సికింద్రాబాద్: బోనాల జాతరకు రావాలని కిషన్ రెడ్డికి ఆహ్వానం
Secunderabad, Telangana:సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల జాతరకు రావాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని ఆలయ ఈవో గుత్తా మనోహర్ రెడ్డి, పూజారులు ఆహ్వానించారు. ఈ సందర్భంగా కృష్ణ రెడ్డి ఇంటికి వెళ్లి ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈనెల 21, 22వ తేదీలలో అత్యంత వైభవంగా బోనాల జాతర నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ చీర సుచిత్ర, పలువురు నాయకులు పాల్గొన్నారు.हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
ATM Sleeping Viral Video: ఏటీఎంలో ఏసీలో దర్జాగా నిద్రపోతున్నాడు.. ఇలా కూడా ఉండారా గురూ!
Hyderabad, Telangana:SBI ATM Sleeping Viral Video: డబ్బు డిపాజిట్, విత్‌డ్రా వంటి వాటి కోసం వినియోగించే ఏటీఎం మెషీన్ దగ్గర ఓ విచిత్రమైన సంఘటన జరిగింది. మనలో చాలామందికి ఏటీఎంలో డబ్బును తీయడం వేయడం వంటి తెలిసే ఉంటుంది. ఆ ఏటీఎంల వద్ద ఎయిర్ కండిషనర్ కూడా ఉంటుందనే విషయం అందరికి తెలిసి విషయమే. అయితే తాజాగా ఉత్తరప్రదేశ్‌లో ఓ వింత ఘటన చోటుచేసుకుంది. ఎండల తాకిడి తట్టుకోలేక ఓ వ్యక్తి ఏటీఎం మెషీన్ ఉండే ఏసీ దగ్గర పడుకొని నిద్రపోయాడు. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఏం జరిగిందంటే?
ఉత్తరప్రదేశ్‌లోని మౌ జిల్లాలో ఏసీ సౌకర్యం ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బిఐ) ఏటిఎమ్ కియోస్క్‌లో ఒక వ్యక్తి నిద్రపోతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో బ్యాంకు ఏటిఎమ్‌లలో భద్రతా ఏర్పాట్లపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. మౌలోని భిటి ప్రాంతంలో ఉన్న ఒక ఎస్బిఐ ఏటిఎమ్‌లో ఈ ఘటన జరిగినట్లు సమాచారం. అక్కడ గుర్తుతెలియని ఒక వ్యక్తి బూత్ నేలపై హాయిగా పడుకుని కనిపించాడు. బయట ఉన్న వేడి, తేమ నుండి రక్షణ కోసం ఏసీ ఉన్న ఆ ప్రదేశాన్ని ఆశ్రయంగా వాడుకుంటున్నట్లు స్పష్టమవుతోంది.
ప్రత్యక్ష సాక్షుల ప్రకారం.. నగదు విత్‌డ్రా చేసుకోవడానికి ఏటిఎమ్‌కు వచ్చిన వినియోగదారులు లోపల ఆ వ్యక్తి నిద్రపోవడాన్ని గమనించారు. వారిలో ఒకరు ఈ దృశ్యాన్ని వీడియో తీసి ఆన్లైన్లో పంచుకున్నారు. సోషల్ మీడియాలో అది వేగంగా వ్యాపించడంతో, ఒక వ్యక్తి ఏటిఎమ్ బూత్‌లో ఎవరికీ కనపడకుండా ఎలా ఉండగలడని చాలామంది ప్రశ్నించడం మొదలుపెట్టారు. ఆ ప్రదేశంలో భద్రతా సిబ్బంది లేకపోవడం అనే విషయంపై కూడా ఈ వీడియో దృష్టిని ఆకర్షించింది.
జీవన్ రామ్ ఇంటర్ కాలేజీకి ఎదురుగా ఉన్న ఆ కియోస్క్ వద్ద సిబ్బంది ఎవరూ లేరని సమాచారం. దీంతో ఆ ప్రదేశంలోని వినియోగదారుల భద్రత, బ్యాంకింగ్ మౌలిక సదుపాయాల భద్రతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఏటీఎం భద్రత బ్యాంకు బాధ్యత అని అధికారులు స్పష్టం చేశారు. బ్యాంకులు తమ సొంత భద్రతా సిబ్బందిని నియమించి, ఏటీఎం కియోస్క్‌ల వద్ద సరైన నిఘా ఉండేలా చూసుకోవాలని, అవసరమైతే పోలీసులు జోక్యం చేసుకోవచ్చని, కానీ తగినంత భద్రతను ఏర్పాటు చేయాల్సిన బాధ్యత బ్యాంకుపైనే ఉంటుందని సిటీ సర్కిల్ ఆఫీసర్ (సీఓ) నితేష్ ప్రతాప్ తెలిపారు.
దేశవ్యాప్తంగా ఏటీఎంలలో దొంగతనాలు, విధ్వంసకాండ కేసులు వెలుగులోకి వస్తున్న నేపథ్యంలో ఈ ఘటన ఏటీఎం భద్రతపై విస్తృత ఆందోళనలను మళ్లీ రేకెత్తించింది. ప్రతి ఆఫ్-సైట్ కియోస్క్ వద్ద ఇరవై నాలుగు గంటల భద్రతా సిబ్బంది తప్పనిసరి కానప్పటికీ, బ్యాంకింగ్ నిబంధనల ప్రకారం పనిచేసే నిఘా వ్యవస్థలు తప్పనిసరిగా ఉండాలి. ఆ వీడియో వైరల్ అయిన తర్వాత.. ఏటీఎం బూత్‌ల దుర్వినియోగాన్ని నివారించడానికి, వినియోగదారులను, ఆస్తులను కాపాడటానికి భద్రతను కట్టుదిట్టం చేయాలని, సీసీటీవీ కవరేజీని పెంచాలని, క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహించాలని స్థానిక నివాసితులు బ్యాంకుకు పిలుపునిచ్చారు.
Also Read: "భవిష్యత్తు అంతా హైడ్రోజన్దే"..చారిత్రాత్మక రైలు ఆవిష్కరణ ఘట్టంలో ప్రధాని మోదీ!
ALso REad: Metro Lovers Kissing: మెట్రో రైలులో లవర్స్ ముద్దులాట..బూతులు తిడుతున్న ప్రయాణికులు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Supreme Court Voter: ఓటరు లిస్టులో పేరు లేకపోతే పౌరసత్వం పోయినట్టేనా? సుప్రీంకోర్టు సంచలన తీర్పు!
New Delhi, Delhi:Supreme Court Voter List: ఓటరు జాబితాలో పేరు లేనంత మాత్రాన ఎవరూ తమ భారత పౌరసత్వాన్ని కోల్పోరని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. పశ్చిమ బెంగాల్లో చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియకు వ్యతిరేకంగా దాఖలైన ఒక పిటిషన్‌ను విచారించిన సందర్భంగా సర్వోన్నత న్యాయస్థానం ఈ కీలక వ్యాఖ్యలు చేసింది. ఒక వ్యక్తి పౌరసత్వాన్ని నిర్ధారించే అంతిమ అధికారం భారత ఎన్నికల సంఘానికి (ECI) లేదని కోర్టు తేల్చి చెప్పింది. ఈ పిటిషన్‌ను భారత ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్, జస్టిస్ జయమాల్య బాగ్చి, జస్టిస్ వి.మోహనలతో కూడిన ధర్మాసనం విచారించింది.
సుప్రీంకోర్టు క్లారిటీ..
ఒక వ్యక్తి భారత పౌరుడా, కాదా అని నిర్ణయించే తుది అధికారం ఎన్నికల సంఘానికి లేదని ధర్మాసనం స్పష్టం చేసింది. ఓటరు జాబితాలో పేరు లేకపోవడం అనేది కేవలం ఆ వ్యక్తికి ప్రస్తుతానికి 'ఓటు హక్కు' లేదని మాత్రమే సూచిస్తుంది. అంతే తప్ప, అది పౌరసత్వాన్ని రద్దు చేసే పత్రం కాబోదని న్యాయస్థానం తేల్చి చెప్పింది.
ఎన్నికల ప్రక్రియ కోసం ఈసీ చేసే వెరిఫికేషన్ కేవలం ఓటర్ల జాబితా రూపకల్పనకు మాత్రమే పరిమితమని పేర్కొంది. గతంలో బీహార్ SIR కేసులో ఇచ్చిన తీర్పులోనే ఈ విషయాన్ని తాము స్పష్టం చేశామని కోర్టు గుర్తు చేసింది.
నిలిచిపోతున్న సంక్షేమ పథకాలు..
పశ్చిమ బెంగాల్లో ఓటరు జాబితా సవరణ తర్వాత తలెత్తిన తీవ్రమైన సమస్యలను పిటిషనర్ ప్రసేన్‌జిత్ బోస్ తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఓటరు జాబితా నుండి తొలగింపునకు గురైన వారు 19 అప్పీలేట్ ట్రిబ్యునళ్ల ముందు దాదాపు 34 లక్షల అప్పీళ్లు చేసుకున్నారు. కానీ, ఇప్పటివరకు కేవలం 38,000 అప్పీళ్లు మాత్రమే పరిష్కారమయ్యాయి (వీటిలో 70% మందికి అనుకూలంగా తీర్పు వచ్చింది).
ఈ అప్పీళ్లు పెండింగ్‌లో ఉండగానే, ఓటరు జాబితాలో పేరు లేని వారికి ప్రజా పంపిణీ వ్యవస్థ (PDS-రేషన్) ప్రయోజనాలను, అన్నపూర్ణ యోజన వంటి ప్రభుత్వ సంక్షేమ పథకాలను నిలిపివేస్తూ బెంగాల్ ప్రభుత్వం నోటిఫికేషన్లు జారీ చేసింది. ఓటు లేని వారికి కనీసం కుల ధృవీకరణ పత్రాలు (Caste Certificates) కూడా ఇవ్వడం లేదని న్యాయవాది కోర్టుకు తెలిపారు.
న్యాయస్థానం తదుపరి ఆదేశాలు..
ఈ పరిణామాలపై స్పందించిన సుప్రీంకోర్టు.. ఒక వ్యక్తిని ఓటర్ల జాబితా నుండి తొలగించిన తర్వాత, వారి పౌరసత్వ స్థితిని నిర్ధారించడానికి కేంద్ర ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకోవడం ఎన్నికల సంఘం బాధ్యత అని స్పష్టం చేసింది.
ఓటరు జాబితా సవరణ ప్రక్రియలో పారదర్శకత ఉండాలని, తప్పుగా పేర్లు తొలగింపునకు గురైన వారి కోసం బలమైన అప్పీల్ వ్యవస్థ ఉండాలని కోర్టు సూచించింది. పశ్చిమ బెంగాల్ ఎస్ఐఆర్ను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లతో పాటు, ప్రభుత్వ పథకాలను నిలిపివేయడాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లపై కూడా సమగ్ర విచారణ జరుపుతామని సుప్రీంకోర్టు ధర్మాసనం వెల్లడించింది.
Also Read: "భవిష్యత్తు అంతా హైడ్రోజన్దే"..చారిత్రాత్మక రైలు ఆవిష్కరణ ఘట్టంలో ప్రధాని మోదీ!
Also Read: సాంప్రదాయ విలువలకు నిలువెత్తు రూపం..సేవే పరమావధిగా జీవితం..నంద్ కిషోర్ లైఫ్ హిస్టరీ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
మందుబాబులకు తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు.. తెల్లవారుజామున 4.30 వరకు మద్యం విక్రయాలు
Baddipadaga, Telangana:Liquor Sales: ఫుట్‌బాల్ ప్రపంచకప్ నేపథ్యంలో మందుబాబులకు తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు వినిపించింది. ఫిఫా ప్రపంచకప్ 2026 ఫైనల్ మ్యాచ్ సందర్భంగా మద్యం విక్రయాల సమయం పెంచుతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. హోటళ్లు, రెస్టారెంట్లు, బార్లు, పబ్‌లు తెరచి ఉంచే సమయాన్ని తెలంగాణ ప్రభుత్వం పెంచేసింది. క్రీడాభిమానుల నుంచి వచ్చిన డిమాండ్ నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
హైదరాబాద్‌లోని క్రీడాభిమానుల నుంచి వచ్చిన భారీ అభ్యర్థనలను పరిగణనలోకి తీసుకుని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అర్జెంటీనా, స్పెయిన్ మధ్య జరగనున్న ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌ను బహిరంగంగా ప్రదర్శించాలనుకునే అన్ని రకాల కమర్షియల్, ప్రైవేట్ స్పోర్ట్స్ ఎస్టాబ్లిష్మెంట్లతో పాటు హోటళ్లు, రెస్టారెంట్లు, పబ్‌లను తెరిచి ఉంచేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
ఈ మెగా ఫైనల్ మ్యాచ్ సోమవారం అర్ధరాత్రి 12:30 గంటలకు ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఆదివారం సాయంత్రం నుంచి సోమవారం మ్యాచ్ ముగిసే సమయం వరకు క్రీడాభిమానులు మ్యాచ్ వీక్షించేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. హోటళ్లు, రెస్టారెంట్లు, పబ్‌లు తదితర వాణిజ్య సంస్థలను తెరచి ఉంవవచ్చని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ సడలింపులతోపాటు న్యూ ఇయర్ వేడుకల సమయంలో విధించే సాధారణ నిబంధనలు యథావిధిగా అమలులో ఉంటాయని ప్రభుత్వం తెలిపింది. తెలంగాణ బార్ అండ్ రెస్టారెంట్స్ ఓనర్స్ అసోసియేషన్ విజ్ఞప్తి మేరకు అనుమతిస్తూ ఎక్సైజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
డ్రంక్ అండ్ డ్రైవ్ వంటి ఉల్లంఘనలపై పోలీసులు కఠినంగా వ్యవహరిస్తారని తెలంగాణ ప్రభుత్వం హెచ్చరించింది. శాంతిభద్రతల విషయంలో జీరో టాలరెన్స్ విధానాన్ని అవలంభిస్తారని అధికారులు హెచ్చరిక చేశారు. ఫిఫా వరల్డ్ కప్ సందర్భంగా తెలంగాణలో తెల్లవారుజాము వరకు మద్యం విక్రయాలు జరగనున్నాయి. ఇటీవలే ఇదే తరహా కర్ణాటక ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. కర్ణాటక బాటలోనే ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం నడుస్తోంది.
==> 18వ తేదీన జరిగే ఫిఫా వరల్డ్ కప్ థర్డ్ ప్లేస్ ప్లే-ఆఫ్ మ్యాచ్ సందర్భంగా 19వ తేదీ తెల్లవారుజామున 4.30 గంటల వరకు మద్యం విక్రయాలు జరగనున్నాయి.
==> 19వ తేదీన జరిగే ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ సందర్భంగా అర్ధరాత్రి నుంచి 20వ తేదీ తెల్లవారుజామున 3 గంటల వరకు మద్యం అమ్మకాలకు అనుమతి
ఎక్కడ చూడవచ్చు
ఫిఫా ప్రపంచకప్ మ్యాచ్‌లు జీ5 యాప్‌లో చూడవచ్చు. జీ మీడియా నెట్‌వర్క్‌కు సంబంధించి స్పోర్ట్స్ ఛానళ్లు యునైట్8 స్పోర్ట్స్ లలో ప్రత్యక్ష ప్రసారం జరుగుతాయి. ఫుట్‌బాల్ ప్రపంచకప్‌ను జీ5లో చూస్తూ ఎంజాయ్ చేయవచ్చు.
Empty Stomach Water: ఉదయాన్నే ఖాళీ కడుపుతో నీళ్లు తాగితే ఏమవుతుంది? పుకార్లపై వైద్యుల స్పందన ఇదే!
Hyderabad, Telangana:Empty Stomach Water In Morning: ఉదయాన్నే నిద్రలేవగానే కాస్త నీరు తాగమని మన పెద్దవారు చెబుతుంటారు. అయితే దాని వెనుక ఓ ఆరోగ్య రహస్యం ఉందట. ఉదయాన్నే నీళ్లు తాగడం ఎందుకు ముఖ్యమంటే.. మనం రాత్రి పడుకున్నాక దాదాపు 6 నుండి 8 గంటల పాటు శరీరానికి నీరు అందదట. దీనివల్ల ఉదయానికి శరీరం స్వల్పంగా డీహైడ్రేషన్ (నిర్జలీకరణం)కు గురవుతుందట. అందుకే, నిద్రలేవగానే నీళ్లు తాగడం వల్ల శరీరానికి అవసరమైన ద్రవాలు మళ్లీ అంది, అవయవాలు చురుగ్గా పనిచేయడం ప్రారంభిస్తాయని నిపుణులు చెబుతున్నారు.
లభించే నిజమైన ఆరోగ్య ప్రయోజనాలు..
ఉదయం 1 లేదా 2 గ్లాసుల నీరు తాగడం వల్ల శరీరానికి వెంటనే జలసమృద్ధి (Hydration) కలిగి, రోజంతా ఉత్సాహంగా ఉండటానికి సహాయపడుతుంది. నీరు జీర్ణవ్యవస్థను శుభ్రపరుస్తుంది. కొంతమందిలో ఇది మలబద్ధకం సమస్యను నివారించడంలో తోడ్పడుతుంది.
ఈ విధంగా ఉదయమే నీళ్లు తాగడం వల్ల బాడీ టెంపరేచర్ సమతుల్యంగా ఉంటుంది. మూత్రపిండాలు సక్రమంగా పనిచేస్తూ, మూత్రం ద్వారా శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపడానికి తగినంత నీరు అవసరం.
వైరల్ అవుతున్న అపోహలు.. వైద్యుల హెచ్చరిక!
సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్నట్లుగా ఖాళీ కడుపుతో నీళ్లు తాగడం వల్ల అన్ని రోగాలూ నయమవుతాయనడానికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. నీరు తాగడం మంచి అలవాటే కానీ.. ఇది ఏ వ్యాధికీ సంపూర్ణ చికిత్స కాదు.
కేవలం ఉదయాన్నే నీళ్లు తాగడం వల్లే బరువు తగ్గడం, మధుమేహం (డయాబెటిస్) నియంత్రణ కావడం లేదా క్యాన్సర్ వంటి తీవ్ర వ్యాధులు నయమవడం సాధ్యం కాదు.
ఎంత నీరు తాగాలి? ఎవరికి ప్రమాదం?
నీరు తాగే విషయంలో ఒకే నియమం అందరికీ వర్తించదు. సాధారణంగా ఉదయం 1 లేదా 2 గ్లాసుల నీరు తాగవచ్చు. ఆ తర్వాత రోజంతా దాహాన్ని బట్టి తగినంత నీరు తీసుకోవాలి. అయితే, కింది సమస్యలు ఉన్నవారు వైద్యుల సలహా లేకుండా ఒకేసారి ఎక్కువ నీరు తాగకపోవడమే మంచిదని చెబుతున్నారు.
1) మూత్రపిండాల (కిడ్నీ) సమస్యలు ఉన్నవారు
2) గుండె జబ్బులు ఉన్నవారు
3) శరీరంలో నీటి పరిమాణాన్ని నియంత్రించాల్సిన ఇతర అనారోగ్య సమస్యలు ఉన్నవారు.
ఆరోగ్యకరమైన ఉదయపు దినచర్య..
నిజమైన ఆరోగ్యం కేవలం నీళ్లతోనే సాధ్యం కాదు. పరిపూర్ణ ఆరోగ్యం కోసం ఉదయం పూట వీటిని అలవాటు చేసుకోండి. నిద్రలేచిన వెంటనే తగినంత నీరు తాగండి. ఆ తర్వాత ఒక 15-20 నిమిషాల పాటు తేలికపాటి వ్యాయామం లేదా వాకింగ్ చేయండి. తాజా పండ్లు, కూరగాయలతో కూడిన పోషకమైన అల్పాహారం తీసుకోండి. రోజంతా శరీరానికి తగినంత నీటిని అందిస్తూ ఉండండి.
గమనిక: ఉదయాన్నే నీళ్లు తాగడం మంచి అలవాటే అయినప్పటికీ, సోషల్ మీడియాలో వచ్చే ప్రతి చిట్కాను గుడ్డిగా నమ్మకూడదు. ఏదైనా కొత్త ఆరోగ్య నియమాన్ని పాటించే ముందు ఫ్యామిలీ డాక్టర్‌ను సంప్రదించడం ఎల్లప్పుడూ శ్రేయస్కరం.
Also Read: Middle Age Men Fitness: 50 ఏళ్లు దాటిన మగాళ్లకు స్టామినా తగ్గకుండా ఉండాలంటే..!
Also Read; Onion Juice Benefits: ఉల్లిపాయ జ్యూస్ ఎప్పుడైనా తాగారా? తాగితే ఏం జరుగుతుంది?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Mohammad Nawaz Breach: డోపింగ్ వివాదంలో పాకిస్థాన్ స్టార్ క్రికెటర్‌కు షాక్..3 నెలల నిషేధం విధించిన ఐసీసీ!
Hyderabad, Sindh:Mohammad Nawaz Breach News: డోపింగ్ నిరోధక రూల్స్ ఉల్లఘించిన కారణంగా పాకిస్థాన్ స్టార్ స్పిన్నర్ మహమ్మద్ నవాజ్‌పై అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) మూడు నెలల పాటు నిషేధం విధించింది. అన్ని రకాల క్రికెట్ పోటీల నుండి అతడిని సస్పెండ్ చేస్తున్నట్లు ఐసీసీ శుక్రవారం ఒక ప్రకటనలో అధికారికంగా వెల్లడించింది.
దొరికిపోయిన స్పిన్నర్..
ఫిబ్రవరి 7న శ్రీలంకలోని కొలంబోలో నెదర్లాండ్స్‌తో జరిగిన పురుషుల టీ20 మ్యాచ్ ముగిసిన అనంతరం మహమ్మద్ నవాజ్‌కు డోపింగ్ పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో అతడు నిషేధిత మాదకద్రవ్యం 'కార్బాక్సీ-THC' (Carboxy-THC) తీసుకున్నట్లు తేలింది. సాధారణంగా గంజాయి వినియోగాన్ని గుర్తించడానికి ఈ పరీక్ష చేస్తారు.
శిక్ష తగ్గింపునకు అవకాశం..
ఐసీసీ నిర్ణయాన్ని నవాజ్ అంగీకరించాడు. అయితే, క్రీడా ప్రదర్శనను మెరుగుపరుచుకోవడానికి తాను ఈ పదార్థాన్ని వాడలేదని, మ్యాచ్‌కు దూరంగా ఉన్న సమయంలోనే దీనిని తీసుకున్నానని అతడు నిరూపించగలిగాడు. దీంతో ఐసీసీ అతడికి 3 నెలల స్వల్ప కాల నిషేధాన్ని ఖరారు చేసింది. నవాజ్ మే 1వ తేదీ నుంచే స్వచ్ఛందంగా తాత్కాలిక నిషేధాన్ని పాటిస్తుండటంతో, ఆ తేదీ నుంచే ఈ శిక్షా కాలం అమల్లోకి వచ్చినట్లు ఐసీసీ పరిగణించింది.
ప్రస్తుతం రెండున్నర నెలల నిషేధాన్ని పూర్తి చేసుకున్న నవాజ్.. ఐసీసీ సూచించిన మాదకద్రవ్యాల విముక్తి చికిత్స కార్యక్రమాన్ని (Rehabilitation Program) విజయవంతంగా పూర్తి చేస్తే ఈ శిక్షా కాలాన్ని ఒక నెలకు తగ్గిస్తారు. ఒకవేళ ఐసీసీ సంతృప్తి చెందేలా ఈ ప్రోగ్రామ్‌ను ముగిస్తే అతడు మళ్లీ అదనంగా ఎలాంటి నిషేధాన్ని ఎదుర్కోవాల్సిన అవసరం ఉండదు.
రికార్డులు రద్దు.. పేలవ ఫామ్..
ఐసీసీ నిబంధనల ప్రకారం.. ఫిబ్రవరి 7న నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌తో పాటు, మే 1వ తేదీ వరకు నవాజ్ ఆడిన మ్యాచ్‌ల రికార్డులు, సాధించిన ఫలితాలను రద్దు చేశారు. నవాజ్ చివరిసారిగా పాకిస్థాన్ సూపర్ లీగ్ (PSL)లో ముల్తాన్ సుల్తాన్స్ తరపున ఆడాడు. ఆ టోర్నీలో 6 మ్యాచ్‌ల్లో కేవలం 54 పరుగులు మాత్రమే చేసి, బౌలింగ్‌లో 9 మ్యాచ్‌లలో 6 వికెట్లు తీసినప్పటికీ భారీగా పరుగులు సమర్పించుకుని తీవ్ర నిరాశపరిచాడు. తాజాగా డోపింగ్ వివాదం అతడి కెరీర్‌ను మరింత కష్టాల్లోకి నెట్టింది.
Also Read: ఫ్రాన్స్ vs స్పెయిన్ సెమీఫైనల్.. ఫైనల్ బెర్త్ కోసం 'యూరోపియన్' యుద్ధం!
Also REad: ఫిఫా ప్రపంచకప్ సెమీఫైనల్స్‌లో హోరాహోరీ టీమ్స్..ట్రోఫీ గెలిచే సత్తా ఎవరికి ఉందంటే?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
వర్షాల్లేక ఎండిపోతున్న నారుమడులు.. ట్యాంకర్లతో నీళ్లు పోస్తున్న రైతులు!
Hyderabad, Telangana:Jagtial Drought Crisis: వానకాలం సీజన్ మొదలై నెలలు గడుస్తున్నా.. ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో జగిత్యాల జిల్లాలో రైతాంగం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది.. సాగు నీరందక, వర్షాలు కురువకపోవడంతో పచ్చని నారుమడులు కళ్లముందే ఎండిపోతున్నాయి. నమ్మిన భూతల్లిని, వేసిన నారును కాపాడుకునేందుకు రైతులు పడరాని పాట్లు పడుతున్నారు.
ట్యాంకర్లతో నీరు..
మల్యాల మండలం నూకపల్లి గ్రామంలో వర్షలేకపోవడంతో రైతుల పరిస్థితులు దారుణంగా మారాయి. గ్రామానికి ఆసరాగా నిలవాల్సిన వరద కాలువలు పూర్తిగా ఎండిపోయాయి.. భూగర్భ జలాలు కూడా అడుగంటడంతో బోర్లలో నీరు రావడం లేదు.. ఈ క్రమంలో గ్రామానికి చెందిన రైతులు, తాము ఎంతో కష్టపడి పోసిన వరి నారుమడి ఎండిపోతుండటం చూసి తట్టుకోలేకపోయాడు.
ఎలాగైనా వారి నారుమడిని బతికించుకోవాలనే తాపత్రయంతో.. ప్రైవేట్ ట్యాంకర్ల ద్వారా డబ్బులు పెట్టి.. నీటిని కొనుగోలు చేస్తున్నారు. ట్యాంకర్స్ ద్వారా నారుమడికి నీటి తడులు అందిస్తూ.. పంటను కాపాడుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. పెట్టుబడి ప్రాథమిక దశలోనే ఇలా వేలాది రూపాయలు ఖర్చు చేసి.. నీటిని తోడాల్సి రావడంపై రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు..
జులైలోనే ఈ తిప్పలా?..
సాధారణంగా జులై మాసంలో విస్తారంగా వర్షాలు కురిసి.. వాగులు, వంకలు, కాలువలు గలగలా పారాలి.. కానీ ఈ ఏడాది అందుకు భిన్నమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. సీజన్ ప్రారంభంలోనే సాగునీటి కోసం రైతులు ఇలా ట్యాంకర్లను ఆశ్రయించాల్సి రావడం జిల్లాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.. జులైలోనే పరిస్థితి ఇలా ఉంటే.. రాబోయే రోజుల్లో ప్రధాన పంట కాలంలో పంటలను ఎలా కాపాడుకోవాలో తెలియక అన్నదాతలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
రైతుల డిమాండ్..
ఎండిపోతున్న నారుమడులను, పొలాలను చూసి జిల్లాలోని రైతులు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. వర్షాలు పడకపోతే ఈ ఏడాది సాగు పూర్తిగా కుంటుపడే ప్రమాదం ఉందని వారు వాపోతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం, నీటిపారుదల శాఖ అధికారులు స్పందించి.. ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా కాలువలకు నీటిని విడుదల చేసి.. నారుమడులను, పంటలను కాపాడాలని జగిత్యాల జిల్లా రైతాంగం కోరుతోంది.
Also Read: కొండగట్టులో కొబ్బరికాయ దోపిడీ.. ఒక్కో కాయకు రూ.10 వసూలు, వైరల్ వీడియో!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.
తెలంగాణలో బిగ్ ట్విస్ట్.. బీఆర్ఎస్ పార్టీ యువ సంగ్రామ సదస్సుకు పోలీసుల అనుమతి నిరాకరణ
Hyderabad, Telangana:Saroornagar Stadium: హైదరాబాద్‌లోని సరూర్‌నగర్ స్టేడియంలో బీఆర్ఎస్ పార్టీ యువజన, విద్యార్థి విభాగాల ఆధ్వర్యంలో ఈ నెల 18వ తేదీన నిర్వహించనున్న యువ సంగ్రామ సదస్సుకు పోలీసులు అనుమతి నిరాకరించారు. కొన్ని వారాల కిందట అనుమతి కోసం దరఖాస్తు చేసుకోగా.. పోలీసులు ఇంకా అనుమతించకపోవడాన్ని బీఆర్ఎస్ పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సభకు అనుమతి కోసం గులాబీ పార్టీ హైకోర్టును ఆశ్రయించింది.
సభకు అనుమతి నిరాకరించడంపై ఆ పార్టీ మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ శంబీపూర్ రాజు మాట్లాడుతూ.. 'యువజన, విద్యార్థి విభాగాల ఆధ్వర్యంలో నిర్వహించనున్న సదస్సు కోసం గత నెలలోనే కలెక్టర్‌కు దరఖాస్తు సమర్పించాం. కలెక్టర్ లేఖ ఆధారంగా స్పోర్ట్స్ అథారిటీకి కూడా సమాచారం వెళ్లింది. జూలై 8న పోలీస్ కమిషనర్‌కు కూడా అధికారికంగా లేఖ అందించాం. పోలీసులు సూచించిన విధంగా సీసీ కెమెరాల ఏర్పాటు, డీడీల చెల్లింపులు సహా కోరిన ప్రతి నిబంధనను పాటించినప్పటికీ అనుమతి ఇవ్వలేదు' అని వెల్లడించారు.
బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మాట్లాడుతూ.. తాను చేసిన ఫోన్ కాల్స్‌కు కూడా పోలీస్ కమిషనర్ స్పందించడం లేదని తెలిపారు. ముఖ్యమంత్రి కార్యాలయం నుంచే సభకు అనుమతి ఇవ్వవద్దని పోలీసు అధికారులకు ఆదేశాలు వెళ్లినట్లు తెలుస్తోందని ఆరోపించారు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష పార్టీల సభలకు అనుమతులు ఇచ్చామని గుర్తుచేశారు. ఇప్పుడు ప్రతిపక్షమైన బీఆర్ఎస్ పార్టీ సభకు అనుమతి నిరాకరించడం ప్రజాస్వామ్య విరుద్ధం అని రేవంత్ రెడ్డిపై మండిపడ్డారు.
నిరుద్యోగ యువత పక్షాన నిలబడే ‘యువ సంగ్రామం’ సదస్సుకు కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డంకులు సృష్టించడం దుర్మార్గం!
అన్ని అనుమతులు, డీడీలు కట్టినా సీఎంఓ ఒత్తిళ్లతో పోలీసులు పర్మిషన్ నిరాకరించడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే.
గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు గజ్వేల్‌లో సభ పెట్టినా… pic.twitter.com/C1ZfcOKCeM
— BRS Party (@BRSparty) July 17, 2026
'నిరుద్యోగులకు ఇచ్చిన హామీల గురించి ప్రశ్నిస్తామనే భయంతోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని, నిరుద్యోగులపై రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరు బాధాకరం. ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా యువ సంగ్రామ సదస్సు విజయవంతమవుతుంది. యువత పెద్ద సంఖ్యలో హాజరుకావాలి' అని ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పిలుపునిచ్చారు. 'పోలీసులు ఆరు రకాల వివరాలు విడతలవారీగా కోరినా అన్నింటినీ సమర్పించాం. రెండు రోజులుగా పోలీస్ కమిషనర్‌కు ఫోన్ చేసినా స్పందించడం లేదు. ఏసీపీ ద్వారా మాట్లాడించినా అనుమతి ఇవ్వలేదు. అనుమతి నిరాకరణపై న్యాయస్థానాన్ని ఆశ్రయించాం' అని తెలిపారు.
'ముఖ్యమంత్రి కార్యాలయం నుంచే సభకు అనుమతి ఇవ్వవద్దని ఆదేశాలు వచ్చినట్లు సమాచారం ఉంది. భారీగా యువత హాజరయ్యే అవకాశం ఉండడంతో ప్రభుత్వంపై వ్యతిరేకత వ్యక్తమవుతుందనే కారణంతో రేవంత్ రెడ్డి సభను అడ్డుకుంటున్నాడు' అని ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఆరోపించారు. ఎన్నికల సమయంలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలతో రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పించి.. ఇప్పుడు నిరుద్యోగులను మోసం చేస్తున్నారని విమర్శించారు. విద్యార్థులపై దమనకాండ కొనసాగించడం, ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయక విద్యార్థులను ఇబ్బందులకు గురిచేయడం కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలకు నిదర్శనమని ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి వివరించారు. సభకు అనుమతి ఇవ్వకపోతే సరూర్‌నగర్ స్టేడియం వద్దకే వచ్చి తమ నిరసనను తెలియజేస్తామని రేవంత్ రెడ్డికి హెచ్చరించారు.ఈ సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగం అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్, నాయకులు బాలమల్లు, నర్సింహా గౌడ్, కిశోర్‌గౌడ్, రాఘవ, అమృత లాల్ చౌహన్, రవినాయక్ తదితరులు పాల్గొన్నారు.
pic.twitter.com/Tz8djqYV3c🔥 @D_SudheerReddy- ఎమ్మెల్యే
యువ సంగ్రామ సదస్సును పెట్టి తీరుతాం!
కాంగ్రెస్ సర్కార్ ఎన్ని అడ్డంకులు సృష్టించినా..నిరుద్యోగులకు నోటిఫికేషన్లు ఇవ్వకుండా ద్రోహం చేస్తున్న కాంగ్రెస్ సర్కార్ వైఖరిపై పోరుకు సిద్ధమైంది బీఆర్ఎస్ ✊
విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వకుండా..— BRS Party (@BRSparty) July 17, 2026
రూ.20 వేల బడ్జెట్లో AI ఫీచర్లతో iQOO Z11 Lite స్మార్ట్‌ఫోన్ లాంచ్!
Hyderabad, Telangana:Iqoo Z11 Lite Launching Soon: భారతీయ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి ప్రముఖ బ్రాండ్ iQOO మరో శక్తివంతమైన ఫోన్‌ను విడుదల చేసేందుకు రెడీ అయ్యింది.. ఇది iQOO Z11 Lite పేరుతో లాంచ్ కాబోతోంది. దీనిని కంపెనీ ఈ నెల 24వ తేదీన అధికారికంగా విడుదల చేయబోతోంఒఇ. ముఖ్యంగా కాలేజీ విద్యార్థులతో పాటు నేటి యువతను దృష్టిలో పెట్టుకుని.. రూ. 20,000 లోపు బడ్జెట్ ధరలో అందుబాటులోకి తీసుకు రాబోతోంది. అంతేకాకుండా ఇది అద్భుతమైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఫీచర్లతో విడుదల కానుంది.
AI పవర్డ్ ప్రొడక్టివిటీ..
ఈ iQOO Z11 Lite స్మార్ట్‌ఫోన్‌లో ల్యాండింగ్, క్రియేషన్‌తో పాటు కమ్యూనికేషన్ ప్రక్రియలను సులభతరం చేసేందుకు పవర్ఫుల్ AI ఫీచర్ల సెట్‌ను అందించబోతున్నట్లు తెలుస్తోంది.. ఇందులో ఉండే AI క్రియేషన్ ఫీచర్ విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడుతుందని సమాచారం. ఇది పెద్ద పెద్ద డాక్యుమెంట్లను క్షణాల్లో సులభంగా Summary చేస్తుందని.. అసైన్మెంట్లను రిఫైన్ చేస్తుందని కంపెనీ క్లైమ్ చేస్తుంది. ఇది కంటెంట్ జెనరేట్ చేయడంతో పాటు టెక్స్ట్‌ను వివిధ భాషల్లోకి ట్రాన్స్లెట్ చేసేందుకు క్రియాశీలక పాత్ర పోషిస్తుంది..
అంతేకాకుండా, ఇందులో ఉన్న AI క్యాప్షన్ ఫీచర్ ద్వారా రియల్-టైమ్ ట్రాన్స్‌క్రిప్షన్‌తో పాటు ఇన్స్టంట్ ట్రాన్స్లేషన్, వన్-టాప్ సమ్మరీ వంటి సపోర్ట్‌ను కూడా అందిస్తోంది.. ఆన్లైన్ లెక్చర్లు, వర్క్‌షాప్‌లు వినేటప్పుడు నోట్స్ రాసుకోవడానికి.. వాటిని షేర్ చేయడానికి ఇది అద్భుతంగా సహాయపడుతుంది.
ఏకంగా 6500mAh భారీ బ్యాటరీ..
ఈ ఫోన్ భారీ 6500mAh బ్యాటరీని కూడా కలిగి ఉంటుంది.. ఇది 44W ఫ్లాష్‌చార్జ్ (FlashCharge) సపోర్ట్‌తో అందుబాటులోకి రాబోతోంది.. ఎక్కువ సేపు చదువుకోవడానికి.. గేమింగ్, మల్టీటాస్కింగ్ కోసం ఈ బ్యాటరీ అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇస్తుందని కంపెనీ తెలుపుతోంది.. కంపెనీ క్లెయిమ్ ప్రకారం.. ఈ బ్యాటరీ 5 సంవత్సరాల పాటు బ్యాటరీ హెల్త్‌ను కలిగి ఉంటుందని సమాచారం..
పడిపోయినా పగిలిపోదు..
రోజువారీ క్యాంపస్ జీవితంలో ఫోన్లు చేతిలోంచి జారిపడటం, వర్షంలో తడవడం సర్వ సహజం.. అందుకే iQOO Z11 Lite ఫోన్‌ను మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీతో నిర్మించిన్నట్లు కంపెనీ తెలుపుతోంది. దీనికి SGS 5-స్టార్ డ్రాప్ రెసిస్టెన్స్ సర్టిఫికేషన్ అందుబాటులోకి రాబోతోంది.. దీనివల్ల ప్రమాదవశాత్తు ఫోన్ కింద పడినా ఎటువంటి నష్టం జరగకుండా చాలా గట్టి ప్రొటక్షన్ లభిస్తుంది.
బ్రైట్ డిస్ప్లే..
ఈ స్మార్ట్‌ఫోన్ ఎండలో కూడా స్పష్టంగా కనిపించేలా 1200 నిట్స్ పీక్ బ్రైట్నెస్ డిస్ప్లేను కూడా కలిగి ఉంటుంది.. దీని స్లీక్, మోడర్న్ డిజైన్ ఎంతో ప్రీమియంగా ఉంటుందని సమాచారం. ఫోన్ వెనుక భాగంలో మినిమలిస్ట్, కాంపాక్ట్ కెమెరా మాడ్యూల్తో పాటు, కాల్స్, నోటిఫికేషన్ల కోసం ఒక డైనమిక్ లైట్ ఫీచర్‌ను కూడా అందుబాటులోకి తీసుకు రాబోతోంది.
iQOO Z11 Lite స్మార్ట్‌ఫోన్ భారత్‌లో జూలై 24న లాంచ్ కాబోతున్నట్లు అధికారక సమాచారం. ఈ ఫోన్ ప్రముఖ ఈ-కామర్స్ సైట్ అమెజాన్ (Amazon), iQOO అధికారిక వెబ్సైట్లో అందుబాటులోకి రాబోతోంది.. ఇది సోలార్ ఫ్లేమ్ (Solar Flame)తో పాటు మిడ్నైట్ బ్లూ (Midnight Blue) అనే రెండు ప్రీమియం కలర్ వేరియంట్లలో లభించబోతున్నట్లు తెలుస్తోంది. ఇది రూ.20,000 బడ్జెట్లో AI ఫీచర్లు, భారీ బ్యాటరీ కోరుకునే వారికి ఇది ఒక బెస్ట్ ఆప్షన్ కాబోతున్నట్లు మార్కెట్లో టెక్ నిపుణులు భావిస్తున్నారు.
Also Read: 7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
ఆగస్టు 12న Google Pixel 11 సిరీస్ గ్రాండ్‌గా లాంచ్.. ప్రత్యేకతలేంటో తెలుసా?
Hyderabad, Telangana:Google Pixel 11 Series Launch: స్మార్ట్‌ఫోన్ ప్రియులకు Google సంస్థ అదిరిపోయే శుభవార్త చెప్పింది.. ప్రతి సంవత్సరం అక్టోబర్‌లో కొత్త ఫోన్లను పరిచయం చేస్తుంది. ఈసారి మరింత ముందుగానే అంటే ఆగస్టు 12న తమ కొత్త గూగుల్ పిక్సెల్ 11 (Google Pixel 11) సిరీస్‌ను గ్లోబల్ మార్కెట్లో లాంచ్ చేసేందుకు ముహూర్తం ఖరారు చేసింది. ఈ మేరకు కంపెనీ తన అఫీషియల్ స్టోర్ పేజీలో ఒక టీజర్ వీడియోను విడుదల చేస్తూ అధికారికంగా ప్రకటించింది..
కొత్తగా పిక్సెల్ గ్లో (Pixel Glow)..
గూగుల్ పిక్సెల్ 11 సిరీస్‌లో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న హైలైట్ పిక్సెల్ గ్లోగా భావించవచ్చు.. ఫోన్ వెనుక భాగంలో ఉండే కెమెరా బార్లో ఒక అద్భుతమైన మల్టీ-కలర్ RGB ఎల్ఈడీ (LED) లైటింగ్‌ను గూగుల్‌ను అందుబాటులోకి తీసుకు రాబోతున్నట్లు తెలుస్తోంది.. ఇది కేవలం సాధారణ ప్లాష్‌లైట్ లాగా కాకుండా.. గూగుల్ సిగ్నేచర్ రంగులతో పాటు అద్భుతంగా వెలుగుతుందని సమాచారం..
స్మార్ట్ నోటిఫికేషన్లు..
ఫోన్‌కు వచ్చే కాల్స్.. వాట్సాప్ లేదా ఫేస్బుక్ మెసేజ్‌లకు వేర్వేరు రంగుల్లో ప్రత్యేకమైన లైట్ బ్లింక్ అవుతుందని సమాచారం. ఉదాహరణకు వాట్సాప్ మెసేజ్ వస్తే గ్రీన్ కలర్.. ఫేస్బుక్ నోటిఫికేషన్‌కు బ్లూ కలర్ లైట్ వెలిగేలా యూజర్లు సెట్ చేసుకోవచ్చని తెలుస్తోంది..
జెమిని AI ఇంటరాక్షన్..
గూగుల్ జెమిని AI వాయిస్ అసిస్టెంట్‌తో మనం మాట్లాడేటప్పుడు.. ఆ వాయిస్ రెస్పాన్స్‌కు అనుగుణంగా ఈ లైట్ రంగులు మారుస్తూ.. విజువల్ ఫీడ్‌బ్యాక్ కూడా అందిస్తుంది.. ఇది నథింగ్ (Nothing) ఫోన్లలోని గ్లిఫ్ ఇంటర్ఫేస్ తరహాలో మరింత స్టైలిష్‌గా.. ప్రీమియమ్గా ఉండబోతోందని సమాచారం..
నాలుగు మోడల్స్..
ఆగస్టు 12న జరిగే మేడ్ బై గూగుల్ (Made by Google) ఈవెంట్లో కంపెనీ మొత్తం నాలుగు మోడళ్లను లాంచ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇందులోని గూగుల్ పిక్సెల్ 11 స్మార్ట్‌ఫోన్ 6.3 ఇంచుల డిస్ప్లేను కలిగి ఉంటుంది. అంతేకాకుండా పిక్సెల్ 11 ప్రో మొబైల్ 6.3 అంగుళాల డిస్ప్లేను కలిగి ఉంటుందని సమాచారం.. ఇక పిక్సెల్ 11 ప్రో XL స్మార్ట్‌ఫోన్ 6.8 అంగుళాల డిస్ప్లేతో లభించబోతోంది. ఇక పిక్సెల్ 11 ప్రో ఫోల్డ్ స్మార్ట్‌ఫోన్ 6.4, 8.0 అంగుళాల డిస్ప్లేను కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్లు స్టెర్లింగ్, డ్యూన్, లైట్ ఫాగ్, పైన్ వంటి అద్బుతమైన కలర్ ఆప్షన్లతో పాటు కొత్తగా గోల్డ్ ఫినిషింగ్ వేరియంట్లో కూడా అందుబాటులోకి రానుంది..
Also Read: 7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!
పవర్ఫుల్ ప్రాసెసర్..
ఈ పిక్సెల్ 11 సిరీస్ కేవలం లుక్స్ పరంగానే కాకుండా పర్ఫార్మెన్స్ పరంగానూ నెక్స్ట్ లెవెల్లో ఉండబోతున్నట్లు తెలుస్తోంది.. ఈ ఫోన్లలో అత్యంత శక్తివంతమైన గూగుల్ టెన్సర్ G6 (Tensor G6) చిప్‌సెట్‌ను వినియోగించిన్నట్లు సమాచారం. TSMCకి సంబంధించిన అడ్వాన్స్డ్ 2nm ప్రొడక్షన్ ప్రాసెస్ ఆధారంగా తయారైన ఈ ప్రాసెసర్ వల్ల ఫోన్ బ్యాటరీ లైఫ్ పెరగడమే.. కాకుండా అద్భుతమైన స్పీడ్ లభిస్తుందని సమాచారం. అంతేకాకుండా ఈ సిరీస్ సరికొత్త ఆండ్రాయిడ్ 17 (Android 17) ఆపరేటింగ్ సిస్టమ్‌తో రన్ కాబోతున్నట్లు తెలుస్తోంది.. ఈ సిరీస్ ఆగస్టు 12న అధికారికంగా లాంచ్ అయిన రోజు నుంచే గూగుల్ స్టోర్‌లో ఈ ఫోన్ల ప్రీ-ఆర్డర్లు (Pre-orders) ప్రారంభం కాబోతున్నాయి.
Also Read: 7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Tecno నుంచి సూపర్ ఫోన్.. 3D కర్వ్డ్ డిస్ప్లేతో Tecno Camon 50 Ultra 5G ఫోన్!
Hyderabad, Telangana:Tecno Camon 50 Ultra 5g Telugu: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ టెక్నో (Tecno) భారత మార్కెట్లోకి సరికొత్త ఫ్లాగ్షిప్ ఫీచర్ల మంచి ఫోన్‌ను విడుదల చేసింది. మొబైల్ ఫొటోగ్రఫీ, అద్భుతమైన బ్యాటరీ లైఫ్‌ను కోరుకునే వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని Tecno Camon 50 Ultra 5G ఫోన్‌ను మార్కెట్లోకి లాంచ్ చేసింది.. అధునాతన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఫీచర్లతో పాటు అత్యంత ప్రత్యేకమైన బిల్ట్ క్వాలిటితో వచ్చిన ఈ స్మార్ట్‌ఫోన్ ధర, పూర్తి స్పెసిఫికేషన్ల వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం..
డిజైన్, డిస్ప్లే..
ఈ Tecno Camon 50 Ultra 5G ఫోన్లో 6.78-అంగుళాల 1.5K 3D కర్వ్డ్ AMOLED డిస్ల్పేను కలిగి ఉంటుంది. ఇది 144Hz రిఫ్రెష్ రేట్, 4500 నిట్స్ గరిష్ట బ్రైట్‌నెస్‌తో అందుబాటులోకి వచ్చింది. దీనివల్ల ఎండలో కూడా స్క్రీన్ స్పష్టంగా కనిపిస్తుందని కంపెనీ క్లైమ్ చేస్తోంది. అలాగే డిస్ప్లే ప్రొటక్షన్ కోసం కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7iని వినియోగించిన్నట్లు సమాచారం. కంపెనీ దీనిని సిల్క్-ఫ్లో డిజైన్‌తో అందుబాటులోకి తీసుకు వచ్చింది..
కెమెరా వివరాలు..
ఈ స్మార్ట్‌ఫోన్ 50MP ట్రిపుల్ కెమెరా సెటప్‌తో అందుబాటులోకి తీసుకు వచ్చింది. ఇందులో కంపెనీ చాలా ప్రత్యేకమైన 50 మెగాపిక్సెల్ సోనీ LYT-700C సెన్సార్ ప్రధాన కెమెరా కెమెరాను కూడా కలిగి ఉంటుంది.. అంతేకాకుండా 3x ఆప్టికల్ జూమ్ సామర్థ్యంతో 50 మెగాపిక్సెల్ సెన్సార్ టెలిఫొటో కెమెరాతో అందుబాటులోకి వచ్చింది.. అలాగే 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ లెన్స్ అల్ట్రా-వైడ్ కెమెరా కూడా లభిస్తోంది.. ఇక సెల్ఫీల కోసం ముందు భాగంలో 50 మెగాపిక్సెల్ పవర్ఫుల్ ఫ్రంట్ కెమెరాను కూడా తీసుకు వచ్చింది.
ప్రాసెసర్, పర్ఫార్మెన్స్..
మల్టీటాస్కింగ్‌తో పాటు గేమింగ్ కోసం ఈ ఫోన్లో శక్తివంతమైన మీడియాటెక్ డైమెన్సిటీ 7400 అల్టిమేట్ (4nm) ప్రాసెసర్‌ను వినియోగించిన్నట్లు తెలుస్తోంది.. ఇది ఆండ్రాయిడ్ 16 ఆధారిత హైఓఎస్ (HiOS 16) పై ఆపరేటింగ్ సిస్టమ్‌పై రన్ అవుతుంది. ఇది 8GB LPDDR5X ర్యామ్‌తో పాటు 256GB స్టోరేజ్ వేరియంట్లో అందుబాటులోకి వచ్చింది..
బ్యాటరీ, ఛార్జింగ్..
ఈ స్మార్ట్‌ఫోన్ ప్రధాన ఆకర్షణ దీనిలోని 6500mAh భారీ బ్యాటరీగా భావించవచ్చు. ఇది ఒకసారి ఛార్జ్ చేస్తే.. రెండు రోజుల పాటు నిరంతరాయంగా పనిచేస్తుందని కంపెనీ తెలిపింది.. దీనికి తోడు 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా అందుబాటులో ఉంది. దీనివల్ల ఫోన్ చాలా వేగంగా ఛార్జ్ అవుతుందని కంపెనీ క్లైమ్ చేస్తుంది..
ధర వివరాలు..
భారత మార్కెట్లో టెక్నో కేమన్ 50 ఆల్ట్రా 5G (8GB + 256GB వేరియంట్) ధరను రూ.39,999తో లభించబోతోంది. అయితే, లాంచ్ ఆఫర్ కింద కొనుగోలు చేసేవారికి అదనంగా రూ.3,000 వరకు డిస్కౌంట్ కూపన్ లభిస్తుంది.. దీనితో ఈ ఫోన్‌ను కేవలం రూ.36,999కే సొంతం చేసుకోవచ్చు.. జులై 21 మధ్యాహ్నం 12 గంటల నుంచి ఈ ఫోన్ ప్రముఖ ఈ-కామర్స్ వెబ్సైట్ అమెజాన్ (Amazon.in)లో అందుబాటులోకి వచ్చింది.
Also Read: 7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
రేపు 'రా ఎన్టీఆర్' రూ.100 కోట్ల సహాయ కార్యక్రమాలపై ప్రెస్ మీట్.. తిరుపతిలో ఉత్కంఠ
Tirupati, Andhra Pradesh:RAW NTR Press Meet: తిరుపతిలో ప్రెస్‌మీట్ నిర్వహించి తీరుతామని.. తగ్గేదేలే అని రా ఎన్టీఆర్ టీం ప్రకటించింది. అనుకున్న సమయానికి రేపు తిరుపతిలో మీటింగ్ జరుపుతామని రా ఎన్టీఆర్ వ్యవస్థాపకుడు సాయి రూప్ ప్రకటించాడు. అయితే రా ఎన్టీఆర్ టీంపై తిరుపతి ఎస్పీకి ఎన్టీఆర్ ప్యాన్స్ అసోసియేషన్ ఫిర్యాదు చేసింది. దీంతో తిరుపతిలో రేపు ఏం జరుగుతుందనేది ఉత్కంఠ నెలకొంది. ఈ కార్యక్రమంతో జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల సంఘాల మధ్య తీవ్ర విబేధాలు ఏర్పడ్డాయి.
రా ఎన్టీఆర్ ప్రెసిడెంట్ సాయి రూప్ ఏ మాత్రం తగ్గేదే లేదు అంటున్నాడు . అనుకున్న సమయానికి 18వ తేదీన తిరుపతిలో ఉదయం మీడియా సమావేశం నిర్వహిస్తామని చెబుతున్నాడు. రూ.100 కోట్లతో 'రా ఎన్టీఆర్' పేరుతో తాము చేయబోయే సేవా కార్యక్రమాల గురించి తెలియజేస్తామని సాయిరూప్ తెలిపాడు. తాము అనుకున్న.. ముందుగా ప్రకటించిన హోటల్లోనే మీడియా సమావేశం నిర్వహిస్తామని ప్రకటించాడు. ఎన్టీఆర్ అభిమానులు అందరూ రావాలని.. తాము చేయబోయే ఈ కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిచ్చాడు.
అయితే రా ఎన్టీఆర్ బృందం కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు ఎన్టీఆర్ అభిమానుల సంఘం ప్రయత్నిస్తోంది. రా ఎన్టీఆర్ ప్రెస్‌మీట్‌పై ఇప్పటికే తిరుపతి ఎస్పీని కలిసి ఫిర్యాదు చేసింది. ఎన్టీఆర్ పేరుతో భారీ దోపిడీ చేయబోతున్నారని.. ఇది తమ అభిమాన నటుడికి చెడ్డపేరు వచ్చే అవకాశం ఉందని ఎన్టీఆర్ అభిమానుల సంఘం తిరుపతి అధ్యక్షుడు ప్రకటించాడు. రా ఎన్టీఆర్ టీంపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.
'రా ఎన్టీఆర్ ప్రెస్‌మీట్‌ను కచ్చితంగా నిర్వహిస్తాం. ఒకవేళ తాజ్ హోటల్లో అనుమతి రాకపోతే బయట వేరే వేదికలో నిర్వహిస్తాం. మమ్మల్ని ఖండిస్తూ ఎన్టీఆర ఆఫీస్ పేరిట విడుదలైన లేఖలో ఎన్టీఆర్ ప్రమేయం ఎంతవరకు ఉందో మాకు తెలియదు. అది ఆయన అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో కూడా పోస్ట్ కాలేదు. కాబట్టి ఎన్టీఆర్ పేరిట వచ్చిన లేఖను పట్టించుకోం' అని సాయిరూప్ తెలిపాడు. ఒకవేళ స్వయంగా ఎన్టీఆర్ వద్దన్నా కూడా తాము ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని ప్రకటించడం గమనార్హం. 'ఎందుకంటే మేము ఏ తప్పూ చేయడం లేదు. మా వెనుక ఏ రాజకీయ పార్టీ లేదు. ప్రెస్ మీట్లో మీడియా ప్రశ్నలు, జవాబులు ఉంటాయి. రూ.100 కోట్లతో సేవా కార్యక్రమాలు ఏమిటో పూర్తి వివరంగా వివరిస్తాం' అని సాయిరూప్ వెల్లడించాడు.
A Sincere Request To All @tarak9999 Fans & Well-wishers ❤️🙏🏻 pic.twitter.com/4MAZFfHpNS
— RAW NTR (@RAWNTR) July 16, 2026
ప్రపంచంలోనే మొదటి AI ఫోన్ వచ్చేసింది.. Nubia NaviX Ultra ప్రత్యేకతలివే!
Hyderabad, Telangana:Nubia NaviX Ultra Launched: ప్రముఖ చైనీస్ ఎలక్ట్రానిక్స్ దిగ్గజం ZTE సబ్-బ్రాండ్ నుబియా (Nubia) స్మార్ట్‌ఫోన్ ప్రియుల కోసం ఒక అద్భుతమైన శుభవార్తను అందించింది.. పూర్తిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సామర్థ్యాలతో పనిచేసే అద్బుతమైన కొత్త స్మార్ట్‌ఫోన్ నావిక్స్ ఆల్ట్రా (NaviX Ultra)ను మార్కెట్లోకి విడుదల చేసింది. చైనాలోని షాంఘైలో జూలై 17న ఇది లాంచ్ అయ్యింది. వరల్డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాన్ఫరెన్స్ (WAIC) వేదికగా ఈ ఫోన్‌ను అధికారికంగా విడుదల చేసింది.. ఈ కంపెనీ ఇప్పటికే మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫారమ్ వీబో (Weibo)లో ఒక అధికారిక పోస్ట్‌ను షేర్ చేసింది. అయితే, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం..
4 అద్భుతమైన ఆప్షన్లు..
నుబియా నావిక్స్ ఆల్ట్రా డిజైన్, కలర్ వేరియంట్లకు సంబంధించిన టీజర్‌ను కంపెనీ ఇప్పటికే విడుదల చేసి చైనా మార్కెట్లో అంచనాలను పెంచిన్నట్లు తెలుస్తోంది.. ఈ స్మార్ట్‌ఫోన్ వినియోగదారులకు నాలుగు విభిన్నమైన, ఆకర్షణీయమైన రంగుల్లో లభించబోతోంది.. ఇది వైట్ (White), పర్పుల్ (Purple)తో పాటు పింక్ (Pink), బ్లాక్ (Black) కలర్ ఆప్షన్స్‌లో అందుబాటులోకి రాబోతోంది. ఈ అద్భుతమైన స్టైలిష్ రంగులు యువతనుచ ప్రొఫెషనల్స్ ఇద్దరినీ విశేషంగా ఆకట్టుకుంటాయని టెక్ విశ్లేషకులు భావిస్తున్నారు.
దౌబావో AI అసిస్టెంట్..
ఈ స్మార్ట్‌ఫోన్ అతిపెద్ద హైలైట్ దీనిలో అందుబాటులోకి వస్తున్న అడ్వాన్స్డ్ AI సిస్టమ్‌గా భావించవచ్చు. బైట్‌డాన్స్ (ByteDance)కు సంబంధించిన దౌబావో (Doubao) మొబైల్ AI అసిస్టెంట్‌తో వస్తున్న మొట్టమొదటి స్మార్ట్‌ఫోన్ ఇదే కావడం విశేషం. నుబియా కంపెనీ పౌండర్ ని ఫీ (Ni Fei) తెలిపిన వివరాల ప్రకారం.. కంపెనీ లార్జ్-స్కేల్ AI ఏజెంట్ మోడల్ కోసం ఫైలింగ్ పూర్తి చేసిన్నట్లు తెలుస్తోంది.. ఈ నావిక్స్ ఆల్ట్రా ఫోన్ అడ్వాన్స్డ్ AI సిస్టమ్‌ను పూర్తిగా ఇంటెగ్రేట్ చేసుకున్న మొదటి డివైజ్‌గా నిలుస్తుందని అతను తెలిపారు..
దీనిలోని AI కేవలం ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడం లేదా టెక్స్ట్ రాయడానికే పరిమితం కాకుండా.. మొబైల్లోని వివిధ యాప్స్‌లో మల్టీ-స్టెప్ టాస్క్‌లను యూజర్ల ప్రమేయం లేకుండా స్వయంగా పూర్తి చేస్తుందని కంపెనీ తెలిపింది.. ఇది వినియోగదారులకు ఏజెంటిక్ ఎక్స్‌పీరియన్స్‌ను అందిస్తుందని కంపెనీ వెల్లడించింది..
Also Read: 7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!
ఆకట్టుకునే డిజైన్..
టీజర్ ద్వారా అందుబాటులోకి వచ్చిన వివరాల ప్రకారం.. ఈ ఫోన్ వెనుక భాగంలో పిల్-షేప్ (Pill-shaped) కెమెరా ఐలాండ్‌ను కలిగి ఉంటుంది. దానికి సరిగ్గా క్రింద LED ఫ్లాష్‌ను కూడా అందిస్తోంది.. అలాగే, ఫోన్ ముందు భాగంలో సెల్ఫీ కెమెరా కోసం అద్భుతమైన హోల్-పంచ్ (Hole-punch) కటౌట్ డిజైన్‌ను వినియోగించారు. అన్నింటికంటే ముఖ్యంగా.. ఈ ఫోన్ పక్క భాగంలో (Side frame) ఒక అద్భుతమైన ఆరెంజ్ కలర్ బటన్‌ను కూడా అందిస్తోంది.. ఈ ప్రత్యేక బటన్ కేవలం AI ఫీచర్లను క్షణాల్లో యాక్సెస్ చేయడానికి (Quick Access) సహాయపడుతుందని సమాచారం..
Also Read: 7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
బరువు తగ్గడానికి దాల్చిన చెక్క నీరు నిజంగా సహాయపడుతుందా? మీరు తెలుసుకోవాల్సిన నిజాలు!
New York, New York:Cinnamon Water For Weight Loss: దాల్చిన చెక్క సాధారణంగా బిర్యానీ, పులావ్ కొన్ని ఫ్లేవర్ రైస్, కూరల్లో వేస్తారు. ఇందులో ఔషధ గుణాలు కూడా బోలెడు ఉంటాయి. ఇది వంటకు మంచి రుచి కూడా ఇస్తుంది. దాల్చిన చెక్క నీటిని ఉదయం పరగడపున తీసుకుంటే మీ కడుపు ఆరోగ్యం బాగుంటుంది. అంతేకాదు ఉదయం నుంచి ఆ రోజంతా మీ షుగర్ స్థాయిలు కూడా అదుపులో ఉంటాయి. ఇందులో శరీరానికి వెచ్చదనాన్ని అందించే గుణం కూడా కలిగి ఉంటుంది. ప్రధానంగా దాల్చిన చెక్కలో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ సమ్మేళనాలు కలిగి ఉంటాయి. దాల్చిన చెక్క చాయ్, కూర, లేదా డెజర్ట్స్, బిర్చానీలో వేసుకుంటే మంచి అరోమాతోపాటు మీ ఇమ్యూనిటీ కూడా బూస్ట్ అవుతుంది. మన శరీర ఆరోగ్యానికి ఇది మంచిది.
అయితే, బరువు నిర్వహణలో ఉండటానికి దాల్చిన చెక్క నీటిని తాగుతున్నారు. ఇలా పరగడపున దాల్చిన చెక్క నీటిని తీసుకుంటే జీర్ణ ఆరోగ్యం మెరుగవ్వడంతోపాటు ఆరోగ్యకరమైన బరువుకు కూడా ఇది తోడ్పడుతుంది. దాల్చిన చెక్క కడుపు ఆరోగ్యానికి కూడా సహాయపడుతుంది. ఖనిజాలు కూడా సులభంగా గ్రహిస్తాయి.
రెగ్యులర్‌గా దాల్చిన చెక్క నీరు తీసుకుంటే ఇది ఆరోగ్యకరమైన బరువుతోపాటు జీర్ణం కూడా మృదువుగా అయ్యేలా చేస్తుంది. ఇది కడుపులో గ్యాస్, అజీర్తిని కూడా తగ్గిస్తుంది.
చక్కెర స్థాయిలు..
దాల్చిన చెక్క నీటిని నిత్యం తీసుకుంటే ఇది చక్కెర స్థాయిలు కూడా అదుపులో ఉండేలా చేస్తాయి. ఇది సహజమైన ఇన్సూలిన్ అని కూడా పిలుస్తారు. అనారోగ్యకరమైన స్నాక్స్ తినేకంటే ఇలా దాల్చిన చెక్కతో తయారు చేసిన టీ తీసుకుంటే షుగర్ స్థాయిలు అదుపులో ఉంటాయి.
ఆరోగ్యకరమైన జీవక్రియ..
దాల్చిన చెక్క నీరు మీ డైలీ రొటీన్లో చేర్చుకుంటే కూడా మీ శరీర జీవక్రియ సహజంగా సహాయపడుతుంది. ఆరోగ్యంకరమైన జీవక్రియ శరీరాన్ని శక్తి ఉపయోగించడానికి అనుమతిస్తుంది. శరీరా ఆరోగ్యానికి కూడా సహాయపడుతుంది.
Also Read: ఏసీ గదిలో గంటల తరబడి కూర్చుంటున్నారా? మీ చర్మం పాడవుతుందని చెప్పే 5 సంకేతాలు ఇవే!
Also Read: ఉదయాన్నే షుగర్ లెవెల్స్ అకస్మాత్తుగా పెరుగుతున్నాయా? ఈ 5 చిట్కాలతో ఈజీగా కంట్రోల్
యాంటీ ఆక్సిడెంట్లు బోలెడు..
దాల్చిన చెక్కలో సహజంగా యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇది శరీర సెల్ ఆక్సిడేటివ్ స్ట్రెస్ బారిన పడకుండా కాపాడతాయి. బరువు నిర్వహణలో ఉన్నవారికి ఇది ఒక ఆరోగ్యకరమైన ఫుడ్.
తీపి తినాలనే కోరిక..
ఈ దాల్చిన చెక్కను నరు తీసుకుంటే కూడా మీ టేస్ట్ బడ్కు తీపి తినాలనే కోరిక తగ్గిస్తుంది.ఇది తీసుకుంటే షుగర్ వేసుకోవాల్సిన అవసరం లేదు.
దాల్చిన చెక్క నీటిని తయారు చేసే విధానం..
ఒక చిన్న దాల్చిన చెక్క లేదా అరచెంచా దాల్చిని పొడి తీసుకోవాలి. మీకు కావాల్సిన నీరు తీసుకోండి. ఇప్పుడు ఒక సాస్ ప్యాన్ తీసుకుని నీరు పోయండి. అందులో ఈ దాల్చిన చెక్క వేసి ఓ 7 నిమిషాు మరిగించండి. దాల్చిన చెక్క సారం పూర్తిగా నీటిలోకి ఇంకిపోయే వరకు ఉడికించాలి. ఇప్పుడు కాస్త చల్లారనివ్వాలి. ఆ తర్వాత స్టెయినర్ సహాయంతో వడగట్టండి.ఉదయం పరగడపున ఈ నీటిని తాగడం అలవాటు చేసుకోండి. దాల్చిన చెక్క నీటిని మీ రోజువారీ రొటీన్లో చేర్చుకుంటే ఆరోగ్యకరం. ఇది ఒక సమతుల ఆహరం. దీంతోపాటు రోజూ ఫిజికల్ యాక్టివిటీ కూడా తప్పనిసరి. మీరు డైట్ కూడా ఆరోగ్యకరంగా ఉండేటా చూడండి.దీంతో మీరు సులభంగా బరువు తగ్గిపోతారు.(Disclaimer: పాఠకులారా ఈ వ్యాసం కేవలం సాధారణ సమాచారం, సలహాలను మాత్రమే అందిస్తుంది. ఇది ఎంతమాత్రం వృత్తిపరమైన సలహా కాదు. ఈ సమాచారానికి జీ తెలుగు న్యూస్ ఎటువంటి బాధ్యత వహించదు.)
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Hydrogen Train: "భవిష్యత్తు అంతా హైడ్రోజన్దే"..చారిత్రాత్మక రైలు ఆవిష్కరణ ఘట్టంలో ప్రధాని మోదీ!
Hyderabad, Telangana:Hydrogen Train PM Modi Speech: భారత రైల్వే రంగంలో సరికొత్త విప్లవానికి తెరలేచింది. దేశంలోనే మొట్టమొదటి హైడ్రోజన్ రైలు సర్వీసును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఘనంగా ప్రారంభించారు. ఈ చారిత్రాత్మక ఘట్టం అనంతరం ప్రధాని మోదీ దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తూ, రాబోయే కాలమంతా హైడ్రోజన్ ఇంధనానిదేనని స్పష్టం చేశారు.
రైల్వే వ్యవస్థలో పర్యావరణ పరిరక్షణకు కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని ప్రధాని పేర్కొన్నారు. ఇందులో భాగంగానే పర్యావరణహిత చర్యలకు శ్రీకారం చుడుతూ ఈ హైడ్రోజన్ రైలును అందుబాటులోకి తెచ్చామని చెప్పారు. భవిష్యత్తులో రైల్వే అవసరాల కోసం డీజిల్, సాంప్రదాయ విద్యుత్ వినియోగాన్ని దశలవారీగా తగ్గిస్తామని ఆయన వెల్లడించారు. భారతీయ రైల్వే రూపురేఖలను పూర్తిగా మార్చేయడంలో, గ్రీన్ ఎనర్జీ దిశగా అడుగులు వేయడంలో ఈ ప్రాజెక్ట్ ఒక కీలకమైన మైలురాయిగా నిలుస్తుందని ప్రధాని మోదీ ధీమా వ్యక్తం చేశారు.
దేశంలోనే మొట్టమొదటి హైడ్రోజన్ రైలును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతికి అంకితం చేశారు. అయితే మన దేశంలో ఎక్కువ శాతం ఉన్న ఎలక్ట్రిక్ రైళ్లు, హైడ్రోజన్ రైళ్లు రెండూ పర్యావరణ అనుకూల రవాణా వ్యవస్థలే అయినప్పటికీ, వాటి పనితీరు, సాంకేతికత.. సామర్థ్యంలో ప్రధాన వ్యత్యాసాలు ఉన్నాయి.
ప్రపంచవ్యాప్తంగా జర్మనీ, జపాన్, చైనా, అమెరికా వంటి అగ్రదేశాల సరసన ఇప్పుడు భారత్ కూడా హైడ్రోజన్ రైలు సాంకేతికత కలిగిన దేశంగా నిలిచింది. ఈ నేపథ్యంలో, అటు పర్యావరణానికి మేలు చేసే హైడ్రోజన్ రైలుకు, ఇటు దశాబ్దాలుగా మనకు సేవలందిస్తున్న ఎలక్ట్రిక్ రైలుకు మధ్య తేడాలేంటి? ఏది ఉత్తమమైనది? అనే ఆసక్తికరమైన వివరాలు ఇక్కడ చూద్దాం.
భారతదేశపు తొలి హైడ్రోజన్ రైలు ప్రత్యేకతలు..
ఉత్తర రైల్వే పరిధిలో దాదాపు రూ.140 కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్టు పనులు జరిగాయి. ఈ రైలులో 8 ప్యాసింజర్ కోచ్‌లు, 2 పైలట్ కోచ్‌లు ఉన్నాయి. ఇది దేశంలోనే అత్యంత పొడవైన హైడ్రోజన్ రైలు కావడం విశేషం. ఇందులో 682 సీటింగ్ సామర్థ్యం ఉండగా, మొత్తం 2,600 మంది ప్రయాణికులు ప్రయాణించేందుకు వీలుంది.
Also Read: హైడ్రోజన్ రైలు Vs ఎలక్ట్రిక్ రైలు.. ఈ రెండు రైళ్లలో ఏది బెస్ట్? ఏది తక్కువ ఖర్చు?
Also Read: పంచాయితీ ఎన్నిక సీట్ల విషయంలో జనసేన తగ్గేదేలే.. మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్య!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Hydrogen Vs Electric Train: హైడ్రోజన్ రైలు Vs ఎలక్ట్రిక్ రైలు.. ఈ రెండు రైళ్లలో ఏది బెస్ట్? ఏది తక్కువ ఖర్చు అవుతుంది?
Sorkhi, Haryana:Hydrogen Train Vs Electric Train: భారతీయ రైల్వే చరిత్రలో నేడు (జూలై 17) ఒక చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతం అయ్యింది. హర్యానాలో దేశంలోనే మొట్టమొదటి హైడ్రోజన్ రైలు సర్వీసును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జెండా ఊపి ప్రారంభించారు. చెన్నైలోని పెరంబూర్ ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ICF)లో రూపుదిద్దుకున్న ఈ పర్యావరణ అనుకూల రైలు.. హర్యానాలోని జింద్ - సోనిపట్ మార్గంలో పరుగులు పెడుతోంది.
ప్రపంచవ్యాప్తంగా జర్మనీ, జపాన్, చైనా, అమెరికా వంటి అగ్రదేశాల సరసన ఇప్పుడు భారత్ కూడా హైడ్రోజన్ రైలు సాంకేతికత కలిగిన దేశంగా నిలిచింది. ఈ నేపథ్యంలో, అటు పర్యావరణానికి మేలు చేసే హైడ్రోజన్ రైలుకు, ఇటు దశాబ్దాలుగా మనకు సేవలందిస్తున్న ఎలక్ట్రిక్ రైలుకు మధ్య తేడాలేంటి? ఏది ఉత్తమమైనది? అనే ఆసక్తికరమైన వివరాలు ఇక్కడ చూద్దాం.
భారతదేశపు తొలి హైడ్రోజన్ రైలు ప్రత్యేకతలు..
ఉత్తర రైల్వే పరిధిలో దాదాపు రూ.140 కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్టు పనులు జరిగాయి. ఈ రైలులో 8 ప్యాసింజర్ కోచ్‌లు, 2 పైలట్ కోచ్‌లు ఉన్నాయి. ఇది దేశంలోనే అత్యంత పొడవైన హైడ్రోజన్ రైలు కావడం విశేషం. ఇందులో 682 సీటింగ్ సామర్థ్యం ఉండగా, మొత్తం 2,600 మంది ప్రయాణికులు ప్రయాణించేందుకు వీలుంది.
పనితీరు, ఇంధన వినియోగం..
ఎలక్ట్రిక్ రైళ్లు నడవడానికి పట్టాల పైన ఉండే ఓవర్‌హెడ్ విద్యుత్ తీగలు తప్పనిసరి. రైలు పైకప్పుపై ఉండే 'పాంటోగ్రాఫ్' అనే పరికరం ద్వారా ఈ తీగల నుండి విద్యుత్‌ను గ్రహించి, కింద ఉండే మోటార్ల సహాయంతో ఇవి ప్రయాణిస్తాయి. దీనికి భిన్నంగా, హైడ్రోజన్ రైళ్లకు ఎలాంటి ఓవర్‌హెడ్ విద్యుత్ తీగలు అవసరం లేదు. ఈ రైళ్లలోనే అమర్చబడిన ఫ్యూయల్ సెల్స్ ద్వారా హైడ్రోజన్ వాయువును, బయటి వాతావరణంలోని ఆక్సిజన్‌తో రసాయనిక చర్య జరిపిస్తారు. ఈ ప్రక్రియ ద్వారా సొంతంగా విద్యుత్‌ను ఉత్పత్తి చేసుకుంటూ ఇవి ముందుకు సాగుతాయి.
సామర్థ్యం, బరువు..
సామర్థ్యం విషయానికి వస్తే ఎలక్ట్రిక్ రైళ్లు అత్యంత ప్రతిభావంతంగా పనిచేస్తాయి. పవర్ గ్రిడ్ నుండి వచ్చే విద్యుత్‌లో దాదాపు 80-90% శక్తి నేరుగా రైలును నడపడానికి ఉపయోగపడుతుంది. అదే హైడ్రోజన్ రైళ్లలో, ఫ్యూయల్ సెల్ ద్వారా హైడ్రోజన్‌ను తిరిగి విద్యుత్‌గా మార్చే ప్రక్రియలో ఎక్కువ శక్తి వృథా అవుతుంది. దీనివల్ల వీటి సామర్థ్యం కేవలం 30-40% వరకే పరిమితమవుతుంది. ఇక బరువు విషయానికొస్తే, ఎలక్ట్రిక్ రైళ్లు ఇంధనాన్ని నిల్వ ఉంచుకోవాల్సిన అవసరం లేదు కాబట్టి చాలా తేలికగా ఉంటాయి. కానీ, హైడ్రోజన్ రైళ్లు తమకు కావలసిన శక్తిని స్వయంగా తయారు చేసుకోవడం కోసం భారీ హైడ్రోజన్ ట్యాంకులు, ఇంధన నిల్వలు, పెద్ద బ్యాటరీలను మోయాల్సి రావడం వల్ల బరువు ఎక్కువగా ఉంటాయి.
ప్రయాణ ఖర్చులు, టికెట్ ధరలు..
ప్రయాణికులపై పడే ఆర్థిక భారం పరంగా చూస్తే, ఎలక్ట్రిక్ రైళ్లలో కిలోమీటర్ల దూరాన్ని బట్టి సాధారణ టికెట్ ధరలు రూ.5 నుండి రూ.30 వరకు ఉంటాయి. అదే ఏసీ కోచ్‌లలో ప్రయాణిస్తే ఈ ధర రూ. 35 నుండి రూ.120 (దాదాపు 60 కి.మీ. దూరానికి) వరకు మారుతుంది. మరోవైపు, కొత్తగా అందుబాటులోకి రానున్న హైడ్రోజన్ రైళ్లలో ప్రారంభ దశ కింద జింద్ - సోనిపట్ (సుమారు 85-90 కిలోమీటర్లు) మార్గానికి టికెట్ ధరలను రూ.5 నుండి రూ.25 మధ్యే ఉంచినట్లు సమాచారం. ప్రారంభంలో ప్రయాణికులను ఆకర్షించడానికి, పర్యావరణ అనుకూల ప్రయాణాన్ని ప్రోత్సహించడానికి హైడ్రోజన్ రైలు ధరలను చాలా సరసంగా నిర్ణయించారు.
భద్రత విషయంలో ఏది సేఫ్?
ఎలక్ట్రిక్ రైళ్లలో హై-వోల్టేజ్ విద్యుత్ వైర్లు ప్రధాన ముప్పు. వాటిని తాకడం వల్ల ప్రాణాంతక ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. అయితే, అగ్నిప్రమాదాలు చాలా అరుదుగా జరుగుతాయి.
హైడ్రోజన్ రైళ్లలో హైడ్రోజన్ అత్యంత వేగంగా మండే స్వభావం గల వాయువు. సొరంగాలు వంటి ఇరుకైన ప్రదేశాల్లో లీకేజీ జరిగితే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.
రక్షణ చర్యలు: ప్రభుత్వం ఈ రైలులో అత్యున్నత భద్రతా ప్రమాణాలను ఏర్పాటు చేసింది. సెన్సార్లు, అత్యవసర ఆటోమేటిక్ షట్-ఆఫ్ సిస్టమ్ (మానవ ప్రమేయం లేకుండానే హైడ్రోజన్ సరఫరాను నిలిపివేసే వ్యవస్థ), డ్రైవర్ సురక్షిత క్యాబిన్, ప్రత్యేక మానిటరింగ్ స్క్రీన్లు వంటి ఆధునిక రక్షణ చర్యలను రైలు డిజైన్లోనే పొందుపరిచారు.
ఈ రెండింటిలో ఏది ఉత్తమమైనది?
రెండు రకాల రైళ్లకు వాటి స్వంత ప్రయోజనాలు, పరిమితులు ఉన్నాయి. ఎలక్ట్రిక్ రైళ్లు చాలా ఏళ్లుగా నమ్మకమైన, సురక్షితమైన రవాణాగా నిరూపితమయ్యాయి. హైడ్రోజన్ రైళ్లు పర్యావరణానికి అత్యంత మేలు చేసే సాంకేతికత (జీరో ఎమిషన్స్) అయినప్పటికీ, ఇవి మన దేశంలో ఇప్పుడే అడుగుపెడుతున్నాయి. ఇవి నిరంతరాయంగా సేవలందిస్తూ ప్రజల వాడకం పెరిగిన తర్వాతే వీటి పూర్తి సామర్థ్యం, విశ్వసనీయతపై స్పష్టత వస్తుంది.
ఈ జింద్-సోనిపట్ పైలట్ ప్రాజెక్ట్ విజయవంతం అయితే, ఈ అనుభవంతో చారిత్రాత్మక పర్యాటక మార్గమైన కల్కా-సిమ్లా వంటి సాంప్రదాయ రైల్వే మార్గాల్లో కూడా హైడ్రోజన్ రైళ్లను ప్రవేశపెట్టేందుకు భారతీయ రైల్వే రంగం సిద్ధమవుతోంది.
Also Read: రైలు కింద కుటుంబం మొత్తం ఆత్మహత్య..బావ హత్య కేసులో నిందితుడు దారుణం..అసలు నిజం ఇదే?
Also Read; Metro Lovers Kissing: మెట్రో రైలులో లవర్స్ ముద్దులాట..బూతులు తిడుతున్న ప్రయాణికులు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
