Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Rangareddy500033
Cobras Video Watch: అవి ఆట బొమ్మలు కాదురా బుడ్డోళ్లు.. ప్రమాదకరమైన కింగ్ కోబ్రాలు.. ఫుల్ వీడియో ఇదే!...
DDDharmaraju Dhurishetty
Feb 04, 2026 10:29:39
Hyderabad, Telangana

Children Playing With Cobras Video Watch: సాధారణంగా మనుషులకు పాములు కనిపిస్తేనే వెన్నులో వణుకు పుడుతుంది. అలాంటిది ఆ చిన్నారులు మాత్రం భయంకరమైన నాగుపాములతో ఏదో బొమ్మల్లాగా ఆడుకుంటున్నారు. అంతేకాకుండా ఒక చిన్న బుడ్డోడు అయితే అత్యంత ప్రమాదకరమైన కింగ్ కోబ్రా పడగ భాగాన్ని రెండు చేతులతో పట్టుకొని.. మూతి దగ్గరికి తీసుకెళ్లడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. అసలు ఈ ఘటన ఎక్కడ జరిగింది? ఇది ఇంతకీ నిజమైన వీడియో నేనా? దీనికి సంబంధించిన అన్ని రకాల వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం..

వీడియో వివరాల్లోకి వెళితే.. ఓ మారుమూల గ్రామంలో గిరిజన తెగకు సంబంధించిన చిన్నారులు విషపూరితమైన పాములతో అత్యంత సన్నిహితంగా ఉండడం మీకు కనిపిస్తుంది. కేవలం రెండు మూడేళ్లు కలిగిన ఈ చిన్నారులు నాగుపాముల మెడను పట్టుకొని వాటికి ముద్దులు పెడుతూ ఈ వీడియోలో కనిపించడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఈ వీడియోలో ముగ్గురు చిన్నారుల్లో.. ఇద్దరు అత్యంత ప్రమాదకరమైన కింగ్ కోబ్రా పామును మెడ భాగంలో పట్టుకుని ఉండడం మీరు చూడొచ్చు..

అయితే అందులో ఒక చిన్నారి మాత్రం ఆ పామును పట్టుకోవడానికి భయపడుతూ ఉండడం మీరు గమనించవచ్చు.. ఏది ఏమైనా ఇద్దరు మాత్రం ఆ కింగ్ కోబ్రాలను పట్టుకొని ఓ ఆట ఆడేస్తున్నారు. అయితే, ఈ సమయంలో కింగ్ కోబ్రాను ఆ పిల్లలకి ఎలాంటి హాని చేయకుండా.. కూల్ గా ఉండడం మీరు చూడొచ్చు. సాధారణంగా కింగ్ కోబ్రాలు పడక విప్పినై అంటేనే.. తప్పకుండా దాడి చేసేందుకు ప్రయత్నిస్తాయి. అలాంటిది ఈ వీడియోలో ఆ పిల్లలు పాములతో సన్నిహితంగా ఉన్నప్పటికీ అవి ఏమీ చేయలేకపోయాయి..

ఇక వీడియోలోనే ఆ పిల్లలు పాములను రెండు చేతుల పట్టుకొని ముఖం దగ్గరికి తీసుకెళ్లినప్పటికీ.. అక్కడున్న పెద్దలు సైతం దీనిని సర్వసాధారణంగా తీసుకున్నారు.. ఆ గ్రామంలో పిల్లలకు చిన్నతనం నుంచి పాములతో ఎలా మెలగాలి అనే శిక్షణ ఇచ్చినటున్నట్లు తెలుస్తోంది. అందుకే వారు ఆ పాములను ఎంతో సులభంగా పట్టుకొని ఉండడం మీరు చూడొచ్చు. ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియో ఓ యూట్యూబ్ ఛానల్ నుంచి పోస్ట్ చేశారు. దీనిని ఇప్పటివరకు కొన్ని వందల మంది వీక్షించినట్లు తెలుస్తోంది.

Also Read: India Us Trade Deal: భారత్‌కు ట్రంప్‌ భారీ గిఫ్ట్‌.. గొప్ప స్నేహితుడంటూ టారిఫ్‌ కట్‌, ప్రధాని మోదీ రియాక్షన్‌ ఇదే..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
HDHarish Darla
Feb 04, 2026 11:12:25
Hyderabad, Telangana:

Vaibhav Suryavanshi Vs Babar Azam: అండర్-19 ప్రపంచకప్‌లో టీమ్ ఇండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ చరిత్ర సృష్టించేందుకు అడుగు దూరంలో ఉన్నాడు. ఆఫ్ఘనిస్తాన్‌తో జరగనున్న కీలకమైన సెమీఫైనల్ మ్యాచ్‌లో వైభవ్ గనుక చెలరేగితే, పాకిస్థాన్ స్టార్ బ్యాటర్ బాబర్ ఆజం నెలకొల్పిన రికార్డు కనుమరుగు కానుంది. ప్రస్తుత ప్రపంచకప్‌లో వైభవ్ ఇప్పటివరకు 196 పరుగులు (సగటు 39.20) చేసి ఫర్వాలేదనిపిస్తున్నాడు. అయితే, సెమీఫైనల్ మ్యాచ్ అతనికి ఒక అద్భుతమైన అవకాశాన్ని ఇస్తోంది.

బాబర్ ఆజం రికార్డు ఏమిటి?
పాకిస్థాన్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజం తన అండర్-19 వన్డే కెరీర్‌లో 35 ఇన్నింగ్స్‌లలో 1,271 పరుగులు చేశాడు. ఇందులో 3 సెంచరీలు, 8 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. పరుగుల పరంగా బాబర్‌ను అధిగమించాలంటే వైభవ్‌కు ఇంకా 103 పరుగులు అవసరం.

ప్రస్తుతం అండర్-19 వన్డేల్లో యాక్టివ్‌గా ఉన్న ఆటగాళ్లలో బంగ్లాదేశ్‌కు చెందిన అజీజుల్ హకీమ్ (1,261 పరుగులు) అగ్రస్థానంలో ఉన్నాడు. బంగ్లాదేశ్ టోర్నీ నుండి నిష్క్రమించడంతో, వైభవ్ అతన్ని దాటేసే అవకాశం ఉంది.

వైభవ్ ప్రస్తుత స్కోరు: 1,169 పరుగులు (23 ఇన్నింగ్స్‌ల్లో).

లక్ష్యం: అజీజుల్ హకీమ్‌ను దాటడానికి 93 పరుగులు, బాబర్ ఆజంను దాటడానికి 103 పరుగులు.

స్ట్రైక్ రేట్‌లో వైభవ్ టాప్!
మిగిలిన బ్యాటర్లతో పోలిస్తే వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ శైలి అత్యంత వేగంగా ఉంటుంది. వైభవ్ స్ట్రైక్ రేట్ 158.18 (అండర్-19 చరిత్రలోనే ఇది అత్యుత్తమం)గా ఉంది. అయితే పాకిస్తాన్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజం స్ట్రైక్ రేట్ మాత్రం 73.85గా ఉండడం విశేషం.

ఆటగాడు ఇన్నింగ్స్ పరుగులు సగటు స్ట్రైక్ రేట్
అజీజుల్ హకీమ్ (బంగ్లా) 35 1,261 42.03 74.79
బాబర్ ఆజం (పాక్) 35 1,271 38.51 73.85
వైభవ్ సూర్యవంశీ (భారత్) 23 1,169 50.82 158.18

కేవలం 23 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ స్థాయికి చేరుకున్న వైభవ్, సెమీఫైనల్‌లో సెంచరీ సాధిస్తే బాబర్ ఆజంను పక్కకు నెట్టి అండర్-19 వన్డే చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన కీలక ఆటగాళ్ల జాబితాలో చేరిపోతాడు. భారత్ ఫైనల్ చేరాలంటే కూడా వైభవ్ మెరుపులు జట్టుకు ఎంతో అవసరం.

Also REad: Adani Data Center Vizag: హైకోర్టులో ఏపీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ..అదానీ డేటా సెంటర్‌ భూ వివాదంపై కీలక ఆదేశాలు!

Also Read: Jabardasth Bobby Accident: జబర్దస్త్ నటుడు మృతి..రాజమండ్రి బ్రిడ్జిపై ఘోర ప్రమాదం..కన్నీరుమున్నీరైన సుమ!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

 

0
comment0
Report
DDDharmaraju Dhurishetty
Feb 04, 2026 10:56:51
Hyderabad, Telangana:

Huge Anaconda Video Watch Now Here: సోషల్ మీడియాలో నిత్యం ఎన్నో వింతలు విశేషాలకు సంబంధించిన వీడియోలు మనకు కనిపించి ఆశ్చర్యానికి గురిచేస్తూ ఉంటాయి. ముఖ్యంగా వన్యప్రాణులకు సంబంధించిన కొన్ని దృశ్యాలు సోషల్ మీడియా వినియోగదారులను ఎంతగానో ఆకట్టుకుంటాయి. ఇలాంటి వీడియోలకు జనాలు ఎక్కువగా ఆకర్షితులవుతారు. ముఖ్యంగా చాలామంది సోషల్ మీడియా వినియోగదారులు ఎక్కువగా పాములకు సంబంధించిన వీడియోలను వీక్షించేందుకు ఆసక్తి చూపుతూ ఉంటారు. 

తాజాగా కేవలం 9 సెకండ్ల నిడివి గల భారీ అనకొండకు సంబంధించిన ఓ వీడియో వైరల్‌గా మారింది. ఈ వీడియోను పెద్ద పరిమాణం కలిగిన అనకొండ మీరు చూడొచ్చు. అయితే, ఈ పాము తన కంటే పరిమాణంలో పెద్దదిగా ఉన్న ఓ జీవిని అమాంతం మింగేయడానికి ప్రయత్నించింది.. అది అనుకున్న ప్రకారమే ఆ జీవిని అనకుండా మొత్తం మింగడానికి ప్రయత్నిస్తోంది.. ఈ సమయంలోనే దాని నోరుని పెద్దగా తెరిచి, సగం వరకు మింగేయడం మీరు ఈ వీడియోలో క్లియర్‌గా చూడొచ్చు. 

ఆ పాము ఆహారాన్ని సగం వరకు మాత్రమే నోట్లోకి లాక్కోవడం మీరు చూడొచ్చు.. ఆ తర్వాత ఆహారం పెద్దదిగా ఉండడంతో.. మరింత సగం లోపలికి లాక్కోలేకపోయింది.. చేసేదేమీ లేక ఆ పాము మింగుతున్న జీవిని నోటి భాగం గుండా బయటికి కక్కేసింది. ఇలా ఆ పాము సగం వరకు మింగిన జీవిని బయటికి కక్కేయడం మీరు ఈ వీడియోలో క్లియర్‌గా చూడొచ్చు. పాములు ఇతర జీవులను చంపుకొని తినడం ప్రకృతి ఆహారపు గొలుసులో భాగమైనప్పటికీ.. కానీ పాముల కంటే భారీ శరీరం కలిగిన జీవులను తినడానికి ప్రయత్నించడం వాటికే శాపమని ఈ వీడియో క్లియర్‌గా తెలుపుతోంది. 

ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతూ వస్తోంది. ఇప్పటివరకు ఈ వీడియోను 57,000 మందికి పైగా సోషల్ మీడియా వినియోగదారులు వీక్షించారు. పాము అంత పెద్ద జీవిని ఎలా మింగుతుంది? అని రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. కొంతమందైతే పాము దవడలు విరగడం వల్లే.. ఆ జీవిని బయటికి కక్కేస్తోందని కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ.. ఇప్పుడు ఈ వీడియో మాత్రం సోషల్ మీడియాలో పెద్ద హైలెట్‌గా మారింది.

Also Read: Cobra Hood Video: వామ్మో.. ప్లాస్టిక్ డబ్బాలో పడగ విప్పిన నాగుపాము.. వీడియో ఇదే చూడండి..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
comment0
Report
DDDharmaraju Dhurishetty
Feb 04, 2026 10:43:57
Hyderabad, Telangana:

Baby Snake Video Watch Here: సాధారణంగా భూమిపైన కొన్ని పాములు మాత్రమే నేరుగా పిల్లలకు జన్మనిస్తాయి. కానీ వందలో 80 శాతం పాములు మాత్రం గుడ్డు పెట్టి పిల్లలకు జన్మనిస్తాయి. ఇలాంటి సమయాల్లో పాములు తప్పకుండా వాటి పిల్లలను రక్షించుకోవడానికి గుడ్ల దగ్గరే పాడుగాపులు కాస్తూ ఉంటాయి. సాధారణంగా మనం సోషల్ మీడియాలో వైర్లు అవుతున్న ఎన్నో రకాల ఫార్ములకు సంబంధించిన వీడియోలు చూసాం.. కానీ ఇప్పుడు వైరల్ అవుతున్న వీడియో వీటన్నిటికీ చాలా భిన్నమైంది గా భావించవచ్చు. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న బేబీ స్నేక్ సంబంధించిన వీడియో ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఇంతకీ ఈ వీడియోలో ఏముంది? దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. 

ఈ వీడియోకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. పాము గుడ్డు నుంచి ఒక చిన్న పిల్ల బయటికి రావడం కనిపిస్తుంది.. వీడియో ప్రారంభంలో ఒక వ్యక్తి తెల్లని గుడ్డును పట్టుకొని.. ఉండడం మీరు చూడొచ్చు.. ఆ తర్వాత ఆ వ్యక్తి దాని పొరను మెల్లగా విడదీస్తూ కనిపించడం మీరు క్లియర్‌గా చూడవచ్చు. అప్పుడే మీకు ఆ గుడ్డు లోపల ఉన్న చిన్న పాము పిల్ల కనిపిస్తుంది. సాధారణంగా అప్పుడే పుట్టిన పాములు అంతగా విషం కలిగి ఉండవు..

ఆ వ్యక్తి గుడ్డు పెంకును కొద్దిగా తొలగించిన వెంటనే పాము.. నెమ్మదిగా తలను బయటికి పెట్టి.. చుట్టూ ఉన్న పరిసరాలను అటు ఇటు చూస్తూ ఉండడం మీరు గమనించవచ్చు.. అంతేకాకుండా ఆ బుల్లి పాము తన నాలుకను బయటపెట్టి పరిసరాలను క్లియర్గా చూడడం మీరు ఈ వీడియోలో ఎంతో స్పష్టంగా చూడవచ్చు.. ఆ తర్వాత ఈ చిన్న పాము గుడ్డు లోపలి నుంచి పూర్తిగా బయటికి వచ్చి అతని చేతిపై పాకుతూ ఉండేందుకు ప్రయత్నిస్తోంది. 

Also Read: Cobra Hood Video: వామ్మో.. ప్లాస్టిక్ డబ్బాలో పడగ విప్పిన నాగుపాము.. వీడియో ఇదే చూడండి..

ఆ చిన్న పాము అతని చేతిపై పాకుతూ నెమ్మదిగా కదులుతూ ఉన్న అద్భుతమైన దృశ్యాలు మీరు ఈ వీడియోలో చూడొచ్చు. ఈ పాము చాలా చిన్నదిగా ముదురు రంగు మచ్చలతో కూడిన చర్మం కలిగి ఉంది. ఇలాంటి అరుదైన దృశ్యాలు సోషల్ మీడియాలో అప్పుడప్పుడు ఊహించని స్థాయిలో వైరల్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు కూడా ఈ వీడియోను యూట్యూబ్ ఛానల్ నుంచి పోస్ట్ చేశారు. ఇప్పటివరకు ఈ వీడియోను కొన్ని వేల మంది సోషల్ మీడియా వినియోగదారులు వీక్షించారు.

Also Read: Cobra Hood Video: వామ్మో.. ప్లాస్టిక్ డబ్బాలో పడగ విప్పిన నాగుపాము.. వీడియో ఇదే చూడండి..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
comment0
Report
HDHarish Darla
Feb 04, 2026 10:35:45
Hyderabad, Telangana:

Adani Data Center Vizag Land Dispute: ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్, రాష్ట్ర ప్రభుత్వానికి విశాఖపట్నంలోని భూ కేటాయింపుల వ్యవహారంలో హైకోర్టులో చుక్కెదురైంది. అదానీ డేటా సెంటర్ ఏర్పాటుకు వందల ఎకరాల విలువైన ప్రభుత్వ భూమిని ఉచితంగా కట్టబెట్టడంపై న్యాయస్థానం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.

విశాఖపట్నం శివారులోని అడవివరం, ముడసరిలోవ ప్రాంతాల్లో సుమారు 480 ఎకరాల భూమిని అదానీ గ్రూపు సంస్థలకు కేటాయించాలన్న ప్రభుత్వ నిర్ణయం ఇప్పుడు న్యాయ వివాదంలో చిక్కుకుంది.

పిటిషనర్ వాదనలు
జై భీమ్ భారత్ పార్టీ (JBP) అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు నేతల నాగేశ్వరరావు ఈ కేటాయింపులను సవాలు చేస్తూ ప్రజా ప్రయోజన వ్యాజ్యం (PIL) దాఖలు చేశారు. పిటిషనర్ తరపున ప్రముఖ న్యాయవాది జడ శ్రవణ్ కుమార్ బలమైన వాదనలు వినిపించారు. అయితే కేటాయించిన 480 ఎకరాల భూమి విలువ సుమారు రూ.5,000 కోట్లు ఉండొచ్చని వారు కోర్టుకు నివేదించారు.

2023 నాటి ల్యాండ్ అలాట్మెంట్ పాలసీ (జీవో నంబర్ 117) ప్రకారం.. పరిశ్రమలకు భూములను కేవలం లీజుకు మాత్రమే ఇవ్వాలి. ప్రాజెక్టు పూర్తయిన తర్వాతే తదుపరి చర్యలు ఉండాలి. పరిశ్రమ ఏర్పాటు కాకముందే 'సేల్ డీడ్' రాసిస్తే, ఆ భూమిపై ప్రభుత్వం తన పూర్తి అధికారాలను కోల్పోతుందని పిటిషనర్ ఆందోళన వ్యక్తం చేశారు.

జీవోల జారీ - ప్రోత్సాహకాలు
రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది అదానీ సంస్థలకు అనుకూలంగా రెండు కీలక ఉత్తర్వులు జారీ చేసింది.

జీవో 40 (11-10-2025): భూమితో పాటు రూ.1,000 కోట్ల ప్రోత్సాహకాలు ఇస్తున్నట్లు ప్రకటించింది.

జీవో 66 (02-12-2025): 480 ఎకరాల భూమిని తక్షణమే బదలాయించాలని అధికారులను ఆదేశించింది.

హైకోర్టు ధర్మాసనం సంధించిన ప్రశ్నలు
చీఫ్ జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, జస్టిస్ చల్లా గుణరంజన్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ అంశంపై ప్రభుత్వాన్ని నిలదీసింది.

1) ఉచితంగా భూమిని ఎలా బదలాయిస్తారు? ఏ చట్టం ఈ అధికారాలను ప్రభుత్వానికి ఇచ్చింది?

2) కేవలం లీజు పద్ధతిలో మాత్రమే భూములు ఇవ్వాలన్న నిబంధన ఉన్నప్పుడు, డైరెక్ట్ సేల్ డీడ్ ఎలా రాస్తారు?

3) ఇప్పటి వరకు ఆ కంపెనీల పేరుతో సేల్ డీడ్ రిజిస్ట్రేషన్ జరిగిందా లేదా అని ధర్మాసనం ప్రశ్నించింది.

ప్రభుత్వ స్పందన
ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ (AG) దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపిస్తూ, ఈ జీవోల వెనుక ఉన్న పూర్తి వివరాలను తెలుసుకోవడానికి సమయం కావాలని కోరారు. ప్రభుత్వం దీనిపై సమగ్రమైన కౌంటర్ దాఖలు చేస్తుందని కోర్టుకు విన్నవించారు.

హైకోర్టు ఈ వ్యవహారంపై తీవ్రంగా స్పందిస్తూ, పూర్తి వివరాలతో కూడిన ప్రమాణ పత్రం దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ కేటాయింపులకు సంబంధించిన అన్ని ప్రతివాదులకు నోటీసులు జారీ చేస్తూ, విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.

Also Read: Jabardasth Bobby Accident: జబర్దస్త్ నటుడు మృతి..రాజమండ్రి బ్రిడ్జిపై ఘోర ప్రమాదం..కన్నీరుమున్నీరైన సుమ!

Also Read: DA Hike 2026: రాష్ట్ర ఉద్యోగులకు బంపర్ ఆఫర్..5 శాతం పెరగనున్న డీఏ..ఎవరికి ఎంత వస్తుంది? ఎక్కడంటే?

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
RKRavi Kumar Sargam
Feb 04, 2026 10:35:23
Dharmavaram, Andhra Pradesh:

YS Sharmila Yatra: 'అద్భుతంగా నడుస్తున్న ఉపాధి హామీ పథకం మోదీ అధికారంలో వచ్చాక భ్రష్టు పట్టించారు. ఉపాధికి గ్రహణం పట్టించారు. నిర్వీర్యం చేయాలని కుట్రలు చేశారు. దేశవ్యాప్తంగా ఉపాధి హామీ పథకానికి అయ్యే ఖర్చు రూ.86 వేల కోట్లు. ఈ మొత్తం బీజేపీ కాంట్రాక్టర్ల జేబుల్లో పెట్టేందుకు కొత్త చట్టం తెచ్చారు. వీబీ గ్రామ్ జీ అనే చట్టం ఒక పనికి మాలిన పథకం. రాష్ట్రాల మీద భారం తప్పా లాభం లేదు. రాష్ట్రం మీద 40 శాతం భారం వేయడం దుర్మార్గం. రాష్ట్రం 40 శాతం నిధులు ఇవ్వకపోతే పథకం ఆగినట్లే' అని వైఎస్‌ షర్మిల ఆందోళన వ్యక్తం చేశారు.

Also Read: Arava Sridhar: ఇది నాకు, వీణకు మధ్య వ్యక్తిగత సంబంధం: జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌

ఉపాధి హామీ చట్టం పరిరక్షణ యాత్ర 3వ రోజు సత్యసాయి జిల్లాలో కొనసాగింది. ధర్మవరం నియోజకవర్గం రాఘవంపల్లి గ్రామంలో జరుగుతున్న ఉపాధి హామీ పనుల్లో  వైఎస్ షర్మిలా రెడ్డి పాల్గొని పనులు చేశారు. అనంతరం కీలక ప్రసంగం చేశారు. 'నరేగాలో 7 గంటలు పని చేస్తే చాలు. కానీ మోడీ తెచ్చిన కొత్త చట్టంలో 12 గంటలు పని చేయాలట. 125 రోజుల పని కల్పన అనేది బూటకం.. పచ్చి మోసం. నరేగా కింద 100 రోజులు ఉంటేనే సగటున 50 రోజులు పని కల్పించలేదు. కాంగ్రెస్ హయాంలో 100 రోజులు పని ఒక హక్కు. బీజేపీ అధికారంలో వచ్చాక సగటున 52 రోజులు పని ఇచ్చారు. చేసిన పనికి కూడా వేతనాలు ఆపారు. 100 రోజులు పని ఇవ్వలేని వాళ్లు 125 రోజులు ఇస్తాం అంటే హాస్యాస్పదం' అని వైఎస్‌ షర్మిల తెలిపారు.

Also Read: Manipur Violence: మణిపూర్‌లో రాష్ట్రపతి పాలన ముగింపు.. కొత్త ముఖ్యమంత్రి ఎవరో తెలుసా?

'పేదల నుంచి వ్యతిరేకత రాకుండా 125 రోజులు అని మభ్యపెడుతున్నారు. గ్రామ్ జీ చట్టం ద్వారా మళ్లీ వలసలు పెరుగుతాయి. గ్రామాల్లో ఆకలి చావులు పెరుగుతాయి. గ్రామ్ జీ చట్టం పేదల పొట్టలు కొట్టే చట్టం. నరేగా కింద పనులు గ్రామ సభలు నిర్ణయించేవి. గ్రామ్ జీ చట్టంలో పనులు కేంద్రం నిర్ణయం చేస్తుంది అట. మన గ్రామంలో ఏం పని కావాలో కేంద్రానికి ఏం తెలుసు?' అని ఏపీసీసీ చీఫ్‌ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ప్రశ్నించారు.

Also Read: Wild Tiger: రాజమండ్రి ప్రజలకు బిగ్‌ అలర్ట్.. జనారణ్యంలో చిరుతపులి సంచారం

'ఇదంతా కాంట్రాక్టర్లను బతికించే చట్టం. కాంట్రాక్టర్లకు లేబర్‌ను సరఫరా చేసే పథకం. కాంగ్రెస్‌ హయాంలో ఉపాధి హామీ పని జరిగే చోట అన్ని సౌకర్యాలు కల్పించారు. ఇప్పుడు పని జరిగే చోట తాగునీళ్లు కూడా లేవు. పథకాన్ని కావాలని చంపుతున్నారు' అని వైఎస్‌ షర్మిల తెలిపారు. 'ఇటీవల రాష్ట్రంలో 18 లక్షల జాబ్ కార్డులు తొలగించారు. ఆనాడు వైఎస్సార్‌ కాలంలో కోటి 10 లక్షల కార్డులు ఉండేవి. ఇప్పుడు 65 లక్షలకు కార్డులను కుదిర్చారు. ఐదేళ్ల కాలంలో దాదాపు 50 లక్షల జాబ్ కార్డులు తొలగించారు' అని వివరించారు. రాష్ట్రంలో ఉపాధి హామీ పని రక్షణకు పేదలకు ముందుకు రావాలని చెప్పారు. 'నరేగా పథకం పేదల పొట్ట నింపే పథకం. గ్రామ్‌జీ పథకం పేదల పొట్ట కొట్టే పథకం. అందరూ కలిసి కాంగ్రెస్ చేసే పరిరక్షణ పోరాటంలో భాగం కావాలి' అని పిలుపునిచ్చారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.

0
comment0
Report
HDHarish Darla
Feb 04, 2026 10:02:07
Rajamahendravaram, Andhra Pradesh:

Jabardasth Bobby Death News: తెలుగు బుల్లితెరపై తన కామెడీ టైమింగ్‌తో అందరినీ నవ్వించిన 'జబర్దస్త్' కమెడియన్ లక్ష్మీనారాయణ (బాబీ) రోడ్డు ప్రమాదంలో మరణించడం చిత్ర పరిశ్రమను విషాదంలో ముంచెత్తింది. రాజమండ్రిలో జరిగిన ఈ ఘోర ప్రమాదంలో బాబీతో పాటు మరో ఇద్దరు యువకులు కూడా ప్రాణాలు కోల్పోవడం కలిచివేస్తోంది.

రాజమండ్రిలోని రోడ్డు కం రైల్వే బ్రిడ్జిపై సోమవారం రాత్రి జరిగిన ఈ బైక్ ప్రమాదం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బుల్లితెరపై ఎంతో భవిష్యత్తు ఉన్న ఒక నటుడు ఇలా అర్ధాంతరంగా తనువు చాలించడం అందరినీ ఆవేదనకు గురిచేస్తోంది.

ఏం జరిగింది?
అతివేగంగా వచ్చిన రెండు బైక్‌లు ఎదురెదురుగా బలంగా ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండటంతో బాబీతో పాటు అక్షయ్ కుమార్, సత్యకుమార్ అనే యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. యువకులు హెల్మెట్లు ధరించకపోవడం, వాహనాలను అతివేగంతో నడపడమే ఈ మరణాలకు ప్రధాన కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.

బాబీ మరణవార్త విన్న వెంటనే స్టార్ యాంకర్ సుమ కనకాల తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. బాబీకి సుమతో మంచి సాన్నిహిత్యం ఉంది. వార్త తెలిసిన వెంటనే ఆమె హైదరాబాద్ నుండి రాజమండ్రికి చేరుకున్నారు. బాబీ భౌతికకాయాన్ని చూసి సుమ కంటతడి పెట్టారు.

"అందరినీ నవ్వించే బాబీ ఇలా మౌనంగా వెళ్లిపోతారని అనుకోలేదు" అంటూ ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చారు. బాబీ మరణం టెలివిజన్ రంగానికి పెద్ద లోటని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

బాబీ కేవలం జబర్దస్త్‌లోనే కాకుండా 'సుమ అడ్డా' వంటి అనేక ప్రముఖ షోలలో నటించి ప్రేక్షకులకు చేరువయ్యారు. ఆయన మృతిపై రష్మీ, సుధీర్, ఆది వంటి ఇతర కమెడియన్లు సోషల్ మీడియా వేదికగా సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

ఒక చిన్న పొరపాటు, అతివేగం కారణంగా ముగ్గురు యువకుల ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. బాబీ ఆత్మకు శాంతి చేకూరాలని అభిమానులు కోరుకుంటున్నారు.

Also REad: DA Hike 2026: రాష్ట్ర ఉద్యోగులకు బంపర్ ఆఫర్..5 శాతం పెరగనున్న డీఏ..ఎవరికి ఎంత వస్తుంది? ఎక్కడంటే?

Also Read: Mrunal Thakur Hit Movies: 7 ఏళ్లుగా మృణాల్ ఠాకూర్‌ను వెంటాడుతోంది..ఇప్పటికైనా ఆ కోరిక తీరుతుందా?

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
HDHarish Darla
Feb 04, 2026 09:37:55
Tamil Nadu:

Tamil Nadu Government Employees DA Hike: తమిళనాడు ప్రభుత్వ ఉద్యోగులకు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 2026 సంవత్సరం అదిరిపోయే ఆరంభాన్ని ఇవ్వబోతోంది. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ప్రభుత్వం అందించే కరువు భత్యం (DA) ఈసారి 5 శాతం పెరిగే అవకాశం ఉండటంతో ఉద్యోగుల జీతాలు భారీగా పెరగనున్నాయి. ఆల్ ఇండియా కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ (AICPI) గణాంకాల ప్రకారం.. జనవరి 2026 నుండి అమలులోకి వచ్చే కరువు భత్యంపై స్పష్టత వచ్చింది.

ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగులు 58% డీఏ పొందుతున్నారు. నవంబర్, డిసెంబర్ నెలల్లో వినియోగదారుల ధరల సూచిక 148.2 పాయింట్ల వద్ద స్థిరంగా ఉండటంతో, ఈసారి డీఏ 5% పెరిగి 63%కి చేరడం దాదాపు ఖాయమైనట్లు తెలుస్తోంది.

జీతం ఎంత పెరుగుతుంది? (ఉదాహరణతో..)
ఒక ఉద్యోగి మూల వేతనం (Basic Pay) రూ. 40,000 అనుకుంటే.. పాత డీఏ (58%) రూ.23,200 అలాగే  కొత్త డీఏ (63%) రూ.25,200గా ఉండనుంది. ఈ క్రమంలో ఆ ఉద్యోగికి  నెలకు రూ.2,000 అదనపు జీతం లభించే అవకాశం ఉంది.

కేవలం డీఏ మాత్రమే కాకుండా, ఇది 50 శాతం దాటినందున నిబంధనల ప్రకారం HRA (ఇంటి అద్దె అలవెన్స్), TA (రవాణా అలవెన్స్) కూడా పెరుగుతాయి. దీనివల్ల ఉద్యోగి చేతికి వచ్చే మొత్తం జీతం గణనీయంగా పెరుగుతుంది.

సాధారణంగా జనవరి నుండి వర్తించే డీఏ పెంపును కేంద్ర ప్రభుత్వం మార్చి నెలలో (హోలీ పండుగ సమయానికి) అధికారికంగా ప్రకటిస్తుంది. బడ్జెట్ సమావేశాల తర్వాత దీనిపై కేబినెట్ ఆమోదం లభిస్తుంది. ఏప్రిల్ నెల జీతంతో పాటు జనవరి నుంచి మార్చి వరకు ఉన్న 3 నెలల బకాయిలను (Arrears) కలిపి చెల్లిస్తారు.

తమిళనాడు ఉద్యోగులకు డబుల్ ధమాకా!
కేంద్రం డీఏ పెంపును ప్రకటించిన వెంటనే, ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ నేతృత్వంలోని తమిళనాడు ప్రభుత్వం కూడా తమ రాష్ట్ర ఉద్యోగులు, ఉపాధ్యాయులకు 5% డీఏ పెంపును ప్రకటించే అవకాశం ఉంది.

రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఈ విషయంలో సానుకూల నిర్ణయం తీసుకోవచ్చని, త్వరలో ప్రవేశపెట్టే తాత్కాలిక బడ్జెట్‌లో దీనిపై స్పష్టత రావచ్చని సచివాలయ వర్గాలు భావిస్తున్నాయి.

ప్రస్తుతం 7వ వేతన సంఘం సిఫార్సుల ప్రకారం జీతాలు అందుతున్నాయి. 8వ వేతన సంఘంపై ప్రాథమిక కసరత్తు మొదలైనప్పటికీ, అది అమలులోకి రావడానికి మరో రెండేళ్లు పట్టవచ్చు. అప్పటి వరకు ఈ ఆరు నెలలకోసారి పెరిగే డీఏనే ఉద్యోగులకు ప్రధాన ఉపశమనం.

Also Read: Pat Cummins IPL 2026: ఐపీఎల్ ముందు కావ్యాపాపకి బిగ్‌ షాక్! సన్‌రైజర్స్ టీమ్ నుంచి కెప్టెన్ అవుట్!

Also Read: Mrunal Thakur Hit Movies: 7 ఏళ్లుగా మృణాల్ ఠాకూర్‌ను వెంటాడుతోంది..ఇప్పటికైనా ఆ కోరిక తీరుతుందా?

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
HDHarish Darla
Feb 04, 2026 09:16:18
Hyderabad, Telangana:

Pat Cummins Ruled Out Of IPL: ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభానికి ముందే సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) అభిమానులకు మింగుడుపడని వార్త అందుతోంది. జట్టును ముందుండి నడిపించే కెప్టెన్, ఆస్ట్రేలియా స్టార్ ఆల్ రౌండర్ పాట్ కమిన్స్ ఈ మెగా టోర్నీకి దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. వెన్నునొప్పి సమస్య తలెత్తడమే ఇందుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. మార్చి 26 నుంచి ఐపీఎల్ సీజన్-19 ప్రారంభం కానుంది. అయితే, అంతకంటే ముందే హైదరాబాద్ ఫ్రాంచైజీ కెప్టెన్ ఇబ్బందుల్లో పడటం ఫ్యాన్స్‌ను ఆందోళనకు గురిచేస్తోంది.

ప్రస్తుతం క్రికెట్ ప్రపంచమంతా టీ20 ప్రపంచకప్ 2026 కోసం సిద్ధమవుతోంది. అయితే, వెన్నునొప్పి కారణంగా కమిన్స్ ఇప్పటికే ఈ మెగా ఈవెంట్‌కు దూరమయ్యాడు. ప్రపంచకప్ ముగిసిన వెంటనే ఐపీఎల్ ప్రారంభం కానుండటంతో, అప్పటికి ఆయన కోలుకుంటాడా లేదా అన్నది సందేహంగా మారింది.

తను ఐపీఎల్ ఆడటంపై పాట్ కమిన్స్ స్వయంగా క్లారిటీ ఇచ్చారు. "ప్రస్తుతానికి నేను ఏమీ చెప్పలేను. త్వరలో మరోసారి స్కాన్ చేయించుకోవాలి. నా వెన్నెముక ఎంత వేగంగా కోలుకుంటుందనే దానిపైనే ఐపీఎల్‌లో నా భాగస్వామ్యం ఆధారపడి ఉంటుంది. పూర్తి ఫిట్‌నెస్ సాధిస్తేనే మైదానంలోకి దిగుతాను" అని ఆయన పేర్కొన్నారు.

ఆస్ట్రేలియా బోర్డు నిబంధనల ప్రకారం.. సెంట్రల్ కాంట్రాక్ట్ ఉన్న ప్లేయర్లు పూర్తి ఫిట్‌గా ఉంటేనే విదేశీ లీగ్‌లలో ఆడేందుకు అనుమతిస్తారు. మార్చి నెలాఖరు నాటికి కమిన్స్ ఫిట్‌నెస్ సాధించకపోతే, క్రికెట్ ఆస్ట్రేలియా అతన్ని భారత్‌కు పంపే అవకాశం లేదు. ఒకవేళ కమిన్స్ దూరం అయితే, హైదరాబాద్ జట్టు కొత్త కెప్టెన్‌ను వెతుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.

సన్‌రైజర్స్ హైదరాబాద్ పూర్తి జట్టు (IPL 2026)..
పాట్ కమిన్స్ (కెప్టెన్), ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, హెన్రిచ్ క్లాసెన్, నితీష్ కుమార్ రెడ్డి, హర్షల్ పటేల్, లియామ్ లివింగ్‌స్టోన్, జైదేవ్ ఉనద్కత్, భువనేశ్వర్ కుమార్, కమిందు మెండిస్, బ్రైడన్ కార్సే తదితరులు.

గత సీజన్‌లో హైదరాబాద్‌ను ఫైనల్‌కు చేర్చడంలో కమిన్స్ కీలక పాత్ర పోషించారు. మరి వచ్చే నెలలో జరిగే ఫిట్‌నెస్ టెస్టులో ఆయన పాస్ అయ్యి, ఆరెంజ్ ఆర్మీని నడిపిస్తారో లేదో వేచి చూడాలి.

Also Read: Mrunal Thakur Hit Movies: 7 ఏళ్లుగా మృణాల్ ఠాకూర్‌ను వెంటాడుతోంది..ఇప్పటికైనా ఆ కోరిక తీరుతుందా?

Also Read: EPFO Interest Rate: ఉద్యోగులకు షాకింగ్ న్యూస్..పీఎఫ్ వడ్డీ రేటులో కోత? భారీగా తగ్గించే యోచనలో కేంద్రం!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
HDHarish Darla
Feb 04, 2026 08:28:30
Hyderabad, Telangana:

Mrunal Thakur Hits And Flops: టాలీవుడ్‌లో 'సీతామహాలక్ష్మి'గా వెలిగిపోతున్న మృణాల్ ఠాకూర్ కెరీర్ ఇప్పుడు ఒక ఆసక్తికరమైన మలుపులో ఉంది. సౌత్‌లో తిరుగులేని విజయాలు అందుకుంటున్న ఈ భామకు, సొంత గూడు బాలీవుడ్‌లో మాత్రం ఏడేళ్లుగా ఒక సరైన హిట్టు పడలేదు. ఈ నేపథ్యంలో ఆమె ఆశలన్నీ ఇప్పుడు రాబోయే చిత్రాలపైనే ఉన్నాయి.

బుల్లితెర నుండి వెండితెరకు పరిచయమైన మృణాల్, కెరీర్ ఆరంభంలో 'సూపర్ 30', 'బాట్లా హౌస్' వంటి చిత్రాలతో బాలీవుడ్‌లో మంచి విజయాలనే అందుకుంది. కానీ ఆ తర్వాతే ఆమెకు కష్టాలు మొదలయ్యాయి.

బాలీవుడ్‌లో మృణాల్ నటించిన 'జెర్సీ', 'గుమ్రా', 'ఆంఖ్ మిచోలీ' వంటి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి. గత ఏడాది వచ్చిన 'సన్నాఫ్ సర్దార్ 2' కూడా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. అయితే, ఆమె బాలీవుడ్ కెరీర్ ప్రమాదంలో పడ్డ ప్రతిసారీ టాలీవుడ్ ఆమెను ఆదుకుంది.

'సీతారామం' సినిమాతో మృణాల్ క్రేజ్ పాన్-ఇండియా స్థాయికి చేరింది. అలాగే 'హాయ్ నాన్న' మరో క్లాసిక్ హిట్ అందుకోవడంతో బాలీవుడ్ మేకర్స్ మళ్లీ ఆమె వైపు చూడటం మొదలుపెట్టారు.

బాలీవుడ్‌లో వరుస ఫ్లాపులు ఉన్నప్పటికీ, మృణాల్‌కు అక్కడ అవకాశాలు తగ్గకపోవడానికి ప్రధాన కారణం సౌత్‌లో ఆమెకు ఉన్న విపరీతమైన ఇమేజ్. అందుకే బీటౌన్ మేకర్స్ ఆమెకు రెడ్ కార్పెట్ పరుస్తూ వరుస ఆఫర్లు ఇస్తున్నారు.

ప్రస్తుతం మృణాల్ ఆశలన్నీ 'దో దీవానే శెహర్ మే' చిత్రంపైనే ఉన్నాయి. ఒక స్వచ్ఛమైన రొమాంటిక్ లవ్ స్టోరీగా వస్తున్న ఈ సినిమా ఈ నెల 20న విడుదల కానుంది. ఏడేళ్ల తర్వాత బాలీవుడ్‌లో ఆమెకు ఒక భారీ హిట్ దక్కుతుందా లేదా అనేది ఈ సినిమాతోనే తేలిపోనుంది.

అడవి శేష్‌తో చేస్తున్న డెకాయిట్ (Dacoit) బైలింగ్వల్ మూవీ వచ్చే నెలకు వస్తుందని భావించినా, ప్రస్తుతం వాయిదా పడే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. మృణాల్ ప్రస్తుతం 'హాయ్ జవాని తో ఇష్క్ హోనా హై' మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌‍తో పాటు 'పూజా మేరీ జాన్' ఈ చిత్రాల్లో కూడా మృణాల్ తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది.

సౌత్ సినిమాల పుణ్యమా అని బాలీవుడ్‌లో తన స్థానాన్ని పదిలపరుచుకుంటున్న మృణాల్, ఈ ఏడేళ్ల డ్రాట్‌ను ముగిస్తుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. ఫిబ్రవరి చివర కల్లా మృణాల్ కోరిక తీరుతుందో లేదో మనకు తెలిసిపోతుంది.

Also Read: EPFO Interest Rate: ఉద్యోగులకు షాకింగ్ న్యూస్..పీఎఫ్ వడ్డీ రేటులో కోత? భారీగా తగ్గించే యోచనలో కేంద్రం!

Also Read: Bharat Gas Lite Cylinder: సామాన్యులకు గుడ్‌న్యూస్..కేవలం రూ.300లకే గ్యాస్ సిలిండర్..మీ పాత సిలిండర్ తీసుకెళ్లండి చాలు!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
DDDharmaraju Dhurishetty
Feb 04, 2026 07:53:51
Hyderabad, Telangana:

Realme P4x 5G Price Cut: మీరు కూడా ఎప్పటినుంచో అతి తక్కువ ధరలోనే 7000mAh బ్యాటరీతో కూడిన మొబైల్ కొనుగోలు చేయాలనుకుంటున్నారా? అయితే, మీకు ఫ్లిప్‌కార్ట్‌ ఇలాంటి జంబో బ్యాటరీస్‌తో కూడిన కొన్ని మొబైల్‌పై అద్భుతమైన డిస్కౌంట్ ఆఫర్స్ ను అందిస్తోంది. ముఖ్యంగా రియల్‌మీ కంపెనీ గతంలో విడుదల చేసిన Realme P4x 5G చాలా తగ్గింపు ధరతో లభిస్తుంది. దీనిపై అదనంగా స్పెషల్ డిస్కౌంట్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. అయితే, దీనిపై ఉన్న ఆఫర్స్ వివరాలేంటో? ఇది ఎలాంటి ఫీచర్లతో అందుబాటులోకి వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం..

Realme P4x 5G మొబైల్‌ 6.72 అంగుళాల Full HD+ LCD డిస్ప్లేను కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఇది 144Hz రిఫ్రెష్ రేట్, 1000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంటుంది. కాబట్టి ఎండలో కూడా దీని స్క్రీన్ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అంతేకాకుండా గేమింగ్ చేసే వారికి ఈ మొబైల్ స్క్రీన్ చాలా స్మూత్ గా ఉంటుంది. ఇక ఈ స్మార్ట్‌ఫోన్‌ను కంపెనీ ఎంతో శక్తివంతమైన 7000mAh భారీ బ్యాటరీతో లాంచ్ చేసింది. ఇది 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ను కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఎంతో శక్తివంతమైన MediaTek Dimensity 7400 Ultra 5G చిప్‌సెట్‌ ప్రాసెసర్‌తో అందుబాటులో ఉంది. అలాగే ఇందులో ప్రత్యేకంగా గేమింగ్ కోసం VC FrostCore కూలింగ్ సిస్టం కూడా అందుబాటులోకి తీసుకువచ్చింది.

ఇక ఈ మొబైల్ వెనుక భాగంలో ఉన్న కెమెరా వివరాల్లోకి వెళితే.. దీనిని కంపెనీ డ్యూయల్ కెమెరా సిస్టంతో విడుదల చేసింది. ఇది 50MP మెయిన్ కెమెరాతో పాటు 2MP మోనోక్రోమ్ సెన్సార్ సపోర్టుతో అందుబాటులోకి వచ్చింది. దీంతోపాటు ఫ్రంట్ భాగంలో 8MP కెమెరా ఉంది..ఈ మొబైల్ ఆండ్రాయిడ్ 15 ఆధారిత Realme UI 6.0 ఆపరేటింగ్ సిస్టంతో పాటు ఐపీ64 (IP64) డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ వంటి ప్రత్యేకమైన ఫీచర్స్ ను కలిగి ఉంటుంది. ప్రస్తుతం ఇది మార్కెట్లో రెండు స్టోరేజ్ ఆప్షన్స్‌లో అందుబాటులో ఉంది. 128 జీబీతో పాటు 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌తో లభిస్తోంది.

Also Read: Redmi 14C 5G Offer: రెడ్‌మీ 5G ఫోన్ కేవలం రూ.6,500కే! సగం ధరకే స్మార్ట్‌ఫోన్..అదిరిపోయే ఆఫర్!

మార్కెట్లో ప్రస్తుతం 256జిబి ఇంటర్నల్ స్టోరేజ్ కలిగిన ఈ స్మార్ట్‌ఫోన్‌ ధర MRP రూ.20,999 కాగా.. ప్రత్యేకమైన డిస్కౌంట్ ఆఫర్స్‌తో 10 శాతం తగ్గింపుతో కేవలం రూ.18,999కే అందుబాటులో ఉంది. అంతేకాకుండా స్మార్ట్‌ఫోన్‌ అనుసంధాన యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు వినియోగించి పేమెంట్ చేస్తే అదనంగా రూ.1,800 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. దీంతో మీరు కేవలం ఈ మొబైల్‌ను రూ.16,900 లోపే పొందవచ్చు. ఇక మరింత తగ్గింపు ధరకే ఈ మొబైల్ సొంతం చేసుకోవాలనుకునే వారు కచ్చితంగా ఎక్స్చేంజ్ బోనస్ ఆఫర్స్ ను వినియోగించుకోవాల్సి ఉంటుంది. దీనిని వాడాలనుకునే వారు తప్పకుండా ఏదైనా ఒక పాత మొబైల్ ఎక్స్చేంజ్ చేయాల్సి ఉంటుంది. ఇలా చేస్తే రూ.15 వేల వరకు బోనస్ లభిస్తుంది. ఈ బోనస్‌ను ధర నుంచి మైనస్ చేస్తే రూ.1,900 లోపే దీనిని సొంతం చేసుకోవచ్చు.

Also Read: Redmi 14C 5G Offer: రెడ్‌మీ 5G ఫోన్ కేవలం రూ.6,500కే! సగం ధరకే స్మార్ట్‌ఫోన్..అదిరిపోయే ఆఫర్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
comment0
Report
HDHarish Darla
Feb 04, 2026 06:45:46
Hyderabad, Telangana:

EPFO Interest Rate 2026: పీఎఫ్ ఖాతాదారులకు కేంద్ర ప్రభుత్వం షాకిచ్చే అవకాశముంది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఈపీఎఫ్‌ఓ (EPFO) వడ్డీ రేట్లను తగ్గించవచ్చని సంకేతాలు అందుతున్నాయి. ఇది నేరుగా కోట్ల మంది ఉద్యోగుల పదవీ విరమణ పొదుపుపై ప్రభావం చూపనుంది. ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) త్వరలో జరగబోయే తన 239వ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సమావేశంలో వడ్డీ రేట్లపై కీలక నిర్ణయం తీసుకోనుంది.

వడ్డీ రేటు ఎంత తగ్గొచ్చు?
ప్రస్తుతం ఈపీఎఫ్ డిపాజిట్లపై 8.25% వడ్డీ లభిస్తోంది. అయితే, మార్చిలో జరిగే సమావేశంలో దీనిని 8% నుండి 8.20% మధ్యకు తగ్గించాలని బోర్డు భావిస్తోంది.

'వికసిత భారత్ ఉపాధి పథకం' కింద కొత్తగా భారీ సంఖ్యలో సభ్యులు ఈపీఎఫ్‌ఓలో చేరుతున్నారు. నిధుల లభ్యత, ఆర్థిక నిలకడను కాపాడుకోవడానికి వడ్డీ రేటును స్వల్పంగా తగ్గించడం అవసరమని నిపుణులు భావిస్తున్నారు.

వడ్డీ రేటు తగ్గింపుపై బోర్డు నిర్ణయం తీసుకున్నప్పటికీ, దానికి ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆమోదం తప్పనిసరి. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ వంటి రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు ఉండటంతో, రాజకీయంగా వ్యతిరేకత వస్తుందనే ఉద్దేశంతో ఈ నిర్ణయాన్ని ప్రస్తుతానికి వాయిదా వేసే అవకాశం కూడా ఉందని కొన్ని వర్గాలు పేర్కొంటున్నాయి.

ఏప్రిల్ నుంచి UPI ద్వారా పీఎఫ్ విత్‌డ్రా!
వడ్డీ రేట్ల విషయంలో చేదు వార్త ఉన్నప్పటికీ, సాంకేతిక పరంగా ఒక తీపి కబురు ఉంది. పీఎఫ్ 3.0 సంస్కరణల్లో భాగంగా ఏప్రిల్ నుంచి కొత్త సదుపాయం అందుబాటులోకి రానుంది. చందాదారులు తమ యూపీఐ (UPI) పిన్ ఉపయోగించి పీఎఫ్ సొమ్మును సురక్షితంగా విత్‌డ్రా చేసుకోవచ్చు.

పీఎఫ్ నుంచి విత్‌డ్రా చేసిన సొమ్ము నేరుగా బ్యాంకు ఖాతాకు చేరుతుంది. దానిని మీరు ఏటీఎంలు లేదా డెబిట్ కార్డుల ద్వారా వెంటనే వాడుకోవచ్చు. సభ్యుల మొత్తం చందాలో కొంత భాగాన్ని భవిష్యత్తు అవసరాల కోసం రిజర్వ్ చేసి, మిగిలిన మొత్తాన్ని విత్‌డ్రా చేసుకునే వెసులుబాటు కల్పిస్తారు.

వడ్డీ రేట్లు తగ్గితే దీర్ఘకాలంలో ఉద్యోగుల పొదుపుపై ప్రభావం పడుతుంది. అయితే యూపీఐ వంటి డిజిటల్ సేవలు అందుబాటులోకి రావడం వల్ల అత్యవసర సమయాల్లో పీఎఫ్ సొమ్మును వాడుకోవడం సులభతరం అవుతుంది. మార్చిలో జరిగే అధికారిక సమావేశం తర్వాతే వడ్డీ రేటుపై పూర్తి స్పష్టత రానుంది.

Also Read: PF New Rules 2026: ఉద్యోగులకు అలర్ట్..పీఎఫ్‌ కొత్త రూల్స్..రూ.25,000కు పెరగనున్న కనీస జీతం!

Also Read: Allu Arjun Tweet: మెగా కాంపౌండ్‌కు ఐకాన్ స్టార్..చరణ్-ఉపాసనలకు బన్నీ విషెస్..సెలబ్రేషన్స్ షురూ!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
DDDharmaraju Dhurishetty
Feb 04, 2026 05:12:05
Hyderabad, Telangana:

Dashanka Raja Yogam Effect On Zodiac: ఫిబ్రవరి 3న ఎంతో శక్తివంతమైన బుధ, శని గ్రహాలు ఒకదానికొకటి 36 డిగ్రీల కోణంలోకి వచ్చాయి. జ్యోతిష్య శాస్త్రంలో ఈ ఘటనను అత్యంత అరుదైనదిగా భావిస్తారు. అయితే, ఇలాంటి సమయంలోనే ప్రత్యేకమైన రాజయోగాలు ఏర్పడుతూ ఉంటాయి. ముఖ్యంగా ఈ సమయంలో ఎంతో పవిత్రమైన దశాంతక రాజయోగం ఏర్పడింది. దీని కారణంగా కొన్ని రాశుల వారిపై ప్రత్యేకమైన ప్రభావం పడింది. ముఖ్యంగా ఈ రాజయోగంతో కొన్ని రాశుల వారికి ఆర్థికంగా పెద్ద పెద్ద మార్పులు వస్తాయి. అలాగే కెరీర్ పరంగా విశేషమైన ప్రయోజనాలు కలిగే అవకాశాలున్నాయి. 

దశంక రాజయోగంతో కొన్ని రాశుల వారి జీవితాల్లో అద్భుతమైన మార్పులు రాబోతున్నాయి. ఈ యోగ ప్రభావంతో విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయి. ఆర్థికంగా కలిసి రావడమే కాకుండా.. అద్భుతమైన ధన లాభాలు కలుగుతాయి. అలాగే అదృష్టం పెరిగి అనుకుంటున్న పనుల్లో విజయాలు సాధిస్తారు. అయితే, ఈ సమయంలో అదృష్టాన్ని సొంతం చేసుకునే రాశులేవో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

ఈ రాశులవారిపై దశంక రాజయోగం ఎఫెక్ట్:
మిథున రాశి 
మిధున రాశి వారికి దశంక రాజయోగ ప్రభావంతో జీవితం కొత్త మలుపు తిరగబోతోంది. ముఖ్యంగా వీరికి వచ్చే నెలలో పనుల్లో అద్భుతమైన మెరుగుదల కనిపిస్తుంది. వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టడం చాలా లావుగా ఉంటుంది. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఊహించని లాభాలు కూడా పొందగలుగుతారు. అలాగే వీరికి తెలివితేటలు కూడా ఊహించని స్థాయిలో పెరుగుతాయి. కృషికి తగ్గ ప్రతిఫలం కూడా లభిస్తుంది.

సింహరాశి 
సింహ రాశి వారికి బుధుడు శని ప్రభావాల కారణంగా ఏర్పడిన దశంక యోగంతో జీవితం చాలా శుభప్రదంగా మారుతుంది. అలాగే ఈ సమయంలో వీరి కొత్త కొత్త ప్రాజెక్టులను కూడా పొందగలుగుతారు. దీంతోపాటు కార్యాలయాల్లో గౌరవం కూడా విపరీతంగా పెరుగుతుంది. వ్యాపారాలు లావు తగ్గంగా మారుతాయి. ఆర్థికంగా చాలావరకు కలిసి రాబోతోంది.

మకర రాశి 
మకర రాశి వారికి ఫిబ్రవరి నెల అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. వీరికి అదృష్టం కూడా ఊహించని స్థాయిలో పెరుగుతుంది. అంతేకాకుండా కొన్ని అద్భుతమైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు. దీంతోపాటు సకాలంలో నిర్ణయాలు అద్భుతమైన అవకాశాలను కూడా అందిస్తాయి. విశ్వాసం ఊహించని స్థాయిలో పెరిగి కొన్ని రకాల కఠినమైన పనులు కూడా సులభంగా చేస్తారు.

కుంభరాశి 
కుంభరాశి వారికి దశంక యోగం ఎంతో శుభప్రదంగా ఉంటుంది. వీరికి కూడా ఊహించని స్థాయిలో తెలివితేటలు పెరుగుతాయి. ముఖ్యమైన పనులు చేయడం వల్ల అద్భుతమైన విజయాలు సాధించగలుగుతారు. కెరీర్ పరంగా విశేషమైన లాభాలు కలుగుతాయి. ఆర్థికపరంగా అద్భుతమైన మెరుగుదల కనిపించే అవకాశాలున్నాయి. కృషికి తగ్గ ప్రశంసలు కూడా పొందగలుగుతారు.

Also Read: Mercury Transit 2026: మకరంలో తిష్ట వేసిన బుధుడు.. ఈ రాశుల వారికి కోటీశ్వరులయ్యే యోగం ప్రారంభం!

Also Read: Mercury Transit 2026: మకరంలో తిష్ట వేసిన బుధుడు.. ఈ రాశుల వారికి కోటీశ్వరులయ్యే యోగం ప్రారంభంa

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
comment0
Report
DDDharmaraju Dhurishetty
Feb 04, 2026 04:56:22
Hyderabad, Telangana:

Powerful Ruchaka Raja Yoga Effect On Zodiac Telugu: గడిచిన ఫిబ్రవరి మూడవ తేదీకి ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉండేది. ఈరోజు బుధుడు కుంభరాశిలో, చంద్రుడు సింహరాశిలో కదలికలు జరుపుతాడు. ఫలితంగా కుజుడు వచ్చేస్థితిలోకి వెళ్లి.. మకర రాశిలో రుచకరాజు యోగం ఏర్పడింది. అలాగే కుజుడు, సూర్యుడి కలయిక కారణంగా ఈరోజే ఆదిత్య మంగళ రాజయోగం కూడా ఏర్పడింది. దీంతో ఈ ప్రభావం ఫిబ్రవరి మూడవ తేదీ నుంచి 5వ తేదీ వరకు కొనసాగుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. జ్యోతిష్య శాస్త్రంలో రుచక రాజయోగానికి చాలా ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. ఈ రాజయోగ ప్రభావం వల్ల అన్ని రాశుల వారికి చాలా మేలు జరుగుతుంది. ముఖ్యంగా కొన్ని రాశుల వారు ఊహించని ధన లాభాలు పొందగలుగుతారు. అయితే ఈ మంగళవారం నుంచి గురువారం వరకు ఏ రాశుల వారికి అత్యధికంగా మేలు జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

రెండు రోజుల అదృష్ట రాశులు..
మేషరాశి 
మేషరాశి వారికి కెరీర్ పరంగా చాలా బాగుంటుంది. రుచక రాజయోగ ప్రభావంతో వీరికి పెండింగ్లో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి. ఉద్యోగాలు చేసే అధికారులకు మద్దతు కూడా లభిస్తుంది. దీని కారణంగా అన్ని రకాల పెండింగ్ పనులను ఎంతో సులభంగా చేయగలుగుతారు. అలాగే సామాజిక రంగంలో గౌరవం కూడా విపరీతంగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రేమ జీవితం చాలా శృంగార భరితంగా మారుతుంది. స్నేహితుల సపోర్టుతో కొన్ని రకాల పనులు ఎంతో సులభంగా చేయగలుగుతారు.

కన్య రాశి 
రుచక రాజయోగ ప్రభావంతో కన్యా రాశి వారికి విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా వీరికి ఈరోజు నుంచి అదృష్టం సహకరించబోతోంది. తద్వారా రెండు రోజులపాటు అద్భుతమైన లాభాలు కలుగుతాయి. అలాగే ఈరోజు మీకు ఇష్టమైన స్నేహితులతో కలిసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ప్రత్యర్ధులు, శత్రువుల నుంచి కూడా ప్రశాంతత లభిస్తుంది. ఒత్తిడి కూడా పూర్తిగా తొలగిపోతుంది. ఏదైనా కొత్త వ్యాపారాలు ప్రారంభించాలనుకుంటున్న వ్యక్తులకు ఇది అద్భుతమైన అవకాశం. 

తులారాశి 
తులా రాశిలో జన్మించిన వ్యక్తులకు కూడా ఈ సమయంలో ఎంతో కొంత మేలు జరుగుతుంది. ముఖ్యంగా రెండు రోజులపాటు వీరికి అదృష్టం సహకరించి అన్ని ప్రయత్నాల్లో విజయాలు లభించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఉద్యోగాలు చేసేవారు ఈ సమయంలో విశేషమైన ఫలితాలు పొందుతారు. అలాగే మీ ప్రత్యర్థులతో వస్తున్న వాగ్వాదాలు కూడా ఈరోజు తొలగిపోతాయి. శత్రువుల బాధ నుంచి విముక్తి కలుగుతుంది. అంతేకాకుండా తల్లిదండ్రులతో సంబంధాలు మెరుగుపడతాయి. 

మకర రాశి 
మకర రాశి వారికి మంగళవారం నుంచి గురువారం వరకు చాలా శుభప్రదంగా ఉంటుంది. రాజయోగ ప్రభావంతో వీరికి అద్భుతమైన లాభాలు కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆర్థికంగా అదృష్టం సహకరించబోతోంది. అలాగే గతంలో చేసిన పనులన్నీ సులభంగా పూర్తవుతాయి. తల్లిదండ్రుల నుంచి అద్భుతమైన లాభాలు కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొత్తగా ఏదైనా ప్రారంభించాలనుకుంటున్న వ్యక్తులకు ఈ సమయం అద్భుతమైన అవకాశాన్ని అందించబోతోంది. అలాగే అత్తమామల సహకారంతో విశేషమైన ఫలితాలు పొందుతారు. 

కుంభరాశి 
కుంభ రాశి వారికి ఈ సమయం చాలా శుభప్రదంగా ఉంటుంది. ముఖ్యంగా గత కొన్ని రోజుల నుంచి వస్తున్న గందరగోల సమస్యలు కూడా తొలగిపోతాయి. అలాగే ఎలాంటి పనులు చేసిన అద్భుతమైన విజయాలు సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత కొద్ది రోజుల నుంచి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులకు కాస్త పరిష్కారం కూడా లభిస్తుంది. తెలివితేటలతో ముందుకెళ్లడం వల్ల కొన్ని రకాల పనుల్లో ఊహించని విజయాలు కూడా సాధించగలుగుతారు. దీంతోపాటు దౌత్యపరమైన తెలివితేటలతో వ్యాపారాలను అద్భుతమైన విజయాలు సాధిస్తారు.

Also Read: Mercury Transit 2026: మకరంలో తిష్ట వేసిన బుధుడు.. ఈ రాశుల వారికి కోటీశ్వరులయ్యే యోగం ప్రారంభం!

Also Read: Mercury Transit 2026: మకరంలో తిష్ట వేసిన బుధుడు.. ఈ రాశుల వారికి కోటీశ్వరులయ్యే యోగం ప్రారంభం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
comment0
Report
RKRavi Kumar Sargam
Feb 04, 2026 04:11:02
Rajamahendravaram, Andhra Pradesh:

 Rajahmundry: ఆంధ్రప్రదేశ్‌లో చిరుతపులి సంచారం కలకలం రేపుతోంది. ఒక పులి తెలంగాణ మీదుగా ఏపీలోకి ప్రవేశించి ఇప్పుడు రాజమండ్రి పట్టణ ప్రజలను వణికిస్తోంది. కొంత అటవీ ప్రాంతం కాకుండా జనారణ్యంలో పులి సంచరిస్తుండడంతో రాజమండ్రి తీవ్ర భయాందోళన నెలకొంది. పులి ఎటు వైపు వెళ్తుందో.. ఏం చేస్తుందోనని ఉత్కంఠ నెలకొంది. పులి సంచారంపై స్థానిక ఎమ్మెల్యేతోపాటు అటవీ శాఖ అధికారులు అప్రమత్తం ప్రకటించారు.

Also Read: Nandi Awards: టాలీవుడ్‌కు ఏపీ ప్రభుత్వం శుభవార్త.. త్వరలోనే నంది అవార్డులు

రాజమండ్రి పట్టణంలో రాత్రి 9 గంటల సమయంలో పెద్దపులి దివా చెరువు హైవేపై కనిపించింది. ఎస్‌వీ పీసీ ఫంక్షన్ హాల్‌కి ఆనుకుని ఉన్న రోడ్డుపై తిరిగి.. పక్కనే ఉన్న ఢిల్లీ పబ్లిక్ స్కూల్ వైపు పెద్దపులి వెళ్లింది. రాజమండ్రి నగరానికి అతి సమీపంలో పెద్దపులి సంచరించడం కలకలం రేపుతోంది. దివాన్ చెరువు వద్ద ఆటోనగర్ ప్రాంతానికి చేరుకోవడంతో స్థానిక ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఆటో నగర్, దివాన్ చెరువు, కొంతమూరు, లాలా చెరువు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ సూచించారు.

Also Read: YS Sharmila: ఉపాధి హామీని మోదీ ఖూనీ చేస్తున్నారు.. అందరం తిరగబడాలి: వైఎస్‌ షర్మిల

ఒకే రోజు వివిధ ప్రాంతాల్లో పులి సంచరించింది. ఉదయం గాడాల ప్రాంతంలో పెద్ద పులి సంచరించిన ఆనవాళ్లు కనిపించాయి. అక్కడ పెద్దపులి పాదముద్రలు లభించాయి. గాడాల ప్రాంతం నుంచి దిశ మార్చుకొని రాజమండ్రి శివారులోని దివాన్ చెరువు ఆటోనగర్ ప్రాంతానికి పులి చేరుకుంది. ఛత్తీస్‌ఘడ్ నుంచి వచ్చినట్లుగా భావిస్తున్న పెద్దపులి పది రోజుల కిందట తెలంగాణలోకి ప్రవేశించి..  కావడిగుంట్ల అటవీ ప్రాంతం నుంచి కన్నాపురం ఫారెస్ట్ ఏరియా మీదుగా ఏలూరు జిల్లాలోకి ప్రవేశించింది. అక్కడి నుంచి బుట్టాయిగూడెం ప్రాంతంలోకి వచ్చింది. నాలుగు రోజుల కిందట పోలవరం మండలం పట్టిసీమ వద్ద గోదావరి నదిని ఈదుకుని తూర్పుగోదావరి జిల్లాలోకి పులి ప్రవేశించినట్లు అటవీ శాఖ అధికారులు భావిస్తున్నారు. సీతానగరం మండలం కొండేపూడి నుంచి ఏటిపట్టు ప్రాంతంలో సంచరిస్తూ తొర్రేడు వద్దకు చేరుకుని జనావాసాలకు దగ్గరగా అరటి, మొక్కజొన్న తోటలు వరి పొలాల వద్ద పులి సంచరిస్తోంది. తూర్పుగోదావరి జిల్లాలోకి వచ్చాక మూడుచోట్ల పశువులను పులి చంపి తన ఆకలిని తీర్చుకుంది.

Also Read: Pawan Kalyan: అరవ శ్రీధర్‌ రాసలీలపై పవన్‌ కల్యాణ్‌ ఆగ్రహం.. సమావేశం నుంచి వాకౌట్‌

 
 
 
 
 

కాగా రాజమండ్రి పట్టణ పరిసరాల్లో పులి సంచరిస్తుండడంతో దానిని బందించేందుకు అటవీ శాఖ అధికారులు స్థానిక పోలీసుల సహాయంతో ఏర్పాట్లు చేశారు. ఫారెస్ట్ అధికారులు బోన్లు ఏర్పాటుచేయగా.. ట్రాప్ కెమెరాలు, డ్రోన్ల ద్వారా పులిని గాలిస్తున్నారు. కాగా రాజమండ్రి పట్టణంలో పులి సంచరిస్తున్న వీడియోలు వైరల్‌గా మారాయి. సోషల్ మీడియాలో పులి సంచారంపై వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.

0
comment0
Report
Advertisement
Back to top