Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Hyderabadcode 500003

రాంగోపాల్ పేట: స్థానిక సమస్యలపై ఆరా తీసిన కార్పొరేటర్

Jun 28, 2024 10:06:35
Secunderabad, Telangana
రాంగోపాల్ పేట డివిజన్ పరిధిలో డివిజన్ బిజెపి కార్పొరేటర్ చీర సుచిత్ర డిప్యూటీ కమిషనర్ సోమయ్య తో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా బస్తి ప్రాంతాల్లో ఉన్న సమస్యలపై ఆరా తీశారు. బోనాల జాతరలోగా సమస్యలన్నీ పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. వీలైనంత త్వరగా తగిన చర్యలు తీసుకోవాలని అన్నారు. అలాగే పెండింగ్ అభివృద్ధి పనులను కూడా త్వరగా ప్రారంభించి గడువులోగా పూర్తి చేయాలని సూచించారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని అన్నారు.
0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
HDHarish Darla
Dec 21, 2025 13:15:47
Hyderabad, Telangana:

IND vs PAK Asia Cup U19 Final: అండర్-19 ఆసియా కప్‌ 2025 టోర్నీ ఆద్యంతం అజేయంగా నిలిచి ఫేవరెట్‌గా బరిలోకి దిగిన భారత కుర్రాళ్లు, ఫైనల్‌లో మాత్రం చేతులెత్తేశారు. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో జరిగిన తుది పోరులో అన్ని రంగాల్లో విఫలమై 191 పరుగుల భారీ తేడాతో ఓటమిని చవిచూశారు. ఫలితంగా ఆసియా కప్ పాక్ వశమైంది.

టీమ్ ఇండియా బ్యాటింగ్ వైఫల్యం
పాక్ విధించిన 348 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత బ్యాటర్లు ఏ దశలోనూ నిలకడగా ఆడలేకపోయారు. టీమ్ ఇండియా కేవలం 26.2 ఓవర్లలో 156 పరుగులకే ఆలౌట్ అయింది. ఆశ్చర్యకరంగా పదో స్థానంలో వచ్చిన దీపేశ్‌ దేవేంద్రన్ (36) జట్టులో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు.

టాప్ ఆర్డర్ బ్యాటర్లు వైభవ్ సూర్యవంశీ (26 రన్స్), ఖిలాన్ పటేల్ (19 రన్స్) మినహా మిగిలిన ప్రధాన బ్యాటర్లందరూ స్వల్ప స్కోరుకే పెవిలియన్ చేరారు. ఒక దశలో భారత్ 120 పరుగులకే 9 వికెట్లు కోల్పోయి ఘోర పరాజయం అంచున నిలవగా, దీపేశ్ పోరాటంతో స్కోరు 150 మార్కును దాటింది. పాక్ బౌలర్లలో అలీ రజా 4 వికెట్లతో విరుచుకుపడగా.. సయామ్, సుభాన్, హుజైఫా రెండేసి వికెట్లు పడగొట్టారు.

'సమీర్' సెంచరీ కారణం
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పాకిస్థాన్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 347 పరుగుల భారీ స్కోరు సాధించింది. పాక్ ఓపెనర్ సమీర్ మిన్హాస్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. కేవలం 113 బంతుల్లోనే 17 ఫోర్లు, 9 సిక్సర్లతో 172 పరుగులు చేసి భారత బౌలర్లకు చుక్కలు చూపించాడు. మరోవైపు అహ్మద్ హుస్సేన్ (56) అర్ధ సెంచరీతో రాణించగా, ఉస్మాన్ ఖాన్ (35) కీలక పరుగులు జోడించాడు. భారత బౌలర్లలో దీపేశ్‌ దేవేంద్రన్ 3 వికెట్లు తీయగా, హెనిల్ పటేల్, ఖిలాన్ పటేల్ తలో రెండు వికెట్లు తీశారు.

Also REad: Nara Brahmani Cricket: క్రికెట్ మ్యాచ్ ఆడుతున్న మంత్రి నారా లోకేష్ భార్య..బర్త్‌డే రోజు బ్యాట్ పట్టిన నారా బ్రాహ్మణి!

Also REad: Emmanuel Remuneration: బిగ్‌బాస్ హౌస్ నుంచి ఇమ్మాన్యుయేల్ ఎలిమినేషన్..15 వారాలకు ఎన్ని లక్షలు సంపాదించారంటే?

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
DDDharmaraju Dhurishetty
Dec 21, 2025 12:46:41
Hyderabad, Telangana:

Shani Dev Vakri 2026 In Meena Rashi: 2026 సంవత్సరం చాలా ప్రత్యేకమైనది అని జ్యోతిష్యులు చెబుతున్నారు. ముఖ్యంగా ఈ సమయంలో కొన్ని అత్యంత శక్తివంతమైన గ్రహాలు సంచారం చేయడమే కాకుండా.. నక్షత్ర ప్రవేశం, తిరోగమనలు జరపబోతున్నాయి.  ఈ సమయంలోనే శని మార్పు కూడా ఉండబోతోంది. దీంతో 2026 సంవత్సరం మరింత ప్రత్యేక ప్రాముఖ్యతను అంతరించుకోబోతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. శని గ్రహాన్ని కర్మలకు ఫలాలు అందించే గ్రహంగా చెప్పుకుంటూ ఉంటారు. శని కదలికలు అనేవి కొన్ని రాశుల వారికి శుభప్రదంగాను.. మరి కొన్ని రాశుల వారికి అశుభ్రంగాను ఉంటుంది. ఇవి వ్యక్తులు చేసే కర్మలను బట్టి కూడా మారుతుంది. జులై 26వ తేదీన శనిగ్రహం మళ్లీ వక్రస్థితిలోకి వెళ్ళబోతున్నాడు. దీనికి కారణంగా ఈ ఏడాది కొన్ని రాశుల వారికి చాలా కలిసి రాబోతోంది. శని గ్రహం ఆశీస్సులతో కొన్ని రాశులు అద్భుతమైన ప్రయోజనాలు పొందుతాయి. ముఖ్యంగా ఆర్థికంగా చాలావరకు మెరుగుపడే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. అయితే, 2026 సంవత్సరంలో శని అనుగ్రహంతో అత్యధిక లాభాలు పొందబోతున్న రాశులేవో తెలుసుకోండి.

మకర రాశి 
మకర రాశికి ఎల్లప్పుడూ శని అధిపతిగా వ్యవహరిస్తాడు. కాబట్టి 2026 సంవత్సరంలో శని కదలికల కారణంగా ఈ రాశి వారికి అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. ఏదైనా పనుల్లో ఎక్కువ కాలం వస్తున్న అడ్డంకులన్నీ పూర్తిగా తొలగిపోతాయి. అంతేకాకుండా ఆర్థిక పరిస్థితులు చాలా బలంగా మారే అవకాశాలు ఉన్నాయి. దీంతోపాటు ఆత్మవిశ్వాసం పెరిగి ఊహించని స్థాయిలో లాభాలు కలుగుతాయి. తోబుట్టులతో సంబంధాలు మరింత మెరుగుపడే అవకాశాలు ఉన్నాయి. ఈ సమయంలో చిన్న చిన్న ప్రయాణాలు చాలా లాభదాయకంగా మారుతాయి అని జ్యోతిష్యులు చెబుతున్నారు. ముఖ్యంగా ఈ రాశి వారు అన్ని పనుల్లో ఓపికతో ముందుకు సాగడం వల్ల అఖండ విజయాలు సాధించే అవకాశాలు ఉన్నాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. 

వృషభరాశి 
వృషభ రాశిలో జన్మించిన వ్యక్తులకు శని కదలికల కారణంగా చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ముఖ్యంగా వీరికి ఈ సంవత్సరం మొత్తం కొత్త ఆదాయ మార్గాలు లభిస్తూ ఉంటాయి. అలాగే దీర్ఘకాలికంగా వస్తున్న అనేక సమస్యల నుంచి కాస్త పరిష్కారం కూడా లభించబోతోంది. కెరీర్ కూడా స్థిరత్వంగా ఉండబోతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. ముఖ్యంగా వీరికి సీనియర్ల నుంచి మంచి సపోర్టు లభించి ఎన్నో రకాల లాభాలు కలుగుతాయి. అలాగే వీరికి సామాజిక బాధ్యత కూడా పెరుగుతుంది. దీని కారణంగా సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు లభిస్తాయి. భవిష్యత్తు ప్రణాళికలు కూడా చాలావరకు లాభసాటిగా మారుతాయి.

Also Read: Chatugrahi Yoga 2026: త్వరలో 4 గ్రహాల అరుదైన కలయికతో రాజయోగం.. జాక్ పాట్ కొట్టబోతున్న రాశులు ఇవే..

తులారాశి 
తులా రాశిలో జన్మించిన వ్యక్తులకు శని ప్రభావంతో క్రమశిక్షణ విపరీతంగా పెరుగుతుంది. ముఖ్యంగా వీరు ఈ సమయంలో ఎప్పుడు పొందలేని విజయాలు సొంతం చేసుకుంటారు. అలాగే కొత్త బాధ్యతలు లభించడమే కాకుండా అద్భుతమైన లాభాలు కలుగుతాయి. ఈ సమయంలో వీరు తప్పకుండా ఆరోగ్యం పై ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. మానసికంగా కూడా చాలా వరకు మెరుగుపడతారు. నమ్మకంతో ముందుకు సాగడం వల్ల అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. కుటుంబ జీవితంలో కూడా ఎన్నో రకాల లాభాలు కలుగుతాయి.

NOTE: ఇక్కడ అందించిన సమాచారం జ్యోతిష్యుల నుంచి సేకరించింది. దీనిని జీ తెలుగు న్యూస్‌ ధృవీకరించదు.. 

Also Read: Chatugrahi Yoga 2026: త్వరలో 4 గ్రహాల అరుదైన కలయికతో రాజయోగం.. జాక్ పాట్ కొట్టబోతున్న రాశులు ఇవే..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
comment0
Report
HDHarish Darla
Dec 21, 2025 06:12:13
Hyderabad, Telangana:

Banana For Pregnant Women: అరటిపండు.. అన్ని కాలాల్లో, అతి తక్కువ ధరలో, సులభంగా లభించే ఒక అద్భుతమైన పోషకాహారం. చాలా మంది దీనిని సాధారణ పండుగా భావించి నిర్లక్ష్యం చేస్తుంటారు. కానీ, ముఖ్యంగా గర్భిణీ స్త్రీలకు, సాధారణ ఆరోగ్యానికి అరటిపండు చేసే మేలు అంతా ఇంతా కాదు. ఆరోగ్య నిపుణుల ప్రకారం.. ప్రతిరోజూ ఒకటి లేదా రెండు అరటిపండ్లు తినడం వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇక్కడ ఉన్నాయి.

గర్భిణీ స్త్రీలకు, శిశువుకు కలిగే లాభాలు
గర్భధారణ సమయంలో సరైన పోషకాలు తీసుకోవడం చాలా ముఖ్యం. అరటిపండు తల్లికి, బిడ్డకు ఎలా సహాయపడుతుందంటే.. గర్భిణీలలో తరచుగా కనిపించే నీరసం, అలసటను తగ్గించి తక్షణ శక్తిని అందిస్తుంది. ఇందులోని ఫోలిక్ యాసిడ్, ఇతర విటమిన్లు శిశువు మెదడు, వెన్నెముక అభివృద్ధికి తోడ్పడతాయి. గర్భధారణ సమయంలో మహిళల్లో వచ్చే మలబద్ధకం సమస్యను ఇందులోని ఫైబర్ నివారిస్తుంది.

ప్రయోజనం,ఎలా పనిచేస్తుంది?
తక్షణ శక్తి,ఇందులోని సహజ చక్కెరలు, ఫైబర్ రోజంతా మీకు కావాల్సిన శక్తిని ఇస్తాయి.
మానసిక ఉల్లాసం.. "ఇందులోని ట్రిప్టోఫాన్ అనే పదార్థం ఒత్తిడిని తగ్గించి, మూడ్‌ని మెరుగుపరుస్తుంది."
రక్తహీనత నివారణ.."ఇనుము (Iron) పుష్కలంగా ఉండటం వల్ల హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచి, ఎనీమియా నుండి రక్షిస్తుంది."
రోగనిరోధక శక్తి.. "విటమిన్ బి6, విటమిన్ సి వల్ల జలుబు, ఫ్లూ వంటి సీజనల్ వ్యాధులు దరిచేరవు."
చర్మం, జుట్టు.. "యాంటీఆక్సిడెంట్లు చర్మానికి సహజ మెరుపును ఇచ్చి, జుట్టు ఆరోగ్యంగా పెరగడానికి సహాయపడతాయి."

సూచన:
అరటిపండ్లు ఆరోగ్యానికి చాలా మంచివి అయినప్పటికీ, గర్భధారణ సమయంలో మధుమేహం ఉన్నవారు లేదా కిడ్నీ సమస్యలు ఉన్నవారు వీటిని తీసుకునే ముందు తమ వైద్యుని సంప్రదించడం ఉత్తమం.

(గమనిక: పైన పేర్కొన్న సమాచారం కేవలం కొన్ని నివేదికల ఆధారంగా రూపొందించింది. దీన్ని పాటించే ముందు సంబంధిత నిపుణుడ్ని సంప్రదించడం మేలు. దీన్ని జీ తెలుగు న్యూస్ ధ్రువీకరించడం లేదు.)

Also Read: Nidhhi Agerwal In Bigg Boss: లూలూ మాల్ ఘటన తర్వాత తొలిసారి బయటకొచ్చిన హీరోయిన్ నిధి అగర్వాల్! ఎలా మారిపోయిందంటే?

Also Read: Nidhhi Agerwal In Bigg Boss: లూలూ మాల్ ఘటన తర్వాత తొలిసారి బయటకొచ్చిన హీరోయిన్ నిధి అగర్వాల్! ఎలా మారిపోయిందంటే?

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
Dec 21, 2025 05:26:19
0
comment0
Report
HDHarish Darla
Dec 20, 2025 14:00:25
Hyderabad, Telangana:

Nidhhi Agerwal Lulu Mall: బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ముగింపు దశకు చేరుకుంది. ఆదివారం జరగబోయే గ్రాండ్ ఫినాలే కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తుండగా, శనివారం నాటి ఎపిసోడ్ గెస్టుల రాకతో మరింత కలర్‌ఫుల్‌గా మారింది. ముఖ్యంగా 'రాజాసాబ్' హీరోయిన్ నిధి అగర్వాల్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చి టాప్ 5 సభ్యులతో చేసిన హంగామా ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.

ఇటీవలే హైదరాబాద్‌లోని లూలూ మాల్‌లో జరిగిన ప్రమోషన్లలో నిధి అగర్వాల్‌కు అభిమానుల వల్ల చేదు అనుభవం ఎదురైన సంగతి తెలిసిందే. జనం ఒక్కసారిగా మీద పడటంతో ఆమె తీవ్ర అసౌకర్యానికి లోనయ్యారు. అయితే, బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టిన నిధి, అక్కడ టాప్ 5 కంటెస్టెంట్లతో కలిసి చాలా సరదాగా గడిపారు. బయట జరిగిన సంఘటన మర్చిపోయేలా హౌస్ మేట్స్ ఆమెను ఎంటర్టైన్ చేశారు.

నిధి అగర్వాల్ రాగానే ఇమ్మాన్యుయేల్ తనదైన శైలిలో రెచ్చిపోయాడు. "పాపలకే పాప.. నిధి పాప" అంటూ ఇమ్మాన్యుయేల్ చేసిన అల్లరి అంతా ఇంతా కాదు. గోల్స్ ఆ.. గర్ల్స్ ఆ?: టైటిల్ గెలిస్తే ఏం చేస్తావని పవన్‌ను నిధి అడగ్గా.. "నాకు కొన్ని గోల్స్ ఉన్నాయి" అని అతను సమాధానమిచ్చాడు. దానికి నిధి చిలిపిగా "గోల్స్ ఆ.. లేక గర్ల్స్ ఆ?" అని కౌంటర్ వేయడంతో అంతా నవ్వుల్లో మునిగిపోయారు.

ఇమ్మాన్యుయేల్ రొమాంటిక్ పంచ్
నిధి అగర్వాల్ హౌస్ మేట్స్ కోసం ఒక ఫన్నీ గేమ్ ప్లాన్ చేసింది. కళ్లకు గంతలు కట్టుకుని ఆడే ఈ గేమ్‌లో ఇమ్మాన్యుయేల్ మళ్ళీ తన టైమింగ్‌తో ఆకట్టుకున్నాడు. "గేమ్ ఆడేటప్పుడు పొరపాటున మిమ్మల్ని టచ్ చేస్తే ఏమీ అనుకోవద్దు కదా" అంటూ నిధిని రొమాంటిక్‌గా అడగడం ఆ ప్రోమోలో హైలైట్‌గా నిలిచింది.

ఫినాలే దిశగా టాప్ 5
ప్రస్తుతం హౌస్‌లో ఇమ్మాన్యుయేల్, సంజన, డిమాన్ పవన్, కళ్యాణ్, తనూజ టాప్ 5 రేసులో ఉన్నారు. నిధి అగర్వాల్ వీరిలో ఎనర్జీ నింపడమే కాకుండా, ప్రభాస్ హీరోగా నటించిన 'రాజాసాబ్' సినిమా విశేషాలను కూడా పంచుకున్నారు. మరి ఈ ఆదివారం జరిగే గ్రాండ్ ఫినాలేలో బిగ్ బాస్ తెలుగు 9 టైటిల్ విజేతగా ఎవరు నిలుస్తారో చూడాలి!

Also Read: Srisailam Sparsha Darshan: శ్రీశైల మల్లన్న భక్తులకు తీపికబురు! 'స్పర్శ దర్శనం' వేళలు పెంపు..పూర్తి వివరాలివే!

Also REad: 8th Pay Commission: ప్రభుత్వ ఉద్యోగులకు అలెర్ట్..ఇది ఆలస్యమైతే రూ. 3.8 లక్షల వరకు నష్టం!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
HDHarish Darla
Dec 20, 2025 13:01:36
Hyderabad, Telangana:

8th Pay Commission Delay HRA Loss: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న 8వ వేతన సంఘం అమలులో జాప్యం జరిగితే, వారు భారీగా ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉందని తాజా విశ్లేషణలు హెచ్చరిస్తున్నాయి. ముఖ్యంగా ఇంటి అద్దె భత్యం, రూపంలో ఈ నష్టం లక్షల్లో ఉండే అవకాశం ఉంది. ఆ వివరాలు ఇక్కడ చూద్దాం.

అసలు సమస్య ఏమిటి?
సాధారణంగా కొత్త వేతన సంఘం అమల్లోకి వచ్చినప్పుడు, ప్రభుత్వం పెరిగిన జీతాన్ని, కరువు భత్యాన్ని (DA) వెనుకటి తేదీ నుండి లెక్కగట్టి 'బకాయిల' రూపంలో చెల్లిస్తుంది. కానీ, HRA హౌస్ రెంట్ అలవెన్స్ విషయంలో ఈ వెసులుబాటు ఉండదు. అంటే, కొత్త వేతన సంఘం అమలు చేసే వరకు పాత రేట్ల ప్రకారమే HRA అందుతుంది. అమలు తర్వాతే కొత్త రేట్లు వర్తిస్తాయి తప్ప, గడిచిన కాలానికి బకాయిలు ఇవ్వరు.

కీలకమైన గడువు తేదీలు
7వ వేతన సంఘం కాలపరిమితి 2025 డిసెంబర్ 31న ముగియనుంది. 8వ వేతన సంఘం 2026 జనవరి 1 నుంచి ప్రారంభం కానునట్లు అంచనా వేస్తున్నారు. గత అనుభవాల దృష్ట్యా.. ఈ ప్రక్రియ పూర్తి కావడానికి 18 నుండి 24 నెలల సమయం పట్టవచ్చు.

నష్టం ఎలా ఉంటుంది?
ఉదాహరణకు ఒక ఉద్యోగి మూల వేతనం సుమారు రూ.76,500 ఉంటుంది అనుకుందాం. 8వ వేతన సంఘం అమలులో రెండేళ్లు (24 నెలలు) ఆలస్యం జరిగితే.. సవరించిన వేతనంపై పెరిగే HRA ప్రయోజనాన్ని ఆ రెండేళ్ల కాలానికి బకాయిల రూపంలో పొందలేరు. దీనివల్ల మెట్రో నగరాల్లో పనిచేసే ఉద్యోగులు గరిష్టంగా రూ. 3.8 లక్షల వరకు నష్టపోయే ప్రమాదం ఉంది. తక్కువ వేతన శ్రేణిలో ఉన్న వారు కూడా కొన్ని లక్షల రూపాయల మేర ప్రయోజనాన్ని కోల్పోతారు.

గమనించాల్సిన అంశాలు
ప్రస్తుతానికి 8వ వేతన సంఘంపై కేంద్ర ప్రభుత్వం నుండి ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. అయితే, ఉద్యోగ సంఘాలు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతున్నాయి.

Also Read: KCR in Hyderabad: కేసీఆర్ ఇప్పుడెలా ఉన్నారో తెలుసా? చాలా కాలం తర్వాత హైదరాబాద్ చేరుకున్న గులాబీ బాస్!

Also Read; iPhone 15 Offer Price: ఐఫోన్ 15 కేవలం రూ.11,050లకే! ఫ్లిప్‌కార్ట్‌లో అదిరిపోయే ఆఫర్..ఎలా పొందాలో తెలుసుకోండి!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
RKRavi Kumar Sargam
Dec 20, 2025 12:29:41
Hyderabad, Telangana:

KTR Chit Chat:  'వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నేను ఫెయిల్ కాదు. నేను వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యాక 32 జిల్లా పరిషత్, 136 మున్సిపాలిటీలు గెలిచాం. రేవంత్ సీఎం అయ్యాక.. సొంత పార్లమెంట్ స్థానాన్ని కూడా గెలిపించలేదు. నేకు ఐరన్ లెగ్ కాదు.. రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీలు ఐరన్ లెగ్‌లు' అని బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ తెలిపారు. రేవంత్ సీఎం అయ్యాక.. సొంత పార్లమెంట్ స్థానాన్ని కూడా గెలిపించలేదని గుర్తుచేశారు.

Also Read: KCR Meeting: రేపు ఏం జరగనుంది? క్లీన్‌చిట్ ఎమ్మెల్యేలు కేసీఆర్‌ మీటింగ్‌కు వెళ్తారా?

రేపు బీఆర్‌ఎస్‌ పార్టీ కార్య నిర్వాహక సమావేశం కావడంతో పతెలంగాణ భవన్‌లో మాజీ మంత్రి కేటీఆర్‌ మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. 'రేవంత్.. ఎవరితో ఫుట్‌బాల్ ఆడుకుంటాడో నాకు తెలియదు. నేను మాత్రం రేవంత్ రెడ్డిని ఫుట్‌బాల్ ఆడుకుంటాను. రేవంత్ ఇంట్లో మహిళలు, పిల్లలను, మనమడి గురించి నేను మాట్లాడను. రేవంత్ రెడ్డి మాదిరి కుటుంబసభ్యుల విషయంలో నేను చిల్లర రాజకీయాలు చేయను' అని కేటీఆర్‌ తెలిపారు. 'కేసీఆర్ రేపు అన్ని విషయాలపై దిశానిర్దేశం చేస్తారని చెప్పారు. లోకల్ బాడీ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం చేపడతామని పేర్కొన్నారు. 'రేవంత్ రెడ్డి సర్కార్‌కు హనీమూన్ ముగిసింది. ‌ఇక కేసీఆర్ ప్రజల్లోకి వస్తారు. కేసీఆర్ బహిరంగ సభలపై రేపటి సమావేశంలో నిర్ణయం. కాంగ్రెస్ పార్టీ ఆఫీస్‌లో ప్రెస్‌మీట్ పెట్టి.. బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నామనటం‌ పెద్ద కామెడీ. రేవంత్ చెప్తోన్న 66శాతం నిజమైతే.. పది మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి బైపోల్స్‌కు రావాలి' అని మాజీ మంత్రి కేటీఆర్‌ చెప్పారు.

Also Read: Tomorrow School Holiday: విద్యార్థులకు లక్కీ హలీడే.. రేపు అన్నీ స్కూళ్లకు సెలవు!

'పంచాయతీ ఎన్నికల దెబ్బకు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను ఇప్పడు నిర్వహించరు. మొదట మున్సిపల్ ఎన్నికలు నిర్వహిస్తారు. గ్రేటర్‌లో మున్సిపాలిటీల విలీనం సక్రమంగా జరగలేదు. గ్రేటర్‌ను మూడు కార్పొరేషన్లు చేయాలనేది రేవంత్ రెడ్డి ఆలోచన. అయితే గ్రేటర్ ఎన్నికలు ఎప్పుడు పెట్టాలనే దానిపై రేవంత్‌ రెడ్డికి స్పష్టత లేదు. 2028లో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావటం‌ పక్కా' అని మాజీ మంత్రి కేటీఆర్‌ తెలిపారు. 'ఫార్ములా, కాళేశ్వరం, ఫోన్ ట్యాపింగ్ కేసుల్లో ఏమీ లేదని రేవంత్ కు అర్థమైంది. రేవంత్ పాలనకు పంచాయతీ ఎన్నికల ఫలితాలే సూచిక. రేవంత్ రెడ్డి దెబ్బకు పరిశ్రమలు ఆంధ్రకు వెళ్ళిపోతున్నాయి. విరూపాక్ష అనే కంపెనీ కర్నూలుకు వెళ్లిపోయింది. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు.‌ టైం కోసం ఎదురుచూస్తున్నారు. 42 శాతం రిజర్వేషన్లు పార్టీ పరంగా ఇవ్వమని చెప్పటానికి రేవంత్  ఎవరు?' అని మీడియాతో కేటీఆర్‌ ప్రశ్నించారు.

Also Read: KTR Challenge: ఆ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించు.. రేవంత్ రెడ్డికి కేటీఆర్‌ దమ్మున్న సవాల్‌

'పార్లమెంట్  ఎన్నికల్లో 50శాతం, అసెంబ్లీ ఎన్నికల్లో 30శాతం సీట్లు బీసీలకు ఇచ్చాం. రేవంత్ రెడ్డి నుంచి నేర్చుకోవాల్సిన అవసరం లేదు. మార్కెట్ యార్డ్‌లు బీసీలకు ఇచ్చింది మేము. రాజకీయం వేరే.. విద్యా, ఉపాధిలో బీసీలకు‌ రిజర్వేషన్లు ఎందుకు ఇవ్వరు? అఖిలేష్ మా పాత దోస్త్.‌ ఫ్రెండ్లీగా ఉంటే.. బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావుకు బాధ ఎందుకు?' అని కేటీఆర్‌ ప్రశ్నించారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
comment0
Report
HDHarish Darla
Dec 20, 2025 12:07:36
Hyderabad, Telangana:

KCR in Nandi Nagar: తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సుదీర్ఘ విరామం తర్వాత హైదరాబాద్ నగరానికి చేరుకున్నారు. గత కొంతకాలంగా ఎర్రవల్లిలోని తన ఫామ్‌హౌస్‌కే పరిమితమైన ఆయన, మళ్లీ నగరానికి రావడంతో రాజకీయ వర్గాల్లో ఒక్కసారిగా వేడి పెరిగింది.

ఎర్రవల్లి నుండి నగరానికి..
తన తుంటి ఎముక శస్త్రచికిత్స తర్వాత కోలుకున్న కేసీఆర్, ఎక్కువ సమయం ఎర్రవల్లి నివాసంలోనే గడుపుతూ పార్టీ కార్యకలాపాలను అక్కడి నుండే పర్యవేక్షిస్తున్నారు. అయితే, తాజా రాజకీయ పరిణామాలు, పార్టీ బలోపేతంపై దృష్టి సారించేందుకు ఆయన హైదరాబాద్‌లోని తన నివాసానికి చేరుకున్నారు.

పార్టీ నేతలతో కీలక భేటీలు
కేసీఆర్ రాకతో తెలంగాణ భవన్‌తో పాటు ఆయన నివాసం వద్ద సందడి నెలకొంది. ఈ క్రమంలో పార్టీకి చెందిన మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలతో కేసీఆర్ వరుస భేటీలు నిర్వహించనున్నట్లు సమాచారం. స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు, రాష్ట్రంలోని ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు. తమ అధినేత మళ్లీ ప్రజల మధ్యకు, పార్టీ ఆఫీసుకు వస్తుండటంతో కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది.

ఆరోగ్యం, విశ్రాంతి
శస్త్రచికిత్స తర్వాత వైద్యుల సూచనల మేరకు కేసీఆర్ ఇన్నాళ్లూ విశ్రాంతి తీసుకున్నారు. ఇప్పుడు ఆయన పూర్తిస్థాయిలో కోలుకోవడంతో, మళ్లీ క్రియాశీల రాజకీయాల్లో వేగం పెంచాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. కేవలం ఫామ్‌హౌస్‌కే పరిమితమయ్యారన్న విమర్శలకు చెక్ పెడుతూ, ఆయన ఇకపై హైదరాబాద్ నుండే అందుబాటులో ఉండనున్నారని బీఆర్ఎస్ శ్రేణులు అంటున్నాయి.

రాజకీయ ప్రాధాన్యత
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కేసీఆర్ నగరానికి రావడం, అది కూడా కీలక చర్చల కోసం రావడం రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. పార్టీ సంస్థాగత మార్పులు, భవిష్యత్తు పోరాటాల గురించి ఆయన త్వరలోనే ఒక స్పష్టమైన ప్రకటన చేసే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

డిసెంబరు 21న బీఆర్ఎస్ కీలక సమావేశం..
తెలంగాణ భవన్‌లో ఆదివారం అనగా డిసెంబరు 21న బీఆర్‌ఎస్‌ శాసనసభాపక్షం, రాష్ట్ర కార్యవర్గం భేటీ కానున్నట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ నేతృత్వంలో నేతలు సమావేశం కానున్నారు. ఈ కీలక సమావేశంలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాల్గొననున్నారని తెలుస్తోంది. దీంతో పాటు  సాగునీటి ప్రాజెక్టుల, నదీ జలాల అంశంపై పోరుకు బీఆర్‌ఎస్‌ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో వీటిపై కేసీఆర్‌ ఉద్యమ కార్యాచరణ ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. 

Also Read: Carrot Benefits: శీతాకాలంలో రోజూ క్యారెట్ తింటే ఏం జరుగుతుంది? ఆరోగ్యమా!! అనారోగ్యమా?

Also Read: iPhone 15 Offer Price: ఐఫోన్ 15 కేవలం రూ.11,050లకే! ఫ్లిప్‌కార్ట్‌లో అదిరిపోయే ఆఫర్..ఎలా పొందాలో తెలుసుకోండి!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
HDHarish Darla
Dec 20, 2025 11:32:49
Hyderabad, Telangana:

Carrot Benefits For Health: శీతాకాలం వచ్చిందంటే చాలు చలితో పాటు రకరకాల ఇన్ఫెక్షన్లు కూడా మన దరిచేరుతుంటాయి. ఈ కాలంలో లభించే అద్భుతమైన కూరగాయల్లో క్యారెట్ ఒకటి. రుచికి తియ్యగా ఉండే క్యారెట్ కేవలం ఆహారం మాత్రమే కాదు, పోషకాల గని కూడా. శీతాకాలంలో ప్రతిరోజూ క్యారెట్ తీసుకోవడం వల్ల మన శరీరానికి కలిగే ఆరోగ్య లాభాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

క్యారెట్‌లోని ముఖ్యమైన పోషకాలు
క్యారెట్‌లో శరీరానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. ఇందులో ఉండే విటమిన్ ఏ (బీటా-కెరోటిన్) కంటి చూపుకు మేలు చేస్తుండగా.. విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అలాగే క్యారెట్‌లోని పొటాషియం రక్తపోటును నియంత్రించి.. ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.

Also REad; Coin Under Pillow: నిద్రపోయే ముందు దిండు కింది రూపాయి బిళ్ళ ఉంచితే.. అదృష్టం వస్తుందట..నిజమిదే?

రోజూ క్యారెట్ తినడం వల్ల కలిగే 5 ప్రధాన లాభాలు
1. రోగనిరోధక శక్తి పెంపు

చలికాలంలో వైరల్ ఫీవర్లు, జలుబు, దగ్గు వంటివి వేగంగా వ్యాపిస్తాయి. క్యారెట్‌లోని విటమిన్-సి, యాంటీఆక్సిడెంట్లు శరీరానికి బ్యాక్టీరియా, వైరస్‌లతో పోరాడే బలాన్ని ఇచ్చి, రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి.

2. కంటి చూపు మెరుగుపడుతుంది 
క్యారెట్‌లో బీటా-కెరోటిన్ అధికంగా ఉంటుంది. ఇది మన శరీరంలోకి వెళ్ళాక విటమిన్-ఏగా మారుతుంది. ఇది రేచీకటి వంటి సమస్యలను నివారించడమే కాకుండా, కంటి చూపును స్పష్టంగా ఉంచడంలో సహాయపడుతుంది.

3. మెరిసే చర్మం
శీతాకాలపు చల్లని గాలి వల్ల చర్మం పొడిబారి, కాంతివిహీనంగా మారుతుంది. క్యారెట్లలోని పొటాషియం చర్మంలో తేమను నిలుపుతుంది. ఇందులోని యాంటీఆక్సిడెంట్లు చర్మానికి సహజమైన మెరుపును ఇచ్చి, మొటిమలు, మచ్చలను తగ్గిస్తాయి.

4. గుండె ఆరోగ్యానికి మేలు
క్యారెట్‌లో ఉండే పొటాషియం రక్తపోటును అదుపులో ఉంచుతుంది. అలాగే ఇందులోని ఫైబర్ పదార్థం శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. తద్వారా గుండె సంబంధిత సమస్యల ముప్పు తగ్గుతుంది.

5. మెరుగైన జీర్ణక్రియ
క్యారెట్లు ఫైబర్‌కు మంచి మూలం. వీటిని ప్రతిరోజూ సలాడ్ రూపంలో తీసుకోవడం వల్ల మలబద్ధకం సమస్య నుండి ఉపశమనం లభిస్తుంది. ఇది జీవక్రియను మెరుగుపరిచి బరువు తగ్గడానికి కూడా సహకరిస్తుంది.

ఎలా తీసుకోవాలి?
క్యారెట్లను పచ్చిగా సలాడ్ లాగా తీసుకోవచ్చు లేదా జ్యూస్ రూపంలో తాగవచ్చు. అయితే, వండిన క్యారెట్ల కంటే పచ్చిగా తినడం వల్ల పూర్తి స్థాయిలో ఫైబర్ అందుతుంది.

(గమనిక: ఈ సమాచారం సాధారణ అవగాహన కోసం మాత్రమే. ఏదైనా ఆరోగ్య సమస్య ఉన్నవారు లేదా కొత్త డైట్ ప్రారంభించేవారు వైద్యుని సంప్రదించడం ఉత్తమం. దీన్ని జీ తెలుగు న్యూస్ ధ్రువీకరించడం లేదు.)

Also Read: iPhone 15 Offer Price: ఐఫోన్ 15 కేవలం రూ.11,050లకే! ఫ్లిప్‌కార్ట్‌లో అదిరిపోయే ఆఫర్..ఎలా పొందాలో తెలుసుకోండి!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
DDDharmaraju Dhurishetty
Dec 20, 2025 11:27:17
Hyderabad, Telangana:

 Most Deadly King Cobra Video Watch: ప్రస్తుతం కొంతమంది సోషల్ మీడియాలో వైరల్ అయ్యేందుకు సాహసోపేతమైన పనులు చేస్తున్నారు. డేంజర్ అని తెలిసినప్పటికీ కూడా అలాంటి పనులే చేసి సోషల్ మీడియాలో నిలుస్తున్నారు. అలాగే మరికొంతమంది అయితే బహిరంగ ప్రదేశాల్లో చేయకూడని పనులు చేస్తూ ట్రెండింగ్ లో నిలుస్తున్నారు. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలే ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతూ వస్తున్నాయి. ముఖ్యంగా అత్యంత విషపూరితమైన సంస్కృపాలకు సంబంధించిన వీడియోలు ఎక్కువగా చూసేందుకు జనాలు ఆసక్తి చూపుతున్నారు.. దీంతో కొంతమంది పాములతో సాహసం చేసి మరి వాటితో ఆడుకుంటూ వీడియోలు పోస్ట్ చేస్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటనకు సంబంధించిన వీడియోని ఇప్పుడు వైరల్‌గా మారింది. 

ఇప్పుడు వైరల్ అవుతున్న వీడియోలో ఓ యువకుడు అత్యంత ప్రమాదకరమైన కింగ్ కోబ్రాతో ఆటలాటడం మీరు గమనించవచ్చు. ఈ వీడియోకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. ఓ వ్యక్తి కూర్చొని కనిపించడం మీరు చూడొచ్చు.. అలాగే అతని మెడలో అత్యంత పొడవైన ప్రమాదకరమైన నాగుపాము కూడా మీరు చూడొచ్చు. ఆ నాగుపాము పడగ విప్పి పొడవుగా కనిపించడం కూడా మీరు గమనించవచ్చు. పడక విప్పి అలాగే నిలబడి కనిపిస్తోంది. అయితే ఆ యువకుడు నెమ్మదిగా పైకి లేస్తూ ఉండడం కూడా మీరు చూడొచ్చు.. 

 
 
 
 
 

ఎంతో నెమ్మదిగా ఆ యువకుడు పామును రెండు చేతుల పట్టుకొని పైకి లేవడం మీరు ఈ వీడియోలో క్లియర్ గా చూడొచ్చు. అలాగే పైకి లేచిన వెంటనే ఆ యువకుడు పాము తో పాటు అటూ ఇటూ తిరగడం కూడా గమనించవచ్చు. అతను మూడు వైపుల పాములు మెడలో వేసుకుని తిరుగుతూనే ఉన్నాడు. అయితే, ఈ సమయంలో పాము ఏమాత్రం అతనిపై దాడి చేయలేకపోయింది. అంతేకాకుండా అతడు ఏ దిక్కున తిరిగితే.. ఆ దిక్కులో పాము కూడా తిరగడం మీరు చూడొచ్చు. ఇలా ఆ ప్రమాదకరమైన పాము మెడకు చుట్టుకొని ఆడుతున్న దృశ్యాలు ఇప్పుడు అందర్నీ షాక్ కు గురిచేస్తున్నాయి. సోషల్ మీడియాలో ఫేమ్ కొంతమంది ఇలాంటి పనులు చేస్తున్నారని సోషల్ మీడియా వినియోగదారుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

Also Read: King Cobra Video: ఏంగుండెరా వాడిది.. 20 అడుగుల కింగ్ కోబ్రాతో ఏంచేస్తున్నాడో తెలిస్తే షాక్.. వీడియో మీకోసం..

ఈ వీడియో చూసిన చాలా మంది వారి అభిప్రాయాలను కామెంట్లలో తెలుపుతున్నారు. నిజానికి ఆ పాము పెంచుకున్నదై ఉంటుందని.. అందుకే ఆ యువకుడు మెడకు చుట్టుకున్నప్పటికీ పాము ఏమాత్రం దాడి చేయలేక పోయిందని అంటున్నారు. ఇక మరికొంతమంది ఇలాంటి పాములతో చాలా జాగ్రత్తగా ఉండాలని కామెంట్లలో తెలుపుతున్నారు. ఏది ఏమైనా ఇలాంటి పాములను పట్టుకునే క్రమంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. లేకపోతే ప్రాణానికి ప్రమాదం.. ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియో ఓ ఇంస్టాగ్రామ్ ఖాతా నుంచి షేర్ చేశారు. ఇప్పటివరకు ఈ వీడియోను కొన్ని కోట్ల మందికి పైగా వీక్షించారు.

Also Read: King Cobra Video: ఏంగుండెరా వాడిది.. 20 అడుగుల కింగ్ కోబ్రాతో ఏంచేస్తున్నాడో తెలిస్తే షాక్.. వీడియో మీకోసం..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

  

0
comment0
Report
BBhoomi
Dec 20, 2025 10:42:46
Secunderabad, Telangana:

EPFO Pension Nomination Rules: ఉద్యోగం చేస్తూ పెళ్లి చేసుకోని వారి విషయంలో ఓ సందేహం ఉంటుంది. వివాహితులు అయితే నామినీగా తన భాగస్వామిని ఎంచుకుంటారు. మరి అవివాహితులు ఈపీఎఫ్ లేదా పెన్షన్ లో జమ అయిన డబ్బు ఎవరికి చెందుతున్న ప్రశ్న చాలా మందిలో ఉంటుంది. ముఖ్యంగా అవివాహిత ఉద్యోగులు తమ సోదరుడు లేదా సోదరిని నామినీని చేయవచ్చా అనే విషయంపై స్పష్టత లేక అయోమయంలో ఉంటారు. ఇలాంటి సందేహాలకు ఎంప్లాయిూస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ వివరణ ఇచ్చింది.

ఈపీఎఫ్ఓ రూల్స్ ఏం చెబుతున్నాయి?

అవివాహిత ఉద్యోగి తన సోదరుడు లేదా సోదరిని నామినీగా ఎంచుకోవచ్చా. అంటే ఈపీఎఫ్ఓ సమాధానం అవుననే చెబుతోంది. కానీ కొన్ని కండిషన్స్ పెట్టింది. పీఎఫ్, ఈపీఎస్ రెండింటికీ వేర్వేరు నామినేషన్లు అవసరమని ఈపీఎఫ్ఓ నియమాలు స్పష్టం చేస్తున్నాయి. 1952 ఉద్యోగుల భవిష్య నిధి స్కీములోని పేరా 2 జీ ప్రకారం కుటుంబం అనే పదానికి నిర్వచనం ఉంది. పురుష సభ్యుడి విషయంలో భార్య, పిల్లలు, అతనిపై ఆధారపడిన తల్లిదండ్రులు కుటుంబంగా పరిగణిస్తారు. మహిళా ఉద్యోగి విషయంలో భర్త, పిల్లలు, ఆమెపై ఆధారపడిన తల్లిదండ్రులు, భర్తపై ఆధారపడిన తల్లిదండ్రులను కుటుంబంగా లెక్కిస్తారు.

సోదరులు, సోదరీమణుల విషయంలో రూల్స్ ఏం చెబుతున్నాయి?

ఇక్కడ ఒక ముఖ్యమైన నిబంధన ఉంది. EPF పథకంలోని పేరా 61(4) ప్రకారం, నామినేషన్ చేసే సమయంలో ఉద్యోగికి కుటుంబం లేకపోతే, అతను లేదా ఆమె సోదరుడు, సోదరి సహా ఎవరినైనా నామినేట్ చేయవచ్చు. అంటే అవివాహితుడిగా ఉండి, పై నిర్వచనం ప్రకారం కుటుంబ సభ్యులు లేని ఉద్యోగి తన తోబుట్టువును నామినీగా పేర్కొనడానికి అర్హుడే అవుతారు. అయితే, ఉద్యోగి వివాహం చేసుకున్న వెంటనే లేదా కుటుంబం ఏర్పడిన వెంటనే, ముందుగా చేసిన నామినేషన్ ఆటోమెటిగ్గా చెల్లుబాటు కాకుండా పోతుంది. అప్పుడు EPFO నిర్వచించిన కుటుంబ సభ్యుల్లో ఎవరో ఒకరి పేరుతో కొత్తగా నామినేషన్ చేయడం తప్పనిసరి అవుతుంది.

Also Read: EPFO EDLI Scheme: PF హోల్డర్లకు రూ.7 లక్షల ఉచిత జీవిత బీమా.. క్లెయిమ్ చేసే ప్రక్రియను ఇక్కడ తెలుసుకోండి..!!

పెన్షన్‌కు సంబంధించిన నియమాలు :

పెన్షన్ విషయంలో కూడా EPFO స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చింది. ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్, 1995 లోని పేరా 2(vii) ప్రకారం, కుటుంబం అంటే జీవిత భాగస్వామి, పిల్లలు మాత్రమే. EPSలోని పేరా 16(5)(a) ప్రకారం, ఒక ఉద్యోగి అవివాహితుడిగా ఉండి, జీవించి ఉన్న జీవిత భాగస్వామి లేదా అర్హత కలిగిన పిల్లలు లేకపోతే, అతను తన పెన్షన్ కోసం ఏ వ్యక్తినైనా నామినేట్ చేయవచ్చు. ఇక్కడ కూడా అదే షరతు వర్తిస్తుంది. ఉద్యోగికి తర్వాత కుటుంబం ఏర్పడితే, ఆ నామినేషన్ రద్దు అవుతుంది.

PF, పెన్షన్‌కు వేర్వేరు నామినేషన్లు అవసరం:

ఒక ఉద్యోగి అవివాహితుడిగా ఉండి, EPFO నిర్వచనం ప్రకారం కుటుంబ సభ్యులు లేకపోతే, అతను లేదా ఆమె తమ సోదరుడు లేదా సోదరిని PFకూ, పెన్షన్‌కూ నామినేట్ చేయవచ్చు. అయితే PFకి ఒక ఫారం, EPSకి మరో ప్రత్యేక నామినేషన్ ఫారం తప్పనిసరిగా సమర్పించాలి. ఈ విషయంలో చిన్న నిర్లక్ష్యం జరిగినా, భవిష్యత్తులో మీ కుటుంబ సభ్యులకు ఆర్థిక ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది. అందుకే ఉద్యోగులు తమ వ్యక్తిగత పరిస్థితులు మారిన వెంటనే నామినేషన్ వివరాలను సకాలంలో అప్ డేట్ చేసుకోవాలి. .

Also Read:  PF Interest: మీ పీఎఫ్ అకౌంట్ ఎంత వడ్డీని సంపాదించింది? ఒకే ఒక క్లిక్ తో ఇలా చెక్ చేసుకోండి..!!

 

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.

0
comment0
Report
DDDharmaraju Dhurishetty
Dec 20, 2025 09:32:21
Hyderabad, Telangana:

 Rare Snakes Video Watch Here: భూమిపై చాలా రకాల వింత జంతువులు నివసిస్తూ ఉంటాయి. అంతేకాకుండా అప్పుడప్పుడు వీటికి సంబంధించిన దృశ్యాలు కూడా సోషల్ మీడియాలో కనిపిస్తూ ఉంటాయి. కొన్ని జీవులు చూడడానికి ఎంతో భయానకంగా ఉన్నప్పటికీ.. అంత ప్రమాదకరమైన ఉండవు. అయితే, కొన్ని రకాల పాముల జాతులు కూడా చూడడానికి ఎంతగానో భయంకరంగా ఉంటాయి. కానీ ఇవి అంతగా విషాన్ని కలిగి ఉండవు. నిత్యం ఇలాంటి పాములకు సంబంధించిన వీడియోలు మనం సోషల్ మీడియాలో తరచుగా చూస్తూ ఉంటాం. మంది పాములు పట్టే క్రమంలో వీడియోలు తీసి పోస్ట్ చేస్తున్నవి కూడా అప్పుడప్పుడు వైరల్ అవుతూ ఉన్నాయి. తాజాగా కూడా ఓ వీడియో వైరల్ అవుతోంది. 

ఇప్పుడు వైరల్ అవుతున్న వీడియో విషయానికొస్తే.. ఓ వ్యక్తి తన రెండు చేతుల నిండా పాములను తాళ్లలా పట్టుకొని అటు ఇటు తిరగడం మీరు చూడొచ్చు. అంతేకాకుండా ఆ వేలాడుతున్న పాములను వీడియోకు చూపిస్తూ.. ఉండడం కూడా గమనించవచ్చు. అయితే, ఈ వీడియోలో అతడు పట్టుకున్న పాములన్ని బొమ్మ పాముల్లాగా కనిపిస్తూ ఉన్నాయి. వీటిని చూసిన చాలామంది ఇవి బొమ్మ పాములని కూడా కామెంట్లు చేస్తున్నారు. నిజానికి ఇవి అరుదైన జాతికి సంబంధించిన పాములని.. వీటివల్ల మనుషులకు అంతగా ప్రమాదం ఉండదని సమాచారం. అందుకే ఆ యువకుడు తన రెండు చేతుల నిండా పాములను పట్టుకుని ఆడుతూ ఉన్నాడు. 

 
 
 
 
 

ఈ వీడియో చూసిన కొంతమంది వారి అభిప్రాయాలను కూడా కామెంట్లలో వ్యక్తం చేస్తున్నారు. నిజానికి ఆ యువకుడు పట్టుకున్న పాములు ప్రమాదకరమైనవి కాకపోయినప్పటికీ.. వీడియో చూస్తుంటే మాత్రం భయమేస్తోందని కామెంట్లు చేస్తున్నారు. ఇక మరి కొంతమంది అయితే ఆ వ్యక్తి పాములు పట్టడంలో నైపుణ్యం కలవాడని.. అందుకే ఆ పాములు అతన్ని ఏమీ చేయలేకపోతున్నాయని కామెంట్లు రాస్తున్నారు. ఏది ఏమైనా ఇలా పాములకు హాని కలిగించడం అంత మంచిది కాదని కొంతమంది వన్యప్రాణి సంరక్షకులు చెబుతున్నారు..

Also Read: King Cobra Video: ఏంగుండెరా వాడిది.. 20 అడుగుల కింగ్ కోబ్రాతో ఏంచేస్తున్నాడో తెలిస్తే షాక్.. వీడియో మీకోసం..

ఇప్పుడు వైరల్ అవుతున్న వీడియోను సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్‌లో therealtarzan అనే అకౌంటెంట్ షేర్ చేశారు. ఇప్పటివరకు ఈ వీడియోను 98 లక్షల మందికిపైగా వీక్షించినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా చాలామంది ఈ వీడియోను చూసి లైక్ చేశారు. అలాగే కొంతమంది ఈ వీడియోను చూసి ఫన్నీగా కామెంట్లు కూడా పెడుతున్నారు. సాధారణంగా ఇలా అడవుల్లో జీవించే అరుదైన వన్యప్రాణులతో ఆడడం అస్సలు మంచిది కాదు. దీనివల్ల పర్యావరణానికి ముప్పు కలిగే అవకాశాలున్నాయి. కాబట్టి, ఇలా పదుల సంఖ్యలో పాములను అడవుల నుంచి తెచ్చుకునే బదులు, ఇంట్లో ఒకటి లేదా రెండింటిని పెంచుకోవడం మంచిది.

Also Read: King Cobra Video: ఏంగుండెరా వాడిది.. 20 అడుగుల కింగ్ కోబ్రాతో ఏంచేస్తున్నాడో తెలిస్తే షాక్.. వీడియో మీకోసం..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

  

0
comment0
Report
Advertisement
Back to top