గోశామహల్: మర్డర్లకు అడ్డగా పాతబస్తీ
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Singareni Scam: 'సింగరేణి కుంభకోణం సూత్రధారి రేవంత్ రెడ్డి.. పాత్రధారి ఆయన బావమరిది సృజన్ రెడ్డి. సాక్షాత్తు దొంగే రేవంత్ రెడ్డి అయినప్పుడు ఇక ఆయనతో మాట్లాడితే న్యాయం జరుగుతుందా?' అని బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి హరీశ్ రావు ప్రశ్నించారు. 'భట్టి విక్రమార్క ప్రెస్‌మీట్ ఉల్టా చోర్ కొత్వాల్ కో డాంటే అనే సామెతను తలపించింది. కుంభకోణాన్ని సమర్థించుకునేందుకు సంబంధం లేని కాగితాలతో మసిపూసి మారేడు కాయ చేశారు' అని తప్పుబట్టారు. 'సైనిక్ స్కూల్లో బట్టలు ఆరబెట్టే మిషన్ కోసం పెట్టిన నిబంధనను తెచ్చి రూ.వేల కోట్ల సింగరేణి ఓబీ కాంట్రాక్టులకు ముడిపెట్టడం హాస్యాస్పదం. ఇది ప్రజలను తప్పుదోవ పట్టించడమే' అని మాజీ మంత్రి హరీశ్ రావు స్పష్టం చేశారు.
Also Read: Municipal Elections: మున్సిపల్ యుద్ధానికి బీఆర్ఎస్ పార్టీ సిద్ధం.. కీలక ప్రక్రియ పూర్తి
సింగరేణి కుంభకోణంపై బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యాలయం తెలంగాణ భవన్లో మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు కీలక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. 'జనవరిలో సైట్ విజిట్ లేకుండా 7 శాతం తక్కువకు టెండర్లు ఖరారైతే మే నెలలో ఆ నిబంధన పెట్టి అంచనా రేట్ల కంటే ఎక్కువకు ఎందుకు కట్టబెట్టారు?' అని ప్రశ్నించారు. 'సింగరేణికి వచ్చిన రూ.6,900 కోట్ల లాభాలను దాచిపెట్టి కార్మికుల బోనస్‌లో కోత విధించారు. ఆ డబ్బును రేవంత్ రెడ్డి తన సోకులకు, ఢిల్లీకి కప్పం కట్టడానికి వాడుకుంటున్నారు' అని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు ఆరోపించారు.
Also Read: Janasena Party: తెలంగాణలో సంచలన పరిణామం.. సినీ నటుడు ఆర్కే సాగర్ కీలక ప్రకటన
'కాంగ్రెస్ పాలనలో జాబ్ క్యాలెండర్ లేదు కానీ.. రేవంత్ రెడ్డి కుంభకోణాల క్యాలెండర్ మాత్రం పక్కాగా అమలవుతోంది. ఈ మొత్తం కుంభకోణంపై తక్షణమే సిట్టింగ్ జడ్జి లేదా సీబీఐ విచారణ జరిపించాలి' అని మాజీ మంత్రి హరీశ్ రావు డిమాండ్ చేశారు. 'రేవంత్ రెడ్డి దొంగ, రేవంత్ రెడ్డి బావమరిది ఈ కుంభకోణంలో మొదటి లబ్ధిదారుడు. సాక్షాత్తు ముఖ్యమంత్రే ఈ అవినీతికి సూత్రధారి, పాత్రధారి అని మేం చెప్తుంటే... ఇంకా రేవంత్ రెడ్డితో మాట్లాడితే ఏం వస్తుంది?' అని ప్రశ్నించారు. బొగ్గు కుంభకోణంపై స్పష్టమైన సమాధానం ఇవ్వకుండా మాటల గారడీతో, నాలుగు కాగితాలు చూపి మసిపూసి మారేడు కాయ చేసే ప్రయత్నం భట్టి విక్రమార్క చేశారని మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శించారు. సైట్ విజిట్ సర్టిఫికెట్‌పై భట్టి విక్రమార్క అబద్ధాలను వండి వార్చారని తెలిపారు. 'సింగరేణి కాలరీస్ అనేది తెలంగాణ ప్రజల ఆస్తి. ఇది ఏ ఒక్క మంత్రికో, ప్రభుత్వానికో, కొద్దిమంది కాంట్రాక్టర్లకో చెందిన సంస్థ కాదు. సింగరేణిలో పారదర్శకత, పోటీ, న్యాయం అనే మౌలిక సూత్రాలతో నడుస్తున్నది. సింగరేణి టెండర్ ప్రక్రియను చూస్తే ఈ మూడు సూత్రాలకు మంగళం పాడారు అని స్పష్టమవుతున్నది' అని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ విధానాలన్నీ పక్కనపెట్టి అవసరమైన చోట వారి అనుకూలమైన విధానాలను మార్చుకున్నారని ఆరోపించారు.
Also Read: Govt Employees: ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం తీపి కబురు.. ఉత్తర్వులు జారీ!
'సింగరేణి కుంభకోణానికి ఎవరు బాధ్యులు? ఎంత నష్టం జరిగింది? లబ్ధి పొందిన వారు ఎవరు? ఈ మూడు కీలక ప్రశ్నల్లో ఒక్కదానికైనా భట్టి విక్రమార్క సమాధానం చెప్పకుండా దాటివేశారు' అని మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శించారు. 'సింగరేణి కుంభకోణంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్నది. రేవంత్ రెడ్డి, ఆయన బావమరిది బాగోతం బయటపడకుండా కాపాడే ప్రయత్నం భట్టి విక్రమార్క చేస్తున్నారు. రేవంత్ రెడ్డిని బొగ్గు కుంభకోణం నుంచి బయటపడేసేందుకు విఫల ప్రయత్నాలు చేస్తున్నారు. తమ అనుయాయులకు టెండర్లు దక్కేలా విధానాలు మార్చారు' అని ఆరోపించారు.
'2025 మే తర్వాత ఓబీ రిమూవల్ కాంట్రాక్టర్లకు ఏ టెండర్ వచ్చినా.. సైట్ విజిట్ సర్టిఫికెట్ ఎవరికి ఇవ్వాలన్నా ఈయనే రింగ్ మాస్టర్ సృజన్ రెడ్డి. ఇంత స్పష్టంగా నేను బయటపెట్టినా కూడా కుంభకోణం జరగలేదని భట్టి గారు బుకాయించడం శోచనీయం. ఒక నైని గోల్డ్ బ్లాక్ టెండర్ రద్దు చేయడమే కాదు సైట్ విజిట్ సర్టిఫికెట్ తో ఖరారైన టెండర్లన్నీ రద్దు చేయాలి' అని మాజీ మంత్రి హరీశ్ రావు డిమాండ్ చేశారు. 'సైట్ విజిట్ సర్టిఫికెట్ అనేది లోపభూయిష్టమైనది. ఇందులో అవినీతి జరుగుతున్నదని స్పష్టంగా ప్రజలకు అర్థమైంది. మీకు పారదర్శకత్వం ఉంటే, నిజాయితీ ఉంటే సైట్ విజిట్ సర్టిఫికెట్ మీద జరిగిన ఓబీ వర్క్స్, సోలార్ పవర్ ప్లాంట్స్, మిగతా అన్ని టెండర్లను క్యాన్సిల్ చేయాలి' అని కాంగ్రెస్ ప్రభుత్వానికి హరీశ్ రావు సవాల్ చేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
.Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Three-headed Cobra Video Watch Here: ప్రకృతిలో మనకు తెలియని వింతలు ఎన్నో జరుగుతూ ఉంటాయి. కొన్నిసార్లు జన్యుపరమైన లోపాల వల్ల వింత ఆకృతులతో జంతువులు, వివిధ జీవులు జన్మిస్తూ ఉంటాయి. ఇలాంటివి చాలా అరుదుగా మాత్రమే కనిపిస్తూ ఉంటాయి. తాజాగా సోషల్ మీడియాలో జన్యు లోపం వల్ల జన్మించిన పాము కు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. ఈ వీడియోను అత్యంత ప్రమాదకరమైన నాగుపాము కు మూడు తలలు ఉండడం మీరు చూడొచ్చు. అయితే ఈ వీడియోలో కనిపిస్తున్న పాముకు మూడు తలలు ఉన్నాయో లేదో కానీ.. వీడియోలో మాత్రం ఒకేచోట మూడు పాముల తలలు దగ్గర దగ్గరగా ఉన్నట్లు కనిపిస్తోంది. అయితే, ఈ వీడియోకు సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకుందాం.
మూడు తలల పాములు చాలా అరుదుగా కేవలం మనం సినిమాల్లో మాత్రమే చూస్తూ ఉంటాం. కానీ ఇప్పుడు యూట్యూబ్ షార్ట్ వీడియోలో వైరల్ అవుతూ వస్తుంది. ఈ వీడియోలో అత్యంత ప్రమాదకరమైన మూడు తలల నాగు ఓ గోడలోని చిన్న గూటిలో ఉండడం మీరు చూడొచ్చు. అసలు ఈ వీడియోలో ఏం జరిగింది? సాధారణంగా మనం పాముకు కేవలం ఒకతల మాత్రమే చూస్తూ ఉంటాం.. అరుదుగా అప్పుడప్పుడు రెండు తలలకు సంబంధించిన పాములు చూస్తుంటాం.. కానీ ఈ వీడియోలో ఏకంగా మూడు తలలు కలిగిన నాగుపాము కనిపించడం విశేషం.
ఈ వీడియోను ఓ ఛానల్ నుంచి షార్ట్ వీడియో రూపంలో పోస్ట్ చేశారు. ఈ దృశ్యాలు చూస్తుంటే.. ఏదో పాత కట్టడం లేదా పురాతన గోడల్లో ఓ చిన్న గూటిలో జరిగినట్లు తెలుస్తోంది. అయితే, ఈ వీడియోలో కనిపిస్తున్న పాము మూడు పడగలను విప్పి ఉండడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఆ గోడ రంద్రం నుంచి మూడు తలలు కలిగిన పాము బయటికి వచ్చేందుకు ప్రయత్నించడం మీరు కళ్ల కట్టినట్లు చూడొచ్చు. ఈ దృశ్యాలు చూసిన చాలా మంది సోషల్ మీడియా వినియోగదారుడు కంగు తింటున్నారు..
నిజమా? గ్రాఫిక్సా?
ఈ వీడియో చూస్తుంటే ఇవి అత్యంత సహజంగా జరిగిన దృశ్యాలుగా అనిపిస్తుంది. పాము కదలిక, అది ముసలి కొట్టే విధానం ఆశ్చర్యపరిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, ఇది నిజంగానే మూడు తలల పామా లేక.. ఓకే గూటిలో లేక మూడు తలలు ఉన్నాయా అన్న సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి.. ఈ వీడియో టైటిల్ లో మాత్రం పోస్ట్ చేసే క్రమంలో మూడు తలలో పాము భూమి లోపల నుంచి వచ్చిందని క్యాప్షన్ పెట్టారు.. కానీ పర్టికులర్‌గా గమనించి చూస్తే.. గూటిలోనే మూడు పాములు ఉన్నాయని.. బయటికి మూడు తలల పాముల కనిపించడం మీరు చూడొచ్చు.
ప్రస్తుతం చాలామంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీని వాడుకొని ఇలానే మూడు తలలతో పాటు ఆరు, ఎనిమిది తలలు కలిగిన పాములను క్రియేట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఇప్పుడు వైరల్ అవుతున్న వీడియో కూడా అలాంటిదే అనుకున్నారు. కానీ క్లియర్‌గా చూస్తే.. ఒకే గూటిలో మూడు పాములు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ వీడియోను నిజమని కొంత నమ్మిన కొంతమంది సోషల్ మీడియా వినియోగదారులు.. వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ఈ పాము నిజంగా అద్భుతంగా ఉందని.. ఇలాంటి మూడు తలలు కలిగిన పామును ఇప్పుడే చూస్తున్నట్లు కామెంట్లలో రాసుకొస్తున్నారు.
Also Read: Giant Cobra Video: కిచెన్‌లో ఫ్రిజ్ వెనుక భారీ నాగుపాము.. సంచలనం సృష్టిస్తున్న వీడియో..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Giant King Cobras Vs Mongoose Video: ప్రకృతిలో జరిగే అత్యంత ఆసక్తి కలిగించే విషయాల్లో వన్యప్రాణులు దాడి చేసుకోవడం. ముఖ్యంగా పాము ముంగిసలు దాడి చేసుకోవడం సర్వసాధారణమే.. ఇవి ఒకదానికొకటి బద్ధ శత్రువులుగా చెప్పుకుంటారు. అందుకే ఎక్కడ కనిపించినా తప్పకుండా.. అవి దాడి చేసుకుంటూనే ఉంటాయి. ఇలా అప్పుడప్పుడు దాడి చేసుకుంటున్న సందర్భంలో కొంతమంది స్మార్ట్‌ఫోన్స్‌లో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ వస్తున్నారు.. ఇలా పోస్ట్ చేసిన వీడియోలే ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి. ఇప్పుడు వైరల్ అవుతున్న వీడియోలు ఏముందో? దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ వీడియోలో ముందుగా రెండు కింగ్ కోబ్రాలు తమ పడగలను విప్పి ముంగిస వైపు చూస్తూ.. ఉండడం మీరు గమనించవచ్చు. ఆ తర్వాత ఆ రెండు పాములు దానిపై దాడి చేయడానికి సిద్ధంగా ఉండడం కూడా మీరు చూడొచ్చు. ముంగిస కూడా ఏమాత్రం బెదరకుండా.. వాటిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నట్లు కూడా మీరు క్లియర్ గా చూడొచ్చు. అలాగే రెండు ఒకదానికొకటి దాడికి ప్రయత్నించుకోవడం, అందులో రెండు కింకోబ్రాల పైకి ముంగిస కూడా దాడి చేయడం మీరు క్లియర్ గా చూడొచ్చు.
ముంగిస ఆ కింగ్ కోబ్రాల దాడి నుంచి తనకున్న శక్తి సామర్థ్యాలను వినియోగించుకుని ఎంతో సులభంగా తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్న దృశ్యాలు కూడా మీరు కళ్లకు కట్టినట్లు చూడొచ్చు. ఈ ముంగిస వ్యూహాత్మకంగా ఆ రెండు పాముల పై దాడి చేస్తూ ఉండడం మీరు గమనించవచ్చు. అలాగే అది తనకున్న పళ్ళతో పాము తలభాగాన్ని పట్టుకొని కొరకడానికి కూడా ప్రయత్నిస్తోంది. వీటి రెండిటి మధ్య దాడి దాదాపు 33 సెకండ్లకు పైగా కొనసాగినట్లు తెలుస్తోంది. ఇలా కొద్దిసేపు ఆ ముంగిస పాములు ఎంతగానో దాడి చేసుకున్నాయి.
ఇందులో ముంగిస మాత్రం ఎంతో ధైర్యంగా పాముల నుంచి చాకచక్యంగా తప్పించుకుంటూ నిలబడింది. ఈ రెండు పాములు దాడిలో కాస్త గాయాల పాలైనట్లు కూడా మీరు గమనించవచ్చు. నిజానికి ముంగిసలకు పాము విషం పట్ల కాస్త రోగ నిరోధక శక్తిని కలిగి ఉంటుంది కాబట్టి ఆ రెండు పాములు దానిపై కాటేసినప్పటికీ ఏమాత్రం దాని శరీరం నిండా విషం చేరకుండా ఉంటుంది. అయితే దీనికి సంబంధించిన వీడియోని కొంతమంది సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.. ఇందులో ఒక వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.
Also Read: Giant Cobra Video: కిచెన్‌లో ఫ్రిజ్ వెనుక భారీ నాగుపాము.. సంచలనం సృష్టిస్తున్న వీడియో..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Nampally Fire Accident Tragedy: కొన్ని గంటలుగా జరుగుతున్న రిస్క్యూ ఆపరేషన్స్ ఫలించలేదు. ఆ అయిదుగురి ప్రాణాలు అగ్నికి ఆహుతి అయిపోయాయి. నాంపల్లి ఫర్నిచర్ అగ్ని ప్రమాదం చివరికి శోకాన్నే మిగిల్చింది. హైదరాబాద్ నాంపల్లి ఫర్నిచర్ షాపులో జరిగిన అగ్నిప్రమాదం తీరని విషాదాన్ని మిగిల్చింది. ఆ కుటుంబంలో తీరని దుఃఖాన్ని నింపింది. నిన్నటి నుంచి దాదాపు 22 గంటలకు పైగా కొనసాగిన రిస్క్యూ ఆపరేషన్ ప్రయత్నాలు ఫలించలేదు. బిల్డింగ్ లో చిక్కుకున్న ఐదుగురు ప్రణీత్ (8), అఖిల్ (11), ఇంతియాజ్ (28), హాబీబ్ (32), బేబీ (48) మరణించారు. వారి మృతదేహాలను రిస్క్యూ సిబ్బంది గుర్తించారు. వాటిని బయటికి తీసి ఉస్మానియా ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించే పనులు జరుగుతున్నాయి.
కొన్ని గంటలుగా తమ కుటుంబీకులు ప్రాణాలతో బయటికి వస్తారని ఎదురుచూసిన వారి ఆశలు ఆవిరయ్యాయి. మొదటగా మూడు మృతదేహాలను వెలికి తీశారు. భవనం సెల్లార్ నుంచి మూడు శవాలను రిస్క్యూ టీమ్ వెలికి తీసింది. ఇక పోస్టుమార్టం నిమిత్తం వారిని ఆసుపత్రికి తరలిస్తున్నారు. మిగతా వారి కోసం ఆ తర్వాత కాస్త సహాయక చర్యలు మరింత శ్రమించి బయటకు తీశారు. నిన్న మధ్యాహ్నం జరిగిన ఈ ఫైర్ యాక్సిడెంట్ కొన్ని గంటలుగా ఆపరేషన్ కొనసాగింది. ఇప్పటికీ భవనం సెల్లార్ నుంచి దట్టమైన పొగలు వస్తూనే ఉన్నాయి. ఇక డెడ్ బాడీలను చూసి కుటుంబాలు తీవ్ర రోదనలో మిగిలింది. ఆ ప్రాంతం అంతా తీవ్ర విషాదంతో మునిగిపోయింది.
ఇక నిన్న నాంపల్లి ఫర్నిచర్ షాప్ లో జరిగిన అగ్నిప్రమాదంలో ముమ్మరంగా సహాయక చర్యలు చేపట్టారు. వెంటనే మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. కానీ దట్టమైన పొగలు సహాయక చర్యలకు తీవ్ర ఇబ్బందిని ఏర్పరిచాయి. దీంతో ఆటంకం ఏర్పడింది. బిల్డింగ్ లో చిక్కుకున్న వారి కోసం సెల్లార్ నుంచి గుంత తవ్వుకుంటూ రిస్క్యూ టీమ్ వెళ్లింది. బిల్డింగ్ బయట ప్రమాదంలో చిక్కుకున్న వారి కుటుంబీకులు ఎదురు చూశారు. వారు ప్రాణాలతో బయటపడాలని రాత్రంతా నిద్రాహారాలు లేక గడిపారు. సమయం గడిచే కొద్ది ప్రాణాలపై ఆశలు కూడా సన్నగిల్లుతూనే ఉన్నాయి. చివరికి తమ వారి ప్రాణాలు మంటల్లో కాలిపోయాయని తెలిశాక వారి రోదనలు మిన్నంటాయి. ఇక నిన్న ప్రమాదా స్థలాన్ని సీపీ సజ్జనార్ తో పాటు కలెక్టర్ హరిచందన కూడా సందర్శించారు. వారు ఎప్పటికప్పుడు సహాయక చర్యలను పర్యవేక్షిస్తూనే ఉన్నారు.
నిత్యం.. అగ్ని ప్రమాదం..
నాంపల్లి అగ్నిప్రమాదం ప్రస్తుతం శవాలను వెలికి తీసి వారిని ఉస్మానియా ఆసుపత్రికి తరలిస్తున్నారు. అయితే హైదరాబాద్ చుట్టూ ఏదో ఒక మూల తరచూ ఈ అగ్ని ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. గత ఏడాది కూడా గుల్జార్‌హౌస్ ఘటనలో 8 మంది చిన్నారులతో సహా దాదాపు 17 మంది అగ్నికి ఆహుతైన సంగతి తెలిసిందే. 22 గంటల పాటు జరిగిన ఈ రిస్క్యూలో చివరికి విషాదమే మిగిలింది. ప్రమాదం జరిగిన తర్వాత తీవ్రస్థాయిలో రిస్క్యూ ఆపరేషన్ నిర్వహిస్తున్న అధికారులు ఆ తర్వాత చర్యలు మాత్రం ప్రశ్న గానే మిగులుతున్నాయి.
బాలిక హాస్టల్లో అగ్నిప్రమాదం..
ఇక మరోవైపు ఆల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో వసతి గృహంలో కూడా అగ్ని ప్రమాదం జరిగింది. ఆల్వాల్ హై టెన్షన్ లైన్‌కు బాలికల వసతి గృహం వద్ద తెల్లవారుజామున అగ్ని ప్రమాదం జరిగింది. నాలుగో అంతస్తు గదిలో షార్ట్ సర్క్యూట్ జరగడంతో ఏసి పేలిపోయింది. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. పెద్ద ఎత్తున పొగ కూడా ఆలుముకోవడంతో 20 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు.
Also Read: తెలంగాణ యువతకు శుభవార్త.. ఈ పథకంతో రూ.4 లక్షల ప్రభుత్వ రుణం పక్కా..!
Also Read: ఉద్యోగ సంఘాలతో చర్చలు ఫెయిల్.. నేటి నుంచి 4 రోజుల బ్యాంక్ బంద్..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Trigrahi Raja Yoga Effect On Zodiac Sings Telugu: మరో నాలుగు ఐదు రోజులైతే ఫిబ్రవరి నెల కూడా ప్రారంభమవుతుంది. కుంభరాశిలో ఒకదాని తర్వాత ఒకటి శక్తివంతమైన గ్రహాలు కూడా త్వరలోనే ప్రవేశించబోతున్నాయి. ముఖ్యంగా ఫిబ్రవరి 4వ తేదీ నుంచి మార్చి 14వ తేదీ వరకు కుంభరాశిలో చాలా ప్రభావవంతమైన గ్రహాలు సంచారం చేసి ఎంతో శక్తివంతమైన త్రిగ్రహి రాజయోగాన్ని ఏర్పాటు చేయబోతున్నాయి. ఏవైనా మూడు గ్రహాలు ఒకే రాశిలో కలిసున్నప్పుడు ఇలాంటి యోగం ఏర్పడుతుంది. అయితే ఫిబ్రవరి నెలలో బుధుడు, సూర్యుడు, శుక్రుడు మూడు గ్రహాలు కుంభరాశిలో కలిసి ఉంటాయి. ఫలితంగా వీటి సంయోగం జరుగుతుంది. దీంతో ఈ శక్తివంతమైన రాజయోగం ఏర్పడుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. ముఖ్యంగా ఈ సమయంలో కొన్ని రాశుల వారికి తెలివితేటలు పెరగడమే కాకుండా వ్యాపారం, వాక్చాతుర్యం వంటి అంశాల్లో కలిసి రాబోతోంది. అలాగే ఆత్మవిశ్వాసం కూడా ఊహించని స్థాయిలో పెరుగుతుంది. అయితే త్రిగ్రహి రాజయోగ ప్రభావంతో ఏ రాశుల వారికి ఊహించని స్థాయిలో మేలు జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఫిబ్రవరి మూడవ తేదీన కుంభరాశిలోకి బుధుడు ప్రవేశిస్తాడు. ఫిబ్రవరి 4వ తేదీ నుంచి 12వ తేదీ వరకు కుంభరాశిలో శుక్రుడు, సూర్యుడు, బుధుడు గ్రహాలు కలయిక జరుపతాయి. ఫిబ్రవరి 13వ తేదీన సూర్యుడు కుంభరాశిలోకి ప్రవేశించినప్పుడు ఈ త్రిగ్రహి రాజయోగం మరింత బలపడుతుంది. ఎందుకంటే అప్పుడు రాహు కుంభరాశిలో ఉంటాడు. ఫలితంగా ఈ సమయంలో చతుర్గ్రహి యోగం ఏర్పడుతుంది.
అంతేకాకుండా ఫిబ్రవరి 23వ తేదీన కుజుడు కుంభరాశిలోకి ప్రవేశిస్తాడు. దీంతో ఈ సమయంలో ఐదు గ్రహాల కలయిక జరుగుతుంది. కుంభరాశిలో ఈ ఐదు గ్రహాల సంయోగం పంచ గ్రహి మహాయోగం ఏర్పడుతుంది. ఈ అరుదైన రాజయోగ ప్రభావం ఫిబ్రవరి 23వ తేదీ నుంచి మార్చ్ 14వ తేదీ వరకు కొనసాగడం విశేషం. ఇలాంటి సమయంలో కొన్ని రాశుల వారికైతే అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతుంటాయి. ముఖ్యంగా ఆర్థికంగా కలిసి వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తాయి.
ఈ రాశుల వారిపై తీవ్ర ప్రభావం..
మేషరాశి
మేషరాశిలో జన్మించిన వ్యక్తులకు ఈ శక్తివంతమైన రాజయోగాల ప్రభావం చాలా శుభప్రదంగా ఉండబోతోంది. ముఖ్యంగా వీరికి కొత్త ఆదాయ వనరులు లభించడమే.. కాకుండా దీర్ఘకాలిక సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి. భవిష్యత్తులో అద్భుతమైన ప్రణాళికలతో విజయాలు సాధించగలుగుతారు. ముఖ్యంగా కెరీర్ పరంగా మెరుగుదల కనిపిస్తుంది. ఎప్పటినుంచో తీవ్ర సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులకు ఉపశమనం కూడా కలుగుతుంది.
కుంభరాశి
కుంభరాశిలో జన్మించిన వ్యక్తులు అద్భుతమైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు. వీరికి ఆత్మవిశ్వాసం కూడా ఊహించిన స్థాయిలో పెరుగుతుంది. ముఖ్యంగా నిలిచిపోయిన పనులు అద్భుతంగా ముందుకు సాగుతాయి. కార్యాలయాల్లో పనులు చేస్తున్న వ్యక్తులు అద్భుతమైన ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా బుధుడు, సూర్యుడి కలయికతో వీరి ఆలోచన శక్తి కూడా ఊహించని స్థాయిలో పెరుగుతుంది. శుక్రుడి ప్రభావంతో వీరి ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి. సామాజికంగా గౌరవం కూడా పెరుగుతుంది. అనుకున్న పనుల్లో అద్భుతమైన విజయాలు సాధించగలుగుతారు.
సింహరాశి
సింహరాశిలో జన్మించిన వ్యక్తులకు కీర్తి, ప్రతిష్టలు ఊహించిన స్థాయిలో పెరుగుతాయి. నాయకత్వ లక్షణాలు పెరగడమే కాకుండా.. ఎన్నో రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా ప్రభుత్వ రాజకీయ రంగాల్లో పనులు చేస్తున్న వ్యక్తులకు ప్రత్యేకమైన అనుకూలత కూడా పెరుగుతుంది. అలాగే సమాజంలో గౌరవం పెరిగి అద్భుతమైన ప్రయోజనాలు పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Also Read: Mercury Transit 2026: మకరంలో తిష్ట వేసిన బుధుడు.. ఈ రాశుల వారికి కోటీశ్వరులయ్యే యోగం ప్రారంభం!

Also Read: Mercury Transit 2026: మకరంలో తిష్ట వేసిన బుధుడు.. ఈ రాశుల వారికి కోటీశ్వరులయ్యే యోగం ప్రారంభం!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Amercia Snow Toofan: మంచు తుపాను కారణంగా అమెరికాలోని 18 రాష్ట్రాలు గజ గజ వణికిపోతున్నాయి. ఆయా రాష్ట్రాల్లో వింటర్ ఎమర్జెన్సీ ప్రకటించింది ప్రభుత్వం. అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటికి రావొద్దంటూ హెచ్చరికలు జారీ అయ్యాయి. చాలా రాష్ట్రాల్లో విమాన తదితర రవాణా సేవలు స్తంభించిపోయాయి. తీవ్ర ప్రతికూల వాతావరణం కారణంగా శని, ఆదివారాల్లో కలిపి ఏకంగా 10 వేలకు పైగా విమాన సర్వీసులను ముందు జాగ్రత్త చర్యగా రద్దు చేశారు. చాలా రాష్ట్రాల్లో స్కూళ్లు, ఇతర విద్యా సంస్థలకు సోమవారం కూడా సెలవు ప్రకటించారు. ఫెర్న్‌గా పేర్కొంటున్న ఈ తుఫాన్‌కు ఆర్కిటిక్ బ్లాస్ట్ వల్ల ఉత్తర ధ్రువం నుంచి వీస్తున్న అతి శీతల గాలులే కారణమని వాతావరణ శాఖ తెలిపింది. వచ్చే రెండు మూడు రోజుల్లో దాని తీవ్రత మరింత పెరుగుతుందని హెచ్చరించింది. నిత్యావసరాల కోసం జనం ఎగబడటంతో చాలా నగరాల్లో దుకాణాలు ఖాళీ అయిపోయాయి. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు ఫెడరల్ ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ ఏజెన్సీ అప్రమత్తమైంది.
నార్త్ డకోటా మొదలుకుని పలు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు మైనస్ 20 నుంచి ఏకంగా మైనస్ 40 దాకా పడిపోతున్నాయి. దాంతో వాహనాలు కూడా కదలకుండా మొరాయిస్తున్నాయి. ఫలితంగా అత్యవసర సేవలకు అంతరాయం కలుగుతోంది. టెక్సాస్, ఓక్లహామా, కాన్సాస్ తదితర రాష్ట్రాలు అతలాకుతలం అవుతున్నాయి. ఓక్లహామా నుంచి బోస్టన్ దాకా 1,500 మైళ్ల మేరకు తీవ్రంగా ప్రభావితమవుతోంది. టెక్సాస్ నుంచి వర్జీనియా దాకా హిమపాతం వణికిస్తోంది. రాజధాని వాషింగ్టన్ డీసీ మొదలుకుని న్యూయార్క్ తదితర మహా నగరాలు మంచు దుప్పట్లో కూరుకుపోయాయి. శనివారం 3,200, ఆదివారం 4,800 దేశీయ, అంతర్జాతీయ విమాన సర్వీసులు రద్దయినట్టు ఫ్లైట్ ట్రాకింగ్ వెబ్సైట్ ఫ్లైట్అవేర్ ముందు పేర్కొంది. ఒక్క ఆదివారమే 7,600కు పైగా సర్వీసులు రద్దవుతున్నట్టు అనంతరం వెల్లడించింది.
Read more: సమంత కంటే ముందు రెండో పెళ్లి చేసుకున్న హీరోయిన్స్ వీళ్లే..! పూర్తి లిస్ట్ ఇదే..!
Read more: సమంత బాటలో దర్శకులను పెళ్లి చేసుకున్న హీరోయిన్స్ వీళ్లే..
అతి శీతల గాలుల ధాటికి అమెరికా వ్యాప్తంగా చాలాచోట్ల చెట్లు, కరెంటు స్తంభాలు నేలకొరుగుతున్నాయి. దాంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. దాంతో చలికి తట్టుకోలేక జనం అల్లాడుతున్నారు. దేశవ్యాప్తంగా ఒక్క శుక్రవారమే ఏకంగా 95 వేలకు పైగా కరెంటు కోత ఉదంతాలు నమోదయ్యాయి. వీటిలో 37 వేలకు పైగా టెక్సాస్‌లోనే కావడం గమనార్హం. ఈ సమస్య కనీసం కొద్ది రోజుల పాటు కొనసాగవచ్చని అధికారులు ఇప్పటికే హెచ్చరించారు. టెక్సాస్‌లో ఐదేళ్ల క్రితం ఇలాంటి తుఫాన్ సమయంలో భారీ కరెంటు కోతల వల్ల వందలాది మంది దుర్మరణం పాలవడం తెలిసిందే. అలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా అన్ని చర్యలూ తీసుకుంటున్నట్టు గవర్నర్ గ్రెగ్ అబట్ తెలిపారు.
భారత్ నుంచి అమెరికా తూర్పు తీరంలోని న్యూయార్క్, నెవార్క్ నగరాలకు విమాన సర్వీసులను రద్దు చేస్తున్నట్టు ఎయిరిండియా ప్రకటించింది. ప్రయాణికులు, సిబ్బంది భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. న్యూఢిల్లీ, ముంబైల నుంచి ఆ నగరాలకు ఎయిరిండియా రెగ్యులర్‌గా విమాన సర్వీసులు నడుపుతోంది.
Also Read: వెయ్యి కోట్ల దర్శకులు.. ‘దురంధర్’తో ఈ క్లబ్బులో ఎంట్రీ ఇచ్చిన ఆదిత్యధర్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
.Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.
Parliament Budget Session 2026 Details :పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ఈ నెల 28 నుంచి ప్రారంభం కానున్నాయి. ఫిబ్రవరి 13 వరకు తొలిదశ సమావేశాలు కొనసాగుతాయి. మళ్లీ మార్చి 9న మొదలై ఏప్రిల్ 2 వరకు జరుగుతాయి. ఇక ఫిబ్రవరి 1 న అంటే ఆదివారం దేశ వార్షిక బడ్జెట్‌ను కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మాలా సీతారామన్ పార్లమెంట్లో ప్రవేశ పెడతారు. ఈ నేపథ్యంలో సభ సజావుగా సాగేందుకు ప్రభుత్వం 27న అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించనుంది. సభలో చర్చనీయాంశాలు, ఇతర విషయాలను దీనిలో చర్చించనున్నారు.
ఉభయసభల సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేసే ప్రసంగంతో పార్లమెంటు సమావేశాలు మొదలవుతాయి. ఆ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ఫిబ్రవరి రెండు నుంచి నాలుగు వరకు చర్చ కొనసాగే అవకాశం ఉంది.
Read more: సమంత కంటే ముందు రెండో పెళ్లి చేసుకున్న హీరోయిన్స్ వీళ్లే..! పూర్తి లిస్ట్ ఇదే..!
Read more: సమంత బాటలో దర్శకులను పెళ్లి చేసుకున్న హీరోయిన్స్ వీళ్లే..
కాగా పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో ప్రభుత్వం జమిలి ఎన్నికల బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉంది. దీనిపై ఇప్పటికే JPC నివేదిక సిద్ధమైందని తెలుస్తోంది. దీనికి తోడు అమరావతిని AP రాజధానిగా చట్టబద్ధత కల్పించే బిల్లును కూడా సభ ముందుకు తీసురానున్నారని సమాచారం. పూర్వోదయ పథకం కింద రాష్ట్రానికి భారీ నిధులు కేటాయించనున్నట్లు సమాచారం. ఇక ఆదాయ పన్ను సరళీకరణ, వక్ఫ్ బోర్డు సవరణలు, వికసిత్ భారత్ శిక్షా అధీక్షణ్ బిల్లు కూడా ఈ సమావేశాల్లో చర్చకు రానున్నట్లు తెలుస్తోంది.
Also Read: వెయ్యి కోట్ల దర్శకులు.. ‘దురంధర్’తో ఈ క్లబ్బులో ఎంట్రీ ఇచ్చిన ఆదిత్యధర్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
.Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.
School Holiday News: తమిళనాడులోని తిరువారూర్ జిల్లా విద్యార్థులకు జిల్లా యంత్రాంగం తీపి కబురు అందించింది. ఒక ప్రముఖ ఆలయ ఉత్సవం కారణంగా జిల్లాలోని మూడు కీలక తాలూకాలకు జనవరి 28 (బుధవారం) నాడు స్థానిక సెలవు ప్రకటిస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. మన్నార్గుడిలోని ప్రసిద్ధ శ్రీ రాజగోపాలస్వామి ఆలయ మహాకుంభాభిషేక వేడుకను పురస్కరించుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు.
సెలవు వివరాలు..
జనవరి 28, 2026 (బుధవారం) నాడు తమిళనాడులోని తిరువారూర్ జిల్లాలోని మన్నార్గుడి, నీదమంగళం, కొత్తూరు తాలూకాలకు మాత్రమే ఈ స్థానిక సెలవు వర్తిస్తుంది. ఈ మూడు తాలూకాలలోని అన్ని ప్రభుత్వ, ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలలు, కళాశాలలు, ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు ఉంటుంది. ప్రైవేట్ పాఠశాలల సెలవు అనేది ఆయా యాజమాన్యాల నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది.
వర్కింగ్ డే అప్డేట్..
సాధారణంగా స్థానిక సెలవు ప్రకటించినప్పుడు, ఆ పనిదినాన్ని భర్తీ చేయడానికి మరొక రోజు పాఠశాలలు నిర్వహించడం ఆచారం. ఆ ప్రకారం జనవరి 28 సెలవుకు బదులుగా, ఫిబ్రవరి 7 (శనివారం) నాడు పాఠశాలలు, కార్యాలయాలు యథావిధిగా పనిచేస్తాయని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు.
వరుస సెలవులతో విద్యార్థుల ఖుషీ..
జనవరి 26 (సోమవారం) గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఇప్పటికే సాధారణ సెలవు ఉంది. ఆ తర్వాత మంగళవారం మాత్రమే పాఠశాలలు పనిచేస్తాయి. మళ్లీ బుధవారం (జనవరి 28) నాడు ఈ మూడు తాలూకాల విద్యార్థులకు స్థానిక సెలవు లభించడంతో వారు పండగ చేసుకుంటున్నారు.
మన్నార్గుడి రాజగోపాలస్వామి ఆలయ కుంభాభిషేకం అత్యంత వైభవంగా జరగనుంది. ఈ పవిత్ర వేడుకలో స్థానిక భక్తులు, విద్యార్థులు, వారి కుటుంబ సభ్యులు పాల్గొనేందుకు వీలుగా ప్రభుత్వం ఈ వెసులుబాటు కల్పించింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Tomato Pack For Hair: చిన్న వయసులోనే జుట్టు తెల్లబడటం (Grey Hair) అనేది ప్రస్తుతం చాలా మందిని వేధిస్తున్న సమస్య. రసాయనాలతో కూడిన హెయిర్ డైలు వాడటం వల్ల జుట్టు మరింత దెబ్బతినే అవకాశం ఉంది. అయితే, మన వంటింట్లో ఉండే టమోటా సహాయంతో జుట్టును సహజంగా ఎలా సంరక్షించుకోవచ్చో తెలుసుకుందాం. టమోటా కేవలం వంటలకే కాదు, జుట్టు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. ఇందులో ఉండే విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు జుట్టుకు సహజమైన మెరుపును అందిస్తాయి.
కావాల్సిన పదార్థాలు..
పండిన టమోటా: ఒకటి (పేస్ట్ లా చేయాలి)
ఆలివ్ ఆయిల్: 3-4 టేబుల్ స్పూన్లు (తేమ కోసం)
కాఫీ పౌడర్: 2 టేబుల్ స్పూన్లు (రంగు కోసం)
హెన్నా పేస్ట్: కొద్దిగా (ఆప్షనల్ - మెరుగైన రంగు కోసం)
తయారీ, వాడే విధానం..
మిశ్రమం తయారీ: ఒక గిన్నెలో టమోటా పేస్ట్, ఆలివ్ ఆయిల్, కాఫీ పౌడర్‌ను బాగా కలపండి. ఈ మిశ్రమాన్ని 15 నిమిషాల పాటు పక్కన పెట్టండి.
అప్లై చేయడం: ఈ ప్యాక్‌ను జుట్టు కుదుళ్ల నుండి చివర్ల వరకు సమానంగా పట్టించండి.
సమయం: సుమారు 20 నిమిషాల పాటు ఆరనివ్వండి.
శుభ్రం చేయడం: గోరువెచ్చని నీరు మరియు మైల్డ్ షాంపూతో జుట్టును శుభ్రంగా కడగాలి.
టమోటా వల్ల కలిగే ప్రయోజనాలు..
స్కాల్ప్ క్లీనింగ్: తల చర్మంపై ఉన్న మలినాలను తొలగించి, రంధ్రాలు తెరుచుకునేలా చేస్తుంది.
సహజ మెరుపు: జుట్టు పొడిబారకుండా చూస్తూ, సహజమైన కాంతిని ఇస్తుంది.
రంగు మెరుగుదల: కాఫీ మరియు టమోటా కలయిక వల్ల జుట్టు సహజ రంగు మెరుగుపడుతుంది. ఇది తెల్ల జుట్టు ప్రక్రియను నెమ్మదింపజేస్తుంది.
(ముఖ్య గమనిక: ఈ ప్యాక్ వల్ల జుట్టు వెంటనే పూర్తిగా నల్లగా మారుతుందని చెప్పలేము కానీ, క్రమం తప్పకుండా వాడితే మంచి మార్పు కనిపిస్తుందని నివేదికల్లో వెల్లడిస్తున్నారు. అలాగే, జుట్టు ఆరోగ్యం అనేది మనం తీసుకునే ఆహారం, నిద్ర, ఒత్తిడిపై కూడా ఆధారపడి ఉంటుంది. కాబట్టి పోషకాహారం తీసుకోవడం మర్చిపోకండి. అయితే పైన చెప్పిన సమాచారాన్ని జీ తెలుగు న్యూస్ ధ్రువీకరించడం లేదు.)
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Aadhaar-UAN Linking: ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) ఉద్యోగులకు మరింత సౌకర్యం కల్పించే దిశగా మరో కీలక అడుగు వేసింది. యూనివర్సల్ అకౌంట్ నంబర్ (UAN)తో ఆధార్‌ను అనుసంధానించే ప్రక్రియను తాజాగా మరింత సులభంగా మార్చింది. దీనివల్ల PF విత్ డ్రా, ఖాతాల బదిలీలు, KYC అప్డేట్లు వంటి సేవలు ఇప్పుడు వేగంగా పూర్తవుతున్నాయి. ఈ మార్పు లక్షలాది మంది ఉద్యోగులు, PF ఖాతాదారులకు ఊరట కలిగిస్తోంది.
ఆధార్–UAN లింక్ ఎందుకు అవసరం?
UANకు ఆధార్‌ను లింక్ చేయడం EPFO తప్పనిసరి చేసింది. దీని ప్రధాన ఉద్దేశం ఉద్యోగుల గుర్తింపును ఖచ్చితంగా నిర్ధారించడం, మోసాలను అడ్డుకోవడం. PF ప్రయోజనాలు సమయానికి అందేలా చేస్తుంది. గతంలో పేర్లలో తేడాలు, పత్రాల అసమతుల్యత, ధృవీకరణలో జాప్యం వంటి కారణాలతో PF క్లెయిమ్‌లు ఆలస్యం అవుతుండేవి. కానీ ఇప్పుడు ఆధార్ అనుసంధానం వల్ల ఈ సమస్యలు చాలా వరకు తొలగిపోయాయి.
ఆన్లైన్లో లింక్ చేసే విధానం:
ఆధార్‌ను UANతో లింక్ చేయడానికి EPFO సులభమైన ఆన్లైన్ ప్రక్రియను అందుబాటులోకి తీసుకొచ్చింది. సభ్యులు EPFO అధికారిక పోర్టల్‌లో లాగిన్ అయి, తమ UAN, పాస్‌వర్డ్‌తో ఖాతాలోకి ఎంటర్ అవ్వాలి. అనంతరం KYC విభాగంలో ఆధార్ వివరాలను నమోదు చేస్తే UIDAI ద్వారా ఆన్లైన్ ధృవీకరణ జరుగుతుంది. ధృవీకరణ విజయవంతమైన వెంటనే ఆధార్–UAN అనుసంధానం పూర్తవుతుంది. ఇదేకాకుండా UMANG మొబైల్ యాప్ ద్వారా లేదా ఆఫ్‌లైన్ మార్గాల్లో కూడా ఈ ప్రక్రియను పూర్తి చేసే అవకాశం ఉంది. ఉద్యోగులు తమకు అనుకూలమైన విధానాన్ని ఎంచుకోవచ్చు.
Also Read: Budget 2026: సీనియర్ సీటిజన్లు ఏం డిమాండ్ చేస్తున్నారు? వారి గోడును నిర్మలమ్మ వింటారా?
PF సేవలు ఇక మరింత వేగంగా:
ఆధార్ లింక్ చేసిన తర్వాత PF విత్ డ్రా, ఖాతాల బదిలీలు గణనీయంగా వేగవంతమయ్యాయి. ఒకప్పుడు క్లెయిమ్‌లు ప్రాసెస్ కావడానికి రోజులు లేదా వారాలు పట్టేది. కానీ ఇప్పుడు ఆన్లైన్ క్లెయిమ్‌లు త్వరగా పూర్తవుతున్నాయి. ముఖ్యంగా ఉద్యోగాలు మారే సమయంలో PF బదిలీల్లో ఎదురయ్యే జాప్యాలు చాలా వరకు తగ్గాయి.
ఉద్యోగులకు నిజమైన ఉపశమనం:
గతంలో సరైన డాక్యుమెంట్లు లేకపోవడం లేదా ధృవీకరణ సమస్యల వల్ల PF డబ్బులు రావడానికి నెలల సమయం పట్టేదని చాలా మంది ఉద్యోగులు చెబుతున్నారు. దీనివల్ల వారు ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొన్నారు. ఆధార్–UAN లింక్ అమలులోకి వచ్చిన తర్వాత, నిధులు సమయానికి అందడంతో కుటుంబ అవసరాలు తీర్చుకోవడం సులభమైంది. ఇది కేవలం సాంకేతిక మార్పు మాత్రమే కాదు, ఉద్యోగుల జీవితాల్లో భద్రత, నమ్మకాన్ని పెంచిన సంస్కరణగా మారింది.
EPFO తీసుకున్న ఈ చర్య ఉద్యోగులకు మరింత భద్రత, సౌలభ్యం అందిస్తోంది. ఆధార్–UAN అనుసంధానం వల్ల PF సేవలు సులభమయ్యాయి, ఆలస్యాలు తగ్గాయి. చెల్లింపులు వేగంగా జరుగుతున్నాయి. ఈ మార్పు ఉద్యోగుల ఆర్థిక జీవితాలను మరింత స్థిరంగా, సురక్షితంగా మార్చే దిశగా కీలకమైన ముందడుగుగా నిలుస్తోంది.
Also Read:Sukanya Samriddhi Yojana: ఆడపిల్లలకు రూ.72లక్షలు.. సుకన్య సమృద్ధి యోజన కొత్త మైల్స్టోన్..!!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
.Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Home Loan: కొత్త ఇల్లు నిర్మించుకోవాలన్నా.. ఇప్పటికే ఉన్న ఇంటిని మరమ్మతులు చేయాలన్నా.. చాలా మంది బ్యాంకులు లేదా ఫైనాన్స్ సంస్థల నుంచి హోమ్ లోన్‌ను ఆశ్రయిస్తారు. అయితే ప్రతి ఒక్కరికీ ఒకే విధంగా రుణం మంజూరు చేయరు. రుణం ఇచ్చే ముందు బ్యాంకులు క్రెడిట్ ప్రొఫైల్, సిబిల్ స్కోర్‌తో పాటు మరికొన్ని కీలక అంశాలను పరిశీలిస్తాయి. అందుకే హోమ్ లోన్‌కు అప్లై చేసే ముందు అర్హత ఎలా నిర్ణయిస్తారు? ప్రక్రియ ఏంటి? అనే విషయాలు తెలుసుకోవడం చాలా అవసరం ఉంటుంది.
హోమ్ లోన్ అంటే ఏమిటి అనే విషయానికి వస్తే.. ఇది ఇల్లు కొనుగోలు చేయడానికి.. కొత్తగా నిర్మించడానికి లేదా పునర్నిర్మాణం చేయడానికి రుణదాతలు అందించే సెక్యూర్డ్ లోన్. ఈ రుణానికి తీసుకునే ఆస్తినే బ్యాంకు వద్ద పూచీకత్తుగా ఉంచాలి. భద్రత ఉండటంతో ఇతర రుణాలతో పోలిస్తే హోమ్ లోన్‌పై వడ్డీ రేటు సాధారణంగా తక్కువగా ఉంటుంది.
హోమ్ లోన్ ఎలిజిబిలిటీ అనేది పలు అంశాలపై ఆధారపడి ఉంటుంది. మీ నెలవారీ ఆదాయం, క్రెడిట్ స్కోర్ లేదా సిబిల్ స్కోర్, గతంలో తీసుకున్న లోన్ల చెల్లింపు చరిత్ర, ప్రస్తుత వయసు, పదవీ విరమణ వయసు, అలాగే ఇప్పటికే ఉన్న నెలవారీ ఆర్థిక బాధ్యతలను బ్యాంకులు గమనిస్తాయి. ఈ అన్ని అంశాలను పరిశీలించిన తర్వాతే మీరు ఎంత మొత్తానికి రుణం పొందగలరో నిర్ణయిస్తారు.
హోమ్ లోన్ తీసుకుంటే నెలకు ఎంత ఈఎమ్ఐ చెల్లించాలి అనే సందేహం చాలా మందికి ఉంటుంది. దీని కోసం హోమ్ లోన్ కాలిక్యులేటర్ ఎంతో ఉపయోగపడుతుంది. మీరు తీసుకునే లోన్ మొత్తం, చెల్లింపు గడువు, వడ్డీ రేటు వంటి వివరాలను నమోదు చేస్తే నెలవారీ ఈఎమ్ఐ, మొత్తం వడ్డీ, మొత్తం రీపేమెంట్ ఎంత అవుతుందో స్పష్టంగా తెలుస్తుంది. ఆన్లైన్లో అందుబాటులో ఉన్న ఈ కాలిక్యులేటర్లు మీ ఆర్థిక ప్రణాళికను సులభతరం చేస్తాయి.
Also Read: Budget 2026: సీనియర్ సీటిజన్లు ఏం డిమాండ్ చేస్తున్నారు? వారి గోడును నిర్మలమ్మ వింటారా?
హోమ్ లోన్ ప్రీపేమెంట్ గురించి కూడా తెలుసుకోవాలి. అంటే నిర్ణీత కాలానికి ముందే లోన్ మొత్తాన్ని పూర్తిగా లేదా కొంత భాగాన్ని చెల్లించడం. సాధారణంగా హోమ్ లోన్ గడువు 10 నుంచి 30 ఏళ్ల వరకు ఉంటుంది. అయితే అదనపు ఆదాయం లభించినప్పుడు ముందుగానే లోన్ చెల్లిస్తే వడ్డీ భారాన్ని గణనీయంగా తగ్గించుకోవచ్చు. అయితే ప్రీపేమెంట్ చేయడానికి ముందు బ్యాంకు నిబంధనలు, ఛార్జీలపై స్పష్టత ఉండాలి.
ఈ విషయంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక మార్గదర్శకాలు జారీ చేసింది. జనవరి 1, 2026 నుంచి అమల్లోకి వచ్చిన నిబంధనల ప్రకారం, ఆ తేదీ నుంచి మంజూరైన లేదా పునరుద్ధరించబడిన ఫ్లోటింగ్ వడ్డీ రేటు లోన్లపై బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు ప్రీపేమెంట్ లేదా ఫోర్క్లోజర్ ఛార్జీలను వసూలు చేయరాదు.
Also Read:Sukanya Samriddhi Yojana: ఆడపిల్లలకు రూ.72లక్షలు.. సుకన్య సమృద్ధి యోజన కొత్త మైల్స్టోన్..!!
హోమ్ లోన్ తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ప్రణాళిక చేయకపోతే దీర్ఘకాలిక అప్పులు, ఆర్థిక ఒత్తిడి పెరిగే ప్రమాదం ఉంటుంది. సాధారణంగా మీ నెలవారీ ఈఎమ్ఐ మీ జీతంలో 35 నుంచి 40 శాతం మించకుండా ఉండేలా చూసుకోవాలి. ఎందుకంటే హోమ్ లోన్‌తో పాటు కుటుంబ ఖర్చులు, పిల్లల చదువు, రోజువారీ అవసరాలు కూడా సమతుల్యంగా నడవాలి. అందుకే లోన్ తీసుకునే ముందు మీ ఆదాయం, ఖర్చులు, భవిష్యత్ అవసరాలను సమగ్రంగా అంచనా వేసుకోవడం ఎంతో ముఖ్యం.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
.Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
BRS Party Ready For Battle: పంచాయతీ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు దక్కించుకున్ని ఫుల్ జోష్‌లో ఉన్న బీఆర్ఎస్ పార్టీ మున్సిపల్ ఎన్నికలకు సిద్ధమైంది. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే సమీక్ష సమావేశాలు నిర్వహించి పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసిన గులాబీ పార్టీ ఈ క్రమంలోనే ఇన్‌చార్జ్‌లను నియమించింది. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు ఇన్‌చార్జ్‌లు, సమన్వయకర్తలను బీఆర్ఎస్ పార్టీ నియమిస్తూ ప్రకటన విడుదల చేసింది. దీనికి సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి.
Also Read: Janasena Party: తెలంగాణలో సంచలన పరిణామం.. సినీ నటుడు ఆర్కే సాగర్ కీలక ప్రకటన
తెలంగాణ రాష్ట్రంలో త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల కోసం భారత రాష్ట్ర సమితి కోసం అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల వారీగా ప్రత్యేక సమన్వయకర్తలను ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నియమిస్తూ ప్రకటన విడుదల చేశారు. మొత్తం 122 మున్సిపాలిటీలు, 6 కార్పొరేషన్లకు సమన్వయకర్తలను ప్రకటించారు. ప్రతి మున్సిపాలిటీకి ఒక సీనియర్ నాయకుడిని ఎన్నికల ఇంచార్జిగా బాధ్యతలు అప్పగించారు. క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణులను సమన్వయం చేయడం, స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ఎన్నికల వ్యూహాలను రూపొందించడం ఈ సమన్వయకర్తల ప్రధాన బాధ్యతగా అని బీఆర్ఎస్ పార్టీ తెలిపింది.
Also Read: Govt Employees: ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం తీపి కబురు.. ఉత్తర్వులు జారీ!
మున్సిపల్, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రక్రియ ప్రారంభం నుంచి ముగిసే వరకు ఇన్‌చార్జ్‌లు నిరంతరం ఆయా మున్సిపాలిటీల్లో అందుబాటులో ఉంటారని బీఆర్ఎస్ పార్టీ వెల్లడించింది. మున్సిపల్ ఎన్నికల్లో అత్యంత కీలకమైన అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో సమన్వయకర్తలు కీలక పాత్ర పోషిస్తారని.. స్థానిక నాయకత్వంతో చర్చించి, గెలుపు గుర్రాలను గుర్తించి, నివేదికలను ఎప్పటికప్పుడు పార్టీ అధిష్టానానికి సమర్పించాలని కేటీఆర్ ఆదేశించారు. పార్టీ రూపొందించిన ప్రచార కార్యక్రమాలను ప్రజల్లోకి సమర్థవంతంగా తీసుకెళ్లడం, బూత్ స్థాయి ఏజెంట్లను సమన్వయం చేయడం వంటి అంశాలను ఇన్‌చార్జ్‌లు పర్యవేక్షిస్తారు. మున్సిపల్ ఎన్నికల సరళిని, గ్రౌండ్ రిపోర్టులను ఎప్పటికప్పుడు పార్టీ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్‌కు, వర్కింగ్ ప్రెసిడెంట్‌కు నివేదించేలా బీఆర్ఎస్ పార్టీ ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసింది. పార్టీ తరపున నియమించిన మున్సిపల్ ఎన్నికల సమన్వయకర్తల పూర్తి జాబితాను విడుదల చేసి.. ప్రజల మద్దతుతో మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపే లక్ష్యంగా పార్టీ శ్రేణులు పనిచేయాలని కేటీఆర్ పిలుపునిచ్చారు.
Also Read: KTR Press Meet: ఫోన్ ట్యాపింగ్ విచారణ తర్వాత కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
.Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Brs ktr sends legal notices to bandi sanjay and mp dharmapuri arvind: తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ అంశం ప్రస్తుతం దుమారంగా మారింది. ఇప్పటికే దీనిపై హరీష్ రావును, కేటీఆర్ లను సిట్ విచారించింది. అంతే కాకుండా దీనిపై సీఎం రేవంత్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాడని బీఆర్ఎస్ మండిపడింది. మొత్తంగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహరంతో తెలంగాణ రాజకీయాలు హీటెక్కాయి. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి బండి సంజయ్, ఎంపీ ధర్మపురి అర్వింద్ లు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లీగల్ నోటీసుల్ని జారీ చేశారు.నోటీసులు అందిన ఐదురోజుల్లో రియాక్ట్ కాకుంటే సివిల్ తో పాటు క్రిమినల్ చట్టాల కింద కఠిన చర్యలుతీసుకుంటామని హెచ్చరికలు జారీ చేశారు.
ముఖ్యంగా ఎంపీ ధర్మపురి అర్వింద్, కేంద్ర మంత్రి చేసిన వ్యాఖ్యలు తన రాజకీయ ప్రతిష్టను దెబ్బతీసేలా ఉన్నాయని కేటీఆర్ మండిపడ్డారు. ప్రజల్లో తనపై ఉన్న నమ్మకాన్ని సడలించేలా వీరు చేసిన వ్యాఖ్యలను కేటీఆర్ తీవ్రంగా రియాక్ట్ అయ్యారు. ఎలాంటి ప్రూఫ్ లు లేకుండా అసత్యాలు ప్రచారం చేశారని మండిపడ్డారు.
ఇప్పటికే కేంద్రమంత్రి బండి సంజయ్ గతంలో చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన కేసు న్యాయస్థానంలో ఉన్నప్పటికీ… చట్ట వ్యతిరేకంగా మరోసారి నోరు పారేసుకున్నారన్నారు. ఈ మేరకు బండి సంజయ్, అరవింద్ లకు కేటీఆర్ తన న్యాయవాదులతో నోటీసులు పంపించారు.
బండి సంజయ్‌కు పంపిన నోటీసులో, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై ఆయన చేసిన ఆరోపణలను కేటీఆర్ న్యాయవాదులు ప్రస్తావించారు. కేటీఆర్ కుటుంబం ఫోన్ ట్యాపింగ్ ద్వారా వేల కోట్లు సంపాదించిందని, సెలబ్రిటీల ఫోన్లు ట్యాప్ చేశారంటూ జనవరి 23న నిర్వహించిన ప్రెస్ మీట్లో కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు పూర్తిగా అవాస్తవమని అన్నారు. ఇప్పటికే బండి సంజయ్‌పై సిటీ సివిల్ కోర్టులో పరువు నష్టం దావా నడుస్తుందని మరల ఈ వ్యాఖ్యలు చేయడంపై కేటీఆర్ మండిపడ్డారు.
మరోవైపు ఎంపీ ధర్మపురి అరవింద్‌కు పంపిన నోటీసులో ఆయన చేసిన వ్యక్తిగత దూషణలను తప్పుబట్టారు. డ్రగ్స్ సేవించడం, సరఫరా చేస్తున్నారంటూ అరవింద్ చేసిన వ్యాఖ్యలు అక్షేపణీయమని పేర్కొన్నారు.
Read more: CP Sajjanar: నాంపల్లిలో భారీ అగ్ని ప్రమాదం.. నుమాయిష్ సందర్శకులకు సీపీ సజ్జనార్ కీలక సూచనలు..
ఈ ఇద్దరు ఎంపీలు తమ వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని, బహిరంగంగా నిబంధనలు లేని క్షమాపణలు చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. లేకుండా చట్టపరంగా సివిల్, క్రిమినల్ చర్యలు తీసుకుంటామన్నారు. మొత్తంగా ఫోన్ ట్యాపింగ్ అంశం పార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమన్న చందంలా మారింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
.Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి