గడ్డిఅన్నారం: సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి
Hyderabad, Telangana:సీజనల్ వ్యాధుల పట్ల డివిజన్ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని గడ్డిఅన్నారం డివిజన్ బీజేపీ కార్పొరేటర్ బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి సూచించారు. సోమవారం డివిజన్ పరిధిలోని కోదండరాం నగర్ లో జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరు ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, చెత్తాచెదారం ఆరుబయట వేయద్దని, దోమల నివారణకు చర్యలు తీసుకోవాలని సూచించారు. లక్షణాలు ఉంటే పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
Independence Day: స్వాతంత్య్ర వేడుకల్లో తళతళ మెరుస్తున్న తెలంగాణ సచివాలయం
Hyderabad, Telangana:Light Decoration To Telangana Secretariat For Independence Day 2026 Watch VisualsKCR Wishes: తెలంగాణ ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన తొలి సీఎం కేసీఆర్
Baddipadaga, Telangana:80th Independence Day: స్వాతంత్య్ర వేడుకలకు తెలంగాణలో భారీ స్థాయిలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. వాడవాడలా స్వాతంత్య్ర వేడుకలు జరగనుండగా రాష్ట్రస్థాయిలో గోల్కొండలో సంబరాలు జరగనున్నాయి. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఓ ప్రకటన విడుదల చేశారు.
రాష్ట్ర ప్రజలకు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ 80వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపినట్లు బీఆర్ఎస్ పార్టీ తెలిపింది. 'పరాయి వలస పాలనను పారదోలి 1947 ఆగస్టు 15న భారతదేశం స్వయంపాలనను సాధించుకుంది. నిస్వార్థ పోరాట స్ఫూర్తి, దార్శనిక నాయకత్వం, త్యాగంతో కూడిన ప్రజల భాగస్వామ్యమే దేశానికి స్వాతంత్య్రాన్ని అందించాయి' అని మాజీ సీఎం కేసీఆర్ గుర్తుచేసుకున్నారు.
'79 వసంతాలు పూర్తి చేసుకుని 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని చేసుకుంటున్న ఈ శుభసందర్భంలో దేశ సామాజిక న్యాయం, ఆర్థిక ప్రగతిని ప్రతి ఒక్కరూ పునశ్చరణ చేసుకోవాలి' అని గులాబీ బాస్ కేసీఆర్ తెలిపారు. ఫెడరల్ పాలనా విధానం, సెక్యులర్ స్ఫూర్తితో ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా భారతదేశం మరింత ముందుకు సాగేందుకు ఇంకా చేరుకోవాల్సిన లక్ష్యాలను గుర్తించాల్సిన అవసరం ఉందని మాజీ సీఎం కేసీఆర్ గుర్తుచేశారు. భవిష్యత్తులో దేశ పాలనలో భాగస్వామ్యం కానున్న నేటితరం మరింత జ్ఞానం, సహనం, దార్శనికతతో ముందడుగు వేసినప్పుడే స్వాతంత్య్ర ఉద్యమ త్యాగాల ఫలాలు ప్రతి గడపకు చేరుతాయని తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.
అంత్యక్రియలకు హాజరు
తన కుటుంబంలో చోటుచేసుకున్న విషాద సంఘటనతో కేసీఆర్ స్వాతంత్య్ర వేడుకలకు దూరంగా ఉండే అవకాశం ఉంది. తన సతీమణి శోభమ్మ సోదరుడు, కేసీఆర్ బామ్మర్ది మృతిచెందడంతో కల్వకుంట్ల కుటుంబం మొత్తం విషాదంలో మునిగింది. బావమరిది అంత్యక్రియల్లో బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ పాల్గొని ఆఖరి నివాళి అర్పించారు. అంతకుముందు మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం కుటుంబాన్న ఓదార్చారు. ఇక తన సోదరుడు మృతిచెందడాన్ని కేసీఆర్ భార్య శోభమ్మ తట్టుకోలేకపోతున్నారు. సోదరుడి మృతదేహం చూసిన అనంతరం శోభమ్మ తీవ్ర కన్నీటి పర్యంతమయ్యారు. కంటతడి పెట్టడంతో కేసీఆర్ ఆమెను ఓదార్చారు.
Independence Day: తెలంగాణలో ఏ జిల్లాల్లో ఎవరు జెండా ఎగురవేస్తారు? పూర్తి జాబితా ఇదే!
Baddipadaga, Telangana:Telangana Independence Day: స్వాతంత్య్ర వేడుకలకు తెలంగాణలో అన్నీ ఏర్పాట్లు పూర్తయ్యాయి. రాజధాని హైదరాబాద్‌లో దేశభక్తిని చాటేలా అన్నీ ప్రభుత్వ కార్యాలయాలు విద్యుద్దీపాల వెలుగులో కాంతులీనుతున్నాయి. స్వాత్యంత్ర వేడుకల్లో ఏయే జిల్లాల్లో ఎవరు జెండా ఎగురవేయనున్నారనేది తెలంగాణ ప్రభుత్వం జాబితా విడుదల చేసింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు జాతీయ జెండాను ఆవిష్కరిస్తారని ప్రభుత్వం వెల్లడించింది.
80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా 32 జిల్లాల్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్న మంత్రులు, ప్రజాప్రతినిధులు జెండా వందనం చేయనున్నారు. రాష్ట్రస్థాయిలో రాజధాని హైదరాబాద్‌లో జరగనున్న స్వాతంత్య్ర వేడుకల్లో ముఖ్యమంత్రి పాల్గొననున్నారు. గోల్కొండ కోటలో ముఖ్యమంత్రి జెండాను ఆవిష్కరించనున్నారు. ఉదయం 10:00 గంటలకు ముఖ్యమంత్రి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి కీలక ప్రసంగం చేయనున్నారు.
స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ, దేశభక్తి, ప్రజాస్వామ్య విలువలను ప్రతిబింబించేలా రాష్ట్రవ్యాప్తంగా వేడుకలు నిర్వహించాలని ప్రభుత్వం అధికార యంత్రాంగానికి ఇప్పటికే మార్గదర్శకాలు విడుదల చేసిన విషయం తెలిసిందే. రాష్ట్రంలోని 32 జిల్లా కేంద్రాల్లో ఉదయం 9:30 గంటలకు మంత్రులు, ప్రభుత్వ విప్‌లు, శాసనసభ/శాసనమండలి సభ్యులు, ప్రభుత్వ సలహాదారులు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి గౌరవ వందనం స్వీకరించనున్నారు.
జిల్లా.. జెండా ఆవిష్కరించే మంత్రులు, ప్రజాప్రతినిధులు
ఆదిలాబాద్ – ప్రభుత్వ సలహాదారు మహ్మద్ అలీ షబ్బీర్
భద్రాద్రి కొత్తగూడెం – మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
హనుమకొండ – మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
జగిత్యాల – మంత్రి మహ్మద్ అజహరుద్దీన్
జయశంకర్ భూపాలపల్లి – ప్రభుత్వ విప్ యెన్నం శ్రీనివాస్ రెడ్డి
జనగామ – ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య
జోగులాంబ గద్వాల – ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి ఏపీ జితేందర్ రెడ్డి
కామారెడ్డి – ప్రభుత్వ సలహాదారు వి. హనుమంతరావు
కరీంనగర్ – మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్
ఖమ్మం – ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క
కుమురంభీం ఆసిఫాబాద్ – శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాశ్
మహబూబాబాద్ – ప్రభుత్వ విప్ జె. రాంచందర్ నాయక్
మహబూబ్‌నగర్ – మంత్రి జూపల్లి కృష్ణారావు
మంచిర్యాల – ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్ రావు
మెదక్ – మంత్రి వివేక్ వెంకటస్వామి
మెద్చల్ – ప్రభుత్వ సలహాదారు కె. కేశవరావు
ములుగు – మంత్రి దనసరి అనసూయ సీతక్క
నాగర్‌కర్నూల్ – ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ జి. చిన్నారెడ్డి
నల్గొండ – మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి
నారాయణపేట – మంత్రి వాకిటి శ్రీహరి
నిర్మల్ – ప్రభుత్వ విప్ వెముల వీరేశం
నిజామాబాద్ – ప్రభుత్వ సలహాదారు పి. సుదర్శన్ రెడ్డి
పెద్దపల్లి – ప్రభుత్వ విప్ చింతకుంట విజయ రమణారావు
రాజన్న సిరిసిల్ల – ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
రంగారెడ్డి – మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు
సంగారెడ్డి – మంత్రి దామోదర రాజనర్సింహ
సిద్దిపేట – మంత్రి పొన్నం ప్రభాకర్
సూర్యాపేట – మంత్రి నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి
వికారాబాద్ – శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్
వనపర్తి – శాసనమండలి చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి
వరంగల్ – మంత్రి కొండా సురేఖ
యాదాద్రి భువనగిరి – శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి
Independence Day: రేపు ఏపీలో స్వాతంత్య్ర వేడుకల్లో జెండా ఎగురవేసే మంత్రులు వీరే..
Nuzendla, Andhra Pradesh:80th Independence Day: స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లో గొందు గొందులో భారతదేశ గీతాలు వినిపించనున్నాయి. స్వాతంత్య్ర వేడుకలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. శనివారం జరగనున్న 80వ స్వాతంత్య్ర వేడుకలకు ఆంధ్రప్రదేశ్ ముస్తాబైంది. ప్రతి గల్లీలో.. ప్రతి ఊరిలో.. ప్రతి జిల్లాలో జరగనున్న వేడుకలకు ఏపీ ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసింది. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా అధికారికంగా ఆయా జిల్లాల్లో మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు జాతీయ జెండాను ఎగురవేయనున్నారు.
రాష్ట్రస్థాయి స్వాతంత్య్ర వేడుకలకు సంబంధించిన వివరాలను ఏపీ ప్రభుత్వం వెల్లడించింది. స్వాతంత్య్ర దినోత్సవ కార్యక్రమానికి మంత్రుల నియామకం చేపట్టింది. ఆగస్టు 15న అమరావతిలో రాష్ట్రస్థాయి స్వాతంత్య్ర వేడుకలు జరగనుండగా.. ఉదయం 8.30 గంటలకు అమరావతిలోని పరేడ్‌లో సీఎం చంద్రబాబు పోలీసుల గౌరవ వందనం స్వీకరించనున్నారు. అనంతరం జాతీయ జెండా ఎగురవేయనున్నారు. ఇక డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కాకినాడలో జాతీయ పతాకం ఆవిష్కరించనున్నారు.
జిల్లాల వారీగా మంత్రుల జెండావందనం
- ఎన్టీఆర్ జిల్లాలో జాతీయ పతాకం ఆవిష్కరించనున్న మంత్రి నారా లోకేశ్
- శ్రీకాకుళంలో జెండా ఎగరేయనున్న మంత్రి అచ్చెన్నాయుడు
- కృష్ణా జిల్లాలో జాతీయ పతాకం ఆవిష్కరించనున్న మంత్రి కొల్లు రవీంద్ర
- పల్నాడులో జాతీయ పతాకం ఆవిష్కరించనున్న మంత్రి నాదెండ్ల మనోహర్
- నెల్లూరులో మంత్రి పొంగూరు నారాయణ
- అనకాపల్లిలో మంత్రి వంగలపూడి అనిత
- చిత్తూరులో మంత్రి సత్యకుమార్ యాదవ్
- పశ్చిమగోదావరిలో మంత్రి నిమ్మల రామానాయుడు
- విశాఖపట్నంలో మంత్రి అనగాని సత్యప్రసాద్
- తిరుపతిలో మంత్రి ఆనం రామనారాయణరెడ్డి
- అనంతపురంలో మంత్రి పయ్యావుల కేశవ్
- కర్నూలులో జెండా ఆవిష్కరించనున్న మంత్రి టీజీ భరత్
- కడపలో మంత్రి NMD మహమ్మద్ ఫరూక్
- ఏలూరులో మంత్రి కొలుసు పార్థసారథి
- ప్రకాశంలో మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి
- బాపట్లలో మంత్రి గొట్టిపాటి రవికుమార్
- తూర్పుగోదావరిలో మంత్రి కందుల దుర్గేష్
- పార్వతీపురం మన్యంలో మంత్రి గుమ్మిడి సంధ్యారాణి
- నంద్యాలలో మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి
- శ్రీసత్యసాయి జిల్లాలో మంత్రి ఎస్.సవిత
- డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమలో మంత్రి వాసంశెట్టి సుభాష్
- విజయనగరంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్
- అన్నమయ్య జిల్లాలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి
- అల్లూరి సీతారామరాజు, పోలవరం, మార్కాపురం జిల్లాల్లో జాతీయ పతాకం ఆయా జిల్లాల కలెక్టర్లు ఆవిష్కరించనున్నారు.
Teacher Hair: టీచరమ్మకు పనోళ్లుగా విద్యార్థి.. జడ వేయించుకున్న టీచర్
Kesamudram, Telangana:Teacher Ties Her Hair Braided With A SSC Student In KGBV Hostel Watch Viral VideoIndependence Day: విద్యుద్దీపాల కాంతుల్లో ఏపీ అసెంబ్లీ జిగేల్ జిగేల్
Amaravati, Andhra Pradesh:AP Assembly Building Illuminated Visuals For 80th Independence Day Celebrations Watch VisualsIndependence Day: విద్యుద్దీపాల వెలుగుల్లో ఏపీ సెక్రటేరియట్ జిగేల్
Velgapudi, Andhra Pradesh:AP Secretariat Building Colorful Lightings For 80th Independence Day Celebrations Watch Visualsబెస్ట్ స్వాతంత్ర దినోత్సవ వీడియో విషెస్..
Hyderabad, Telangana:80వ స్వాతంత్య్ర దినోత్సవ గ్రీటింగ్స్..
Hyderabad, Telangana:Happy 80th Independence Day: మత, భాష, సాంస్కృతులలో ఎన్నో వైవిధ్యాలు ఉన్నప్పటికీ.. భారతీయులమంతా ఒక్కటే అని ఐకమత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పే పండగ ఇది.. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా భారతదేశం విజయవంతంగా కొనసాగుతోందని ఈ వేడుకలే ప్రత్యక్ష నిదర్శనం.. కాబట్టి ఇలా స్వాతంత్ర వేడుకలు ఎల్లప్పుడూ కులమత భేదం లేకుండా అందరూ కలిసికట్టుగా జరుపుకోవాలని కోరుకుంటూ.. దేశభక్తిని పెంపొందించడానికి సోషల్ మీడియా ద్వారా మీ మిత్రులకు, శ్రేయోభిలాషులకు ఇలా 80 వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు, గ్రీటింగ్స్ ను పంపండి..
అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ.. స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు!
Hyderabad, Telangana:Happy 80th Independence Day Telugu: స్వేచ్ఛ వాయువుల కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడిన అమరవీరుల త్యాగాలను గుండెల్లో గుడిగా మలుచుకోవలసిన అవసరం ఎంతగానో ఉంది.. 80 ఏళ్ల స్వేచ్ఛ ప్రస్థానంలో సాధించిన విజయాలను స్మరించుకుంటూ.. నవభారత నిర్మాణానికి పునరంకితమవుదాం.. ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకల రోజున.. ప్రతి ఒక్కరి గుండెల్లో దేశభక్తిని నింపేందుకు ఈ శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి పంపండి..Independence Day 2026: 80వ స్వాతంత్ర్య దినోత్సవానికి ఆంధ్రప్రదేశ్‌లో ఘనంగా ఏర్పాట్లు..
Nunna, Vijayawada, Andhra Pradesh:80th Independence Day 2026: మరికొన్ని గంటల్లో దేశవ్యాప్తంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరగనున్నాయి. ఆగస్టు 15న ఢిల్లీలోని ఎర్రకోటపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మువ్వన్నెల జెండాను ఎగురవేస్తారు. అలాగే ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం ఘనంగా ఏర్పాట్లు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకొనేందుకు ఏర్పాట్లు చేశారు.Karur Stampede Govt Job: కరూర్ తొక్కిసలాట బాధితులకు సుప్రీంకోర్టులో ఊరట..ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడం పట్ల హర్షం!
Karur, Tamil Nadu:Karur Stampede Govt Job News: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ముందు ఆ రాష్ట్రంలో జరిగిన కరూర్ తొక్కిసలాట యావత్ దేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది. అయితే ఇటీవలే ఆ తొక్కిసలాటలో మరణించిన వారి కుటుంబాలను తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ సమావేశం అయ్యారు. ఈ విషాదాన్ని మానని గాయంగా అభివర్ణించిన ఆయన..బాధితుల కుటుంబాలకు శాశ్వత ఉద్యోగాలు కల్పించే ప్రక్రియను మద్రాసు హైకోర్టు పర్యవేక్షణలో జరుగుతుందని ఆయన తెలిపారు. అయితే ఇదే విషయాన్ని దేశంలోని అత్యున్నత ధర్మాసనం సుముఖత వ్యక్తం చేసింది. తొక్కిసలాటలో చనిపోయిన కుటుంబాల్లో ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించడం పట్ల తప్పేమి లేదని అభిప్రాయపడింది.'డెడ్ డ్రాప్' కేసులో సంచలన విషయాలు.. అమ్మాయిలపై లైంగిక దాడి, సొంతంగా అబార్షన్
Hyderabad, Telangana:Dead Drop Marijuana Case: గంజాయి మత్తులో ఘోరాలకు పాల్పడుతున్న ముఠాను ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేశారు. డెడ్ డ్రాప్ విధానంలో గంజాయి విక్రయిస్తూ.. పోలీసులు దాడి చేస్తే వారిపై ఓ కుక్కతోపాటు తుపాకీతో ఎదురుదాడి చేసేందుకు పక్కా ప్లాన్ వేసుకున్నారు. అయితే హైదరాబాద్ పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి బాలానగర్‌లో ఆన్లైన్ పద్ధతిలో ఆరేళ్ల నుంచి గంజాయి విక్రయిస్తున్న ముఠాను అరెస్ట్ చేశారు. బొల్లా బ్రదర్స్ ఈ గంజాయి దందా చేస్తున్నారు. విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ముఖ్యంగా బొల్లా కిరణ్ దారుణాలకు పాల్పడ్డాడని తెలిసింది. అమ్మాయిలతో కూడా అతడు వ్యాపారాలు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
డెడ్ డ్రాప్ గంజాయి కేసులో వెలుగులోకి సంచలన విషయాలు బయటకు వచ్చాయి. రోజుకు డెడ్ డ్రాప్ ద్వారా 25 సార్లు గంజాయిని బొల్లా బ్రదర్స్ విక్రయిస్తున్నారు. గంజాయి ముఠా బొల్లా బ్రదర్స్‌తో ఐదు మంది కానిస్టేబుల్స్, ఎస్ఐతో ప్రయివేటు పార్టీలు ఈ ముఠా చేసుకుంది. కేసుల్లో నిందితులను పట్టుకొని రావడానికి కారును బొల్లా బ్రదర్స్ సప్లై చేసినట్లు గుర్తించారు. అరెస్ట్ అయిన బొల్లా బ్రదర్స్ ఇంట్లోనే పోలీసులతో కలిసి పార్టీలు చేసుకున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.
ఇక కృష్ణవేణి అనే మహిళతో వివాహేతర సంబంధం ఏర్పరచుకుని ఈ గంజాయి దందా చేస్తోందని పోలీసులు నిర్ధారించారు. అంతేకాకుండా కృష్ణవేణికి అబార్షన్ అయ్యేలా బొల్లా కిరణ్ అనైతికంగా ప్రవర్తించాడు. ఈ కేసులో నిందితులతో కలిసి పార్టీలు చేసుకున్న ఎస్సైను పోలీస్ శాఖ హెడ్ క్వాటర్స్‌కు అటాచ్ చేసింది. ఒరిస్సా నుంచి 31 మంది రోజు బొల్లా బ్రదర్స్‌కి గంజాయి సరఫరా చేస్తున్నట్లు విచారణలో తెలిసింది.
మొత్తం 203 కస్టమర్లకి డెడ్ డ్రాప్ ద్వారా బొల్లా బ్రదర్స్ గంజాయి సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు. అంతేకాకుండా గంజాయి విక్రయాలతో వచ్చిన డబ్బులతో అమ్మాయిలపై బొల్లా కిరణ్ పెట్టుబడి పెట్టాడు. వరంగల్‌లోని మారుమూల ప్రాంతాల నుంచి మైనర్ అమ్మాయిలను హైదరాబాద్ తీసుకొచ్చి వారిపై లైంగిక దాడులకు పాల్పడుతున్నాడు. వారు గర్భం దాలిస్తే సొంతంగా అబార్షన్ చేయించిన ఉదంతం వెలుగులోకి వచ్చింది.
గర్భం దాల్చిన అమ్మాయిలపై బొల్లా కిరణ్ దాడులకు తెగబడ్డాడు. గర్భం దాల్చిన అమ్మాయి కడుపులపై దాడులు చేసి అబార్షన్ అయ్యేలా క్రూరంగా బొల్లా కిరణ్ వ్యవహరించాడు. ఆసుపత్రికి తీసుకెళ్లకుండా సొంతంగా అమ్మాయిలకు అబార్షన్ చేయడం తీవ్ర సంచలనం రేపుతోంది. డబ్బులకు ఆశపడి కిరణ్ అఘాయిత్యాలను బాధిత అమ్మాయిలు బయటకు చెప్పలేదు. అమ్మాయిల పేరుతో సిమ్‌లు తీసుకుని ఆ నంబర్లతో గంజాయి దందాకు వాడుతున్నాడు.
ఒక మహిళ ఖాతాలో లక్షల రూపాయల లావాదేవీలు అధికారులు గుర్తించారు. అమ్మాయిల తల్లిదండ్రులను కూడా ట్రాప్ చేసి తన దగ్గర పెట్టుకోవడం గమనార్హం. పోలీసులపై దాడులు చేసేందుకు ఏకంగా రెండు కుక్కల్ని బొల్లా కిరణ్ పెంచాడు. పోలీసులను బెదిరించడానికి ఒక తుపాకీ కూడా ఉంది. ఆరు సంవత్సరాల నుంచి డెడ్ డ్రాప్ ద్వారా బొల్లా కిరణ్ గంజాయి విక్రయాలు చేస్తున్నాడు. అతడికి కస్టమర్లుగా విద్యార్థులు, వ్యాపారవేత్తలు ఉన్నారు. బొల్లా కిరణ్ కేబుల్ ఆపరేటర్‌గా పని చేస్తూ డ్రగ్స్ దందా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
Uber Rapido Merger: ఉబర్-ర్యాపిడో విలీన చర్చలపై అర్ధాంతర బ్రేక్..మేనేజ్మెంట్ విభేదాలే కారణమా?
Hyderabad, Telangana:Uber Rapido Deal: అమెరికాకు చెందిన ప్రముఖ రైడ్ హెయిలింగ్ సంస్థ ఉబర్, భారతీయ స్టార్టప్ రాపిడోతో కలిసి పనిచేసేందుకు జరిపిన చర్చలు అర్ధాంతరంగా నిలిచిపోయాయి. దేశీయంగా తమ కార్యకలాపాలను విలీనం చేసుకునే దిశగా అడుగులు వేసినప్పటికీ, యాజమాన్య నియంత్రణ విషయంలో ఇరు సంస్థల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఈ డీల్‌కు బ్రేక్ పడింది.
చర్చల వెనుక అసలు కథ
ఉబర్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ దారా ఖోస్రోషాహి ఈ ఏడాది మే నెలలో ఐదు రోజుల పాటు భారత్‌లో పర్యటించారు. దేశంలో పెట్టుబడులు, వ్యాపార విస్తరణ ప్రణాళికలపై ఆయన వరుస సమీక్షలు జరిపారు. ఈ క్రమంలోనే రాపిడోతో విలీనం అంశం తెరపైకి వచ్చింది.
ఉబర్ ప్రతిపాదన ఏమిటంటే?
క్యాబ్, ఆటో, బైక్ ట్యాక్సీ సేవలందిస్తున్న ఇరు సంస్థలు కలిసి పనిచేయాలని ఉబర్ తొలుత ప్రతిపాదించింది. అంతేకాకుండా, దేశీయంగా తమ కార్యకలాపాలన్నింటినీ రాపిడో బృందమే నిర్వహించాలని సూచించింది.
అయితే, రాపిడో మాత్రం అందుకు భిన్నమైన ప్రతిపాదనను ముందుకు తెచ్చింది. ఉబర్ భారత వ్యాపారాన్ని పూర్తిగా తమకు క్యాష్-స్టాక్ లావాదేవీ రూపంలో విక్రయించాలని, రాపిడోలో ఉబర్ కేవలం మైనారిటీ వాటాదారుగా మాత్రమే ఉండాలని కోరింది.
డీల్‌కు ఎందుకు బ్రేక్ పడింది?
భారత్‌లో తమ వ్యాపారాన్ని పూర్తిగా వేరే సంస్థకు విక్రయించడం ఇష్టం లేని ఉబర్.. రాపిడో ప్రతిపాదనను తిరస్కరించింది. మేనేజ్మెంట్ కంట్రోల్ తమ చేతుల్లోనే ఉండాలని ఉబర్ భావించగా, రాపిడో పూర్తి స్థాయి యాజమాన్యాన్ని కోరడంతో ఈ చర్చలు అర్ధాంతరంగా ఆగిపోయాయి.
ప్రస్తుతం ఈ రెండు కంపెనీలు ఎవరికి వారుగా స్వతంత్రంగానే తమ కార్యకలాపాలను కొనసాగిస్తున్నాయి. రాపిడోకు గట్టి పోటీనిచ్చేందుకు ఉబర్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగానే తన బైక్ ట్యాక్సీ సేవలను కొత్తగా మరో 100 నగరాలకు విస్తరించగా, ప్రస్తుతం దేశవ్యాప్తంగా మొత్తం 220 నగరాల్లో ఉబర్ బైక్ ట్యాక్సీ సేవలు అందుబాటులోకి వచ్చాయి.
Also Read: ఆగస్టు 15న వినియోగదారులకు స్పెషల్ ఆఫర్.. రూ.1 రీఛార్జ్ ఫ్రీడమ్ ప్లాన్ మళ్లీ వచ్చింది
Also Read: ఈవీ వాహనాలు కొనుగోలు చేసేవారికి గుడ్‌న్యూస్..పీఎం ఈ-డ్రైవ్ పథకంతో రూ.5,000 డిస్కౌంట్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Teacher Hair: విద్యార్థితో దర్జాగా జడ వేయించుకున్న ఇంగ్లీష్ టీచరమ్మ.. వీడియో వైరల్
Kesamudram, Telangana:KGBV Teacher Hair Video: విద్యార్థినులకు విద్యాబుద్ధులు నేర్పి భావి భారత పౌరులుగా తీర్చిదిద్దవలసిన ఉపాధ్యాయులు తమ సొంత పనులు చేపించుకోవడం తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది. తరగతి గదిలో పాఠాలు చెప్పాల్సిన టీచరమ్మ విద్యార్థులతో జుట్టు వేయించుకోవడం తీవ్ర దుమారం రేపుతోంది. కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయంలో ఓ ఉపాధ్యాయురాలు ఓ విద్యార్థిని తో జడలు వేయించుకున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అంతేకాకుండా మిగతా విద్యార్థులతో దురుసుగా ప్రవర్తించారు. మరికొందరు విద్యార్థులతో గుంజీలు తీయించారు. ఈ సంఘటన తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం మహమూద్‌పట్నం శివారులో కస్తూర్బా గాంధీ బాలికల గురుకుల విద్యాలయం ఉంది. ఇక్కడ ఇంగ్లీష్ ఉపాధ్యాయురాలు అర్చన ఉన్నారు. ఆమె పాఠశాలలోని 10వ తరగతి విద్యార్థినితో జడలు వేయించుకున్నారు. ఆ దృశ్యాలు ఎవరో ఫోన్లో చిత్రీకరించారు. అంతేకాకుండా మరో విద్యార్థి కూర్చుని ఉండగా ఏమైంది? అంటూ దురుసుగా ప్రవర్తించారు. 20 గుంజీలు తీయించారు అని ఆ విద్యార్థి ఆవేదన వ్యక్తం చేసింది. అయితే ఆమె మాత్రం విద్యార్థినితో దురుసుగా మాట్లాడారు. ఈ వీడియో బయటకు రావడంతో వైరల్‌గా మారింది.
టీచర్ చేసిన పనికి విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చదువు చెప్పాల్సిన ఆమె ఇలా తన సొంత పనులు చేయించుకోవడాన్ని అందరూ తప్పుబడుతున్నారు. ఇది ఇల్లా లేక ఆ పిల్లలు పనిమనుషులా అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఆమె వ్యవహార శైలి ఎప్పుడూ ఇలానే ఉంటుందని.. విద్యార్థులను వేధింపులకు గురి చేస్తోందని పలువురు విద్యార్థులు ఆరోపిస్తున్నారు. వెంటనే ఇంగ్లీష్ టీచర్ అర్చనను సస్పెండ్ చేయాలని కేజీబీవీలోని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.
కాగా కేజీబీవీలో మరికొందరు పాఠశాల ఉపాధ్యాయులు, హాస్టల్ వార్డెన్ తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. సరైన ఆహారం పెట్టడం లేదని.. తమ గురుకులంలో మౌలిక వసతులు కరువయ్యాయని విద్యార్థులు వాపోతున్నారు. కేజీబీవీపై ఉన్నత అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో ఇలా ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయ. వెంటనే కేజీబీవీ విద్యాలయాన్ని సందర్శించి ఉన్నత అధికారులు చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.
