Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Hyderabad500028

కార్వాన్: లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

Jul 05, 2024 11:23:38
Hyderabad, Telangana
కార్వాన్ MLA కౌసర్ మోహినుద్దీన్ శుక్రవారం టోలిచౌకి డివిజన్ పరిధి హకీంపేట్‌లోని ఫంక్షన్ హాల్లో లబ్ధిదారులకు 180 షాదీ ముబారక్ చెక్కులను అందజేశారు. అన్ని వర్గాల అభ్యున్నతి కోసం ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే కౌసర్ మోహినుద్దీన్ తెలిపారు. ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకొని అభివృద్ధి చెందాలన్నారు.
0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
RKRavi Kumar Sargam
Mar 30, 2026 12:08:10
Wadgaon, Maharashtra:

CIBIL Score Update: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏప్రిల్ 1, 2026 నుంచి కొత్త బ్యాంకింగ్ నిబంధనలను తీసుకువస్తోంది. బ్యాంకు వినియోగదారులకు లబ్ధి చేకూరేలా.. పారదర్శకతను పెంచేలా ఆర్‌బీఐ కీలక మార్పులు చేసింది. నామినీలు, సిబిల్‌ స్కర్‌, చార్జీలు, బంగారు ఆభరణాలపై తీసుకునే రుణాలు తదితర వాటి నిబంధనల విషయంలో ఆర్‌బీఐ కొన్ని కొత్త నిబంధనలు అమలు చేయనుంది. కొత్త ఆర్థిక సంవత్సరం 2026-27 నుంచి ఈ నిబంధనలు అమల్లోకి రానున్నాయి. కొత్తగా రాబోతున్న ఐదు నిబంధనలు ఏమిటో తెలుసుకుందాం.

Also Read: KT Rama Rao: ప్రజల గొంతు నొక్కేందుకు 'హేట్ స్పీచ్'.. రేవంత్‌ రెడ్డిపై కేటీఆర్ ఆగ్రహం

నామినీలు
బ్యాంకు ఖాతాకు నామినీల విషయంలో ఆర్‌బీఐ కొత్త నిబంధన తీసుకురాబోతున్నది. నలుగురు నామినీలు ఇప్పటివరకు మీ బ్యాంకు అకౌంట్ లేదా లాకర్‌కు ఒకరిద్దరిని మాత్రమే నామినీలుగా ఉంచే అవకాశం ఉంది. కానీ ఇప్పుడు బ్యాంకు అకౌంట్లు, లాకర్లకు గరిష్టంగా నలుగురిని నామినీలుగా చేర్చుకోవచ్చు. ఈ కొత్త నిబంధనతో భవిష్యత్‌లో కుటుంబీకులకు ఆస్తుల నిర్వహణ సులభం కానుంది.

వారానికి ఒకసారి అప్‌డేట్‌
ఆర్థిక లావాదేవీలపై ఇచ్చే క్రెడిట్‌ స్కోర్‌ విషయంలో కొత్త నిబంధన వచ్చింది. సాధారణంగా సిబిల్ స్కోర్ నెలకు ఒకసారి మాత్రమే అప్‌డేట్ అయ్యేది. ఇకపై వారానికి ఒకసారి అంటే 7 రోజులకు ఒకసారి సిబిల్ స్కోర్ అప్‌డేట్ అవుతుంది. అంటే ప్రతి నెల 7, 14, 21, 28 తేదీల్లో క్రెడిట్‌ స్కోర్‌ అప్‌డేట్‌ కానుంది.  కొత్త నిబంధన తీసుకురావడంతో అప్పు కట్టగానే ఆ వివరాలు వెంటనే స్కోర్‌లో కనిపిస్తాయి. దీనివల్ల క్రెడిట్‌ స్కోర్‌ పెరుగుతుంది.

Also Read: KT Rama Rao: మూసీ పేరిట రేవంత్‌ రెడ్డి రూ.లక్షన్నర కోట్ల అవినీతి: కేటీఆర్‌

లోన్‌ క్లోజ్‌
రుణాలు తీసుకున్నవారు ముందే దానిని మూసేయాలనుకుంటే ఛార్జీలు వసూలు చేసేవారు. బ్యాంకులు 'ఫోర్‌క్లోజర్' లేదా 'ప్రీ-పేమెంట్' పేరుతో వసూలు చేసే జరిమానాలు ఇకపై ఉండవు. ఫ్లోటింగ్ వడ్డీ రేటు ఉన్న హోమ్ లోన్, కారు లోన్, ఎడ్యుకేషన్ లేదా పర్సనల్ లోన్లపై ముందస్తు చెల్లింపులకు ఛార్జీలు ఒకటో తేదీ నుంచి ఉండవు. అదనపు ఖర్చు లేకుండా అప్పును ఎప్పుడైనా తీర్చేసి క్లోజ్‌ చేయవచ్చు.

బంగారు ఆభరణాలపై..
సామాన్య ప్రజలకే కాదు బంగారు వ్యాపారులకు మేలు కలిగించే ఓ నిర్ణయం ఆర్‌బీఐ తీసుకుంది. బంగారు ఆభరణాల వ్యాపారులు తీసుకునే 'గోల్డ్ మెటల్ లోన్' (జీఎంఎల్‌) తిరిగి చెల్లించే గడువును ఆర్‌బీఐ పెంచింది. ఇంతకు ముందు 180 రోజులు ఉండగా.. ఇప్పుడు 270 రోజులకు గడువును పెంచారు. గడువు పెంపుతో బంగారు వ్యాపారులకు నగదు నిర్వహణ సులభమవుతుంది.

Also Read: Kavitha Apology: బహిరంగ క్షమాపణలు చెప్పిన కవిత.. ఎందుకో తెలుసా?

ఏప్రిల్‌ 1వ తేదీన ఆర్‌బీఐ అమలు చేయనున్న ఈ కొత్త నిబంధనలతో ప్రజలతోపాటు బంగారు వ్యాపారులకు చాలా లబ్ధి జరగనుంది. ముఖ్యంగా రుణాలు కావాలని చూస్తున్న వారికి భారీ ప్రయోజనం లభించనుంది. తక్కువ వడ్డీకే రుణాలు తీసుకునేవారికి క్రెడిట్ స్కోర్ ప్రతి వారం అప్‌డేట్ అవుతుండడంతో మరికొన్ని రుణాలు పొందడానికి దోహదం చేస్తుంది. మంచి క్రెడిట్‌ స్కోర్ ఉన్నవారు బ్యాంకులతో మాట్లాడి తక్కువ వడ్డీ రేట్లు పొందే అవకాశం లభించింది. అదనపు చార్జీలు లేకపోవడంతో ఇక త్వరగానే లోన్లు మూసివేసి వడ్డీ భారం నుంచి విముక్తి కావొచ్చు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

563
comment0
Report
RKRavi Kumar Sargam
Mar 30, 2026 12:08:08
Hyderabad, Telangana:

Hate Bill Is Cruel Weapon: సోషల్‌ మీడియాలో ప్రభుత్వ వైఫల్యాలు, తప్పిదాలు, కుంభకోణాలపై నిలదీస్తుంటే వాటిని నియంత్రించేందుకు కాంగ్రెస్‌ ప్రభుత్వం తీసుకువచ్చిన హేట్‌ బిల్లును బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్‌ ఖండించారు. హేట్‌ బిల్లుతో ప్రజాస్వామ్యం గొంతును నొక్కే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. పౌర స్వేచ్ఛను హరించే క్రూరమైన ఆయుధంగా కేటీఆర్‌ ప్రకటించారు. ఈ సందర్భంగా రేవంత్‌ రెడ్డిపై మండిపడ్డారు.

Also Read: KT Rama Rao: మూసీ పేరిట రేవంత్‌ రెడ్డి రూ.లక్షన్నర కోట్ల అవినీతి: కేటీఆర్‌

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన తెలంగాణ హేట్ స్పీచ్ అండ్ హేట్ క్రైమ్స్ (ప్రివెన్షన్) బిల్లుపై భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌ మండిపడ్డారు. ఈ బిల్లును పౌర స్వేచ్ఛను హరించే ఒక క్రూరమైన ఆయుధంగా అభివర్ణించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం తన విమర్శకుల నోళ్లు మూయించేందుకే ఇటువంటి నిరంకుశ చట్టాలను తీసుకువస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. హేట్‌ బిల్లు చట్టరూపం దాల్చితే రాజ్యాంగం కల్పించిన భావప్రకటన స్వేచ్ఛకు, ప్రజాస్వామ్య మూలాలకే ముప్పు వాటిల్లుతుందని మాజీ మంత్రి కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు.

Also Read: Kavitha Apology: బహిరంగ క్షమాపణలు చెప్పిన కవిత.. ఎందుకో తెలుసా?

సామాజిక సామరస్యాన్ని కాపాడటం ప్రభుత్వ బాధ్యతే అయినప్పటికీ ఈ బిల్లులోని నిబంధనలు అత్యంత అస్పష్టంగా ఉన్నాయని కేటీఆర్‌ తెలిపారు. అధికారుల వ్యక్తిగత అభిప్రాయాలకే ఎక్కువ ప్రాధాన్యమిచ్చేలా ఈ బిల్లు రూపకల్పన చేశారని.. ఇది కచ్చితంగా దుర్వినియోగానికి దారితీస్తుందని మాజీ మంత్రి కేటీఆర్‌ విమర్శించారు. బిల్లులో ఉపయోగించిన వ్యతిరేక భావాలు ప్రేరేపించడం, సామాజిక సమగ్రతను దెబ్బతీయడం వంటి పదాలకు స్పష్టమైన న్యాయ పరిమితులు లేవని ఎత్తిచూపారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టే ప్రతిపక్ష నాయకులు, జర్నలిస్టులు, సామాజిక కార్యకర్తలను లక్ష్యంగా చేసుకునేందుకే ఈ పదజాలాన్ని పొందుపరిచారని మాజీ మంత్రి కేటీఆర్‌ వెల్లడించారు. ప్రభుత్వ నిర్ణయాలను విమర్శిస్తే వాటిని ఫేక్ న్యూస్‌గా ముద్రవేసి జైలుకు పంపే ప్రమాదం పొంచి ఉందని న్నారు.

కాంగ్రెస్‌ ప్రభుత్వం తీసుకువచ్చిన హేట్‌ బిల్లు సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధమని మాజీ మంత్రి కేటీఆర్‌ గుర్తుచేశారు. శ్రేయా సింఘల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన చారిత్రాత్మక తీర్పును ఈ సందర్భంగా కేటీఆర్ ప్రస్తావించారు. ప్రత్యక్ష హింసకు ప్రేరేపించే మాటలపైనే నియంత్రణ ఉండాలని, విమర్శ లేదా వ్యంగ్యం శిక్షార్హం కాదని కోర్టు స్పష్టం చేసిందని వెల్లడించారు. ఈ పరిమితిని మించి చట్టాలు చేయడం ఆర్టికల్ 19(1)(a) ప్రకారం రాజ్యాంగ ఉల్లంఘనే అవుతుందని మాజీ మంత్రి కేటీఆర్‌ స్పష్టం చేశారు.

ఏడు నుంచి పది సంవత్సరాల వరకు జైలు శిక్షలను ప్రతిపాదించడం ద్వారా ప్రజల్లో భయోత్పాతాన్ని సృష్టించాలని రేవంత్‌ రెడ్డి చూస్తున్నాడని బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జర్నలిస్టులు, విద్యార్థులు, సామాన్యులు తమ అభిప్రాయాలను పంచుకోవాలంటేనే భయపడేలా ఈ శిక్షలు ఉన్నాయని తెలిపారు. ఇప్పటికే దేశంలో హేట్ స్పీచ్‌పై తగినన్ని చట్టాలు ఉండగా, అదనంగా ఈ చట్టం తీసుకురావడంలో ఆంతర్యం ఏమిటి? అని ప్రశ్నించారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

554
comment0
Report
HDHarish Darla
Mar 30, 2026 07:42:32
Nelapadu, Andhra Pradesh:

AP High Court Jobs 2026 News: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టులో ఖాళీగా ఉన్న పోస్టుల ఇప్పుడు భర్తీకి నోటిఫికేషన్ విడుదలయ్యింది. అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తూ ఓ ప్రకటన విడుదల చేశారు. ఇందులో భాగంగా ఏపీ హైకోర్టులో మొత్తం 300 ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ప్రణాళికను రూపొందించారు. ఇందులో 78 అసిస్టెంట్లు, 50 డేటా ఎంట్రీ ఆపరేటర్స్‌, 20 ఆఫీస్ సబార్డినేట్, 44 టైపిస్ట్ పోస్టుల ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు. 

ఆంధ్రప్రదేశ్ హైకోర్టులోని వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఈ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల దరఖాస్తు చేసుకోవాలని 
నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదలయ్యింది. విడుదల చేసిన ఈ 300 పోస్టులను రెగ్యులర్ ప్రాతిపదికన భర్తీ చేయనున్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు వివిధ విభాగాలను మార్చి 30 అనగా నేటి నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునేందుకు వీలు ఉంది. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో పోస్టుల వారీగా ఖాళీల వివరాలు ఇలా ఉన్నాయి..

సీనియర్ సిస్టమ్ ఆఫీసర్ పోస్టులు: 1
అసిస్టెంట్ లైబ్రేరియన్ పోస్టులు: 1
సెక్షన్ ఆఫీసర్స్ పోస్టులు: 5
కంప్యూటర్ ఆపరేటర్ పోస్టులు: 31
లైబ్రేరియన్ గ్రేడ్-II పోస్టులు: 1
అసిస్టెంట్ పోస్టులు: 78
యూడీ స్టెనోగ్రాఫర్ పోస్టులు: 7
ఎగ్జామినర్ పోస్టులు: 27
కాపీయిస్ట్ పోస్టులు: 34
టైపిస్ట్ పోస్టులు: 44
డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులు: 50
ఆఫీస్ సబార్డినేట్ పోస్టులు: 20
స్టెనోగ్రాఫర్ పోస్టులు:1

హైకోర్టులో భర్తీకి  పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు విడుదల చేసిన నోటిఫికేషన్‌ను క్షుణ్ణంగా పరిశీలించాలి. అయితే విడుదలైన పోస్టుల నోటిఫికేషన్ అనుసరించి సంబంధిత విభాగాల్లో కనీసం 7వ తరగతి నుంచి డిగ్రీ, బీటెక్‌, లా డిగ్రీ, ఎమ్మెస్సీలో ఉత్తీర్ణత పొంది ఉండాల్సిన అవసరం ఉంది. అయితే అభ్యర్ధులకు గరిష్ఠ వయోపరిమితి 2026 జనవరి 1 నాటికి 18 ఏళ్ల నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి. 

రిజర్వేషన్ ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడౠ్ల్యఎస్ అభ్యర్థులకు ఐదేళ్లు, పీడౠ్ల్యబీడీ అభ్యర్థులకు పదేళ్ల వరకు వయో సడలింపు ఉండనుంది. అయితే ఇందులో కొన్ని పోస్టులకు దరఖాస్తు చేసే అభ్యర్థులకు తప్పనిసరిగా టైపింగ్ లేదా షార్ట్‌హ్యాండ్ వంటి టెక్నికల్ అర్హతలు కూడా ఉండాలి. ఈ అర్హతలు ఉన్నవాళ్లు ఆన్‌లైన్‌లో మార్చి 30, 2026 నుంచి‌ ఏప్రిల్‌ 19, 2026వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. అప్లై చేసిన అభ్యర్థులు ఆన్‌లైన్‌ రాత పరీక్ష (సీబీటీ), స్కిల్ టెస్ట్ (కొన్ని పోస్టులకు మాత్రమే) హజరవ్వాల్సి ఉంటుంది. అయితే మెరిట్ ఆధారంగా అభ్యర్థుల తుది ఎంపిక అనేది జరుగుతుంది. అయితే ఇందులో ఎంపికైన వారికి నెలకు రూ.20,000 నుంచి అత్యధికంగా రూ.1,47,760 వరకు జీతాలను చెల్లిస్తారు.

Also Read: Bank Holiday April 2026 List: షాకింగ్ న్యూస్..ఏకంగా 12 రోజులు సెలవులు..బ్యాంకు ఉద్యోగులకు పండగే..ఎందుకంటే?

Also Read: Ball Tampering PSL: మరోసారి చెత్తబుద్ధి బయటపెట్టిన పాకిస్థాన్..నిన్న జరిగిన మ్యాచ్‌లో బాల్ ట్యాంపరింగ్..గెలుపు కోసం తప్పుడు పని!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

1020
comment0
Report
HDHarish Darla
Mar 30, 2026 07:08:24
Hyderabad, Telangana:

Bank Holiday April 2026 List News: ఏప్రిల్ 2026లో దేశవ్యాప్తంగా అనేక ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంక్ సెలవులు రానున్నాయి. ఈ సెలవులు అనేక కార్యకలాపాలు, ప్రజల దైనందిక కార్యాకలాపాలు, బ్యాంకింగ్ సేవలపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతాయి. ఏప్రిల్ నెలలో గుడ్ ఫ్రైడే, డాక్టర్ అంబేద్కర్ జయంతి వంటి ప్రధాన జాతీయ సెలవు దినాలతో పాటు.. ఆదివారాలు, రెండో, నాలుగో శనివారాల్లో బ్యాంకులు మూతపడనున్నాయి. అందువల్ల మీకు ఏదైనా ముఖ్యమైన బ్యాంకింగ్ పని ఉంటే ఈ తేదీల కంటే ముందుగానే ప్రణాళిక వేసుకోవడం చాలా ముఖ్యం.

ఏప్రిల్‌లో 12 నుంచి 14 రోజుల పాటు బ్యాంకింగ్ సేవలకు అంతరాయం కలిగే అవకాశం ఉంది. నేషనల్ హాలీడేస్, వారాంతపు సెలవులతో వివిధ రోజుల్లో బ్యాంకులు మూతపడనున్నాయి. అయితే డిజిటల్ బ్యాంకింగ్ సేవలు ఎప్పుడూ అందుబాటులో ఉంటాయి.

ఏప్రిల్ 1: బ్యాంకులకు వార్షిక సెలవు
ఏప్రిల్ 1వ తేదీన ఆర్థిక సంవత్సరం ప్రారంభమయ్యే క్రమంలో బుధవారం నాడు బ్యాంకులు వార్షిక ముగింపు పనులతో తీరిక లేకుండా ఉంటాయి. ఈ క్రమంలో ఆ రోజున సాధారణ లావాదేవీల సేవలకు అంతరాయం కలగవచ్చు.

ఏప్రిల్ 3: గుడ్ ఫ్రైడే
గుడ్ ఫ్రైడే సందర్భంగా దేశవ్యాప్తంగా ఏప్రిల్ 3వ తేదీ.. శుక్రవారం నాడు ప్రభుత్వ సెలవు దినం పాటించనున్నారు. అన్ని బ్యాంకులు, ప్రభుత్వ కార్యాలయాలు మూతపడనున్నాయి.

ఏప్రిల్ 5: ఈస్టర్ ఆదివారం
ఏప్రిల్ 5 (ఆదివారం) ఈస్టర్ సండే, ఇది వారపు సెలవుదినంతో కలిసిపోతుంది.అందువల్ల దీనిని ప్రత్యేక అదనపు సెలవుదినంగా పరిగణించాల్సిన అవసరం లేదు.

ఏప్రిల్ 14: అంబేద్కర్ జయంతి
డాక్టర్ భీమ్ రావ్ రామ్‌జీ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని.. ఏప్రిల్ 14వ తేదీ మంగళవారం నాడు దేశ వ్యాప్తంగా ప్రభుత్వ సెలవు రోజుగా ప్రకటించారు. ఈ రోజున బ్యాంకులు, ప్రభుత్వ కార్యాలయాలు మూతపడతాయి.

ఏప్రిల్ 19: అక్షయ తృతీయ (ఆదివారం)
ఏప్రిల్ 19న అక్షయ తృతీయ, పరశురామ జయంతిని జరుపుకోనున్నారు. కానీ ఆ రోజు ఆదివారం కావడంతో ఈ సెలవు కూడా వారంతపు సెలవు ఖాతాలో వెళ్లిపోతుంది.

వారపు సెలవులు (ఆదివారం)
ఏప్రిల్ 5, 12, 19, 26 తేదీలలో ఆదివారాల కారణంగా బ్యాంకులు మూతపడనున్నాయి. అదే విధంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నియమాల ప్రకారం.. నెలలో రెండో, నాలుగో శనివారాలు బ్యాంకులకు సెలవు ఉండనుంది. ఏప్రిల్ 11న రెండో శనివారం.. అలాగే ఏప్రిల్ 25న నాలుగో శనివారం..ఈ రెండు రోజులూ బ్యాంకులు మూసి ఉంటాయి.

Also Read: Ball Tampering PSL: మరోసారి చెత్తబుద్ధి బయటపెట్టిన పాకిస్థాన్..నిన్న జరిగిన మ్యాచ్‌లో బాల్ ట్యాంపరింగ్..గెలుపు కోసం తప్పుడు పని!

Also Read: RCB Vs SRH Preview: రాయల్ ఛాలెంజర్స్ Vs సన్‌రైజర్స్..ఐపీఎల్ తొలి మ్యాచ్‌‌లో విజయం వారిదే?! ఎవరి బలమెంతో తెలుసా?

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

1098
comment0
Report
HDHarish Darla
Mar 30, 2026 04:54:26
Lahore, Punjab:

PSL Ball Tampering News: పాకిస్తాన్ సూపర్ లీగ్ మరో చెత్త కారణంతో నిరంతరం వార్తల్లో నిలుస్తూనే ఉంది. ఈ లీగ్ ప్రారంభానికి ముందే పలువురు ఇంటర్నేషనల్ క్రికెటర్లు టోర్నీ వైదొలగడంతో ఇప్పటికే పాక్ సూపర్ లీగ్‌ పరువు పోయింది. ఆ తర్వాత ఇటీవలే ప్రారంభమైన తొలి మ్యాచ్‌లో బంతి వింతగా ఎర్రగా మారడంతో అందరూ ఆశ్చర్యపోయారు. ఇప్పుడు బాల్ ట్యాంపరింగ్‌కు పాల్పడినందుకు లాహోర్ ఖలందర్స్‌పై తీవ్రమైన ఆరోపణలు వస్తున్నాయి. 

ఆదివారం అనగా మార్చి 29 రాత్రి కరాచీ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌‌లో 20వ ఓవర్ ప్రారంభానికి కొద్దిసేపటి ముందు షహీన్ అఫ్రిది , ఫఖర్ జమాన్, హారిస్ రౌఫ్‌లతో పాటు లాహోర్ ఖలందర్స్ టీమ్‌కు చెందిన పలువురు ఆటగాళ్లు గ్రౌండ్‌లో గుమిగూడారు. మైదానంలోని అంపైర్ నిశిత పర్యవేక్షణలోనే, వారిలో ప్రతి ఒక్కరూ బంతిని చేతితో తాకినట్లు కనిపించారు. జమాన్ బంతిని రౌఫ్‌కు అందించిన తర్వాత అంపైర్ జోక్యం చేసుకుని.. ఆ బంతిని తనకే ఇవ్వమని కోరాడు. బంతిపై ఏదో ప్రయోగించారని గమనించిన నాలుగో అంపైర్ మరో బంతిని ప్రవేశపెట్టాల్సి వచ్చింది.

బాల్ ట్యాంపరింగ్ జరిగే సమయంలో కరాచీ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో లాహోర్ ఖలందర్స్ చివరి ఓవర్‌లో 14 పరుగులను కాపాడుకోవాల్సి వచ్చింది. అప్పటికే 5 వికెట్లు పడిపోవడం వల్ల వారు నియంత్రణలో ఉన్నట్లు కనిపించారు. అయితే, ఐదు పరుగుల పెనాల్టీ కారణంగా చివరి ఓవర్‌లో లక్ష్యం కేవలం 9 పరుగులకు తగ్గింది. దీంతో ఛేజింగ్ జట్టుపై ఒత్తిడి తగ్గింది.

రౌఫ్ తొలి బంతికే ఖుష్దిల్ షాను అవుట్ చేసినా.. ఆ తర్వాతి నుంచే ఆటపై పట్టు కోల్పోయాడు. వైడ్‌తో సహా తర్వాతి రెండు బంతుల్లోనే 11 పరుగులు ఇచ్చేయడంతో, అబ్బాస్ అఫ్రిది ఒక ఫోర్, ఒక సిక్స్ కొట్టి కరాచీ కింగ్స్‌కు నాలుగు వికెట్ల తేడాతో విజయాన్ని అందించాడు.

షహీన్ అఫ్రిది ఏమి చెప్పారు?
ఈ మ్యాచ్ అనంతరం మాట్లాడిన లాహోర్ ఖలందర్ కెప్టెన్ షహీన్ అఫ్రిది.. ఆ సంఘటన గురించి తనకు తెలియదని, ఏ నిర్ధారణకు వచ్చే ముందు తన టీమ్ ఓ సారి ఫుటేజీని సమీక్షిస్తుందని చెప్పాడు. "నాకు దీని గురించి తెలియదు. మేము ఫుటేజీని పరిశీలించి, దాని గురించి చర్చిస్తాము. ఐదు పరుగుల పెనాల్టీ ఇప్పటికే విధించారు. దాని గురించి మేము ఏమీ చేయలేము" అని షహీన్ అఫ్రిది అన్నాడు.

Also Read: CSK Vs RR Playing 11: చెన్నై సూపర్ కింగ్స్ Vs రాజస్థాన్ రాయల్స్..గెలుపెవరిది? ప్లేయింగ్ 11 టీమ్స్ ఇవే!

Also Read: MI Vs KKR Highlights: 14 ఏళ్ల నిరీక్షణకు తెరదించిన ముంబై ఇండియన్స్..ఇలా ఎప్పుడూ జరగలేదంట! ఏం చేశారంటే?

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

990
comment0
Report
HDHarish Darla
Mar 30, 2026 02:58:50
Hyderabad, Telangana:

CSK Vs RR Match Playing 11: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2026) తొలి సీజన్‌లో ఛాంపియన్‌గా నిలిచిన రాజస్థాన్ రాయల్స్ (RR) జట్టు మరో 18 ఏళ్ల వరకు ఒక్కసారి కూడా ట్రోఫీని ముద్దాడలేకపోయింది. అయితే మరో జట్టు చెన్నై సూపర్ కింగ్స్ ఏకంగా 5 సార్లు ట్రోఫీని గెలుచుకుంది. ఈ ఇరువురి టీమ్స్‌కు నేడు ఐపీఎల్‌లో మ్యాచ్ జరగనుంది. మరికొద్ది గంటల్లో ప్రారంభం కానున్న ఈ మ్యాచ్‌‌లోని రాజస్థాన్, చెన్నై జట్ల బలాబలాలను ఇప్పుడు తెలుసుకుందాం. 

ఐపీఎల్ 2025లో మాదిరిగానే.. రాజస్థాన్ రాయల్స్ జట్టుకు చెప్పుకోవడానికి బలమైన బ్యాటింగ్ లైనప్ ఉండబోతోంది. రవీంద్ర జడేజా, దాసున్ షనక వంటి ఆటగాళ్ల చేరికతో.. మిడిల్ ఆర్డర్ సమస్య పూర్తిగా సమసిపోయినట్లే కనిపిస్తోంది. మరోవైపు రాజస్థాన్ బౌలింగ్ దళం కూడా సంపూర్ణంగా కనిపిస్తున్నా.. స్పిన్ విభాగంలో సరైన కాంబినేషన్‌ లేకపోవడం ఆ జట్టుకు ప్రధానంగా ఉన్న లోటు అని చెప్పవచ్చు.

మరోవైపు చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో కూడా ఆటగాళ్లకు వరుస గాయాలు వెంటాడుతున్నాయి. గాయాల కారణంగా జట్టులో అనేక మార్పులు సంభవించినప్పటికీ.. టీమ్ కొత్తదనంతో కనిపిస్తోంది. కండరాల గాయం కారణంగా నాథన్ ఎల్లిస్ జట్టుకు దూరమవ్వగా, ఆ తర్వాత గాయం కారణంగా ఎంఎస్ ధోనీ మొదటి రెండు వారాల పాటు జట్టుకు దూరమయ్యాడు. అలాగే రాజస్థాన్ రాయల్స్ టీమ్ నుంచి కూడా ఒక రోజు ముందు పక్కటెముకల నొప్పితో డెవాల్డ్ బ్రెవిస్ దూరమయ్యాడు .
 
ట్రేడ్ విండోలో జరిగిన భారీ మార్పుల తర్వాత.. రాజస్థాన్ రాయల్స్ కొత్త ఆటగాళ్లతో కూడిన జట్టుతో తమ ఐపీఎల్ 2026 ఆరంభ మ్యాచ్‌లోకి అడుగుపెడుతోంది. మాజీ కెప్టెన్ సంజు సామ్సన్ చెన్నై సూపర్ కింగ్స్‌కు వెళ్లగా, రవీంద్ర జడేజా, సామ్ కర్రన్ రాజస్థాన్ టీమ్‌లోకి రావడం కొసమెరుపు. అయితే గాయం కారణంగా సామ్ కర్రన్ ఈ సీజన్ మొత్తం ఆడలేకపోవడంతో RR జట్టుకు ఇప్పటికే ఒక పెద్ద ఎదురుదెబ్బ తగిలినట్లైంది. దీంతో ఫాస్ట్ బౌలర్ లేని లోటు కనిపించనుంది.
 
ఓపెనర్లలో యశస్వి జైస్వాల్, యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ టాప్ ఆర్డర్‌ బలంగా ఉండగా.. కెప్టెన్ రియాన్ పరాగ్, పవర్ హిట్టర్ షిమ్రాన్ హెట్మయర్‌తో కలిసి మిడిల్ ఆర్డర్‌కు స్ట్రాంగ్ ‌గా ఉంది. రవీంద్ర జడేజా ఆల్‌రౌండర్‌గా తగిన ప్రాధాన్యత సంతరించుకోనుంది. బౌలింగ్ విభాగంలో.. రాజస్థాన్ రాయల్స్ జట్టు జోఫ్రా ఆర్చర్, నాండ్రే బర్గర్, సందీప్ శర్మలతో పేస్ త్రయంపై ఎక్కువగా ఆధారపడనుంది. వీరికి విఘ్నేష్ పుత్తూర్ స్పిన్ బౌలింగ్‌లో మద్దతు అందించే అవకాశం ఉంది.
 
రాజస్థాన్ రాయల్స్ తుదిజట్టు (అంచనా)
యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ, రియాన్ పరాగ్ (కెప్టెన్), షిమ్రోన్ హెట్మెయర్, రవీంద్ర జడేజా, ధృవ్ జురెల్, డోనోవన్ ఫెరీరా / దసున్ షనక, జోఫ్రా ఆర్చర్, నాండ్రే బర్గర్, సందీప్ శర్మ, విఘ్నేష్ పుతుర్
  
చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో గాయాల కారణంగా ఐపీఎల్ 2026కు ముందస్తు సన్నాహాలు కూడా దెబ్బతిన్నాయి. డెత్ ఓవర్ల స్పెషలిస్ట్ నాథన్ ఎల్లిస్ ఈ సీజన్ నుండి తప్పుకోగా, సీనియర్ దిగ్గజం ఎంఎస్ ధోని గాయంతో రెండు వారాలు దూరమయ్యాడు. ధోనీ లేకపోవడం వల్ల జట్టు కూర్పులో భారీగా మార్పులు చేసే అవకాశం ఉంది. ధోనీ స్థానంలో అదనపు బౌలర్‌ను ఎంచుకునే అవకాశం ఉంది.
 
బ్యాటింగ్ విభాగం ఇప్పటికీ పటిష్టంగానే కనిపిస్తోంది. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ ముందుండి జట్టును నడిపిస్తాడని అంచనా వేయగా, సంజు సామ్సన్, ఆయుష్ మహాత్రేలు బలమైన టాప్ ఆర్డర్‌ను ఏర్పాటు చేస్తున్నారు. మిడిల్ ఆర్డర్‌లో ఫామ్‌లో ఉన్న ఆల్‌రౌండర్ శివమ్ దూబే ఉన్నాడు. అయితే.. సైడ్ స్ట్రెయిన్ కారణంగా తొలి మ్యాచ్‌కు డెవాల్డ్ బ్రెవిస్ దూరమయ్యాడు. రాజస్థాన్ రాయల్స్‌తో జరిగే పోరులో బ్రెవిస్ స్థానాన్ని సర్ఫరాజ్ ఖాన్ భర్తీ చేసే అవకాశం ఉంది. బౌలింగ్ దశంలో ఆందోళన కలిగించే అంశం ఏమిటంటే.. జేమీ ఓవర్టన్ నుండి ఆల్‌రౌండ్ ప్రదర్శనతో పాటు మాట్ హెన్రీ, ఖలీల్ అహ్మద్, నూర్ అహ్మద్ రూపంలో ప్రత్యామ్నాయాలు ఉన్నాయి.
 
చెన్నై సూపర్ కింగ్స్ తుదిజట్టు (అంచనా)
సంజు శాంసన్ (వికెట్ కీపర్), ఆయుష్ మ్హత్రే, రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), శివమ్ దూబే, సర్ఫరాజ్ ఖాన్, ప్రశాంత్ వీర్, జామీ ఓవర్టన్, నూర్ అహ్మద్, మాట్ హెన్రీ, ఖలీల్ అహ్మద్, అన్షుల్ కాంబోజ్.

Also Read: MI Vs KKR Highlights: 14 ఏళ్ల నిరీక్షణకు తెరదించిన ముంబై ఇండియన్స్..ఇలా ఎప్పుడూ జరగలేదంట! ఏం చేశారంటే?

Also Read: Virat Kohli Flying Kiss: అనుష్క శర్మకి విరాట్ కోహ్లీ ఫ్లయింగ్ కిస్..స్మృతి మంధాన ఎందుకు ఇలా చేసింది! ఫొటోలు వైరల్!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

1005
comment0
Report
HDHarish Darla
Mar 30, 2026 01:10:26
Mumbai, Maharashtra:

MI Vs KKR Match Highlights: ఐపీఎల్ 2026 రెండో మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై ముంబై ఇండియన్స్ జట్టు ఘనవిజయం సాధించింది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో ఆతిథ్య ముంబై ఇండియన్స్ 6 వికెట్ల తేడాతో కేకేఆర్‌ను ఓడించింది. మొదట బ్యాటింగ్ చేసిన కోల్‌కతా నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 221 పరుగుల రాబట్టింది. ఈ లక్ష్యాన్ని అలవోకగా ఛేదించిన ముంబై ఇండియన్స్ ఈ మ్యాచ్‌లో విజయం సాధించింది. ఈ విజయంతో ముంబై ఇండియన్స్ తమ 14 ఏళ్ల సుదీర్ఘ విరామానికి తెరపడింది. 

ముంబైలోని వాంఖడే వేదికగా జరిగిన ఐపీఎల్ రెండో మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా తొలుత టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. మొదట బ్యాటింగ్ చేసిన అజింక్య రహానే కెప్టెన్సీలోని కేకేఆర్ జట్టు పటిష్టమైన బ్యాటింగ్ ప్రదర్శన కనబరిచింది. ముంబై ఇండియన్స్ ఆటగాళ్లు కూడా ఫీల్డింగ్‌లో పేలవంగా ఆడుతూ భారీగా పరుగులు ఇచ్చేశారు. దీంతో కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టు 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 221 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. 

ఆ తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన ముంబై ఇండియన్స్ ఓపెనర్లు రోహిత్ శర్మ, ర్యాన్ రికెల్టన్ ఆరంభం నుంచే దూకుడుగా ఆడారు. దీని ఫలితంగా, హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ 2015 తర్వాత తొలిసారిగా కేవలం 23 బంతుల్లోనే హాఫ్‌సెంచరీ పూర్తి చేశాడు. 2015లో రోహిత్ శర్మ 25 బంతుల్లో అర్ధశతకం సాధించాడు. రోహిత్ శర్మ అర్ధశతకం పూర్తి కాగానే, ర్యాన్ రికెల్టన్ కూడా 25 బంతుల్లోనే తన అర్ధశతకాన్ని చేరుకున్నాడు. 

హాఫ్‌సెంచరీలు సాధించిన తర్వాత కూడా రోహిత్, రికెల్టన్ ఇద్దరూ తమ దూకుడు ఇన్నింగ్స్‌ను కొనసాగించారు. కానీ రోహిత్ శర్మ 38 బంతుల్లో 78 పరుగులు చేసి అవుటయ్యాడు. ఈ ఇన్నింగ్స్‌లో అతను 6 సిక్సర్లు, 6 ఫోర్లు కొట్టాడు. రోహిత్ అవుటైన వెంటనే క్రీజులోకి వచ్చిన సూర్య కుమార్ యాదవ్ 16 పరుగులు చేసి అవుటయ్యాడు. అతని తర్వాత తిలక్ వర్మ క్రీజులోకి వచ్చాడు. మంచి ఫామ్‌లో ఉన్న ర్యాన్ రికెల్టన్ 43 బంతుల్లో 81 పరుగులు చేసి తన వికెట్‌ను కోల్పోయాడు.

ఓపెనర్ రికెల్టన్ అవుటైనప్పుడు.. కెప్టెన్ హార్దిక్ పాండ్యా, తిలక్ వర్మ క్రీజులో ఉన్నారు. కానీ ముంబై విజయానికి చేరువలో ఉన్నప్పుడు, తిలక్ వర్మ 20 పరుగుల వద్ద అవుటయ్యాడు. హార్దిక్ పాండ్యా చివరి వరకు నిలబడి ముంబైని విజయ అంచుకు తీసుకెళ్లాడు. ఐపీఎల్‌లో తమ తొలి మ్యాచ్ గెలవడం ద్వారా ముంబై ఇండియన్స్ తమ 14 ఏళ్ల నిరీక్షణకు తెరదించింది. ఎందుకంటే గత 14 ఏళ్లలో ముంబై ఐపీఎల్‌లో తొలి మ్యాచ్‌లో ఎన్నడూ గెలవలేదు. కానీ ఇప్పుడు ఈ మ్యాచ్ గెలిచి ముంబై తమ నిరీక్షణకు తెరదించింది. 

Also Read: MI Vs KKR Preview: ముంబై ఇండియన్స్ Vs కోల్‌కతా నైట్‌రైడర్స్..ఏ జట్టు గెలవబోతుంది? సరికొత్త రికార్డుకు చేరువలో రోహిత్ శర్మ!

Also Read: Virat Kohli Test Return: టెస్టుల్లోకి విరాట్ కోహ్లీ రీఎంట్రీ? టీమ్ఇండియాకు కెప్టెన్ అవ్వాలని CSK మాజీ క్రికెటర్ సూచన!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

1072
comment0
Report
HDHarish Darla
Mar 29, 2026 13:19:58
Mumbai, Maharashtra:

MI Vs KKR Match Preview: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 సీజన్ జోరుగా సాగుతోంది. నేడు ఐపీఎల్‌లో రెండో లీగ్ మ్యాచ్ జరగనుంది. ఇందులో ముంబై ఇండియన్స్ (MI), కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌కు ముంబైలోని ప్రతిష్టాత్మక వాంఖడే స్టేడియం వేదిక కానుంది. అయితే ఈ మ్యాచ్ కు ముందు ఇరు జట్ల బలాబలాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. అయితే ఇదే మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ఓ సరికొత్త రికార్డును నెలకొల్పేందుకు అవకాశం ఉంది. దీని ద్వారా, రోహిత్ ఐపీఎల్ చరిత్రలోనే ఒక అరుదైన రికార్డు కానుంది.

ప్రస్తుతం ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ పై అత్యధిక పరుగులు చేసిన రికార్డు ఆస్ట్రేలియా దిగ్గజం డేవిడ్ వార్నర్ పేరిట ఉంది. వార్నర్ కేకేఆర్‌ జట్టుపై 28 ఇన్నింగ్స్‌లలో 1093 పరుగులు చేశాడు. ఈ జాబితాలో ప్రస్తుతం రోహిత్ శర్మ రెండో స్థానంలో ఉన్నాడు. రోహిత్ శర్మ ఇప్పటివరకు కోల్‌కతాపై ఆడిన 35 ఇన్నింగ్స్‌లలో 1083 పరుగులు చేశాడు. 

అయితే ఆదివారం జరగబోయే మ్యాచ్‌లో రోహిత్ కేవలం 11 పరుగులు చేసినా.. అతను వార్నర్‌ను అధిగమించి అగ్రస్థానానికి చేరుకుంటాడు. కేకేఆర్‌పై రోహిత్ రికార్డు అద్భుతంగా ఉంది. రోహిత్ ఇప్పటికే ఇదే జట్టుపై ఒక సెంచరీ, 6 హాఫ్ సెంచరీలు సాధించాడు.

ముంబై ఇండియన్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య పోరు ఎప్పుడూ ఏకపక్షంగానే నడిచేవి. గతంలో కొన్ని మ్యాచ్ రికార్డులను పోలిస్తే.. ముంబైదే పైచేయిగా కనిపిస్తోంది. ఈ రెండు జట్లు ఇప్పటివరకు 35 సార్లు తలపడగా.. అందులో ముంబై 24 మ్యాచ్‌లలో విజయం సాధించగా.. కేకేఆర్ కేవలం 11 మ్యాచ్‌లలో మాత్రమే గెలిచింది. వాంఖడే స్టేడియంలో ముంబై రికార్డు మరింత మెరుగ్గా ఉంది. ఇక్కడ జరిగిన 12 మ్యాచ్‌లలో, ముంబై 10 సార్లు గెలుపొందగా కేకేఆర్ కేవలం 2 సార్లు మాత్రమే గెలిచింది. 2025 సీజన్‌లో ముంబై 8 వికెట్ల భారీ తేడాతో విజయం సాధించింది.

జట్టు బలాబలాలు..
ఈ సీజన్‌లో ముంబై ఇండియన్స్ ఒక బలమైన జట్టుగా కనిపిస్తోంది. బ్యాటింగ్‌లో రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, క్వింటన్ డి కాక్, ర్యాన్ రికెల్టన్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, రూథర్‌ఫోర్డ్ వంటి విధ్వంసకర ఆటగాళ్లు ముంబై బలంగా కనిపిస్తోంది. మరోవైపు బౌలింగ్‌లో జస్ప్రీత్ బుమ్రా, ట్రెంట్ బౌల్ట్ ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌లను భయపెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. పవర్‌ప్లేలో దీపక్ చాహర్, శార్దూల్ ఠాకూర్ కీలక పాత్ర పోషిస్తారు. 

మరోవైపు ఫామ్‌లో ఉన్న టిమ్ సీఫెర్ట్, ఫిన్ అలెన్ కేకేఆర్‌కు సహాయపడతారు. ఆ జట్టు అజింక్య రహానే, రింకు సింగ్, రోవ్‌మన్ పావెల్‌పైనే ఆధారపడుతోంది. అయితే హర్షిత్ రాణా, ఆకాష్ దీప్ గాయాల కారణంగా జట్టుకు దూరమవడంతో, కేకేఆర్ బౌలింగ్ విభాగం కాస్త బలహీనంగా కనిపిస్తోంది.

Also Read: Virat Kohli Flying Kiss: అనుష్క శర్మకి విరాట్ కోహ్లీ ఫ్లయింగ్ కిస్..స్మృతి మంధాన ఎందుకు ఇలా చేసింది! ఫొటోలు వైరల్!

Also REad: Virat Kohli Test Return: టెస్టుల్లోకి విరాట్ కోహ్లీ రీఎంట్రీ? టీమ్ఇండియాకు కెప్టెన్ అవ్వాలని CSK మాజీ క్రికెటర్ సూచన!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

1047
comment0
Report
HDHarish Darla
Mar 29, 2026 12:22:35
Hyderabad, Telangana:

Russia Petrol Export Ban News: ఇదే విషయంపై రష్యా ఉప ప్రధాన మంత్రి అలెగ్జాండర్ నోవాక్ మాట్లాడుతూ..2026 ఏప్రిల్ 1 నుండి 2026 జూలై 31 వరకు రష్యా నుండి పెట్రోల్ ఎగుమతులపై పూర్తి నిషేధాన్ని విధించాలని ఆదేశించారు. రష్యా దేశీయ మార్కెట్లో పెట్రోల్ సరఫరా తగినంతగా ఉండేలా చూడటం, సామాన్యులకు ధరలను అదుపులో ఉంచడం ఈ వ్యూహాత్మక నిర్ణయం వెనుక ముఖ్య ఉద్దేశం అని తెలియజేశారు. అంతర్జాతీయ మార్కెట్లో అస్థిరత ఉన్నప్పటికీ, రష్యా పౌరులకు అందుబాటు ధరలలో ఇంధనం లభించాలని నోవాక్ స్పష్టం చేశారు. 

ఎందుకీ నిర్ణయం..
పశ్చిమాసియాలో ఇజ్రాయెల్, ఇరాన్‌ల మధ్య కొనసాగుతున్న సంఘర్షణ అంతర్జాతీయ చమురు, పెట్రోలియం మార్కెట్లలో అనిశ్చితి నెలకొల్పిందని రష్యా భావిస్తోంది. ప్రపంచ ధరలలోని హెచ్చుతగ్గుల నుండి దేశీయ మార్కెట్‌ను కాపాడటానికి ఇంధన ధరలను స్థిరంగా ఉంచాల్సిన అవసరాన్ని అధ్యక్షుడు పుతిన్ స్పష్టం చేశారు. దీనికి తోడు.. గతేడాది ఉక్రెయిన్ దాడుల వల్ల దెబ్బతిన్న రిఫైనరీలకు మరమ్మతులు చేయాల్సిన అవసరం ఉండగా, అలాగే ఇంధన నిల్వలను కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నందున, ప్రభుత్వం ఇప్పుడు తన దేశీయ అవసరాలకు ప్రాధాన్యత ఇస్తోంది.

ఏ దేశాలు ప్రభావితమవుతాయి?
రష్యా రోజుకు సుమారు 120,000 నుండి 170,000 బ్యారెళ్ల పెట్రోల్‌ను ఎగుమతి చేస్తుంది. ఈ నిషేధం రష్యాలో తయారైన పెట్రోల్‌ను అత్యధికంగా కొనుగోలు చేసే దేశాలకు పెద్ద దెబ్బ కొడుతుంది. చైనా, టర్కీ, బ్రెజిల్‌తో పాటు పలు ఆఫ్రికా దేశాలు, సింగపూర్ వంటి దేశాలు ఇప్పుడు తమ పెట్రోల్ అవసరాలను తీర్చుకోవడానికి ప్రత్యామ్నాయ మార్కెట్లను వెతుక్కోవాల్సి ఉంటుంది. సరఫరాలో ఈ తగ్గుదల ప్రపంచ మార్కెట్లో పెట్రోల్ కొరతకు దారితీయవచ్చని, ఇది అంతర్జాతీయ ధరలను మరింత పెంచే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

భారత్‌లో ప్రభావం ఎంత?
భారతీయ నిపుణుల అభిప్రాయం ప్రకారం.. రష్యా తీసుకున్న ఈ నిర్ణయం భారతదేశంపై కనీసం ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది. దీనికి ప్రధాన కారణం.. భారతదేశం శుద్ధి చేసిన పెట్రోల్‌కు బదులుగా రష్యా నుండి ముడి చమురును కొనుగోలు చేయడమే. భారతదేశం తన ముడి చమురు అవసరాలలో సుమారు 80% దిగుమతి చేసుకుంటుంది. అందులో దాదాపు 20% సరఫరా రష్యా నుండి వస్తుంది. ప్రపంచంలోనే అత్యంత అధునాతనమైన రిఫైనరీ నెట్‌వర్క్‌లలో ఒకటి భారతదేశంలో ఉంది. ఇది రోజుకు 5.6 మిలియన్ బ్యారెళ్ల చమురును శుద్ధి చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంది. మనం స్వయంగా ముడి చమురును కొనుగోలు చేసి.. దానిని పెట్రోల్, డీజిల్‌గా శుద్ధి చేసి, విదేశీ మార్కెట్లకు కూడా ఎగుమతి చేస్తాము.

గతంలోనూ ఆంక్షలు..
రష్యా తన దేశీయ సరఫరాలను కాపాడుకోవడానికి కఠినమైన చర్యలు తీసుకోవడం ఇది మొదటిసారి కాదు. గతేడాది ధరలను నియంత్రించే ప్రయత్నంలో రష్యా పెట్రోల్, డీజిల్ ఎగుమతులపై తాత్కాలిక నిషేధాన్ని విధించింది. ప్రస్తుతం రష్యా రిఫైనరీలు పూర్తి సామర్థ్యంతో పనిచేస్తున్నాయి. ప్రభుత్వం వద్ద తగినంత నిల్వలు ఉన్నాయి. బ్రెంట్ క్రూడ్‌తో పోలిస్తే రష్యా 'యురల్స్ ఆయిల్' ప్రస్తుతం గణనీయమైన ప్రీమియంతో అమ్ముడవుతోందని మంత్రి నోవాక్ ఇంకా పేర్కొన్నారు. ఈ వాస్తవం మార్కెట్‌లో రష్యాకు ఉన్న బలమైన పట్టును స్పష్టం చేస్తుంది.

Also Read: Virat Kohli Test Return: టెస్టుల్లోకి విరాట్ కోహ్లీ రీఎంట్రీ? టీమ్ఇండియాకు కెప్టెన్ అవ్వాలని CSK మాజీ క్రికెటర్ సూచన!

Also Read: Virat Kohli Flying Kiss: అనుష్క శర్మకి విరాట్ కోహ్లీ ఫ్లయింగ్ కిస్..స్మృతి మంధాన ఎందుకు ఇలా చేసింది! ఫొటోలు వైరల్!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

1098
comment0
Report
RKRavi Kumar Sargam
Mar 29, 2026 12:00:28
Hyderabad, Telangana:

Kavitha Apology: గతంలో తాను ఓ పని చేయలేకపోయానని.. ఈ సందర్భంగా క్షమాపణలు చెబుతున్నట్లు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ప్రకటించారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు న్యాయం చేయలేకపోయా.. క్షమించండి అని చెప్పారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ఆ పాపంలో నాకు భాగం ఉందనే క్షమించాలని కోరుతున్నా అంటూ విజ్ఞప్తి చేశారు. ఏజెన్సీలకు రేవంత్‌ రెడ్డి కొమ్ము కాస్తూ 5 లక్షల మందికి అన్యాయం చేస్తున్నాడని మండిపడ్డారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల కోసం కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు.

Also Read: IPL 2026: ఐపీఎల్‌ ప్రారంభం వేళ సజ్జనార్‌ కీలక విజ్ఞప్తి.. వారికి సీరియస్‌ వార్నింగ్‌

హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్ వద్ద ధర్నాచౌక్‌లో ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ నిర్వహించిన ధర్నాకు ఆమె మద్దతు ప్రకటించి మాట్లాడారు. హైదరాబాద్ వీధుల్లో 5 లక్షల మంది ఉద్యోగులు మార్చ్ చేసే రోజులు దగ్గర్లో ఉన్నాయని రేవంత్‌ రెడ్డిని హెచ్చరించారు. కోదండరాం, హరగోపాల్ లాంటి మేధావుల మౌనం ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు శాపంగా మారిందని మండిపడ్డారు. తెలంగాణ జాగృతి అధికారంలోకి వస్తే ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగాల వ్యవస్థే ఉండదని స్పష్టం చేశారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలకు పరిష్కారం చూపకుంటే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు.

Also Read: Hyderabad Police: ర్యాపిడో ఆటోలో బంగారం బ్యాగ్‌.. అర్ధగంటలో తెచ్చి ఇచ్చిన హైదరాబాద్‌ పోలీసులు

తెలంగాణ వస్తే అసలు ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగాల వ్యవస్థే ఉండదని భావించామని.. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత పర్మినెంట్ ఉద్యోగాలనే ఔట్ సోర్సింగ్ గా మార్చేశారని మాజీ ఎమ్మెల్సీ కవిత తెలిపారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు న్యాయం చేయలేకపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. ఆనాటి పాపంలో తనకు భాగం ఉండడంతో క్షమాపణ చెబుతున్నట్లు తెలిపారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను కాంగ్రెస్ వాళ్లు కూడా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఉన్న 5 లక్షల మంది ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులు చేపట్టిన ఈ ఉద్యమం మరో తెలంగాణ ఉద్యమంలా ఉందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత తెలిపారు.

Also Read: RCB vs SRH: ఐపీఎల్‌ 2026 ఆరంభంలోనే సన్‌రైజర్స్‌కు షాక్‌.. ఇషాన్‌ కిషన్‌ శ్రమ వృథా

తెలంగాణ ఉద్యమంలో మిలియన్ మార్చ్ ఎలా చేశామో.. అలాగే హాఫ్ మిలియన్ ఉన్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు హైదరాబాద్ వీధుల్లో మార్చ్ చేపట్టాలని కవిత పిలుపునిచ్చారు. అప్పుడు మాత్రమే ఈ రేవంత్‌ రెడ్డి స్పందిస్తాడని చెప్పారు. ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ విధానం కారణంగా 9 వందల ఏజెన్సీలకు మాత్రమే లాభం కలుగుతోంది తప్ప ఉద్యోగులకు జరిగిన మేలు ఏది లేదని వివరించారు. రాజుల సొమ్ము రాళ్ల పాలు అన్నట్లుగా ప్రభుత్వాలు ఉద్యోగులకు అందాల్సిన ప్రయోజనాలను ఏజెన్సీలకు దోచి పెడుతున్నారని మండిపడ్డారు. 

ధర్నా చౌక్‌లో ఎన్ని రోజులైనా ధర్నా చేసుకొని మీ చావు మీరు చావండన్నట్లుగా రేవంత్‌ రెడ్డి వ్యవహరిస్తున్నాడని మాజీ ఎమ్మెల్సీ కవిత మండిపడ్డారు. సమస్యపై పోరాటం మాత్రమే కాదు పరిష్కారమయ్యే వరకు కొట్లాడటం తెలంగాణ బిడ్డల లక్షణమని పేర్కొన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం తీసుకొచ్చిన కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ విధానం ఇప్పటికీ కొనసాగటం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. జాగృతి అధికారంలోకి వస్తే ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ అనే విధానాన్నే లేకుండా చేస్తామని ప్రకటించారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

1037
comment0
Report
HDHarish Darla
Mar 29, 2026 07:54:50
Hyderabad, Telangana:

Virat Kohli Test Comeback News: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో నిన్న సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ బ్యాటర్ విరాట్ కోహ్లీ అద్భుతంగా రాణించిన సంగతి తెలిసిందే. టీ20 మ్యాచ్ ఆడి దాదాపుగా 10 నెలలు దాటినా.. కోహ్లీ ఫామ్ చూసి అందరు ముక్కున వేలేసుకున్నారు. అయితే ఈ క్రమంలో ఓ మాజీ క్రికెటర్ విరాట్ కోహ్లీకి ఓ సూపర్ సలహ ఇచ్చాడు. టెస్టు రిటైర్మెంట్ వెనక్కి తీసుకొని.. శుభ్‌మన్ గిల్ బాధ్యతలు చేపట్టాలని విరాట్ కోహ్లీకి చెన్నై సూపర్ కింగ్స్ మాజీ ప్లేయర్ సూచించాడు. అతను ఎవరో కాదు టీమ్ఇండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు. 

విరాట్ కోహ్లీ మరో ఆరేళ్ల పాటు క్రికెట్ ఆడగలడని అంబటి రాయుడు అభిప్రాయపడ్డాడు. ఇప్పుడిదే విషయంపై సోషల్ మీడియాలో విపరీతమైన చర్చ నడుస్తోంది. రెండేళ్ల క్రితం టెస్ట్ ఫార్మాట్ నుంచి కోహ్లీ అనూహ్యంగా రిటైర్ అయినప్పటికీ, ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ 2026తో పాటు ఇటీవలే జరిగిన వన్డే సిరీస్‌లలో కోహ్లీ అద్భుతమైన ప్రతిభను కనబరిచాడు.

ఐపీఎల్ 2026లో అద్భుతమైన ఫామ్..
శనివారం సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ఐపీఎల్ 2026 సీజన్ ఆరంభ మ్యాచ్‌లో కోహ్లీ తన పాత ఫామ్‌ను ప్రదర్శించాడు. 202 పరుగుల లక్ష్య ఛేదనలో డిఫెండింగ్ ఛాంపియన్స్‌కు అండగా నిలిచి, అజేయంగా 69 పరుగులు చేసి సునాయాస విజయాన్ని అందించాడు. ఇటీవలే దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్‌లపై వన్డే సిరీస్‌లలో సెంచరీలు సాధించిన తర్వాత అంతటి స్థాయిలో కోహ్లీ ఇప్పుడు మరోసారి రాణించాడు.

దక్షిణాఫ్రికా సిరీస్ తర్వాత తాను కేవలం వన్డేలపై దృష్టి పెట్టాలని కోహ్లీ నిర్ణయించుకున్నప్పటికీ.. టెస్టు క్రికెట్ కూడా ఆడగలడని అంబటి రాయుడు అభిప్రాయపడ్డాడు. ఇటీవలే ఓ ఇంటర్య్వూలో మాట్లాడిన అంబటి రాయుడు.. విరాట్ కోహ్లీకి టెస్టుల్లో ఆడే సత్తా ఉందని ఆయన అభిప్రాయపడ్డాడు. కోహ్లీ ఫిట్‌నెస్ ఇప్పటికీ అత్యున్నత స్థాయిలో ఉందని రాయుడు నొక్కిచెప్పాడు. సీనియర్ ఆటగాడిగా టీమ్ఇండియాను సుదీర్ఘ ఫార్మాట్‌లోకి తిరిగి గాడిలోకి తీసుకొచ్చేందుకు కోహ్లీ కెప్టెన్సీ పగ్గాలను చేపట్టాలని రాయుడు సూచించాడు.

విరాట్ కోహ్లీ టెస్టు కెరీర్..
విరాట్ కోహ్లీ తన టెస్ట్ కెరీర్‌ను 123 మ్యాచ్‌లతో కెరీర్‌ను ముగించాడు. ఈ ఫార్మాట్‌లో అతను 9,230 పరుగులు చేయగా.. అందులో 30 సెంచరీలు, 31 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. టీమ్ఇండియాకు ఎంతో కష్టతరంగా మారిన బోర్డర్-గావస్కర్ ట్రోఫీ తర్వాత.. ప్రతిష్టాత్మకమైన 10,000 పరుగుల మైలురాయికి కేవలం 770 పరుగుల దూరంలో అతను రిటైర్ అయ్యాడు.

Also Read: Virat Kohli Flying Kiss: అనుష్క శర్మకి విరాట్ కోహ్లీ ఫ్లయింగ్ కిస్..స్మృతి మంధాన ఎందుకు ఇలా చేసింది! ఫొటోలు వైరల్!

Also Read: RCB Vs SRH Preview: రాయల్ ఛాలెంజర్స్ Vs సన్‌రైజర్స్..ఐపీఎల్ తొలి మ్యాచ్‌‌లో విజయం వారిదే?! ఎవరి బలమెంతో తెలుసా?

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

1089
comment0
Report
HDHarish Darla
Mar 29, 2026 07:10:41
Bengaluru, Karnataka:

Virat Kohli Flying Kiss Video: క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్ అట్టహాసంగా ప్రారంభమైంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన తొలి మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుపై ప్రత్యర్థి టీమ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయాన్ని సాధించింది. తొలి మ్యాచ్‌లో విజయంతో ఆర్సీబీ సిరీస్‌ను ప్రారంభించింది. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన ఈ ఉత్కంఠభరితమైన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో గెలిచింది ఆర్సీబీ. అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్ రెండింటిలోనూ ఆకట్టుకున్న ఆర్సీబీ జట్టు.. విరాట్ కోహ్లీ అద్భుతమైన బ్యాటింగ్ ప్రతిభతో ఈ గొప్ప విజయాన్ని నమోదు చేసింది. 

విరాట్ కోహ్లీ ఫ్లయింగ్ కిస్ వైరల్..
దాదాపు 10 నెలల తర్వాత టీ20 క్రికెట్‌లోకి పునరాగమనం చేసిన విరాట్ కోహ్లీ, తన తొలి మ్యాచ్‌లోనే అద్భుతమైన ప్రదర్శనతో అభిమానులను ఆకట్టుకున్నాడు. 202 పరుగుల భారీ లక్ష్యంతో బరిలో దిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు విరాట్ కోహ్లీ వెన్నుదన్నుగా నిలిచాడు. అతను కొట్టిన ప్రతి సిక్సర్‌కు మైదానంలోని అభిమానుల కోలాహలం చెవులు చిల్లులు పడేలా ఊర్రూతలూగించాయి. 

అయితే ఈ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా చూసేందుకు విరాట్ కోహ్లీ భార్య అనుష్క శర్మ కూడా చిన్నస్వామి స్టేడియానికి విచ్చేసింది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించిన తర్వాత విరాట్ కోహ్లీ తన భార్య అనుష్క శర్మకు ఫ్లైయింగ్ కిస్ ఇచ్చాడు. కోహ్లీ చేసిన పనికి అనుష్క సిగ్గు పడుతూ తన భర్తకు తిరిగి ఫ్లైయింగ్ కిస్ ఇచ్చింది. అదే సమయంలో అనుష్క శర్మతో పాటు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మహిళా జట్టు కెప్టెన్ స్మృతి మంధాన కూడా అక్కడే ఉంది. ఆమెతో పాటు మరికొందరు ఆర్సీబీ మహిళా క్రికెటర్లు ఉన్నారు. అయితే విరాట్ కోహ్లీ ఫ్లైయింగ్ కిస్ చూసి స్మృతి మంధాన దెబ్బకి షాక్‌కు గురైంది. అయితే అనుష్క శర్మకి కోహ్లీ కిస్ ఇస్తే స్మృతి మంధాన షాక్ అవ్వడం ఏంటని ఫ్యాన్స్ తెగ చర్చించుకుంటున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. 

సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్
ఐపీఎల్ 2026 తొలి మ్యాచ్‌లో బెంగళూరు టాస్ గెలిచి మొదట బౌలింగ్ ఎంచుకుంది. బలమైన బ్యాటింగ్ ఆర్డర్ ఉన్న సన్‌రైజర్స్ హైదరాబాద్ 250కి పైగా పరుగులు చేస్తుందని అంచనా వేశారు. అయితే ఆర్సీబీ బౌలర్ జాకబ్ డఫీ తన అద్భుతమైన బౌలింగ్‌తో పవర్‌ప్లే ముగిసేలోపే సన్‌రైజర్స్ తొలి మూడు వికెట్లు పడగొట్టాడు. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, నితీష్ కుమార్ రెడ్డి వంటి కీలక ఆటగాళ్లందరూ వెంటవెంటనే అవుటయ్యారు. 

ఎస్‌ఆర్‌హెచ్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన హెన్రిచ్ క్లాసెన్ 31 పరుగుల వద్ద అవుటయ్యాడు. అయితే, ప్రశాంతంగా ఆడిన కెప్టెన్ ఇషాన్ కిషన్ 38 బంతుల్లో 80 పరుగులు చేశాడు. అలాగే, చివరి దశలో తన సత్తా చాటిన యువ ఆటగాడు అనికేత్ వర్మ 43 పరుగులు చేశాడు. వీరి ప్రదర్శనతో సన్‌రైజర్స్ హైదరాబాద్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 201 పరుగులు రాబట్టింది. ఆర్సీబీ బౌలర్లలో జాకబ్ డఫీ, రొమారియో షెపర్డ్ చెరో 3 వికెట్లు పడగొట్టారు. 

ఆర్సీబీ అద్భుతమైన బ్యాటింగ్
202 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు  మంచి ఆరంభాన్ని అందుకుంది. ఓపెనింగ్ బ్యాటర్ ఫిల్ సాల్ట్ 8 పరుగులకే ఔటైనప్పటికీ.. ఆ తర్వాత వచ్చిన విరాట్ కోహ్లీ, దేవదత్ పడిక్కల్ చక్కగా ఆడి జట్టుకు సునాయాస విజయానికి బాటలు వేశారు. ఇంపాక్ట్ ప్లేయర్‌గా బరిలోకి దిగిన దేవదత్ పడిక్కల్ కేవలం 26 బంతుల్లోనే 61 పరుగులు చేశాడు. మరోవైపు, విరాట్ కోహ్లీ 38 బంతుల్లో 69 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. జట్టు కెప్టెన్ రజత్ పాటిదార్ తన వంతుగా 12 బంతుల్లో 31 పరుగులు బాదాడు. దీంతో ఆర్సీబీ కేవలం 15.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి భారీ విజయాన్ని అందుకుంది. 

ప్రస్తుత సీజన్‌లోని మొదటి మ్యాచ్‌లో అది కూడా సొంతగడ్డపై భారీ విజయం నమోదు చేయడంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అభిమానులు ఉత్సాహంలో ఉన్నారు. తక్కువ సమయంలోనే భారీ లక్ష్యాన్ని ఛేదించిన ఆర్సీబీ, తమ బలమైన బ్యాటింగ్ ఆర్డర్‌తో ఇతర జట్లకు సవాలు విసిరింది. రాబోయే మ్యాచ్‌లలో కూడా ఆర్సీబీ ఇదే ఫామ్‌తో విజయాలు కొనసాగిస్తుందో లేదో చూడాలి.

Also Read: RCB Vs SRH Preview: రాయల్ ఛాలెంజర్స్ Vs సన్‌రైజర్స్..ఐపీఎల్ తొలి మ్యాచ్‌‌లో విజయం వారిదే?! ఎవరి బలమెంతో తెలుసా?

Also Read: Amaravati Farmers: అసెంబ్లీలో అమరావతి బిల్లు ఆమోదానికి ముందే కేంద్రం గుడ్ న్యూస్..రైతులకు ఇక పండగే!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

995
comment0
Report
Advertisement
Back to top