పేరు మీద రూ.58 కోట్ల విలువైన భూములు, భవనాలు ఉన్నాయి.

పెట్టుబడులు, వాహనాలు
అపారమైన సంపద ఉన్నప్పటికీ, అజిత్ పవార్ పేరిట ఎటువంటి ఎల్ఐసీ (LIC) లేదా లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలు లేకపోవడం గమనార్హం. ఆయనకు వివిధ కంపెనీల షేర్లు, బాండ్లు, మ్యూచువల్ ఫండ్లలో భారీ పెట్టుబడులు ఉన్నాయి. అజిత్ పవార్ వద్ద టయోటా కామ్రీ, హోండా CRV, హోండా అకార్డ్ వంటి లగ్జరీ కార్లతో పాటు.. తన వ్యవసాయ నేపథ్యానికి తగ్గట్లుగా ట్రాక్టర్, మూడు ట్రైలర్లు కూడా కలిగి ఉన్నారు.

అప్పులు, ఆదాయ వనరులు
ఆస్తులతో పాటు పవార్ కుటుంబానికి సుమారు రూ.21.39 కోట్ల రుణాలు (Loans) ఉన్నాయి. వీరికి ప్రధానంగా వ్యవసాయం, రియల్ ఎస్టేట్ మరియు వివిధ వ్యాపారాల ద్వారా ఆదాయం సమకూరుతోంది. బారామతి, పూణే ప్రాంతాల్లో వీరికి కోట్లాది రూపాయల విలువైన వ్యవసాయ భూములు ఉన్నాయి.

Also Read: Ajit Pawar Plane Crash: మహారాష్ట్ర రాజకీయాల్లో అజిత్ పవార్.."దాదా" ప్రస్థానం, ఆరుసార్లు ఉపముఖ్యమంత్రి రికార్డు!

ALso Read: Padma Awards Benefits: పద్మ అవార్డుల పవర్ ఇదే! పురస్కార గ్రహీతలకు లభించే రాచమర్యాదలు ఇవే!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
HDHarish Darla
Jan 28, 2026 06:14:45
Hyderabad, Telangana:

Sideways Market Strategy: షేర్ మార్కెట్ ఎప్పుడూ ఒకేలా ఉండదు. భారీ పెరుగుదల లేదా ఒడిదుడుకుల తర్వాత, మార్కెట్ సాధారణంగా ఒక సమీకరణ దశ (Consolidation Phase) లోకి ప్రవేశిస్తుంది. 2025 ముగింపులో భారతీయ మార్కెట్లు సరిగ్గా ఇటువంటి దశలోనే ఉన్నాయి. ఇక్కడ మార్కెట్ దిశ కంటే మీ పెట్టుబడి వ్యూహమే కీలకం. బజాజ్ ఫిన్‌సర్వ్ అసెట్ మేనేజ్‌మెంట్ హెడ్ (ఈక్విటీ) సొర్భ్ గుప్తా విశ్లేషణ ప్రకారం.. మార్కెట్లు ఒకే పరిమితిలో కదులుతున్నప్పుడు పెట్టుబడిదారులు అనుసరించాల్సిన వ్యూహాలపై వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

సైడ్‌వేస్ మార్కెట్ అంటే ఏమిటి?
మార్కెట్ సూచీలు (Nifty/Sensex) పెద్దగా పెరగకుండా లేదా తగ్గకుండా ఒకే రేంజ్ లో కదలడాన్ని సైడ్‌వేస్ మార్కెట్ అంటారు.
అపోహ: మార్కెట్ పెరగడం లేదు కాబట్టి అవకాశాలు లేవని చాలామంది భావిస్తారు.
వాస్తవం: సూచీలు స్థిరంగా ఉన్నా, లోలోపల వివిధ రంగాలు, స్టాక్స్ మధ్య పనితీరులో చాలా వ్యత్యాసం (Dispersion) ఉంటుంది. కొన్ని రంగాలు పుంజుకుంటే, మరికొన్ని క్షీణిస్తాయి.

ఫ్లెక్సీ క్యాప్ (Flexi Cap) ప్రయోజనం
మార్కెట్ ఒకే పరిమితిలో ఉన్నప్పుడు, కఠినమైన నియమాలు ఉన్న ఫండ్స్ కంటే ఫ్లెక్సీ క్యాప్ వ్యూహాలు మెరుగ్గా పనిచేస్తాయి. దీనికి కారణాలు..

పరిమితులు లేవు: లార్జ్, మిడ్, స్మాల్ క్యాప్ కంపెనీల మధ్య ఎక్కడ అవకాశాలు ఉంటే అక్కడ పెట్టుబడి పెట్టే స్వేచ్ఛ ఫండ్ మేనేజర్‌కు ఉంటుంది.

