జూబ్లీహిల్స్: సమస్యల పరిష్కారానికి శంఖారావం
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
EPS-95 Pension Hike 2026: దేశవ్యాప్తంగా ఉన్న లక్షల మంది ప్రైవేట్ ఉద్యోగులకు ముఖ్యగమనిక. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ)లోని ముఖ్యమైన ఈపీఎస్-95 కింద కనీస పెన్షన్‌ను పెంచాలని ఎప్పటినుంచో పెన్షనర్లు డిమాండ్ చేస్తున్న క్రమంలో కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో స్పష్టతనిచ్చింది.
గత వారం పార్లమెంటులో పెన్షనర్ల చిరకాల డిమాండ్‌ను ఎంపీ ఎన్‌కే ప్రేమచంద్రన్ లేవనెత్తారు. ఈపీఎఫ్ పెన్షన్ సవరణ కోసం ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి పర్యవేక్షణ కమిటీ సిఫార్సులను అమలు చేయడానికి ప్రభుత్వానికి ఏమైనా ప్రణాళిక ఉందా? అని ప్రశ్నించారు. ఈ సిఫార్సులను అధ్యయనం చేశారా అనే విషయాలతో సహా ఐదు కీలక ప్రశ్నలు అడిగారు. దీనిపై కార్మిక, ఉపాధి శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా సమాధానమిచ్చారు.
కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే EPS-95 పథకం కింద నెలకు రూ.1,000 కనీస పింఛను అందిస్తోందని మంత్రి మన్సుఖ్ మాండవీయా తెలియజేశారు. ప్రతి ఏడాది EPSకు ప్రభుత్వం '1.16%' వాటాను అందిస్తోందని కార్మిక శాఖ మంత్రి పునరుద్ఘాటించారు. లోక్‌సభలో ఇచ్చిన సమాధానంలో కూడా EPFO, EPS-95 కింద కనీస పింఛను పెంపుపై ప్రభుత్వం తన వైఖరిని స్పష్టం చేసింది. పింఛను పెంపు అమలు, నిధుల స్థిరత్వం వంటి కొనసాగుతున్న ప్రయత్నాలను ప్రముఖంగా ప్రస్తావించింది.
పెన్షనర్ల నెలవారి అవసరాలను తీర్చడానికి నెలకు రూ.1,000 కనీస పింఛను సరిపోదని పెన్షనర్లు, ఉద్యోగ సంఘాలు నిరంతరం డిమాండ్ చేస్తూనే ఉన్నాయి. అయితే, పింఛను నిధికి సంబంధించిన ఆర్థిక స్థిరత్వం, భవిష్యత్ బాధ్యతలను సమాకాలీనం చేసేందుకు ఏ పెంపు అయినా ఉండాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే ఈపీఎస్-95 పెన్షన్ కింద రూ.1,000 నుంచి రూ.7,500కి పెంపు ఇప్పట్లో లేదనే సంకేతాలను మంత్రి లోక్‌సభ వేదికగా స్పష్టం చేశారు.
(గమనిక: ఈ పోస్ట్ కేవలం సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే అందించింది. ఇది ఎలాంటి ప్రభుత్వ జీతాల పెంపు లేదా పింఛను పెంపునకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. తాజా, కచ్చితమైన సమాచారం కోసం అధికారిక ప్రభుత్వ వెబ్‌సైట్‌లను సంప్రదించమని సిఫార్సు చేస్తున్నాము.)
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Kallur Donkey Race Telugu Latest News: రాయలసీమ గడ్డకి ప్రత్యేకమైన చరిత్ర ఉంది.. అద్భుతమైన సంప్రదాయాలకు పెట్టింది పేరు.. ఆధునిక కాలంలో యంత్రాలను వినియోగించి పనులు చేయడం పెరిగినప్పటికీ.. మూగజీవాల అవసరం తగ్గుతున్నా.. తమ మూలాలను మర్చిపోని కర్నూలు వాసులు ఒక అరుదైన వేడుకను దశాబ్దాలుగా కొనసాగిస్తున్నారు. ఉగాది సందర్భంగా ప్రతి సంవత్సరం కల్లూరులోని చౌడేశ్వరి దేవి ఆలయం వద్ద నిర్వహించే గాడిదల బురద పరుగు పందెం స్థానిక సంస్కృతికి నిలువుటద్దంగా నిలుస్తూ వస్తోంది. అయితే, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ఈ వింత ఆచారానికి దాదాపు 150 ఏళ్ల ఘన చరిత్ర ఉన్నట్లు సమాచారం.. కేవలం వినోదం కోసం మాత్రమే కాకుండా.. మానవులకు ఎంతగానో అండగా నిలిచిన మూగజీవాల పట్ల కృతజ్ఞత చాటుకునేందుకు యాదవులతో పాటు అక్కడ ఉండే రైతులంతా ఈ ఉత్సవాన్ని నిర్హహిస్తారు. ఇందులో భాగంగా గాడిదను కేవలం భారం మోసే జంతువుగా చూడకుండా.. కష్టాల్లో పాలుపంచుకునే కుటుంబ సభ్యుడిగా భావించడం ఇక్కడి విశేషం..
ఉగాది తర్వాతి రోజున నగరం నడివొడ్డున ఉన్న చౌడేశ్వరి ఆలయం భక్తులతో కిక్కిరిసిపోతుంది. అంతేకాకుండా ప్రాంగణంలో మోకాలోతు బురదలో గాడిదలు పరుగులు తీస్తుంటే.. యువకులు ఎంతో ఉత్సాహంగా వాటిని వెంటాడుతూ ప్రత్యేకమైన మొక్కులు చెల్లించుకుంటారు. అంతేకాకుండా గంగానమ్మకు ప్రతిరూపమైన ఈ మట్టిలో చేసే ప్రదక్షిణ వల్ల రాబోయే సంవత్సరం సమృద్ధిగా వర్షాలు కురుస్తాయని, పాడి పశువులకు ఎలాంటి వ్యాధులు సోకవని.. పంటలు బాగా పండి రైతులు సుభిక్షంగా ఉంటారని భక్తుల భక్తుల నమ్మకం..
అలాగే డప్పు వాయిద్యాలు, యువకుల డ్యాన్స్‌ల మధ్య గాడిదలను ఊరేగింపుగా ఆలయానికి తీసుకువస్తారు. దేశంలో మరెక్కడా లేని విధంగా కేవలం కర్నూలులోనే జరిగే ఈ బురద పందేలను చూడటానికి తెలుగు రాష్ట్రాల నుండే కాకుండా, పొరుగున ఉన్న కర్ణాటక నుంచి కూడా భక్తులు భారీగా తరిలి వస్తారని స్థానికులు చెబుతున్నారు. తమ పూర్వీకులు అందించిన ఈ వారసత్వాన్ని కాపాడుకోవడం వారి బాధ్యత.. గాడిద అంటే ఓర్పుకు నిదర్శనం.. యంత్రాలు ఎన్ని వచ్చినా మా నమ్మకం మాత్రం మారదని స్థానిక రజక సంఘం ప్రతినిధులు గర్వంగా చెబుతున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
LPG ATM Gurugram News: పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న యుద్ధం నేపథ్యంలో దేశం గ్యాస్ సిలిండర్ల కొరతను ఎదుర్కొంటోంది. ఇలాంటి పరిస్థితుల్లో సామాన్య ప్రజలకు ఒక శుభవార్తను తెలియజేశారు. దేశంలో మొదటిసారిగా LPG గ్యాస్ సిలిండర్ ATMను హర్యానాలోని గుర్‌గ్రామ్‌లో ప్రారంభించారు. కేవలం 2-3 నిమిషాల్లో గ్యాస్ సిలిండర్లు రీఫిల్ చేసుకునేందుకు వీలుగా ఏర్పాట్లు చేశారు.
భారత్ పెట్రోలియం కార్పోరేషన్ లిమిటెడ్ (BPCL) పైలట్ ప్రాజెక్ట్‌లో భాగంగా ప్రారంభించిన ఈ మెషీన్, తేలికపాటి కాంపోజిట్ సిలిండర్లను అందిస్తుంది. అయితే ఈ LPG గ్యాస్ సిలిండర్ రీఫిల్లింగ్ ప్రక్రియ 24x7 గంటలపాటు అందుబాటులో ఉంటుందని యాజమాన్యం తెలియజేసింది. ఈ సౌకర్యం వినియోగదారులకు వేగవంతమైన, సురక్షితమైన, సులభమైన గ్యాస్ రీఫిల్స్ చేసుకునే అవకాశాన్ని అందిస్తుంది.
NCRలో ఎల్‌పిజి గ్యాస్ ఏటిఎమ్‌ను ప్రవేశపెట్టిన మొదటి నగరంగా గురుగ్రామ్ నిలిచింది. సోహ్నాలోని సెక్టార్ 33లో ఉన్న సెంట్రల్ పార్క్ ఫ్లవర్ వ్యాలీలో ఏర్పాటు చేసిన ఈ ATM సమీప నివాస ప్రాంతాలలో ఆటోమేటెడ్, కాంటాక్ట్‌లెస్ గ్యాస్ పంపిణీని అందిస్తుంది.
ఈ LPG ఏటిఎం ఫైబర్‌తో తయారు చేసిన కాంపోజిట్ సిలిండర్లను అందిస్తుంది. ప్రస్తుతం గృహోపకరాణాల్లో వినియోగిస్తున్న ఇనుప సిలిండర్ల కంటే చాలా తేలికైనవి. రోజూ వాడే సిలిండర్ బరువు సుమారు 31 కిలోలు ఉండగా, ఒక కాంపోజిట్ సిలిండర్ కేవలం 15 కిలోల బరువు ఉండి, అంతే పరిమాణంలో గ్యాస్‌ను నిల్వ చేస్తుంది. కాంపోజిట్ సిలిండర్ల ప్రధాన ప్రయోజనం వాటి పారదర్శకత. దీనివల్ల వినియోగదారులు వారి సిలిండర్లలో గ్యాస్ స్థాయిని సులభంగా చూసి తెలుసుకోవచ్చు. గ్యాస్ స్థాయిని తనిఖీ చేయడానికి సిలిండర్‌ను ఎత్తడం లేదా ఊపడం వంటి అవసరం ఉండదు.
LPG ఏటిఎం నుండి గ్యాస్ పొందే ప్రక్రియ పూర్తిగా డిజిటల్ విధానంగా కొనసాగుతుంది. వినియోగదారులు తమ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌ను నమోదు చేసి, ఓటిపిని ధృవీకరించుకున్న తర్వాత, ఖాళీ సిలిండర్‌పై ఉన్న క్యూఆర్ లేదా బార్‌కోడ్‌ను స్కాన్ చేసి, యుపీఐ లేదా డెబిట్ కార్డ్ ఉపయోగించి చెల్లిస్తారు. ఆ తర్వాతే యంత్రం రీఫిల్ చేసిన సిలిండర్‌ను అందిస్తుంది.
ఈ ఏటీఎం మెషీన్ రోజుకు 24 గంటలు పనిచేస్తుంది. అలాగే ఒకేసారి 10 సిలిండర్ల వరకు నిల్వ చేయగలదు. నిల్వ 2 సిలిండర్లకు చేరినప్పుడు, సమీపంలోని గ్యాస్ ఏజెన్సీకి ఆటోమేటిక్ హెచ్చరిక అందుతుంది. దీనివల్ల సకాలంలో రీఫిల్స్ జరుగుతాయి. వినియోగదారులకు వేగవంతమైన, సౌకర్యవంతమైన సేవను అందించే లక్ష్యంతో భారత్ పెట్రోలియం కార్పోరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్) చేపట్టిన పైలట్ ప్రాజెక్ట్‌లో భాగంగా ఈ ఎల్పీజీ ఏటీఎం ఉంది. ఈ ప్రయోగం విజయవంతమైతే, భవిష్యత్తులో దేశవ్యాప్తంగా ఇతర నగరాల్లో కూడా ఇలాంటి ఎల్పీజీ ఏటీఎంలను ఏర్పాటు చేసే అవకాశం ఉంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Snake in Assembly Video Watch: తెలంగాణ అసెంబ్లీ ప్రాంగణంలో ఒక్కసారిగా కలకలం రేగింది. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలో అనూహ్యంగా ఒక పాము ప్రత్యక్షం కావడంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. ఉత్కంఠభరితమైన చర్చలు, రాజకీయ వేడితో నిండి ఉన్న సభ ప్రాంగణంలో ఈ ఘటన చోటు చేసుకోవడం గమనార్హం.. అయితే, ఈ పాము ఎలా వచ్చిందో? దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం..
సాధారణంగా అసెంబ్లీ సమావేశాల వేళ భారీ బందోబస్తు, పోలీసుల పహారా ఉంటుందని అందరికీ తెలిసిందే.. శుక్రవారం ఉదయం సభా కార్యక్రమాలు జరుగుతున్న సమయంలో.. అసెంబ్లీ ఆవరణలోని గార్డెన్ సమీపంలో ఒక పాము పాకుతూ కనిపించింది. అటుగా వెళ్తున్న సిబ్బంది దానిని చూసి ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. దీంతో అక్కడ విధుల్లో ఉన్న పోలీసులు, మీడియా ప్రతినిధులు అలర్ట్ అయ్యారు. సుమారు మూడు అడుగుల పొడవున్న ఆ పాము పొదల్లోకి వెళ్లేందుకు ప్రయత్నించింది.
అయితే, అక్కడే ఉన్న కొంతమంది అధికారులు పామును చూసి భయపడి దూరంగా వెళ్తుండగా.. అక్కడ విధుల్లో ఉన్న ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ సహాసం చేసి పట్టుకునేందుకు ప్రయత్నించారు.. ఏమాత్రం భయపడకుండా.. చాకచక్యంగా ఆ పామును పట్టుకున్నారు. ఆతని దగ్గర ఎలాంటి పాములను పట్టుకునే పరికరాలు లేకపోయినప్పటికీ, తనకున్న అవగాహనతో పాముకు గాయం కాకుండా.. అలాగే తనకు ప్రమాదం కలగకుండా ఎంతో సింపుల్‌గా ఆ పామును పట్టుకుని రక్షించారు.
కానిస్టేబుల్ ఎంతో సులభంగా పట్టుకోవడం చూసి అక్కడున్న వారంతా ఆశ్చర్యపోయారు. ప్రాణాలకు తెగించి పామును పట్టుకున్న ఆ కానిస్టేబుల్‌ను ఉన్నత అధికారులతో పాటు మీడియా ప్రతినిధులు అభినందించారు. పామును పట్టుకున్న తర్వాత దానిని ఒక సంచిలో భద్రపరిచి.. వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించిన్నట్లు తెలుస్తోంది. అనంతరం ఆ పామును జన సంచారం లేని ఓ ప్రదేశంలో అధికారులు సురక్షితంగా విడిచిపెట్టినట్లు తెలుస్తోంది.. అయితే, గత రెండు రోజుల నుంచి వర్షాలు కురుస్తుండడంతో పాము బయటికి వచ్చి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Chaturgrahi Yoga 2026 Effect On Zodiac: జ్యోతిష్య శాస్త్రంలో గ్రహగమనాలు మానవ జీవితంపై ఎంతటి ప్రభావాన్ని చూపుతాయో మనందరికీ తెలిసిందే. అయితే, ఈ నెలలో అరుదైన ఖగోళ సంఘటన చోటు చేసుకోబోతోంది. సుమారు 500 ఏళ్ల తర్వాత చైత్ర నవరాత్రుల సమయంలో ఎంతో శక్తివంతమైన చతుర్గ్రాహి రాజయోగం ఏర్పడబోతోంది. మీనరాశిలో సూర్యుడు బుధుడు శుక్రుడు రాహు గ్రహాల కలయిక కారణంగా ఈ శక్తివంతమైన రాజయోగం ఏర్పడుతుంది. మార్చి చివరివారాల నుంచి ప్రారంభమయ్యే ఈ రాజయోగం నాలుగు రాశుల వారికి అదృష్టాన్ని తెచ్చిపెట్టబోతోంది. ముఖ్యంగా ఈ సమయంలో కొన్ని రాశుల వారి జాతకంలో అనేక మార్పులు రాబోతున్నాయి.
అదృష్టం పొందబోయే రాశులు ఇవే..
మేషరాశి
చతుర్గ్రాహి రాజయోగం వల్ల మేష రాశి వారికి ఊహించని ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి. విదేశాలకు వెళ్లాలనుకుంటున్న వారి ప్రయత్నాలు ఫలించడమే కాకుండా అద్భుతమైన ప్రయోజనాలు కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉద్యోగస్తులకు పదోన్నతులు కూడా లభించి జీతాలు కూడా విపరీతంగా పెరుగుతాయి. ముఖ్యంగా కుటుంబంలో శుభకార్యాలు కూడా జరిగే సూచనలు ఉన్నాయి.
మిథున రాశి
చతుర్గ్రాహి రాజయోగం వల్ల గోల్డెన్ పీరియడ్ ప్రారంభం కాబోతోంది. ముఖ్యంగా వ్యాపారస్తులకు ఈ సమయంలో భారీ లాభాలు కలిగే సూచనలున్నాయి. సమాజంలో వీరికి గౌరవ మర్యాదలు పెరగడమే కాకుండా.. కొత్త ఆదాయ మార్గాలు కూడా తెరుచుకుంటాయి. గతంలో ఉన్న అనారోగ్య సమస్యల నుంచి పూర్తిగా ఉపశమనం కూడా లభించబోతోంది. అంతేకాకుండా ఎన్నో రకాల దీర్ఘకాలిక సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది.
తులారాశి
తులా రాశిలో జన్మించిన వ్యక్తులకు వృత్తిపరంగా ఉద్యోగాలపరంగా ఈ సమయంలో అనేకమైన మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. ముఖ్యంగా నిరుద్యోగ యువతకు ఈ సమయంలో తప్పకుండా అద్భుతమైన పరిష్కారం లభించబోతోంది. కొత్త వాహనాలు కొనుగోలు చేయాలనుకునే వ్యక్తులకు ఈ సమయం అద్భుతంగా ఉంటుంది. జీవిత భాగస్వామితో ఉన్న విభేదాలు కూడా పూర్తిగా తొలగిపోతాయి. భాగస్వామ్య జీవితంలో అద్భుతమైన ప్రయోజనాలు కలిగే అవకాశాలున్నాయి.
ధనస్సు రాశి
ఈ శక్తివంతమైన రాజయోగ ప్రభావంతో ధనస్సు రాశి వారికి అఖండ విజయాలు కలుగుతాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. ముఖ్యంగా రాజకీయ లేదా సామాజిక రంగాల్లో ఉన్నవారికి పదవియోగం కూడా ఉండబోతోంది. పాత బాకీల నుంచి డబ్బులు వసూలు అవ్వడమే కాకుండా అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా విద్యార్థులు పోటీ పరీక్షల్లో కూడా ఉత్తమ ఫలితాలు పొందగలుగుతున్నారు. అలాగే ధార్మిక కార్యక్రమాల పట్ల విపరీతమైన ఆసక్తి కూడా పెరగబోతా ఉంది. అనుకున్న పనుల్లో అద్భుతమైన విజయాలు సాధించబోతున్నారు.
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Mani Kanchana Yoga Effect On Zodiac Telugu: వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాల కలయిక వల్ల ఏర్పడే యోగాలు మానవ జీవితాల్లో అద్భుతమైన మార్పులను తీసుకువస్తూ ఉంటాయి. 2026 సంవత్సరం బుధుడు తో పాటు గురు గ్రహాల కదలికలు ఎక్కువగా ఉండబోతున్నాయి. అంతేకాకుండా ఈ సమయంలో ఎంతో శక్తివంతమైన మణికాంచన రాజయోగం కూడా ఏర్పడబోతోంది. ముఖ్యంగా ఈ సమయంలో కొన్ని రాశుల వారికి ఎన్నో రకాల ఊహించని ప్రయోజనాలు కలుగుతాయి. ఆర్థికంగా అద్భుతమైన కలిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. దీంతోపాటు అనుకున్న పనుల్లో అద్భుతమైన సంపాదన కూడా లభించబోతోంది.
మణికాంచన రాజయోగం ఎఫెక్ట్..
వృషభ రాశి
మణికాంచన రాజయోగం ప్రభావంతో వృషభ రాశి వారికి ఆర్థిక పరిస్థితులు గతంలో కంటే ఇప్పుడు మరింత మెరుగుపడతాయి. ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ లభించడమే కాకుండా వ్యాపారాల్లో ఒప్పందాలు లాభసాటిగా మారతాయి. అంతేకాకుండా అనవసర ఖర్చులకు కూడా విపరీతంగా పెరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ సమయంలో ఖర్చుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది..
సింహరాశి
సింహరాశి వారికి ఆత్మవిశ్వాసం విపరీతంగా పెరుగుతుంది. నిలిచిపోయిన పనులు కూడా ఎంతో సులభంగా పూర్తవుతాయి. కెరీర్‌లో ఊహించని విజయాలు కూడా సాధించబోతున్నారు. అంతేకాకుండా ఈ సమయంలో అహంకారం నుంచి కూడా ఉపశమనం కలుగుతుంది. దీని కారణంగా వీరికి సమాజంలో మంచి గుర్తింపు కూడా లభించబోతోంది.
తులారాశి
మణికాంచన రాజయోగ ప్రభావంతో తులా రాశి వారికి ఆర్థికంగా చాలా వరకు కలిసి రాబోతోంది. ముఖ్యంగా కుటుంబంలో సుఖశాంతులు నెలకొంటాయి. అలాగే ఇతరులపై అద్భుతమైన విజయాలు కూడా సాధించగలుగుతారు. సొంత నిర్ణయాలతో ముందుకెళ్లడం శ్రేయస్కరమని జ్యోతిష్యులు చెబుతున్నారు. దీంతోపాటు సమస్యలు కూడా ఎంతో సులభంగా పరిష్కారం కాబోతున్నాయి.
మకర రాశి
మకర రాశి వారికి దీర్ఘకాలిక సమస్యల నుంచి ఎంతో సులభంగా విముక్తి లభించబోతోంది.. ముఖ్యంగా వీరు ఈ సమయంలో పెట్టుబడుల నుంచి భారీ మొత్తంలో లాభాలు పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఎంతో ఓపికగా పనిచేయడం వల్ల మంచి గుర్తింపు కూడా పొందగలుగుతారు. దీంతోపాటు తొందరపాటు నిర్ణయాన్ని తీసుకోవడం మానుకుంటే చాలా మంచిది. ఈ సమయంలో వీరికి అంతా బాగానే ఉంటుంది..
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Ugadi Celebrations In Vijayawada: 'మన సంస్కృతీ సంప్రదాయాలు మనకు విలువలు నేర్పుతాయి. విలువలతో జీవనం గడిపేవారికి ఉన్న ఆనందం ఎవరికీ ఉండదు. విలువలు లేని చోట ఏమీ మిగలదు' అని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. 'ఇక్కడ ఉండే మనకంటే విదేశాల్లోని తెలుగువారు మన సంస్కృతీ సంప్రదాయాలను పాటిస్తున్నారు. విదేశాల్లో తెలుగు సంస్కృతీ సంప్రదాయాల అంబాసిడర్లుగా ప్రవాసాంధ్రులు మారారు. తెలుగు జాతి ప్రపంచంలో నెంబర్ వన్ గా ఉండాలన్నదే నా సంకల్పం' అని చంద్రబాబు ప్రకటించారు.
Also Read: Devuni Kadapa: ఉగాది ప్రత్యేకం.. వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న ముస్లిం భక్తులు
గురువారం జరిగిన ఉగాది వేడుకల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరై ఈ సందర్భంగా కీలక ప్రసంగం చేశారు. 'మన పండుగలు, ఆచారాల్లోనే సైన్సు ఉంది. వాస్తు లాంటి శాస్త్రాలు, సూర్య నమస్కారం లాంటి ఆచారాలు ఇలాంటివే. యోగా, నేచురోపతి లాంటి వైద్యం కూడా ప్రకృతి నుంచి వచ్చిందే. ఆరోగ్యం, ఆనందం, సంపద వీటి వల్లే సాధ్యం అవుతుంది. సమీప భవిష్యత్తులో పూర్తి సాంకేతికతతో పాలన జరిగే అవకాశం ఉంటుంది' అని సీఎం చంద్రబాబు తెలిపారు. ప్రకృతి వైపరీత్యాలు, వాతావరణం ఇలా వేర్వేరు పరిస్థితులను అధ్యయనం చేసి దానికి అనుగుణంగా చర్యలు తీసుకునే అవకాశం వచ్చిందని చెప్పారు.
Also Read: Chiranjeevi: ఉగాది పండుగ రోజు చిరంజీవి కీలక ప్రకటన.. విద్యా దానం చేసేందుకు సిద్ధం!
'2047 నాటికి అగ్రస్థాయిలో తెలుగు జాతి ఉండాలనే సంకల్పం మనం అంతా తీసుకోవాలి. సంజివనీ ప్రాజెక్టు ద్వారా ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు ఓ ముఖ్యమైన ముందడుగు వేశాం. డిజిటల్ హెల్త్ రికార్డుల ద్వారా వ్యక్తిగత ఔషధాలను కూడా అందించే పరిస్థితి వస్తుంది. 2024కు ముందు ఐదేళ్లు ఎవరూ సంతోషంగా పండుగలు కూడా జరుపుకునే పరిస్థితి లేదు' అని సీఎం చంద్రబాబు తెలిపారు. ఒక వ్యక్తి కారణంగా ఎక్కడ చూసినా భయం, విధ్వంసం, దారుణాలు జరిగాయని వైఎస్ జగన్‌పై పరోక్ష విమర్శలు చేశారు. అందుకే టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి కూటమిగా ఏర్పడి, సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన అందిస్తున్నామని చెప్పారు.
Also Read: Telangana CM Gift: ఉగాది పండుగ కానుక ప్రకటించిన తెలంగాణ సీఎం.. రైతులకు అదిరిపోయే వార్త
రాష్ట్రంలోని ప్రతీ వ్యక్తికి ఆర్దిక, సామాజిక, ఆరోగ్య భద్రత అందించాలన్నదే తమ లక్ష్యం అని సీఎం చంద్రబాబు ప్రకటించారు. 'భారత్ అంటే ఉమ్మడి కుటుంబాలు కలిసి ఉండే సంప్రదాయం ఉంది. ఇంట్లోని పెద్ద వాళ్లను కూడా జాగ్రత్తగా చూసుకుంటాం. కొందరు స్వార్ధంతో తల్లికి, చెల్లెలికి ఆస్తులు ఇవ్వని వ్యక్తులు కూడా ఉంటారు. అందుకే మళ్లీ ఉమ్మడి కుటుంబాలు ఉండేలా చర్యలు చేపట్టాలని ఆలోచన చేస్తున్నాం. పాపులేషన్ మేనేజ్‌మెంట్ పాలసీతో మళ్లీ జనాభాను పెంచేలా చర్యలు చేపడుతున్నాం. తల్లికి వందనం ద్వారా ఎంత మంది పిల్లలు ఉన్నా అందరికీ ఆర్దిక సహకారం అందిస్తున్నాం' అని వివరించారు.
'అన్నదాత సుఖీభవ ద్వారా రైతన్నలకు రూ.20 వేల చొప్పున ఇచ్చాం. శక్తి ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం తీసుకువచ్చాం. 56 కోట్ల ప్రయాణాలు జరిగాయి. దివ్యాంగ శక్తి ద్వారా దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించాం' అని సీఎం చంద్రబాబు చెప్పారు. అర్చకులకు రూ.15 వేల చొప్పున వేతనం ఇస్తున్నాం, ఇమామ్‌లు మౌజన్లకు కూడా గౌరవ వేతనం ఇస్తున్నట్లు తెలిపారు. సమాజంలో అందరూ ఆనందంగా ఉండాలన్న లభ్యంతో పనిచేస్తున్నట్లు గుర్తుచేశారు.
'పేదల జీవన ప్రమాణాలు కూడా పెంచేలా పీ4 కార్యక్రమాన్ని తీసుకువచ్చాం. సంపన్నులైన 10 శాతం మంది సమాజంలో అట్టడుగున ఉన్న 20 శాతం మందిని ఆదుకునేలా ఈ కార్యక్రమం చేపట్టాం. నేను పనిచేసేది 5 కోట్ల మంది తెలుగు ప్రజల కోసం. అందరి జీవన ప్రమాణాలు మెరుగు పర్చటం కోసం.. సమాజంలో అట్టడుగున ఉండిపోయిన పేదలకు చేయూతను ఇచ్చి పైకి తీసుకువచ్చేలా కార్యాచరణ చేపట్టాం' అని సీఎం చంద్రబాబు వెల్లడించారు.
'సమగ్ర అభివృద్ధి కోసం విశాఖ, తిరుపతి, అమరావతి కేంద్రంగా ప్రాంతీయ ఎకనామిక్ కారిడార్లు తీసుకువచ్చాం. పోర్టులు, ఎయిర్‌పోర్టులు, రహదారులు, రైల్వేలైన్లు అనుసంధానం చేసి లాజిస్టిక్స్ వ్యవస్థను అభివృద్ధి చేస్తాం. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల కోసం ఇప్పటి వరకూ రూ.1,943 కోట్లు ఇచ్చాం' అని సీఎం చంద్రబాబు వివరించారు. గత పాలకులు పైసా కూడా వారికి పరిహారం ఇవ్వలేదని విమర్శిస్తూనే.. అన్ని ప్రాంతాలు సస్యశ్యామలం కావాలంటే పోలవరం పూర్తి కావాలని పేర్కొన్నారు. గోదావరి పుష్కరాలకంటే ముందు పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Chiranjeevi Education Charity: సినిమాలు చేస్తూనే సమాజానికి ఎంతో కొంత సేవ చేయాలనే తపనతో సామాజిక సేవ కార్యక్రమాలు చేస్తుంటారు. అలాంటి సేవా కార్యక్రమాలు చేసే వారిలో సినీ నటుడు చిరంజీవి ముందుంటారు. తాజాగా ఉగాది పండుగ రోజు మరో సేవా కార్యక్రమానికి సంబంధించి చిరంజీవి ప్రకటించారు. రక్తదానంతోపాటు విద్యాదానం చేస్తానని మెగాస్టార్ ప్రకటన చేశారు. భవిష్యత్‌లో విద్యా దానానికి సంబంధించిన కార్యక్రమాలు చేయనున్నట్లు తెలిపారు.
Also Read: Devuni Kadapa: ఉగాది ప్రత్యేకం.. వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న ముస్లిం భక్తులు
ఉగాది పండుగ సందర్భంగా జరిగిన ఓ ప్రత్యేక కార్యక్రమంలో చిరంజీవి కీలక ప్రకటన చేశారు. ఇప్పటికే బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ వంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుండగా అదే మాదిరి విద్యాదానం చేస్తానని తెలిపారు. శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని విద్యార్థులకు సంబంధించి శుభవార్త ప్రకటించారు. భవిష్యత్తులో విద్యాదానంపై దృష్టి సారిస్తానని చిరంజీవి తెలిపారు. 'రక్తం కొరతతో ప్రాణాలు కోల్పోతున్న సందర్భాలు నన్ను కదిలించాయి. అందుకే 1998లో బ్లడ్ బ్యాంక్‌ను స్థాపించి అభిమానులను రక్తదానానికి ప్రేరేపించా. ఈ సమయంలో ఐ బ్యాంక్ సేవలను కూడా ప్రారంభించి అత్యవసర సమయంలో ప్రాణదాతగా నిలిచేలా వ్యవస్థను తీర్చిదిద్దా' అని మెగాస్టార్ చిరంజీవి వెల్లడించారు. బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ సేవలను అక్కడితో ఆపాలని ఎప్పుడూ అనుకోలేదని.. ఇప్పుడు విద్యా రంగంలో సేవలు అందించే దిశగా అడుగులు వేయాలని ఆలోచిస్తున్నట్లు చిరంజీవి తెలిపారు.
Also Read: Telangana CM Gift: ఉగాది పండుగ కానుక ప్రకటించిన తెలంగాణ సీఎం.. రైతులకు అదిరిపోయే వార్త
తమిళ స్టార్ హీరో సూర్య స్థాపించిన అగరం ఫౌండేషన్ స్ఫూర్తిగా పేదలకు ఉచిత విద్య అందించే కార్యక్రమాన్ని ప్రారంభించాలనుకుంటున్నట్లు చిరంజీవి ప్రకటించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకే పరిమితం కాకుండా.. ఎక్కడ విద్య అవసరం ఉంటుందో అక్కడ తాను సహాయం అందించేలా కృషి చేస్తానని వెల్లడించారు. త్వరలోనే తాను ఈ విద్యా పథకానికి సంబంధించిన పూర్తి వివరాలను ప్రకటిస్తానని చిరంజీవి వివరించారు.
చిరంజీవి సేవా కార్యక్రమాలు
దశాబ్దాలుగా సినీ పరిశ్రమలో కొనసాగుతున్న చిరంజీవి తన సంపాదనలో కొంత సామాజిక సేవా కార్యక్రమాలకు వినియోగిస్తున్నారు. చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటుచేసి బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ సేవలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ట్రస్ట్ ద్వారా పేదలకు వైద్యం, ఆర్థిక సహాయం అందిస్తున్నారు. ఇక కరోనా సమయంలో ఆక్సిజన్ సిలిండర్లు, వైద్య సహాయం అందించారు. చిరంజీవి ట్రస్ట్ సేవా కార్యక్రమాలను ఆయన కుమారుడు, సినీ నటుడు రామ్ చరణ్ పర్యవేక్షణ వేస్తున్నారు. ట్రస్ట్ కార్యకలాపాల కోసం ప్రత్యేక వెబ్‌సైట్‌ను ప్రారంభించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Gandhari Vana Viral News: ఆకాశం ఒక్కసారిగా ఉన్నట్టుండి నల్లటి మేఘాలతో కమ్మేసింది.. చూస్తుండగానే భారీ వర్షం మొదలైంది.. సాధారణంగా వర్షం అంటే రైతులకు ఆనందంతో పాటు ఒక మనసును పరిమళింపజేసే అద్భుతమైన సంతోషం.. కానీ ప్రస్తుతం కురుస్తున్న ఈ వర్షం మాత్రం రైతు కంట కన్నీరు పెట్టిస్తోంది.. వ్యవసాయ భాషలో దీనినే గాంధారివాన అంటారు. అసలు ఈ పేరు వెనక ఉన్న పరమార్ధం ఏంటి? పురాణాలకు.. ఈ వానకు ఉన్న సంబంధమేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం..
మహాభారతంలో గాంధారి పాత్ర మనందరికీ తెలిసిందే.. తన భర్త ధృతరాష్ట్రుడు పుట్టుకతోనే కళ్ళు లేకపోవడంతో.. పతిభక్తితో ఆమె కూడా తన కళ్ళకు గంతలు కట్టుకుంటుంది.. అయితే, తన కళ్ళు కనిపించకపోవడంతో తన వందమంది కుమారులు చేసే ఆకృత్యాలను ఆమె చూడలేక పోతుంది. బిడ్డలపై అమితమైన ప్రేమతో వారి తప్పులను తెలుసుకో లేక ఏమీ చేయలేక పోతుంది.. అంతేకాకుండా వారందరికీ నిత్యం ఎంతగానో సేవలు చేస్తూ ఉంటుంది.. అయితే ఆమె వారిపై చూపే ప్రేమ ఎంతో వినాశనానికి దారితీస్తుంది. చివరకు కౌరవులంతా మరణించే వరకు వస్తుంది..
గాంధారి ప్రేమ బిడ్డలకు ఎలాగైతే మేలు చేయాల్సింది పోయి కీడు చేసిందో.. ఈ అకాల వర్షం కూడా పంటలకు అలాగే నష్టం కలిగిస్తుంది. పంట చేతికి వచ్చే సమయంలో లేదా కోతల సమయంలో కురిసే వర్షాల వల్ల ధాన్యం తడిసి ముద్దవుతుంది. రైతు కష్టమంతా బురద పాలవుతుంది. అవసరం లేనప్పుడు కురిసే అధిక వర్షాల వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువ.. అందుకే సమయం కాని సమయంలో కురిసే ఈ వినాశకరమైన వర్షాలను మన పెద్దలు గాంధారి వానగా అభివర్ణించేవారు..
ఈ అరుదైన పదాన్ని నేటి తరానికి గుర్తు చేశారు న్యాచురల్ స్టార్ నాని.. ఆయన నటించిన దసరా చిత్రంలో చమ్కీల అంగీలేసి ఓ వదినే అనే జానపద గీతంలో ఈ పదం వినిపిస్తుంది. గాంధారి వానల్లె కురిసిందే నీ ప్రేమ అంటూ సాగే లిరిక్స్ ఆ సందర్భంలో ఎంతటి లోతైన భావాన్ని కలిగి ఉందో ఇప్పుడు మనం ఎంతో సులభంగా అర్థం చేసుకోవచ్చు.. ప్రకృతి వైపరీత్యము లేక వాతావరణ మార్పులో కానీ ప్రస్తుతం కురుస్తున్న ఈ గాంధారి వానలు అన్నదాతను ఆవేదనకు గురిచేస్తున్నాయి.. అవసరమైనప్పుడు గురువని వాన అవసరం లేనప్పుడు కురిసి సర్వస్వాన్ని నాశనం చేయడం నిజంగా దురదృష్టకరమే.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Boyfriend Video Watch:ప్రేమ పేరుతో తనను మోసం చేస్తున్నాడని తెలుసుకున్న ఓ యువతి.. నడి రోడ్డుపై తన ప్రియుడికి చుక్కలు చూపించిన ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ గా మారింది. అందరూ చూస్తుండగానే అతనిపై విరుచుకుబడి చితకబాతిన ఘటన ఇప్పుడు మీరు ఈ వైరల్ అవుతున్న వీడియోలో చూడొచ్చు. ఈ ఘటన ఎక్కడ జరిగిందనేది స్పష్టంగా తెలియనప్పటికీ.. సోషల్ మీడియాలో ఈ వీడియో మాత్రం రచ్చ లేపుతోంది.. ఈ వీడియో చూసిన సోషల్ మీడియా వినియోగదారులంతా ఆసక్తిగా ఇతరులకు షేర్ చేస్తున్నారు. ఈ వీడియోకు సంబంధించిన అన్ని వివరాలేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం..
సమాచారం ప్రకారం సదరు యువతి.. యువకుడు కొద్ది సంవత్సరాల నుంచి ప్రేమలో ఉన్నారట.. అయితే తన ప్రియుడు తనను కాదని మరో యువతితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని ఆమెకు ఇటీవలే తెలిసింది.. తనను నమ్మించి మోసం చేస్తున్నాడని ఆగ్రహించిన ఆ యువతి.. అతనిని నడి రోడ్డుపై పట్టుకొని నిలదీసింది.. మాటకు మాట పెరగడంతో కోపం కట్టలు తెంచుకున్న యువతి.. ఆ యువకుడిని కిందకు నెట్టిపడేసింది.. అతనిపై కూర్చొని విచక్షణారహితంగా చితకబాతింది.
ప్రస్తుతం ఈ వీడియో ఇంస్టాగ్రామ్ ఇండియా రివైండ్ అనే ఖాతా నుంచి సోషల్ మీడియాలోకి పోస్ట్ చేశారు. యువతి తన ప్రియుడిని రోడ్డుపై పడేసి.. అతనిపై కూర్చుని మరి కొట్టడం మీరు ఈ వీడియోలో క్లియర్ గా చూడొచ్చు. అంతేకాకుండా యువకుడు ఆమె చేతుల నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తుండగా.. ఆమె జుట్టు పట్టుకుని లాగడం ఈ వీడియోలో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. కొంతసేపు ఇద్దరు రోడ్డుపైనే దాడి చేసుకున్నారు. ఆ తర్వాత ఆ యువతి అలా దాడి చేసుకుంటూనే.. తన ప్రియుడిపై పడుకుండిపోయింది.. దీంతో ఆ యువకుడు ఆమెను ఓదారుస్తూ రోడ్డుపైనే పడుకొని గట్టిగా హత్తుకున్నారు..
https://t.co/bs4BbVxDBV pic.twitter.com/PNI1rkq361
— Anonymous_girl (@srutimisra_789) March 17, 2026
ఈ వింత ప్రవర్తనను చూసిన సోషల్ మీడియా వినియోగదారులు రకరకాలుగా స్పందిస్తూ వస్తున్నారు.. మోసం చేశాడని కొట్టడం సరే.. మళ్లీ అంతలోనే అంత ప్రేమ ఎక్కడి నుంచి వచ్చిందని కొందరు ప్రశ్నిస్తూ కామెంట్ బాక్స్ లో కామెంట్ చేస్తుంటే.. మరి కొంతమంది మాత్రం ఇదొక వింత ప్రేమ కథ అని కామెంట్ చేస్తున్నారు. ఇక ప్రత్యక్ష సాక్షులు తీసిన ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. అయితే, ఈ ఘటన ఎక్కడ జరిగిందనేది ఇప్పటికీ స్పష్టంగా తెలియదు.. కానీ సోషల్ మీడియాలో మాత్రం విపరీతంగా వైరల్ గా మారింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Scared Horse Video Watch Now: పెళ్లి వేడుకలు అంటేనే భాజా భజంత్రీలతో పాటు సందడి కేరింతలు ఉంటూ ఉంటాయి. మరీ ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాల్లో పెళ్లిల్లో వరుడు గుర్రంపై రాజసంలో ఊరేగుతూ రావడం ఆనవాయితీగా ఉంటుంది.. అయితే కొన్నిసార్లు ఈ ఆనందం కాస్త ఆందోళనగా కూడా మారుతూ ఉంటాయి. ఇలాంటి ఘటనలు అప్పుడప్పుడు సోషల్ మీడియాలో చూస్తూ ఉంటాం.. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియో చూస్తే ఎవరికైనా ఆందోళన కలగక తప్పదు.. పెళ్లి మండపంలోకి వరుడు గుర్రంపై వస్తుండగా.. ఆ మూగ జీవి ఒక్కసారి భయాందోళనకు గురై వీరంగం సృష్టించింది. ఇప్పుడు ఈ ఘటన సోషల్ మీడియాలోనే విపరీతంగా వైరల్ అవుతూ వస్తోంది.
వైరల్ అవుతున్న సమాచారం ప్రకారం.. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లోని ఓ గ్రామంలో చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. వరుడు అలంకరించిన గుర్రంపై కూర్చొని.. బంధుమిత్రుల కోలాహరం మధ్య వివాహం జరిగే వేదిక దగ్గరకు చేరుకోవడం మీరు చూడొచ్చు. చుట్టూ బాణాసంచా కాల్పులతో పాటు పెద్ద మ్యూజిక్ సౌండ్ కూడా వినిపించడం మీరు వీడియోలో గమనించవచ్చు. దీంతో ఆ ప్రాంతమంతా ఒక్కసారిగా సందడి నెలకొంది.. అయితే, అసలు ఘటన ఇప్పుడే జరిగింది...
అయితే బాణాసంచా వెలుగుకో లేదా సౌండ్‌కో కానీ.. ఒక్కసారిగా ఆ గుర్రం భయాందోళనకు గురైంది.. అప్పటివరకు ప్రశాంతంగా ఉన్న గుర్రం.. ఒక్క సెకండ్ పలో వెనక కాళ్లపైకి లేచి రంకెలు వేయడం మొదలుపెట్టింది. అలా ఆ గుర్రం కొద్దిసేపటి వరకు అలా రంకెలు వేస్తూనే వీరంగం సృష్టించింది. అక్కడున్న వారంతా ఒక్కసారిగా భయాందోళనకు గురైనట్లు తెలుస్తోంది..
https://t.co/vVVgvZu4p1 pic.twitter.com/PXOlEPkYOb
— Anonymous_girl (@srutimisra_789) February 24, 2026
గుర్రం అదుపుతప్పుతుందని గ్రహించిన వరుడు దానిపై నుంచి పడిపోకుండా గట్టిగా పట్టుకోవడానికి ప్రయత్నిస్తుండడం మీరు వీడియోలో చూడొచ్చు.. కానీ ఆ గుర్రం అటు ఇటు పిచ్చిగా ప్రవర్తిస్తుండడంతో అక్కడున్న అతిథులు ప్రాణభయంతో గందరగోళంగా పరుగులు తీశారు. గుర్రంపై ఉన్న వరుడు కిందికి పడిపోవడం కూడా మీరు క్లియర్‌గా చూడొచ్చు. ఆ గుర్రం సమీపంలోని కుర్చీలతో పాటు పరదాలను ధ్వంసం చేస్తూ బీభత్సం సృష్టించింది..
ఈ వీడియో చూసిన సోషల్ మీడియా వినియోగదారులు రకరకాలుగా స్పందిస్తూ వస్తున్నారు.. జంతువులకు భారీ శబ్దాలు అంటే పడదు.. ముఖ్యంగా పెళ్లిళ్లు ఇలాంటి ప్రయోగాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుందని కొందరు సూచిస్తూ కామెంట్లు పెడుతున్నారు.. ఇక మరికొందరు మాత్రం వరుడు ప్రాణాలతో బయటపడటం అదృష్టమని కామెంట్లు చేస్తూ వస్తున్నారు. ఏది ఏమైనా ఆడంబరాల కోసం జంతువులను ఇబ్బంది పెట్టడం వల్ల ఇలాంటి ప్రమాదాలు జరుగుతాయని ఈ ఘటన మరోసారి నిరూపించింది..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Work From Home Fun Viral Video Watch: కరోనా కాలంలో మొదలైన వర్క్ ఫ్రమ్ హోమ్ ఐటీ ఉద్యోగుల జీవితాల్లో అద్భుతమైన మార్పులను తీసుకువచ్చింది. ఇంటి నుంచి పనిచేసే సౌలభ్యం ఉన్నప్పటికీ.. అటు ఆఫీస్ పనులతో పాటు ఇటు ఇంటి పనులను చక్కబెట్టుకోవడం ఉద్యోగులకు కత్తి మీద సామల మారింది.. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియో ఎందుకు నిదర్శనంగా నిలుస్తోంది. ఒక యువకుడు ఆఫీస్ వీడియో కాన్ఫరెన్స్లో భాగంగా పాల్గొంటూనే.. మరోవైపు వంటింటిలో పూరీలు చేస్తున్న దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియా వినియోగదారులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి..
ఉగాది పండగ సీజన్ కావడంతో ప్రతి ఇంట్లో పిండి వంటల సందడి నెలకొంది.. అయితే, ఆఫీసుల్లో పని ఒత్తిడి వల్ల సెలవు దొరకని ఒక యువకుడు.. తన పనిని వదులుకోకుండానే పండగ వంటకాలను తయారు చేయాలనుకున్నాడు. ఇందులో భాగంగానే ఈ పిండివంతలను ఆఫీస్ మీటింగ్ అటెండ్ అవుతూ తయారు చేస్తూ ఉండడం విశేషం. దీనికి సంబంధించిన వీడియో రాహుల్_సింగ్2910 అని ఇన్స్టాగ్రామ్ ఖాతా నుంచి పోస్ట్ చేశారు. ఈ వీడియోలో సదరు యువకుడు హెడ్ ఫోన్లు పెట్టుకొని సీరియస్గా లాప్టాప్ ముందు కూర్చుని కనిపిస్తూ ఉంటాడు.. అంతేకాకుండా లాప్టాప్ లో ఆఫీస్ మీటింగ్ జరగడం కూడా మీరు చూడొచ్చు.. అయితే, అతను తెలివిగా తన కెమెరాను ఆఫీసులో ఉంచినట్లు తెలుస్తోంది.
మీటింగ్ సమయంలో తమ సహుద్యోగులతో మాట్లాడుతున్న సమయంలో.. శ్రద్ధగా వింటూనే తన ముందున్న పళ్లెంలో పూరీలను తయారు చేస్తున్నాడు. ఒక చేత్తో మీటింగ్ ను గమనిస్తూ.. మరో చేత్తో ఆ పిండివంటను తయారు చేస్తున్న తీరును చూసి సోషల్ మీడియా వినియోగదారులు ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఈ వీడియోను పోస్ట్ చేసిన కొన్ని రోజుల్లోనే లక్షల మంది వీక్షించినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా వేళలో లైకులు కూడా వచ్చాయి. అయితే ఈ వీడియో చూసిన సోషల్ మీడియా వినియోగదారులు మల్టీ టాస్కింగ్ అంటే ఇదే కదా అంటూ కామెంట్లు చేస్తున్నారు.
https://t.co/1HRfvviuMQ pic.twitter.com/6V3H2jCpaR
— Anonymous_girl (@srutimisra_789) March 8, 2026
ఇక మరి కొంతమంది సోషల్ మీడియా వినియోగదారులైతే.. భయ్యా నీ క్రియేటివిటీకి దండాలు.. ఆఫీస్ పని ఇంటి పని రెండు కలిపి చేసుకోవడంలో నువ్వు తోపు అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఒకవేళ పొరపాటున కెమెరా ఆన్ అయితే నీ పరిస్థితి ఏంటని మరి కొంతమంది కామెంట్లలో పెడుతున్నారు. ఈ వీడియో కేవలం వినోదం కోసమే కాకుండా నేటి తరం ఉద్యోగులు ఎదుర్కొంటున్న వ్యక్తిగత సమస్యలను కూడా ప్రతిబింబిస్తోందని కొంతమంది సోషల్ మీడియా వినియోగదారులు భావిస్తున్నారు. పండగ రోజుల్లో కూడా సెలవు దొరకకపోవడంతో ఉద్యోగులు ఇలాంటి వినూత్న మార్గాలను వెతుక్కుంటున్నారని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Devuni Kadapa Temple: తెలుగు వారి తొలి పండుగ ఉగాది అత్యంత వైభవంగా జరిగింది. తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఉగాది వేడుకలు అంబరాన్నంటుతున్నాయి. అయితే ఈ పండుగ సందర్భంగా వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని ముస్లిం భక్తులు దర్శించుకున్నారు. ఉగాది రోజు ప్రత్యేకంగా శ్రీవారి ఆలయాన్ని సందర్శించడం విశేషం. ఏపీలోని కడప జిల్లాలో ప్రతి ఉగాదికి ప్రత్యేకంగా నిలుస్తున్న ఈ సన్నివేశం శుక్రవారం జరిగింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Also Read: Telangana CM Gift: ఉగాది పండుగ కానుక ప్రకటించిన తెలంగాణ సీఎం.. రైతులకు అదిరిపోయే వార్త
ఉగాది పండుగ రోజు ప్రత్యేకంగా కడప జిల్లాలో మాత్రం ఈ పండుగ ఒక సరికొత్త ఆధ్యాత్మిక, సామాజిక సందేశాన్ని ఇస్తోంది. కులమతాలకు అతీతంగా.. దేవుడి కడప లక్ష్మీ వేంకటేశ్వర స్వామిని ముస్లిం సోదరులు దర్శించుకున్నారు. ఈ విధంగా ముస్లింలు దర్శించుకోవడం ఇక్కడ దశాబ్దాలుగా వస్తున్న ఆచారం. తమ ఇంటి అల్లుడిగా భావించే వేంకటేశ్వరుడికి ముస్లిం మహిళలు బుర్కాలు ధరించి భక్తితో మొక్కులు చెల్లించుకున్నారు.
దక్షిణ భారత దేశంలోనే అత్యంత ప్రసిద్ధి గాంచిన క్షేత్రం దేవుని కడప. తిరుమల వేంకటేశ్వర స్వామికి తొలి గడపగా ఈ క్షేత్రాన్ని పిలుస్తారు. ఉగాది పర్వదినం సందర్భంగా ఇక్కడ ఒక అద్భుతమైన దృశ్యం ఆవిష్కృతమైంది. వేకువజాము నుంచే ముస్లిం సోదరులు తమ కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి దర్శనానికి తరలివచ్చారు. హిందూ సోదరులతో కలిసి క్యూ లైన్లలో నిలబడి, ఏడుకొండల వాడిని భక్తితో దర్శించుకుంటున్నారు.
Also Read: Telangana CM: ఎవరూ అడ్డుపడ్డా అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తా: తెలంగాణ సీఎం
ముస్లింలు వేంకటేశ్వర స్వామిని తమ అల్లుడిగా (బీబీ నాంచారమ్మ భర్త) భావించి పూజించడం ఇక్కడి ప్రత్యేకత. ముఖ్యంగా ఉగాది రోజున కొత్త అల్లుడికి మర్యాదలు చేసినట్లుగా.. పండ్లు, పూలు, వేప పువ్వు ప్రసాదాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు. ఆలయ గడపకు హారతి ఇచ్చి, మొక్కులు చెల్లించుకోవడం ద్వారా ఏడాది పొడవునా సుఖసంతోషాలతో ఉంటామని వారు నమ్ముతారు. గంగా-జమున తహజీబ్‌కు ఈ దృశ్యం అద్దం పడుతోంది.
తిరుమలలో రద్దీ
తెలుగు నూతన సంవత్సరాది శ్రీ పరాభవనామ ఉగాది పండగను పురస్కరించుకుని తిరుమల శ్రీవారి ఆలయం కొత్త శోభను సంతరించుకుంది. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వర స్వామి వారి ఆలయం ని ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో రంగు రంగుల పుష్పాలతో అలంకరించింది. మామిడికాయలతో తోరణాలు, పూలతో ఏనుగులు, అరటి, కొబ్బరి కాయలతో అలంకరణ చేశారు. ఆధ్యాత్మిక సెట్టింగ్ భక్తులను ఆకట్టుకుంటున్నాయి. స్వామి దర్శనం చేసుకొని అలంకరణలు చూసి మురిసిపోతున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook