విద్య మాత్రమే సమాజాన్ని , దేశాన్ని మారుస్తుంది రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు
కేవలం విద్య మాత్రమే సమాజాన్ని , దేశాన్ని మారుస్తుంది రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. అంతర్జాతీయ స్థాయిలో విద్య ప్రమాణాలతో మెరుగుపడాల్సిన అవసరం ఉందని. ఆ దిశగా విద్యార్థులు రాణించాల్సిన అవసరం ఉందన్నారు. హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో ఎగ్జిబిషన్ సొసైటీ నిర్వహిస్తున్న వనిత మహావిద్యాలయా ఫార్మసీ కాలేజీ సిల్వర్ జూబ్లీ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో మంత్రి శ్రీధర్ బాబు ముఖ్య అతిధిగా హాజరయి మాట్లాడారు.
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Revanth Reddy 1 50 Lakh Crore Corruption: తెలంగాణలో తన కుంభకోణాలు, అవినీతి గురించి ప్రశ్నిస్తే రేవంత్ రెడ్డి బెదిరింపులకు దిగుతున్నారని బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మైనింగ్ అక్రమాలను ప్రశ్నించిన సందర్భంలో కూడా ప్రతిపక్షాన్ని బెదిరించే ధోరణి ప్రదర్శించారని గుర్తుచేశారు. రేవంత్ రెడ్డికి బెదిరింపులు అలవాటైపోయాయని.. అలాంటి బెదిరింపులకు బీఆర్‌ఎస్ పార్టీ ఎప్పటికీ భయపడదని స్పష్టం చేశారు.
Also Read: Sports Meet: అన్ని స్టేడియాలను అభివృద్ధి చేస్తాం.. స్పోర్ట్స్ మీట్‌లో రేవంత్ రెడ్డి
హైదరాబాద్‌లోని బీఆర్‌ఎస్ పార్టీ ప్రధాన కార్యాలయం తెలంగాణ భవన్‌లో శనివారం జరిగిన బీఆర్‌ఎస్‌వీ సమావేశంలో కేటీఆర్ కీలక ప్రసంగం చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలుకు ఒక్క రూపాయి లేదని చెప్పే రేవంత్ రెడ్డి.. తన అవినీతి సొమ్ముల కోసం మూసీ పేరిట రూ.లక్షన్నర కోట్లు ఖర్చు చేస్తానని చెప్పడం దారుణమని మండిపడ్డారు. కేసీఆర్ ప్రభుత్వం రూ.16 వేల కోట్లతో రూపొందించిన సమగ్ర ప్రణాళికను పక్కన పెట్టి భారీ అంచనాలతో అవినీతి కార్యక్రమాన్ని చేపట్టడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపణలు చేశారు.
Also Read: IPL 2026: ఐపీఎల్ ప్రారంభం వేళ సజ్జనార్ కీలక విజ్ఞప్తి.. వారికి సీరియస్ వార్నింగ్
కేసీఆర్ ప్రభుత్వం మూసీ నదిలో మురుగునీటి శుద్ధి కేంద్రాల నిర్మాణాన్ని దాదాపుగా పూర్తి చేసిందని.. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీటిని మూసీలోకి పంపించే ప్రణాళిక కూడా సిద్ధంగా ఉందని గుర్తుచేశారు. అయినప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం అంచనాలను అనవసరంగా పెంచి అవినీతికి మార్గం సుగమం చేస్తోందని విమర్శించారు. మూసీ ప్రాజెక్ట్ పేరుతో లక్షలాది ఇళ్లను కూల్చివేయడానికి దాదాపు 3000 ఎకరాల భూమిని సేకరించి కార్పొరేట్ కంపెనీలకు అప్పగించే ప్రయత్నం జరుగుతోందని కేటీఆర్ ఆరోపించారు. మూసీ ఒడ్డున ఉన్న ఇళ్లు చట్ట విరుద్ధమని చెప్పే ప్రభుత్వం.. అదే ప్రాంతంలో భారీ హోటళ్లు, బిజినెస్ సెంటర్లు నిర్మించాలనుకోవడం ద్వంద్వ వైఖరి అని మండిపడ్డారు.
Also Read: Hyderabad Police: ర్యాపిడో ఆటోలో బంగారం బ్యాగ్.. అర్ధగంటలో తెచ్చి ఇచ్చిన హైదరాబాద్ పోలీసులు
మూసీ పేరిట జరుగుతున్న అవినీతి చర్యలను జాతీయ స్థాయి ప్రముఖులు కూడా వ్యతిరేకిస్తున్నారని మాజీ మంత్రి కేటీఆర్ గుర్తుచేశారు. అయినా ఇప్పుడు దేవుడి పేరును ఉపయోగించి ప్రజలను మోసం చేసే ప్రయత్నం జరుగుతోందని విమర్శించారు. తాను చేస్తున్న అవినీతి ప్రశ్నిస్తే శివతాండవం చేస్తానని మాట్లాడటం రేవంత్ రెడ్డి అహంకారానికి నిదర్శనమని తెలిపారు. రేవంత్ రెడ్డి తన అధికార అహంకారాన్ని తగ్గించుకొని.. మూసీ ప్రాజెక్ట్‌ను ప్రజలకు ఇబ్బంది కలగకుండా అమలు చేయాలని తెలిపారు.
ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రం పిచ్చోడి చేతిలో రాయిలాగా మారిందని మాజీ మంత్రి కేటీఆర్ దుయ్యబట్టారు. ఎన్నికల సమయంలో అభయహస్తం పేరుతో ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రజలను మోసం చేశారని విమర్శించారు. విద్యార్థులకు విద్యా భరోసా కార్డులు, 2 లక్షల ఉద్యోగాలు, మెగా డీఎస్సీ, ఉర్దూలో ప్రత్యేక డీఎస్సీ, బ్యాక్‌లాగ్ పోస్టుల భర్తీ ఇలా అన్నీ అమలు కాలేదని గుర్తుచేశారు. వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పి రెండున్నరేళ్లు గడిచినా ఒక్కటీ పూర్తిగా అమలు కాలేదని విమర్శించారు. నన్ను కోసినా పైసలు లేవు అనే రేవంత్ రెడ్డి మూసీ కోసం మాత్రం రూ.లక్షల కోట్లు ఉన్నాయని చెప్పడం ప్రజలను మోసం చేయడమేనని మాజీ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Telangana Legislators Sports Meet 2026: 'నిత్యం రాజకీయాల్లో మునిగి తేలుతూ.. నిరంతరం సమస్యలంపరిష్కారం కోసం విరామం లేకుండా పనిచేసే వారికి ఇది అద్భుతమైన అవకాశం. ఇక్కడ అద్భుతంగా ఆడకపోవచ్చు.. కానీ అద్భుతమైన క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించడానికి ఎల్బీ స్టేడియం వేదిక అవుతుంది. ఈ మైదానంలో శిక్షణ పొందిన వారు మంత్రివర్గంలో ఉన్నారు. క్రికెట్‌లో దేశానికి వన్నె తెచ్చిన అజారుద్దీన్ మంత్రివర్గ సభ్యులుగా ఉన్నారు.
Also Read: IPL 2026: ఐపీఎల్ ప్రారంభం వేళ సజ్జనార్ కీలక విజ్ఞప్తి.. వారికి సీరియస్ వార్నింగ్
హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో ఏర్పాటుచేసిన ప్రజాప్రతినిధుల క్రీడా పోటీల కార్యక్రమంలో ముఖ్యమంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. 'రంజీ క్రికెట్ మ్యాచ్ ఆడిన వాకిటి శ్రీహరి క్రీడా శాఖ మంత్రిగా ఉన్నారు. ఒకప్పుడు క్రీడలకు ఎంతో ప్రాధాన్యం ఉండేది. కానీ తెలంగాణ ఏర్పడిన తరువాత క్రీడా స్ఫూర్తి కరువైంది. అందుకే ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక స్పోర్ట్స్ పాలసీని తీసుకొచ్చాం' అని తెలంగాణ సీఎం వివరించారు. మట్టిలో మాణిక్యాలను వెలికి తీయాలని సీఎం కప్ పోటీలను నిర్వహించామని చెప్పారు. 140 కోట్ల జనాభా ఉన్న మన దేశం ఒలంపిక్స్ లో ఒక్క పతకం సాధించలేదని గుర్తుచేశారు.
Also Read: Hyderabad Police: ర్యాపిడో ఆటోలో బంగారం బ్యాగ్.. అర్ధగంటలో తెచ్చి ఇచ్చిన హైదరాబాద్ పోలీసులు
'3 కోట్ల జనాభా ఉన్న సౌత్ కొరియా 32 గోల్డ్ మెడల్స్ తెచ్చుకుంది. సౌత్ కొరియా స్పోర్ట్స్ యూనివర్సిటీకే 16 గోల్డ్ మెడల్స్ వచ్చాయి. క్రీడాకారులను రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రోత్సహిస్తోంది' అని రేవంత్ రెడ్డి తెలిపారు. 'విద్యార్థులకు నేను ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నా. చదువుతో పాటు క్రీడల్లో ఆసక్తి పెంచుకుని రాణించండి. క్రీడా స్ఫూర్తిని నింపేందుకే ప్రపంచ ఫుట్ బాల్ దిగ్గజం మెస్సీని హైదరాబాద్ తీసుకొచ్చాం' అని వివరించారు. దీనిపై ప్రతిపక్ష నాయకులు వివాదం సృష్టించే ప్రయత్నం చేశారని.. ఫుట్‌బాల్ దిగ్గజం హైదరాబాద్‌కు వస్తే మన ఖ్యాతి ప్రపంచానికి తెలిసింది. కానీ ప్రతిపక్ష నాయకులు డ్రగ్ లాడ్ కింగ్‌ను రాష్ట్రానికి పిలవాలని భావిస్తున్నారో నాకు తెలియదు' అని చెప్పారు.
'ఫామ్‌హౌస్ పార్టీలకు దూరంగా.. మత్తుకు దూరంగా ఉండాలని క్రీడలను ప్రోత్సహిస్తున్నాం. ఎల్బీ స్టేడియం రాజకీయ కార్యకలాపాలకే పరిమితమైంది. ఎల్బీ స్టేడియాన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నాం. గచ్చిబౌలి స్టేడియాన్ని ప్రపంచ క్రీడా పోటీలు నిర్వహించేలా అభివృద్ధి చేయబోతున్నాం. బేగంపేట హాకీ క్రీడా మైదానాన్ని ప్రభుత్వం అభివృద్ధి చేస్తుంది' అని తెలంగాణ సీఎం వెల్లడించారు. ఫుట్‌బాల్‌లో గతంలో దేశానికి మెడల్స్ తెచ్చిన ఏడుగురిలో 4 గురు మన ప్రాంతానికి చెందినవారు ఉన్నారని.. మళ్లీ ఆ స్థాయికి క్రీదా స్ఫూర్తిని నింపి క్రీడాకారులను తయారు చేయాలని సంకల్పించామని చెప్పారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Harish rao fires on cm revanth reddy govt in assembly session: తెలంగాణ రాజకీయాలు మరోసారి హీటెక్కాయి. ఈక్రమంలో ఇప్పటికే ఎక్కడ చాన్స్ దొరికిన అధికార, అపోసిషన్ పార్టీలు తరచుగా మాటల యుద్దంకు దిగుతాయి. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో హరీష్ రావు రాఘవ కన్స్ట్రక్షన్స్ వివాదంపై మంత్రి పొంగులేటిపై సంచలన ఆరోపణలు చేశారు. రాఘవ పేరు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తండ్రి పేరన్న సంగతి అందరికి తెలుసన్నారు. అదే విధంగా...మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి భార్య, కొడుకు, తమ్ముడు.. దూరపు బంధువులు ఎలా అవుతారని ఏకీపారేశారు. రాఘవ కన్స్ట్రక్షన్స్ డైరెక్టర్లుగా ఉన్నది పొంగులేటి సతీమణి మాధురి, కొడుకు హర్ష రెడ్డి, తమ్ముడు ప్రసాద్ రెడ్డేనని స్పష్టం చేశారు. అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్ అసత్యాలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
సభను సీఎం రేవంత్ తప్పుదోవ పట్టించారని ఎద్దేవా చేశారు. సభలో కాంగ్రెస్ సర్కార్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుందని అన్నారు. అక్రమాలపై ప్రశ్నిస్తే డొంకతిరుగుడు సమాధానాలా?.. అంటూ కాంగ్రెస్ పై ఫైర్ అయ్యారు. రాఘవ కన్స్ట్రక్షన్స్ అవినీతి, అక్రమాలపై ప్రభుత్వం తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తుందన్నారు.
జవాబుదారీతనం లేకుండా సభలో దాటవేత ధోరణి ప్రదర్శిస్తున్న కాంగ్రెస్ పాలకుల తీరు శోచనీయమన్నారు. దీనికి కౌంటర్ గా సీఎం రేవంత్ రెడ్డి సైతం రాఘవ కన్స్ట్రక్షన్ పై సీబీ సిఐడి విచారణ జరిపిస్తామన్నారు. రాఘవ కన్స్ట్రక్షన్ కు సివరేజ్ ఫీజు కట్టిందని స్పష్టం చేశారు.
Read more: IPL 2026: ఐపీఎల్ ప్రారంభం వేళ సజ్జనార్ కీలక విజ్ఞప్తి.. వారికి సీరియస్ వార్నింగ్
ఇది వారు ఫిర్యాదు చేస్తే తీసుకున్న చర్య కాదని.. ఆ సంస్థ నుంచి రావాల్సిన బకాయిలు ప్రభుత్వం రాబట్టుకుందని సీఎం రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. మొత్తంగా రాఘవ కన్స్ట్రక్షన్స్ అంశం తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.
RCB Vs SRH Match Preview: ఐపీఎల్ 2026 సీజన్ నేడు మార్చి 28న అట్టహాసంగా ప్రారంభం కానుంది. ఈ మెగా టోర్నమెంట్‌లోని తొలి మ్యాచ్ బెంగళూరులోని చిన్నస్వామి క్రికెట్ స్టేడియంలో జరగనుంది. ఈ మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), మాజీ ఛాంపియన్ సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) తలపడనున్నాయన్న సంగతి తెలిసిందే. గత సీజన్‌లో అద్భుత ప్రదర్శనతో టైటిల్ గెలుచుకున్న RCB ఆత్మవిశ్వాసంతో ఉండగా, గణాంకాల పరంగా హైదరాబాద్ బలంగా కనిపిస్తోంది.
ఐపీఎల్ చరిత్రలో బెంగళూరు, హైదరాబాద్ జట్లు ఇప్పటి వరకు 26 సార్లు తలపడ్డాయి. సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు 13 మ్యాచ్‌లు గెలవగా, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్ 11 మ్యాచ్‌లు గెలిచింది. అందులో మిగిలిన 2 మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి. ఈ గణాంకాలను పరిశీలిస్తే ఆర్సీబీపై సన్‌రైజర్స్ జట్టు ఆధిపత్యం పుష్కలంగా కనిపిస్తోంది.
ఆర్సీబీ బలాబలాలు..
రజత్ పాటిదార్ కెప్టెన్సీలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గత సీజన్‌లో కప్ గెలిచి చరిత్ర సృష్టించింది. 18 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత వారు తొలిసారిగా ఐపీఎల్ ట్రోఫీని కైవసం చేసుకున్నారు. ఈసారి కూడా ఆర్సీబీ జట్టు చాలా బలంగా కనిపిస్తోంది. ముఖ్యంగా బ్యాటింగ్ విభాగంలో.. విరాట్ కోహ్లీ, ఫిల్ సాల్ట్ జోడి ప్రత్యర్థి బౌలర్లకు పీడకలగా మారనుంది. గత సీజన్‌లో వీరిద్దరూ జట్టుకు ఘోరమైన ఆరంభాన్ని అందించారు.
అతనితో పాటు దేవదత్ పడిక్కల్ ఇటీవలే దేశవాళీ క్రికెట్‌లోనూ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఈసారి అతను మూడో స్థానంలో బ్యాటింగ్ చేసే అవకాశం ఉంది. వీరి తర్వాత టిమ్ డేవిడ్, జితేష్ శర్మ, రొమారియో షెపర్డ్ వంటి భారీ హిట్టర్లు జట్టుకు అదనపు బలాన్ని ఇస్తున్నారు. వెంకటేష్ అయ్యర్ చేరికతో జట్టు మరింత సమతుల్యంగా మారింది.
ఆర్సీబీలో బలమైన బ్యాటింగ్ లైనప్ ఉన్న తర్వాత ఆర్సీబీ బౌలింగ్ విషయంలో కొన్ని సవాళ్లను ఎదుర్కొంటోంది. జట్టు కీలక పేసర్ జోష్ హేజిల్‌వుడ్ తొలి కొన్ని మ్యాచ్‌లకు అందుబాటులో లేడు. ఇది జట్టుకు పెద్ద దెబ్బ. హేజిల్‌వుడ్ లేని లోటును సీనియర్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ పూరించాల్సి ఉంటుంది. ఇప్పుడు భువి ఫాస్ట్ బౌలింగ్ యూనిట్ పూర్తి బాధ్యత తీసుకుంటున్నాడు. అదే విధంగా ఈ సీజన్‌లో యశ్ దయాల్ కూడా దూరంగా ఉన్నాడు. దీంతో న్యూజిలాండ్ పేసర్ జాకబ్ డఫీ ప్రదర్శన ఆర్సీబీకి చాలా కీలకం. స్పిన్ విభాగంలో కృనాల్ పాండ్యా ఆల్‌రౌండ్ ప్రదర్శనపై జట్టు ఆశలు పెట్టుకుంది.
సన్‌రైజర్స్ బలాబలాలు..
సన్‌రైజర్స్ హైదరాబాద్ మరోసారి తమ టాప్ ఆర్డర్ బ్యాటింగ్‌పైనే ఎక్కువగా ఆధారపడుతోంది. అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్ వంటి ముగ్గురు విధ్వంసకర ఆటగాళ్లతో ఎస్‌ఆర్‌హెచ్ బ్యాటింగ్ లైనప్ బలంగా ఉంది. రెగ్యులర్ కెప్టెన్ పాట్ కమిన్స్ అందుబాటులో లేకపోవడంతో, ప్రారంభ మ్యాచ్‌లలో ఇషాన్ కిషన్ జట్టును నడిపించే అవకాశం ఉంది. గత సీజన్‌లో హెన్రిచ్ క్లాసెన్ అత్యధిక పరుగులు సాధించాడు. అనికేత్ వర్మ గతేడాది ఫినిషర్‌గా తనదైన ముద్ర వేశాడు. ఈసారి నితీష్ కుమార్ రెడ్డి, లియామ్ లివింగ్‌స్టన్ వంటి ఆటగాళ్లపై భారీ అంచనాలు ఉన్నాయి. వీళ్లిద్దరూ బాగా రాణిస్తే, హైదరాబాద్ భారీ స్కోరు సాధించడం ఖాయం.
బ్యాటింగ్‌తో పోలిస్తే సన్‌రైజర్స్ బౌలింగ్ విభాగం కొంచెం బలహీనంగా ఉన్నట్లు కనిపిస్తుంది. పాట్ కమిన్స్ లేకపోవడం జట్టుకు పెద్ద లోటు అనే చెప్పాలి. ఇషాన్ మలింగ, హర్షల్ పటేల్, జయదేవ్ ఉనద్కత్ ఫాస్ట్ బౌలింగ్‌ను ముందుండి నడిపించాల్సి ఉంటుంది. డెత్ ఓవర్లలో హర్షల్ పటేల్ కీలకంగా మారతాడు. హైదరాబాద్ జట్టులో స్పిన్ విభాగంలో పెద్ద ఆటగాళ్లు ఎవరూ లేరు. మొత్తంగా, నేటి మ్యాచ్‌లో ఏం జరుగుతుందో వేచి చూడాలి.
Also Read: Amaravati Farmers: అసెంబ్లీలో అమరావతి బిల్లు ఆమోదానికి ముందే కేంద్రం గుడ్ న్యూస్..రైతులకు ఇక పండగే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Badminton Video: వీరు కదా అసలైన చాంపియన్లు.. చెప్పులతో బ్యాడ్మింటన్ ఆడుతున్న చిన్నారుల వీడియో వైరల్!
Badminton Video Watch: ప్రతిభకు పేదరికం అడ్డు కాదని.. క్రీడల పట్ల ఆసక్తి ఉంటే సౌకర్యాలు లేకపోయినా అద్భుతాలు చేయవచ్చని ఇద్దరు చిన్నారులు నిరూపించారు.. సాధారణంగా బ్యాడ్మింటన్ ఆడాలంటే చేతిలో ఖరీదైన బ్యాట్లు, మంచి షటిల్ కాకులు ఎంతగానో అవసరం ఉంటాయి. కానీ ఈ బుజ్జి ఆటగాళ్లు మాత్రం తమ దగ్గర ఉన్న వస్తువులతోనే అద్భుతమైన క్రీడా స్ఫూర్తిని చాటడం ఆశ్చర్యం కలిగిస్తోంది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతూ.. సోషల్ మీడియా వినియోగదారుల ప్రశంసలను అందుకుంటుంది..
వైరల్ అవుతున్న వీడియో వివరాల్లోకి వెళితే.. ఇద్దరు పిల్లలు ఒక చిన్న ప్లేగ్రౌండ్‌లో బ్యాడ్మింటన్ ఆడుతూ కనిపిస్తారు.. అయితే, వారి చేతుల్లో బ్యాట్లు లేవు.. వాటికి బదులుగా తమ కాలి చెప్పులను చేతుల్లో పట్టుకొని.. వాటినే బ్యాడ్మింటన్సుగా వాడుతున్నారు.. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ఒక పాడైపోయిన షటిల్ కాకును వారు ఆడుతున్న తీరు ప్రొఫెషన్ ఆటగాళ్లని తలపిస్తోంది. ఎక్కడ వేగం తగ్గకుండా.. కాకు కింద పడకుండా ఒకరికొకరు షాట్లు కొట్టుకుంటూ.. ఎంతో ఏకాగ్రతతో ఆడుతున్నారు..
ఈ వీడియో చూసిన సోషల్ మీడియా వినియోగదారులు.. ఆ పిల్లల ప్రతిభను చూసి ఫీదా అవుతున్నారు.. ఆట మీద ఇష్టమే వారిని ఇలా ఆడిస్తోందని.. నిజమైన క్రీడా స్ఫూర్తి అంటే ఇదే అంటూ చాలామంది కామెంట్లతో ముంచేత్తుతున్నారు.. వస్తువులు లేవని కుంగిపోకుండా. ఉన్న వాటితోనే ఆనందాన్ని వెతుక్కుంటూ.. ఆడుతున్న ఈ చిన్నారుల వీడియోను ప్రముఖులు సైతం షేర్ చేస్తున్నారు. వీరికి సరైన శిక్షణతో పాటు వసతులు కల్పిస్తే భవిష్యత్తులో గొప్ప క్రీడాకారులుగా ఎదుగుతారని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
Read more: Viral Video: ముక్కుతో సిగరెట్ తాగడమేంటి? ఈ వీడియో ఒకసారి చూడండి..
ప్రస్తుతం ఈ వీడియో వివిధ సోషల్ మీడియాల్లో వైరల్ అవుతూ వస్తోంది.. దీనిని లక్షలాదిమంది వీక్షించడమే కాకుండా వేల సంఖ్యలో లైక్ చేస్తూ షేర్ కూడా చేస్తున్నారు.. ఏ ఆడంబరాలు లేని ఈ స్వచ్ఛమైన క్రీడా చూస్తుంటే చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయని చాలామంది రీ పోస్ట్ కూడా చేస్తున్నారు. ముఖంపై చిరునవ్వుతో.. చెప్పులతోనే వారు చేస్తున్న ఆ విన్యాసం నేటి తరానికి గొప్ప సందేశాన్నిస్తోంది.. వస్తువులు ఏదైతేనేం.. గురి తప్పలేదు.. సంకల్పం వీడలేదు అన్నట్లుగా సాగుతున్న వీరి ఆట సోషల్ మీడియాలో ఇప్పుడు పెద్ద సెన్సేషన్‌గా మారింది..
Read more: Viral Video: ముక్కుతో సిగరెట్ తాగడమేంటి? ఈ వీడియో ఒకసారి చూడండి..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Delivery Boy Stealing Chocolate Video: నేటి కాలంలో ఏది కావాలన్నా ఆన్లైన్లో ఆర్డర్ చేసి నిమిషాల్లో ఆర్డర్ చేస్తే నిమిషాల్లో ఇంటి ముందుకు వస్తుంది. ముఖ్యంగా ఫుడ్ నుంచి కిరాణా సామాగ్రి వరకు అన్ని డెలివరీ సర్వీసులు మన జీవితంలో భాగమైపోయాయి.. అయితే వినియోగదారులు కంపెనీల పై ఉంచే నమ్మకాన్ని కొందరు డెలివరీ బాయ్స్ తగ్గించే ప్రయత్నాన్ని చేస్తున్నారు. తాజాగా ఓ డెలివరీ బాయ్ కస్టమర్ ఆర్డర్ నుంచి వస్తువును దొంగలిస్తూ అడ్డంగా దొరికిపోయిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ గా మారింది..
వైరల్ అవుతున్న వీడియో వివరాల్లోకి వెళ్తే.. ఒక ప్రముఖ డెలివరీ సంస్థకు చెందిన ఏజెంట్.. కస్టమర్ ఆర్డర్ చేసిన వస్తువులను డెలివరీ చేయడానికి ఒక అపార్ట్మెంట్ వద్దకు చేరుకున్నాడు.. ఇంటి బయట వేచి ఉన్న సమయంలో.. చుట్టుపక్కల ఎవ్వరూ లేరని గమనించిన అతను మెల్లగా ఆర్డర్ ప్యాక్‌ను తెరిచారు.. అందులో ఉన్న ఒక చాక్లెట్ ను బయటకు తీసి తన జేబులో వేసుకున్నాడు. ఆ తర్వాత ఏమీ తెలియనట్టుగా ప్యాకెట్‌ను మళ్ళీ యధావిధిగా సర్ది కస్టమర్కు ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు..
Read more: Viral Video: ముక్కుతో సిగరెట్ తాగడమేంటి? ఈ వీడియో ఒకసారి చూడండి..
డెలివరీ బాయ్ తనను ఎవరు గమనించడం లేదనుకున్నాడు కానీ.. అదే బిల్డింగ్ పై అంతస్తులు ఉన్న ఒక వ్యక్తి ఇదంతా గమనించాడు.. వెంటనే తన మొబైల్‌ను తీసి ఆ డెలివరీ బాయ్ చేస్తున్న పనిని చిత్రీకరించాడు.. ఆర్డర్ నుంచి వస్తువులను తీసి జేబులో వేసుకోవడం ఆ వీడియోలో ఎంతో స్పష్టంగా కనిపిస్తోంది. సదరు వ్యక్తి ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అధికాస్త క్షణాల్లో వైరల్ గా మారింది.. ఇది చూసిన వినియోగదారుల సైతం ఆశ్చర్యానికి గురవుతూ ఉన్నారు..
వీడియో చూసిన సోషల్ మీడియా వినియోగదారులు సదరు డెలివరీ బాయ్‌పై మండిపడుతున్నారు.. మేము డెలివరీ చార్జీలతో పాటు టిప్పులు ఇస్తున్నప్పుడు ఇలాంటి పనులు చేయడం ఎంతవరకు మంచిది.. అని కొంతమంది ప్రశ్నిస్తుంటే.. మరి కొంతమంది మాత్రం పాపం ఆకలి వేసి.. తీసుకున్నాడేమో అని ఆ డెలివరీ బాయ్ ని వెనకేసుకొస్తున్నారు.. కానీ ఈ వీడియో చూసిన చాలా మంది మాత్రం విపరీతంగా షేర్ చేస్తున్నారు.. ఇలాంటి ఘటనాల వల్ల నిజాయితీగా పని చేసే ఇతర డెలివరీ బాయ్స్ పరుగు పోతోందని కొంతమంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సదరు కంపెనీ దీనిపై స్పందించి ఆ డెలివరీ బాయ్ పై ప్రత్యేకమైన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు..
Read more: Viral Video: ముక్కుతో సిగరెట్ తాగడమేంటి? ఈ వీడియో ఒకసారి చూడండి..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Redneck Keelback Snake Found In India: ప్రకృతి ఒడిలో దాగి ఉన్న అనేక రహస్యాలు శాస్త్రవేత్తలకు ఎన్నో సవాళ్లను విసురుతుంది. అయితే ఇప్పుడు వైల్డ్‌లైఫ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (WII) శాస్త్రవేత్తలు కనుగొన్న రెండు కొత్త జాతుల కీల్‌బ్యాక్ పాములు ఈ జాబితాలో చేరాయి. ప్రపంచ జీవవైవిధ్య పటంలో భారతదేశానికి ఎంతో గొప్ప స్థానం ఉంది. భారత్‌లో అడవులు, పర్వతాలు, చిత్తడి నేలలు వేలాది అరుదైన జంతువులు, పక్షులకు నిలయంగా ఉన్నాయి.
ముఖ్యంగా పాముల విషయానికి వస్తే.. భారతదేశంలో 500 కంటే ఎక్కువ విభిన్న జాతుల పాములు నివసిస్తున్నాయి. సాధారణ ప్రజలు పాములకు భయపడటం సహజం. కానీ నిజానికి, మన దేశంలో కనిపించే మొత్తం పాములలో కేవలం 60 జాతులు మాత్రమే విషపూరితమైనవిగా ఉన్నాయి. మిగిలిన పాము జాతులన్నీ పర్యావరణ సమతుల్యతను కాపాడటంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి.
ఇటీవలి ఈ ముఖ్యమైన పరిశోధన ప్రకారం.. ఈశాన్య భారతదేశంలోని అడవులలో రెండు కొత్త జాతుల కిల్‌బ్యాక్ పాములను కనుగొన్నారు. ఈ పాములు ఇంతకుముందు మయన్మార్ వంటి పొరుగు దేశాలలో మాత్రమే కనిపించేవని జంతు పరిశోధన శాస్త్రవేత్తలు తెలిపారు. కానీ ఇప్పుడు మిజోరంలోని న్గేగ్పుయ్ వన్యప్రాణుల అభయారణ్యం, అరుణాచల్ ప్రదేశ్‌లోని నమ్దఫా జాతీయ ఉద్యానవనం వంటి దట్టమైన అటవీ ప్రాంతాలలో ఇవి కనిపించడం పర్యావరణ శాస్త్రవేత్తలలో గొప్ప ఉత్సుకతను రేకెత్తించింది.
వేటాడే జాతికి చెందిన ఈ పాములు చాలా అరుదైనవిగా పరిగణించారు. ఇవి ప్రధానంగా విషరహితమైనవిగా వస్తున్నాయట. నీటి సమీప ప్రాంతాలలో లేదా చిత్తడి నేలల్లో నివసించడానికి ఇష్టపడతాయి. ఆహార గొలుసులో వీటి పాత్ర చాలా పెద్దది.
ఈ కిల్‌బ్యాక్ పాముల శారీరక నిర్మాణం ఇతర సాధారణ పాముల కంటే భిన్నంగా ఉంటుంది. ఇవి లేత ఎరుపు రంగులో ఉండి, వాటి శరీరంపై స్పష్టమైన పొడవైన గీతను కలిగి ఉంటాయి. ఈ పాముల చర్మం నునుపుగా కాకుండా చాలా గరుకుగా ఉంటుంది. ఈ కారణంగానే వీటిని 'కిల్‌బ్యాక్ స్నేక్స్' అని పిలుస్తారు. ఈ పాముల అత్యంత ప్రత్యేక లక్షణం వాటి 'మభ్యపెట్టే' సామర్థ్యం. వాటి చర్మానికి కాంతిని ప్రతిబింబించే గుణం ఉండటం వల్ల, అవి నివసించే పరిసరాల రంగుకు అనుగుణంగా తమను తాము సర్దుబాటు చేసుకుంటాయి.
దీనివల్ల అవి చిత్తడి నేలల్లో లేదా మట్టిలో పూర్తిగా కలిసిపోతాయి. శత్రువుల నుండి తమను తాము రక్షించుకోవడానికి, వేటాడటానికి ఈ లక్షణం వాటికి ఒక వరం. అవి మట్టి రంగుతో సరిపోలడం వల్ల, సాధారణ ప్రజలు లేదా జంతువులు వాటిని గుర్తించడం అంత సులభం కాదు.
Also Read: Amaravati Farmers: అసెంబ్లీలో అమరావతి బిల్లు ఆమోదానికి ముందే కేంద్రం గుడ్ న్యూస్..రైతులకు ఇక పండగే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Amaravati Farmers Tax Exemption: అమరావతి రాజధాని ప్రాంత రైతులకు కేంద్రంలోని మోదీ సర్కారు తీపికబురు చెప్పింది. ఓ పక్క అసెంబ్లీలో అమరావతి రాజధానికి చట్టబద్ధత కల్పిస్తున్న తీర్మానంపై చర్చ జరుగుతున్న క్రమంలో కేంద్రం ఈ ప్రకటన వెలువరించింది. రాజధాని భూసమీకరణలో భాగంగా తమ భూములను ఇచ్చిన రైతులకు ప్రయోజనం చేకూరేలా ఇప్పుడు కీలక నిర్ణయం తీసుకుంది.
అమరావతి రైతుల కోసం క్యాపిటల్ గెయిన్స్‌పై ట్యాక్స్ మినహాయింపు గడువును మరో కొన్నేళ్లు పొడిగించనున్నట్లు తెలిపింది. ఈ నిర్ణయం ప్రకారం.. క్యాపిటల్ గెయిన్స్ టాక్స్ మినహాయింపు గడువును 2031 మార్చి 31 వరకు కొనసాగించనున్నట్లు నివేదికలో తెలిపారు. అయితే ఈ సడలింపు అనేది కేవలం అమరావతి ల్యాండ్ పూలింగ్ స్కీమ్‌లో పాల్గొన్న రైతులకు వర్తించనుందని తెలుస్తోంది.
అయితే సమైఖ్య ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ విడిపోయిన తర్వాత నవ్యాంధ్రప్రదేశ్‌కు రాజధాని అమరావతి నిర్మాణం కోసం రైతులు స్వచ్ఛందంగా భూములను ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అలా భూములు ఇచ్చిన రైతులకు ఆర్థిక భారం తగ్గించేందుకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వారి ఆర్థిక భద్రతకు ఈ నిర్ణయం ఎంతో కీలకంగా మారనున్నట్లు కేంద్రం భావించింది.
ముఖ్యంగా రైతులు తమ భూముల మార్పిడి, ప్లాట్ల కేటాయింపులో వచ్చే పన్ను భారాన్ని తగ్గించడంలో ఈ నిర్ణయం ఎంతో ఉపకరిస్తుంది. ఈ చర్య అమరావతి రైతులకు ఎంతో పెద్ద ఊరటనిచ్చినట్లైంది. భవిష్యత్తులోనూ అమరావతి రాజధాని అభివృద్ధిలో రైతుల భాగస్వామ్యాన్ని మరింత ప్రోత్సహించే విధంగా పన్ను మినహాయింపు నిర్ణయం అనేది తోడ్పడుతుంది. ఏది ఏమైనా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో అమరావతి రైతులు ఆర్థిక భద్రతతో పాటు రాజధాని ప్రక్రియను వేగవంతం చేసే దిశగా అడుగులు వేసినట్లు అవుతుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Say No To Cricket Betting: క్రీడా ప్రపంచంలో ఐపీఎల్‌కు ఉన్నంత క్రేజ్ ఏ ఆటకు లేదు. అలాంటి ఐపీఎల్ సరికొత్త సీజన్ ప్రారంభమవడంతో బెట్టింగ్ రాయుళ్లు పండుగ చేసుకుంటున్నారు. అయితే ఐపీఎల్ 2026పై బెట్టింగ్‌లు పెరిగే అవకాశం ఉండడంతో హైదరాబాద్ పోలీసులు కీలక ప్రకటన చేశారు. ఐపీఎల్‌పై క్రికెట్ బెట్టింగ్ కొనసాగితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఐపీఎల్ బెట్టింగ్ కోసం జీవితాన్ని నాశనం చేసుకోకూడదని యువతకు పోలీసులు సూచించారు.
Also Read: Hyderabad Police: ర్యాపిడో ఆటోలో బంగారం బ్యాగ్.. అర్ధగంటలో తెచ్చి ఇచ్చిన హైదరాబాద్ పోలీసులు
బెట్టింగ్ ఊబిలో పడొద్దు.. బతుకును ఛిద్రం చేసుకోవద్దని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ సూచించారు. ఐపీఎల్ సీజన్ మొదలవుతున్న తరుణంలో క్రికెట్‌ను కేవలం క్రీడగా ఆస్వాదించాలని.. బెట్టింగ్ ఊబిలో పడి జీవితాలను నాశనం చేసుకోవద్దని విజ్ఞప్తి చేశారు. గతంలో బెట్టింగ్ యాప్‌ల నిషేదంపై ప్రచారం చేయడంతో వందలాది యాప్‌లను ప్రభుత్వం నిషేధించిందని తెలిపారు. ఇప్పుడు టెలిగ్రామ్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా వేదికగా ఐపీఎల్ క్రికెట్ దందా కొత్త రూపం దాల్చిందని వెల్లడించారు.
Also Read: KT Rama Rao: మాజీ మంత్రి కేటీఆర్ నిర్ణయం.. ఎమ్మెల్యేల క్రీడా పోటీల బహిష్కరణ
కేవలం డబ్బు కోసం ఇటువంటి ప్రమాదకరమైన యాప్‌లను ప్రమోట్ చేసే సోషల్ మీడియా ఇన్‌ప్లుయెన్సర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని సజ్జనార్ హెచ్చరించారు. ఆన్‌లైన్ మాత్రమే కాకుండా ఫామ్ హౌస్‌లు, రహస్య ప్రాంతాల్లో సాగే ఆఫ్‌లైన్ బెట్టింగ్‌లకు పాల్పడుతుండడంతో వారిపై తమ ప్రత్యేక నిఘా ఉంటుందని తెలిపారు. బెట్టింగ్‌తో అప్పులపాలై కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి తెచ్చుకోవద్దని సూచించారు. మీ పరిసరాల్లో ఎవరైనా బెట్టింగ్‌కు పాల్పడుతున్నట్లు తెలిస్తే వెంటనే డయల్ 100 లేదా వాట్సాప్ నంబర్ 94906 16555 కు సమాచారం ఇవ్వాలని పోలీస్ కమిషనర్ సజ్జనార్ సూచించారు.
ఐపీఎల్ 2026 సీజన్ శనివారం ప్రారంభమైంది. తొలి మ్యాచ్ సన్‌రైజర్స్ హైదరాబాద్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య జరుగుతున్న విషయం తెలిసిందే. గతేడాది చాంపియన్‌గా నిలిచిన ఆర్‌సీబీ మరోసారి ట్రోఫీని సాధించాలనే కసితో ఆడనుండగా.. ఈసారి కూడా అద్భుతమైన ప్రదర్శన చేసి ఈ సీజన్‌లో సత్తా చాటాలని హైదరాబాద్ ఉవ్విళ్లూరుతోంది. మరి ఈ రెండు జట్ల మధ్య జరిగే పోరు ఎలా ఉంటుందనేది ఉత్కంఠ నెలకొంది.
Also Read: Raja Singh: ఇళ్ల మధ్య ఇరుక్కున్న రథం.. నిలిచిపోయిన రాజాసింగ్ శోభయాత్ర
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Gold Bag Recovery: కోటిన్నరకు పైగా జనాభా ఉన్న హైదరాబాద్‌లో శాంతి భద్రతల పరిరక్షణ.. ప్రజల భద్రతను పోలీసులు పకడ్బందీగా చేస్తూ ప్రశంసలు పొందుతున్నారు. పోలీస్ స్టేషన్‌కు వచ్చిన కేసును.. ఫిర్యాదు అందిన వెంటనే విచారణ చేసి అత్యంత వేగంగా పరిష్కారం చూపుతున్నారు. కొన్ని కేసులు ఇలా ఫిర్యాదు చేయగానే ఎఫైఆర్ అయ్యేలోపు పోలీసులు పరిష్కారం చూపుతున్నారు. తాజాగా ఓ మహిళా బంగారు ఆభరణాలు పోగొట్టుకుంటే అర్ధ గంటల్లోనే ఛేదించారు. ఈ సంఘటన లక్డీకాపూల్‌లో జరిగింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Also Read: AP High Court Jobs: ఏపీ నిరుద్యోగులకు పండుగ.. హైకోర్టులో 300 ప్రభుత్వ ఉద్యోగాలు
తమిళనాడు రాష్ట్రానికి చెందిన మణిమేగల ఈ నెల 27వ తేదీన రాత్రి లక్డీకాపూల్ మెట్రో స్టేషన్ బస్టాప్ వద్ద రాపిడో ఆటోలో వచ్చింది. అయితే ఆ సమయంలో తన హ్యాండ్‌బ్యాగ్‌ను ఆటోలోనే మర్చిపోయింది. ఆ బ్యాగ్‌లో సుమారు రూ.4 లక్షల విలువైన బంగారు గాజులు, కమ్మలతో రూ.30 వేల నగదు, ముఖ్యమైన పత్రాలు ఉన్నాయి. మరచిపోయిన విషయం గుర్తుచేసుకునేలోపు ఆటో తుర్రుమంది. ఏం చేయాలో దిక్కుతోచక ఆ మహిళ వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చింది.
Also Read: Telangana PRC: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల ఆశలు గల్లంతు.. పీఆర్‌సీ కమిటీ గడువు మళ్లీ పొడిగింపు
బాధితురాలి ఫిర్యాదుపై సైఫాబాద్ సీఐ సీతయ్య తక్షణమే స్పందించి క్రైమ్ టీమ్‌ను రంగంలోకి దించారు. సాంకేతిక సమాచారంతో ఆటో డ్రైవర్‌ను పోలీసులు గుర్తించారు. చాదర్‌ఘాట్ ప్రాంతంలో ఆటోను గుర్తించి అక్కడి పోలీసులకు సమాచారం ఇచ్చారు. చాదర్‌ఘాట్ పోలీసుల సహాయంతో ఆటోలో హ్యాండ్‌బ్యాగ్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం బ్యాగ్ స్టేషన్‌కు చేరడంతో బాధితురాలు మణిమేగలకు అప్పగించారు. బ్యాగులోని నగదు, ఆభరణాలను సురక్షితంగా అప్పగించడంతో బాధితురాలు హైదరాబాద్ పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.
హైదరాబాద్ మహానగరంలో తాను పోగొట్టుకున్న విలువైన బంగారు ఆభరణాలు, నగదును సైఫాబాద్ పోలీసులు కేవలం 30 నిమిషాల్లోనే రికవరీ చేసి అప్పగించడంతో ఆమె ఆనందంలో ఉంది. ఇలాంటి కేసులు హైదరాబాద్‌లో తరచూ జరుగుతున్నాయి. సాంకేతిక పరిజ్ఞానంతోపాటు పోలీసుల పనితీరుతో అత్యంత వేగంగా కేసులు పరిష్కారమవుతున్నాయి. కొన్ని కేసులు ఎఫ్‌ఐఆర్ అయ్యేలోపు కూడా పరిష్కారమవుతుండడం గమనార్హం. నేరం జరిగిన వెంటనే విచారణ, దర్యాప్తు ప్రారంభిస్తే అంతే వేగంగా కేసు పరిష్కారమవుతుందని హైదరాబాద్ పోలీసులు నమ్ముతున్నారు. ఆ నమ్మకమే హైదరాబాద్ పోలీసుల సక్సెస్ రేటు పెంచుతోంది.
Also Read: Lavanya Drunk: తప్ప తాగి హీరో రాజ్ తరుణ్ మాజీ లవర్ నానా రచ్చ.. తిరగబడ్డ గ్రామస్తులు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Vivo T5 Pro Launch Date India Telugu: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం వివో భారత మార్కెట్‌లోకి మరో శక్తివంతమైన స్మార్ట్‌ఫోన్‌ను ప్రవేశ పెట్టేందుకు సిద్ధమైనట్లు వార్తలు వస్తున్నాయి.. తన పాపులర్ T సిరీస్‌లో భాగంగా వివో టి 5 ప్రో (Vivo T5 Pro) పేరుతో త్వరలోనే సరికొత్త మొబైల్ ను విడుదల చేయబోతోంది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న సాంసంగ్‌తో పాటు వన్ ప్లస్, రెడ్‌మీ దిగ్గజ సంస్థలకు గట్టి పోటీనిస్తూ..ఎన్నో ఊహకందని ఫీచర్లతో అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.. అయితే, ఈ మొబైల్‌కు సంబంధించిన ఫీచర్స్ ఏంటో పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
వివో T5 ప్రో స్మార్ట్ ఫోన్ ఎన్నో రకాల అద్భుతమైన ఫీచర్లతో అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఈ స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన అత్యంత ఆసక్తికరమైన అంశం ఏమిటంటే బ్యాటరీ.. సాధారణంగా స్మార్ట్‌ఫోన్లలో కేవలం 6,000mAh బ్యాటరీని చూసి ఉంటాం.. కానీ ఇందులో ఎంతో శక్తివంతమైన 9,020mAh భారీ బ్యాటరీ ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఈ స్మార్ట్‌ఫోన్ చాలా ప్రత్యేకమైన 90W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో అందుబాటులోకి రావడం విశేషం. అతి తక్కువ సమయంలోనే ఈ భారీ బ్యాటరీని ఛార్జ్ చేసుకోవచ్చు. ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే దాదాపు నాలుగు నుంచి ఐదు రోజుల పాటు నాన్ స్టాప్ బ్యాటరీ లైఫ్ నందిస్తుంది.. అదేవిధంగా ఇందులో ఎన్నో రకాల ప్రీమియం ఫీచర్స్ ఉండబోతున్నాయి.
ముఖ్యంగా ఈ వివో T5 ప్రోలో ఎంతో ప్రత్యేకమైన 6.8 అంగుళాల 1.5K AMOLED డిస్ప్లే ఉండబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ డిస్ప్లే 144Hz రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా వీడియో స్ట్రీమింగ్ ప్రియులకు అద్భుతమైన అనుభూతిని అందిస్తుంది. దీంతోపాటు ఇందులో కంపెనీ ప్రత్యేకమైన ప్రాసెస్ కూడా అందించింది.
Read more: Vivo T4R 5G: Sony కెమెరా, 5700 mAh బ్యాటరీ.. vivo T4R 5G పై కళ్లు చెదిరే డిస్కౌంట్లు!
ఈ వివో T5 ప్రో మొబైల్‌కు సంబంధించిన ప్రాసెస్ వివరాల్లోకి వెళితే.. దీనిని కంపెనీ ఎంతో శక్తివంతమైన Snapdragon 7s Gen 4 చిప్‌సెట్‌పై తయారుచేసినట్లు తెలుస్తోంది. హై ఎండ్ గేమ్లను సైతం ఎంతో సునాయాసంగా హ్యాండిల్ చేయగలుగుతుంది. ముఖ్యంగా మల్టీ టాస్కింగ్ ప్రియులకు ఇది అద్భుతంగా పనిచేస్తుంది.. ఇక ఈ స్మార్ట్‌ఫోన్ వెనక భాగం వివరాల్లోకి వెళితే.. అద్భుతమైన Sony IMX882 ప్రైమరీ సెన్సార్‌తో 50 మెగాపిక్సెల్ కెమెరాతో అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. ఇందులో చాలా ప్రత్యేకమైన 4K వీడియో రికార్డింగ్‌కు సపోర్ట్ లభించడం విశేషం. అంతేకాకుండా ఇది లేటెస్ట్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత OriginOS 6 ఆపరేటింగ్ సిస్టంపై రన్ కాబోతోంది.
ఈ స్మార్ట్‌ఫోన్‌ను గత సంవత్సరం విడుదల చేసిన వివో T4 ప్రోకు సక్సెసర్‌గా.. అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే దీని ధర గత మోడల్ కంటే చాలా ఎక్కువ రేటే ఉండబోతున్నట్లు తెలుస్తోంది. దీనిని కంపెనీ రూ.35 వేలలో వేరియంటును బట్టి అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. కాబట్టి మంచి బ్యాటరీ తో పాటు కెమెరా సెటప్ ను కలిగిన మొబైల్ ని కొనుగోలు చేయాలనుకునేవారు ఇంకొన్ని రోజులపాటు వెయిట్ చేయాల్సి ఉంటుంది.
Read more: Vivo T4R 5G: Sony కెమెరా, 5700 mAh బ్యాటరీ.. vivo T4R 5G పై కళ్లు చెదిరే డిస్కౌంట్లు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
PM Modi inaugurates Noida International Airport in Jewar: ప్రపంచ దేశాలన్ని ప్రస్తుతం ఇరాన్, ఇజ్రాయేల్ ల యుద్దంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఇప్పటికే ఒకవైపు ఎల్పీజీ కొరత మరోవైపు చమురు సమస్యలను ఎదుర్కొంటుంది. హర్మూజ్ జల సంధి నుంచి నౌకలపై ఇరాన్ కొన్ని దేశాల నౌకలకు మాత్రమే అనుమతిస్తుంది. ఈ క్రమంలో భారత్ లో లాక్ డౌన్ విధిస్తున్నారని వదంతులు వ్యాపించాయి. దీనిపై కేంద్రమంత్రి రంగంలోకి దిగి మరీ లాక్ డౌన్ ప్రకటించే ప్రసక్తిలేదని స్పష్టం చేశారు. అలాంటి వాటిని నమ్మకూడదన్నారు. అంతేకాకుండా భారత్ అన్నిరకాలుగా కొరతను ఎదుర్కొవడానికి సమర్థవంతంగా ముందుకు వెళ్తుందన్నారు. ఆహరం, ఇంధనం, ఎల్పీజీ కొరతపై ఆందోళనలు చెందాల్సిన అవసరం లేదని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ స్పష్టం చేశారు. మరోవైపు ప్రధాని మోదీ ఇటీవల ఎన్ని కలు జరుగుతున్న రాష్ట్రాలు మినహా అన్ని రాష్ట్రాల సీఎంలతో వర్చువల్ గా భేటీ అయ్యారు.
ఎల్జీజీ, నిత్యవసర ధరల పెరుగుదలపై చర్చించారు. అంతేకాకుండా సరిహద్దురాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఫెక్ ప్రచారాలను నమ్మకూడదన్నారు. ఉత్తర ప్రదేశ్ లోని నోయిడాలో ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ ను ప్రధాని మోదీ ప్రారంభించారు. డబులు ఇంజీన్ సర్కారు డెవలప్ మెంట్ తో రాష్ట్రాలు ముందుకు వెళ్తున్నాయని అన్నారు. నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణంలో గత ప్రభుత్వాల నిర్లక్ష్యం వహించిందని మోదీ అన్నారు.
నోయిడాలోని జేవన్ ప్రాంతంలో పీపీపీ పద్దతిలో రూ. 11,200 కోట్లతో ఈ విమానశ్రయంను నిర్మిస్తున్నట్లు చెప్పారు. అధునాత నావిగేషన్ సిస్టమ్స్ సాయంతో, 3,900 మీటర్ల పొడవైన ఈ విమానాశ్రయ రన్ వే పై అతి పెద్ద విమానాలు కూడా రాకపోకలు సాగిస్తాయని అన్నారు. సరకు రవాణాకు కార్గో లాజిస్టిక్ జోన్లను అనుసంధానం చేస్తూ మల్టీ మోడల్ కార్గో హబ్ ను నిర్మించినట్లు మోదీ తెలిపారు. గతంలో 2004 నుంచి 2014 మధ్య కాలంలో ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు కేవలం ఫైళ్లకే పరిమితమైందని, అభివృద్ధి పట్ల కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీలకు ఉన్న చిత్తశుద్ధి లేదని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
డబుల్ ఇంజీన్ సర్కారుతో యూపీ మరింతగా ముందుకు వెళ్తుందన్నారు. ఇప్పటికే మౌళిక వసతుల కోసం రూ. 17 లక్షల కోట్లు ఖర్చుచేశామన్నారు. దేశంలో ఉన్న రైల్వే లైన్లలో 40 వేల కి. మీ. మేర విద్యుదీకరణ చేశామన్నారు.
అలాగే ఎన్డీయే హయాంలో పోర్టుల సంఖ్య రెండింతలు పెరిగిందన్నారు. వికసిత్ భారత్ కోసం ప్రతి ఒక్కరు ముందుకు రావాలన్నారు. ఇలాంటి కష్టసమయంలో అపోసిషన్ పార్టీలు దుష్ట రాజకీయాలు చేయోద్దన్నారు. కొన్ని పార్టీలు పనిగట్టుకుని కేంద్రంపై బురద జల్లే ప్రయత్నాలు చేస్తున్నాయని ప్రధాని మోదీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వీరికి ప్రజలు సరైన విధంగా బుద్ది చెప్తారని మాట్లాడారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.
Iphone 200mp Camera Leak News: స్మార్ట్‌ఫోన్ రంగంలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న దిగ్గజ సమస్త యాపిల్.. భవిష్యత్తులో రాబోయే ఐఫోన్ మోడల్ కోసం ఒక భారీ అప్‌గ్రేడ్‌ను సిద్ధం చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటివరకు సాఫ్ట్వేర్ ఆప్టిమైజేషన్‌తో పాటు కంప్యూటేషనల్ ఫోటోగ్రఫీపై దృష్టి పెట్టిన యాపిల్.. ఇప్పుడు మెగాపిక్సెల్స్ పెంచడానికి దృష్టి పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి. తాజాగా లీక్ అయిన సమాచారం ప్రకారం.. యాపిల్ సంస్థ ప్రస్తుతం 200 మెగాపిక్సెల్ కెమెరా సెన్సార్‌ను పరీక్షిస్తోందట.. ఒకవేళ సక్సెస్ అయితే రాబోయే యాపిల్ స్మార్ట్‌ఫోన్స్ అన్ని అద్భుతమైన కెమెరా సెటప్‌తో విడుదలయ్యే అవకాశాలు ఉన్నట్లు లీకైన వివరాలు చెబుతున్నాయి.
ప్రముఖ టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ వెల్లడించిన వివరాల ప్రకారం.. యాపిల్ కంపెనీ భారీ సెన్సార్ ను పరీక్షిస్తుందట.. ఇదే తరహా సెన్సార్ ను ఒప్పో త్వరలో విడుదల విడుదల చేయబోయే Find X9 Ultraలో కూడా వినియోగించినట్లు వార్తలు వస్తున్నాయి. యాపిల్ సాధారణంగా మెగాపిక్సెల్స్ సంఖ్య కంటే పిక్చర్ క్వాలిటీకి ఎక్కువగా ప్రాధాన్యతిస్తూ ఉంటుంది.. అయితే ఆండ్రాయిడ్ ఫోన్లు 200MP కెమెరాలతో మార్కెట్లో సంచలనం సృష్టించడం వల్ల యాపిల్ కూడా తన వ్యూహాన్ని మార్చుకుంటున్నట్లు తెలుస్తోంది..
ఈ ఫీచర్ ప్రస్తుతం టెస్టింగ్ దశలో మాత్రమే ఉంది.. కాబట్టి ఇది ఏ మోడల్‌లో వస్తుందని అంశంపై ఇంకా స్పష్టత లేదు.. వచ్చి ఏడాది రాబోయే ఐఫోన్ 18 సిరీస్‌కు సంబంధించిన లీకులు ఇప్పటికే సోషల్ మీడియాలో చక్కెరలు కొడుతున్నాయి.. వాటిలో ఈ 200MP కెమెరా ప్రస్తావన లేకపోయినప్పటికీ.. కొంతమంది టెక్ నిపుణులు మాత్రం ఇందులోని రాబోతున్నట్లు చెబుతున్నారు. ఇక ఐఫోన్ 19 లేదా ఆ తర్వాత రాబోయే మోడల్లలో ఈ ఫీచర్ అందుబాటులో ఉండే అవకాశాలు ఉన్నట్లు కొంతమంది నిపుణులు భావిస్తున్నారు. అంతేకాకుండా ఈ భారీ సెన్సార్‌ను కేవలం ప్రైమరీ కెమెరాకు మాత్రమే పరిమితం చేయాలని యాపిల్ భావిస్తుందట..
Read more: Vivo T4R 5G: Sony కెమెరా, 5700 mAh బ్యాటరీ.. vivo T4R 5G పై కళ్లు చెదిరే డిస్కౌంట్లు!
ఇప్పటికే యాపిల్ తన 48MP కెమెరా సెన్సార్‌తోనే అత్యుత్తమైన ఫోటోగ్రఫీని అందిస్తూ వస్తోంది.. ఒకవేళ 200MP సెన్సార్ కలిగిన కెమెరా ఫీచర్ మార్కెట్లో అందుబాటులోకి తీసుకువస్తే.. ఐఫోన్ ఫోటోగ్రఫీ స్థాయి మరో స్థాయికి చేరే అవకాశాలున్నాయి. ముఖ్యంగా వెలుతురు తక్కువగా ఉన్న సమయాల్లో కూడా అద్భుతమైన చిత్రాలను తీయడానికి.. 8k వీడియో రికార్డింగ్ సపోర్టును మరింత మెరుగుపరచడానికి ఈ సెన్సార్ ఎంతో సహాయపడుతుందని తెలుస్తోంది. అయితే ఈ కెమెరా సెన్సార్ కు సంబంధించిన వివరాలను త్వరలోనే యాపిల్ కంపెనీ విడుదల చేసే అవకాశాలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది..
Read more: Vivo T4R 5G: Sony కెమెరా, 5700 mAh బ్యాటరీ.. vivo T4R 5G పై కళ్లు చెదిరే డిస్కౌంట్లు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook