లక్డీకపూల్ కలెక్టరేట్‌లో హైదరాబాద్ జిల్లా స్థాయి అధికారుల సమన్వయ సమావేశం.
ముఖ్య అతిథిగా హైదరాబాద్ ఇన్‌ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరయ్యారు. సమావేశంలో హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురశెట్టి, జీహెచ్‌ఎంసీ ఇన్‌చార్జి కమిషనర్ ఆమ్రపాలి, అదనపు సీపీ విక్రమ్ సింగ్ మాన్, అదనపు కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. బోనాల పండుగను పురస్కరించుకుని హైదరాబాద్ నగరంలోని ఆలయాలకు విద్యుత్తు అలంకరణలు, భక్తులకు తాగునీరందించేందుకు వివిధ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు.
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
MLA Chirri Balaraju Cyber Crime: కళ్ల ముందు కనిపిస్తున్నా.. మనకు తెలియకుండా సైబర్ నేరగాళ్లకు చిక్కుకుంటాం. చదువుకున్నవారు కూడా తెలియకుండా నష్టపోతుంటారు. దీనికి సామాన్య ప్రజలతోపాటు ఎమ్మెల్యేలు, ఎంపీలతోపాటు పోలీసులు కూడా తేడాలేదు. అందరూ సైబర్ మాయగాళ్ల వలలో చిక్కి డబ్బును అప్పగించేస్తున్నారు. తాజాగా జనసేన పార్టీ ఎమ్మెల్యే సైబర్ నేరగాళ్లకు చిక్కి రూ.12 లక్షలు నష్టపోయిన ఉదంతం ఆంధ్రప్రదేశ్‌లో చోటుచేసుకుంది. ఆర్‌టీఏ చలాన్ పేరిట ఓ లింక్ పంపి ఎమ్మెల్యే డబ్బులను సైబర్ నేరగాళ్లు కాజేశారు. ఈ వార్త వివరాలు ఇలా ఉన్నాయి.
Also Read: LPG Gas: ఎల్పీజీ గ్యాస్ సంక్షోభం నుంచి భారీ ఊరట.. వాణిజ్య గ్యాస్ కోటా 50 శాతానికి పెంపు
ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గ ఎమ్మెల్యే చిర్రి బాలరాజు సైబర్ మాయాగాళ్ల వలలో చిక్కకుని భారీగా నష్టపోయారు. కేవలం ఒకే ఒక్క క్లిక్‌తో ఆయన బ్యాంక్ ఖాతా ఖాళీ అయిపోయింది. ఆర్టీఏ చలానా పేరుతో ఎమ్మెల్యే మొబైల్‌కు ఒక మెసేజ్ వచ్చింది. అందులో ఆయన వాహనానికి సంబంధించి ట్రాఫిక్ చలానా పెండింగ్‌లో ఉందని.. దాన్ని చెల్లించాలని కోరుతూ ఒక లింక్ పంపారు. అది నిజమైన చలానా అని నమ్మిన ఎమ్మెల్యే ఆ మెసేజ్‌లో పంపిన లింక్‌ను క్లిక్ చేశారు. అది ఒక మాల్వేర్ ఉన్న యాప్ డౌన్‌లోడ్ అయ్యింది. లింక్ ఓపెన్ చేసిన కాసేపటికే జంగారెడ్డిగూడెంలోని ఇండస్ లేండ్ బ్యాంక్ లో ఉన్న ఆయన ఖాతా నుంచి ఏకంగా రూ.12 లక్షలు మాయమయ్యాయి.
Also Read: Harish Rao: శిలాఫలకాలపై రేవంత్ రెడ్డి పేరు ఉండొచ్చు కానీ.. ప్రజల మనస్సులో ఉండేది కేసీఆర్ పేరే!
తన ఫోన్ హ్యాక్ అయిందని, నగదు విత్‌డ్రా అయినట్లు మెసేజ్ రావడంతో ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ఆందోళనకు గురయ్యాడు. వెంటనే అప్రమత్తమైనా ఫలితం లేకుండాపోయింది. అతడి బ్యాంకు ఖాతాలో నుంచి రూ.12 లక్షలు విత్ డ్రా అయ్యాయి. ఈ విషయంపై జీలుగుమిల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా.. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సైబర్ నేరగాళ్లను పట్టుకునేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు. సైబర్ క్రిమినల్స్ ఐపీ అడ్రస్ ట్రాకింగ్, యాప్ డేటా విశ్లేషణ వంటి సాంకేతిక పద్ధతులను ఉపయోగించి నిందితులను అదుపులోకి తీసుకోవడం కోసం అన్ని విధాలుగా పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
Also Read: TMC Manifesto: నాలుగోసారి అధికారమే లక్ష్యం.. తృణమూల్ అధినేత్రి మమతా టాప్ 10 హామీలు
ఎమ్మెల్యే స్థాయి వ్యక్తికే ఇలాంటి పరిస్థితి ఎదురైందంటే, సామాన్యులు ఎంత జాగ్రత్తగా ఉండాలో ఈఘటనలో అర్థం చేసుకోవచ్చు. చలానాలు, గిఫ్ట్ ఓచర్లు, కేవైసీ అప్‌డేట్ పేరుతో వచ్చే లింక్‌లతో అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. అధికారిక వెబ్‌సైట్లు మాత్రమే చూడాలని తెలిపారు. ట్రాఫిక్ చలానాల కోసం ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్ ఈ చలాన్ లేదా అధికారిక యాప్స్ మాత్రమే వాడాలని సూచించారు. ఏదైనా యాప్ ఇన్‌స్టాల్ చేసేటప్పుడు అది మీ కాంటాక్ట్స్, ఎస్ఎంఎస్ రీడ్ చేయడానికి పర్మిషన్ అడిగితే ఒకటికి రెండుసార్లు ఆలోచించాలని అన్నారు. ఒకవేళ మీరు మోసపోతే తక్షణమే 1930 నంబర్‌కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలని పోలీసులు సూచించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Petrol Price Today News: పశ్చిమాసియాలో యుద్ధం నేపథ్యంలో ముడిచమురు రవాణాపై తీవ్ర ఆంక్షలు నెలకొన్నాయి. ఈ క్రమంలో అంతర్జాతీయ మార్కెట్లో ఇంధన ధరపై భారీగా ప్రభావం పడింది. తాజాగా భారతదేశంలో పవర్/స్పీడ్ పెట్రోల్‌పై రూ.2 నుంచి రూ.2.30 మేర పెంచిన సంగతి తెలిసిందే. అయితే నేడు అనగా 2026 మార్చి 22న దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరల్లో మార్పులు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
భారతదేశంలో మార్చి 22 అనగా ఆదివారం నాడు ఉదయం పెట్రోల్ ధరలు యథాతథంగా ఉన్నాయి. దీంతో దేశవ్యాప్తంగా ప్రయాణికులకు ఇంధన ధరలపై స్థిరత్వం కొనసాగుతోంది. దేశంలోని ప్రధాన నగరాలైన ఢిల్లీ, ముంబై, చెన్నై, హైదరాబాద్, బెంగళూరు, అహ్మదాబాద్, కోల్‌కతా, జైపూర్, లక్నో, నోయిడాతో సహా ప్రధాన నగరాల్లోనూ నిన్న ఉన్న ధరలే కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా ఉన్న ఇంధన ధరలను ఇప్పుడు పరిశీలిద్దాం.
భారత రాజధాని ఢిల్లీలో పెట్రోల్ లీటరుకు రూ.94.77 విక్రయిస్తుండగా..ముంబైలో దీని ధర లీటరుకు రూ.103.54గా ఉంది. అయితే ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధ నేపథ్యంలో ప్రపంచ ముడి చమురు ధరల్లో భారీగా హెచ్చుతగ్గులు ఉన్నా ఎంతో స్థిరమైన ధోరణి కొనసాగుతుంది. అయితే దేశంలోని ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు (OMCలు) ప్రస్తుత రిటైల్ ధరలను కొనసాగించాలని నిర్ణయించుకున్నాయి.
దేశంలోని ప్రధాన నగరాల్లో లీటర్ పెట్రోల్ ధర ఏ విధంగా ఉందో ఇప్పుడు పరిశీలిద్దాం.
1) ఢిల్లీ Rs. 94.77
2) ముంబై Rs. 103.54
3) చెన్నై Rs. 100.80
4) కోల్‌కతా Rs. 105.45
5) బెంగళూరు Rs. 102.99
6) హైదరాబాద్ Rs. 107.46
7) పూణే Rs. 103.99
8) అహ్మదాబాద్ Rs. 94.68
9) లక్నో Rs. 94.72
10) జైపూర్ Rs. 105.11
11) నోయిడా Rs. 94.90
12) గురుగ్రామ్ Rs. 95.51
13) ఘజియాబాద్ Rs. 94.58
14) శ్రీనగర్ Rs. 100.64
15) జోధ్‌పూర్ Rs. 104.43
పశ్చిమ ఆసియాలోని రాజకీయ పరిణామాలతో పాటు ముడిచమురు సరఫరాపై ప్రభావం కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో ధరలు పెరుగుతున్నప్పటికీ.. దేశంలో ఉన్న పంప్ ధరలు స్థిరంగా కొనసాగడం గమనార్హం. బ్రెంట్ క్రూడ్ ఇటీవల అస్థిరమైన శ్రేణిలో ట్రేడ్ అవుతున్నప్పటికీ, తుది వినియోగదారునికి తక్షణ ధరల పెరుగుదలను నివారించడానికి భారతీయ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు (OMCలు) ఈ హెచ్చుతగ్గులను చాలా వరకు తట్టుకున్నాయి.
ఇదిలా ఉండగా దేశవ్యాప్తంగా ప్రీమియం పెట్రోల్ ధరలను లీటరుకు సుమారుగా రూ.2 నుంచి రూ.2.30 మేర పెంచారు. ఎంపిక చేసిన నగరాల్లోని డీలర్ల సమాచారం ఆధారంగా.. ఇండియన్ ఆయిల్ వారి ఎక్స్‌పి95, హిందుస్థాన్ పెట్రోలియం వారి పవర్ పెట్రోల్ వంటి హై-ఆక్టేన్ ఇంధనాలకు ఈ పెంపు వర్తిస్తుంది. సవరించిన ధరలు నిన్నటి (మార్చి 21) నుంచి అమల్లోకి వచ్చాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Bhadrachalam Temple: తెలంగాణలోని ప్రసిద్ధి సీతారామచంద్రుల ఆలయం భద్రాచలం పుణ్యక్షేత్రాన్ని అభివృద్ధి చేయాలని తెలంగాణ ప్రభుత్వం సంకల్పించింది. ఆలయ అభివృద్ధిపై ప్రభుత్వం సమీక్ష చేసి అధికార యంత్రాంగానికి కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆలయాన్ని అద్భుతంగా అభివృద్ధి చేయాలని.. గోదావరి పుష్కరాలకు కూడా భారీ ఏర్పాట్లు చేయాలని అధికారులకు తెలంగాణ ముఖ్యమంత్రి ఆదేశించారు. ఆగమశాస్త్రం ప్రకారం అభివృద్ధి పనులు జరగాలని స్పష్టం చేశారు.
Also Read: LPG Gas: ఎల్పీజీ గ్యాస్ సంక్షోభం నుంచి భారీ ఊరట.. వాణిజ్య గ్యాస్ కోటా 50 శాతానికి పెంపు
హైదరాబాద్‌లోని తన నివాసంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతోపాటు మంత్రులు కొండా సురేఖ, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస రెడ్డి, ఉన్నతాధికారులతో భద్రాచలం ఆలయ అభివృద్ధి, గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై సమావేశంలో సమీక్ష చేశారు. భద్రాచలం ఆలయ అభివృద్ధికి ఇప్పటివరకు పూర్తయిన భూసేకరణకు అనుగుణంగా ఆలయ అభివృద్ధికి సంబంధించిన పలు డిజైన్లను ముఖ్యమంత్రి పరిశీలించారు. సీతారామచంద్ర స్వామి ఆలయ అభివృద్ధి ప్రణాళికలపై ముఖ్యమంత్రి ఉన్నతస్థాయి సమావేశంలో సమీక్షించారు. భద్రాచలం సీతారామచంద్ర స్వామి ఆలయ సహజత్వానికి ఏమాత్రం భంగం కలగకుండా.. అభివృద్ధి పనులు పూర్తిగా ఆగమ శాస్త్రానుసారం చేపట్టాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ఆగమశాస్త్రానుసారం అభివృద్ధి పనుల నిర్వహణ సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మూడు దశల్లో పనులను పూర్తి చేసేలా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సూచించారు. వచ్చే గోదావరి పుష్కరాల నాటికి చేయగలిగిన పనులను ముందుగా గుర్తించి.. దానికి సంబంధించిన అంచనాలతో తొలి దశ అభివృద్ధి ప్రణాళికలు సిద్ధం చేయాలని తెలంగాణ సీఎం ఆదేశించారు.
Also Read: Tirumala: భక్తుల నమ్మకం కాపాడతాం.. నాణ్యమైన ప్రసాదాన్ని అందిస్తాం: సీఎం చంద్రబాబు
గోదావరి పుష్కరాల ప్రణాళికలకు అనుగుణంగా ఆలయ సమీపంలోని పుష్కర ఘాట్ల నిర్మాణం, అభివృద్ధి పనులు జరగాలని ముఖ్యమంత్రి సూచించారు. 2027 మార్చి 31 నాటికి తొలిదశ అభివృద్ధి పనులు పూర్తి చేసే లక్ష్యంతో పనులు జరగాలని స్పష్టం చేశారు. పుష్కరాలు ముగిసిన అనంతరం మిగతా పనులు పూర్తి చేసేందుకు కూడా ఇప్పుడే ప్రణాళికలు, అంచనాలు సిద్ధం చేయాలని ఆదేశించారు. శ్రీరామనవమి సందర్భంగా నిర్వహించనున్న కల్యాణోత్సవానికి తాను వస్తున్నట్లు సీఎం చెప్పినట్లు సమాచారం. కల్యాణోత్సవ ఏర్పాట్లపై కూడా సమీక్ష చేశారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా భద్రాచలం ఆలయంలో శ్రీరామనవమి వేడుకలకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని దేవాదాయ శాఖకు ఆదేశించినట్లు తెలుస్తోంది.
Also Read: Harish Rao: శిలాఫలకాలపై రేవంత్ రెడ్డి పేరు ఉండొచ్చు కానీ.. ప్రజల మనస్సులో ఉండేది కేసీఆర్ పేరే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
About the Author
Telangana Budget: ఆర్భాటంగా.. గొప్పగా ప్రకటించిన తెలంగాణ బడ్జెట్‌లో బీసీలకు మోసం జరిగిందని బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, ఎంపీ ఆర్ కృష్ణయ్య విమర్శించారు. రూ.3 లక్షల 24 వేల కోట్లల్లో బీసీలకు కేవలం 12.511 కోట్లు మాత్రమే కేటాయించి తీవ్ర అన్యాయం చేశారని రేవంత్ రెడ్డిపై మండిపడ్డారు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌లో ఇచ్చిన హామీలు ఒక్కటీ కూడా బడ్జెట్‌లో అమలు చేయలేదని తెలిపారు. ఇచ్చిన వాగ్ధానం ప్రకారం బడ్జెటు రూ.20 వేల కోట్లకు పెంచాలి.. బీసీ కార్పొరేషన్, బీసీ కుల ఫెడరేషన్లకు రూ.10 వేల కోట్లు కేటాయించాలని గుర్తుచేశారు.
Also Read: LPG Gas: ఎల్పీజీ గ్యాస్ సంక్షోభం నుంచి భారీ ఊరట.. వాణిజ్య గ్యాస్ కోటా 50 శాతానికి పెంపు
హైదరాబాద్‌లోని బీసీ సంక్షేమ సంఘం కార్యాలయంలో శనివారం ఏర్పాటుచేసిన 14 సంఘాల సమావేశంలో ఆర్ కృష్ణయ్య మాట్లాడారు. తెలంగాణ బడ్జెట్‌లో బీసీ వర్గాలకు దక్కిన ప్రయోజనాలు ఏమీ లేవని తెలిపారు. బీసీలకు రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ తీరని మోసం చేసిందని మండిపడ్డారు. ఒక్కొక్క బీసీ కుటుంబానికి రూ.20 లక్షలు, 80 శాతం సబ్సిడీ రుణాలు మంజూరు చేయాలని ఈ సందర్భంగా ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు.
Also Read: Tirumala: భక్తుల నమ్మకం కాపాడతాం.. నాణ్యమైన ప్రసాదాన్ని అందిస్తాం: సీఎం చంద్రబాబు
ఎస్సీ/ ఎస్టీ/ మైనారటీ విద్యార్థులకు పూర్తి ఫీజులు ఇస్తూ కేవలం బీసీ విద్యార్ధులకు అన్యాయం చేస్తున్నారని రేవంత్ రెడ్డి వైఖరిని ఎంపీ ఆర్ కృష్ణయ్య తప్పుబట్టారు. 'మంత్రివర్గంలో కేవలం ముగ్గురు బీసీలే. సమాచార కమిషన్ల 6 మందిని నియమిస్తే ఒకటి కూడా బీసీలకు ఇవ్వకుండా ఆన్యాయం చేశారు. రాజ్యసభ ఎన్నికలలో ఒకటి కూడా బీసీలకు ఇవ్వలేదు. ప్రభుత్వం అడుగడుగునా బీసీ వ్యతిరేక ఆ చర్యలు పాల్పడుతోంది' అని విమర్శించారు.
సమావేశంలో జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ ర్యాగ అరుణ్ కుమార్, జాతీయ బీసీ సంక్షేమ సంఘం నాయకుడు నీలం వెంకటేష్, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం, జిల్లపల్లి అంజి - రాష్ట్ర అధ్యకులు రాష్ట్ర యువజన సంఘం, బీసీ ఐక్య వేదిక అధ్యక్షుడు అనంతయ్య, తెలంగాణా బి.సి సంఘం అధ్యక్షుడు రాజేందర్, తెలంగాణా బీసీ విద్యార్ధి సంఘం శివ కుమార్, తెలంగాణా బి.సి విద్యార్థి సంఘం ప్రధాన కార్యదర్శి నిఖిల్, తెలంగాణా బీసీ యువజన సంఘం ఆశిష్ గౌడ్ తదితర కులసంఘాల నాయకులు పాల్గొన్నారు.
బీసీ సంఘాలు తీవ్ర ఆగ్రహం
ఇప్పటికే పంచాయతీ ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు పాటిస్తామని మాట ఇచ్చిన రేవంత్ రెడ్డి నిలబెట్టుకోలేకపోయారు. 42 శాతం బీసీల రిజర్వేషన్ బిల్లును ఆమోదించారు కానీ అది అమలుపై కాంగ్రెస్ ప్రభుత్వం శ్రద్ధ పెట్టలేదు. ఇలా ప్రతీ అంశంలో బీసీలకు మోసం చేస్తున్న రేవంత్ రెడ్డి ఇప్పుడు తెలంగాణ బడ్జెట్ లోనూ మోసం చేశాడని బీసీ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Commercial Gas Quota: ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా దేశాల మధ్య నెలకొన్న ఘర్షణ వాతావరణం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతోంది. భారతదేశంపై ఊహించని రీతిలో ప్రభావం పడడంతో భారతీయులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతానికి పెట్రోల్, డీజిల్ కొరత లేకపోయినా భవిష్యత్‌లో ముప్పు పొంచి ఉండగా.. ఎల్పీజీ గ్యాస్ సంక్షోభం మాత్రం కొనసాగుతోంది. మూడు దేశాలు ఘర్షణ ప్రారంభమైనప్పటి నుంచి భారతదేశంలో ఎల్పీజీ కొరత ఏర్పడింది. ముఖ్యంగా కమర్షియల్ గ్యాస్ ఇబ్బంది ఏర్పడగా.. తాజాగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వాణిజ్య సిలిండర్ కోటా పెంచుతూ ప్రభుత్వం ప్రకటన జారీ చేసింది.
Also Read: Chiranjeevi: ఉగాది పండుగ రోజు చిరంజీవి కీలక ప్రకటన.. విద్యా దానం చేసేందుకు సిద్ధం!
దేశంలోని అన్ని రాష్ట్రాలకు గ్యాస్ సరఫరాపై తీవ్ర ఇబ్బందులు పడుతుండగా.. కేంద్ర ప్రభుత్వం వాణిజ్య ఎల్‌పీజీ సరఫరాపై కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత కొరత నేపథ్యంలో రాష్ట్రాలకు కేటాయించే వాణిజ్య గ్యాస్ కోటాను 50 శాతానికి పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం విశేషం. ఈ మేరకు కేంద్ర పెట్రోలియం మరియు సహజ వాయువు మంత్రిత్వ శాఖ కార్యదర్శి డాక్టర్ నీరజ్ మిట్టల్ ప్రకటన చేశారు. ఈ సందర్భంగా అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు లేఖ రాశారు.
Also Read: Devuni Kadapa: ఉగాది ప్రత్యేకం.. వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న ముస్లిం భక్తులు
రాష్ట్రాల్లో గ్యాస్ కొరతతో ఇబ్బందులు పడుతున్న ప్రజల కోసం కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. గతంలో ఉన్న 20 శాతం కేటాయింపులతోపాటు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ సంస్కరణలతో మరో 10 శాతం అదనంగా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. మరో 20 శాతం అదనపు కమర్షియల్ గ్యాస్ కోటాను కేటాయిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇది మార్చి 23వ తేదీ నుంచి అమలులోకి వచ్చేలా పెట్రోలియం శాఖ కేటాయించింది.
కేంద్ర ప్రభుత్వ పెంపుతో రాష్ట్రాలకు అందే మొత్తం కమర్షియల్ గ్యాస్ సరఫరా అదనంగా 50 శాతానికి చేరుకోనుంది. అదనపు 20 శాతం గ్యాస్ కేటాయింపుల్లో ప్రభుత్వం కొన్ని ప్రత్యేక రంగాలకు ప్రాధాన్యం ఇచ్చింది. రెస్టారెంట్లు, హోటళ్లు, దాబాలు, ఇండస్ట్రియల్ క్యాంటీన్లు, ఆహార శుద్ధి పరిశ్రమలు, డెయిరీ రంగాలు, ప్రభుత్వ లేదా స్థానిక సంస్థల ద్వారా నడపబడే రాయితీ క్యాంటీన్లు, కమ్యూనిటీ కిచెన్లకు కేటాయించిన అదనపు గ్యాస్ కేటాయింపులు చేయాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు సూచనలు చేసింది.
అదనంగా కేటాయించిన 50 శాతం కోటాను పొందాలంటే వినియోగదారులకు పెట్రోలియం శాఖ కొన్ని నిబంధనలు విధించింది. వాణిజ్య, పారిశ్రామిక వినియోగదారులు తప్పనిసరిగా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల (ఓంఎస్‌సీలు) వద్ద వివరాలను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. గ్యాస్ సంక్షోభం నేపథ్యంలో వాణిజ్య సిలిండర్ తప్పుదారి పట్టకుండా.. దుర్వినియోగం కాకుండా కేంద్ర పెట్రోలియం శాఖ ధ్రువీకరణ తప్పనిసరి చేసింది. గ్యాస్ మళ్లింపు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం సూచించడంతో ఆ వాణిజ్య సిలిండర్లు రాష్ట్రాలకు రానున్నాయి. కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో రాష్ట్రాల్లోని కమర్షియల్ గ్యాస్ వినియోగదారులకు భారీ ప్రయోజనం లభించనుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Giant Burmese Python Viral Video Watch: సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి మనం నిత్యం ఎన్నో రకాల వింతలతో పాటు విశేషాలకు సంబంధించిన వీడియోలను చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా క్రూర మృగాలతో పాటు విసర్పాలకు సంబంధించిన వీడియోలు నిత్యం సోషల్ మీడియా వినియోగదారులు ఎంతో ఆసక్తిగా చూస్తూ ఉంటారు. తాజాగా ఒక బర్మీస్ పైతాన్ కు సంబంధించిన వీడియో ఇంటర్నెట్ను షేక్ చేస్తుంది. సాధారణంగా ఈ పాము కనిపిస్తేనే ఆమడ దూరం పారిపోతూ ఉంటారు.. అలాంటిది ఓ వ్యక్తి ఏకంగా ఆ భారీ కొండచిలువకు తన చేతులతో నీళ్లను తాగించడం చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.
వైరల్ అవుతున్న వీడియోలో ఒక వ్యక్తి తన ప్రాణాలను ఏమాత్రం లెక్కచేయకుండా ఒక భారీ పర్మిష్ బర్మీస్ పైథాన్‌కు నీటిని అందించడం మీరు చూడొచ్చు. ఒక చేతిలో ఒక గ్లాసు పట్టుకొని ఆ వ్యక్తి.. తన మరో అరచేతిని దోసిలిలా పట్టుకొని అందులో నీటిని పోస్తున్నాడు. ఆ భారీ సర్పం కూడా అతనిని ఏమీ చేయకుండా.. ఆ వ్యక్తి అరచేతిలో నుంచి నీటిని తాగుతోంది.. ఆ వ్యక్తి అలా నీటిని పోస్తూనే ఉన్నాడు.. ఆ పాము తాగుతూనే ఉంది. ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది..
సాధారణంగా బర్మీస్ పైథాన్‌లు చాలా శక్తివంతమైనవిగా చెప్పుకుంటూ ఉంటారు. వివిధ ఆహారాన్ని చుట్టేసి ఊపిరాడకుండా చేసి చంపేయగలవు.. అలాంటి భయంకరమైన పాము అంత శాంతంగా నీటిని తాగడం చూస్తుంటే.. ఏదో తేడానే అనిపిస్తోంది. అయితే ఈ వీడియో చూసిన సోషల్ మీడియా వినియోగదారులు మాత్రం ఒక్కసారిగా కంగు తింటున్నారు.. అతడి ధైర్యాన్ని మెచ్చుకోవాల్సిందే.. కానీ అది చాలా ప్రమాదకరమని కొంతమంది ఈ వీడియో చూసినవారు అంటుంటే.. ఇక మరి కొంతమంది అయితే ప్రకృతిలో మనుషులు, జంతువుల మధ్య ఉండే సంబంధానికి ఇదొక అద్భుతమైన నిదర్శనమని వివరిస్తూ వస్తున్నారు..
Read more: Two-headed Snake Video: ఒకే పాము రెండు తలలు.. ఇలాంటి వీడియో ఎప్పుడైనా చూశారా?
ఇక మరి కొంతమంది అయితే ఆ పాముకు నీళ్లు సరిపోయాయా? దాని దాహం తీర్చిన ఆ వ్యక్తి రియల్ హీరో అంటూ కామెంట్లలో రాస్తు వస్తున్నారు.. ఇలాంటి సాహసాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని వన్యప్రాణి నిపుణులు సూచిస్తున్నారు.. పాములు ఎప్పుడు ఎలా స్పందిస్తాయో ఊహించడం చాలా కష్టమని.. శిక్షణ లేని వారు ఇలాంటి పనులు చేయడం ప్రాణానికే ప్రమాదమని వారు చెబుతున్నారు. ఏది ఏమైనా ఎండల తీవ్రత పెరిగే సమయంలో ఇలా మూగజీవాల దాహం తీర్చడం గొప్ప విషయమేనని కొంతమంది సోషల్ మీడియా వినియోగదారులు కొనియాడుతున్నారు..
Read more: Two-headed Snake Video: ఒకే పాము రెండు తలలు.. ఇలాంటి వీడియో ఎప్పుడైనా చూశారా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి..
Two-headed Snake Video Watch: ప్రకృతి సృష్టిలో అప్పుడప్పుడు కొన్ని వింతలు అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటాయి.. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియో సోషల్ మీడియా వినియోగదారులను నోరెళ్లబెట్టుకునేలా చేస్తోంది.. సాధారణంగా ఒకతలతో ఉండే పామును మాత్రమే మనం చూస్తూ ఉంటాం.. అలాంటిది ఒకే శరీరానికి రెండు తలలు కలిగిన నల్లత్రాచు పిల్ల దర్శనం ఇవ్వడం ఇప్పుడు ఇంటర్నెట్లో చర్చనీ అంశానికి దారితీసింది. ఈ వీడియో చూసిన చాలామంది సోషల్ మీడియా వినియోగదారులు ఇలా రెండు తలలతో కూడా పాములు జన్మిస్తాయా? అని సందేహం వ్యక్తం చేస్తున్నారు.. అయితే, ఈ వీడియోకు సంబంధించిన అన్ని వివరాలేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం..
ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో.. ఒక వ్యక్తి తన చేతితో అప్పుడే జన్మించిన ఒక చిన్న నల్ల త్రాచును చూపించడం మీరు ఈ వీడియోలో చూడొచ్చు.. మొదటి చూపుతో అందరూ ఈ వీడియో చూడగానే అది మామూలు పాము పిల్ల అని అనుకుంటూ ఉంటారు.. అంతేకాకుండా అందరికీ ముందుగా అలాగే కనిపిస్తూ ఉంటుంది.. కానీ దానిని క్లియర్‌గా గమనిస్తే దాదాపు రెండు వేరువేరు తలలు ఉండటం మీకు స్పష్టంగా కనిపిస్తుంది. ఆ వ్యక్తి కెమెరాకు దగ్గరగా ఆ పామును చూపిస్తుండగా.. ఈ వింత పాము తన రెండు తలలు అటు ఇటు వేగంగా కదుపుతూ పరిసరాలను గమనించడం మీరు ఈ వీడియోలో క్లియర్‌గా చూడొచ్చు..
ఓకే వెన్నుముకకు రెండు తలలు ఉన్నట్లు మీకు ఈ వీడియోలో పామును చూస్తే అర్థమవుతుంది. ఆ వ్యక్తి పామును సున్నితంగా చేత్తో పట్టుకునేందుకు కూడా ప్రయత్నించారు.. అయితే, ఈ వీడియోలో ఆ పాము అటు ఇటు ఎంతో వేగంగా కదలడం చూసి సోషల్ మీడియా వినియోగదారులు ఆశ్చర్యపోతున్నారు.. సైన్స్ ప్రకారం ఇలాంటి వింతలను బైసెఫాలీ అని అంటూ ఉంటారు. మానవులలో కవలలు ఎలాగైతే అతుక్కొని పుడతారో.. పాముల్లో కూడా పిండం అభివృద్ధి చెందే సమయంలో విభజన సరిగ్గా జరగకపోవడం వల్ల ఇలాంటి అరుదైన పాములు రెండు తలలతో జన్మిస్తూ ఉంటాయని నిపుణులు చెబుతున్నారు..
Read more: Jagtial News: పాపం.. కిడ్నీలు ఫెయిలైన భర్తను శ్మశానంలో వదిలేసిన భార్య
ఇలాంటి పాములు ప్రకృతిలో ఎక్కువ కాలం జీవించడం కష్టమని కొంతమంది సైంటిస్టులు తెలుపుతున్నారు. ఎందుకంటే రెండు తలలు వేర్వేరు దిశల్లో వెళ్లాలని ప్రయత్నించడం వల్ల ఆహారం తీసుకోవడంలోనూ, ఇతర పనుల్లోను ఇబ్బంది పడుతూ ఉంటాయి.. కాబట్టి వీటికి భూమ్మీద బతికే ఛాన్స్ చాలా తక్కువగా ఉంటుందని వారు చెబుతున్నారు.. ఈ వీడియో పోస్ట్ చేసిన కొన్ని రోజుల్లోనే వేల సంఖ్యలో వ్యూస్ వచ్చాయి. కొంతమంది దీనిని చూసి కామెంట్లు కూడా పెడుతున్నారు. పామును చూడటానికి భయం.. ఇందులోను రెండు తలలా! అని కామెంట్లలో వారి అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.
Read more: Jagtial News: పాపం.. కిడ్నీలు ఫెయిలైన భర్తను శ్మశానంలో వదిలేసిన భార్య
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి..Twitter, Facebook
20-foot Massive Python Video Watch Here: సోషల్ మీడియా ప్రపంచంలో నిత్యం ఏదో ఒక ఆశ్చర్యాన్ని కలిగించే వీడియో వెలుగులోకి వస్తూనే ఉంటుంది.. అయితే, ప్రతిరోజు ఎన్నో వింతలకు సంబంధించిన వీడియోలు మనం చూస్తూ ఉంటాం. అయితే, తాజాగా వైరల్ అవుతున్న వీడియో మాత్రం సామాన్యులకు వెన్నులో వణుకు పుట్టిస్తోంది. ఒక 20 అడుగులు కలిగిన భారీ కొండచిలువను.. ఓ వ్యక్తి ఏమాత్రం భయం లేకుండా తోకని పట్టుకొని లాక్కెళ్ళడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. దీనిని చూసిన వారంతా ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురవుతున్నారు.
వైరల్ అవుతున్న ఈ రీల్‌లో ఒక నిర్మానుష్యమైన ప్రాంతంలో భారీ శరీరంతో ఉన్న కొండచిలువ పాము నెమ్మదిగా కదులుతూ ఉండడం మీకు కనిపిస్తూ ఉంటుంది. సాధారణంగా అంత పెద్ద పాము చూస్తే ఎవరైనా ఆవిడ దూరం పరుగులు తీస్తారు.. కానీ ఈ వీడియోలో ఉన్న వ్యక్తి మాత్రం దానికి భిన్నంగా వ్యవహరించాడు.. ఆ కొండచిలువ వెనక భాగంలో ఉండి తోకను రెండు చేతులతో గట్టిగా పట్టుకున్నాడు.. ఆ వ్యక్తి అంతటితో ఆగకుండా దాన్ని వెనక్కి లాక్కు వెళ్లడం మొదలుపెట్టాడు. అయితే ఆ పాము ఒకపక్క ముందుకు వెళ్లాలని చూస్తున్నప్పటికీ.. ఆ వ్యక్తి వెనుకకు ఈడ్చుకు వెళ్లడంతో అది తీవ్ర అవస్థల పాలవుతున్నట్లు తెలుస్తోంది..
ఈ వీడియో పోస్టు చేసిన కొన్ని రోజుల్లోనే లక్షలాది వ్యూస్ ను సంపాదించుకుంది.. అంతేకాకుండా దీనిని వేలాదిమంది లైక్ చేసినట్లు కూడా తెలుస్తోంది. కొంతమంది సోషల్ మీడియా వినియోగదారులు ఈ వీడియో కింద కామెంట్లు కూడా చేస్తున్నారు. మరికొంతమంది ఈ వీడియోని చూసి డైరెక్టుగా స్పందిస్తున్నారు.. ఇతనికి ప్రాణం మీద ఆశ లేదా అని కొంతమంది అంటుంటే.. మరి కొంతమంది బహుశా ఆ వ్యక్తి పాములు పట్టడంలో ప్రత్యేకమైన శిక్షణ పొంది ఉంటారని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు..
Read more: Jagtial News: పాపం.. కిడ్నీలు ఫెయిలైన భర్తను శ్మశానంలో వదిలేసిన భార్య!
ఇక మరి కొంతమందైతే ఇలాంటి వన్యప్రాణుల పట్ల క్రూరంగా ప్రవర్తించడం సరికాదని.. ఇలాంటి విన్యాసాలు ప్రాణాలకే ప్రమాదమని హెచ్చరిస్తున్నారు.. కొండచిలువకు విషయం లేకపోయినప్పటికీ.. అవి తమకు ఉండే కండరాలతో మనుషులను ఎంతో సులభంగా ఉక్కిరిబిక్కిరి చేయగలుగుతాయి. కేవలం న్యూస్ కోసం లేదా రీల్స్ కోసం ఇలాంటి ప్రమాదకరమైన పనులు చేయడం ఏమాత్రం సరైనది కాదు.. ఈ వీడియో ఎక్కడ చిత్రీకరించారు అనే విషయం ఇంకా స్పష్టంగా తెలియాల్సి ఉంది. కానీ ఈ వీడియో మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద హాట్ టాపిక్‌గా మారింది..
Read more: Jagtial News: పాపం.. కిడ్నీలు ఫెయిలైన భర్తను శ్మశానంలో వదిలేసిన భార్య!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి..Twitter, Facebook
Chandrababu Naidu: తిరుమల భక్తుల నమ్మకానికి విఘాతం కలిగించకుండగా.. నిరంతరం వారి నమ్మకాన్ని కాపాడేలా కృషి చేస్తూనే ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. భక్తులకు నాణ్యమైన ప్రసాదాన్ని, తాగునీటిని అందించేందుకు టెక్నాలజీని వినియోగిస్తూ చిత్తశుద్ధితో పని చేయాలని టీటీడీ అధికారులకు సూచించారు. తిరుమలకు వచ్చే కోట్లాది మంది భక్తుల నమ్మకం, విశ్వాసాలను మరింత పెంచేలా.. ఆరోగ్య భద్రతే ధ్యేయంగా టీటీడీ మరో చారిత్రాత్మక అడుగు వేసిందని ప్రకటించారు.
Also Read: RK Roja: ఉగాది రోజు చంద్రబాబు, పవన్ కల్యాణ్, బీఆర్ నాయుడు గాడిదలు కాస్తున్నారా?
తన మనమడు దేవాన్ష్ జన్మదినం సందర్భంగా తిరుమలను సందర్శించిన సీఎం చంద్రబాబు అనంతరం కొన్ని అభివృద్ధి పనులను ప్రారంభించారు. స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీ, ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ సంయుక్తంగా టీటీడీ సహకారంతో రూ.25 కోట్ల వ్యయంతో నిర్మించిన అత్యాధునిక వాటర్ - ఫుడ్ అనాలసిస్ ల్యాబ్‌కు రిబ్బన్ కట్ చేశారు. దేశంలోనే ఒక ఆలయం కోసం ఏర్పాటు చేసిన మొట్టమొదటి అత్యున్నత ప్రమాణాలు కలిగిన ల్యాబ్ ఇదే అని ప్రకటించారు.
Also Read: Chiranjeevi: ఉగాది పండుగ రోజు చిరంజీవి కీలక ప్రకటన.. విద్యా దానం చేసేందుకు సిద్ధం!
ల్యాబ్ ప్రారంభోత్సవం చేసిన అనంతరం ల్యాబ్‌లోని ప్రతి విభాగాన్ని క్షుణ్ణంగా పరిశీలించి.. పనితీరు, సామర్థ్యం గురించి అధికారులను సీఎం చంద్రబాబు అడిగి తెలుసుకున్నారు. ప్రసాదాల తయారీలో వాడే ముడి పదార్థాల నాణ్యతను ఏ స్థాయిలో విశ్లేషించవచ్చని ప్రశ్నించారు. ఆహార పదార్థాల రుచి, వాసనను డిజిటల్ పద్ధతిలో కచ్చితంగా విశ్లేషిస్తాయని అధికారులు సీఎం చంద్రబాబుకు వివరించారు. 1981లో నీటి పరీక్షల కేంద్రం ప్రారంభమవగా.. ఇప్పుడు నెలకు వెయ్యి నుంచి 1,500 శాంపిళ్లను విశ్లేషించే స్థాయికి చేరిందని అధికారులు వెల్లడించారు.
శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో వాడే నెయ్యి, ఇతర పదార్థాల కల్తీ నివారణకు తీసుకుంటున్న చర్యలపై టీటీడీ అధికారులను సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా అడిగి తెలుసుకున్నారు. కల్తీ జరగకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారని అధికారులను ప్రశ్నించారు. ఆధునిక జీసీ/హెచ్‌పీఎల్‌సీ యంత్రాలతో నెయ్యి స్వచ్ఛతను అత్యంత శాస్త్రీయంగా ఇక్కడే నిర్ధారించవచ్చని అధికారులు తెలిపారు. దీంతో కల్తీకి ఏమాత్రం అవకాశం ఉండదని అధికారులు స్పష్టం చేశారు. ముడి పదార్థాల్లో ఉండే పురుగు మందుల అవశేషాలు, యాంటీ బయోటిక్స్, లెడ్, ఆర్సినిక్ వంటి హెవీ మెటల్స్ కనుగొనే సామర్థ్యం ఉన్న పరికరాలను కూడా ఈ ల్యాబులో ఏర్పాటు చేసినట్లు సీఎం చంద్రబాబుకు అధికారులు తెలిపారు.
తిరుమల శ్రీవారి ప్రసాదాలపై భక్తులకు ఉన్న అపారమైన నమ్మకాన్ని కాపాడటమే తమ ప్రభుత్వ ప్రథమ కర్తవ్యం అని.. ఆ మేరకు అధికారులు పని చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ల్యాబ్ పరీక్షలకే పరిమితం కాకుండా అన్నప్రసాద కేంద్రాల్లోని వంటశాలల శుభ్రతపై నిరంతర తనిఖీలు చేసి పరిశుభ్రతను నిర్ధారించాలని చెప్పారు. శ్రీవారి ప్రసాదాలపై మరింత నమ్మకాన్ని, విశ్వాసాన్ని పెంచాలని కోరారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Adulterated Samosa Seized In Hyderabad News: మీరు బయట దొరికే వేడి వేడి సమోసాలను ఎంతో ఇష్టంగా తింటారా? అయితే ఈ వార్త చదివాక మీరు మరోసారి ఆలోచించాల్సిందే.. హైదరాబాద్‌లో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఒక అక్రమ సమోసా తయారీ కేంద్రాన్ని టాస్క్ ఫోర్స్ పోలీసులు శనివారం ఉదయం గుర్తించారు. ఎలాంటి శుభ్రత లేని వాతావరణంలో.. ప్రమాదకరమైన పదార్థాలతో సమోసా తయారు చేస్తున్న దృశ్యాలు చూసి అధికారులు సైతం ఆశ్చర్యానికి గురయ్యారు.. భద్రత ప్రమాణాలు పాటించకుండా తయారు చేస్తున్న సమోసా కేంద్రాలపై అధికారులు మెరుపు దాడులు చేశారు..
హైదరాబాద్‌లోని జియాగూడ ప్రాంతంలో అబ్దుల్ రసీద్ అనే వ్యక్తి ఎటువంటి ఎఫ్ఎస్ఎస్ఏఐ (FSSAI) అనుమతులు, మున్సిపల్ ట్రేడ్ లైసెన్స్ లేకుండా గత కొంతకాలంగా ఈ క్రేంద్రాన్ని నడుపుతున్నారు. పక్కా సమాచారంతో దాడులు నిర్వహించిన సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ బృందం. అక్కడ జరుగుతున్న దారుణాలను బయటపెట్టింది.. తయారు కేంద్రం అంతా ఈగలతో పాటు మురికి నుండి ఉండటమే కాకుండా కనీస ఆరోగ్య సూత్రాలు పాటించడం లేదని పోలీసులు నిర్ధారించారు...
ఈ తనిఖీల్లో భాగంగా.. సమోస మిశ్రమాల్లో కలిపి ఎందుకు పాడైపోయిన, దుర్వాసన వస్తున్న గుడ్లను వాడుతున్నట్లు అధికారులు గుర్తించారు. అంతేకాకుండా ఇప్పటికే నల్లగా మారిన నూనెలను పదేపదే వేడి చేస్తూ సమోసాలను వేయిస్తున్నట్లు తెలిపారు. అంతేకాకుండా పురుగులు పట్టిన మైదా పిండితో పాటు నాణ్యతలేని మసాలా దినుసులను కూడా నిల్వ ఉంచినట్లు శోదాలలో తెలిపారు.. అంతేకాకుండా సమోసా స్టఫింగ్ కోసం కుళ్లిపోయిన ఆహార పదార్థాలు వినియోగిస్తున్నారని తేల్చి చెప్పారు..
Read more: Jagtial News: పాపం.. కిడ్నీలు ఫెయిలైన భర్తను శ్మశానంలో వదిలేసిన భార్య!
ఈ దాడుల్లో భాగంగా అధికారులు సుమారు ఐదు లక్షల విలువైన విలువ ఉంచిన సమోసాలతో పాటు ముడి పదార్థాలను సీజ్ చేసినట్లు తెలిపారు. ఈ సమోసా తయారీ కేంద్రం నుంచి ప్రతి రోజు వేల సంఖ్యలో సమోసాలు నగరంలోని వివిధ హోటళ్లతో పాటు తోపుడుబండ్లకు సరఫరా ఐతున్నట్లు విచారణలో తేలింది.. నిందితుడు అబ్దుల్ రషీద్ ను అరెస్టు చేసి అధికారులు రిమాండ్ కు తరలించారు.. ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెట్టి ఆక్రమంగా వ్యాపారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని టాస్క్ ఫోర్స్ డీసీపీ హెచ్చరించారు.. అంతేకాకుండా ఇలా భద్రత ప్రమాణాలు పాటించకుండా ఎక్కడ ఆహార కేంద్రాలున్న అధికారులకు సమాచారం అందించాలని కోరారు..
Read more: Jagtial News: పాపం.. కిడ్నీలు ఫెయిలైన భర్తను శ్మశానంలో వదిలేసిన భార్య!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి..
Narmetta Oil Palm Factory: శ్రమ మాది, శిలాఫలకం రేవంత్ రెడ్డిది.. బీఆర్ఎస్ కట్టిన భవనాలకు రిబ్బన్ కటింగ్ చేస్తున్నాడని బీఆర్‌ఎస్ పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, మాజీ మంత్రి హరీశ్ రావు తెలిపారు. సిద్దిపేట అభివృద్ధిపై రాజకీయ కక్ష చేస్తున్నాడని.. ఏకంగా రూ.1,070 కోట్ల అభివృద్ధి పనుల రద్దు చేశారని ఆరోపించారు. కేసీఆర్ తెచ్చిన కాళేశ్వరం జలాలతోనే నర్మెట్ట ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ప్రారంభిస్తున్నారని గుర్తుచేశారు. దేవుళ్ల మీద ఒట్లు పెట్టి రైతులకి ధోకా చేశాడని.. రేవంత్ రెడ్డి పర్యటిస్తున్న నర్మెట్ట గ్రామంలోనే రుణమాఫీ కాని రైతులు 350 మంది ఉన్నారని మాజీ మంత్రి హరీశ్ రావు వెల్లడించారు.
Also Read: TMC Manifesto: నాలుగోసారి అధికారమే లక్ష్యం.. తృణమూల్ అధినేత్రి మమతా టాప్ 10 హామీలు
రేవంత్ రెడ్డి సిద్దిపేట పర్యటన చేస్తున్న నేపథ్యంలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు కీలక మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డికి ఒక బహిరంగ లేఖను విడుదల చేశారు. అనంతరం హరీశ్ రావు మాట్లాడుతూ.. ' రెండున్నర సంవత్సరాల్లో కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో సిద్దిపేట నియోజకవర్గానికి కొత్తగా మంజూరైన కార్యక్రమం ఒక్కటీ లేదు. సిద్దిపేటలో రేవంత్ రెడ్డి ప్రారంభించబోతున్న కార్యక్రమాలన్నీ గత బీఆర్ఎస్ ప్రభుత్వం మంజూరు చేసి.. నిధులు కేటాయించి, నిర్మాణాలు పూర్తి చేసినవే' అని వివరించారు. మాదేమో శ్రమ ఫలితం.. రేవంత్ రెడ్డిదేమో శిలాఫలకం అని ప్రకటించారు.
Also Read: Kavitha: తెలంగాణ బడ్జెట్‌పై జాగృతి ఫైర్.. రాహుల్ గాంధీకి కొత్త పేరు పెట్టిన కవిత
శిలాఫలకాల మీద రేవంత్ రెడ్డి పేరు ఉండొచ్చు.. కానీ ప్రజల మనోఫలకాల మీద ఉండేది మాత్రం కేసీఆర్ పేరే అని హరీశ్ రావు ప్రకటించారు. 'రూ.300 కోట్లతో నర్మెట్టలో ప్రారంభించబోతున్న ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ గత బీఆర్ఎస్ ప్రభుత్వ ఘనతే. దేశంలోనే అత్యుత్తమ టెక్నాలజీతో ఈ ఫ్యాక్టరీ రావడానికి, రిఫైనరీ పెట్టడానికి మేమే నిర్ణయం తీసుకున్నాం. టీజీఐసీ ద్వారా 62 ఎకరాల భూమిని సేకరించి ఇచ్చాం. రైతులను స్వయంగా ఒప్పించి మొక్కలు నాటించాం' అని మాజీ మంత్రి హరీశ్ రావు గుర్తుచేశారు.
Also Read: Harish Rao: కాంగ్రెస్ బడ్జెట్‌తో ఆరు గ్యారెంటీలకు ఘోరీ.. అందరికీ మొండి'చేయి': హరీశ్ రావు
'కాళేశ్వరాన్ని కూలేశ్వరం అని ఎగతాళి చేసిన రేవంత్ రెడ్డి ఇవాళ అదే కాళేశ్వరం జలాలతో నడిచే ఫ్యాక్టరీని ప్రారంభించడం శోచనీయం. ఈ ఫ్యాక్టరీ కోసం కాలువ పొడిగించి 20 కోట్ల లీటర్ల సామర్థ్యంతో చెరువును నిర్మించి నీరందించింది మేమే. పక్కనే పారుతున్న కాళేశ్వరం కాలువ నీళ్లను నెత్తిన జల్లుకుని ఫ్యాక్టరీని ప్రారంభించు' అని రేవంత్ రెడ్డికి హరీశ్ రావు సూచించారు. కాళేశ్వరం, మల్లన్న సాగర్ కట్టేటప్పుడు ప్రాజెక్టును అడ్డుకోవడానికి కోర్టుల్లో కేసులు వేసి ఎన్ని కుట్రలు చేసినా.. మొక్కవోని దీక్షతో ప్రాజెక్టును పూర్తి చేసి ఈ నేలకు జలాలను అందించిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిది అని గుర్తుచేశారు.
'ఎన్నికల ముందు దేవుళ్ల మీద ఒట్లు పెట్టిన రేవంత్ రెడ్డి.. రుణమాఫీ పేరిట రైతులను దారుణంగా మోసం చేశారు' అని మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శించారు. సిద్దిపేట నియోజకవర్గంలో ఇంకా 52 శాతం మందికి, అంటే 22,819 మంది రైతులకు రుణమాఫీ కాలేదు. రూ.300 కోట్ల బకాయిలు ఉన్నాయి. రేవంత్ రెడ్డి పర్యటిస్తున్న నర్మెట్ట గ్రామంలోనే 350 మంది రైతులకు మాఫీ కాలేదు. పూర్తి స్థాయిలో రుణమాఫీ చేయకుండా ఏ ముఖం పెట్టుకుని సిద్దిపేట పర్యటనకి వస్తున్నారు' అని రేవంత్ రెడ్డిని మాజీ మంత్రి హరీశ్ రావు నిలదీశారు. వరుసగా మూడు పంటలకు ఎగ్గొట్టిన రైతుబంధును.. ఈ మూడు సీజన్ల రైతుబంధు బకాయిలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. 'సగం పనులైన ప్రభుత్వ వెటర్నరీ కాలేజీని సిద్దిపేట నుంచి తన సొంత నియోజకవర్గం కొడంగల్‌కు ఎత్తుకుపోయారు. ఇది ముఖ్యమంత్రి స్థాయికి తగిన పనేనా?' అని హరీశ్ రావు ప్రశ్నించారు. కేవలం రాజకీయ కక్షతో రద్దు చేసిన రూ.1,070 కోట్ల పనులను తక్షణమే పునరుద్ధరించాలని మాజీ మంత్రి హరీశ్ రావు డిమాండ్ చేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Rain Alert In AP For Next 3 Days: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. ఓ వైపు ఉక్కపోతతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతుంటే.. ఇప్పుడు మరోసారి వర్షాలు పలకరిస్తున్నాయి. ఈ క్రమంలో రాబోయే మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అలెర్ట్ జారీ చేసింది. తీరం వెంట గంటకు 60 కిలోమీటర్ల వేగంతో వీచే ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు ఏఏ ప్రాంతాల్లో కురవనున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణం సడెన్‌గా వాతావరణం మారిపోయింది. ఉపరితల ఆవర్తనంతో పాటు మరోవైపు అల్పపీడన ద్రోణి ప్రభావంతో ఏపీ వ్యాప్తంగా రాబోయే 3 రోజుల పాటు సాధారణం నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతిలోని వాతావరణ కేంద్రం తెలియజేసింది. రాష్ట్రంలోని తీర ప్రాంతాలతో పాటు రాయలసీమ వ్యాప్తంగా ఈదురు గాలులతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని తెలియజేసింది. ఇలాంటి పరిస్థితుల్లో రైతులు ఎంతో జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
సముద్ర మట్టానికి 1.5 కి.మీ ఎత్తులో దక్షిణ అంతర కర్ణాటక పరిసరాల్లో ఆవర్తనం కొనసాగుతోంది. ఉత్తర అంతర కర్ణాటక నుండి గల్ఫ్ ఆఫ్ మన్నార్ వరకు తమిళనాడు మీదుగా 0.9 కి.మీ ఎత్తులో ద్రోణి విస్తరించి ఉంది. ఉత్తర కోస్తా ఆంధ్ర తీరంలోని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావం ప్రస్తుతం కొంత తగ్గింది.
గత మూడు రోజులుగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అక్కడక్కడ ఓ మోస్తారు వర్షాలు కురవగా.. ఇప్పుడు మరో 3 రోజుల పాటు వర్షాల తీవ్రత కొనసాగనుంది. ముఖ్యంగా గంటకు 40-60 కి.మీ వేగంతో బలమైన ఈదురు గాలులు వీచే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు సంభవించే అవకాశం ఉంది. రేపు, ఎల్లుండి వర్షాలు కొనసాగినా.. ఈదురుగాలులు మాత్రం గంటకు 30 నుంచి 50 కి.మీ వరకు ఉంటుంది. రాగల 3 రోజులు ఏపీలో వాతావరణం దాదాపుగా ఒకేలా ఉండే అవకాశం ఉంది. అయితే కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉంది.
నేడు కూడా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు ఏపీలోని కొన్ని ప్రాంతాల్లో పడే అవకాశం ఉంది. గంటకు 50 కి.మీ వేగంతో గాలులు వీయడం సహా రేపు తేలికపాటి వర్షాలు కురుస్తాయి. ఎల్లుండి మాత్రం కేవలం ఒకటి రెండు ప్రాంతాల్లో మాత్రమే తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉంది. అయితే ఈ జల్లుల కారణంగా రాష్ట్రవ్యాప్తంగా గరిష్ట ఉష్ణోగ్రతల్లో ఎలాంటి మార్పు సంభవించకపోవడం గమనార్హం. వర్షాలు ముగిసిన తర్వాత ఎండ తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉంది. వర్షాల నేపథ్యంలో రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు భారీగా పెరిగే అవకాశం ఉంది. ఈ క్రమంలో ప్రజలకు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు.
Also REad: Water Melon For Diabetics: షుగర్ ఉన్న వాళ్లు వేసవిలో పుచ్చకాయ తినొచ్చా? వైద్యులు ఏం చెబుతున్నారంటే?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Jagtial Mango Market Losses Latest News: తెలంగాణ మామిడికి కేరాఫ్ అడ్రస్ గా నిలిచే జగిత్యాల జిల్లాలో ఈ ఏడాది తీపి కరువైంది గా భావించవచ్చు.. ఎంతో రుచికరమైన ఇక్కడి మామిడి పండ్లకు అంతర్జాతీయంగా ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చర్చించుకోవాల్సిన అవసరం లేదు.. కానీ ప్రస్తుతం జరుగుతున్న యుద్ధం జగిత్యాల మామిడి మార్కెట్ పై తీవ్ర ప్రభావం చూపుతోంది.. ఎగుమతులు నిలిచిపోవడంతో కోట్లాది రూపాయల వ్యాపారం స్తంభించిపోయింది.. అటు రైతులతోపాటు ఇటు వ్యాపారాలు తీవ్ర ఆందోళనలో మునిగిపోయినట్లు తెలుస్తోంది..
ప్రతి ఏటా జగిత్యాల మామిడి మార్కెట్ కు ఢిల్లీతో పాటు మహారాష్ట్ర గుజరాత్ వంటి రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో వ్యాపారులు వస్తుంటారు.. ఇక్కడి క్వాలిటీ బాగా నచ్చడంతో వ్యాపారులు నేరుగా తోటల వద్ద కొనుగోలు జరిపి.. వాటిని ప్యాకింగ్ చేసి అమెరికాతో పాటు దుబాయ్, సౌదీ అరేబియా, కువైట్ వంటి గల్ఫ్ దేశాలకు ఎక్కువగా ఎగుమతులు చేస్తారు.. సాధారణంగా ఈ సీజన్లో జగిత్యాల నుంచి సుమారు 100 కోట్లకు పైగా ఎగుమతులు జరుగుతూ ఉండేవట.. కానీ ఈ ఏడాది యుద్ధం కారణంగా విమాన సర్వీసులు రద్దు కావడం, రవాణా చార్జీలు ఉన్నట్టుండి ఒక్కసారిగా పెరగడంతో ఎగుమతులకు తీవ్ర అంతరాయం ఏర్పడింది..
మిడిల్ ఈస్ట్ దేశాలకు ఎగుమతి అయ్యే మామిడిలో 60 శాతం జగిత్యాల నుంచే వెళ్తుంది.. అయితే ప్రస్తుతం గల్ఫ్ దేశాల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల వల్ల ఆర్డర్లు రద్దు అయ్యాయట.. ఇంకా తేడాది ఈ సమయానికి 100 టన్నుల మామిడి విదేశాలకు వెళ్ళింది.. కానీ ఇప్పుడు స్థానిక మార్కెట్ పైనే ఆధారపడాల్సి వస్తోంది. డిమాండ్ లేక ధరలు సగానికి సగం పడిపోయాయని స్థానిక రైతులతో పాటు వ్యాపారస్తులు వాపోతున్నారు. అంతేకాకుండా కొన్నిచోట్లనైతే రైతులు సగం కంటే తక్కువ ధరలకు వ్యాపారులకు అమ్మేయాల్సి వస్తోందట..
Read more: Jagtial News: పాపం.. కిడ్నీలు ఫెయిలైన భర్తను శ్మశానంలో వదిలేసిన భార్య!
పెట్టుబడులు విపరీతంగా పెరిగి.. దిగుబడి తగ్గిన సమయంలో ఈ యుద్ధ ప్రభావం రైతులకు కోలుకోని దెబ్బగా మారింది.. ఎగుమతులు లేకపోవడంతో వ్యాపారాలు ఉన్నదారలకంటే 50 శాతం తక్కువ ధరలకు కొనుగోలు చేస్తున్నారు.. దీనివల్ల రైతులకు రవాణా ఖర్చులు కూడా రావడం లేదట.. అంతర్జాతీయ మార్కెట్ తలుపులు మూసుకుపోవడంతో.. నిలువ చేసుకునే సదుపాయం లేక రైతులు చాలా చీప్ ధరలకే అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.. అయితే, దీనిపై ప్రభుత్వం స్పందించి మామిడి ఎగుమతులకు ప్రత్యామ్నాయ మార్గాలు చూపాలని.. నష్టపోయిన రైతులను ఆదుకోవాలని జిల్లా వాసులు కోరుతున్నారు..
Read more: Jagtial News: పాపం.. కిడ్నీలు ఫెయిలైన భర్తను శ్మశానంలో వదిలేసిన భార్య!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Jagtial Telugu News: మనుషుల మధ్య బంధాల కంటే పేదరికం సృష్టించే కష్టాలే బలమైనవని నిరూపించే అత్యంత హృదయ విదారక ఘటన జగిత్యాల జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది.. ప్రాణం ఉన్నంతవరకు తోడుంటానని ప్రమాణం చేసిన భార్య.. తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న భర్తను కాపాడుకోలేక, తగిన గతిలేక స్మశాన వాటికలు వదిలేసి వెళ్లిన ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది..
జగిత్యాల జిల్లాకు చెందిన ఎండ్రికాయల శ్రీధర్ గత కొన్ని రోజుల నుంచి తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు.. ఇదే సమయంలో ఆయనకు రెండు కిడ్నీలు దెబ్బతినడంతో పరిస్థితి చాలా వరకు విషమించింది.. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో డయాలసిస్ చేయించినప్పటికీ.. ఆరోగ్యం ఏమాత్రం మెరుగు పడలేకపోయింది.. రోజురోజుకు క్షీణిస్తున్న ఆరోగ్యం, పెరుగుతున్న వైద్య ఖర్చులు ఆ కుటుంబాన్ని ఆర్థికంగా అనేక సమస్యల్లో పడేసాయి..
శ్రీధర్ అనారోగ్యానికి గురికావడంతో ఆ కుటుంబం తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయింది.. ముఖ్యంగా అర్థ కట్టలేని స్థితిలో ఉండడంతో ఇంటి యజమాని ఇల్లు ఖాళీ చేయాలని తీవ్ర ఒత్తిడి తీసుకువచ్చాడు.. మరోవైపు ఇద్దరు పిల్లల బాధ్యత తో పాటు వారి భవిష్యత్తు ఆ తల్లిని ఎంతగానో వేటాడాయి.. ఆటో అనారోగ్యంతో కదలలేని స్థితిలో ఉన్న భర్తను చూసుకోలేక.. మరోవైపు పిల్లలను పోషించలేక ఆమె తీవ్ర మనోవేదనకు గురైంది.. కొద్ది రోజులపాటు ఎంతగానో ఆలోచన చేసింది..
Read more: Viral Video: ముక్కుతో సిగరెట్ తాగడమేంటి? ఈ వీడియో ఒకసారి చూడండి..
చివరికి ఏ దారి కనిపించని స్థితిలో.. తన భర్తను జగిత్యాలలోని స్థానిక స్మశాన వాటికలో వదిలేసింది.. నేను నీకు చికిత్స చేయించలేను.. కనీసం ఉండటానికి నీడ కూడా లేదని.. ఎంతో నిస్సహాయ స్థితిలో ఆమె తన ఇద్దరు పిల్లలను తీసుకొని పుట్టింటికి వెళ్ళిపోయింది.. అయితే స్మశానంలో పడి ఉన్న శ్రీధర్ ను గమనించిన స్థానికులు వెంటనే సామాజిక కార్యకర్తలకు సమాచారం అందించారు.. మానవత్వంతో స్పందించిన వారు పోలీసుల సహాయంతో శ్రీధర్ను చికిత్స నిమిత్తం మళ్ళీ ఆస్పత్రికి తరలించారు.. ఈ వార్త తెలిసిన స్థానికులు.. పేదరికం ఒక మనిషిని ఎంతటి కఠిన నిర్ణయాన్ని తీసుకునేలా చేస్తుందని.. దానికి నిదర్శనం ఈ ఘటనేనని కన్నీరు పెడుతున్నారు.
Read more: Viral Video: ముక్కుతో సిగరెట్ తాగడమేంటి? ఈ వీడియో ఒకసారి చూడండి..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి