icon-pinewzicon-zee
PINEWZ
become creator
Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Pinewz
505001
Merugu Vinod Merugu Vinod Follow28 Jul 2024, 02:18 am
0
0
Report

हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|

Cobra Video: వామ్మె.. ఇంటి బీరువాలో భారీ కింగ్ కోబ్రాలు.. చూస్తేనే వణుకుపుడుతోంది..

Hyderabad, Telangana:

 Two King Cobras Viral Video Watch: సోషల్ మీడియాలో నిత్యం అనేక వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి. ముఖ్యంగా జంతువులతో పాటు పాములకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియా వినియోగదారులను విపరీతంగా ఆకర్షిస్తూ ఉంటాయి. తాజాగా నెట్టింట ఒక వీడియో నెటిజన్లను ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఒక సాధారణ ఇంటిలో జరిగిన ఈ ఘటన ఇప్పుడు సోషల్ మీడియా వ్యాప్తంగా సంచలనంగా మారింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలేంటో? అసలు ఈ వీడియోలో పాములు ఎలా వచ్చాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం..

సాధారణంగా మనం బీరువాను దుస్తులతో పాటు విలాసవంతమైన వస్తువులను దాచుకోవడానికి వినియోగిస్తూ ఉంటాము.. అయితే, ఒక ఇంటి యజమాని తన బీరువాను తెరవగానే ఊహించని దృశ్యాలు కనిపించాయి. బీరువా తెరిచిన వెంటనే అందులో దాగివున్న రెండు భారీ నాగుపాములు పడగ విప్పి దర్శనం ఇవ్వడంతో ఆ ఇంటి యజమాని ఆశ్చర్యానికి గురయ్యాడు. ఈ దృశ్యాన్ని చూసిన కుటుంబ సభ్యులు సైతం భయాందోళనకు గురైనట్లు తెలుస్తోంది. 

ఈ వీడియోలో ఆ పాములు చాలా ప్రశాంతంగా.. బీరువాలోని దుస్తుల మధ్య సేద తీరుతున్నట్లు మీరు గమనించవచ్చు. యజమాని తలుపులు తీయగానే.. అవి అప్రమత్తమై పడకవిప్పి కాటు వేయడానికి సిద్ధంగా ఉన్నట్లు కూడా మీరు చూడొచ్చు. అదృష్టవశాత్తూ.. యజమాని తక్షణమే అప్రమత్తం అవ్వడంతో పేను ప్రమాదం తప్పినట్లు తెలుస్తోంది. అయితే ఆ బీరువాలోకి పాములు ఎలా వచ్చాయని అంశం ఇప్పటికీ కొలిక్కి రాలేదు..

 
 
 
 
 

ఈ వీడియోను చూసి సోషల్ మీడియా వినియోగదారులు కూడా ఆశ్చర్యపోతున్నట్లు తెలుస్తాది. అంతేకాకుండా వారు ఈ వీడియో పై రకరకాలుగా స్పందిస్తూ వస్తున్నారు. అసలు అవి బీరువాలోకి ఎలా వెళ్లాలి? చూస్తుంటేనే భయమేస్తోంది.. ఇంటి యజమాని ప్రాణాలతో బయటపడటం నిజంగా అదృష్టం అంటూ కొంతమంది సోషల్ మీడియా వినియోగదారులు కామెంట్స్ చేస్తున్నారు. ఇక మరికొంతమంది అడవికి దగ్గరగా ఉండేవారు ఇళ్లలో పాములు రాకుండా తగిన జాగ్రత్తలు తప్పనిసరి తీసుకోవాల్సి ఉంటుందని సూచిస్తున్నారు..

Also Read: King Cobra Video: స్టౌపై గిన్నెలో తిష్టవేసిన భారీ కింగ్ కోబ్రా.. వీడియో చూస్తే వణికిపోవాల్సిందే!

పాములకు సంబంధించిన ఘటనలు వెలుగులోకి వచ్చినప్పుడు.. కంగారు పడకుండా వెంటనే వన్యప్రాణి సంరక్షకులకు సమాచారం అందించడం చాలా మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా వర్షాకాలంతో పాటు ఎండాకాలంలో పాములు చల్లటి, చీకటి ప్రదేశాల కోసం వెతుకుతూ ఇళ్లలోకి ప్రవేశించే అవకాశం ఉంది. కాబట్టి ఇంట్లో బీరువాలతో పాటు బూట్ల స్టాండ్లు, పాత వస్తువులు ఉంచే ప్రదేశాలను తరచుగా శుభ్రం చేసుకోవడం, తనిఖీలు చేయడం చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు..

Also Read: King Cobra Video: స్టౌపై గిన్నెలో తిష్టవేసిన భారీ కింగ్ కోబ్రా.. వీడియో చూస్తే వణికిపోవాల్సిందే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

  

0
0
Report

Lassi Viral Video: లస్సీలో మూత్రం పోసి విక్రయిస్తున్న బాలుడు.. వైరల్ వీడియో..

Hyderabad, Telangana:

 Lassi Contamination Viral Video Watch: సోషల్ మీడియాలో ప్రస్తుతం ఒక వీడియో సోషల్ మీడియా వినియోగదారులను ఉలిక్కిపడేలా చేస్తుంది. ఆహార పదార్థాల్లో కల్తీ అనేది కొత్తేమీ కాదు కానీ.. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన మాత్రం ప్రజలను తీవ్ర అసహనంతో పాటు భయాందోళనకు గురిచేస్తుంది. ఓ బాలుడు లస్సిలో మూత్రం పోసి.. అదే విషతుల్యమైన డ్రింకును కస్టమర్లకు విక్రయిస్తున్నట్లుగా ఉన్న దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ గా మారాయి. అయితే ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలియదు కానీ వీడియో మాత్రం ఊహించని స్థాయిలో వైరల్ అవుతుంది.

వైరల్ అవుతున్న వీడియోలో.. సదరు బాలుడు ఎంతో నిర్లక్ష్యంగా.. లస్సీని సర్వ్ చేస్తున్నాడు.. కస్టమర్లకు ఇచ్చే లస్సి గ్లాసుల్లో అతను మూత్రం కలిపి.. ఏమీ తెలియనట్లుగా.. వారికి సర్వ్ చేస్తున్నాడు.. అక్కడే ఉన్న కొందరు వ్యక్తులు ఈ అమానుష్యాన్ని గమనించి.. వెంటనే తమ స్మార్ట్ ఫోన్స్ లో వీడియోను తీయడం ప్రారంభించారు. ఆ పిల్లాడి చేస్తాలను చూసి కంగుతిన్నవారు.. వెంటనే అతన్ని నిలదీసి అడుగుతుండడం కూడా మీరు ఈ వీడియోలో చూడొచ్చు.. అయితే, ఆ పిల్లాడు ఏమీ తెలియనట్టు.. ఎటువంటి పాశ్చాతాపం లేకుండా అమాయకపు నటన ప్రదర్శించడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.. అతని నిర్లక్ష్యం చూసి వీడియో తీస్తున్న వారు కూడా షాక్ అయిపోయారు..

 
 
 
 
 

వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో.. అది క్షణాల్లోని వైరల్ అవ్వడం ప్రారంభమైంది.  ఇది చూసి సోషల్ మీడియా వినియోగదారులు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. ఆహారంతో ఇలా చెలగాట మాడటం ఎంతవరకు మంచిది? అని పలువురు ప్రశ్నిస్తున్నారు. వీధి వ్యాపారుల వద్ద దొరికే ఆహార పదార్థాల పట్ల ప్రజలు ఎంతో జాగ్రత్తగా ఉండాలని.. ఇలాంటి కల్తీ ఆహారాల వల్ల ఊహించని రోగాలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు..

Also Read: King Cobra Video: స్టౌపై గిన్నెలో తిష్టవేసిన భారీ కింగ్ కోబ్రా.. వీడియో చూస్తే వణికిపోవాల్సిందే!

ఈ ఘటన ఎక్కడ జరిగిందని విషయంపై ఇంకా స్పష్టత లేకపోయినప్పటికీ.. కానీ ప్రతి ఒక్కరిని ఆలోచించేలా చేస్తోంది.. రోడ్డు పక్కన దొరికే ఆహార పదార్థాల నాణ్యత పై ఆహార భద్రత అధికారులు కఠినమైన నిగా ఉంచాలని ప్రజలు కూడా డిమాండ్ చేస్తున్నారు. లేకపోతే ప్రజల ప్రాణాలతో ఇలాంటివారు చలగాటమాడుతూనే ఉంటారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిబంధనలను ఉల్లంఘించే వ్యాపారులపై అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని.. ప్రజల ఆరోగ్యానికి రక్షణ కల్పించాలని సోషల్ మీడియా వినియోగదారులు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు.

Also Read: King Cobra Video: స్టౌపై గిన్నెలో తిష్టవేసిన భారీ కింగ్ కోబ్రా.. వీడియో చూస్తే వణికిపోవాల్సిందే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

  

0
0
Report

Telangana: దేవదాయ శాఖలో భారీగా ఈవో పోస్టులు.. 190 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్!

Karimnagar, Telangana:

Telangana Endowment Department Recruitment Telugu News: రాష్ట్రంలోని దేవాలయాల నిర్వహణను మరింత పతిష్టం చేసే దిశగా తెలంగాణ ప్రభుత్వం అద్భుతమైన నిర్ణయం తీసుకుంది. దేవాదాయ శాఖలోని సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న 190 కార్య నిర్వహణ అధికారుల పోస్టులను  భర్తీ చేసేందుకు ప్రభుత్వం పచ్చ జెండా ఊపింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు ఎన్ని ఈవో (EO) పోస్టులు ఉన్నాయి. తెలంగాణ ప్రభుత్వం ఎలా వీరి నియామకాలను చేపట్టబోతోంది? దీనికి సంబంధించిన అన్ని రకాల వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

రాష్ట్రవ్యాప్తంగా వివిధ గ్రేడ్లలో ఖాళీగా ఉన్న ఈవో పోస్టులను ప్రత్యక్ష నియామక పద్ధతిలో భర్తీ చేయబోతున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఆలయాల్లో పాలన సౌలభ్యంతో పాటు ఆర్థిక క్రమశిక్షణ, భక్తులకు మెరుగైన సేవలందించే లక్ష్యంగా ఈ పోస్టుల మంజూరు జరిగినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. అంతేకాకుండా పూర్తిగా తెలంగాణ వ్యాప్తంగా ఉన్న గుడిలను అభివృద్ధి చేసే లక్ష్యంతోనే మరిన్ని పోస్టులను కూడా భర్తీ చేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.

ఈ నియామకాల్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు ప్రత్యేకమైన ప్రాధాన్యత లభించింది. జిల్లాకు మొత్తం 2 గ్రేడ్ వన్ EO పోస్టులను ప్రభుత్వం కేటాయించింది. ఇందులో ఒకటి కరీంనగర్ పట్టణానికి.. మరొకటి సిరిసిల్ల ప్రాంతానికి కేటాయించినట్లు అధికారులు నోటిఫికేషన్లు క్లుప్తంగా పేర్కొన్నారు. జిల్లాలోని ప్రధాన దేవాలయాల పరిపాలన లో ఈ నియామకాలు కీలక మార్పులు తీసుకురానన్నాయి.. ఆలయ అభివృద్ధికి ఇవి తోడ్పడతాయని స్థానికులతో పాటు ఇతర అధికారులు అభిప్రాయపడుతున్నారు.

Also Read: Cooking Oil Prices Hike: సామాన్యుడి జేబుకు మంట.. నిన్న గ్యాస్.. నేడు వంట నూనె.. భారీగా పెరిగిన ధరలు  

ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై అధికారులతో పాటు నిరుద్యోగ యువత హర్షం వ్యక్తం చేస్తున్నారు. చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్న EO పోస్టుల నోటిఫికేషన్ కోసం వేచి చూస్తున్న అభ్యర్థులకు ఇది శుభవార్త అని చెప్పవచ్చు. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత పోస్టులు మంజూరు కావడంతో.. అభ్యర్థులు ఇప్పటినుంచి పోటీ పరీక్షల తయారీలో నివంతం అవుతున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా చేపడుతున్న ఈ భారీ నియామకాల వల్ల దేవాదాయ శాఖలో పరిపాలనపరమైన ఇబ్బందులు తొలగిపోయి.. వ్యవస్థ మరింత పారదర్శకంగా మారుతుందని ఆశాభావం వ్యక్తమవుతోంది.. అతి త్వరలోనే సిలబస్‌తో పాటు వయోపరిమితి, దరఖాస్తు విధానం వంటి వివరాలతో కూడిన పూర్తి స్థాయి అధికారిక నోటిఫికేషన్ వెలువరించే అవకాశాలు ఉన్నాయి.

Also Read: Cooking Oil Prices Hike: సామాన్యుడి జేబుకు మంట.. నిన్న గ్యాస్.. నేడు వంట నూనె.. భారీగా పెరిగిన ధరలు  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report
Advertisement

8th Pay Commission: ప్రభుత్వ ఉద్యోగుల ఎగిరి గంతేసే వార్త..డీఏతో పాటు HRA పెంపునకు కేంద్రం గ్రీన్ సిగ్నల్?!

Hyderabad, Telangana:

8th Pay Commission HRA Hike: ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం ఇటీవలే శుభవార్త తెలియజేసింది. పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని భర్తీ చేసేందుకు వీలుగా ఇటీవల కరువు భత్యం (DA) 60 శాతానికి పెంచిన సంగతి తెలిసిందే. మరోవైపు, ప్రభుత్వ ఉద్యోగుల జీవన వ్యయాలు, ఇంటి అద్దెను తీర్చడానికి ఇచ్చే HRAలో వచ్చిన ముఖ్యమైన మార్పులు చేయబోతున్నారు.

8వ వేతన సంఘం అమలు కోసం ఎదురుచూస్తున్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కరువు భత్యాన్ని ఇటీవల సవరించిన కేంద్ర ప్రభుత్వం డీఏలో 2 శాతం పెంచగా.. దీంతో వారి మొత్తం కరువు భత్యం 60 శాతానికి చేరింది. ఈలోగా కరువు భత్యంతో పాటు ప్రభుత్వం హెచ్‌ఆర్‌ఏను కూడా పెంచుతుందా అని చాలామంది ఆశ్చర్యపోతున్నారు. దీనికి సమాధానం అవును. ఈ విషయంలో ప్రభుత్వ నిబంధనల వివరణ ఇక్కడ ఉంది.

ఇటీవలి కాలంలో, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు 8వ వేతన సంఘం గురించి చాలా మాట్లాడుకుంటున్నారు. ఈ నేపథ్యంలో, వారి దృష్టి ప్రధానంగా ఫిట్‌మెంట్ అంశం, మూల వేతనంపై కేంద్రీకృతమై ఉంది. అయితే, ఉద్యోగి చేతికి అందే నెలసరి వేతనంలో అనేక అలవెన్సులు చేరి ఉంటాయి. 

'ఆల్ ఇండియా కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్' (AICPI) ఆధారంగా కరువు భత్యం (DA) ఏడాదికి రెండు సార్లు సవరిస్తారు. ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు ద్రవ్యోల్బణం నుండి ఉపశమనం కలిగించి, పెరుగుతున్న జీవన వ్యయాన్ని తట్టుకోవడంలో వారికి సహాయపడటమే దీని లక్ష్యంగా వస్తుంది.

ఇటీవల, కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు (రైల్వే, రక్షణ రంగ ఉద్యోగులతో సహా) ఇచ్చే కరువు భత్యం (డీఏ)లో మార్పులను ప్రకటించింది. దీని ప్రకారం.. మూల వేతనంలో డీఏను 58 శాతం నుంచి 60 శాతానికి పెంపుదల చేశారు. ఈ మార్పు 2026 జనవరి 1 నుంచి అమలులోకి వస్తుంది. 

ప్రభుత్వ ఉద్యోగులు అందుకునే జీతంలో డీఏ, హెచ్‌ఆర్ఏ అనేవి ప్రధానంగా రెండు ముఖ్యమైన భాగాలు వస్తున్నాయి. డీఏ నేరుగా ఉద్యోగి మూల వేతనంపై ఆధారపడి ఉండగా, హెచ్‌ఆర్‌ఏ అనేది ఇంటి అద్దె ఖర్చుగా పరిగణిస్తున్నారు. నిబంధనల ప్రకారం.. డీఏ ఒక నిర్దిష్ట పరిమితిని (ఉదాహరణకు 50% దాటినప్పుడు) మించినప్పుడు, హెచ్‌ఆర్‌ఏ రేటు కూడా పెంచుతారు. కరువు భత్యం అనేది కేవలం ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే లభిస్తుండగా.. ప్రభుత్వ ఉద్యోగులతో పాటు ప్రైవేట్ ఉద్యోగులకు హెచ్ఆర్ఏ కలిపి జీతంగా చెల్లిస్తారు.

Also Read: MI Vs CSK Match: ఐపీఎల్‌ నుంచి తప్పుకోనున్న తొలి టీమ్ ముంబై..CSK జట్టుపై చిత్తుగా ఓడింది!

Also Read: 2700 Crore Bank Fraud: రూ.2,700 కోట్లు ఎగ్గొట్టిన కేసులో నిందితుడు అరెస్టు..ఆర్థిక మోసగాడ్ని భారత్‌కు అప్పగించిన యూఏఈ!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report

Hamsa Mahapurusha Rajayoga: జూన్ 2 నుంచి హంస మహా పురుష రాజయోగం.. ఈ 4 రాశుల వారికి ఇక పండగే!

Hyderabad, Telangana:

Hamsa Mahapurusha Rajayoga Effect On Zodiac: వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గురుగ్రహాన్ని అదృష్టానికి శ్రేయసుకు సూచికగా పరిగణిస్తారు. జూన్ రెండవ తేదీన గ్రహాలకు అధిపతిగా భావించే గురు గ్రహం తన ఉచ్ఛరాశి అయిన కర్కాటక రాశిలోకి ప్రవేశించబోతోంది.. దీని కారణంగా ఎంతో శక్తివంతమైన హంస మహాపురుష రాజయోగం ఏర్పడబోతోంది. దీని ప్రభావం వల్ల కొన్ని రాశుల వారి జీవితాల్లో సుఖసంతోషాలు రావడం ప్రారంభమవుతాయి.. ముఖ్యంగా ఆయా రాశుల వారికి కోరుకున్న కోరికలు కూడా ఎంతో సులభంగా నెరవేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీర్ఘకాలిక సమస్యలు పూర్తిగా తొలగిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ సమయం కొన్ని రాశుల వారికి చాలా లాభదాయకంగా ఉండబోతోంది.

ఈ రాశుల వారికి జాక్పాట్..
కర్కాటక రాశి 
గురు గ్రహ సంచార ప్రభావంతో కర్కాటక రాశి వారికి విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా వీరికి ఈ సమయంలో జీవితంలో పెద్ద పెద్ద మార్పులు సంభవిస్తాయి. అంతేకాకుండా భారీ మొత్తంలో డబ్బులు పొంది.. డబ్బులను గణనీయంగా పొదుపు చేయగలుగుతారు. అంతేకాకుండా కొత్త ఆదాయం మార్గాలు కూడా రావడంతో ఆర్థిక చింతల నుంచి ఉపశమనం కలుగుతుంది. కొత్త వ్యాపారాలతో పాటు ప్రాజెక్టులను ప్రారంభించాలని చూస్తున్న వ్యక్తులకు ఈ సమయం చాలా ఉత్తమంగా ఉండబోతుంది. అంతేకాకుండా దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న పనులు కూడా త్వరగా పూర్తవుతాయి. వ్యాపారస్తులకు ఊహించని లాభాలు కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

వృశ్చిక రాశి 
హంస మహా పురుష రాజయోగ ప్రభావంతో వృశ్చిక రాశి వారికి అదృష్టం విపరీతంగా పెరగబోతుంది.. ముఖ్యంగా వీరికి అదృష్టం పూర్తిగా తోడు ఉండబోతోంది కాబట్టి మీరు చేసే ప్రతి పని అద్భుతంగా ఉంటుంది. అంతేకాకుండా తండ్రుల నుంచి అద్భుతమైన ఆస్తులతో పాటు ఇతర లగ్జరీ వస్తువులు పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా వీరు అనేక మార్గాల ద్వారా ఈ సమయంలో డబ్బులు అందుకోబోతున్నారు. ఈ సమయంలో పాత పెట్టుబడుల నుంచి చేతికి భారీ మొత్తంలో డబ్బులు రాబోతున్నాయి. ఉద్యోగాల్లో పదోన్నతులతో పాటు జీతాలు పెరిగి కొత్త ఇల్లులు కొనుగోలు చేస్తారు. దీంతోపాటు దీర్ఘకాలంగా ఉన్న అప్పుల భారం తగ్గడంతో మానసికంగా చాలా అద్భుతంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

తులారాశి 
ఈ శక్తివంతమైన రాజయోగ ప్రభావం తులారాశి వారికి చాలా బాగుండబోతోంది ముఖ్యంగా వృత్తి జీవితంలో కొత్త మహిళా ఏర్పడబోతోంది. కార్యాలయంలో మీ పనికి అధికారులు అభినందనలు కూడా తెలుపుతారు. అంతేకాకుండా చాలా కాలంగా ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వ్యక్తులకు ఈ సమయంలో మంచి కంపెనీల నుంచి ఉద్యోగాలు కూడా లభిస్తాయి.. వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టడం వల్ల భారీ మొత్తంలో ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. అలాగే వృత్తి జీవితంలో పెద్ద విజయాలు సాధించే అవకాశాలు కూడా ఉన్నాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. 

మీన రాశి 
మీన రాశిలో జన్మించిన వ్యక్తులకు కూడా గురు గ్రహం అధిపతి కావడం వల్ల వీరికి అద్భుతమైన ఫలితాలు దక్కుతాయి.. ముఖ్యంగా విదేశాలకు వెళ్లాలనుకుంటున్న వ్యక్తులకు భారీ మొత్తంలో సంపాదనలు లభించబోతున్నాయి.. అంతేకాకుండా ఈ సమయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకున్న అద్భుతమైన లాభాలు పొందుతారు. వ్యాపారాన్ని విస్తరించుకోవాలనుకున్న వ్యక్తులకు ఈ సమయం అత్యంత అనుకూలంగా ఉండబోతోంది. మీ కుటుంబ జీవితంలో సంతోషంతో పాటు శాంతి కూడా నెలకొంటుంది. ఇంట్లో ఏదైనా శుభకార్యాలు జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. పెట్టుబడుల నుంచి భారీ మొత్తంలో లాభాలు పొందడమే కాకుండా సంబంధాల్లో మాధుర్యం కూడా లభించబోతోంది.

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
0
Report

Judge Suicide: తీర్పులు ఇచ్చే చేతులే ప్రాణాలు తీసుకున్నాయి.. జడ్జి అమన్ కుమార్ శర్మ సూసైడ్ మిస్టరీ!

Hyderabad, Telangana:

What is Judge Aman Kumar Sharma Suicide Mistery: భార్యాభర్తల మధ్య గొడవలు ప్రస్తుతం తారస్థాయికి చేరుకుంటున్నాయి. అవి ఒకరిని హత్య చేయడమో లేదా తామే ఆత్మహత్య చేసుకోవడమో జరుగుతోంది. మొన్నే బాచుపల్లికి చెందిన వ్యక్తి భార్య ఆగడాలతో హుస్సేన్‌సాగర్‌లో దూకి సూసైడ్‌ చేసుకున్నాడు. ఆ ఘటన మరువక ముందే తాజాగా భార్య వేధింపులతో ఓ యువ జడ్జి కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. తీర్పులిచ్చే చేతులే స్వయానా ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఢిల్లీలో చోటుచేసుకుంది. యువ జడ్జి అమన్‌ కుమార్‌ శర్మ (30) సూసైడ్‌ ప్రస్తుతం దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. అయితే 2 నెలలుగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయని.. ఈ నేపథ్యంలోని ఆత్మహత్య చేసుకున్నట్లు బంధువులు చెప్తున్నారు. భార్య కూడా జ్యుడిషియల్ ఆఫీసర్‌గా విధులు నిర్వర్తిస్తుంది. 2021 ఢిల్లీ జ్యుడీషియల్ సర్వీస్ లో చేరిన అమన్ పలు క్రిమినల్, సివిల్ కేసులు విచారించారు. ఫస్ట్ క్లాస్ జ్యూడిషియల్‌ మెజిస్ట్రేట్ సివిల్ జడ్జిగా కూడా పనిచేశారు. అయితే భార్య భర్తల మధ్య గొడవల కారణంగానే అమన్ కుమార్ ఆత్మహత్య చేసుకున్నట్లు తండ్రి ఇతర బంధువులు కూడా చెబుతున్నారు.

 ఆత్మహత్యకు కారణం ఏమై ఉంటుంది? 
ఢిల్లీలోని గ్రీన్ పార్కులో 30 ఏళ్ల యువ జడ్జ్ ఆత్మహత్య ఘటన మిస్టరీ ఇంకా వీడాల్సి ఉంది. ప్రధానంగా మానసిక ఒత్తిడి, వైవాహిక జీవితంలో కలహాల కారణంగానే తను తీవ్ర ఇబ్బందులు పడుతున్నానని తండ్రికి ఫోన్ చేసి చెప్పినట్లు సమాచారం. ఇంతలోనే శనివారం మధ్యాహ్నం 1:45 గంటలకు ఉన్నటుండి అమన్‌ బావమరిది శివం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన ఇంటి బాత్రూంలో అమన్ కుమార్ ఆత్మహత్య చేసుకున్నాడని ఫిర్యాదు చేశాడు. వెంటనే పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని పర్యవేక్షించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. అయితే ఘటన అనంతరం నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. 

 ముందు రోజు రాత్రి 10 గంటల సమయంలో అమన్‌ తన తండ్రితో ఫోన్ చేసి మాట్లాడాడు. తాను తీవ్ర ఒత్తిడికి గురవుతున్నట్లు, వైవాహిక గొడవల వల్ల సతమతమవుతున్నట్లు చెప్పాడు. ఈ నేపథ్యంలో వెంటనే అల్వార్ నుంచి తండ్రి ఢిల్లీకి రాత్రి 12 గంటల సమయంలోనే బయలుదేరారు. కొడుకుని చూసి నచ్చజెప్పాడు. అయితే ఇంట్లో భార్యకే పూర్తి అధికారం ఉందని.. ఆమె ప్రతి మాటకు నేను వినాల్సి వస్తుంది.. లేకపోతే గొడవలు ఎక్కువవుతున్నాయి. ఒత్తిడి కూడా ఎక్కువ అవుతుందని చెప్పుకు వచ్చాడు. పరిస్థితిని చక్కదిద్దడానికి తండ్రి ప్రయత్నించాడు. కోడలు తనను కూడా ఇంట్లోంచి వెళ్లిపోమని చెప్పింది, లేకపోతే పోలీసులకు ఫోన్ చేసి అరెస్ట్ చేయిస్తానని బెదిరించింది. అయితే కోడలు తల్లిదండ్రులకు ఫోన్ చేసి ఫోన్ చేయగా వారు కూడా నెంబర్ బ్లాక్ చేశారు. వెంటనే భార్య మామను పిలిపించి పరిస్థితిని తెలియజేశాడు. ఇక అతను కూడా నేనేం చేయలేనని వెనతిరిగిపోయాడు. ఇద్దరు మధ్య గొడవ తారస్థాయికి చేరుకుంది. 

Also Read: బర్గి డ్యామ్‌లో ఘోర ప్రమాదం.. 30 మందితో వెళ్తున్న క్రూయిజ్ బోల్తా.. ఏడుగురి మృతదేహాల వెలికితీత!

Also Read:  అర్ధరాత్రి హైవోల్టేజ్‌‌ డ్రామా.. ఈవీఎంలలో అవకతవకలు జరిగాయంటూ స్ట్రాంగ్‌ రూమ్‌ వద్ద మమత రచ్చ! వీడియో

కాసేపటి తర్వాత కూడా అమన్‌ ఒక గదిలో.. భార్య మరో గదిలో ఉంది. అయినా ఆమె గట్టిగట్టిగా కేకలు వేస్తూ అరుస్తూనే ఉంది. కాసేపటికి తండ్రి అమన్ ఎక్కడ అని అడగ్గా ఆమె నాకు తెలియదని చెప్పింది. వెంటనే మొబైల్ తో యాప్ కాల్ చేశాడు. బాత్రూంలో మోగింది.. డోర్ ఎంతకీ తెరచుకోవడం లేదు. వెంటనే డోర్ పగలగొట్టి చూడగా తన భార్య స్కార్ప్‌తోనే అమన్‌ ఉరేసుకొని వేలాడుతూ కనిపించాడు. ఈ కేసు దర్యాప్తులో వైవాహిక కలహాలే కారణమా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report
Advertisement

MI Vs CSK Match: ఐపీఎల్‌ నుంచి తప్పుకోనున్న తొలి టీమ్ ముంబై..CSK జట్టుపై చిత్తుగా ఓడింది!

Chennai, Tamil Nadu:

MI Vs CSK Match 2026: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌‌లో నేడు జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై తమ చిరకాల ప్రత్యర్థి చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) ఘన విజయం సాధించింది. అయితే ఈ లీగ్‌లో ముంబై ఇండియన్స్‌కు ఇది ఏడో పరాజయం కావడం గమనార్హం. ఇప్పటికే ప్లేఆఫ్స్ రేసు నుంచి పూర్తిగా తప్పుకున్నట్లే పరిస్థితి కనిపిస్తుంది. వరుస ఓటముల తర్వాత ముంబై ఇండియన్స్ టీమ్‌ అభిమానులు తీవ్ర నిరాశలో కూరుకుపోయారు.

ప్రస్తుత లీగ్‌లో ఆడిన 9 మ్యాచ్‌ల్లో ముంబై ఇండియన్స్ జట్టు 2 సార్లు గెలుపొందగా.. 7సార్లు ఓటమిని చవిచూసింది. దీంతో ఆ టీమ్ ప్లేఆఫ్స్ అర్హత సాధించడం దాదాపుగా అసాధ్యమే అని చెప్పవచ్చు. లీగ్ దశ నుంచి తప్పుకొనే తొలి టీమ్‌గా ముంబై నిలుస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. మరోవైపు చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఇప్పటి వరకు ఆడిన 9 మ్యాచ్‌ల్లో 4 మ్యాచ్‌ల్లో గెలుపొంది.. 5 మ్యాచ్‌ల్లో ఓటమి పాలైంది. అయితే సీఎస్కే జట్టు తదుపరి మ్యాచ్‌ ఫలితాల ద్వారా దాని ప్లేఆఫ్స్ అర్హత సాధించే అవకాశం ఉంది. 

ప్రస్తుతం ఐపీఎల్ లీగ్ సగానికి పైగా మ్యాచ్‌లు పూర్తవ్వగా.. ఇలాంటి పరిస్థితుల్లో ఐపీఎల్ జట్లు ప్లేఆఫ్స్‌కు వెళ్లాలంటే కనీసం 7 లేదా 8 మ్యాచ్‌ల్లో కచ్చితంగా నెగ్గాల్సి ఉంటుంది. మరోవిధంగా చెప్పాలంటే 14 లేదా 16 పాయింట్లను సాధించాల్సి ఉంటుంది. ఒకవేళ ఏవైనా రెండు జట్ల మధ్య పాయింట్ల వ్యత్యాసం సమానంగా ఉంటే.. వాటి నెట్ రన్‌రేట్ మెరుగ్గా ఉన్న ఆధారంగా ప్లేఆఫ్స్‌కు చేరుతాయి. పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ ఇప్పటికే 12 పాయింట్లను సాధించినందున, ముంబై ఇండియన్స్ ప్లేఆఫ్‌లకు అర్హత సాధించే అవకాశాలు చాలా తక్కువ.

శనివారం జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా మొదట బ్యాటింగ్ ఎంచుకోగా.. విల్ జాక్స్ తక్కువ స్కోరుకే అవుటైనా ఫర్వాలేదనిపించేలా ఆరంభాన్ని ఇచ్చాడు. సగం ఆట ముగిసేసరికి, ముంబై జట్టు 180కి పైగా పరుగులు చేస్తుందని అనిపించింది. అయితే, సూపర్ కింగ్స్ పద్ధతిగా పరుగులు చేయడాన్ని నియంత్రించి, ముంబై ఇండియన్స్‌కు బ్రేకులు వేసింది. దీంతో ముంబై జట్టును 159 పరుగులకే పరిమితం చేసింది. 

లక్ష్యచేధనలో చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటర్లలో సంజు సామ్సన్‌ను 11 పరుగులకే అవుట్ చేసి ముంబై ఇండియన్స్ 'ఎల్లో ఆర్మీ'కి ఆరంభంలోనే దెబ్బకొట్టింది. కానీ, మూడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన ఉర్విల్ పటేల్, వేగంగా 49 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. రుతురాజ్ గైక్వాడ్ (67*), కార్తీక్ శర్మ (54*) అజేయంగా 98 పరుగులు జోడించారు. ఇంకా 11 బంతులు, 8 వికెట్లు మిగిలి ఉండగానే విజయాన్ని ఖాయం చేసుకుంది.

మ్యాచ్ అనంతరం మాట్లాడిన ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా.. ఈ సీజన్ తమకు ఏమాత్రం కలిసి రాలేదని, ఈ మ్యాచ్‌లో తమ ప్రదర్శన అన్ని విభాగాల్లోనూ వెనుకబడిందని పాండ్యా అభిప్రాయపడ్డాడు. "ఇది మా సీజన్ కాదు. వారు మాకంటే మెరుగ్గా ఆడారు. మెరుగ్గా బౌలింగ్ చేశారు. మెరుగ్గా ఫీల్డింగ్, బ్యాటింగ్ చేశారు. 180-190 పరుగులు ఒక మంచి స్కోరు అయ్యేది. మాకు కావాల్సిన మూమెంటమ్ లభించలేదు. మొత్తంగా చూస్తే, ఒక బౌలింగ్ యూనిట్‌గా వారు మాకంటే మెరుగ్గా ఉన్నారు. కానీ ఒక బ్యాటింగ్ యూనిట్‌గా మేము అంత గొప్పగా రాణించలేకపోయాము. మాకు అందుబాటులో ఉన్న బౌలింగ్ ప్రత్యామ్నాయాలతోనే మేము ముందుకు వెళ్లాము" అని హార్దిక్ పాండ్యా అభిప్రాయపడ్డాడు. 

Also Read: Virat Kohli ODI Retirement: వన్డేలకు విరాట్ కోహ్లీ రిటైర్మెంట్! కింగ్ కోహ్లీ స్థానంలో అతనే అసలైన వారసుడు!

ALso Read: Ravindra Jadeja Kuldeep Yadav: బ్యాట్‌తో కుల్దీప్ ముఖంపై కొట్టబోయిన జడేజా..ఐపీఎల్ మ్యాచ్‌లో ఊహించని సంఘటన..

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report
Advertisement

Virat Kohli ODI Retirement: వన్డేలకు విరాట్ కోహ్లీ రిటైర్మెంట్! కింగ్ కోహ్లీ స్థానంలో అతనే అసలైన వారసుడు!

Hyderabad, Telangana:

Virat Kohli ODI Retirement News: క్రికెట్ ప్రపంచంలో విరాట్ కోహ్లీ అంటే స్పెషల్ బ్రాండ్ ఉంది. విరాట్ కోహ్లీ ప్రస్తుతం ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో (ఐపీఎల్) రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తరఫున ఆడుతున్నాడు. అయితే, 2027 వన్డే ప్రపంచ కప్ తర్వాత కోహ్లీ తన రిటైర్మెంట్‌ను ప్రకటించవచ్చని మరోసారి ఊహాగానాలు పెరుగుతున్నాయి.

ఒకవేళ కోహ్లీ వన్డే క్రికెట్ నుండి తప్పుకుంటే.. టీమ్ ఇండియాలో అతని స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారు? అనే ప్రశ్న అందరిలోనూ చర్చ నడుస్తోంది. ప్రస్తుతం టీమ్ఇండియా వన్డే జట్టులో శ్రేయస్ అయ్యర్ 4వ స్థానంలో, కేఎల్ రాహుల్ 5వ స్థానంలో ఉన్నారు. హార్దిక్ పాండ్యా తన 6వ స్థానాన్ని నిలబెట్టుకున్నాడు.

భారత వన్డే జట్టులో మూడవ స్థానానికి తిలక్ వర్మ బలమైన పోటీదారుడిగా ఉన్నాడు. తిలక్ వర్మ బ్యాటింగ్ శైలి ప్రత్యర్థి బౌలర్లకు బెంబేలెత్తించే విధంగా మారాడు. వన్డే ఫార్మాట్‌లో టీమ్ఇండియాకు విరాట్ కోహ్లీ ఉత్తమ ఎంపిక అని విశ్లేషకులు భావిస్తున్నారు. తిలక్ వర్మ ఫాస్ట్ బౌలర్లను, కటింగ్ స్పిన్నర్లను ఎదుర్కోవడంలో నిష్ణాతుడిగా ఎదుగుతున్నాడు. అంతర్జాతీయ వన్డే మ్యాచ్‌లలో (ODI) మూడవసారి బ్యాటింగ్‌కు వచ్చే స్థానంలో తిలక్ వర్మ ఎంతో అవసరంగా ఉంటుంది.

ఇంటర్నేషనల్ క్రికెట్ లెక్కల ప్రకారం.. తిలక్ వర్మ టీమ్ఇండియా తరఫున 49 టీ20 మ్యాచ్‌లలో 1,389 పరుగులు చేశాడు. అతని సగటు 44.81గా నమోదయ్యింది. వాటిలో మొత్తంగా 2 సెంచరీలు, 6 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. వన్డేల విషయానికొస్తే, తిలక్ వర్మ 5 మ్యాచ్‌లలో 68 పరుగులు చేశాడు. అందులో ఒక అర్ధ సెంచరీ ఉంది.

మరోవైపు తిలక్ వర్మ తన చివరి వన్డేను 2025 డిసెంబర్ 6న దక్షిణాఫ్రికాతో ఆడాడు. తిలక్ వర్మను వన్డే జట్టుకు ఎక్కువ కాలం దూరంగా ఉంచడం కష్టం. తన నిలకడైన ప్రదర్శనలు, మ్యాచ్ గమనాన్ని మార్చగల సామర్థ్యంతో, రిటైర్ అయిన కోహ్లీకి సరైన ప్రత్యామ్నాయంగా తిలక్ వర్మను పరిగణిస్తున్నారు. 2027 ప్రపంచ కప్ తర్వాత, మిడిల్ ఆర్డర్ బాధ్యతలు తీసుకునే అధికారం టీమ్ ఇండియాకు ఉంది. బీసీసీఐ చివరికి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.

Also Read: 2700 Crore Bank Fraud: రూ.2,700 కోట్లు ఎగ్గొట్టిన కేసులో నిందితుడు అరెస్టు..ఆర్థిక మోసగాడ్ని భారత్‌కు అప్పగించిన యూఏఈ!

Also Read: Janasena Rajya Sabha: జనసేన నుంచి రాజ్యసభ బరిలో టాలీవుడ్ బడా నిర్మాత..పవన్ కల్యాణ్ మాస్టర్ ప్లాన్ ఇదేనా?

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report
Advertisement

Vodafone Idea: సంక్షోభంలో వొడాఫోన్‌ ఐడియా.. రూ.50 వేల కోట్లు ఎలా సాధ్యం?

Wadgaon, Maharashtra:

Vodafone Idea: టెలికాం దిగ్గజం వోడాఫోన్ ఐడియా తీవ్ర సంక్షోభంలో పడింది. ఆ సంస్థను ఇప్పుడు ఆదుకోవాల్సిన అవసరం ఉంది. వొడాఫోన్‌ ఐడియాకు రూ.50,000 కోట్ల సహాయం అవసరం. ఈ కంపెనీ ప్రస్తుత రుణం, స్పెక్ట్రమ్ చెల్లింపులు, మూలధన వ్యయం వంటి భారీగా ఉన్నాయి. కేంద్రం ఇప్పటికే స్పెక్ట్రమ్ బకాయిలలో సుమారు రూ.37,000 కోట్లను ఈక్విటీగా మార్చి దాదాపు 49 శాతం వాటాతో అతిపెద్ద వాటాదారుగా అవతరించింది. దీని ప్రమోటర్లైన యూకేకు చెందిన వొడాఫోన్ పీఎల్‌సీ, స్వదేశీ ఆదిత్య బిర్లా గ్రూప్ సుమారు 25.5 శాతం వాటాను కలిగి ఉంది. మిగిలిన ప్రభుత్వ, సంస్థాగత పెట్టుబడిదారుల వద్ద ఉంది.

Also Read: Kotha Prabhakar Reddy: దుబ్బాకలో రణరంగంగా మీటింగ్‌.. మైక్‌ విసిరిపడేసిన బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యే

వొడాఫోన్ ఐడియాకు ఈ వారం కేంద్ర ప్రభుత్వం స్థూల ఆదాయం (ఏజీఆర్‌) సర్దుబాటు సంబంధిత బకాయిలను సుమారు రూ.23,649 కోట్లు తగ్గించింది. అయినా కూడా కంపెనీ తన కార్యకలాపాలను కొనసాగించడానికి, 5జీని పెద్ద ఎత్తున విస్తరించడానికి రానున్న మూడున్నరేళ్లకు సుమారు రూ.45,000 నుంచి రూ.50,000 కోట్ల మూలధనం అవసరం కావచ్చని మార్కెట్‌ వర్గాలు చెబుతున్నాయి. ఏజీఆర్‌ ఉపశమనం కంపెనీ బ్యాలెన్స్ షీట్‌కు కొంత వెసులుబాటు కల్పిస్తుందని, కానీ మూలధన అవసరాన్ని తీర్చదని కొందరు మార్కెట్‌ నిపుణులు పేర్కొంటున్నారు.

Also Read: Govt Employees: 100 రోజుల్లో అన్నింటికి పరిష్కారం.. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు

వొడాఫోన్ ఐడియా ఇప్పటికీ భారీ రుణభారంతో కొట్టుమిట్టాడుతోంది. దీని మొత్తం అప్పులు అనేక లక్షల కోట్ల రూపాయలకు చేరుకున్నాయి. ప్రస్తుత బాధ్యతలు అప్పు, స్పెక్ట్రమ్ చెల్లింపులు, మూలధన వ్యయం వంటి వివిధ రూపాల్లో విస్తరించి ఉన్నాయి. ఈ నిధుల కొరతను అధిగమించడానికి వొడాఫోన్ ఐడియా ఒక పెద్ద ఇన్వెస్టర్‌ను ఆకర్షించాల్సి ఉంది. మరి ఆ పెట్టుబడి ఆకర్షిస్తుందా? ఎవరు అంతటి భారీ పెట్టుబడి పెడతారనేది ఇప్పుడు కీలక ప్రశ్న.

దేశీయ టెలికాం రంగంలో రిలయన్స్ జియో,  భారతీ ఎయిర్‌టెల్ ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. వొడాఫోన్ ఐడియా మార్కెట్ వాటా క్రమంగా క్షీణించింది. ఈ రెండు సంస్థల ఆధిపత్యాన్ని మార్కెట్ ఎక్కువగా పరిగణనలోకి తీసుకుంటోంది. ఫలితంగా సబ్‌స్క్రైబర్ల వాటా, నెట్‌వర్క్ నాణ్యతపై వినియోగదారుల అభిప్రాయంలో వొడాఫోన్ ఐడియా వెనుకబడుతోంది. 5జీని ప్రోత్సహించి, మూలధనాన్ని సమీకరించినప్పటికీ అధిక రుణాలు, నెట్‌వర్క్ అంతరాలతో సతమతమవుతూనే ఉంది. ఈ నేపథ్యంలో వొడాఫోన్‌ ఐడియా భారీ స్థాయి పెట్టుబడి ఎలా ఆకర్షిస్తుందా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

కొత్త మూలధనం అందకపోతే ప్రత్యర్థులతో పోలిస్తే వొడాఫోన్ ఐడియా కష్టాలు మరింత పెరిగే అవకాశం ఉన్నాయి. బకాయిలు తీర్చడం మాత్రమే కాకుండా వృద్ధికి నిధులు సమకూర్చడం అనేదే అసలు పెద్ద సమస్యగా మిగిలిపోయింది. అన్నింటికన్నా ముఖ్యంగా సంక్షోభంలో ఉన్న టెలికాం ఆపరేటర్‌కు రూ.50,000 కోట్లు ఎవరు రాస్తున్నారు?

ఆయన రంగంలోకి దిగుతారా?
కష్టాల్లో ఉన్న వొడాఫోన్‌ ఐడియాను ఆదుకోవడానికి సజ్జన్‌ జిందాల్ రంగంలోకి దిగుతారని చర్చ నడుస్తోంది. ఆయనకు చెందిన జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ మౌలిక సదుపాయాలు, టెలికాం సంబంధిత రంగాలలో విస్తరిస్తూ వస్తోంది. ఈ క్రమంలో దేశంలోని మూడో అతిపెద్ద టెలికాం ఆపరేటర్‌ను స్థిరీకరించడానికి ప్రభుత్వం చేపట్టిన విస్తృత ప్రయత్నంలో భాగంగా.. జిందాల్ నేతృత్వంలోని గ్రూపును పరిశీలిస్తున్నట్లు కొన్ని నివేదికలు సూచిస్తున్నాయి.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
0
Report

2700 Crore Bank Fraud: రూ.2,700 కోట్లు ఎగ్గొట్టిన కేసులో నిందితుడు అరెస్టు..ఆర్థిక మోసగాడ్ని భారత్‌కు అప్పగించిన యూఏఈ!

Hyderabad, Telangana:

2700 Crore Bank Fraud Case: సుమారు రూ.2,700 కోట్ల మేరకు బ్యాంకులను మోసం చేసిన కేసులో ఇప్పుడు పురోగతి వచ్చింది. కోల్‌కతాకు చెందిన శ్రీ గణేష్ జ్యువెలరీ హౌస్ లిమిటెడ్ ప్రమోటర్ కమలేష్ పరేఖ్‌ను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) అరెస్టు చేసింది. 2016లో కోల్‌కతాలోని సీబీఐ బ్యాంకింగ్ సెక్యూరిటీస్ అండ్ ఫ్రాడ్ బ్రాంచ్ నమోదు చేసిన కేసు ప్రకారం.. ఆ కంపెనీతో పాటు దాని అనుబంధ సంస్థలు అనేక మార్గాల ద్వారా 25 బ్యాంకుల కన్సార్టియం నుంచి దాదాపుగా రూ.2,672 కోట్లు కాజేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. 

2022 డిసెంబర్ 31న ప్రమోటర్ కమలేషన్ పరేఖ్‌పై అధికారికంగా సీబీఐ ఛార్జిషీట్ దాఖలు చేసింది. అయితే, దర్యాప్తు మొదలైనప్పటి నుంచి అతను పరారీలో ఉండగా.. ఇప్పుడు చాలా ఏళ్లుగా అధికారులు కళ్లుగప్పి తిరుగుతున్నాడు. 2024లో ఇంటర్‌పోల్ ద్వారా అతనిపై రెడ్ కార్నర్ నోటీసు జారీ చేయగా.. సభ్య దేశాలలోని చట్ట అమలు సంస్థలకు అతన్ని కావలసిన పరారీలో ఉన్న వ్యక్తిగా గుర్తించారు. ఆ తర్వాత యూఏఈ అధికారులు అతనిని గుర్తించి, అదుపులోకి తీసుకున్నారు. అతనిపై నమోదైన ఆరోపణలను ఎదుర్కొనేందుకు భారతదేశానికి అప్పగించారు.

కమలేష్ పరేఖ్‌ను భారత్ అప్పగించగా.. అతను స్వదేశానికి వచ్చిన తర్వాత ట్రాన్సిట్ రిమాండ్ కోసం పరేఖ్‌ను ఈరోజు ఢిల్లీలోని ఒక కోర్టు ముందు హాజరుపరుస్తున్నారు. ఢిల్లీ కోర్టు విచారణలు పూర్తయిన తర్వాత, అతన్ని కోల్‌కతాకు తీసుకెళ్లే అవకాశం ఉంది. అక్కడ అసలు కేసుపై అధికార పరిధి ఉన్న సంబంధిత కోర్టు ముందు హాజరుపరుస్తారు.

Also Read: Janasena Rajya Sabha: జనసేన నుంచి రాజ్యసభ బరిలో టాలీవుడ్ బడా నిర్మాత..పవన్ కల్యాణ్ మాస్టర్ ప్లాన్ ఇదేనా?

Also Read: Ravindra Jadeja Kuldeep Yadav: బ్యాట్‌తో కుల్దీప్ ముఖంపై కొట్టబోయిన జడేజా..ఐపీఎల్ మ్యాచ్‌లో ఊహించని సంఘటన..

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report

Janasena Rajya Sabha: జనసేన నుంచి రాజ్యసభ బరిలో టాలీవుడ్ బడా నిర్మాత..పవన్ కల్యాణ్ మాస్టర్ ప్లాన్ ఇదేనా?

Chinnakakani, Andhra Pradesh:

Janasena Rajya Sabha Candidate: ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రానురాను మరింత ఆసక్తిగా మారుతున్నాయి. 2029 ఎన్నికలను లక్ష్యంగా చేసుకొని ఇప్పటికే పలు రాజకీయ పార్టీలు పన్నాగాలు పన్నుతున్నారు. అటు కూటమిలోని తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీతో పాటు ఇటు వైసీపీలోనూ ప్లానింగ్స్ మొదలెడుతున్నారు. ఈ క్రమంలో రాజ్యసభకు నిపుణులను పంపే యోచనలో కూటమి ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం.  

రానున్న రాజ్యసభ స్థానాల భర్తీకి కూటమిలోని టీడీపీ, జనసేన, బీజేపీ ఓ ఒప్పందానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఇందులో చెరో సీటు అనే ఒప్పందానికి వచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఈసారి రాజ్యసభ స్థానాల కోసం జనసేన నుంచి రెండు పేర్లు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే వారిలో ఎవరికి సీటు ఇస్తారనే విషయంపై ఇప్పుడు సందిగ్ధం నెలకొంది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మదిలో ఎవరు ఉన్నారనే విషయంపై ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో చర్చ జరుగుతోంది. 

పార్లమెంట్‌లోని రాజ్యసభలో జనసేన తొలిసారి అడుగుపెట్టబోతోంది. 2024 ఎన్నికల్లో జనసేన నుంచి లోక్‌సభకు ఇద్దరు నాయకులు ఎన్నికైన సంగతి తెలిసిందే. ఇప్పుడు రాజ్యసభలో తొలి అడుగు పెట్టేందుకు జనసేన సమీకరణాలను మొదలుపెడుతోంది. ఆంధ్రప్రదేశ్‌‌లో ప్రస్తుతం నాలుగు రాజ్యసభ స్థానాలు ఖాళీలు ఉన్నట్లు తెలుస్తోంది. అందులో రెండు టీడీపీకి ఉండగా.. మిగిలిన రెండింటిని జనసేన, బీజేపీ పంచుకోనున్నాయి. 

రాజ్యసభకు ఇప్పుటికే ఎంపీగా ఉన్న సానా సతీష్ ఎంపికను మరోసారి పునరుద్ధరిస్తూ ఖరారు చేయగా.. ఇప్పుడు మరోస్థానంలో ప్రముఖ ఫార్మా కంపెనీకి చెందిన ఓ ప్రముఖ వ్యాపారవేత్తను ఎంచుకున్నట్లు తెలుస్తోంది. అలాగే భారతీయ జనతా పార్టీ నుంచి తమిళనాడు లీడర్ అన్నామలై లేదా మందకృష్ణ మాదిగను ఆ స్థానంలో పంపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 

అయితే జనసేన పార్టీ విషయానికొస్తే.. రాజ్యసభ స్థానానికి గానూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇద్దరి పేర్లను పరిశీలిస్తున్నట్లు సమాచారం. అందులో పారిశ్రామికవేత్త లింగమనేని రమేష్ పేరు గట్టిగా వినిపిస్తోంది. అలాగే టాలీవుడ్ నుంచి మరో స్టార్ ప్రొడ్యూసర్ పేరు కూడా జనసేనాని పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఇటీవలే తెలుగు సినిమా ఇండస్ట్రీలో వరుస సినిమాలను నిర్మిస్తున్న ఓ ప్రముఖ నిర్మాతను జనసేన పార్టీ నుంచి రాజ్యసభకు పంపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఇందులో నిజాలేంటో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచిచూడక తప్పదు.

Also Read: Ravindra Jadeja Kuldeep Yadav: బ్యాట్‌తో కుల్దీప్ ముఖంపై కొట్టబోయిన జడేజా..ఐపీఎల్ మ్యాచ్‌లో ఊహించని సంఘటన..

Also Read: Trump Nobel Prize: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు నోబెల్ బహుమతి?! 287 మందిలో ఒక్కడిగా..

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report
Advertisement
Advertisement
Back to top