వేగవంతమైన మార్పు: పరిస్థితులు మారినప్పుడు, స్థిరమైన ఆదాయం ఉన్న కంపెనీల నుండి అధిక వృద్ధి ఉన్న సంస్థల వైపు పెట్టుబడులను సులభంగా మళ్లించవచ్చు.

భారత ఆర్థిక వ్యవస్థలో మెగాట్రెండ్లు
మార్కెట్ సమీకరణ దశలో ఉన్నప్పటికీ, భారతదేశ దీర్ఘకాలిక వృద్ధికి పునాదులైన కొన్ని మెగాట్రెండ్లు బలంగా ఉన్నాయి:

1) డిజిటల్ స్వీకరణ, ఎనర్జీ ట్రాన్సిషన్.

2) మాన్యుఫాక్చరింగ్, ఫైనాన్షలైజేషన్.

3) ఆరోగ్యం, వెల్నెస్, ఫార్మలైజేషన్.

ఈ ట్రెండ్లు అన్ని రంగాలపై ఒకేలా ప్రభావం చూపవు. అందుకే, బలమైన వ్యాపార నమూనాలు కలిగిన సంస్థలను ఎంచుకోవడం (Bottom-up selection) ఈ దశలో అత్యంత ముఖ్యం.

డైవర్సిఫికేషన్: కేవలం రిస్క్ మేనేజ్‌మెంట్ మాత్రమే కాదు
సమీకరణ దశలు తరచుగా భవిష్యత్తులో వచ్చే భారీ ర్యాలీలకు పునాది వేస్తాయి. ఈ సమయంలో వైవిధ్యభరితమైన (Diversified) పోర్ట్‌ఫోలియోను కలిగి ఉండటం వల్ల ఒకే థీమ్ లేదా రంగంపై ఆధారపడాల్సిన అవసరం ఉండదు.

అధిక విలువ నిర్ణయాలు (High Valuations) లేని మంచి నాణ్యమైన కంపెనీలను తక్కువ ధరకే కొనుగోలు చేసే అవకాశం లభిస్తుంది.

మార్కెట్లు స్తబ్దుగా ఉన్నప్పుడు నెమ్మదితనం కంటే, మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మారే ఫ్లెక్సిబిలిటీ (అనుకూలత) నిజమైన వ్యత్యాసాన్ని సృష్టిస్తుంది. ఇది కేవలం స్వల్పకాలిక వ్యూహం కాదు, దీర్ఘకాలంలో సంపద సృష్టించడానికి ఒక అనివార్యమైన మార్గం.

(గమనిక: పైన పేర్కొన్న సమాచారం కేవలం కొన్ని నివేదికల ఆధారంగా రూపొందించింది మాత్రమే. దీన్ని పాటించే ముందు సంబంధిత నిపుణుడి సలహా తీసుకోవడం ఉత్తమం. దీన్ని జీ తెలుగు న్యూస్ ధ్రువీకరించడం లేదు.)

Also Read: Ajit Pawar Plane Crash: మహారాష్ట్ర రాజకీయాల్లో అజిత్ పవార్.."దాదా" ప్రస్థానం, ఆరుసార్లు ఉపముఖ్యమంత్రి రికార్డు!

Also Read: Anti Aging Superfoods: వయసు పెరిగినా యవ్వనంగా ఉండాలంటే..మీ డైట్‌లో ఈ సూపర్ ఫుడ్స్ ఉండేలా చూసుకోండి!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
HDHarish Darla
Jan 28, 2026 05:43:13
Badapur, Maharashtra:

Ajit Pawar Political Career: మహారాష్ట్ర రాజకీయాల్లో తనదైన ముద్ర వేసి, పరిపాలనలో "దాదా" (పెద్దన్న) అని పిలుచుకునే అజిత్ పవార్ ఇకలేరు. ఈరోజు ఉదయం జరిగిన విమాన ప్రమాదంలో ఆయన మృతి చెందినట్లు జాతీయ మీడియా వర్గాలు తెలిపాయి. ఈ క్రమంలో అజిత్ పవార్ రాజకీయ ప్రస్థానం అత్యంత ఆసక్తికరం. దశాబ్దాల కాలం పాటు బారామతి కోటను కాపాడుకుంటూ, రాష్ట్ర రాజకీయాల్లో కింగ్ మేకర్‌గా ఆయన ఎదిగిన తీరు అసాధారణం.

అజిత్ పవార్ రాజకీయ జీవిత విశేషాలు..
6 సార్లు ఉపముఖ్యమంత్రిగా..

మహారాష్ట్ర రాజకీయ చరిత్రలో వరుసగా కాకపోయినా అత్యధిక కాలం, అత్యధిక సార్లు (6 పర్యాయాలు) ఉపముఖ్యమంత్రిగా పనిచేసిన ఏకైక నాయకుడు అజిత్ పవార్. ఆయన విభిన్న సిద్ధాంతాలు కలిగిన ముఖ్యమంత్రుల వద్ద పనిచేశారు. పృథ్వీరాజ్ చవాన్ (కాంగ్రెస్), దేవేంద్ర ఫడ్నవీస్ (బిజెపి), ఉద్ధవ్ ఠాక్రే (శివసేన - MVA), ఏక్‌నాథ్ షిండే (శివసేన - మహాయుతి) వంటి నేతలు ముఖ్యమంత్రులుగా ఉన్న క్రమంలో అజిత్ పవార్ ఉపముఖ్యమంత్రిగా పనిచేశారు.

బారామతి వారసుడిగా..
1982లో ఒక సహకార చక్కెర కర్మాగారం బోర్డు సభ్యుడిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. అలాగే 1991లో పూణే జిల్లా కేంద్ర సహకార బ్యాంకు చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టి, గ్రామీణ స్థాయిలో పట్టు సాధించారు. అదే ఏడాది 1991లో బారామతి పార్లమెంటరీ నియోజకవర్గం నుండి లోక్‌సభకు ఎన్నికైనప్పటికీ, తన మామ శరద్ పవార్ కోసం ఆ స్థానాన్ని త్యాగం చేశారు.

తిరుగులేని శాసనసభ్యుడు
బారామతి అసెంబ్లీ నియోజకవర్గం అంటే అజిత్ పవార్, అజిత్ పవార్ అంటే బారామతి అన్నట్లుగా ఆయన పట్టు సాధించారు. 1991 నుండి వరుసగా 7 సార్లు శాసనసభకు ఎన్నికయ్యారు (1995, 1999, 2004, 2009, 2014, 2019). నియోజకవర్గ అభివృద్ధిపై ఆయనకు ఉన్న కమాండ్, కార్యకర్తలతో ఉన్న అనుబంధమే ఆయనను "దాదా"గా మార్చింది.

పార్టీలో చీలిక, సరికొత్త మలుపు
2019లో దేవేంద్ర ఫడ్నవీస్‌తో కలిసి తెల్లవారుజామున ప్రమాణ స్వీకారం చేయడం ద్వారా రాజకీయ సంచలనం సృష్టించారు. అనంతరం 2023లో ఎన్‌సిపి (NCP) లో చీలిక తీసుకువచ్చి, మెజారిటీ ఎమ్మెల్యేలతో కలిసి షిండే ప్రభుత్వంలో చేరారు. ఫిబ్రవరి 2024లో కేంద్ర ఎన్నికల సంఘం అజిత్ పవార్ వర్గాన్నే అసలైన ఎన్‌సిపిగా గుర్తించి, 'గడియారం' గుర్తును కేటాయించింది.

వ్యక్తిగత జీవితం
జననం: జూలై 22, 1959. అహ్మద్‌నగర్‌లోని దేవ్‌లాలీ ప్రవరలో పాఠశాల విద్యను పూర్తి చేశారు.
విద్య: తండ్రి మరణంతో కుటుంబాన్ని ఆదుకోవాల్సి రావడంతో తన డిగ్రీని పూర్తి చేయలేకపోయారు.
కుటుంబం: భార్య సునేత్ర పవార్, కుమారులు జయ్, పార్థ్ పవార్.

పాలనా దక్షత, కఠినమైన క్రమశిక్షణ, సమయపాలనకు అజిత్ పవార్ పెట్టింది పేరు. రాజకీయాల్లో ఎన్ని మలుపులు వచ్చినా, మహారాష్ట్ర అధికార కేంద్రంలో తన స్థానాన్ని పదిలపరుచుకుంటూ ఆయన సాగిస్తున్న ప్రయాణం అద్భుతం.

Also REad: Padma Awards Benefits: పద్మ అవార్డుల పవర్ ఇదే! పురస్కార గ్రహీతలకు లభించే రాచమర్యాదలు ఇవే!

Also Read: Kavya Maran Celebration: స్టేడియంలో డ్యాన్స్ చేసిన కావ్య పాప..ఫైనల్లో సన్‌రైజర్స్ ఘనవిజయం..మూడోసారి ట్రోఫీ కైవసం!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
Advertisement
Back to top