గడ్డిఅన్నారం: సీవరేజ్ పనులు ప్రారంభించిన కార్పొరేటర్
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Lava Yuva Smart 3 64 Price: ప్రముఖ లావా స్మార్ట్‌ఫోన్ కంపెనీ మార్కెట్‌లోకి దిమ్మతిరిగే ఫీచర్స్‌తో కూడిన మంచి మొబైల్‌ను విడుదల చేయబోతోంది. దీనిని కంపెనీ బడ్జెట్ రేంజ్‌లో లాంచ్ చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఆకుట్టుకునే ఫీచర్స్‌తో పాటు ప్రీమియం లుక్‌తో విడుదల కాబోతోంది. దీనిని కంపెనీ లావా యువ స్టార్ 3 పేరుతో వినియోగదారులకు అందించబోతోంది. అయితే, ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన ఫీచర్స్ వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం..
లావా యువ స్టార్ 3 స్మార్ట్‌ఫోన్ ప్రీమియం డిజైన్‌తో లాంచ్ కాబోతోంది. ముఖ్యంగా ఇది వెనక భాగంలో అద్భుతమైన కెమెరా సెటప్‌ను కూడా కలిగి ఉంటుంది. అంతేకాకుండా దీనిని కంపెనీ ప్రీమియం కెమెరా సెన్సార్స్‌తో అందుబాటులోకి తీసుకు రాబోతోంది. విడుదలకు ముందే ఈ స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన ఫీచర్స్ లీక్ అయ్యాయి.
YTECHB నివేదిక ప్రకారం.. ఈ స్మార్ట్‌ఫోన్ మ్యాట్ బ్లాక్ ఫినిషింగ్‌తో పాటు బ్యాక్ సెటప్‌లో రెండు నిలువు కెమెరాలను కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఇందులో LED ఫ్లాష్ సెటప్ కూడా అందుబాటులో ఉంది. అంతేకాకుండా ఇందులోనే అనేక రకాల ప్రీమియం ఫీచర్స్ లభిస్తున్నట్లు తెలుస్తోంది. లావా యువ స్టార్ 3 స్మార్ట్‌ఫోన్ బ్యాక్ సెటప్‌లో 13MP కెమెరాను కూడా కలిగి ఉంటుంది. అలాగే ఇందులో ప్రత్యేకమైన AI కెమెరా ఫీచర్లు కూడా లభిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్ నలుపుతో పాటు ఇతర రంగుల్లో కూడా విడుదల కాబోతున్నట్లు సమాచారం.. దీనిని కంపెనీ ఆండ్రాయిడ్ 16 ఆపరేటింగ్ సిస్టమ్‌పై రన్ చేయబోతోంది..
Also Read: Redmi 14C 5G Offer: రెడ్‌మీ 5G ఫోన్ కేవలం రూ.6,500కే! సగం ధరకే స్మార్ట్‌ఫోన్..అదిరిపోయే ఆఫర్!
ఈ స్మార్ట్‌ఫోన్ ఎంతో శక్తివంతమైన 5000mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఫ్రంట్ భాగంలో 5MP ఫ్రంట్ సెల్ఫీ కెమెరా కూడా లభిస్తోంది. దీంతో పాటు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా అందుబాటులో ఉంది. అలాగే 6.7-అంగుళాల FHD డిస్‌ప్లేను కలిగి ఉండడమే కాకుండా సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ స్కానర్ కూడా లభిస్తోంది. ఈ లావా యువ స్టార్ 3 స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన ధర వివరాలు కూడా ఇటీవలే లీక్ అయ్యాయి. దీనిని బట్టి చూస్తే.. భారతదేశంలో ధర రూ.10,000 నుంచి ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా వేరియంట్‌ను బట్టి ధరలో కాస్త అటు ఇటు మార్పులు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి.
Also Read: Redmi 14C 5G Offer: రెడ్‌మీ 5G ఫోన్ కేవలం రూ.6,500కే! సగం ధరకే స్మార్ట్‌ఫోన్..అదిరిపోయే ఆఫర్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Iphone 18 Pro Max Price In India: ఈ ఏడాది చివరి నెల లోపే యాపిల్ ఐఫోన్ 18 ప్రో మాక్స్ మార్కెట్‌లోకి లాంచ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. విడుదలకు ముందే ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన ఫీచర్స్‌తో పాటు ధర కూడా లీక్ అయ్యాయి. దీంతో పాటు ఐఫోన్ 18 ప్రో స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన ఫీచర్స్ కూడా అప్పుడు సోషల్ మీడియాల్లో కనిపిస్తున్నాయి. ఈ మొబైల్స్‌లో కంపెనీ గత మోడల్స్ కంటే ఎన్నో రకాల ప్రీమియం ఫీచర్స్ ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా డైనమిక్ ఐలాండ్‌తో సహా ఫ్రంట్ డిజైన్‌లో కంపెనీ అనే ప్రధాన మార్పులను కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది.. కెమెరాలో ఎన్నో రకాల ప్రత్యేకమైన స్పెషిఫికేషన్స్‌ను కూడా అందించబోతున్నట్లు సమాచారం. అయితే, సోషల్ మీడియాలో లీక్ అయిన ఫీచర్స్ వివరాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
యాపిల్ ఫ్లాగ్‌షిప్ మోడల్స్ ఐఫోన్ 18 ప్రోతో పాటు ఐఫోన్ 18 ప్రో మాక్స్ స్మార్ట్‌ఫోన్స్ విడుదలకు ముందే వార్తల్లో నిలుస్తున్నాయి. ముఖ్యంగా ఈ రెండు స్మార్ట్‌ఫోన్స్‌కి సంబంధించిన డిస్ల్పే ఫీచర్స్ వివరాల్లోకి వెళితే.. ఐఫోన్ 18 ప్రో మోడల్ స్మార్ట్‌ఫోన్ 6.3-అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉండబోతున్నట్లు లీక్ అయిన వివరాలు చెబుతున్నాయి. ఇక ప్రో మాక్స్‌లో 6.9-అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. డైనమిక్ ఐలాండ్ కోసం పిల్-ఆకారపు కటౌట్‌ను కూడా కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది.. అలాగే ఇందులో కంపెనీ ఫేస్ ఐడిని డిస్ల్పే కింద అందిస్తున్నట్లు సమాచారం..
ఈ రెండు స్మార్ట్‌ఫోన్స్ డిజైన్ వివరాల్లోకి వెళితే..ఐఫోన్ 18 ప్రోతో పాటు ఐఫోన్ 18 ప్రో మాక్స్ వెనక ప్యానెల్ చాలా అద్భుతంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఇందులో కంపెనీ ట్రిపుల్ కెమెరాలను కలిగి ఉండబోతున్నట్లు సమాచారం. ఈ మొబైల్ అల్యూమినియం ఫ్రేమ్‌తో పాటు గ్లాస్ బ్యాక్ ప్యానెల్‌తో అందుబాటులోకి రాబోతోంది. ఇది రెండు కలర్ ఆప్షన్స్‌లో అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. ప్రత్యేకంగా ఇందులో కాఫీ బ్రౌన్ కలర్ కూడా లభించబోతోంది.
ఐఫోన్ 18 ప్రో మాక్స్ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన కెమెరా వివరాల్లోకి వెళితే.. ఇది బ్యాక్ సెటప్‌లో ఎంతో శక్తివంతమైన కెమెరాను కలిగి ఉంటుంది. అంతేకాకుండా చికటిలో కూడా అద్భుతమైన ఫోటోగ్రాఫీని అందించేందుకు అద్భుతమైన లెన్స్‌ను కూడా అందిస్తోంది. ఇందులో సాంసంగ్ సెన్సార్స్ కూడా అందుబాటులో ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే ప్రత్యేకమైన టెలిఫోటో కెమెరా లెన్స్‌ను కూడా కలిగి ఉంటుంది. దీంతో పాటు నైట్ ఫోటోగ్రఫీ కోసం ప్రత్యేమైన సెన్సార్‌ను అందిస్తోంది.
ఐఫోన్ 18 ప్రో మాక్స్ స్మార్ట్‌ఫోన్‌లో కంపెనీ చాలా ప్రత్యేకమైన A20 ప్రో చిప్‌సెట్ ప్రాసెసర్‌ను కలిగి ఉంటుంది. ఈ చిప్‌సెట్ 2nm ప్రాసెస్‌పై తయారు చేసిన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఇందులో కంపెనీ ఎంతో శక్తివంతమైన 5100mAh బ్యాటరీని అందిస్తోంది. కాబట్టి ఈ స్మార్ట్‌ఫోన్ దాదాపు 240 గ్రాముల వరకు బరువును కలిగి ఉండే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, పాత మోడళ్ల కంటే కొంచెం బరువుగా ఉండే ఛాన్స్‌లు ఉన్నట్లు తెలుస్తోంది.. కనెక్టివిటీ కోసం C2 మోడెమ్‌ను ఇందులో అందుబాటులో ఉంచిన్నట్లు తెలుస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్ ధరల వివరాల్లోకి వెళితే.. ఐఫోన్ 18 ప్రో స్మార్ట్‌ఫోన్ బేస్ వేరియంట్ ధర రూ.1,65,000 నుంచి ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి.
Also Read: Redmi 14C 5G Offer: రెడ్‌మీ 5G ఫోన్ కేవలం రూ.6,500కే! సగం ధరకే స్మార్ట్‌ఫోన్..అదిరిపోయే ఆఫర్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Gold Price Drop Reasons: బులియన్ మార్కెట్‌లో గత కొన్ని రోజులుగా బంగారం, వెండి ధరలు ఊహించని విధంగా పతనమవుతున్నాయి. ముఖ్యంగా వెండి ధరలు భారీగా పడిపోవడం పెట్టుబడిదారులను విస్మయానికి గురిచేస్తోంది. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో వెండి ధరలు భారీ క్షీణతను నమోదు చేస్తున్నాయి. గత కొన్ని రోజులుగా పెరుగుతూ వచ్చిన వెండి మెరుపు ఒక్కసారిగా తగ్గింది. శుక్రవారం ఒక్కరోజే వెండి ధరల్లో భారీ కదలికలు కనిపించాయి.
వెండి ధరల స్థితిగతులు
నేడు వెండి కిలోకు రూ.2,35,221 వద్ద ట్రేడవుతోంది. నిపుణుల విశ్లేషణ ప్రకారం.. వెండి ధరలు గత 50 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టేలా తగ్గుతున్నాయి. గత కొన్ని రోజుల్లోనే వెండి విలువలో 46% పైగా క్షీణత కనిపించింది. ఇదే ట్రెండ్ వచ్చే వారం కూడా కొనసాగితే, వెండి ధర రూ.2 లక్షల దిగువకు పడిపోయే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
బంగారం ధరల అప్‌డేట్
బంగారం ధర కూడా వెండి బాటలోనే నడుస్తోంది. దేశీయ మార్కెట్‌లో 10 గ్రాముల బంగారం (24 క్యారెట్) ధర సుమారు రూ.1,53,710 వద్ద ఉంది. వెండితో పోలిస్తే బంగారం తగ్గుదల శాతం తక్కువగా ఉన్నప్పటికీ, ధరల హెచ్చుతగ్గులు కొనుగోలుదారులను అయోమయంలో పడేస్తున్నాయి.
ధరలు పడిపోవడానికి కారణాలు?
గ్లోబల్ మార్కెట్‌లో చోటు చేసుకుంటున్న మార్పులే ఈ పతనానికి యూఎస్ డాలర్ బలపడడమే ప్రధాన కారణంగా తెలుస్తోంది. డాలర్ ఇండెక్స్ రెండు వారాల గరిష్ట స్థాయికి చేరింది. డాలర్ బలపడితే ఇతర కరెన్సీలు వాడే దేశాలకు బంగారం కొనుగోలు భారమవుతుంది, ఫలితంగా డిమాండ్ తగ్గి ధరలు పడిపోతాయి.
అమెరికా - చైనా మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు సడలడం వల్ల మార్కెట్‌లో అనిశ్చితి తగ్గింది. యుద్ధ మేఘాలు తొలగిపోతుండటంతో, పెట్టుబడిదారులు సురక్షితమైన బంగారం, వెండి నుండి తమ నిధులను ఉపసంహరించుకుని స్టాక్ మార్కెట్ల వైపు మళ్లుతున్నారు.
అంతర్జాతీయ మార్కెట్‌లో ప్రభావం
ఈ సంక్షోభం కేవలం భారతదేశానికే పరిమితం కాలేదు. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ఔన్సుకు సుమారు $4,838.81 వద్ద ఉంది. వెండి ధరలు ప్రపంచవ్యాప్తంగా దాదాపు 14.9% పతనమై $74.94 వద్ద ట్రేడవుతున్నాయి.
వెండి ధరలు రూ.2 లక్షల దిగువకు వస్తాయనే వార్త కొనుగోలుదారులకు తీపి కబురు అయినప్పటికీ, మార్కెట్ సెంటిమెంట్ ప్రస్తుతానికి బలహీనంగా ఉంది. మరిన్ని పెట్టుబడులు పెట్టే ముందు మార్కెట్ గమనాన్ని గమనించడం ఉత్తమం.
Also Read: Mercury Transit 2026: ఈ 3 రాశుల వారికి గడ్డు కాలం..ఆర్థిక, ఆరోగ్య విషయాల్లో తస్మాత్ జాగ్రత్త!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Jogi Ramesh Residence: 'అరాచకాలు ప్రశ్నిస్తే భౌతిక దాడులు చేస్తారా? నాగరిక సమాజం తల దించుకునేలా చంద్రబాబు చర్యలు ఉన్నాయి' అని మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయం కోసం దేవుణ్ని వాడుకున్న వ్యక్తి చంద్రబాబు అని మండిపడ్డారు. 'అబద్ధాన్ని సృష్టించి రెక్కలు కట్టి దుష్ప్రచారం చేశారు. చంద్రబాబువి అబద్దాలని సీబీఐ ఛార్జ్‌షీట్ తేల్చేసింది. తిరుమలలో వాడిన నెయ్యిలో జంతుకొవ్వు లేనే లేదు. దాన్నే ఎన్‌డీఆర్‌ఐ, ఎన్‌డీడీబీ ల్యాబ్‌లు నిర్థారించాయి' అని వెల్లడించారు.
Also Read: YS Jagan Tour: వైఎస్ జగన్ పర్యటనలో అపశ్రుతి.. ఇద్దరు మృతి
ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో టీడీపీ గుండాల దాడిలో ధ్వంసమైన మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటిని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ సందర్శించారు. టీడీపీ గూండాల దాడిలో విధ్వంసమైన వస్తువులు.. పెట్రోల్ బాంబు వేయడంతో దగ్ధమైన ప్రాంతాన్ని చూశారు. అనంతరం జోగి రమేష్ కుటుంబాన్ని పరామర్శించి.. వారికి ఓదార్పునిచ్చారు. ఏ మాత్రం అధైర్య పడొద్దని, పార్టీ పూర్తి అండగా ఉంటుందని జోగి రమేశ్ కుటుంబానికి మజీ సీఎం వైఎస్ జగన్ భరోసా ఇచ్చారు.
Also Read: World Cup 2026: చిచ్చరపిడుగులా చిరుతపులుల్లా.. అండర్ 19 ప్రపంచకప్ చాంపియన్ భారత్
అనంతరం మాజీ సీఎం జగన్ మాట్లాడుతూ చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. 'అంబటి రాంబాబు, జోగి రమేష్ ఇళ్లపై దాడులు హేయం. అందరూ చూస్తుండగా గంటలకొద్దీ సర్వం విధ్వంసం
అంబటి ఇంట్లో 5 కార్లు ధ్వంసం చేశారు. అన్నీ పగలగొట్టారు. అంబటి రాంబాబుపై ఏకంగా హత్యా ప్రయత్నం చేశారు. జోగి రమేష్ ఇంటిపై ఏకంగా పెట్రోల్ బాంబులు, యాసిడ్ బాటిళ్లు కూడా విసిరేశారు. నిప్పు పెట్టారు. ఇది కూడా హత్యా ప్రయత్నం కాక మరేమిటి?' అని వైఎస్ జగన్ ప్రశ్నించారు.
Also Read: KT Rama Rao: తెలంగాణకు కాంగ్రెస్, బీజేపీలు చేసిందేమీ లేదు: కేటీఆర్
'పోలీసుల సమక్షంలోనే రెండు చోట్ల దాడులు. గుంటూరు, ఇబ్రహీంపట్నం ఘటనల్లో వారి ప్రమేయం ఉంది. టీడీపీ గుండాలకు కొందరు పోలీసులు సహకరించారు. మరి ఇది జంగిల్‌రాజ్ కాదా?' అని వైఎస్ జగన్ నిలదీశారు. 'వైవీ సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్‌రెడ్డి తప్పు చేయలేదు. అందుకే వారి పేర్లు ఛార్జ్‌షీట్‌లో పెట్టలేదు. అరెస్టు చేయలేదు. అయినా చంద్రబాబు, లోకేష్, పవన్ అదే తప్పుడు ప్రచారం. సుప్రీంకోర్టు ఆదేశాలతో సీబీఐ పని చేసి రిపోర్టు ఇచ్చింది. వాస్తవాంశాలు, ల్యాబ్‌ల నివేదికలతో సిట్ ఛార్జ్‌షీట్ దాఖలు. అయినా చేసిన తప్పు ఒప్పుకోకుండా ఎదురుదాడి' అని వివరించారు.
'తిరుమల నెయ్యి వివాదంపై ఇప్పుడు వన్‌మ్యాన్ కమిషన్‌తో అనుకూల నివేదిక కుట్ర. ఏ మాత్రం విలువ ఉండని ఆ వన్‌మ్యాన్ కమిషన్' అని మాజీ సీఎం వైఎస్ జగన్ స్పష్టం చేశారు. 'తప్పు చేసిన, చేస్తున్న ఎవ్వరినీ వదలి పెట్టబోం సుప్రీంకోర్టు తలుపు కూడా తడుతాం. రాష్ట్రంలో జంగిల్‌రాజ్‌ను ఎండగడతాం. మరో మూడేళ్లలో వచ్చేది మా ప్రభుత్వమే' అని ధీమా వ్యక్తం చేశారు. 'ఇప్పుడు తప్పు చేస్తున్న పోలీసులు, అధికారులు. నాయకులు, గుండాగిరి చేస్తున్న ప్రతి ఒక్కరూ అందరినీ బోనులో నిలబెడతాం. వారికి శిక్ష తప్పదు' అని వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ హెచ్చరించారు.
'అబద్ధాన్ని సృష్టించి రెక్కలు కట్టి దుష్ప్రచారం చేశారు. కానీ చంద్రబాబువి అబద్దాలని సీబీఐ ఛార్జ్‌షీట్ తేల్చేసింది. తిరుమలలో వాడిన నెయ్యిలో జంతుకొవ్వు లేదని, దాన్నే ఎన్‌డీఆర్‌ఐ, ఎన్‌డీడీబీ ల్యాబ్‌లు నిర్థారించాయి' అని మాజీ సీఎం వైఎస్ జగన్ గుర్తు చేశారు. రాజకీయం కోసం దేవుణ్ని వాడుకున్న వ్యక్తి చంద్రబాబు అని మండిపడ్డారు. చేసిన తప్పు ఒప్పుకోకుండా ఎదురుదాడి చేస్తున్నారని, ఇప్పుడు వన్‌మ్యాన్ కమిషన్‌తో అనుకూల నివేదిక కోసం చంద్రబాబు కుట్ర చేస్తున్నారని, అయితే ఆ కమిషన్‌కు ఏ మాత్రం విలువ ఉండదని తేల్చి చెప్పారు. తప్పు చేసినవారిని.. చేస్తున్న వారిని ఎవరినీ వదలి పెట్టబోమని ప్రకటించారు. సుప్రీంకోర్టు తలుపు కూడా తడుతామని తెలిపారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Telangana Municipal Elections: కాంగ్రెస్ పార్టీ కరీంనగర్‌లో చేతులెత్తేసిందని.. ఓడిపోతుందని తెలిసే కరీంనగర్‌కు రేవంత్ రెడ్డి రాకుండా పారిపోయారని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ విమర్శించారు. ఎంఐఎం పార్టీకి కాంగ్రెస్ మేయర్ పదవి ఆఫర్ ఇచ్చిందని ఆరోపించారు. 'ముస్లిం ఓట్ల కోసం కాంగ్రెస్ లోపాయికారీ ఒప్పందం చేసుకుంది. కేంద్రం నిధులిస్తే.. అవి మేమే తెచ్చామనడానికి సిగ్గు లేదా? కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటేయాలి?' అని ప్రశ్నించారు. ఢిల్లీ నుంచి గల్లీకి నిధులు తెచ్చే దమ్ము బీజేపీకే ఉందని ప్రకటించారు.
Also Read: World Cup 2026: చిచ్చరపిడుగులా చిరుతపులుల్లా.. అండర్ 19 ప్రపంచకప్ చాంపియన్ భారత్
మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కరీంనగర్‌లోని 10, 11 డివిజన్‌లలో కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రచారం చేశారు. కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుందని ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా సమాచారం తెలుసుకున్న రేవంత్ రెడ్డి కరీంనగర్‌కు రాకుండా చొప్పదండికే పరిమితమయ్యారని ఎద్దేవా చేశారు. ఘోర ఓటమి తథ్యమని తెలిసిన కాంగ్రెస్ పార్టీ ఎంఐఎం పార్టీకి మేయర్ పదవి ఇచ్చేందుకు లోపాయికారీ ఒప్పదం చేసుకుందని ఆరోపించారు.
Also Read: KT Rama Rao: తెలంగాణకు కాంగ్రెస్, బీజేపీలు చేసిందేమీ లేదు: కేటీఆర్
'కేంద్ర నిధులు తెచ్చి అభివృద్ధి పనులు చేయించి నేను బుక్‌లెట్ ఇంటింటికీ పంపిస్తుంటే.. వాళ్లకు భయమేసి ఇప్పుడు కరపత్రం కొట్టించి మేమే కేంద్రం నుంచి నిధులు తెచ్చారని చెప్పడం సిగ్గు చేటు' అని కాంగ్రెస్‌పై బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 'కరీంనగర్ కార్పొరేషన్ లో కాంగ్రెస్ పూర్తిగా చేతులెత్తేసింది. ఈ విషయం తెలియడంతోనే రేవంత్ రెడ్డి కరీంనగర్‌కు రాకుండా చొప్పదండిలో మీటింగ్ పెట్టి అటు నుంచి అటు పారిపోయిండు' అని బండి సంజయ్ విమర్శించారు. 'ఇక్కడున్న కాంగ్రెస్ నాయకుల గురించి చెప్పాల్సిన పనే లేదు. అట్లాంటి పార్టీకి ఎందుకు ఓటేయాలి?' అని ప్రశ్నించారు.
Also Read: Velama Community: రేవంత్ రెడ్డి జాతి వ్యాఖ్యలపై వెలమ సంఘాల సంచలన నిర్ణయం
ఆరు గ్యారంటీలను అమలు చేశారా? పేదలకు ఇండ్లు ఇచ్చారా? మహిళలకు రూ.2,500, తులం బంగారం, స్కూటీ ఇచ్చారా? అవ్వాతాతలకు రూ.6 వేలు ఇచ్చారా?' అని రేవంత్ రెడ్డిని బండి సంజయ్ నిలదీశారు. పొరపాటున కాంగ్రెస్ పార్టీ ఓటేస్తే ఎన్నికలైన వెంటనే ఇంటి పన్ను, నల్లాపన్ను సహా అన్ని రకాల పన్నులు పెంచి ప్రజల నడ్డి విరగ్గొడతారని తెలిపారు. ఆఖరికి రోడ్డుపై నడవాలంటే కూడా పన్నులు బాదుతారు జాగ్రత్త అని ప్రజలకు సూచించారు. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని బండి సంజయ్ విజ్ఞప్తి చేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Saturn And Venus Conjunction Effect On Zodiac Telugu: మార్చి నెల గ్రహ సంచారాలపరంగా చాలా ముఖ్యమైనదిగా జ్యోతిష్యులు చెబుతున్నారు. ఎందుకంటే ఇదే సమయంలో అనేక గ్రహాల సంయోగం కూడా జరగబోతోంది. ముఖ్యంగా కొన్ని గ్రహాలు సంచారం చేయడమే కాకుండా తిరోగమనం కూడా చేయబోతున్నాయి. ముఖ్యంగా శని, శుక్ర గ్రహాల కలయిక జరగబోతోంది. దీని కారణంగా అద్భుతమైన శుభ ప్రభావం అన్ని రాశుల వారిపై పడుతుంది. ముఖ్యంగా శుక్రుడు మార్చి రెండున మీనరాశిలోకి ప్రవేశిస్తాడు. అక్కడ శని ఇప్పటికే సంచార దశలో ఉన్నాడు. 2025 సంవత్సరం వరకు అక్కడే ఉంటాడు. మార్చి నెలలో మీనరాశిలో అనేక గ్రహాల కలయిక జరుగుతుంది. దీంతో నాలుగు రాశుల వారిపై అపారమైన ప్రభావం పడుతుంది. ఈ సమయంలో ఆయా రాశుల వారికి ఊహించని ప్రయోజనాలు కూడా కలుగుతాయి. ఆర్థికంగా చాలా మేలు జరిగే అవకాశాలున్నాయి. అయితే, మరి కొన్ని రాశుల వారికి మాత్రం కొన్ని రకాల దుష్ప్రభావాలు కలుగుతాయి. అయితే ఈ సమయంలో ఏ రాశుల వారిపై ఎలాంటి ప్రభావం పడుతుందో తెలుసుకోండి.
ఈ రాశుల వారికి శని, శుక్ర సంయోగం ప్రభావం..
మీన రాశి
శని, శుక్ర గ్రహాల కలయిక మీన రాశి వారికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ముఖ్యంగా వీరికి ఈ సమయంలో అనేక రకాల ప్రయోజనాలతో పాటు ఆర్థికంగా కలిసి రాబోతోంది. ముఖ్యంగా ఖర్చులు కూడా కలిసి వచ్చి ఆర్థిక నష్టాలు సంభవించకుండా ఉంటాయి. అలాగే ఈ సమయంలో కొన్ని రకాల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండడం మేలు..
కర్కాటక రాశి
శని, శుక్ర గ్రహాల కలయిక కారణంగా కర్కాటక రాశి వారికి ఉద్రిక్తతలు, విభేదాలు విపరీతంగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. అలాగే కెరీర్ పరంగా అనేక సమస్యలు కూడా వస్తాయి. ముఖ్యంగా ఆశించిన ఫలితాలు రాకపోవడం కారణంగా మానసిక సమస్యల బారిన పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే క్రమంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది.
సింహరాశి
సింహ రాశి వారికి కూడా అనేక సంబంధాలు ఏర్పడినప్పటికీ.. ఈ సమయంలో చిన్న చిన్న విభేదాలు తలెత్తే అవకాశాలు కనిపిస్తున్నాయి. జాగ్రత్తగా లేకపోతే కొన్ని రకాల చిక్కుల్లో పడే అవకాశాలు కూడా ఉన్నాయి. వ్యక్తిగత నష్టాలు గణనీయంగా ఉండవచ్చు. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం మేలు. అంతేకాకుండా ఆర్థిక నష్టాలను కూడా తగ్గించుకోవలసి ఉంటుంది.
Also Read: Mercury Transit 2026: మకరంలో తిష్ట వేసిన బుధుడు.. ఈ రాశుల వారికి కోటీశ్వరులయ్యే యోగం ప్రారంభం!
వృశ్చిక రాశి
శని, శుక్ర సంయోగం కారణంగా వృశ్చిక రాశి వారికి కొన్ని రకాల సైద్నాంధిక విభేదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే కొనసాగుతున్న అనేక సమస్యల్లో ఆకస్మికంగా మరికొన్ని సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా వీరు డ్రైవ్ చేసే సమయంలో చాలా జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. అలాగే మొండితనం విడిచి జీవితాన్ని ముందుకు సాగించాల్సి ఉంటుంది.
Also Read: Mercury Transit 2026: మకరంలో తిష్ట వేసిన బుధుడు.. ఈ రాశుల వారికి కోటీశ్వరులయ్యే యోగం ప్రారంభం!

Also Read: Mercury Transit 2026: మకరంలో తిష్ట వేసిన బుధుడు.. ఈ రాశుల వారికి కోటీశ్వరులయ్యే యోగం ప్రారంభం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
KTR Speech: 'ఆరు గ్యారంటీలతోపాటు ఇచ్చిన హామీల అమలులో విఫలమవడం.. పరిపాలన వైఫల్యాలతో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలను మోసం చేస్తోంది. మరోవైపు కుల మతాల పేరుతో ఓట్లు అడుగుతూ బీజేపీ ఎన్నికల అప్పుడు ఓట్లు వేయించుకుంటుంది. ఈ రెండు పార్టీలకు మున్సిపల్ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలి' అని ప్రజలకు మాజీ మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసి కేసీఆర్‌ని మరోసారి సీఎం చేసుకునే ప్రస్థానాన్ని ప్రారంభించాలని విజ్ఞప్తి చేశారు. ఆరు గ్యారెంటీలు, కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు కావాలంటే ఆ పార్టీని ఓడించాలని సూచించారు.
Also Read: YS Jagan Tour: వైఎస్ జగన్ పర్యటనలో అపశ్రుతి.. ఇద్దరు మృతి
వేములవాడలో శుక్రవారం భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ మున్సిపల్ ఎన్నికల ప్రచారం చేశారు. పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేసిన కేటీఆర్ అనంతరం కీలక ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు చేస్తున్న అన్యాయాలపై విరుచుకు పడ్డారు. ఈ రెండు పార్టీలను మున్సిపల్ ఎన్నికల్లో ఓడించాలని విజ్ఞప్తి చేశారు. ఎన్నికల ప్రచారంలో వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ బాండ్ పేపర్ మీద రాసి ఇచ్చి ఆరు గ్యారెంటీలు అన్నింటిని వంద రోజుల్లో అమలు చేస్తానని చెప్పిన విషయాన్ని కేటీఆర్ బాండ్ పేపర్‌తో సహా చూపించి గుర్తుచేశారు.
Also Read: Velama Community: రేవంత్ రెడ్డి జాతి వ్యాఖ్యలపై వెలమ సంఘాల సంచలన నిర్ణయం
'కాంగ్రెస్ పార్టీ దొంగ మాటలతో అధికారంలోకి వచ్చి అడ్డగోలు హామీలు చెప్పి పదవి ఎక్కిన తర్వాత ప్రజలను మోసం చేస్తోందని మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు. వేములవాడలో ఆది శ్రీనివాస్ హామీల అమలు నుంచి మొదలుకొని అభివృద్ధి వరకు అడ్రస్ లేకుండా పారిపోయాడని ఆరోపించారు. మంత్రి పదవి కావాలనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి కాళ్లు పట్టుకుంటున్న ఆది శ్రీనివాస్ వేములవాడ నియోజకవర్గానికి ఏమి చేశారో చెప్పాలని సవాల్ చేశారు.
Also Read: DA Hike: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు.. 19 శాతం డీఏ పెంపు
ఆరు గ్యారెంటీలలో కనీసం ఒక్కదాన్నైనా అమలు చేశారా అని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. ఇన్ని రకాల మోసాల తర్వాత, ద్రోహాల తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే ప్రజలకు అంతకు మించిన తప్పు మరొకటి ఉండదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ చెప్పిన హామీలు రూ.4 వేల పెన్షన్, ఆసరా పెన్షన్ నుంచి రైతు భరోసా, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ , తులం బంగారం రావాలన్నా ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేయాలని మాజీ మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు.
కేంద్ర మంత్రిగా ఉన్న బండి సంజయ్ కూడా చేసింది ఏమీ లేదని.. తెలంగాణకు కేంద్రంలోని బీజేపీ ఎలాంటి లబ్ధి చేయలేదని మాజీ మంత్రి కేటీఆర్ గుర్తుచేశారు. రూ.15 లక్షలు ప్రతి ఇంటికి ఇస్తానని చెప్పిన మోదీ ఆ తర్వాత ఇచ్చిన హామీలన్నింటినీ పక్కన పెట్టారని తెలిపారు. ఎన్నికలు రాగానే దేవుడి పేరు చెప్పి కులం, మతం పేరు చెప్పి బీజేపీ ఓట్లు ప్రజలతో వేయించుకుంటుందని కేటీఆర్ విమర్శించారు. ఈసారి కూడా బీజేపీ దొంగ మాటలకు మోసపోవద్దని సూచించారు. పేదోళ్ల కడుపులు నింపి తండ్రి లెక్క చూసుకొని తెలంగాణ తెచ్చిన వారెవరో గుర్తుంచుకొని బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Motorola Edge 50 Fusion Price: ప్రముఖ స్మార్ట్ ఫోన్ కంపెనీ మోటోరోలా ఎడ్జ్ సిరీస్ మొబైల్‌కి అద్భుతమైన డిమాండ్ ఉంది. ముఖ్యంగా ప్రీమియం ఫీచర్స్‌తో తక్కువ ధరల్లో అందుబాటులోకి రావడం వల్ల చాలామంది వీటిని ఎగబడి మరీ కొనుగోలు చేస్తున్నారు. ముఖ్యంగా ఎడ్జ్ 50 సిరీస్ మొబైల్స్‌ని విచ్చలవిడిగా కొనుగోలు చేస్తున్నారు. అందులో ఎడ్జ్ 50 ఫ్యూజన్ ఎక్కువగా యువత కొంటున్నారు. అయితే, మీరు కూడా ఎప్పటినుంచో ఈ స్మార్ట్‌ఫోన్‌ను అత్యంత తక్కువ ధరతోనే ఎక్స్చేంజ్ బోనస్‌తో కొనుగోలు చేయాలనుకుంటే ఇదే మంచి అవకాశం..
ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న Motorola Edge 50 Fusion స్మార్ట్‌ఫోన్ ఎన్నో రకాల అద్భుతమైన ఫీచర్లతో అందుబాటులో ఉంది. ముఖ్యంగా ఇది శక్తివంతమైన కెమెరా ఫీచర్స్‌తో లభిస్తోంది. అలాగే వినియోగదారుడు ఈ స్మార్ట్ ఫోన్‌ను ఆకర్షించేందుకు అద్భుతమైన డిజైన్తో లభిస్తుంది. ఇక మధ్యతరగతి కుటుంబానికి సంబంధించిన వారు ఎక్కువ ఫీచర్లు ఉన్న ఫోన్ కావాలనుకుంటే ఇదే బెస్ట్..Motorola Edge 50 Fusion స్మార్ట్‌ఫోన్ 6.7-అంగుళాల p-OLED కర్వ్‌డ్ డిస్‌ప్లే ను కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఇది 144Hz రిఫ్రెష్ రేట్‌తో లభిస్తోంది. ఇక ఈ స్క్రీన్ 1,600 నిట్స్ గరిష్ట బ్రైట్‌నెస్‌ను కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఇది చాలా ప్రత్యేకమైన కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ తో లభిస్తోంది.
ఇక ఈ స్మార్ట్ ఫోన్ చాలా ప్రత్యేకమైన క్వాల్‌కామ్ Snapdragon 7s Gen 2 చిప్‌సెట్ ప్రాసెసర్ ను కలిగి ఉంటుంది. ముఖ్యంగా గేమింగ్ ఆడే యువతకు చాలా బాగా పనికొస్తుంది. ఇక మల్టీ టాస్కింగ్ చేసే వారికి ఇది చాలా అద్భుతంగా ఉంటుంది. వెనక భాగంలో కూడా చాలా ప్రత్యేకమైన కెమెరా సెటప్‌తో లభిస్తుంది. ఈ మొబైల్ వెనుక భాగంలో 50MP సోనీ LYTIA 700C మెయిన్ కెమెరా అందుబాటులో ఉంది. అంతేకాకుండా అదనంగా 13MP అల్ట్రావైడ్ మైక్రో షాట్స్ కెమెరా కూడా లభిస్తోంది. ఇక దీని ఫ్రంట్ భాగంలో 32MP హై-రిజల్యూషన్ కెమెరా కూడా అందుబాటులో ఉంటుంది. అలాగే ఇది ఎంతో శక్తివంతమైన 5,000mAh బ్యాటరీ సామర్థ్యంతో లభిస్తోంది.
ఈ స్మార్ట్‌ఫోన్ చాలా ప్రత్యేకమైన 68W టర్బో ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తోంది. కాబట్టి కేవలం 15 నిమిషాల్లోనే రోజంతా సరిపోయే చార్జింగ్ అందిస్తుంది. ఇక ఇది ఆండ్రాయిడ్ 14 ఆధారిత 'Hello UI' ఆపరేటింగ్ సిస్టంపై రన్ అవుతుంది. అంతేకాకుండా ఇన్-డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, డ్యూయల్ స్టీరియో స్పీకర్ వంటి ప్రత్యేకమైన ఫీచర్స్ ను కూడా కలిగి ఉంటుంది. ప్రస్తుతం మార్కెట్‌లో ఈ మొబైల్ రెండు స్టోరేజ్ ఆప్షన్స్‌లో అందుబాటులో ఉంది.. ఇందులోని మొదటి స్టోరేజ్ వేరియంట్ 128GB ఇంటర్నల్ స్టోరేజ్‌ను కలిగి ఉంటుంది. దీని ధర మార్కెట్‌లో రూ.18,999తో అందుబాటులోకి వస్తుంది. అలాగే రెండవ వేరియంట్ 256gb ఇంటర్నల్ స్టోరేజ్‌ను కలిగి ఉంటుంది. ఇక ఇది మార్కెట్లో రూ.21,999 ధరతో లభిస్తోంది.
ప్రస్తుతం ఈ మొబైల్‌పై ఫ్లిప్‌కార్ట్‌లో అద్భుతమైన డిస్కౌంట్ ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి. బేస్ వేరియంట్ స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేసే వారికి అత్యంత తగ్గింపు ధరలోని ఇది పొందవచ్చు. దీనిపై ఉన్న స్పెషల్ బ్యాంక్ ఆఫర్స్‌లో భాగంగా ఫ్లిప్‌కార్ట్ అనుసంధాన యాక్సిస్ లేదా ఎస్బిఐ బ్యాంకులకు సంబంధించిన క్రెడిట్ కార్డులను వినియోగించి పేమెంట్ చేసే వారికి రూ.1000 వరకు తగ్గింపు లభిస్తుంది. అలాగే ఎక్స్చేంజ్ బోనస్ ఆఫర్‌ను వినియోగించి పేమెంట్ చేసే వారికి ఈ స్మార్ట్‌ఫోన్ చాలా చీప్ ధరకే లభిస్తుంది. అయితే, ఈ ఆఫర్ పొందాలనుకునే వారు తప్పకుండా ఏదైనా మొబైల్ ఎక్స్చేంజ్ చేయాల్సి ఉంటుంది. ఇలా చేస్తే దాని వ్యాల్యూని బట్టి ఏకంగా రూ.15 వేల వరకు బోనస్ లభిస్తుంది. దీనిని కొత్త స్మార్ట్‌ఫోన్ ధర నుంచి తీసేస్తే.. రూ.4 వేల లోపే ఈ మొబైల్ సొంతం చేసుకోవచ్చు.
Also Read: Redmi 14C 5G Offer: రెడ్‌మీ 5G ఫోన్ కేవలం రూ.6,500కే! సగం ధరకే స్మార్ట్‌ఫోన్..అదిరిపోయే ఆఫర్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
YS Jagan Tour: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తీవ్ర సంచలన పరిణామాలు చోటుచేసుకుంటుండగా.. తమ పార్టీ నాయకుల నివాసాలపై టీడీపీ గూండాలు దాడులు జరగడాన్ని వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. అంబటి రాంబాబు, జోగి రమేశ్ నివాసాలపై దాడిని ఖండించిన ఆయన బాధిత కుటుంబాలను పరామర్శించి.. వారికి ధైర్యం చెప్పారు. అయితే జోగి రమేశ్ పరామర్శ కార్యక్రమంలో అనుకోని సంఘటన చోటుచేసుకుంది. జగన్ పర్యటనలో ఇద్దరు మృతి చెందారు. ఈ విషాద సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
Also Read: Velama Community: రేవంత్ రెడ్డి జాతి వ్యాఖ్యలపై వెలమ సంఘాల సంచలన నిర్ణయం
ఇబ్రహీంపట్నంలో మాజీ మంత్రి జోగి రమేశ్ నివాసంపై ఇటీవల టీడీపీ గూండాలు దాడి చేయడమే కాకుండా పెట్రోల్ బాంబులు విసిరి నిప్పుపెట్టారు. ఈ సంఘటన తీవ్ర రాజకీయ దుమారం రేపింది. ఈ క్రమంలో ఆ కుటుంబాన్ని శుక్రవారం మాజీ సీఎం వైఎస్ జగన్ పరామర్శించారు. ఈ పరామర్శ కార్యక్రమంలో రెండు అపశ్రుతి సంఘటనలు చోటుచేసుకున్నాయి. జగన్ ర్యాలీలో యువకులు బైక్ స్టంట్లు చేస్తూ ప్రమాదానికి గురయ్యాయి. ఈ ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. మృతి చెందిన యువకుడు ఇబ్రహీంపట్నం కొత్తగేట్‌కు చెందిన భార్గవ్‌గా గుర్తించారు. పోస్టుమార్టం నిమిత్తం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి మృతదేహాన్ని తరలించారు.
Also Read: DA Hike: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు.. 19 శాతం డీఏ పెంపు
జగ్గయ్యపేట మండలం చిల్లకల్లు గ్రామానికి వచ్చిన మాజీ సీఎం వైఎస్ జగన్‌ను చూసేందుకు పెద్ద ఎత్తున వైఎస్సార్‌సీపీ నాయకులు, అభిమానులు తరలివెళ్లారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ చూసేందుకు వెళ్లిన చిలకలు గ్రామానికి చెందిన వైసీపీ పార్టీ నాయకుడు దొంగల రాంబాబు తీవ్ర అస్వస్థతకు గురయి మరణించారు. గుండెపోటుతో రాంబాబు మృతి చెందినట్లు తెలిసింది. ఈ సంఘటనలకు సంబంధించిన వివరాలు మరిన్ని తెలియాల్సి ఉంది.
Also Read: Chandrababu: తిరుమల పవిత్రతని తిరిగి నిలబెట్టేలా పని చేస్తాం: సీఎం చంద్రబాబు
అడుగడుగునా ఆంక్షలు
జగ్గయ్యపేట పర్యటనకు వెళ్తున్న వైఎస్ జగన్‌కు అడుగడుగునా ఆంక్షలు విధించారు. జగన్ కాన్వాయ్ వెళ్లిన అనంతరం అభిమానులు, వైఎస్సార్‌సీపీ నాయకులు వెంట వెళ్లేందుకు పోలీసులు అనుమతించలేదు. జగన్ పర్యటనకు ఆంక్షలు విధించడంతో ఆ పార్టీ నాయకులు, అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పోలీసులతో వాగ్వాదానికి దిగారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Ayushman Card Free Treatment Hospital List News: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఆయుష్మాన్ పథకం కింద చాలామంది నిరుపేద కుటుంబానికి సంబంధించిన రోగులు ఉచిత చికిత్స పొందుతున్నారు. ఈ పథకం పేద కుటుంబ సభ్యులతో పాటు మధ్యతరగతి ఫ్యామిలీస్ కి ఎంతగానో సహాయపడుతోంది.. ముఖ్యంగా ఈ పథకం కింద అర్హులైన వారికి కేంద్రం ఏకంగా ఐదు లక్షల వరకు ఉచిత చికిత్స అందిస్తోంది. ప్రస్తుతం చాలామంది ఎక్కువ మొత్తంలో దీనినే వినియోగిస్తున్నారని సమాచారం. అయితే కొన్ని సందర్భాల్లో ఈ పథకానికి అనుబంధంగా ఉన్న ఆస్పత్రుల వివరాలు తెలుసుకోవడంలో ఇబ్బంది పడుతున్నారు. కొంతమందైతే ఈ పథకం కింద లేని ఆసుపత్రులకు వెళ్లి తీవ్ర ఇబ్బందులు పడి డబ్బు చెల్లిస్తున్నారు.. మీరు కూడా మీ ఏరియాలో ఉన్న ఆయుష్మాన్ భారత్ పథకం కింద పనిచేస్తున్న ఆసుపత్రుల వివరాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ స్టోరీ మీకోసమే..
మీకు దగ్గరగా ఉన్న ఆస్పత్రుల్లో ఆయుష్మాన్ కార్డు అప్లికేబుల్ అవుతుందో లేదో అనే విషయాన్ని కేవలం రెండు నిమిషాల్లోనే చెక్ చేసుకోవచ్చు. ముందుగా hospitals.pmjay.gov.in అని వెబ్సైట్‌ను ఓపెన్ చేయాల్సి ఉంటుంది. అందులో మీకు కావలసిన రాష్ట్రాన్ని ఎంచుకొని.. ఆ తర్వాత మీకు దగ్గరగా ఉన్న జిల్లాను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా పబ్లిక్ లేదా ప్రైవేట్ హాస్పిటల్ రకాన్ని కూడా ఎంచుకోండి. ఇలా ఎంచుకున్న తర్వాత స్క్రీన్ పై కనిపించే కోడ్ అందులో కొట్టేసి సెర్చ్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి
దీంతో వెంటనే మీకు ఆసుపత్రి పేరుతో పాటు చిరునామా, ఫోన్ నెంబర్, అందుబాటులో ఉన్న సౌకర్యాలు పూర్తిగా మీకు ఆ వెబ్సైట్లో కనిపిస్తాయి. ఇలా అన్ని డీటెయిల్స్ ను మీకు కావాలనుకుంటే మీ మొబైల్ లో అధికారికంగా కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ఆయుష్మాన్ యాప్ వార అన్ని వివరాలను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ యాప్ లో నేరుగా ఆస్పత్రులను సెర్చ్ చేయండి అనే ఆప్షన్ కూడా లభిస్తుంది. దీనిని వినియోగించి ఎంతో సులభంగా మీకు దగ్గరగా ఉన్న ప్రదేశాల్లో ఆసుపత్రుల వివరాలను తెలుసుకోవచ్చు.
అంతేకాకుండా ఆయుష్మాన్ భారత్ పథకంలో భాగంగా చదువురాని వారికి ఒక హెల్ప్ లైన్ నెంబర్ను కూడా అందిస్తోంది. దీని ద్వారా కూడా మీకు దగ్గరగా ఉన్న ఆస్పత్రుల వివరాలను సులభంగా తెలుసుకోవచ్చు. దీనికోసం మీ మొబైల్‌లో నేరుగా 14555 లేదా 1800-111-565 నంబర్‌కు కాల్ చేయాల్సి ఉంటుంది. అయితే ఆస్పత్రికి వెళ్లాలనుకునేవారు తప్పకుండా వారి వెంట ఆయుష్మాన్ కార్డుతో పాటు ఆధార్ కార్డును కూడా తీసుకు వెళ్లాల్సి ఉంటుంది. ఆసుపత్రిలో ఆయుష్మాన్ మిత్ర హెల్ప్ డెస్క్ సెంటర్ ఉంటుంది.. అక్కడ వీటిని చూపించి నేరుగా జాయిన్ అవ్వచ్చు.
Also Read: Cobra Hood Video: వామ్మో.. ప్లాస్టిక్ డబ్బాలో పడగ విప్పిన నాగుపాము.. వీడియో ఇదే చూడండి..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Rattlesnake Video Watch: సాధారణంగా అడవులకు దగ్గరగా జీవించేవారు తప్పకుండా కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే అనేక వన్యప్రాణులు జనాభాసాల్లో సంచారం చేసి దాడి చేసే అవకాశాలుంటాయి. ముఖ్యంగా గత కొద్ది రోజుల నుంచి పాములు విపరీతంగా జనాభాసాల్లోకి సంచారం చేస్తున్నాయి. ఎక్కడపడితే అక్కడ చాలామందికి ప్రమాదకరంగా మారుతున్నాయి. ఇలాంటి దాఖలాలు ఇప్పటివరకు ఎన్నో మనం చూసిన సంగతి తెలిసిందే. తాజాగా కూడా ఇలాంటి వీడియోనే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియో ఇప్పుడు సంచలనం రేపుతోంది.. ఈ వీడియోలో ఏముందో? దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో అత్యంత ప్రమాదకరమైన రాటిల్ స్నేక్ చూడొచ్చు.. ఈ వీడియోకు సంబంధించిన వివరాల్లోకి వెళ్తే ఒక వ్యక్తి తన శూలోపల ఏదో కదులుతున్నట్లు గమనించారు.. అయితే, దానిని అలాగే పరీక్షించి చూడగా అతడికి ఒక అత్యంత ప్రమాదకరమైన రాటిల్ స్నేక్ కనిపిస్తుంది. వెంటనే అతను ఒక స్నేక్ క్యాచర్ కి సమాచారం అందిస్తారు. వెంటనే అతను ఆ ఘటన స్థలానికి చేరుకొని పామును రెస్క్యూ చేపట్టేందుకు ప్రయత్నిస్తాడు..
ఇందులో భాగంగానే ఆ స్నేక్ క్యాచర్ మొదటగా ఒక షూను అటు ఇటు కదుపుతాడు. అయితే, అతనికి అందులో ఏది కనిపించదు. ఆ తర్వాత రెండవ దానిని ఒక స్నేక్ స్టిక్‌తో కదిపేందుకు ప్రయత్నిస్తాడు. ఇంతలోనే అత్యంత ప్రమాదకరమైన ఓ చిన్న పాము బయటికి రావడం కనిపిస్తుంది. అంతేకాకుండా అతనిపై ఆ పాము దాడి చేసేందుకు కూడా ప్రయత్నిస్తుంది. ఈ సమయంలో దాదాపు మూడు నుంచి నాలుగు సార్లు ఆ పాము అతనిపై దాడి చేసేందుకు ప్రయత్నించడం మీరు చూడొచ్చు. అయితే ఈ పాము చాలా యాక్టివ్‌గా ఉంది. దానిని పట్టుకోవడం చాలా కష్టతరం అవుతోంది.
అయితే ఆ పాము చాలా యాక్టివ్‌గా ఉండడం వల్ల.. దానిని పట్టుకోవడం కాస్త ప్రమాదకరమని భావించి.. అతను ఆ షూతో పాటు పామును కూడా ఒక బకెట్లో సురక్షితంగా తీసుకొని ఒక సురక్షితమైన ప్రదేశానికి వెళ్తాడు. అక్కడ ఈ పామును వదిలేస్తాడు. ఇప్పుడు దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో ఊహించని స్థాయిలో వైరల్ అవుతున్నాయి. అయితే,త ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలియదు కానీ.. స్నేక్ క్యాచర్ తరపున అక్కడికి వెళ్లిన బృందం వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
Also Read: Cobra Hood Video: వామ్మో.. ప్లాస్టిక్ డబ్బాలో పడగ విప్పిన నాగుపాము.. వీడియో ఇదే చూడండి..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Huge King Cobra Video Watch: సాధారణంగా ఎక్కడైనా అత్యంత ప్రమాదకరమైన పాములు కనిపిస్తే వెంటనే అందరూ స్నేక్ క్యాచర్ కి కాల్ చేస్తూ ఉంటారు. వార అక్కడికి చేరుకొని.. ప్రాణాలకు తెగించి మరి ఎంతో ప్రమాదకరమైన పాములను రెస్క్యూ చేయడంలో క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు. ఇలా వారు పాములు పట్టుకుంటున్న దృశ్యాలను మన తరచుగా చూస్తూ ఉన్నాం. అయితే, మనం వారిని ఎంతో ధైర్యవంతులుగా భావిస్తూ ఉంటాం.. కానీ వారి వెనక ఎన్నో సమస్యలు ఉంటాయి.. కొన్ని కొన్ని సందర్భాల్లో అత్యంత ప్రమాదకరమైన పాముల కాటుకు గురై తీవ్ర సమస్యల బారిన కూడా పడుతూ ఉంటారు. కాబట్టి వీరు చేస్తున్న పనిని గుర్తించి వీరికి తగ్గ గౌరవం ఇవ్వడం చాలా మంచిది.
ముఖ్యంగా సమాజంలో కొంతమంది స్నేక్ క్యాచర్స్ క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు. రోజుకు దాదాపు నాలుగు నుంచి ఐదు అత్యంత ప్రమాదకరమైన పాములను పట్టుకొని రెస్క్యూ చేసేవారు కూడా ఉన్నారు. అందులో సర్పమిత్ర ఆకాష్ జాదవ్ ఒకరు. ఆయన దాదాపు కొన్ని కొన్ని సందర్భాల్లో ఒకేసారి రెండు ప్రమాదకరమైన పాములను పట్టుకున్న దాఖలాలు కూడా ఉన్నాయట.. అంతేకాకుండా ఒకేసారి ఆ రెండింటిని సురక్షితమైన ప్రదేశాల్లో వదిలిపెట్టిన సందర్భాలు ఉన్నాయని అనేక వీడియోల్లో ఈయన పేర్కొన్నారు. తాజాగా కూడా ఆయన రెండు ప్రమాదకరమైన పొడవాటి నాగుపాములను వదిలిపెడుతున్న దృశ్యాలు కూడా వీడియోలో చూడొచ్చు..
ఇప్పటివరకు అతను వందలాది పాములను పట్టుకున్నప్పటికీ ప్రభుత్వం నుంచి లేదా ఇతర నాయకుల నుంచి ఎలాంటి ప్రోత్సాహం అందలేదని వీడియోలో తెలిపారు.. ఈ వృత్తి ఎంచుకున్న వారిలో 70 శాతం మంది నిరుపేదలే అని ఆయన వీడియోలో క్లియర్ గా చెప్పడం మీరు చూడొచ్చు. అంతేకాకుండా కొన్ని సందర్భాల్లో పాములు కాటేసి హాస్పిటల్లో అడ్మిట్ అయినప్పుడు కూడా ఆ చికిత్సకైనా ఖర్చులు వీరి జేబుల నుంచే పెట్టుకోవాల్సి వస్తుందట. ఇలా వీడియోలో చెబుతూ అతను పట్టుకున్న రెండు ప్రమాదకరమైన పాములను వదిలిపెట్టడం మీరు చూడొచ్చు.
ఈ వీడియోలో అతను అడవికి దగ్గరగా ఉన్న ఓ సురక్షితమైన ప్రదేశంలో రెండు పాములను పట్టుకుని వచ్చి.. వదిలిపెట్టేందుకు సిద్ధంగా ఉన్నాడు. ఈ సమయంలో అతను వీడియోలో మాట్లాడుతూ.. స్నేక్ క్యాచర్స్ ఎదుర్కొనే సమస్యల గురించి తెలిపారు. ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియోను అతని యూట్యూబ్ ఛానల్ నుంచి షేర్ చేశారు. ఇప్పటివరకు ఈ వీడియోను కొన్ని వేల మందికి పైగా సోషల్ మీడియా వినియోగదారులు వీక్షించినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా చాలామంది ఈ వీడియోని చూసి ఆశ్చర్యపోయారు.
Also Read: Cobra Hood Video: వామ్మో.. ప్లాస్టిక్ డబ్బాలో పడగ విప్పిన నాగుపాము.. వీడియో ఇదే చూడండి..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Ap CM Chandrababu naidu Sensational comments on Tirumala laddu row: తిరుమల లడ్డు వివాదం ఏపీరాజకీయాల్లో పెనుదుమాంగా మారాయి. ఇప్పటికే సిట్ నివేదికపై వైసీపీ వర్సెస్ కూటమి మధ్య మాటల ఫిరంగులు పేలుతున్నాయి. ఈ క్రమంలో తిరుమల లడ్డు వివాదంను డైవర్ట్ చేసేందుకు అంబటి రాంబాబు,జోగి రమేష్ ఇళ్లపై దాడులు చేశారని వైసీపీ తీవ్ర మైన ఆరోపణలు చేస్తుంది. ఈ క్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి తిరుమల లడ్డు కల్తీపై చేసిన వ్యాఖ్యలు మరోసారి ఏపీలో అగ్గిని రాజేశాయి. దీనిపై శ్రీవారి భక్తులు కూడా తీవ్ర ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. కర్నూల్ లోని ఎమ్మిగనూరు మండలం కలుగొట్ల గ్రామంలో మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో తిరుమల లడ్డు తయారీలో అక్రమాలు జరిగాయన్నారు. లడ్డు తయారీలో కల్తీ జరిగిందన్నారు. 2019 నుంచి 2024 ల మధ్య లడ్డుపై అనేక ఫిర్యాదులు అందాయన్నారు. కూటమి వచ్చాక దీనిపై సమగ్ర విచారణ చేపట్టామన్నారు. ఈవోను మార్చామన్నారు. సమర్థవంతమైన అధికారుల్ని విచారణకు రంగంలోకి దింపి సిట్ ఏర్పాటు చేశామన్నారు. ఎడీడీబీ రిపోర్ట్ తిరుమల లడ్డులో కల్తీ జరిగిందని స్పష్టంగా పేర్కొందని గుర్తు చేశారు.
సిట్ నివేదికను తప్పుగా వైసీపీ ప్రచారం చేస్తున్నారన్నారు. తిరుమలలడ్డుపై విచారణ చేయిస్తున్న తనను సారీ చెప్పాలని అంటున్నారని ఫైర్ అయ్యారు. అంతేకాకుండా తిరుమల లడ్డులో బాత్రూమ్ లో ఉపయోగించే కెమికల్ ను వాడారని మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. గత ఐదేళ్లు ఏపీలోని అన్ని ప్రధాన ఆలయాల్లో కూడా కల్తీ నెయ్యితోనే ప్రసాదాలు తయారు చేశారని సీఎం చంద్రబాబు గత పాలకులపై మండిపడ్డారు. ఈ విషయంను స్వయంగా వైవీ సుబ్బారెడ్డి కూడా చెప్పారన్నారు.
తిరుమల శ్రీవారి పవిత్రతను దిగజార్చేలా గత పాలకులు అనేక అక్రమాలకు పాల్పడ్డారంటూ చంద్రబాబు నిప్పులు చెరిగారు. మొత్తంగా ఏపీ సీఎం చంద్రబాబు వ్యాఖ్యలతో తిరుమల లడ్డు వివాదం మరోసారి ఏపీలోనే కాకుండా దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. దీనిపై శ్రీవారి భక్తులు మాత్రం తీవ్రంగా మండిపడుతున్నారు. వెంటనే దీని వెనకల ఉన్న వారిని పట్టుకుని కఠినంగా పనిష్మెంట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
.Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Sammakka Saralamma Hundi Calculation In Telugu: మనందరికీ మేడారం జాతర అనగానే కోట్లాదిమంది భక్తుల నమ్మకంతో పాటు ఆ తల్లి పై ఉన్న విశ్వాసం గుర్తుకొస్తుంది.. కోరిన కోరికలు తీర్చే అమ్మవార్లుగా.. సమ్మక్క సారలమ్మలను భక్తులు ఎంతో భక్తిశ్రద్ధలతో కొలుస్తూ ఉంటారు.. తాజాగా మేడారంలో జరిగిన ఒక ఘటన భక్తుల మనోవేదనకు.. అమ్మవార్లపై వారికి ఉన్న నమ్మకానికి అద్దం పడుతోంది. ఇంతకీ అదేంటి? ప్రస్తుతం ఆ అమ్మవారి హుండీలో లభించిన నోటిపై ఉన్న భక్తుడి మనోవేదన ఏంటి? దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం..
ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరుగాంచిన మేడారం సమ్మక్క- సారక్క జాతర ముగిసిన తర్వాత అక్కడికి వచ్చిన భక్తులంతా సమర్పించిన కానుకల లెక్కింపు ప్రక్రియ ఇప్పుడు కొనసాగుతోంది.. ఈ సమయంలో హుండీలో బంగారంతో పాటు నగదు వెండి వస్తువులతో పాటు భక్తుల తమ బాధలను విన్నవిస్తూ రాసిన లీకలు అప్పుడప్పుడు బయట పడుతూ ఉంటాయి. అయితే, తాజాగా కూడా ఒక వంద రూపాయల నోటుపై భక్తుడు రాసిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి.
సాధారణంగా మేడారం జాతరకు వచ్చిన భక్తులంతా హుండీలో తమకు ఉద్యోగాల్లో ప్రమోషన్ రావాలని, ఉద్యోగాలు లేనివారికి ఉద్యోగాలు కలగాలని, ఆర్థిక ఇబ్బందులు ఉంటే త్వరగా తొలగిపోవాలని, ఆరోగ్యం బాగుండాలని కోరుకుంటూ తమ మొక్కులను కానుకల రూపంలో చెల్లిస్తూ ఉంటారు. కానీ ఇక్కడ ఓ తండ్రి తన కొడుకు పెట్టే బాధను భరించలేక సాక్షాత్తు ఆ అమ్మవారిలను ఆశ్రయించడం సంచలనంగా మారింది.
ప్రస్తుతం వైరల్ అవుతున్న ఆ వంద రూపాయల నోటుపై.. అమ్మ సమ్మక్క సారలమ్మ.. మా కొడుకు బారి నుండి మమ్మల్ని రక్షించండి" అని రాసి ఉంది. ఈ రాతలు చూస్తుంటే ఆ తల్లిదండ్రులు తమ ఇంట్లో ఎంతటి నరకాన్ని అనుభవిస్తున్నారో? అర్థమవుతుంది. వృద్ధాప్యంలో ఎంతో అండగా ఉండాల్సిన తమ కుమారుడు కాలయముగా మారాడని.. పోలీసులకు చెప్పుకోలేక.. బయట బంధువులకి ఎవరికీ ముఖం చూపించలేక చివరకు ఆ దేవతలకు తమ గోడును ఇలా నోటుపై వెల్లబోశారు.
మారుతున్న సమాజంలో నైతిక విలువలు ఎంతల దిగజారిపోతున్నాయో చెప్పడానికి ఈ ఘటన నిదర్శనంగా నిలుస్తోంది. అక్కడ హుండీలోని కానుకలను లెక్కిస్తున్న అధికారులైతే ఈ నోటును చూసి ఆశ్చర్యపోయారు.. ఇది కేవలం ఒక వంద రూపాయల నోటు మాత్రమే కాదు.. ఎందుకంటే ఒక ఒక కుటుంబం అనుభవిస్తున్న క్షోభకు ప్రతిరూపమని సోషల్ మీడియా వినియోగదారులు చెబుతున్నారు. ఆ అమ్మవారిని ఆ తల్లిదండ్రులకు ధైర్యాన్ని ప్రసాదించాలని సోషల్ మీడియా ముఖంగా చాలామంది నటిజన్స్ కోరుకుంటున్నారు..
Also Read: Cobra Hood Video: వామ్మో.. ప్లాస్టిక్ డబ్బాలో పడగ విప్పిన నాగుపాము.. వీడియో ఇదే చూడండి..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook