icon-pinewzicon-zee
PINEWZ
become creator
Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back

हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|

Sun And Venus Transit: సూర్య, శుక్రుల నక్షత్ర మార్పు.. మకర రాశితో పాటు ఆ 2 రాశులకు ఇక కోటీశ్వర యోగమే!

Hyderabad, Telangana:

Sun And Venus Transit June 22 Effect On Zodiac: జూన్ 22వ తేదీన సూర్య శుక్ర గ్రహాల మార్పులు జరగబోతున్నాయి. ముఖ్యంగా ఇవి తమ నక్షత్రాలను మార్చుకున్నాయి. ఈరోజు సూర్యుడు ఆరుద్ర నక్షత్రంలోకి సంచారం చేయగా.. శుక్రుడు ఆశ్లేష నక్షత్రంలోకి సంచారం చేశాడు.. జ్యోతిష్య శాస్త్రంలో సూర్యుడిని ధైర్యంతో పాటు సాహసం, ఆనందానికి సూచికగా భావిస్తారు. ఇక శుక్రుడిని సంపద శ్రేయస్సు వ్యాపారం ఉపాధితో పాటు ఇతర శుభ పనులకు సూచికగా భావిస్తారు. అలాంటిది ఈ రెండు గ్రహాలు సంచారం చేశాయి. ఇదిలా ఉంటే.. ఆరుద్ర నక్షత్రానికి అధిపతి రాహువు కాగా.. ఆశ్లేష నక్షత్రానికి అధిపతి బుధుడు.. జూన్ 22వ తేదీన ఈ రెండు గ్రహాలు ఏకకాలంలో తమ నక్షత్రాలను మార్చుకోవడం అరుదైన యాదృచ్ఛికంగా భావిస్తారు.. దీని కారణంగా మూడు రాశుల వారిపై ఊహించని ప్రభావం పడుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు.. ముఖ్యంగా ఆర్థికంగా మేలు జరగడమే కాకుండా కోరుకుంటున్న కోరికలు కూడా చాలావరకు నెరవేరే అవకాశాలు కనిపించబోతున్నాయి. అలాగే దీర్ఘకాలిక సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి..

తులారాశి:
సూర్య శుక్ర గ్రహాలు ఏకకాలంలో సంచారం చేయడం కారణంగా.. ముఖ్యంగా తులా రాశి వారిపై ఊహించని ప్రభావం పడబోతోంది. వీరికి ఈ సమయం చాలా ప్రయోజనకరంగా ఉండబోతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఆకస్మిక ఆర్థిక లాభాలు కలగడమే కాకుండా.. అనుకుంటున్న పనుల్లో దిమ్మతిరిగే ధన లాభాలు సొంతం చేసుకోబోతున్నారు. అలాగే వీరికి ధైర్య సాహసాలు పెరిగి ఆత్మీయంలో మద్దతు లభించి కష్టతరమైన పనులు కూడా ఎంతో సులభంగా చేయగలిగే అవకాశాలున్నాయి. దీంతోపాటు తొందరపాటు నిర్ణయాన్ని తీసుకోకుండా ఉండడం మంచిది. అలాగే ఈ సమయంలో మీకు అనుకూలంగా పనులు చేయగలుగుతారు..

మకర రాశి:
సూర్య శుక్ర గ్రహాల అరుపులు అనేక విధాలుగా మకర రాశి వారిపై కూడా ప్రభావాన్ని చూపుతాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. ముఖ్యంగా వీరికి ఆర్థిక పరిస్థితులు గతంలో కంటే ఇప్పుడు మరింత మెరుగుపడే సూచనలు కనిపిస్తున్నాయి. దీంతోపాటు వ్యాపారాల్లో ఉన్న వ్యక్తులకు అందరికీ మంచి మంచి అవకాశాలు కూడా లభించబోతున్నాయి. అలాగే ఉద్యోగాలు చేసే వారందరికీ పదోన్నతులు కూడా తప్పకుండా లభిస్తాయి. ముఖ్యంగా ఈ సమయంలో మకర రాశి వారు తమ వ్యాపారాలను ఊహించని స్థాయిలో విస్తరించే అవకాశాలున్నాయి. దీంతోపాటు ఒంటరిగా ఉన్నవారికి జీవితంలో ఒక ప్రత్యేకమైన వ్యక్తిని కలిసే అవకాశాలున్నాయి. అలాగే మీకు అందరి సపోర్టు లభించి అనుకుంటున్న పనులు ఎంతో సింపుల్ గా చేయగలుగుతారు..

కుంభరాశి:
కుంభరాశిలో జన్మించిన వ్యక్తులందరికీ ఈ సమయంలో ఆకర్షణతో పాటు పురోగతి విపరీతంగా పెరుగుతుంది. మీ వ్యక్తిగత జీవితంలోకి ఇతరులను సులభంగా ఆకర్షించగలుగుతారు. అలాగే వృత్తి జీవితం మెరుగుపడడమే కాకుండా.. అనుకున్నన్నీ ఆర్థిక లాభాలు కూడా పొందగలుగుతారు. ఉద్యోగాలపరంగా దిమ్మతిరిగే ధన లాభాలు సొంతం చేసుకోగలుగుతారు. ముఖ్యంగా ఈ సమయంలో తప్పకుండా కొన్ని రకాల శుభవార్తలు కూడా వింటారు. అదృష్టం కలిసి వస్తే ఆ సంపూర్ణంగా ఉన్న పనులు కూడా ఎంతో సులభంగా ఈ సమయంలో పూర్తవుతాయి. ముఖ్యంగా కొత్త మార్గాల నుంచి భారీ మొత్తంలో ఆర్థిక లాభాలు కూడా సొంతం చేసుకోగలుగుతారు. అవసరమైన ఖర్చులకు దూరంగా ఉండటం ఎంతో మంచిది అని జ్యోతిష్యులు చెబుతున్నారు..

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

గమనిక.. 

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook ..

0
0
Report

Qatar LNG Blast: ఖతార్‌ గ్యాస్‌ ప్లాంట్‌లో భారీ పేలుడు.. 12 మంది భారతీయులు దుర్మరణం..!!

BBhoomi2h ago
Secunderabad, Telangana:

Ras Laffan Industrial City Indians Killed: ఖతార్ లోని ప్రముఖ రాస్ లఫాన్ లిక్విఫైడ్ నేచరుల్ గ్యాస్ ఇండస్ట్రీలో సంభవించిన భారీ పేలుడులో 13 మంది దుర్మరణం చెందారు. 66 మంది తీవ్రంగా గాయపడ్డారు. మరణించిన వారిలో 12 మంది భారతీయులు ఉన్నారు. ఇరాన్ జరిపిన క్షిపణి దాడి కారణంగా నిలిచిపోయిన కార్యకలాపాలను కార్మికులు పునరుద్ధరిస్తున్న సమయంలో ఈ పేలుడు జరిగింది. బర్జాన్ గ్యాస్ సరఫరా విభాగంలో ఈ పేలుడు జరిగిందని.. ఇదొక సాంకేతిక ప్రమాదమని అధికారులు తెలిపారు. 

ఈ ప్రమాదం గురించి తెలుసుకున్న వెంటనే, విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ ఖతార్‌లో ప్రాణాలు కోల్పోయిన భారత పౌరులకు, గాయపడిన వారికి తన ప్రగాఢ సంతాపం తెలిపారు. ఖతార్‌లోని రాస్ లఫాన్ ఇండస్ట్రియల్ సిటీలో జరిగిన పేలుడులో భారత పౌరులతో సహా ప్రాణాలు కోల్పోవడం, గాయపడటం వంటి వార్తలకు నేను తీవ్రంగా విచారించాను. మరిన్ని వివరాలు వెలువడుతున్న కొద్దీ, దోహాలోని మా భారత రాయబార కార్యాలయం ఖతార్ అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతోంది. ఈ విషాదంతో ప్రభావితమైన భారత పౌరుల కుటుంబాలకు సహాయం అందించడానికి అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి. బాధితులకు, వారి కుటుంబాలకు మా ప్రార్థనలు, సానుభూతి తెలియజేస్తున్నాము అని విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్  అన్నారు. 

ప్రమాదంలో మరణించిన 12 మంది భారతీయుల పార్థివ దేహాలను వీలైనంత త్వరగా వారి స్వస్థలాలైన భారతదేశానికి పంపించడానికి, చట్టపరమైన ప్రక్రియలను పూర్తి చేసేందుకు ఖతార్ అధికారులతో కలిసి వేగంగా పనిచేస్తున్నట్లు దోహాలోని భారత రాయబార కార్యాలయం, ఖతార్ అధికారులను ఉటంకిస్తూ సోమవారం ధృవీకరించింది. ప్రమాదంలో గాయపడిన వారందరి పరిస్థితి ఇప్పుడు పూర్తిగా నిలకడగా ఉందని, వారికి ఖతార్ ఆసుపత్రులలో సరైన, నాణ్యమైన వైద్య చికిత్స అందుతోందని కూడా రాయబార కార్యాలయం స్పష్టం చేసింది.

ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే, భద్రతా అధికారులు రాస్ లఫాన్ అత్యవసర ప్రతిస్పందన బృందాలతో కలిసి స్పందించి, పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి భారీ సహాయక చర్యలను ప్రారంభించారని ఖతార్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ ప్రమాదం వల్ల ప్లాంట్ నుండి ఎలాంటి హానికరమైన గ్యాస్ లీకేజీలు జరగలేదని, సమీపంలో నివసిస్తున్న ప్రజల భద్రతకు గానీ, పర్యావరణానికి గానీ ఎటువంటి ముప్పు లేదని ఖతార్ ప్రభుత్వం హామీ ఇచ్చింది. ప్రస్తుతం, ఉన్నత స్థాయి సాంకేతిక నిపుణులు ఈ ఘటనకు గల కచ్చితమైన కారణాన్ని దర్యాప్తు చేస్తున్నారు.

Also Read: CEO లకే సవాల్ విసురుతున్న CPO పోస్ట్.. కార్పొరేట్ ప్రపంచంలో దీని క్రేజ్ వేరే లెవల్

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report

ప్రజాసేవకు కేర్ ఆఫ్ అడ్రస్ అంటే బాలకృష్ణ: చంద్రబాబు ప్రశంసల వర్షం

Hyderabad, Telangana:

'బాలకృష్ణకు సినిమాల్లో చప్పట్లు వినిపించేవి.. కానీ ఇప్పుడు ప్రజాసేవకు కేర్ ఆఫ్ అడ్రస్ అంటే బాలకృష్ణ ఉంటారు. ఎంతోమంది క్యాన్సర్ బాధితులకు సేవలు అందించిన ఘనత బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్‌కి దక్కుతుంది. ప్రతి ఒక్క సక్సెస్ స్టోరీకి ఒక కారణం ఉంటుంది. మా అత్తమ్మ బసవతారకం. ఎన్టీఆర్‌ రాజకీయాల్లో ఎప్పుడూ బిజీగా ఉండేవారు. కానీ ఆమె మా కుటుంబానికి పెద్దదిక్కుగా ఉండేవారు. క్యాన్సర్ అప్పట్లో డబ్బున్న వారికే వచ్చేది.. రాచపుండు అనే వారు. అమెరికాకు కూడా తీసుకెళ్లి చికిత్స చేయించాం. ఎన్టీఆర్‌ ముఖ్యమంత్రి అయిన కొద్ది రోజుల్లోనే ఆమె మా నుంచి దూరమయ్యారు' అని సీఎం చంద్రబాబు గుర్తుచేసుకున్నారు.

హైదరాబాద్‌లో మంగళవారం జరిగిన బసవతారకం క్యాన్సర్‌ ఆస్పత్రి సిల్వర్‌ జూబ్లీ వేడుకల్లో టీడీపీ అధినేత చంద్రబాబు కీలక ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా బాలకృష్ణపై ప్రశంసలు కురిపించారు. 'ఆమెను చూసిన ఎన్టీఆర్‌ పేదలకు చికిత్స అందించేందుకు ఒక ఆస్పత్రి ఉండాలని భావించి కొన్ని ఎకరాల భూమిని కేటాయించి కట్టించాలనే ధృడ నిశ్చయంతో ముందుకువెళ్లారని చెప్పారు. 'ముఖ్యమంత్రిగా ఓడిపోవడం. అనంతరం ఆస్పత్రిని పూర్తి చేయడానికి చాలా కష్టపడ్డాం. ఎట్టకేలకు అప్పటి పీఎం వాజ్‌పేయి ప్రారంభించారు' అని సీఎం చంద్రబాబు గుర్తుచేశారు. 'తండ్రి ఒక మొక్క నాటితే దాన్ని ఒక గొప్ప కల్పవృక్షం లా మార్చిన ఘనత బాలకృష్ణకి దక్కుతుంది. 25 ఏళ్లలో ఎంతోమంది దాతలు ఆస్పత్రి కోసం పనిచేశారు' అని తెలిపారు.

'మాకు ఆస్పత్రిని నడపడానికి ఎన్నో సవాళ్లు వచ్చాయి. బాలకృష్ణ సారథ్యంలో 16 ఏళ్లుగా అన్‌స్టపబుల్‌గా నడుపుతున్నారు. ఈ పాటికి రిటైర్ అవుతారు. కానీ స్టిల్ హీరోగా రాణిస్తూ హిందూపూర్ ఎమ్మెల్యేగా సేవలు అందిస్తున్నారు. బాలకృష్ణకు ప్యాషన్ ఉంది. ఎంపతీ ఉంది' అని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రశంసించారు. ఒక ప్రవైట్ ఆర్గనైజేషన్ పెడితే కూడా ఇంతలా కష్టపడరు.. కానీ నాన్ ప్రొఫిటబుల్ ఆర్గనైజేషన్ కోసం బాలకృష్ణ దేశవిదేశాల్లో తిరిగి దాతలను పట్టుకుని ఆస్పత్రిని నిలబెడుతున్నారని చెప్పారు. ఈ ఆస్పత్రికి వచ్చే ప్రతి పేషంట్‌కి భరోసా కల్పించేలా సేవలు అందిస్తున్నారు. 1,600 పైగా క్యాన్సర్ ప్రివెంటివ్ స్క్రీనింగ్ సెంటర్స్ పెట్టారు. అమరావతిలో వెయ్యి పడకల ఆస్పత్రి పెడతాము అంటే స్వాగతించా' అని చంద్రబాబు వివరించారు.

'ప్రతి ఏడాది 9 లక్షల మంది క్యాన్సర్‌తో చనిపోతున్నారు. దీన్ని మనం ఆలోచించాలి. ఎంత ధైర్యంగా ఉన్నా కుటుంబంలో అయినా సరే క్యాన్సర్ వస్తే మొత్తం కుంగిపోతారు. మనం ముందుగా గుర్తిస్తే కాపాడుకునే అవకాశాలు ఉన్నాయి. సమైకే ఆంధ్రప్రదేశ్‌లో కూడా అన్ని ప్రభుత్వాలు, విడిపోయాక కూడా అన్ని ప్రభుత్వాలు బసవతారకం ఆస్పత్రికి బాసటగా ఉన్నారు' అని సీఎం చంద్రబాబు గుర్తుచేశారు. 'ప్రైవేట్‌లో లాభాపేక్ష ఉంది. కానీ బసవతారకం ఆస్పత్రిలో నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ అలాంటి ఆర్గనైజేషన్లు రావాలి. ఎన్‌టీఆర్‌ వేసిన పునాదులు.. ఒకవైపు బాలకృష్ణ సినిమాలు. నా భార్య ఎన్టీఆర్‌ ట్రస్ట్. పిల్లలు, హెరిటేజ్, మొత్తం సేవలు అందిస్తున్న కుటుంబం. భారతదేశంలోనే నెంబర్ 1 నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్‌గా నిలుస్తుంది. బెస్ట్ ప్లాట్‌ఫారంగా బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ నిలుస్తుంది' అని టీడీపీ అధినేత చంద్రబాబు తెలిపారు.

0
0
Report
Advertisement

రేవంత్ రెడ్డి మోసగాడు.. భూమి బద్దలైనా మల్లొచ్చేది మాత్రం కేసీఆర్ ప్రభుత్వమే: హరీశ్ రావు

Achampet, Telangana:

Harish Rao vs Revanth Reddy: 'రైతులకు రూ.29,350 కోట్ల భరోసా ఎగ్గొట్టి, బోనస్‌ను బోగస్ చేసి.. ఇప్పుడు కేంద్రం చెబితేనే పంటలు కొంటామంటున్న రేవంత్ రెడ్డి మొనగాడు కాదు.. పక్కా మోసగాడు' అని బీఆర్‌ఎస్‌ పార్టీ డిప్యూటీ ఫ్లోర్‌ లీడర్‌, మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పేదలకు ఇవ్వడానికి పైసల్లేవంటాడు కానీ.. తన గెస్ట్ హౌస్‌కు రూ.100 కోట్లు, కంచెకు రూ.17 కోట్లు.. పక్క రాష్ట్రాల్లో పేపర్ యాడ్స్‌కు రూ.వందల కోట్లు ఎక్కడి నుంచి వస్తున్నాయని ప్రశ్నించారు. 'నాడు ఔరంగజేబు జుట్టుపై పన్ను వేసినట్లు.. నేడు పెట్రోల్, డీజిల్, ఎరువులు, చార్జీల పేరుతో రేవంత్ సర్కార్ ప్రజల రక్తం తాగుతూ పన్నుల భారం మోపుతోంది' అని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

నల్లమల గౌరవం
నాగర్‌కర్నూల్‌ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలో జరిగిన బీఆర్ఎస్ పార్టీ సమావేశంలో మాజీ మంత్రి హరీష్ రావు కీలక ప్రసంగం చేశారు. 'కొనుగోలు కేంద్రాల్లో మొలకెత్తిన ధాన్యం కొనలేని దద్దమ్మ, బీఆర్ఎస్‌ను మొలకెత్తనివ్వననడం విడ్డూరం.. రాబోయే ఎన్నికల్లో పాలమూరులో 14కు 14 సీట్లు గెలిచి కొడంగల్‌లోనే రేవంత్‌ను చిత్తుగా ఓడిస్తాం' అని ప్రకటించారు. 'రేవంత్ రెడ్డి మొనగాడు కాదు, మోసగాడు. నల్లమల పేరు చెప్పి నల్లమల గౌరవం రేవంత్ రెడ్డి తగ్గిస్తున్నాడు' అని తెలిపారు. 'రైతులకు ఇప్పటివరకు రూ.29,350 కోట్ల రైతు భరోసా డబ్బులు బాకీపడ్డాడు. ఈ ప్రభుత్వంలో బోనస్ కాస్తా బోగస్ అయింది. మొలకెత్తిన గింజలు కొనలేని రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్‌ను మొలకెత్తనియ్య అని అంటున్నాడు' అని మాజీ మంత్రి హరీశ్‌ రావు తెలిపారు.

కొడంగల్‌లో రేవంత్ రెడ్డిని ఓడిస్తాం
'కేంద్ర ప్రభుత్వం జొన్నలు, మక్కలు, సోయాబీన్, పల్లి, సన్‌ప్లవర్ కొంతమేరే కొంటుంది. కేంద్రం ఎంత కొనమంటే అంతే కొంటామని రేవంత్ రెడ్డి ప్రభుత్వం అంటుంది. ఖరీఫ్ సీజన్‌లో వడ్లు కొనుగోలు చేసే పరిస్థితి ఉండదు. ఉమ్మడి పాలమూరులో 14 సీట్లకు 14 సీట్లు గెలిచి కొడంగల్‌లో రేవంత్ రెడ్డిని ఓడిస్తాం' అని బీఆర్‌ఎస్‌ పార్టీ డిప్యూటీ ఫ్లోర్‌ లీడర్ హరీశ్ రావు ప్రకటించారు. 'దళారుల, మిల్లర్ల చేతిలో రేవంత్ రెడ్డి తోలు బొమ్మ , ఆయన ఎవరి తోలు తియ్యలే. రాష్ట్రం సాధించిన పార్టీగా ప్రజల కోసం పోరాడుతూనే ఉంటాం' అని తెలిపారు.

'తెలంగాణ కోసం రాజీనామాలో చరిత్ర సృష్టించిన నాయకుడు కేసీఆర్. బీఆర్ఎస్‌ పార్టీకి ప్రతిపక్ష హోదా రాదంటున్న రేవంత్ రెడ్డి, పాలకపక్షం అవుతుందని ఒప్పుకున్నాడు. 100 స్థానాల్లో ప్రజలు బీఆర్ఎస్‌ను గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారు' అని మాజీ మంత్రి హరీశ్‌ రావు తెలిపారు. రేవంత్ రెడ్డిని, అయన మోసాలను ఎండగడుతూనే ఉండాలని బీఆర్‌ఎస్‌ పార్టీ శ్రేణులకు సూచించారు. 'పేరుకే బీసీ, ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్‌లు.. ఏ ఒక్క వర్గానికి మేలు జరగలేదు. బీఆర్ఎస్ పార్టీ హయాంలో అన్ని వర్గాల వారికి కేసీఆర్ న్యాయం చేశారు. లంకె బిందెలు ఉన్నాయి అనుకుంటే పైసలు లేవని రేవంత్ రెడ్డి అంటున్నాడు' అని విమర్శించారు.

రూ.17 కోట్లతో ఇనుప కంచెలు
'జూబ్లీహిల్స్ ప్యాలెస్‌కు కూతవేటు దూరంలో 100 కోట్ల రూపాయలతో గెస్ట్ హౌస్ కట్టుకున్నాడు. గెస్ట్ హౌస్ చుట్టూ రూ.17 కోట్లతో ఇనుప కంచెలు వేసుకున్నాడు. రేవంత్ రెడ్డి మనవడితో ఫుట్‌బాల్ మ్యాచ్ ఆడేందుకు పైసలు ఉంటాయి. కేరళ, బీహార్, మహారాష్ట్ర , ఢిల్లీలో వందల కోట్లు ఖర్చు పెట్టి యాడ్స్ ఇచ్చేందుకు డబ్బులు ఉంటాయి. పేద వర్గాలకు పైసలు ఇచ్చేందుకు డబ్బులు లేవని అంటున్నాడు' అని డిప్యూటీ ఫ్లోర్‌ లీడర్‌ హరీశ్‌ రావు విమర్శించారు.

ఒక్క రూపాయి ఇవ్వలేదు
'తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ హయాంలో  ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇచ్చాం. ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు ఒక్క రూపాయి ఇవ్వలేదు. భూమి బద్దలైనా మల్లొచ్చేది మాత్రం కేసీఆర్ ప్రభుత్వమే' అని మాజీ మంత్రి హరీశ్‌ రావు ప్రకటించారు. స్కాంల ప్రభుత్వం వద్దు స్కీమ్‌ల ప్రభుత్వం కావాలని ప్రజలు కోరుకుంటున్నారని గుర్తుచేశారు. ఎవడు అయితే కేసులు పెట్టిండో, బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరినీ వదిలిపెట్టమని హెచ్చరించారు. రిటైర్ అయినా, ఎక్కడున్నా పట్టుకొని వచ్చి బొక్కలో వేస్తామని ప్రకటించారు.

ప్రజలు తిట్టుకునే పరిస్థితి
'కాంగ్రెస్‌ పాలన కొన్నేళ్ల వరకు ప్రజలు తిట్టుకునే పరిస్థితి. రేవంత్ రెడ్డికి మాటలు ఎక్కువ చేతలు తక్కువ. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండున్నర యేండ్లు అవుతుంది, ఒక్క ప్రాజెక్ట్ కట్టలేదు. పెండింగ్ ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులలాగా కేసీఆర్ మార్చారు' అని మాజీ మంత్రి హరీశ్‌ రావు గుర్తుచేశారు. 'కార్యకర్తలు గట్టిగా పనిచేసి అచ్చంపేట గడ్డపై గులాబీ జెండా ఎగరెయ్యాలి. అప్పుడు కొడంగల్‌కు ఇంఛార్జ్‌గా ఉండి రేవంత్ రెడ్డిని ఓడించాం. ఈసారి ఉమ్మడి పాలమూరులో 14 స్థానాలకు 14 బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది' అని బీఆర్‌ఎస్‌ పార్టీ డిప్యూటీ ఫ్లోర్‌ లీడర్‌ హరీశ్ రావు పూర్తి విశ్వాసం ప్రకటించారు.

0
0
Report

YSRCP: సాయికృష్ణ కేసులో విజయవాడ సీపీని సస్పెండ్‌ చేయాల్సిందే!: అంబటి రాంబాబు

Tadepalli, Andhra Pradesh:

Ambati Rambabu: 'సీబీఐ దర్యాప్తుతోనే నిజానిజాలు నిగ్గు తేలుతాయి. విజయవాడ సీపీ పాత్రపై అడుగడుగునా అనుమానాలు ఉన్నాయి. పోలీస్‌ కమిషనర్‌ను సస్పెండ్‌ చేస్తేనే విచారణ ముందుకు వెళ్తుంది' మాజీ మంత్రి అంబటి రాంబాబు తెలిపారు. లోపభూయిష్టంగా సీఐ నాగరాజుపై ఎఫ్‌ఐఆర్‌ నమోదుచేశారని.. సాయికృష్ణను మార్కాపురం నుంచి తెచ్చింది టాస్క్‌ఫోర్స్‌. ఎవరి టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు ఆ పని చేశారు? ఎన్‌బీడబ్ల్యూ ఉంటే కోర్టులో ఎందుకు హాజరుపర్చలేదు?' అని ప్రశ్నించారు.

విజయవాడ పోలీసుల చేతిలో చనిపోయిన గాదె సాయికృష్ణ కేసులో వాస్తవాలు బయటికి రావాలంటే పోలీసు కమిషనర్‌ రాజశేఖర్‌బాబును సస్పెండ్‌ చేయాలని వైఎస్సార్‌సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు స్పష్టం చేశారు. అసలు సాయికృష్ణను తీసుకురావాలని టాస్క్‌ ఫోర్స్‌ పోలీసులను మార్కాపురం పంపింది ఎవరో తేల్చాలని కోరారు. ఈ కేసులో నాగరాజుతో పాటు చాలా మంది పెద్దల పాత్ర ఉందని ఆరోపించారు.

చాలా దురదృష్టకరం
తాడేపల్లిలోని వైఎసార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం నిర్వహించిన మాజీ మంత్రి అంబటి రాంబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. 'విజయవాడలో గాదె సాయికృష్ణ లాకప్‌ డెత్, పోలీసుల వేధింపులతో ఆత్మహత్య చేసుకున్న క్రాంతికుమార్‌ ఘటనలు కలకలం రేపుతున్నాయి. రక్షించాల్సిన పోలీసు స్టేషన్‌లోనే నేరస్తులుగా ముద్ర వేసి భక్షించే కార్యక్రమం చేయడం చాలా దురదృష్టకరం' అని తెలిపారు. కొట్టారు, చంపేశారు. ఇక్కడ ఉద్దేశం ఏంటనేది దర్యాప్తులో తేలాలి. సాక్ష్యాధారాలు లేకుండా డెడ్‌ బాడీని బూడిద చేశారనే ఆరోపణలు ఉన్నాయి' అని వివరించారు. ఇలా దేశ చరిత్రలోనే ఎక్కడా జరిగి ఉండదనేది తన అభిప్రాయం అని అంబటి రాంబాబు తెలిపారు. 

'ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో చట్టబద్దమైన పాలన జరుగుతుందా? లేక భీతావహ పాలన జరుగుతుందా? అనే అనుమానం కలుగుతోంది. విజయవాడలో నడిబొడ్డున ఇంత దారుణమైన ఘటన జరిగితే 45 రోజుల వరకూ ఎవరూ మాట్లాడింది లేదు. సాయికృష్ణను మార్కాపురం నుంచి తీసుకొచ్చాక మే 23వ తేదీన చనిపోతే, 24న దహనం చేశారనే సమాచారం ఉంది. ఇందులో వాస్తవం ఏమిటన్నది చెప్పాల్సింది పోలీసులే! కానీ, కానిస్టేబుల్‌ నుంచి డీజీపీ వరకూ అందరూ నోటికి ప్లాస్టర్‌ వేసుకున్నారు' అని మాజీ మంత్రి అంబటి రాంబాబు తెలిపారు.

ఒక్క అడుగు కూడా ముందుకు వేయదు
'కృష్ణలంక సీఐ నాగరాజుపై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ చూస్తే ఆయనకు సహాయం చేసేందుకే లోపభూయిష్టంగా తయారు చేసినట్లు కనిపిస్తోంది. సాయికృష్ణను మార్కాపురం వెళ్లి తీసుకొచ్చింది టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు. అక్కడ నాగరాజు పాత్ర లేదు. టాస్క్‌ఫోర్స్‌ నేరుగా కమిషనర్‌ ఆధ్వర్యంలో ఉంటుంది. కమిషనర్‌ ఆదేశాలు లేకుండా టాస్క్‌ఫోర్స్‌ ఒక్క అడుగు కూడా ముందుకు వేయదు. కమిషనర్‌ ఆదేశాలు లేకుండా, సాయికృష్ణను టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు తీసుకొస్తే వాళ్లు క్రమశిక్షణా రాహిత్యానికి పాల్పడినట్లే' అని వైఎస్సార్‌సీపీ నాయకులు అంబటి రాంబాబు ఆరోపించారు.

కుటుంబానికి సమాచారం ఇచ్చారా?
'కమిషనర్‌ ప్రమేయంతోనే సాయికృష్ణను తీసుకొచ్చారు. కొత్తగా ఏదైనా నేరారోపణ అతడిపై ఉందా లేక నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ ఉందా? అతనిపై కేవలం 2 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. కాబట్టి నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ ఇచ్చారంటున్నారు. అప్పుడు సాయికృష్ణను తీసుకొచ్చిన 24 గంటల్లో కోర్టులో హాజరుపర్చాలి. అసలు అరెస్టు మెమో ఏమైనా ఉందా? కుటుంబానికి సమాచారం ఇచ్చారా? వైద్య పరీక్షలు చేయించారా? కోర్టు ముందు హాజరు పర్చారా?. అంటే  ఏమీ లేదు' అని మాజీ మంత్రి అంబటి రాంబాబు స్పష్టం చేశారు.

ఒక్కడే కాదు, అనేక మంది
సాయికృష్ణ ఘటనకు బాధ్యత వహించాల్సింది విజయవాడ పోలీసు కమిషనరే అని మాజీ మంత్రి అంబటి రాంబాబు ప్రకటించారు. నాగరాజుపై ఆరోపణలు ఆ తర్వాత. నాగరాజు ఒక్కడే కాదు, అనేక మంది ఈ కేసులో జోక్యం చేసుకున్నారు. ఈ వ్యవహారంలో నాగరాజును తప్పించే ప్రయత్నం జరుగుతోంది. నాగరాజుపై కానీ, కమిషనర్‌ పైనా మాకు ఎలాంటి కోపం లేదు. ఓ వ్యక్తిని చంపి మొత్తం వ్యవస్థను నాశనం చేస్తున్నారు. ఇందులో వాస్తవాలు నిగ్గు తేలకపోతే వ్యవస్థలు ప్రమాదంలో పడతాయి.

అసలు సాయికృష్ణ బతికే ఉన్నాడా? లేక చనిపోయాడా? అనేది ఇప్పటివరకూ పోలీసులు ఎందుకు బయటపెట్టరు అని మాజీ మంత్రి అంబటి రాంబాబు ప్రశ్నించారు. పోలీసులు ఇప్పటివరకూ నోరు విప్పకపోవడం వెనుక చాలా పెద్ద కుట్ర ఉందని ఆరోపించారు. ఈ నేరం పోలీసులు చేశారా? టాస్క్‌ఫోర్స్‌ చేస్తే తిరిగి అదే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారంటే దొంగ చేతికి తాళం ఇస్తున్నట్లేనని తెలిపారు. కేసు దర్యాప్తులో ఇన్ని లొసుగులు ఉడడంతోనే సీబీఐకి అప్పగించాలని డిమాండ్‌ చేశారు.

పవన్ కల్యాణ్‌పై ఆగ్రహం
సాయికృష్ణ కేసు వ్యవహారంపై జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ వ్యవహార శైలిపై మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్‌ కల్యాణ్‌ ఎందుకు ఈ కేసుల మీద ద్వంద వైఖరి ప్రదర్శిస్తున్నారు? అని ప్రశ్నించారు. 'చంద్రబాబు సాయికృష్ణ కుటుంబాన్ని పిలిపించుకుని న్యాయం చేస్తామని హామీ ఇస్తారు. పవన్‌ కల్యాణ్‌ మాత్రం, సాయికృష్ణ క్రిమినల్‌ అని, అతడు చనిపోతే స్పందించాలా? అని అంటున్నారు. అంటే చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ మధ్య కమ్యూనికేషన్‌ గ్యాప్‌ ఏర్పడిందా? లేక ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు ఉన్నాయా? అని అంబటి రాంబాబు సందేహాలు వ్యక్తం చేశారు. ఏదేమైనా పవన్‌ కల్యాణ్‌ వైఖరి చాలా దురదృష్టకరమని వైఎస్సార్‌సీపీ సీనియర్‌ నాయకులు అంబటి రాంబాబు తెలిపారు.

0
0
Report

FIFA World Cup 2026: ఉరుగ్వేను వణికించిన చిన్నదేశం కేప్ వెర్డే.. కెవిన్ పినా హిస్టారికల్ గోల్..!!

BBhoomi16h ago
Secunderabad, Telangana:

FIFA World Cup 2026: ఆదివారం మయామిలో జరిగిన గ్రూప్ H మ్యాచ్‌లో మాజీ ఛాంపియన్ ఉరుగ్వేతో 2-2 డ్రా చేసుకోవడం ద్వారా కేప్ వెర్డే, ఫీఫా ప్రపంచ కప్ 2026లో తమ రెండవ పాయింట్‌ను సంపాదించింది. ఫీఫా ప్రపంచ కప్ 2026లో ఏదైనా జట్టు  రాణించిందంటే, అది నిస్సందేహంగా గ్రూప్ Hలో కేప్ వెర్డేనే అని చెప్పాలి. కేవలం 500,000 కంటే కొంచెం ఎక్కువ జనాభా ఉన్న ఈ దేశం, ఆదివారం మయామిలోని హార్డ్ రాక్ స్టేడియంలో మాజీ ఛాంపియన్‌లను 2-2 డ్రాతో నిలువరించి, టోర్నమెంట్‌లో తమ వరుసగా రెండవ పాయింట్‌ను సంపాదించింది. 

ఈ అద్భుత ప్రదర్శనలో కెవిన్ పినా కీలక పాత్ర పోషించాడు. అతను 21వ నిమిషంలో జట్టు తరఫున మొదటి గోల్ చేసి.. ఈ చిన్న దేశానికి ఆధిక్యాన్ని అందించాడు. పినా ఫ్రీ కిక్ ద్వారా కేప్ వెర్డే  మొదటి ప్రపంచ కప్ గోల్‌ను సాధించగా, 61వ నిమిషంలో హెలియో వరేలా స్కోరును సమం చేశాడు.  ప్రపంచ టోర్నమెంట్‌లకు అర్హత సాధించడానికి కష్టపడే ఇతర చిన్న జాతీయ జట్ల కోసమే ఇది అని కేప్ వెర్డే కోచ్ పెడ్రో లీటావ్ బ్రిటో చెప్పారు. తమ చారిత్రాత్మక పరుగును కొనసాగించి నాకౌట్ దశకు చేరుకోగలమని తమ జట్టు మొత్తం విశ్వాసంతో ఉందని ఆయన తెలిపారు.

రెండు పాయింట్లతో ఉరుగ్వేతో కలిసి గ్రూప్ హెచ్‌ను పంచుకుంటున్న కేప్ వెర్డే, తన చివరి గ్రూప్ మ్యాచ్‌లో సౌదీ అరేబియాతో తలపడనుంది. కేప్ వెర్డే కోచ్ మాట్లాడుతూ.. ఒక దేశం చిన్నదిగా ఉండవచ్చని, ఆర్థికంగా ఇబ్బందులు పడవచ్చని చూపించడానికి కూడా మేము ఇక్కడ ఉన్నాము. కానీ వారు దృఢ సంకల్పంతో ఉంటే, ఆ కష్టాలను తట్టుకోగలిగితే, వారు ఇతర పెద్ద జట్లు మరియు రెండవ శ్రేణి ఆటగాళ్లతో భుజం భుజం కలిపి నిలబడగలరు అని అన్నారు. 

ఎవరీ కెవిన్ పినా?

కెవిన్ పినా కేప్ వెర్డేకు చెందిన 29 ఏళ్ల మిడ్‌ఫీల్డర్. అతను రష్యన్ జట్టు క్రాస్నోడార్ తరపున ఆడతాడు. 023 ఆఫ్రికా కప్ ఆఫ్ నేషన్స్ మ్యాచ్‌లో మొజాంబిక్‌పై ఇదే విధమైన దూరం నుండి గోల్ చేసి, ఇలాంటి ఫలితాన్నే సాధించాడు. పినా కేప్ వెర్డే రాజధాని అయిన ప్రైయాలో జన్మించాడు. చాడెనీస్‌తో తన ఫుట్‌బాల్ కెరీర్‌ను ప్రారంభించాడు. అతని వృత్తిపరమైన కెరీర్ పోర్చుగల్‌లోని ఒలివిరెన్సేతో ప్రారంభమైంది. అక్కడ అతను అనాడియా,  సెర్టానెన్సేలకు లోన్‌లో ఆడి, ఆ తర్వాత అదే దేశంలోని మరో జట్టు అయిన చావెస్‌కు తిరిగి వచ్చాడు. అతను 2024-25 సీజన్ కోసం రష్యన్ ప్రీమియర్ లీగ్ జట్టు క్రాస్నోడార్‌లో చేరడానికి ముందు, 2022 వరకు చావెస్‌ జట్టులో భాగంగా ఉన్నాడు.

ఈ స్టార్ మిడ్‌ఫీల్డర్ 2022లో కేప్ వెర్డే తరఫున అరంగేట్రం చేసి, లీచ్‌టెన్‌స్టీన్‌ను 6-0 తేడాతో ఓడించడంలో జట్టుకు సహాయపడ్డాడు. ఆదివారం తన దేశం కోసం తన మూడవ అత్యంత చిరస్మరణీయమైన గోల్‌ను సాధించాడు.

కేప్ వెర్డే అనేది ఆఫ్రికా పశ్చిమ తీరంలో ఉన్న ఒక ద్వీపాల సమూహం. దీని మొత్తం వైశాల్యం సుమారు 4,000 చదరపు కిలోమీటర్లు.  జనాభా సుమారు 500,000. జనాభా ప్రకారం ప్రపంచ కప్‌కు అర్హత సాధించిన దేశాలలో ఇది మూడవ అతి చిన్న దేశం.  మొదటి అర్ధభాగం చివరిలో మాక్సీ అరౌజో,  అగస్టిన్ కనోబ్బియో ఉరుగ్వేకు ఆధిక్యాన్ని అందించారు. కానీ రెండవ అర్ధభాగంలో మైదానంలోకి వచ్చిన కొద్ది నిమిషాలకే, మథియాస్ ఒలివీరా ఇచ్చిన ఒక పేలవమైన పాస్‌ను వరేలా సద్వినియోగం చేసుకుని, గోల్ లైన్ నుండి చాలా ముందుకు వచ్చిన ముస్లెరాకు బంతిని అందించగా, అతను స్కోరును సమం చేశాడు.

Also Read: ఈ ఒక్క డిమాండ్‌ను నెరవేరిస్తే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల బేసిక్

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report
Advertisement

Walk After Meals: భోజనం చేసిన తర్వాత నడిస్తే ఏం జరుగుతుంది? తిన్నాక ఎంతసేపు నడిస్తే క్షేమం?

Hyderabad, Telangana:

Walk After Meals Benefits: భోజనం చేసిన తర్వాత కాసేపు నడవడం మంచిదా? కాదా? ఎంతసేపు నడవాలి? అనే సందేహాలు చాలా మందిలో ఉంటాయి. కొంతమంది తిన్న వెంటనే చకచకా నడిచేస్తుంటారు, మరికొందరు హాయిగా పడుకుంటారు. అయితే, నిపుణుల అభిప్రాయం ప్రకారం.. భోజనం చేసిన తర్వాత చేసే తేలికపాటి నడక ఆరోగ్యానికి ఒక సంజీవనిలా పనిచేస్తుంది.కానీ ఇందులో కొన్ని నియమాలు ఉన్నాయి. అవేంటో ఒకసారి చూద్దాం.

ఎంతసేపు నడవాలి?
మనం భోజనం చేసిన 30 నిమిషాల లోపు నడక ప్రారంభించడం అత్యంత ఉత్తమం. కేవలం 10 నుండి 15 నిమిషాల పాటు తేలికగా నడిస్తే సరిపోతుంది. భోజనం చేసిన 30 నుండి 60 నిమిషాల వ్యవధిలో రక్తంలో గ్లూకోజ్ (చక్కెర) స్థాయిలు గరిష్టంగా పెరుగుతాయి. ఈ సమయంలో మనం నడిస్తే, మన కండరాలు ఆ గ్లూకోజ్‌ను శక్తిగా మార్చేసుకుంటాయి. ఫలితంగా రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి, శరీరంలో అదనపు కొవ్వు పేరుకుపోదు.

మధ్యాహ్నం, రాత్రి భోజనం తర్వాత ఇలా రోజుకు మూడు సార్లు 10 నిమిషాల చొప్పున చిన్న చిన్న నడకలు నడవడం వల్ల గుండె ఆరోగ్యం అద్భుతంగా మెరుగుపడుతుందని అమెరికన్ హార్ట్ అసోసియేషన్ (AHA) కూడా ధృవీకరించింది.

పొరపాటున కూడా ఇవి చేయకండి!
భోజనం తర్వాత నడవడం మంచిదే కదా అని కొందరు అతిగా చేస్తుంటారు. నిపుణులు దీనిపై కొన్ని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. భోజనం చేసిన వెంటనే వేగంగా నడవడం, జాగింగ్ చేయడం, బరువైన వస్తువులు ఎత్తడం లేదా కఠినమైన వ్యాయామాలు అస్సలు చేయకూడదు. భారీగా భోజనం చేసిన వెంటనే వేగంగా నడిస్తే జీర్ణక్రియ దెబ్బతింటుందని వైద్యులు చెబుతున్నారు. దీనివల్ల యాసిడ్ రిఫ్లక్స్ (గుండెల్లో మంట/పుల్లటి తేన్పులు), అజీర్ణం, గ్యాస్ సమస్యలు, కడుపులో అసౌకర్యం, నొప్పి వంటి సమస్యలు తలెత్తుతాయి.

నడిస్తే కలిగే దీర్ఘకాలిక లాభాలు..
నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ అధ్యయనాల ప్రకారం.. ఈ అలవాటు వల్ల లభించే ముఖ్య ప్రయోజనాలు చాలా ఉన్నాయి. రోజూ నడక అలవాటు చేసుకోవడం వల్ల రక్తంలో షుగర్ స్థాయిని తగ్గించి టైప్-2 డయాబెటిస్ ముప్పును తగ్గిస్తుంది. అలాగే శరీరంలో మెటబాలిజం (జీవక్రియ) వేగవంతం చేసి, కేలరీలు కరగడానికి దోహదపడుతుంది. వీటితో పాటు గుండె భద్రత రక్తపోటు (BP), చెడు కొలెస్ట్రాల్ (LDL) తగ్గించి గుండెపోటు.. పక్షవాతం రాకుండా కాపాడుతుంది.

కాబట్టి, తిన్న వెంటనే సోఫాకు అతుక్కుపోకుండా లేదా బెడ్‌పై వాలిపోకుండా.. మీ ఇల్లు లేదా ఆఫీస్ పరిసరాల్లోనే కనీసం 10 నిమిషాల పాటు ప్రశాంతంగా వజ్రాసనంలో ఉన్నంత తేలికగా నడవండి. ఆరోగ్యాన్ని కాపాడుకోండి!

Also Read: రోజూ యోగా చేయడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే!

Also Read: ఏసీ లేదా ఫ్యాన్ వేసుకొని యోగా చేస్తున్నారా? ఈ నిజం

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report

Harish Rao: మళ్లీ కేసీఆర్ వస్తేనే మా రాత మారుతుంది.. హరీశ్‌ రావుతో రైతులు

Kadthal, Telangana:

Telangana Uria Shortage: కాంగ్రెస్ పాలనలో రైతులు పరేషాన్ అవుతున్నారని.. మళ్లీ కేసీఆర్‌ వస్తేనే తమ రాత మారుతుందని భావిస్తున్నట్లు బీఆర్ఎస్ పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, మాజీ మంత్రి హరీశ్‌ రావు తెలిపారు. కాంగ్రెస్‌కు ఓటేసి మోసపోయినట్లు రైతులు చెబుతున్నారని గుర్తుచేశారు. ఆన్‌లైన్‌లో బుకింగ్ పేరుతో యూరియా దొరకక బ్లాక్‌లో కొంటున్నారు.. కరెంటు ఎప్పుడు వస్తుందో తెలియక రేవంత్ పాలనలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వివరించారు.

అచ్చంపేట పర్యటనకు వెళ్తుండగా మాజీ మంత్రి హరీశ్‌ రావు మార్గమధ్యలో రంగారెడ్డి జిల్లా కడ్తాల్ వద్ద ఫెర్టిలైజర్ షాప్ దగ్గర ఆగి రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అక్కడకు వచ్చిన హారీశ్ రావును చూసి రైతులు ఆశ్చర్యం వ్యక్తం చేసి.. అనంతరం తమ గోడు వెళ్లబోసుకున్నారు. 'ఆన్‌లైన్ బుకింగ్ పేరుతో యూరియా దొరకక బ్లాక్‌లో కొంటున్నాం. కరెంటు ఎప్పుడు వస్తుందో తెలియక రేవంత్ పాలనలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. కొనుగోళ్లలో తరుగు, ఆగిపోయిన పాల బిల్లులతో అరిగోస పడుతున్నాం' అని వివరించారు. కాంగ్రెస్‌కు ఓటేసి మోసపోయామని.. మళ్లీ కేసీఆర్ వస్తేనే తమ రాత మారుతుందని మాజీ మంత్రి హరీశ్‌ రావు తెలిపారు. ఈ సందర్భంగా ఎల్లయ్య అనే రైతుతో మాట్లాడగా.. అతడు ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో తమ కష్టాలు వెళ్లబోసుకున్నాడు.

హరీశ్‌ రావు: యూరియా దొరికిందా>
రైతు ఎల్లయ్య: అసలు యూరియా దొరకడం లేdi. స్మార్ట్‌ఫోన్లలో ఆన్‌లైన్ బుకింగ్ చేస్తేనే యూరియా ఇస్తామంటున్నారు. మా దగ్గర చిన్న ఫోన్లు (కీప్యాడ్ ఫోన్లు) ఉంటే ఎలా ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకోవాలి. తీరా షాపు దగ్గరికి వెళ్లేసరికి స్టాక్ అయిపోయిందని చెబుతున్నారు. చేసేదేం లేక బ్లాక్‌లో యూరియా బస్తాలు తెచ్చుకోవాల్సి వస్తోంది. యూరియా కావాలంటే ఏమాత్రం అవసరం లేని ఇతర మందుల ప్యాకెట్లను కొనాలని షాపుల వాళ్లు బలవంతపెడుతున్నారు.

హరీశ్‌ రావు: కరెంటు పరిస్థితి ఎలా ఉంది?
రైతు ఎల్లయ్య: కరెంటు ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు పోతుందో అసలు అర్థమే కావడం లేదు. యాసంగిలో వడ్లు, మక్కలు అమ్మినప్పుడు కొనుగోలు కేంద్రాల్లో విపరీతంగా తరుగు తీశారు. పాల బిల్లుల విషయంలోనూ ప్రభుత్వం రైతులను ఆగం చేస్తోంది.
రైతు ఎల్లయ్య: గతంలో (కేసీఆర్‌ ప్రభుత్వం) నెలకు రెండుసార్లు క్రమం తప్పకుండా వచ్చే పాల బిల్లులు వచ్చేవి. ఇప్పుడు సక్రమంగా రావడం లేదు. ఒక బిల్లు వేసి మూడు బిల్లులు ఆపుతున్నారు. లీటర్‌కు ఇచ్చే ధర కూడా తగ్గించారు.

హరీశ్‌ రావు: కాంగ్రెస్ ప్రభుత్వం యూరియా సరిగ్గా ఇవ్వకపోగా, రైతుబంధు, బోనస్ లాంటివి కూడా ఎగ్గొట్టింdr.
రైతులు: రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇకపై మక్కలు, జొన్నలు కొనమని చెబుతోంది. మరి మేం ఏం పంటలు వేసుకోవాలి, ఎలా బతకాలి?
రైతులు: ఏదేమైనా మళ్లీ కేసీఆర్ వస్తేనే రైతుల రాత మారుతుందని, ఆయన ఉన్నప్పుడే తాము సంతోషంగా ఉన్నాం. ప్రస్తుత పరిస్థితి చూసి కాంగ్రెస్‌కు ఓటేసినందుకు రైతులు, జనాలు ఇప్పుడు తీవ్రంగా బాధపడుతున్నారు

0
0
Report

Allu Arjun Stampede Case: నాంపల్లి కోర్టుకు హాజరైన అల్లు అర్జున్..జూలై 6కు విచారణ వాయిదా?

Hyderabad, Telangana:Allu Arjun Stampede Case News: 2024 డిసెంబరు 4న 'పుష్ప 2' సినిమా ప్రీమియర్ షో సమయంలో జరిగిన తొక్కిసలాట కేసులో తాజాగా హీరో అల్లు అర్జున్‌కు కోర్టు నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈరోజు (జూన్ 22) కోర్టుకు హాజరవుతారా లేదా అన్నది సినీ, రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ రేపుతోంది. హైదరాబాద్‌లోని నాంపల్లి క్రిమినల్ కోర్టు ఈ కేసులో అల్లు అర్జున్‌తో పాటు ఇతరులకు వ్యక్తిగతంగా హాజరుకావాలని సమన్లు జారీ చేసింది. వర్చువల్ (ఆన్‌లైన్) హాజరుకు కోర్టు నిరాకరించడంతో ఆయన నేరుగా వస్తారా, లేక క్వాష్ పిటిషన్ దాఖలు చేస్తారా అనేది ఆసక్తికరంగా మారింది.
0
0
Report
Advertisement

UK Prime Minster: యూకే రాజకీయాల్లో పెను సంచలనం.. బ్రిటన్ ప్రధానమంత్రి కీర్ స్టార్మర్ ఆకస్మిక రాజీనామా!

England:

UK Prime Minister Resign News: బ్రిటన్ రాజకీయాలు మరోసారి తీవ్ర ఊగిసలాటలో పడ్డాయి. అధికార లేబర్ పార్టీలో అంతర్గత తిరుగుబాటు, సొంత పార్టీ నుంచే ఒత్తిడి తీవ్రం కావడంతో యూకే (UK) ప్రధానమంత్రి కీర్ స్టార్మర్ సోమవారం తన రాజీనామాను ప్రకటించారు. రాబోయే ఎన్నికల్లో పార్టీని విజయపథంలో నడిపించే సత్తా తనకు ఉందా? లేదా? అనే ప్రశ్నలకు సమాధానం దొరికిందని పేర్కొంటూ ఆయన పదవి నుంచి తప్పుకున్నారు.

ఈ రాజీనామాతో, గత పదేళ్ల కాలంలో పూర్తి పదవీకాలం ముగియకుండానే మధ్యలోనే తప్పుకున్న ఆరో బ్రిటీష్ ప్రధానమంత్రిగా కీర్ స్టార్మర్ నిలిచారు. కొత్త నాయకుడిని ఎన్నుకునే వరకు తాను ఆపద్ధర్మ ప్రధానిగా కొనసాగుతానని 10 డౌనింగ్ స్ట్రీట్ వెలుపల ఇచ్చిన ప్రకటనలో ఆయన స్పష్టం చేశారు. జూలై 2024 సార్వత్రిక ఎన్నికల్లో లేబర్ పార్టీని చారిత్రాత్మక విజయ తీరాలకు చేర్చిన రెండేళ్ల లోపే స్టార్మర్ ఇలా నిష్క్రమించడం గమనార్హం.

భావోద్వేగ ప్రసంగం..
జాతిని ఉద్దేశించి మాట్లాడిన స్టార్మర్.. ఆరేళ్ల క్రితం తాను లేబర్ పార్టీ పగ్గాలు చేపట్టినప్పుడు పార్టీ మనుగడే ప్రశ్నార్థకంగా మారిందని గుర్తు చేసుకున్నారు. "కఠోర శ్రమతో మేము పార్టీని మార్చాము. ప్రత్యేక హక్కులున్న కొందరి కోసం కాకుండా.. అందరికీ సమాన అవకాశాలు, ఆర్థిక వృద్ధి, పెరిగిన వేతనాలు, కార్మికుల హక్కుల మెరుగుదల కోసం శ్రమించాం. మా ప్రభుత్వం అర మిలియన్ మందిని పేదరికం నుండి బయటకు తీసుకువచ్చింది" అని తన పాలనా రికార్డును ఆయన సమర్థించుకున్నారు. అయినప్పటికీ పార్టీ భవిష్యత్తు కోసం తాను తప్పుకోవడమే సరైన నిర్ణయమని భావించి "నేను రాజీనామా చేస్తున్నాను" అని ప్రకటించారు.

గత కొన్ని నెలలుగా స్టార్మర్ ప్రజాదరణ గణనీయంగా తగ్గుతూ వచ్చింది. ముఖ్యంగా గ్రేటర్ మాంచెస్టర్ మాజీ మేయర్ ఆండీ బర్న్‌హామ్ తిరిగి పార్లమెంట్‌కు ఎన్నికవడంతో స్టార్మర్‌పై ఒత్తిడి పతాక స్థాయికి చేరింది. స్టార్మర్ నాయకత్వాన్ని సవాలు చేయడమే లక్ష్యంగా బర్న్‌హామ్ ప్రచారం నిర్వహించారు. ఆయన సాధించిన విజయం లేబర్ పార్టీకి కొత్త ఊపిరి పోస్తుందని చాలా మంది ఎంపీలు నమ్మడమే స్టార్మర్ పతనానికి నాంది పలికింది.

మరోవైపు, వాగ్దానం చేసిన ఆర్థిక వృద్ధిని సాధించడంలో, ప్రభుత్వ సేవలను మెరుగుపరచడంలో, జీవన వ్యయ సంక్షోభాన్ని అదుపు చేయడంలో స్టార్మర్ ప్రభుత్వం విఫలమైందనే విమర్శలు ఉన్నాయి. వీటికి తోడు గ్రీన్ పార్టీ, రిఫార్మ్ యూకే పార్టీల నుంచి వస్తున్న రాజకీయ పోటీ స్టార్మర్ పరిస్థితిని మరింత క్లిష్టతరం చేసింది.

తదుపరి ప్రధాని రేసులో ఎవరు?
స్టార్మర్ రాజీనామాతో బ్రిటన్ తదుపరి ప్రధాని ఎవరనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ప్రస్తుతం అందరి దృష్టి ఆండీ బర్న్‌హామ్‌పైనే ఉంది. అయితే, రేసులో తానున్నానని మాజీ ఆరోగ్య శాఖ కార్యదర్శి వెస్ స్ట్రీటింగ్ కూడా సంకేతాలు ఇచ్చారు. బర్న్‌హామ్‌తో అంతర్గత ఒప్పందం కుదుర్చుకుని స్ట్రీటింగ్ భవిష్యత్ ప్రభుత్వంలో కీలక పదవి తీసుకునే అవకాశం కూడా ఉందని లేబర్ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.

Also Read: Strait Of Hormuz: పశ్చిమాసియాలో మరోసారి ఉద్రిక్తత..హోర్మూజ్ జలసంధిని మూసివేసిన ఇరాన్!

Also Read; 2,50,000 అమ్మాయిలపై అత్యాచారం చేసిన పాకిస్థానీ టీమ్..పనికట్టుకొని మరీ బాలికలకు ఎర!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report

NEET Re-Exam Paper: విద్యార్థులకు చుక్కలు చూపిన నీట్ రీ-ఎగ్జామ్..కటాఫ్ భారీగా తగ్గే ఛాన్స్ ఉందా?

Hyderabad, Telangana:

NEET Re-Exam Paper 2026: దేశవ్యాప్తంగా సర్వత్రాత్మక ఆసక్తి రేపిన నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామినేషన్ ఆదివారం అనగా జూన్ 21 నాడు అత్యంత కఠిన భద్రత ఏర్పాట్లు నడుమ ప్రశాంతంగా ముగిసింది. మే నెలలో జరిగిన తొలి పరీక్షతో పోలిస్తే, ఈ రీ-ఎగ్జామ్ ప్రశ్నాపత్రం విద్యార్థులకు చుక్కలు చూపించిందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులో కఠినంగా రావడంతో ఈసారి నీటి కట్-ఆఫ్ మార్కులు భారీగా తగ్గే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. 

కట్టుదిట్టమైన భద్రత 37 రోజుల్లో రీ-ఎగ్జామ్.. 
దేశంలోని 551 నగరాలతో పాటు విదేశాల్లోని 14 కేంద్రాల్లో కలిపి మొత్తం 5,440 పరీక్ష కేంద్రాల్లో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) ఈ పరీక్ష నిర్వహించింది. దాదాపు 20 లక్షల మందికి పైగా అభ్యర్థులు హాజరైన ఈ పరీక్ష కోసం అధికారులు మునుపేన్నడు లేని విధంగా 1.38 లక్షల సీసీటీవీ కెమెరాల ద్వారా 95 వేల పరీక్ష గదులను నిశితంగా ప్రవేశించారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఢిల్లీలోని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ప్రధాన కార్యాలయం నుంచి స్వయంగా పరీక్షలను సమీక్షించారు. అన్ని ప్రభుత్వ విభాగాల సహకారంతో కేవలం 37 రోజుల్లోనే రెండోసారి పరీక్షను విజయవంతంగా పూర్తి చేసామని ఎన్‌టీఏ డైరెక్టర్ జనరల్ అభిషేక్ సింగ్ తెలిపారు. 

ఫిజిక్స్, కెమిస్ట్రీ టఫ్..
మే 3న జరిగిన మొదటి పరీక్షతో పోలిస్తే ఈసారి రీ-ఎగ్జామ్ ప్రశ్నాపత్రం చాలా కఠినంగా ఉందని విద్యార్థులు, నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 

భౌతిక శాస్త్రం (ఫిజిక్స్) సబ్జెక్టు అత్యంత కఠినంగా రావడమే కాకుండా, ప్రశ్నలు సాధించడానికి ఎక్కువ సమయం తీసుకునేలా ఉన్నాయని విద్యార్థులు చెబుతున్నారు. ఒక నాలుగు-ఐదు ప్రశ్నలు విద్యార్థులకు తీవ్ర గందరగోళాన్ని గురిచేసేలా వచ్చాయని అంటున్నారు. 

కెమిస్ట్రీ సబ్జెక్ట్‌లో న్యూమరికల్స్ మెమొరీ బేస్డ్ ప్రశ్నలు ఎక్కువగా అడిగారట. ఇవి కూడా లెక్కల కట్టడానికి ఎక్కువ సమయం పట్టేలా ఉండటంతో స్కోరింగ్ తగ్గే అవకాశం ఉంది. 

బయాలజీ.. బోటనీ, జువాలజీ ప్రశ్నలు పూర్తిగా ఎన్సీఈఆర్టీ పుస్తకాల నుంచి రావడంతో విద్యార్థులకు పెద్ద ఊరటం ఇచ్చింది. ఇందులో మంచి స్కూలు సాధించవచ్చు అని నిపుణులు చెబుతున్నారు. 

భారీగా తగ్గనున్న కటాఫ్ మార్కులు 
ప్రశ్నాపత్రం కఠినంగా ఉన్న నేపథ్యంలో ఈసారి టాప్ స్కోర్ 700 నుంచి 710 మార్కుల మధ్య నమోదయ్యే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. అది ఓపెన్ క్యాటగిరి కట్ ఆఫ్ మార్కులు 487 ఉండగా.. ఈసారి కటాఫ్ మార్కులు భారీగా తగ్గే ఛాన్స్ ఉందంటున్నారు. పేపర్ కఠినత్వాన్ని బట్టి చూస్తే యావరేజ్ మార్కులు సాధించిన విద్యార్థులకు సైతం మెడికల్ సీటు దక్కే అవకాశాలు మెరుగ్గా ఉన్నాయని విశ్లేషిస్తున్నారు.

Also Read: రీ-నీట్ పరీక్షలోనూ ఆగని అక్రమాలు.. బిహార్‌ నకిలీ గ్యాంగ్ గుట్టురట్టు, 24మంది అరెస్ట్

Also REad: నటుడు ప్రకాష్ రాజ్‌పై నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ..అరెస్టు చేయాలంటూ కోర్టు ఆదేశం!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report
Advertisement

Kanaka Durga Temple: విజయవాడ కనకదుర్గమ్మ గుడిలో అపచారం..రూ.500 దర్శనం టికెట్ల గోల్‌మాల్!

Vijayawada, Andhra Pradesh:

Kanaka Durga Temple Ticket Fraud: విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో టికెట్లు బూటకపు వ్యవహారం కలకలం రేపుతుంది. భక్తుల నమ్మకాన్ని ఆసరాగా చేసుకుని, అమ్మవారి ఆదాయానికి గండి కొడుతున్న కొంతమంది ఆలయ సిబ్బంది బాగోతం వారం వ్యవధిలోని రెండుసార్లు వెలుగు చూడటం తీవ్ర సంచలనంగా మారింది. ఆలయ ఈవో కార్యనిర్వాహణ అధికారి ఇచ్చిన ఫిర్యాదులతో వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఇప్పటివరకు రెండు వేరువేరు ఎఫ్ఐఆర్లు నమోదు అయ్యాయి. 

నకిలీ 500 రూపాయల దందా.. 
కొద్దిరోజులు కలిస్తే ఆలయంలో నకిలీ 500 రూపాయల దర్శన టికెట్లు వ్యవహారం తీవ్ర దుమారం లేపింది. భక్తుల నకిలీ టికెట్లు వంటగట్టి సొమ్ము చేసుకుంటున్నట్లు వచ్చిన ఆధారాలతో ఈవో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ స్కామ్ లో ప్రేమే ఉన్నట్లు తేలడంతో, హోంగార్డు చంద్రశేఖర్ను నగర పోలీస్ కమిషనర్ (సీపీ) రాజశేఖర్ బాబు తక్షణమే సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. 

ఇద్దరు ఉద్యోగులపై వేటు.. 
ఈ నకిలీ టికెట్ల వ్యవహారం మరువకముందే, నిన్న ఆలయంలో మరొక టికెట్లు అక్రమం విక్రయం ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఈ తాజా ఘటనకు తీవ్రంగా పరిగణించిన ఆలయ ఈవో.. విచారణ జరిపి అక్రమాలను పాల్పడినట్లు తేలిన ఇద్దరు ఉద్యోగులను విధుల్లో నుంచి తొలగిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. 

పవిత్ర పుణ్యక్షేత్రంలో, భక్తులు భక్తిశ్రద్ధలతో సమర్పించే కానుకలు, టికెట్ల ఆదాయాన్ని పక్కదారి పట్టిస్తున్న అంతర్గత ముఠాలపై ఆలయ అధికారులు, పోలీస్ నిగా తీవ్రం చేశారు. ఈ లీలలు వెనుక ఇంకా ఎవరి హస్తము ఉందనే కోణంలో వన్ టౌన్ పోలీసులు విచారణ ముమ్మరం చేశారు.

Also Read: ఆంధ్రప్రదేశ్‌కు కూతవేటు దూరంలో మరో బంగారం నిధి..దక్షిణ భారతదేశంలో రెండో బంగారు గని!

Also Read: తిరుమల వెళ్లే భక్తులకు శుభవార్త..రూ.120లకే దర్శనం టికెట్..రేపు ఒక్క రోజు మాత్రమే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report

NEET Re-Exam 2026: రీ-నీట్ పరీక్షలోనూ ఆగని అక్రమాలు.. బిహార్‌లో నకిలీ గ్యాంగ్ గుట్టురట్టు, 24 మంది అరెస్ట్!

Chintamanpur, Bihar:

NEET Re-Exam 2026 Bihar Gang: వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ (NEET) పరీక్షను చుట్టుముట్టిన వివాదాలు, అక్రమాలు రీ-నీట్ (Re-NEET) లోనూ కొనసాగుతుండటం తీవ్ర కలకలం రేపుతోంది. దేశవ్యాప్తంగా కఠిన నిబంధనల నడుమ నిర్వహించిన రీ-నీట్ పరీక్షలోనూ సరికొత్త మోసాలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. తాజాగా బిహార్‌లో భారీ నెట్‌వర్క్ కలిగిన ఒక 'సాల్వర్ గ్యాంగ్' (నకిలీ అభ్యర్థుల ముఠా) గుట్టును పోలీసులు రట్టు చేశారు.

నమ్మకమైన సమాచారం మేరకు లఖిసరాయ్ జిల్లాలోని మూడు ప్రధాన పరీక్ష కేంద్రాలపై పోలీసులు ఏకకాలంలో ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో పరీక్షల్లో అవకతవకలకు పాల్పడుతున్నట్లు ఆధారాలు లభించడంతో.. ఏడుగురు నకిలీ అభ్యర్థులు సహా మొత్తం 24 మందిని పోలీసులు అరెస్టు చేశారు. అసలైన అభ్యర్థులకు బదులుగా భారీ మొత్తానికి ఒప్పందం కుదుర్చుకుని, పరీక్షలు రాయడానికి వచ్చిన ఈ నకిలీ అభ్యర్థులను పోలీసులు పక్కా వ్యూహంతో పట్టుకున్నారు.

బయోమెట్రిక్ సిబ్బందితో కుమ్మక్కు
ఈ వ్యవస్థీకృత మోసంలో పరీక్షా కేంద్రాల్లో భద్రతను పర్యవేక్షించాల్సిన బయోమెట్రిక్ సంస్థ సిబ్బంది పాత్ర ఉండటం గమనార్హం. బయోమెట్రిక్ సంస్థ సిబ్బందితో కుమ్మక్కైన 14 మంది వెరిఫికేషన్ ఉద్యోగులను కూడా పోలీసులు రంగంలోకి దిగి అరెస్టు చేశారు. అభ్యర్థుల వేలిముద్రలు, గుర్తింపు కార్డుల తనిఖీల్లో ఎలాంటి అవకతవకలు బయటపడకుండా ఈ వెరిఫికేషన్ సిబ్బంది ముఠా సభ్యులకు సహకరించినట్లు విచారణలో తేలింది. సాంకేతిక లోపాలను సాకుగా చూపి, నకిలీ అభ్యర్థులను పరీక్షా హాళ్లలోకి అనుమతించేలా వీరు లోపాయికారీ ఒప్పందాలు చేసుకున్నారు.

సీటు కోసం రూ.40 లక్షల వరకు వసూలు..
ఈ నకిలీ గ్యాంగ్ నీట్ పరీక్షలో అర్హత సాధించి, మెడికల్ సీటు సంపాదించి పెడతామంటూ ఒక్కో అభ్యర్థి నుంచి రూ. 30 లక్షల నుంచి రూ. 40 లక్షల వరకు వసూలు చేసినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది. నిరుపేద, మధ్యతరగతి విద్యార్థుల ప్రతిభను తుంగలో తొక్కుతూ.. కేవలం డబ్బు బలంతో సీట్లు కొల్లగొట్టేందుకు ఈ ముఠా భారీ స్కెచ్ వేసింది. నిందితుల నుంచి పెద్ద ఎత్తున నగదు, నకిలీ గుర్తింపు కార్డులు, మొబైల్ ఫోన్లు, కీలక పత్రాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఇప్పటికే నీట్ పరీక్ష విధానంపై దేశవ్యాప్తంగా విద్యార్థులు, తల్లిదండ్రుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొనగా.. ఇప్పుడు అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించిన రీ-నీట్‌లోనూ ఇలాంటి దారుణాలు బయటపడటం విద్యావ్యవస్థలోని లోపాలను ఎత్తిచూపుతోంది. ఈ ముఠా వెనుక ఉన్న కీలక సూత్రధారులను పట్టుకునేందుకు పోలీసులు విచారణను మరింత వేగవంతం చేశారు.

Also Read: రూ.500 లాటరీ టికెట్‌తో రూ.3 కోట్ల జాక్‌పాట్.. ఆ జర్నీతో డ్రైవర్‌ కోటీశ్వరుడయ్యాడు!

Also Read: నటుడు ప్రకాష్ రాజ్‌పై నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ..అరెస్టు చేయాలంటూ కోర్టు ఆదేశం!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report

Allu Arjun Stampede Case: నేడు కోర్టులో అల్లు అర్జున్ హాజరుపై సస్పెన్స్..వెండాతున్న సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసు!

Hyderabad, Telangana:

Allu Arjun Stampede Case News: 2024 డిసెంబరు 4న 'పుష్ప 2' సినిమా ప్రీమియర్ షో సమయంలో జరిగిన తొక్కిసలాట కేసులో తాజాగా హీరో అల్లు అర్జున్‌కు కోర్టు నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈరోజు (జూన్ 22) కోర్టుకు హాజరవుతారా లేదా అన్నది సినీ, రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ రేపుతోంది. హైదరాబాద్‌లోని నాంపల్లి క్రిమినల్ కోర్టు ఈ కేసులో అల్లు అర్జున్‌తో పాటు ఇతరులకు వ్యక్తిగతంగా హాజరుకావాలని సమన్లు జారీ చేసింది. వర్చువల్ (ఆన్‌లైన్) హాజరుకు కోర్టు నిరాకరించడంతో ఆయన నేరుగా వస్తారా, లేక క్వాష్ పిటిషన్ దాఖలు చేస్తారా అనేది ఆసక్తికరంగా మారింది.

కేసు నేపథ్యం ఇదే!
డిసెంబర్ 4, 2024న హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని సంధ్యా థియేటర్‌లో 'పుష్ప 2: ది రూల్' స్పెషల్ ప్రీమియర్ షో నిర్వహించారు. హీరో అల్లు అర్జున్‌ను చూసేందుకు అభిమానులు ఒకేసారి పోటెత్తడంతో అక్కడ తీవ్రమైన తొక్కిసలాట జరిగింది. ఈ ప్రమాదంలో రేవతి (39) అనే మహిళ ఊపిరాడక ప్రాణాలు కోల్పోగా, ఆమె 8 ఏళ్ల కుమారుడు శ్రీతేజ తీవ్రంగా గాయపడ్డాడు.

మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో చిక్కడపల్లి పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేశారు. తగిన భద్రతా అనుమతులు తీసుకోకపోవడం, పోలీసుల హెచ్చరికలను నిర్లక్ష్యం చేయడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని దర్యాప్తులో తేలింది. పోలీసులు దాఖలు చేసిన ఛార్జిషీటులో మొత్తం 23 మందిని నిందితులుగా చేర్చారు. థియేటర్ యాజమాన్యం, మేనేజర్‌లను A1 నుంచి A10 నిందితులుగా పేర్కొనగా.. నటుడు అల్లు అర్జున్‌ను A11 (11వ నిందితుడు)గా చేర్చారు.

గతంలో (డిసెంబర్ 13, 2024న) ఈ కేసులో అల్లు అర్జున్‌ను పోలీసులు అరెస్ట్ చేయగా, ఆయన హైకోర్టు నుంచి మధ్యంతర బెయిల్, ఆ తర్వాత షరతులతో కూడిన రెగ్యులర్ బెయిల్ పొందారు.

నేటి విచారణపై సస్పెన్స్!
ఛార్జిషీటును పరిశీలించిన నాంపల్లి కోర్టు, జూన్ 22న (నేడు) విచారణకు స్వయంగా హాజరుకావాలని అల్లు అర్జున్‌ సహా మరో 19 మందికి సమన్లు పంపింది. అయితే అల్లు అర్జున్ కోర్టుకు వస్తారా? లేదా అనేదానిపై రెండు రకాల చర్చలు నడుస్తున్నాయి. కోర్టు ఆదేశాల ప్రకారం నేరుగా నాంపల్లి కోర్టుకు రావడం. ఒకవేళ నిందితులంతా హాజరైతే నేటి నుంచి ట్రయల్ (న్యాయ ప్రక్రియ) ప్రారంభమవుతుంది. తనపై ఉన్న అభియోగాలను కొట్టివేయాలని కోరుతూ ఉన్నత న్యాయస్థానంలో క్వాష్ పిటిషన్ వేసి, వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరడం వంటి జరగొచ్చు.

"సోమవారం విచారణకు వ్యక్తిగతంగా హాజరుకావాలని కోర్టు సమన్లు ఇచ్చింది. దీనికి సంబంధించిన తదుపరి వివరాలను త్వరలోనే వెల్లడిస్తాం" అని అల్లు అర్జున్ లీగల్ టీమ్ పేర్కొంది. దీంతో ఐకాన్ స్టార్ కోర్టు మెట్లు ఎక్కుతారా లేక చట్టపరమైన ఇతర మార్గాలను ఎంచుకుంటారా అనేది మరికొద్ది గంటల్లో తేలనుంది.

Also Read: నటుడు ప్రకాష్ రాజ్‌పై నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ..అరెస్టు చేయాలంటూ కోర్టు ఆదేశం!

Also Read: పోక్సో కేసులో బండి భగీరథ్‌కు భారీ ఊరట..రెగ్యులర్ బెయిల్ ఇచ్చిన కోర్టు!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report
Advertisement
Advertisement
Back to top