Mrunal Thakur Hits And Flops: టాలీవుడ్‌లో 'సీతామహాలక్ష్మి'గా వెలిగిపోతున్న మృణాల్ ఠాకూర్ కెరీర్ ఇప్పుడు ఒక ఆసక్తికరమైన మలుపులో ఉంది. సౌత్‌లో తిరుగులేని విజయాలు అందుకుంటున్న ఈ భామకు, సొంత గూడు బాలీవుడ్‌లో మాత్రం ఏడేళ్లుగా ఒక సరైన హిట్టు పడలేదు. ఈ నేపథ్యంలో ఆమె ఆశలన్నీ ఇప్పుడు రాబోయే చిత్రాలపైనే ఉన్నాయి.
బుల్లితెర నుండి వెండితెరకు పరిచయమైన మృణాల్, కెరీర్ ఆరంభంలో 'సూపర్ 30', 'బాట్లా హౌస్' వంటి చిత్రాలతో బాలీవుడ్‌లో మంచి విజయాలనే అందుకుంది. కానీ ఆ తర్వాతే ఆమెకు కష్టాలు మొదలయ్యాయి.
బాలీవుడ్‌లో మృణాల్ నటించిన 'జెర్సీ', 'గుమ్రా', 'ఆంఖ్ మిచోలీ' వంటి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి. గత ఏడాది వచ్చిన 'సన్నాఫ్ సర్దార్ 2' కూడా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. అయితే, ఆమె బాలీవుడ్ కెరీర్ ప్రమాదంలో పడ్డ ప్రతిసారీ టాలీవుడ్ ఆమెను ఆదుకుంది.
'సీతారామం' సినిమాతో మృణాల్ క్రేజ్ పాన్-ఇండియా స్థాయికి చేరింది. అలాగే 'హాయ్ నాన్న' మరో క్లాసిక్ హిట్ అందుకోవడంతో బాలీవుడ్ మేకర్స్ మళ్లీ ఆమె వైపు చూడటం మొదలుపెట్టారు.
బాలీవుడ్‌లో వరుస ఫ్లాపులు ఉన్నప్పటికీ, మృణాల్‌కు అక్కడ అవకాశాలు తగ్గకపోవడానికి ప్రధాన కారణం సౌత్‌లో ఆమెకు ఉన్న విపరీతమైన ఇమేజ్. అందుకే బీటౌన్ మేకర్స్ ఆమెకు రెడ్ కార్పెట్ పరుస్తూ వరుస ఆఫర్లు ఇస్తున్నారు.
ప్రస్తుతం మృణాల్ ఆశలన్నీ 'దో దీవానే శెహర్ మే' చిత్రంపైనే ఉన్నాయి. ఒక స్వచ్ఛమైన రొమాంటిక్ లవ్ స్టోరీగా వస్తున్న ఈ సినిమా ఈ నెల 20న విడుదల కానుంది. ఏడేళ్ల తర్వాత బాలీవుడ్‌లో ఆమెకు ఒక భారీ హిట్ దక్కుతుందా లేదా అనేది ఈ సినిమాతోనే తేలిపోనుంది.
అడవి శేష్‌తో చేస్తున్న డెకాయిట్ (Dacoit) బైలింగ్వల్ మూవీ వచ్చే నెలకు వస్తుందని భావించినా, ప్రస్తుతం వాయిదా పడే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. మృణాల్ ప్రస్తుతం 'హాయ్ జవాని తో ఇష్క్ హోనా హై' మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌తో పాటు 'పూజా మేరీ జాన్' ఈ చిత్రాల్లో కూడా మృణాల్ తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది.
సౌత్ సినిమాల పుణ్యమా అని బాలీవుడ్‌లో తన స్థానాన్ని పదిలపరుచుకుంటున్న మృణాల్, ఈ ఏడేళ్ల డ్రాట్‌ను ముగిస్తుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. ఫిబ్రవరి చివర కల్లా మృణాల్ కోరిక తీరుతుందో లేదో మనకు తెలిసిపోతుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Jabardasth Bobby Death News: తెలుగు బుల్లితెరపై తన కామెడీ టైమింగ్‌తో అందరినీ నవ్వించిన 'జబర్దస్త్' కమెడియన్ లక్ష్మీనారాయణ (బాబీ) రోడ్డు ప్రమాదంలో మరణించడం చిత్ర పరిశ్రమను విషాదంలో ముంచెత్తింది. రాజమండ్రిలో జరిగిన ఈ ఘోర ప్రమాదంలో బాబీతో పాటు మరో ఇద్దరు యువకులు కూడా ప్రాణాలు కోల్పోవడం కలిచివేస్తోంది.
రాజమండ్రిలోని రోడ్డు కం రైల్వే బ్రిడ్జిపై సోమవారం రాత్రి జరిగిన ఈ బైక్ ప్రమాదం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బుల్లితెరపై ఎంతో భవిష్యత్తు ఉన్న ఒక నటుడు ఇలా అర్ధాంతరంగా తనువు చాలించడం అందరినీ ఆవేదనకు గురిచేస్తోంది.
ఏం జరిగింది?
అతివేగంగా వచ్చిన రెండు బైక్‌లు ఎదురెదురుగా బలంగా ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండటంతో బాబీతో పాటు అక్షయ్ కుమార్, సత్యకుమార్ అనే యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. యువకులు హెల్మెట్లు ధరించకపోవడం, వాహనాలను అతివేగంతో నడపడమే ఈ మరణాలకు ప్రధాన కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.
బాబీ మరణవార్త విన్న వెంటనే స్టార్ యాంకర్ సుమ కనకాల తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. బాబీకి సుమతో మంచి సాన్నిహిత్యం ఉంది. వార్త తెలిసిన వెంటనే ఆమె హైదరాబాద్ నుండి రాజమండ్రికి చేరుకున్నారు. బాబీ భౌతికకాయాన్ని చూసి సుమ కంటతడి పెట్టారు.
"అందరినీ నవ్వించే బాబీ ఇలా మౌనంగా వెళ్లిపోతారని అనుకోలేదు" అంటూ ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చారు. బాబీ మరణం టెలివిజన్ రంగానికి పెద్ద లోటని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
బాబీ కేవలం జబర్దస్త్‌లోనే కాకుండా 'సుమ అడ్డా' వంటి అనేక ప్రముఖ షోలలో నటించి ప్రేక్షకులకు చేరువయ్యారు. ఆయన మృతిపై రష్మీ, సుధీర్, ఆది వంటి ఇతర కమెడియన్లు సోషల్ మీడియా వేదికగా సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
ఒక చిన్న పొరపాటు, అతివేగం కారణంగా ముగ్గురు యువకుల ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. బాబీ ఆత్మకు శాంతి చేకూరాలని అభిమానులు కోరుకుంటున్నారు.
Also REad: DA Hike 2026: రాష్ట్ర ఉద్యోగులకు బంపర్ ఆఫర్..5 శాతం పెరగనున్న డీఏ..ఎవరికి ఎంత వస్తుంది? ఎక్కడంటే?
Also Read: Mrunal Thakur Hit Movies: 7 ఏళ్లుగా మృణాల్ ఠాకూర్‌ను వెంటాడుతోంది..ఇప్పటికైనా ఆ కోరిక తీరుతుందా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Tamil Nadu Government Employees DA Hike: తమిళనాడు ప్రభుత్వ ఉద్యోగులకు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 2026 సంవత్సరం అదిరిపోయే ఆరంభాన్ని ఇవ్వబోతోంది. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ప్రభుత్వం అందించే కరువు భత్యం (DA) ఈసారి 5 శాతం పెరిగే అవకాశం ఉండటంతో ఉద్యోగుల జీతాలు భారీగా పెరగనున్నాయి. ఆల్ ఇండియా కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ (AICPI) గణాంకాల ప్రకారం.. జనవరి 2026 నుండి అమలులోకి వచ్చే కరువు భత్యంపై స్పష్టత వచ్చింది.
ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగులు 58% డీఏ పొందుతున్నారు. నవంబర్, డిసెంబర్ నెలల్లో వినియోగదారుల ధరల సూచిక 148.2 పాయింట్ల వద్ద స్థిరంగా ఉండటంతో, ఈసారి డీఏ 5% పెరిగి 63%కి చేరడం దాదాపు ఖాయమైనట్లు తెలుస్తోంది.
జీతం ఎంత పెరుగుతుంది? (ఉదాహరణతో..)
ఒక ఉద్యోగి మూల వేతనం (Basic Pay) రూ. 40,000 అనుకుంటే.. పాత డీఏ (58%) రూ.23,200 అలాగే కొత్త డీఏ (63%) రూ.25,200గా ఉండనుంది. ఈ క్రమంలో ఆ ఉద్యోగికి నెలకు రూ.2,000 అదనపు జీతం లభించే అవకాశం ఉంది.
కేవలం డీఏ మాత్రమే కాకుండా, ఇది 50 శాతం దాటినందున నిబంధనల ప్రకారం HRA (ఇంటి అద్దె అలవెన్స్), TA (రవాణా అలవెన్స్) కూడా పెరుగుతాయి. దీనివల్ల ఉద్యోగి చేతికి వచ్చే మొత్తం జీతం గణనీయంగా పెరుగుతుంది.
సాధారణంగా జనవరి నుండి వర్తించే డీఏ పెంపును కేంద్ర ప్రభుత్వం మార్చి నెలలో (హోలీ పండుగ సమయానికి) అధికారికంగా ప్రకటిస్తుంది. బడ్జెట్ సమావేశాల తర్వాత దీనిపై కేబినెట్ ఆమోదం లభిస్తుంది. ఏప్రిల్ నెల జీతంతో పాటు జనవరి నుంచి మార్చి వరకు ఉన్న 3 నెలల బకాయిలను (Arrears) కలిపి చెల్లిస్తారు.
తమిళనాడు ఉద్యోగులకు డబుల్ ధమాకా!
కేంద్రం డీఏ పెంపును ప్రకటించిన వెంటనే, ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ నేతృత్వంలోని తమిళనాడు ప్రభుత్వం కూడా తమ రాష్ట్ర ఉద్యోగులు, ఉపాధ్యాయులకు 5% డీఏ పెంపును ప్రకటించే అవకాశం ఉంది.
రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఈ విషయంలో సానుకూల నిర్ణయం తీసుకోవచ్చని, త్వరలో ప్రవేశపెట్టే తాత్కాలిక బడ్జెట్‌లో దీనిపై స్పష్టత రావచ్చని సచివాలయ వర్గాలు భావిస్తున్నాయి.
ప్రస్తుతం 7వ వేతన సంఘం సిఫార్సుల ప్రకారం జీతాలు అందుతున్నాయి. 8వ వేతన సంఘంపై ప్రాథమిక కసరత్తు మొదలైనప్పటికీ, అది అమలులోకి రావడానికి మరో రెండేళ్లు పట్టవచ్చు. అప్పటి వరకు ఈ ఆరు నెలలకోసారి పెరిగే డీఏనే ఉద్యోగులకు ప్రధాన ఉపశమనం.
Also Read: Pat Cummins IPL 2026: ఐపీఎల్ ముందు కావ్యాపాపకి బిగ్ షాక్! సన్‌రైజర్స్ టీమ్ నుంచి కెప్టెన్ అవుట్!
Also Read: Mrunal Thakur Hit Movies: 7 ఏళ్లుగా మృణాల్ ఠాకూర్‌ను వెంటాడుతోంది..ఇప్పటికైనా ఆ కోరిక తీరుతుందా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Pat Cummins Ruled Out Of IPL: ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభానికి ముందే సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) అభిమానులకు మింగుడుపడని వార్త అందుతోంది. జట్టును ముందుండి నడిపించే కెప్టెన్, ఆస్ట్రేలియా స్టార్ ఆల్ రౌండర్ పాట్ కమిన్స్ ఈ మెగా టోర్నీకి దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. వెన్నునొప్పి సమస్య తలెత్తడమే ఇందుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. మార్చి 26 నుంచి ఐపీఎల్ సీజన్-19 ప్రారంభం కానుంది. అయితే, అంతకంటే ముందే హైదరాబాద్ ఫ్రాంచైజీ కెప్టెన్ ఇబ్బందుల్లో పడటం ఫ్యాన్స్‌ను ఆందోళనకు గురిచేస్తోంది.
ప్రస్తుతం క్రికెట్ ప్రపంచమంతా టీ20 ప్రపంచకప్ 2026 కోసం సిద్ధమవుతోంది. అయితే, వెన్నునొప్పి కారణంగా కమిన్స్ ఇప్పటికే ఈ మెగా ఈవెంట్‌కు దూరమయ్యాడు. ప్రపంచకప్ ముగిసిన వెంటనే ఐపీఎల్ ప్రారంభం కానుండటంతో, అప్పటికి ఆయన కోలుకుంటాడా లేదా అన్నది సందేహంగా మారింది.
తను ఐపీఎల్ ఆడటంపై పాట్ కమిన్స్ స్వయంగా క్లారిటీ ఇచ్చారు. "ప్రస్తుతానికి నేను ఏమీ చెప్పలేను. త్వరలో మరోసారి స్కాన్ చేయించుకోవాలి. నా వెన్నెముక ఎంత వేగంగా కోలుకుంటుందనే దానిపైనే ఐపీఎల్‌లో నా భాగస్వామ్యం ఆధారపడి ఉంటుంది. పూర్తి ఫిట్‌నెస్ సాధిస్తేనే మైదానంలోకి దిగుతాను" అని ఆయన పేర్కొన్నారు.
ఆస్ట్రేలియా బోర్డు నిబంధనల ప్రకారం.. సెంట్రల్ కాంట్రాక్ట్ ఉన్న ప్లేయర్లు పూర్తి ఫిట్‌గా ఉంటేనే విదేశీ లీగ్‌లలో ఆడేందుకు అనుమతిస్తారు. మార్చి నెలాఖరు నాటికి కమిన్స్ ఫిట్‌నెస్ సాధించకపోతే, క్రికెట్ ఆస్ట్రేలియా అతన్ని భారత్‌కు పంపే అవకాశం లేదు. ఒకవేళ కమిన్స్ దూరం అయితే, హైదరాబాద్ జట్టు కొత్త కెప్టెన్‌ను వెతుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.
సన్‌రైజర్స్ హైదరాబాద్ పూర్తి జట్టు (IPL 2026)..
పాట్ కమిన్స్ (కెప్టెన్), ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, హెన్రిచ్ క్లాసెన్, నితీష్ కుమార్ రెడ్డి, హర్షల్ పటేల్, లియామ్ లివింగ్‌స్టోన్, జైదేవ్ ఉనద్కత్, భువనేశ్వర్ కుమార్, కమిందు మెండిస్, బ్రైడన్ కార్సే తదితరులు.
గత సీజన్‌లో హైదరాబాద్‌ను ఫైనల్‌కు చేర్చడంలో కమిన్స్ కీలక పాత్ర పోషించారు. మరి వచ్చే నెలలో జరిగే ఫిట్‌నెస్ టెస్టులో ఆయన పాస్ అయ్యి, ఆరెంజ్ ఆర్మీని నడిపిస్తారో లేదో వేచి చూడాలి.
Also Read: Mrunal Thakur Hit Movies: 7 ఏళ్లుగా మృణాల్ ఠాకూర్‌ను వెంటాడుతోంది..ఇప్పటికైనా ఆ కోరిక తీరుతుందా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Realme P4x 5G Price Cut: మీరు కూడా ఎప్పటినుంచో అతి తక్కువ ధరలోనే 7000mAh బ్యాటరీతో కూడిన మొబైల్ కొనుగోలు చేయాలనుకుంటున్నారా? అయితే, మీకు ఫ్లిప్‌కార్ట్ ఇలాంటి జంబో బ్యాటరీస్‌తో కూడిన కొన్ని మొబైల్‌పై అద్భుతమైన డిస్కౌంట్ ఆఫర్స్ ను అందిస్తోంది. ముఖ్యంగా రియల్‌మీ కంపెనీ గతంలో విడుదల చేసిన Realme P4x 5G చాలా తగ్గింపు ధరతో లభిస్తుంది. దీనిపై అదనంగా స్పెషల్ డిస్కౌంట్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. అయితే, దీనిపై ఉన్న ఆఫర్స్ వివరాలేంటో? ఇది ఎలాంటి ఫీచర్లతో అందుబాటులోకి వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం..
Realme P4x 5G మొబైల్ 6.72 అంగుళాల Full HD+ LCD డిస్ప్లేను కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఇది 144Hz రిఫ్రెష్ రేట్, 1000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంటుంది. కాబట్టి ఎండలో కూడా దీని స్క్రీన్ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అంతేకాకుండా గేమింగ్ చేసే వారికి ఈ మొబైల్ స్క్రీన్ చాలా స్మూత్ గా ఉంటుంది. ఇక ఈ స్మార్ట్‌ఫోన్‌ను కంపెనీ ఎంతో శక్తివంతమైన 7000mAh భారీ బ్యాటరీతో లాంచ్ చేసింది. ఇది 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ను కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఎంతో శక్తివంతమైన MediaTek Dimensity 7400 Ultra 5G చిప్‌సెట్ ప్రాసెసర్‌తో అందుబాటులో ఉంది. అలాగే ఇందులో ప్రత్యేకంగా గేమింగ్ కోసం VC FrostCore కూలింగ్ సిస్టం కూడా అందుబాటులోకి తీసుకువచ్చింది.
ఇక ఈ మొబైల్ వెనుక భాగంలో ఉన్న కెమెరా వివరాల్లోకి వెళితే.. దీనిని కంపెనీ డ్యూయల్ కెమెరా సిస్టంతో విడుదల చేసింది. ఇది 50MP మెయిన్ కెమెరాతో పాటు 2MP మోనోక్రోమ్ సెన్సార్ సపోర్టుతో అందుబాటులోకి వచ్చింది. దీంతోపాటు ఫ్రంట్ భాగంలో 8MP కెమెరా ఉంది..ఈ మొబైల్ ఆండ్రాయిడ్ 15 ఆధారిత Realme UI 6.0 ఆపరేటింగ్ సిస్టంతో పాటు ఐపీ64 (IP64) డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ వంటి ప్రత్యేకమైన ఫీచర్స్ ను కలిగి ఉంటుంది. ప్రస్తుతం ఇది మార్కెట్లో రెండు స్టోరేజ్ ఆప్షన్స్‌లో అందుబాటులో ఉంది. 128 జీబీతో పాటు 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌తో లభిస్తోంది.
Also Read: Redmi 14C 5G Offer: రెడ్‌మీ 5G ఫోన్ కేవలం రూ.6,500కే! సగం ధరకే స్మార్ట్‌ఫోన్..అదిరిపోయే ఆఫర్!
మార్కెట్లో ప్రస్తుతం 256జిబి ఇంటర్నల్ స్టోరేజ్ కలిగిన ఈ స్మార్ట్‌ఫోన్ ధర MRP రూ.20,999 కాగా.. ప్రత్యేకమైన డిస్కౌంట్ ఆఫర్స్‌తో 10 శాతం తగ్గింపుతో కేవలం రూ.18,999కే అందుబాటులో ఉంది. అంతేకాకుండా స్మార్ట్‌ఫోన్ అనుసంధాన యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు వినియోగించి పేమెంట్ చేస్తే అదనంగా రూ.1,800 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. దీంతో మీరు కేవలం ఈ మొబైల్‌ను రూ.16,900 లోపే పొందవచ్చు. ఇక మరింత తగ్గింపు ధరకే ఈ మొబైల్ సొంతం చేసుకోవాలనుకునే వారు కచ్చితంగా ఎక్స్చేంజ్ బోనస్ ఆఫర్స్ ను వినియోగించుకోవాల్సి ఉంటుంది. దీనిని వాడాలనుకునే వారు తప్పకుండా ఏదైనా ఒక పాత మొబైల్ ఎక్స్చేంజ్ చేయాల్సి ఉంటుంది. ఇలా చేస్తే రూ.15 వేల వరకు బోనస్ లభిస్తుంది. ఈ బోనస్‌ను ధర నుంచి మైనస్ చేస్తే రూ.1,900 లోపే దీనిని సొంతం చేసుకోవచ్చు.
Also Read: Redmi 14C 5G Offer: రెడ్‌మీ 5G ఫోన్ కేవలం రూ.6,500కే! సగం ధరకే స్మార్ట్‌ఫోన్..అదిరిపోయే ఆఫర్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
EPFO Interest Rate 2026: పీఎఫ్ ఖాతాదారులకు కేంద్ర ప్రభుత్వం షాకిచ్చే అవకాశముంది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఈపీఎఫ్‌ఓ (EPFO) వడ్డీ రేట్లను తగ్గించవచ్చని సంకేతాలు అందుతున్నాయి. ఇది నేరుగా కోట్ల మంది ఉద్యోగుల పదవీ విరమణ పొదుపుపై ప్రభావం చూపనుంది. ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) త్వరలో జరగబోయే తన 239వ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సమావేశంలో వడ్డీ రేట్లపై కీలక నిర్ణయం తీసుకోనుంది.
వడ్డీ రేటు ఎంత తగ్గొచ్చు?
ప్రస్తుతం ఈపీఎఫ్ డిపాజిట్లపై 8.25% వడ్డీ లభిస్తోంది. అయితే, మార్చిలో జరిగే సమావేశంలో దీనిని 8% నుండి 8.20% మధ్యకు తగ్గించాలని బోర్డు భావిస్తోంది.
'వికసిత భారత్ ఉపాధి పథకం' కింద కొత్తగా భారీ సంఖ్యలో సభ్యులు ఈపీఎఫ్‌ఓలో చేరుతున్నారు. నిధుల లభ్యత, ఆర్థిక నిలకడను కాపాడుకోవడానికి వడ్డీ రేటును స్వల్పంగా తగ్గించడం అవసరమని నిపుణులు భావిస్తున్నారు.
వడ్డీ రేటు తగ్గింపుపై బోర్డు నిర్ణయం తీసుకున్నప్పటికీ, దానికి ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆమోదం తప్పనిసరి. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ వంటి రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు ఉండటంతో, రాజకీయంగా వ్యతిరేకత వస్తుందనే ఉద్దేశంతో ఈ నిర్ణయాన్ని ప్రస్తుతానికి వాయిదా వేసే అవకాశం కూడా ఉందని కొన్ని వర్గాలు పేర్కొంటున్నాయి.
ఏప్రిల్ నుంచి UPI ద్వారా పీఎఫ్ విత్‌డ్రా!
వడ్డీ రేట్ల విషయంలో చేదు వార్త ఉన్నప్పటికీ, సాంకేతిక పరంగా ఒక తీపి కబురు ఉంది. పీఎఫ్ 3.0 సంస్కరణల్లో భాగంగా ఏప్రిల్ నుంచి కొత్త సదుపాయం అందుబాటులోకి రానుంది. చందాదారులు తమ యూపీఐ (UPI) పిన్ ఉపయోగించి పీఎఫ్ సొమ్మును సురక్షితంగా విత్‌డ్రా చేసుకోవచ్చు.
పీఎఫ్ నుంచి విత్‌డ్రా చేసిన సొమ్ము నేరుగా బ్యాంకు ఖాతాకు చేరుతుంది. దానిని మీరు ఏటీఎంలు లేదా డెబిట్ కార్డుల ద్వారా వెంటనే వాడుకోవచ్చు. సభ్యుల మొత్తం చందాలో కొంత భాగాన్ని భవిష్యత్తు అవసరాల కోసం రిజర్వ్ చేసి, మిగిలిన మొత్తాన్ని విత్‌డ్రా చేసుకునే వెసులుబాటు కల్పిస్తారు.
వడ్డీ రేట్లు తగ్గితే దీర్ఘకాలంలో ఉద్యోగుల పొదుపుపై ప్రభావం పడుతుంది. అయితే యూపీఐ వంటి డిజిటల్ సేవలు అందుబాటులోకి రావడం వల్ల అత్యవసర సమయాల్లో పీఎఫ్ సొమ్మును వాడుకోవడం సులభతరం అవుతుంది. మార్చిలో జరిగే అధికారిక సమావేశం తర్వాతే వడ్డీ రేటుపై పూర్తి స్పష్టత రానుంది.
Also Read: PF New Rules 2026: ఉద్యోగులకు అలర్ట్..పీఎఫ్ కొత్త రూల్స్..రూ.25,000కు పెరగనున్న కనీస జీతం!
Also Read: Allu Arjun Tweet: మెగా కాంపౌండ్‌కు ఐకాన్ స్టార్..చరణ్-ఉపాసనలకు బన్నీ విషెస్..సెలబ్రేషన్స్ షురూ!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Dashanka Raja Yogam Effect On Zodiac: ఫిబ్రవరి 3న ఎంతో శక్తివంతమైన బుధ, శని గ్రహాలు ఒకదానికొకటి 36 డిగ్రీల కోణంలోకి వచ్చాయి. జ్యోతిష్య శాస్త్రంలో ఈ ఘటనను అత్యంత అరుదైనదిగా భావిస్తారు. అయితే, ఇలాంటి సమయంలోనే ప్రత్యేకమైన రాజయోగాలు ఏర్పడుతూ ఉంటాయి. ముఖ్యంగా ఈ సమయంలో ఎంతో పవిత్రమైన దశాంతక రాజయోగం ఏర్పడింది. దీని కారణంగా కొన్ని రాశుల వారిపై ప్రత్యేకమైన ప్రభావం పడింది. ముఖ్యంగా ఈ రాజయోగంతో కొన్ని రాశుల వారికి ఆర్థికంగా పెద్ద పెద్ద మార్పులు వస్తాయి. అలాగే కెరీర్ పరంగా విశేషమైన ప్రయోజనాలు కలిగే అవకాశాలున్నాయి.
దశంక రాజయోగంతో కొన్ని రాశుల వారి జీవితాల్లో అద్భుతమైన మార్పులు రాబోతున్నాయి. ఈ యోగ ప్రభావంతో విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయి. ఆర్థికంగా కలిసి రావడమే కాకుండా.. అద్భుతమైన ధన లాభాలు కలుగుతాయి. అలాగే అదృష్టం పెరిగి అనుకుంటున్న పనుల్లో విజయాలు సాధిస్తారు. అయితే, ఈ సమయంలో అదృష్టాన్ని సొంతం చేసుకునే రాశులేవో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ఈ రాశులవారిపై దశంక రాజయోగం ఎఫెక్ట్:
మిథున రాశి
మిధున రాశి వారికి దశంక రాజయోగ ప్రభావంతో జీవితం కొత్త మలుపు తిరగబోతోంది. ముఖ్యంగా వీరికి వచ్చే నెలలో పనుల్లో అద్భుతమైన మెరుగుదల కనిపిస్తుంది. వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టడం చాలా లావుగా ఉంటుంది. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఊహించని లాభాలు కూడా పొందగలుగుతారు. అలాగే వీరికి తెలివితేటలు కూడా ఊహించని స్థాయిలో పెరుగుతాయి. కృషికి తగ్గ ప్రతిఫలం కూడా లభిస్తుంది.
సింహరాశి
సింహ రాశి వారికి బుధుడు శని ప్రభావాల కారణంగా ఏర్పడిన దశంక యోగంతో జీవితం చాలా శుభప్రదంగా మారుతుంది. అలాగే ఈ సమయంలో వీరి కొత్త కొత్త ప్రాజెక్టులను కూడా పొందగలుగుతారు. దీంతోపాటు కార్యాలయాల్లో గౌరవం కూడా విపరీతంగా పెరుగుతుంది. వ్యాపారాలు లావు తగ్గంగా మారుతాయి. ఆర్థికంగా చాలావరకు కలిసి రాబోతోంది.
మకర రాశి
మకర రాశి వారికి ఫిబ్రవరి నెల అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. వీరికి అదృష్టం కూడా ఊహించని స్థాయిలో పెరుగుతుంది. అంతేకాకుండా కొన్ని అద్భుతమైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు. దీంతోపాటు సకాలంలో నిర్ణయాలు అద్భుతమైన అవకాశాలను కూడా అందిస్తాయి. విశ్వాసం ఊహించని స్థాయిలో పెరిగి కొన్ని రకాల కఠినమైన పనులు కూడా సులభంగా చేస్తారు.
కుంభరాశి
కుంభరాశి వారికి దశంక యోగం ఎంతో శుభప్రదంగా ఉంటుంది. వీరికి కూడా ఊహించని స్థాయిలో తెలివితేటలు పెరుగుతాయి. ముఖ్యమైన పనులు చేయడం వల్ల అద్భుతమైన విజయాలు సాధించగలుగుతారు. కెరీర్ పరంగా విశేషమైన లాభాలు కలుగుతాయి. ఆర్థికపరంగా అద్భుతమైన మెరుగుదల కనిపించే అవకాశాలున్నాయి. కృషికి తగ్గ ప్రశంసలు కూడా పొందగలుగుతారు.
Also Read: Mercury Transit 2026: మకరంలో తిష్ట వేసిన బుధుడు.. ఈ రాశుల వారికి కోటీశ్వరులయ్యే యోగం ప్రారంభం!

Also Read: Mercury Transit 2026: మకరంలో తిష్ట వేసిన బుధుడు.. ఈ రాశుల వారికి కోటీశ్వరులయ్యే యోగం ప్రారంభంa
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Powerful Ruchaka Raja Yoga Effect On Zodiac Telugu: గడిచిన ఫిబ్రవరి మూడవ తేదీకి ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉండేది. ఈరోజు బుధుడు కుంభరాశిలో, చంద్రుడు సింహరాశిలో కదలికలు జరుపుతాడు. ఫలితంగా కుజుడు వచ్చేస్థితిలోకి వెళ్లి.. మకర రాశిలో రుచకరాజు యోగం ఏర్పడింది. అలాగే కుజుడు, సూర్యుడి కలయిక కారణంగా ఈరోజే ఆదిత్య మంగళ రాజయోగం కూడా ఏర్పడింది. దీంతో ఈ ప్రభావం ఫిబ్రవరి మూడవ తేదీ నుంచి 5వ తేదీ వరకు కొనసాగుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. జ్యోతిష్య శాస్త్రంలో రుచక రాజయోగానికి చాలా ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. ఈ రాజయోగ ప్రభావం వల్ల అన్ని రాశుల వారికి చాలా మేలు జరుగుతుంది. ముఖ్యంగా కొన్ని రాశుల వారు ఊహించని ధన లాభాలు పొందగలుగుతారు. అయితే ఈ మంగళవారం నుంచి గురువారం వరకు ఏ రాశుల వారికి అత్యధికంగా మేలు జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
రెండు రోజుల అదృష్ట రాశులు..
మేషరాశి
మేషరాశి వారికి కెరీర్ పరంగా చాలా బాగుంటుంది. రుచక రాజయోగ ప్రభావంతో వీరికి పెండింగ్లో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి. ఉద్యోగాలు చేసే అధికారులకు మద్దతు కూడా లభిస్తుంది. దీని కారణంగా అన్ని రకాల పెండింగ్ పనులను ఎంతో సులభంగా చేయగలుగుతారు. అలాగే సామాజిక రంగంలో గౌరవం కూడా విపరీతంగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రేమ జీవితం చాలా శృంగార భరితంగా మారుతుంది. స్నేహితుల సపోర్టుతో కొన్ని రకాల పనులు ఎంతో సులభంగా చేయగలుగుతారు.
కన్య రాశి
రుచక రాజయోగ ప్రభావంతో కన్యా రాశి వారికి విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా వీరికి ఈరోజు నుంచి అదృష్టం సహకరించబోతోంది. తద్వారా రెండు రోజులపాటు అద్భుతమైన లాభాలు కలుగుతాయి. అలాగే ఈరోజు మీకు ఇష్టమైన స్నేహితులతో కలిసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ప్రత్యర్ధులు, శత్రువుల నుంచి కూడా ప్రశాంతత లభిస్తుంది. ఒత్తిడి కూడా పూర్తిగా తొలగిపోతుంది. ఏదైనా కొత్త వ్యాపారాలు ప్రారంభించాలనుకుంటున్న వ్యక్తులకు ఇది అద్భుతమైన అవకాశం.
తులారాశి
తులా రాశిలో జన్మించిన వ్యక్తులకు కూడా ఈ సమయంలో ఎంతో కొంత మేలు జరుగుతుంది. ముఖ్యంగా రెండు రోజులపాటు వీరికి అదృష్టం సహకరించి అన్ని ప్రయత్నాల్లో విజయాలు లభించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఉద్యోగాలు చేసేవారు ఈ సమయంలో విశేషమైన ఫలితాలు పొందుతారు. అలాగే మీ ప్రత్యర్థులతో వస్తున్న వాగ్వాదాలు కూడా ఈరోజు తొలగిపోతాయి. శత్రువుల బాధ నుంచి విముక్తి కలుగుతుంది. అంతేకాకుండా తల్లిదండ్రులతో సంబంధాలు మెరుగుపడతాయి.
మకర రాశి
మకర రాశి వారికి మంగళవారం నుంచి గురువారం వరకు చాలా శుభప్రదంగా ఉంటుంది. రాజయోగ ప్రభావంతో వీరికి అద్భుతమైన లాభాలు కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆర్థికంగా అదృష్టం సహకరించబోతోంది. అలాగే గతంలో చేసిన పనులన్నీ సులభంగా పూర్తవుతాయి. తల్లిదండ్రుల నుంచి అద్భుతమైన లాభాలు కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొత్తగా ఏదైనా ప్రారంభించాలనుకుంటున్న వ్యక్తులకు ఈ సమయం అద్భుతమైన అవకాశాన్ని అందించబోతోంది. అలాగే అత్తమామల సహకారంతో విశేషమైన ఫలితాలు పొందుతారు.
కుంభరాశి
కుంభ రాశి వారికి ఈ సమయం చాలా శుభప్రదంగా ఉంటుంది. ముఖ్యంగా గత కొన్ని రోజుల నుంచి వస్తున్న గందరగోల సమస్యలు కూడా తొలగిపోతాయి. అలాగే ఎలాంటి పనులు చేసిన అద్భుతమైన విజయాలు సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత కొద్ది రోజుల నుంచి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులకు కాస్త పరిష్కారం కూడా లభిస్తుంది. తెలివితేటలతో ముందుకెళ్లడం వల్ల కొన్ని రకాల పనుల్లో ఊహించని విజయాలు కూడా సాధించగలుగుతారు. దీంతోపాటు దౌత్యపరమైన తెలివితేటలతో వ్యాపారాలను అద్భుతమైన విజయాలు సాధిస్తారు.
Also Read: Mercury Transit 2026: మకరంలో తిష్ట వేసిన బుధుడు.. ఈ రాశుల వారికి కోటీశ్వరులయ్యే యోగం ప్రారంభం!

Also Read: Mercury Transit 2026: మకరంలో తిష్ట వేసిన బుధుడు.. ఈ రాశుల వారికి కోటీశ్వరులయ్యే యోగం ప్రారంభం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Rajahmundry: ఆంధ్రప్రదేశ్‌లో చిరుతపులి సంచారం కలకలం రేపుతోంది. ఒక పులి తెలంగాణ మీదుగా ఏపీలోకి ప్రవేశించి ఇప్పుడు రాజమండ్రి పట్టణ ప్రజలను వణికిస్తోంది. కొంత అటవీ ప్రాంతం కాకుండా జనారణ్యంలో పులి సంచరిస్తుండడంతో రాజమండ్రి తీవ్ర భయాందోళన నెలకొంది. పులి ఎటు వైపు వెళ్తుందో.. ఏం చేస్తుందోనని ఉత్కంఠ నెలకొంది. పులి సంచారంపై స్థానిక ఎమ్మెల్యేతోపాటు అటవీ శాఖ అధికారులు అప్రమత్తం ప్రకటించారు.
Also Read: Nandi Awards: టాలీవుడ్‌కు ఏపీ ప్రభుత్వం శుభవార్త.. త్వరలోనే నంది అవార్డులు
రాజమండ్రి పట్టణంలో రాత్రి 9 గంటల సమయంలో పెద్దపులి దివా చెరువు హైవేపై కనిపించింది. ఎస్‌వీ పీసీ ఫంక్షన్ హాల్‌కి ఆనుకుని ఉన్న రోడ్డుపై తిరిగి.. పక్కనే ఉన్న ఢిల్లీ పబ్లిక్ స్కూల్ వైపు పెద్దపులి వెళ్లింది. రాజమండ్రి నగరానికి అతి సమీపంలో పెద్దపులి సంచరించడం కలకలం రేపుతోంది. దివాన్ చెరువు వద్ద ఆటోనగర్ ప్రాంతానికి చేరుకోవడంతో స్థానిక ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఆటో నగర్, దివాన్ చెరువు, కొంతమూరు, లాలా చెరువు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ సూచించారు.
Also Read: YS Sharmila: ఉపాధి హామీని మోదీ ఖూనీ చేస్తున్నారు.. అందరం తిరగబడాలి: వైఎస్ షర్మిల
ఒకే రోజు వివిధ ప్రాంతాల్లో పులి సంచరించింది. ఉదయం గాడాల ప్రాంతంలో పెద్ద పులి సంచరించిన ఆనవాళ్లు కనిపించాయి. అక్కడ పెద్దపులి పాదముద్రలు లభించాయి. గాడాల ప్రాంతం నుంచి దిశ మార్చుకొని రాజమండ్రి శివారులోని దివాన్ చెరువు ఆటోనగర్ ప్రాంతానికి పులి చేరుకుంది. ఛత్తీస్‌ఘడ్ నుంచి వచ్చినట్లుగా భావిస్తున్న పెద్దపులి పది రోజుల కిందట తెలంగాణలోకి ప్రవేశించి.. కావడిగుంట్ల అటవీ ప్రాంతం నుంచి కన్నాపురం ఫారెస్ట్ ఏరియా మీదుగా ఏలూరు జిల్లాలోకి ప్రవేశించింది. అక్కడి నుంచి బుట్టాయిగూడెం ప్రాంతంలోకి వచ్చింది. నాలుగు రోజుల కిందట పోలవరం మండలం పట్టిసీమ వద్ద గోదావరి నదిని ఈదుకుని తూర్పుగోదావరి జిల్లాలోకి పులి ప్రవేశించినట్లు అటవీ శాఖ అధికారులు భావిస్తున్నారు. సీతానగరం మండలం కొండేపూడి నుంచి ఏటిపట్టు ప్రాంతంలో సంచరిస్తూ తొర్రేడు వద్దకు చేరుకుని జనావాసాలకు దగ్గరగా అరటి, మొక్కజొన్న తోటలు వరి పొలాల వద్ద పులి సంచరిస్తోంది. తూర్పుగోదావరి జిల్లాలోకి వచ్చాక మూడుచోట్ల పశువులను పులి చంపి తన ఆకలిని తీర్చుకుంది.
Also Read: Pawan Kalyan: అరవ శ్రీధర్ రాసలీలపై పవన్ కల్యాణ్ ఆగ్రహం.. సమావేశం నుంచి వాకౌట్
కాగా రాజమండ్రి పట్టణ పరిసరాల్లో పులి సంచరిస్తుండడంతో దానిని బందించేందుకు అటవీ శాఖ అధికారులు స్థానిక పోలీసుల సహాయంతో ఏర్పాట్లు చేశారు. ఫారెస్ట్ అధికారులు బోన్లు ఏర్పాటుచేయగా.. ట్రాప్ కెమెరాలు, డ్రోన్ల ద్వారా పులిని గాలిస్తున్నారు. కాగా రాజమండ్రి పట్టణంలో పులి సంచరిస్తున్న వీడియోలు వైరల్‌గా మారాయి. సోషల్ మీడియాలో పులి సంచారంపై వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.
Janasena Party MLA Issue: ఆంధ్రప్రదేశ్‌లో తీవ్ర సంచలనం రేపిన తన రాసలీలల వ్యవహారంపై జనసేన పార్టీ రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ కీలక వ్యాఖ్యలు చేశారు. తనపై వస్తున్న ఆరోపణలు.. చక్కర్లు కొడుతున్న వీడియోలపై కీలక ప్రకటన చేశారు. అస్సలు ఈ వ్యవహారం తన జనసేన పార్టీకి సంబంధం లేదని.. ఇది ఆ మహిళకు.. తనకు సంబంధించిన వ్యక్తిగత అంశం అని ప్రకటించారు. ఇది వ్యక్తిగత విషయం అని స్పష్టం చేశారు.
Also Read: Wild Tiger: రాజమండ్రి ప్రజలకు బిగ్ అలర్ట్.. జనారణ్యంలో చిరుతపులి సంచారం
తన రాసలీలల వ్యవహారంపై జనసేన పార్టీ నియమించిన త్రిసభ్య కమిటీ విచారణకు జనసేన పార్టీ రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ హాజరయ్యారు. కొన్ని గంటల పాటు విచారణ జరిగిన అనంతరం అరవ శ్రీధర్ మీడియాతో మాట్లాడారు. 'నాకు, వీణకు మధ్య జరిగింది వ్యక్తిగత విషయం' అని ప్రకటించారు. పార్టీ ఆదేశాల మేరకు విచారణకు హాజరయ్యానని.. తన వాదనను ఆధారాలతో కమిటీకి తెలిపినట్లు వెల్లడించారు. త్వరలో అన్నీ విషయాలు చెబుతానని చెప్పారు.
Also Read: Nandi Awards: టాలీవుడ్‌కు ఏపీ ప్రభుత్వం శుభవార్త.. త్వరలోనే నంది అవార్డులు
కమిటీ తన నివేదికను జనసేన పార్టీ అధిష్టానానికి ఇచ్చాక నిర్ణయం తీసుకుంటారని ఎమ్మెల్యే అరవ శ్రీధర్ తెలిపారు. 'ఇది నా వ్యక్తిగత వ్యవహారం.. జనసేన పార్టీకి ఆపాదించవద్దు' అని విజ్ఞప్తి చేశారు. 'నాపై కేసు నమోదైన విషయం నాకు తెలియదు. వాళ్లు ఎన్ని కేసులు పెట్టుకున్నా చట్ట ప్రకారం ఎదుర్కోడానికి నేను సిద్ధం' అని ప్రకటించారు. ఇక ప్రజా జీవితంలోకి ఎప్పుడు వస్తారని ప్రశ్నించగా.. ఈ వ్యవహారం చక్కబడ్డాక వస్తానని తెలిపారు. విచారణ తర్వాత పార్టీ తీసుకోబోయే నిర్ణయం ఎలాంటి ఉంటుందో చూడాలని చెప్పారు. కమిటీ ఇచ్చిన తీర్పు.. పార్టీ అధిష్టానం తీసుకోబోయే నిర్ణయం తర్వాత అన్నీ విషయాలు మీడియాతో పంచుకుంటానని అరవ శ్రీధర్ వివరించారు. ఆధారాలతో సహా తాను మరోసారి మీడియా ముందుకు వస్తానని తెలిపారు. అసెంబ్లీలో మహిళతో చాటింగ్ వీడియో విషయమై స్పందించేందుకు అరవ శ్రీధర్ వెనుకంజ వేశారు.
Also Read: Pawan Kalyan: అరవ శ్రీధర్ రాసలీలపై పవన్ కల్యాణ్ ఆగ్రహం.. సమావేశం నుంచి వాకౌట్
వేధింపులపై కేసు నమోదు
జనసేన పార్టీ ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పై ఓ మహిళా ఉద్యోగి లైంగిక వేధింపుల ఆరోపణలపై పోలీసులు కేసు నమోదు చేశారు. తిరుపతి జిల్లా ఎస్పీకి ఆ మహిళ ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం పోలీసులు కేసు నమోదు చేశారు. తనపై లైంగిక దాడి చేశాడని మహిళ జాతీయ మానవ హక్కుల సంఘానికి బాధితురాలు ఫిర్యాదు చేయడంతో.. మానవ హక్కుల సంఘం ఆదేశాల మేరకు తిరుపతి పోలీసులు బీఎన్‌ఎస్ 318(2), 318(4), 351(2) సెక్షన్ల కింద కేసు నమోదైంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.
Yumnam Khemchand Singh: జాతుల మధ్య చెలరేగిన హింస మణిపుర్ రాష్ట్రాన్ని రావణకాష్టం చేసింది. వివిధ వర్గాల మధ్య జరిగిన ఘర్షణతో అక్కడ ప్రజాజీవనం అస్తవ్యస్తమైంది. దీంతో ప్రజాస్వామ్య ప్రభుత్వం తొలగిపోయి రాష్ట్రపతి పాలన విధించారు. రాష్ట్రపతి పాలనకు ఏడాది పూర్తికానుండడంతో కేంద్ర ప్రభుత్వం ప్రజా ప్రభుత్వాన్ని నెలకొల్పనుంది. ఈ నేపథ్యంలో మణిపూర్‌కు సంబంధించి కీలక పరిణామం చోటుచేసుకుంది. మణిపూర్‌కు కాబోయే ముఖ్యమంత్రిని బీజేపీ ఎన్నుకుంది.
Also Read: Nandi Awards: టాలీవుడ్‌కు ఏపీ ప్రభుత్వం శుభవార్త.. త్వరలోనే నంది అవార్డులు
దేశ రాజధాని ఢిల్లీలో సమావేశమైన బీజేపీ నాయకులు మణిపూర్‌కు సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నారు. మణిపూర్ బీజేపీ శాసనసభా పక్ష నాయకుడు మాజీ మంత్రి యుమ్నం ఖేమ్‌చంద్ సింగ్ ఎన్నికయ్యారు. త్వరలోనే ఆయన మణిపూర్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. శాసనసభ పక్ష నాయకుడిగా ఖేమ్‌చంద్‌ను ఎంచుకోగా.. మహిళా నాయకురాలు నెమ్చా కిప్‌జెన్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. మణిపుర్‌లో కొత్తగా కొలువుదీరే ప్రభుత్వానికి పదవీకాలం 2027 వరకు ఉంది.
Also Read: YS Sharmila: ఉపాధి హామీని మోదీ ఖూనీ చేస్తున్నారు.. అందరం తిరగబడాలి: వైఎస్ షర్మిల
మణిపూర్‌లో జాతుల మధ్య ఘర్షణలు 2023 మే నుంచి తీవ్ర స్థాయిలో హింస చెలరేగింది. ఘర్షణలతో మణిపుర్ రాష్ట్రం అట్టుడుకిపోయింది. ఈ ఘర్షణలో పెద్ద ఎత్తున ఆస్తి నష్టం సంభవించగా.. 250 మందికిపైగా మృతి చెందారని సమాచారం. ఇక ఈ ఘర్షణలతో మణిపూర్‌లో వేలాదిమంది నిరాశ్రయులు కాగా.. లక్షలాది మందిపై తీవ్ర ప్రభావం చూపింది. ఈ ఘర్షణలు, హింస చెలరేగడంతో నియంత్రించలేని బీజేపీ సీఎం బీరెన్ సింగ్ ఫిబ్రవరి 9, 2025లో తన పదవికి రాజీనామా చేశారు. అతడి రాజీనామాతో మణిపూర్‌లో రాష్ట్రపతి పాలన విధించారు. ఏడాది కాలంగా కొనసాగుతున్న రాష్ట్రపతి పాలనతో కొంత ఘర్షణలు, హింసలు తగ్గుముఖం పట్టాయి. ప్రస్తుతం మణిపూర్‌లో పరిస్థితి చక్కదిద్దుకుందని.. అంతేకాకుండా రాష్ట్రపతి పాలన ఏడాది ముగుస్తుండడంతో అక్కడ ప్రజా ప్రభుత్వం ఏర్పాటుచేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా బీజేపీ శాసనసభా పక్ష నాయకుడిని నియమించారు.
Also Read: Pawan Kalyan: అరవ శ్రీధర్ రాసలీలపై పవన్ కల్యాణ్ ఆగ్రహం.. సమావేశం నుంచి వాకౌట్
వస్తున్న సమాచారం ప్రకారం ఫిబ్రవరి 9వ తేదీన మణిపుర్‌లో కొత్త ప్రభుత్వం కొలువుదీరే అవకాశం ఉంది. మణిపూర్ అసెంబ్లీలో బలాబలాలు పరిశీలిస్తే.. మొత్తం 60 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఒక ఎమ్మెల్యే స్థానం ఖాళీ ఉండగా.. అత్యధికంగా బీజేపీకి 37 మంది ఎమ్మెల్యేలు ఉండగా.. 6 మంది నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్‌సీపీ), కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఐదుగురు, నాగా పీపుల్స్ ఫ్రంట్ ఐదుగురు ఉన్నారు. ఇద్దరు కుకీ పీపుల్స్ అలయన్స్ నుంచి ఎమ్మెల్యేలు ఉండగా.. జేడీయూ 1, ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేలు ఉన్నారు. మెజార్టీ కన్నా అధికంగా సీట్లు ఉండడంతో మణిపూర్‌లో బీజేపీ ప్రభుత్వం కొలుదీరబోతున్నది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
.Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Re Launch Nandi Awards: సినీ పరిశ్రమకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నంది అవార్డులు ఇచ్చి ప్రభుత్వం గౌరవించింది. తెలంగాణ స్వరాష్ట్రంగా ఏర్పడిన అనంతరం సినీ పరిశ్రమకు సంబంధించి అవార్డులు ఆగిపోయాయి. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం నంది అవార్డులకు పేరు మార్చి అందిస్తుండగా.. ఏపీలో మాత్రం పుష్కర కాలంగా ఎలాంటి అవార్డులు లేదు. తాజాగా నంది అవార్డులపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలోనే నంది అవార్డులు ఇస్తామని సినీ పరిశ్రమకు తీపి కబురు వినిపించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగు చలన చిత్ర పరిశ్రమ అభివృద్ధికి సంబంధించి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని.. ఏప్రిల్ నుంచి అవసరమైన కార్యాచరణను ప్రారంభిస్తామని ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ ప్రకటించారు.
Also Read: YS Sharmila: ఉపాధి హామీని మోదీ ఖూనీ చేస్తున్నారు.. అందరం తిరగబడాలి: వైఎస్ షర్మిల
వెలగపూడిలోని సచివాలయంలో మంత్రి కందుల దుర్గేష్ ఏపీ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ - 2026 పోటీల విజేతలను సత్కరించారు. అనంతరం మంత్రి దుర్గేశ్ మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో చర్చించి త్వరలోనే నంది అవార్డులు, నంది నాటకోత్సవాల నిర్వహణపై ప్రకటన చేస్తామని తెలిపారు. హైదరాబాద్‌కు ధీటుగా అమరావతిని సినిమా రంగానికి కేంద్ర బిందువుగా మార్చాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం ఉందని చెప్పారు. సామాజిక చైతన్యంతో కూడినటువంటి చిత్రాలకు దర్శకత్వం వహించిన దర్శకులు దిలీప్ రాజా ఏపీలో తెలుగు చలన చిత్ర పరిశ్రమ అభివృద్ధి చేయాలని నిరంతరం తపిస్తున్నారని మంత్రి దుర్గేశ్ తెలిపారు. సినిమా రంగం అభివృద్ధికి ఏపీ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.
Also Read: Pawan Kalyan: అరవ శ్రీధర్ రాసలీలపై పవన్ కల్యాణ్ ఆగ్రహం.. సమావేశం నుంచి వాకౌట్
ఏపీ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ వివరాలు
ఆంధ్రప్రదేశ్‌లోని ఔత్సాహిక కళాకారులను మాత్రమే ప్రోత్సహించేందుకు నిర్వహించిన ఏపీ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ పోటీల్లో రాష్ట్రవ్యాప్తంగా 203 షార్ట్ ఫిల్మ్ ఎంట్రీలు రాగా 2 వేల మంది నటీనటులు పాల్గొన్నారు. మొదటి మూడు స్థానాల్లో నిలిచిన విజేతలకు రూ.లక్ష రూపాయల నగదు బహుమతి అందించారు. ఉత్తమ నటిగా సుజిత (మనం), ఉత్తమ కేరెక్టర్ ఆర్టిస్ట్‌గా సాయి ప్రకర్ష (అబద్దం వర్సెస్ నిజం), ఉత్తమ నటుడు పవన్ శర్మ (మన్ను-మిన్ను), ఉత్తమ బాలనటి హర్షతున్నీసా, యంగ్ టాలెంట్ రిత్విక్ రెడ్డి (అస్త్ర), త్రివిక్రమ్ (డెబ్యూ డైరెక్టర్ ) విలన్ మీసాల భాస్కర్, తెలుగు స్క్రిప్ట్ పరిశీలకులు మంజులూరి లక్ష్మీపతి మాస్టర్, జగదీష్, ఉత్తమ దర్శకత్వం నరేష్ దోనె అవార్డులు పొందారు.
Also Read: Revanth Reddy: తెలంగాణ జాతిపిత కేసీఆర్ ఎలా అవుతాడు?: రేవంత్ రెడ్డి
షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ విజేతలు వీరే..
ప్రథమ బహుమతి: 'మహావృక్షం'. చంద్రశేఖర్ శకునాల (విశాఖపట్టణం)
ద్వితీయ బహుమతి: సింహాద్రి అప్పన్న, శ్రీనివాసరావు (శ్రీకాకుళం)
తృతీయ బహుమతి: అబద్దం వర్సెస్ నిజం, నవీన్ కుమార్ (పాలకొల్లు)
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
.Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి