ఈబి5 వీసాతో అమెరికా గ్రీన్ కార్డ్ సులువుగా పొందవచ్చు- మల్లెల గ్లోబల్ ఆర్గనైజేషన్
Hyderabad, Telangana:ప్రభుత్వం ప్రారంభించిన కొన్ని పథకాల్లో పెట్టుబడులు పెట్టి దేశాభివృద్ధిలో పాలుపంచుకుంటున్న మల్లెల గ్లోబల్ ఆర్గనైజేషన్ వ్యవస్థాపకుడు మల్లెల ఆదిత్య సోమాజిగూడ, ఎంతో మంది భారతీయులు తమ విలువైన భవిష్యత్తు కోసం అమెరికాలో స్థిరపడాలని కోరుకుంటున్నారని సూచించారు. ఇలాంటి వారికి ఈబీ5 వీసా ఎంతో అనువుగా ఉంటుందని, ఈ వీసా ద్వారా అమెరికాలో వర్క్ పర్మిట్, నిబంధనలతో కూడిన గ్రీన్ కార్డ్ పొందవచ్చని, వచ్చే ఐదేళ్లలోగా శాశ్వత గ్రీన్ కార్డ్ పొందవచ్చని తెలిపారు.
हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
Goddess Lakshmi Blessings: లక్ష్మీదేవికి ఇష్టమైన 4 రాశులు ఇవే.. ఇక వీరికి తిరుగుండదు, అపార ధనలాభం!
Hyderabad, Telangana:Goddess Lakshmi Blessings Latest News: జ్యోతిష్య శాస్త్రంలో ఐశ్వర్యానికి, సిరిసంపదలకు అధిదేవతగా లక్ష్మీదేవిని భక్తిశ్రద్ధలతో కొలుస్తూ ఉంటారు. ప్రతి ఇంట్లోనూ శుక్రవారం అమ్మవారి పూజలు ఎంతో భక్తిశ్రద్ధలతో జరుగుతూ ఉంటాయి. అయితే, జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. లక్ష్మీదేవికి కొన్ని రాశులంటే అత్యంత ప్రీతికరం.. ఆయా రాశుల వారిపై అమ్మవారి ప్రత్యేక అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుందని జ్యోతిష్యులు తెలుపుతుపున్నారు.. దీనివల్ల వారు జీవితంలో ఊహించని స్థాయిలో ధనలాభం, కీర్తి ప్రతిష్టలు, విజయాలతో పాటు విలాసవంతమైన జీవితం లభిస్తుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అయితే, జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. ఏయే రాశులవారికి ఎలా ఉంటుందో? అత్యధిక లాభాలు పొందే రాశులేవో పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ రాశులవారికి బంపర్ లాభాలు:
వృషభ రాశి (Taurus)
లక్ష్మీదేవికి అత్యంత ఇష్టమైన రాశులలో వృషభ రాశి మొదటి వరుసలో ఉంటుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ఈ రాశి వారికి అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళలా లభిస్తూ ఉంటాయి.. వీరి ఆదాయ వనరులు నిరంతరం విపరీతంగా పెరుగుతాయి. అలాగే ఆర్థికంగా ఎప్పుడూ స్థిరంగా ఉండే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కొత్త ఉద్యోగాల కోసం ప్రయత్నించే వారికి ఈ సమయంలో శుభవార్తలు కూడా తప్పకుండా అందుకుంటారు.. కార్యాలయంలో వీరి గౌరవ మర్యాదలు, కీర్తి ప్రతిష్టలు విపరీతంగా పెరుగుతాయి. ఉద్యోగస్తులకు జీతాల పెరుగుదలతో పాటు ప్రమోషన్లు లభించే బలమైన అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి.
సింహ రాశి (Leo)
సింహ రాశికి అధిపతి నవగ్రహాల రాజు అయిన సూర్యభగవానుడుగా భావిస్తూ ఉంటారు.. ఈ రాశి వారు దృఢ సంకల్పం, అంకితభావంతో పాటు ఎంతో అద్భుతమైన బుద్ధిని కలిగి ఉంటారు. వీరి కష్టాన్ని గుర్తించి లక్ష్మీదేవి అపారమైన అనుగ్రహాన్ని అందిస్తుంది.. వీరు అడుగుపెట్టిన ప్రతి రంగంలోనూ అద్భుతమైన విజయాలు కలుగుతాయి.. ఆర్థికంగా వీరు చాలా బలంగా ఉంటారు. అమ్మవారి కృప వల్ల వీరు ఎప్పుడూ ఇతరులపై ఆధారపడాల్సిన అవసరం కూడా రాదని జ్యోతిష్యులు తెలుపుతున్నారు.
మీన రాశి (Pisces)
లక్ష్మీదేవికి ఇష్టమైన మరో ముఖ్యమైన రాశి మీన రాశి.. అమ్మవారి అనుగ్రహం వల్ల ఈ రాశి వారికి జీవితంలో ఎప్పుడు డబ్బుకు ఎలాంటి కొరత అనేది ఉండదని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. వీరు తమ నిరంతర శ్రమతో పాటు సత్ప్రవర్తనతో లక్ష్మీదేవి అనుగ్రహం సులభంగా పొందుతారు. వ్యాపార, ఉద్యోగ రంగాలలో వీరు నిరంతరం లాభాలను ఆర్జిస్తూ ఐశ్వర్యవంతమైన జీవితాన్ని గడిపే అవకాశాలు ఉన్నాయి..
తులా రాశి (Libra)
తులా రాశికి అధిపతి శుక్ర గ్రహం.. జ్యోతిష్యశాస్త్రంలో శుక్రుడిని ఆకర్షణ, సంపద, విలాసాలకు కారకుడిగా చెప్పుకుండారు. అందుకే తులా రాశి వారిపై శుక్రుడితో పాటు లక్ష్మీదేవి ప్రత్యేక ఆశీస్సులు లభిస్తూ ఉంటాయి. అమ్మవారి దయతో వీరు జీవితంలో అన్ని రకాల సుఖసంతోషాలను కలుగుతాయి.. వీరు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోరని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ఎలాంటి పనులు చేపట్టిన విజయాలు సులభంగా సాధించే ఛాన్స్‌లు ఉన్నాయి.
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
గమనిక.. 
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook ..
Rahu Transit 2026: హనుమంతుడి ఆశీస్సులు, రాహువు అనుగ్రహం..ఈ రోజు నుంచి ఈ రాశుల వారికి గోల్డెన్ డేస్!
Hyderabad, Telangana:Rahu Transit In Dhanishta Nakshatra 2026 Telugu: జ్యోతిష్య శాస్త్రంలో అత్యంత ప్రభావవంతమైన గ్రహంగా భావించే రాహువు తన నక్షత్ర సంచారం చేశాడు.. 2026 జూన్ 30 మంగళవారం రోజున రాహువు కుంభ రాశి నుంచి ధనిష్ఠ నక్షత్రంలోకి ప్రవేశించాడు.. ఈ నక్షత్రంలో రాహువు గ్రహం డిసెంబర్ 2026 వరకు సంచార దశలో ఉంటాడు.. రాహువు ఈ నక్షత్ర సంచారం అన్ని రాశుల వారి ఆరోగ్యం, ఉద్యోగం, ఆర్థిక స్థితితో పాటు కుటుంబ సంబంధాలపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అయితే, ముఖ్యంగా మూడు రాశుల వారికి ఈ సమయం ఎంతో అదృష్టాన్ని, విజయాలను తెచ్చిపెట్టబోతోంది.. మంగళవారం నుంచి ఈ రాశుల వారికి హనుమంతుడి అనుగ్రహంతో పాటు రాహువు ప్రత్యేక అనుగ్రహం లభించి.. ఈ సమయం కొన్ని రాశులవారికి గోల్డెన్ పీరియడ్‌గా ఉండబోతోంది. అయితే, ఈ సమయంలో ఏయే రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుందో? అదృష్టాన్ని పొందే రాశులేవో పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
మేష రాశి (Aries)
మేష రాశి వారికి రాహువు నక్షత్ర సంచారంతో ఈ సమయం అత్యంత లాభదాయకంగా ఉంటుంది.. సుదీర్ఘకాలంగా నిలిచిపోయిన పనులు మళ్లీ వేగం ప్రారంభమవుతాయి.. ఆదాయానికి కొత్త మార్గాలు సులభండా తెరుకుకుంటాయి. మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభించే అవకాశాలు కనిపిస్తున్నాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. కార్యాలయంలో ఉన్నతాధికారుల నుంచి పూర్తి సపోర్ట్ కూడా అందుతుంది.. కష్ట సమయాల్లో నమ్మకమైన స్నేహితుడు లేదా సన్నిహితుడి సహాయం మీకు కొండంత బలాన్ని అందిస్తుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు ఈ కాలం ఎంతో అనుకూలంగా ఉంటుంది. అలాగే వారు ఆశించిన మంచి ఫలితాలు కూడా పొందుతారు.
సింహ రాశి (Leo)
సింహ రాశి వారికి ఈ నక్షత్ర సంచారం అదృష్టాన్ని రెట్టింపు చేయడమే కాకుండా.. ఆర్థికంగా ఎదగడానికి సరికొత్త అవకాశాలను అందిస్తుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ఉద్యోగస్తులకు ప్రమోషన్ లేదా అదనపు బాధ్యతలు దక్కే అవకాశాలు కూడా ఉన్నాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. అలాగే మీ ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచుతుంది. గతంలో చేసిన పెట్టుబడుల నుంచి మంచి లాభాలు కూడా కలుగుతాయి. కుటుంబంలో సుఖసంతోషాలు ఊహించని స్థాయిలో పెరుగుతాయి. మనస్సు ప్రశాంతంగా కూడా మారుతుంది.. దీర్ఘకాలికంగా వేధిస్తున్న కుటుంబ సమస్యలన్నింటికీ ఈ సమయంలో పరిష్కారం అవుతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు.
తులా రాశి (Libra)
తులా రాశి వారికి రాహువు ధనిష్ఠ నక్షత్ర సంచారం కారణంగా కెరీర్, వ్యాపార రంగాలలో సానుకూల మార్పులను తీసుకు వస్తుందని జ్యోతిష్యులు తెలుపుతుపున్నారు. వ్యాపారస్తులు ఈ సమయంలో చేసే సుదూర ప్రయాణాల వల్ల భారీగా లాభాలను కూడా అందిస్తాయి.. సమాజంలో కొత్త పరిచయాలు కూడా విపరీతంగా ఏర్పడతాయి. ఇవి భవిష్యత్తులో మీకు ఎంతగానో ఉపయోగపడే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారాన్ని విస్తరించడానికి ఊహించని అవకాశాలు లభిస్తాయి. కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి మెరుగైన ప్యాకేజీతో కూడిన మంచి అవకాశాలు కూడా లభించబోతున్నాయి. ఈ కాలంలో చేసే ప్రయాణాలు మీ భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు.
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
గమనిక.. 
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook ..
Vaidhriti Yog: జూలై 22న వైధృతి యోగం.. ఆ 4 రాశుల వారికి ఇక తిరుగుండదు, డబ్బే డబ్బు!
Hyderabad, Telangana:Vaidhriti Yog On July 22 Latest News: జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాలు, నక్షత్రాల సంచారాలు మానవ జీవితాలపై తీవ్ర ప్రభావం చూపుతాయని మనందరికీ తెలుసు. గ్రహాల మార్పుల వల్ల ఎప్పటికప్పుడు సరికొత్త యోగాలు ఏర్పడుతుంటాయి. ఈ క్రమంలోనే రాబోయే జూలై 22 (బుధవారం) రోజు ఒక అరుదైన, విశేషమైన ఖగోళ సంఘటన జరగబోతోంది. సూర్యుడు, చంద్రుల కలయిక కారణంగా అత్యంత శక్తివంతమైన వైధృతి యోగం ఏర్పడనుంది. ఈ యోగాని ఎంతో ప్రత్యేమైన ప్రాముఖ్యత ఉంటుంది.
సనాతన ధర్మంలో, జ్యోతిష్య శాస్త్రంలో వైధృతి యోగాన్ని అంతగా శుభప్రదమైనదిగా భావించరు. కానీ, ఆశ్చర్యకరంగా ఈసారి ఏర్పడబోయే వైధృతి యోగం కొన్ని రాశుల వారిపై ఊహించని సానుకూల ప్రభావాన్ని చూపించబోతోంది. జూలై 22 సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఈ యోగం ప్రభావం ఉంటుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ఈ ప్రత్యేక సమయంలో సూర్య-చంద్రుల అనుగ్రహంతో 4 రాశుల వారి జాతకాలు పూర్తిగా మారబోతున్నాయి. వారి జీవితాల్లో సుఖసంతోషాలతో పాటు ఆర్థికంగా అద్భుతమైన లాభాలు కలుగుతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అయితే, ఈ సంచారంతో ఏయే రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుందో? అదృష్టాన్ని పొందే రాశులేవో పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
మేష రాశి (Aries):
మేష రాశి వారికి ఈ వైధృతి యోగం అపారమైన శుభ ఫలితాలను అందించబోతోంది.. ఉద్యోగ లేదా వ్యాపార రంగాలలో ఉన్న వారికి ఊహించని శుభవార్తలు వింటారు.. మీ ఆర్థిక స్థితి గణనీయంగా మెరుగుపడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. దీర్ఘకాలంగా వేధిస్తున్న డబ్బుకు సంబంధించిన సమస్యలన్నీ శాశ్వతంగా తొలగిపోతాయి. ప్రేమ సంబంధాలలో సానుకూల మార్పులు రావడం ప్రారంభమవుతాయి.. వివాహిత జీవితంలో భాగస్వామి నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది. అదృష్టం మీ వైపు ఉండటంతో అనుకున్న పనులు చకచకా సాగిపోతాయి.
సింహ రాశి (Leo):
సింహ రాశి వారికి ఈ యోగం పురోభివృద్ధికి నాంది పలకబోతోంది. వీరికి ఈ సమయంలో ఆత్మవిశ్వాసంతో పాటు వ్యక్తిత్వం మరింత ఆకర్షణీయంగా మారబోతోందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. కార్యాలయంలో లేదా ఉద్యోగ రంగంలో చాలా కాలంగా ఎదుర్కొంటున్న ఆటంకాలు తొలగిపోతాయని జ్యోతిష్యులు చెబుతున్నారు.. పనుల్లో వేగం పెరుగుతుంది. సమాజంలో, పని చేసే చోట మీ గౌరవ మర్యాదలు విపరీతంగా పెరుగుతాయి.. అలాగే, తండ్రితో ఉన్న సంబంధాలు మరింత బలపడే అవకాశం ఉందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు.
వృశ్చిక రాశి (Scorpio):
వృశ్చిక రాశి వారికి ఈ వైధృతి యోగం కొత్త అవకాశాలను అందించబోతోంది.. సుదీర్ఘకాలంగా మంచి ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు ఈ సమయంలో మంచి ఉద్యోగ అవకాశం లభించే ఛాన్స్‌లు కనిపిస్తున్నాయి. తండ్రుల ద్వారా భారీ మొత్తంలో ఆస్తులు కూడా పొందుతారు. ఆకస్మిక ధనలాభం కలిగే సూచనలు కలిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం కూడా తప్పకుండా కలుగుతుంది.. కార్యాలయంలో కొత్త బాధ్యతలు పెరగడంతో పాటు, అదనపు ఆదాయ వనరులు లభిస్తాయి.. ఈ కాలంలో కుటుంబ సభ్యుల పూర్తి సహకారం మీకు లభిస్తుంది.
ధనుస్సు రాశి (Sagittarius):
సూర్య-చంద్రుల ఈ విశేష కలయిక ధనుస్సు రాశి వారికి అత్యంత లాభదాయకంగా ఉంటుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అదృష్టం మీకు వంద శాతం అండగా ఉండడం వల్ల జీవితంలోని వివిధ రంగాలలో విజయాలు సాధిస్తారు. ఆధ్యాత్మిక, ధార్మిక కార్యక్రమాలపై ఆసక్తి విపరీతంగా పెరుగుతుంది.. మీ సానుకూల ఆలోచనా విధానం జీవితంలో కీలక నిర్ణయాలు తీసుకోవడానికి ఎంతో సహాయపడుతుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ఈ యోగం ప్రభావంతో సుదూర ప్రయాణాలు చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. విద్యార్థులకు ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది.. పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. పాత పెట్టుబడుల నుంచి భారీగా లాభాలు చేకూరే అవకాశం ఉంది.
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
గమనిక.. 
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook ..
తెల్లవారుజామున ఘోర సంఘటన.. అన్నదమ్ముళ్లను బలిగొన్న ఆర్టీసీ బస్సు
Gajuwaka, Andhra Pradesh:Vizag Road Accident: ఒక కుటుంబంలో ఆర్టీసీ బస్సు తీవ్ర విషాదం నింపింది. నిర్లక్ష్యం కారణంగా ఇద్దరి ప్రాణాలను ఆర్టీసీ బస్సు బలిగొన్నది. కుటుంబంలో అన్నదమ్ముళ్లుగా ఉన్న ఆ ఇద్దరు సోదరులు మరణంలోనూ రక్త సంబంధం వీడలేదు. బస్సు రూపంలో మృత్యువు కబళించడంతో వారిద్దరూ ప్రాణాలు కోల్పోయారు. ఏపీలోని విశాఖపట్టణంలో చోటుచేసుకున్న ఈ విషాద సంఘటన ఒక కుటుంబాన్ని శోకసంద్రంలో ముంచింది. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
Also Read: ఏరువాక పౌర్ణమి రోజు తుంగభద్ర నదిలో కాడెడ్లు మృతి.. గుండెలవిసేలా రైతుల రోదన
విశాఖపట్టణం అక్కయ్యపాలెం ప్రాంతానికి చెందిన పొట్నూరు రమేశ్, పొట్నూరు సతీశ్ సోదరులు. వీరిద్దరూ బజాజ్, రిలయన్స్ సంస్థల్లో పని చేస్తూ కుటుంబానికి ఆసరాగా ఉంటున్నారు. బుధవారం తెల్లవారుజామున ఇద్దరు అన్నదమ్ముళ్లు పని మీద బైక్‌పై బయటకు వచ్చారు. అనకాపల్లి వైపు నుంచి గాజువాక వైపు వస్తున్న సమయంలో శ్రీనగర్ వంతెనపైకి ఎక్కిన సోదరుల బైక్‌ను అత్యంత వేగంగా వచ్చిన ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది.
గాజువాక శ్రీనగర్ జాతీయ రహదారిపై జరిగిన ఈ రోడ్డు ప్రమాదంలో అన్నదమ్ముళ్లు రమేశ్, సతీశ్ ఇద్దరు తీవ్ర గాయాలపాలయ్యారు. వారు ప్రయాణిస్తున్న బుల్లెట్ బైక్ ఫుట్‌పాత్‌ను ఢీకొనడంతో ఇద్దరు కిందపడ్డారు. ఇద్దరి తలలకు తీవ్ర గాయాలవడంతో ఘటనా స్థలంలోనే వారిద్దరూ మృతి చెందారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు రోడ్డు ప్రమాద స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం విశాఖపట్టణంలోని కేజీహెచ్‌కు తరలించారు. దువ్వాడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇద్దరినీ కోల్పోయిన ఆ కుటుంబం తీవ్ర దుఃఖంలో మునిగింది. వారి స్వస్థలం అక్కయ్యపాలెంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతుల కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు.
Also Read: ఏపీలో బయటపడ్డ మరో బంగారు గని.. టన్నుల కొద్దీ బంగారం నిల్వలు
నిత్యం ప్రమాదాలు
అనకాపల్లి-గాజువాక వైపు ఉన్న శ్రీనగర్ వంతెన ఇరుకుగా మారడంతో నిత్యం ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని స్థానికులు చెబుతున్నారు. అక్కడ ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని వాహనాదారులు డిమాండ్ చేస్తున్నారు. దీనికితోడు ఆర్టీసీ డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా ఈ ప్రమాదం జరిగిందని ప్రత్యక్ష సాక్షులు ఆరోపిస్తున్నారు. తెల్లవారుజామునే రెండు నిండు ప్రాణాలు రోడ్డు ప్రమాదంలో కోల్పోవడం విషాదం నింపింది. మృతుల కుటుంబానికి ప్రభుత్వం ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
ఏరువాక పౌర్ణమి రోజు నదిలో కాడెడ్లు మృతి.. గుండెలవిసేలా రైతు దంపతుల రోదన
Kurnool, Andhra Pradesh:Farmer Couple Heart Break: ఏరువాక పండుగ అంటే రైతులు చేసుకునేది. తమకు ఎల్లప్పుడూ వ్యవసాయ పనుల్లో సహాయం చేస్తున్న పశుపక్ష్యాదులతో ఆనందంగా గడిపే పండుగ ఏరువాక పౌర్ణమి. ఈ పండుగ రోజే తీవ్ర విషాద సంఘటన ఏర్పడింది. తుంగభద్ర నదీ తీరంలో వెళ్తున్న రెండు కాడెడ్లు పొరపాటున నీటిలో పడిపోయాయి. వెంటనే అప్రమత్తమైన రైతు దంపతులు వాటిని కాపాడేందుకు ప్రయత్నించగా.. అయితే కాడెడ్లు అప్పటికే నీటిలో మునిగిపోయి మృతి చెందాయి. ఈ సంఘటన ఏపీలోని కర్నూలు జిల్లాలో చోటుచేసుకుంది. అయితే ఈ సంఘటనపై టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.
కర్నూలు జిల్లా మంచాలకు చెందిన కురవ సురేష్ వ్యవసాయం చేస్తుంటాడు. వ్యవసాయ పనుల కోసం రెండు కాడెడ్లు ఉన్నాయి. వాటిని ఎంతో అపురూపంగా.. ప్రేమగా చూసుకునేవారు. ఆలనా పాలనా చూసుకుంటూ కాడెడ్లను కుటుంబసభ్యుల్లా చూసుకుంటున్నారు. ఎడ్లకు సంబంధించిన పండుగ ఏరువాక పౌర్ణమి కావడంతో మంగళవారం పండుగ చేసుకుందామని భావించారు. అయితే తుంగభద్ర నదీ తీరంలో ఈ రెండు కాడెడ్లు నీటిలో పడిపోయాయి. ఆ తర్వాత కొద్దిసేపటికే నీటిలో మునిగి అవి మరణించాయి. కాడెడ్లు మృతి చెందడంతో సురేశ్ దంపతులు గుండెలవిసేలా రోదించారు. కుటుంబసభ్యుల్లా ఉన్న ఎడ్లు మృతి చెందడంతో ఆ రైతు దంపతులు రోదించిన విధానం అందరినీ ఆవేదనకు గురి చేస్తోంది. ఈ సంఘటనపై సీఎం చంద్రబాబు 'ఎక్స్' వేదికగా స్పందించారు.
'పశువులను సంపదగా భావిస్తాం. రైతన్నకు వెన్నుదన్నుగా ఉండేవి కాడెద్దులు. కుటుంబసభ్యుల్లా భావించే రెండు ఎద్దులు తుంగభద్ర నదిలో ప్రమాదవశాత్తూ చనిపోవడం ఎంతో బాధ కలిగించింది' అని సీఎం చంద్రబాబు ట్వీట్ చేశారు. అన్నదాతకు పవిత్రమైన రోజైన ఏరువాక పౌర్ణమి నాడు ఇవి మృతి చెందడం, ఆ యజమాని కుటుంబం ఆవేదనతో విలపించడం తనన్నెంతో కలిచివేసిందని తెలిపారు. ఎడ్లు లేని లోటు పూడ్చలేనిదైనప్పటికీ వాటి యజమాని కుటుంబానికి ప్రభుత్వం తరపున పరిహారం అందించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌కు ఇప్పటికే ఆదేశించినట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. ప్రాణంలా చూసుకునే ఎడ్లను కోల్పోయిన ఆ కుటుంబానికి కొంత సాయంగా నిలవాలని సూచించినట్లు చెప్పారు.
నేడు సత్యవేడులో పర్యటన
తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గంలో సీఎం చంద్రబాబు నేడు పర్యటించనున్నారు. మాదనపాలెం సమీపంలోని హీరో మోటోకార్ప్ రెండో గ్లోబల్ పార్ట్స్ సెంటర్‌కు నేడు శంకుస్థాపన చేయనున్నారు. ఏపీఐఐసీ పరిధిలో ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు భూమిపూజ జరగనుంది. సీఎం పర్యటన సందర్భంగా భద్రతా ఏర్పాట్లు, హెలిపాడ్, వేదిక, రాకపోకల మార్గాలను జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, ఎస్పీ సుబ్బారాయుడు పరిశీలించారు. నెల్లూరు పర్యటన అనంతరం సాయంత్రం 4:20 గంటలకు హీరో మోటోకార్ప్ హెలిపాడ్‌కు సీఎం రానున్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు ఘన స్వాగతం పలికేందుకు సిద్ధమయ్యారు. శంకుస్థాపన అనంతరం హీరో మోటోకార్ప్ ప్లాంట్‌ను ముఖ్యమంత్రి సందర్శించనున్నారు. రాత్రి 7 గంటలకు శ్రీ సిటీ గెస్ట్ హౌస్‌కు చేరుకుని అక్కడే బస చేయనున్నారు.
పశువులను సంపదగా భావిస్తాం. రైతన్నకు వెన్నుదన్నుగా ఉండేవి కాడెద్దులు. కుటుంబ సభ్యుల్లా భావించే రెండు ఎద్దులు తుంగభద్ర నదిలో ప్రమాదవశాత్తూ చనిపోవడం ఎంతో బాధ కలిగించింది. అన్నదాతకు పవిత్రమైన రోజైన ఏరువాక పౌర్ణమి నాడు ఇవి మృతి చెందడం, ఆ యజమాని కుటుంబం ఆవేదనతో విలపించడం నన్నెంతో… pic.twitter.com/ivz4SXAfrU
— N Chandrababu Naidu (@ncbn) June 30, 2026
రైతులకు ఎగ్గొట్టిన రూ.30 వేల కోట్లు ఎప్పుడిస్తావ్ రేవంత్ రెడ్డి?: సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
Wanaparthy, Telangana:Rythu Bharosa: ఎకరాకు ఏడాదికి రూ.15 వేలు, కౌలు రైతులు, భూ యజమానులు, రైతు కూలీలకు రైతు భరోసా ఇస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ రైతులను దారుణంగా మోసం చేసిందని బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మండిపడ్డారు. 'తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ పాలనలో మృగశిర కార్తె వచ్చినట్లు రైతుబంధు రైతుల ఖాతాల్లో ఠంచనుగా పడిపోయేది. ఒక్కసారి రైతుబంధు వేయడం మొదలైతే ఏ రోజు ఏ రైతు ఖాతాలో, ఎన్ని ఎకరాలకు సంబంధించిన డబ్బులు పడతాయో సామాన్య రైతుకు కూడా తెలిసిపోయేది' అని వ్యవసాయ శాఖ మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గుర్తుచేశారు.
రైతు భరోసా పేరిట మరోసారి రేవంత్ రెడ్డి మీటింగ్ పెట్టి రైతుల ఖాతాల్లో డబ్బులు వేస్తున్నట్లు పీఆర్ స్టంట్లు చేయడంపై మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఖండించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఓ ప్రకటన చేశారు. కాంగ్రెస్ మోసలు వివరిస్తూనే రైతులకు కేసీఆర్ ప్రభుత్వం ఏమేం చేసిందనేది వివరించారు. 'రైతు భరోసా అమలు విషయంలో రేవంత్ సర్కార్ పిల్లిమొగ్గలు వేస్తుంది. ఎకరాకు రూ.15 వేలను రూ.12 వేలకు కుదించింది. అధికారంలోకి వచ్చిన తర్వాత మూడుసార్లు రైతు భరోసా ఎగ్గొట్టారు. ఒకసారి ఊర్ల వారీగా రైతు భరోసా వేశారు. అది గందరగోళంగా మారడంతో మళ్లీ ఎకరాల వారీగా వేశారు. దానిని కూడా మధ్యలోనే ఆపివేశారు' అని సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గుర్తుచేశారు. గత యాసంగిలో అందరు రైతులకు అని చెప్పి రెండెకరాల వరకు వేసి చేతులు దులుపుకుందని మండిపడ్డారు.
'ఇప్పుడు రైతు భరోసా అంటూ మళ్లీ కొత్త నాటకం మొదలుపెట్టింది. రైతుల ఖాతాల్లో డబ్బులు నేరుగా వేయడానికి సభల పేరుతో వృథా ఖర్చులు ఎందుకు?' అని బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ప్రశ్నించారు. పంటల కొనుగోళ్ల విషయంలోనూ ఈ సర్కారు చేతులెత్తేసిందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఎంత కొంటే అంతే కొంటామని చెప్పి బాధ్యతల నుంచి తప్పుకున్నాడని రేవంత్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. యూరియా యాప్ రైతులకు శాపంగా మారిందని చెప్పారు. ఈ వైఫల్యాల నుంచి రైతుల దృష్టిని మరల్చడానికి రైతు భరోసా పేరుతో కాంగ్రెస్ పీఆర్ స్టంట్లు చేస్తోందని విమర్శించారు. రైతులందరికీ రైతు భరోసా వేయాలని, గతంలో ఎగ్గొట్టిన రైతు భరోసా నిధులు విడుదల చేయాలని వ్యవసాయ శాఖ మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి డిమాండ్ చేశారు.
ఏపీలో బయటపడ్డ మరో బంగారు గని.. టన్నుల కొద్దీ బంగారం నిల్వలు
Thummala, Andhra Pradesh:Jowkala Mines: బంగారానికి అడ్డాగా ఆంధ్రప్రదేశ్ మారనుంది. ఏపీలో బంగారం నిక్షేపాలు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే కర్నూలు జిల్లా జొన్నగిరిలో బంగారం గనులు ప్రారంభమవగా బంగారం మార్కెట్లో ఏపీ బ్రాండ్ హవా కొనసాగిస్తోంది. ఇదే క్రమంలో మరో చోట కూడా బంగారం గనులు బయటపడ్డాయి. చిత్తూరు జిల్లా కుప్పంలోనూ బంగారు గనులున్నాయని గుర్తించారు. అంతేకాకుండా సత్యసాయి జిల్లాలో కూడా బంగారం నిక్షేపాలు ఉన్నాయని అధికారులు తేల్చారు.
సత్యసాయి జిల్లాలోని ఎన్పీకుంట మండలం జౌకల ప్రాంతంలో ఖనిజాన్వేషణ ప్రక్రియను ఏపీ ప్రభుత్వం వేగవంతం చేసింది. ఇక్కడ బంగారం నిల్వలు ఉన్నాయని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. గతంలోనే జౌకల ప్రాంతంలో భారీగా బంగారం నిక్షేపాలు ఉన్నాయని పరిశోధనల్లో తేలింది. అయితే ఇక్కడ బంగారం ఎంత మేరకు ఉందో తెలుసుకునేందుకు పరిశోధనలు చేసేందుకు అధికార యంత్రాంగం సిద్ధమైంది. బంగారాన్ని అన్వేషించేందుకు ఆరు ప్రైవేట్ ఏజెన్సీలకు ప్రభుత్వం బాధ్యతలు అప్పగించింది.
జౌకల ప్రాంతంలో మొత్తం ఆరు బ్లాకులు ఉండగా అక్కడ నాలుగు దశల్లో అధికారులు, శాస్త్రవేత్తల బృందం పరిశోధన చేయనుంది. పరిశోధనలు పూర్తయ్యాక వచ్చే నివేదికలను పరిశీలించి బంగారం నిక్షేపాలపై ఒక స్పష్టత రానుంది. నివేదికలో ఉన్న అంశాల ఆధారంగా అక్కడ తవ్వకాలు చేయాలా? వద్దా? అనేది నిర్ణయానికి వస్తారు. 2015లోనే శ్రీ సత్యసాయి జిల్లా జౌకల ప్రాంతంలో బంగారం నిక్షేపాలు ఉన్నాయని మినరల్ ఎక్స్‌ప్లోరేషన్ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ ట్రస్ట్ పరిశోధనలు చేసింది.
కర్ణాటకలోని కోలార్ గ్రీన్‌స్టోన్ బెల్ట్‌తో ఈ ప్రాంతంతో జౌకల ప్రాంతం పోలి ఉందని.. ఇక్కడ బంగారు నిల్వలు ఉన్నట్లు ట్రస్ట్ సభ్యులు గుర్తించారు. అయితే 2022లో ఈ పరిశోధనలు జీ4 దశలో నిలిచిపోవడంతో బంగారం నిల్వల పరిశోధన ప్రక్రియ నిలిచిపోయింది. జొన్నగిరిలో బంగారు తవ్వకాలు ప్రారంభమైన తర్వాత ఏపీ ప్రభుత్వం జౌకలపై దృష్టి సారించింది. ఆగిపోయిన జీ4 దశ నుంచి మళ్లీ బంగారం నిక్షేపాలపై పరిశోధనలను ప్రారంభించనుంది. పరిశోధనల తర్వాత జౌకల ప్రాంతంలో బంగారు నిల్వలపై ఒక స్పష్టత వస్తుంది. నిక్షేపాలు ఉంటే తవ్వకాలకు ఏపీ ప్రభుత్వం అనుమతి ఇవ్వనుంది.
బంగారం నిల్వలు ఉన్నాయని చెబుతున్న జౌకల వెలిగల్లు గ్రీన్‌స్టోన్ బెల్ట్ కొత్తపల్లి బ్లాక్ ప్రాంతంలో ఉంది. ఈ ప్రాంతంలో ఆరు బ్లాకుల్లో 5,560 హెక్టార్లలో పూర్తిస్థాయి పరిశోధనలు జరగనున్నాయి. 2001లోనే ఇక్కడ ప్రాథమికంగా బంగారం నిక్షేపాల కోసం అన్వేషించగా ఓ సంస్థ పరిశోధన చేసేందుకు లైసెన్సు కోసం దరఖాస్తు చేసుకుంది. అయితే ఏం జరిగిందో తెలియదు కానీ ఆ తర్వాత అడుగులు ముందుకు పడలేదు. ఈ ఒక్క జౌకల ప్రాంతం మాత్రమే కాదు రామగిరి, రొద్దం ప్రాంతంలోనూ బంగారు నిల్వలు ఉన్నాయని తెలుస్తోంది. ఆయా ప్రాంతాల్లో బంగారు నిల్వలు ఉంటే వాటిని వేలం వేసి ప్రైవేట్ సంస్థలకు అప్పగించాలని ఏపీ ప్రభుత్వం చూస్తోంది. ఇదే కాకుండా చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో బంగారు గనులు ఉన్నట్లు తెలుస్తోంది. గుడుపల్లె మండలం చిగురుగుంట-బిసానత్తం బ్లాక్‌లో బంగారం ఉందని వార్తలు వస్తున్నాయి. ఈ ప్రాంతం కర్ణాటకలోని కేజీఎఫ్ ప్రాంతానికి 27 కిలోమీటర్ల దూరంలో ఉండడంతో ఇక్కడ కూడా బంగారం నిక్షేపాలు ఉంటాయని తెలుస్తోంది. అక్కడ కూడా త్వరలో పరిశోధనలు చేసే అవకాశం ఉంది.
రైతులను నిండా ముంచిన రేవంత్ రెడ్డిది రైతు వంచన ప్రభుత్వం.. హరీశ్ రావు తీవ్ర ఆగ్రహం
Mahbubnagar, Telangana:Harish Rao Challenge: 'తెలంగాణ కోసం రాజీనామా చేయమంటే జిరాక్స్ కాయితం ఇచ్చిన చరిత్ర రేవంత్ రెడ్డిది. రేవంత్ రెడ్డి ఉద్యమం గురించి, త్యాగాల గురించి మాట్లాడుతుంటే నవ్విపోదురు గాక నాకేం సిగ్గు అన్నట్టు ఉంది ఆయన తీరు' అని అసహనం వ్యక్తం చేశారు. పాలమూరు ప్రజల జోష్ చేస్తుంటే బీఆర్ఎస్ పార్టీ మళ్లీ కచ్చితంగా అధికారంలోకి వస్తుంది అనే నమ్మకం ఉందని విశ్వాసం వ్యక్తం చేశారు. జడ్చర్లలో నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ సమావేశంలో మాజీ మంత్రి హరీష్ రావు కీలక ప్రసంగం చేశారు.
'హైదరాబాద్‌లో రేవంత్ రెడ్డి రైతు ఆశీర్వాద సభ అని పెడుతున్నాడు. అది రైతు ఆశీర్వాద సభ కాదు రైతుల వంచన సభ' అని మాజీ మంత్రి హరీశ్ రావు ప్రకటించారు. రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచి రైతును వంచించుతూనే ఉన్నాడని ఆరోపించారు. 'యాసంగి రైతు బంధు ఎగొట్టి ఇప్పుడు మళ్లీ వానాకాలం రైతుబంధు వేస్తానని మోసం చేస్తున్నాడు. రైతు రుణమాఫీ రూ.2 లక్షలు కాదు కదా రూ.లక్ష లోపు ఉన్నవాళ్లకు కూడా చెయ్యలేదు' అని రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.
'నల్గొండలో ఒట్టేసి చెబుతున్నా మూసీ ప్రాజెక్ట్ పూర్తి చేస్తానన్నాడు. ఆ ఒట్టు అనేదానికి ప్రాణం ఉంటే ఈ రేవంత్ రెడ్డి అబద్ధాలకు ఉరేసుకొని ఎప్పుడో ఆత్మహత్య చేసుకునేది. కనిపించిన దేవుడి మీద ఒట్టు పెట్టి రుణమాఫీ చేయకుండా దేవుళ్లనే మోసం చేసిన ఘనుడు రేవంత్ రెడ్డి' అని బీఆర్ఎస్ పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు గుర్తుచేశారు. 'పాలమూరు బిడ్డలు స్వచ్ఛమైన పాలలాంటి మనుసున్న బిడ్డలు. రేవంత్ రెడ్డి జూట మాటలు, బట్టెబాజ్ మాటలతో పాలమూరు పరువు తీస్తున్నాడు' అని మండిపడ్డారు.
'ఎన్నికల్లో మాట ఇచ్చి తప్పిన మనిషి రేవంత్ రెడ్డి. హామీ ఇవ్వక పోయినా ప్రజలకు కావాల్సింది అర్ధం చేసుకొని రుణమాఫీ చేసిన నాయకుడు కేసీఆర్. రైతుబంధు పేరిట రూ.29, 300 కోట్లు రైతులకు రేవంత్ రెడ్డి బాకీపడ్డాడు. జూపల్లి కృష్ణారావు మతి ఉండి మాట్లాడుతాడో మతి లేక మాట్లాడతాడో అర్ధం కాదు' అని మాజీ మంత్రి హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. 'ఎన్నికలకు ముందు అన్ని పంటలకు బోనస్ అని చెప్పి.. అధికారంలోకి వచ్చాక సన్న వడ్లకే అన్నారు. ఇప్పుడు కేవలం 7 ఏడు రకాల వడ్లకే అంటున్నారు' అని గుర్తుచేశారు.
'కేసీఆర్ హయాంలో యూరియా కోసం గోదాములు కట్టించి నిల్వ ఉంచాడు. కానీ రేవంత్ రెడ్డి యాపులు అంటూ నాటకాలు చేస్తున్నాడు. అసెంబ్లీలో తరుగు పెడితే తోలు తీస్తానని రేవంత్ రెడ్డి అన్నాడు. కానీ తెలంగాణలో ఏ ఊరులో అయినా తరుగు లేకుండా ఒక్క బస్తా కొన్నారా? రేవంత్ రెడ్డి ఎంత మంది తోళ్లు తీశాడు?' అని బీఆర్ఎస్ పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు ప్రశ్నించారు. దళారుల చేతిలో, రైస్ మిల్లర్ల చేతిలో రేవంత్ రెడ్డి తోలు బొమ్మ అయ్యాడు తప్ప ఎవరి తోలు తియ్యలేదు అని విమర్శించారు.
'కేసీఆర్ అధికారంలో ఉన్నపుడు 24 గంటల ఉచిత విద్యుత్ ఇచ్చింది బీఆర్ఎస్. రేవంత్ రెడ్డి వచ్చాక 6 గంటలకు వచ్చింది. రైతుల కరెంటులో కోత పెట్టడానికే రైతు డిస్కం. సోలార్ పవర్ మాత్రమే రైతు డిస్కంలకు కేటాయిస్తారంట. ఒకవేళ అదే జరిగితే పొద్దున్న 9 నుండి సాయంత్రం 4 వరకే కరెంట్ వస్తది. రైతు డిస్కమ్ అనేది రైతు 24 గంటల కరెంటుకి ఉరితాడు అవుతది' అని రైతులను మాజీ మంత్రి హరీశ్ రావు హెచ్చరించారు. 'కేసీఆర్ ఇచ్చిన రైతు బీమా రైతు కుటుంబాలకు ఒక ధీమా లెక్క ఉండే. కానీ కేసీఆర్ పోయాక ఒక 6 నెలల నుంచి రైతు బీమా బంద్ అయ్యింది. ఎల్ఐసీకి బీమా డబ్బులను రేవంత్ రెడ్డి కట్టలేదు. 7,600 రైతు కుటుంబాలు రైతు బీమా కోసం ఎదురుచూస్తున్నాయి' అని రేవంత్ రెడ్డి మోసాలను సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు వివరించారు.
తెలంగాణలో రేవంత్ రెడ్డి మోసం చేయని ఒక్క వర్గం లేదు: హరీశ్ రావు
Mahbubnagar, Telangana:Harish Rao vs Revanth Reddy: రైతులకు బాకీపడ్డ రూ.30 వేల కోట్లు ఎప్పుడు ఇస్తావో చెప్పాలని రైతుల పక్షాన రేవంత్ రెడ్డిని మాజీ మంత్రి హరీశ్ రావు డిమాండ్ చేశారు. మిగిలిపోయిన రుణమాఫీ ఎప్పటిలోగా పూర్తి చేస్తావో చెప్పాలని రైతుల పక్షాన నిలదీశారు. 'కేంద్రం కొనుమన్న పంటే కొంటాం, కేంద్రం కొనుమన్న అంతే కొంటాం అని అంటున్న రేవంత్ రెడ్డి మీరు ఉన్నది ఎందుకు. కేంద్రానికి సరెండర్ అయ్యారా? కేంద్రం టార్గెట్ 50 లక్షల మెట్రిక్ టన్నులు. అంతే కొంటే మిగితా రైతుల పరిస్థితి ఏంటి..? వడ్లు కొనే చేతకాని ప్రభుత్వాన్ని రైతులు నమ్ముతారా?' అని ప్రశ్నించారు.
జడ్చర్లలో బీఆర్ఎస్ పార్టీ నాయకుల విస్తృత సమావేశం నిర్వహించగా.. మాజీ మంత్రి హరీష్ రావు కీలక ప్రసంగం చేశారు. 'కరోనా వచ్చినా కరువు వచ్చినా కేసీఆర్ హయాంలో రైతు బంధు ఆగలేదు. 11 విడతల్లో రూ.73 వేల కోట్లు కేసీఆర్ రైతుబంధు ఇచ్చాడు. రేవంత్ రెడ్డి వచ్చాక వచ్చిన 5 విడతల్లో 3 విడతలు ఎగొట్టాడు. మూడు పంటలకు మూడుసార్లు రైతు బంధు ఇవ్వాలన్నాడు ఇప్పటికే మూడు రైతు బంధులు ఎగ్గొట్టాడు' అని రేవంత్ రెడ్డి మోసాలను బీఆర్ఎస్ పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు వివరించారు. బీఆర్ఎస్ పార్టీ హయాంలో 2021-2022లో 92 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు కొన్నామని.. దానితో పోల్చుతే మీరుకొన్నది ఎంత? అని రేవంత్ రెడ్డిని తీసిపడేశారు.
'పాలమూరు పెండింగ్ ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానిది. కల్వకుర్తిలో 3 లక్షల 30 వేల ఎకరాలకు నీరు ఇచ్చాం. నెట్టెంపాడుకు లక్ష 60 వేల ఎకరాలకు నీరు ఇచ్చాం, భీమాలో లక్ష 70 వేల ఎకరాలకు నీరు ఇచ్చాం. చెరువులు, కాల్వలు పూర్తి చేసి వలసలను వాపస్ తెచ్చాం. రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చి మూడేళ్లు అవుతోంది ఒక్క ఎకరాకు నీళ్లు ఇచ్చావా?' అని బీఆర్ఎస్ పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు ప్రశ్నించారు.
'తుంగభద్ర నది మీద శ్రీశైలం ప్రాజెక్టుకు నీళ్లు రాకుండా 65 టీఎంసీలతో ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలు డ్యాములు కడుతుంటే మన పాలమూరు రంగారెడ్డి పరిస్థితి ఏంటి?' అని రేవంత్ రెడ్డిని మాజీ మంత్రి హరీశ్ రావు నిలదీశారు. 'ఇంటర్‌లింకింగ్ అఫ్ రివర్స్, ఆల్మట్టి ఎత్తు, అక్రమ ప్రాజెక్టులు తుంగభద్ర, కృష్ణపై కడుతున్న ప్రాజెక్ట్‌లపై ఒక్క మాట కూడా మాట్లాడకుండా రేవంత్ రెడ్డి నోరు మూసుకున్నాడు' అని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
'తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ మాట ఇచ్చాడు. తండాలను గ్రామ పంచాయితీలను చేస్తానన్నాడు చేసి చూపించాడు. హైకోర్టు మొట్టికాయలు వేసినా పిల్లలకు ఫీజు రీయింబర్స్మెంట్ డబ్బులు ఇవ్వడం లేదు. ఫీజు కట్టక పిల్లల సర్టిఫికెట్లు ఇవ్వడం లేదు వారి చదువులు ఆగిపోతున్నాయి' అని మాజీ మంత్రి హరీశ్ రావు ఆందోళన వ్యక్తం చేశారు. 'రేవంత్ పాలనలో ఎస్సీ/ఎస్టీలకు అన్యాయం. బీసీలకు అన్యాయం, వృద్ధులకు మోసం, రైతులకు ఢోకా రేవంత్ రెడ్డి మోసం చేయని ఒక్క వర్గం లేదు' అని విమర్శించారు.
'అందాల పోటీలకు వంద కోట్లు ఉంటాయి, ఫ్యూచర్ సిటీకి, నీ మనవడు ఫుట్‌బాల్ ఆటకు, మూసీకి వందల కోట్లు ఉంటాయి. పిల్లల చదువులకు ఉండవా రేవంత్ రెడ్డి. డబ్బులు లేక కాదు ఇవ్వాలనే మనుసు నీకు లేదు' అని రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. సంగారెడ్డి పాశమైలారం సిగాచీ ఘటనలో 54 మంది చనిపోతే మనిషికి కోటి రూపాయలు ఇస్తానని ఇప్పటివరకు రూపాయి కూడా ఇవ్వలేదని గుర్తుచేశారు. 'రూ.200 ఉన్న పింఛన్‌ను రూ.2000 చేసిన ఘనత కేసీఆర్. రూ.4000 ఇస్తానన్న రేవంత్ రెడ్డి రూపాయి కూడా పెంచలేదు. ఒక్క కొత్త పింఛన్ ఇవ్వలేదు' అని బీఆర్ఎస్ పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు గుర్తుచేశారు. ప్రతి కార్యకార్త ఒక సైనికుడి లాగా పోరాడాలని.. ప్రతి గ్రామంలో రేవంత్ చేస్తున్న స్కాంల మీద, తప్పిన మాట మీద చర్చ పెట్టాలని గులాబీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. 'కొడంగల్‌లో నరేందర్ రెడ్డి చిత్తూ చిత్తుగా ఓడిస్తే పోయి మల్కాజిగిరిలో 5000 ఓట్లతో గెలిచావు. మల్ల నిన్ను ఇక్కడ ఓడించడం ఖాయం. పాలమూరులో 14 సీట్లకు 14 సీట్లను గెలిచి తీరుతాం. బీఆర్ఎస్ అధికారంలోకి రావడం ఖాయం' అని బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు హరీశ్ రావు పూర్తి విశ్వాసం ప్రకటించారు.
దమ్ముంటే రాజీనామా చేయాలని అంటున్నారు. నీ అయ్య జాగీరా? రేవంత్ రెడ్డి ఫైర్
Hyderabad, Telangana:Farmers Welfare: 'ప్రభుత్వ ఉద్యోగులకు విడతల వారీగా జీతాలు ఇచ్చారు. కష్టమైనా ఫస్టు తారీఖున జీతాలు ఇవ్వాల్సిందేనని అధికారులను ఆదేశించా. బడి పిల్లల కూరగాయలు, బట్టలకు కూడా చెల్లించకుండా బకాయిలు పెట్టారు. సర్పంచ్‌లకు వందల కోట్లు బకాయిలు పెట్టారు. సర్పంచ్‌లు ఆత్మహత్యలు చేసుకున్నారు. సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు ధర్నాలు చేశారు. బకాయిలు పెట్టింది బకాసురులు కట్టే పని మాత్రం నాకు పడింది. ఇనుప కంచెలు వేసుకుని నేను లోపల లేను' అని రేవంత్ రెడ్డి తెలిపారు.
నవాబులం కాదు బీకారులం
హైదరాబాద్ మాదాపూర్‌లో రైతులకు రైతు బంధు నిధులు విడుదల చేసిన అనంతరం రేవంత్ రెడ్డి కీలక ప్రసంగం చేశారు. బీజేపీతోపాటు బీఆర్ఎస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. షేర్వానీ వేసుకుని నవాబు అని చెప్పుకోలేం.. మనం నవాబులం కాదు బీకారులం అని తెలిపారు. 'స్వయం సహాయక మహిళలు బడి పిల్లలకు వండి పెడితే వాళ్లకు కూడా డబ్బులు ఇవ్వలేదు. హాస్టళ్లలో చదువుకునే పిల్లలకు మెస్ ఛార్జీలు, కాస్మోటిక్ ఛార్జీలు ఇవ్వలేదు' అని రేవంత్ రెడ్డి బీద అరుపులు అరిచారు. అప్పులతో పాటు అడ్డగోలుగా తప్పులు కూడా చేశాడు.. ఢిల్లీకి పోయే పరిస్థితి లేకుండా చేశాడని ఆవేదన వ్యక్తం చేశారు.
చర్చకు సిద్ధమా?
'రైతుల కోసం ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేద్దాం. చర్చకు సిద్ధమా? పదేళ్లలో మీరు ఏం చేశారో, రెండున్నర యేళ్లలో మేం ఏం చేశామో చర్చకు సిద్ధం' అని బీఆర్ఎస్ పార్టీకి రేవంత్ రెడ్డి సవాల్ చేశారు. కాళేశ్వరం కోసం రూ.లక్షా రెండు వేల కోట్లు చెల్లిస్తే రెండేళ్లలో కూలిపోయి కూలేశ్వరం అయింది. డబ్బులు గోదావరిలో కలిసిపోయాయి. ఏ ఊరిలో రైతులు పంటలు పండించినా కాళేశ్వరం నీళ్లతోనే పండాయి అన్నారు. మూడేళ్లలో కాళేశ్వరం నుంచి చుక్క నీరు రాకపోయినా 2 కోట్ల 80 లక్షల టన్నుల ధాన్యాన్ని తెలంగాణ రైతులు పండించారు. కేసీఆర్ ఎంత కాలం కాశీ మజలీ కథలు చెపుతావు?' అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.
తెలంగాణలో ఆటలు సాగవు
'చిన్న రాక్షసులు బయలుదేరి కేసీఆర్ రావాలని కోరుకుంటున్నారని చెపుతున్నాడు. కేసీఆర్ రావాలని ఎవరు కోరుకుంటున్నారు? రూ.లక్ష రుణమాఫీ చేయలేదు. దళితులకు మూడెకరాలు ఇవ్వలేదు. కోటీ ఎకరాలకు నీళ్లు ఇస్తానని చెప్పి ఇవ్వలేదు' అని రేవంత్ రెడ్డి విమర్శించారు. 'ప్రతి పేదవాడి ఖాతాల్లో రూ.15 లక్షలు వేస్తానని మోదీ చెప్పాడు. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానన్నాడు.. 24 కోట్ల ఉద్యోగాలు రావాలి ..వచ్చాయా..?' అని ప్రశ్నించారు. తెలంగాణలో బండి సంజయ్, కిషన్ రెడ్డికి మాత్రమే ఉద్యోగాలు ఇచ్చాడని ఎద్దేవా చేశారు. బీజేపీ అధ్యక్షుడు నితిన్ నబీన్ వచ్చే ప్రభుత్వం మాదే అంటున్నాడు.. ఏందీ వచ్చేది.. తెలంగాణలో ఆటలు సాగవు అని హెచ్చరించారు.
'పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు రూ.8 వేల కోట్ల బకాయిలు పెట్టిపోయారు. ఆర్టీసీ రూ.వెయ్యి కోట్ల లాభాల్లోకి వచ్చింది.. సింగరేణి లాభాల్లోకి తెచ్చాం. ధరణిని బంగాళాఖాతంలో వేసి భూభారతి తెచ్చి సమస్యలు పరిష్కరిస్తున్నాం. ఆర్టీసీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్నాం. ఇప్పటివరకు రూ.11 వేల కోట్లు ఆర్టీసీకి ప్రభుత్వం చెల్లించింది. ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణం వద్దని ఆటో వాళ్లను రెచ్చగొట్టి ధర్నాలు చేయించే ప్రయత్నం చేశారు. వెయ్యి బస్సులకు మహిళా సంఘాలను యజమానులను చేశాం' అని రేవంత్ రెడ్డి చిట్టా విప్పారు.
నీ అయ్య జాగీరా?
'దమ్ముంటే రాజీనామా చేయాలని అంటున్నారు. నీ అయ్య జాగీరా? నీ తాత గడీలు అనుకుంటున్నావా? గడీల ముందు బానిసలమా రాజీనామా చేయడానికి' అని ప్రతిపక్షాలపై రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 'ఒక్క నిజం చెప్పితే తలకాయ వెయ్యి వక్కలు అవుతుందన్న శాపం కల్వకుంట్ల కుటుంబానికి ఉన్నట్లుంది. ఒకరికి మించి ఒకరు అబద్దాలు చెబుతున్నారు. కేసీఆర్‌ను మించి అబద్దాలు చెపుతున్నారు. బుద్ది మారనంత వరకు దేవుడు వాళ్లను క్షమించరు' అని విమర్శించారు. 'బతుకమ్మ చీరలను జొన్న చేను కాడ పిట్టలు కొట్టడానికి కట్టారు. మేం పెట్టిన చీరలను ఆడబిడ్డలు సంతోషంగా కట్టుకుంటున్నారు' అని తెలిపారు.
రేవంత్ రెడ్డిది రైతు వంచన ప్రభుత్వం.. హరీశ్ రావు తీవ్ర ఆగ్రహం
Hyderabad, Telangana:Harish Rao Slams To Revanth Reddy On Rythu Bharosa Schemeముగిసిన బీజేపీ జాతీయ అధ్యక్షుడి తెలంగాణ పర్యటన
Baddipadaga, Telangana:BJP National Chief Nitin Nabin Four Days Telangana Tour Endగనులు, ఖనిజ నిల్వలపై సీఎం చంద్రబాబు సమీక్ష
Amaravathi, Andhra Pradesh:AP CM Chandrababu Review On Minerals And Mines In Camp Officeయాదాద్రి ఆలయ నగరిలో మఠాలకు భూముల కేటాయింపు
Hyderabad, Telangana:Lands Allocations For Mathas At Yadadri Laxmi Narasimha Swamy Templeఎల్‌నినో ప్రభావంతో రైతులు వర్షాలకు తగ్గట్టు పంటలు వేసుకోవాలి: తెలంగాణ సీఎం
Hyderabad, Telangana:Telangana Rythu Bharosa: 'తాము బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఈ 30 నెలల్లో రైతును ఆత్మగౌరవంతో బతికేలా.. వ్యవసాయాన్ని పండుగలా తీర్చిదిద్దడానికి సంపూర్ణంగా ప్రయత్నం చేస్తున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి తెలిపారు. తెలంగాణ రాష్ట్రం అప్పుల ఊబిలో నిండా మునిగింది. మళ్లీ లేవడానికి వీలులేకుండా అప్పులతో మన్ను కప్పారు. అన్ని రకాల అప్పులను తొవ్వితే గుట్టల కొద్దీ బయటపడ్డాయి. అందిన కాడికి చేబదులు తీసుకువచ్చారు' అని ప్రతిపక్షాలపై విమర్శలు చేశారు.
ఈ ప్రభుత్వం మీది.. ప్రజలది
'9 రోజుల్లోనే 9 వేల కోట్ల రూపాయలను రైతు భరోసా కింద చెల్లిస్తాం.. నగదు సిద్ధం చేశాం. ఈ ప్రభుత్వం మీది.. ప్రజలది. ప్రభుత్వం రైతులది, ఆడబిడ్డలది, నిరుద్యోగులది' అని తెలంగాణ సీఎం ప్రకటించారు. '5 వేల పోలీస్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇస్తామంటే వద్దని అంటున్నారు. మూసీ వద్దని, మెట్రో వద్దని, రీజనల్ రింగ్ రోడ్డు వద్దని అంటున్నారు. పోర్లు దండాలు పెట్టినా అన్ని పనులు చేస్తా' అని స్పష్టం చేశారు. ప్రభుత్వాన్ని కాపాడుకునే బాధ్యత రైతులదని చెప్పారు.
తెలంగాణను వికాసం వైపు
'30 నెలల్లో సమాజంలో గౌరవం పెంచుకుని , విధ్వంసమైన తెలంగాణను వికాసం వైపు నడిపిస్తున్నాం. ఎప్పుడు ప్రజల్లోనే ఉంటున్నాం. తప్పించుకుని తిరగడం లేదు. 25.35 లక్షల మంది రైతులకు ఇరవై వేల కోట్ల రైతు రుణమాఫీ చేశాం. రైతు భరోసా కింద ప్రభుత్వం రాగానే రూ.7 వేల కోట్లు చెల్లించాం. సివిల్ సప్లయీస్ కార్పొరేషన్లో బకాయిలు పెట్టిపోతే 2023లో చెల్లించాం. రైతు భరోసాను రూ.12 వేలకు పెంచి ఇప్పటివరకు రూ.27 వేల కోట్లు రైతు ఖాతాల్లో వేశాం. ఈ విడుతతో కలిసి రూ.36 వేల కోట్ల రైతు భరోసా కింద చెల్లించాం' అని రేవంత్ రెడ్డి లెక్కాపద్దుల చిట్టా విప్పారు.
కాంగ్రెస్ పార్టీ పేటెంట్
'ఉచిత కరెంటు ను కనిపెట్టిందే కాంగ్రెస్ పార్టీ. ఉచిత కరెంటు కాంగ్రెస్ పార్టీ పేటెంట్. వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఉచిత కరెంటుతో పాటు విద్యుత్ బకాయిలను రద్దు చేస్తు సంతకం పెట్టారు. కాంగ్రెస్ వస్తే కరెంటు కష్టాలు అని ఇప్పుడు విమర్శిస్తున్నారు. నెలకు రూ.వెయ్యి కోట్లు ఉచిత కరెంటు కోసం ఖర్చు చేస్తున్నాం. ఇప్పటివరకు రూ30 వేల కోట్లు ఖర్చు చేశాం. సన్న వడ్ల బోనస్ కోసం రూ.4 వేల కోట్ల ఖర్చు చేశాం. మూడున్నర వేల కోట్ల రైతు బీమా కోసం ఖర్చు చేశాం. ఇప్పటివరకు లక్షా డెబ్బై ఐదు వేల కోట్లు రైతుల కోసం ఖర్చు చేశాం. నెలకు రూ.6 వేల కోట్లు ఖర్చు పెట్టాం' అని రేవంత్ రెడ్డి వివరించారు.
అబద్దాల పునాదులపై నడపను
'నేను ఉన్నది ఉన్నట్లు చెపుతా.. చేసేది చెపుతా. కిరీటాలు పెట్టుకోవాలి, వజ్ర వైడూర్యాలు సంపాదించాలని నాకు లేదు. పదవి శాశ్వతం కాదు. మాట శాశ్వతం.. మాట కోసం ఎంతకైనా నిలబడతాడు అన్న పేరు కోసం ప్రయత్నం. అబద్దాల పునాదులపైన ప్రభుత్వాన్ని నడపను' అని రేవంత్ రెడ్డి తెలిపారు. 'స్వయం సహాయక మహిళలతో 1000 మెగా వాట్ల సోలార్ ప్లాంట్లను పెట్టించాం. రిలయన్స్‌తో పోటీపడేలా మహిళా సంఘాలతో పెట్రోల్ బంకులు ఏర్పాటు చేయించాం. స్వయం సహాయక మహిళల స్టాల్స్ కోసం రూ.1000 కోట్లు విలువ చేసే స్థలాన్ని శిల్పారామంలో కేటాయించాం. యాదయ్య, యాదిరెడ్డి, ఇషాన్ రెడ్డి, వేణుగోపాల్ రెడ్డి, కానిస్టేబుల్ కిష్టయ్య లాంటి వాళ్లు తెలంగాణ కోసం ఆత్మ బలిదానాలు చేసుకున్నారు' అని తెలంగాణ సీఎం గుర్తుచేశారు. ఇప్పటివరకు 30 నెలల్లో 70 వేల ఉద్యోగాలు ఇచ్చామని డబ్బా కొట్టుకున్నారు. ప్రతి శాఖలో ఉద్యోగాలు భర్తీ చేశాం. మొదటి తారీఖునే జీతాలు ఇస్తున్నామని గొప్పలు చెప్పుకున్నారు. 'కాలానికి తగ్గట్లుగా రైతులు వ్యవసాయాన్ని మార్చుకోవాలి. ఈ సారి వర్షాలు పడవని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వర్షాలను బట్టి పంటలు వేసుకోవాలి. 7 రకాల సన్న వడ్ల విత్తనాలను రైతు వేదికల్లో అందుబాటులో ఉంచాం.. డిమాండ్ ఉన్న సన్న వడ్లను వేయాలని రైతులకు చెబుతున్నాం' అని తెలంగాణ సీఎం రైతులకు సూచనలు ఇచ్చారు.
